7, అక్టోబర్ 2021, గురువారం

Unbelievable

 



👆🏿👆🏿👆🏿

*Unbelievable!!!*

The 13th century poet saint Gyandev created a children's game called Moksha Patam. The British later named it Snakes and Ladders & diluted the entire knowledge - instead of the original Moksha Patam.

In the original one hundred square game board, the 12th square was faith, the 51st square was reliability, the 57th square was generosity, the 76th square was knowledge, and the 78th square was asceticism. These were the squares where the ladders were found and one could move ahead faster. The 41st square was for disobedience, the 44th square for arrogance, the 49th square for vulgarity, the 52nd square for theft, the 58th square for lying, the 62nd square for drunkenness, the 69th square for debt, the 84th square for anger, the 92nd square for greed, the 95th square for pride, the 73rd square for murder and the 99th square for lust. These were the squares where the snake waited with its mouth open. The 100th square represented Nirvana or Moksha.The tops of each ladder depict a God, or one of the various heavens (kailasa, vaikuntha, brahmaloka) and so on. As the game progressed various actions were supposed to take you up and down the board as in life... 

Really Amazing.

*isn't it???!* 


Though we had played this game during our childhood, like myself, many of us may not be knowing about the very important lessons of life which can be learnt by the children while playing this game. 

Britishers had destroyed not only Sanskrit but also Hindu beliefs in many ways. After capturing power, the main agenda of the British was looting India of its wealth and spreading Christianity throughout the country by destroying Hindu beliefs and customs.

ఆలోచించాల్సిన జీవిత సత్యం

 అందరూ ఆలోచించాల్సిన నేటి జీవిత సత్యం. ఓసారి చదవండి ! చదివి వినిపించండి! ఇది ఇప్పటి తరానికి !!


 అసలు *కరోనా ఎందుకొస్తోంది ? ఎవరికొస్తోంది ?*


*ప్రతిరోజూ ఎంతోమంది తెలిసినవాళ్లు పోతున్నారు. ప్రతిరోజూ ఎన్నో చావు వార్తలు వింటున్నాం. ఎక్కడ చూసినా భయం రాజ్యమేలుతోంది. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఇదంతా చూస్తూ, "అసలు కరోనా ఎందుకొస్తోంది?" అన్న ప్రశ్న ఎవరినడిగినా ఒకటే చెబుతారు.*


*'వైరస్' వల్ల వస్తున్నది'*


*(చాలామంచి జవాబు)


*'మరి వైరస్ అందర్నీ కాటేయడం లేదేంటి?'*


*'ఇంట్లో జాగ్రత్తగా ఉంటే రాదు'*


*(ఇది కూడా చాలామంచి జవాబే.)* 


*'మరి ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా చాలామందికి వస్తోంది కదా? ఇదేంటి ?'*


*'గాలిలో వస్తోంది'*


*అదే గాలిని అందరూ పీలుస్తున్నారు కదా? మరి అందరికీ రావడం లేదెందుకు ?*


*'రోగనిరోధకశక్తి లేనివాడికి వస్తోంది'*


*'రోగనిరోధకశక్తి ఎందుకు తగ్గుతోంది?*


*'తెలియదు'*


*ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం.* 


*'మా మామయ్య కూరగాయలకని మార్కెట్టుకి వెళ్ళొచ్చాడు. అక్కడ సోకింది'*


*మరి అక్కడే ఉంటూ, రోజంతా కూరగాయలు అమ్ముతున్నవాడికి ఎందుకని రావడం లేదు ?*


*నో ఆన్సర్..*


*'మా బాబాయి పాలప్యాకెట్ కని బయటకెళ్ళి వైరస్ కొనితెచ్చుకున్నాడు'*


*'మరి రోజంతా అదే షాపులో పాలప్యాకెట్లు అమ్ముతున్నవాడికి ఎందుకని రాలేదు?'*


*మళ్ళీ నో ఆన్సర్*


*'మా నాన్న వద్దంటున్నా వినకుండా బయటకెళ్ళి మామిడిపండ్లు కొన్నాడు. అక్కడ సోకి ఉంటుంది'*


*'రోజంతా ఎండలో రోడ్డుపక్కన కూచుని పండ్లు అమ్ముతున్న ఆమెకు ఎందుకని కరోనా సోకలేదు?'*


*మళ్ళీ నో ఆన్సర్.*


*చివరకు ఇలా జవాబు వస్తుంది.*


*'కాయకష్టం చేసేవాళ్లకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్లకు రాదు'*


*ఏతావాతా తేలిందేమిటి ? ఎవడికైతే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటున్నదో వాడికి కరోనాయే కాదు. ఏ వైరసూ సోకదు. ఏ బాక్టీరియా సోకదు. ఏమీ కాదు.* డా || హన్నేమాన్ ఈ మాటను రెండు వందల ఏళ్ళక్రితం చెప్పాడు. ఆయుర్వేద సృష్టికర్తలైన ఋషులు వేల ఏళ్ళనాడే ఈ మాటను చెప్పారు. అంతేగాక ఏమేం చేస్తే, ఎలా బ్రతికితే, రోగనిరోధకశక్తి బాగుంటుందో కూడా చెప్పారు. ఏం చేస్తుంటే అది క్షీణిస్తుందో కూడా చెప్పారు. వినేవారేరీ ? వింటే, జనం పోగుచేసుకుంటున్న చెడు ఫలం ను ఎవడనుభవిస్తాడు? అందుకే మంచి చెప్పినా ఎవడూ వినడు, వినలేడు. విన్నట్టు విని వదిలేస్తాడు గాని.. ఆచరించలేడు. కనుక వాడి ఖర్మ వాడిని వెంటాడుతుంది. గొంతు పట్టుకుంటుంది. తీసుకుపోతుంది. అదంతే !


*ఇప్పుడు విషయంలోకొద్దాం.


నేనింతవరకూ ఓవెన్ ను కొనలేదు. ఎందుకో తెలుసా? దానివల్లనే అమెరికాలో పెద్దప్రేగు కాన్సర్ వస్తున్నదని గ్రహించాను గనుక. అమెరికాలో పొట్ట కేన్సర్లు చాలా ఎక్కువ. ఎందుకని?


వినండి మరి.


స్టోర్స్ లో ఉన్న మాంసం ఎన్నో రోజులనుంచీ డీప్ ఫ్రిజ్ లో ఉంటుంది. మైనస్ డిగ్రీలలో ఉంటుంది. దాన్ని తెచ్చి, ఓవెన్లో పడేసి ఒకేసారి 160 ఫారెన్ హీట్ దాకా వేడిచేసేసి తింటారు. ఒకేసారి అంత టెంపరేచర్ తేడా వస్తే ఆ మాంసంలో ఏమౌతుంది? పైగా, మంటపైన, కుండలో వండితే జరిగే ప్రక్రియ వేరు. అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది. ఓవెన్ లో ఏ ఆక్సిజన్ ఉంటుంది? ఒక ఉదాహరణ చెప్తాను. 

 * వినడానికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. 


చనిపోయిన శవాన్ని మార్చురీలోని కోల్డ్ స్టోరేజిలో ఉంచడానికి, మాంసాన్ని, కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచడానికి తేడా ఏంటి ? అలాంటివి తెచ్చి, కనీసం వాటిని కట్టెలమీదకూడా ఉడికించకుండా, ఆక్సిజన్ లేని, అదసలు అవసరంలేని, మైక్రో వేవ్స్ క్రింద ఓవెన్లో ఉడికిస్తే ఏమౌతుంది? వాటిల్లో ఏయే మార్పులొస్తాయి? తినేవాడికి కాన్సర్లు రాక ఏమౌతుంది? చెప్పండి.


ఈరోజుల్లో.. ఏ పూటకాపూట, ఏరోజు కూరగాయలను ఆరోజున వేడివేడిగా వండుకుని, ఏపూట అన్నం ఆపూట వేడిగా వండుకుని ఎవరు తింటున్నారు? చెప్పనా? రోజుకూలీలు తింటున్నారు. కాయకష్టం చేసుకునేవాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏరోజుకు ఆరోజున కూరగాయలు తెచ్చుకుంటారు. మంటమీద వండుకుని తింటారు. ఓవెన్ వాడరు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. సుఖానికిపోయే సంపన్నులు, ఫ్రిజ్ లో వారాల తరబడి ఆహారాన్ని మురగబెట్టుకుని తినేవాళ్లు, ఓవెన్లు వాడేవాళ్లు రోగాల పాలౌతున్నారు. ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ వంట చెయ్యడానికి బద్ధకిస్తూ, పొద్దున్నే ఒకేసారి అన్నీ వండిపారేసి, వాటినే రాత్రికి పెట్టుకుని తినేవాళ్లు రోగాలపాలౌతున్నారు.


జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ మింగే తిండిలో ఏముంటుందో మీకు తెలుసా? అదెప్పటి ఆహారమో మీకు తెలుసా? ఈ రోజున మిగిలిపోయిన ఫుడ్ ని ఏ హోటలువాడూ పారెయ్యడు. రేపు, ఎల్లుండి, ఎంతవరకూ దానిని ఉంచగలిగితే అంతవరకూ ఫ్రిజ్ లో ఉంచి, ఓవెన్లో ఇన్స్టంట్ గా వేడిచేసి మీకు పంపిస్తాడు. ఆ కుళ్లిపోయిన వేడివేడి ఆహారాన్ని లొట్టలేసుకుంటూ మీరు మింగుతారు. దానికితోడు, వాడు ఫ్రీగా ఆఫర్లో పంపించే కూల్ డ్రింక్ ఉండనే ఉంటుంది. అది యాసిడ్. ఇక మీకు రోగాలు రాక ఏమౌతాయి మరి?


యాసిడ్ తో కడగాల్సింది టాయిలెట్ ని. పొట్టని కాదు. ఆఫ్కోర్స్.. ఈ రోజుల్లో టాయిలెట్ కమోడ్ కీ మన పొట్టకీ పెద్ద తేడా ఉండటం లేదనుకోండి. ఇంకా చెప్పాలంటే కమోడే శుభ్రంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం కాబట్టి. మన పొట్టే దానికంటే అసలైన దరిద్రం !


ప్రతిరోజూ చెమటపట్టేలాగా వ్యాయామం ఎవరు చేస్తున్నారు? ఏసీ జిమ్ముల్లో ఒకరినొకరు చూసుకుంటూ ఎగరడం కాదు. చక్కటి ఎండలో, ఆరుబైట గాలిలో ఎవరు వ్యాయామాలు చేస్తున్నారు? ఆ చేసే వ్యాయామాలు మాత్రం ఏమిటి? కండలు పెంచే జిమ్ము వ్యాయామాలు. అవి రోగనిరోదకశక్తిని పెంచగలవా? లేవు. ఏడాదిపాటు పెంచిన కండలు, ఒక్క జ్వరంతో కరిగి వేలాడటం మొదలుపెడతాయి. మరెందుకవి? 


అసలు కనీస వ్యాయామమంటూ ఏదో ఒకదాన్ని ఏడుస్తున్నవారెందరు? ఎవరూ లేరు. పొద్దున్న పదింటికి నిద్ర లేవడం, ఆ సోఫాలోనో, బెడ్ మీదనో రోగిష్టిలాగా పడుకుని, టీవీనో, మొబైల్ నో చూస్తూ, ఫోన్లో సొల్లు వాగుతూ ఉండటం, టైమైతే జొమాటో ఆర్డర్ పెట్టడం, తిని మళ్ళీ మొబైల్లోకి చూస్తూ పడుకోవడం. లేకపోతే ఆ ఫ్రిజ్ లో కుక్కిన పదిరోజులనాటి చెత్తను మింగడం. ఇది మన దినచర్య. ఇక రోగాలు రాక మరేమొస్తాయి?


ఏదో రోగం వచ్చినపుడు కూడా ప్రకృతిసిద్ధమైన మందులు వాడకుండా, సింథటిక్ ముందులు వాడటం. అక్కడకూడా డబ్బులు పారేసి పెద్ద ఆస్పత్రిలో చేరి దేహాన్ని వారికి అప్పజెప్పడం. అదృష్టం బాగుంటే ప్రాణంతో తిరిగి రావడం, లేదా శవంగా బయటకు రావడం. దహనం కూడా ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో. ఇదీ మన బ్రతుకు.


వినడానికి అసహ్యంగా ఉంటుందని ముందే చెప్పాను. ఎప్పుడైనా చూశారా మీరు? మామూలుగా దహనం చేసిన శవం బూడిద ఎలా ఉంటుందో? తెల్లగా ఉంటుంది. ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో వచ్చే బూడిదను ఎప్పుడైనా చూశారా? నల్లగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా పెనంమీద అట్టు మాడినట్లు శవం అందులో మాడిపోతుంది. అది అసహజ ప్రక్రియ . బ్రతికున్నపుడూ అసహజంగా బ్రతకడం, చావులో కూడా అసహజమే. ఇది మానవజాతి చేతులారా చేసుకుంటున్న ఖర్మ కాకపోతే మరేంటి? 


సినిమాలు చూసి, ఫుడ్ కంపెనీల యాడ్స్ మాయలో పడి, మోడరన్ లైఫ్ ఉచ్చులో ఇరుక్కుని మనుషులు సర్వనాశనం అవుతున్నారు. అవండి. మిమ్మల్ని ఎవడూ కాపాడలేడు.


అసలు మన దేశంలో ఫ్రిజ్ ఎందుకు? అవసరమా? మనకు ఓవెన్లెందుకు? అవసరమా? మనకు జొమాటోలెందుకు? అవసరమా? అమెరికావాడి తిండి మనకెందుకు? అవసరమా? రోజంతా కదలకుండా పందుల్లాగా పడుకుని టీవీలు, మొబైళ్ళు చూడటం మనకెందుకు? అవసరమా? అర్ధరాత్రిళ్ళు, తెల్లవారుఝామున నానాచెత్త తిండి తినడం అవసరమా? ఏదీ అవసరం లేదు. ఇదేదీ సహజం కాదు. మరి ఇన్ని అసహజములైన పనులు, ప్రకృతికి వ్యతిరేకమైన పనులు ప్రతిరోజూ చేస్తూ, మన రోగనిరోధకశక్తి గట్టిగా ఉండాలంటే ఎలా ఉంటుంది?


పోనీ మనసన్నా శుద్ధంగా ఉంటున్నదా మనకు?


ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కోపాలు, అహంకారాలు, గర్వాలు, ధనమదం, కులగర్వం, ఆశ, నాటకాలు, వేషాలు, పొగరు, లెక్కలేనితనం, అన్నీ నాకే తెలుసన్న మదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో మన మనస్సులో ఉన్న దయ్యాలు.


ఒళ్ళూ కుళ్లిపోతూ, మనసూ కుళ్లిపోతూ, పైకిమాత్రం 'అంతా భలే బాగుంది' అనుకుంటూ మొహానికి మాత్రం క్రీములు పూసుకుంటూ, ఒళ్ళు అందరికీ చూపించుకుంటూ బ్రతుకుతున్న ఇలాంటి స్థితిలో కరోనా ఎందుకు? గట్టిగా ఒక చిన్న గాలివీస్తే చాలు మనం నేలకూలిపోవడానికి.


ఏవిధంగా మనం ఆరోగ్యవంతులం అసలు?


మనల్ని చంపడానికి కరోనాయే అవసరం లేదు. చిన్న సూది గుచ్చుకుంటే కూడా, కుప్పకూలిపోయి, ప్రాణాలు పోయే రోజులు ముందున్నాయి. కూచున్నవాడు కూచున్నట్టు, నుంచున్నవాడు నుంచున్నట్టు, నడుస్తున్నవాడు నడుస్తూనే చనిపోయే రోజులు ముందున్నాయి. 


బుద్ధి కర్మానుసారిణి. ఎవడాపగలడు? ఎవడెన్ని చెప్పినా, ఎంత మంచిని చెవిలో వినిపించినా, ఎవడూ వినడు, ఆచరించడు. పో కాలం వచ్చినపుడు ఇలా ఉండక ఇంకెలా ఉంటుoది


సేకరణ. మానస సరోవరం 👏

మొదటి పాఠశాల

 ఇల్లే మొదటి పాఠశాల.

...................................


         2012 వ సంవత్సరం. నవదంపతుల కోసం మొట్టమొదటి సారిగా ' శ్రీమాతా కుటుంబ చింతనయాత్ర ' పేరుతో రెండురోజుల శిబిరం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా లోని కానూరు గ్రామంలో శ్రీ రంగప్పయ్య గారింట్లో నిర్వహించబడింది. రెండు రోజులు విజయవంతంగా జరిగి వచ్చిన నవదంపతులు పుట్టింటినుండి అత్తగారింటికి వెళ్ళేవారిలాగా భావుకులయ్యారు. శిబిరంలో చివరి కార్యక్రమం ప్రశ్నోత్తరాలు, సమారోప్ ( ముగింపు ) మాననీయ శ్రీ న. కృష్ణప్ప గారు నిర్వహించడానికి సిద్ధమై వేదిక మీద కూర్చున్నారు. సమారోప్ కార్యక్రమం కావడం వల్ల వేదిక ఒక చివరన ఆతిథ్యమిచ్చిన ఆ ఇంటి యజమాని కూడా ఆసీనుడై ఉన్నారు. 

          శిబిరంలో పాల్గొన్న ఒక యువతి లేచి నిలబడి ' నాదొక ప్రశ్న. అయితే ఈ ప్రశ్న కృష్ణప్ప గారికి కాదు, ఈ ఇంటి యజమాని అయిన శ్రీ రంగప్పయ్య గారికి ' అన్నది. ఆమె ఏ ప్రశ్న అడుగుతుందో, ఈయన ఏ జవాబిస్తారో అనే సంశయంతోనే ప్రశ్న అడగడానికి అనుమతించబడింది. 

         ఆమె ప్రశ్న ఇలా ఉంది : ' నేను ఎవరు ? నా వంశం ఏది ? నా కులం ఏది ? ఇవేవీ తెలియకుండానే మీరు, మేము రావడానికి చాలా ముందుగానే ఇంటి ముందు ముగ్గులు వేసి, మామిడాకు తోరణాలు కట్టి , ఎన్నో ఏళ్ళుగా పరిచితులో, బంధువులో వస్తున్నారనేలా ఎదురుచూస్తూ నిలబడిఉండి, మేం బస్సునుండి దిగగానే ఆత్మీయంగా ఎదురువచ్చి , మా కాళ్ళు కడిగి, హారతి ఇచ్చి స్వాగతించారు. ఇక ఈ ఇంట్లోని వారందరి తియ్యని మాటలు, ఆతిథ్యం, వండి వడ్డించిన రకరకాల వంటలు , అన్నిటికన్నా ఎక్కువగా మేం ఏ పని చేయకుండా మీరు తీసుకున్న శ్రద్ధ ఆధునిక శైలిలో పెరిగిన నాకు ఒక రకంగా విచిత్రంగా అన్పించింది. ఇక, ఈ ఇంట్లో వంటగది, పూజగదితో సహా ఏ గదిలోకైనా వెళ్ళడానికి నిర్బంధమేమీ లేదు. భావనలకన్నా వ్యవహారికతే విజృంభిస్తున్న నేటి కాలంలో ఈ రకమైన ఆత్మీయత,ప్రేమాభిమానాలు చూపడానికి కారణమేమిటి ? మాకందరికీ ఈ రకమైన ఆతిథ్యమివ్వాలని మీకు ఎందుకనిపించింది ? దీనివల్ల మీకేమిటి లాభం ? '

     ప్రశ్న విన్న రంగప్పయ్య గారు సాధారణ వ్యక్తి. పెద్దగా చదువుకున్నవారు కూడా కాదు.అయితే వినయ సంపన్నులు. రైతు.చిన్నగా నవ్వుతూ ఆయన ఇచ్చిన క్లుప్తమైన జవాబు ఎవరికైనా కన్నీరు తెప్పించేలా ఉంది. ' కాదమ్మా , మీరంతా మా ఇంటి ఆడపిల్లలే అని మేము భావించగా , నువ్వు ఇలా ప్రశ్నిస్తున్నావా ? మా ఇంటి ఆడపిల్ల తన భర్తతో కలసి వచ్చినపుడు చూసుకోవాల్సింది ఇలాగే కదా ? వచ్చిన మీ ఇరవైమంది కూడా మా ఇంటి ఆడపిల్లలే.పెళ్ళయిన ఆడపిల్లను పుట్టింటివారు చూసుకోవాల్సిన విధానమే ఇది.' జవాబు వినగానే ప్రశ్న అడిగిన యువతి వెక్కివెక్కి ఏడవడం ప్రారంభించింది. 

       ఎవరో సంబంధం లేని తమ కులం, గోత్రం తెలియని వారిని, అందులోనూ ప్రపంచంలో దొంగలే ఎక్కువ అని భావించే ఈ కాలంలో ఆదరించి, సత్కరించే ఆలోచన ఎక్కడినుండి వచ్చింది ? ఇది ఆలోచించాల్సిన విషయమేగదా ? ఉపనిషత్తుల్లోని మాతృదేవోభవ... ఆచార్యదేవోభవ అనే మాటలు కేవలం గ్రాంధిక పదాలుగాక, ఈ సమాజపు ఆచరణ, నడవడికల వల్లే కొనసాగుతూ వచ్చాయి. దీన్నే సంస్కారం అని పిలవచ్చు. 

        ఇలాంటి ఆచరణలున్న ఈ సమాజంలోనే అకస్మాత్తుగా మెకాలె కారణంగా ఎంత మార్పు వచ్చిందో ? దీని గురించి ఆలోచించాల్సి ఉంది. 

        ఇల్లు పాఠశాలగా మారి , తల్లి గురువుగా ఉన్నంతవరకూ సంతానం డబ్బు తయారుచేసే యంత్రమానవులు కావాలని భావించకుండా తన కుటుంబం, తన కులం, సమాజపు ఆస్తి కావాలనే భావన ఉండింది. ఒకవేళ తమ పిల్లలు తప్పుచేస్తే మొత్తం కుటుంబం , సమాజం ముందు పాపభీతితో తలవంచుకోవాల్సి వస్తుందనే హెచ్చరిక కూడా ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తమ వంశం, పరంపర, సంస్కృతుల పట్ల గర్వపడేరీతిలో పెంచేవారు. అయితే కాలప్రవహంలో మన కుటుంబమూ కొట్టుకుపోతున్న కారణంగా గర్వపడాల్సిన విషయాలన్నీ అపహాస్యానికి గురయ్యాయి. దీనినుండి బయటపడాల్సిన అవసరం గతంలోకన్నా నేడు ఎక్కువగా ఉంది. 

    ఈమధ్య ప.పూ. సరసంఘచాలకులు కుటుంబాన్ని మరింత దృఢతరం చేయడానికి భజన, భోజనం, భాష , భూష ( వేషధారణ ) , భవనం, భ్రమణం ( పర్యటన ) అనే ఆరు సూత్రాలను సమాజం ముందుంచారు.

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*440వ నామ మంత్రము* 7.10.2021


*ఓం కులకుండాలయాయై నమః*


సుషుమ్నానాడికి మూలము మూలాధారము. అట్టి మూలాధారమునే తన ఆలయంగాజేసుకొని కొలువై ఉండు శ్రీమాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కులకుండాలయా* యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం కులకుండాలయాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు సాధకుడు నిశ్చయంగా ఆత్మానందానుభూతితో తరించును.


ములాధారమునందు కర్ణిక గలదు. ఆ కర్ణిక మధ్యలో గల బిందువునకు కులకుండమని అందురు. తామరదుంపవలె ఉండు ఆ కులకుండమే తన నివాసస్థానమై, కుండలినీ శక్తిరూపంలో నిద్రిస్తూ ఉంటుంది పరమేశ్వరి. అనగా కులకుండమే తన ఆలయముగా చేసికున్నది గనుక అమ్మవారు *కులకుండాలయా* యని అనబడినది. ఈ విషయంలో శంకరభగవత్పాదులవారు సౌందర్యలహరిలోని పదియవ శ్లోకంలో ఇలా చెబుతున్నారు:-


*సుధాధారాసారై-శ్చరణయుగలాంతర్విగలితైః*


*ప్రపంచం సించన్తీ - పునరపి రసామ్నాయమహసః|*


*అవాప్య స్వాం భూమిం - భుజగనిభ మధ్యుష్ట వలయం*


*స్వమాత్మానం కృత్వా - స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||*


ఈ శ్లోకం కుండలినీ యోగం (అవరోహణ) గురించి తెలిపే శ్లోకం - శరీరంలో నాడీ ప్రపంచం గురించి, అమృత ధారా స్రావ మార్గంగురించి వివరణ

 

అమ్మా...భగవతీ ( బ్రహ్మరంధ్ర స్థానములో ఉన్న సహస్రార చక్రమందు అయ్యవారితో విహరించు అమ్మ.) నీ పాదద్వయం మధ్యబాగము నుండి స్రవించిన అమృతధారా వర్షములచేత (మనలోని అంతః ప్రపంచమైన) వేల నాడుల ప్రపంచమును తడుపుతున్నదానివై,అమృతాతియ కాంతిగల చంద్రుని స్థానమును (బ్రహ్మరంధ్రమును) వీడి, మరలా స్వస్థానమైన మూలాధారమును చేరి, నీ రూపాన్ని నీవే పామువలె చుట్టలు చుట్టుకుని, పృధివీతత్వమగు మూలాధారమందు, తామరదుద్దు మధ్యలోని సన్నని రంధ్రములో సూక్ష్మముగానున్నదానియందు కుండలినీశక్తిగా నిద్రిస్తూ ఉంటావు.


 మూలాధారమునందు నిద్రాణములో నున్న కుండలినీ శక్తిని జాగృతంచేసి, సుషుమ్నా మార్గంలో షట్చక్రములగుండా, బ్రహ్మ,విష్ణు,రుద్ర గ్రంథులను ఛేదిస్తూ సహస్రారంచేరి అచటగల చంద్రమండలమునుండి సుధాధారలను స్రవింపజేసి, సాధకుని డెబ్బదిరెండువేల నాడీమండలమును తడపి, ఆ సుధాధారలలో సాధకుని ఆహ్లాదగొలిపి, మరల మూలాధారంచేరి యథాప్రకారం నిద్రాణమునకు చేరుకుంటుంది కండలినీ శక్తి. అనగా మూలాధారమందుగల కులకుండము తన నివాసస్థానమై, అది తన నిలయంగా, ఆలయమై విలసిల్లుతుంది గనుక శ్రీమాత *కులకుండాలయా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కులకుండాలయాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*439వ నామ మంత్రము* 7.10.2021


*ఓం కులేశ్వర్యై నమః*


సజాతీయమైన మాతృకా సమూహమునకు *కుళ* యని పేరు. అట్టి సమూహానికి అధీశ్వరి అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కులేశ్వరీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కులేశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులను బ్రహ్మజ్ఞానసముపార్జనాసక్తులుగా పరివర్తింపజేసి, ఆ మార్గములో సాధన కొనసాగునట్లు వారిని అనుగ్రహించును.


మూలాధారచక్రము, స్వాధిష్టానచక్రము, మణిపూరచక్రము, అనాహతచక్రము, విశుద్ధిచక్రము, ఆజ్ఞాచక్రము - ఈ మార్గానికి సుషుమ్నా మార్గం అందురు. ఈ మార్గంలోనే కురుకుళ్ళాదేవి సంచరిస్తూ ఉంటుంది. ఈ సుషుమ్నా మార్గముపై ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. ఆ దేవతయే కులేశ్వరి. అట్టి కులేశ్వరి స్వరూపిణియైన పరమేశ్వరి *కులేశ్వరీ* యని అనబడుచున్నది. డెబ్బదిరెండువేల నాడీ మండలమును కూడా కులము అని అంటారు.అట్టి కులమునకు అధీశ్వరియైన పరమేశ్వరి *కులేశ్వరీ* యని అనబడుచున్నది. ఇంతకు ముందు నామ మంత్రములో అమ్మవారిని కురుకుళ్ళా యని స్తుతించాము. అట్టి కురుకుళ్ళాయే *కులేశ్వరీ* యని కూడా అనబడుచున్నది. సజాతీయులైనటువంటి మాతృ, మాన, మేయముల సమూహమే కులము. అటువంటి కులమునకు ఈశ్వరి జగన్మాత గనుక,ఆ తల్లి *కులేశ్వరీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కులేశ్వర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

ఉత్సాహం తో ఉంటే

 "అనిర్వేదః శ్రియోమూలం అనిర్వేదః పరం సుఖం,

అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః."

ఇది వాల్మీకి విరచిత రామాయణ లోని శ్లోకం. 

నిర్వేదం అంటే దిగులు, ఈనాటి భాషలో డిప్రెషన్. 

అనిర్వేదం అంటే ఉత్సాహం. 

అనిర్వేదమే శ్రేయస్సుకరం. అదే పరమసుఖం. అదే మానవుడిని ముందుకు నడిపిస్తుంది, అన్ని పనులను సఫలం చేస్తుంది. నేను మనసు నుంచి నిరుత్సాహన్ని పారద్రోలి ఉత్సాహం తో వెతుకుతాను, 

అని లంకలో హనుమ రావణ అంతఃపురము లో సీతాదేవి ని కానక దిగులు పడి ,అంతలోనే తేరుకుని అనుకున్న మాట. 

నిజానికి ఇది మనకు వర్తిస్తుంది. ప్రతి చిన్న విషయానికి దిగులు చెందుతూ జీవితం దుర్భరం చేసుకుంటాము. అలా కాకుండా ఉత్సాహం తో ఉంటే జీవితం లో అన్నీ సాధించించగలము.

చక్కని సందేశం.

ముఖ్యం

 శుభోదయం ......... ☕ ........


*ఒక పనిని చేయడానికి ఎన్ని గంటలు పట్టింది అన్నది ముఖ్యం కాదు, ఒక గంటలో ఎంత పని చేశాము అన్నది ముఖ్యం.*


మన జీవితంలో మరో రోజు వచ్చింది అంటే మనకు ఇంకొకరోజు అవసరం అని అర్థం కాదు. మనము ఈరోజు వేరొకరికి అవసరమేమూ అనే విధంగా బ్రతకాలి. 


*ఇతరుల లోపాలను వెతుకుతూ తమ సమయాన్ని గడిపే వారు సాధారణంగా తమ తప్పులను సరిదిద్దుకోవడానికి సమయం కేటాయించరు.*

అజగరవ్రతం


 తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావం, అంతర్దృష్టి ఇదే అజగరవ్రతం . ఇది యజ్ఞయాగాదుల వలన లభించదు. ఆత్మజ్ఞానం వలననే ఇది లభించ గలదు. అజగరవ్రతం ఆచరించే వారికి పాపము అంటదు, భయము ఉండదు, శోకముచేరదు, మోక్షము అతడికి దగ్గరగా ఉంటుంది " 

*దుఃఖ విముక్తి

 *దుఃఖ విముక్తి*


ధర్మరాజు " పితామహా ! మానవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖములనుండి విముక్తి పొందగలడు " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నేను నీకు అజగర కథచెప్తాను. పూర్వము ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణుడిని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు " మహారాజా ! ఈ చరాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అందులో మానవులూ ఉన్నారు. ఏ ప్రాణి శాశ్వతం కాదు. ప్రాణం శాశ్వతం కాదని తెలిసీ, మానవులు మరణానికి కలత చెందుతారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దుంగలు కొట్టుకు వస్తాయి. అవి ఒక్కక్కసారి కలుస్తూ తిరిగి కొంతదూరం పోయి విడిపోతాయి. ఈ సృష్టిలో భార్యాభర్తలు బంధుమిత్రులు అలాగే కలుస్తూ విడిపోతుంటారు. ఈ సత్యం తెలిసిన వాడు సుఖదుఃఖాలకు అతీతుడు అయి శాశ్వత ఆనందం పొందగలడు. నేను సుఖదుఃఖాలకు అతీతుడను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు. నేను, నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరను. దుఃఖం వచ్చిన కలత పడక దానిని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక ఏది దొరికినా తింటాను. మృదువైన శయ్యమీద కటిక నేలమీద సమభావంతో నిద్రించగలను. పట్టువస్త్రాలు, నారచీరలు ఏవైనా ధరించగలను. ఎదీ నాకుగాకోరను. లభించినది ఏదైనా తృప్తి చెందగలను. అజగరవ్రతం స్వీకరించి నన్ను వెదుకుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత చిత్తతతో ఉంటాను. తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావం, అంతర్దృష్టి ఇదే అజగరవ్రతం . ఇది యజ్ఞయాగాదుల వలన లభించదు. ఆత్మజ్ఞానం వలననే ఇది లభించ గలదు. అజగరవ్రతం ఆచరించే వారికి పాపము అంటదు, భయము ఉండదు, శోకముచేరదు, మోక్షము అతడికి దగ్గరగా ఉంటుంది " అని ప్రహ్లాదుడికి బ్రాహ్మణుడు చెప్పాడు.

🕉️

శరన్నవరాత్రులు - నవావరణ పద్యార్చన*

 *శ్రీ ప్లవ - శరన్నవరాత్రులు - నవావరణ పద్యార్చన*l

           రచన: శ్రీశర్మద - స్వర్ణపురి (పొన్నూరు)


ఆశ్వయుజ శుక్ల పాడ్యమి: ది.07-10-2021


శార్దూలము: 

శ్రీమాతా! శ్రితపారిజాత! తవధీశ్శ్రేణుల్ శరద్రాత్రులై

నీ మాహాత్మ్యము పర్వమై పృథివిపై నిత్యోత్సవంబై శుభా

రామంబయ్యె భవత్ప్రభాకలితమై రాజత్కళాశోభలై

శ్రీమంతంబయి నిల్వవచ్చె జగతిన్ శ్రేయఃప్రదేయమ్ములై

✍️శ్రీశర్మద.

తీర్ధం* యొక్క విశిష్టత

 🙏 *అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం!!* 

🕉పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు. *తీర్ధం* యొక్క విశిష్టత ప్రత్యేకంగా ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం.

దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో *పంచామృతాలు* ,

 *తులసి దళాలు* ,

 *సుగంధ ద్రవ్యాలు* ,

 *మంత్ర శక్తులు* ఉంటాయి. దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి.

👌 *మొదటిసారి* తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. ( *అకాల మృత్యు హరణం* )

👌 *రెండవసారి* తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.( *సర్వవ్యాధి నివారణం!* )

👌 *మూడవది* పవిత్రమైన పరమాత్ముని పరమ పదం అనుకుని తీసుకోవాలి.( *సమస్త పాపక్షయకరం* )

📚 *పురాణాల** ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి.

మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. *కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం ముద్ర* వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ రంద్రం *సహస్రార చక్ర* ఉంటుంది. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోవడం మంచిది.


🙏 శ్రీ కృష్ణార్పణం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*గోశాల..*


"శ్రీ స్వామివారి మందిరం వద్ద ..ఆ స్వామి కృపతో అన్నదానం జరుగుతున్నది..స్వామివారిని దర్శించుకున్న భక్తుల కోరికలు కూడా తీరుతున్నాయి..అన్నీ లక్షణంగా ఉన్నాయి..ఒక్క గోశాల కూడా వుంటే బాగుంటుంది..కనీసం ఐదు ఆవులను మన గుడి వద్ద పోషిస్తే బాగుంటుంది.."అని 2016 ఆగస్ట్ లో మా సిబ్బంది నాతో చెప్పారు.. చూద్దాం..అంటూ వాయిదా వేసాను నేను..అందుకు కారణం లేక పోలేదు..గోశాల నిర్వహణ తేలికైన పని కాదు..గోవులకు సరైన ఆహారం..వాటిని సంరక్షించడానికి పని వాళ్ళూ..ఉంచడానికి ఒక గోశాల కావాలి..ఇవన్నీ ఖర్చు తో కూడుకున్న పనులు..శ్రీ స్వామివారి వద్ద గోవులను ఇవ్వడానికి కొంతమంది ఉత్సాహం చూపుతున్నారు..కానీ..నేను వారిస్తూ వున్నాను..అన్ని ఏర్పాట్లూ చేసి..ఆపైన గోవులను ఇక్కడికి తీసుకురావాలని నా కోరిక..


క్రమంగా మా వాళ్ళ నుంచి గోశాల గురించిన అభ్యర్ధన పదే పదే వినబడసాగింది..నేనూ నిశ్చయానికి వచ్చేసాను..ముందుగా ఒక పది పదిహేను గోవులు ఉండడానికి సరిపడా షెడ్ నిర్మాణం జరగాలి..కనీసం రెండు, రెండున్నర లక్షల వ్యయం అవుతుంది..దాతల సహకారం తీసుకుందామని నిర్ణయించుకున్నాము..ఏ నిర్ణయమైనా అమలు చేద్దామని అనుకున్నప్పుడు..ముందుగా శ్రీ స్వామివారి సమాధి వద్ద మోకరిల్లి..అక్కడ చెప్పుకొని..మొదలుపెట్టడం అలవాటు..ఇప్పుడు కూడా శ్రీ స్వామివారి సమాధి వద్ద ఇలా గోశాల నిర్మాణం చేయాలని సంకల్పించామనీ..ఆశీర్వదించమని వేడుకున్నాను..


ఆ ప్రక్క ఆదివారం రోజు..వింజమూరు నుంచి..శ్రీ గుఱ్ఱం వెంకటేశ్వర్లు దంపత్సమేతంగా వచ్చారు..శ్రీ స్వామివారి ఆశ్రమాన్ని నిర్మించిన శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారికి స్వయానా మరదలి కుమారుడు..1979 నుంచీ నాకు పరిచయం ఉన్న వ్యక్తి..శ్రీ స్వామివారి మీద అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన వాడు..శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..ఉత్సవ విగ్రహం వద్ద పూజ చేయించుకొని..నేరుగా నావద్దకు వచ్చి..ఏ ఉపోద్ఘాతమూ లేకుండానే..నేరుగా..


"మన గుడి వద్ద గోశాల లేదు కదా?..గోశాల ఎందుకు కట్టించలేదు?..ఇంత పెద్ద ఆలయం వద్ద గోశాల కూడా వుంటే ఎంత శోభస్కరంగా ఉంటుందో ఆలోచించావా?..నా మాట విని తొందరగా గోశాల ఏర్పాటు చెయ్యి.." అని గబ గబా చెప్పేసాడు..


నేను కొద్దిగా తేరుకొని.."గోశాల నిర్మించాలంటే..నిధులు కావాలి కదా?..సుమారు రెండులక్షల పైమాటే..గబుక్కున నేను ఒకరిని అడగలేను..గోశాల గురించి ఆలోచన చేసాను..ఆ స్వామివారితో కూడా మొర పెట్టుకున్నాను..దాతల సహకారం తీసుకొని..మెల్లిగా పూర్తి చేస్తాను..అదీకాక గోవులకు గ్రాసం కొనడం పెద్ద సమస్య ఇక్కడ..మొగలిచెర్ల లో గ్రాసం దొరకదు..వేరే గ్రామాల నుంచి గడ్డి కొని..ట్రాక్టర్ ద్వారా తెప్పించుకోవాలి..ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా.." అన్నాను..


"ముందు ఒకటి చెప్పు ప్రసాదూ..గోశాల నిర్మాణం జరగడం నీకు అభ్యంతరం లేదు కదా..ఇక ఆ ఖర్చు గురించి..రెండు..రెండున్నర లక్షలు కదా..ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు..వచ్చేనెలలో మంచిరోజు ఎప్పుడో చూడు..నిర్మాణం మొదలుపెడదాం..నేను పూర్తిగా ఆ ఖర్చు భరిస్తాను..రెండు మూడు నెలలకు సరిపడా గడ్డి కూడా నేనే ఏర్పాటు చేస్తాను..ఇక నీదే ఆలస్యం.." అన్నాడు..


నేను మాట్లాడటానికి ఏమీ లేదు..శ్రీ స్వామివారే వెంకటేశ్వర్లు ద్వారా చెప్పించేసారని అర్థమైపోయింది..సరే అన్నాను..మరో వారం రోజులకల్లా వెంకటేశ్వర్లు తన మనుషులను పంపించాడు..వాళ్ళు చక చకా గోశాల కు అనువైన షెడ్డును నిర్మించేశారు..మరో రెండు నెలల లోపే ఐదు గోవులతో..గోశాల ప్రారంభం అయింది..అందులో రెండు గోవులు వెంకటేశ్వర్లు ద్వారా వచ్చినవే..ఈరోజు మొత్తం పన్నెండు ఆవులతో మేము గోశాల ను నిర్వహిస్తున్నామంటే..పైకి కనిపించే కారణం శ్రీ గుఱ్ఱం వెంకటేశ్వర్లు ప్రోద్బలమూ..ఆర్థికసహాయమూ..కానీ అంతర్లీనంగా మాకు కనిపించేది ఆ దయామయుడైన అవధూత శ్రీ దత్తాత్రేయుడి సంకల్పం..అది నెరవేర్చే బాధ్యత కూడా శ్రీ స్వామివారిదే.. మేము నిమిత్తమాత్రులం..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..సెల్..94402 66380 & 99089 73699)