24, మే 2022, మంగళవారం

Comfortable attitude at Old Age*

 *Comfortable attitude at Old Age*


I asked one of my friends who has crossed 60 & is heading to 70. 

What sort of change he is feeling in him?

He sent me the following 

very interesting lines, 

which i would like to share 

with you all.....

1) After loving my parents, 

    my siblings, my spouse, 

    my children, my friends, 

    now I have started loving   

    myself.

2) I just realised that I am not 

     “Atlas”. 

     The world does not rest on 

      my shoulders.

3) I now stopped bargaining 

     with vegetables & fruits 

     vendors. 

     After all, a few Rupees more 

     is not going to burn a hole in 

     my pocket but it might help 

     the poor fellow save for his 

     daughter’s school fees.

4) I pay the taxi driver without 

     waiting for the change. 

     The extra money might 

      bring a smile on his face. 

      After all he is toiling much 

      harder for a living than me

5) I stopped telling the elderly 

     that they've already 

     narrated that story many 

     times. 

     After all, the story makes 

      them walk down the 

      memory lane & relive 

      the past.

6) I have learnt not to correct 

     people even when I know 

     they are wrong. 

     After all, the onus of making 

     everyone perfect is not on 

     me. 

     Peace is more precious than 

     perfection.

7) I give compliments freely & 

     generously. 

     After all it's a mood 

     enhancer not only for the 

     recipient, but also for me

😎 I have learnt not to bother 

    about a crease or a spot on 

    my shirt. 

    After all, personality speaks 

    louder than appearances.

9) I walk away from people 

     who don't value me. 

     After all, they might not 

     know my worth, 

     but I do.

10) I remain cool when 

       someone plays dirty 

       politics to outrun me in the 

       rat race. 

      After all, I am not a rat & 

      neither am I in any race.

11) I am learning not to be 

      embarrassed by my 

      emotions. 

      After all, it's my emotions 

      that make me human.

12) I have learnt that its better 

      to drop the ego than to 

      break a relationship. 

      After all, my ego will keep 

      me aloof whereas with 

      relationships I will never 

      be alone*.

13) I have learnt to live each 

      day as if it's the last. 

      After all, it might be the last.

14) I am doing what makes me 

       happy. 

      After all, I am responsible 

      for my happiness, and 

      I owe it to me.

 ☘ 🥒


I decided to send this to many, because why do we have to wait for so long, 

why can't we practice this at any stage and age...

Best wishes for all my 

grown-up friends & relatives

అమ్మ తీర్పు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

     🙏  *అమ్మ తీర్పు*  🙏           

                 🌷🌷🌷

‘మా ఫ్రెండ్స్ వస్తున్నారు....మందు పార్టీ ఉంది, చికెన్ చేయమంటే, పందిలా పడుకుంటావా?' కోపంగా కాలితో ఒక్క తన్ను  తన్నగానే జ్వరంతో టాబ్లెట్ వేసుకుని పడుకున్న వసుధ ఉలిక్కిపడి లేచింది.  నిద్రలో నుండి హఠాత్తుగా భయపడి లేచేసరికి ఒక్క క్షణం అయోమయంగా అనిపించింది. ఎదురుగా భీకరంగా కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ భర్త,  కృష్ణమూర్తి.

‘ఎప్పుడూ ఆ దేభ్యం మొహం వేసుకుని ఉంటావు.....ఇల్లు అంటే రావాలి, రావాలి; అనిపించేలా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా ...నీ మొండితనం నీదే....ఏదీ వండావా? ’ రంకెలేస్తూ అంటున్నాడు.


‘జ్వరం వచ్చిందండీ, చేతకావట్లేదు, నీరసంగా అంది.


‘ఛీ ...ఎప్పుడూ రోగాలు రొష్టులే, ఎప్పుడు చక్కగున్నావ్ కనుక దరిద్రపు కొంప, దరిద్రపు కొంపాని' కాలితో ముందున్న పిండి గిన్నెను విసిరి తంతూ విసురుగా వెళ్ళిపోయాడు.  ఇల్లంతా ఎగజల్లినట్లు పిండి అంతా పరుచుకు పోయింది.  బాగు చేసే ఓపిక లేక అలాగే ఒరిగిపోయింది వసుధ.


అలా వెళ్ళినవాడు పేకాడుతూ క్లబ్బులో ఆ రాత్రంతా ఉండి పోయాడు.  తర్వాత అక్కడే అలాగే నిద్రపోయాడు.  తెల్లవారి పొద్దెక్కిన తర్వాత ఇంటికి బయల్దేరాడు.


‘అంటీ మీకీ తాళం చెవి ఇమ్మంది’ అంటూ పక్కింటి అమ్మాయి తాళం చెవి చేతిలో పెట్టింది.  గుడికో, ఏదైనా పేరంటానికో వెళ్ళినప్పుడల్లా అలా ఇచ్చి పోవడం పరి పాటే.  లోనికి వెళ్ళగానే రాత్రి హాంగోవర్ తగ్గడానికి బాత్రూం కెళ్ళి స్నానం చేసి వచ్చాడు.  తల తుడుచుకుంటూ నడుస్తుంటే కాలికి ఎదో తగలడంతో, టవల్ పక్కకు తీసేస్తూ కిందకి చూసాడు.  కింద నిన్న తను తన్ని వెళ్ళిన పిండి. ఏదో అనుమానంతో చుట్టూ పరికించి చూసాడు.  ఎప్పటిలా ఇల్లు కడిగిన ముత్యంలా అద్దంలా మెరిసిపోవటం లేదు.  ఇల్లంతా అస్తవ్యస్తంగా దుమ్ము దుమ్ముగా ఉంది.  అతని భ్రు ముడి పడింది. పెళ్ళయి ముప్పై వసంతాలు దాటుతున్నా ఎన్ని సార్లు ఎంత పెద్ద గొడవలైనా ఇల్లిలా ఉన్న దాఖలాలు లేవు.  ఏమయ్యింది....నిజంగానే ఆరోగ్యం బాలేక హాస్పిటల్ కి వెళ్ళిందా...కనీసం తనకి ఫోన్ చేస్తుందే....తను తాగిన మత్తులో ఏమైనా ఎత్తలేదా... సెల్ తీసి చూసాడు.  ఏ కాల్ లేదు, సరే తనే ఫోన్ చేద్దామనుకుని చేసాడు. ఊహు, స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎంత చేతకాక పోయినా ఇల్లిలా ఎన్నాడూ పెట్టలేదు.  ఆ పరిసరాలు, ఆ నిశ్శబ్దం చికాకు కలిగిస్తున్నాయి.  అసహనంగా అతి భారంగా పావుగంట గడిచింది.... సమయం గడుస్తున్నకొద్దీ కోపం పెరుగుతోంది.. ఆకలి వల్లనేమో అది రెట్టింపవుతుంది.  సరే టీవీ పెడదామనుకుని రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు.  అది బరువుగా పెట్టిన దాని కింది కాగితం ఫాన్ గాలికి ఎగిరి కింద పడింది.  తీస్తూ ఆశ్చర్య పోయాడు.  అది ఉత్తరం.


అతని కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు తీసాయి.


‘నేను చాలా విసిగిపోయాను. అలసిపోయాను.  ఇక నా మనస్సుతో, మీతో ఘర్షణ పడే ఓపిక నాకు లేదు.  పెళ్ళయిన దగ్గరనుండి మీరు నన్ను కేవలం ఒక వస్తువుగా, భావోద్రేకాలు లేని మరమనిషిగానే భావించారు. అందమైన మీ రూపం వెనుక అందమైన మనస్సుంటుందను కున్నానే కానీ అందం వెనక ఇంత వికృతమైన మనస్సుంటుందనుకోలేదు.  మీకు కావాల్సిన సుఖం, సదుపాయాలను అందించే రోబోలాగానే తప్ప నాకూ మనస్సుంటుందని, దానికేన్నో ఆశలున్నాయని మీరనుకోలేదు. పెళ్ళయి ముప్పై వసంతాలు దాటినా మీరు మారలేదు.  కనీసం పిల్లలూ నా మనస్సు అర్ధం చేసుకోలేదు.  అందుకే ఈ మిగిలిన జీవితం అయినా నా కిష్టమైనట్లుగా గడపడానికి గడప దాటుతున్నాను. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు.  ఎన్నో జన్మల తర్వాత ఇంతటి ఉత్తమమైన మనిషి జన్మ వస్తుందంటారు.  ఆ జన్మ సార్ధకత చేసుకునేలా నాకు నేనుగా బతుకుతాను.  మా అమ్మావాళ్ళు బతికి ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడో ఇచ్చిన డబ్బులు ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతున్నాయి.  పిల్లలకి నా ఆశీస్సులు.  నన్ను వెదకడానికి ప్రయత్నించవద్దు... నా పిచ్చిగానీ మీరెందుకు వెతుకుతారు?  ఒక పనిమనిషిని పెట్టుకుంటారు.’


సెలవ్.... వసుధ.


ఉత్తరం చదివి హతాశుడయ్యాడు. అస్సలు జీర్ణించుకోలేక పోతున్నాడు.  ఇంత కాలం కనీసం తనన్న మాటకు ఎదురుకూడా చెప్పలేనిది ఇప్పుడు ఏకంగా ఎగిరేపోతుందా?  ఇది కలా,  నిజమా? చేతులు వణుకుతుంటే కాగితం ఎగిరిపోయి టేబిల్ పై నున్న కృష్ణుని పాదాల చెంత పడింది.


కాస్సేపటికి తేరుకుని కర్తవ్యమ్ గుర్తొచ్చిన వాడిలా కొడుక్కి ఫోన్ చేసాడు, ‘అమ్మ వచ్చిందా’ అంటూ, ‘లేదు ఎందుకు ఇంట్లో లేదా?' కొడుకు అడుగుతుంటే పెట్టేసాడు. కూతురుకు చేసాడు. అక్కడా లేదనే సమాధానం వచ్చింది. మైండ్ అంతా బ్లాంక్ అయిపొయింది. షుగర్ పేషంట్ కావడం వల్లనేమో శరీరం వణకడం మొదలయ్యింది.


కొడుకు హరగోపాల్ మళ్ళీ ఫోన్ చేసాడు.  తరచి తరచి అడగ్గా విషయం చెప్పాడు.  చెల్లి దగ్గరకెల్లిందేమో కంగారు పడవద్దన్నాడు. అక్కడా లేదన్నాక కంగారు పడి బయల్దేరుతా నన్నాడు.  కూతురు వినీల ఫోన్ చేసింది. విషయం తెలిసి తానూ అల్లుడితో చెప్పి బయల్దేరుతానంది. మృదుమధురంగా రవలించే కాలి పట్టాలతో ఇంట్లో నడయాడే ఇల్లాలు లేక ఇంట్లో స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.  ఇంటి ముందు శుద్ది చేసి ముగ్గేసిన ఆనవాళ్ళు లేవు.  పూజ గదినుండి వచ్చే సాంబ్రాణి , అగర్బత్తి సువాసనలు లేవు.  భయం భయంగా బ్రష్ అందిస్తూ, కాళ్ళకు మడుగు లొత్తుతూ , ఇష్టమైనవి కష్టమైనా చేసిపెట్టే ప్రేమదేవత లేదు.  బీపీ, షుగర్ మందులు వేళకు ఇచ్చే ఆత్మీయత లేదు.  ఏం చేసినా ఎందుకు చేసావని గాని, ఎందుకు చేయలేదని గాని అడిగే దిక్కులేదు. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని తొలిసారి తెలిసిందతనికి.  నిగ్రహించుకున్న నిబ్బరం నీరుగారిపోతుంటే అతనికి తెలియకుండానే రెండు కళ్ళల్లోనుండి కన్నీళ్ళు వరదలయ్యాయి.  అలాగే నెమ్మదిగా అచేతనావస్థలో స్పృహ తప్పిందతనికి.


కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో బెడ్ మీదున్నాడు.  ఆసుపత్రిలో చిన్న రూమ్.  పక్కన మరో బెంచీ మీద కూతురు, కొడుకు కూర్చుని ఉన్నట్లున్నారు.  వారి మాటలు వినబడుతుంటే మళ్ళీ భారంగా కళ్ళు మూసాడు.


‘ ఏమో అన్నయ్యా....అసలు అమ్మ ఇలా ఎందుకు చేసింది.  ఏం తక్కువయ్యింది?  నాన్న తాగడం,  కోప్పడ్డం అంతా మామూలేగా... కొత్తేం కాదుగా.... ఏదో మనస్సు ఆపుకోలేక వచ్చాను.  ఆయన అప్పటికే కోప్పడుతున్నాడు, పిల్లలకి ఆయనకు కష్టం అవుతుందని.  త్వరగా వచ్చేస్తానన్నాను.  అయినా నాన్న షుగర్ పేషంట్ అని తెలిసీ ఎలా వెళ్ళింది?  నాన్న ఫ్రెండ్స్ సమయానికి రాబట్టి సరి పోయింది గాని, లేదంటే.....ఏదేమైనా నేను ఈ వేళ వెళ్ళిపోతాను’ వినీల అంటోంది.


‘నువ్వెళ్తే ఎలా?  మీ వదిన అయితే ఈ చాకిరీ ఏం చేయదు.  తనకీ చిన్న పిల్ల ఉంది.  అర్ధం చేసుకో... నాన్నను మా ఇంటికి తీసుకెళితే కూడా ఊర్కోదు.  నాకూ ఆఫీస్ ఉంది.  ఈయనతో ఏ టైం కి ఏమవుతుందో?  ఈ టెన్షన్ నేను భరించలేను.’


‘ఆయనకసలే ముక్కు మీద కోపం.  నేను తీసుకువెళ్ళలేను.  ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే, ఇంతకీ అమ్మ ఎక్కడికి, ఎందుకు వెళ్ళినట్లు.  అమ్మే ఉంటే ఈ తలనొప్పి ఉండేదే కాదు కదా!'


‘నేను అందుకే తెలిసిన వాళ్ళనందరినీ వాకబు చేశా....ఉత్తరం ప్రకారం చూస్తే, ఏదైనా ఆశ్రమంకో, హరే రామ హరే కృష్ణ లాంటి మఠం కో వెళ్లి ఉంటుంది’.


‘అవున్రా...నువ్వలా అంటే నాకు గుర్తొస్తోంది.  ఒకసారి అమ్మ ‘అమ్మ అనాధాశ్రమం’ గురించి ఏదో పేపర్ లో చదివి దాని వివరాలు ఎవరికో కావాలి అని నెట్ లో చూసి చెప్పమంది.’  ఉత్సాహంగా అంది వినీల.


‘అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. నెట్ లో సర్చ్ కొట్టి ఈ రెండు మూడు రోజుల్లో ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చారా అని తెలుసుకుంటాను.   ఒకవేళ దొరికితే మనం అదృష్టవంతులమే....’


‘హలో....’అమ్మ 

వృద్ధాశ్రమమానండీ .. డొనేషన్ ఇవ్వడానికి మాకు కొన్ని వివరాలు కావాలండీ... ఓహో... వంద మంది ఉంటారా.......ఈ రెండు రోజుల్లో మీ దగ్గర ఎవరైనా కొత్తవాళ్ళు చేరారా?  ఆమె పేరు ఏమిటండీ?  ఆ..అవునండీ...వసుధనే, ఉన్నారండీ. మేము ఫోన్ చేసినట్లు 

చెప్పకండి.  మేము వస్తాము. విరాళం తెస్తాము’


‘ఆ... ఏంట్రా అన్నయ్యా !అమ్మ అక్కడికే వెళ్ళిందా?అబ్బా.. ఎంత అదృష్టం !దేవుడు మన మొర ఆలకించాడు...’


అన్నీ వింటున్న క్రిష్ణమూర్తి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.  తనను ఒక్క రోజు చూసుకోవడం కష్టమయ్యింది పిల్లలకి.  భరించే అమ్మ దొరికిందని సంబర పడుతున్నారు.  నిజంగా వసుధ దేవత.  ఎన్ని రకాలుగా కష్ట పెట్టాడు.  అయినా ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు.  మాటకు ఎదురు చెప్పలేదు.  ఈ కొన్ని గంటలలోనే ఆమె లేకుండా తను ఉండలేదన్నది అర్ధమయ్యింది. బుద్ది వచ్చింది.  తనకు వసుధ కావాలి.  తను లేకుండా ఆమె బ్రతుకగలదేమోగాని ఆమె లేనిది తను బ్రతకలేడు.  డాక్టర్ లోనికి రాగానే హరగోపాల్, వినీల ఆయనతో కల్సి బెడ్ దగ్గర కొచ్చారు.


‘నాన్నా...నాన్నా....అదిగో డాక్టర్ వచ్చారు.  లే నాన్నా...’ పిల్లలు పిలుస్తున్నారు.  నెమ్మదిగా అప్పుడే మెలకువ వచ్చినట్లు కళ్ళు విప్పాడు.


‘ఎలా ఉంది...కొంచెం నీరసంగా ఉంటుంది... మరేం భయం లేదు.  మీరు డిశ్చార్జ్ కావొచ్చు.  కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ‘డాక్టర్ వెళ్ళిపోయాడు.


‘నాన్నా....అమ్మ ఆచూకీ తెలిసింది నాన్నా... ఈ రోజే వెళదాం...’ పిల్లలు డిశ్చార్జ్ కి సన్నాహాలు చేస్తూ అన్నారు.


*********************


‘అమ్మ అనాధాశ్రమం ‘ అన్న బోర్డ్ దగ్గర సరాసరి వెహికిల్ ని ఆపి దిగారు, కృష్ణమూర్తి, వినీల, హరగోపాల్.


‘నవమాసాలు మోసి, కనీ, పెంచి, లాలించి, పాలించి,అనారోగ్యం లో సేవ చేసి, రక్షనిచ్చి, ఆసరా అయి, శక్తి ఉడిగి పండుటాకై నీ చేతిలోనే నేలరాలుతుంది...’ ఎదురుగా బిడ్డకు పాలిస్తున్న అమ్మ బొమ్మ దగ్గర రాసి ఉంది.


WOMAN-------W -- Wonderful Mother


O--- Outstanding friend


M--- Marvelous Daughter


A—Adorable sister


N—Nicest gift to Men from God


వినీల ఇలా అక్కడున్న కొటేషన్లు చదువుతుంటే, హరగోపాల్ తొందర పెట్టి తీసుకెళ్ళాడు.


ఆఫీస్ రూమ్ లో పెద్దావిడ కూర్చుని ఉంది. ఆవిడ పైన ‘జీవితం ఒక అద్దం లాంటిది. అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది.  దాన్ని చూసి ఏడిస్తే మనల్ని చూసి ఏడుస్తుంది.  తేడా అద్దంలో లేదు. మనలో ఉంది.  జీవితం లోని సమస్యలు కూడా అంతే.  అందుకే ధైర్యంగా ఎదుర్కోవాలి’ అన్న కొటేషన్ రాసి ఉంది.  ఆవిడతో వివరాలు చెప్పి వసుధను ఒక్కసారి పిలిపించమని చెప్పారు.  ఆవిడ పక్కనే ఉన్న ఒక విశాలమైన రూమ్ చూపెట్టి అక్కడ కూర్చోండి, పిలిపిస్తాను అంది.  ముగ్గురు ఆ గదిలోకి నడిచారు.  ఆ గది గోడల పైనన్నీ అందంగా రాసిన ఆణిముత్యాల్లాంటి కోటేషన్లే.  టెన్షన్ తో ఉన్న మనస్సు మళ్ళించడానికన్నట్లు మౌనంగా అంతా ఆ కొటేషన్లు చదవడంలో మునిగిపోయారు.


‘ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడువక తప్పదు.


ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు.


ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు.


ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాకతప్పదు.


ఎంత గొప్ప ప్రదేశాన్ని చూసినా తిరిగి సొంత గూటికి చేరక తప్పదు.


ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు.


ఇదే జీవితం’


‘జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే!


ఎన్ని సార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది.


గమ్యం అనంతం, గమనం అనేకం.


ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కదిలిపోయేదే జీవితం! ‘


 *ముసలితనం* 


‘నీ శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు,


నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు,


నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు,


నీ పనులకు ఒకరి మీద ఆధార పడిన రోజు,


నీ భావాన్ని నీ నోటితో పలుకలేని రోజు’


నీ నిస్సహాయస్థితి కి నీకే జాలికలిగే రోజు నీ జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది.


కానీ అప్పటికే అంతా చేజారిపోతుంది.


తప్పులు దిద్దుకునే అవకాశం కూడా ఉండదు’


చదువుతున్న కృష్ణమూర్తికి నిన్నటి తన పరిస్థితి గుర్తొచ్చి కళ్ళల్లో నీరు ఉబికింది. తలుపు శబ్దం కావడంతో గుమ్మం వైపు చూసారంతా.


పసుపు పచ్చని చీరలో, నుదుట ఎర్రటి బొట్టు ప్రకాశవంతంగా వెలుగుతుంటే మృదు మధుర అందెల సవ్వడి ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంటే గంభీరంగా అడుగుపెట్టింది.


‘అమ్మా, అమ్మా,’ అంటూ చిన్నపిల్లల్లా రెండు వైపులా ఏడుస్తూ హత్తుకు పోయారిద్దరు పిల్లలు.  భుజంపై తల ఆన్చిన ఇద్దరినీ ఆర్తిగా భుజాలపై అలాగే రెండు చేతులతో తలనిమురుతూ ఉండి పోయింది వసుధ .


‘అమ్మా...నీకేం తక్కువయ్యిందని వచ్చావ్?' ముందు హరగోపాల్ అన్నాడు విడివడుతూ...


‘అన్నీ ఎక్కువే అయ్యాయి, భరించలేక వచ్చా’ స్పష్టంగా అంది వసుధ .


‘ నీకేదవసరమైనా అన్నీ క్షణాల్లో నాన్న తెచ్చిపెడుతున్నాడుగా, ప్రేమ లేకుంటేనే అలా చేస్తాడా? .’వినీల ఆరా..


‘మొన్ననే గోపాల్ పెళ్ళిలో బంగారం కూడా కొనిచ్చాను.  ప్రేమలేకుంటేనే చేస్తానా?  ఏం లేదని ఇలా వచ్చావ్?’  భర్త అసహనం.


‘ మనశ్శాంతి.  అది దొరకకనే వచ్చా...మీరు నన్ను పిలిచే పిలుపు ఏమిటో తెలుసా...’ఏయ్ మనిషీ...ఇగో... ఓ దేభ్యం మొహం..’ ఇవీ నా బిరుదులు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్నవాళ్ళని శాశ్వతంగా వదిలి పెళ్లి కాగానే చిరకాలం కష్టసుఖాల్లో తోడూ నీడై కలిసి ఉంటాడని గుడ్డి నమ్మకంతో వస్తాం.  కానీ ఎన్నడూ నా మనస్సు ఏమిటో కనీసం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ.. ఏంటీ.. బంగారం కొనిచ్చానన్నారు కదూ...నేను అడిగానా, అది కేవలం సమాజంలో మీ స్టేటస్ సింబల్ గా కనబడడానికే.  మీకు అన్నీ ఎప్పటికీ అమర్చి పెట్టే భార్య ఈ రోజు మీరు చెప్పింది వండలేదంటే,  ఏ బాధ ఉందో అని ఆలోచించక, చేయిచేసుకునే మనిషికి ఎం ప్రేమ ఉందనుకోవాలి?  ఏ అనురాగ బంధమూ లేని మీతో ఇంకా ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుందనిపించింది.

చిన్నప్పటి నుండి నా మనస్సులో ఎన్నో కోరికలు ఉండేవి.  ఎంతో చదువుకోవాలని, ఏవేవో చదవాలని, పుస్తకాలు రాయాలని ఎన్నో కోరికలు.  కాని ఒక్కటీ నెరవేరలేదు.  కారణం, ఆయనకిష్టం లేదు కాబట్టి.  ఇప్పుడు చదివి ఎవర్ని ఉద్ధరించాలని అంటూ ప్రతీ దానికి ఆంక్షలే.  అందుకే ఈ చరమాంకం లోనైనా ఇప్పుడైనా ఓపెన్ యునివర్సిటీ ద్వారా ఇంకా చదువుకుంటాను.  గుడిలో అందరూ నేను పాడే పాటలు కీర్తనలు చాలా ఇష్టపడతారు. ఎంతో మంది రాసియ్యమని అడిగేవారు.  అలా అవన్నీ గ్రంధస్తం చేస్తాను.  అలనాటి మన సంప్రదాయ సంస్కృతులలో భాగంగా ఉన్న ఎన్నో పాటలు, కొంగుచాపే పాట, తలుపుల దగ్గర పాడేపాట, అప్పగింతల పాట, బతుకమ్మ పాటలు, మన సంస్కృతీ సంప్రదాయాలు తెలిపే మంగళ హారతి పాటలు, జోల పాటలు ....ఇలా ఎన్నో పాటలు కనుమరుగవుతున్న సంప్రదాయాలన్నింటిని గ్రంధస్తం చేయాలనుకుంటున్నా.  ఆయన మారతాడని ఇంతకాలం ఎన్నో భరించా... కానీ నేను ఆయనకు ఒక అవసరం మాత్రమే  అని తెలుసుకున్నా, అందుకే నా కిష్టమైనట్లు కనీసం ఈ జీవిత చరమాంకం లోనైనా బతకాలనుకుంటున్నా’.


‘అమ్మా...అమ్మ భువిపై దేవుడి అపురూపమైన సృష్టి అంటారు . తల్లికి బిడ్డలపై ఎంతో ప్రేమఉంటుంది కదా!  అందులో ఆడపిల్లని, నా కోసమైనా ఒక్కసారి ఆలోచించలేవా అమ్మా?' వినీల అంది.


‘బిడ్డలకు రెక్కలు లేనప్పుడు వాటికి తల్లి సంరక్షణ అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ్యత నేరవేర్చాను.  ఇప్పుడు నీకు అన్నీ ఆలోచించే విచక్షణా జ్ఞానం ఉంది. ఎప్పుడూ...'అమ్మా! పిల్లలతో నాకు ఇంత కష్టం అవుతుంది' అని అంటావు.  పుట్టింట్లో నీకు పూర్తి విశ్రాంతి ఇస్తాను.  నీ ఇంటి కొచ్చి ఏదో రెండు మూడు నెలలకో నాలుగు రోజులు చేయగలను.  కాని మళ్ళీ నాలుగు రోజులకే 'వచ్చి హెల్ప్ చేయవచ్చుగా' అంటావ్.   నాకూ వయసై పోతుంది... ఇదివరకులా వేగంగా చేసే శక్తి నాకు లేదు.  పైగా నీకు చంటిపిల్ల ఉన్నప్పుడు నాన్న కేరళ లో ఉన్న ఏదో ఫంక్షన్ కి నన్ను తీసుకుని వెళితే, ఈ వయస్సులో హనీమూన్లా తిరుగుతున్నారని అల్లుడు తప్పుపట్టాడని చెప్పావే కాని,’ మరి ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళలేదు. వారి డబ్బులతో వారు వెళ్ళారు... కాళ్ళు చేతులు ఈ మాత్రం ఆడినప్పుడే వెళ్ళాలి కదా' అని మీ ఆయనకీ సర్ది చెప్పుకోలేక పోయావు. ఎప్పుడూ అయ్యో బిడ్డ కష్టపడుతుందని అవో, ఇవో చేసి పంపే నా ఆరాటమే కాని, ఒక్కసారైనా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగావా? ఎందుకంటే అమ్మ అది ఆశించదు.   నిజమే... కానీ మళ్ళీ నీ కడుపున పుట్టినవాళ్ళు కూడా నీలాగే తయారవుతారు.  అప్పుడు నా బిడ్డ మనసు ఎంత వేదన పడుతుందో నాకు తెలుసు.  అది నేను భరించలేను.  కాబట్టి అలాంటి సందేశం సున్నితంగా యువత లోకి చొచ్చుకుపోయేలా చేయాల్సిన అవసరం ఇప్పుడుంది.   నాలా, నా బిడ్డ గాని, మరో అమ్మ మనసు గానీ బాధ పడొద్దని నా ఆశ‘ వినీల కళ్ళనిండా నీళ్ళు నిండాయి.


‘అమ్మా!  మరి నేనేం తప్పు చేసాను.  కనీసం నువ్వు నా దగ్గరికైనా రాకుండాఎందుకు వెళ్ళిపోయావు?’  కినుక చూపాడు కొడుకు.


‘మానవ శరీరం గరిష్టంగా 45 డే(యూనిట్ల) బాధను భరించగలదట.  కానీ బిడ్డకు జన్మ నిచ్చేప్పుడు తల్లియాభై ఏడు డే (యూనిట్ల) నొప్పి భరిస్తుందట. అది 20 ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధకు సమానమట.  కాని అంత బాధ భరించి తన కడుపును చీల్చి జన్మ నిచ్చిన తల్లి, బిడ్డను చూసి అంత బాధ మర్చి పోతుందట.  కోడలు ‘మీ అమ్మ కి ఎప్పటికీ కూతురంటేనే ఇష్టం.  నేను చదువుకుంటూ పాపని చూసుకోవడం ఎంత కష్టం, వచ్చి సహాయం చేయొచ్చుగా... ఆమె కన్నీచేసి పెడుతుంది.  అదే కొడుకంటే ప్రేమే లేదు' అంటూ ఎన్నో అందని చెప్పావు.  అంటే వచ్చి మీ దగ్గర కొన్ని రోజులున్నాను.  నేనున్నన్ని రోజులు వంట గదిలో గాని, ఏపనిలో గాని నేను చేసింది తనకు నచ్చదు.  ఏదో అని చీదరించుకుంటుంది.  భయం భయంగా బతికాను.  ఆమె నన్ను అలా అన్ని మాటలంటున్నప్పుడు నీ మనసుకి తెలీదా నా మనసు.   ఆమెకు నేను రెండేళ్లుగానే తెలుసు కావచ్చు.  కాని నీకు నేను నువ్వు పుట్టినప్పటి నుండి తెలుసు.  ఒక్క సారి నేనలాంటి దాన్ని కాదని నాకు భరోసా ఇవ్వలేదు. అయినా ఇవన్నీ అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కాని రేపు నీ కొడుకుతో మీరలా బాధపడొద్దని.  నేను అనుకున్న కొన్ని పనులు ఈ జన్మ ముగిసేలోగా చేయాలని మాత్రమే వచ్చేసాను.  నన్ను క్షమించండి....’


‘వసుధా!' జీవితం లో తొలిసారి మార్దవంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే పిలిచాడు కృష్ణమూర్తి.


‘నిన్ను ఎన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే.  కాని నీ మనస్సింతగా గాయపడుతుందనుకోలేదు. నువ్వు లేని క్షణమొక యుగమైంది.  నువ్వు లేక నేను బతక లేను....రా వసుధ..నా అవసరం కోసం నిన్ను పిలవడం లేదు.  అక్కడే ఉండి నీకిష్టమైనవన్నీ చేసుకో. ఇక నుండి నీ ప్రతీ కష్టం పంచుకుంటాను. పేకాట, తాగుడు వదిలేసాను. ఇకముందు కూడా వాటి జోలికి పోను.  నువ్వేన్నోసార్లు అవి మానేయడానికి డాక్టర్ దగ్గరకు కౌన్సిలింగ్ కి రమ్మన్నావు.  కదా వస్తాను.  నిన్న డాక్టర్ చెప్పాడు. నీకు తరచూ అనారోగ్యం ఎందుకొస్తుందో. బాబుకు కిడ్నీ చెడిపోతే ఎవరికీ తెలవద్దంటూ నీ కిడ్నీ ఇచ్చావు కదా, దానివల్లనేనట.  నిజంగా ‘అమ్మ ‘ అనే పదానికి నువ్వు నిలువెత్తు నిదర్శనం.  ఇక నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను.  నా మీద ఒట్టు.  నన్ను నమ్ము వసుధా. ప్లీజ్’ కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు కృష్ణమూర్తి.


‘అమ్మా, నా ప్రాణం నిలబెట్టిన నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా.‘


‘అమ్మా...నీ తల్లి మనస్సు అర్ధం చేసుకోలేక పోయాను.  ఇంకా నేను బాధ పడకూడదనే తపన పడుతున్న నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తోందమ్మా, నన్ను క్షమించమ్మా.’ పిల్లలిద్దరూ కన్నీళ్ళతో తల్లి పాదాలు అభిషేకం చేస్తున్నారు.


‘మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటి వారి లోని లోపాలు, తప్పులూ మరింత చిన్నవిగా కనిపిస్తాయి.  ఓర్పు క్షమాగుణం పెరుగుతాయి.  ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో దాదాపు అన్ని సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి...‘ ఐశ్వర్యారాయ్ కావాలంటే అందం ఉండాలి..కాని మదర్ తెరిస్సా కావాలంటే మనస్సుంటే చాలు..’ ఎదుట ఉన్న కొటేషన్లు ఆమెకు దిశానిర్దేశం చేస్తున్నట్లున్నాయి.


ఆ ప్రాంగణం లోని గుడిలోని జేగంటలు తధాస్తు అన్నట్లు మంగళకరంగా మోగాయి. 

ప్రతి ఒక్కరు చదివి అందరి చేత చదించాల్సిన వ్యాసం.


అమ్మకు జేజేలు

👏👏👏👏👏

🙏ఈ  కథ వ్రాసిన  వారికి నా  అభినందనలు. 🙏

యీ మెసేజ్ చూసిన ప్రతి ఒకరు మీ తల్లి తండ్రులను ఏవిధమైన యిబ్బంది కలుగకుండా ప్రేమగా ఆప్యాయంగా, అత్తమామలను తన తల్లి తండ్రులగా చూసుకుంటే వృద్దాప్యంలో వున్న వారికి ఏ సమస్య వుండదు.  అనాధ ఆశ్రమాలు వుండవు.


 *సేకరణ:  వాట్సాప్.*

హనుమజ్జయంతి ప్రత్యేకం - 5

 ॐ         హనుమజ్జయంతి ప్రత్యేకం - 5

       (ఈ నెల 25వ తేదీ హనుమజ్జయంతి) 


5. హనుమంతుడు - పరమాత్మకి మెచ్చిన దూత 


* మొదటి కలయిక 


    ఋశ్యమూక పర్వతము వద్దనుంచి వచ్చి, 

    శ్రీరాముని తొలిసారి కలసి మాట్లాడిన హనుమ మాటలు విన్న శ్రీరాముడు, 

    హనుమ గూర్చి లక్ష్మణునితో ప్రశంసిస్తూ, 

   "ఇట్టి దూత లేని రాజు తలపెట్టీన పనులు ఎలా సిద్ధిస్తాయి? 

    ఇట్టి గుణగణములు కల కార్యసాధకులైన దూతలు ఏ రాజువద్ద ఉంటారో, అతని కార్యాలు ఆ దూతలచే నిర్వర్తించబడి, సిద్ధిస్తాయి" అంటాడు.  


* సీతాదర్శనానంతరం 


    హనుమ విషయాలను శ్రీరామునికి నివేదించిన తరువాత,

   దూతలు మూడు తరగతులని శ్రీరాముడు పేర్కొన్నాడు. 

      (యుద్ధకాండ - 1వ సర్గ) 


(i) ఉత్తమ దూత:

       స్వామి శ్రేయస్సు దృష్టియందుంచుకొని, చేసికొని రమ్మన్న పనిని మాత్రమే గాక, దానికి అనుబంధంగా స్వామి ధ్యేయాన్ని సాధించే ఇతరపనులను కూడ సర్వాంగ సౌష్ఠవంగా సాధించువాడు ఉత్తమ దూత:

(ii) మధ్యమ దూత

         చేసికొని రమ్మన్నపని తూ.చ. తప్పకుండా అంతమటుకే చేసికొని వచ్చువాడు మధ్యమదూత. 

(iii) అధమదూత: 

          చేసుకొని రమ్మన్నపనిని సావధానమూగా చేయనివాడు అథమదూత. 


    ఈ సందర్భంలో సముద్రందాటి తిరిగి వచ్చిన కార్యసాధకుడైన హనుమను రాముడు "హనుమ ఒనర్చిన ఘనకార్యములు లోకములోనే 

అత్యద్భుతములైనవి, 

ఊహకందనివి, 

అనితరసాధ్యమైనవి" అని ప్రశంసించాడు.  

    హనుమకు తాను తన గాఢాలింగన సౌఖ్యాన్ని మాత్రమే ఇయ్యగలనని తెలిపాడు. 

    అదియే హనుమకు పరమ సుఖానుభవములను కల్గించగలదని పేర్కొన్నాడు. 

    అప్పటికి తానీయగలిగిన సర్వస్వము అదియే అన్నాడు.  

    పులకితగాత్రుడై, తాను అప్పగించిన కార్యమును సఫలమొనర్చిన హనుమని తన హృదయానికి హత్తుకొన్నాడు. 


* ఉత్తమ దూతయైన హనుమ దౌత్యము నెరిపిన సందర్భములు నాలుగు. అవి 


(౧) సుగ్రీవుని దూతగ రామ సందర్శనము: 

    రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయపడ్డాడు. 

    హనుమ భయాన్ని వీడమన్నాడు. అప్పుడు ఆ రామలక్ష్మణుల వివరాలను తెలుసుకొని రమ్మని  హనుమంతునే పంపాడు సుగ్రీవుడు. 

    రామలక్ష్మణులు సుగ్రీవుని మైత్రికై ప్రయత్నిస్తున్న విషయం పసిగట్టి హనుమ, 

    కపిరాజ్యాన్ని సుగ్రీవునకు సంపాదించిపెట్టే పథకము రూపొందించుకొన్నాడు. 

    చూచి రమ్మన్నదానికన్న చాల ముందుకుపోయి ఆ ధ్యేయ సాధనకు రాచబాట పరిచాడు. 


(౨) రాముని దూతగ సీతకు సందేశం: 

    సీత జీవించియున్నదో లేదో చూచిరమ్మని పంపిన వేరెవరైనా, చూచిన వెంటనే వెనుదిరిగి పోయి ఉండెడివాడు. 

    లేదా ఆ సంతోషంలో ఆమె ముందు దూకి కార్యము చెడగొట్టేవాడు కావచ్చు. 

    కానీ హనుమ అన్ని విషయాలని తర్కించుకొని 

  - సీతకు రాముని సందేశమూ, 

  - అంగుళీయకమూ అందించాడు. 

    సీత నుంచీ కబురూ, చూడామణీ తీసుకుని, తిరిగి రాముని వద్దకు వెళ్ళాడు. 


(౩) సుగ్రీవుని దూతగ రావణునితో: 

    రావణునితో దౌత్యము నెరపమని హనుమకెవ్వరూ చెప్పలేదు. 

    అయినా వానర బలపరాక్రమాలు రావణునకు తెలిపి, 

    రాక్షసులలో మనోధైర్యాలు శిథిలపరచుట తన స్వామి కార్యమునకు అనుకూలములని ఆలోచించి నిర్ణయించుకున్నాడు.   


(౪) రాముని దూతగ భరతునితో సమావేశము: 

    14 సంవత్సరాలు వనవాస దీక్ష పూర్తిచేసుకున్నాడు రాముడు. 

    తెల్లవారి అయోధ్యకు చేరకపోతే, భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు. 

    హనుమకు రాముడు సంగతి తెలిపి, భరతుని వద్దకు పంపాడు. 

    తనరాక భరతునకు ఆనందమైతే సరే. అట్లుకాక భరతునికి రాజ్యకాంక్ష ఉన్నట్లనిపిస్తే, 

    హనుమను వెంటనే తిరిగి తన వద్దకు వచ్చివేయమన్నాడు. 

    భరతుని అభిప్రాయం తెలిసికొనడం తేలికగాదు. 

    హనుమ పూర్వము నడిపిన దౌత్యములు రామునకు ప్రీతికల్గించాయి. 

    అట్లే హనుమ రామునికి సరియైనదౌత్యాన్ని భరతునితో నడిపాడు. 


    ఈ విధంగా హనుమ సుగ్రీవునికీ శ్రీరామచంద్రునికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఉత్తమ దూత. 


    విశ్వంలో ఏ దౌత్యమైనా, ఏ విధంగా ఉండాలో అందరూ తెలుసుకొనేలా, 

    తాను ఆచరించి చూపిన ఆదర్శవంతుడైన దూత హనుమంతుడు. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

వాయుశాపము

 వైశాఖ పురాణం - 24

24వ అధ్యాయము - వాయుశాపము


అంబరీషునితో నారదుడీవిధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను.


శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ! విష్ణువునుద్దేశించి చేయుధర్మములు పూజలు, ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలిసికొనుటయెట్లు? వానికి చెందిన ధర్మములేవి? వీనిచేనతడు సంతోషించును? నీ సేవకుడనగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగ నడిగెను.


శంఖుడును కిరాతుడా! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాపరహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మమొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొనజాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానందరూపుడు. చరాచరస్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి స్థానముపోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు, వీని ప్రవృత్తులన్నియు, నివృత్తులును, పరమాత్మవలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానులయభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మపదమునకు వాచ్యులెట్లగుదురు? కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, యితిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వానిచేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరువిధములచే తెలిసికొనజాలము. కావున వేదాదుల నెరుగనివారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడునగు శ్రీహరిని యింద్రియాదులచేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొనశక్యము కాదు. ఇతని యవతారములను కర్మలను తమ బుద్దికొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీనవృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వశక్తిసంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.


బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి యుండుటచే, ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని యెరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులుండుటవలన రాజు వండరెట్లు గొప్పవాడు. అట్తి రాజుకంటె మనుష్య గంధర్వులు నూరురెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వులకంటె నూరురెట్లు గొప్పవారిని యెరుగుము. అట్టిదేవతలకంటె సప్తర్షులు గొప్పవారు, సప్తర్షులకంటె అగ్ని, అగ్నికంటె సూర్యుడు, సూర్యునికంటె గురువు, గురువుకంటె ప్రాణము, ప్రాణము కంటె యింద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.


ఇంద్రునికంటె గిరిజాదేవి, ఆమెకంటె జగద్గురువగు శివుడు, శివునికంటె మహాదేవియగు బుద్ది, బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణముకంటె గొప్పదిలేదు. ఆ ప్రాణమునండే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణమువలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువుకంటె గొప్పది సమానమైనది యేదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ! ప్రాణము అన్నిటికంటె గొప్పదో, ప్రాణముకంటె విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.


అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ/రాజుగ నియమించుచున్నాను. మరిమీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి యుండవలెను అని శ్రీహరి పలుకగ యింద్రాదులు నేను గొప్పయనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియుననక మౌనముగ నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.


అప్పుడు శ్రీహరి నవ్వుచు "విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపముననుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ యీ శరీరమునుండి బయటకు వచ్చిన యీ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.


స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట, చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహినికుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవమునుండి దక్షుడను ప్రజాపతి యీవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు గాలిని పీల్చుచునుండెను తరువాత హస్తప్రదేశమునుండి యింద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము యింద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగువానిని చేయుచునే యుండును. తరువాత కన్నులనుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపులేకపోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కునుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను గాని వినుట మున్నగువానిని శరీరము చేయుచునే యుండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడిశక్తి లేకపోయెను. చెవిటి వాడనియనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటమున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాటలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానములేదుగాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము, కన్నులు, చెవులు, మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి యిట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.


శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్నిప్రవేశించినను ఆ కళేబరమునుండి మాటరాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము బ్రదికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.


ఈ ప్రాణము తన అంశలచేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమైయుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేదియని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవములకంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది యేదియును లేదు. ప్రాణముకంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు.


ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరివశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసినజీవి పూర్వకర్మవశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.


అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ! బ్రహ్మజ్ఞానీ! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ యెందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.


అప్పుడు శంఖమహాముని యిట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్టనుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకములయందును. ప్రఖ్యాతియుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.


ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పుచేయకుండనున్న వానిని యిట్లు శపించితివి కావున కణ్వమునీ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. ఇంకను అడుగవలసినది యున్నచో నదుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.

కసవింద

 కసవింద - 


 తెలుగు - కసవింద . 

  

 సంస్కృతము - కాసమర్ధ . 

  

 హింది - కసౌందీ . 


 లాటిన్ - Cassia occidentalis linn . 


 కుటుంబము - Caesalpinaceae . 


  రూపలక్షణాలు - 


    కసవింద చెట్టు క్షుపజాతికి చెందినది . గజము ఎత్తువరకు పెరుగును . ఇది సన్నని , వెడల్పు ఆకుల బేధము కలిగి ఉంటుంది . ఆకులు 3 అంగుళముల పొడవు కలిగి 2 అంగుళముల వెడల్పు కలిగి మిరపకాయలను పోలి ఉండును . దీని కాయలు ఉలవకాయల వలే సన్నముగా 5 నుంచి 6 అంగుళముల పొడవుగా ఉండును. దీని ఆకు కొంచము నలుపురంగుగా పొడవుగా కొనగలిగి ఉండును . పసుపుపచ్చని అందమైన పూతలు పూయును . బీజములు గుండ్రముగా , బల్లపరుపుగా , నునుపుగా ఉండును . ఇది సర్వత్రా జలము గల భూముల యందు ఉండును కొన్ని ప్రదేశాలలో గుబురుగా ఒకేచోట ఎక్కువుగా ఉండును . 


  ఈ కసవిందలో 3 రకాలు కలవు . అవి 


    * కసవింద సాధారణమైనది . 


    * కమ్మ కసవింద . 


    * కొండ కసవింద లేదా తీట కసవింద . 


         పై మూడింటిలో కొండ కసవిందకు ముండ్లు గల ఆకులు ఉండటం మూలన తీట కసవింద అని కూడా పిలుస్తారు . ఇది మామూలు కసవింద మాదిరి పొదలా పెరగక నేలను పాకి అల్లుకొనును . 


  గుణగణములు - 


      కసివింద ఎక్కువ చేదు , కొంచం మధురంగా ఉండును . వేడిగా , జీర్ణకారిగా , కంఠమును శుభ్రపరచునదిగా , కఫము , వాతము , అజీర్ణము , దగ్గును , పిత్తమును హరించునదిగా ఉండును . త్రిదోషములను హరించు శక్తి కలిగినది . విషములను పొగొట్టును . గాయములను , చర్మవ్యాధులను , నేత్రరోగములను , గడ్డలను పోగొట్టును . వాతసన్నిపాతములను హరించును . ఉదర రోగములను హరించును . అతిమూత్రవ్యాధి నివారణ అగును . 


            కసవిందాకు కూర కొంచము చేదుగా , వెగటుగా ఉండును . వేడిని , పిత్తమును కలిగించును . కఫవాతములను , నులిపురుగులు పడుటను , ఆయాసముతో కూడిన దగ్గులను , చర్మవ్యాధులను పోగుట్టును . ఆకలిని కలిగించును . ఇందులో కమ్మ కసవిందకు కూర తియ్యగా , రుచిగా ఉండును . వాతములను పోగొట్టును . పొత్తికడుపును శుభ్రపరచును . రక్తపిత్తములను , క్రిమిరోగమును పోగొట్టును . మంచి వీర్యవృద్ధిని ఇచ్చును . 


        సాధారణముగా కసవిందకాయలు లేతవి వండుకొని తినినచో కొంచం వేడిచేయును . కాని శ్వాసకాసలు , వాతములు , జ్వరముల యందు పథ్యముగా ఉపయోగించదగినది . కొండకసవింద , కమ్మ కసవింద కాయలు మాత్రం కూరకు ఉపయోగించరాదు . వాతరోగము అత్యంత తీవ్రముగా ఉన్నప్పుడు మాత్రమే తక్కువ మోతాదులో ఇవ్వవచ్చు . 


      కమ్మ కసవింద రసము , చూర్ణము సాధరణ కసవింద వలె చేదుగా ఉండక తియ్యగా ఉండును . దీని ఆకును కూరగా కాని లేదా పులుసుకూరగా గాని వండి తినుదురు . ఇది రుచిగా , స్వాదుగా ఉండును . కొండ కసవింద ఆకుల రసముగాని , కషాయము గాని జ్వరములను , సన్నిపాతములను , ఉదరరోగములను నశింపచేయును . వేరుచెక్క విషజ్వరాలను హరించును . ఇది రుచికి కారముగా ఉండి అగ్నిదీపనమును కలిగించును . దీని వ్రేళ్ళు , కాయలు వేసి కాచిన తైలము మర్దించిన వాతపునొప్పులు నెమ్మదించును . నీళ్ల విరేచనములు పోగొట్టు గుణము కలిగినది . దీని రసపు మోతాదు 3 తులముల ఎత్తు , కషాయం మోతాదు 5 తులముల ఎత్తు వరకు ఇవ్వవచ్చును . సాధరణ కసవింద చూర్ణం లోపలికి పుచ్చుకునే మోతాదు 2 నుంచి 4 చిన్నముల ఎత్తు వరకు ఉండవచ్చు . 


  ఔషధోపయోగములు - 


  * వాతనొప్పుల నివారణ కొరకు - 


        కసవిందాకు రసాన్ని నువ్వులనూనెతో కలిపి తైలపక్వము చేసి కీళ్లపై వ్రాసిన వాతనొప్పులు తగ్గును . 


 * పక్షవాత నివారణ కొరకు - 


        కసవింద ఆకు రసాన్ని వెన్నతో కలిపి మర్దించిన నరాల బలహీనత తగ్గి పక్షవాతం వలన పడిపోయిన అవయవం తిరిగి స్వాధీనంలోకి వచ్చును . 


 * గజ్జి నివారణ కొరకు - 


        కసవిందాకు రసము ఒంటికి రాసుకున్న గజ్జి తగ్గును . అంతే కాకుండా ఎలర్జీ , దద్దుర్లు తగ్గును . 


 * విరిగిన ఎముకలు అతుక్కునుటకు - 


      కసవింద ఆకులను కోడిగుడ్డు సొనతో నూరి పట్టువేసిన విరిగిన ఎముకలు అతుక్కునును . 


 * బోదకాలు నివారణ కొరకు - 


       కసవింద వేరుని అవునేతితో కలిపి తాగిన బోదకాలు తగ్గును . 


       కసవింద వేరు పై బెరడును నూరి ఒక చెంచా మోతాదులో రోజుకి రెండుసార్లు సేవించిన బోదకాలు నయం అగును . 


 * చుండ్రు , పేలు నివారణ కొరకు - 


      కసవింద ఆకు రసాన్ని తలకు పట్టించి మరుసటిరోజు ఉదయాన్నే తలస్నానం చేసిన పేలు , చుండ్రు తగ్గును . 


 * దగ్గు , ఆయాసం నివారణ కొరకు - 


      కసవింద ఆకు రసాన్ని 1 నుంచి 2 చెంచాలు రోజుకి 2 లేదా 3 సార్లు సేవించిన దగ్గు తగ్గును . కసవింద గింజల చూర్ణాన్ని కాఫీలా కాచుకొని తాగుచున్న ఆయాసము తగ్గును . 


 * కండ్లకలక నివారణ కొరకు - 


      కసవింద ఆకులను కండ్లపైన వేసి ఉదయం , సాయంత్రం కట్టు కట్టుచున్న కండ్లకలక నివారణ అగును . 


 * సోరియాసిస్ , సిబ్బెము నివారణ కొరకు - 


       కసవింద వేరును పుల్లని పండ్లరసముతో గాని లేదా పుల్లటి మజ్జిగతో గాని లేదా పులిసిన గంజితో మెత్తగా నూరి పూసిన సోరియాసిస్ , సిబ్బెము , తామర , గజ్జి నయం అగును . 


 * అతిమూత్రం నివారణ కొరకు - 


      కసవింద గింజల చూర్ణము 1 గ్రాము 1 స్పూన్ తేనెతో కలిపి ఉదయం , సాయంత్రం తీసుకున్న అతిమూత్రం తగ్గును . 


 * నులిపురుగుల నివారణ కొరకు - 


     కసవింద ఆకులను శుభ్రపరచి నీడన ఎండించి మెత్తని చూర్ణం చేసుకుని ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం 2 గ్రాముల మోతాదులో తీసుకొనుచున్న కడుపులో నులిపురుగులు నశించును . ఆయసం , దగ్గు , చర్మరోగాలు కూడా నశించును . 



       పైన మీకు వివరించిన విధముగా సంపూర్ణమైన వివరణతో ఒక్కో మొక్క గురించి నేను రాసిన గ్రంథాలలో మొక్కలను గుర్తించే విధముగా కలర్ ఫొటోస్ తో ఇవ్వడం జరిగింది . 


 

   గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

    

       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

బ్రాహ్మణ కరివెన నిత్య అన్నదాన సత్రములు

 అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్య అన్నదాన సత్రములు & Contact phone nos.

శ్రీశైలం

8333907784

8333907787

కాశీ

8333907790

8333907791

రామేశ్వరం

8333907793

04573-222156

భద్రాచలం

8333907796

8333907795

మహానంది

8333907803

8333907802

షిర్డీ

8333907800

8333907798

అలంపూర్

8333907806

8333907805

త్రిపురాంతకం

8333907794

యాదాద్రి

8333907815

08685-299909

విజయవాడ(వృద్ధాశ్రమం)

8333907807

8333907813

కర్నూల్ ( శంకర మఠం)

8333907783

8333907808

అరుణాచలం

8333907813.

Rs.3000/- permenant yearly oneday అన్నదానం.

Rs 15000/- permenantly yearly 5 days అన్నదానం.

రాస 30000/- permenantly daily అన్నదానం.

Rs 1500/- only one day అన్నదానం లేదా oneday sweet.

అన్నీ దానములలో అన్నదానం గొప్పది.దీనిని సద్వినియోగం చేసుకొందాం.బ్రాహ్మణులకు చేయూత నిస్తాం.

just for information to send Brahmin community.

సందేశాత్మక కధ*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹


*ఒక చిన్న సందేశాత్మక కధ* 


కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని. ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది.

 

తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడికి వెళ్లాను. మూడేళ్ళ క్రితం కార్తీక మాసం లో అనుకుంటా, ఖాళీగా ఉన్న రోజుల్లో గుడికి వెళ్లిరా అంది అమ్మ. అప్పట్నుంచి ఆఫీస్ లేనపుడు దగ్గర్లో ఉన్న గుడికి వస్తూ ఉంటాను.


ఎప్పటిలాగే దణ్ణం పెట్టుకుని కొంచెంసేపు గర్భ గుడికి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య     M S సుబ్బలక్ష్మి  గారు పాడిన విష్ణు సహస్ర నామం వినిపిస్తోంది. కొంత మంది ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొంతమంది అర్చన చేయిస్తున్నారు . కొంత మంది దేవుడికి పట్టు వస్త్రాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది తన్మయత్వం తో దేవుడిని చుస్తూ ఉండిపోయారు. 


దేవుడికి మధ్యాహ్నం సమర్పించే నైవేద్యంకి ఇంకొంచెం సమయమే ఉండడంతో, ప్రతి వారం గుడిలో ఉండే పూజారిగారు క్షణం కూడా తీరిక లేకుండా కంగారుగా ఉన్నారు.


అమ్మ వెళ్ళమంది అని గుడి కి రావడం మొదలు పెట్టినా, గుడికి వచ్చిన ప్రతిసారీ ఎందుకో చాలా ఆనందంగా ఉంటుంది.

కాని నా మెదడు లో మాత్రం ఎప్పటిలాగే ఎన్నో ప్రశ్నలు రాసాగాయి. దేవుడి గురించి, దేవాలయాల గురించి, భక్తుల గురించి, ఎన్నో సందేహాలు, ఇంకెన్నో విశ్లేషణలు. ప్రతిసారి లాగే ఆ ప్రశ్నల ప్రవాహంలో, ఆలోచనల అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.


ఇంతలో గుడిలో నేను ఎప్పుడు చూడని పూజారి గారు ఒకరు, నన్ను చూసి, నవ్వి, నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఈయన్ని ఎప్పుడు ఈ గుడిలో చూడలేదు కదా, అన్న సందేహంతో కూడిన ఒక నవ్వు నవ్వాను.


*కొత్త పూజారి గారు:* 

నిన్ను ఈ గుడి లో చాలా రోజులనుంచి చూస్తున్నాను బాబు. కాని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఎమన్నా ఉంటే చెప్పు పర్లేదు అన్నారు. నేను ఎప్పుడూ చూడని వ్యక్తి,  నేను వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నారా!  అన్న ఆలోచన ఒకవైపు, నా ప్రశ్నలు, సందేహాలు నా మోహం మీద కనిపించేస్తున్నాయా అని కంగారు ఇంకోవైపు కలిగి, 


*నేను* : 

అబ్బే అలాంటిది ఏమి లేదండి.


*కొత్త పూజారి గారు*

మధ్యాహ్నం నైవేద్యానికి, గుడి ముయ్యడానికి ఇంకా సమయం ఉంది బాబు. పర్లేదు చెప్పు నీ సందేహాలు ఏంటో. నాకు తెలిసినంతలో నీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను అన్నారు.

ఎందుకో నాకున్న సందేహాలు అన్నీ అడిగేద్దామని ధైర్యం తెచ్చుకుని నేను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను.


*నేను:* 

పెద్దవాళ్ళు గుడికి వెళ్తే మంచిది అంటారు కదండీ. అసలు గుడి కి ఎందుకు రావాలి?  నా ప్రశ్న లో అవివేకం ఉంటే క్షమించండి.


*కొత్త పూజారి గారు:* 

(గట్టిగా నవ్వుతూ) నువ్వు ఉద్యోగం చేయడానికి బెంగళూరులో ఉన్నావు. కానీ ప్రతి నెలా రెండు రోజులైనా ఇంటికి వెళ్ళి నాన్న అమ్మ ని కలవాలి అనుకుంటావు కదా, ఎందుకు ? ఎందుకంటే వాళ్లతో గడిపినపుడు నీకు ఆనందం వస్తుంది. వాళ్ల ప్రేమ నీకు హాయిని ఇస్తుంది. బహుశా నీ ప్రశ్న కి సమాధానం దొరికింది అనుకుంటున్నాను.


భగవంతుడిని నాన్న అమ్మ తో పొల్చిన వెంటనే ఒక్కసారిగా నాలో కమ్ముకున్న చాలా మేఘాలు తొలగిపోయినట్టు అనిపించింది.


*నేను:* 

భగవంతుడు అంతటా ఉన్నాడు అంటారు. కాని ఎందుకు గుడికి వచ్చి దణ్ణం పెట్టుకుంటారు అందరూ ?


*కొత్త పూజారి గారు:* 

నీ ప్రాణ స్నేహితుడు నీకు దూరంగా వేరే ఊరిలో ఉన్నాడనుకో, నువ్వు ఫోన్లో అతనితో మాట్లాడొచ్చు. కానీ అతడిని నేరుగా కలిస్తే వచ్చే ఆనందం ఇంకా ఎక్కువ వుంటుందా? లేదా? కొంత మందికి ఫోనులో మాట్లాడినా ఆనందం కలుగుతుంది, కొంత మందికి నేరుగా కలిస్తే ఆనందం కలుగుతుంది.


*నేను:* 

కోరికలు తీరితే కానుకలు ఇస్తా అంటారు కదండీ, కానుకలు ఇస్తారని భగవంతుడు కోరికలు తీర్చడు కదా?


*కొత్త పూజారి గారు:* 

నీకు కొత్తగా ఉద్యోగం వచ్చిందనుకో, ఆ అనందంలో మీ కుటుంబ సభ్యులకి ఎదైనా కొనిపెట్టాలని నువ్వు అనుకుంటావా? అనుకోవా? నీ కుటుంబ సభ్యులు నీకు కొత్త ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తారా? నువ్వు ఎదైనా కొనిపెడతావని ఆశిస్తారా? గుర్తుపెట్టుకో దేవుడు కానుకలు కోరుకోడు, నీ అభ్యున్నతి కోరుకుంటాడు. అందుకునే సత్యభామ వెసిన వజ్ర వైఢూర్యాలకి కాకుండా, భక్తితో రుక్మిణి వేసిన తులసీ దళంకి తూగాడు శ్రీ కృష్ణుడు.


*నేను:* 

ఎదైనా పని మొదలు పెట్టే ముందు, దేవుడికి దణ్ణం పెట్టుకోమంటారు కదండీ, దేవుడి అనుగ్రహం వలన పని పూర్తయితే, మానవ ప్రయత్నం లేనట్టే కదా?అలాకాకుండా మానవ ప్రయత్నం వలన పని పుర్తయితే, పని మొదలు పెట్టే ముందు దేవుడికి దణ్ణం పెట్టమనడంలో ఆంతర్యం ఏమంటారు?


*కొత్త పూజారి గారు:* 

నీ ఆఫీసులో కొంచం క్లిష్టమైన పని ఇచ్చారనుకో, సాధారణంగా ఏం చేస్తావు? కొంచెం నిశబ్దమైన ప్రదేశానికి వెళ్ళి, నీకు నచ్చిన కాఫీ అయినా, టీ అయినా, తాగుతూ, ఏకాగ్రతతో ఆలోచించి, పని పూర్తి చేస్తావు. అవునా, కాదా?ఇప్పుడు కాఫీ, నిశ్శబ్దమైన ప్రదేశం వీటి వలన పని పూర్తి అయ్యిందా? లేక నీ బుధ్ధి ఉపయోగించడం వలన పని పూర్తి అయ్యిందా? నిజానికి కాఫీ, నిశబ్దమైన ప్రదేశం ఇవన్నీ నీ ఏకగ్రతని పెంచి, నువ్వు నీ పని పూర్తి చెయ్యడానికి నీ బుద్ధిని ఉపయోగించడంలో దొహదపడ్దాయి.  అలాగే దైవ దర్శనం కూడా, నీ పని చెయ్యడానికి కావలసిన ప్రశాంతతని పెంచి, నీకు కావలసిన శక్తియుక్తులని సరిగ్గా ఉపయోగించడానికి దోహదపడేది కాదంటావా?


*నేను:* 

మొక్కులు తీర్చకపోతే భగవంతుడికి కోపం వస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు?


*కొత్త పూజారి గారు:* 

మీ అమ్మగారి తో నువ్వు, “ఇవాళ సాయంత్రం తప్పకుండా కూరగాయల మార్కెట్ కి నిన్ను తీస్కుని వెళ్తా” అని చెప్పి, తర్వాత మర్చిపోయి నీ స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్లి వచ్చావనుకో, అపుడు మీ అమ్మగారు ఏమంటారు ? స్నేహితులతో బయటకి వెళ్తే లోకం తెలీదు వెధవకి అని కోపంతో తిడతారా లేదా ? అలా ప్రేమగా కొప్పడతారు కానీ, అలా మర్చిపోయినందుకు నువ్వు కష్టాలు పడాలని ఆశించరు కదా..!!  మీ తల్లితండ్రులకే ఇంత ప్రేమ ఉంటే, లోకాలు అంతటికి ఆ దేవుడిని తల్లి తండ్రీ అంటారు. తనకి ఇంకెంత ప్రేమ ఉండాలి ?


ఇవన్ని విన్నాక ఎందుకో తెలియకుండానే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేసాను. నాకున్న ప్రశ్నలు సందేహాలు అన్నీ తొలగిపోయినట్టు అనిపించి ఆ ఆనందం లో కళ్లలో నీళ్ళు తిరిగాయి. 


ఆ పూజారి గారు నవ్వుతూ నా తల నిమిరి, సరే బాబు నైవేద్యానికి సమయం అయిందని చెప్పి వెళ్లిపోయారు.


తర్వాత తదేకం గా గర్భ గుడి లోని దేవుడిని అలా తన్మయత్వంతో చాలా సేపు చుస్తూ ఉండిపోయాను. ఇపుడు దేవుడిని చూస్తోంటే ఎందుకో తల్లితండ్రులను చూస్తున్నట్టు, ప్రాణ స్నేహితులను చూస్తున్నట్టు అనిపించింది. నేను నా భావాలని నా కళ్ళతోనే ఆయనతో పంచుకుంటున్నానేమో అనిపిస్తోంది.


ఆ కొత్త పూజారి గారిని కలవాలి అనిపించి, ఆ రోజు సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్లాను,  కానీ ఆయన కనిపించలేదు. కొత్త పూజారి గారిని కలవాలనే కోరిక ఆపుకోలేక ప్రతీ వారం గుడిలో ఉండే పూజారి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను.


*నేను* : 

పొద్దున్న ఒక కొత్త పూజారి గారు ఉన్నారు కదండీ, ఆయన సాయంత్రం రాలేదా ?


*గుడిలో ప్రతి వారం వుండే పూజారి గారు:* 


కొత్త పూజారి గారా ? ఎవరు బాబూ? పొద్దున్న కూడా నేను ఒక్కడినే ఉన్నాను బాబూ గుడిలో. నాతో పాటు ఇంకో పూజారి ఎవరూ లేరు బాబు.


*నేను:* 

లేదండి, నైవేద్యానికి ఇంకా సమయం ఉందని ఆయన నాతో మాట్లాడారు కూడా.

అని అంటూ, ఆగిపోయాను నేను.  నైవేద్యానికి సమయం ఉందని అన్నారు కానీ, భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి సమయం ఉంది అనలేదు కదా.

ఈ విషయం స్ఫురించగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, నాకేమి అర్ధం కాలేదు, అలా కూర్చుండిపోయాను. 


ఇంతలో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. గుడి నుంచి బయటకి వచ్చి ఫోన్ మాట్లాడాను.


*అమ్మ:* 

ఏరా ఏం చేస్తున్నావు ? ఇప్పుడే నాన్న నేను టీ తాగాము, నువ్వు భోజనం చేసావా ? పొద్దున్న గుడి కి వెళ్ళొచ్చావా ?


*నేను:* 

హా.. పొద్దున్న దేవుడిని కలిసొచ్చానమ్మా ..!! అన్నాను తన్మయత్వంతో కూడిన స్వరంతో....


*సేకరణ: వాట్సాప్.*

దుష్కర్మఫలితం

 *దుష్కర్మఫలితం*


*మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ - ఎలా తుడుచుపెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలి ద్దాం…!*

*ఈరోజు చాలామందిమి, పూజలు చేసాము, వ్రతాలు నోచాము, దానాలు చేసాము, ధర్మాలు ఆచరించాము, అని విర్ర వీగుతుంటాము, కానీ అవి ఎంతవరకు మనలను - భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము కదూ. అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా?*

*కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు.  తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.*

*కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విల పిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.*

*ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.*

 *”అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు?” అని నిలదీస్తాడు.*

*అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధాన మిస్తాడు…*

*”ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదు,  నేను జరగనిచ్చిందీ కాదు, ఇది ఇలా జరగడానికి, నీకు పుత్ర శోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ,   నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు)*

*ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో, ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి, వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా, అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు.*

*తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది.”*

*”నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింప జేస్తుంది, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!” అని అంటాడు.*

*ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు...*

*”కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.?” అని ప్రశ్నిస్తాడు.*

*అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ..  “ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి....ఎన్నో సత్కర్మలు ఆచరించాలి, ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించు కున్నావు, వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది!” అని సెలవిస్తాడు.*

*అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలి పోతాడు.*

*మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకు పోతాయో ఎవరికీ తెలియదు, అందు కోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసి పోవడం వద్దు, అహంకార మమ కారాలకు దూరంగా ఉండి, ‘అంతా భగవదేచ్ఛ’ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి.*

*భూమి మీదపడి నప్పటినుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తలో ఉండాలి. ఏ ఆధ్యాత్మిక కధ విన్నా గజేంద్ర మోక్షము కాని, ఏ కధైనా మనకర్మ ఫలమే. నవ్వులో గానీ, మాటలాడుటలో గానీ, అతి జాగ్రత్తవహించాలి. గతాన్ని ఏమీ చేయలేకపోయినా ఇప్పటినుండి జాగ్రత్తగా వ్యవహరించాలి!”*✍️

   🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!* 🙏

        ‌.         మీ.... కృష్ణ శర్మ

భువనాలు సృష్టింపబడతయో

 శ్లోకం:☝️

*యస్యైచ్చయేవ భువనాని సముద్భవంతి*

*తిష్ఠంతి యాంతి చ పునర్విలయం యుగాంతే*

*తస్మై సమస్త ఫలభోగ నిబంధనాయ*

*నిత్య ప్రబుద్ధ ముదితాయ నమశ్శివాయ*


భావం: ఎవని ఇచ్ఛామాత్రం చేత సమస్త భువనాలు సృష్టింపబడతయో. ఎవని నియతిని అనుసరించి వాటి వృద్ధి , స్తితి మరియు అంత్యకాలమున లయింపబడతాయో! అట్టి కర్మఫల ప్రదాతయైన , నిత్య శుద్ధ బుద్ధ ఆనంద స్వరూపుడైన శివునకు నమస్కరిస్తున్నాను.🙏

సంపాదన ఖర్చు

 🙏🌺.మన సంపాదన ఖర్చు చేసే విధానం🌺🙏


                     🌺  శ్లోకము 🌺


             🌺ధర్మాయ యశసే అర్థాయ,

             కామాయ స్వజనాయచ,

             పంచధా విభజన్ విత్తం,

             ఇహా ముత్రచ మోదతే

(ఎనిమిదవ స్కంధం, శ్రీమద్భాగవతం.. నుండి )🌺


🌺ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానిని అయిదు భాగాలుగా విభజించాలి.


మొదటి భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వినియోగించాలి. గుప్తదానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, ఈతి బాధల్లో ఉన్నవారికి ఆర్తులకు సహాయం, ప్రేత సంస్కారాలు  మున్నగు కార్యక్రమాలు, ప్రచారం కోసం కాకుండా చిత్తశుద్ధితో చెయ్యాలి. అన్నీ భగవత్పరంగా చెయ్యాలి. ఇవే మనిషిని కృతకృత్యుణ్ణి, ధన్యుణ్ణి చేస్తాయి.


రెండవ భాగాన్ని మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే ప్రజోపయోగ శాశ్వత కార్యక్రమాలపై వెచ్చించాలి. ఆలయాలు, ధర్మశాలలు, అనాథ సేవాశ్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు విద్యా, వైద్య కార్యక్రమాలు, నిత్యాన్నదాన పథకాలు, పండిత సమ్మానాలు మున్నగునవి ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలను చిరకాలం నిలబెడతాయి.🌺


🌺మూడవ భాగం తిరిగి తాను ధనం సంపాదించడానికి పెట్టుబడిగా పెట్టాలి. ఉద్యోగులైతే పొదుపు పథకాల్లోను, ఇళ్ళ స్థలాలు వీటిపై పెట్టుబడిపెట్టాలి.


నాల్గవ భాగం తన స్వంత సుఖాలు, అవసరాల కోసం ఖర్చుపెట్టాలి.


అయిదవ భాగం తనను ఆశ్రయించి ఉన్నవారి సుఖాలు, అవసరాలు, అభివృద్ధి కోసం ఖర్చుపెట్టాలి.


మన ధర్మ శాస్త్రాలు మనకు ఎంత చక్కని ప్రణాళిక ఇచ్చాయో కదా!🌺

పేదవారు

  పేదవారు 

తరచూ మనం అనేకమంది అనేక కష్టాలు పడుతూ పేదరికంలో మ్రగ్గుతున్న వారిని  చూస్తుంటాము. వారిని చుస్తే మనకు జాలివేస్తుంది కూడా. కొంతమంది అనేక రోగాలతో బాధపడుతుంటారు, కొంతమంది తినటానికి తిండిలేక ఉండటానికి ఇల్లు లేక కాళ్లకు చెప్పులు లేక ఇలా ఇలా అనేక బాధలతో ఇబ్బంది పడుతున్నవారిని చూస్తుంటే మనస్సు తరుక్కోని పోతుంది

దైవ సృష్టిలో ఇలా కొంతమందిని పేదవారిగా, కొంతమందిని ఇశ్వర వంతులుగా ఎందుకు సృష్టించాడా అని విచారిస్తే నాకు లభించిన సమాధానాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను. నేను ఎంతవరకు సరిగా చెప్పానన్నది ప్రాజ్ఞులైన పాఠకులే తెలపాలి

పేదరికానికి కారణం ఏమిటని విచారిస్తే నాకు లభించిన కారణాలు మూడు అవి ఏమిటంటే 1) గత జన్మ ప్రారబ్ద ఫలము 2)తామస ప్రవ్రుత్తి ఫలము 3) జ్ఞ్యాన పరీక్షాసమయ ఫలము ఇప్పుడు ఒక్కొక్కటి విస్తరిద్దాం

1) గత జన్మ ప్రారబ్ద ఫలముపూర్వ జన్మలో పాపము ఎక్కువాగా చేసి తగినంత పుణ్యం చేయనందున  ప్రారబ్ధ ఫలాన్ని అనుభవించటానికి ఇప్పుడు పేదరికాన్నివ్యాధుల్నిఅంగ వైకల్యాలని అనుభవించక తప్పదు  పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం"  అన్న శ్లోకార్ధం ప్రకారం గత జన్మలో చేసిన పాపం కొంత వ్యాధుల రూపంలో బాధిస్తుంది. కాబట్టి వ్యాధులను నివారించుకోవటానికి ఔషధ సేవనం చేయాలి. ఇక పేదరిక నిర్ములన చేయటానికి పుణ్యకార్యాలు చేయాలి అంటే దైవ చింతన, సజ్జన సేవన , పరోపకార కార్యాలు ఇలా చేయటం వలన వారి ప్రారబ్ధంలో ఉన్నపాప జాబితా తొలగించి పుణ్యం చోటు  చేసుకుంటుంది. పేదరికంలో వున్నవారు ఎట్టి పరిస్థితిలోను మనో ధుర్యాన్ని వీడకూడదు. సదా భగవంతుని స్మరిస్తూ పేదరికాన్ని అవలీలగా అధిగమించాలి

2) తామస ప్రవ్రుత్తి ఫలము: ఇది చాలా ప్రమాదకరం మనం చూస్తూవుంటాము. తల్లిదండ్రులు పిల్లవానికి మంచిగా ఇల్లు వాకిలి అమర్చి జీవయోపధీకి ఉద్యోగమో, వ్యాపారమో అమర్చి వెళ్లిన తల్లిదండ్రులు గతించిన వెనువెంటనే వున్న ఆస్తిపాస్తులన్నీ అమ్మే చివరికి సంసారాన్ని " అమ్మ బువ్వ-అయ్యా బువ్వ" అన్నట్లుగా చేస్తారు. పురుషుడు సమర్ధుడు కాకపొతే ఉన్నవన్నీ పోయి పేదరికం సంప్రాప్తం అవుతుంది

దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే

లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్ర

త్యక్షము వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే

యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా

తాత్పర్యం:-

 కుటుంబానికైనా సమర్థుడైన యజమాని లేకపోతే ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా అది ఎటూ చాలకుండా ఖర్చవుతూ పోతుందిఎలాగంటేగండి పడిన తటాకంలోకి ఎన్ని వాగుల నీళ్లు వచ్చి చేరుతున్నా అవి అందులో నిలువవుఎప్పటి కప్పుడు జారుకుంటూనే ఉంటాయి కదాగృహ ఆర్థిక నిర్వహణ కూడా ఇలాంటిదే అని అర్ధం

గృహ యజమాని సమర్థుడై  ఉండి వచ్చిన ఆదాయాన్ని గృహవ్యయాన్ని సమన్వయము చేసుకుంటూ ఒక ప్రణాళికా బద్దంగా జీవనం గడిపితే ఇల్లు స్వర్గంగా ఉంటుంది. తక్కువ రాబడి వున్నా పేదరికం ఉండదు. కానీ అదే దుర్వ్యసనాలకు పాల్పడి దుష్ట జన సాంగత్యం (దుర్మార్గులతో స్నేహితం) చేస్తూ అవసరాలకు మించిన ఖర్చులు పెడుతూ అదుపు లేకుండా విలాసాలకు వెళుతూ ఇతరులతో పోల్చుకొని వారిలాగా ఉండాలని తనకు అవసరము వున్నా లేకున్నా వివిధ వస్తువులను కొని అప్పులు చేస్తూ అవి తీర్చలేక చతికిల పడితే అట్టి వారిని పరమేశ్వరుడు కూడా ఆడుకొనలేడు. భార్య భర్తలు ఇద్దరు చక్కగా వారి ఆదాయ వ్యయాలను సరి చూసుకొని డాంబికాలు పోకుండా ఇతరులతో పోల్చుకోకుండా జీవనం సాగించాలి. అటువంటి వారితో లక్ష్మీదేవి సదా వెంటనే ఉంటుంది. .

నిన్న జరిగిన ఒక సంఘటన ఇక్కడ పేర్కొంటాను. ఒక వీధి వ్యాపారస్తుడు ప్లాస్టిక్ సామానులు విక్రయిస్తూ మా ఇంటిముందుకు వచ్చాడు.నేను మాకు కావలసిన వస్తువులను కొని డబ్బులు ఇవ్వటానికి గేటు వద్దకు వెళ్ళితే మా గేటుమీద వున్న నా నామ ఫలకం (NAME PLATE) చూసి చదివి అయ్యా PG.D.P.M.I.R అంటే డిగ్రీ అని నన్ను అడిగాడు నేను నా నామ ఫలకం మీద నా పేరు ప్రక్కన నేను చదివిన డిగ్రీలు "B.Sc,LL.B., PG.D.P.M.I.R" లు వ్రాసుకొన్నదానిని పేర్కొంటు ఆటను సందేహాన్ని వెలిబుచ్చాడు. నేను అతని విద్య స్థాయిని తెలుసుకొనే నిమిత్తము నీవు ఏమి చదివావు అని అడిగాను ఎందుకంటె అతని స్థాయికి తగినట్లుగా సమాధానం చెప్పాలని. దానికి నేను M.B.A. చదివానని చెప్పాడు. అది విని నా మెదడు సూన్యం (mind blank) అయ్యింది. అతని ప్రశ్నకు సమాధానంగా అది ఒక పోస్ట్ గ్రాడ్యువేట్ డిప్లమా అని చెప్పి మరల నీవు M.B.A.చదివి ఇలా వీధి వర్తకునిగా ఎందుకు వ్యాపారం చేస్తున్నావని అడిగానుదానికి తానూ గతంలో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేశానని అది మూసి వేశారని కాబట్టి ఆంధ్రా నుండి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నానని రోజుకు వెయ్యి నుండి పదిహేను వందలవరకు లాభం దొరుకుతున్నదని సంతోషంగా చెప్పాడు. నాకు అతడు ఒక కర్మ యోగిలాగా కనపడ్డాడు..   కాబట్టి మిత్రులారా ఎప్పుడు మనిషి తాను గొప్పవాడని లేని పోనీ డాంబికాలు పోకుండా అవసరానుగుణంగా తన జీవితాన్ని మలుచుకోవాలి. ఆలా సమయానుకూలంగా ప్రవర్తించే వారు సాదా సంతోషంగా వుంటారు

అనువుగాని చోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా..?
విశ్వదాభిరామ.. వినుర వేమ..!!

మనిషి డాంబికాన్ని, అహంకారాన్ని విడనాడి, వినయాన్ని అనుకవత్వాన్ని సంతరించుకుంటే సదా సంతోషంగా ఉంటాడు. పేదరికం అనేది అస్సలు ఉండదు. రోజుల్లో బ్రతకటానికి అనేక మార్గాలు వున్నాయి. నిజానికి కొన్ని సందర్భాలలో  సంపాదనకు చదువుకు సంబంధం లేదనిపిస్తుంది నాకు

3) జ్ఞ్యాన పరీక్షాసమయ ఫలము తరహా పేదరికం ప్రస్తుత సమయంలో ఉండక పోవచ్చుభగవంతుడు తన భక్తునికి మోక్షాన్ని ప్రసాదించాలని తలచినప్పుడు భక్తునికి జ్ఞ్యాన పరిపక్వత కలిగినదా లేదా అని భగవంతుడు పరీక్షించాలని పేదరికాన్ని సంప్రాప్తిస్తాడని దివాజ్ఞ్యములు వక్కాణిస్తారుకానీ ఇప్పటి సమాజంలో అంతగా జ్ఞ్యన సముపార్జన చేసిన వారు అరుదుగా వుంటారో లేక లేరో భగవంతునికే తెలియాలి. ఇప్పుడు దైవ భక్తులం అని చెప్పుకునే స్వామీజీలు, బాబాలు, సత్ గురువులు (వారంతట వారే చెప్పుకుంటారు) వారి ఆర్భాటం వారు వారి భక్తుల వద్దనుండి పొందే కానుకలు చూస్తూ ఉంటే అన్ని వృత్తి వ్యాపారాలకంటే వారి వృత్తే (ఇలా వ్రాయటానికి నేను చాలా బాధపడుతున్నాను) చాల లాభదాయకంగా ఉన్నట్లు కనపడుతుంది. రాజకీయ నాయకులతో, బడా బడా షావుకార్లతో ( వేరే పదం వాడటానికి నా మనస్సు అంగీకరించలేదు) వారికి సంబంధాలుఇంకా కొన్ని సందర్భాలలో కొన్ని అసాంఘిక కార్యా కలాపాలలో కూడా వీరి పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నది. ఏతా వాత చెప్పేదేమిటంటే ప్రస్తుత సమాజంలో భగవంతుడికి తమ భక్తులను పరీక్షించే శ్రమ లేదనిపిస్తుంది

కాబట్టి మిత్రులారా 

కృషితో నాస్తి దుర్భిక్షం

, జపతో నాస్తి పాతకమ్

మౌనేన కలహో నాస్తి

నాస్తి జాగరతో భయమ్

అన్నట్లు కృషి చేసే వారికి దరి దాపుల్లో దారిద్యం రాదు

గమనిక: వ్యాసం చదివిన ఒక్క పాఠకుడైన తన జీవన సరళి మార్చుకొని ఉన్నత పదాన్ని చేరుకుంటే వ్యాసకర్త కృషి సఫలీకృతం అయినట్లే

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః