24, మే 2022, మంగళవారం

కసవింద

 కసవింద - 


 తెలుగు - కసవింద . 

  

 సంస్కృతము - కాసమర్ధ . 

  

 హింది - కసౌందీ . 


 లాటిన్ - Cassia occidentalis linn . 


 కుటుంబము - Caesalpinaceae . 


  రూపలక్షణాలు - 


    కసవింద చెట్టు క్షుపజాతికి చెందినది . గజము ఎత్తువరకు పెరుగును . ఇది సన్నని , వెడల్పు ఆకుల బేధము కలిగి ఉంటుంది . ఆకులు 3 అంగుళముల పొడవు కలిగి 2 అంగుళముల వెడల్పు కలిగి మిరపకాయలను పోలి ఉండును . దీని కాయలు ఉలవకాయల వలే సన్నముగా 5 నుంచి 6 అంగుళముల పొడవుగా ఉండును. దీని ఆకు కొంచము నలుపురంగుగా పొడవుగా కొనగలిగి ఉండును . పసుపుపచ్చని అందమైన పూతలు పూయును . బీజములు గుండ్రముగా , బల్లపరుపుగా , నునుపుగా ఉండును . ఇది సర్వత్రా జలము గల భూముల యందు ఉండును కొన్ని ప్రదేశాలలో గుబురుగా ఒకేచోట ఎక్కువుగా ఉండును . 


  ఈ కసవిందలో 3 రకాలు కలవు . అవి 


    * కసవింద సాధారణమైనది . 


    * కమ్మ కసవింద . 


    * కొండ కసవింద లేదా తీట కసవింద . 


         పై మూడింటిలో కొండ కసవిందకు ముండ్లు గల ఆకులు ఉండటం మూలన తీట కసవింద అని కూడా పిలుస్తారు . ఇది మామూలు కసవింద మాదిరి పొదలా పెరగక నేలను పాకి అల్లుకొనును . 


  గుణగణములు - 


      కసివింద ఎక్కువ చేదు , కొంచం మధురంగా ఉండును . వేడిగా , జీర్ణకారిగా , కంఠమును శుభ్రపరచునదిగా , కఫము , వాతము , అజీర్ణము , దగ్గును , పిత్తమును హరించునదిగా ఉండును . త్రిదోషములను హరించు శక్తి కలిగినది . విషములను పొగొట్టును . గాయములను , చర్మవ్యాధులను , నేత్రరోగములను , గడ్డలను పోగొట్టును . వాతసన్నిపాతములను హరించును . ఉదర రోగములను హరించును . అతిమూత్రవ్యాధి నివారణ అగును . 


            కసవిందాకు కూర కొంచము చేదుగా , వెగటుగా ఉండును . వేడిని , పిత్తమును కలిగించును . కఫవాతములను , నులిపురుగులు పడుటను , ఆయాసముతో కూడిన దగ్గులను , చర్మవ్యాధులను పోగుట్టును . ఆకలిని కలిగించును . ఇందులో కమ్మ కసవిందకు కూర తియ్యగా , రుచిగా ఉండును . వాతములను పోగొట్టును . పొత్తికడుపును శుభ్రపరచును . రక్తపిత్తములను , క్రిమిరోగమును పోగొట్టును . మంచి వీర్యవృద్ధిని ఇచ్చును . 


        సాధారణముగా కసవిందకాయలు లేతవి వండుకొని తినినచో కొంచం వేడిచేయును . కాని శ్వాసకాసలు , వాతములు , జ్వరముల యందు పథ్యముగా ఉపయోగించదగినది . కొండకసవింద , కమ్మ కసవింద కాయలు మాత్రం కూరకు ఉపయోగించరాదు . వాతరోగము అత్యంత తీవ్రముగా ఉన్నప్పుడు మాత్రమే తక్కువ మోతాదులో ఇవ్వవచ్చు . 


      కమ్మ కసవింద రసము , చూర్ణము సాధరణ కసవింద వలె చేదుగా ఉండక తియ్యగా ఉండును . దీని ఆకును కూరగా కాని లేదా పులుసుకూరగా గాని వండి తినుదురు . ఇది రుచిగా , స్వాదుగా ఉండును . కొండ కసవింద ఆకుల రసముగాని , కషాయము గాని జ్వరములను , సన్నిపాతములను , ఉదరరోగములను నశింపచేయును . వేరుచెక్క విషజ్వరాలను హరించును . ఇది రుచికి కారముగా ఉండి అగ్నిదీపనమును కలిగించును . దీని వ్రేళ్ళు , కాయలు వేసి కాచిన తైలము మర్దించిన వాతపునొప్పులు నెమ్మదించును . నీళ్ల విరేచనములు పోగొట్టు గుణము కలిగినది . దీని రసపు మోతాదు 3 తులముల ఎత్తు , కషాయం మోతాదు 5 తులముల ఎత్తు వరకు ఇవ్వవచ్చును . సాధరణ కసవింద చూర్ణం లోపలికి పుచ్చుకునే మోతాదు 2 నుంచి 4 చిన్నముల ఎత్తు వరకు ఉండవచ్చు . 


  ఔషధోపయోగములు - 


  * వాతనొప్పుల నివారణ కొరకు - 


        కసవిందాకు రసాన్ని నువ్వులనూనెతో కలిపి తైలపక్వము చేసి కీళ్లపై వ్రాసిన వాతనొప్పులు తగ్గును . 


 * పక్షవాత నివారణ కొరకు - 


        కసవింద ఆకు రసాన్ని వెన్నతో కలిపి మర్దించిన నరాల బలహీనత తగ్గి పక్షవాతం వలన పడిపోయిన అవయవం తిరిగి స్వాధీనంలోకి వచ్చును . 


 * గజ్జి నివారణ కొరకు - 


        కసవిందాకు రసము ఒంటికి రాసుకున్న గజ్జి తగ్గును . అంతే కాకుండా ఎలర్జీ , దద్దుర్లు తగ్గును . 


 * విరిగిన ఎముకలు అతుక్కునుటకు - 


      కసవింద ఆకులను కోడిగుడ్డు సొనతో నూరి పట్టువేసిన విరిగిన ఎముకలు అతుక్కునును . 


 * బోదకాలు నివారణ కొరకు - 


       కసవింద వేరుని అవునేతితో కలిపి తాగిన బోదకాలు తగ్గును . 


       కసవింద వేరు పై బెరడును నూరి ఒక చెంచా మోతాదులో రోజుకి రెండుసార్లు సేవించిన బోదకాలు నయం అగును . 


 * చుండ్రు , పేలు నివారణ కొరకు - 


      కసవింద ఆకు రసాన్ని తలకు పట్టించి మరుసటిరోజు ఉదయాన్నే తలస్నానం చేసిన పేలు , చుండ్రు తగ్గును . 


 * దగ్గు , ఆయాసం నివారణ కొరకు - 


      కసవింద ఆకు రసాన్ని 1 నుంచి 2 చెంచాలు రోజుకి 2 లేదా 3 సార్లు సేవించిన దగ్గు తగ్గును . కసవింద గింజల చూర్ణాన్ని కాఫీలా కాచుకొని తాగుచున్న ఆయాసము తగ్గును . 


 * కండ్లకలక నివారణ కొరకు - 


      కసవింద ఆకులను కండ్లపైన వేసి ఉదయం , సాయంత్రం కట్టు కట్టుచున్న కండ్లకలక నివారణ అగును . 


 * సోరియాసిస్ , సిబ్బెము నివారణ కొరకు - 


       కసవింద వేరును పుల్లని పండ్లరసముతో గాని లేదా పుల్లటి మజ్జిగతో గాని లేదా పులిసిన గంజితో మెత్తగా నూరి పూసిన సోరియాసిస్ , సిబ్బెము , తామర , గజ్జి నయం అగును . 


 * అతిమూత్రం నివారణ కొరకు - 


      కసవింద గింజల చూర్ణము 1 గ్రాము 1 స్పూన్ తేనెతో కలిపి ఉదయం , సాయంత్రం తీసుకున్న అతిమూత్రం తగ్గును . 


 * నులిపురుగుల నివారణ కొరకు - 


     కసవింద ఆకులను శుభ్రపరచి నీడన ఎండించి మెత్తని చూర్ణం చేసుకుని ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం 2 గ్రాముల మోతాదులో తీసుకొనుచున్న కడుపులో నులిపురుగులు నశించును . ఆయసం , దగ్గు , చర్మరోగాలు కూడా నశించును . 



       పైన మీకు వివరించిన విధముగా సంపూర్ణమైన వివరణతో ఒక్కో మొక్క గురించి నేను రాసిన గ్రంథాలలో మొక్కలను గుర్తించే విధముగా కలర్ ఫొటోస్ తో ఇవ్వడం జరిగింది . 


 

   గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

    

       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కామెంట్‌లు లేవు: