28, మే 2024, మంగళవారం

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

గుండెపోటు

 



* *గుండెపోటు ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి స్థానిక అల్లo ని మీ జేబులో వజ్రంలా ఉంచుకోండి. దాడి జరిగిన వెంటనే, పైన క్లిప్‌లో చూపిన విధంగా కూర్చుని అల్లం నమలండి. మీ కళ్లలో నీళ్లు వచ్చే వరకు నమలండి. అందరికీ షేర్ చేయండి. భాగస్వామ్యం ఒక జీవితాన్ని కాపాడుతుంది*

తేడా ఏమిటి?

 తేడా ఏమిటి?


కర్తవ్యం, బాధ్యత- అనే రెండు మాటలూ మనకు ఒకేలా వినిపిస్తాయి. అర్థాలు ఒకేలా తోస్తాయి. వాస్తవానికి ఆ రెండూ వేరు. విధి నిర్దేశించేవి కర్తవ్యాలు. కావాలని మనిషి నెత్తికెత్తుకొనేవి బాధ్యతలు. కాబట్టే కర్తవ్యాలకు ముగింపు(డిటాచ్ మెంటు) ఉంటుంది. బాధ్యతలకు కొనసాగింపు (అటాచ్మెంట్) ఉంటుంది. వివేక వంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు. తక్కినవారంతా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటారు. రామాయణంలోని ఇద్దరు మహర్షుల చర్యలను పరిశీ లిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది. రాముణ్ని ఓ ఇంటి వాణ్ని చేసింది- కన్నతండ్రి దశరథుడో, పిల్లనిచ్చిన జనకుడో కాదు. జాగ్ర త్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామి త్రుడు. అది ఆయనకు విధి నిర్దేశిం చిన కర్తవ్యం. ఆయన పుట్టుకకు లోకకల్యాణం, సీతారామకల్యాణం అనేవి రెండూ ప్రధాన లక్ష్యాలు. వీటిలో మొదటిది- రాముడి అవతార పరమార్ధంతో ముడివ డినది. రెండోది- ఆ పరమార్థం నెర వేరేందుకు కావలసిన శక్తిని సమ కూర్చినది. ఆ శక్తి పేరు సీతమ్మ. విశ్వామిత్రుడు తొలుత తాటక వధతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు. రాక్షసులతో వైరానికి నాంది పలికాడు. యాగ సంరక్షణ మనేది ఓ నెపం. అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడి వశం చేసేందుకు ఏర్ప డిన సన్నివేశం. రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమ కూర్చే ప్రయత్నం అది. యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు. మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకై అహల్యను పరిచయం చేశాడు. గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు. ఇదంతా ఆ ముని కర్తవ్యం

సీతారామకల్యాణం పూర్తవగానే రంగంలోంచి ఆయన నిష్క్రమించాడు. వారి సంసారం ఏ విధంగా నడుస్తోందో, రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం. అది రాముడి పని. రాక్షసుల రక్తాన్ని తోడేయడం, ఇక తానిచ్చిన అస్త్ర శస్త్రాలే చూసుకొంటాయి. పంట కోత పూర్తయ్యాక- ఇక కొడవలికి పనేమిటి? కర్తవ్యం ముగిసిందనే మాటకు, డిటాచ్మెంటు అనే భావానికి అసలైన అర్థం అదే!


రామరావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు. రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. మూడుసార్లు పారాయణ చేయించాడు. వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. తన ఉపదేశం ఫలించిందా లేదా, రాముడు తేరుకొని రావణాసురుణ్ని సంహరించాడా లేదా... వంటి సంశయాలు, కుతూహలాలు ఆ మహర్షికి లేనే లేవు. తాను నేర్పించిన గాండీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు. రాముడికి తాను ఉపదేశించిన మంత్ర శక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు. అంతవరకే వారి పని. కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోయారిద్దరూ!


పిల్లలను పెంచి పెద్ద చేయడం, సంస్కారాన్ని అలవరచడం, విద్యాబుద్ధులు నేర్పించడం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం. పెరిగి పెద్దయి వారివారి జీవితాల్లో స్థిర పడినా- ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం ఓ బలహీనత. తాము బతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కర్తవ్యం కాదు. దాని కొనసా గింపు. కర్తవ్యాలు సంతృప్తికి, బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి. ఆ తేడాను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి.


ఎర్రాప్రగడ రామకృష్ణ

Panchaag


 

అమ్మానాన్నలు

 రాత్రి భోజనాల తర్వాత ఒకటీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది . 


ఆమె పిల్లలు పడుకున్నారు!


భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.


చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది.


ఆ  ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!


"ఏమైంది? ఎందుకు  ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.


 నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.


"అయితే...?"


"ఇదిగో! ఈ చివరి  పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"


భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"


హెడ్డింగ్ ఇలా పెట్టాడు


💥నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.💥


అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రేమిస్తారు!


వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!!


నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!


అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్  చేతిలోకి తీసుకుని  జవాబిస్తారు!


కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...

నేను  ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!


వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!


వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు! 

అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!


అదే ఒకవేళ నాతో  మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే  ఫోన్ కి జవాబిస్తారు!


అమ్మానాన్నలు

స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!

ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!

దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!

దాన్ని చాలా ఇష్టపడుతారు!!

దానితో రిలాక్స్ అవుతుంటారు!!

దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!


దానిని ఎపుడు పనివాళ్ళకి అప్పగించరు


నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ ఒక్కగంట పనిచేయకపోతే చాలా కంగారుపడతారు హడావిడి చేస్తారు 


రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!

ఉదయం లేవగానే దాన్నే  చేతిలోకి తీసుకుంటారు!!


కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న  చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!! 


భార్య చదువుతుంటే... విన్న  భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...

"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.


"మన కొడుకు" అంది భార్య కన్నీరు కారుతుండగా!


వస్తువులను ఉపయోగించుకోవాలి!

బంధాలను ప్రేమించాలి!!


అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!......


#నీతి : ఎవరికి ఏం అర్ధమయితే అది 


శుభసాయంత్రం మాష్టారు 😊💐


#Courtesy #WhatsApp

పల్లె సింగర్ రేణుక అక్క

 


 


 ఓ అద్భుతమైన పల్లె సింగర్ రేణుక అక్క తో మన ఫోక్ స్టార్ మాట ముచ్చట పాట చూసి అక్కను అందరూ ఆశీర్వదించండి 🙏🏿💐

పిల్లలను మార్చే బాధ్యత

 విద్యార్థిని, విద్యార్థుల 


తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా*

                 ********


క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు.  ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.


తల్లిదండ్రులకు  తమ పిల్లలపై  శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.


క్రమశిక్షణ మాటలతో రాదు.  కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.


పిల్లలకి బడిలో భయంలేదు.

ఇంట్లో భయం లేదు.

అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది.

వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. 

అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.

ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు.


*గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.*

ఇది నిజం.


*గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది*?


*కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు!  చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు*! 


*5వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని వచ్చే వారిని కామెంట్స్ చేయడం.  అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి*.


*దరిద్రం ఏంటంటే,  కొంతమంది తల్లి  దండ్రులే మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు*.


*ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు*. 


పెన్ను ఉంటే పుస్తకం ఉండదు,

పుస్తకం వుంటే పెన్ను వుండదు.  కొనరు, తెచ్చుకోరు. 

భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం. 

ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.


కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా...?


*భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట!*

*అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం*.


స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్ట కూడదు, కనీసం మందలించ కూడదు ప్రేమతో చెప్పాలట.

ఇదెలా సాధ్యమ్?


మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?


మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు.  ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం.  వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.


తల్లిదండ్రులకు నా మనవి. పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల తోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు.


 90 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. 

ఇది యదార్ధం.  


ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.

       

మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు.


అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. 

మా బాగు కోసమే అని అనుకునేవారు.

        

ముందుగా తల్లి దండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.


తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..


*పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60 % , కానీ 40% మాత్రం తల్లి దండ్రులే..!🙏*


*పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..  పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢ నమ్మకాలు, స్వార్థం, అతి  ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు.*


*ఇప్పుటి తరం 70% పిల్లలు..*


👉తల్లిదండ్రులు కారు, బండి శుభ్రం మంటే తుడవరు.


👉మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.


👉లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.


👉కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.


👉రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు.


👉గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు.


👉తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు.


👉 మైనర్ పిల్లలకి బైక్లు ఇవ్వడం 

వారు ఆక్సిడెంట్లకు చేయడం 

కేసులలో ఇరుక్కోవడం


👉ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.


👉ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి.


👉అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు.


👉20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు.


👉బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి.


👉కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు.


👉వారిస్తే వెర్రి పనులు.


👉మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు.


పై వాటికి  కారణం మనమే. ఎందుకంటే మనకు అహం,పరువు మరియు  ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.


చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.


గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..


*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి.*


*కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు.*


*ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత 15 ఏళ్లకే ప్రేమ - దోమ అనటం,సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.*


మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు..


అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లి దండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..


భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..


మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.


👉కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు.


గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..


03వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు.


05వ తరగతి వారికి అల్సర్, బీపీలు.


10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి..


వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచక పోవడమే. అందుకే తల్లి దండ్రులు మారాలి.


రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?


కేవలం గుడికి , దర్గా లకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు.


సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..👇

👉  బాధ్యత

👉  మర్యాద

👉  గౌరవం

👉  కష్టం

👉  నష్టం

👉  ఓర్పు

👉  సహనం

👉  దాతృత్వం

👉  ప్రేమ

👉  అనురాగం

👉  సహాయం

👉  సహకారం

👉  నాయకత్వం

👉  మానసిక ద్రృఢత్వం

👉  కుటుంబ బంధాలు

👉  అనుబంధాలు  

👉  దైవ భక్తి

👉  దేశ భక్తి


కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..


మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, మన ఆనందం కోసం బ్రతుకుదాం.


ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..


భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.


 🙏చదివిన వారందరి విన్నపం...

దయచేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి


*ఈ మేసేజ్ చదివి అందరూ మారిపోతారు అని నేను అనుకోవడం లేదు....*


*కనీసం ఒక్కరు అయిన మారుతారని ఉద్దేశంతో ఈ మేసేజ్ పెడుతున్నాను*

ఇట్లు   ** మీ శ్రేయోభిలాషి 

🙏🙏🙏🙏**

వీర్ సావర్కర్

 *మే 28 - పుట్టినరోజు* 



 *విప్లవకారుల నాయకుడు వీర్ సావర్కర్* 


వినాయక్ దామోదర్ సావర్కర్ మే 28, 1883న భాగూర్ (నాసిక్ జిల్లా, మహారాష్ట్ర) గ్రామంలో జన్మించారు. విద్యార్థి జీవితంలో లోకమాన్య తిలక్ వార్తాపత్రిక 'కేసరి' అతనిపై చాలా ప్రభావం చూపింది. దేశ స్వాతంత్య్రాన్ని  తన జీవిత లక్ష్యం చేసుకున్నాడు. 1905లో విదేశీ వస్తువులను బహిష్కరించాలని ఉద్యమాన్ని ప్రారంభించాడు. ముగ్గురు చఫేకర్ సోదరులను ఉరితీసినప్పుడు, అతను హత్తుకునే కవితను రాశాడు. ఆ తర్వాత అదే రోజు రాత్రి తన కవితని చదివిన తర్వాత తనే ఎక్కిళ్లతో ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో అతని తండ్రి లేచి అతడ్ని సముదాయించాడు.


సావర్కర్ జీ సాయుధ విప్లవానికి అనుకూలంగా ఉండేవారు. విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి భారత్‌కు ఆయుధాలు పంపాలన్నది అతని కోరిక. అందుకోసం శ్యామ్‌జీ కృష్ణవర్మ ఇచ్చిన స్కాలర్‌షిప్‌తో బ్రిటన్‌ వెళ్లాడు. లండన్‌లోని 'ఇండియా హౌస్' ఆయన కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. అక్కడ నివసించే ఎందరో విద్యార్థులను విప్లవం కోసం ప్రేరేపించాడు. వారిలో కర్జన్ వైలీని చంపిన మదన్‌లాల్ ధింగ్రా ఒకరు.


అతని కార్యకలాపాలను చూసిన బ్రిటిష్ పోలీసులు మార్చి 13, 1910న అతన్ని పట్టుకున్నారు. అతనిపై భారతదేశంలో కూడా చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, అందుకే అతన్ని మోరియా అనే ఓడలో భారతదేశానికి తీసుకురావడం ప్రారంభించారు. 1910 జూలై 10న ఫ్రాన్స్‌లోని మోర్సెల్లెస్ ఓడరేవులో మలవిసర్జన చేయాలనే సాకుతో టాయిలెట్‌కి వెళ్లి అక్కడి నుంచి సముద్రంలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. 


ఒడ్డున చేరే సరికి అతన్ని ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేసేరు. అతడిని వెంబడిస్తున్న బ్రిటీష్ పోలీస్ లు ఫ్రెంచ్ పోలీసుల నుంచి అతన్ని తీసుకెళ్లారు. ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. కాబట్టి కేసు హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరుకుంది; బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా కుట్ర చేసి భారతదేశానికి ఆయుధాలను పంపిన నేరానికి అతనికి జీవిత ఖైదు విధించబడింది. అతని ఆస్తులన్నీ కూడా జప్తు చేశారు.


సావర్కర్ జీ బ్రిటిష్ ఆర్కైవ్‌లను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత '1857 స్వాతంత్ర్య యుద్ధం' పేరుతో ఒక ముఖ్యమైన పుస్తకాన్ని రాశారు. తర్వాత దానిని రహస్యంగా ముద్రించడానికి భారతదేశానికి పంపారు. ఈ పుస్తకాన్ని వ్రాసి ప్రచురించిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం నివ్వెరపోయింది. ప్రపంచ చరిత్రలో ప్రచురించబడక ముందే నిషేధించబడిన ఏకైక పుస్తకం ఇదే. 


ప్రచురణకర్త దానిని రహస్యంగా పారిస్‌కు పంపాడు. అక్కడ కూడా బ్రిటిష్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ దానిని ప్రచురించడానికి అనుమతించలేదు. చివరగా 1909లో ఇది హాలండ్ నుండి ప్రచురించబడింది. నేటికీ, ఇది 1857 నాటి స్వాతంత్ర్య పోరాటంపై అత్యంత విశ్వసనీయమైన పుస్తకం.


1911లో, అతనికి మరొక జీవిత ఖైదు విధించబడింది మరియు కాలేపానికి, అండమాన్ జైలు కి పంపబడ్డారు. ఆ విధంగా రెండు జీవిత ఖైదుల పాటు జైలు శిక్ష అనుభవించాడు. అతని అన్న గణేష్ సావర్కర్ కూడా అక్కడే ఖైదు చేయబడ్డాడు. జైలులో వారిని తీవ్రంగా హింసించారు. గానుగ ద్వారా నూనె తీయడం, కొబ్బరికాయలు కొట్టడం, కొరడాతో కొట్టడం, ఆకలి, దాహం వేయడం, చాలా రోజులు నిరంతరం నిలబడేలా చేయడం, ప్రతిరోజూ చేతికి సంకెళ్లు వేయడం వంటి చిత్రహింసలు ఎదుర్కోవాల్సి వచ్చింది.


1921లో అండమాన్ నుండి రత్నగిరికి పంపబడ్డాడు. 1937లో అతను అక్కడి నుండి కూడా విముక్తి పొందాడు; కానీ సుభాష్ చంద్రబోస్‌తో పాటు, అతను విప్లవానికి ప్రణాళిక వేయడంలో నిమగ్నమై ఉన్నాడు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, గాంధీ హత్యకు సంబంధించిన *తప్పుడు* కేసులో ఇతడిని ఇరికించారు; కానీ అతను నిర్దోషి అని రుజువైంది. అతను రాజకీయాల హిందూీకరణ మరియు హిందువుల సైనికీకరణకు బలమైన సమర్ధకుడు. ఆరోగ్యం క్షీణించడంతో, వీర్ సావర్కర్, ఫిబ్రవరి 26, 1966న తన శరీరాన్ని విడిచిపెట్టాడు.

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి

జయగురుదత్త

 జయగురుదత్త !

"యజ్ఞోహి శ్రేష్థతమం కర్మ" యజ్ఞం చేయడాన్ని మించిన కర్మ వేరొకటి లేదు. "ఏదమగన్మ దేవజనం .." అనే మంత్రార్ధం - పూర్వకాలములో ఎక్కడైతే యజ్ఞములు జరుగతవో మరల మరల యజ్ఞములు అక్కడే జరుగుతవి అని అర్ధం. అటువంటి పుణ్యభూమి అయిన జగద్గురువులు కంచి పీఠాధీశులు, శృంగేరీ పీఠాధీశులు, దత్తావధూత శ్రీ గణపతి సచ్చిదానంద సరస్వతీ స్వామి వారి కరకమలములచే ప్రతిష్ఠితమైన శ్రీ యజ్ఞదత్త క్షేత్రము , జుజ్జూరు నందు, మా నాన్నగారు, కర్మజ్యేష్ఠులు బ్రహ్మశ్రీ మద్దూరి వేంకటేశ్వర యాజులు గారిచే అనేక పర్యాయములు అనుష్థింపబడిన "నాచికేత యుక్త జ్యోతిరతిరాత్రము" అను మహాయజ్ఞమును క్రోధి నామ సంవత్సర ఆషాఢ శుధ్ధ చవితి (10-07-2024) మొదలు నవమి (15-07-2024) వరకు జరుప దైవజ్ఞ ప్రేరణ అయినది, ఇది విశేషమైన క్రతువు, అపురూపమైనది, అత్యంత ఫలదాయకము, కావున ఈ క్రతువులో పాల్గొని మీ యధాశక్తి  సేవ జేసుకొని ఆ యజ్ఞపరమాత్ముని అనుగ్రహము పొందవలసినది. మరల మరల ఇటువంటి క్రతువులో పాల్గొనే అవకాశం దుర్లభమే.

ఇందుతొ పత్రికను జతపరచుచున్నాను.


భవదీయుడు 

మద్దూరి యజ్ఞనారాయణ షోడశి అత్యగ్నిష్టోమ సనాచికేత కాఠకోక్థి ఆప్త వాజపేయ బృహస్పతిసవ యజ్వ

9849007481

కాలం చక్రం తిరుగుతోంది !!

 కాలం చక్రం తిరుగుతోంది !! 


కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర మరియు కలి యుగాలు) ఉంటాయి.

దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు

త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు

ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు

కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు

మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

కాలమానము సౌర (మానవ) సంవత్సరాలు దివ్య సంవత్సరాలు

ఒక చతుర్యుగము 43,20,000 12,000

71 చతుర్యుగములు 30,67,20,000 8,52,000

ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య 17,28,000 4,800

14 సంధ్యా కాలములు 2,41,92,000 67,200

ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరము 30,84,48,000 8,56,800

14 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరములు 4,31,82,72,000 1,19,95,200

14 మన్వంతరములు + కల్పాది సంధ్య = ఒక కల్పము

= బ్రహ్మకు ఒక పగలు 4,32,00,00,000 1,20,00,000

కల్పముల పేర్లు

మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో "శ్వేతవరాహ కల్పం" నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి

శ్వేత కల్పము

నీలలోహిత కల్పము

వామదేవ కల్పము

రత్నాంతర కల్పము

రౌరవ కల్పము

దేవ కల్పము

బృహత్ కల్పము

కందర్ప కల్పము

సద్యః కల్పము

ఈశాన కల్పము

తమో కల్పము

సారస్వత కల్పము

ఉదాన కల్పము

గరుడ కల్పము

కౌర కల్పము

నారసింహ కల్పము

సమాన కల్పము

ఆగ్నేయ కల్పము

సోమ కల్పము

మానవ కల్పము

తత్పుమాన కల్పము

వైకుంఠ కల్పము

లక్ష్మీ కల్పము

సావిత్రీ కల్పము

అఘోర కల్పము

వరాహ కల్పము

వైరాజ కల్పము

గౌరీ కల్పము

మహేశ్వర కల్పము

పితృ కల్పము

వాయు పురాణం 21వ అధ్యాయంలో 28 కల్పాల పేర్లున్నాయి. తరువాతి అధ్యాయంలో మరో ఐదు కల్పాలపేర్లున్నాయి.చతుర్యుగాలు

హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని సంవత్సరములు కలిపి ఒక యుగము గా కాలమానము లెక్కింపబడుతున్నది. అలా నాలుగు యుగాలు చెప్పబడ్డాయి.

1 యుగాలు, మహా యుగము

2 యుగాదులు

3 యుగాల మధ్య జరిగిన ఒక కథ

యుగాలు, మహా యుగము

దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును

కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు

త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు

ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు

కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)

మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో రెండు పాదాలపైన, కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.

యుగాదులు

కృత యుగాది - కార్తీక శుద్ధ నవమి

త్రేతా యుగాది - వైశాఖ శుద్ధ తదియ

ద్వాపర యుగాది - మాఘ బహుళ అమావాస్య

యుగాల మధ్య జరిగిన ఒక కథ

భాగవతం ఏకాదశ స్కందము నుండి : ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో - సూర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరుని గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన షుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, "నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు శ్రీకృష్ణభగవానుని అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న బలరామునితో వివాహం జరిపించు అని చెప్పాడు. అతడు అలాగే తెరిగి వెళ్ళి తన కుమార్తె రేవతి ని బలరామునకిచ్చి పెళ్ళి చేసాడు.

(ఒక మహాయుగము = బ్రహ్మకు 43.2 సెకనులు)

సృష్టిని పాలించేది మనువులు. ఒక్కో మనువు 71 మహా యుగాలు పాలిస్తాడు. అలాంటి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకుఒక పగలు. రాత్రి కాలం కూడ అంటె అవుతుంది. ఉదయ కల్పం; క్షయ కల్పం. ఇంత వరకు ఆరు ఉదయ కల్పములు, బ్రంహకు జరిగాయి. ఈ ఆరు ఉదయ కల్పములను పాలించిన మనువులు 1.స్వయంబువు, 2 స్వారీచ, 3. ఉత్తమ, 4. తామన, 5, రైవత 6 చాక్షువ. ఇప్పుడు ఏడవ మనువు వైవస్వతుడు పాలిస్తున్నాడు. 71 మహా యుగములలో 28 వ మహా యుగములోని కలియుగము నడుస్తున్నది.

బ్రహ్మ:: బ్రహ్మ ఒక్కడు కాదు. బ్రహ్మ ఆయుష్షు 100 సంవత్సరాలు. ఇప్పటివరకు మానవ బ్రహ్మ, చాక్షువ బ్రహ్మ, వాచిక బ్రహ్మ, శ్రావణ బ్రహ్మ, జన్మ బ్రహ్మ, నాసిక జన్మ బ్రహ్మ అండ జన్మ బ్రంహ అనబడే ఆరుగురు బ్రహ్మలు పుట్టి గతించారు. ప్రస్థుతం విష్ణువు నాభీ కమలంలో పుట్టిన బ్రహ్మ కాలలో 50 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో మొదటి దినం గడుస్తున్నది. బ్రహ్మ సవత్సరం అంటే 360 రోజులు అనగా, 3,091,76,00,00,000 సంవత్సరాలు. 100 సంఅత్సరాలు అంటే 3,09,17,376 కోట్ల సంవత్సరాలు. అలాంటి ఆరుగురి బ్రహ్మల జీవిత కాలం 18,55,04,256 కోట్ల సంవత్సరాలు గడిచి పోయాయి. 7 వ బ్రహ్మ కాలం 2009,62,944,00,000 సంవత్సరాలయితే అందులో 27మహా యుగాలు అనగా11,66,40,000 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో 27 మహా యుగాలు గడచి పోగా ఇప్పుడు 28 వ మహా యుగం లో కృత, త్రేత, ద్వాపర యుగాలు అనగా 38,88,000 సంవత్సరాలు గడిచి పోయాయి. కనుక పంచాంగ కర్థల అంచనా ప్రకారం సృష్టి వయస్సు 200,96,29,56 కోట్ల 5 లక్షల, 33 వేల ఒక వంద సంవత్సరాలు.

సృష్టి రహస్య విశేషాలు

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*



*సృష్టి రహస్య విశేషాలు.*


1  సృష్టి  ఎలా  ఏర్పడ్డది?

2  సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది?

3  మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి?


( సృష్ఠి )  ఆవిర్బావము.

1  ముందు  (పరాపరము) దీనియందు శివం పుట్టినది

2  శివం యందు  శక్తి

3  శక్తి యందు నాధం

4  నాధం యందు బిందువు

5  బిందువు యందు సదాశివం

6  సదాశివం యందు మహేశ్వరం

7  మహేశ్వరం యందు ఈశ్వరం

8  ఈశ్వరం యందు రుద్రుడు

9  రుద్రుని యందు విష్ణువు

10 విష్ణువు యందు బ్రహ్మ

11  బ్రహ్మ యందు ఆత్మ

12  ఆత్మ యందు దహరాకాశం

13  దహరాకాశం యందు వాయువు

14  వాయువు యందు అగ్ని

15  ఆగ్ని యందు జలం

16  జలం యందు పృథ్వీ. 

17.  పృథ్వీ యందు ఓషధులు

18.  ఓషదుల వలన అన్నం

19.  ఈ అన్నము వల్ల...... నర ,  మృగ , పశు , పక్షి  ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.



( సృష్ఠి ) కాల చక్రం.

పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.

ఇప్పటివరకు ఎంతో మంది శివులు ,

ఎంతోమంది విష్ణువులు ,

ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు.

ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.

ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.


1 కృతాయుగం

2 త్రేతాయుగం

3 ద్వాపరయుగం

4 కలియుగం


నాలుగు యుగాలకు 1 మహయుగం.

71 మహ యుగాలకు 1 మన్వంతరం.

14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం).

15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం).

1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  

1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం).

2000 యుగాలకు ఒక దినం.

ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.


ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.

1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.

7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.

14 మంది మనువులు.

ఇప్పుడు "వైవస్వత" మనువులో ఉన్నాం. 

"శ్వేతవరాహ" యుగంలో ఉన్నాం.


5 గురు భాగాన కాలంకు 60 సం

1 గురు భాగాన కాలంకు 12 సం

1 సంవత్సరంకు 6 ఋతువులు.

1 సంవత్సరంకు  3 కాలాలు.

1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి

1 సం. 12 మాసాలు.

1 సం.  2 ఆయనాలు

1సం. 27 కార్తెలు

1 నెలకు 30 తిధులు

27 నక్షత్రాలు - వివరణలు

12 రాశులు

9 గ్రహాలు

8 దిక్కులు

108 పాదాలు

1 వారంకు 7 రోజులు


పంచాంగంలో ఇవి వుంటాయి:

1 తిధి. 

2 వార.  

3 నక్షత్రం.  

4 కరణం.  

5 యోగం.


సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.

దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.

1  సత్వ గుణం 

2  రజో గుణం

3  తమో గుణం


( పంచ భూతంలు ఆవిర్భావం )

1 ఆత్మ యందు ఆకాశం 

2 ఆకాశం నుండి వాయువు

3 వాయువు నుండి అగ్ని

4 అగ్ని నుండి జలం

5 జలం నుండి భూమి అవిర్బవించాయి.


5  ఙ్ఞానేంద్రియంలు

5  పంచ ప్రాణంలు

5  పంచ తన్మాత్రలు

5  ఆంతర ఇంద్రియంలు

5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు


1  ( ఆకాశ పంచికరణంలు )

ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )

ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )

ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )

ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )

ఆకాశం - భూమితో కలవడంవల్ల      ( ఆహంకారం )   

పుడుతుతున్నాయి


2( వాయువు పంచీకరణంలు )

వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)

వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )

వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )

వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )

వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.


3 ( అగ్ని పంచీకరణములు )

అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )

అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )

అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )

అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )

అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.


4 ( జలం పంచికరణంలు )

జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )

జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )

జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )

జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )

జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం ) పుట్టెను.


5 ( భూమి పంచికరణంలు )

భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )

భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )

భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )

భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )

భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టెను.


( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానేంద్రియంలు:

1  శబ్ద

2  స్పర్ష

3  రూప

4  రస

5  గంధం


5  (  పంచ తన్మాత్రలు ):

1  చెవులు

2  చర్మం

3  కండ్లు

4  నాలుక

5  ముక్కు


5  ( పంచ ప్రాణంలు ):

1  అపాన 

2  సామనా

3  ప్రాణ

4  ఉదాన

5  వ్యాన


5  (  అంతఃర ఇంద్రియంలు  )  

1  మనస్సు

2  బుద్ది

3  చిత్తం

4  జ్ఞానం

5  ఆహంకారం


5  (  కర్మేంద్రియంలు )

1  వాక్కు

2  పాని

3  పాదం

4  గుహ్యం

5  గుదం


6  (  అరిషడ్వర్గంలు  )

1  కామం

3  క్రోదం

3  మోహం

4  లోభం

5  మదం

6  మాత్సర్యం


3  (  శరీరంలు  )

1  స్థూల  శరీరం

2  సూక్ష్మ  శరీరం

3  కారణ  శరీరం


3  (  అవస్తలు  )

1  జాగ్రదావస్త

2  స్వప్నావస్త

3  సుషుప్తి అవస్త


6  (  షడ్బావ వికారంలు  )

1  ఉండుట

2  పుట్టుట

3  పెరుగుట

4  పరినమించుట

5  క్షిణించుట

6  నశించుట


6  (  షడ్ముర్ములు  )

1  ఆకలి

2  దప్పిక

3  శోకం

4  మోహం

5  జర

6  మరణం


7  (  కోశములు  )  (  సప్త ధాతువులు  )

1  చర్మం

2  రక్తం

3  మాంసం

4  మేదస్సు

5  మజ్జ

6  ఎముకలు

7  శుక్లం


3  (  జీవి త్రయంలు  )

1  విశ్వుడు

2  తైజుడు

3  ప్రఙ్ఞుడు


3  (  కర్మత్రయంలు  )

1  ప్రారబ్దం కర్మలు

2  అగామి  కర్మలు

3  సంచిత  కర్మలు


5  (  కర్మలు  )

1  వచన

2  ఆదాన

3  గమన

4  విస్తర

5  ఆనంద


3  (  గుణంలు  )

1  సత్వ గుణం

2  రజో గుణం

3  తమో గుణం


9  (  చతుష్ఠయములు  )

1  సంకల్ప

2  అధ్యాసాయం

3  ఆభిమానం

4  అవధరణ

5  ముదిత

6  కరుణ

7  మైత్రి

8  ఉపేక్ష

9  తితిక్ష


10  

(5 పంచభూతంలు పంచికరణ చేయనివి)

      

(5 పంచభూతంలు  పంచికరణం చేసినవి)

1  ఆకాశం

2  వాయువు

3  ఆగ్ని

4  జలం

5  భూమి


14  మంది  (  అవస్థ దేవతలు  )

1  దిక్కు

2  వాయువు

3  సూర్యుడు

4  వరుణుడు

5  అశ్వీని దేవతలు

6  ఆగ్ని

7  ఇంద్రుడు

8  ఉపేంద్రుడు

9  మృత్యువు

10  చంద్రుడు

11  చతర్వకుడు

12  రుద్రుడు

13  క్షేత్రజ్ఞుడు

14  ఈశానుడు


10  (  నాడులు  ) 1 (  బ్రహ్మనాడీ  )

1  ఇడా నాడి

2  పింగళ

3  సుషుమ్నా

4  గాందారి

5  పమశ్వని

6  పూష

7  అలంబన

8  హస్తి

9  శంఖిని

10  కూహు

11  బ్రహ్మనాడీ


10  (  వాయువులు  )

1  అపాన

2  సమాన

3  ప్రాణ

4  ఉదాన

5  వ్యాన

6  కూర్మ

7  కృకర

8  నాగ

9  దేవదత్త

10  ధనంజమ


7  ( షట్ చక్రంలు  )

1  మూలాధార

2  స్వాదిస్థాన

3  మణిపూరక

4  అనాహత

5  విశుద్ది

6  ఆఙ్ఞా

7  సహస్రారం


( మనిషి ప్రమాణంలు)

96  అంగుళంలు

8  జానల పోడవు

4  జానల వలయం

33 కోట్ల రోమంలు

66 ఎముకలు

72 వేల నాడులు

62  కీల్లు

37  ముారల ప్రేగులు

1  సేరు గుండే

అర్ద సేరు రుధిరం

4  సేర్లు మాంసం

1  సేరెడు పైత్యం

అర్దసేరు శ్లేషం


(  మానవ దేహంలో 14 లోకాలు  )  పైలోకాలు 7

1  భూలోకం  -  పాదాల్లో

2  భూవర్లలోకం  -  హృదయంలో

3  సువర్లలోకం  -  నాభీలో

4  మహర్లలోకం  -  మర్మాంగంలో

5  జనలోకం  -  కంఠంలో

6  తపోలోకం  -  భృమద్యంలో

7  సత్యలోకం  -  లాలాటంలో


అధోలోకాలు  7

1  ఆతలం  -  అరికాల్లలో

2  వితలం  -  గోర్లలో

3  సుతలం  -  మడమల్లో

4  తలాతలం  -  పిక్కల్లో

5  రసాతలం  -  మొకాల్లలో

6  మహతలం  -  తోడల్లో

7  పాతాళం  -  పాయువుల్లో


(  మానవ దేహంలో  సప్త సముద్రంలు  )

1  లవణ సముద్రం  -  మూత్రం

2  ఇక్షి సముద్రం  -  చెమట

3  సూర సముద్రం  -  ఇంద్రియం

4  సర్పి సముద్రం  -  దోషితం

5  దది సముద్రం  -  శ్లేషం

6  క్షీర సముద్రం  -  జోల్లు

7  శుద్దోక సముద్రం  -  కన్నీరు


(  పంచాగ్నులు  )

1  కాలాగ్ని  -  పాదాల్లో

2  క్షుదాగ్ని  -  నాభిలో

3  శీతాగ్ని  -  హృదయంలో

4  కోపాగ్ని  -  నేత్రంలో

5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో


7  (  మానవ దేహంలో  సప్త  దీపంలు  )

1  జంబుా ద్వీపం  -  తలలోన

2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన

3  శాక ద్వీపం  -  శిరస్సుపైన

4  శాల్మల ధ్వీపం  -  చర్మంన

5  పూష్కార ద్వీపం  -  గోలమందు

6  కూశ ద్వీపం  -  మాంసంలో

7  కౌంచ ద్వీపం  -  వెంట్రుకల్లో


10  (  నాధంలు  )

1  లాలాది ఘోష  -  నాధం

2  భేరి  -  నాధం

3  చణీ  -  నాధం

4  మృదంగ  -  నాధం

5  ఘాంట  -  నాధం

6  కీలకిణీ  -  నాధం

7  కళ  -  నాధం

8  వేణు  -  నాధం

9  బ్రమణ  -  నాధం

10  ప్రణవ  -  నాధం


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

తిరుమల తిరుపతి

 


*బెంగుళూరు లోని ఓ ఇంటి ముందు*

*తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి* 

*శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు..కారులోంచి దిగారు.* 

లోపలికి వెళ్ళి చూస్తే..అంతా నిశ్శబ్దం. 

మంచం మీద ఓ వృద్ధుడు నిస్తేజంగా 

పడుకుని ఉన్నారు. చుట్టూ ఎవరెవరో వున్నారు. 

ప్రసాద్ తాను వచ్చిన పని గురించి చెప్పారు. 

అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి..

నాన్నగారు వారం నుంచి కోమాలో వున్నారు,

అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు

తీసుకుపోయి..ఆ వృద్ధుని చెవిలో 

"నాన్నగారూ..నాన్నగారూ" అంటూ పిలిచాడు. 

సమాధానం లేదు. ఈ సారి చెవి దగ్గరగా..

"మీ కోసం తిరుమల నుండి ప్రసాదం వచ్చింది"

అన్నాడు. అప్పుడు తెరుచుకున్నాయి.. 

ఆ వృద్ధుని కళ్ళు. అర్ధ నిమీలిత నేత్రాలతో 

ఆయన ప్రసాద్ వంక, ఆయన చేతిలోని ప్రసాదం 

వంక చూస్తున్నాడు. ప్రసాద్ వెళ్లి ఆయన మెడలో 

శ్రీవారి డాలర్ హారం అలంకరించి, శాలువా కప్పి, 

శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు..


"మిమ్ము స్వామి వారి ఆస్థాన విద్వాంసునిగా 

నియమిస్తున్నాము" అని నియామక పత్రాన్ని 

ఆయనకు అందించారు. ఆ వృద్ధుని కళ్ళు 

వాటి వంక చూశాయి..కళ్ళనుంచి 

నీళ్లు కారుతున్నాయి.పెదాలు వణుకుతున్నాయి. 

ఏవో మాటలు వినిపిస్తున్నాయి.

ఏదీ అర్ధం కావడం లేదు.

ఆఖరు మాట ఒక్కటే అందరికీ వినిపించింది..


"స్వామీ! ఇన్నాళ్లకు నా మీద దయకలిగిందా?"

అంటూ..తన చేతనున్న వాటిని తడుముకుంటూ.. 

అనిర్వచనీయ అనుభూతిని అనుభవిస్తూన్నాడు.

స్వామి వారి కరుణ లభించింది.ఇక తన 

జీవితానికి విముక్తి లభించిందన్నట్లు మరో 

పది నిముషాల తరువాత....

"రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ప్రాణాలు 

అనంత వాయువుల్లో కలిసిపోయాయి! 

అందరికీ అదో అద్భుతం,అనిర్వచనీయం!


ఎవరీ..రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?


శ్రీనివాసునిపై అన్నమయ్య రాసిన కీర్తనలు 

30 వేలకు పైగా ఉన్నాయి. అప్పటి పాలకులు

అన్నమయ్య కీర్తనలను తాళపత్రాలపై 

చెక్కించారు. వాటిని స్వామి వారి ఆలయంలో 

నిక్షిప్తం చేశారు. 20 శతాబ్దంలో ఆలయ 

నిర్వహణప్పుడు..ఇవి బయటపడ్డాయి. 

ఆ తాళపత్రాలను గ్రంధ రూపంలోకి తెచ్చి,..

"జో అచ్యుతానంద..జోజో ముకుందా" 

అని మనం పాడుకోగలుగుతున్నామంటే.. 

ఆ కృషికి కారకులు..'వేటూరి ప్రభాకర శాస్త్రి, 

రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు!


ఓ రోజు సంగీత సమావేశం ముగిశాక..

అన్నమాచార్య ప్రాజెక్ స్పెషల్ ఆఫీసర్ 

కామిశెట్టి శ్రీనివాసులు..ప్రసాద్ గారితో..

సర్! రేపు మీరు బెంగుళూరు వెళుతున్నారు.

రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ గారు ప్రస్తుతం 

అక్కడే ఉన్నారు. అన్నమయ్య కీర్తనలను 

జనబాహుళ్యంలోకి తీసుకు రావడానికి 

ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన 

సమకాలికులకు అన్ని గుర్తింపులు లభించాయి. 

కానీ రాళ్లపల్లి వారికి మాత్రం అన్యాయం జరిగింది. 

ఆయనను మీరు కలిస్తే బాగుంటుంది" అన్నారు.


పివిఆర్కే ప్రసాద్ చాలా సేపు ఆలోచించి 

ఓ నిర్ణయానికి వచ్చారు. డిప్యూటీ ఈ.ఓ.ని పిలిచి..

ఉదయానికల్లా..రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని 

ఆస్థాన విద్వాంసునిగా నియామక పత్రం, 

శ్రీవారి గోల్డ్ డాలర్,శాలువా, ప్రసాదం

అక్షింతలు వగైరా సిద్ధం చేయండి అన్నారు!

డెప్యూటీ ఈ.ఓ.అవాక్కయ్యాడు.

"సర్! అలా నియమించే అధికారం మీ 

పరిధిలోనిది కాదు.బోర్డు ఓ కమిటీని నియమించి,

ఆ కమిటీ ఎంపిక చేసిన వారిని మాత్రమే 

బోర్డు నియమిస్తుంది. రూల్స్ కు విరుద్ధంగా 

అలా చేస్తే మీ మీద ఏ చర్యలైనా తీసుకునే 

అధికారం బోర్డుకు ఉంటుంది.అవసరమైతే 

మిమ్ము ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు 

అన్నాడు..

అయినా ప్రసాద్ గారు వినలేదు.

వెంటనే నేను చెప్పినట్లు చేయండి..అన్నారు! 

అలాగే అన్నీ సిద్ధం అయిపోయాయి.

అవి తీసుకుని బెంగుళూరు బయలుదేరారు

పివిఆర్కే ప్రసాద్ గారు. బెంగుళూరులో ఆఖరు 

క్షణాలలో..వాటిని రాళ్లపల్లి వారికి సమర్పించడం.

దాని కోసమే ఆయన ఎదురుచూస్తున్నట్లుగా..

ఆ శుభ సందేశం అందుకోగానే ఆయన 

స్వర్గస్థులవడం జరిగిపోయాయి!

            * * *

టిటిడి బోర్డు మీటింగ్ హాలు..వాతావరణం

సీరియస్ గా వుంది. జరిగిందంతా చెప్పి 

ప్రసాద్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు.

"ప్రసాద్ గారూ - మీరు చేసినది చాలా పెద్ద 

తప్పిదం. రూల్స్ కు విరుద్ధం" అన్నాడో సభ్యుడు. 

మీ మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడానికి 

ఇక బోర్డు ఎందుకు? అన్నారు మరొకరు.

ఎవరికి తోచింది వారు మాట్లాడారు. చివరిలో 

అందరూ చైర్మన్ నాగిరెడ్డిగారి వంక చూశారు.

ఆయన చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వారు!

"స్వామి వారికి బోర్డు చైర్మన్ నుండి..సాధారణ

యాత్రికుడి వరకూ అందరూ సమానం. ఆయన

సమస్త జీవరాసులను సమానంగా ప్రేమిస్తాడు.

ఎవరిని ఎప్పుడు, ఎక్కడ ఆదుకోవాలో

అప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు.

ఆయన లీలలు అలా ఉంటాయి. రాళ్లపల్లి వారిని

జీవన చరమాంకంలో సంతోష పెట్టేందుకే ప్రసాద్

గారిని అలా తరుముతున్నట్లు బెంగుళూరు

పంపించాడేమో? అని నేను భావిస్తున్నాను.


ఈ రూల్సు అన్నీ ప్రసాద్ గారికి తెలియనివి కావు.

రాళ్లపల్లివారికి ఎప్పుడో జరగవలసిన సత్కారం

అప్పుడు జరగలేదు.ఇప్పుడు మనకు భగవంతుడు

కల్పించిన అవకాశంగా నేను భావిస్తున్నాను!

ప్రసాద్ గారి చర్యకు ఆమోదం తెలుపుతున్నాను.

అన్నాడు. అంతా నిశ్శబ్దం. నాగిరెడ్డిగారి 

తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. 


ఎన్నో చిత్రాలలో..కథలను మలుపులు తిప్పి,

ఉత్కంఠ రేకెత్తించి, ముగింపులో ఓ సందేశంతో

ప్రేక్షకులను ఇంటికి పంపే విజయాధినేత 

నాగిరెడ్డిగారు..ఈ సమస్యకు ఒక్క చిరునవ్వుతో

ముగించిన ఆయన స్థితప్రజ్ఞతకు మనసులోనే

కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ప్రసాద్ గారు!

 *🙏ఓం నమో వేంకటేశాయా!!!🙏*


Courtesy Whatsapp

ఇంద్రియ నిగ్రహం

 *ఇంద్రియ నిగ్రహం*


ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని అర్ధం. వాటిలో మనస్సు కూడా ఒక ప్రధానమైన ఇంద్రియం. అదే కర్మలకు కారణమైన ప్రధాన ఇంద్రియం. తనకు ఇష్టమైనదానికోసం దానిని వెతుకుకుంటూపోవటం మనస్సు యొక్క సహజ లక్షణం. అది దానికి ఇష్టంలేని దానిమీదికి పోదు. ఎందుచేతనంటే దానివలన మనస్సుకు ప్రయోజనం లేదుకనుక. అలాంటప్పుడు మనసు ఇష్టం లేని దానికోసం  ఎందుకు శ్రమపడాలి ? కాబట్టి మనస్సుకు ( ఇంద్రియానికి ) ఏది ఆకర్షణగా ఉంటుందో, దేనివలన తాను కోరుకున్న అనందం కలుగుతుందో దానిమీదనే దాని ఆసక్తి ప్రసరిస్తుంది. అది లౌకికమైన తాత్కాలిక ఆనందం, కష్టసాధ్యమైన పారమార్ధిక విషయాల వైపు మనస్సు పోదు. అటువంటి మనస్సును నిగ్రహించి దానిని పారమార్ధికమైన విషయాలవైపు మళ్ళించటం కష్టసాధ్యమైన కార్యం. ఆ విధంగా మనస్సును మళ్లించగల శక్తిని సమకూర్చుకోవటాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు. 

కాబట్టి లౌకిక సుఖాన్ని కాదనుకుని నిత్యమైన పారమార్ధిక సుఖానికై మానవుడు ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం నిరంతరం సాగుతూనే ఉండాలి. కార్యసాధనకు ప్రయత్నం ముఖ్యం. లేకపోతే మనస్సును నిగ్రహించి కార్యోన్ముఖంగా చేయటం ఎట్లా సంభవిస్తుంది? కాబట్టి కార్యసాధనకు తీవ్రమైన ప్రయత్నం చేయాలి, ఆలోచన చేయాలి. ఆలోచన అంతర్ముఖంగా చేసుకొని మనస్సు ఏ విషయాలకు లోనవుతుందో వాటిని నిరోధించుకునే ప్రయత్నం చేయాలి. 

మనకు ఇష్టంలేని ప్రస్తావన తీవ్రమైనప్పుడు మనకు కోపం వస్తుంది. క్రోధం అంతః శత్రువు. హద్దు మీరుతుంది. చేయకూడని పని చేయిస్తుంది. మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తుంది. దీనివలన అనర్ధం జరుగుతుంది. అది తనకూ మంచిది కాదు. ఎదుటివారికీ ప్రయోజనం కలిగించదు. అటువంటి క్రోధాన్ని ప్రయత్నపూర్వకంగా నిరోధించాలి. 

సహనం, వివేకం జీవితంలో అలవరుచుకోవాలి. మనకు అనుకోని విధంగా ఒక ఆపద ఏర్పడింది అనుకుందాము. త్రోవను పోయే ఒకనిని హఠాత్తుగా పాము కాటువేసింది అనుకుందాము. అది ఆకస్మికమైన విపత్తు. దానికి ఏడ్చి పొడబొబ్బలు పెట్టి, ఇతరులను నిందించి, పాముపై క్రోధం పెరిగి, దానిని చంపటానికి ప్రయత్నించి, అది కనపడకుండా పోయి, భయము పెంచుకుంటూపోతే చేయవలసిన కార్యం మరచి సమయం వ్యర్ధమవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. అటువంటి ఆపద సమయములలోనే మనము సహనము, వివేకముతో కూడిన కార్యము తలపెట్టాలి.

ఏ కార్యం జరగటానికైనా ఒక కారణం ఉంటుంది. ఆ పాము కాటు వేయటానికి ఒక ప్రేరణ ఉండి ఉంటుంది. అదియే దైవ ప్రేరణ. దీనినే మనం లౌకికంగా ఒక సామెత కూడా వాడుతూవుంటాము -  *"శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని"*. ప్రారబ్ధ కర్మ పాలనంలోనే అట్లా జరిగి ఉంటుంది అని భావించాలి. అట్లా విచారణచేయటమే వివేకం. ఈ విచారణను వివేకముచే స్థిరపరచుకుని నిర్ణయం చేసుకోగలుగుతున్నాము. 

ఈ విధమైన విచక్షణచేయగలగటానికి ఎన్నో కఠినమైన పరిస్థితులను, అవరోధాలను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. నీటిని సహనంతో అధిగమించాలి. దీనినే తితిక్ష అని కూడా అంటారు. తితిక్ష కలవాడే వేదాంత శిక్షణకు అర్హుడు, యోగ్యుడు. అటువంటివానికే శాస్త్రము యెడల శ్రద్ధ కలుగుతుంది. శాస్త్రంలో శ్రద్ధ అంటే విశ్వాసం. శాస్త్రం అనేది ఏది నిర్దేశిస్తుందో అది చేయాలి. ఆ విధంగా శాస్త్రం ఎందుకు చెప్పింది అన్న దానిపై పరిశోధన చేయకూడదు. శాస్త్రంపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉంటే చాలదు, శాస్త్రం చెప్పిన విధంగా ఆచరించి తీరాలి.  


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు*

పిల్లల్లోని ప్రతిభ

 రాత్రి "పాడుతాతియ్యగా" ఫైనల్స్ చూస్తే చాలా సంతోషం కలిగింది..

ఆయా పిల్లల నిరంతర కృషి, పట్టుదల అమోఘం..

వారి విజయాల వెనుక వారి తల్లిదండ్రుల ప్రోత్సాహసహకారాలు ఎన్నదగినవి..

అవకాశాలనివ్వాలేగానీ పిల్లల ప్రతిభల్లో ఏలోటూ ఉండదు..

పాఠశాలనుండి వచ్చిన చిన్నారులు తమ అనుభవాలను బోలెడు చెప్పి తమ ఆనందాలను పంచుకోవాలని ఆశగా తమయింటిలోని తమతల్లిదండ్రులవద్దకో లేక పెద్దలదగ్గరికో వస్తారు..

వాళ్లను చేరదీయడం మాటెలా ఉన్నా తమతమ వ్యాపకాలకు (సీరియల్స్, టీవీసినిమాలు, ఫోన్లు) భంగం కలుగుతోందని విసుగ్గా వాళ్లను పట్టించుకోకుండా ఉంటే వాళ్లకు దిక్కేది?

ఎలా ఎదుగుతారు వాళ్లు?

మనింటికి అతిథులెవరైనా వస్తే వాళ్లకు ఎనలేని మర్యాదలు చేసేసి తెగ కబుర్లు చెప్పేసి వాళ్లు వెళ్లగానే వాళ్లగురించి దారుణంగా మాట్లాడడం విన్న పిల్లలకు విశాలభావాలెలా అలవడతాయి?

మనకున్న సమయంలో కొంతసేపైనా వాళ్లను చేరదీసి వారిప్రతిభలను అభినందిస్తూ మన అనుభవంలోనున్న విజయగాధలను చెబితే వారికి నాయకత్వ లక్షణాలు అబ్బవా?

ఎంతసేపూ ఇతరులతో పోల్చడం, వారి ఎదుటనే కీచులాడుకోవడంవంటివి చేస్తే వారిలో అభద్రతాభావం పెరగదంటారా?

లోగడ క్విజ్ కార్యక్రమాలూ, ప్రపంచంలోని అద్భుతాలూ ప్రసారమయ్యేవి.

ఇప్పుడన్నీ యూట్యూబ్ లలో అందుబాటులో ఉంటున్నాయి.

వాటిని చూడాలని వీళ్లకు తెలిస్తేకదా!

ఎంతసేపూ నీచపదాలతో దరిద్రపు హాస్యంతో కూడినవే చూడడానికి ఇష్టపడుతున్నారు..

సరైన మార్గదర్శనం కొరవడుతోందనిపిస్తోంది..

పెద్దలు కొన్ని త్యాగాలు చేయగలిగితేనే పిల్లల్లోని ప్రతిభ బైటికొస్తుందని భావన..

సానుకూలంగా తీసుకోండిసుమా!

మనలో వ్యతిరేకధోరణి పోనంతకాలం పిల్లల్లో సానుకూలదృక్పథం ఏర్పడదు..

                                       -కాశ్యపస..

కావ్యనిర్మాణమును

 కావ్యనిర్మాణమును భువి కవి యొనర్చ 

పండితుడు దాని సారమున్ బడయు చుండు 

తరువు నిరతంబు భువియందు    విరులనీయ 

వ్యాప్తి చేయును గంధమున్ వాయు వరయ

వైశాఖ పురాణం - 20.

 వైశాఖ పురాణం - 20.


20వ అధ్యాయము - పిశాచత్వ విముక్తి


నారదుడు అంబరీషునకు వైశాఖమహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి యింకను వైశాఖ మహాత్మ్యమును దయయుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవుడిట్లనెను, రాజా! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము.


వైశాఖమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతఃకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరికథను విని యధాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖపురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు. ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము.


పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్టుడు అనువారు అచటనుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు. సర్వసంగపరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగ చదివినవారు. అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట బృగుప్రస్రవణమను తీర్థసమీపమున నుండిరి.


వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందాసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో, తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైన చెప్పిన శ్రద్దగావినును. వీరెవరును లేనిచో విష్ణుకథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్లు తన పనులను మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్లు శ్రీమహావిష్ణు కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుటకన్న దూరమున నున్న క్షేత్రములను దర్శించుట కన్న కర్మానుష్ఠానము కన్న వానికి విష్ణుకథలయందు ప్రీతి యెక్కువ. ఎవరైన చెప్పుచున్నచో తాను వినును, వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును.


విష్ణుకథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసికొనును. విష్ణుకథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ది కలుగును. విష్ణుభక్తి పెరుగును. విష్ణువుపై నాసక్తియు సజ్జనులయందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా! దుష్టులు కర్మలనెన్నిటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్దిని సాధింపవలయును. చిత్తశుద్దివలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణుకథాశ్రవణము, ధ్యానము, మననము, ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోట గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము, విష్ణుకథ లేనిచోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణమృగము గాని, విష్ణుకథగాని, సజ్జనులు గాని లేని చోట మరణించివారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్య నిష్ఠుడీవిధముగ నాలోచించి విష్ణుకథా శ్రవణము ప్రసంగము, మననము, స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును.


ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాజపాది కర్మలనిన యిష్టము. వానినెప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైన చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాదికర్మకలాపము పొడగునని దూరముగ పోవును. అతని ననుసరించి యుందువారును స్నానాదికర్మలనాచరించి తమ యింటి పనులను చేసికొనుట యందిష్టము కలవారై యుందురు. ఇట్లెంతకాలము గడచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము స్మృతి మున్నగు వానిని యెరుగడు.


ఇట్టి యహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మిచెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు యెండిన పెదవులు, నోరు కలవాడై యుండెను. ఇట్లు బాధపడుచు కొన్నివేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను, జలము ప్రళయాగ్నివలెను ఫల పుష్పాదులు విషముగను వుండెడివి.


ఈ విధముగ కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలువిధములుగ బాధలనుపడెను. నిర్జనమైన ఆ యడవియందతడు మిక్కిలి బాధపడుచుండగా నొకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు నా ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధల ననుభవించుచున్న చిన్నకర్ణుని జూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పివాని బాధకు కారణము నడిగెను. అతడును నేను కర్మనిష్ఠుడనువాడను. దుర్వాసమహాముని సిష్యుడను. కర్మపరతంత్రుడనై శ్రీ హరి కథా శ్రవణాదులను చేయనివాడను. మూఢుడనై కర్మలనే ఆచరించుటవలన నిట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతయును వానికి చెప్పెను. నా యదృష్టవశమున మీ దర్శనమైనది. నాను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించెను. వాని పాదములపై బడి దుఃఖించెను.


సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను రెండు గడియలకాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగ సమర్పించెను. ధారపోసెను. ఆ మహిమవలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు-సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను దెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్యవిమానము నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనపురమునకు పోయెను.


శ్రుతకీర్త మహారాజా! కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము, ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె సర్వక్షేత్రములకంటె ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె పవిత్రమైనది. గంగాతీర వాసులకు యిహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగాతీరవాసులకు యిహము, పరము, నిశ్చితములు సుమా అని శ్రుతకీర్తికి శ్రుతదేవుడు భగవత్ స్వరూపము నీవిధముగ వివరించెను.


ఏ కోవశీసర్వభూతాంతరాత్మ, ఏకంరూపం బహుధాయః కరోతి |

తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ||

ఏకోదేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా |

కర్మాధ్యక్షస్సర్వభూతాధివాసస్సక్షి చైషకేవలోనిర్గుణశ్చ ||

ఏకోనారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకఏవశివో నిత్యస్తతోన్యత్ఫకలం మృషా |

బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్తు క్రీడ తే పరమేశ్వరః ||


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి భగవంతుని తత్త్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.


వైశాఖ పురాణం 20వ అధ్యాయం సమాప్తం.

Knee pain


 

Pravachan


 

భారత్‌లోకి ప్రవేశించిl వైరస్

 *👽 50 ఏళ్ళ క్రితం భారత్‌లోకి ప్రవేశించిl వైరస్ గురించి తెలుసుకుందాం 👽*

*♦️1. రాజీవ్‌గాంధీ మొత్తం 181 పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొన్నారు. అందులో నుండి సోనియా గాంధీ 180లలో పాలుపంచుకున్నారు. (శ్రీపెరంబుదూర్ మీటింగ్ తప్ప) రాజీవ్ గాంధీ చివరి మీటింగ్‌లో ఆవిడ పాల్గొనలేదు. అదే రోజు ఆయన మానవబాంబ్ ద్వారా హాత్య చేయబడ్డారు.*

*♦️2. రాజీవ్‌గాంధీ హత్యలో మరో 14 మంది సామాన్యులు చనిపోయారు. అందులో కాంగ్రెస్‌కి చెందిన ఒక్క లీడరు కూడా లేడు ! ఇది ఆశ్చర్యంగా, అనుమానాస్పదంగా అనిపించడం లేదా ఒక మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కాండిడేట్ వ్యక్తి ప్రసంగించే మీటింగ్‌లో ఒక్క సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేకపోవడం,*

*♦️3. రాజీవ్‌గాంధీ హత్యలో పెద్ద లీడర్ కానీ, మధ్యస్థ లీడర్ కానీ, చిన్న లీడర్ కానీ చనిపోలేదు. సోనియా లేరు, ఎప్పుడూ రాజీవ్ వెంట ఉంటూ అనుసరించే వ్యక్తి తల నొప్పి కారణంగా ఆవిడ ఆ ర్యాలీకి ఆరోజు హాజరు  కాలేదు. చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే పోయే తల నొప్పిని ఆమె సాకుగా చెబుతోంది. ఆ తరువాత భారత న్యాయస్థానానికి ప్రియాంకగాంధీ ద్వారా హంతకులకు శిక్ష అవసరం లేకుండా క్షమాభిక్ష పెట్టమని ఆమె అప్లికేషన్ దాఖలు చేయించింది.*

*♦️4. సోనియా ప్రస్థానం నెహ్రౄ కుటుంబంలో ఒక కొడలుగా మొదలయ్యాక అప్పటినుండి ఇప్పటివరకు ఒక్కటి కూడా సాధారణ మరణం నమోదు కాలేదు, అన్నీ కూడా అసాధారణమైనవే, రహస్యమైనవే. మీకేం అర్ధమైంది ❓*

*♦️5. ఇందిరా గాంధీ కుమారుడు అయిన సంజయ్‌గాంధీ మామ అయినటువంటి కల్నల్ ఆనంద్ ఆయన తన ఫామ్ హౌస్ కి ఎదురుగా చంపబడ్డాడు.*

*♦️6. సంజయ్‌గాంధీ కూడా ఒక ప్రైవేట్ ప్లేన్ ప్రమాదంలో చనిపోయాడు. ఇందిరాగాంధీ తన సొంత రక్షకుడి చేతిలోనే హత్య చేయబడ్డారు. తరువాత రాజీవ్ గాంధీ కూడా అలాగే చనిపోవడం జరిగింది.*

*♦️7. సోనియా తన దగ్గరి మిత్రురాలు, తనతో పాటు బార్‌లో డాన్స్ చేసిన కొలీగ్ డ్యాన్సర్ కొడుకు అయిన రాబర్ట్ వాద్రాకు ప్రియాంకను ఇచ్చి వివాహం జరిపించారు.*

*♦️8. ప్రియాంక గాంధీ మామ రాజేంద్ర వాద్రా ఢిల్లీలోని ఒక గెస్ట్ హౌస్‌లో చనిపోయి కనిపించడం జరిగింది.*

*♦️9. ప్రియాంక బావగారి భార్య అంటే ప్రియాంక తోడి కోడలు హైవే రోడ్డు ప్రమాదం లో చనిపోయారు.*

*♦️10. ప్రియాంక గాంధీ బావ మొరాదబాద్ హోటల్‌లో చనిపోయి కనిపించడం జరిగింది.*

*♦️11. రాజీవ్‌గాంధీకి దగ్గరి మిత్రులు అయిన రాజేష్‌ పైలట్, మాధవరావు సిందియాలు రాజీవ్‌తో కలిసి ఇటలీలోని సోనియా డ్యాన్స్ చేసే ఆ బార్‌కి వెళ్లేవారు. రాజేష్ పైలట్ రోడ్డు ప్రమాదంలో, మాధవరావు సింధియా విమాన ప్రమాదంలో చనిపోయారు.*

*♦️12. ఏ రోజైతే పార్లమెంట్ మీద అఫ్జల్‌గురు దాడి చేసాడో ఆరోజు రాహుల్, సోనియా ఇద్దరూ పార్లమెంట్‌కి వెళ్ళలేదు. ఇది కూడా కాకతాళీయమేనా. ❓*

*♦️13. ముంబాయి తాజ్ హోటల్ (26/11) దాడి ముందు రోజే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళిపోయాడు. మీకేం అర్థమైంది. ❓*

*👿 ఇండియాలో హిందువులకు ఇప్పటికి మీడియా దాచేసిన, సమాధానం తెలియని ప్రశ్నలు ❓👿*

*♦️1. పాకిస్తాన్, భారతదేశం మతం ఆధారంగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు, భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ప్రకటించ బడలేదు (ప్రపంచంలో ఇంకో హిందూ దేశం కూడాలేదు.) ❓*

*❓2. పాకిస్తాన్ నుండి హిందువుల, సిక్కుల శవాలు వస్తే రానీ, ఇక్కడ ఒక ముస్లిం రక్తం కూడా పార కూడదని జాతిపితగా ప్రచారమైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎందుకన్నారు ❓*

*♦️3. గాంధీ అనుకుంటే భగత్ సింగ్ ను కాపాడగలిగే వారు. కానీ ఎందుకు కాపాడ లేదు ❓*

*♦️4. భారత్ లో  ముస్లింల లబ్ది కోసం రకరకాల చట్టాలు ఎందుకు ఉన్నాయి ❓*

*♦️5.  భారత్ నుండి విడిపోయిన దేశాలు అన్నీ  ముస్లిం దేశాలుగనే  ఎందుకు మారాయి ❓*

*♦️6.  కేరళ లో రిక్షావాళ్లు, డ్రైవర్లు అయిన హిందువులు శ్రీ కృష్ణ, జై హనుమాన్ అని ఎందుకు రాసుకోకూడదు ❓*

*♦️7.  రాజ్యాంగం ప్రకారం 10 శాతం కంటే తక్కువ ఉన్న వారినే  అల్ప సంఖ్యాకులు అంటారు. భారత్లో 18 శాతం ఉన్న ముస్లింలు ఇంకా అల్ప సంఖ్యాకులుగా ఎందుకు సౌకర్యాలు పొందుతున్నారు ❓*

*♦️8.  కాశ్మీర్ హిందూ దేశంలో భాగం అయినప్పటికీ, అక్కడినుండి హిందువులను ఎందుకు వెళ్ల గొట్టారు ❓*

*♦️9. ముస్లింలు ఎక్కడైతే 30 - 40 శాతం అవుతారో అప్పుడు వారి కోసం ప్రత్యేక ముస్లిం దేశం కావాలని డిమాండ్ మొదలవుతుంది. ఇతర మతస్తులను వ్యతిరేకిస్తారు ❓ ఎందుకు ♦️*

*♦️10. ఇస్లామిక్ ఉగ్రవాదులకు, ఇస్లాంకు సంబంధం అంట కట్టొద్దని కోరుకుంటారు. కానీ హిందుత్వాన్ని మతతత్వం అని ఎందుకంటారు ❓*

*♦️11. ప్రపంచంలో హజ్ యాత్రకు  సబ్సీడీ ఇచ్చే ఏకైక దేశం భారత దేశం. 60 సంవత్సరాలుగా ప్రభుత్వం దీని కొరకు వేల కోట్లు ఖర్చు చేశారు. ఎందుకు ❓*

*♦️12. హిందూ మందిరాలలో ఆదాయాన్ని మదరసాలకు ఎందుకు ఖర్చు పెడతారు ❓*

*♦️13. కాశ్మీర్లో భగవద్గీత బోధించటానికి చట్టపరమైన ఆంక్షలు ఎందుకు ❓*

*♦️14. ఒకసారి జుమ్మా మసీద్ ఇమామ్ సయ్యద్ అబ్దుల్ బుఖారీ  "నేను ఒసామా బిన్ లాడెన్ ను సమర్పిస్తానని, ఐఎస్ఐఎస్ యొక్క ఏజెంటును"  అని అన్నారు. అయినా భారత ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు ❓*

*♦️15. పాకిస్తాన్ లో 1947లో 22.4 5 శాతం హిందువులు ఉండేవారు 1.12 శాతం మాత్రమే ఉన్నారు. అందరూ ఎక్కడికి పోయారు ❓*

*♦️16. మొగలుల ద్వారా ధ్వంసం చేయబడిన సోమనాథ్ మందిర్ పునరుద్దరించాలన్న సమయంలో ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే అని గాంధీ ఎందుకన్నారు ❓*

*♦️17. అదే గాందీ జుమ్మా మసీదు పునరుద్దరణకు నిరాహార దీక్షకు కూర్చుని ప్రభుత్వం పై వత్తిడి ఎందుకు తెచ్చారు ❓*

*♦️18.  భారత్లో 1947లో 7.8 8 శాతం ముస్లింలు మాత్రమే ఉండే వారు. ప్రస్తుతం వారు 18.8 శాతం ఉన్నారు. ఇంత జనాభా ఎలా పెరిగింది ❓*

*♦️19. భారతదేశంలోని మీడియా హిందువులకు, సంఘ్ కు  వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది ❓*

*♦️20. అక్బర్ జనానా లో  4878 మంది హిందూ మహిళలు ఉండేవారు. జోధా అక్బర్  సినిమాలో కాని, పాఠశాల చరిత్ర పాఠ్యాంశాలలో ఇది ఎందుకు ముద్రించ బడ లేదు ❓*

*♦️21. బాబర్ లక్షల హిందువులను హత్య చేశాడు.అయినా మనం ఎందుకు అతని మసీదును  చూడాలను కుంటాము ❓*


21. భారత్ లో 80 శాతం హిందువులు ఉన్నారు. అయినా శ్రీరాముని మందిరం2020 దాక ఎందుకు కట్టలేకపోయాము? 

*♦️23‌. కాంగ్రెస్ పాలనలో 645 దాడులు జరిగాయి. అందులో 32, 427 మంది చనిపోయారు. ఇవేవీ మీడియాకు కనపడవా ❓*

*♦️24. కానీ గుజరాత్ లో  ప్రతీకార దాడులలో రెండు వేల మంది చనిపోతే మీడియా ఇంత హంగామా ఎందుకు చేసింది ❓*

*♦️24. గోద్రా లో  67 మంది కరసేవకులు సజీవంగా దహనం చేశారు మీడియా దాని గురించి ఎందుకు మాట్లాడదు ❓*

*♦️25. జవహర్లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం (ఘియాషుద్దీన్ గాజీ)  కానీ మనకు చరిత్రలో తప్పుగా ఎందుకు చూపించారు. ❓*B

*🤝 ప్రతి ఒక్కరూ రాబోయే తరాలను ఎటు వైపు తీసుకెళ్తున్నారో ఆలోచించాలి. ఇది మనందరి బాధ్యత. 🤝*

దీన్ని ప్రతీ హిందువు చదవాలి

దయచేసి మీకు తెలిసిన ప్రతీ

హిదువుకు ఫార్వార్డ్ చెయ్యండి🙏

సుగంధాన్ని వ్యాపింపజేస్తుంది....

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝  

*కవిః కరోతి కావ్యాని రసం జానాతి పణ్ణితః* ౹

*తరుః సృజతి పుష్పాణి మరుద్వహతి సౌరభమ్* ॥


తా𝕝𝕝 కవి కావ్యాలను రాస్తాడు... పండితుడు అందులో సారాన్ని తెలుసుకుంటాడు... చెట్టు పుష్పాలను పుష్పిస్తుంది... వాయువు వాటి సుగంధాన్ని వ్యాపింపజేస్తుంది....


             👇  [ *శివ మానస పూజ* ] 👇


శ్లో𝕝𝕝  

*కరచరణ కృతం వాక్కాయుజం కర్మజం వా*

*శవణ్ర నయనజం వా మానసం వాఽపరాధమ్*

*విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ*

*జయ జయ కరుణాబ్ధేశ్రీ మహాదేవ శంభో* || ౫ ||


ఓ దయాహృదయుడైన శంభో భగవానుడా, నేను నా చేతులు లేదా

కాళ్ళతో, నా మాట లేదా శరీరం, నా చర్యల ద్వారా, నా చెవులు లేదా

కళ్ళ ద్వారా, మానసికంగా చేసిన లేదా గ్రంధాలచేనిషేధించబడిన

అనేక విధాలుగా పాపాలు చేసిఉండవచ్చు. *దయచేసి నా

పాపాలన్నిటినీ క్షమించు మహాదేవ శంభో*.

అమర్‌నాథ్‌

 *అమర్‌నాథ్‌ గుహ,అమర్నథ్ యాత్ర (Amaranath Cave,Amaranath yatra )- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుదాం..*



మంచు కొండ మీద ఓ గుహ... భారత దేశంలోనే పెద్దది ఉన్నది 12,000 అడుగుల ఎత్తున... అక్కడికి వెళ్లడమే ఎంతో కష్టం... అయినా లక్షలాది మంది దర్శిస్తారు... అదే అమర్‌నాథ్‌!


ఓసారి పార్వతీదేవికి జీవరహస్యం, అమరత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. శివుడిని అడిగింది. మంచు కొండల్లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో దానిని వివరించాడు. ఆ అమర కథను చెప్పిన స్థలమే అమర్‌నాథ్‌ గుహ! జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని మంచు కొండపై, సముద్రమట్టానికి 12,756 అడుగుల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ గురించిన పురాణ కథ ఇది. దేశంలోనే అతి పెద్ద గుహగా 75 అడుగుల ఎత్తు, 40 గజాల వైశాల్యంతో ఉండే ఇందులో ఏటా జూన్‌, ఆగస్టుల మధ్య కాలంలో మంచు శివలింగాకారంలో ఏర్పడడం ఓ భౌగోళిక అద్భుతం. ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన ఇక్కడికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.


అమర్‌నాథ్‌ గుహ బుటామాలిక్‌ అనే ఓ ముస్లిం బాలుడి వల్ల బయటపడడం ఒక విశేషం. తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతూ మంచు కొండ ఎక్కినప్పుడు తొలిసారిగా దీన్ని చూశాడని చెబుతారు. ఇప్పటికీ ఆ బాలుడి వంశస్థులు అక్కడే ఉంటారు. అమర్‌నాథ్‌ సంబంధించిన ప్రస్తావన క్రీస్తుపూర్వం 34 నుంచి అనేక గ్రంథాలు, చారిత్రక ఆధారాలలో కనిపిస్తుంది. భక్తులు పహల్గామ్‌ అనే ఊరి నుంచి 42 కిలోమీటర్ల దూరం కాలినడకన మంచు కొండ ఎక్కుతారు.


జీవరహస్యాన్ని ఎవరూ లేని చోట చెప్పాలనుకున్న శివుడు, పహల్గామ్‌లో నందిని వదిలేసి పార్వతితో కొండెక్కాడని చెబుతారు. మార్గమధ్యంలో చందన్‌వరి వద్ద నెలవంకని, శేష్‌నాగ్‌ సరస్సు వద్ద కంఠాభరణమైన పాముని, మహాగుణాస్‌ పర్వతం వద్ద గణేశుడిని, పంజితర్ణి వద్ద పంచ భూతాల్ని విడిచిపెట్టాడు. త్రినేత్రంలోని కాలాగ్నిని కూడా వదిలి ఏ జీవి కనిపించినా భస్మం చేయమని ఆదేశించి గుహలో ప్రవేశించాడు. శివుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా తను పరుచుకున్న జింక చర్మం కింద ఉన్న రంధ్రంలో రెండు పావురాలు ఉండిపోయి శివుడి చెప్పిన రహస్యాన్ని విన్నాయి. వాటికి శివుడు అమరత్వాన్ని ప్రసాదించాడని, అవి ఇప్పటికీ అమర్‌నాథ్‌ గుహలో కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు.


అమర్‌నాథ్‌ గుహకి పైభాగంలో ఉండే రామకుండం అనే సరస్సు నుంచి బొట్టు బొట్టుగా పడే నీరు గడ్డకడుగూ ఏడడుగుల ఎత్తయిన శివలింగంగా ఏర్పడుతుంది. దీని ఎత్తు చంద్రుని హెచ్చుతగ్గులను బట్టి మారుతుందని చెబుతారు.🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కాళహస్తీశ్వరా

 శు భో ద యం🙏


నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,

జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు  పై

కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ

చ్చిన రానీ, యవి నాకుభూషణములే శ్రీకాళహస్తీశ్వరా!

   "స్వామీ! కాళహస్తీశ్వరా! నాకు కష్టాలేరానీ ,నష్టాలేరానీ, సుఖాలేరానీ దుఃఖాలేరానీ,ననుసామాన్యుడనీమాన్యుడననీ,సంసారమోహమేనన్ను ఆవహింపనీ,జ్ఞానము కలుగనిమ్ము అవియన్నియు నాకు అలంకారములుగనేభావింతును.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ..

 ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ...


1. గణనాయకాష్టకం - అన్ని విజయాలకు.


2. శివాష్టకం - శివ అనుగ్రహం..


3. ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం...


4. శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది...


5. అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి....


6. కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం...


7. దుర్గష్టోత్తర శతనామం - భయహరం..


8. విశ్వనాథ అష్టకం - విద్య విజయం..


9. సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం..


10. హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ...


11. విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి...


12. శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి...


13. భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి...


14. శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం...


15. లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం.


16. కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం..


17. ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత..


18. శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం..


19. లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి..


20. శ్యామాల దండకం - వాక్శుద్ధి..


21. త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి..


22. శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి...


23. శని స్తోత్రం - శని పీడ నివారణ...


24. మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం..


25. అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి...


26. కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం..


27. కనకధార స్తోత్రం - కనకధారయే...


28. శ్రీ సూక్తం - ధన లాభం..


29. సూర్య కవచం - సామ్రాజ్య సిద్ది..


30. సుదర్శన మంత్రం - శత్రు నాశనం...


31. విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం...


32. రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి..


33. దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు...


34. భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు..


35. వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు...


36. దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు..


37. లలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి...


*నిత్యము భగవన్నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి..*

.........................................................

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం -‌ పంచమి - ఉత్తరాషాఢ -‌‌ భౌమ వాసరే* (28.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మీరు భాగస్వాములు

 మీరు భాగస్వాములు కండి 

ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు.  మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ +91 9848647145 కు వాట్సాప్ చేయండి.  దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 

ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు+91 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   

ఇట్లు 

మీ బ్లాగరు


పంచాంగం 28.05.2024

 ఈ రోజు పంచాంగం 28.05.2024  Tuesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస కృష్ణ    పక్ష: పంచమి తిధి భౌమ వాసర: ఉత్తరాషాఢ నక్షత్రం బ్రహ్మ యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పంచమి మధ్యాహ్నం 03:21 వరకు.

ఉత్తరాషాఢ  పగలు 09:31 వరకు.

సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:42


వర్జ్యం : మధ్యాహ్నం 01:22 నుండి 02:55 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:20 నుండి 09:12 వరకు తిరిగి రాత్రి 11:07 నుండి 11:51 వరకు.


అమృతఘడియలు : రాత్రి 10:36 నుండి 12:09 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

విద్యార్దులకు

 ▪️ తల్లి తండ్రులు లేని పిల్లలు  ఎవరయినా  ఉంటే వారికి ప్రముఖ సంస్థ అయిన Hyderabad *Amma Jyothi Foundation* వారు 1వ తరగతి నుండి వారు ఎంత చదివితే అంత చదివించి వారికి ఉన్నత భవిష్యత్తు ఇచ్చే వరకు వారి పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది వారికి అన్ని ఉచితం 


* LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం


1.నో హాస్టల్ ఫీజు

2.నో స్కూల్ ఫీజు

3 నో కాలేజ్ ఫీజు.

4.నో బిల్డింగ్ ఫీజ్. 


📘 *ముఖ్య గమనిక:* 

తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు లేకపోయినా, లేదా పేదపిల్లలు ఎవరైనా ఉంటే ఇదే *Amma Jyothi Foundation*  సంస్థ వారికి మంచి భవిష్యత్తు ఇస్తుంది.


*హాస్టల్ ఫీజు ఉచితం

*మెస్ ఫీజు ఉచితం

* LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం


📞 వివరాలకు సెల్:

*9490043272*

9573411887


ఇతర గ్రూపులకు పంపండి

పేద విద్యార్దులకు  సహాయంచేయండి.

మనకు అవసరము లేకపోవచ్చు, 

కానీ అనాధ పిల్లలకు చాలా అవసరం ఉండవచ్చు. పేద విద్యార్థులకు సహాయం చేద్దాం!🙏

చందమామ

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 *మన చిన్నప్పటి “చందమామ” లు అన్నీ వున్నాయోచ్…!*👇



*1947 జనవరి నుండి 2012 డిసెంబర్ వరకూ విడుదల అయిన అన్ని చందమామ పుస్తకాలను PDF రూపంలో తన వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు.*


*వీటిని ఎవ్వరమైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.*


*వీటిని మనం పిల్లలచే చదివించవచ్చు, లేదా మనమే చదివి వినిపించవచ్చు.*


*దీనివలన పిల్లలకు తెలుగు చదవడం వస్తుంది, అలానే భాషపై పట్టు కూడా పెరుగుతుంది.*


*మనం చంపేసిన ఎన్నో తెలుగు పదాలు ఈ కథలలో ఉంటాయి. కథల రూపంలో నేర్పడం కనుక, ఇది కొంత తేలికగానే ఉంటుంది.*


*అవకాశం ఉన్నవారు, మీ పిల్లలు చదువుకునే బడిలో తెలుగు బోధించే వారికి కూడా వీటిని పంపండి.*


*లింక్:-* http://granthanidhi.blogspot.com/2020/04/candamama.html?m=1

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన 

మరియు ఇతర పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

********

తేదీ.28.05.2024

మంగళ వారం (భౌమ వాసరే) 

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణ పక్షే పంచమ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  కృష్ణ పక్షే పంచమ్యాం

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.29

సూ.అ.6.26

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

కృష్ణ పక్షం 

పంచమి సా. 3.09 వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.9.43 వరకు. 

అమృతం రా. 10.43 ల 12.15 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.04 ల 8.56 వరకు. 

దుర్ముహూర్తం రా.10.51 ల 11.36 వరకు. 

వర్జ్యం మ.1.32 ల 3.04 వరకు. 

యోగం బ్రహ్మం  తె. 2.30 వరకు. 

కరణం తైతుల సా.3.09 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ. 12.00ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ.9.00 ల 10.30 వరకు. 

ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.     

***********   

పుణ్యతిధి వైశాఖ బహుళ పంచమి మరియు షష్ఠి. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. స్పాట్ రిజిస్ట్రేషన్ లు  ఏర్పాటు చేయటం జరిగినది.

 ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

⚜ *శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం*

 🕉  *మన గుడి : నెం 330*


⚜ *కర్నాటక  :-*


*అద్యపాడి- దక్షిణ కన్నడ ప్రాంతం*


⚜ *శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం*



💠 భారతదేశంలో దుర్గ ఆరాధన అతిప్రాచీన కాలంనుండి కొనసాగుతోంది.

భక్తుల యొక్క  కోరికలను నెరవేర్చే

సింహవాహినికి వృక్షాలు, పువ్వులు,  జంతువులు‌, పక్షులు సర్వం ప్రీతిపాత్రమైనవే.


💠 పచ్చదనాల ప్రకృతి మాత ఒడిలో నిర్మితమైనదే అద్యపాడి

దుర్గా పరమేశ్వరీదేవి ఆలయం.


💠 శంకరీదేవి పంకరాజా  యొక్క సహోదరి. దుర్గాదేవికి  పరమ భక్తురాలు. 

కొండలూ , కోనలతోవున్న ఇరవై రెండుగ్రామాలకు అధికారిణి.

ఆ సమయంలో మంగళూర్ ను సోయిదేవన్ అనే రాజు పాలిస్తూ వుండేవాడు.

అతడు అసమర్ధుడు కావడంతో అతని రాజ్యంలో నుండి ఏడు గ్రామాలు  శంకరి వశంలోకి వచ్చేయి.


💠 శంకరీదేవి పరిపాలించే రాజ్యంలో

తిమ్మా,బొమ్మా అనే దొంగలు భీభత్సం సృష్టించి బాటసారులను, గ్రామస్తులను

దోచుకోసాగారు. 

రాజ్యంలో శాంతి కరువైంది.

శంకరి గొప్ప తపశ్శాలి , దేవీ కటాక్షంపొందిన  దమణ మహర్షిని ఆశ్రయించింది.


💠 తనని ఆశ్రయించిన శంకరి రాణికి ప్రజల సమస్య తీరుస్తానని దమణ మహర్షి

అడవిలోని దొంగలని  కలుసుకున్నాడు

దమణ మహర్షి .

మహర్షి యొక్క తీక్షణమైన , శక్తివంతమైన చూపులకే భయపడిన దొంగలు మహర్షిని శరణు కోరారు. తాము అపహరించిన సంపదనంతా తిరిగి యిచ్చి వేసి, మహర్షి బోధనలతో,సన్మార్గంలో జీవించసాగారు.


💠 దమణ మహర్షి ఆదేశంతో, శంకరీదేవి అద్యపాడి లో దుర్గాపరమేశ్వరికి ఒక

ఆలయం నిర్మించింది. ఎన్నో తరాలు మారి  దేవాలయం కాలగర్భంలో కలసిపోయింది. తరువాత కాలంలో ఆ స్ధలంలో ఒక గ్రామం వెలసింది. అక్కడ వున్న  ఒక పెద్ద వృక్షాన్న నాగులు సంచరించడం గమనించిన

ఒక పేద దంపతులు ఆ నాగులను భక్తి శ్రధ్దలతో  పూజించడం మొదలుపెట్టాక వారి జీవితం ఉన్నతస్థాయికి వచ్చి ఆ పేద దంపతులకు

సుఖశాంతులు లభించాయి.


💠 ఒకనాడు  దుర్గాదేవి వారి స్వప్నంలో కనిపించి తనకి ఆలయం నిర్మించమని ఆదేశించింది. ఆ దంపతులు  ఆలయ నిర్మాణానికి ప్రసన్న జోస్యం చూసి, పాత ఆలయం వున్న చోటనే తిరిగి ఆలయం  పునర్నిర్మించారు.


💠 దుర్గాదేవికి ప్రియమైనప్రకృతి పచ్చదనాల వడిలో  ఈ ఆలయం వున్నది. 

కొండమార్గంలో దూరం నుండే  కనిపించే గోపుర శిఖరాన్ని దర్శించి‌ ముందుకు సాగితే అక్కడ క్రింద కి పలు మెట్లవరస కనిపిస్తుంది. ఆ మెట్లు దిగివెళితే ఎదురుగా నాగ యక్షి  వృక్ష పైభాగాన్ని దర్శిస్తాము. ఆ వృక్షం క్రింద రక్తేశ్వరి, బ్రహ్మదేవుని, నాగదేవుని, నంది గోనా, గుళిక దైవా, వ్యాఘ్ర చాముండి మొదలైన దేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి.


💠 సమీపాన వున్న కొన్ని మెట్లుమీదుగా పైకి ఎక్కి తే చదరంగా, తుళునాడు బాణీలో కట్టబడిన ప్రదక్షణ బాట ద్వారా ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తాము.

అక్కడ ముందుగా వలంపురి వినాయకుని దర్శించి గర్భగుడిలోకి ప్రవేశిస్తాము.


💠 శంఖు చక్రములను , ధరించి, అభయ వరద రూపిణిగా, అలంకారభూషితయై,

ఆశీనురాలైన  దుర్గా పరమేశ్వరి  దేవి దర్శనం భక్తులకు కలుగుతుంది.


💠 దుర్గాదేవి ని దర్శించుకొని

కొన్ని మెట్లు దిగితే అక్కడ ఉప దేవతల సన్నిధులు , మరల మరి  కొన్ని మెట్లు దిగితే  ఆలయ క్రింది అంతస్తుకి చేరుకుంటాము.

అక్కడ నాగ యక్షి వృక్ష మధ్య భాగమున  చుట్టూ పెద్దపుట్ట  వుంటుంది. 

అందులోపల ఆదిలో ప్రతిష్టించబడిన

మూల దేవతా విగ్రహం అక్కడ

వున్నదని ఐహీకం.


💠 ఎడం ప్రక్కన వున్న నూతి

వద్ద మూలగా  ఒక గుహవుంది. 

ఆ గుహలో  శ్వేత నక్షత్ర తాబేలు  వుంది అని చెప్తారు.


💠 గుహ ప్రవేశ ద్వారము వద్ద  వృక్షం యొక్కవేరు భాగము తెలుస్తుంది.

ఈ గుహ లోపలి నుండి వెడితే, అద్యపాడి  ఆది నాదేశ్వరుని ఆలయానికి  చేరుకోవచ్చని చెప్తారు.


💠 గుహలోవున్న  నీటిలో దమణ మహర్షి జీవించి వున్నట్టు చెప్తారు. 

అయితే ఆ గుహ లోపలికి వెళ్ళి

తిరిగి వచ్చిన వారు లేరు.


💠 సంవత్సరం పొడవునా, దుర్గా పరమేశ్వరీ దేవికి అనేక ఉత్సవాలు జరగుతున్నా,  రధోత్సవం,  నవరాత్రి ఉత్సవాలు,  దీపోత్సవాలు మాత్రం  అత్యంత ఘనంగా  జరుపుతారు.


💠 ప్రకృతి అందాలతో నిండి

వున్న  యీ ఆలయం దర్శనం రమణీయంగా వుంటుంది. ఒక సాహసయాత్ర ను తలపింపజేస్తుంది .


💠 ఈ అద్యపాడి దుర్గా పరమేశ్వరీ దేవి ఆలయం దక్షిణ కర్ణాటక లో మంగుళూర్ కు సమీపంలోని బజ్పే విమానాశ్రయానికి ఒక 10 కిమీ దూరంలో వుంది.


💠 దుర్గాపరమేశ్వరి సదా తనను చూడవచ్చినవారిని తన కరుణా కటాక్షాలతో  అనుగ్రహించి కాపాడుతూనే వుంటుంది