ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
3, డిసెంబర్ 2023, ఆదివారం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
ఆ క్షణంలో త్రిశంకుడు శ్వపచుడుగా మారిపోయాడు. సువర్ణరత్నకుండలాలు ఇనవరాత
కుండలాలైపోయాయి. చందనచర్చ - దుర్గంధభూయిష్టమైపోయింది. దివ్యపీతాంబరం నల్లని మలివవస్త్రంగా
మారిపోయింది. శరీరం గజవర్ణంలోకి దిగింది. వైగనిగ్యం సౌకుమార్యం అంతరించి పళ్ళికలు పళ్ళికలుగా
బండబారింది. శక్త్యుపాసకుడైన వసిష్ఠుడి రోషానికి తిరుగులేదుకదా! అందుకనే శ్రీదేవీ ఉపాసకులకు
ఎప్పుడూ కించపరచకూడదు. వసిష్ఠుడంటే గాయత్రీ జపనిష్ఠుడైన మహామునీశ్వరుడు.
తస్మాత్ శ్రీశక్తి భక్తో హి నావమాన్యః కదాచన |
గాయత్రీ జపనిష్టా హి వసిష్టో మునిపత్తమః ॥
(12-35)
త్రిశంకుడు తన రూపాన్ని చూసుకుని బోరున విలపించాడు. రాజధానికి తిరిగివెళ్ళేందుకు
మనస్కరించలేదు. అడవిలోకే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళను ? ఏమి చెయ్యను? రూపం చూస్తే వాళే
రోతగా ఉంది. ఇంటికి వెడితే భార్య తిరస్కరిస్తుంది. కొడుకు దుఃఖిస్తాడు. సచివులు అసహ్యించుకుంటాడు.
బంధుమిత్రులు దూరం తొలగుతారు. ఇలా జీవించడంకన్నా మరణించడమే మేలు. విషం తాగవా?
మడుగులో దూకనా ? తాడుపేని ఉరిపోసుకోవా? చితిపేర్చుకుని అగ్నిలో ప్రవేశించనా? నిరాహారుడిపై
ప్రాయోపవేశం చెయ్యనా ? ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే జన్మజన్మలకూ ఇదే వెంటాడుతుందా ? ఈ
శాపమూ ఈ శ్వపచత్వమూ తప్పవా ? ఈ ఆలోచన రావడంతోనే త్రిశంకుడి ధోరణి మారిపోయింది. ఎట్టి
పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోనుగాక చేసుకోను. చేసుకున్న కర్మను ఈ జన్మంలోనే ఈ దేహంతోనే
అనుభవించాలి. అనుభవించడంతోనే కర్మవిపాకం క్షయమవుతుంది. ప్రారబ్ధకర్మలు క్షయించడానికి
అదొక్కటే మార్గమని పెద్దలు చెప్పారు. అందుచేత చేసుకున్న కర్మ శుభమైనా అశుభమైనా అనుభవించక
తప్పదు. ఆశ్రమాలను సందర్శిస్తూ తీర్థక్షేత్రాలను సేవిస్తూ అంబికాదేవిని ధ్యానిస్తూ సాధువణ్ణమలకు
పరిచర్యలు చేస్తూ నా దుష్కర్మమ నశింపజేసుకుంటాను. అదృష్టం బాగుంటే ఏ మహామభావుడో ఏ
మహర్షియో ఏ సాధుపుంగవుడో సంగతపడవచ్చు. ఏదైనా ఉపకారం చెయ్యవచ్చు.
ప్రారబ్ధకర్మణాం భోగాదవ్యథా న క్షయో భవేత్ |
తస్మాన్మయాత్ర భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్
1 (12-46)
ఇలా ఒక విశ్చయానికి వచ్చి గంగాతీరం చేరుకున్నాడు
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
ఆ క్షణంలో త్రిశంకుడు శ్వపచుడుగా మారిపోయాడు. సువర్ణరత్నకుండలాలు ఇనవరాత
కుండలాలైపోయాయి. చందనచర్చ - దుర్గంధభూయిష్టమైపోయింది. దివ్యపీతాంబరం నల్లని మలివవస్త్రంగా
మారిపోయింది. శరీరం గజవర్ణంలోకి దిగింది. వైగనిగ్యం సౌకుమార్యం అంతరించి పళ్ళికలు పళ్ళికలుగా
బండబారింది. శక్త్యుపాసకుడైన వసిష్ఠుడి రోషానికి తిరుగులేదుకదా! అందుకనే శ్రీదేవీ ఉపాసకులకు
ఎప్పుడూ కించపరచకూడదు. వసిష్ఠుడంటే గాయత్రీ జపనిష్ఠుడైన మహామునీశ్వరుడు.
తస్మాత్ శ్రీశక్తి భక్తో హి నావమాన్యః కదాచన |
గాయత్రీ జపనిష్టా హి వసిష్టో మునిపత్తమః ॥
(12-35)
త్రిశంకుడు తన రూపాన్ని చూసుకుని బోరున విలపించాడు. రాజధానికి తిరిగివెళ్ళేందుకు
మనస్కరించలేదు. అడవిలోకే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళను ? ఏమి చెయ్యను? రూపం చూస్తే వాళే
రోతగా ఉంది. ఇంటికి వెడితే భార్య తిరస్కరిస్తుంది. కొడుకు దుఃఖిస్తాడు. సచివులు అసహ్యించుకుంటాడు.
బంధుమిత్రులు దూరం తొలగుతారు. ఇలా జీవించడంకన్నా మరణించడమే మేలు. విషం తాగవా?
మడుగులో దూకనా ? తాడుపేని ఉరిపోసుకోవా? చితిపేర్చుకుని అగ్నిలో ప్రవేశించనా? నిరాహారుడిపై
ప్రాయోపవేశం చెయ్యనా ? ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే జన్మజన్మలకూ ఇదే వెంటాడుతుందా ? ఈ
శాపమూ ఈ శ్వపచత్వమూ తప్పవా ? ఈ ఆలోచన రావడంతోనే త్రిశంకుడి ధోరణి మారిపోయింది. ఎట్టి
పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోనుగాక చేసుకోను. చేసుకున్న కర్మను ఈ జన్మంలోనే ఈ దేహంతోనే
అనుభవించాలి. అనుభవించడంతోనే కర్మవిపాకం క్షయమవుతుంది. ప్రారబ్ధకర్మలు క్షయించడానికి
అదొక్కటే మార్గమని పెద్దలు చెప్పారు. అందుచేత చేసుకున్న కర్మ శుభమైనా అశుభమైనా అనుభవించక
తప్పదు. ఆశ్రమాలను సందర్శిస్తూ తీర్థక్షేత్రాలను సేవిస్తూ అంబికాదేవిని ధ్యానిస్తూ సాధువణ్ణమలకు
పరిచర్యలు చేస్తూ నా దుష్కర్మమ నశింపజేసుకుంటాను. అదృష్టం బాగుంటే ఏ మహామభావుడో ఏ
మహర్షియో ఏ సాధుపుంగవుడో సంగతపడవచ్చు. ఏదైనా ఉపకారం చెయ్యవచ్చు.
ప్రారబ్ధకర్మణాం భోగాదవ్యథా న క్షయో భవేత్ |
తస్మాన్మయాత్ర భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్
1 (12-46)
ఇలా ఒక విశ్చయానికి వచ్చి గంగాతీరం చేరుకున్నాడు
మల్టీ మిల్లెట్ మొలకల ప్రోటీన్ పౌడర్ మాల్ట్ చేయు విధానము:
పదార్ధాలు--
కొర్రలు, సామలు,అరికలు, ఊదలు,అండు కొరలు,సజ్జలు,రాగులు,వరిగెలు,జొన్నలు,పెసలు,ఉలవలు,కందిపప్పు,అలసంద,పచ్చి బఠాణి,అక్రోట పప్పులు,బాదంపప్పు,నల్లమిరియాలు,యాలుకలు
1.పాలతో చేయు విధానము: ఒక గ్లాసు పాలు గిన్నెలో పోసి స్టౌ పైన పెట్టి మరగనివ్వాలి .పాలు మరిగే లోపు ఒక స్పూను ప్రోటీన్ పౌడర్ చిన్న కప్పులో వేసి కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా కలిపాలి.తరువాత ఈ మరిగిన పాలలో ఈ నీటితో కలిపిన మిశ్రమం వేసి కలిపి 2 నిమిషాలు సన్న మంట పై ఉంచాలి. తరువాత రుచికి తగినంత పంచదార లేదా కొద్దిగా చల్లారాక బెల్లము పొడి కానీ వేసుకొని తాగవచ్చు.
2.మజ్జిగ తో కలుపుకొని త్రాగు విధానము:
ఒక 1/2 గ్లాసు నీళ్ళు గిన్నెలో పోసి స్టౌ పైన పెట్టి మరగనివ్వాలి.ఈ లోగా 1 స్పూను ప్రోటీన్ పౌడర్ చిన్న కప్పులో వేసి నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి మరిగే నీటిలో పోసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి.తరువాత చల్లారాక అందులో అర గ్లాసు మజ్జిగ పోసి తగినంత ఉప్పు లేదా సైంధవ లవణం కలిపి త్రాగాలి.
*మనో నేత్రాలు..*
దాదాపు నాలుగు సంవత్సరాల కాలం క్రితం..
"వాట్సాప్ లో గురుచరణ్ అనే గ్రూప్ ను నిర్వహిస్తున్నాము..మీరు ఇతర గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్న మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుభవాలు..లీలలు..ఈ గ్రూప్ లో కూడా పోస్ట్ చేయండి..నా పేరు నందకిశోర్..నేను ఆ గ్రూప్ అడ్మిన్ గా వున్నాను..మీకు లింక్ పంపుతాను.." అన్నారు..సరేనండీ అన్నాను..అదేవిధంగా ఆ గ్రూప్ లో చేరాను..ఆ తరువాత శ్రీ నందకిశోర్ గారు మళ్లీ నాతో మాట్లాడుతూ.."ఈ గ్రూప్ లో ఎక్కువ మందిమి అంధత్వం కారణంగా చదవలేని వాళ్ళము..మీకు వీలుంటే ఆడియో రూపం లో పెట్టగలరా..?" అన్నారు..ఒకింత ఆశ్చర్యం వేసింది..ఖమ్మం లో నివాసం ఉంటున్న శ్రీమతి జీవని గారు..మొగిలిచెర్ల స్వామివారి జీవితచరిత్రను ఆడియో రూపం లో యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు..వారిని సంప్రదించి..వారిని ఈ గ్రూప్ లో చేరమని అడిగాను..వారూ ఈ గ్రూప్ లో చేరి..ఆడియో రూపం లో శ్రీ స్వామివారి చరిత్రను పోస్ట్ చేశారు..అంతే కాకుండా..మా తల్లిగారు వ్రాసిన శ్రీ శిరిడీ సాయినాథ భాగవతాన్ని కూడా ఆడియో రూపం లో జీవని గారు పోస్ట్ చేశారు..అలా గురుచరణ్ అనే సమూహములో సభ్యుడిగా మారి..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను, లీలలను ఆ గ్రూప్ సభ్యులకు చేరవేయడం ఇన్నాళ్లూ జరుగుతున్నది..
ఇలా ఉండగా ఒక నాలుగైదు నెలల క్రితం.."అంకుల్..నేను నందకిశోర్ ను మాట్లాడుతున్నాను..వచ్చే శనివారం నేనూ..మా స్నేహితుడూ ఇద్దరం కలిసి..మొగిలిచెర్ల వచ్చి..స్వామివారిని దర్శించుకుందాము అనుకుంటున్నాము..మీతో ముందుగా తెలియచేస్తున్నాను.." అన్నారు..నందకిశోర్ గారు తనకు సరిగా కళ్ళు కనబడవు అని చెప్పి వున్నారు కదా..మరి ఎలా వస్తున్నారో..అనే సందేహం కలిగింది..వస్తానని చెప్పారు కదా..వేచి చూద్దాం..అనుకున్నాను..
ఆ ప్రక్క శనివారం ఉదయం తొమ్మిదిన్నరకు స్వామివారి మందిరం వద్దకు వచ్చే బస్సు లో నందకిశోర్ గారు..వారి స్నేహితుడు..వీళ్ళిద్దరికీ తోడుగా మరో పదిహేనేళ్ల కుర్రవాడు దిగారు..నందకిశోర్ గారు, వారి స్నేహితుడు పూర్తిగా అంధులు..స్వామివారి మందిరం లోపలికి వచ్చి..నేను ఎక్కడ వుంటానో విచారించి..ఆ పిల్లవాడి సహాయంతో నా వద్దకు నడచి వచ్చారు..నేను నందకిశోర్ గారిని..వారి స్నేహితుడిని చూసి..పూర్తి ఆశ్చర్యం లో మునిగిపోయి వున్నాను.."ప్రయాణం బాగా జరిగిందా.." అని మాత్రం అడిగాను.."నిన్నరాత్రి నేను హైదరాబాద్ లో బస్సు ఎక్కాను అంకుల్..ఒంగోలు లో నా స్నేహితుడు..మా ఇద్దరికీ తోడుగా ఈ పిల్లవాడు కలిశారు..ముగ్గురం కలిసి వచ్చాము..మీ పోస్టుల ద్వారా ఈ స్వామివారి లీలలు తెలుసుకుంటున్నాము..ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్లాలని బలంగా అనిపించింది..ఈరోజు వస్తే..స్వామివారి పల్లకీసేవ కూడా వుంటుంది అని విన్నాను..అందులో కూడా పాల్గొని..రేపు ఉదయం స్వామివారి సమాధి వద్దకు వెళ్లి వస్తాము.." అన్నారు..
స్వామివారి పల్లకీసేవ..స్వామివారి సమాధి..ఈ రెండూ కళ్ళతో చూసి అనుభూతి చెందడం అందరికీ సాధ్యమయ్యే పని..మరి నందకిశోర్ గారు..వారి స్నేహితుడూ ఎలా దర్శించుకుందామని అనుకుంటున్నారో..అని అనిపించింది..ఆరోజు సాయంత్రం స్వామివారి పల్లకీసేవ వద్ద ఆ ఇద్దరూ భక్తి శ్రద్ధలతో కూర్చున్నారు...వాళ్ళిద్దరినీ బాగా గమనిస్తూనే వున్నాను..బాహ్య దృష్టి లేకపోయినా..మనో నేత్రం తో తనను దర్శించే భాగ్యాన్ని వారికి కల్పించాడమో ఆ స్వామివారు అని మా దంపతులము అనుకున్నాము..పల్లకీసేవ తరువాత..నా వద్దకు వచ్చి.."చాలా బాగా జరిగింది అంకుల్.." అని చెప్పారు..
ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం ఐదు గంటలకే ఆ ఇద్దరూ తయారయ్యి మందిరం లోకి వచ్చారు..స్వామివారి ప్రభాతసేవ లో జరిగే విశేష హారతుల అనంతరం..తమ సహాయకుడిని తీసుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..దర్శించుకొని వచ్చారు..నిజమే..వాళ్లిద్దరూ స్వామివారి సమాధిని ముట్టుకొని...నమస్కారం చేసుకొని..తమ అంతర్దృష్టి తో దర్శించి..తృప్తిగా ఇవతలకు వచ్చారు...వారి అంధత్వం వారికి అడ్డురాలేదు..మాకు ఆశ్చర్యం తో నోట మాట కూడా రావడం ఆగిపోయింది..
ఈ మొత్తం తతంగం చూస్తూ ఉన్న మా దంపతులకు..మా సిబ్బందికి ఒక విషయం బాగా అర్ధమయింది..స్వామివారి మీద ఎనలేని భక్తి ఉంటే..వారికి చూపు లేకపోయినా..ఆయన వారికి తన దర్శనభాగ్యాన్ని కలిగిస్తారు..చూపు చక్కగా ఉండికూడా..కొందరు దైవాన్ని చూడలేరు..కానీ దైవం తలుచుకుంటే..అంధులు సైతం దైవాన్ని దర్శించే అదృష్టానికి నోచుకుంటారు..అనే విషయాన్ని మా కళ్ళకు కట్టినట్లుగా స్వామివారు సోదాహరణంగా చూపించారు..
మరి కొద్దిసేపటి తరువాత..నందకిశోర్ గారు నావద్దకు వచ్చి.."అంకుల్..మళ్లీ అతి త్వరలో స్వామివారి దర్శనానికి వస్తాము..మీ సహకారం మరువలేనిది.." అని చెపుతుంటే..ఆ భక్తిపరుడి వినయపు మాటలకు కళ్ళకు నీళ్లు వచ్చాయి.."అలాగే తప్పకుండా రండి..మీరు వచ్చేముందు తెలియచేయండి.." అని మాత్రం అనగలిగాను..
శ్రీ నందకిశోర్ గారికి మరలా స్వామివారు ఎప్పుడు తన దర్శనాన్ని కలిగిస్తారో అని నేను కూడా ఎదురుచూస్తూ వున్నాను..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..99089 73699 & 94402 66380).
*జైశ్రీరామ్*
25-5-2020
అభ్యాసం-18
*సుభాషితం*
"యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః |
యత్రైతాస్తు నపూజ్యంతే
సర్వాస్తత్రా ఫలాక్రియః"||
(మనువు)
*భావం*
ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారు.
ఎక్కడ స్త్రీలు పూజింపబడరో అక్కడ చేసిన కార్యాలన్నీ,పుణ్యకార్యాలతో సహా నిష్ఫలమౌతాయి.
*అమృతవచనం*
*శ్రీమాత* ఇలా అన్నారు:
ప్రపంచపు మేలుకోరి *భారతదేశాన్ని* రక్ఛించుకోవాలి.ఎందుకంటే ప్రపంచానికి శాంతిని,ఒక నూతన వ్యవస్థను ఒక్క భారతదేశం మాత్రమే అందించ గలుగుతుంది.భారతదేశ భవిష్యత్తు చాలా స్పష్టంగా ఉంది.భారతదేశం జగద్గురువు.ప్రపంచ భవిష్యత్ వ్యవస్థ కూడా భారతదేశం మీదనే ఆధారపడి ఉంది.ఆథ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంలో నిలబెట్టే ప్రయత్నం కేవలం భారతదేశమే చేస్తున్నది.
శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి
.
---౦--- ఆలోచనాలోచనాలు---౦---"" అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక "" "" ఉద్,యానమ్ తేపురుష న,అవయానమ్""--- అథర్వణ వేదం. --- ఓ మనిషీ! నీ గమనం పైకి, పైపైకి; క్రిందివైపుకు కాదు. ( సంస్కృత సూక్తి సుధ) 1* మత్స్యన్యాయేనభక్షేరన్,యది దండో నపాలయేత్. ----రాజు గనుక దండాన్ని(కఠినమైన శిక్షలను) అమలుపరచకపోతే, పెద్ద చేప చిన్న చేపలను మ్రింగేవిధంగా బలవంతులు, బలహీనులను నమిలి మింగేస్తారు సుమా! 2* మనః పూతం సమాచరేత్.--- పవిత్రమైన మనస్సుతో కార్యాచరణను ప్రారంభించాలి. 3* మనస్యన్యత్, వచస్యన్యత్,కర్మణ్యన్యత్ దురాత్మానామ్--- దుర్మార్గుల మనస్సు, మాట, చేష్టలు వేర్వేరుగా ఉంటాయి. 4* ఉపకారోహి నీచానాం, అపకారోహి జాయతే!--- వాల్మీకి రామాయణం. నీచులకు చేసే ఉపకారం, అపకారాన్నే కలిగిస్తుంది సుమా! 5* ఋషిః సయో మమర్హిత--- మానవజాతికి మేలుచేసేవాడే నిజమైన ఋషి. --- ఋగ్వేదం. 6* నికటస్థం గరీయాం సమపితోకో నమన్యతే! పవిత్రామపి యన్మర్త్యా ననమస్యంతి జాహ్నవీం!! తనకు దగ్గరగా ఉన్నవారి గొప్పతనం తనకు తెలియదు. గుర్తించలేరు కూడా! బాగా దగ్గరవున్నా గంగానదికి ప్రజలు నమస్కరించరు కదా! 7* వరం సఖే సత్పురుషాఏ మానితో! న నీచ సంసర్గ గుణైరలంకృతః!! నీచులతో పొగిడించుకొనేకంటే సజ్జనుల నుండి అవమానం పొందడమే మేలు! 8* విద్యా వివాదాయ, ధనం మదాయ,-- శక్తిః పరేషాం పరపీడనాయ! ఖలస్య సాధోర్విపరీతమేతత్, జ్ఞానాయ,దానాయచ రక్షణాయ!! దుర్జనుని విద్య వివాదానికి, ధనం మదానికి, శక్తి పరపీడనకు ఉపకరిస్తుంది. సజ్జనుని విద్య జ్ఞానాభివృద్ధికి, ధనం దానానికి, శక్తి పరుల రక్షణకు ఉపయోగపడుతుంది. 9* అకారణం రూపమకారణం కులం! మహత్సు నీచేషుచ కర్మ శోభతే!! అందంకానీ, కులంగానీ గౌరవానికి హేతువు కాదు. ఇవేవీలేకపోయినా ఎవరు చేసిన పనులే వాళ్ళగౌరవానికి అర్హతను సంపాదించిపెడతాయి. 10* అంధః తమః ప్రవిశంతియే అవిద్యాముపాసతే! --- ఈశావాస్యోపనిషత్. అవిద్య(అజ్ఞానాన్ని) ఆరాధించేవారు కారుచీకటిలోకి ప్రవేశిస్తారు. 11* అంభసః ప్రస్వతీరష్టారనావ మదితేపిబేడ్. ---చరక సంహిత. ప్రొద్దు పొడవకముందే (మనుషులు) ఎనిమిది పుడిసెళ్ళ నీరు త్రాగాలి.( పుడిసె అనగా నోటినిండా పట్టే నీరు అని అర్థం) 12* అకారణం విద్విషంతో లజ్జంతేన కథం భువి? --- ఈ లోకంలో అకారణంగా ద్వేషించేవారు తమను చూసి తామే సిగ్గు పడాలి. తేది 3--12--2023, ఆదివారం, శుభోదయం.
"పంచారామాలు" అనగా ఏమిటి ?
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధమైన "శైవక్షేత్రాలను", "పంచారామాలు' అని పిలుస్తారు. 'పంచారామాలు' ఏర్పడుటకు, స్కందపురాణంలో ఇలా వివరించబడి యున్నది..
పూర్వం.. తారకాసురుడు అను రాక్షసుడు, 'శివుని' గురించి ఘోర తపస్సు చేసి 'శివుని' ఆత్మలింగము సంపాదిస్తాడు. దీనితో వీర గర్వముతో, దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా, ఇందుకు దేవతలు, విష్ణుమూర్తిని ప్రార్ధించగా, 'శివపార్వతుల' వల్ల కలిగిన కుమారుడు "కుమారస్వామి" వల్లనే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని తెలిపి "కుమారస్వామిని" యుద్ధానికి పంపుతారు. యుద్ధమునందు "కుమారస్వామి", తారకాసురుని కంఠంలో గల 'ఆత్మలింగమును' చేధిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ 'లింగమును' చేధిస్తాడు. దీనితో తారకాసురుడు మరణిస్తాడు.
చేధిoచే సమయంల్లో, ఆ.. 'ఆత్మలింగము' వేరై, ఐదు ప్రదేశములలో పడుతాయి. తరువాత వాటిని ఆ...యా...ప్రదేశాలలో, దేవతలు లింగ ప్రతిష్ఠ కావిస్తారు.. కనుక ఈ అయిదు 'క్షేత్రాలను', 'పంచారామాలు' అని పిలుస్తారు..
1. దాక్షారామము :
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు.
స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరిఇయు సగభాగం నలుపుతో ఉంటుంది.
ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన, భీముడు నిర్మించాడని పురాణాలలో చెప్పబడి యున్నది. అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతో మంది దేవతలు, రాజులు స్వామి వారిని దర్శించుకొని, తరించారని తన 'భీమేశ్వర పురాణంలో' చెప్పబడి యున్నది. ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ "మహాశివరాత్రి" పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
2. అమరారామము :
పంచారామల్లో రెండవదైన 'అమరారామము', గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీతీరమునందు వెలసినది. ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో, తెల్లగా మెరుస్తూ ఉంటుంది.
ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' చేత ప్రతిష్టించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి యున్నది.
3. క్షీరారామము :
క్షీరారామము, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ 'శివుని' మూర్తిని "శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి" అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో 'సీతారాములు' కలిసి ప్రతిష్ఠించారట. ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది.
'శివుడు' తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట. క్షీరం అనగా పాలు, దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.
క్రమంగా 'క్షీరపురి' కాస్తా 'పాలకొల్లుగా' మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో '9' గోపురాలుతో కట్టబడింది.
4. సోమారామము :
పంచరామాల్లో నాల్గవదైన "సోమారామము". పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" అని పిలుస్తారు. ఇచ్చట 'శివలింగానికి' ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే 'శివలింగం', అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
ఇక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్టించాడు. చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి 'సోమారామము' అని పేరు వచ్చింది.
5. కుమారభీమారామము :
పంచారామాల్లో చివరిది, 5వది అయిన 'కుమారభీమారామము', తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు. ఇక్కడ స్వామిని "కాల బైరవుడు" అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి 'శివలింగం' సున్నపురాయితో చేసినదిలాగా ఉంటుంది. ఈ ఆలయంలో "మహశివరాత్రి" ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ -
ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును.
ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును .
సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును .
నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య .
అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు.
ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
*#కృష్ణా_నీ_మీద_మనసాయెరా #గోపికావిలాపము*
( కందములలో శతకము - 05 )
🌺🍃 *----------------* 🍃🌺
🌹🙏🌹
*మధురంబానల్లని సిగ ,*
*మధురము శిఖిపింఛమదియె , మణిమకుటమునున్ .*
*మదురము లలాట తిలకము ,*
*మధురంబా కనుగవలును , మరువను కృష్ణా !*
( 41 )
🌹🙏🌹( భావము )
నల్లని నీ కురుల ముడి , ఆ కురులపై మెరిసే నెమలి పింఛము,
మణులతో పొదిగిన ఆ కిరీటము ,
నుదుటిపై బహు అందముగా తీర్చిదిద్దిన ఆ తిలకము
ఆ చక్కని కనుదోయి , అతి మనోహరముగా ఉన్నవి ! 🙏
అవి నేను మరచిపోలేను *కృష్ణా !!*
🌹🙏🌹
*చెక్కిలి నునుపులు మధురము ,*
*చక్కని నక్రంబు బోలె సంపెంగవలెన్ ,*
*జుక్కల వలె గుండలములు ,*
*మక్కువ జూపెడి నగవులు , మధురము కృష్ణా !*
( 42 )
🌹🙏🌹( భావము )
నీ నునుపైన మెరిసెడి చెంపలు , సంపెంగను పోలుచున్న ఆ నాశికము ,
రెండు చెవులకూ నక్షత్ర కాంతులీనుచూ ఊగుతున్న కుండలాలు ,
మరలా మరలా చూడాలని ప్రేమము పుట్టించే ఆ చిరు దరహాసము ,
అన్నీ అతి మనోహరమైనవి *కృష్ణా !*
🌹🙏🌹
*అధరంబనితర మధురం-*
*బధరముపై మురళినాద మతిమధురంబై ,*
*సుధలను గురిపించెడి నీ*
*మధుకర రూపమును గొల్తు , మన్మధ కృష్ణా !*
( 43 )
🌹🙏🌹( భావము )
ఇక నీ పెదవులు పోలికకు అందనంత మధురము .🙏
ఆ పెదవులపై నువ్వు పలికించే మురళీనాదము ఇంకా మధురాతి మధురము .🙏
తేనియలను కురిపిస్తున్నదా అన్నట్లుగా ఉండెడి నీ రూపమును
సదా ధ్యానించుకొనుచున్నాను ,
మన్మథాకారుడవైన *ఓ కృష్ణా !*
🌹🙏🌹
*పమ్ముకొనిన యా భుజములు ,*
*సొమ్ములు ధరియించి ఛాతి సొగసును జూపెన్ ,*
*గమ్మని మేని సుగంధము ,*
*ఝుమ్మనగా రేచె మదిన , జొకములు కృష్ణా !*
( 44 )
🌹🙏🌹( భావము )
ఉప్పొంగినట్లుగా ఉన్న ఆ భుజములు ,
రత్న హారములు ధరించగా మెరుస్తున్న నీ ఛాతి అందమంటే ఏమిటో చూపిస్తున్నది .🙏
అసలు నీ మేని సుగంధమును తలుచుకుంటే
మదిలో ఝుమ్మని రేగుతాయి లలితమైన మదన భావనలెన్నో *కృష్ణా !*🙏
🌹🙏🌹
*నడుముకు వడ్డాణముతో ,*
*వడివడి తిరుగాడు సొగసు వలపును రేపెన్ .*
*బడిపడి తిరిగితినయ నే*
*బిడియపడని కామినివలె , బ్రీతిగ కృష్ణా !*
( 45 )
🌹🙏🌹( భావము )
నడుముకు కట్టిన ఆ వడ్డాణముతో , గబగబా నువ్వు అడుగులు వేయుచూ తిరుగాడుట చూస్తుంటే ,
ఆ ఆందములకు నాలో నీపై ప్రేమ ఇంకా ఇంకా పెరిగిపోతున్నది .🙏
అందుకేనేమో నీ వెనుక పడి మరీ తిరుగుతున్నాను ,
ఏమాత్రము సిగ్గుపడని కామిని లాగా , నీవే నాకు ప్రీతి అనుచూ *కృష్ణా !*
🌹🙏🌹
*ఊరువులవియే చూచితి ,*
*నేరుపుగా నీ మగసిరి నిరుపమమనెదన్ ,*
*జేరి తలవాల్చ నీయర*
*సారముగా దాసినౌదు , సత్యము కృష్ణా !*
( 46 )
🌹🙏🌹( భావము )
బలమైన నీ తొడలను చూడగా అనిపిస్తున్నది
మగతనమనగా నీదే అని దానికి సాటి ఇంకొకటి లేదని !🙏
ఆ తోడలపై నా తలవాల్చి సేదతీరాలని ఆశ ,
దానికోసము గుత్తముగా నీకు ఊడిగము చేయుటకు నేను సిద్ధము ,
ఇది నిజము *కృష్ణా !*
🌹🙏🌹
*నిలువెత్తు మన్మధుడవై ,*
*చెలికత్తెల కడను జేరి, చెలికానిగ నూ-*
*యలకెత్తి సరసములతో*
*జలిపొత్తులనెన్నొ చూపు , జాణవు కృష్ణా !!*
( 47 )
🌹🙏🌹( భావము )
నిలువత్తు మన్మధ రూపుడవై చెలులవద్ద నీవు
సరసములతో వారిని ఉయలలూగించు వాడవు ,
వారి చలికి వేడిమి నిచ్చే పోందువు ,
బహు చతురుత చూపించెడివాడవు నీవు *కృష్ణా !*
🌹🙏🌹
*ఆపాదమస్తకంబును*
*నేపారుచు నెంత చూచి నివ్వెర వడినన్ ,*
*నా పాలిట దైవమనెడి*
*యాపాదన మద్భుతమిల , నందును గృష్ణా !*
( 48 )
🌹🙏🌹( భావము )
నిన్ను క్రింది నుంచీ పై దాకా కళ్ళప్పగించి ఎంతగానో
అతిశయమును పొందినా ,
చివరకు నాకు నీవు దైవమువంటి వాడవు
అను భావన కలిగించుకొనుటయే
అద్భుతము కదా *కృష్ణా !*
🌹🙏🌹
*పాదము లొత్తెడి భాగ్యము ,*
*నీ దాసిగ నుండు సుఖమె నిజసుఖమౌ నా*
*పాదములే సర్వస్వము ,*
*లేదయ యితరమగు చింత , లేదయ కృష్ణా !*
( 49 )
🌹🙏🌹( భావము )
నీ పాదములను ఒత్తగలిగే భాగ్యమే భాగ్యము .🙏
నీకు దాసిగా ఉండుటలో కలిగే ఆనందమే నిజమైన ఆనందము .🙏
అటువంటి నీ పాదములే నాకు సర్వస్వము .🙏
ఇది తప్ప నాకు ఇక వేరు ఆలోచన లేదు కృష్ణా ! లేనే లేదు *కృష్ణా !*
🌹🙏🌹
*చెంతన నుండగ జాలును ,*
*బంతము బోకుండ జేతు బరిచర్యలు , నా*
*యంతము నీకడనగుచో*
*నంతయె చాలు , నికనేమి యడుగను గృష్ణా !*
( 50 )
🌹🙏🌹( భావము )
నీ సన్నిధిలో నేను ఉండగలిగితే చాలు .🙏
నీకు అన్ని రకములైన సేవలనూ ఏ పంతానికీ పోకుండా చేసెదను.🙏
నా తుది శ్వాస నీ సన్నిధిలోనే విడువగలిగితే చాలు !🙏
ఆ విధముగా నాపై దయచూపు నిన్ను వేరే ఇక ఏమియూ అడుగను *కృష్ణా !*
🌹🙏🌹
*హరే కృష్ణ ! హరే కృష్ణ !* 🙏
పద్యములు 51 to 60 రేపటి శీర్షికలో .....
మీ ఆశీర్వాదములను కోరుకొనుచూ ..
మీ సూచనలు అభిప్రాయములు సదా స్వాగతిస్తూ ...
భవదీయుడు
✍ *--వేణుగోపాల్ యెల్లేపెద్ది*
*బుద్ధుడు కుల వ్యవస్థపై యుద్ధం చేశాడా?*
--------------------------
బుద్ధుడు రాజ్యాన్ని విడిచి వచ్చేశాక కొందరు బ్రాహ్మణ సన్యాసుల సాహచర్యం లేదా శిష్యరికంలో ధ్యాన జీవనాన్ని అనుసరించాడు అని అంతర్జాతీయ బుద్ధ చరిత్రకారులు AK Coomaraswamy, I B Horner లు తమ Gotama the Buddha పుస్తకంలో తెలియజెప్పారు. Dwight Goddard తన A Buddhist Bibleలో బుద్ధుడు బోధిని పొందడానికి ముందు కొందరు బ్రాహ్మణుల్ని ఆశ్రయించాడు అని తెలియజెప్పాడు.
*'బుద్ధుడు కుల వ్యవస్థపై యుద్ధం చేశాడు అన్న తప్పుడు అభిప్రాయం చలామణిలో ఉంది'* అని అంటూ AK Coomaraswamy, I B Horner లు చెప్పాక, జన్మతః వచ్చిన బ్రాహ్మణ్యానికి ఆత్మ జ్ఞానంవల్ల వచ్చే బ్రాహ్మణ్యానికి ఉన్న తేడాను బుద్ధుడు గుర్తించాడు అనీ చెప్పారు. బ్రాహ్మణ్యం అన్న ధార్మిక లేదా ఆధ్యాత్మిక వృత్తి ఏ వర్గంలో పుట్టిన వ్యక్తికైనా తెరవబడే ఉంటుంది అంటూ బుద్ధుడు చెప్పాడని అఙ్గుత్తర-నికాయనూ, సమ్యుత్త-నికాయనూ ఉటంకిస్తూ AK Coomaraswamy, I B Horner లు తెలియజేశారు.
సుత్త నిపాతంలోనూ, దమ్మ పదంలోనూ బుద్ధుడు బ్రాహ్మణ్యం గురించి విశదం చేశాడు. మిలిందపన్హాను ఉటంకిస్తూ *'బుద్ధుడు వ్యక్తిత్వం పరంగా బ్రాహ్మణుడు'* అని AK Coomaraswamy, I B Horner లు స్పష్టం చేశారు. మిలిందపన్హా అని అన్నప్పుడు నాగసేనుడు ఈ సత్యాన్ని మొదటగా చెప్పినట్టుగా తెలుసుకోవాలి.
బుద్ధుడి 10మంది శిష్యుల్లో ముగ్గురు క్షత్రియులు, ఒకరు మంగలి, ఆరుగురు బ్రాహ్మణులు. బౌద్ధానికి పునాదిగా, నిర్మాణంగా నెలకొన్న బౌద్ధ తాత్త్వికులు 12 మంది బ్రాహ్మణులు, నలుగురు క్షత్రియులు.
బుద్ధుడు కుల పరమైన అసమానతల జోలికి పోలేదు. కులాల, వర్గాల ప్రసక్తి, ప్రస్తావన బుద్ధుడికి సంబంధించింది కాదు. Koanraad Elst వంటి అంతర్జాతీయ బుద్ధ, బౌద్ధ పరిశోధకులు ఈ వాస్తవాన్ని గట్టిగా తెలియజేస్తున్నారు.బుద్ధుడు కులవాది కాదు; బుద్ధుడికి కుల వ్యాధి లేదు.
ప్రధాన జన జీవన స్రవంతి నుంచి కొన్ని వర్గాలను వేరు చేసి మనదేశంలో సామాజిక సామరస్యాన్ని చెడగొట్టి, దేశంలోని ప్రధాన సాంస్కృతిక వ్యవస్థ అయిన సనాతనాన్ని దెబ్బతీసి తద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలన్న పన్నాగంతో కొన్ని దశాబ్దుల క్రితం కొన్ని దుష్ట శక్తులు బుద్ధుణ్ణి కుల పరంగా వక్రీకరించాయి;
కృతకంగా కొన్ని వర్గాలకు, కులాలకు బుద్ధుణ్ణి ఆపాదించి ప్రజల్ని దారుణంగా వంచించాయి. బుద్ధుడు కేంద్రంగా మనదేశంలో కుల కుట్ర జరిగింది. బుద్ధుడు ఏ కులానికో, ఏ వర్గానికో ప్రతీక కాదు; బుద్ధుడు ఏ కులానికో, ఏ వర్గానికో చిహ్నం కాదు.బుద్ధుడు కులం వ్యక్తి కాదు;
బుద్ధుడు ధర్మం వ్యక్తి.
బుద్ధుడు కుల వ్యవస్థపై ఏ యుద్ధమూ చెయ్యలేదు.
- రోచిష్మాన్
అజినో మోటో... మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్లో టెస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవ్వడానికి కారణం ఫేర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి, షుగర్లకి రోగిష్ఠులును చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్లో వంట వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. చైనాలో ఇది వాడితే ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది కానీ భారతదేశంలో దీనికి ఇంకా వెలుగులో తీసుకురాలేదు. ఈ టెస్ట్ సాల్ట్ వేసిన, ఏ భోజనం ఒక 40 రోజుల్లో తిన్నారంటే జీవితాంతం బీపీతో, షుగర్తో బాధపదడం తప్పదు. ఈ విషయాన్ని మీడియా మాధ్యమాల్లో చర్చించి దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంగా తీసుకొస్తే గాని ఈ భారత దేశంలో రోగిష్టులు తగ్గరని కొన్ని సామాజిక సంస్థలు కూడా ఢిల్లీలో చర్చించాయి. కానీ మన ప్రభుత్వం దీనికి నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నది. ఈ టేస్టెడ్ సాల్ట్ వల్ల మన కొన్ని వేల రుచులను గుర్తించగలిగే మన నాలుక బండ పారిపోవడమే కాకుండా మేధోశక్తిని కూడా నాశనం చేస్తుంది. దీనిని మన భారతీయులందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. జైహింద్
**********
*శుభోదయం*
*********
సంధ్యా వందన
మరియు ఇతర
పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ.03.12.2023
ఆది వారం (భాను వాసరే)
*************
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరదృతౌ
కార్తీక మాసే కృష్ణ పక్షే షష్ఠ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
భాను వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
ఇతర పూజలకు
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరత్ ఋతౌ కార్తీక మాసే కృష్ణ పక్షే షష్ఠ్యాం
భాను వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.6.18
సూ.అ.5.20
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు
కార్తీక మాసం
కృష్ణ పక్షం షష్ఠి సా.6.23 వరకు.
ఆది వారం.
నక్షత్రం ఆశ్రేష రా.9.24 వరకు.
అమృతం రా. 7.39 ల 9.25 వరకు.
దుర్ముహూర్తం సా. 3.51 ల 4.35 వరకు.
వర్జ్యం ఉ. 9.08 ల 10.53 వరకు.
యోగం ఐంద్రం రా.9.31 వరకు.
కరణం వనజి సా.6.23 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.
రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు.
గుళిక కాలం మ. 3.00 ల 4.30 వరకు.
యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు.
***********
పుణ్యతిధి కార్తీక బ.షష్ఠి.
.**********
*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,
(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)
S2,/C92, 6 -3 -1599/92,బి
M3 66579.
.**********
*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*
వారి
*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*
*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును*
*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*
*సంప్రదించండి*
ఫోన్(చరవాణి) నెం లను
*9030293127/9959599505
*.**************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏
03-12-2023
రాశి ఫలితాలు
భాను వాసరః (ఆదివారం )
మేషం
దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
--------------------------------------
వృషభం
మిత్రుల సహాయంతో కొన్ని ప నులు పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేయనుకోవాలి.
------------------------------------
మిధునం
కుటుంబ సభ్యులతో విబేధాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులను కొంత మందకోడీగా సాగుతాయి. అన్నిరంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
--------------------------------------
కర్కాటకం
వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. భూ క్రయవిక్రయాలలో లాభాలు అందుతాయి. అధికారులు అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. --------------------------------------
సింహం
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితులు నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. ఇంటా బయట సమస్యల నుంచి బయటపడతారు.
-------------------------------------
కన్య
సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలం లో పూర్తి అవుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.
------------------------------------
తుల
పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
---------------------------------------
వృశ్చికం
సంతాన విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది. దైవ అనుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు.
---------------------------------------
ధనస్సు
వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అకారణ వివాదాలు కలుగుతాయి.
--------------------------------------
మకరం
మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై అశ్రద్ధ చేయడం మంచిది కాదు.
-------------------------------------
కుంభం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయం లో శ్రధ్ధ వహించాలి. అన్ని రంగాల వారికి అనువైన కాలం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో వివాదాలు తొలగుతాయి.
---------------------------------------
మీనం
ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషం గా గడుపుతారు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహంలో శుభకార్యాల గూర్చి చర్చ జరుగుతుంది.
---------------------------------------
ఈ రోజు పంచాంగం 03.12.2023 Sunday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు కార్తీక మాస కృష్ణ పక్ష: షష్థీ తిధి భాను వాసర: ఆశ్లెష నక్షత్రం ఇంద్ర యోగ: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.
షష్థి రాత్రి 07:29 వరకు
ఆశ్లెష రాత్రి 09:36 వరకు
సూర్యోదయం : 06:35
సూర్యాస్తమయం : 05:36
వర్జ్యం : పగలు 09:10 నుండి 10:56 వరకు.
దుర్ముహూర్తం : సాయంత్రం 04:08 నుండి 04:52 వరకు.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం : మద్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
*తండ్రి ఆశీర్వాద బలం.*
.....ప్రాణం విడిచే ముందు ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “బాబూ, నేను ఏ సంపదను ఇవ్వలేకపోయాను. గానీ జీవితాంతం ఎల్లప్పుడూ నిజాయితీగా, నా వ్యాపారంలో ఉన్నాను.
ఆ నిజాయితీ బలంతో నీకు ఆశీర్వదిస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది ! " అని కుమారుడి తలపై చేయివేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుదిశ్వాస విడిచాడు.
ధరమ్ పాల్ భక్తితో తన తండ్రి అంత్య క్రియలు పూర్తి చేశాడు.
ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ తోపుడు బండిపై స్వీట్ వ్యాపారం ప్రారంభించాడు. కొద్దిరోజుల లోనే తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు. సరుకుల నాణ్యత వలన క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది. మూడేళ్ళకు నగరంలోని ఐశ్వర్యవంతులలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను పూర్తిగా విశ్వసించాడు.
తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ, ప్రామాణ్యతను కానీ కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి.
ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు.
ఒకరోజు ఒక స్నేహితుడు అతనితో “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?”
ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను."
ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని వెనుకగా గేలి చేసినా పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు.
మరికొన్ని సంవత్సరాల్లో తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి.
*నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్ కుతూహలపడ్డాడు*.
ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు.
*ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని చూసుకొని చాలా గర్వపడుతున్నాడని,* ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు.
భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్‌కు రవాణా చేసి విక్రయించమని సలహా ఇచ్చాడు.
ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే.
తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు.
నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు.
జాంజిబార్ లో ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారిపై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు. వారంతా భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు.
ఎవరని వాకబు చేయగా ఆయన స్వయంగా సుల్తాన్ అని చెప్పారు.
సుల్తాన్ కి ఎదురుపడి ధరమ్ పాల్ నమస్కరించి "నేను భారతదేశంలోని గుజరాత్‌లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను."
సుల్తాన్ అతనితో తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు.
సుల్తాన్‌తో వినయంతో వందలాది మంది సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని అడిగాడు.
సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు.
ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు.
అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం.
ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్ చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”.
అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు.
" లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్.
అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.
“ ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక మీరు ఏం సంపాదిస్తారు? ”
ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.”
సుల్తాన్ ఇలా అడిగాడు, “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!"
అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, *“మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు"*, అని ఆ మాటలు మాట్లాడుతూ, ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు.
ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి, ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.
ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది.
సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు.
“ఇది మహాద్భుతం ! ఓ అల్లా , చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు! ” .
అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు.
అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, " ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు.
ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు."
సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు.
కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు.
*తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం.*
వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.
*ఈ ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలుతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.*
_*Namasthe*_🙏🏻🎊
“You can get everything in life you want if you will just help enough other people get what they want.”
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
🚩అనగనగా ఒక కాలంలో......
ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉండేవాడు. అతను ఒక పెంటియమ్
కంప్యూటర్ పెట్టుకొని ఒక నది ఒడ్డున చెట్టు కింద కూర్చుని కొత్తకొత్త
ప్రోగ్రామ్‌లు తయారు చేసేవాడు. వాటిని దగ్గరున్న సంతలో అమ్మి
బియ్యం నూనె పప్పులూ కొనుక్కుని జీవనం సాగించేవాడు.
ఒకరోజు కంప్యూటర్ మీద పని చేసుకుంటుండగా అది జారి నదిలో
పడిపోయింది. అక్కడ నది చాలా లోతు. దిగి తీయడం అసాధ్యం.
ఏం చేయాలా అని దిగులుపడుతుంటే చిన్నప్పుడు చదువుకున్న
మూడు గొడ్డళ్ళ కథ గుర్తొచ్చింది అతనికి. వెంటనే నదీ మాతను
ప్రార్థించసాగాడు. కాసేపటికి ఆమె ప్రత్యక్షమై ఆ ఇంజనీర్ కొచ్చిన కష్టం
గురించి తెలుసుకుని కట్టెల కొట్టేవాడ్ని పరీక్షించినట్టుగానే ఇతని
నిజాయితీని కూడా పరీక్షించాలనుకుంది.
ఒక అగ్గిపెట్టె చూపించి "ఇదా నీ కంప్యూటర్" అని అడిగింది.
ఇదేంటి...దేవతకు కంప్యూటరంటే ఏమిటో కూడా తెలియదా అని
మనసులో ఆశ్చర్యపోతూ "కాదు" అన్నాడు.
ఈ సారి ఆమె జేబులో పట్టే చిన్న క్యాలిక్యులేటర్ చూపించి "ఇదా"
అనడిగింది.
"అబ్బే కాదు" అన్నాడతను.
మూడోసారి ఇంజనీర్ వాడుతున్న కంప్యూటర్‌నే నీళ్ళలో నుంచి బయటికి
తీసి "నీ వస్తువు ఇదేనా" అనడిగింది.
"అవును" అన్నాడతను నిట్టూరుస్తూ.
.
ఆ నిట్టూర్పును గమనించకుండా అతని నిజాయితీకి మెచ్చి నదీ దేవత
అతనికి ఆ మూడు వస్తువులూ ఇవ్వబోయింది. ఇంతలో ఇంజనీర్
ఉండబట్టలేక "నా అసలు వస్తువును తీసివ్వడానికి ముందు ఇంకా
మేలైన కంప్యూటర్లను కదా నువ్వు నాకు చూపించాల్సింది" అని
అడిగాడు. గొడ్డళ్ళ కథలో అలా జరిగిందనే కదా అతను అసలు ఆమెను
ప్రార్థించడం మొదలు పెట్టింది!
నదీ దేవతకు కోపమొచ్చింది. "గాడిదా ఆ విషయం నాకు తెలుసురా.
నీకు మొదట చూపించిన రెండూ ట్రిలెనియం, బిలెనియం
కంప్యూటర్లురా. ఐ.బి.ఎం వారి లేటెస్ట్ కంప్యూటర్లు రా అవి........" అని
తిట్టి అంతర్థానమైపోయింది.
నీతి: టెక్నాలజీలో వస్తున్న మార్పుల గురించి సంపూర్ణ అవగాహన
లేకపోతే నోరు తెరిచి నీ తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకోవడం కంటే
నోరు మూసుకుని నువ్వు జీనియస్‌వనే అభిప్రాయాన్నే ఇతరులకు
కలిగించడం మంచిది.
*** *** ***
ఒక్క టెక్నాలజీ అనే ఏముంది....ఏ విషయంలో అయినా అదే మంచిది.
తెలియనప్పుడు నోరు తెరిచి అభాసుపలయ్యేకంటే మూసుకుని
ఆత్మగౌరవాన్ని ఉంచుకోవడమే ఉత్తమం.
***శ్రీ వి వి అప్పారావు గారి నుంచి సేకరించింది.
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*నేలమాళిగ..నిరంతర సాధన...*
*(నలభై ఆరవ రోజు)*
మొగలిచెర్ల ఫకీరు మాన్యం లో నిర్మిస్తున్న ఆశ్రమం దాదాపు పూర్తి కావొచ్చింది..శ్రీ స్వామివారు సాధన చేసుకుంటూనే..మరోవైపు తన అవసరాల కనుగుణంగా ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు..తూర్పు ముఖంగా ఒక గది..ముందు వరండా..వరండాలో ఆగ్నేయం వైపు ఒక చిన్న వంటగది..ఈశాన్యం లో బావి..చుట్టూరా ప్రహరీ గోడ..ప్రహరీ లో తూర్పు వైపు ద్వారం..ఇలా ఉండేది..
తాను సమాధి స్థితి నుంచి వెలుపలికి రాగానే..ముందుగా బావి వద్దకు వెళ్లి..తలారా స్నానం చేసేవారు..ఆ స్నానం చేయడం కూడా ఏదో త్వరగా ముగించినట్లు కాకుండా..నింపాదిగా..శ్రద్ధగా చేసేవారు..ఆరడుగుల పైనే పొడవున్న తెల్లని మేనిఛాయతో..బావి వద్ద నిలబడి రెండుచేతులతో బక్కెట్ పైకెత్తి పట్టుకొని..అందులోని నీటిని ధారగా తలమీద పోసుకునే వారు..పరమశివుడు తనకు తానే అభిషేకించుకుంటున్నాడా అనిపించేది ఆ దృశ్యం చూస్తే!..
ఆ తరువాత ఆశ్రమ ఆవరణ అంతా తిరుగుతూ వుండేవారు..ఫకీరు మాన్యం లోకి పశువులను మేపుకొనడానికి వచ్చిన పశువుల కాపరులు..ఆశ్రమ ప్రహరీ వద్దకు వచ్చి..ప్రహరీ మీదుగా లోపలికి చూసేవారు..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు తిరుగుతూ కనిపించేవారు..వీళ్ళను చూసి పలకరింపుగా నవ్వేవారు..బాగా ఉత్సాహంగా ఉన్నరోజు.. ఆ పశువుల కాపరుల తో మాట్లాడేవారు కూడా..వారి యోగక్షేమాలు విచారించేవారు..ఆ సమయంలో శ్రీ స్వామివారిని కలిసిన వారితో ..ఏ కల్మషమూ లేకుండా..నవ్వుతూ..హాయిగా మాట్లాడేవారు..
ఒక్కొక్కసారి శ్రీధరరావు దంపతులు అలాంటి సమయంలో రావడం జరిగితే..వారిని కూర్చోబెట్టి..అనర్గళంగా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను విడమరిచి చెప్పేవారు..ఆ చెప్పడంలో కూడా ఖంగు మనే కంఠస్వరంతో..ఎంతో వేదాంతాన్ని రంగరించి..వినసొంపుగా చెప్పేవారు..పట్టుమని ముప్పై యేళ్ళు కూడా లేని ఆ యువకుడిలో అంత జ్ఞానం ఎలా వచ్చిందీ అని వినే వారికి అనిపించేది..మహా మహా యోగులు..మహర్షులు చెప్పిన భాష్యాలను అలవోకగా అర్ధం తో సహా వివరించేవారు..ఆ ధారణాపటిమ దైవదత్తమే కానీ..మరేదీ కాదని ప్రభావతి గారు అనేవారు తమ పిల్లల తో..
శ్రీ స్వామివారికి ఆహారం ప్రతిరోజూ శ్రీధరరావు గారింటి నుంచే వచ్చేది..ఆయన ధ్యానం లో ఉన్నప్పుడు గది ముందు తలుపుదగ్గర పెట్టి వెళ్లే వాళ్ళు..తిరిగి సాయంత్రం ఆ అన్నం డబ్బా ను తీసుకెళ్లే వాళ్ళు..ఒక్కొక్కసారి ఆ డబ్బా లో ఉన్న ఆహారం అలానే ఉండేది..అంటే శ్రీ స్వామివారు ధ్యానం నుంచి వెలుపలికి రాలేదని అర్ధం..మరోసారి వరుసగా రెండు మూడు రోజులపాటు అలానే జరిగేది..శ్రీ స్వామివారు నిరాహారంగా ధ్యానం లోనే ఉండిపోయేవారు..ఆ తపోసాధన ఎంత తీవ్రంగా ఉండేదో..శ్రీ స్వామివారు ధ్యానం నుంచి లేచి వెలుపలికి వచ్చినప్పుడు దగ్గరగా గమనించిన వారికి అర్ధమయ్యేది..ముఖం లో ఒకవిధమైన తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది..దృష్టి కూడా దిగంతాలకు అవతలివైపు చూస్తున్నట్లు గోచరించేది..పద్మాసనం వేసుకొని హఠయోగంలో అలా నిటారుగా..కూర్చుని ఉండేవారేమో..రెండు తొడల మీదా పాదములు పెట్టుకున్నందువల్ల..కమిలిపోయి మచ్చలు ఏర్పడేవి..ఇవేవీ ఆయన మనసుకు తోచేవి కాదు..ధ్యానం..సమాధి స్థితి..అంతే!..అదే ధ్యాస!..తానొచ్చిన కార్యం పూర్తి కావాలంటే..తాను ఇంత సాధనా చేయాల్సిందే అన్నట్లుగా వుండేవారు..ఎవరితోనూ సంభాషించేవారు కాదు..ఒకవేళ శ్రీధరరావు దంపతులు రాదల్చుకున్నా..ఓ నాలుగైదు రోజులపాటు రావొద్దని చెప్పి పంపేవారు..ఎవరైనా వచ్చినా.. ప్రహరీ కున్న ద్వారం వద్దే వేచి చూసి..తిరిగి వెళ్లవలసిందే..
ఆశ్రమం లోని ప్రధాన గది లో నిర్మించుకున్న నేలమాళిగ లోనే ధ్యానానికి కూర్చుని..ఆ పైన ఒక చెక్క పలకను వేసుకునే వారు..అంటే..పూర్తిగా చీకటి గుహ లాంటి ప్రదేశాన్ని సృష్టించుకున్నారు..ఆ లోపల కూర్చుని ధ్యానం చేయడం మానవమాత్రులకు సాధ్యం కాదు..ఈవిషయంలో శ్రీధరరావు దంపతులకు ఒక భయం పట్టుకుంది..ఊపిరాడని స్థితి వస్తే ఎట్లా?..అని..ఆ దంపతులు తల్లడిల్లిపోయారు..ఆ సందేహాన్ని శ్రీ స్వామివారు ఎంత చాకచక్యంగా వాళ్లకు అర్ధమయ్యేలా నివృత్తి చేసారో.. రేపటి భాగంలో చదువుకుందాము..
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
ఆదివారం, డిసెంబరు 3, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
కార్తీక మాసం - బహుళ పక్షం
తిథి:షష్ఠి సా6.23 వరకు
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:ఆశ్లేష రా9.24 వరకు
యోగం:ఐంద్రం రా9.31 వరకు
కరణం:వణిజ సా6.23 వరకు
వర్జ్యం:ఉ9.08 - 10.53
దుర్ముహూర్తము:మ3.51 - 4.35
అమృతకాలం:రా7.38 - 9.23
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి : వృశ్చికం
చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం:6.18
సూర్యాస్తమయం: 5.20
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *⚜️పెరియ పురాణం⚜️*
. *నాయనార్ల చరిత్ర - 19*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*19. చండేశ్వర నాయనారు*
నీయంజలూరు అనే గ్రామంలో ఎచ్చ దత్తన్, పవిత్ర అనే దంపతులు
శైవ సంప్రదాయాన్ని అనుసరిస్తూ జీవనం సాగిస్తూ వచ్చారు. పరమేశ్వరుని
అనుగ్రహం వలన వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు విచార శర్మ.
శివభక్తుడైన విచారశర్మ పశువులను మేపడమే పవిత్ర కార్యంగా నిర్వహిస్తూ వచ్చాడు. చేతిలో ఒక పొడవాటి కర్రను ధరించి పశువులను
పచ్చిక అధికంగా ఉన్న ప్రాంతాలకు తీసుకువెళ్లి మేపుతుండేవాడు. దీని
కారణంగా పశువులు ఆరోగ్యంగానూ, బలిష్టంగానూ ఉండేవి. పాలను
కూడ అధికంగా ఇవ్వసాగాయి.
ఊరివారు కూడ దీనిని చూసి
సంతోషించారు. ఇంట్లోనున్న దూడలను ఎడబాసిన ఆవులు విచారశర్మ తమదగ్గరికి రాగానే పాలుపిండకనే యధేచ్ఛగా పాలను స్రవించసాగాయి.
ఈ పాలు ఇలా వృధాగా నేలపాలు కావడం కన్న శివునికి అభిషేకంగా
ఉపయోగిస్తే మంచిదని విచారశర్మ అనుకున్నాడు.
శివుని కోసం ఒక ఆలయం నిర్మించాలని అనుకొని మణ్ణినదీ తీరంలోని అత్తివృక్షం కింద ఇసుకతో శివలింగాన్ని నిర్మించాడు. ఒక్కొక్క
ఆవు పొదుగులోని నాలుగు కాడలలో ఒకదానిని మాత్రం తడమగా దాని
నుండి పాలు సమృద్ధిగా కురిసింది. వాటిని కడవలలో నింపుకొని
శివలింగానికి అభిషేకం చేశాడు. పరమేశ్వరుడు అతనిభక్తికి సంప్రీతుడై
క్షీరాభిషేకాన్ని సంతోషంగా స్వీకరించాడు.
పశువులు తామే వచ్చి పూజకు కావలసిన పాలను ఇవ్వసాగాయి. మొదట ఒక వేడుకగా ప్రారంభించిన
ఈ పూజ రోజూ చేసే నిత్య పూజగా మారింది.
విచారశర్మ చేస్తున్న ఈపూజలను చూసి వాస్తవం తెలియని ఒకడు
ఆ ఊరిపెద్దల దగ్గరికి వెళ్లి వారితో విచారశర్మ మన ఊరి ఆవుల నుండి
పాలను తీసి వాటిని ఇసుకలో పోస్తున్నాడు" అని ఫిర్యాదు చేశాడు.
ఊరిపెద్దలు విచారశర్మ తండ్రిగారిని విచారణసభకు పిలిపించారు. జరిగిన
విషయం అతనికి తెలియజేశారు. ఎచ్చదత్తన్ సభవారికి నమస్కరించి
"పెద్దలారా! ఈ విషయం నాకింతవరకు తెలియదు. ఈ ఒక్క తప్పును
క్షమించండి. ఇకమీదట ఈవిధంగా జరక్కుండా నేను చూస్తాను" అని
చెప్పి ఇంటికి వెళ్లాడు. రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు.
సభలోని వారు
చేసిన అభియోగాన్ని తలచుకుంటూ ఉన్నాడు. ఈ అభియోగంలోని
సత్యాసత్యాలను తానే స్వయంగా వెళ్లి తెలుసుకోవాలని నిశ్చయం
చేసుకున్నాడు. ఉదయం యధాప్రకారం పశువులను తోలుకొని వెళ్తున్న
విచారశర్మను అతనికి తెలియకుండా రహస్యంగా వెంబడించాడు. విచారశర్మ
మెల్లగా మణినదీ తీరాన్ని సమీపించాడు.
అక్కడి అత్తి చెట్టు సమీపంలో
పశువులను మేయడానికి వదిలాడు. తాను నదిలో స్నానంచేసి అత్తిచెట్టుకింద
ఇసుకలో శివలింగాన్ని నిర్మించాడు. పశువుల పొదుగులోని ఒక్క కాడనుండి తీసిన పాలను కడవల్లో నింపుకొని ఆపాలతో శివలింగానికి భక్తితో అభిషేకం
చేయడం ప్రారంభించాడు.
తన కుమారుడు చేస్తున్న తతంగమంతా
ఎచ్చదత్తన్ చూశాడు. మితిలేని కోపంతో తనచేతిలో ఉన్న కర్రతో విచారశర్మ
వీపుపై బలంగా కొట్టాడు. కాని భక్తి పారవశ్యంతో పూజచేస్తున్న విచారశర్మకు
తన తండ్రి కొట్టిన దెబ్బలుకాని, తిట్టిన తిట్లుగాని వినిపించలేదు.
ఎచ్చదత్తన్త న కోపాన్ని ఆపుకోలేక పోయాడు. పరమేశ్వరుని అభిషేకానికై కడవలో ఉంచిన పాలను తన కాలితో తన్ని తోసివేశాడు. అప్పుడు విచారశర్మలో
చైతన్యం కలిగింది. అభిషేకానికై ఉంచిన పాలను నెట్టి వేసినది ఎవరని
చూశాడు. పాలను ఎవరైతే కింద తోసివేశారో వాళ్లు ఎవరైనప్పటికీ వాళ్ల
కాళ్లను నరకాలని నిశ్చయం చేసుకున్నాడు.
తన చేతిలో ఉన్న కర్ర
గండ్రగొడ్డలిగా మారగా దానితో తండ్రిగారి కాళ్లను నరికివేశాడు. ఎచ్చదత్తన్
నేలమీదికి వాలిపోయాడు. శివపూజకు కలిగిన అంతరాయం
తీరిపోయిందనే సంతోషంతో విచారశర్మ మళ్లీ పూజలో నిమగ్నమైపోయాడు.
విచారశర్మ అచంచలమైన శివభక్తికి పరవశుడైన పరమేశ్వరుడు పార్వతీ
సమేతుడై, విచారశర్మ ముందు ప్రత్యక్షమయ్యాడు.
తనకు చేతులు మోడ్చి భక్తితో నమస్కరించిన విచారశర్మతో "భక్తుడా! నాకోసం నీవు నీ తండ్రిగారి కాళ్లను నరికావు.
ఇక నీకు మేమే తండ్రి
మేము ధరించిన ఆభరణాలనే నీవూ ధరించి శివగణాలకు నాయకుడవై,
చండేశ్వర బిరుదముతో విరాజిల్లు" అని పరమేశ్వరుడు చెప్పి విచారశర్మను
ఆలింగనం చేసుకున్నాడు. పరమేశ్వరుని స్పర్శమాత్రం చేతనే విచారశర్మ
మాయాశరీరం తొలగిపోయి శివుని దివ్యజ్యోతిలో ఐక్యమైపోయింది.
*పంతొమ్మిదవ చరిత్ర సంపూర్ణం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *⚜️పెరియ పురాణం⚜️*
. *నాయనార్ల చరిత్ర - 19*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*19. చండేశ్వర నాయనారు*
నీయంజలూరు అనే గ్రామంలో ఎచ్చ దత్తన్, పవిత్ర అనే దంపతులు
శైవ సంప్రదాయాన్ని అనుసరిస్తూ జీవనం సాగిస్తూ వచ్చారు. పరమేశ్వరుని
అనుగ్రహం వలన వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు విచార శర్మ.
శివభక్తుడైన విచారశర్మ పశువులను మేపడమే పవిత్ర కార్యంగా నిర్వహిస్తూ వచ్చాడు. చేతిలో ఒక పొడవాటి కర్రను ధరించి పశువులను
పచ్చిక అధికంగా ఉన్న ప్రాంతాలకు తీసుకువెళ్లి మేపుతుండేవాడు. దీని
కారణంగా పశువులు ఆరోగ్యంగానూ, బలిష్టంగానూ ఉండేవి. పాలను
కూడ అధికంగా ఇవ్వసాగాయి.
ఊరివారు కూడ దీనిని చూసి
సంతోషించారు. ఇంట్లోనున్న దూడలను ఎడబాసిన ఆవులు విచారశర్మ తమదగ్గరికి రాగానే పాలుపిండకనే యధేచ్ఛగా పాలను స్రవించసాగాయి.
ఈ పాలు ఇలా వృధాగా నేలపాలు కావడం కన్న శివునికి అభిషేకంగా
ఉపయోగిస్తే మంచిదని విచారశర్మ అనుకున్నాడు.
శివుని కోసం ఒక ఆలయం నిర్మించాలని అనుకొని మణ్ణినదీ తీరంలోని అత్తివృక్షం కింద ఇసుకతో శివలింగాన్ని నిర్మించాడు. ఒక్కొక్క
ఆవు పొదుగులోని నాలుగు కాడలలో ఒకదానిని మాత్రం తడమగా దాని
నుండి పాలు సమృద్ధిగా కురిసింది. వాటిని కడవలలో నింపుకొని
శివలింగానికి అభిషేకం చేశాడు. పరమేశ్వరుడు అతనిభక్తికి సంప్రీతుడై
క్షీరాభిషేకాన్ని సంతోషంగా స్వీకరించాడు.
పశువులు తామే వచ్చి పూజకు కావలసిన పాలను ఇవ్వసాగాయి. మొదట ఒక వేడుకగా ప్రారంభించిన
ఈ పూజ రోజూ చేసే నిత్య పూజగా మారింది.
విచారశర్మ చేస్తున్న ఈపూజలను చూసి వాస్తవం తెలియని ఒకడు
ఆ ఊరిపెద్దల దగ్గరికి వెళ్లి వారితో విచారశర్మ మన ఊరి ఆవుల నుండి
పాలను తీసి వాటిని ఇసుకలో పోస్తున్నాడు" అని ఫిర్యాదు చేశాడు.
ఊరిపెద్దలు విచారశర్మ తండ్రిగారిని విచారణసభకు పిలిపించారు. జరిగిన
విషయం అతనికి తెలియజేశారు. ఎచ్చదత్తన్ సభవారికి నమస్కరించి
"పెద్దలారా! ఈ విషయం నాకింతవరకు తెలియదు. ఈ ఒక్క తప్పును
క్షమించండి. ఇకమీదట ఈవిధంగా జరక్కుండా నేను చూస్తాను" అని
చెప్పి ఇంటికి వెళ్లాడు. రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు.
సభలోని వారు
చేసిన అభియోగాన్ని తలచుకుంటూ ఉన్నాడు. ఈ అభియోగంలోని
సత్యాసత్యాలను తానే స్వయంగా వెళ్లి తెలుసుకోవాలని నిశ్చయం
చేసుకున్నాడు. ఉదయం యధాప్రకారం పశువులను తోలుకొని వెళ్తున్న
విచారశర్మను అతనికి తెలియకుండా రహస్యంగా వెంబడించాడు. విచారశర్మ
మెల్లగా మణినదీ తీరాన్ని సమీపించాడు.
అక్కడి అత్తి చెట్టు సమీపంలో
పశువులను మేయడానికి వదిలాడు. తాను నదిలో స్నానంచేసి అత్తిచెట్టుకింద
ఇసుకలో శివలింగాన్ని నిర్మించాడు. పశువుల పొదుగులోని ఒక్క కాడనుండి తీసిన పాలను కడవల్లో నింపుకొని ఆపాలతో శివలింగానికి భక్తితో అభిషేకం
చేయడం ప్రారంభించాడు.
తన కుమారుడు చేస్తున్న తతంగమంతా
ఎచ్చదత్తన్ చూశాడు. మితిలేని కోపంతో తనచేతిలో ఉన్న కర్రతో విచారశర్మ
వీపుపై బలంగా కొట్టాడు. కాని భక్తి పారవశ్యంతో పూజచేస్తున్న విచారశర్మకు
తన తండ్రి కొట్టిన దెబ్బలుకాని, తిట్టిన తిట్లుగాని వినిపించలేదు.
ఎచ్చదత్తన్త న కోపాన్ని ఆపుకోలేక పోయాడు. పరమేశ్వరుని అభిషేకానికై కడవలో ఉంచిన పాలను తన కాలితో తన్ని తోసివేశాడు. అప్పుడు విచారశర్మలో
చైతన్యం కలిగింది. అభిషేకానికై ఉంచిన పాలను నెట్టి వేసినది ఎవరని
చూశాడు. పాలను ఎవరైతే కింద తోసివేశారో వాళ్లు ఎవరైనప్పటికీ వాళ్ల
కాళ్లను నరకాలని నిశ్చయం చేసుకున్నాడు.
తన చేతిలో ఉన్న కర్ర
గండ్రగొడ్డలిగా మారగా దానితో తండ్రిగారి కాళ్లను నరికివేశాడు. ఎచ్చదత్తన్
నేలమీదికి వాలిపోయాడు. శివపూజకు కలిగిన అంతరాయం
తీరిపోయిందనే సంతోషంతో విచారశర్మ మళ్లీ పూజలో నిమగ్నమైపోయాడు.
విచారశర్మ అచంచలమైన శివభక్తికి పరవశుడైన పరమేశ్వరుడు పార్వతీ
సమేతుడై, విచారశర్మ ముందు ప్రత్యక్షమయ్యాడు.
తనకు చేతులు మోడ్చి భక్తితో నమస్కరించిన విచారశర్మతో "భక్తుడా! నాకోసం నీవు నీ తండ్రిగారి కాళ్లను నరికావు.
ఇక నీకు మేమే తండ్రి
మేము ధరించిన ఆభరణాలనే నీవూ ధరించి శివగణాలకు నాయకుడవై,
చండేశ్వర బిరుదముతో విరాజిల్లు" అని పరమేశ్వరుడు చెప్పి విచారశర్మను
ఆలింగనం చేసుకున్నాడు. పరమేశ్వరుని స్పర్శమాత్రం చేతనే విచారశర్మ
మాయాశరీరం తొలగిపోయి శివుని దివ్యజ్యోతిలో ఐక్యమైపోయింది.
*పంతొమ్మిదవ చరిత్ర సంపూర్ణం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *శివానందలహరీ – శ్లోకం – 19*
. శ్రీ ఆదిశంకరాచార్య విరచితం
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*దురాశాభూయిష్ఠే దురధిపగృహద్వారఘటకే*
*దురన్తే సంసారే దురితనిలయే దుఃఖజనకే |*
*మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే*
*వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయమ్ 19*
ఓ శివా! దురాశాభూయిష్ఠమైనది, దుష్ట అధికారుల/ప్రభువుల ముంగిళ్ళలో పడిగాపులు కాయునట్లు చేయునది, పాపమయమైనది, దుఃఖకారణమైనది, ముగింపులేనిది అయిన ఈ సంసారములో నా బాధలను ఏల నశింపజేయవు? (అలా వ్రాసిన) బ్రహ్మదేవునియందు వాత్సల్యముచేత, తొలగించుటలేదు కాబోలు. నీవు భక్తవత్సలుడవైనప్పుడు నిన్ను భజించి మేమూ కృతార్థులమవుతున్నాము కదా!
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం - షష్ఠి - ఆశ్రేష - భాను వాసరే* *(03-12-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/7Kh_2MgPj8U?si=bfL-LIhGZdkj6z7P
🙏🙏
🕉️🪔 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️
🪔 ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔
*శ్లోకం*
*సంసారదావ దహనాకుల భీకరోగ్ర*
*జ్వాలావళీభి రభిదగ్ధ తనూరుహస్య* |
*త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య*
*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||
_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 10_* _
తా॥ సంసారమనెడి కారుచిచ్చు భయంకరములగు గొప్ప
జ్వాలలతో నిండి పోయినది. నేను దాని నడుమ చిక్కుకొంటిని.
ఆ మంటలు నా శరీర మందలి రోమములను కాల్చి
వేయుచున్నవి. ఇక నా శరీరము కూడా దహింపబడును. కాన
నిన్ను శరణు జొచ్చితిని. నీ పాద పద్మములనెడి సరస్సు తప్ప
తాపము నేదియు చల్లార్పజాలదు. ఓ నృసింహ దేవా!
కరుణించి చేయూత నొసగి, ఆ దావాగ్ని నుండి రక్షింపుము. *లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *95వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*శుక్రగ్రహ చరిత్ర - 7*
*"ఈ సంధి కాలంలో రాక్షసులకు సరికొత్త విద్యాబోధన చేయాలి ! దేవతలు గొప్పవారు , దేవతలు మంచివారు దేవతలకు రాక్షసులు సేవలు చేయాలి. రాక్షసులు దేవతలను గౌరవించి , ఆరాధించాలి. ఎలాంటి పరిస్థితులలో కూడా దేవతల పట్ల అవిధేయత చూపరాదు. దేవతలతో యుద్ధానికి దిగరాదు. ఇలాంటి దేవహితం పొంగిపొర్లే విద్యను వాళ్ళకు బోధించాలి. వాళ్ళను మన విధేయులుగా , శాశ్వత విధేయులుగా - సేవకులుగా మార్చివేయాలి !"* బృహస్పతి వివరించాడు.
*"మీ ఆలోచన అద్భుతం ! అయితే మనం బోధిస్తే వాళ్ళ చెవులకు ఎక్కదుగా గురుదేవా ?"* ఇంద్రుడు అన్నాడు..
*"చెప్పాల్సింది , ప్రబోధించాల్సింది నువ్వూ , నేనూ కాదు , మహేంద్రా ! శుక్రుడు !"* బృహస్పతి నవ్వుతూ అన్నాడు.
*"శుక్రుడా ?!"*
*"శుక్రుడు ! మాయా శుక్రుడు !"* బృహస్పతి ఇంద్రుణ్ణి తీక్షణంగా చూస్తూ అన్నాడు. *"శాంబరీ విద్య ఇంద్రా!”*
*"మాయా శుక్రుడా ?"* ఇంద్రుడు నోరు వెళ్ళబెట్టాడు.
*"ఇదిగో ! చూడు !"* అన్నాడు నవ్వుతూ బృహస్పతి. క్షణంలో ఆయన అంతర్ధాన మైపోయి , ఆ స్థానంలో శుక్రుడు ప్రత్యక్షమయ్యాడు.
*ఇంద్రుడు నిర్ఘాంతపోతూ లేచి నిలుచున్నాడు.*
*"ఇదీ నా పథకం , మహేంద్రా ! మాయా శుక్రుడి అవతారంలో వృషపర్వుడి ఆస్థానంలో ప్రవేశిస్తాను. శుక్రుడు జయంతితో అజ్ఞాత దాంపత్యం నెరపే పదేళ్ళ సంధి కాలంలో అసురులందర్నీ సురసేవకులుగా మార్చివేస్తాను !"* శుక్రుడి శరీరంలోంచి బృహస్పతి కంఠం సగర్వంగా పలికింది.
*"మీ ఆలోచన పరమాద్భుతం ! అయితే మృతసంజీవని లభించింది కాబట్టి , దేవతలను ఢీ కొందామని రాక్షసరాజు తొందరపడితే..."* ఇంద్రుడు సందేహాన్ని వ్యక్తం చేశాడు.
శుక్రుడి శరీరంలోంచి బృహస్పతి నవ్వాడు. *"మంత్రోపదేశం పొందాను. మంత్ర సిద్ధి జరగాలి కద ! సమయస్ఫూర్తితో సాధించుకుంటానులే , మహేంద్రా !”*
*"మీరు సాధించగలరు !"* ఇంద్రుడు మెచ్చుకున్నాడు. *"కానీ , మీ కంఠస్వరం ?”*
*“ముందుగా ఆశ్రమానికి వెళ్ళి మా జననీజనకులను దర్శించుకుని , మృతసంజీవని గురించి చెప్పి , వాళ్ళ ఆశీస్సులు తీసుకొని , వృషపర్వుడి ఆస్థానం చేరుకుంటాను !"*
శుక్రుడి వేషంలో ఉన్న బృహస్పతి శుక్రుడి కంఠస్వరాన్ని అవలీలగా అనుకరిస్తూ అన్నాడు.
ఇంద్రుడు గొల్లున నవ్వాడు.
***************************************
వృషపర్వుడి ఆధ్వర్యంలో రాక్షస వీరులందరూ , పూర్ణకుంభాలతో మాయా శుక్రుడికి స్వాగతం పలికారు.
శుక్రుడి పేర వాళ్ళు చేస్తున్న జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతోంది.
కొలువు కూటంలో అగ్రాసనం మీద కూర్చోబెట్టి , శుక్రుడికి పాద పూజ చేశాడు. వృషపర్వుడు. గురుపాద తీర్థాన్ని అందరూ శిరస్సుల మీద చల్లుకున్నారు.
*“గురుదేవా ! దిగ్విజయంగా తిరిగి వచ్చారు ! మా అదృష్టం ! ఇంక అసుర వీరుల ఆయుర్దాయానికి అంతం లేదు !"* వృషపర్వుడు ఆనందోత్సాహాలతో అన్నాడు.
సభలో అందరూ హర్షధ్వానాలు చేశారు. మాయాశుక్రుడు లేచి నిలబడి సభను కలియజూశాడు.
*"పరమశివుడు మీ గురువును కరుణించాడు ! మృతసంజీవనీ మంత్రం ఉపదేశించాడు !"*
హర్షధ్వానాలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నాయి.
*"మంత్రోపదేశం జరిగింది , మంత్రసిద్ధి జరగాలి ! పది సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఆ మంత్రరాజాన్ని జపించాలని ముక్కంటి ఆనతిచ్చాడు ! అప్పుడు మంత్ర శుద్ధి ! మంత్ర సిద్ధి !”*
*“గురుదేవా ! అయితే...అప్పటిదాకా మనం దేవతలను ఢీ కొనలేమన్నమాట !"* వృషపర్వుడు కొంచెం నిస్పృహతో అన్నాడు.
*"నిరాశ వద్దు వృషపర్వా ! మరణించే మన వీరులకు మరలా ప్రాణం పోయగలిగిన నాడే దేవతలను ఎదుర్కొందాం అది తిరుగులేని విజయం కదా !"* కపట శుక్రుడు. నవ్వుతూ అన్నాడు.
*"పదేళ్ళు ! గురుదేవా , పదేళ్ళు మనం ఓపిక పట్టాలి !”*
*"పదేళ్ళు ఎంత ? చిటికెలో గడిచిపోతాయిలే , వృషపర్వా ! అప్పటి దాకా మన పరివారానికి విశేషవిద్య బోధిస్తాను !”* కపట శుక్రుడు చిరునవ్వుతో అన్నాడు.
********************************
కపట శుక్రుడు అన్నట్టు పది సంవత్సరాలు చిటికెలో గడిచిపోయాయి జయంతి సాహచర్యంలో శుక్రుడికి ! పదేళ్ళ అజ్ఞాత దాంపత్యం ఆనంద యాత్రగా సాగింది. విడిచి వెళ్ళలేక కన్నీళ్ళు పెట్టుకున్న జయంతికి ధైర్యం చెప్పి , ఓదార్చి , శుక్రుడు వృషపర్వుడి నగరానికి , జయంతి తల్లిదండ్రుల వద్దకు ప్రయాణమయ్యారు.
*******************************
వృషపర్వుడి సభ నిండుగా ఉంది. కపట శుక్రుడు తన ఆసనం మీద ఆసీనుడై ఉన్నాడు.
*"గురుదేవా ! మీరన్నట్టు , పది సంవత్సరాలు పది రోజుల్లా గడిచిపోయాయి ! మనకు మృతసంజీవని సిద్ధించినట్టే కదా !"* వృషపర్వుడు ప్రశ్నించాడు.
కపట శుక్రుడు సమాధానం ఇచ్చేంతలో సభలో కలకలం బయలుదేరింది. అందరి తలలు మహాద్వారం వైపు తిరిగి ఉన్నాయి. శుక్రుడు దండకమండలాలు ధరించి , వస్తున్నాడు. సభలోని రాక్షసులంతా మాటలు మరచిపోయిన వాళ్ళలా , మూగవాళ్ళలా ఉండిపోయారు. ఎవ్వరూ పైకి లేవలేదు.
శుక్రుడు వృషపర్వుడి ముందు ఆగాడు. ఆయన చూపులు కపట శుక్రుడి మీద వాలాయి. వృషపర్వుడు తన సమీపంలో కూర్చున్న కపట శుక్రుడి వైపు తిరిగాడు.
*"గురుదేవా ! ఎవరితను ?”*
*"వృషపర్వా !"* శుక్రుడు గద్దించాడు. *"మీ గురు దేవుణ్ణి నన్నే గుర్తు పట్టలేవా ?”*
*"వీడెవడో మాయావిలా ఉన్నాడు , రాక్షసరాజా !"* కపట శుక్రుడు శాంతంగా అన్నాడు.
*"ఎవరు మాయావి ? నేను లేని సమయంలో , నా వేషంలో , నా స్థానంలో తిష్ఠ వేసిన నువ్వు మాయావి !"* శుక్రుడు గద్దించాడు..
*"నోర్ముయ్ ! పరమశివుణ్ణి మెప్పించి , మృతసంజీవని సాధించి తెచ్చిన మా గురుదేవులను మాయావి అంటావా ? నీ వేషాలు కట్టిపెట్టు ! నీ మాయ ఇక్కడ పనిచేయదు !"*
*"వీడు... ఈ కపట నటుడు , మృతసంజీవని సాధించాడా ? నా మాట విశ్వసించు వృషపర్వా ! వీడెవడో నా వేషంతో మీ అసురకులాన్ని మోసగిస్తున్నాడు. నేను శుక్రుణ్ణి. నేను పులోమా భృగు మహర్షి దంపతుల పుత్రుణ్ణి. నన్ను నమ్ము !"*
*"పరిజనులారా ! ఈ మాయావిని మందిరం నుంచి , నగరం నుండి , మన రాజ్యం నుండే వెళ్ళగొట్టండి. మన గురుదేవుల రూపంలో ఉన్నందువల్ల ఆ రూపాన్ని గౌరవించి ప్రాణాలతో వదలండి !"* వృషపర్వుడు ఆజ్ఞాపించాడు.
కపట శుక్రుడు మెప్పుగా తలపంకించాడు.
నలుగురు రాక్షస వీరులు శుక్రుడిని సమీపించారు , బెదిరింపుగా చూస్తూ.
*"ఆగండి !"* శుక్రుడు హుంకరించాడు. *"మీకు విద్యాబుద్ధులు చెప్పి , మీ కోసం కఠోర తపస్సుతో మృతసంజీవని విద్యను సాధించిన నన్నే అనుమానించి , అవమానిస్తారా ? అందుకు శిక్షగా నిరంతర అపజయాలతో అఘోరించండి !"*
శుక్రుడి కంఠస్వరం సభలో మారుమ్రోగింది. ఆయన ఆవేశంగా అడుగులు వేసుకుంటూ సభలోంచి వెళ్ళిపోయాడు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
ఉప్మా కనిపెట్టిన వాడ్ని ఉరికే వదలకూడదు 😣😣...ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి😎😎..ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా ఒక వంద సార్లు చూపించి ఉరితీయ్యాలి😂😂...ఎవరి ఇంటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో🐒🐒కసి తీర కడుపులో మంట చల్లార్చుకోడానికి చేస్తారో తెలీదు 😰😰..కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు🐺🐺... వుండండి వుండండి అంటూ😛😛 వంటింట్లో నుంచి ఏ పూరి నో పొంగలో తెస్తారనుకుంటే🙆.ఉట్టిపుణ్యం గా ఊడి పడుతుంది ప్లేట్ లో ఈ ఉప్మా🙇🙇.. ఒక రెండు స్పూన్ ల వరకు బాగానే వుంటుంది👸...తరువాత చూడండి జ్వరమొచ్చినప్పుడు మాత్రలు మింగినట్టు🙅🙅స్పూన్ స్పూన్ కి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతున్న మన కష్టాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా👶👶..ఇంకాస్త పెట్టమంటారా అంటే😳.... ఆ స్పూన్ తో తల మీద గట్టిగ కొట్టుకొని వెర్రి గా నవ్వాలనిపిస్తుంది💣💣💣...ఈ దరిద్రానికి మళ్లీ రకాలు💥💥..గోధుమ రవ్వ,,బొంబాయి రవ్వ అంటూ👂👂..బొంబాయి ముంబై అయినా..ఈ ఉప్మా ఇంకా బొంబాయి రవ్వగానే చెలామణి అవుతాంది😛😛...జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఉప్మా🐇🐇...ఉల్లిపాయలేస్తే ఉల్లిపాయుప్మ🐓🐓..టమాట వేస్తే టమేటా బాత్ 🍅🍅🍅.... ఉప్మా చేయి అంటే చాలు చిటికెలో చేతిలో ఉప్మా ప్లేట్ తో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తారు🎅🎅....శనివారం అయిందంటే చాలు ఎదో రూపం లో తగులుకుంటుంది🙇🙇..ఈ మంతెన గారు ఊరుకోక గోధుమ రవ ఉప్మా మంచిది అని చెప్పారు💪💪.. ఇక చూడండి👈..వారోత్సవాలు...👈బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి☝....తప్పు మీది కాదు సర్👐👐.ధైర్యం చేసి ఉదయన్నే నాలుగు గంటలకి మీ ప్రోగ్రాం చూపించామ్ కదా✊✊...చేసిన పాపం ఉరికే పోదు👎👎..ఇది తినడం ఒక ఎత్తు అయితే తిన్నాక లోపల కి వెళ్లి ఇది చేసే హంగామ అంతా ఇంతా కాదు🏃🏃🏃...పడుకుంటే కడుపు లో షేర్ ఆటో లు తిరుగుతునట్టు ఒకటే గోల 🚆🚆🚆....అర స్పూన్ తింటే ,,.అరిగించుకోటానికి ఆరు గంటలు పడుతుంది🎠🎠🎠... ఉప్మా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే🎭🎭...మా రామ్ దేవ్ బాబా గురూ గారు మహత్తరమైన ఉపాయం చెప్పారు😜😝😜... ఉప్మా కాశి లో వదిలేసాను అని చెప్పమన్నాడు 😛😛...ఎప్పుడైనా ఎవరైనా పెట్టినప్పుడు ఈ మాట చెప్పి తప్పించుకుంటున్నా అని చెప్పాడు 😌😌....నేను అదే చేస్తా లాభం లేదు😫😫...ఇంతకీ ఎంతమంది ఇవాళ ఉప్మా తిన్నారో 😊😊...అదే లే తినాల్సివచ్చిందో చెప్పండి 😆...ఎదో మనిషి కి మనిషి సహాయం..తోడూ 😜😜...మీకోసం ప్రార్థన చేస్తా..కడుపులో పడిన ఉప్మా త్వరగా కరగాలని...
😃😃జై ఊప్మాఁ..జై జై ఊప్మా..
సేకరణ:- వాట్సాప్ పోస్ట్