*బుద్ధుడు కుల వ్యవస్థపై యుద్ధం చేశాడా?*
--------------------------
బుద్ధుడు రాజ్యాన్ని విడిచి వచ్చేశాక కొందరు బ్రాహ్మణ సన్యాసుల సాహచర్యం లేదా శిష్యరికంలో ధ్యాన జీవనాన్ని అనుసరించాడు అని అంతర్జాతీయ బుద్ధ చరిత్రకారులు AK Coomaraswamy, I B Horner లు తమ Gotama the Buddha పుస్తకంలో తెలియజెప్పారు. Dwight Goddard తన A Buddhist Bibleలో బుద్ధుడు బోధిని పొందడానికి ముందు కొందరు బ్రాహ్మణుల్ని ఆశ్రయించాడు అని తెలియజెప్పాడు.
*'బుద్ధుడు కుల వ్యవస్థపై యుద్ధం చేశాడు అన్న తప్పుడు అభిప్రాయం చలామణిలో ఉంది'* అని అంటూ AK Coomaraswamy, I B Horner లు చెప్పాక, జన్మతః వచ్చిన బ్రాహ్మణ్యానికి ఆత్మ జ్ఞానంవల్ల వచ్చే బ్రాహ్మణ్యానికి ఉన్న తేడాను బుద్ధుడు గుర్తించాడు అనీ చెప్పారు. బ్రాహ్మణ్యం అన్న ధార్మిక లేదా ఆధ్యాత్మిక వృత్తి ఏ వర్గంలో పుట్టిన వ్యక్తికైనా తెరవబడే ఉంటుంది అంటూ బుద్ధుడు చెప్పాడని అఙ్గుత్తర-నికాయనూ, సమ్యుత్త-నికాయనూ ఉటంకిస్తూ AK Coomaraswamy, I B Horner లు తెలియజేశారు.
సుత్త నిపాతంలోనూ, దమ్మ పదంలోనూ బుద్ధుడు బ్రాహ్మణ్యం గురించి విశదం చేశాడు. మిలిందపన్హాను ఉటంకిస్తూ *'బుద్ధుడు వ్యక్తిత్వం పరంగా బ్రాహ్మణుడు'* అని AK Coomaraswamy, I B Horner లు స్పష్టం చేశారు. మిలిందపన్హా అని అన్నప్పుడు నాగసేనుడు ఈ సత్యాన్ని మొదటగా చెప్పినట్టుగా తెలుసుకోవాలి.
బుద్ధుడి 10మంది శిష్యుల్లో ముగ్గురు క్షత్రియులు, ఒకరు మంగలి, ఆరుగురు బ్రాహ్మణులు. బౌద్ధానికి పునాదిగా, నిర్మాణంగా నెలకొన్న బౌద్ధ తాత్త్వికులు 12 మంది బ్రాహ్మణులు, నలుగురు క్షత్రియులు.
బుద్ధుడు కుల పరమైన అసమానతల జోలికి పోలేదు. కులాల, వర్గాల ప్రసక్తి, ప్రస్తావన బుద్ధుడికి సంబంధించింది కాదు. Koanraad Elst వంటి అంతర్జాతీయ బుద్ధ, బౌద్ధ పరిశోధకులు ఈ వాస్తవాన్ని గట్టిగా తెలియజేస్తున్నారు.బుద్ధుడు కులవాది కాదు; బుద్ధుడికి కుల వ్యాధి లేదు.
ప్రధాన జన జీవన స్రవంతి నుంచి కొన్ని వర్గాలను వేరు చేసి మనదేశంలో సామాజిక సామరస్యాన్ని చెడగొట్టి, దేశంలోని ప్రధాన సాంస్కృతిక వ్యవస్థ అయిన సనాతనాన్ని దెబ్బతీసి తద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలన్న పన్నాగంతో కొన్ని దశాబ్దుల క్రితం కొన్ని దుష్ట శక్తులు బుద్ధుణ్ణి కుల పరంగా వక్రీకరించాయి;
కృతకంగా కొన్ని వర్గాలకు, కులాలకు బుద్ధుణ్ణి ఆపాదించి ప్రజల్ని దారుణంగా వంచించాయి. బుద్ధుడు కేంద్రంగా మనదేశంలో కుల కుట్ర జరిగింది. బుద్ధుడు ఏ కులానికో, ఏ వర్గానికో ప్రతీక కాదు; బుద్ధుడు ఏ కులానికో, ఏ వర్గానికో చిహ్నం కాదు.బుద్ధుడు కులం వ్యక్తి కాదు;
బుద్ధుడు ధర్మం వ్యక్తి.
బుద్ధుడు కుల వ్యవస్థపై ఏ యుద్ధమూ చెయ్యలేదు.
- రోచిష్మాన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి