---౦--- ఆలోచనాలోచనాలు---౦---"" అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక "" "" ఉద్,యానమ్ తేపురుష న,అవయానమ్""--- అథర్వణ వేదం. --- ఓ మనిషీ! నీ గమనం పైకి, పైపైకి; క్రిందివైపుకు కాదు. ( సంస్కృత సూక్తి సుధ) 1* మత్స్యన్యాయేనభక్షేరన్,యది దండో నపాలయేత్. ----రాజు గనుక దండాన్ని(కఠినమైన శిక్షలను) అమలుపరచకపోతే, పెద్ద చేప చిన్న చేపలను మ్రింగేవిధంగా బలవంతులు, బలహీనులను నమిలి మింగేస్తారు సుమా! 2* మనః పూతం సమాచరేత్.--- పవిత్రమైన మనస్సుతో కార్యాచరణను ప్రారంభించాలి. 3* మనస్యన్యత్, వచస్యన్యత్,కర్మణ్యన్యత్ దురాత్మానామ్--- దుర్మార్గుల మనస్సు, మాట, చేష్టలు వేర్వేరుగా ఉంటాయి. 4* ఉపకారోహి నీచానాం, అపకారోహి జాయతే!--- వాల్మీకి రామాయణం. నీచులకు చేసే ఉపకారం, అపకారాన్నే కలిగిస్తుంది సుమా! 5* ఋషిః సయో మమర్హిత--- మానవజాతికి మేలుచేసేవాడే నిజమైన ఋషి. --- ఋగ్వేదం. 6* నికటస్థం గరీయాం సమపితోకో నమన్యతే! పవిత్రామపి యన్మర్త్యా ననమస్యంతి జాహ్నవీం!! తనకు దగ్గరగా ఉన్నవారి గొప్పతనం తనకు తెలియదు. గుర్తించలేరు కూడా! బాగా దగ్గరవున్నా గంగానదికి ప్రజలు నమస్కరించరు కదా! 7* వరం సఖే సత్పురుషాఏ మానితో! న నీచ సంసర్గ గుణైరలంకృతః!! నీచులతో పొగిడించుకొనేకంటే సజ్జనుల నుండి అవమానం పొందడమే మేలు! 8* విద్యా వివాదాయ, ధనం మదాయ,-- శక్తిః పరేషాం పరపీడనాయ! ఖలస్య సాధోర్విపరీతమేతత్, జ్ఞానాయ,దానాయచ రక్షణాయ!! దుర్జనుని విద్య వివాదానికి, ధనం మదానికి, శక్తి పరపీడనకు ఉపకరిస్తుంది. సజ్జనుని విద్య జ్ఞానాభివృద్ధికి, ధనం దానానికి, శక్తి పరుల రక్షణకు ఉపయోగపడుతుంది. 9* అకారణం రూపమకారణం కులం! మహత్సు నీచేషుచ కర్మ శోభతే!! అందంకానీ, కులంగానీ గౌరవానికి హేతువు కాదు. ఇవేవీలేకపోయినా ఎవరు చేసిన పనులే వాళ్ళగౌరవానికి అర్హతను సంపాదించిపెడతాయి. 10* అంధః తమః ప్రవిశంతియే అవిద్యాముపాసతే! --- ఈశావాస్యోపనిషత్. అవిద్య(అజ్ఞానాన్ని) ఆరాధించేవారు కారుచీకటిలోకి ప్రవేశిస్తారు. 11* అంభసః ప్రస్వతీరష్టారనావ మదితేపిబేడ్. ---చరక సంహిత. ప్రొద్దు పొడవకముందే (మనుషులు) ఎనిమిది పుడిసెళ్ళ నీరు త్రాగాలి.( పుడిసె అనగా నోటినిండా పట్టే నీరు అని అర్థం) 12* అకారణం విద్విషంతో లజ్జంతేన కథం భువి? --- ఈ లోకంలో అకారణంగా ద్వేషించేవారు తమను చూసి తామే సిగ్గు పడాలి. తేది 3--12--2023, ఆదివారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి