17, మే 2024, శుక్రవారం

రాణి అంబక్క

 రాణి అంబక్క: భయమంటే ఏమిటో తెలియని గొప్ప వీరనారి. ఈ రాణి గురించి ఎంత మందికి తెలుసు? ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక యుద్ధనౌక కు ఒక మహిళ పేరు కాని, రాణి పేరు పెట్టలేదు. కానీ ఒక్క మన భారతదేశం నౌకలు మాత్రమే ఆ అదృష్టం చేసుకున్నాయి.


బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ గొప్ప వీరవనిత గురించి మన చరిత్రపుటల్లో ఏ పుస్తకంలోనూ నోచుకోలేకపోయింది.


ఏ పాఠ్యపుస్తకము చెప్పలేని #రాణి_అంబక్క గారి చరిత్ర:

16 వ శతాబ్దంలో దక్షిణ కన్నడ బంట్వాల్ ఫలక్ అనే ప్రాంతంలో తుకారాం పూజారి అనే చరిత్రకారుడు ఒక మ్యూజియంని మొదలుపెట్టాలి అని అనుకున్నాడు. ఆ మ్యూజియం పేరు "తులు బడుకు మ్యూజియం" అది రాణి అంబక్క చరిత్ర జ్ఞాపకార్థం. భారతీయ చరిత్రలో ఒకే ఒక ధీరవనిత పలుమార్లు పోర్చుగీస్ వాళ్లను ఓడించిన మహారాణి రాణి అంబక్క. ఆమె ధైర్యంలో మరియు వీరత్వంలో రాణి లక్ష్మీ బాయి కి, రాణి రుద్రమ దేవికి మరియు రాణి దుర్గావతి కీ సరిసమానమైన వ్యక్తి.


7 వ శతాబ్దం నుండి మన భారతదేశానికి మరియు అరేబియన్ దేశాలకు మధ్య వాణిజ్య సంబంధాలుండేవి (యుద్ధ గుర్రాలు, మసాలా దినుసులు, బట్టల వ్యాపారం జరిగేది). చాలా యూరోపియన్ దేశాలు మన భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నాయి అప్పటికి. 1498 లో మొదటిసారి వాస్కోడిగామా మన భారతదేశంలోని కాలికట్ ప్రాంతానికి సముద్రమార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్నాడు. యూరోపియన్ దేశాల నుంచి మొదట భారత్ కి వచ్చింది పోర్చుగీస్.


ఐదు సంవత్సరాల తరువాత పోర్చుగీసు వాళ్లు మొదటి ఓడరేవును కట్టారు. దాని తర్వాత వాళ్లు వివిధ నౌకాశ్రయాలు కట్టారు. మనదేశం తో సహా మస్కట్, మొజాంబిక్, శ్రీలంక, ఇండోనేసియా తో పాటు ఎక్కడో దూరంలో చైనాలో ఉన్న మకావు కలుపుతూ సముద్ర మార్గాన్ని నిర్మించారు. 20 సంవత్సరాలలో పోర్చుగీస్ ఈ మార్గాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది.


భారతీయులకు, అరబ్బులకు, పెర్షియన్ మరియు ఆఫ్రికన్ ఓడలకు హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం ఉచితంగా ఉండేది. 16 వ శతాబ్దం నాటికి పోర్చుగీస్ యొక్క ఆధిపత్యాన్ని ఏ ఒక్క యూరోపియన్ దేశం అడ్డుపడలేకపోయాయి (డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళు 17 వ శతాబ్దం మొదట్లో భారత్ లోకి వచ్చారు). 

ఎప్పటి నుండి అయితే ఈ సముద్ర మార్గంలో పోర్చుగీస్ ఆధిపత్యం పెరిగిందో అప్పటి నుండి వాళ్లు రుసుములు విధించడం మొదలుపెట్టారు. పోర్చుగీస్ వాళ్లకు స్థానికంగా ఉన్న రాజులు ఎదురుతిరిగిన వాళ్లను ఓడించి ఆ మార్గాన్ని వశం చేసుకున్నారు.


1526 లో పోర్చుగీస్ మంగళూర్ పోర్ట్ ని ఆక్రమించిన తర్వాత వాళ్ళ తదుపరి లక్ష్యం ఉల్లాల పోర్ట్ పైన పెట్టారు. ఉల్లాల అనేది చౌత రాజు 3 వ తిరుమల రాయ రాజధాని. అది విజయనగరం రాజ్యం కీ కట్టుబడి ఉండేది. చౌతలు మొదట జైన్ రాజులు వాళ్ళు 2 వ శతాబ్దం లో గుజరాత్ నుండి వలస వచ్చారు (అది ఇప్పుడు దక్షిణ కన్నడ, ఉడిపి మరియు కేరళలోని కాసర్ గోడ్ జిల్లా వరకు ఉంది). చౌత లు మాతృస్వామ్య రాజవంశీయులు. ఆ రాజు యొక్క మేన కోడలే రాణి అంబక్క. ఆ రాజు అంబక్క ను దత్తత తీసుకొని రాజ్యానికి రాణిగా ప్రకటించాడు. ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు కత్తి యుద్ధం, విలు విద్య, గుర్రపు స్వారీ, సైనిక వ్యూహం, దౌత్య పరమైన అన్ని విద్యలలో చిన్నప్పటి నుండే ఆరితేరింది. ఆమె రాజ్య సింహాసనం అధిరోహించిన నాటి నుండే రాజ్యానికి పోర్చుగీస్ నుండి ఉన్న ముప్పు తెలుసు. 3 వ తిరుమల రాయ చనిపోయేముందు రాణి అంబక్క ని లక్ష్మప్ప బంగరాజ(మంగళూర్ రాజు) తో వ్యూహాత్మక వివాహ కూటమి ఒప్పందంతో పెళ్లి జరిగింది. అంబక్క కి పెళ్లి అయినా కూడా తన ముగ్గురు పిల్లలతో తన సొంత ఇంట్లో ఉల్లాల లో ఉండసాగింది. కొన్ని రోజులకు వాళ్ళ వైవాహిక బంధం తెగిపోయింది బంగరాజ పోర్చుగీస్ తో సంధి చేసుకోవడం వల్ల.


అంబక్క నాయకత్వంలో వెలిగిపోతున్న ఉల్లల రాజ్యం పైన పోర్చుగీస్ ఒక కన్ను వేసి ఉంచారు. ఆమె నుండి అధిక పన్నులు వసూలు చేయడమే కాక ఆమె పైన మితిమీరిన ఆంక్షలు వేయడంతో ఆమె పోర్చుగీస్ కి ఎదురు తిరిగింది. పోర్చుగీస్ వాళ్లు తన ఓడలో పైన దాడి చేసిన కూడా అరబ్స్ తో వ్యాపారం చేయడం ఆపలేదు. మగవీరుల, బిల్లవా విలు విద్యలు మొదలు మప్పిలః తెడ్డులు నడిపే అన్ని కులాలకు మరియు మతాలకు అతీతంగా తన సైన్యంలో మరియు నౌకా దళంలో మగవారు ఉండేవాళ్ళు.


ఆమె మొండిపట్టు ని చూసి పోర్చుగీస్ పలుమార్లు ఉల్లలా పైన దాడి చేశారు. 1556 సంవత్సరంలో మొదటి సారి పోర్చుగీస్ అడ్మిరల్ డాన్ అల్వరో డి సివేరియా ఆధ్వర్యంలో యుద్ధం చేశారు కానీ అది అననుకూల సంది జరిగింది. మళ్లీ 2 సంవత్సరాల తర్వాత పోర్చుగీస్ అతి పెద్ద సైన్యంతో ఉల్లాల పైకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు అంబక్క మాస్టర్ యుద్ధవ్యూహాలతో మరియు దౌత్య వ్యూహంతో (అరబ్బులు మరియు కోజికోడ్ జమోవియా వాళ్లతో చేతులు కలిపి) పోర్చుగీస్ వాళ్లను ఓడించి వెను తిరిగేలా చేసింది.


General Joao Pexixoto ఆధ్వర్యంలో మరోసారి ఉల్లల పైన దాడి చేసి కోటను ఆక్రమించుకున్నారు. కానీ అప్పటికే వాళ్ళ దాడిని గ్రహించిన రాణి ఆ కోట నుండి తప్పించుకుని పారి పోయింది. అదే రోజు రాత్రి ఆమెకు నమ్మకం గా ఉండే 200 మంది సైనికులతో పోర్చుగీస్ స్థావరాలపై మహాకాళి ల రౌద్రరూపం దాల్చి విరుచుకుపడింది. 70 మంది సైనికులతో పాటు ఆమె కోటను ఆక్రమించిన General ను నరికి చంపింది. ఆమె రౌద్రానికి భయపడిన మిగతా పోర్చుగీస్ సైన్యం పడవలలో పారిపోయారు.


రాణి అంబక్క ధైర్యాన్ని మరియు మనో నిబ్బరం మిగతా రాజులకు కూడా స్ఫూర్తినిస్తున్న విషయం పోర్చుగీస్ వారు జీర్ణించుకోలేకపోయారు. వేరే రాజులతో ఆమెను బెదిరించడానికి ప్రయత్నించాలని చూసారు. అంతే కాకుండా స్వయానా తన భర్త యుద్ధం చేస్తాము మరియు ఉల్లాల రాజ్యాన్ని తగులబెడతామని బెదిరించిన కూడా బెదరలేదు.


ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా నా అదరని మరియు బెదరని రాణి అంబక్క ను చూసి పోర్చుగీస్ ఖంగుతిన్నారు. ఈసారి Anthony D Noronha ( Portuguese Viceroy of Goa) ను రంగంలోకి దింపారు. 1571 లో మూడువేల మంది పోర్చుగీస్ సైన్యంతో Armada అనే యుద్ధనౌక సహాయంతో ఉల్లాల పైన మెరుపు దాడి చేశారు.


రాణి అంబక్క తన కులదైవాన్ని దర్శనం చేసుకొని కోటకు బయలుదేరి వస్తుంటే మార్గ మధ్యలో కోట కాపలాదారుడు వచ్చి జరిగిన ఉదంతం చెప్పగానే వెను వెంటనే తన గుర్రాన్ని యుద్ధ రంగం వైపు తిప్పింది. ఒక మెరుపుల, ఒక మహాచండీ ల యుద్ధ భూమిలోకి దూకింది. భరతమాత కోసం, దేశం కోసం అని అరుస్తూ యుద్ధభూమిలో కి దిగింది. అటు నేల పైన మరియు ఇటు సముద్రంలో, అటు వీధి వీధిలో మరియు ఇటు సముద్రతీరంలో యుద్ధం భీకరంగా సాగింది. మెల్లగా ఒడ్డు పైన ఉన్న పూర్తి పోర్చుగీస్ సైన్యాన్ని సముద్రంలోకి దింపుతూ వాళ్ల పడవలలో పారిపోయేలా చేశారు. ఇటు పిమ్మట ఒడ్డు పైన ఉన్న తన సైన్యాన్ని అగ్ని బాణాలు వేయించ సాగింది. నేలపై నుండి కొన్ని వేల బాణాలు సముద్రంలో ఉన్న పోర్చుగీస్ పైకి వేయించి వాళ్లను సముద్రంలోనే మట్టు పెట్టించింది..


కానీ యుద్ధంలో గాయపడిన రాణి అంబక్క ను ఎలాగైనా చంపాలని సామంతులకు డబ్బు మభ్యపెట్టి ఆమె పైకి యుద్ధం చేయించారు. కానీ భయమంటే ఎరుగని రాణి తను గాయాలపాలైన కూడా యుద్ధం చేస్తూ కదనరంగంలో కన్నుమూసింది.

ఒక గొప్ప వీర వనిత మాతృదేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. రాణి అంబక్క పోర్చుగీస్ చరిత్రలోనే ఒక మరిచిపోలేని ఘట్టం. చిరస్మరణీయురాలు అయ్యింది. భారతదేశం ఉన్నన్ని రోజులు ఈ భారతీయులం అందరం మీకు రుణపడి ఉంటాము అంబక్క.


తన వీరత్వానికి ప్రతీకగా మరియు భయం అంటూ ఎరుగని తన ధైర్యానికి దాసోహమంటూ 2015 లో మోడీ ప్రభుత్వం నౌకా దళం లోని ఒక నౌకకి రాణి అంబక్క పేరు పెట్టి తమ రుణం తీర్చుకున్నారు.


గమనిక: మన భారతీయ చరిత్రలో మన రాజుల మరియు రాణులు ఏ రోజూ కూడా మొఘలుల చేతిలో మరియు బ్రిటిష్ వాళ్ల చేతిలో ఓడిపోలేదు, చనిపోలేదు. మన వాళ్ళ వెన్నుపోటు వల్లనే చనిపోయారు.


జయహో రాణి అంబాక్క జయహో

Copied..

Panchaag


 

మహాభాగవతం

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది రెండవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*42.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*కంసస్తు ధనుషో భంగం రక్షిణాం స్వబలస్య చ|*


*వధం నిశమ్య గోవిందరామవిక్రీడితం పరమ్॥9895॥*


 *42.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*దీర్ఘప్రజాగరో భీతో దుర్నిమిత్తాని దుర్మతిః|*


*బహూన్యచష్టోభయథా మృత్యోర్దౌత్యకరాణి చ॥9896॥*


బలరామకృష్ణులు అవలీలగా ధనుస్సును విఱిచిన విషయములను, దాని రక్షణకై తాను పంపిన యోధులను వధించిన సంగతులను కంసునకు తెలియవచ్చెను. ఆ యదువీరుల బలపరాక్రమములకు అతడు ఎంతయు భీతిల్లెను. దుశ్చింతలలో మునిగియున్న ఆ దుష్టునకు నిద్రయే కఱవయ్యెను. కనులు మూసినను, తెరచినను మృత్యుసూచకములైన పెక్కు అపశకునములు గోచరింపసాగెను.


 *42.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*అదర్శనం స్వశిరసః ప్రతిరూపే చ సత్యపి|*


*అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తథా॥9897॥*


నీళ్ళలోను, అద్దమునందును చూచుకొనినప్పుడు వాని ప్రతిబింబమునందు అతనికి శిరస్సు లేకుండ మొండెము మాత్రమే కనబడుచుండెను. ఆకాశమున చంద్రుడు ఒక్కడే ఉన్నప్పటికిని ఇద్దఱుగా గోచరించుచుండెను. అట్లే ప్రతి నక్షత్రము రెండుగా కనబడసాగెను.


*42.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*ఛిద్రప్రతీతిశ్ఛాయాయాం ప్రాణఘోషానుపశ్రుతిః|*


*స్వర్ణప్రతీతిర్వృక్షేషు స్వపదానామదర్శనమ్॥9898॥*


వానికి తన నీడయందు శరీరము శిథిలమైనట్లుగ తోచుచుండెను. చెవులలో చేతుల వ్రేళ్ళు ఉంచినప్పుడు ప్రాణములయొక్క శబ్దములు వినబడకుండెను. వృక్షములు బంగారుఛాయలతో ఒప్పుచున్నట్లు కనబడుచుండెను. దుమ్ములమీదను, బురదపైనను అడుగిడుచున్నప్పుడు పాదముద్రలు కనబడకుండెను.


*42.30 (ముప్పదియవ శ్లోకము)*


*స్వప్నే ప్రేతపరిష్వంగః ఖరయానం విషాదనమ్|*


*యాయాన్నలదమాల్యేకస్తైలాభ్యక్తో దిగంబరః॥9899॥*


స్వప్నములలో ప్రేతలను కౌగలించుకొనుచున్నట్లుగను, గాడిదపై ఎక్కిపోవుచున్నట్లుగను, విషమును భక్షించుచున్నట్లుగను చూచు చుండెను. ఇంకను జపాకుసుమమాలను ధరించినట్లుగను, శరీరమునందు అంతటను నూనెను పూసికొనినట్లుగను, దిగంబరముగా ఉన్నట్లుగను తోచసాగెను.


*42.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*అన్యాని చేత్థం భూతాని స్వప్నజాగరితాని చ|*


*పశ్యన్ మరణసంత్రస్తో నిద్రాం లేభే న చింతయా॥9900॥*


ఈ విధముగా అతనికి స్వప్నజాగ్రదవస్థలయందు ఇంకను పెక్కు అపశకునములు పొడసూపెను. ఆ కారణమున అతని చింత అధికమాయెను. మృత్యుభీతి మెండయ్యెను, కంటికి కునుకు లేకుండెను.


*42.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*వ్యుష్టాయాం నిశి కౌరవ్య సూర్యే చాద్భ్యః సముత్థితే|*


*కారయామాస వై కంసో మల్లక్రీడామహోత్సవమ్॥9901॥*


పరీక్షిన్మహారాజా! ఆ రాత్రి ఎట్లో గడచెను. సూర్యుడు తూర్పుదిక్కున ఉదయించెను. అంతట ఆ కంసుడు మల్లక్రీడా మహోత్సవమునకై ఆదేశించెను.


*42.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*ఆనర్చుః పురుషా రంగం తూర్యభేర్యశ్చ జఘ్నిరే|*


*మంచాశ్చాలంకృతాః స్రగ్భిః పతాకాచైలతోరణైః॥9902॥*


వెంటనే కొంతమంది రాజోద్యోగులు మల్లరంగమును సిద్ధపఱచి, దానిని చక్కగా అలంకరించిరి. తూర్యధ్వనులు, ఢంకాధ్వనులు మొదలయ్యెను. ప్రేక్షకులు కూర్చుండుటకై మంచెలను నిర్మించి, వాటిని పూలమాలలతోడను, పతాకములతోను, వస్త్రములతోను, తోరణములతోడను అలంకరించిరి.


*42.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*తేషు పౌరా జానపదా బ్రహ్మక్షత్రపురోగమాః|*


*యథోపజోషం వివిశూ రాజానశ్చ కృతాసనాః॥9903॥*


బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలగు పౌరులు, జానపదులు రాజాజ్ఞప్రకారము అందు ప్రవేశించి, తమ తమ స్థానములలో కూర్చుండిరి. ఆహ్వానములపై ఇతరదేశముల నుండి వచ్చిన రాజులు యథోచితముగా ఆసనములను అలంకరించిరి.


*42.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*కంసః పరివృతోఽమాత్యై రాజమంచ ఉపావిశత్|*


*మండలేశ్వరమధ్యస్థో హృదయేన విదూయతా॥9904॥*


కంసప్రభువు రాజసింహాసనముపై ఆసీనుడయ్యెను. మంత్రులను, మండలేశ్వరులును అతని చుట్టును జేరి కూర్చుండిరి. కాని, అపశకునముల కారణముగా అతని మనస్సు మాత్రము ఆందోళనకు గుఱియైయుండెను.


*42.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*వాద్యమానేషు తూర్యేషు మల్లతాలోత్తరేషు చ|*


*మల్లాః స్వలంకృతా దృప్తాః సోపాధ్యాయాః సమావిశన్॥9905॥*


తూర్యాది వాద్యములు మ్రోగదొడంగెను. అప్పుడు మదించియున్న మల్లయోధులు చక్కగా అలంకృతులై, భుజాస్ఫాలన మొనర్చుచు, తమ మల్లాచార్యులతోగూడి అందు ప్రవేశించిరి.


*42.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*చాణూరో ముష్టికః కూటః శలస్తోశల ఏవ చ|*


*త ఆసేదురుపస్థానం వల్గువాద్యప్రహర్షితాః॥9906॥*


చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోశలుడు మొదలగు ప్రముఖ మల్లయోధులు వినసొంపైన వాద్యధ్వనులకు పొంగిపోవుచు రంగస్థలమునకు చేరిరి.


*42.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*నందగోపాదయో గోపా భోజరాజసమాహుతాః|*


*నివేదితోపాయనాస్త ఏకస్మిన్ మంచ ఆవిశన్॥9907॥*


కంసుని ఆహ్వానముపై వచ్చిన నందుడు మొదలగు గోపాలురు అందు ప్రవేశించి, తాము తీసికొనివచ్చిన కానుకలను ఆ కంసరాజునకు సమర్పించిరి. పిమ్మట వారు తమ కొఱకై ఏర్పాటు చేయబడిన మంచెలపై ఆసీనులైరి.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే మల్లరంగోపవర్ణనం నామ ద్విచత్వారింశోఽధ్యాయః (42)*


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షక భటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట* యను నలుబది రెండవ అధ్యాయము (42)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 

*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*373వ నామ మంత్రము* 


*ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః*


కామేశ్వరునకు జీవనాడి వంటి పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కామేశ్వర ప్రాణనాడీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః*

 అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకులు ఆ తల్లి కరుణచే భౌతికపరమైన శాంతిసౌఖ్యములతోబాటు, ఆముష్మికపరమైన అభీష్టముల సిద్ధి లభించును.


పరమేశ్వరి శంకరుని జీవనాడి వంటిది. *శంకరుడు భయంకరమైన విషమును మ్రింగినను మరణమును పొందలేదు. దానికి కారణము నీ తాటంకముల మహిమయే గదా* అని శంకరభగవత్పాదులవారు తమ సౌందర్య లహరిలో ఇరువది ఎనిమిదవ శ్లోకంలో ఇలా అన్నారు:


*సుధామప్యఅర్ధము్య - ప్రతిభయ జరమృత్యు హరిణీం*

*విపద్యంతే విశ్వే - విధి శతమఖాద్యా దివిషదః |*


*కరాలం యత్ క్ష్వేలం - కబలితవతః కాలకలనా*

*న శంభోస్తన్మూలం - తవ జనని తాటంక మహిమా॥*

 

దేవియొక్క తాటంకములు (కర్ణ భూషణములు) అత్యంత మహిమాన్వితమైనవి. వాని సన్నిధిలో కాల ప్రభావము కూడా నిరోధింప బడును.


 ఓ పరమేశ్వరీ! బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ముసలితనాన్ని, మృత్యువును జయించాలని అమృతాన్ని సేవించారు. కాని ప్రయోజనం లేకపోయింది. వారందరూ ప్రళయకాలం వేళ కాలధర్మాన్ని పొందుతున్నారు. కాని అమృతమును కాకుండా మృత్యుతుల్యమైన,అతి ఉగ్రమైన, కాలకూట విషాన్ని మింగిన నీ భర్త పరమశివుడు మాత్రం ప్రళయకాలమందు కూడా కాలధర్మం చెందక కాలాతీతుడై, మృత్యుంజయుడైనాడు.దీనికి కారణం ఏమిటంటే తల్లీ...అదంతా పరమ పవిత్రమైన, పతివ్రతమైన నీయొక్క చెవికమ్మల ప్రభావమే కదా!


తల్లీ! బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల సకల దేవతలూ భయంకరమైన జరామృత్యువులను హరించే అమృతాన్ని గ్రోలి ప్రళయకాలంలో మరణిస్తున్నారు. అతిభయంకరమై లోకాలను దహించే కాలకూటమనే మహావిషాన్ని భక్షించిననూ నీ పతి శంభుడికి (శివుడికి) మరణం సంభవించలేదు. ఇందుకు ముఖ్యకారణం నీ చెవులకు భాసిల్లే రత్నతాటంకాల (రత్నాల కమ్మల) ప్రభావమే కదా! (నీ తేజస్సు మహిమ అంత అద్భుతమైనదని భావము).


తాటాకు, తాళి, తాటంకములు ఇవన్నీ తాటి ఆకు లో నుంచి వచ్చిన పదములు. తాటంకములు అంటే చెవి కమ్మలు.  ఇవి మంగళ సూచకములు. పూర్వపు రోజులలో తాళి, తాటంకములు అన్నీ తాటి ఆకుతో చేసినవే. తాళ పత్రములు అంటే తాటి ఆకులు, వీటి మీదనే మన శాస్త్రములన్నీ మనకు అందించ బడినాయి. కాగితము లేని రోజులలో ఈ తాళ పత్రములనే వాడే వారు. వాటినే తాళ పత్ర గ్రంథములు అని వాటిని పిలిచేవారు. పూర్వపు రోజులలో మరియు ఇప్పటికీ భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవము ఈ తాటాకు పందిళ్ల క్రిందనే జరుగుతుంది. విసన కర్రలు కూడా ఈ తాటాకు తోనే చేస్తారు. ముఖ్యముగా శ్రీ రామ నవమి నాడు ఈ విసన కర్రల వినియోగము చాలా ఎక్కువగా వుంటుంది. తాటాకుతో చేసిన విసనకర్రలను పేద బ్రాహ్మణునికి దానం ఇస్తే మహా పుణ్యము. వడ పప్పు, దక్షిణ తాంబూలములతో తాటాకు విసన కర్రలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం నేటికి ఆచారముగా వున్నది. 


చెవులలో ఈ తాటాకును దూర్చుకొని ఆభరణముగా కూడా వాడే వాళ్ళు.  అలా వచ్చినవి ఈ తాటంకములు. చెవి కమ్మలు. చెవికి పెట్టుకొనే ఆభరణములు.


తమిళనాడు లోని జంబుకేశ్వరం. ఒకప్పుడు జంబు మహర్షి ఇక్కడ తప మాచరించి శివుణ్ణి పూజించి నందువలన ఈ ఈశ్వరుణ్ణి జంబుకేశ్వరుడు అని అందురు. ఇది ఆపోలింగము.  శివ లింగము వున్న భాగములో ఎప్పుడూ నీరు ఊరుతూ వుంటుంది. జంబుకేశ్వరం లో అమ్మ వారు అఖిలాండేశ్వరి ఉగ్రకళతో చాలా భయంకరముగా ఉండేదని, తలుపులు తీయడానికి కూడా అర్చకులు భయపడుతూ వుండేవారు అని, కొంతమంది ఆమె ఉగ్రకళకు గురి అవుతూ వుండేవాళ్ళు అని పెద్దలు చెబుతూ వుండేవారు. ఇదే విషయాన్నీ వారు ఆచార్యులు వారు అక్కడకు వచ్చినప్పుడు విన్నవించుకొన్నారు. జగద్గురువులు అమ్మను ప్రార్ధించి అమ్మ యొక్క ఉగ్రకళను ఆవాహన చేసి శ్రీచక్ర రూపములో తాటంకములు చేయించి అమ్మ వారికి కర్ణాభరణములుగా అమ్మ వారికి సమర్పించినారు. అచ్చటనే వినాయకుడ్ని కూడా స్థాపించినారు అని పెద్దలు చెబుతూ వుంటారు. అప్పటి నుంచి అమ్మ ఉగ్ర రూపము పోయి సౌమ్యవతి అయినది అని కూడా చెబుతూ వుంటారు. ఇప్పటికీ అమ్మ వారి తాటంకములను తీయాలంటే మెరుగు కోసము  కంచి కామ కోటి పీఠాధిపతులు వచ్చి కార్యక్రమమును వారి చేతుల మీదుగా నిర్వర్తిస్తారు అని అంటారు. అంత గొప్ప శక్తి వంతమైనవి అమ్మవారి తాటంకములు. మాంగల్య బలము తక్కువగా   వున్న వాళ్ళు అక్కడకి వెళ్లి అమ్మ యొక్క తాటంకములను దర్శించి వస్తే  దోషము పోతుందని గట్టి నమ్మకము. నిజము కూడా. 


ఇదే విషయాన్ని పోతనగారు తన భాగవతంలో ఇలా చెప్పారు:


*క.కంద పద్యము*


మ్రింగెడి వాఁడు విభుం డని

మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!


ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.


(ఇది అసామాన్య శబ్దార్థసౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్ని దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే. కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది. భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాదానం ఈ పద్యం. 


అమ్మవారి మంగళ సూత్రము ఒక్కటేకాదు, ఆ తల్లి ధరించిన తాటంకముల మహిమకూడా హాలాహల భక్షణానంతరం శివునికి మరణము లేకుండా.చేసినది. గనుకనే ఆ తల్లి *కామేశ్వరప్రాణనాడీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు

*ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐



*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*833వ నామ మంత్రము*


*ఓం పంచాశత్పీఠ రూపిణ్యై నమః*


ఏబదియొక్క పీఠములు (మాతృకావర్ణాధిదేవతల) స్వరూపిణిగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పంచాశత్పీఠరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం పంచాశత్పీఠ రూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునికి మానవజన్మకు, మానవేతర జన్మకు గల భేదము, మానవజన్మను పొందినందుకు ఆ పరమేశ్వరి నామమంత్రస్మరణతో కైవల్యమునందడానికి గల మార్గము ఆ తల్లి అనుగ్రహము వలన తెలియును.


జగన్మాత ఏబదియొక్క శక్తిపీఠముల స్వరూపిణిగా విరాజిల్లుతున్నది అని భావము. 


*పంచాశత్పీఠ* యనగా ఏబది (50) మాత్రమే యథార్థమైన అర్థము. కాని ఏబదికి దగ్గరగా ఉన్నసంఖ్య ఏబది ఒకటిని గ్రహించినచో ఈ నామ మంత్రమునకు సరైన భావము మనకు తెలియును. భాస్కరరాయలు వారు ఏబది ఒకటి అని తీసుకోవడానికి చాలా ప్రమాణాలు తెలియజేశారు. కాని, కొన్ని ప్రమాణములను మాత్రమే గ్రహించి వివరణచేయు ప్రయత్నము జరిగినది.


దక్షయజ్ఞంలో సతీదేవి భర్త అయిన పరమేశ్వరునకు అవమానం జరిగి, సతీదేవి ఆత్మత్యాగముచేయగా, పరమేశ్వరుడు సతీదేవి దేహంతో ప్రళయతాండవము ప్రారంభించాడు. లోకాలు ఆ రుద్రుని తాండవమునకు తల్లడిల్లిపోతుంటే, నారాయణుడు తన సుదర్శనంతో సతీదేవి దేహాన్ని ఖండించగా, ఆ ఖండములు *ఏబది ఒక్కచోట* పడి, శక్తిపీఠములుగా వెలసినవి. గనుక శ్రీమాత *పంచాశత్పీఠరూపిణీ* యని అనబడినది.


జగన్మాత అకారాది క్షకారాంత మాతృకా వర్ణరూపిణి. మాతృకా వర్ణములు ఏబది ఒకటి (51) *అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఐ ఒ ఔ అం అః క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష)*. ఈ అక్షరములకు అధిదేవతలు (శక్తిలు) గలరు. వారు నెలకొని యున్న ప్రతీ ఒకటి ఒక్కొక్క శక్తి పీఠమై విలసిల్లుచున్నవి. అటువంటి ఏబదిఒక శక్తిపీఠముల స్వరూపము తనదిగా భాసిల్లు పరమేశ్వరి *పంచాశత్పీఠరూపిణీ* యని అనబడినది🙏🙏🙏


ఈ అధిదేవతలకు, మనదేహంలో ఉన్న షట్చక్రములకు, లలితాసహస్ర నామస్తోత్రంలోని కొన్ని శ్లోకములతో సమన్వయించి ఇక్కడ వివరణ చేయబడినది.


*శ్రీలలితా సహస్ర నామస్తోత్రంలోని*


98వ శ్లోకము:-


*విశుద్ధచక్రనిలయాఽఽరక్తవర్ణా త్రిలోచనా|*


*ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా॥98॥*


99వ శ్లోకము:-


*పాయసాన్నప్రియా త్వక్-స్థా పశులోక భయంకరీ|*


*అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ॥99॥*


కంఠస్థానమునందున్న విశుద్ధిచక్రములో పదహారు (16) దళముల పద్మము మధ్యగల కర్ణికలో *డాకినీదేవి* ఏకముఖముతో పాటలవర్ణము (ఎరుపు-తెలుపు కలిసిన వర్ణము) లో భాసిల్లుచున్నది. ఈ తల్లి మనశరీరంలోని చర్మధాతువు (త్వక్) నందు శక్తిని ప్రసాదించును. పాయసాన్నము అనిన ఈ దేవతకు ఇష్టము. ఈ విశుద్ధిచక్రంలోని పదహారు దళములందు గల పదహారు దేవతలు *డాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ పదహారు మంది మాతృకావర్ణములలోని *అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఐ ఒ ఔ* అను పదహారు అక్షరములకు అధిదేవతలు. వారు:- 1. అమృతా, 2. ఆకర్షిణి, 3. ఇంద్రాణి, 4.ఈశాని, 5. ఉమా, 6. ఊర్థ్వకేశి, 7. ఋద్ధిర, 8. ౠకార, 9. ఌకార, 10. ౡకార, 11. ఏకపదా, 12. ఐశ్వర్యా, 13. ఓంకారి, 14. ఔషధి, 15. అంబికా, 15. అఃక్షర.


100వ శ్లోకము:-


*అనాహతాబ్జ నిలయా శ్యామాభావదన ద్వయా|*


*దంష్ట్రోజ్జ్వలాఽక్షమాలాది ధరా రుధిర సంస్థితా॥100॥*


101వ శ్లోకము:-


*కాళరాత్ర్యాదిశక్త్యౌఘ వృతా స్నిగ్ధౌదన ప్రియా|*


*మహావీరేంద్రవరదా రాకిణ్యంబా స్వరూపిణీ॥101॥*


హృదయస్థానము నందున్న అనాహతచక్రములో గల పండ్రెండు (12) దళముల పద్మము మధ్యగల కర్ణికలో *రాకినీదేవి* రెండు ముఖములతో శ్యామలవర్ణము (ఎరుపుతో కూడిన నలుపు) లో భాసిల్లుచున్నది. ఈ తల్లి మనశరీరంలోని రక్త ధాతువు నందు శక్తిగా ఉన్నది. నేతితో కలిపిన అన్నము ఈమెకు ఇష్టము. ఈ అనాహతచక్రంలోని పండ్రెండు దళములందు గల పండ్రెండు దేవతలు *రాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ పండ్రెండు దేవతలు మాతృకావర్ణములలోని *క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ* అను పండ్రెండు అక్షరములకు అధిదేవతలు. వారు 1. కాళరాత్రి, .2. ఖాతీత, 3. గాయత్రి, 4. ఘంటాధారిణి, 5. ఙామిని, 6. చంద్ర, 7. ఛాయా, 8. జయా, 9. ఝంకారి, 10. ఙ్ఞానరూపా, 11. టంకహస్తా, 12. ఠంకారిణి.


102వ శ్లోకము


*మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా|*


*వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా॥102॥*


*రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా|*


*సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ॥103॥*


నాభిస్థానమునందున్న మణిపూరచక్రములో పది దళముల పద్మమందలి మధ్య కర్ణికలో *లాకినీదేవి* మూడు ముఖములతో ఎరుపు వర్ణములో విరాజిల్లుచున్నది. ఈ తల్లి మనశరీరంలోని మాంసధాతువు నందు శక్తిగా ఉన్నది. ఈమెకు బెల్లము కలిపిన అన్నము అనిన ఇష్టము. ఈ మణిపూరచక్రంలోని పద్మమునకు పది దళములు ఉంటాయి. ఈ పది దళములందు గల పది దేవతలు *లాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ పది దేవతలు మాతృకావర్ణములలోని *డ ఢ ణ త థ ద ధ న ప ఫ* అను పది అక్షరములకు అధిదేవతలు. వారు :- 1.డామరి, 2. ఢంకారిణి, 3. ణామిరి, 4. తామసి, 5. స్థాణ్వి, 6. దాక్షాయిణి, 7. ధాత్రి, 8. నందా, 9. పార్వతి, 10. ఫట్కారిణి


104వ శ్లోకము


*స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా|*


*శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణాఽతిగర్వితా॥104॥*


105వ శ్లోకము


*మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా|*


*దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ॥105॥*


ఉదరస్థానము నందున్న స్వాధిష్ఠానచక్రములో ఆరు దళముల పద్మమునందు మధ్య కర్ణికలో *కాకినీదేవి* నాలుగు ముఖములతో పచ్చని వర్ణములో భాసిల్లుచున్నది. ఈ దేవత మనశరీరంలోని మేధస్సు ధాతువు నందు శక్తిగా ఉన్నది. ఈమెకు పెరుగు కలిపిన అన్నము అనిన ఇష్టము. ఈపద్మములోని ఆరు దళములందు గల ఆరు దేవతలు *కాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ ఆరు దేవతలు మాతృకావర్ణములలోని *బ భ మ య ర ల* అను ఆరు అక్షరములకు అధిదేవతలు. వారు:- 1. బందిని, 2. భద్రకాళి, 3. మహామాయ, 4. యశస్విని, 5. రమా, 6. లంబోష్టితా.


106వ శ్లోకము


*మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రాఽస్థి సంస్థితా|*


*అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా॥106॥*


107వ శ్లోకం (మొదటి పాదం)


*ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ|* (107వ శ్లోకం, మొదటిపాదము)


పిరుదుల స్థానమునకు పైన, జననేంద్రియ స్థానమునకు క్రిందను గల మూలాధార చక్రములో నాలుగు దళముల పద్మమందలి కర్ణికలో *సాకినీదేవి* నాలుగు ముఖములతో దూమ్ర వర్ణములో భాసిల్లుచున్నది. ఈ తల్లి మనశరీరంలోని అస్థి (ఎముకల) ధాతువు నందు శక్తిగా ఉన్నది. ఈమెకు పప్పు కలిపిన అన్నము అనిన ఇష్టము. ఈ మూలాధార చక్రంలోని పద్మమునకు నాలుగు దళములు ఉంటాయి. ఈ నాలుగు దళములందు గల నాలుగు దేవతలు *సాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ నాలుగు దేవతలు మాతృకావర్ణములలోని *వ శ ష స* అను నాలుగు అక్షరములకు అధిదేవతలు. వారు:- 1. వరదా, 2. శ్రీ, 3. షండా, 4. సరస్వతి.


107వ శ్లోకం (రెండవ పాదము)


*ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా॥107॥* (రెండవ పాదము)


*మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా|*


*హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ॥108॥*


భ్రూమధ్యమునందు గల ఆఙ్ఞా చక్రము. ఇది గంగ, యమున, సరస్వతి సంగమ స్థానము. ఇడ, పింగళ, సుషుమ్నసంగమ స్థానము, వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి సంగమస్థానము, చంద్రఖండము, సూర్యఖండము, అగ్నిఖండము సంగమ స్థానము, చంద్రమండలము, సూర్యమండలము, అగ్నిమండలము సంగమ స్థానము. 

ఇక్కడ గల ద్విదళ పద్మమునందు హాకినీ దేవి రూపములో భ్రూమద్యస్థానమందున్న ఆఙ్ఞా చక్రములో రెండు దళములుగల పద్మము యొక్క కర్ణిక యందు ఆరు ముఖములతో శుక్ల (తెల్లని) వర్ణము కలిగి భాసిల్లుతున్నది.

ఈ దేవి మజ్జ (ఎముకల మద్య ఉండు) ధాతువు నందు శక్తి రూపమై ఉంటుంది. ఈమెకు పసుపుఅన్నము (పులిహోర) అనిన ఇష్టము. ఇక్కడ హంసవతీ, క్షమావతి అను ఇద్దరు శక్తి దేవతలు హాకినీ దేవిని సదా సేవిస్తూ ఉంటారు. భ్రూమధ్యమునందు *హ క్ష* అను అక్షరములతోబాటు మధ్య *ళ* (ద్రవిడభాషల ప్రకారము) అను అక్షరముగూడ గలదని కొందరు పండితులుచెబుతుంటారు.


ఇంతవరకూ మనం తెలుసుకున్న వివరముల ప్రకారం



విశుద్ధి చక్రంలో - 16


అనాహత చక్రంలో - 12


మణిపూర చక్రంలో - 10


స్వాధిష్ఠాన చక్రంలో - 6


మూలాధార చక్రంలో - 4


ఆజ్ఞా చక్రంలో - 2


*వెరసి 50 అక్షరములు, 50 దేవతలు*


(కాని ఆజ్ఞా చక్రంలో హ, క్ష అను అక్షరముల మాత్రమేగాక ద్రవిడ భాషలప్రకారం మధ్యలో *ళ* అను అక్షరం కూడా తీసుకొనవచ్చునని విజ్ఞులు వివరించారు) 


*గనుక వెరసి అక్షరములు 51* గా భావించవచ్చును.


వీటినే *పంచాశత్పీఠములు* అందురు. ఆయాపీఠములలో ఆయాదేవతల రూపంలో పరమేశ్వరి విరాజిల్లుతున్నది గనుక అమ్మవారు *పంచాశత్పీఠరూపిణీ* యని అనబడినది.


ఇక్కడ ఒక సందేహం రావచ్చు. విశుద్ధిచక్రం నుండి క్రిందికి వచ్చి మరల ఆజ్ఞాచక్రమును చెప్పుకొనుటలో ఔచిత్యమేమిటి అనగా, ఇక్కడి వివరణ: 


మాతృకావర్ణ వివరణ *అ* కారం నుండి ప్రారంభ అయినది గనుక, కంఠస్థానములో నున్న విశుద్ధిచక్రం నుండి వివరణ ప్రారంభమయినది. భ్రూమధ్యంలో గల ఆజ్ఞాచక్రంలో గల *హ క్ష* అను అక్షరములు చివరలో చెప్పబడినవి గనుక మూలాధార చక్ర వివరణ అయిన తరువాత ఆజ్ఞాచక్రవివరణ చెప్పబడినది.


వేరొక కారణమేమిటి అంటే - కంఠస్థానములో నున్న విశుద్ధిచక్రము ఆకాశతత్త్వము, తరువాత అనాహతచక్రము వాయుతత్త్వము, ఆ తరువాత మణిపూర చక్రము అగ్నితత్త్వము, స్వాధిష్ఠాన చక్రము జలతత్త్వము, మూలాధార చక్రము పృథ్వీతత్త్వము. అందుచే పంచభూతముల క్రమం ప్రకారం ఈ వివరణలో విశుద్ధిచక్రం నుండి ప్రారంభించడమైనది. చివరగా వివరించిన ఆజ్ఞాచక్రము మనస్సుకు సంబంధించినది. శరీరంలోని పంచభూతములను నియంత్రించేది ఆజ్ఞాచక్రము. అందుచే వివరణ ఈ క్రమంలో జరిగినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పంచాశత్పీఠరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

మహాభాగవతం



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది రెండవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*42.14 (పదమూడవ శ్లోకము)*


*తద్దర్శనస్మరక్షోభాదాత్మానం నావిదన్ స్త్రియః|*


*విస్రస్తవాసఃకబరవలయాలేఖ్యమూర్తయః॥9883॥*


శ్రీకృష్ణుని దర్శనమైనంతనే నగరభామినుల మనస్సులు ఆ స్వామిపట్ల ఆకర్షింపబడెను. అంతట వారు తమను తాము మఱచిపోయిరి. ఆ పారవశ్యములో వారి వస్త్రములు, కొప్పుముడులు, కంకణములు సడలిపోసాగెను. అప్పుడు వారు చిత్తరవులవలె ఎక్కడివారక్కడ నిశ్చేష్టలై ఉండిపోయిరి.


*42.15 (పదునైదవ శ్లోకము)*


*తతః పౌరాన్ పృచ్ఛమానో ధనుషః స్థానమచ్యుతః|*


*తస్మిన్ ప్రవిష్టో దదృశే ధనురైంద్రమివాద్భుతమ్॥9884॥*


*42.16 (పదహారవ శ్లోకము)*


*పురుషైర్బహుభిర్గుప్తమర్చితం పరమర్ద్ధిమత్|*


*వార్యమాణో నృభిః కృష్ణః ప్రసహ్య ధనురాదదే॥9885॥*


అనంతరము శ్రీకృష్ణుడు పౌరులద్వారా ధనుర్యాగ స్థానమును తెలిసికొని అందు ప్రవేశించెను. అచట ఆ స్వామి ఇంద్రధనుస్సువలె అద్భుతమైన ఒక వింటిని చూచెను. స్వర్ణాలంకార శోభితమైన ఆ ధనుస్సును కొందఱు పురుషులు పూజించుచుండిరి. పెక్కుమంది యోధులు కడు జాగరూకులై దానిని రక్షించుచుండిరి. రక్షకభటులు వారించుచున్నను వారిని లెక్కసేయక శ్రీకృష్ణుడు బలప్రయోగముతో దానిని తన చేతిలోనికి తీసికొనెను.


*42.17 (పదిహేడవ శ్లోకము)*


*కరేణ వామేన సలీలముద్ధృతం సజ్యం చ కృత్వా నిమిషేణ పశ్యతామ్|*


*నృణాం వికృష్య ప్రబభంజ మధ్యతో యథేక్షుదండం మదకర్యురుక్రమః॥9886॥*


పిమ్మట ఆ ప్రభువు తన వామహస్తముతో దానిని అవలీలగా పైకెత్తి, అచటి జనులందఱును చూచుచుండగనే వింటినారిని సంధించెను. ఒక్కనిమిషములో ఆ స్వామి ఆ అల్లెత్రాడును లాగి, బలమైన మదపుటేనుగు చెఱకుగడను వలె, ఆ ధనుస్సును రెండు ముక్కలు గావించెను.


*42.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*ధనుషో భజ్యమానస్య శబ్దః ఖం రోదసీ దిశః|*


*పూరయామాస యం శ్రుత్వా కంసస్త్రాసముపాగమత్॥9887॥*


కృష్ణభగవానుడు ఆ ధనుస్సును విఱిచివేయునప్పుడు ఏర్పడిన శబ్దము ఆకాశమునందును, అంతరిక్షమునందును, సకల దిక్కులయందును నిండెను. ఆ ధ్వని చెవుల సోకినంతనే కంసుడు భయముతో వణకిపోయెను.


*42.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*తద్రక్షిణః సానుచరాః కుపితా ఆతతాయినః|*


*గ్రహీతుకామా ఆవవ్రుర్గృహ్యతాం వధ్యతామితి॥9988॥*


ఆ ధనుస్సును రక్షించుచున్న యోధులును, వారి అనుచరులును మిగుల కుపితులైరి. పిమ్మట వారు బలరామకష్ణులను హింసింపదలచి సాయుధులై 'పట్టుకొనుడు, బంధింపుడు' అని కేకలు పెట్టుచు, వారిని చుట్టుముట్టిరి.


*42.20 (ఇరువదియవ శ్లోకము)*


*అథ తాన్ దురభిప్రాయాన్ విలోక్య బలకేశవౌ|*


*క్రుద్ధౌ ధన్వన ఆదాయ శకలే తాంశ్చ జఘ్నతుః॥9889॥*


అంతట బలరామకృష్ణులు తమను చంపుటకై ఉద్యుక్తులైన ఆ రాజభటులయొక్క దుడుకుచేష్టలను గమనించి క్రుద్ధులైరి. వెంటనే వారు అచట విఱిగిపడియున్న ధనుస్సుయొక్క ముక్కలను చేబూని, వాటితో ఆ యోధులను చావమోదిరి.


*42.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*బలం చ కంసప్రహితం హత్వా శాలాముఖాత్తతః*


*నిష్క్రమ్య చేరతుర్హృష్టౌ నిరీక్ష్య పురసంపదః॥9890॥*


ఆ సమయమున రక్షకభటులకు తోడుగా నిలుచుటకై కంసప్రేరణతో వచ్చిన యోధులను గూడ ఆ యదువీరులు హతమార్చిరి. పిదప వారు యజ్ఞశాల ప్రధాన ద్వారమునుండి బయటికి వచ్చి, మిగుల సంతోషముతో మథురాపుర శోభలను గాంచుచు సంచరించిరి.


 *42.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*తయోస్తదద్భుతం వీర్యం నిశామ్య పురవాసినః|*


*తేజః ప్రాగల్భ్యం రూపం చ మేనిరే విబుధోత్తమౌ॥9891॥*


అప్పుడు పురవాసులు అందఱును ఆ మహాపురుషుల యొక్క అద్భుత శౌర్య పరాక్రమములను గూర్చి విని ఎంతయు ఆశ్చర్యపడిరి. పిమ్మట వారు ఆ యదువీరుల యొక్క పటిమను, ధైర్యసాహసములను, నిరుపమాన రూప వైభవములను చూచి, 'వీరు మానవమాత్రులుగారు, దైవాంశ సంభూతులే' అని తలపోసిరి.


 *42.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*తయోర్విచరతోః స్వైరమాదిత్యోఽస్తముపేయివాన్|*


*కృష్ణరామౌ వృతౌ గోపైః పురాచ్ఛకటమీయతుః॥9892॥*


ఆ సోదరులు ఇరువురు నగర వీథులలో స్వేచ్ఛగా సంచరించుచుండిరి. ఇంతలో సూర్యుడు అస్తమించెను. అంతట బలరామకృష్ణులు తోడిగోపాలురతో గూడి నగరమునకు వెలుపల నందాదులు విశ్రమించుచున్న తమ బండ్లకడకు చేరిరి.


 *42.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*గోప్యో ముకుందవిగమే విరహాతురా యాః ఆశాసతాశిష ఋతా మధుపుర్యభూవన్|*


*సంపశ్యతాం పురుషభూషణగాత్రలక్ష్మీం హిత్వేతరాన్ ను భజతశ్చకమేఽయనం శ్రీః॥9883॥*


పొంకమైన శరీరాంగముల వైభవమును బట్టి లక్ష్మీదేవి జగదేకసుందరి. ఆమె సౌందర్యాతిశయమునకు ముగ్ధులైన బ్రహ్మాదిదేవతలు 'ఆమె తమకు దక్కిన బాగుండును' అని ఎంతగానో కోరికపడిరి. కాని ఆ లక్ష్మీదేవి మాత్రము ఆ శ్రీహరియొక్క సర్వాంగరూప వైభవమునకు ఆకర్షితురాలై ఆ పురుషోత్తముని వరించినది. అనగా శ్రీహరియొక్క లోకాతీతమైన అవయవ సౌభాగ్యము అతిలోక లావణ్యవతియైన లక్ష్మీదేవిని గూడ ముగ్ధురాలిని చేసినదన్నమాట. అట్టి పరమపురుషుని యొక్క అపురూప సౌభాగ్యములను గాంచుచు ఆనందించెడి భాగ్యము అబ్బుట పెక్కుజన్మల తపఃఫలముగాక మఱేమగును. ఈ విషయమును గూర్చియే శ్రీకృష్ణుడు గోకులమును వీడి మథురకు వచ్చుచున్నప్పుడు విరహాతురలైన గోపికలు ఇట్లు అనుకొనిరి. "రేపటి సుప్రభాతము మథురానగరవాసులకు సుఖావహము కాగలదు". గోపికలు నాడు పలికిన మాటలు నేడు సత్యములైనవి. ఏలయన మథురవాసులు శ్రీకృష్ణుని సౌందర్యమాధుర్యములను తనివిదీర ఆస్వాదించుచు పరమానందభరితులైరి.


 *42.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*అవనిక్తాంఘ్రియుగలౌ భుక్త్వా క్షీరోపసేచనమ్|*


*ఊషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితమ్॥9894॥*


విడుదులకు చేరిన పిమ్మట బలరామకృష్ణులు పాదములను,హస్తములను ప్రక్షాళనమొనర్చుకొని, పాయసాన్నములవంటి ఆహారమును ఆరగించిరి. మఱునాడు కంసుడు చేయదలచిన పన్నుగడలను గూర్చి ఎఱింగి, వారు ఆ రాత్రి సుఖముగా గడపిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

మహనీయుని మాట

 🌻 *మహనీయుని మాట*🍁

      

*"నీకు కావాల్సింది నీవు ఎదుటి వారి నుండి సంగ్రహించినప్పుడు వారికేమి కావాలో చూసుకునే బాధ్యత నీకే ఉంటుంది. వాడుకొని వదిలేస్తే... నీవు ఎంత ప్రయత్నించినా నీకు కావాల్సింది వస్తుందేమో కాని నీ కోసం ఎవరు మిగలరు."*

     

🌹 *నేటి మంచి మాట* 🌼

   

*"ఇతరులు చెప్పేది వినకుండా ... సలహాలు ఇవ్వడం అంటే రోగ నిర్ధారణ చేయకుండా ఔషధం ఇచ్చినట్లు."*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻.

సిరికొలువు

 _*సిరికొలువు*_


_*(తిరుచానూరు శ్రీ క్షేత్ర మహిమ)*_

 *18.భాగం* 


_*శ్రీ వైకుంఠంలో పరంధాముడు*_


ఇంత ప్రత్యేక దృష్టితో బ్రహ్మసృష్టించిన భూలోకాన్ని ఇతర లోకాలకంటే మిన్నగా శ్రద్ధగా ప్రేమగా పోషించ సాగినాడు పరంధాముడైన 

శ్రీ మహావిష్ణువు. 


వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుని ఆదేశం మేరకు ఎందరో పరమ యోగులు, మరెందరో మునులు, ఋషులు లోకకల్యాణం కోసం తప మాచరిస్తూ వుండినారు. ఎట్టి ఒడుదుడుకులు లేకుండా కొన్ని వేల ఏండ్ల కాలం గడిచిపోయింది.


ఇలా ప్రశాంతంగా తపస్సులు చేసుకుంటున్న ఋషీశ్వరులకు తమ ధ్యానంలో కొన్ని అమంగళ దృశ్యాలు గోచరించాయి. అనేక ఈతి బాధలు, అతి వృష్టి, అనావృష్టి, భూకంపాలు, జలప్రళయాలు, 


జంఝూమారుతాలు భయానకమైన రోగాలు ఇవన్నీ భూలోకాన్ని చుట్టుముట్టినట్లు, వీటితోపాటు రక్కసుల బెడద దాపురించినట్లు భీతిని కలిగించే భయానక ఘట్టాలు ఆ తపోమూర్తులకు కన్పించాయి. 


వీటన్నింటి నుండి బయటపడలేక సతమత మవుతున్న భూలోక మానవులు నిస్సహాయంగా, సహాయం కోసం, చేయూతకోసం నింగివైపు అర్రులు చాస్తూ వుండిన సన్నివేశాలు, ఆ మహనీయు లకు కన్నులకు కట్టినట్లు గోచరించినాయి.


"దీనికి పరిష్కారం ఏమిటి? భవిష్యత్తులో మానవుడు వైకుంఠానికి గాని, కైలాసానికి గాని వెళ్లి నేరుగా 

శ్రీ మహావిష్ణువుతో, పరమశివునితో మొరపెట్టు కోగలడా? సాధ్యం కాదే! మరి వారికి ఏది దారి? భవిష్యత్తులో రాబోయే విపత్తులనుంచి మానవుని ఎలా రక్షించాలి. దీనికి పరిష్కారం ఒక్కటే. 


మనం అందరం త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి మొరపెట్టు కోవడమే. వేరే మార్గం లేనే లేదు" అంటూ భూలోకంలోని తపస్సంపన్నులైన ఋషివర్యులందరూ, దేవతలతో పాటుగా అందరూ నేరుగా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు.


"ఔనౌను! మీరంటున్నది నిజమే. దానికి పరిష్కారం శివుడు చెప్ప గలడేమో' అంటూ అందరినీ కైలాసానికి పిలుచుకువెళ్లాడు బ్రహ్మదేవుడు.


బ్రహ్మాది దేవతలతో వచ్చిన ఋషీశ్వరులను చూచి వారు చెప్పింది సావధానంగా విని ఇలా అన్నాడు పరమశివుడు. “నిజమే మీరు చెప్పింది సత్యం. భవిష్యత్కాలంలో వచ్చే ఇక్కట్లను పోగొట్టి లోకకల్యాణం చేకూర్చగల నిత్య కల్యాణ చక్రవర్తి ఆ 

శ్రీ మహావిష్ణువు ఒక్కడే. 


అన్నింటిని పరిష్కరించి, దారి

చూపించగలవాడు ఆ వైకుంఠ వాసుడు ఒక్కడే. కనుక అందరం కలిసి అక్కడికే వెళదాం పద" అంటూ అందరినీ వైకుంఠలోకానికి పిలుచుకువెళ్లాడు.


ఈశానాది దిక్పాలురు, బ్రహ్మాది దేవతలు, ఎందరో మహనీయులయిన తపస్సంపన్నులు ఎందరోవచ్చి శ్రీ వైకుంఠనాథుని దర్శించి మొరపెట్టుకొన్నారు. 


అతి తొందరలో ఏవేవో విపరీతాలు కలుగుతున్నట్లుగా దృశ్యాలు గోచరిస్తున్నా యని, దానికి పరిష్కారం చూపించి, లోకక్షేమం కలిగించ గలిగినవాడవు నీ వొక్కడవే స్వామీ! అంటూ సాగిలబడినారు, దండ ప్రణామాలర్పించినారు.


అందుకు భూరమానాథుడైన 

శ్రీ మహావిష్ణువు ప్రశాంత గంభీరంగా వారిని పరికించి చూస్తూ, దేవతలారా! ఋషీశ్వరులారా! ఆందోళన అవసరమే లేదు.నన్ను దర్శనం చేసుకొన్నారు కదా! 


ఎలాంటి దుర్నిమిత్తాలైనా, తొలగుతాయి. అష్టకష్టాలు కూడా తొలగుతాయి, సమస్త కల్యాణ పరంపరలు సిద్ధిస్తాయి.మీరన్నట్లుగా, రాబోయే కాలంలోబలహీనులు, అలసులు, అల్పా యుష్కులు, నిరంతర లౌకిక వ్యాపారమగ్న మానసులైన మానవులు ప్రత్యక్షంగా వైకుంఠానికి వచ్చి నన్ను దర్శనం చేసుకోలేరు. 


నన్నే కాదు, వారు ప్రత్యక్షంగా, కైలాసానికి గాని, బ్రహ్మలోకానికి గాని రాలేని అసమర్థులుగా వుంటారు. అందుకే భవిష్యత్తులో ఈవిపరీతార్థాలు చోటు చేసుకుంటాయి. మహనీయులారా! మీ మీ ధ్యానంలో గోచరిస్తున్న ఇక్కట్లు మానవులకు కలగకుండా చేయాలి. అందు ఒక్కటే మార్గం వుంది. 


నేను అవతరించడం ఒక్కటే. భూలోకంలో అవతరించి కలియుగాంతం వరకు ప్రత్యక్షంగా దర్శనమివ్వాలి. దర్శించిన వారిని అందరిని తరింపచెయ్యాలి. వారి ఆపదలన్నింటిని తొలగించాలి. 


వారిచేత తృణమో, పణమో దానంగా స్వీకరించి వారి వారి కోరిక లన్నింటిని తీర్చాలి. ఇవే అప్పటి నా అవతారలక్ష్యాలు కావాలి. అప్పుడే మీకు కనపడిన దుర్నిమిత్తాల ప్రభావం వుండదు. ఉన్నా పనిచెయ్యదు.


అయితే నేను భూలోకంలో అవతరించడానికి గాను శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి ఇరువురూ అత్యంత ప్రధాన భూమికను కూడ నిర్వహించవలసివుంది. అంతేగాక ఆయా అవతార సమయాల్లో, నాతో పాటు లోక కల్యాణానికి భక్త రక్షణకు, శ్రీదేవి భూదేవు లిరువురూ అమూల్యమైన పాత్రను పోషించారు. 


అసలు శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి లేకుండా రాబోయే నా అవతారాలు నిర్వీర్యములు, నిష్ప్రయోజనాలు. వారు లేని నా అవతారం ఊహించడం కష్టం, గడచిన యుగాల్లో అన్ని అవతారాల్లో నా వెంట శ్రీలక్ష్మి, భూలక్ష్ములు వచ్చారు. కాని రాబోయే విశిష్టమైన అవతారాల్లో శ్రీలక్ష్మి, భూలక్ష్ములు ఇరువురూ నా కంటె ముందుగా భువిలో అవతరిస్తారు. ఆ తరువాతే వారి కోసం నేను అవతరిస్తాను. వారిరువురి పాత్ర అత్యంత ఆవశ్యకము.భూలోకవాసులకు అరిష్టాలను, అనిష్టాలను తొలగిస్తూ, అభిష్టాలను కలిగిస్తూ లోకానికి క్షేమాన్ని కలిగించే అవతారాలకు దేవర్షి అయిన నారదమునీంద్రులు కూడ కొంత దోహద పడతారు. అంటూ నారదుని వైపు ఒక్క క్షణం పాటు దృష్టి సారించి శ్రీమన్నారాయణుడు అందరితో ఇలా అన్నాడు.


"ఓ దేవతలారా! పరమయోగులైన మహనీయులారా! మీరందరూ ఎంతమాత్రం ఆందోళన లేకుండా నిశ్చింతంగా మీ మీ లోకాలకు వెళ్లండి. అందరూ లోక క్షేమాన్ని కోరుతూ తపస్సులు చెయ్యండి. ధ్యానాలు నిర్వహించండి. 


యజ్ఞాలు, యాగాలు చెయ్యండి. మీ భయాలు తొలగుతాయి. సర్వత్ర శుభపరంపరలు కలుగుతాయి. తద్వారా నిత్యకల్యాణం పచ్చ తోరణంగా అలరారుతుంది. అంతవరకు మీరందరూ నిరీక్షించండి! ఇక మీరందరూ క్షేమంగా వెళ్లిరండి అంటూ వీడ్కోలు పలికినాడు.అందరు వారి వారి లోకాలకు మరలి వెళ్లినారు. కొన్ని వేల సంవత్సరాల కాలం ఇట్టె గడిచిపోయింది.


 *గోవిందా గోవింద గోవిందా!!!!*

శివానందలహరి

 శ్రీ  ఆది శంకర విరచిత శివానందలహరి   🙏                    ................................. ప్రలోభాద్యైరర్థాహరణపరతంత్రో ధనిగృహే

ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే |

ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో

తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ || 22 ||

  

దొంగలరాజగు ఓ ప్రభూ! శంకరా! నామనస్సనే దొంగ ప్రలోభముతో ధనమునపహరించుటకై ధనికుని ఇంటిలో ప్రవేశించుటకు ప్రయత్నించుచూ తిరుగుచున్నది. దీనిని నేనెట్లు సహించగలను? (నా మనస్సేమో దొంగ, నువ్వేమో దొంగలరాజువి, దొంగలంతా ఒక్క జట్టు కదా) నా మనస్సుని నీ అధీనంలో ఉంచుకొని నిరపరాధియైన నా పై కరుణచూపుము తండ్రీ🙏

మరణమును కలిగించును.

 *దుష్టాభార్యా శఠో మిత్రంభృత్యో౬హంకార సంయుతః|*

*ససర్పే చ గృహే వాసో*మృత్యురేవ న సంశయః||*


దుష్ట భార్య, నమ్మకద్రోహం చేసే మిత్రుడు, గర్వముతో ఉన్న నౌకరు, పాములు ఉన్న ఇంటిలో నివసించుట అనునవి తప్పక మరణమును కలిగించును. 


శుభం భూయాత్

నడిచే దేవుడు…

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…    

నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*కంచి పరమాచర్య …*

       *ధర్మం పాటించుట...!*

               ➖➖➖✍️


```

పీఠాధిపతులు షడ్రసోపతమైన భోజనం చేయాలి.. వారికి దేనిమీద కూడా జిహ్వ ఉండకూడదు. అదీ నియమం.



ఒకరోజు ఆశ్రమంలో వంట వాడు వంట వడ్డించాడు. 


“ఈ పప్పు ఏ పదార్ధంతో చేసావ్?”అని అడిగారు స్వామి. 


వంట వాడు “తోట కూర పప్పు స్వామి” అని “బావుందా” అని అడిగారు. 


పొరటున స్వామి వారు “బావుంది” అని అన్నారు. 


మరుసటి రోజు, మూడవ రోజు కూడా వంట వాడు తోటకూర పప్పు వడ్డిస్తున్నాడు. 


“అదేమిటి రోజూ ఈ పప్పే ఎక్కడ నుండీ వస్తోంది?” అన్నారు. 


అప్పుడు వంట వాడు “మీరు తోటకూర పప్పు వండితే సంతోష పడుతున్నారు అని శిష్యులతో అన్నాను. వారు కట్టలు కట్టలు తీసుకుని వస్తున్నారు దానిలో మంచిది ఎంచి చేస్తున్నాను.” అన్నాడు.


“అలాగా!” అన్నారు స్వామి వారు.


మరునాడు భోజనం వేళ.. “నేను ఇవ్వాళ బిక్ష స్వీకరించటం లేదు!” అన్నారు. 


తరువాత రోజు కూడా బిక్ష చేయటం లేదు అన్నారు. 


“మరి ఏమి తీసుకుంటారు” అని అడిగారు శిష్యులు. 


“ఉసిరికాయ అంత గోమయం, ఆచమనం చేయటానికి గోమూత్రం” అన్నారు స్వామి. 


వారు అవే ఏర్పాటు చేశారు. 


ఉసిరికాయ అంత గోమయం నోట్లో వేసుకునేవారు, గోమూత్రం చేతిలో వేసుకుని ఆచమనం చేసేవారు. 


అలా వారం రోజులు అయిపోయాయ్. పీఠాధిపతులు ముద్ద ముట్టటం లేదు. ఆశ్రమం లోని వారు అందరు వచ్చి కాళ్ళమీద పడిపోయారు. 


“ఏమైంది స్వామి ఎందుకు?” అని అడిగారు. 


దానికి స్వామి వారు “నేను రేపటి రోజున ఏదైనా ఒక గ్రామానికి వెళితే నన్ను అనుగ్రహ భాషణం చేయమంటారు. నేను గురువు యొక్క స్వరూపం తో వేదిక మీద కూచుని ‘ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఇంద్రియాలకు లొంగ కూడదు’అని చెప్తాను. మహానుభావులు శంకరాచార్యులు కూచున్న పీఠo కి అధిపతినయి ఒక తోటకూర పప్పు రుచి కి లొంగి పోయిన నేను జగద్గురు శంకరాచర్య అని పిలిపించుకోనా... పీఠాధిపతి ని అని పిలిపించుకోనా.. పది మందిని కూచోపెట్టి అనుగ్రహభాషణం చేయనా.. ఎక్కడ ఉంది ఈ నాలుకకి ఆ యోగ్యత..? ఏ నాలుక తోట కూర పప్పు రుచి కి లొంగిందో దాన్ని గోమయం తో శుద్ధి చేస్తున్నాను.. గోమూత్రం తో శుద్ధి చేస్తున్నాను. మరొకనాడు ఆ నాలుక రుచి నందు ప్రవర్తించనంత కాలం అలా శుద్ధి చేస్తూనే ఉంటాను. ఈ మాట దేశ దేశాలు పొక్కుతుంది. కంచి పీఠాధిపతులు శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి వారికి తోటకూర పప్పు ఇష్టం అని.. తోటకూర పప్పు కి ప్రీతి పడిన వాడు పీఠాదిపతా.. ఈ పదవి లో కూచున్న నేను ప్రవర్తించని తీరు లో ప్రవర్తించాను. అందుకని శుద్ధి చేసుకుంటున్నాను.” అన్నారు.


ఆనాటి నుండీ స్వామి వారికి వడ్డిoచిన భిక్ష లో పదార్ధాలు..లడ్డు కూర పప్పు పులుసు అన్ని కలపడమే.. ఇది బావుంది అన్న మాట కానీ బాలేదు అన్న మాట కానీ అయన నోటివెంట రాలేదు..

ఇదీ పరమాచర్య జీవితం.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥

 "కంచిపరమాచార్యవైభవం"!!


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

పెళ్లిమంత్రాలకు

 *పెళ్లిమంత్రాలకు…

             అర్థం- పరమార్థం

               ➖➖➖✍️


పెళ్లంటే... తప్పెట్లు, తాళాలు, మూడు ముళ్లు, ఏడడుగులు... అంతేనా?


పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం...!


పెళ్లంటే... ప్రమాణాలు, వాటికి కట్టుబడి ఉండటం ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం.

ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం.

మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ‘వివాహం.’

ఆ సందర్భంలో వధూవరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు...

వాటి అర్థాలపై ప్రత్యేక కథనం...

జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. 

ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా ‘పెళ్లినాటి ప్రమాణాల’ని చెబుతారు. ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది. ఆ బంధం నిండునూరేళ్లు పవిత్రంగా, పచ్చగా ఉంటుంది.


వైవాహిక జీవితానికి మూలం...

వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షులు చెబుతారు. 


ఆధ్యాత్మిక, సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు.


సంప్రదాయ వివాహాలలో ముఖ్యంగా తొమ్మిది అంశాలు ఉంటాయి. అవి… సమావర్తనం, కన్యావరణం, కన్యాదానం, వివాహహోమం, పాణిగ్రహణం, అగ్నిపరిచర్య, లాజహోమం, సప్తపది, నక్షత్ర దర్శనం.


1.) సమావర్తనం:

పెళ్లితంతులో అత్యంత ప్రధానమైన ‘సమావర్తనం’ అంటే తిరిగిరావటం అని అర్థం. గురుకులంలో విద్యపూర్తయ్యాక, ‘చరితం బ్రహ్మచర్యోహం’ అనే శ్లోకాన్ని గురువుల అనుజ్ఞ కోసం పఠించి, గురువు అనుజ్ఞతో గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధపడడం. వివాహం చేసుకున్నాక, గురువుకు ఇచ్చిన మాటను అతిక్రమించకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది.

గృహస్థ ధర్మాన్ని స్వీకరించబోయే సమయంలో...

“రాత్రి సమయంలో స్నానం చేయను, వస్త్రరహితంగా స్నానం చేయను, వర్షంలో తడవను, చెట్లు ఎక్కను, నూతులలోకి దిగను, నదిని చేతులతో ఈదుతూ దాటను, ప్రాణ సంశయం ఏర్పడే సన్నివేశాలోకి ఉద్దేశపూర్వకంగా ప్రవేశించను...”అని పలికిస్తారు.


2.) అంకురారోపణం:

వివాహానికి ముందే కన్యాదాత ఈ కార్యక్రమం నిర్వర్తిస్తాడు….

పంచపాలికలలో పుట్టమన్ను పోసి నవధాన్యాలను పాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి పూజిస్తారు. ఇందులోని పరమార్థం... “కొత్తగా పెళ్లి చేసుకుంటున్న దంపతులారా! భూమిలో విత్తనాలను వేస్తే పంట వస్తోంది. కాబట్టి నేలతల్లిని నమ్మండి, పంట సంతానాన్ని పొందండి!” అని ధర్మసింధు చెబుతోంది.


3.) కన్యావరణం:

కన్యను వరించటానికి రావటాన్ని ‘కన్యావరణం’ అంటారు. మంగళవాద్యాల నడుమ వధువు ఇంటికి వచ్చిన వరుడిని, వధువు తండ్రి గౌరవంగా ఆహ్వానించి మధుపర్కం ఇస్తాడు.


4.) మధుపర్కం:

మధుపర్కమంటే ‘తీయని పానీయం’ అని అర్థం.(కొన్ని చోట్ల బెల్లంతో చేసిన పానకం ఇస్తారు) వరుడికి... తేనె, పెరుగు, బెల్లం కలిపిన మధురపదార్థం తినిపించాక, మధుపర్కవస్త్రాలను ఇస్తారు.

ఎదుర్కోలు సన్నాహం:

ఇరుపక్షాలవారు శుభలేఖలు చదివి, ఒకరికొకరు ఇచ్చుకుని, పానకం అందచేస్తారు.


5.) కన్యాదానం- విధి:

వధువు తండ్రి, తన కుమార్తెను మరో పురుషుడికి కట్టబెట్టడమే కన్యాదానం. కన్యాదానం చేసేటప్పుడు వల్లించే మంత్రాలు...

అష్టాదశవర్ణాత్వియకం కాన్యపుత్రవత్పాలితామయా

ఇదానిల తపదాస్వామి దత్తాం స్నేహేన పాలయం

‘కుమారుడితో సమానంగా పెంచుకొన్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో’

‘శ్రీలక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునికి ఇదిగో నీళ్లు... అంటూ వరుడి పాదాలు కడుగుతారు.

‘పితృదేవతలు తరించడానికి ఈ కన్యను నీకు దానం చేస్తున్నాను. సమస్తదేవతలు, పంచభూతాలు నేను చేస్తున్న ఈ దానానికి సాక్షులుగా ఉందురుగాక’ ‘అందంగా అలంకరించిన సాధుశీలవతి అయిన ఈ కన్యను ధర్మకామార్థ సిద్ధికోసం ప్రయత్నం చేస్తున్న ఈ సాధుశీలుడైన బుద్ధిమంతునికి దానంగా ఇస్తున్నాను’

‘ధర్మబద్ధంగా సంతానం పొందడానికి, ధర్మకార్యాలు నిర్వహించడానికి ఈ కన్యను ఇస్తున్నాను’ వధువు తండ్రి ‘పృణీద్వం’ (వరించవలసినది) అంటాడు. 

అప్పుడు వరుడు…‘పృణేమహే’(వరిస్తున్నాను) అంటాడు.

ఆ తరువాత వధువు తండ్రి వరునితో,

“నేత్రాయ పౌత్రపుత్రా లక్ష్మీం కన్యాంనామ్నీం

ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్య

‘ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ లక్ష్మీస్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించనివాడవై ఉండు!’ అని పలికిన వధువు తండ్రితో, ‘నాతిచరామి’ (అతిక్రమించను) అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు. 


ఇది వేదోక్త మంత్రార్థం. ఆ మాటకు అంత మహత్తు ఉంది. అలా అన్న తరవాతే వరుడి పాదాలను కడిగి, కన్యాదానం చేస్తారు.


6.) యోక్త్రధారణం: 

యోక్త్రం అంటే దర్భలతో అల్లిన తాడు. వివాహ సమయంలో వరుడు దీనిని వధువు నడుముచుట్టూ కట్టి ముడి వేస్తాడు. ఈసమయంలో వరుడు...

“ఆశాసానా సౌమ నవ ప్రజాం సౌభాగయం తను మగ్నే,

రనూరతా భూత్వా సన్న హ్యే సుకృతాయ కమ్” అంటాడు.

‘ఉత్తమమైన మనస్సును, యోగ్యమైన సంతానాన్ని, అధికమైన సౌభాగ్యాన్ని, సుందరమైన తనువును ధరించి, అగ్నికార్యాలలో నాకు సహచారిణివై ఉండు. ఈ జీవిత యజ్ఞమనే మంగళకార్యాచరణం నిమిత్తమై వధువు నడుముకు దర్భలతో అల్లిన తాటిని కడుతున్నాను...’ అనేది ఈ మంత్రార్థం.


7.) జీలకర్ర , బెల్లం :

వధూవరులు... జీలకర్ర, బెల్లం కలిపిన మెత్తని ముద్దను శిరస్సు భాగం లో, బ్రహ్మరంధ్రం పైన ఉంచుతారు. 


ఒకరిపట్ల ఒకరికి అనురాగం కలగడానికి, భిన్నరుచులైన ఇద్దరూ ఏకం కావడానికి, పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడేలా మనసు సంకల్పించటం దీని అంతరార్థం. 

ఈ సమయంలో “ఆభ్రాతృఘ్నీం వరుణ ఆపతిఘ్నీం బృహస్పతే లక్ష్యం తాచుస్యై సవితుస్సః” వరుణుడు, సోదరులను వృద్ధిపరచుగాక. బృహస్పతి, ఈమెను భర్తవృద్ధి కలదిగా చేయుగాక. సూర్యుడు, ఈమెను పుత్రసంతానం కలదానిగా చేయుగాక” అని అర్థం. 

ఇదే అసలైన సుముహూర్తం.


8.) మంగళ సూత్రధారణ :

(తాళి... తాటి ఆకులను గుండ్రంగా చుట్టి, పసుపు రాసి, పసుపుతాడు కడతారు. దానిని తాళిబొట్టు అంటారు. తాళవృక్షం నుంచి వచ్చింది).

వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని ముడి వేస్తూ ఈ కింది మంత్రాన్ని పఠించాలి…

“మాంగల్య తంతునానేన మమజీవన హేతునా

కంఠే బధ్నామి సుభగే త్వం జీవశరదాశ్శతం”


‘నా జీవానికి హేతువైన ఈ సూత్రాన్ని నీకంఠాన మాంగల్యబద్ధం చేస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు జీవించు... అని దీని అర్థం.

*పాణిగ్రహణము:

ధృవంతే రాజా వరుణో ధృవం దేవో బృహస్పతిః

ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం॥


చంద్రుడు (మనస్సు), బృహస్పతి (కాయం), అగ్నిహోత్రుడు (వాక్కు) ... వీరు ముగ్గురి నుంచి బతిమాలి, వధువును తీసుకువస్తాడట వరుడు. అంటే త్రికరణశుద్ధిగా కాపురం బావుంటుంది అని అర్థం!

(కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు, కొంతకాలం గంధర్వుడు, కొంతకాలం అగ్ని కాపాడతారట. ఆ తరువాత వారి ముగ్గురిని అడిగి వరుడు వధువును తీసుకువస్తాడట).

‘సోముడు నిన్ను గంధర్వుడికిచ్చాడు, గంధర్వుడు అగ్నికిచ్చాడు, నేను నిన్ను కాపాడవలసిన నాలుగవవాడను’ అని అభిమంత్రించి పెళ్లికూతురు చేయి పట్టుకొంటాడు. ఇదే పాణిగ్రహణం.

*తలంబ్రాలు: 

దీనినే అక్షతారోహణంగా చెబుతారు. అక్షతలు అంటే నాశం లేనివి. 

వీరి జీవితం కూడా నాశనరహితంగా ఉంటుందని చెప్పడం కోసమే ఈ తంతు. 


ఇందులో ముందుగా... ఒకరి తరవాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించాక వేడుక ప్రారంభం అవుతుంది. సంతానం, యజ్ఞాది కర్మలు, సంపదలు, పశుసంపదలు కలగాలని భార్యాభర్తలు వాంఛిస్తారు.


9.) సప్తపది:

ఏడడుగులు నడిస్తే సంబంధం దృఢపడుతుందట. ఈ ఏడడుగులు ఏడేడు జన్మల అనుబంధాన్నిస్తుంది. వరుడు వధువుని చేయి పట్టుకొని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకి పెడుతూ, ఏడు మంత్రాలు చెబుతాడు. ఇదే సప్తపది. 

ఇందులో వరుడు వధువుని ఏడు కోరికలు కోరతాడు. అన్నం, బలం, ప్రతిఫలం, వ్రతాదికం, పశుసంపద, సంతానం, ఋషుల అనుగ్రహం కలగాలని ఒక్కో అడుగూ వేస్తూ చదువుతారు.

ఈ మంత్రాలను త్రికరణశుద్ధిగా వల్లిస్తూ, అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, ‘పెళ్లినాడు చేసే ప్రమాణాల’ను అతిక్రమించకూడదని, వీటికోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహర్షులు చెప్పారు. 

ప్రమాణాలను నిలబెట్టుకున్న నాడు వివాహవ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే పెద్దల వాక్కు ఆచరణీయం.

**కొత్త బంధాలు, పరిచయాలు :

మానవజీవితంలోని అన్ని సంస్కారాలలోకీ అతి ముఖ్యమైనది వివాహం. దీనితో రెండు జీవితాల బంధం ముడిపడి ఉంటుంది. మూడుముళ్ల బంధంతో వివాహజీవితం కొనసాగుతుంది. వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టాలు స్నాతకం, కాశీయాత్ర, కన్యాదానం, శుభముహూర్తం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, సప్తపది, అరుంధతీ దర్శనం. ఈ కార్యక్రమాలు పురోహితుల వేదమంత్రాల మధ్య, బంధుమిత్రుల శుభాశీస్సుల మధ్య వైభవోపేతంగా జరుగుతుంది. వివాహంతో ఇరువర్గాల బంధువుల మధ్య కొత్త పరిచయాలు, కొత్త బంధాలు, అను బంధాలు కలుగుతాయి.

**ఆత్మల అనుసంధానం :


మానవుడు... కడుపులో ఉన్నప్పటి నుంచి, తనువు చాలించేవరకు మొత్తం 16 కర్మలు ఉంటాయి. వాటిల్లో వివాహం అతి ప్రధానమైనది, స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.


జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వడమే వైవాహిక జీవితం. పెళ్లితో స్త్రీపురుషుల అనుబంధానికి నైతికత ఏర్పడుతుంది. లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలలోకి వివాహబంధం అతి ముఖ్యమైనది, పవిత్రమైనది. పెళ్లి వెనుక ఉన్న సృష్టి రహస్యం, పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చారణలు అన్నీ కలిసి దంపతులను సృష్టికారకులుగా నిలబెడుతున్నాయి.✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

సంతృప్తి చెందిన పితృదేవతలు

 🙏🌞🌞🌞🕉️🕉️🌞🌞🌞🙏

*ఆయుః పుత్రాన్ యశః స్వర్గం*

 *కీర్తిం పుష్టిం బలం శ్రియమ్ |*

*పశు-సుఖం ధనం ధాన్యం*

 *ప్రాప్నుయాత్ పితృపూజనాత్ ||*

*దేవకార్యాదపి సదా*

 *పితృ కార్యం విశిష్యతే |*

*దేవతాభ్యః పితృణాం హి*

 *పూర్వమప్యాయనం శుభం ||*


భావం: శ్రాద్ధ కర్మలతో సంతృప్తి చెందిన పితృదేవతలు ఆ కర్తకి దీర్ఘాయువును, సత్సంతానము, కీర్తి, స్వర్గము, బలము, ధనధాన్యపశుసంపద మరియు సంతోషము అనుగ్రహించి ఆశీర్వదిస్తారు.

దైవారాధనకన్నా పితృదేవతారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. అందుకే దేవతలకంటే ముందు పితృదేవతలను పూజించడం - శ్రాద్ధం చేయడం ద్వారా వారిని సంతోషపెట్టడం మరింత శ్రేయస్కరం.

🙏🌞🌞🌞🕉️🕉️🌞🌞🌞🙏

చతురామ్నాయ పీఠాలు

 చతురామ్నాయ పీఠాలు...

1.దక్షిణాన శృంగేరీలో శారదాపీఠం - సురేశ్వరాచర్యులవారి ఆధ్వర్యాన 

2. తూర్పున పూరీలో గోవర్ధనపీఠం - పద్మపాదాచర్యులవారి ఆధ్వర్యాన 

3.పడమరన ద్వారకలో ద్వారకాపీఠం - హస్తామలకచార్యులవారి ఆధ్వర్యాన 

4. ఉత్తరాన బదరీనాథ్ దగ్గర జ్యోతిర్మఠం - తోటకాచర్యులవారి ఆధ్వర్యాన.

స్త్రీ జన్మ

 స్త్రీ జన్మ 

                  ➖➖➖✍️


ఒకరోజు ధర్మరాజుకొక ధర్మసందేహం వచ్చింది. ‘స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం వుంటుంది’ అని. 

*ఇదే విషయం భీష్ముడిని అడిగాడు.


*దానికి భీష్ముడు నవ్వి “నీకొక కథ చెబుతాను. అందులో నీకు సమాధానం దొరకవచ్చు!” అని చెప్పడం ప్రారంభించాడు….


పూర్వము ‘భంగస్వనుడు’ అనే రాజు వుండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్య సంధుడు. ప్రజలను కన్న బిడ్డల కన్న మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానము కలుగ లేదు. 


“అపుత్రస్య గతిర్నాస్తి!” అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడయినా లేడే అనే బాధతో అగ్ని దేవుడిని ప్రార్ధించి అగ్నిస్తుత యజ్ఞం చేసాడు. 


అగ్ని దేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు.


 ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజయిన తన అనుమతి లేకుండా ‘భంగస్వనుడు’ యజ్ఞము చేసి నూరుగురు కుమారులను పొందడం ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలని అనుకున్నాడు. తగిన సమయం కోసం వేచివున్నాడు.


ఒకరోజు ‘భంగస్వనుడు’ వేటకు వెళ్లాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేసాడు. 


ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది. 


 వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. స్పటికంలా స్వచ్ఛమయిన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు.


మునిగి పైకి లేచే సరికి ఆ రాజు ఆశ్చర్య కరంగా స్త్రీ గా మారిపోయాడు.


అయాచితంగా ప్రాప్తించిన స్త్రీత్వానికి చాలా చింతించాడు. 


“ఈ రూపముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లలకు, పుర జనులకు ఎలా ముఖము చూపించగలను !?" అని విచారించి...

"అయినా ఇలా అడవిలో ఉండలేను కదా!" అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు.


మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి

అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించ సాగాడు.


కాలక్రమంలో, ప్రకృతి వైపరీత్యాన 

మునికి - స్త్రీలాగా మారిన రాజుకి 

జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ మునివలన అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు.


వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో....

        

"కుమారులారా! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను. స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను. కనుక వీరు మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి." అంది. 


స్త్రీ గా మారినా ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృ వాక్య పాలకులుగా తండ్రిమాట పాటించి వారు రాజ్యాన్ని

పంచుకుని పాలించసాగారు.


ఇది చూసిన ఇంద్రుడు ‘నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది

అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య బేధము కల్పించాలని’ సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి ‘భంగస్వనుడి’కి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి....

"రాజకుమారులారా ! ఏమిటీ వెర్రి ఎవరో ఎవరినో తీసుకు వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా!? అసలు వీరి తండ్రి ఎవరు ? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు?" అని వారిలో కలతలు రేపాడు. 


అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నపుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేని పోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు. 


అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. 


చని పోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగింది.


ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రహ్మణ రూపుడై... “అమ్మా నీవు ఎవరవు ? ఎందుకిలా రోదిస్తున్నావు " అని అడిగాడు. 


అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడము కుమారులను కనడము అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము మునిద్వారా కుమారులను కనడము పూసగ్రుచ్చినట్లు చెప్పింది. 


అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై…. "రాజా! నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను" అని చెప్పాడు. 


 దానికి ఆమె "దేవా ! అజ్ఞానంతో

తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు అధిపతి వైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వ్యక్తినా! కనుక నన్ను దయతో రక్షించు!" అని వేడుకోగా....


ఆ మాటలకు కరిగి పోయిన ఇంద్రుడు "రాజా ! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రుల నైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను, ఎవరు కావాలో నీవే

ఎంచుకో !" అన్నాడు.


ఆమె (భంగస్వనుడు) సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది.


ఇంద్రుడు "అదేమిటి రాజా! మిగిలిన వారు నీ కుమారులు కాదా !?" అని అడిగాడు. 


 భంగస్వనుడు "వారు కూడా నా పుత్రులే! వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా!” అని చెప్పింది. 


ఇంద్రుడు సంతోషంతో "రాజా! నీ సత్యనిష్టకు సంతోషించాను. నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను" అని... రాజా ! నీకు ఇంకొక వరము ఇస్తాను నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి

ఇస్తాను" అన్నాడు.


దానికి ఆమె "మహేంద్రా ! నా కుమారులను బ్రతికించావు అదే చాలు.

స్త్రీగానే ఉంటాను" అంది. 


ఇంద్రుడు ఆశ్చర్యంతో "అదేమిటి రాజా ! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి ?"

అని అడిగాడు. 


స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గు పడి 

"మహేంద్రా! నేను స్త్రీగా ఉండడములో ఆనంద పడుతున్నాను. ఇందులో వున్న తృప్తి నాకు పుంసత్వములో కనబడలేదు కనుక ఇలాగే ఉండి పోతాను" అంది.


దేవేంద్రుడు నవ్వి “అలాగే అగుగాక”అని ఆశీర్వదించాడు.


అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు “యుధిష్టిరా ! ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం !” అని అడిగాడు.


 స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమయిన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు.


ఒకతెకు జగములు వణకున్ అగడితమై  

   ఇద్దరు కూడిన అంబులు ఇగురున్ ।

   ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా

   పట్టపగలె చుక్కలు రాలున్ ॥


[ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. 

అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతురాలని భావము]✍️

సంస్కృతపాఠశాలల్లో

 నమస్తే


తెలంగాణాలో ప్రతిష్ఠాత్మకమైన


వేములవాడ 

యాదగిరి గుట్ట 

శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని 

 సంస్కృతపాఠశాలల్లో 


అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి 


మనకు తెలిసిన పిలల్లను  అక్కడ జాయిన్ చేయిద్దాం 


సంస్కృతపాఠశాలలను 


సంస్కృతభాషా గురుశిష్యులను అభివృద్ధి చేసుకుందాం 


వారందరిని కాపాడుకుందాం 

సమయం అమూల్యమైనది


ఈ రెండు నెలలు దానికై అందరం ఏదోవిధంగా కృషి చేద్దాం


మన పిల్లలకు ప్రతిష్టాత్మకమైన మన  పాఠశాలల్లో జాయిన్ చేయిద్దాం


అడ్మిషన్ల కొరకై 

ఆవుల మల్లారెడ్డి 

ప్రిన్సిపాల్ గారిని 

సంప్రదించగలరు 


లేదా

9849641892


ఫోన్ చేయగలరు

Golden words







 

త్రయంబకుడు

 *త్రయంబకుడు అంటే అర్థం ఏమిటి......?*

*శివుడి మూడు నామాలకి ఉన్న పరమార్థం ఏమిటి...?*


https://chat.whatsapp.com/K9tvxPAjRSNDDMozFADfCo

_మహా మృత్యుంజయ మంత్రం_


ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |

ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||

అంటే...

అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. 

దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!


'మహా మృత్యుంజయ మంత్రం పై కొన్ని సందేహాలుంటాయి...

ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదా అని!!...


మరి అలాంటప్పుడు ఈ _మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు?_


అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? 

అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియదు!!! అర్థం కాదు!!... 


మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదు... 

పునర్జన్మ లేకపోవడం, అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. 

అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. 

ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. 

ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి.

ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. 


*అది ఎలాగంటారా?*

ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి, సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. 

ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది.


జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. 

అంటే మాయనుండి విడివడతాడు. 

పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను..


దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. 

(జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు.


ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు...

పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కద...


ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. 


_ఆ ఆరాధన ఎలాగుండాలంటే - జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం._


మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. 

ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. 

అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి, శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -

*పంచభూతాత్మకుడు :-*

శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.


*త్రయంబకుడు :-* 

శివుని మూడుకన్నులు కాలాలను (భూత, భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. 

ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. 

ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. 

దీనినే త్రివేణి సంగమం అని అంటారు.


*నామము :-* 

శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. 

అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.


*విభూతిదారుడు :-* 

సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. 

అంటే భస్మంగాక తప్పదు, నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.


*త్రిశూలం :-* 

సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.


*నాగాభరణుడు :-* 

సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం.


అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు.


అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.

వైశాఖ పురాణం - 9

 VAISAKHA PURANAM -- 09


వైశాఖ పురాణం - 9


9వ అధ్యాయము - పిశాచ మోక్షము


పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన, ఆకలి దప్పికలచేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడ త్రాగగనే కాలకూట విషమువలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగ నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపైనుండి ఆకలిదప్పికల బాధను భరింపలెక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధ ననుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును జూచి అబ్బురపడితిని. ఇదేమి యద్భుతమా యని అనుకొంటిని.


పిశాచరూపమున నున్న అతడు నన్ను జూచి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియు చేయజాలకపోయెను. నేనును వానిని జూచి జాలిపడి ఓయీ భయపడకుము. నీకు నావలన నేభయమును రాదు. నీవెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్నీ కష్టముండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడనని యతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రియని గుర్తింప లేకపోతిని. అప్పుడా పిశాచ రూపమున నున్న యతడిట్లు పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడనువాడను. సంకృతి గోత్రమువాడను. అన్ని విద్యలను నేర్చినవాడను. అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను. సర్వదేవతలను సేవించినవాడను. కాని నేను వైశాఖమాసమున కూడ అన్నదానమెవరికిని చేయలేదు. లోభము కలిగియుంటిని ఆ కాలమున వచ్చిన వారికిని భిక్షమునైన యీయలేదు. కావున నాకీ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా యీ దురవస్థకు కారణము. శ్రుతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్దికలవాడు. వైశాఖమున గూడ అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు పిశాచరూపము నందితిననియు, నేనిట్లు బాధపడుచున్నానియు వానికి చెప్పవలయును. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై యున్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై నున్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము.


వైశాఖమాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము నిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధనుండి విడిపోయి శ్రీమహావిష్ణు సాన్నిధ్యమునందుదును. కావున ఆ విధముగ చేయుమని వానికి చెప్పుము. నాయందు దయయుంచి నాకీ సాయమును చేయుము. నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము. అనుచు నా పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలముంటిని. నన్ను నేను నిందించుకొంటిని. కన్నీరు విడుచుచుంటిని. తండ్రీ నేనే శ్రుతదేవుడను. దైవికముగ నిచటకు వచ్చినవాడను. తండ్రీ! యెన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు. నీకీ బాధనుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలయునో చెప్పుమని ప్రార్థించితిని.


అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంత సేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరచుకొని యిట్లనెను. నాయనా! నీవు తలచిన యాత్రలను పూర్తిచేసికొని యింటికి పొమ్ము. సూర్యుడు మేషరాశియందుండగా, వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీమహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మనవంశము వారందరికిని ముక్తి కలుగును. కావున అట్లు చేయుమని చెప్పెను.


నేనును నా తండ్రి యజ్ఞననుసరించి యాత్రలను చేసి నా యింటికి తిరిగి వచ్చితిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగ శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన యన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపమునుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి యాశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి యచట శాశ్వత స్థితినందెను.


కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములయందును యిదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా! నీకింకేమి కావలయునో అడుగుము చెప్పెదనని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వివరించెను.


ఈ విషయమును నారదమహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను.


వైశాఖ పురాణం 9వ అధ్యాయం సంమాప్తం.

సాక్షాత్తు ఆ దేవుడే

 తాజా పళ్లు తీసుకుందామనుకున్న నాకు రద్దీ గా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఓ పళ్ళ దుకాణం కనపడింది, దుకాణం లో రకరకాల తాజా పళ్ళు ఉన్నాయి, కానీ దుకాణం యజమాని మాత్రం ఎక్కడా కనడలేదు,పళ్ళ రేటు రాసి ఉన్న కాగితం మాత్రం ఆయా పళ్ళ మీద ఉంది, దుకాణం మధ్య లో ఓ అట్టముక్క వ్రేలాడుతూ నా దృష్టి ని ఆకర్షించింది, కుతూహలం తో దానిపై ఏమి రాయబడి ఉందోనని చూసాను, దానిమీద "అయ్యా! నా తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది, కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకుని దానికి తగ్గ డబ్బు ను ఈ గళ్ళా పెట్టె లో వేయగలరు అని ఉంది.. 

నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈకాలం లో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా? అని, దొంగలు ఆ గల్లా పెట్టె ను ఎత్తుకెళితే ఇతని పరిస్థితి ఏంటి? ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది, ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకొని సాయంత్రం అతను డబ్బు తీసుకునుటకు దుకాణం కు వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణం కు చేరుకున్నాను, పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లా పెట్టెను తీసుకుని దుకాణం కట్టి వేస్తున్నాడు, నేను అతని దగ్గరికి వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకుని నీవు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా? ఎవరైనా దొంగలు నీ గల్లా పెట్టె ను ఎత్తుకెళితే ఎలా? పళ్ళ ను ఊరికే తీసుకుపోతే ఎలా? అని మందలించబోయాను, అందుకు అతను చిరునవ్వుతో" అంతా దైవేచ్ఛ " అన్నాడు మళ్ళీ అతనే అయ్యా! మొదట్లో నేను నా తల్లి గారితో మీలాగే అడిగాను, నేను నీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలా? అని, అందుకు మా అమ్మ "నాయనా! నాకు రోజులు దగ్గర పడ్డాయి, గోజూ నిన్ను చూడకుండా ఉండలేను, నేను ఆ దేవున్ని ప్రార్ధిస్తాను, నీవు నేను చెప్పిన విధంగా చేయి, అని చెప్పింది, అమ్మ చెప్పినట్టుగానే ఆరోజు నుండి ఈవిధంగా చేస్తున్నాను అన్నాడు, 

మరి నీకు ఏనాడూ నష్టం రాలేదా? అని అడిగాను కుతూహలం ఆపుకోలేక.. 

అతను అదే చిరునవ్వుతో "నష్టమా??? 

ఒకసారి ఈ గల్లా పెట్టె ను చూడండి అని అతని గల్లాపెట్టె ను తెరచి చూపించాడు, ఆశ్చర్యం! 

గల్లాపెట్టె నిండా డబ్బు! 

దుకాణం లోని పళ్ళ విలువ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది,

ఇవి చూడండి అని దుకాణం లో రకరకాల వస్తువులు చూపాడు.. 

వాటిలో చీరలు, బట్టలు,స్వెట్టర్లు,అప్పుడే వండుకుని తెచ్చిన పులావు, రకరకాల తినుబండారాలు.... 

అన్నింటిపైన "భయ్యా! అమ్మీజాన్ కు మా తరపున ఇవ్వండి" అని రాసిన కాగితాలు ఉన్నాయి.

అంకుల్ అమ్మను నా ఆసుపత్రి కి తీసుకురాగలరు, నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఓ డాక్టర్ తన విజిటింగ్ కార్డు ను ఓ కాగితానికి కట్ఠి దుకాణం లో వ్రేలాడదీసి వెళ్ళాడు..

ఇదంతా చూసిన నాకు కళ్ళ వెంబడి నీళ్ళాగడం లేదు,

సమాజమంతా స్వార్థం తో నిండిపోయింది, మంచితనం మచ్చుకైనా కనిపించడం లేదు అన్న నా భావన పటాపంచలైనట్టయింది, 

సమాజం లో మంచితనం ఇంకా బ్రతికే ఉంది, ముందు మన దృక్పథం లో మార్పు రావాలి, 

తల్లికి సేవచేస్తున్నందుకు గాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణం కు కాపలా కాస్తున్నాడు.. 

ఎంతగా కోపగించుకున్నా తిరిగి మనపై కోప్పడనిది సృష్టి లో ఎవరైనా ఉన్నారంటే అదిఒక అమ్మ ఒక్కటే! 

అమ్మ కు చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కాదు.

Kitchen n food

 I am Gangadhar Lanka my business Cow ghee, Buffalo ghee special inguva, pickles, powders, and Vadiyalu, papads,and jutebags if u wants any above items call me, my cell no. 8143998998

భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 


ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు. మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ 9848647145 కు వాట్సాప్ చేయండి. దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 


ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   


ఇట్లు 


మీ బ్లాగరు

advertisement


 

వైశాఖ పురాణం🚩*_ _*8

 🌹 *శుక్రవారం - మే 17, 2024*🌹

_*🚩వైశాఖ పురాణం🚩*_   

   _*8 వ అధ్యాయము*_

🕉️🪷🕉️🪷🕉️🪷🕉️🪷🕉️

      *పిశాచ మోక్షము*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన, ఆకలి దప్పికలచేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడ త్రాగగనే కాలకూట విషమువలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగ నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపైనుండి ఆకలిదప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధ ననుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును జూచి అబ్బురపడితిని. ఇదేమి యద్భుతమా యని అనుకొంటిని.


పిశాచరూపమున నున్న అతడు నన్ను జూచి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియు చేయజాలకపోయెను. నేనును వానిని జూచి జాలిపడి ఓయీ భయపడకుము. నీకు నావలన నేభయమును రాదు. నీవెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్నీ కష్టమునుండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడనని యతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రియని గుర్తింప లేకపోతిని. అప్పుడా పిశాచ రూపమున నున్న యతడిట్లు పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడనువాడను. సంకృతి గోత్రమువాడను. అన్ని విద్యలను నేర్చినవాడను. అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను. సర్వదేవతలను సేవించినవాడను. కాని నేను వైశాఖమాసమున కూడ అన్నదానమెవరికిని చేయలేదు. లోభము కలిగియుంటిని అకాలమున వచ్చిన వారికిని భిక్షమునైన యీయలేదు. కావున నాకీ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా యీ దురవస్థకు కారణము. శ్రుతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్దికలవాడు. వైశాఖమున గూడ అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు పిశాచరూపము నందితిననియు, నేనిట్లు బాధపడుచున్నానియు వానికి చెప్పవలయును. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై యున్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై నున్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖమాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము నిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధనుండి విడిపోయి శ్రీమహావిష్ణు సాన్నిధ్యమునందుదును. కావున ఆ విధముగ చేయుమని వానికి చెప్పుము. నాయందు దయయుంచి నాకీ సాయమును చేయుము. నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము. అనుచు నా పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలముంటిని. నన్ను నేను నిందించుకొంటిని. కన్నెరు విడుచుచుంటిని. తండ్రీ నేనే శ్రుతదేవుడను. దైవికముగ నిచటకు వచ్చినవాడను. తండ్రీ! యెన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు. నీకీ బాధనుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలయునో చెప్పుమని ప్రార్థించితిని.


అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంత సేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరచుకొని యిట్లనెను. నాయనా! నీవు తలచిన యాత్రలను పూర్తిచేసికొని యింటికి పొమ్ము. సూర్యుడు మేషరాశియందుండగా, వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీమహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మనవంశము వారందరికిని ముక్తి కలుగును. కావున అట్లు చేయుమని చెప్పెను.


నేనును నా తండ్రి యాజ్ఞననుసరించి యాత్రలను చేసి నా యింటికి తిరిగి వచ్చితిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగ శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన యన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపమునుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి యాశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి యచట శాశ్వత స్థితినందెను.


కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములయందును యిదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా! నీకింకేమి కావలయునో అడుగుము చెప్పెదనని శ్రుతదేవుడు  శ్రుతకీర్తి మహారాజునకు వివరించెను.


ఈ విషయమును నారదమహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను.


 _*వైశాఖ పురాణం ఎనిమిదవ*_ 

    *అధ్యాయం సంపూర్ణం*


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏

ఏబిసిడి లు నేర్పమని వస్తే ,

 ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు.


అది ప్రపంచంలోనే అతి పెద్ద మాల్. 

అక్కడ దొరకని వస్తువు అంటూ  ఉండదు.


ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?

అడిగాడు బాస్.


చెయ్యలేదు


సరే ! 

రేపు వచ్చి జాయిన్ అవ్వు. 

నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! 

.

తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది సేల్స్ మాన్  కి. 


చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు.


ఈ రోజు ఎంత మంది కస్టమర్స్  కి  సేల్స్ చేశావు?


కేవలం ఒకరు అని బదులిచ్చాడు సేల్స్ మాన్ 


ఒకటేనా ! 

నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. 

సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?


8,009,770 పౌండ్స్  చెప్పాడు మన సేల్స్ మాన్. 


వాట్ !! అదిరిపడ్డాడు  బాస్. 

అంత పెద్ద సేల్ ఏమి చేశావు? అడిగాడు. 


వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను.


గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే?  అన్నాడు బాస్.  

       

పూర్తిగా వినండి ..!!!


తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు


దాని కన్నా ఒక బోట్  లో వెళుతూ నది మధ్య చేపలు పడితే  బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్  డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. 


ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేదు అన్నారు.


అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4 డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను.


తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను.


బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు.


ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా !!!


లేదు సార్ ! బదులు ఇచ్చాడు సేల్స్ మాన్.


మరి ?  అన్నాడు బాస్. 


ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. 

తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే  హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను.


బాస్: అరే యార్ …!! 

ఇంతకీ  నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?


అప్పుడు ఆ సేల్స్ మాన్ చెప్పాడు 


, కార్పొరేట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్.


టీచర్ కి, సేల్స్ కు,ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్ 


ఏబిసిడి లు నేర్పమని వస్తే ,

పదిహేనేళ్ల తర్వాత వచ్చే ఐఐటి -నీట్-సివిల్స్ ,ర్యాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం... అని ఆన్సర్ ఇచ్చాడు😃😃😃


ప్రస్తుతం భారతదేశంలో corporate విద్య వ్యవస్థ ఇలాగే ఉంది

సీతారాముల కల్యాణ ఘట్టం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹మన సీతమ్మ కథలో సీతారాముల కల్యాణ ఘట్టం సాగుతోంది. ఇది ఏడవ భాగం. ప్రముఖ రచయిత్రి డా. పుట్టపర్తి నాగ పద్మిని గారు సీతాదేవిపై పరిశోధన చేసిన వారు కావడంతో వాల్మీకి రామాయణం లోని అంశాలనే గాక ఎన్నెన్నో భాషల్లో ఉన్న అనేక రామాయణాల్లోని విశేషాలను వెలికి తీసి మనకు అందిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో సీతాదేవి, శ్రీరాముల పెళ్లి సందర్భంగా వశిష్ఠుడు చెప్పిన దశరథుని వంశవృక్షం గురించి వివరించారు. పెళ్లి పెద్ద వంశవృక్షం చెప్పడం ఇప్పటికీ వింటూ ఉంటాం.ఆ విశేషాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

⚜ శ్రీ గోకర్ణనాథేశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 819


⚜ కర్నాటక  :- కుద్రోలి- మెంగళూరు


⚜ శ్రీ గోకర్ణనాథేశ్వర ఆలయం



💠 కర్ణాటకలోని అందమైన ఓడరేవు నగరాలలో మంగళూరు ఒకటి . 

అరేబియా సముద్రం ఒడ్డున విస్తరించి ఉన్న ఈ నగరం కేవలం పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, యాత్రికుల కేంద్రం కూడా.



💠 మంగళూరులోని కుద్రోలి గోకర్ణనాథేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందినది. కుద్రోలిలో ఉన్న ఈ శివాలయం తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ తీర ప్రాంత నగరంలో దసరా పండుగ వేడుకలకు కుద్రోలి వేదికగా కూడా ఉంది. నిజానికి ఇక్కడ దసరా ఉత్సవాలు మైసూర్ దసరా ఉత్సవాల మాదిరిగానే ఉంటాయి.


💠 కుద్రోలిలో గోకర్ణనాథేశ్వరాలయాన్ని నిర్మించడానికి విప్లవకారుడు నారాయణగురువే కారణం. నేడు, వేలాది మంది భక్తులు సందర్శించే అందమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. కుద్రోలి దేవాలయం నగరంలోని అత్యంత ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటి.


💠 ఇంతకుముందు టిప్పు సుల్తాన్ తన గుర్రాలను మేపడానికి దీనిని ఉపయోగించారు కాబట్టి ఆలయం నిర్మించిన భూమికి కుద్రే-వల్లి అనే పేరు పెట్టారు.(కుద్రే అంటే గుర్రం)


💠 ఈ ఆలయం శివుని యొక్క మరొక రూపమైన గోకర్ణనాథేశ్వరునికి అంకితం చేయబడింది మరియు సంఘ సంస్కర్త నారాయణ గురు మార్గదర్శకత్వంలో 1912 సంవత్సరంలో H కొరగప్ప అనే భక్తుడు నిర్మించారు.


💠 1991లో, ఆలయ గోపురం చోళ గోపురం శైలికి పునర్నిర్మించబడింది.  

అమ్మవారు అన్నపూర్ణేశ్వరి, భైరవుడు,గణేశుడు, హనుమంతుడు ఇక్కడ పూజించబడే ఇతర దేవతలలో కొన్ని.  సూర్యాస్తమయం తర్వాత ఆలయ ప్రాంగణం అంతా బంగారు వర్ణంతో మెరిసిపోతుంది 


🔆 చరిత్ర


💠 దక్షిణ భారతదేశంలోని పశ్చిమ తీరం మరియు పశ్చిమ కనుమల వెంబడి ప్రారంభ చేర సామ్రాజ్యాన్ని ఏర్పరచడానికి అనేక విల్లవర్/బిల్లవ వంశాలు కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. 

బిల్లవ సంఘం ఆధ్యాత్మికత రంగంలో తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవాలని కోరుకున్నారు. 

వారు తమ ఆరాధ్య దైవమైన శివునికి ఆధ్యాత్మిక నైవేద్యాన్ని బిల్వ సంప్రదాయానికి అనుగుణంగా నిబంధనలతో వ్యక్తిగతీకరించాలని కోరుకున్నారు. 

అటువంటి దృష్టాంతంలో బిల్లవ నాయకుడు మరియు వ్యాపారవేత్త అయిన అధ్యక్షుడు కొరగప్ప చొరవ తీసుకుని ఈ ఆధ్యాత్మిక అన్వేషణ కోసం గురువును కోరాడు.


💠 అధ్యక్ష కొరగప్ప బిల్లవ పెద్దల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి 1908లో శ్రీ నారాయణ గురుని సందర్శించారు. 

ఆయన బిల్లవులకు ఆలయాన్ని నిర్మించడానికి మార్గనిర్దేశం చేయమని శ్రీ నారాయణ గురుని ఆహ్వానించారు.

నారాయణ గురు ఆధ్యాత్మికతలో తన జ్ఞానం మరియు అనుభవంతో బిల్వలకు వారి ఆరాధ్య దైవమైన శివుని ఆలయాన్ని నిర్మించడంలో సహాయపడటానికి ఆదర్శ మార్గదర్శిగా మరియు గురువుగా (దక్షిణ భారతదేశం నుండి మంగళూరుకు దగ్గరగా) మారారు.

శివలింగాన్ని శ్రీ నారాయణ గురువే స్వయంగా తీసుకొచ్చారు.


💠 1966లో ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నారాయణ గురువు పాలరాతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, విలువైన రత్నాలు పొదిగిన కిరీటాన్ని భక్తులు సమర్పించారు. పునరుద్ధరణకు రూ. 1 కోటి, మరియు ఇప్పుడు ఇది మంగళూరులోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా మారింది. 


💠 ఆలయం అనేక పండుగలను నిర్వహిస్తుంది. మహా శివరాత్రి , కృష్ణాష్టమి, గణేష్ చతుర్థి , నాగర పంచమి, దీపావళి , నవరాత్రి , శ్రీ నారాయణ జయంతిని సంప్రదాయ వైభవంగా జరుపుకుంటారు. 

దీనికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఉన్నారు. 


💠 నవగ్రహాలు, అన్నపూర్ణేశ్వరి, మహాగణపతి, సుబ్రమణ్య, శనీశ్వరుడు మరియు ఆనందభైరవుల కోసం చిన్న ఆలయాలు ప్రధాన ఆలయం చుట్టూ ఉన్నాయి


🔆 నవరాత్రి


💠 ఈ పురాతన దేవాలయం నవరాత్రి సమయంలో బంగారు కాంతులతో మెరిసిపోతుంది. మంగళూరు దసరా వేడుకల్లో ఇదో సెంటరాఫ్ అట్రాక్షన్.

ఈ ఆలయ దసరా ఉత్సవాలను మంగళూరు దసరా అని పిలుస్తారు . 


💠 నవరాత్రి సమయంలో శారద మాత మరియు మహా గణపతి విగ్రహాలతో పాటు, నవ దుర్గాల జీవిత పరిమాణ విగ్రహాలను ఆకర్షణీయంగా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తారు.


💠 గణేష్, ఆది శక్తి మాత, శారదా మాత, శైల పుత్రి మాత, బ్రహ్మచారిణి మాత, చంద్రకాంత మాత, కూష్మాందినీ మాత, స్కంద మాత, కాత్యాహినీ మాత, మహాకాళి మాత వంటి నవదుర్గాల విగ్రహాలను పూజించడం ద్వారా మంగళూరు దసరా చాలా అద్భుతమైన రీతిలో జరుపుకుంటారు.

 గౌరీ మాత మరియు సిద్ధి ధాత్రి మాత. ఈ విగ్రహాలన్నీ నవరాత్రుల తొమ్మిది రోజులు ఘనంగా పూజించబడతాయి. పదవ రోజు, ఈ విగ్రహాలు మంగళూరు దసరా యొక్క గొప్ప ఊరేగింపులో నగరం అంతటా తీసుకువెళతారు.

ఊరేగింపు మరుసటి రోజు ఉదయం గోకర్ణనాథ క్షేత్రానికి తిరిగి వస్తుంది, అక్కడ పైన పేర్కొన్న అన్ని విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోని సరస్సులో నిమజ్జనం చేస్తారు.


💠 మంగళూరు రైల్వే స్టేషన్ నుండి 2.5 కి.మీ దూరం.




© Santosh Kumar

తల్లితండ్రులూ మారండి

 ముమ్మాటికీ తల్లి తండ్రులు వివాహాలను పాడు చేస్తున్నారు. వారి నాశనానికి

వీరే బాధ్యులు.


ఎవరిని కించపరచటానికో వ్రాసింది కాదు. సంఘంలో జరుగుతున్న సంఘటనలు వారి స్పందనలు మాత్రమే. ....


*ప్రస్తుత వివాహ వ్యవస్థ*


"ఆడపిల్లలు, వారి 

తల్లిదండ్రులదే పైచేయి"


కావలసిన అర్హతలు: BTech, Software ,America

అబ్బయికి సొంత ఇల్లు, 

తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం.

సిగరెట్, మందు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం.

ఆడపిల్లల తల్లితండ్రులకు 

సపోర్ట్ గా  ఉండాలి.


💥ఇంటర్వ్యూ: 


ఫోన్ చేయ్యగానే పిల్ల తల్లి మాట్లాడుతుంది.భర్తకు అవకాశంలేదు.


"అబ్బాయి చదువు,తెలివితేటలూ పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తాడు సదరు కంపెనీ వాడు". 

కాని,

10th పాస్ కాని తల్లి " మీ అబ్బాయి 

ఏ యూనివర్సిటీలో చదువుకొన్నాడు?" అనే ప్రశ్న. ( అంటే ఉద్యోగమిచ్చినవాడు వెధవ అన్నమాట ఈవిడ దృష్టిలో)

మీ అబ్బాయి ఫోటో,  వివరాలు whatsapp లో పంపండి ,  మా అమ్మాయిది పంపుతాము అంటుంది !  మనం పంపిస్తే వారు పంపరు. తరవాత

మనమే ఫోన్ చేయాలి. అడిగితె మొదటి వారం: 

"ఇంకా అమ్మాయి చూడలేదండి". రెండవ వారం :

" అమ్మాయి లేట్ గా వస్తోందండి. 

ఇంకా చూడలేదు" .

మూడవ వారం: 

" ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉందండి". 

నాలుగో  వారం:

శని,ఆదివారాలలో " అమ్మాయి తలనోప్పని పడుకుందండి" .

ఐదో వారం:

అమ్మాయి పేకేజ్ మీకన్నా 10 వేలు ఎక్కువండి. ఒప్పుకోలేదు" అని కానీ , లేదా " మీరు ఇన్ని సార్లు చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము" అనిఫోన్ పెట్టేసి, తరవాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు.


💥అమ్మాయిల విషయానికొస్తే:

తల్లి తండ్రుల గారాబం, తరవాత వారిమాట వినకపోవడం , మితిమీరిన స్వేచ్ఛా  జీవితంతో పెళ్లి చూపులనాడు పెళ్ళి కోడుకుతో సంభాషణ ఏకాంతంగా:


"మీ ఇంట్లో బాగేజీ , లగేజి ఉన్నాయా?

మీ ఇంట్లో  వీల్ ఛైర్ లు ఉన్నాయా?

మీ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా?

మీ ఇంట్లో రాహు కేతువులున్నాయా?"

అని అబ్బాయి తల్లితండ్రుల

నుద్దేసించి పై ప్రశ్నలు . తరవాత,

 

"మీ అమ్మ నాన్నలు మనతో 

ఉండడానికి వీలు లేదు,


నా సెల్ నువ్వు ఆన్సర్ చెయ్యొద్దు. 

నీ సెల్ నేను ముట్టుకోను! 


నేను వంట చెయ్యను. 

కర్రి పాయింట్ లో తెచ్చుకుందాము!

లేదా వంటమనిషి పెట్టుకుందాం..

 

నాజీతం సేవింగ్స్ కోసం బ్యాంకులో , 

నీ జీతం ఖర్చుపెడదాము!"


ఇంకా కొంతమంది " మనకి పిల్లలు వద్దు" అని నిబంధనలు.

కావాలి అని గట్టిగా పట్టుపడితే ఎక్కడైనా తెచ్చి పెంచుకుందాం...


లేకపోతె తాంబూలాలు లేవు. 

కొన్ని షరతులు తరవాత చెప్పి కూడా

తాంబూలాలు కాన్సిల్ చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి..


పెళ్ళైన తరవాత ఖర్మకాలి వారికి పడక..  విడాకుల వరకు వస్తే,

విడాకులకై సంతకం పెట్టాలంటే లక్షలు పరిహారం.

అప్పటికే అబ్బాయి క్రెడిట్,డెబిట్ కార్డులు బాలన్స్ జీరో చేసేస్తుంది. కాపురం చేయటం భయమేస్తుంది అంటుంది...

విడాకులైనా ఏ మాత్రము 

మార్పు, బాధ లేకుండా

కొత్త పెళ్లి కూతురు లాగ అవే కండిషన్లు.

సర్దుబాటు వ్యవహారం, పశ్చత్తాపం ఏకోశానా ఉండవు.


వీటన్నిటికి వెర్రి తల్లి సపోర్ట్! 


ఇలాంటి వాళ్లకు మళ్లీ ఒక బకరా నీ చూసి పెళ్లి చేస్తారు కాని, కాపురం చేయించగలరా?


ఉద్యోగం చేసే ఊరినుండి, లేదా విదేశాలనుండి వచ్చిందంటే సూట్కేసులతో సరాసరి ఎయిర్ పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే. 15 రోజుల తరవాతో లేదా వెళ్ళిపోయే టప్పుడు ఒక వారం ముందరో అత్తగారింట్లో ప్రత్యక్షం.


ప్రమాదమేమంటే, 

మగవారికి సంతానోత్పత్తి 90 సంవత్సరాలు దాకా ఉంటుంది. కాని

ఆడవారికి మొనోపోజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తోంది. తల్లితండ్రులు ఈ సంగతి  తెలిసో, తెలియకో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు.

ఆడపిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లితండ్రులు.... కాపురాలు చెడగొట్టి వాళ్ళ సంపాదనతో జల్సా చేసే... తల్లితండ్రులు కూడా ఉన్నారు అనటానికి ఏమాత్రం సందేహం లేదు. కొంత మంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ ఇది ! (వీళ్ళు కళ్ళు తెరిచేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది)

ఇవండీ!  మన మగ పిల్లలకు వివాహం కాకపోవడాని కారణాలు , వాస్తవాలు! 

అనుభ వించిన వారు చెప్పిన 

నగ్న సత్యాలు! 

నేను రాసినవి మాట్రిమొని కన్వెన్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడి తల్లితండ్రులు ,  ఆడపిల్లలు వేదనతో చెప్పిన  యదార్ధ సత్యాలు. అంతేకాని,  ఆడపిల్లలమీద అభాండాలు వెయ్యడం కోసం మాత్రం కాదు. 👉ఇది కేవలం అటువంటి ప్రవృత్తి కలవారికి మాత్రమె!👈 

🌹30 సం. వయసు దాటిఅదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు ,

🌹పెళ్లి చేసుకొని బాధలుపడి విడాకులు తీసుకొన్న అబ్బాయిలకు,

🌹ఇంకా పెళ్ళి చేయ్యక మంచి , మంచి అని సంబంధాలు వెదుకుతూ

అత్యాశతో వయసు దాటబెట్టిన అమ్మాయిల తల్లితండ్రులకు ,

🌹18 వయసు ఫోటోలు పెట్టి పాకేజీలను , క్వాలిఫికేషన్లు పోల్చుకొని

అత్యాసతో చార్మింగ్ పోయి జుట్టుకు రంగేసుకుని ఇంకా ఎదురు చూస్తున్న అమ్మాయిలు , 

🌹అబ్బాయిలకు 

🌹తల్లితండ్రుల స్వార్థ ఆలోచనలకు మనస్పర్థల తో ఉద్యోగాలు మాని కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలకు  

ఈ పోస్ట్ అంకితం.👍


🌷పోయిన వయసు రాదు.

🌷"35 వయసు దాటిన అబ్బాయిలు దయనీయ పరిస్థితి.


"పురుషుడు-స్త్రీ- వయస్సు" 

ఇవి మూడే ముఖమైనవి. 

జీతం, చదువు కాదు

ఒక వ్యక్తి ఆవేదన.


అందరూ... ఆలోచించండి.

👉తల్లితండ్రులూ కాస్త మారండి . అమ్మాయిలను కనగానే సరికాదు. సరిగా పెంచండి. 

ఇది వరకు అబ్బాయుల domination వుండేది. ఇప్పుడు అమ్మాయుల domination. కోడల్ని వెతకాలంటే తలపట్టుకుంటున్నారు అత్తగార్లు . అమ్మాయులని ఇలా తయారు చేసిన ప్రతి తల్లి మీద ఇలా కసి తీర్చుకున్నందుకే ఈ post .

Rent A Car in Hyderabad

 Rent A Car 

Sri vinayaka Travels 

Uppuguda 

Charminar 

Hyderabad 

6309527694

9492027245

SP PICKLES

 *SP PICKLES*

*సంప్రదాయ పచ్చళ్ళు*


*బ్రాహ్మణ సంప్రదాయ పద్దిలో బ్రాహ్మణ మహిళలతో తయారుచేయబడిన పచ్చళ్ళు*

*అన్ని రకాల కొత్త పచ్చళ్ళు పొడులు అప్పడాలు అన్నిరకాల ఒడియాలు తయారుగా ఉన్నాయి.ఎక్కువ మొత్తలలో తీసుకునేవాళ్లకు 10% నా కాస్టమర్స్ కు ఈ వారంలో ఆర్డర్ చేసినవాళ్లకు 5% తగ్గిచి ఇస్తున్నాము కస్టమర్స్ కోరికమేరకు ఈ అవకాశాన్ని కల్పించాతమైనది*🙏


**మాదగ్గర తయారు చేసిన అన్ని పచ్చళ్ళు పొడులు అప్పడాలు అన్నిరకాల ఓడియాలు సంప్రయం పద్దతిలో కలర్స్ ప్రిసర్వేటివ్స్ లేకుండా క్వాలిటీ పదార్ధాలతో తయారుచేస్తాము**


*ఉప్పుపచ్చళ్ళు*: *1kg cost*


చింతకాయ తొక్కు450/-

ఉసిరి తొక్కు450/-

ఉప్పు గోంగూర 450/-

పండుమిర్చి గోంగూర 550/-

పండుమిర్చి 550/-

దబ్బకాయ 450/-

నిమ్మకాయ 450/-

టమోటా 500/-


*ఇంగువ పోపుతో తయారు చేసిన పచ్చళ్ళు* 1 కేజీ కాస్ట్ 


పులిహోర గోంగూర 750/-

గోంగూర 650/-

పండుమిర్చి గోంగూర 650/-

పండుమిర్చి చింతకాయ 650/-


ఆవకాయ(వెల్లుల్లి/లేకుండా) 600/-

బెల్లం ఆవకాయ 600/-

పెసర ఆవకాయ 600/-

మెంతి ఆవకాయ 600/-

నువ్వు ఆవకాయ 600/-

కాలి్ఫ్లవర్ ఆవకాయ 600/-

పనసపోట్టు ఆవకాయ 750/-

పచ్చఆవకాయ 850/-

దోసవకాయ. 600/-

మాగాయ 650/-

*వంకాయ నిల్వ పచ్చడి* 750/-

అల్లం పచ్చడి 650/-

మామిడి అల్లం పచ్చడి 650/-

మామిడి ఆల్లం ఆవకాయ 650/-

టొమోటో పచ్చడి 550/-

మునక్కాయ టమోటా 650/-

*పచ్చిమిరప ఆవకాయ* 600/-

మామిడి తురుము పచ్చడి 600/-

మామిడి ముక్కల పచ్చడి 600/-

వెలక్కాయ పచ్చడి 650/-


*పొడులు* : *1kg cost*


కంది పొడి 550/

నువ్వులపొడి 500/-

ధనియాల పొడి 500/-

పప్పులపొడి 500/-

కరివేపాకు కారప్పొడి 550/-

అవిశగింజల పొడి 600/-

కొబ్బరి పొడి 550/-

రసం పొడి 500-

సాంబారు పొడి 650/-

నల్లకారం 600/-

పుదీనా కారపోదడి 750/-

మునగాకుపోడి 2000/-

మునగాకు కారపోడి 650/-


*వడియాలు* & *అప్పడాలు*: 


సగ్గుబియ్యం వడియాలు  1kg - 600/-

పెసర అప్పడాలు       650/-

మినప అప్పడాలు 650/-

మిర్చి 1050/- 

గుమ్మడి వొడియలు 1150

మినపిండి వోడియలు 650/-

బియ్యపారవ్వ ఒడియలు 650/-

*Snacks*


Any Hot Item:- 550rs perkg

Any Sweet item with oil:-600rs perkg

Any Sweet Item With Pure Ghee:-750


*మాదగ్గర ఇంకా*


 *చిట్టెంటాపోటు* *పాల ఇంగువ* *లభించును*


*మేము అన్నిరకాల పచ్చళ్ళు పొడులు AS బ్రాండ్ పప్పునూనెతో మాత్రమే తయారు చేస్తాము*


*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు* *చార్జీలు అదనం*

 

*అందరికీ నమస్కారం. మీరు దేశ విదేశాలలో ఎక్కడున్నా, మేము మీకు సహకరించగలము. మేము ఆహార పదార్థాలు (స్వీట్లు, ఖారా, పొడులు, పచ్చళ్ళు, చలిమిడి) స్వయంగా శుచి, శుభ్రతతో తయారు చేసి ఇయ్యగలము. మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యక్రమానికైనా మేము కావలసిన సరంజామా, మీ బడ్జెట్ ప్రకారం చీరలు, ధోవతులు, లుంగీలు, తువ్వాళ్ళు, జాకెట్టు బట్టలు, కర్చీఫ్లు, రిటర్న్ గిఫ్టులు పసుపు కుంకుమ పాకెట్లు, ఇట్లా మీకు కావాల్సిన ప్రతీది మీ సమయం ఆదా చేస్తూ, మీ ఇంటి దగ్గరకే ఏర్పాటు ఔతాయి. మీరు ఏ వయస్సు వారైనా మీకు పూజకైనా, పెళ్ళికైనా లేదా వ్రతాలకైనా అన్నీ ఏర్పాటు చేయబడతాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి*


*దయచేసి 

ఈ మెసేజ్ ని పంపవలసినదిగా

కోరుకుంటునను*


*పుచ్చా పల్లవి*

*గౌతమస గోత్రం*

*సత్యనారాయణ*

*విజయవాడ*

*సంప్రదించండి* : *7981370664*

*08662533848*


*7382665848* Gp or Pp number