💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో॥ *నిన్దాం యః కురుతే సాధోః తథా స్వం దూషయత్యసౌ*।
*ఖే భూతిం యః క్షిపేదుచ్చై ర్మూర్ధ్ని తస్యైవ సా పతేత్*॥
*సత్పురుషుని నింద చేసేవాడు తనను తానే నిందించుకున్న వాడవుతాడు. ఆకాశంలోకి గట్టిగా బూడిదను విసిరితే అది అతడిపైకే వచ్చి పడుతుంది....కదా???*
👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇
సాధు నిందను జేసెడి జనుడు జగతి
యాత్మ నిందనె చేసి నట్లగును జూడ
భస్మమును తాను గగనమ్ముపైకి విసర
పడును నయ్యది తనపైనె కడకు జూడ
శ్లో𝕝𝕝
*కస్త్వం కోహం కుత ఆయాతః*
*కా మే జననీ కో మే తాతః*౹ *ఇతి పరభావయ సర్వమసారం*
*విశ్వం త్యక్త్వా స్వప్న విచారం* ॥23॥
భావం: నీవెవరు? నేనెవరు? ఎక్కడ నుండి వచ్చాను? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? ఇదీ నువ్వు విచారణ చెయ్యవలసినది. *ఈ ప్రపంచం అంతా సారహీనమైనది; కేవలం కలలో కనిపించు దృశ్యం లాంటిదే అని దీనిని విడిచిపెట్టుము*.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి