25, ఆగస్టు 2020, మంగళవారం

*ధార్మికగీత*

       
          *శ్లో:- అగ్నిహోత్రం,  గృహక్షేత్రే ౹*
                 *గర్భిణీమ్ వృధ్ధబాలకౌ  ౹*
                 *రక్త హస్తేన నో పేయాత్ ౹*
                 *రాజానం దైవతం గురుమ్ ౹౹*
                                    *
*భా:- లోకంలో మనం ఉత్త చేతులతో  పోకూడని, పోరాని సందర్భాలు,సన్నివేశాలు ఎనిమిది తారసపడుతుంటాయి. అవి.1. "అగ్నిహోత్రము":- మన పరి సరప్రాంతాలలో లోకకళ్యాణార్థం జరిగే యజ్ఞ,యాగాల  సందర్శనకోసం వెళ్ళేటప్పుడు హోమద్రవ్యాలను భక్తితో అర్పించాలి. యాగఫలం మనకు శుభాలనిస్తుంది. 2."గృహక్షేత్రము":- బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు పండ్లో,మిఠాయిలో తీసికొని వెళ్లడం మర్యాదసూచకము. 3."గర్భిణీ":- గర్భవతియైన స్త్రీ యోగక్షేమాల పరామర్శకై వెళ్ళేటప్పుడు ఫలమో, ఫలాహారామో ఆత్మీయంగా ఇచ్చి'  శుభాకాంక్షలు అందజేయాలి.4."వృద్ధులు":- వయోవృద్ధులను చూడడానికి వెళ్ళినపుడు,  ప్రేమాదరాభిమానాలతో మాట్లాడి' వారు తినగలిగినవి ఇవ్వాలి. 5."బాలలు":- కల్లాకపటం తెలియని దైవస్వరూపులైన బాలల  వద్దకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా  ఫలాలు, మిఠాయిలు ప్రేమతో ఇవ్వాలి. వారి ఆనందానికి మేర ఉండదు. 6."రాజు":- ప్రజల్ని కన్నబిడ్డలుగా, కంటికి రెప్పలా కాపాడే ప్రభువు దగ్గరికి వెళ్ళేటప్పుడు కృతజ్ఞతగా పండ్లు అర్పించాలి. 7. "దేవుడు" :-దేవుని గుడికి వెళ్ళినప్పుడు టెంకాయ, పండ్లు, పూలు భక్తిగా సమర్పించాలి. 8."గురువు":- జ్ఞానబోధచే జీవాత్మ,పరమాత్మ తత్త్వాన్ని తెలిపి, జీవితనౌకకు చుక్కాని వంటి గురువు సన్నిధికి వెళ్ళేటప్పుడు సముచిత ద్రవ్యాలను వినమ్రంగా అర్పణ చేయాలి. వీరందరి హార్దిక శుభాశీస్సులు, శుభకామనలు, శుభాకాంక్షలు మనకు శుభప్రదములు , మంగళప్రదములై సుఖ జీవనయానానికి రాచబాట వేయగలుగుతాయి. మనశ్శాంతినిచ్చి, ఆధ్యాత్మికపురోగమనానికి  దోహదం చేస్తాయని సారాంశము*.
                               
                *సమర్పణ*   : 
***********************

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*651వ నామ మంత్రము*

*ఓం విజ్ఞాత్ర్యై నమః*

విజ్ఞానమును ప్రసాదించు జ్ఞానశక్తి స్వరూపిణికి నమస్కారము.

ఇంద్రియములలో చైతన్యము ప్రసాదించి శక్తిని అనుగ్రహించు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విజ్ఞాత్రీ*  అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం విజ్ఞాత్ర్యై నమః*  అని ఉచ్చరించుచూ ఆ విజ్ఞాన స్వరూపిణిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించు సాధకునికి ఎనలేని జ్ఞానసంపదల నొసగి తద్వారా ఆధ్యాత్మికతా భావము ఇంకొక ప్రక్క లౌకిక పరమైన సుఖసంతోషములు ప్రసాదించును.

పరాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి. అంటే మనలోని ఇంద్రియములకు తొలుత ఉన్న జడత్వముతో, వాటికి పనిచేసేశక్తి లేని స్థితి నుండి చైతన్యము కలిగించి ఆయా ఇంద్రియములకు వాటికి గల సహజసిద్ధమైన  శక్తిని ప్రసాదించి, ఆయా జీవులకు పూర్వజన్మ  వాసన ప్రకారం ఆయా ఇంద్రియములకు ఆయా స్థాయిలో శక్తిని ప్రసాదించును. కొందరు మూగవారు, కొందరు అంధులు, కొందరు బధిరులు, కుంటివారు కూడా ఉంటారు. ఎందుకని అవి వారి ప్రారబ్ధాలు. మరికొందరు అఖండ ప్రజ్ఞావంతులు, విజ్ఞానవంతులు, మహర్షులు, అత్యున్నత స్థానంలో ఉన్న మహారాజులు, కూటికి కూడాలేని పేదవారు ఇదంతా పూర్వజన్నకర్మలవాసన మాత్రమే.  జీవుని శరీరంలోని ఇంద్రియములకు చైతన్యము, శక్తిని ప్రసాదించు సృష్టికి కారణభూతురాలైన పరాశక్తియే దీనంతటికీ కారణభూతురాలు. *కార్యకారణ నిర్ముక్త* గా స్తుతింప బడే విజ్ఞాన స్వరూపిణి అయిన జగన్మాత జీవునికి విజ్ఞాన ప్రదాత అందుచేతనే ఆ తల్లిని *విజ్ఞాత్రీ* అను నామ మంత్రముతో వశిన్యాదులు స్తుతించారు.

విజ్ఞానమును ప్రసాదించు జగదీశ్వరికి నమస్కరించునపుడు *ఓం విజ్ఞాత్ర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. *శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ* (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
***************************

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*



*74వ నామ మంత్రము*

*ఓం భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః*

భండాసురుని ముప్పైమంది కుమారులను సంహరించడానికి ఉద్యుక్తురాలైన తన కుమార్థె అయిన బాలాత్రిపురసుందరి విక్రమమును చూసి ఆనందించిన జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితా* యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను, ఆమె అంశలో జనియించిన బాలాత్రిపురసుందరిని మనోనేత్రములందు దర్శించుచూ ఉపాసించిన సాధకులకు వారిలో *భ్రమలను కలిగించి, వంచనకు గురిచేసే* అసురీశక్తులు నిర్మూలింపబడి కాపాడబడడమేకాక ఆ బాలాత్రిపుర సుందరి కరుణతో సరస్వతీ కటాక్షముతో విద్వత్తు, లక్ష్మీ కటాక్షంతో సిరిసంపదలు, శక్తీ కటాక్షంతో లోకాలను ఆకట్టుకునే వాక్పటిమ సంప్రాప్తించి సుఖసంతోషాలతో జీవనం సాగించి అంత్యమున పరమపదమును పొందుదురు.

భండాసురునిపై యుద్ధమునకుద్యుక్తురాలైన జగదాంబ భండాసురుని తన శక్తిసేనలతో మట్టుపెడుతూ మంత్రిణి రాజశ్యామల, దండనాయకి అయిన వారాహి తనవెంట కదలివెళుతుండగా, అశ్వసేనకధినాయకురాలు అశ్వారూఢ, గజసేనకు నాయకురాలైన సంపత్కరీ వెనుకముందులుండగా, జ్వాలామాలిని, వహ్నివాసినులైన అగ్నిస్వరూపిణిలు వహ్నిప్రాకారములునేర్పరుచగా శక్తిస్వరూపిణి అయిన జగన్మాతపై భండాసురుని పుత్రులు ముప్పది మంది వీరావేశంతో విరుచుకుపడుతుంటే తనఅంశనుండి ఉద్భవించిన తొమ్మిది సంవత్సరముల బాలాత్రిపురసుందరిని భండునిపుత్రులతో పోరుసల్పమని ఆజ్ఞాపించింది. ఆ బాలా (కుమారి) త్రిపురసుందరి, మహాత్రిపురసుందరి  ఇచ్చిన రథమునధిరోహించి, సర్వాయుధపరిష్కృతయై, మహాత్రిపుర సుందరితో సమానమైన శక్తియుక్తులు కలిగినదగుటచేత చండప్రచండముగా భండుని సైన్యమును త్రొక్కుకుంటూ దాటి భండుని ముప్పైమంది పుత్రులను తునుముతుంటే మహాత్రిపురసుందరి ఆనందానికి ఆకాశంకూడా హద్దులు లేకుండాపోయిందని ఈ నామమంత్రములోని భావము.

*భండుని పుత్రులు*

1) చతుర్భాహువు, 2) చకోరాక్షుడు, 3) చతుశిరస్కుడు, 4)  వజ్రఘోషుడు, 5) ఊర్థ్వకేసుడు, 6) మహాకాయుడు, 7) మహాహనువు, 8) ముఖశత్రువు, 9) మఖస్కందుడు, 10) సింహఘోషుడు, 11) విరాలకుడు, 12) లశునుడు, 13) కుట్టిశేనుడు, 14) పురజిత్తు, 15) పూర్యరనూకుడు, 16) సర్గశత్రువు, 17) ఇంద్రశత్రువు, 18) అమీత్రకుడు, 19) విద్యున్మాలి, 20)  ఉగ్రకర్మ, 21) ఉగ్రధన్వా, 22) స్వర్గపీడుడు, 23) దుర్గుడు, 24) స్వర్గకంటకుడు, 25) అతిమాయుడు, 26) బృహన్నాయుడు, 27) విభీషణుడు, 28) శ్రుతిపారగుడు, 29) విదురుడు, 30) ఉపమాయువు.

బాలాత్రిపుర సుందరిని *బాల* అనియు, అలాగే బాలాత్రిపుర సుందరీ మంత్రము *బాలామంత్రమనియు* మిగుల ప్రసిద్ధి. ఈ బాలామంత్రం ఈ విధంగా ఉంటుంది *ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం" అంటూ *శ్రీబాలాయై నమః* లేదా *శ్రీబాలాత్రిపురసుందర్యై నమః* అని జపంచేయాలి. కాని ఈ మంత్రం గురువునుండి ఉపదేశింపబడాలి. ఈ మంత్రంలో *ఐం* అనేది వాగ్భవబీజం అనగా సరస్వతీ కటాక్షం కలిగిస్తుంది. *క్లీం* అనేది కామకళాబీజం, ఆకర్షణకు, చతుష్షష్టి కళలకు, లక్ష్యసిద్ధికి చెందుతుంది. *సౌః* అనేది మంగళ ప్రదమైన మోక్షానికి సంబంధించినది. అందుకే ఈ మంత్రం సర్వాభీష్ట ప్రదానమైన మంత్రంగా పండితులు చెబుతారు. *ఒక ఉదాహరణ* ప్రముఖ శ్రీవిద్యోపాసకులు కీర్తిశేషులు, (చందోలు - గుంటూరుజిల్లా)  తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు *బాలాత్రిపురసుందరీ ఉపాసకులు* తొలిరోజుల్లో కడుపేదరికం అనుభవించారు. అమ్మవారికి ఉద్ధరిణి ఉదకం మాత్రం బాలాత్రిపురసుందరీ అమ్మవారి మంత్రజపం తరువాత నివేదించేవారు. ఆ తల్లికి అవన్నీ తెలుసు. లక్ష్మీకటాక్షం కలిగించింది. పదిమందికి పిలిచి అన్నం పెట్టేలాగ, ఎందరికో వేదవిద్యనభ్యసింప జేశావిధంగా వారిని కరుణించింది. ఆతల్లికి వారింట్లోనే ఒక మందిరం ఏర్పాటు చేస్తే వారితోటే ఆ బాల ఉండేది. అమ్మా! అని పిలిస్తే *పిలిచావా బాబూ* అని ఆయనకు కనిపించేది. *నిన్నుకాదమ్మా* అనేవారు. *అయితే నన్ను పిలువవా* అనేది ఆ తల్లి. వారింట్లో పసిపిల్లగా తిరిగిన అనుభవం వారికుంది. వారి ఇంట్లో అందరిలో కలసిపోయి ఒకరోజున చేతికి గాజులు వేయించుకొని తాను వారితోటే ఉన్నానని దృష్టాంతం ఇచ్చిందంటే  *రాఘవనారాయణ శాస్త్రి* గారిని ఒక *మహర్షిగా* మలచిందంటే *బాలాత్రిపురసుందరీ మంత్రోపాసన ప్రభావం* ఎలాంటిదో మనం గ్రహించాలి. ఎలా చివరకు వారి చితిమంటల్లో ఎగిసిపడిన జ్వాలల్లో జ్వాలగా ఆ *బాల*  చూపరులకు సైతం కనబడింది. ఎన్నో కెమెరాలలో ఛాయాచిత్రంగా చోటుచేసుకున్నది. అంత ప్రభావం ఉంది బాలాత్రిపురసుందరీ మంత్రోపాసన ప్రభావం.

అంతటి మహాతల్లికి నమస్కరించునపుడు *ఓం భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. *శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ* (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
***********************

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము*

*పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*పూజాం చ మహతీం కుర్యాద్విత్తశాఠ్యవివర్జితః|*

*చరుం నిరూప్య పయసి శిపివిష్టాయ విష్ణవే॥6946॥*

ఆనాడు ధనమునకు వెనుకాడక భగవంతునకు భక్తి శ్రద్ధలతో మహాపూజను చేయవలెను. పాలతో పాయసమును వండి శ్రీమహావిష్ణువునకు నివేదన చేయవలెను.

*16.52 (ఏబది రెండవ శ్లోకము)*

*శృతేన తేన పురుషం యజేత సుసమాహితః|*

*నైవేద్యం చాతిగుణవద్దద్యాత్పురుషతుష్టిదం॥6947॥*

ఏకాగ్రచిత్తముతో అట్లు వండిన పాయసముతో భగవంతునకు హోమముల ద్వారా పురుషసూక్త విధానముతో అర్చింవలెను. సత్త్వగుణయుక్తమైన, రుచికరమైన నైవేద్యమును సమర్పింపవలెను.

*16.53 (ఏబది మూడవ శ్లోకము)*

*ఆచార్యం జ్ఞానసంపన్నం వస్త్రాభరణధేనుభిః|*

*తోషయేదృత్విజశ్చైవ తద్విద్ధ్యారాధనం హరేః॥6948॥*

జ్ఞానసంపన్నుడైన ఆచార్యుని మరియు బ్రాహ్మణుని వస్త్రాభరణములతో గోదానముతో సంతుష్టులను గావింపవలెను. దీనిని గూడ భగవదారాధనయే అని  తెలిసికొనుము.

*16.54 (ఏబది నాలుగవ శ్లోకము)*

*భోజయేత్తాన్ గుణవతా సదన్నేన శుచిస్మితే|*

*అన్యాంశ్చ బ్రాహ్మణాన్ శక్త్యా యే చ తత్ర సమాగతాః॥6949॥*

సాధ్వీ! ఆచార్యుని, ఋత్విజులను పవిత్రమైన సాత్త్విక గుణయుక్తమైన   భోజన పదార్ధములతో సంతుష్టిపరచవలెను. తదితర బ్రాహ్మణులను,అచటకు విచ్చేసిన అతిథులను గూడ శక్త్యనుసారము భోజనముతో సంతృప్తిపరచవలెను.

*16.55 (ఏబది ఐదవ శ్లోకము)*

*దక్షిణాం గురవే దద్యాదృత్విగ్భ్యశ్చ యథార్హతః|*

*అన్నాద్యేనాశ్వపాకాంశ్చ ప్రీణయేత్సముపాగతాన్॥6950॥*

*16.56 (ఏబది ఆరవ శ్లోకము)*

*భుక్తవత్సు చ సర్వేషు దీనాంధకృపణేషు చ|*

*విష్ణోస్తత్ప్రీణనం విద్వాన్ భుంజీత సహ బంధుభిః॥6951॥*

గురువునకు, ఋత్విజులకు, యథాయోగ్యముగా దక్షిణలను ఇయ్యవలెను. అచట చేరిన చండాలురు మొదలగు వారిని, దీనులను, అంధులను! బుద్ధిహీనులను గూడ అన్నదానములతో సంతోషపెట్టవలెను. అందరును భుజించిన పిదప వారిని సత్కరించవలెను. ఈ విధముగా అందరిని సత్కరించుటవలన  శ్రీమహావిష్ణువు ప్రీతి చెందునని సాధకుడు భావించవలెను. తదుపరి తమ బంధుమిత్రులతో గూడి తాము కూడా భుజింపవలెను.

*16.57 (ఏబది ఏడవ శ్లోకము)*

*నృత్యవాదిత్రగీతైశ్చ స్తుతిభిః స్వస్తివాచకైః|*

*కారయేత్తత్కథాభిశ్చ పూజాం భగవతోఽన్వహమ్॥6953॥*

పాడ్యమి మొదలుకొని, శని త్రయోదశి వరకు నృత్యగానములతో, వాద్య గోష్ఠులతో, స్తుతులతో, స్వస్తి వాచనములతో, భగవత్కథలతో శ్రీహరి పూజలను జరుపవలెను.

*16.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)*

*ఏతత్పయోవ్రతం నామ పురుషారాధనం పరమ్|*

*పితామహేనాభిహితం మయా తే సముదాహృతమ్॥6953॥*

దేవీ! *పయోవ్రతము* అని ప్రసిద్ధి చెందిన ఈ వ్రతము పురుషోత్తముని ఆరాధించే సర్వోత్కృష్టమైన విధానము గలది. దీనిని బ్రహ్మదేవుడు నాకు తెలిపినవిధముగా నీకు వివరించితిని.

*16.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)*

*త్వం చానేన మహాభాగే సమ్యక్ చీర్ణేన కేశవమ్|*

*ఆత్మనా శుద్ధభావేన నియతాత్మా భజావ్యయమ్॥6954॥*

నీవు మిక్కిలి భాగ్యశాలినివి. ఇంద్రియములను వశమలో నుంచుకొని పవిత్రభావముతో శ్రద్ధగా ఈ వ్రటతమును ఆచరింపుము. దీని ద్వారా శ్రీమహావిష్ణువును ఆరాధింపుము.

*16.60 (అరువదియవ శ్లోకము)*

*అయం వై సర్వయజ్ఞాఖ్యః సర్వవ్రతమితి స్మృతమ్|*

*తపఃసారమిదం భద్రే దానం చేశ్వరతర్పణమ్॥6955॥*

కల్యాణీ! ఈ వ్రతము వలన భగవంతుడు సంతష్టుడు అగును. అందువలన దీనిని సర్వయజ్ఞము, సర్వవ్రతము అనియందురు. ఇది సమగ్రతపశ్చర్యల సారము. ఇదియే గొప్ప దానము.

*16.61 (అరువది ఒకటవ శ్లోకము)*

*త ఏవ నియమాః సాక్షాత్త ఏవ చ యమోత్తమాః|*

*తపో దానం వ్రతం యజ్ఞో యేన తుష్యత్యధోక్షజః॥6956॥*

అధోక్షజుని ప్రసన్నునిగా చేయు కార్యములే ఉత్తమమైన యమ నియమములు. అవియే వాస్తవమైన తపస్సులు, దానములు , వ్రతములు, యజ్ఞములు.

*16.62 (అరువది రెండవ శ్లోకము)*

*తస్మాదేతద్వ్రతం భద్రే ప్రయతా శ్రద్ధయా చర|*

*భగవాన్ పరితుష్టస్తే వరానాశు విధాస్యతి॥6957॥*

దేవీ! అందువలన సంయమముతో, శ్రద్ధగా ఈ వ్రతమును ఆచరింపుము. భగవంతుడు శీఘ్రముగా నీ యెడల ప్రసన్నుడై నీ అభిలాషను పూర్తి చేయును.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షోడశోఽధ్యాయః (16)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు పదునారవ అధ్యాయము (16)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
******************

కేతువు మంత్రం

కేతువు మంత్రం ఋగ్వేదంలో అర్కః అర్కిణః అని కలదు. వక పరిశీలన అర్కః సూర్యుని కాంతి హవిస్సుగా మారి భూవాతావరణమునకు రాగానే పదార్ధ ధాతు లక్షణముగా మారు చున్నది అర్క అర్కి . యిందులో వున్న E అనే శక్తి సూర్యచైతన్యమునకు కూడా మూల సూత్రము. అణ / ఆత్మ చైతన్యమే హేతువుగాను అది లేని జీవుడు ఉనికి శూన్యం. అది ప్రకృతి ద్వారానే పుట్టుక చచ్చుట కూడా సూర్యుని చైతన్యం నకు మూల కారణం వెదకుట ఎండమావులలో నీళ్ళకు వెదకుటకై. ఆ ప్రయత్నం మాని వేద పరంగా హనన్యా పూర్వక సంస్కార కర్మలను చేసిన సూర్యలక్షణ శక్తి ప్రకృతికి అవగతమగును. కుంతికి కర్ణుని పుట్టుక లకు మూల తత్వము రఘువంశవిశిష్టమైన రామ తత్వం యివి అన్నియు సూర్యకాంతి లక్షణములు. సూర్యారాధన ప్రకృతి పరంగా సాధ్యం మెూక్షమని. సూర్యుని విధి ఎంత హేతుబద్ధంగా జరుగుచున్నదోఆయనే అదియే ధర్మమని తెలియుచున్నది. దీనికి పదార్ధ రూపంలో జిల్లేడు లో వున్న అగ్ని సంబంధ లక్షణములు కూడా. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.
*********************

మనుచేరిత్ర

హిమాలయాల నుంచి ఇంటికి దారియ వెతుక్కుంటూ బయలుదేరిన ప్రవరుడి కి
 అడ్డంగా నిలబడింది అప్సర. తన ఇంటికి దారి చెప్పమని కోరాడు
మన ప్రవరుడు. అప్పుడు...

ఆమె నవ్వి"కన్నులుండగా దారి ఎందుకు తెలియదు? అందులో ఇంత పెద్ద కనులాయె ! ఓ అయ్యా! మేము అప్సరసలము. నాపేరు *వరూధిని*  మేమెప్పుడూ
 ఈ కొండలలో విహరించు
చుందుము.
నీవుమాకు అతిథి వైతివి.
మా ఆతిథ్యం స్వీకరించుము. అయ్యో! ఎండలో నవిసి పోయినావు. మా ఇల్లు పావనము చేయుము" అని ఆమె అన్నది.
అతడు
"ఓయమ్మా నేను తొందరగా
మా ఊరు పోవలెను. నీవు మాకు ఆతిథ్యం 
ఇచ్చినను ఈయక పోయిననూ  ఒకటే. మీరు దేవతాస్త్రీలు మీ వద్ద మహత్తులుండును. నన్ను మా ఊరు చేర్చిపెట్టు" అన్నాడు.
అప్పుడామె
"ఏమి ఊరయ్యా,
మీవి పూరిగుడిసెలై యుండును.
మావి రత్నాల మేడలు.
ఇక్కడ గంగ యొక్క ఇసుకతిన్నెలు,
పూపొదరిండ్లు,
అవిఅంతయు ఎందుకు గానీ,
ఒక్క మాట చెప్తున్నాను విను.
నా మనసు నీమీద మరలినది నన్ను చచ్చిపొమ్మందువా!
లేకపోయినచో
నన్ను స్వీకరింతువా?" అనగా
అతడు
"నీవు బలే దానివే మేము బ్రాహ్మణులము. ఇంటిదగ్గర అగ్నిహోత్రాలు చెడిపోవుచున్నవి.
నా తల్లిదండ్రులు ముసలివారు.
నేనుఇంటికి వెళ్ళనిచో,
వారు భోజనం చేయరు"
 అనగా ఆమె ముఖము చిన్న పోయినది. ఇది ఏమి అప్సర స్త్రీలుకోరగా
ఈ రీతిగా మాట్లాడే వాడు కూడా ఉండునా?
అనుకొని మరల ధైర్యం తెచ్చుకొని "అయ్యా! మీకు తెలియదు.
యజ్ఞాలు చేసిన వారికి మేములభింతుము. ఇక్కడ ఏమి భోగాలు!
ఎన్ని సుఖాలు!
నీవు మాటాడు మాటలకు అర్థం ఏమైనా ఉన్నదా? గుడ్డివానికి వెన్నెల అన్నట్లు ఉన్నది.
నీవు ఎన్ని జన్మలు ఎత్తినచో ఇట్టి భోగము కుదురును".
ఈ రీతిగా వారికి కొంతసేపు ప్రసంగం అయిన తరువాత ఆమె
ఇదియే బ్రహ్మానందము అన్నది.
దానికి అతడు కొంచెం తడబాటు పడ్డాడు. ఇది ఏమి పాండిత్యం అన్నాడు.
ఏదోతన అగ్నిహోత్రము, ధర్మముల గురించి ఉపన్యాసం మొదలు పెట్టినాడు.
ఆమెకు ఒళ్ళు మండిపోయింది "!
ఆడది తనంతట తాను వలచిరాగా ఎంత తేలిక? "
అని
ఇతనితో
ఇట్లు కాదనుకొని హఠాత్తుగా పోయి కౌగలించుకుంది.



ఆమెను దూరంగా
త్రోసివేసినాడు.
ఆమెకు  చాలా  కోపం వచ్చెను.
కానీ కోరిక మాత్రం ఏమి తగ్గలేదు.
ఓయి నిర్దయుడా! చూడు నీ గోరు ఇచ్చట గుచ్చుకున్నది అని వలవల ఏడ్చినది.
యజ్ఞములెందుకు? నీ తపస్సెందుకు?
నీ పుణ్యములెందుకు? నీకు భూతదయ లేదు.
నీది వట్టిరాతి గుండె.
పరాశరుడు విశ్వామిత్రుడు  వారి కంటే గొప్ప వాడు ఏమి అని ఆమె అనుకు న్నది. ఇతడు ఆమె కౌగిలించుకున్న అప్పుడు అంటిన జవ్వాది గంగలో కడిగేసుకుని తాను  ఇట్లనెను. "నేను నిత్యాగ్నిహోత్రుడనేనినేను
ఇతరుల భార్యలను, ఇతరుల ధనమును కోరని వాడనేని అగ్నిహోత్రుడా!
నన్ను  ప్రొద్దుగ్రుంకెడు లోపల మా ఇంటికి చేర్చు"
 అని ప్రార్ధించెను.
ఆ అగ్నిహోత్రుడు అతనిని ఇంటికి చేర్చెను. ....
 
 ఇంకా ఉంది 
డాక్టర్ నిభాపూడి సు
****************

నిజమైన దేశభక్తుడు

అప్పట్లో……
ఆయన నెల జీతం ₹50/-
ఒకసారి చాలా అవసరంగా ₹100/-కావల్సి వచ్చాయి.
ఎక్కడ ప్రయత్నించినా ఆ డబ్బు సమకూడలేదు.
ఆయన పరిస్థితి గమనించిన ఆయన భార్య" నా దగ్గర వున్నాయి" అని ₹100/-ఇచ్చింది.
"ఎక్కడి"వని ఆశ్చర్యపోయి అడిగాడు.
"మీ జీతం నెలనెలా ₹50/-నాకు ఇస్తారు కదా, జాగ్రత్తగా వాడి నెలకి ₹5/- మిగిల్చేదాన్ని.అలా పోగు చేశాను" అని చెప్పింది భార్య.
వంద రూపాయలు తీసుకున్నాడాయన. అవసరం తీరింది.
ఆ మర్నాడు ఆయన పనిచేస్తున్న సంస్థకు" అయ్యా.. మీరు
నాకు ఇస్తున్న ₹50/-జీతం నాకు ఎక్కువ. ఈ నెల నుండీ
₹45/-ఇవ్వండి చాలు"అని ఉత్తరం రాశాడు.
ఆ సంస్థ పేరు కాంగ్రెస్ పార్టీ.
ఆ ఉత్తరం రాసిన మహానుభావుడు ఆ తర్వాత భారత ప్రధాని అయిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు.
అలాంటి నాయకులు
******************

రామాయణమ్ 41

పడుకొన్నావా హాయిగా ! ఊయలమీద ఊగుతూ కన్నులు తెరువకుండా ఇంకా నిద్దురలోనేవున్నవా నీవు! బయట ఏమి జరుగుతున్నదో తెలిస్తే నీ మత్తు పటాపంచలవుతుంది ! నీ గుండె చెరువవుతుంది .
.
జగతికంతా నీ సవతి కొడుకే రాజు కాబోతున్నాడు ,నీ పతి వలన నీకు పట్టిన గతి తెలియకున్నావు నీవు .
దశరధుడు నాకేస్వంతమని పగటికలలు కంటున్నావు !  కొంగుకు కట్టేసుకున్నాని భ్రమ పడ్డావు ! ఒడిలోదూరిన పాము అని తెలుసుకోలేక పోయావు ! ఎంత అమాయకురాలివమ్మా నీవు!.
.
 సవతిలీల నీకస్సలు తెలియకపాయె! ఎంత గడుసుదమ్మా నీ సవతి ! భాగ్యమంతా నాదే అని నీవు కలగంటున్నావు మొగుడికి వలవేసి అంతా తానే లాక్కున్నది ! .
.
ఏమిటే ! ఏమయ్యిందే ఇప్పుడు అంత కొంపలేమి మునిగిపోయినవని ఈ కేకలు పొద్దున్నే ! అని అడిగింది కైక.
.
నీ సవతి కొడుకుకు తెల్లవారగనే పట్టాభిషేకమట! రాముడే ఇకనుంచి రాజట! .
.ఈ మాట పూర్తిచేసిందో లేదో ! కైక ఒక్కసారి పట్టరాని ఆనందంతో చెంగున దూకి అబ్బ ఎంత మంచి వార్తచెప్పావే మంథరా! నీ జీవితంలో ఇంతకంటే మంచివార్త నాకు ఇకముందు చెప్పలేవు! అంతకుమునుపెప్పుడూ కూడా ఇంత మంచి వార్త నాకు చెప్పలేదు ! .
.
ఇదిగో ఇంత తీయని కమ్మని వార్త నాకెరిగించినందుకు నీకు బహుమతి అని తన మెడలో హారాన్ని తీసి చేతబట్టి మంథర కీయబోయింది కైక ! .
.
కైక ఇలా చేస్తుంటే మంధరకు హృదయతాపం హెచ్చింది ,కన్నులలో కోపం కనపడజొచ్చింది ,మనస్సంతా పాపం నింపుకొని ,ఆహా ! .ఇది నీకు మంచి కబురా! .
నీ సవతికొడుకు రాజవ్వటం నీకు ,నీకొడుకుకూ క్షేమకరమా ! ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు ! .
.
మంథరా ! రాముడే వాడు! సకలగుణాబిరాముడే ! సర్వలోకమనోహరుడే వాడు ! నా చిన్నతండ్రేవాడు ! వాడిని చూస్తే చాలునే ! నన్ను నేను మరచిపోతానే ,వాడు మా అందరి పుణ్యాలపంట ,వాడు మా వరాలమూట !
వాడిని గూర్చి ఇంకొక్క మాట మాట్లాడకే !
.
నాకు రాముడయినా ,భరతుడయినా ఒక్కటే!
.
రామే వా భరతే వాహం విశేషం నోపలక్షయే
తస్మాత్తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యాభిషేక్ష్యతి!
.
నాకు రాముడయినా,భరతుడయినా ఒక్కటే!  తేడాలేదు! అందుకే రాజు రాముని రాజ్యాభిషిక్తుని చేస్తున్నాడంటే ఆనందం కలుగుతున్నది!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
*********************

భాగవత వ్యాప్తి..

భాగవతం మోక్ష నిధి.
పాపాలను నశింప చేసి పుణ్యాన్ని ప్రసాదించే మహిత శక్తి భాగవతానికి ఉంది.
పరమ పుణ్య ప్రదమైన భాగవత తత్వాన్ని తొలుత బ్రహ్మ నారద మహర్షి కి తెలిపాడు.
నారదుడు దానిని వేద వ్యాస మహర్షి కి ఉపదేశించాడు. వ్యాసు డు భాగవత పురాణంగా దానిని రచించి తన  కుమారుడైన         శుకునికి బోధించాడు. శుక మహర్షి పరమ పుణ్యప్రదం..మోక్షప్రదమైన. భాగవత కథను  పరీక్షిత్తు మహారాజు కు వారం రోజుల్లో వివరించి ఆయనకు  ఉత్తమ గతులు కలిగేలా చేసాడు. భాగవత కథను ఆది శేషువు  పాతాళ లోకంలోను... బృహస్పతి స్వర్గ లోకంలోను.., పరాశరుడు భూ లోకంలోను, సనక సనందాదులు స్వర్గానికి పైన ఉండే లోకాల్లో ప్రచారం చేసి బహుళ వ్యాప్తిని  కలుగ చేసారు.
పోతన మహాకవి శ్రీరామ చంద్రుని ప్రత్యక్ష ఆదేశంతో భాగవతాన్ని తెలుగులో రచించి తాను ధన్యుడు కావడంతో పాటు తెలుగు జాతిని ధన్యత చెందేలా చేసాడు.
 ముక్తి పథం భాగవతం. భాగవత కథా సుధను గ్రోలిన వారి  జన్మ ధన్యం.

( ఏం.వి.ఎస్.శాస్త్రి ,ఒంగోలు 9948409528)
********************

*జపం - తీసుకోవాల్సిన జాగ్రత్తలు:-*

👉 జపం చేయడానికి ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలి .. జపానికి గానీ ధ్యానానికి గాని కూర్చునే ముందు గదిని ఉప్పు నీటితో గది అంతా చల్లాలి . ఎందుకు అలా అంటే మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని నశించును .

👉 జపానికి కూర్చునే ముందు తప్పకుండా ఉచితాసనం ఏర్పాటు చేయాలి . లేదా కనీసం దర్భచాప ఉండాలి.

👉 సాధన చేసే వారు తూర్పు ముఖంగా కానీ , ఉత్తర ముఖంగా గానీ లేదా ఏ ఏ దేవత ఉపాసన జపం చేస్తున్నారో ఆయ దేవత జపాలకు ఏ దిక్కున కూర్చుని చేయాలో తెలుసుకుని జపం చేయండి.

👉 జపానికి గానీ ధ్యానం చేయడానికి గానీ బ్రాహ్మీముహూర్తంలో , ఉదయ సాయం సంధ్యలో క్రమం తప్పకుండా చేయాలి ‌.

👉 జపానికి కూర్చునే ముందు ఒక పంచ పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకొని అనుకున్న జపం అంటే 108 , 1008 , అంత కంటే ఎక్కువ సంఖ్యలో జపం పూర్తై అయితే , ఈ నీళ్ళలో కుడిచేయి ఉంగరపు వేలిని 5 నిమిషాల పాటు అలాగే ఉంచి, అప్పుడు ఆ నిటిని సేవించాలి . ఈ పంచపాత్రను ఖాళీ నేలమీద ఉంచకూడదు . కనీసం ఒక తెల్ల బట్టపై ఉంచాలి .

👉 మానసిక జపం చాలా మంచిది !! తొందరగా మంత్ర సిద్ధి అవుతుంది .

👉 జపోచ్చారణలో ( జపం ఉచ్చరించే ) మంత్రం యొక్క బీజాక్షరములు లోపించకూడదు . అలా లోపించిన మంత్రం జప సిద్ది కలగదు .

👉 జప సాధనకి గానీ ధ్యానానికి గాని యోగ విద్య సాధన చేసే వారు తప్పకుండా క్రమం తప్పకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి . జంతు బలులు , చిన్న చీమను కాపాడి అమ్మవారికి ప్రీతి కరం అనే సాకుతో కోళ్ళను , మేకను బలులు ఇవ్వకూడదు ..

👉 మధ్యం సేవించడం , మాంసం తినడం , ఇష్టం వచ్చినట్టు తినడం , పాన్ పరాకులు , గుట్కా , కైనీ , తంబాకు ,  గంజాయీ లాంటి మత్తు పదార్థాలు ఏ మాత్రం తీసుకోకూడదు .

👉 ప్రతీ రోజూ ధ్యానం , వ్యాయామం , సూర్య నమస్కారం , ప్రాణాయామం , మంత్రంతో ప్రాణాయామం క్రమం తప్పకుండా ఒకే సమయంలో ఒకే చోట చేయడం అలవాటు చేసుకోవాలి ..

👉 మానసిక జపానికి కాల నియమం లేదు  . సాధకులకు అనుకూలతను బట్టి సర్వకాల సర్వావస్థల యందు మానసిక జపం చేయవచ్చు .

👉 ఫర స్ర్తీలను వశం చేసుకోవడానికి , ఎదుటి వారిని హించలకు గురి చేసి ధనాన్ని సంపాదించడానికి , విపరీతమైన కామంతో , మంత్ర తంత్రాలతో లోకకల్యాణం కోసం కాకుండా దౌర్జన్యం కోసం , స్వార్ధ ప్రయోజనాల కోసం , ఎదుటివారిని లొంగ తీసుకోవడం కోసం జపం గానీ ధ్యానం గానీ ఏ మాత్రం చేయకూడదు అలా చేస్తే ఆయా దేవతల ఆగ్రహం తప్పకుండా ఉంటుంది , వారి కుటుంబం నాశనం అవుతుంది. ఇతరుల పాపపు కర్మలు , కర్మవాసనలు , కర్మఫలాన్ని మనం అనుభవించే అవకాశం ఉంది .

👉 జపం చేసే మాలను మంచి నీటిలో కడిగి , కాచని పాలలో శుబ్రపరిచి , తర్వాత గంథమున్న నీటీలో గానీ , గంగా నీటిలో గానీ జపమాలను శుద్ధి చేసుకోవాలి రోజూ .

👉 జపానికి ఉపయోగించే మాలను కంఠమాలగా ఉపయోగించరాదు . జప మాలను కింద ( నేల మీద ) ఉంచరాదు .

👉 జప మాల ఎడమ చేతీకి గానీ , పాదాలకు గానీ తగలకూడదు .

👉 జపమాల త్రిప్పేటప్పుడు అది బొడ్డు కిందకు జారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి .

👉 జపం చేసే సమయంలో జప మాలను ఎవరూ చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి .

👉 మాలలోని పూసలను తిప్పడానికి కుడిచేతి బొటన వేలును , మధ్య వేలును ఉపయోగించాలి . చూపుడు వేలు ఉపయోగించకూడదు .

👉 మేరు పూసను దాటి జపించరాదు .

👉 జపమాల యందు పూసల సంఖ్య 108 గానీ , 54 గానీ , 27 గానీ ఉండాలి .

👉 జప మాలలు బంగారం తో గాని , వెండితో గానీ , కనీసం రాగితో అయినా ఉండాలి . అంటే పూసలకు లోహం తో లింకు ఉండాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి .

👉 ఏ ఏ దేవతలను ఉపాసన చేస్తున్నారో , ఆయా దేవతలకు ఆయా జప మాలలు ఉంటాయి అని గమనించండి . ఉదాహరణకు విష్ణువు కీ తులసి మాల , శివుడికి రుద్రిక్ష మాల ... వగైరా ..

👉 మీరు ఏ దేవతను ఉపాసన చేస్తున్నారో ఆయా దేవతలకు ప్రీతికరమైన ఆహారం ముందుగా ఆ దేవతలకు నైవేద్యం సమర్పించి ఆ తర్వాత భుజించడం మంచిది . ప్రీతి కరం కానీ ఆహారం తీసుకోకూడదు .

👉 ఏదైనా దేవత ఉపాసన దీక్షగా సాధన చేసే వారు ఆ దీక్షా సమయంలో క్షౌరము చేసుకోరాదు .

👉 ఏక భుక్తం పాటించాలి అంటే ఒకటే పూట భోజనం చేయాలి . ఫలాహారం  ఎంతో మంచిది . ఉప్పూ , కారం , ఆయిల్ వంటి గాటైన పదార్థాలు తీసుకోకూడదు .

👉 మానసిక శారీరక బ్రహ్మచర్యం పాటించాలి . పర స్త్రీ తో అక్రమ సంబంధం ఉండకూడదు . ఏ స్ర్తీని కామ భావంతో వక్ర దృష్టితో చూడకూడదు .

👉 దీక్షా సమయంలో , సాధన కొనసాగుతున్న కాలంలో తప్పకుండా సాధకుడు యమ , నియమాలు , అంటే సత్యం పలకడం , దేహమును పరి శుభ్రత కలిగి ఉంచడం , అందరి పట్ల ప్రేమను కలిగి ఉంచడం , ఆనందం , ముఖ్యంగా ఉపాసన చేస్తున్న దేవత పై మీ అహంకారాన్ని , మీ అవలక్షణాలను ఆ దేవతకు బలి ఇచ్చి పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీరు ఆ దేవతకు అంకితం అవుతే తప్ప ఆ దేవత యొక్క సాక్షాత్కారం లభించదు ..

👉 ఓ చిన్న చిమను కాపాడి ఓ కోడిని బలి ఇవ్వడం , గురువారం ఆలయం లో పది మందికి అన్నదానం చేసి రియల్ ఎస్టేట్ లో భూ కబ్జా చేయడం , మీ మీ అభిప్రాయాలకు అందరూ నిలబడి ఉండాలని , మి నమ్మకాలను అభిప్రాయాలను ఎదుటి వారిపై బలవంతంగా రుద్దడం , దౌర్జన్యం చేయడం , లంచకొండి తనం , ఎదుటి వారి వ్యక్తిగత విషయాల్లో చొరవ చేసి వారిని బ్లాక్మెయిల్ చేయడం లాంటి లక్షణాలు గలిగిన సాధకులకు ఎలాంటి దేవత అయిన అనుగ్రహం కలుగదు .. కనిసం కలలో కూడా ఆ దేవత కనిపించదు . పైగా ఆ దేవత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది .

👉 సాధనా కాలంలో ఆ సాధకుడు రక్త దానం చేయకూడదు .. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది .

👉 పనీ పాటా లేకుండా .. బాధ్యత లేకుండా .. నా వల్ల కాదు .. నాకు చేతకాదు .. నేను సోంబేరిని .. అంటూ మీ మీ బాధ్యతలను వదిలి దూరంగా నేను జపం చేస్తూ ఉంటా అమ్మా అంతే నీదే .. నువ్వే నాకు దిక్కు ... తొందరగా నీ దర్శనం ఇవ్వు తల్లీ అంటూ ఎంత మొత్తుకున్నా ఆవిడ నీ కనుచూపు మేరలో కూడా ఉండదు .. నువ్వు నిర్వహించే బాధ్యత ను వదిలి .. భార్య పిల్లలను , నీ తల్లి తండ్రులను చూసుకోకుండా , నీ ఉద్యోగం యొక్క బాధ్యత ను కూడా సరిగా నిర్వహించకుండా అంతా నీదే భారం .. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనే సాకుతో చేసే ఎటువంటి సాధన గానీ ధ్యానం గానీ సిద్దించవు ..

👉 మనసా వాచా కర్మణా చిత్త శుద్ధి లేకుండా చేసే ఏ కర్మ నిన్ను మోక్ష మార్గాన్ని చూపవు మనసులో ఓ మాట బయటకు ఓ మాట ఇలాంటి లక్షణాలు కలిగిన సాధకులు యోగ బ్రస్టత్వం పొంది పిశాచ పీడలతో వారి ఉనికిని కోల్పోతారు .
****************

దేవతలు అనంత పద్మనాభస్వామిని పూజిస్తారు

దేవతలు అనంత పద్మనాభస్వామిని పూజిస్తారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం

అనంత పద్మనాభ స్వామి మహిమలు అనంతం

మొన్న కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదల పాలయ్యాయి . అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురం లోను వరదలు వచ్చాయి . స్వామి వారి ఆలయం ముందు ఉండే పద్మ తీర్ధం నిండిపోయింది , ఆలయం దగ్గరకు వెళ్ళే మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది . దాంతో మూడు రోజుల పాటు స్వామి వారి ఆలయం తెరువలేదు , నిత్య పూజలు జరుగలేదు .

దేవతల ఆరాధన :

అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతి రోజూ దేవతలు పుజిస్తారట . అర్చక స్వాములు ఆలయాన్ని తెరువక ముందే దేవతలు స్వామి వారిని సేవిస్తారట .

అఖండ దీపం :

స్వామి వారి సన్నిధిలో ఒక దీపం అఖండలంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది . అందులో కేవలం ఆవు నేయ్యి మాత్రమే వేయాలని ఆలయ శాసనం . ప్రతి రోజు ఆలయం మూసివేసే సమయంలో అర్చక స్వాములు అందులో ఆవు నెయ్యి వేసి వెళతారు . మరుసటి రోజు ఉదయం ఆలయం తెరించేంత వరకూ అఖండలంగా వెలుగుతున్న ఆ జ్యోతిలోనికి మరల నెయ్యి వడ్డిస్తూ కొనసాగిస్తూ ఉంటారు .

మనం లౌకికంగా ఆలోచిస్తే నూనె కంటే నెయ్యితో దీపం వేలగాలంటే కాస్త కష్టమే , ఎందుకంటే నెయ్యి వాతావరణాన్ని బట్టి గడ్డకడుతూ ఉంటుంది . దీపం వెలగడానికి ద్రవంగా మారడానికి సమయం పడుతుంది . చల్లటి వాతావరణంలో నెయ్యి తొందరగా గడ్డ కడుతూ ఉంటుంది . దీపానికి కావలసిన ద్రవంగా నెయ్యి మారక దీపం కొండెక్కిపోయే అవకాశాలు ఎక్కువ . ఇది మనందరికీ అనుభవనీయమైన సంగతే .

కానీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో దీపం లోనికి గడ్డ కట్టిన నెయ్యి వేసిన అది ద్రవంగా మారి దీపం అఖండలంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది . అయితే కొందరికి అనుమానం కలగచ్చు దీపపు ప్రమిద లేక దీపపు కుందె ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటే అది వేడిగా ఉండి నెయ్యిని కరిగిస్తుంది కదా ఇందులో గొప్ప విశేషం ఏముంది అనిపించవచ్చు .

స్వామి వారి సన్నిధిలో దీపం మట్టి ప్రమిద లోనో లేక లోహపు కుందె లోనో ఉండదు . శిలలో చెక్కబడిన రాతి ప్రమిదలో ఉంటుంది .ఇప్పుడు ఆలోచించి చుడండి దీపం ఎంత పెద్దగా ప్రజ్వరిల్లితే ఆ వేడికి రాతి ప్రమిద వేడెక్కాలి , అందులో నెయ్యి కరగాలి ? ఉష్ణోగ్రత తరచుగా ఒకచోట నుండి మరొక చోటికి ప్రయాణిస్తూ ఉంటుంది . రాతి శీలలో ఉండే చలి యొక్క ఉష్ణోగ్రత అదే రాతి శిలలోని ప్రమిదను కుడా చల్లబరుస్తూ నెయ్యిని గడ్డ కట్టేలా చేయాలి . కానీ అందుకు విరుద్ధంగా నెయ్యి కరిగిపోతూ దీపం నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది . ఇది సైన్స్ చెప్పే వాటికి వ్యతిరేకంగా లేదా ? స్వామి వారి మహిమ కాక మరేమిటి ?

మరొక నిదర్శనం :

అర్చక స్వాములు ఉదయాన్నే ఆలయం తెరిచి చూసినప్పుడు దీపంలో నెయ్యి కాస్త తగ్గి ఉంటుంది . ఆ దీపాన్ని మళ్ళీ నెయ్యి వేసి నింపుతారు.అంటే ప్రతి రోజు ఉదయం , మధ్యాహ్నము , సాయంత్రం , రాత్రి అర్చక స్వాములు అప్రమత్తంగా ఉంటూ దీపం అఖండలంగా ఉండేలా నెయ్యి వడ్డిస్తూ ఉంటారు కదా .

మరి మూడు రోజులు ఆలయం మూసి ఉన్నా కూడా ఆ దీపం అలానే వెలుగుతూ ఉంది అంటే ఎవరు నెయ్యి వడ్డించి ఉంటారు ? ఇది దేవతలు స్వామి వారిని సేవిస్తుంటారు అనటానికి నిదర్శనం కాదా ?

మరొక నిదర్శనం :

అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది . మొన్న కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది .స్వామి వారి మూర్తి ఎంత వరకూ వరదలో మునిగిందో అనీ తిరువనంతపుర ప్రజలు భయాందోళలను పొందారు . ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట .

మూడు రోజుల తరువాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూడగా వారు నిశ్చేష్టులయ్యారు . స్వామి వారి గర్భాలయంలోనికి నీరు ప్రవేశించలేదు . ఎక్కడా తేమ కూడా లేదు . అప్పుడే కడిగి శుబ్రపరచినట్లుగా పొడిగా , సుగంధ పరిమళాలతో సువాసనలతో , అఖండలంగా ప్రజ్వరిల్లుతున్న దీపం దర్శనమిచ్చాయి . అంతే కాదు స్వామి వారికి అలంకరించిన పూల మాలలు తాజాగా ఉన్నాయి . బయట ధ్వజ స్థంభం కూడా పరి శుభ్రంగా తేమ లేకుండా ఉన్నాయి .స్వామి వారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాలలోను వరద నీరు ప్రవేశించలేదు . ఇలా నేటికీ స్వామి వారి ఉనికి మనకు చాటుతూనే ఉన్నారు . మనమే ఆయనను గుర్తించలేక శిలలా భావిస్తూ యాంత్రికంగా షోడశోపరచార పూజలు చేస్తూ మన భక్తికి సాటిలేదు అంటూ గర్విస్తూ అజ్ఞానంలో ఓలలాడుతూ ఉన్నాము . ఇలాంటి నిదర్శనాలు ప్రతి ఆలయంలోను జరుగుతూనే ఉంటాయి . అంతటి భక్తి మనలో ఉంటే వాటిని దర్శించే భాగ్యము స్వామి వారే కలిగిస్తారు .

ఇలాంటి నిదర్శనాలను అందరికీ తెలియజేసి నాస్తికులలోను , హేతువాదులలోను మార్పు తెచ్చి మన సనాతన ధర్మాన్ని పరి రక్షించుకోవలసిన కర్తవ్యం మనది కాదా ఆలోచించండి ...

" ఓం నమో నారాయణాయ "
***************************

*కరోనా వైద్యంపై ఇప్పుడు మరింత స్పష్టత*

*ఏ సమయంలో ఏ చికిత్స* ఇస్తున్నామనేదే కీలకం
1000 మందికి పైగా బాధితులను అధ్యయనం చేశాం
వెంటిలేటర్‌ అవసరం లేకుండానే ‘హై ఫ్లో ఆక్సిజన్‌’ ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు
*ఏఐజీఈ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి*

*వైరస్‌ దాడి తీరు, శరీరంలో* దుష్ప్రభావాలు తెలిశాయి కాబట్టి.. దానికి ఏ సమయంలో ఎటువంటి చికిత్స అందించాలనే విషయంలోనూ స్పష్టత ఏర్పడింది. సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల మరణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది

*కరోనా కేసుల సంఖ్య పెరగడం,* కొందరు మృతి చెందడం వంటివి చూసి ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీఈ) ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి సూచించారు. గత నాలుగు నెలలతో పోల్చితే.. ఇప్పుడు మన దేశంలో ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో మరింత స్పష్టత వచ్చిందని చెప్పారు. వైరస్‌ తీవ్రతను ఎంత త్వరగా గుర్తించి, అందుకు తగ్గట్లుగా ఎటువంటి చికిత్స అందిస్తున్నామనేదే అత్యంత కీలకమైన అంశమని ఆయన స్పష్టం చేశారు. యాంటీ వైరల్‌, ప్లాస్మాథెరపీ వంటి చికిత్సలను ఆఖరి దశల్లో కాకుండా.. సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. తమ ఆసుపత్రిలో దాదాపు 1000 మందికి పైగా కరోనా బాధితులకు అందించిన చికిత్సలపై వేర్వేరు దశల్లో అధ్యయనం చేశామన్నారు. అందుబాటులోని కొవిడ్‌ అధునాతన చికిత్సా విధానాలు.. లభిస్తున్న ఫలితాలు తదితర అంశాలపై డాక్టర్‌ నాగేశ్వరరెడ్డితో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది.

*కొవిడ్‌పై మీ గమనంలోకి వచ్చిన అంశాలు ఏమిటి?*

*మొదట్లో ఈ వైరస్‌ శ్వాసకోశాల్లోకి* ప్రవేశిస్తుందని, వాటిలో సమస్యలు సృష్టిస్తుందని భావించేవాళ్లం. కానీ ఇది కేవలం శ్వాసకోశాల్లోనే కాకుండా రక్తంలోనూ ప్రవేశిస్తుందని ఇప్పుడు గ్రహించాం. ఈ వైరస్‌ గుండె, ఊపిరితిత్తులు, తదితర ప్రధాన అవయవాల్లోని రక్తనాళాల్లోకి వెళ్లి అతుక్కుపోతోంది.

*ఇప్పుడున్న అవగాహన ప్రకారం..* ఈ వైరస్‌కు రెండు దశల ఇన్‌ఫెక్షన్లుంటాయి. మొదటిది వైరీమియా. దీనివల్ల వైరస్‌ సోకిన 4-5 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు 11 రోజుల్లోనూ బయటపడతాయి. ఈ సమయంలో జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతునొప్పి వంటివి ఉంటాయి. ఈ లక్షణాలు 90 శాతం మందిలో 3 రోజులే ఉంటాయి. కొంతమందిలో 5 రోజులుండి తగ్గిపోతాయి. ఈ వైరీమియా దశలో మన రోగ నిరోధక వ్యవస్థలోని సైనిక దళాలు ముందుగా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.

*వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన* రెండో వారంలో తదుపరి దశ మొదలవుతుంది. ఈ దశలో కొవిడ్‌ వైరస్‌ రోగ నిరోధక వ్యవస్థపై దాడిని మరింత పెంచుతుంది. ఎలాగంటే మొదటి దశలో మన రోగ నిరోధక వ్యవస్థలోని సైనిక దళాలు వైరస్‌పై తుపాకులతో ఎదురుదాడి చేస్తే..రెండోదశలో బాంబులతో ఎదురుదాడి చేయాల్సివచ్చినట్లు. అంత తీవ్రంగా సైటోకైన్స్‌ విరుచుకుపడతాయి. అయితే మరీ ఎక్కువగా బాంబు దాడి జరిగితే.. మన శరీరంలోని అంతర్గత రక్తనాళాలే దెబ్బతింటాయి. ఇది అత్యంత కీలకమైన పరిణామం.
రెండో దశలో తీవ్రతను గుర్తించడమెలా?

*రక్తంలో ఆక్సిజన్‌ శాతం 95 కంటే* తక్కువకు పడిపోతుంటుంది. శ్వాస తీసుకోవడం కష్టమై ఆయాసంగా ఉంటుంది. అందుకే పల్‌్్స ఆక్సీమీటర్‌తో రెండోవారంలో పరీక్షిస్తుండాలి. 90 శాతం కంటే తక్కువగా ఉంటే అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ఈ విధంగా వైరస్‌ దాడి తీరు, శరీరంలో దుష్ప్రభావాలు తెలిశాయి కాబట్టి.. దానికి ఏ సమయంలో ఎటువంటి చికిత్స అందించాలనే విషయంలోనూ స్పష్టత ఏర్పడింది. సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల మరణాల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఎవరైతే ఆలస్యంగా వస్తున్నారో.. వారిలో అప్పటికే శరీరంలో అంతర్గత వ్యవస్థ దెబ్బతిని ఉండడంతో.. సమస్య తీవ్రమై ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తుంది.

*కొందరిలో ‘హ్యాపీ హైపాక్సియా’* ఉంటుంది. అంటే వీరిలో రక్తంలో ఆక్సిజన్‌ శాతం 80-85 ఉన్నా కూడా. పైకి మాత్రం మామూలుగానే కనిపిస్తారు. ఇటువంటప్పుడు ఉన్నట్టుండి పరిస్థితి విషమిస్తుంది. కొందరిలో నేరుగా గుండెపై వైరస్‌ ప్రభావం చూపుతుంది. అప్పుడు గుండె లయ తప్పడం వల్ల కూడా ప్రాణాపాయం ఉంటుంది. అయితే ఇది చాలా అరుదు.

*కొవిడ్‌కు చికిత్స ప్రణాళిక ఎలా?*
*మొదటి వారంలో.. యాంటీ వైరల్‌* చికిత్స ఇవ్వడం ముఖ్యమైనది. ఇందులో రెండున్నాయి. ఒకటి ‘ఫావిపిరవిర్‌’.. ఇది ఎంత మేరకు పనిచేస్తుందనే విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాలి. రెండోది ‘రెమిడెసివిర్‌’.. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తోంది. అయితే ఎక్కువమంది ఈ ఔషధాన్ని రెండోవారంలో వినియోగిస్తున్నారు. ఎందుకంటే.. ఖరీదు ఎక్కువ. మరొకటి ఏమిటంటే 90 శాతం మందిలో కొవిడ్‌ దానికదే తగ్గిపోతుంది కదా.. ఎందుకు వినియోగించడమనే భావన ఉండడం. మొదటి వారంలో మూణ్నాలుగు రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టకపోతే.. 60 ఏళ్లు పైబడినవారిలో.. లేదా అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ తదితర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారిలో రెమిడిసివిర్‌ వినియోగించడం మంచిదని మా అధ్యయనంలో గ్రహించాం.

*ఊబకాయుల్లో కొవిడ్‌ తీవ్రత* ఎక్కువగా ఉంటోంది. ఊపిరితిత్తుల్లో ఉండే కొవ్వు కణాల్లోకి ఈ వైరస్‌ వెళ్లి కూర్చొంటోంది. దానివల్ల మరింత ప్రమాదకరంగా మారుతోంది. అందుకే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. సరైన సమయంలో యాంటీ వైరల్‌ చికిత్స అందిస్తే 99 శాతం మందిలో నయమవుతోంది. వీటికి అదనంగా  అవసరం మేరకు యాంటీబయాటిక్స్‌ వాడాలి. విటమిన్‌ మాత్రలు ఇవ్వాల్సిందే.

*రెండోవారంలో.. ‘డెక్సామిథాసోన్‌’* అనే స్టెరాయిడ్‌ వినియోగిస్తే వైరస్‌ 90 శాతం నియంత్రణలో ఉంటుంది. ఈ స్టెరాయిడ్‌ రక్తనాళాల్లో వాపు(ఇన్‌ఫ్లమేషన్‌)ను తగ్గిస్తుంది. ఇప్పుడు పరీక్షల పరంగానూ స్పష్టత వచ్చింది. సీఆర్‌పీ, ఐఎల్‌ 6, ఫెర్రిటిన్‌, డీ డైమర్‌, ఎల్‌డీహెచ్‌.. తదితర పరీక్షలు ఆధారంగా వైరస్‌ తీవ్రత తెలుస్తోంది. ఆక్సిజన్‌ ఇస్తూ స్టెరాయిడ్‌ చికిత్స అందించడం వల్ల 99 శాతం మందిలో మూడు రోజుల్లోనే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఔషధాల వల్ల కూడా పరిస్థితి మెరుగుపడకపోతే.. అప్పుడు ‘టోసిలిజుమాబ్‌’ ఔషధాన్ని ప్రయోగాత్మకంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఔషధాన్ని చాలా జాగ్రత్తగా, అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే వినియోగించాలి.

*ప్లాస్మాథెరపీ వల్ల ప్రయోజనమెంత?*
* కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో యాంటీ బాడీస్‌ వృద్ధి చెందుతాయి. వారి నుంచి ప్లాస్మా తీసుకొని బాధితులకు ఇస్తే కోలుకుంటున్నారు. ఇవి అందరిలోనూ వృద్ధి చెందడం లేదని పరిశోధనల్లో వెల్లడైంది. 30-40 శాతం మందిలో మాత్రమే ఈ ‘న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌’ అభివృద్ధి  చెందుతున్నాయి. బాధితులు వెంటిలేటర్‌పైకి వెళ్లిన తర్వాత ప్లాస్మా ఇవ్వడం వల్ల ఎక్కువగా ప్రయోజనం ఉండదు. రెండోవారంలో ఆక్సిజన్‌, స్టెరాయిడ్స్‌ ఇచ్చాక సాధారణంగా 48 గంటల్లో బాధితుల్లో సానుకూల స్పందన కనిపిస్తుంది. ఒకవేళ అప్పటికీ స్పందన లేకపోతే.. ఆ దశలోనే ప్లాస్మాథెరపీకి వెళ్లడం వల్ల ఉపయోగంగా ఉంటుంది.
* ఇప్పుడు ‘మోనోక్లోనాల్‌ యాంటీబాడీస్‌’ అని కొన్ని సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. సాధారణంగా మన శరీరంలోని ‘న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌’ కొన్ని కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ కణాలను తీసి, కల్చర్‌ చేసి ‘హై కాన్సట్రేషన్‌ మోనోక్లోనాల్‌ యాంటీబాడీస్‌’ను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల 100 శాతం కోలుకుంటారు. వ్యాక్సిన్‌ కంటే ముందు ఇవే రానున్నాయి.
కొవిడ్‌కు టీకాలు ఎప్పటికి రావచ్చు?

*డిసెంబరు ఆఖరు నాటికి టీకా* వస్తుందనే ఆశాభావంతో ఉన్నాను. మన దేశంలో జనవరిలో కొంతమందికి అందుబాటులో ఉంటుంది. సాధారణ ప్రజలకు వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే మాసాల వరకూ రావచ్చు.

*లాలాజలం ద్వారా కూడా* కొవిడ్‌ను నిర్ధారించడంపై ప్రయోగాలు చేస్తున్నాం. త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తాం. భారతీయుల్లో కరోనా వ్యాప్తి, తీవ్రత తక్కువ అనే అంశంపై పరిశోధన నిర్వహించాం. మన భారతీయుల జన్యువుల్లోనే కొవిడ్‌ను ఎదుర్కొనే సామర్థ్యముంది. ఈ అంశంపై పరిశోధన కథనం అంతర్జాతీయ వైద్య పత్రికలో ప్రచురణకు వెళ్లింది. త్వరలోనే ఈ విషయాలనూ వెల్లడిస్తాం. ప్రస్తుతమున్న కరోనా ఉద్ధృతి సెప్టెంబరు వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. ప్రజలంతా ముందస్తు జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు. మాస్కు ధరించడం... కనీసం 6 అడుగుల వ్యక్తిగత దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రపర్చుకోవడం తప్పనిసరి... తప్పనిసరి.

*ఆక్సిజన్‌ పాత్ర కూడా చాలా ముఖ్యం..*
*సాధారణంగా ముక్కు ద్వారా* అందించే ఆక్సిజన్‌ వల్ల ఎక్కువ మందిలో నిమిషానికి 2-10 లీటర్ల ఆక్సిజన్‌ సరిపోతుంది. ఇది సరిపోకపోతే.. ‘నాన్‌ ఇన్‌వేజివ్‌ వెంటిలేటర్‌(ఎన్‌ఐవీ)’ విధానంలో ఆక్సిజన్‌ను అందిస్తారు. ఇటీవల ‘నాసల్‌ క్యాథటర్‌’ ద్వారా కొత్తగా ‘హై ఫ్లో ఆక్సిజన్‌’ ఇవ్వడం వల్ల కూడా ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఇది ఇస్తే వెంటిలేటర్‌ చికిత్స అవసరం లేదు. దీని ద్వారా నిమిషానికి 40 లీటర్ల వరకూ కూడా ఇవ్వచ్చు. ఇంతకుముందు ప్రాణాలను కాపాడడానికి వెంటిలేటర్‌ పెట్టాలనుకునేవారు. కానీ ఇప్పుడు వెంటిలేటర్‌ అవసరం లేకుండానే ‘హై ఫ్లో ఆక్సిజన్‌’ ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. ఇది వినియోగిస్తే కేవలం 0.5 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే వెంటిలేటర్‌ అవసరమవుతుంది.

*Forwarded as received for information..*

వికీమీడియా డోనేషన్స్

వికీమీడియా డోనేషన్స్ ఎందుకు అడుగుతోంది..
వీకీపీడియా గురించి కొన్ని విస్తుపోయే నిజాలు..
చదవడానికి 5 నిమిషాలు కేటాయించకపోతే మనకు భావితరాల మీద బాధ్యత లేనట్టే..
విషయం లోకి వెళదాం..

ఈ కాలం లో సాధారణంగా ఇంటర్నెట్ , స్మార్ట్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికి వికీపీడియా తెలుసు..
మనకు ఏం కావాలన్నా గూగుల్ లో వెతకాలి , వెతికిన ప్రతీ వాటి పూర్తి సమాచారం వికీపీడియా ద్వారా తెలుసుకోవాలి..
ఈవిషయం స్కూల్ కి వెళ్లే పిల్లాడినుండి అందరికి తెలిసిందే..

కానీ వీకీపీడియా ద్వార సంఘవిద్రోహ శక్తుల కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి , ఈ దేశం లో జరిగే ప్రతీ అరాచకం వెనక వాళ్ళ హస్తం ఉందా.. అనే అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి..? మనం కాస్త పరిశోధన చేస్తే ఒళ్ళు జలజరించే కొన్ని భయానక విషయాలు బయటపడ్డాయి..
అవేంటో తప్పక చదివి షేర్ చేయండి ..

ఒక్క సారి గూగుల్ లోకి వెళ్లి పప్పు గాంధీ అని సెర్చ్ చేయండి , మీకు వెంటనే రాహుల్ గాంధీ అని ఒక వీకీపీడియా లింక్ కనిపిస్తుంది .. ఆ వీకి లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు వీకీమీడియా ఫౌండేషన్ కి డొనేషన్ చేయమని ఒక లింక్ కనిపిస్తుంది..
ఒకసారి మనం డొనేషన్ ఇచ్చేముందు అసలు ఈ వికీమీడియా అంటే ఏంటో దానిగురించి కొంత లోతుగా విశ్లేషణ చేద్దాం...
వీకీ మీడియా ని జేమ్స వెల్ అనే వ్యక్తి 2003 లో ఎటువంటి లాభాపేక్ష లేని ఒక NGO గా ఏర్పాటు చేసాడు
వికీపీడియా ఫౌండేషన్ లోని సలహా మండలి కమిటీ కి వెళ్తే అందులో నరాలు తెగే  ఉత్కంఠ కలిగే పేర్లు కనిపిస్తుంది అవి మెలిసా హాగ్మెన్, జార్జ్ సొరస్..
వీళ్ళగురించి చెప్పే ముందు ఒకసారి వెనక్కి వెళదాం.

2019 ఆగస్టు 27 వ తారీఖున వికీపీడియా  భారతదేశం లో తన పాఠకుల నుండి విరాళాలు అడిగింది
తరవాత 2019 సెప్టెంబర్ లో సౌదీ అరేబియా పెట్రోలియాం కంపెనీల మీద డ్రోన్ ల తో ఎటాక్ జరిగింది , ఈ ఎటాక్ కి కారం ఇరాన్ నే అని అమెరికా ఇరాన్ దేశాన్ని నిందించింది..
ఫలితంగా భారత్ కి సౌదీ అరేబియా నుండి రావాల్సిన పెట్రోలియం దిగుమతులు 16% పడిపోయాయి..
అప్పుడు భారత్ లో పెట్రోల్ ధరలు అత్యధికంగా పెరిగాయి..
పెట్రోల్ లీటర్ 80 డీజిల్ 70 కి చేరాయి..
పెరిగిన ఇంధన ధరలకు కమ్యూనిస్ట్ మీడియా దేశవ్యతిరేఖ మీడియా దీని అంతటికి కారణం మోదీనే అని ప్రతీ రోజు పేపర్ లలో హెడ్  లైన్స్ వేసేది...

అలాగే సెప్టెంబర్ 16 న పాకిస్థాన్  కి చెందిన ఉగ్రవాద సంస్థ #జైషే_ఏ_మహ్మమద్ దసరా సందర్బంగా  భారత్ దేశం అంతటా ఉగ్రవాదదాడులు చేస్తాం దేవాలయాలపై దాడులు చేస్తాం అని ప్రకటన చేసింది.

ఇదే సమయం లో సెప్టెంబర్ 23 న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వీకిమీడియా ఫౌండేషన్ లోని ముఖ్య సలహాదారుడు పైన చెప్పిన వ్యక్తుల్లో ఒకరు జార్జ్ సొరస్ తో కలిసి కాశ్మీర్ విషయమై చర్చలు జరిపాడు.
మరుసటి రోజు సెప్టెంబర్ 24 న ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని ఇంటలీజెన్స్ నుండి వార్తలు వచ్చాయి.
మల్లి సెప్టెంబర్ 27 న భారత ప్రధాని న్యూయార్క్ లో 74 వ వార్షిక UN జనరల్ మీటింగ్ లో స్పీచ్ ఇచ్చారు
అదే రోజు రాత్రి భారత రక్షణ శాఖ మంత్రి తీరప్రాంతాల్లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అధికారప్రకటన చేశారు..

ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి
ఇవన్నీ భారత ప్రధాని మోదీ సెప్టెంబర్ 20 నుండి 27 మధ్యలో అమెరికా పర్యటన సందర్బంగా జరిగినవి అని..

తరవాత కొన్నాళ్ళకు భారత ఆర్మీ అక్టోబర్ 20 న POK  లోని టెర్రరిస్ట్ స్థావరాలపై దాడిచేయడం ద్వారా పాకిస్థాన్ కి తగిన గుణపాఠం చెప్పింది

ఈ సంఘ విద్రోహ శక్తులు రెండు వైపులా ఇలాగే డబల్ గేమ్స్ ఆడతారు

బాగా గుర్తుతెచ్చుకోండి
భారత ప్రధాని అమెరికా కి వెళ్ళినప్పుడు , లేదా అమెరికా ప్రధాని ఇండియా కి వచ్చినపుడు ఈ వేర్పాటు వాదులు ఉగ్రవాదులు ఈ దేశం లో అరాచకం సృష్టించడానికి ప్రయతిస్తూనే ఉంటారు..
ట్రంప్ భారత దేశ పర్యటనకు వచ్చినప్పుడు ఢిల్లీలో జరిగిన గొడవల గురించి మీ అందరికి తెలుసు

కానీ ఇక్కడే వికీపీడియా కి సంబంధించిన ఒళ్ళు గగ్గులుపొడిచే లింక్ చూద్దాం

12 ఫిబ్రవరి 2020 న వికిపీడియా ఫండ్స్ కావాలి అంటూ లింక్ ఇచ్చింది ఫండ్స్ అడిగిన 12 రోజుల తరవాత అంటే 24 ఫిబ్రవరి 2020 న ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి అప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాలో ఉన్నాడు

మళ్లి 29 జులై 2020 రోజున మల్లి వికీపీడియా ఫండ్స్ ఇవ్వమంటూ అడిగింది , ఇలా అడిగిన 12 రోజుల తరవాత అంటే మొన్న 11 ఆగస్టు 2020 న బెంగుళూర్ లో కాంగ్రెస్ MLA ఇంటి దగ్గర జరిగిన అల్లర్ల గురించి మీ అందరికీ తెలిసిందే..
దీన్ని బట్టి మనకు అర్ధమయ్యే విషయం ఏమిటంటే కమ్యూనిస్టులు వీకిమీడియా  పేరుతో మనల్ని డబ్బులు అడుగుతారు వాళ్ళు మనదగ్గర తీసుకున్న డబ్బులతో మన మీదే యుద్ధం ప్రకటించి వారు తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తారు ..

బెంగుళూరు గొడవల్లో కారణమైన సంస్థ , మనకు మీడియా లో బాగా వినిపించిన పేరు SDPI అనే సంస్థ , ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ SDPI అనే సంస్థ PFI అనే సంస్థ యొక్క పొలిటికల్ వింగ్ ఈ PFI సంస్థ సభ్యులే 2018 మే 16 ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు.
ఈ సంస్థ ని జార్ఖండ్ ప్రభుత్వం నిషేధించింది
ఈ సంస్థ పై ఉత్త్రరప్రదేశ్ ప్రభుత్వం నిషేధించాలని ఆలోచిస్తుంది..

ఇప్పుడు మీకే అర్ధమయ్యి ఉంటుంది వీకిపీడియా ఫండ్స్ ఎందుకు అడుగుతోందో వచ్చిన డబ్బులు దేని కోసం ఖర్చుపెడుతుందో

ఇంకొక్క రెండు చిన్న విషయాలు మనం పరిశీలిస్తే మన కళ్ళముందు ఉన్న మబ్బులు కాస్తా తొలగిపోయి మరికొన్ని విషయాలు మనకు అర్ధమవుతాయి , ఎలా అంటే దీనిమీద మనకిక రవ్వంత అనుమానము లేనంతగా

ఢిల్లీ అల్లర్ల గురించి మనకి అందరికి తెలుసు అవి ముందు ప్లాన్ చేసుకుని అటాక్ చేసినట్టుగా  ఆప్ పార్టీ లీడర్ తాహిర్ హుస్సేన్ కూడా అంగీకరించాడు
కానీ వీకీపీడియాలో గనక మనం వెళ్లి సెర్చ్ చేసి చూస్తే హిందువుల గుంపు ముస్లిం లపై దాడి చేసారూ అని రాశారు

బెంగుళూరు గొడవలు ఒకరు ముస్లిం ప్రవక్త పై  కామెంట్ చేసినందుకు జరిగాయి అని రాసిన వీకీపీడియా , హిందు దేవుళ్ళని అసభ్యంగా చిత్రించి పోస్ట్ పెట్టిన వాడికి కౌంటర్ కామెంట్ వల్ల జరిగిన గొడవలు అని ఎందుకు రాయలేకపోయింది..

ప్రతీ భారతీయుడి నినాదం జై హింద్ అయితే జై హింద్ అనే నినాదం కేవలం బీజేపీ పార్ధుకి వాళ్ళది అని ఎందుకు చూపిస్తుంది

వీకీపీడియా పక్షపాతధోరణి కల మీడియా.. ప్రజలను తప్పుదారిపట్టించడానికి సైకలాజికల్ వార్ చేసే ఒక మధ్యమం ఇలాంటి దానికి మనం డబ్బులు ఇవ్వాలా మనం డబ్బులు ఇచ్చి మనమీద దాడిచేయమని మనమే కోరుకోవాలా సిగ్గుపడాల్సిన విషయం కదా.!

కానీ ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు ఎందుకు ఆలోచిస్తారు , మనకంటికి కనబడే విషయాల వెనక మనకు కనబడకుండా ఎంత యుద్ధం జరుగుతుందో గమనించారా
మన దేశాన్ని నిర్వీర్యం చేయడానికి కమ్యూనిస్టులు , ఉగ్రవాదులు , వేర్పాటువాదులు , సంఘవిద్రోహ శక్తులు ఎన్ని కుట్రలు పన్నుతున్నారో గమనించారా..?

ఇప్పుడే ఒకసారి వీకీపీడియా లింక్ క్లిక్ చేయండి , మల్లి డొనేషన్స్ అడుగుతుంది ఈ సారి వీళ్ళ డబ్బు హైదరాబాద్ లోనో , చెన్నయ్ లోనే అరాచకాలు సృష్టించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుంది
ఇప్పటికే మించిపోయింది ఏమి లేదు శత్రుమూకల వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నుదాము ,
జాతీయవాదం వైపు నిలబడదాం ,
దేశవ్యతిరేఖ, సంఘవ్యతిరేఖ  శక్తులకు నిలువ నీడ లేకుండా చేద్దాం, గొడవలు చేసే వర్గాల ఆర్ధిక మూలాలు దెబ్బతీద్దాం వారిని ఆర్ధికంగా బహిష్కరిద్దాం వారిని నిర్వీర్యం చేద్దాం..

జై హింద్

String  యూట్యూబ్ చానెల్ వారి వీడియో కి నా స్వేచ్చానువాదం

కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి
#శివశక్తి
సేకరణ
ఒక వాట్సాప్ సందేశం.
*******************

సూర్యనార్‌ కోవిల్‌

కుంభకోణం సమీపంలోని సూర్యనార్‌ కోవిల్‌
నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్‌ ప్రపంచానికి ఆయన వెలుగులు ప్రసారింప చేస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదట సూర్యదేవుడినే ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి ప్రతిష్టితమైన దివ్యక్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని సూర్యనార్‌ కోవిల్‌.
బ్రహ్మశాపంతో..
ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణం ప్రకారం కాలవముని అనే యోగి కుష్టువ్యాధితో బాధపడేవాడు. తనకు బాధ నుంచి విముక్తి కలిగించమని కలిగించమని అతను నవగ్రహాలను ప్రార్థించాడు. దీంతో అనుగ్రహించిన గ్రహాధిపతులు అతనికి ఆ వ్యాధి నుంచి విముక్తి కలిగించారు. దీనిపై సృష్టికర్త బ్రహ్మ ఆగ్రహం వ్యక్తంచేశాడు. మానవుల్లో మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని అని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోని శ్వేత పుష్పాల అటవీప్రాంతానికి వెళ్లిపొమ్మని శాపం పెడుతాడు. దీంతో భూలోకానికి వచ్చిన నవగ్రహాలు లయకారకుడైన పరమేశ్వరుని కోసం తపస్సు ఆచరిస్తాయి. ఆ తపస్సుకు ప్రత్యక్షమైన మహాశివుడు వారికి శాపవిముక్తి కలిగిస్తాడు. వారు ఎక్కడైతే తనను పూజించారో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదించాడు. ఆ క్షేత్రంలో ఎవరైనా భక్తులు వచ్చి తమ బాధలను తీర్చమని నవగ్రహాలను వేడుకుంటూ ప్రార్థిస్తే వారికి బాధలు ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించాడు ఆ మహేశ్వరుడు.
ఉషా, ప్రత్యూషలతో కలిసి…
ఈ ఆలయంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన ఆలయాలున్నాయి. ప్రధానమైన సూర్యదేవుడు తన ఇద్దరు సతీమణులైన ఉషాదేవి, ప్రత్యూషదేవిలతో కలిసి భక్తులకు దర్శనమిస్తుంటారు. సూర్యదేవుడంటే తీక్షణమైన కిరణాలు కలిగినవాడు. అయితే అందుకు భిన్నంగా స్వామి మందహాసంతో రెండు చేతుల్లో తామర పుష్పాలు కలిగి భక్తకోటికి ఆశీర్వచనాలు ప్రసాదిస్తున్న ముద్రలో వుంటాడు. స్వామి వివాహవేడుకల్లో వుండటం విశేషం. మిగతా గ్రహాలకు కూడా ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకమైన ఆలయాలు వున్నాయి. సూర్యదేవుని మందిరానికి ఎదురుగానే బృహస్పతి మందిరముంది. నవగ్రహాలకు వాటి వాహనాలు ఇక్కడ కనిపించకపోవడం గమనార్హం.
ఆలయ నిర్మాణం
క్రీ.శ. 11వ శతాబ్దంలో చోళ రాజైన కుళుత్తోంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. అనంతరం విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివకామి, వినాయక, మురుగన్‌ విగ్రహాలున్నాయి. వీటితో పాటు ప్రధాన మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం వుంది. ప్రాంగణంలోనే ఇతర ఏడు గ్రహాధిపతులకు ప్రత్యేకమైన ఆలయాలున్నాయి.
ఉత్సవాలు
తమిళమాసమైన తాయ్‌ నెలలో జరిగే రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. తాయ్‌ మాసం (జనవరి-ఫిబ్రవరి)లో ఈ వేడుక జరుగుతుంది. సూర్యదేవుని రథం దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు తిరుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో రథ సప్తమి వేడుకలను వైభవంగా పదిరోజుల పాటు జరుపుతారు. అలాగే ప్రతి తమిళమాసం ప్రారంభంలో ప్రత్యేకమైన వేడుకలు జరుగుతాయి. మహాభిషేకానికి విశేషసంఖ్యలో భక్తులు హాజరవుతారు.
గ్రహశాంతికి ప్రత్యేక పూజలు
గ్రహబాధల నుంచి విముక్తి పొందడానికి వేలాదిమంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. గ్రహబాధలు ఎక్కువగా వున్న వారు 12 ఆదివారాలు ఆలయంలోనే బసచేసి పూజలు సాంత్వన కలిగించమని వేడుకుంటారు. ఇందు కోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన… తదితర పూజలు నిర్వహిస్తారు. తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం… తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఆలయానికి ఇస్తుంటారు. చక్కెర పొంగలి ప్రసాదాన్ని కూడా పూజలో భాగంగా పంపిణీ చేస్తారు.
**********************

శ్రీరాముడి మహత్వం-

 శ్రీ కొప్పరపు కవులు & విశ్వనాథ సత్యనారాయణ : తావక నామ సుధారస రుచి యెల్ల / వాణీశ వంద్య,శర్వాణి యెరుగు /భవదీయ పదరజోలవ మహత్వంబెల్ల / గౌతమ మౌనీంద్రుకాంత యెరుగు / త్వన్ మహాబాహు దర్ప ప్రభావంబెల్ల / జనకపూజిత శైవచాప మెరుగు / యుష్మత్ అమోఘ బాణోగ్ర ప్రయోగ వైభవలీల యెల్ల / భార్గవవు డెఱుంగు / స్రితజన ప్రీతియెల్ల / సుగ్రీవుడెఱుఁగు/ నిరత శరణాగతత్రాణ బిరుదమెల్ల/  ఆ విభీషణుడెఱుఁగు/ నీ అఖిల మహిమల్, యేమెరుంగుదుమ్ / ఏలుమో / రామదేవ : ఈ పై  పద్యం కొప్పరపు కవులు 1921లో పంగిడిగూడెం శతావధానంలో ఆశువుగా చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ శ్రీ రామాయణ కల్పవృక్ష కావ్య అవతారికలో ఒక పద్యం రాశారు. పావు నెఱుంగు బ్రహ్మ, సగపాలును మాత్ర మెఱుంగు పార్వతీ/ దేవియు, నీ వెఱుంగుదువు తెల్లము రామమహత్తు కృత్ స్న / మా దేవున కేను నీ యనుమతిం బడి నంకిత మిత్తు జానకీ/ దేవి మనోహరుండు రఘుదేవుని సాధు కథా ప్రపంచమున్. (1) మొదటి పద్యం తాత్పర్యం: నీ నామామృతం (శ్రీరామ నామామృతం)లోని  రుచి/వెలుగు బ్రహ్మదేవునితో  వందనాలు పొందే శర్వాణి/పార్వతీదేవికి మాత్రమే తెలుసు. నీ పాద ధూళి యొక్క గొప్పతనం అహల్యకు మాత్రమే తెలుసు. నీ బాహుబలం జనక మహారాజుతో పూజించబడిన శివధనుస్సుకు తెలుసు. అమోఘమైన నీ బాణ ప్రయోగంలో ఉండే వైభవం పరుశురాముడికి మాత్రమే తెలుసు. నిన్ను ఆశ్రయించినవారిని రక్షించే నీ ప్రేమతత్త్వం సుగ్రీవుడికి మాత్రమే తెలుసు. శరణుకోరి వచ్చినవారిని నిరంతరం కాపాడే  నీ శరణాగత వైభవం ఆ విభీషణుడికి మాత్రమే తెలుసు. నీ మహిమలన్నీ ఏమి తెలుస్తాయి?. అందరికీ తెలియవు కదా! అని తాత్పర్యం. ఇక్కడ ఏము ఎఱుంగుదుము, అనేది శ్లేష.నీ మహిమలన్నీ  మాకు తెలుసు అని అర్ధం. మేము నీకు పరమ భక్తులం కాబట్టి, మాకు తెలుస్తాయని, గర్వంగా చెప్పుకోవడం ఈ శ్లేషలోని విశేషం. కొప్పరపు కవులు అవధానంలో ఆశువుగా అలవోకగా చెప్పిన పద్యంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఇది కొప్పరపువారి అసమాన ప్రతిభకు ఒక మెచ్చు తునక. విశ్వనాథ సత్యనారాయణకు కొప్పరపు కవులంటే విశేషమైన గౌరవం. గురుభావం. కొప్పరపువారి కంటే, విశ్వనాథ 8-10ఏళ్ళు చిన్నవాడు.కొప్పరపువారి అనేక అవధాన, ఆశుకవిత్వ సభలు స్వయంగా చూసినవాడు. శ్రీ రామాయణ కల్పవృక్షంలో రాసిన పై పద్యం తాత్పర్యం ఒకసారి చూద్దాం: నీ గురించి (రాముని) బ్రహ్మదేవుడికి పావువంతు మాత్రమే తెలుసు. పార్వతీదేవికి నీ గురించి సగం మాత్రమే తెలుసు.నీకొక్కడికే బాగా/సంపూర్ణంగా  తెలుసు.ఇక్కడ నీకు అంటే?  నందమూరులోని విశ్వేశ్వరుడికి  అని అర్ధం. నందమూరు విశ్వనాథ స్వగ్రామం. ఈయన ప్రియశిష్యుడు ఎన్టీఆర్ ఇంటిపేరు కూడా  నందమూరు కావడం విశేషం. ఇది ఇలా ఉంచుదాం. పద్యశిల్పంలో ఇద్దరు మహాకవుల ఎత్తుగడలో ఉన్న సారూప్యత వివరించడమే నా ఉద్దేశ్యం. కొప్పరపువారిది వచించిన పద్యం. విశ్వనాథది రచించిన పద్యం. మహాకవులు వచించినా? రచించినా, మహాకవిత్వమే వస్తుందని చెప్పడానికి ఈ పద్యాలు ఒక ఉదాహరణ. నమః -జయహో!తెలుగు పద్యం-మా
**********************

శ్రీ మాధవాష్టకం


1) నమో భగవతే మాధవాయ
   క్షీరసాగరస్థితరమాకాంతాయ
   సర్వసమ్మోహనకరమదనజనకాయ
   స్వాహాస్వధావషట్కారస్వరూపాయ ||

2) నమో భగవతే మాధవాయ
   యశోదానందనందనాయ
   కౌసల్యాదశరథనందనాయ
   అనసూయాత్ర్యాత్మజాయ ||

3) నమో భగవతే మాధవాయ
   మధుకైటభసంహరణాయ
   కార్తవీర్యార్జునభంజనాయ
   అహల్యాశాపవిమోచకాయ ||

4) నమో భగవతే మాధవాయ
   సాందీపనీపుత్రరక్షకాయ
   శుక్రాచార్యగర్వభంజనాయ
   ప్రహ్లాదమానసాబ్జవాసాయ ||


5) నమో భగవతే మాధవాయ
   పాండవకులరక్షకాయ
   యమళార్జునభంజనాయ
   తులసీవనమాలాధరాయ ||

6) నమో భగవతే మాధవాయ
   సుపర్ణవాహనారూఢాయ
   సాకేతపురద్వారకాధీశాయ
   భక్తభయార్తిభంజనాయ ||

7) నమో భగవతే మాధవాయ
   కాలాతీతప్రణవస్వరూపాయ
   సవితృమండలతేజస్వరూపాయ
   కేయూరరత్నమణిప్రవాళహారాధరాయ ||

8) నమో భగవతే మాధవాయ
   సద్యఃస్ఫూర్తిప్రదాయకాయ
   సద్యోజాతప్రియవల్లభాయ
   వికసితవదనారవిందాయ ||

      సర్వం శ్రీమాధవదివ్యచరణారవిందార్పణమస్తు
************************

వాము -- ఆయుర్వేదం

వాము అనేది ప్రతి ఒక్కరి వంటగదిలోనే ఉంటుంది. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. వాము ఘాటుగా కాస్త కారంగా ఉంటుంది. మన అమ్మమ్మల కాలం నుండి వామును ఇంటి చిట్కా గా వాడుతున్నారు. కాస్త కడుపునొప్పి అనిపిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు కాస్త వాముని నోట్లో వేసుకుని నమలండి అని చెబుతారు. వాము తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడి కడుపు నొప్పి, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

ప్రస్తుతం వానలు వస్తున్నాయి కదా… ఈ వాన కాలంలో దగ్గు జలుబు గొంతు నొప్పి వంటివి తరచుగా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు వేడిపాలల్లో వాము పొడి కలుపుకుని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా తల నొప్పి కూడా తగ్గుతుంది. వాము లో ఉండే పోషకాలు గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా చేయడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే వాము లో విటమిన్ సి చాలా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి రోజువారి ఆహారంలో వామును చేర్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు
శ్రీ శర్మద
***************

శివానందలహారీ -- 05

స్మ్రతి,పురాణములందు, స్తుతి,నాట్యములయందు
          శకున , వైద్య , నటన శాస్త్ర మందు
సాహిత్య , సంగీత శాస్త్రంబు లందును
           చతుర , హాస్య , విదూష చదువులందు
నేర్పున్న వాడను నే గాను పరమెశ !
           భావింప నన్నింట పశువు నేను
నటువంటి నా మీద యవనినాథుల కెట్లు
          ప్రేమతో జీరంగ ప్రీతి గలుగు ?
పశువు నగునన్ను పాలించ పరుడు లేడు
పశుపతే ! నీవు పాలించి భవము నందు
కరుణ తోడను రక్షించి కావు మెపుడు
భక్త మందార ! శంకరా ! పాహి పాహి !
గోపాలుని మధుసూదన రావు
****************

శ్రీ శఠారి వైభవం...నమ్మాళ్వారులు

 శ్రీవైష్ణవసంబంధమైనఆలయాలలోఇచ్చే
#శఠగోపం_యొక్క_రూపం_వీరిదే
శఠ అనే మాయను హరించి వేయడం వలన, శఠ అనే మాయను కోపించినారు కనుక వీరికి శ్రీ శఠారి, శ్రీశఠగోపం అని నామములు

#శఠారి :- శఠము అనగా 'మాయ' ... అది పుట్టగానే మానవుని పట్టుకుంటుంది. దానివలన " భగవంతుడు మనకు రక్షకుడై ఉన్నాడు" అనే జ్ఞానం నశించి... ఏమీతెలియని అజ్ఞానంతో ఏడుస్తాం . కానీ విశ్వసైన్యాధిపతి ఐన విశ్వక్సేనులవారి అంశతో జన్మించిన వీరు - మాయ(శఠము) తనదగ్గరకు రాకుండా హుంకరించారు .... మాయను  పారిపోయేటట్లుభయపెట్టారు కనుక "శఠారి" అని పిలువబడినారు... భగవంతుడు శ్రీమన్నారాయణుడు వరమిస్తానని వస్తే "నిత్యం నీపాదుకులను నాతలపైధరించి సంసారులైనవారికి నీపాదాలను అందించే అవకాశం ఇవ్వుము" అన్నారు. లోకముపై వారికి ఎంతప్రేమ. తనకోసం ఏమీకోరలేదు. అందుకే విష్ణుదేవాలయములయందలి భగవంతుని పాదుకలను "శఠారి" లేదా "శఠగోపం" అంటారు.

అటువంటి శఠగోపయతి (శఠారి) గురించి తెలుసుకుందాం...

వృషభేతు విశాఖాయాం....
కురుకాపురి కారిజమ్ |
పాండ్యదేశే కలే రాదౌ....
శఠారిం సైన్యపం భజే ||

  కలియుగ ప్రారంభం లో వృషభమాసం (సౌరమానమును అనుసరించి రవి వృషభరాశిలో సంచరించు కాలం వృషభమాసం)లో విశాఖ నక్షత్రంలో .... విశ్వమునకు సైన్యాధిపతియైన శ్రీవిశ్ష్వక్సేనులవారి అంశతో.... పాండ్యదేశములోని కురికాపురి అను పురమునకు రాజైన కారి అనుపేరుగల రాజునకు పుత్రుడై అవతరించారు - శఠారులైన నమ్ ఆళ్వార్....

శఠారి యైన నమ్మాళ్వారు పాదములే మనకు రక్ష   

మాతాపితా యువతయః తనయావిభూతిః,
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్౹
ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామమ్,
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా ||

ఇక కలియుగం ఆరంభమైన 42 వ రోజున ఒక మహానుభావుడు అవతరించాడు. అంటే సుమారు 5100 సంవత్సరాల క్రితం అన్న మాట. కారిమారులనే దంపతులకు భగవత్ ప్రార్థన చేస్తే ఒక చిన్న శిశువు పుట్టింది. ఆ శిశువు పుట్టగానే మాట లేదు, కదలిక లేదు, ఎట్లాంటి స్పందన లేదు. ఆ పిల్లవాడు పాపం ఆహారం ముట్టడం లేదు, ఆ పిల్లవాడి ప్రవృత్తి ఏం పనికి వచ్చేలా లేదు.

కారణం...శిశువు గర్భంలో ఉన్నప్పుడు పుట్టే ముందు ఆ శిశువుకి తన పూర్వ దశ అన్నీ తెలుస్తాయి. తల్లి గర్భం నుండి ప్రకృతిలోకి వచ్చేప్పుడు "శఠ" అనే వాయువు జ్ఞానద్వారాన్ని కప్పివేస్తుంది. అందుకే మందమతులం లేక శఠులం అవుతాం పుట్టగానే. మనం చేసిన పనులే మనకు జ్ఞాపకం ఉండవు సరిగ్గా. కానీ ఈ శిశువు శఠ అనే వాయువును కోప్పడి ఆ శఠ అనే వాయువుకి శత్రువు అయ్యాడట. 'అరి' శత్రువు, అందుకే శఠారి లేక "శఠకోపులు" అయ్యారు. మనకు శఠ అనే వాయువు వల్ల దాహం, ఆకలి వేస్తుంది. కాని ఆశిశువుకు ఆకలి లేదు, దప్పికలేదు, ఒక శిశువు గర్భంలో ఎట్లా ఉంటుందో అట్లానే ఉన్నాడు. లోన భగవత్ తత్వాన్నే అనుభవిస్తున్నాడు.

 తల్లి తండ్రులకు ఏంతోచక ఆళ్వారు తిరునగరి అనే ఊరి దేవాలయం వద్ద వదిలి వెళ్ళారు. ఆశ్చర్యం ఆ శిశువు క్రమేపి జరగడం ప్రారంబించింది, ఆ గుడిలో ఉన్న చింతచెట్టు క్రిందకు చేరింది. మాట లేదు, చూపు లేదు, ఎట్లాంటి ప్రవృత్తి లేదు. కేవలం కూర్చొని ఉంది. అట్లా 16 సంవత్సరాలు గడిచాయి, శరీరం మాత్రం పెరుగుతూ వచ్చింది. అందరికి ఆశ్చర్యంగా అనిపించేది, క్రమంగా అందరూ మరచి పోయారు.

#మధురకవి ఆళ్వారులు నమ్మాళ్వారులను సేవించడం .....

అదే ఊరికి ప్రక్కనే తిరుక్కోరూర్ అనే ఊరు ఉంది. ఆ ఊరికి చెందిన ఒక మహానుభావుడు అందమైన కంఠస్వరం కల్గినవాడు, అందంగా పాడగలడు. అందుకే మధురకవి అని పేరు. చాలా కాలం ఉత్తర దేశ యాత్ర చేస్తూ అక్కడే ఉండి పోయాడు. అలా తన యాత్ర సాగిస్తూ అయోధ్యాపురంలో ఉన్నప్పుడు, ఒక నాడు రాత్రి ఆకాశంలో అధ్భుతమైన తారక కనిపించింది. కొత్తగా ఆ నక్షత్రం ఉంది, పైగా అది దక్షిణం వైపు నడుస్తున్నట్లు కనిపించింది. అది కదులు తున్నట్లుగా రాత్రి అంతా ప్రయాణం సాగించాడు. తెల్లవారే సరికి నక్షత్రాలు కనిపించవు. రోజంతా అలసట తీర్చుకొని, మళ్ళీ రాత్రి ఆ నక్షత్రం నడిచిన వైపు ప్రయాణం సాగించాడు. అయితే కొన్నాల్లకు ఈ శిశువు ఉన్న ఊరికి చేరాక ఆ నక్షత్రం కనిపించడం మానేసింది.

ఆశ్చర్యం అనిపించింది. ఈ ఊర్లో ఏమైనా వింత జరుగుతుందా అని ఆ ఊరి పెద్దలని అడిగాడు. పెద్దగా ఎవ్వరికీ జ్ఞాపకం లేదు ఆ శిశువు గురించి. ఆ ఊరి దేవాలయంకి వెళ్ళి చూసాడు. అక్కడ చింతచెట్టు తొఱ్ఱలో నీలిరంగు శరీరం కల ఒక 16 ఏండ్ల బాలుడు కనిపించాడు. ఆకాశంలో కనపడ్డ నక్షత్రం యొక్క కాంతి ఈ బాలుడు దేహంలో కనపడింది. మాట లేదు పలుకు లేదు, బొమ్మలా ఉన్నాడు . ఏమైన మాట్లాడగలదడా అని తెలుసుకుందామని ఆ ప్రక్కనే చెట్టు ఎక్కి ఒక పెద్ద శబ్దం వచ్చేలా ఒక రాయిని కిందికి విసిరాడు. ఆ శబ్దానికి బాలుడు ఒక్క సారి కనులు తెరిచి చూసాడు. మరి మాటేమైనా వచ్చునా అని ఒక  ప్రశ్న వేసాడు. ప్రకృతిలో  పుట్టేది ఏం తింటుంది, ఎక్కడ ఉంటంది... అడిగాడు. దానికి బదులుగా ఆ బాలుడు  సమాధానం .....  అక్కడే తింటుంది అక్కడే పడి ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు. అబ్బో వేదాంతం కూడా తెలుసును అని అనుకున్నాడు. ఇలా ఆ శిశువు మాటలకి మెచ్చి, ఆ శిశువునే ఆశ్రయించుకొని ఉన్నాడు. ఆ 16 సంవత్సరాలు లోన ఏదో దివ్యమైన దర్శనాన్ని పొంది, ఆ దర్శనం వల్ల పొందిన ఆనంద అనుభూతిని గానంచేశారు .. అదే తిరువాయ్ మొజి.

 శఠకోపులవారి పాటలను విని శ్రీరంగనాథుడే స్వయంగా 'నా' ఆళ్వార్ అనిపిలిపించుకున్నాడు,  అందుకే నమ్మాళ్వార్ అని పేరు వచ్చింది.

 పరమ ప్రయోజనం భగవంతుడే అనే విశ్వాసంతో  ఎవరు పూజిస్తారో వారికి లభిస్తాడు భగవంతుడు. నాకు సమస్తం అతడే 'వాసుదేవః సర్వం' అని కోరిన నమ్మాళ్వార్ లాంటివారు దొరకడం ఎంత కష్టం అనుకున్నాడు పరమాత్మ. 'ఉన్నుం శోరు పరుగు నీరు తిండిం వెత్తిలయుం ఎల్లాం కన్నన్' నాకు తినే తిండి త్రాగే నీరు విళాసమైన వస్తువులు అన్నీ కృష్ణుడే అనుకున్నారు నమ్మాళ్వారు.  అట్లా అనుకున్నందుకు నమ్మాళ్వార్ తన స్థానం కూడా వదిలిపెట్టి వీరి హృదయాన్నే తన స్థానంగా చేసుకున్నాడు. వీరికి భగవంతుడిపై వ్యామోహం కాదు భగవంతుడికే నమ్మాళ్వార్ అంటే వ్యామోహం. నమ్మాళ్వారిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అనే పిచ్చి భగవంతుడికి కల్గేట్టు చేసారు. అందుకే నమ్మాళ్వార్ కి 'కృష్ణ తృష్ణా తత్వం' అని పేరు పెట్టారు పూర్వ ఆచార్యులు. అందుకే నమ్మాళ్వార్ ని పట్టుకుంటే కృష్ణుడు దొరక పోవడం అనేది ఉండదు. భగవంతుడి ప్రేమకి లక్ష్య భూతమైన వారు నమ్మాళ్వార్.

నమ్మాళ్వారు భగవంతుని అందరికీ నీ అనుగ్రహం లభించాలి అని కోరారు...

నీద్వారా వచ్చిన వారినే అనుగ్రహిస్తాను అన్నాడు పరమాత్మ...

ఐతే నీపాదుకలను నాతలపై ఉంచుకుని వారిని నీదయకు పాత్రులుగా చేస్తా అన్నారు నమ్మాళ్వారు.

 అందుకే మన ఆలయాల్లో తల శఠగోపం తలపై  తాకిస్తారు. శఠగోపం అంటే నమ్మాళ్వారే. అట్లా తాకించుకుంటే ఆయన కృప మనకు లభించినట్టే.   అందుకే భగవత్ కృప మూర్తీభవించిన ఆ ఆళ్వార్ని పట్టవే మనసా ఇక చేయాల్సిన కృత్యాలు ఏమి ఉండవు అని అనుకుంటారు భక్తులు . అట్లా భావించే వారే నాకు సర్వస్వం అని భగవంతుడు అనుకుంటాడు.

భగవంతుడు ఎవరినైతే ప్రేమించాడో వారిని ఆళ్వారులు అని అంటాం.

భగవద్గీత 7 వ అధ్యాయంలో పరమాత్మ తనని కోరే వారు నాలుగు రకాలుగా ఉంటారని చెబుతూ ఒకనాడు అనుభవించి కోల్పోయిన సంపదలను కాంక్షించేవారు కొందరైతే ఇది వరకు లేని సంపదలను కాంక్షించేవారు మరి కొందరు, ఇలా వీరిని ఆర్థులు, అర్దార్థులు అని చెప్పి, మరి కొందరు ఆత్మ సాక్షాత్కారం కోరే వారు, వారిని జిజ్ఞాసువులు అని, నాలుగవ రకానికి చెందినవారిని జ్ఞాని అని చెప్పాడు స్వామి. . ఈ నాలుగు రకాలవారు సుకృతులు, ఏం కావాల్సినా నన్నే కోరుకుంటారు. ఈ నలుగురిలో ముగ్గురిని ఒక విభాగం చేసాడు. ఒకరిని ఒక విభాగం చేసాడు. అయితే ఈ ముగ్గురూ నన్నూ కోరుకుంటారు, నేను ఇచ్చేవి కోరుకుంటారు. నేను ఇస్తాను కనక నన్ను కోరుకుంటారు. అందుకే వారు ఏక భక్తులు కారు, ద్వి భక్తులు. "తేషాం జ్ఞాని నిత్య యుక్తః ఏక భక్తిః విశిష్యతే"

కానీ జ్ఞాని అనేవాడు ఏక భక్తి కలిగి ఉంటాడు, కేవలం నన్నే కోరుకుంటాడు, నేను ఇచ్చేవాటియందు ప్రేమ ఉండనే ఉండదు. ఎప్పటికి నన్నే కూడి ఉంటాడు.  మరి జ్ఞానికి నీకు ఉండే అనుబంధం ఎట్లాంటిది అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా "ప్రియోహి జ్ఞానినోహి అహం అత్యర్థం సచ మమ ప్రియః" వాడికి నా జ్ఞానం కంటే గొప్ప ఇష్టం నేనంటే, నాకూ జ్ఞాని అంటే అంత ఇష్టం.అన్నాడు భగవానుడే స్వయంగా.... వారే ఆళ్వారులు... వారిలో నమ్ళ్వారులు ప్రధానమైనవారు.
********************

*అంతిమంగా జరిగేది ఏమిటి?...*



       ఆదివారం ఉదయం ఇంటి ముందు నీరెండకు కూర్చొని  కాఫీ త్రాగుతూ  సేద తీరుతున్న ఓ సంపన్నుడైన ఆసామి దృష్టి ఒక చీమపై పడింది. ఆ చీమ తనకన్నా అనేక రెట్లు పెద్దదైన ఒక ఆకుని మోస్తూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గంట సేపు అనేక అడ్డంకులు, అవరోధాలతో, ఆగుతూ దారి మార్చుకుంటూ గమ్యం వైపు ప్రయాణం కొనసాగించడం గమనించాడు.

        ఒక సందర్భంలో నేలపైనున్న పెద్ద పగులును  ఆ చిన్న చీమ దాటవలసి వచ్చింది. అప్పుడది ఒక క్షణం ఆగి పరిస్థితిని విశ్లేషించి తాను మోస్తున్న ఆ పెద్ద ఆకును దానిపై పరచి దాని పైనుండి నడిచి అవతలకి చేరుకొని మళ్ళీ ఆ ఆకు అంచుని పట్టుకొని పైకెత్తుకుని ప్రయాణం ప్రారంభించింది. భగవంతుని సృష్టిలోని ఆ చిన్నప్రాణి తెలివితేటలు అతనిని ఆకర్షింప చేసాయి. విస్మయం చెందిన అతనిని, ఆ సన్నివేశం సృష్టి యొక్క అద్భుతాలపై ఆలోచనలో పడేసింది.

        భగవంతుని సృష్టి అయిన ఆ ప్రాణి పరిమాణములో ఎంతో చిన్నదైనా తన మేధస్సు, విశ్లేషణ, ఆలోచన, తర్కం, అన్వేషణ, ఆవిష్కరణలతో సమస్యలను  అధిగమించటం అతని కళ్ళ ముందు సృష్టికర్త యొక్క గొప్పతనాన్నిఅవగతం చేసింది.

       కొంత  సేపటికి చీమ తన గమ్య సమీపానికి చేరుకోవడం అతను చూసాడు. అది ఒక చిన్న రంధ్రం ద్వారా భూగర్భం లోపలకి ప్రవేశించే చీమల నివాసస్థలం, అప్పుడా క్షణంలో అతనికి ఆ చీమ వ్యవహారంలో ఉన్న లోపం స్పష్టంగా అర్థం అయ్యింది. ఆ చీమ తాను ఎంతో జాగ్రత్తగా గమ్యం వరకు తీసుకు వచ్చిన  ఆ పెద్ద ఆకును  చిన్న రంద్రం ద్వారా లోనికి ఎలా తీసుకెళ్లగలదు? అది అసంభవం. ఆ చిన్న ప్రాణి  ఎంతో కష్టానికోర్చి, శ్రమపడి, నేర్పుగా ఎన్నో అవరోధాలనధిగమించి చాల దూరం నుంచి తెచ్చిన ఆ పెద్ద ఆకును అక్కడే వదలి ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది.

       తను మోస్తున్న ఆకు భారం తప్ప ఇంకేమి కాదనే ఆలోచన సాహసంతో కూడుకున్న ఆ ప్రయాణం మొదలు పెట్టె ముందు ఆ చీమకు రాలేదు. చివరాఖరికి వేరే మార్గం ఏమి లేక దానిని అక్కడే  వదలి ఆ ప్రాణి గమ్యాన్ని చేరుకోవలసి వచ్చింది. దీని ద్వారా ఆ ఆసామి ఒక గొప్ప జీవిత పాఠాన్ని ఆ రోజు తెలుసుకున్నాడు. ఇది మన జీవితాలలోని సత్యతను కూడా తెలియ చేస్తుంది.

      మనం మన పరివారం గురించి, మన ఉద్యోగం, మన వ్యాపారం, ధనం ఎలా సంపాదించాలని, మనం ఉండే ఇల్లు ఎలా ఉండాలి, ఎలాంటి వాహనంలో తిరగాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి ఉపకరణాలు ఉండాలి ఇలా ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు చేస్తాము కానీ చివరికి వాటన్నింటిని వదలి అంతిమముగా మృత్యువనే బిందువు పెట్టబడడం ద్వారా మన గమ్యమైన శ్మశానం చేరుకుంటాము. మన జీవన ప్రయాణంలో ఎంతో ఆపేక్షగా, ఎంతో భయంగా మనం మోస్తున్న భారమంతా అంతిమంలో ఉపయోగపడదని, మనతో తీసుకెళ్లలేమని మనం తెలుసుకోవటం లేదు. అందుకే భారాన్ని మర్చిపోండి, పరమాత్ముని స్మృతిలో జీవితాన్ని ఆనందంగా గడపండి.
ఓం శాంతి శాంతిః
సర్వే జన సుఖినోభవంతు