25, ఆగస్టు 2020, మంగళవారం

భాగవత వ్యాప్తి..

భాగవతం మోక్ష నిధి.
పాపాలను నశింప చేసి పుణ్యాన్ని ప్రసాదించే మహిత శక్తి భాగవతానికి ఉంది.
పరమ పుణ్య ప్రదమైన భాగవత తత్వాన్ని తొలుత బ్రహ్మ నారద మహర్షి కి తెలిపాడు.
నారదుడు దానిని వేద వ్యాస మహర్షి కి ఉపదేశించాడు. వ్యాసు డు భాగవత పురాణంగా దానిని రచించి తన  కుమారుడైన         శుకునికి బోధించాడు. శుక మహర్షి పరమ పుణ్యప్రదం..మోక్షప్రదమైన. భాగవత కథను  పరీక్షిత్తు మహారాజు కు వారం రోజుల్లో వివరించి ఆయనకు  ఉత్తమ గతులు కలిగేలా చేసాడు. భాగవత కథను ఆది శేషువు  పాతాళ లోకంలోను... బృహస్పతి స్వర్గ లోకంలోను.., పరాశరుడు భూ లోకంలోను, సనక సనందాదులు స్వర్గానికి పైన ఉండే లోకాల్లో ప్రచారం చేసి బహుళ వ్యాప్తిని  కలుగ చేసారు.
పోతన మహాకవి శ్రీరామ చంద్రుని ప్రత్యక్ష ఆదేశంతో భాగవతాన్ని తెలుగులో రచించి తాను ధన్యుడు కావడంతో పాటు తెలుగు జాతిని ధన్యత చెందేలా చేసాడు.
 ముక్తి పథం భాగవతం. భాగవత కథా సుధను గ్రోలిన వారి  జన్మ ధన్యం.

( ఏం.వి.ఎస్.శాస్త్రి ,ఒంగోలు 9948409528)
********************

కామెంట్‌లు లేవు: