*అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము*
*పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*16.51 (ఏబది ఒకటవ శ్లోకము)*
*పూజాం చ మహతీం కుర్యాద్విత్తశాఠ్యవివర్జితః|*
*చరుం నిరూప్య పయసి శిపివిష్టాయ విష్ణవే॥6946॥*
ఆనాడు ధనమునకు వెనుకాడక భగవంతునకు భక్తి శ్రద్ధలతో మహాపూజను చేయవలెను. పాలతో పాయసమును వండి శ్రీమహావిష్ణువునకు నివేదన చేయవలెను.
*16.52 (ఏబది రెండవ శ్లోకము)*
*శృతేన తేన పురుషం యజేత సుసమాహితః|*
*నైవేద్యం చాతిగుణవద్దద్యాత్పురుషతుష్టిదం॥6947॥*
ఏకాగ్రచిత్తముతో అట్లు వండిన పాయసముతో భగవంతునకు హోమముల ద్వారా పురుషసూక్త విధానముతో అర్చింవలెను. సత్త్వగుణయుక్తమైన, రుచికరమైన నైవేద్యమును సమర్పింపవలెను.
*16.53 (ఏబది మూడవ శ్లోకము)*
*ఆచార్యం జ్ఞానసంపన్నం వస్త్రాభరణధేనుభిః|*
*తోషయేదృత్విజశ్చైవ తద్విద్ధ్యారాధనం హరేః॥6948॥*
జ్ఞానసంపన్నుడైన ఆచార్యుని మరియు బ్రాహ్మణుని వస్త్రాభరణములతో గోదానముతో సంతుష్టులను గావింపవలెను. దీనిని గూడ భగవదారాధనయే అని తెలిసికొనుము.
*16.54 (ఏబది నాలుగవ శ్లోకము)*
*భోజయేత్తాన్ గుణవతా సదన్నేన శుచిస్మితే|*
*అన్యాంశ్చ బ్రాహ్మణాన్ శక్త్యా యే చ తత్ర సమాగతాః॥6949॥*
సాధ్వీ! ఆచార్యుని, ఋత్విజులను పవిత్రమైన సాత్త్విక గుణయుక్తమైన భోజన పదార్ధములతో సంతుష్టిపరచవలెను. తదితర బ్రాహ్మణులను,అచటకు విచ్చేసిన అతిథులను గూడ శక్త్యనుసారము భోజనముతో సంతృప్తిపరచవలెను.
*16.55 (ఏబది ఐదవ శ్లోకము)*
*దక్షిణాం గురవే దద్యాదృత్విగ్భ్యశ్చ యథార్హతః|*
*అన్నాద్యేనాశ్వపాకాంశ్చ ప్రీణయేత్సముపాగతాన్॥6950॥*
*16.56 (ఏబది ఆరవ శ్లోకము)*
*భుక్తవత్సు చ సర్వేషు దీనాంధకృపణేషు చ|*
*విష్ణోస్తత్ప్రీణనం విద్వాన్ భుంజీత సహ బంధుభిః॥6951॥*
గురువునకు, ఋత్విజులకు, యథాయోగ్యముగా దక్షిణలను ఇయ్యవలెను. అచట చేరిన చండాలురు మొదలగు వారిని, దీనులను, అంధులను! బుద్ధిహీనులను గూడ అన్నదానములతో సంతోషపెట్టవలెను. అందరును భుజించిన పిదప వారిని సత్కరించవలెను. ఈ విధముగా అందరిని సత్కరించుటవలన శ్రీమహావిష్ణువు ప్రీతి చెందునని సాధకుడు భావించవలెను. తదుపరి తమ బంధుమిత్రులతో గూడి తాము కూడా భుజింపవలెను.
*16.57 (ఏబది ఏడవ శ్లోకము)*
*నృత్యవాదిత్రగీతైశ్చ స్తుతిభిః స్వస్తివాచకైః|*
*కారయేత్తత్కథాభిశ్చ పూజాం భగవతోఽన్వహమ్॥6953॥*
పాడ్యమి మొదలుకొని, శని త్రయోదశి వరకు నృత్యగానములతో, వాద్య గోష్ఠులతో, స్తుతులతో, స్వస్తి వాచనములతో, భగవత్కథలతో శ్రీహరి పూజలను జరుపవలెను.
*16.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)*
*ఏతత్పయోవ్రతం నామ పురుషారాధనం పరమ్|*
*పితామహేనాభిహితం మయా తే సముదాహృతమ్॥6953॥*
దేవీ! *పయోవ్రతము* అని ప్రసిద్ధి చెందిన ఈ వ్రతము పురుషోత్తముని ఆరాధించే సర్వోత్కృష్టమైన విధానము గలది. దీనిని బ్రహ్మదేవుడు నాకు తెలిపినవిధముగా నీకు వివరించితిని.
*16.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)*
*త్వం చానేన మహాభాగే సమ్యక్ చీర్ణేన కేశవమ్|*
*ఆత్మనా శుద్ధభావేన నియతాత్మా భజావ్యయమ్॥6954॥*
నీవు మిక్కిలి భాగ్యశాలినివి. ఇంద్రియములను వశమలో నుంచుకొని పవిత్రభావముతో శ్రద్ధగా ఈ వ్రటతమును ఆచరింపుము. దీని ద్వారా శ్రీమహావిష్ణువును ఆరాధింపుము.
*16.60 (అరువదియవ శ్లోకము)*
*అయం వై సర్వయజ్ఞాఖ్యః సర్వవ్రతమితి స్మృతమ్|*
*తపఃసారమిదం భద్రే దానం చేశ్వరతర్పణమ్॥6955॥*
కల్యాణీ! ఈ వ్రతము వలన భగవంతుడు సంతష్టుడు అగును. అందువలన దీనిని సర్వయజ్ఞము, సర్వవ్రతము అనియందురు. ఇది సమగ్రతపశ్చర్యల సారము. ఇదియే గొప్ప దానము.
*16.61 (అరువది ఒకటవ శ్లోకము)*
*త ఏవ నియమాః సాక్షాత్త ఏవ చ యమోత్తమాః|*
*తపో దానం వ్రతం యజ్ఞో యేన తుష్యత్యధోక్షజః॥6956॥*
అధోక్షజుని ప్రసన్నునిగా చేయు కార్యములే ఉత్తమమైన యమ నియమములు. అవియే వాస్తవమైన తపస్సులు, దానములు , వ్రతములు, యజ్ఞములు.
*16.62 (అరువది రెండవ శ్లోకము)*
*తస్మాదేతద్వ్రతం భద్రే ప్రయతా శ్రద్ధయా చర|*
*భగవాన్ పరితుష్టస్తే వరానాశు విధాస్యతి॥6957॥*
దేవీ! అందువలన సంయమముతో, శ్రద్ధగా ఈ వ్రతమును ఆచరింపుము. భగవంతుడు శీఘ్రముగా నీ యెడల ప్రసన్నుడై నీ అభిలాషను పూర్తి చేయును.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షోడశోఽధ్యాయః (16)*
ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు పదునారవ అధ్యాయము (16)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

******************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి