2, జులై 2024, మంగళవారం

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

Panchaag


 

సాంద్ర బవదీయ సాంబలింగ..

 "



" పూయ గంధము లేదు భూతి పూతే గాని, ఎక్క గుఱ్ఱము లేదు ఎద్దె గానీ త్రాగ కంచము లేదు తలపుర్రెయే గాని మణులు సొమ్ములు లేవు ఫణు లె గాని కొండ మీదే గాని ఉండ చోటులేదు తలను పువులు లేవు జఢలె గాని గజ చర్మమే గాని కట్ట వస్త్రములేదు జోగి రూపమే గాని సొగసు లేదు... ""

. ఇట్టి నిరుపేద యైన నిన్నెరిగి ఎరిగి బ్రాంతి పడి ఎట్లు పెండ్లాడే పార్వతమ్మ ఐన.. నీ భాగ్య మేమని పొగడ వచ్చు భక్త జన సాంద్ర బవదీయ సాంబలింగ..

సర్వం శివార్పణం..

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

యోగినీ ఏకాదశి వ్రతం

 *నేటి యోగినీ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి...?*


*యోగినీ ఏకాదశి..!*





ఈ యోగినీ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. హిందూ మతంలో, ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున ఉపవాసం పాటించి, నియమ నిబంధనలకు అనుగుణంగా పూజలు చేయడం ద్వారా అన్ని రకాల పాపాల నుండి ,జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతారని చెబుతారు. భక్తులు ఉపవాసం పాటించి, జీవితంలో సకల సంతోషాలు, సంపదలు మరియు శ్రేయస్సు పొందగలిగే ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూజిస్తారు.ఈ ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది. 


యోగినీ ఏకాదశిపై పురాణ కథ

కుబేరుడు పరమ శివభక్తుడు. నిత్యం శివార్చన సాగించనిదే రోజు గడిచేది కాదు. తన పూజ కోసం కావల్సిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు. హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు. హేమమాలికి, స్వరూపవతి అనే యక్షిణితో వివాహం జరిగింది. ఆమె సౌందర్యారాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి ఒకనాడు కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు ఎంతకీ పుష్పాలు తీసుకు రాకపోయేసరికి అసహనం కలిగింది. హేమమాలి ఎందుకు రాలేదో కనుక్కుని రమ్మంటూ సేవకులను ఆదేశించాడు. తిరిగొచ్చి సేవకుడు చెప్పిన మాటలను విన్న కుబేరుని అసహనం కాస్తా క్రోధంగా మారిపోయింది. తక్షణమే హేమమాలిని తీసుకురమ్మని ఆదేశించాడు కుబేరుడు.















*కుబేరుడి శాపం*

నీ శరీరం మీద మోహంతో, మనసు సైతం మలినమైపోయింది. అందుకు ప్రతిఫలంగా కుష్టు వ్యాధిగ్రస్తుడవై భార్యకు దూరంగా భూలోకంలో జీవించు అని శపించాడు. కుబేరుని మాటలకు హేమమాలి గుండెపగిలిపోయింది. తొలి తప్పుని మన్నించమంటూ తన స్వామిని ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. ఇన్నాళ్లుగా శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలంవల్ల హేమమాలికి మార్కండేయ రుషి ఆశ్రమం కనిపించింది. జరిగిన విషయం మొత్తం రుషికి వివరించి శాపవిమోచనం చెప్పమని అర్థించాడు. యోగినీ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే నువ్వు శాపవిమోచనాన్ని పొందుతావని సెలవిచ్చారు మార్కండేయ రుషి. అలా జ్యేష్ఠబహుళ ఏకాదశినాడు వచ్చే యోగినీ ఏకాదశి రోజున ఉపవాసమాచరించి మనసులో దైవాన్ని ప్రార్థించి శాపవిమోచనాన్ని సాధించాడు హేమమాలి. 


ఎవరైతే యోగినీ ఏకాదశినాడు ఉపవాసాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారో వారు పాపకర్మల నుంచి విమోచనం పొందుతారని శ్రీ కృష్ణుడు వివరించాడు. హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు. జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలన్న హెచ్చరిక కూడా. అందుకే శరీరం, మనసుని అదుపుచేసుకునేందుకు ఉపవాసాలు, పూజలు, వ్రతాలు. యోగినీ ఏకాదశి రోజున తెల్లవారుజామునే స్నానమాచరించి శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియలు పూర్తయ్యేలోగా దానధర్మాలు చేసి భోజనం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యం, ఆనందంతో పాటూ ఇంట్లో సానుకూల శక్తి, వుంటుంది అని పురాణాలు చెబుతున్నాయి.


ప్రయోజనాలు

యోగిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన అన్ని పాపాలను ప్రక్షాళన చేయవచ్చు మరియు ప్రస్తుత జీవితంలో అన్ని విలాసాలను అందిస్తుంది. యోగిని ఏకాదశి ఉపవాసం పాటించిన తర్వాత స్వర్గ లోకానికి చేరుకోవచ్చు. యోగినీ ఏకాదశి మూడు లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది. యోగినీ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడంతో సమానమని నమ్ముతారు.

కన్యా వరయతే రూపం

 శ్లోకము:


కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శృతం


బాంధవాః కులమిఛ్చంతి మృష్టాన్నమితరే జనాః


మిత్రులు ఈ శ్లొకానికి వివరణ ఇవ్వగలరు. నేటికాలానికి ఇది అనుసరణీయమేనా తెలుపగలరు

మహాత్ముడు

 *లోకంలో ఈ రెండింటి మొహానికి ఎవ్వరూ గురవ్వకూడదు* 


ప్రపంచంలో మనిషి "ఆకర్షితుడయ్యే" రెండు విషయాలు ఉన్నాయి.  అవి *"ఆడ"* మరియు *"బంగారం"*.  ఈ రెండింటిపై మోహానికి గురైన వ్యక్తి తప్పులు చేయడం ప్రారంభిస్తాడు.  ఈ రెండింటిలో దేనిపైనా కోరిక లేనివాడు *"మహాత్ముడు"* అని పిలువబడతాడు. 

రావణుడు సీతను తప్పుగా చూశాడు.. నశించాడు.   ప్రపంచంలో ఏ స్త్రీని తప్పుగా చూడకూడదని దీని అర్థం.  మన భారతీయ సంస్కృతిలో కూడా *“ప్రపంచంలోని స్త్రీలందరినీ తల్లులతో సమానంగా చూడాలి”* అని చెప్పబడింది!  ఎంత దుర్మార్గుడైనా తన తల్లి పట్ల దురుద్దేశాన్ని కలిగి ఉండడు.  ఆడవాళ్లందరినీ తల్లుల్లాగా చూసుకుంటే మనసులో ఎలాంటి ఒత్తిడి ఉండదు. 


దేవీమాహాత్మ్యంలో, దేవతలు స్త్రీ స్వరూపిణి రూపంగల శ్రీమాతను స్తుతించినప్పుడు, *"స్త్రీలందరూ నీ రూపమే"* అని అంటారు.  

ఆ పద్ధతిని అనుసరించే మార్గాలను మన పూర్వీకులు  మనకు నేర్పించారు.  అందుకు విరుద్ధంగా చేస్తే ఘోర తప్పిదం అవుతుంది. అలాగే ఇతరుల ఆస్తులను మనం ఆశించకూడదు.  వీధిలో ఎన్ని రాళ్లు, ధూళి పడి ఉన్నా ఎవరి హృదయం అయినా ఆ రెంటినీ కావాలనుకుంటుందా..?  లేదే.. అలాగ్గే ఇతరుల ఆస్తి పట్ల మనమూ అదే వైఖరిని కలిగి ఉండాలి.  ఈ అలవాటు లేని వారికి, ఇతరుల ఆస్తిని దోచుకోవాలని ఆలోచించే వారికి దుర్యోధనుడి కథ ఒక హెచ్చరిక!  దుర్యోధనుడు తన ముత్తాత పిల్లలకు ఆస్తిని ఇవ్వకుండా అంతా తానే అనుభవించాలనే దురాశ;  అతను దాని ఫలితాన్ని అనుభవించాడు. ధనవంతుడు కావడం ఆనందం కాదు. దుఃఖం లోనే ధనవంతుడిలా ఉండటం గొప్పతనం. ఇది సత్య హరిచంద్రుడు కధ తెలియచేస్తుంది. ఉన్నదానితోనే సంతృప్తి చెందాలి. పరాయివాటిపై వ్యామోహం వద్దు. ఈ విధానం ఏసందర్భంలోనైనా సౌకర్యవంతంగా ఉంటుంది.  

ఈ తత్వాన్ని విస్మరిస్తే అధర్మం, అన్యాయం పెరుగుతాయి.  దీనికి బద్ధంగా, "బంగారం" కోసం మోహాన్ని తొలగిస్తే, మనకు సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితంగా లభిస్తుంది.. జీవితం సుఖమయంగా ఉంటుంది.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

కేశతైలం

 ప్రియమితృలకు నమస్కారం , 


     

       కేశతైలం తయారుచేసాను. దానితో పాటు పూర్తి ఒక షాంపూ కూడా తయారుచేశాను. 


        ఈ రెండు పూర్తి ప్రకృతిసిధ్ధ వనమూలికలతో 

తయారుచేయబడినవి. ఇది అత్యంత ప్రాచీన గ్రంధాలననుసరించి 12 రకాల మూలికలు కలిపి  ప్రాచీనపద్ధతులను అనుసరించి తయారుచేశాను. 


  కేశవృద్ధితైలం ఉపయోగాలు - 


 *  వెంట్రుకలు రాలిపోవడం ఆపుతుంది.


 *  బరకగా ఉన్న వెంట్రుకలను మృదువుగా మారుస్తుంది. 


 *  వెంట్రుకల మందాన్ని పెంచుతుంది. 


 *  వెంట్రుకల కుదుళ్లకు బలాన్ని చేకూర్చడమే కాకుండగా వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.


 *  తలలోని వేడిని తీసివేస్తుంది. తలలోని వేడివల్ల వచ్చే తలనొప్పిని నివారిస్తుంది.


 *  తలకు చల్లదనాన్ని ఇస్తుంది.


  హెర్బల్ షాంపు ఉపయోగాలు  - 


  *  చుండ్రుని శాశ్వతంగా పోగొడుతుంది.


  *  వెంట్రుకలకు అమితమైన బలాన్ని ఇస్తుంది. 


  *  వెంట్రుకలు చిట్లడం  ఆపుతుంది. 


     ఈ రెండిటి కాంబినేషన్ గతకొంతకాలంగా కొంతమంది మీద ప్రయోగించి చూసాను. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మీ అందరికి అందుబాటులో తీసుకుని వస్తున్నాను. 


       నా అనుభవంతో చెప్తున్నాను ఇది తప్పకుండా వెంట్రుకల సమస్యలపైనా బ్రహ్మస్త్రంలా పనిచేస్తుంది. అతి తక్కువకాలంలోనే మీ వెంట్రుకల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుంది.

 

  

  ఈ తైలం ఒక ప్రాచీన ఫార్ములాతో తయారుచేయబడినది. దీనిని వాడటం వలన సైడ్ అఫక్ట్స్ వంటివి ఉండవు. నిర్భయంగా వాడవచ్చు . ఇది పూర్తిగా 100% శుద్ధ ఆయుర్వేద మూలికలతో తయారుచేయబడినది. షాంపు కూడా పూర్తి ఆయుర్వేద మూలికలతో రూపొందించబడినది. చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ షాంపు వాడటం వలన చుండ్రుసమస్య నుంచి బయటపడగలరు.


   ఈ షాంపు మరియు తైలం కావలిసిన వారు 9885030034  నెంబర్ నందు సంప్రదించగలరు .


గమనిక  - 


      రెండు నుంచి మూడు నెలలపాటు ఆపకుండా వాడటం వలన ఇంకా గొప్ప ఫలితాలు చూడగలరు . వేడి నీటితో తలస్నానం నిషిద్ధం . 


        కేశవృద్ధి తైలం మరియు షాంపు కావలసిన వారు 9885030034 ఫోన్ నంబర్ నందు డైరక్టుగా సంప్రదించగలరు . 


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

రజత గద

 



ఇటీవల విజయ యాత్రలో శ్రీ సన్నిధానం వారికి ఒక భక్తుడు సమర్పించిన ఈ రజత గదను ఉద్దేశించి ఇలా భాషణం చేశారు..

"గద అంటే ఒక ఆయుధం.ఇది ప్రముఖంగా శ్రీ ఆంజనేయస్వామి వారి ఆయుధంగా ప్రాచుర్యం పొందింది..దీనితో స్వామివారు దుష్ట సంహారంచేసి, శిష్ట రక్షణ చేశారు. అలాగే ఈ కాలంలో ఈ గదతో అదే స్వామివారు అధర్మం మీద, అన్యాయం మీద, కష్టాల మీద, సంకష్టాల మీద,అపమృత్యు భయాల మీద, అవినీతి మీద, హిందూమతాన్ని,సనాతన ధర్మాన్ని ద్వేషించే వారిమీద, గోవధను చేసే దుర్మార్గులమీద ఈ గదను ఉపయోగించి వాటన్నిటినీ రూపుమాపి భక్తులను, ఈ వేదభూమి ఐన భారతావనిని రక్షించాలని శ్రీ ఆంజనేయస్వామి వారిని వేడుకుంటున్నాను.

*-జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు.*

సాహితీదుగ్ధమాధురీరుచి

 మత్తకోకిల:

సాహితీదుగ్ధమాధురీరుచి చాలినంతగ గ్రోలగా 

దేహమంతయు పుల్కరింతల తేలిపోవుగ హాయిగా 

సాహసింపదు మానసంబిక సన్నుతింపగ నన్యమున్ 

పాహి నీవని ప్రార్థనమ్మిడు భవ్యసాహితి నెప్పుడున్ 

*~శ్రీశర్మద*

8333844664

*శక్తి స్వరూపం

 *శక్తి స్వరూపం ఒక్కటే..*

"దేవత వేర్వేరు పనులు చేసినా, ఆమె నామాలూ, రూపాలు భిన్నంగా ఉన్నప్పటికీ, చైతన్యశక్తి ఒకటే.

*లక్ష్మీప్రదానసమయే నవవిద్రుమాభాం* *విద్యాప్రదానసమయే శరదిన్దుశుభ్రామ్ ।* *విద్వేషివర్గవిజయే చ తమలనీలాం దేవిం* *త్రిలోకజననీం శరణం భజామః ॥*

మనకు సంపదలను అనుగ్రహించే దేవతగా లక్ష్మిదేవి రూపంలో, మనకు జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు సరస్వతి లేదా శారదా అమ్మవారిగా, శత్రువులను సంహరించి, ఆపదలను తొలగించి మనలను రక్షించేటప్పుడు దుర్గ స్వరూపిణిగా అమ్మవారిని పూజిస్తాం. కానీ, అమ్మవారి రూపాలు వేర్వేరు అయినప్పటికిన్నీ

ఈ అన్ని రూపాల ద్వారా మనలను ఒకే ఒక్క దివ్యమాత, ఒకే శక్తి స్వరూపం అనుగ్రహిస్తుందనే ఈ అవగాహనతో మనం అమ్మవారి ఉపాసన చేయాలి."

అంటే అమ్మవారు ఒక్కటే.రూపాలు,నామాలు,

అలంకారాలు,చేతబూనిన ఆయుధాలు మాత్రమే వేరువేరు.

*-జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీతీర్థ మహాసన్నిధానంవారు*

ఒకే వస్తువును

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 శ్లో𝕝𝕝  *ఏకామిషాభిలాషా హి బీజం వైరమహాతరోః* ।    

       *తిలోత్తమాభిలాషో హి యథా సుందోపసుందయోః* ॥


                     *--- _సూక్తిరత్నావళిః_ ---*


తా𝕝𝕝   ఒకే వస్తువును ఇరువురు కోరుటయే వైరమను మహావృక్షమునకు బీజమగుచున్నది.... ఎట్లనిన సుందోపసుందులు ఇరువురూ తిలోత్తమను కోరుకున్నవారై వైరమును కొనితెచ్చుకున్నారుగదా....

పుట్టువు లేని నీ కభవ పు

 శు  భో  ద   యం🙏


పుట్టుకలేనివాడు!

ఉ.

పుట్టువు లేని నీ కభవ పుట్టుట క్రీడయగాక పుట్టుటే?

యెట్టనుడున్ భవాది దశలెల్లను జీవులయందవిద్య దాఁ/

 జుట్టుచు నుండుఁ గాని నినుఁ జుట్టినదింబలెఁ బొంత నుండియుం/

జుట్టఁగలేమిఁ దత్క్రియలఁ జొక్కనియెక్కటి వౌదు వీశ్వరా!


రచన:-పోతనమహాకవి.

భాగవతం-10స్కం-90పద్యం.


పుట్టుట ఎరుగని నారాయణా! నీకు పుట్టుక అంటు వేరే లేదు. అటువంటినీవు ఇలా పుట్టడం నీకు క్రీడ లాంటిదిఅది ఎలా అంటే జన్మ , మరణం మొ/నవన్నీ మాయ కారణంగా జీవులను ఆవరిస్తు వుంటాయి. కాని నిన్ను మాత్రం ఆమాయ స్ప్రుశించలేక దూరంగా వుండిపోతుందీ కనుక ఆమాయామయమైన క్రియలు వేటిలోను చిక్కు కొనకుండా ఏకైక మూర్తిగా నిలబడి పోతావు.కనుకనే ఈజగత్తులకన్నిటికీ నీవు ఈశ్వరుడవు.

           నమో నారాయణాయ!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏

తిరుమల కు వెళ్తున్న బ్రాహ్మణులకు

 *తిరుమల కు వెళ్తున్న బ్రాహ్మణులకు శుభవార్త.*

ఇరవై నాలుగు గంటలు, 365 రోజులు ఆ దేవదేవుడు, తిరుమల వేంకటేశ్వర స్వామి మన కోసం నిలబడి మన బాధలు తీరుస్తూ కల్పవృక్షం గా తిరుమల లో వెలిశారు. *శ్రీహరి భక్తులకు సేవ చేస్తే చాలు శ్రీ హారి మనకు అనుగ్రహిస్తారు అని పురాణాలు చెప్తున్నాయి.  

 సాక్షాత్తు జగద్గురువులు *శ్రీ శృంగేరి భారతి తీర్థ స్వామి* అసిస్సుల తో  మరియు వారి అనుగ్రహం తో  *తిరుమల శృంగేరి మఠం* వారు మన బ్రాహ్మణులకు ప్రతి రోజు *అన్న ప్రసాద వితరణ ను ప్రారంభించారు.*

 *శ్రీ శారద అన్న ప్రసాదం అనే పేరు తో  కార్యక్రమాన్ని ప్రారంభించారు*. 

శుచిగా శుభ్రంగా బ్రాహ్మణుల చేత వండించి వితరణ చేస్తారు. ఇది బ్రాహ్మణులకు శుభవార్త.

ఈ సృష్టిలో విశిష్టమైనది మానవజన్మ. 

ఈ జన్మకు సార్థకత చేకూర్చేది వితరణ. 

ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమల చేరుకుని స్వామి దర్శనం కోసం ఆర్తి తో ఎదురుచూస్తున్న భక్తులకు, కాస్త ఆకలి తీర్చే కార్యక్రమం శృంగేరి మఠం వారు చేస్తున్న అన్న ప్రసాద వితరణ. 

ప్రతి రోజూ ఈ కార్యక్రమం స్థానిక శృంగేరి మఠం నందు జరుగుతుంది . ఇది గొప్ప యజ్ఞం.  ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్న వారు *శ్రీమాన్ కే చంద్ర శేఖర్ గారు ధర్మాదికారి, శృంగేరి మఠం*. తిరుమల శృంగేరి మఠం వారికి మనం అందరం సహకరించాలి. 

కాబట్టి ఈ సమాచారం అందరికీ అందించండి. వారి నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీ రాక ను ముందే వీరికి తెలియజేయగలరు . 0877 2277269, 9440271698.


మీ

*Dr K Chandrasekhar Sastry*

Dharmadhikari

Sri sringeri mutt, Tirumala

🌹 *జూలై 02, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🍁 *మంగళవారం*🍁

    🌹 *జూలై 02, 2024*🌹

       *దృగ్గణిత పంచాంగం*                


          *ఈనాటి పర్వం:*

  *సర్వేషాం యోగిన్యేకాదశి*

    ఉపవాసం ద్వాదశి పారణ 

 రేపు ఉ 05.39 - 08.16 వరకు


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠమాసం - కృష్ణ పక్షం*

*తిథి : ఏకాదశి* ఉ 08.42 వరకు ఉపరి *ద్వాదశి*

వారం :*మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం : కృత్తిక* రా 04.40 తె వరకు ఉపరి *రోహిణి* 

*యోగం : ధృతి* ప 11.17 వరకు ఉపరి *శూల*

*కరణం : బాలువ* ఉ 08.42 *కౌలువ* రా 07.54 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.30 - 12.30  మ 02.30 - 03.30*

అమృత కాలం :*రా 02.20 - 03.53*

అభిజిత్ కాలం :*ప 11.45 - 12.38*

*వర్జ్యం : సా 05.03 - 06.36*

*దుర్ముహుర్తం : ఉ 08.16 - 09.08 రా 11.06 - 11.50* 

*రాహు కాలం : మ 03.28 - 05.06*

గుళిక కాలం :*మ 12.12 - 01.50*

యమ గండం :*ఉ 08.55 - 10.33*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *మేషం/వృషభం*

సూర్యోదయం :*ఉ 05.39* 

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల  :‌ ఉత్తర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం :*ఉ 05.39 - 08.16*

సంగవ కాలం :*08.16 - 10.53*

మధ్యాహ్న కాలం :*10.53 - 01.30*

అపరాహ్న కాలం :*మ 01.30 - 04.07*

*ఆబ్ధికం తిధి:జ్యేష్ఠ బహుళ ద్వాదశి*

సాయంకాలం :*సా 04.07 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.55*

నిశీధి కాలం :*రా 11.50 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.12 - 04.55*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌀🌀🌀 హనుమంతుని*  

     *ప్రదక్షిణాలు 🌀🌀🌀*


హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. 

ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చేస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు, వక్కలు , పసుపుకొమ్ములు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.


*'శ్రీ హనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'*


*శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం*

*తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం*


*శ్లో|| మర్కటేశ మహోత్సాహ -  సర్వశోక వినాశన*

*శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||*


అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి


*''యాకృత్తె రేభి: ప్రదక్షిణణై|*

*శ్రీ సువర్చలా సమేత* *హనుమాన్ సుప్రీతస్సుప్రసంనో వరదో* *భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''*


అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిరస్స్నానం , నేలపడక , సాత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

 🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹