20, ఏప్రిల్ 2026, సోమవారం

పంచాంగం

 


జంటనగరాల పేర్ల

  *జంటనగరాల పేర్ల పుట్టు పూర్వోత్తరాలు* 


పూర్వం సుమారు 400 ఏళ్ళకు ముందు భాగ్యనగరంలో ఇద్దరు ముస్లిం సోదరులు, మూసీనది పక్కన బాతులు మేపుకుంటూ జీవనం చేసేవారు. ఆ ఇద్దరు సోదరులు ప్రతిరోజూ చాలా దూరం తిరుగుతూ బాతులు కాసేవారు. 


ఒకనాడు వారు బాతులు కాస్తుండగా, ఉన్నట్లుండి ఆకాశంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆ ఉరుముల శబ్దానికి బాతులు చెల్లాచెదరై, మూలమూల ప్రాంతాలకు వెళ్ళిపోయాయి.


అన్నదమ్ములిద్దరూ అష్టకష్టాలు పడి బాతులన్నిటినీ ఇంట్లోని దొడ్డిలోకి చేర్చగలిగారు. పెద్దవాడికి సందేహం వచ్చి బాతులన్నిటినీ లెక్కించగా, ఒక్క బాతు తక్కువగా ఉంది. వెంటనే అన్నదమ్ములిద్దరూ తప్పిపోయిన బాతును వెతికి పట్టుకోవడానికి బయలుదేరారు. అన్న భాగ్యనగరం వైపు, తమ్ముడు నేటి సికింద్రాబాద్ ఉన్న ప్రాంతం వైపు వెళ్ళారు. 


ఈ ఇద్దరికీ కూడా తెలుగు సరిగ్గా రాదు. అన్న భాగ్యనగరం అంతా తిరుగుతూ *హేదిరాబాతు* *హేదిరాబాతు* అంటూ వెతికి, వేసారిపోయి, తమ్ముడున్న చోటికి వచ్చాడు.


అప్పుడే తమ్ముడుకి బాతు దొరికింది. వాడు సంతోషంతో అరుస్తూ *సిక్కిందిరాబాతు* *సిక్కిందిరాబాతు* అంటూ, తనకు దొరికిన బాతుని అన్నకు సంతోషంగా ఇచ్చాడు. వాళ్ళిద్దరూ బాతుని తీసుకుని ఇంటికి వెళ్ళారు. 


కాలక్రమేణా ఆ అన్నదమ్ములు పలికిన మాటలే కొద్దిగా మార్పు చెంది, "హైదరాబాద్" "సికింద్రాబాద్" గా స్థిరపడ్డాయేమో కదా 


🤣🤣🤣

ఒక రూపాయి నాణెం

  ఒక రూపాయి నాణెం

ఎనిమిదేళ్ల ఒక చిన్న బాలుడు మార్కెట్‌లోని ఒక దుకాణానికి వెళ్లి, దుకాణదారుడికి ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు:

“మీ దుకాణంలో దేవుడు ఉంటే, ఈ ఒక రూపాయికి నాకు ఆయనను ఇస్తారా?”


దుకాణదారు కోపంగా ఆ నాణెాన్ని బాలుడి చేతి నుంచి కొట్టి, అతడిని వెళ్లగొట్టాడు. బాలుడు నాణెాన్ని తీసుకుని, ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి తిరుగుతూ, “ఒక రూపాయికి దేవుడు దొరుకుతాడా?” అని అడుగుతూనే ఉన్నాడు.


చాలా మంది దుకాణదారులు అతడిని తోసివేశారు. కానీ ఆ బాలుడు మాత్రం ధైర్యం కోల్పోలేదు.


చివరికి ఒక పెద్ద దుకాణంలోకి వెళ్లి అదే ప్రశ్న అడిగాడు. ఆ దుకాణ యజమాని చాలా కోపంగా అతడిని బయటికి లాగి తోసేశాడు. ఆ బాలుడు రోడ్డుపై . . అప్పుడే వెళ్లిపోతున్న ఒక ఖరీదైన విలాసవంతమైన కారు ముందు పడిపోయాడు. కారు వెంటనే ఆగింది. అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు.


ఒక ధనవంతుడు కారు నుంచి దిగుతూ ఏమైంది అని అడిగాడు. బాలుడు జరిగిన సంగతిని మొత్తం చెప్పి, తన ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు:

“మీ దగ్గర దేవుడు ఉంటే, ఈ ఒక రూపాయికి నాకు ఇస్తారా?”


ఆ ధనవంతుడు చిరునవ్వు చిందిస్తూ అడిగాడు:

“నేను ఒక రూపాయికి దేవుణ్ణి కొనుగోలు చేసి నీకు ఇస్తే, ఆయనతో ఏమి చేస్తావు?”


బాలుడు సమాధానమిచ్చాడు:

“నా అమ్మ నాకు అన్నీ. ఆమె నాకు భోజనం పెడుతుంది, జోలపాటలు పాడుతుంది, నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె చాలా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. డాక్టర్లు ‘దేవుడే ఆమెను కాపాడగలడు’ అన్నారు. అందుకే ఒక రూపాయికి దేవుడు దొరుకుతాడేమో అని వెతుకుతున్నాను.”


ఇది విన్న ఆ ధనవంతుడు అన్నాడు:

“నీకు ఒక రూపాయికి దేవుడు కావాలా? నేను ఇస్తాను.”


అతడు ఒక లేఖ రాసి, కవర్లో పెట్టి బాలుడికి ఇచ్చాడు.

“నీ అమ్మ ఉన్న ఆసుపత్రికి వెళ్లి, ఈ లేఖను ఒక ప్రత్యేక డాక్టర్‌కి ఇవ్వు,” అని చెప్పాడు.


బాలుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆ లేఖను పేర్కొన్న డాక్టర్‌కు ఇచ్చాడు. డాక్టర్ ఆ లేఖను తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. అది ఆసుపత్రి స్థాపకుడు స్వయంగా రాసిన లేఖ. వెంటనే బాలుడి తల్లికి అత్యుత్తమ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.


కొన్ని రోజుల తరువాత, అదే కారు నుంచి దిగిన ఆ ధనవంతుడు—అదే ఆసుపత్రి స్థాపకుడు—ముఖ్య వైద్యులతో కలిసి ఆమెను చూడడానికి వచ్చాడు.


తల్లి ఆసుపత్రి ఖర్చులు ఎలా చెల్లించాలి అని ఆందోళన చెందుతోంది.


ఆ ధనవంతుడు ఆమెను ధైర్యం చెప్పాడు:

“మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కుమారుడు ఇప్పటికే మీ చికిత్సకు కావాల్సిన మొత్తం చెల్లించాడు.”


అది విన్న తల్లి ఆశ్చర్యపోయి, తన పక్కన నిద్రిస్తున్న తన కుమారుడిని చూసింది.


ఆయన మరలా అన్నాడు:

“వైద్య ఖర్చులు తీర్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీ కుమారుడి చదువుకు వినియోగిస్తాను.”


తల్లి భావోద్వేగానికి లోనై, “మీరు ఇది ఎందుకు చేస్తున్నారు?” అని అడిగింది.


ఆయన సమాధానం ఇచ్చాడు:

“మీ కుమారుడి దేవుడిపై ఉన్న అచంచల విశ్వాసం, ఆయన ఎక్కడున్నా సంపాదించాలనే సంకల్పమే ఈ సేవకు కారణం.”


హృదయంలో విశ్వాసం ఉండి, దృఢమైన సంకల్పం ఉంటే — ఒక రూపాయికైనా దేవుడు దొరుకుతాడు. 🙏

చందనోత్సవం

 👉ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం.


👉అదే రోజున పరశురామ జయంతి .


మరిన్ని అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.


1. పరశురాముని 

     జన్మదినం


2. పవిత్ర గంగా నది

     భూమిని తాకిన

      పర్వదినం


3. త్రేతాయుగం 

    మొదలైన దినం


4. శ్రీకృష్ణుడు 

    తన బాల్యమిత్రుడైన

     కుచేలుని కలుసుకొన్న

     దినం


5. వ్యాస మహర్షి 

     “మహా భారతము”ను,

      వినాయకుని

      సహాయముతో,

      వ్రాయడం

      మొదలుపెట్టిన దినం


6. సూర్య భగవానుడు

     అజ్ఞాతవాసములో

     వున్న పాండవులకు

      అక్షయ పాత్ర

      ఇచ్చిన దినం


7. శివుని ప్రార్థించి

     కుబేరుడు

     శ్రీమహాలక్ష్మితో 

     సమస్త సంపదలకు

     సంరక్షకునిగా

     నియమింపబడిన దినం


8. ఆదిశంకరులు

     “కనకధారాస్తవం” ను

     చెప్పిన దినం


9. అన్నపూర్ణా దేవి 

     తన అవతారాన్ని

      స్వీకరించిన దినం


10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు

       దుశ్శాసనుని

       బారినుండి 

       కాపాడిన దినం.