14, మే 2023, ఆదివారం

సంతృప్తి

 *సంతృప్తి...*


_నిత్యజీవితంలో ఉన్నదానితో ఆనందపడడమే సంతృప్తి..._

ఒక రోజు ఒక పెద్ద మనిషి ఓ బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని డబ్బుల పెట్టెను భుజాన వేసుకుని ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు, ఆ పెట్టెలో వంద రూపాయల కట్టలు దాదాపు వంద ఉన్నాయి. 

అయితే మార్గమధ్యంలో గతుకుల రోడ్డుపై వెళ్తుండడంతో పెట్టె మూత కొద్దిగా తెరచుకుంది, అందులోంచి ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది...


అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు, కింద పడిన నోట్ల కట్టలోంచి ఒక్క నోటు మాత్రం బయటికొచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది...

ఆ నోటు పడిన పక్కగా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు, అతను ఆ ఒక్క నోటూ తీసుకుని దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌కి వెళ్ళాడు...

ప్లేటు దోసె, ప్లేటు ఇడ్లీ తిని, ఒక కాఫీ తాగాడు, ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాడు, అక్కడి హుండీలో ఓ పది రూపాయల నోటు వేసి, దేవుడికి కృతజ్ఞతగా దణ్ణం పెట్టుకున్నాడు, సంతోషంతో ఇంటికి చేరాడు...

పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి, ఆ దార్లో కాస్సేపటికి వేరే ఒకడు వచ్చాడు. 

అతను ఆ నోట్ల కట్ట తీసుకున్నాడు, వెంటనే లెక్కపెట్టాడు, వంద రూపాయల నోట్లు 99 ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ లెక్కించాడు, ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి...


బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు, కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండవచ్చని అనుకుని వెతకడం మొదలుపెట్టాడు. 

చాలాసేపు వెతికాడు, కానీ ఫలితం లేకపోయింది, అయినా వెతుకులాట మానలేదు.


ఈ కథను చెప్పిన ఓ గురువు ఫకాలున నవ్వాడు. 

ఒక్కనోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్‌ కు వెళ్ళి ఇడ్లీ తిన్నాడు, కాఫీ తాగాడు, కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలు పెట్డాడు...


*నీతి*

మనం ఈరోజు లభించిన దానితో ఉన్నదానితో అనుభవించము... దానితో తృప్తిపడము లేని దానికోసం బుర్రలు పాడుచేసుకుంటాము, ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు...

దేహం ఓ వైపు లాగుతుంటే మనసు మరోవైపు పోతుంటుంది, ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు, సంతృప్తి వుండదు...

మాతృదినోత్సవ శుభాకాంక్షలు

 మాతృదినోత్సవ శుభాకాంక్షలు 

🙏👩‍👧‍👦


మాతృదినోత్సవం సందర్భంగా 20 ప్రశ్నలతో చిన్న క్విజ్ తయారు చేయడం జరిగింది...

*తల్లుల* *పేర్లు* *చెప్పండి* .


1.శ్రీరాముని తల్లి........

2.శ్రీకృష్ణుని కన్న తల్లి.....

3.సూర్యుని తల్లి..

4.శంకరాచార్యుని తల్లి...

5.రామకృష్ణపరమహంస తల్లి..

6.వివేకానందుని తల్లి........

7.పరశురాముని తల్లి .....

8.ధృవుని తల్లి .......

9.ప్రహ్లాదుని తల్లి .....

10.వామనుని తల్లి ....

11.హనుమంతుని తల్లి....

12.దత్తుడి తల్లి....

13.గోవిందుని తల్లి....

14.భీష్ముని తల్లి.....

15.వ్యాసుని తల్లి.....

16.గౌతమ బుద్దుని తల్లి....

17.కర్ణుడి పెంచిన తల్లి

18.యమధర్మ రాజు తల్లి....

19.శనైశ్చరుని తల్లి....

20.భరత మహారాజు తల్లి....

 🥁Mothers day special quiz...😌🤗

 .

                     _*సుభాషితమ్_*


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*నైకస్వప్స్యాచ్ఛూన్యగేహే* 

*శయానం న ప్రబోధయేత్|*

*నోదక్య యా౭భి భాషేత* 

*యజ్ఞం గచ్ఛేన్నచాహృతః||*


తా𝕝𝕝 

*ఒంటరిగా ఇంట్లో నిద్రపోకూడదు... పడుకున్నవారిని లేపకూడదు.... నెలసరి సమయంలో స్త్రీలతో ముచ్చట్లు పెట్టకూడదు..... యజ్ఞయాగాదులకు పిలవకపోయినా వెళ్ళాలి.... ఇవన్నీ పాటించాల్సిన నియమాలు*.... 

మెదడు రోగాలు - నివారణా యోగాలు .

 మెదడు రోగాలు - నివారణా యోగాలు . 


 మెదడు చెడిపోవడానికి గల కారణాలు - 


 * మత్తు పదార్దాలు ఎక్కువుగా సేవించడం వలన.


 * మానసిక శ్రమ ఎక్కువుగా చేయడం వలన.


 * ఎక్కువ ఆందోళన , భయం , ఒత్తిడికి గురి అవ్వడం వలన .


 * సంవత్సరాల తరబడి తలకు, పాదాలకి నూనె రాయకపోవడం వలన.


 * విరుద్ధమైన ఆహారపదార్ధాలు సేవించడం వలన.


 * మధువు, మాంసం ఎక్కువ తీసుకొవడం వలన.


        మొదలయిన కారణాల వలన మెదడుకు రక్తం తీసుకుని పోయే రక్తనాళాలు అస్వస్థత చెంది మెదడు వ్యాదులు సంక్రమిస్తాయి.


 మెదడు వ్యాధుల లక్షణాలు - 


 

 *  ఏ పని చేయాలన్న ఉత్సాహం లేక పోవడం.


 *  తరచుగా తలనొప్పి రావడం.


 *  తలదిమ్ము,, తలతిప్పు కలగడం.


 *  జ్ఞాపకశక్తి తగ్గిపోవడం.


 *  అస్పష్టమైన భావాలు , ఆలోచనలు ఏర్పడటం .


 *  బుద్ధి మందగించడం.


 *  నరముల బలహీనత .


 *  పక్షవాతం రావడం . 


        ఇటువంటి లక్షణాలు అన్ని మెదడు వ్యాధి సంబంధ లక్షణాలుగా పేర్కొనవచ్చు. 


  నివారణా యోగాలు  - 


 

 మెదడు మోద్దుబారితే  - 


 *  సునాముఖి ఆకు చూర్ణం పూటకు అర టీ స్పూన్ మోతాదుగా వెన్నతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి. 


 *  జాజికాయ చూర్ణం రెండు వేళ్ళకు వచ్చినంత రెండు పూటలా మంచినీళ్ళతో వాడాలి.


 *  తమలపాకు ల తాంబూలాన్ని రెండు పూటలా వేసుకోవాలి. 


  మెదడు లొ అతివేడి అనుగుటకు  - 


 *  ఆవనూనేలో  ఉశిరిక పండ్లను ఒక వారం రోజుల పాటు నానబెట్టి తరువాత ఆ నూనేని తలకు మర్దన చేస్తూ ఉంటే మెదడులోని అతివేడి అనిగిపోతుంది.


 *  బాదం నూనెతో తలకు మర్దన చేసుకుంటూ ఉంటే తలలోని పోటు , వేడి , వికారం తగ్గిపోతాయి 


 *  పెద్ద బచ్చలి ఆకుని నూరి రెండు కనతలకు పట్టు  వేస్తే వెంటనే తలలోని దుష్ట వేడిమి తగ్గిపోయి హయిగా నిద్ర పడుతుంది.


  

  మెదడు శుభ్రపడటానికి  - 


 *  గంజాయి ఆకుని నీడలో ఎండబెట్టి మెత్తటి చూర్ణంగా చేసుకొని కొద్దికొద్దిగా ముక్కు పోడుములాగా పీలుస్తూ ఉంటే మెదడు శుభ్రపడుతుంది.


 

         మరింత విలువైన సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   

అగ్నేశ్వరాలయం - వారణాసి

 *_🙏అగ్నేశ్వరాలయం - వారణాసి🙏_*


🌸ఒకానొకప్పుడు భక్తి శ్రద్ధలతో కూడిన విశ్వనార్ అనే బ్రాహ్మణుడు తన భార్య సుచిష్మతితో కలిసి జీవించేవాడు. కొద్ది రోజులకి వారి పూజా ఫలితాల కారణంగా దైవానుగ్రహంతో ఓ మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఆ బిడ్డకి చుట్టు పక్కల ఉన్న ప్రముఖులు కలసి గ్రహపతి అని పేరు పెట్టారు.

విశ్వనార్ కుమారుడు పుట్టుక తర్వాత, బిడ్డ పుట్టుక, పెంచేటప్పుడు జరపవలసిన అన్నీ ఆచార పద్ధతులను క్రమ తప్పకుండా నిర్వహించాడు. గ్రహపతికి అతిధి ఐదో ఏటా బ్రహ్మోపదేశం చేసి, ఉపనయనము చేయడం జరిగింది. అతడు అన్నీ వేద విద్యలను తన తండ్రీ, మరియు గురువైన విశ్వనార్ వద్దనే నేర్చుకున్నాడు.


🌸ఒకరోజు నారద మహర్షుల వారు విశ్వనార్ ఇంటికి వెళ్లి, వారి ఆథిత్యాన్ని స్వీకరించి, వారు అందించిన ఆథిత్యానికి ఉప్పొంగి, నారద మహర్షి గ్రహపతిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అతడిని నిశితంగా పరిశీలించి,

గ్రహపతి తల్లిదండ్రులతో ఇలా చెప్పాడు., ఇతడి అన్నీ శరీర అవయవాలు, నడవడిక రాజ యోగాన్ని సూచిస్తున్నాయి, కాన్యూ ఇతడి పన్నెండేళ్ల వయసులో, భీతిగొలిపే ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది, ఓ పిడుగుపాటు (అగ్ని) కారణంగా ప్రాణాపాయం ఉందని హెచ్చరించాడు. ఇలా చెప్పి నారదుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు.


🌸ఇది విన్న వారివురు తల్లిదండ్రులూ భయకంపితులు అయి, విశ్వనార్ స్పృహతప్పి పడిపోగా, అతని భార్య భోరున విలపించడం జరిగింది. అంతటితో గ్రహపతి అతని తల్లిదండ్రుల కష్టాలను చూసి, తాను కాశీకి వెళ్లి మృత్యుంజయ రూపంలో ఉన్న శివుడిని పూజించడం ప్రారంభిస్తానని చెప్పాడు.

కాశీకి వచ్చి మణికర్ణికా తీర్థంలో స్నానం చేసి విశ్వేశ్వరుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు.,


🌸గ్రహపతి అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్టించి, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు.

ఈ లింగంపై రోజూ 108 కుండల గంగాజలంతో అభిషేకం చేస్తూ పూలు, ఇతర పదార్థాలతో వివిధ పూజలు, అర్చనలు చేశారు. ఇలా తీవ్ర తప్పస్సు చేస్తూ, నెలల కొద్దీ ఉపవాసం వుంటూ., దాదాపు రెండు సంవత్సరాలు గడిపాడు.


🌸అప్పటికే అతనికి పన్నేడేండ్లు వచ్చాయి. అతనికి నారదుడు చెప్పిన ఆ ప్రమాద ఘడియాలు సమీపించాయి. దేవతల రాజు, ఇంద్రుడు గ్రహపతి ముందు ప్రత్యక్షమై అతనికి దివ్యమైన వరాన్ని అందిస్తూ.. ఏమి కావాలో కోరుకోమన్నాడు.

గ్రహపతి గౌరవపూర్వకంగా తాను శివుడిని ఆరాధిస్తున్నానని కాబట్టి ఆయనే ఆశీర్వచనలానైనా, వరాలైనా ఇవ్వగలడని మరెవ్వరూ తనకు ఇవ్వలేరని అంటాడు.


🌸అతడిని ఆశీర్వదించే ఏకైక దేవుడు తానేనని ఇంద్రుడు పలికాడు. గ్రహపతి మళ్ళీ ముందు చెప్పిన మాటలనే మర్యాద పూర్వకంగా పునరావృతం చేసాడు. దాంతో ఆగ్రహించిన ఇంద్రుడు, తన వజ్రాయుధంతో (పిడుగు) తో గ్రహపతి దాడి చేసి గాయపరిచాడు.

ఆ ధాటికి తాలలేని గ్రహపతి, సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు మహాశివుడు అతని ముందు ప్రత్యక్షమై అతన్ని స్పృహలోకి తెచ్చాడు. గ్రహపతి గాఢనిద్ర నుండి మెలకువ వచ్చినట్లు లేచి తన ముందు ప్రత్యక్షంగా నిలబడి ఉన్న పరమశివుడిని దర్శించి ధన్యుడయ్యాడు.


🌸పరమశివుడు గ్రహపతిని పరీక్షించదలచానని, పరమేశ్వరుని రక్షణలో ఉన్న ఏ భక్తులు ఎవ్వరూ, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సెలవిచ్చాడు. పరమేశ్వరుడు అతనికి దైవత్వాన్ని కల్పిస్తూ వరమిచ్చాడు.

గ్రహపతి ప్రతిష్టించిన లింగం ఇక నుండి అగ్నేశ్వర లింగం అని పిలువబడుతుందని, అగ్నేశ్వర లింగాన్ని పూజించే భక్తులకు పిడుగులు లేదా అగ్ని నుంచి భయం ఉండదనీ..


🌸ఈ అగ్నేశ్వర్ లింగాన్ని పూజించే భక్తులకు అకాల మృత్యువును (అకాల మరణం) సమీపించదని, కాశీలో అగ్నీశ్వరుని పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి, ఎక్కడ మరణించినా అగ్ని లోకానికి చేరుకుంటారని మహాశివుడు చెప్పాడు. ఇలా చెప్పి ఆ మహాశివుడు గ్రహపతి ప్రతిష్టించిన ఆ అగ్నేశ్వర్ లింగంలోకి అదృశ్యమయ్యాడు.


🌹 దేవాలయం యొక్క స్థానం 🌹


🪷ఈ ఆలయం హౌస్ నెం. Ck.2/1, పటాని తోలా, భోసాలా ఘాట్, వారణాసి వద్ద ఉంది. సైకిల్ రిక్షా ద్వారా చౌక్ వరకు ప్రయాణించి, సంకట దేవి ఆలయం (ప్రసిద్ధ మైలురాయి) గుండా ఈ ప్రదేశానికి నడవవచ్చు.


🌸ప్రత్యామ్నాయంగా, భక్తులు మెహతా హాస్పిటల్ సమీపంలోని భోసలే ఘాట్/గణేష్ ఘాట్ వరకు పడవ ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు మరియు మెట్లు ఎక్కవచ్చు.


🌹 పూజల రకాలు 🌹


🪷ఆలయం ఉదయం 07.00 నుండి 9.00 గంటల వరకు తెరిచి ఉంటుంది మరియు సాయంత్రం 06.00 నుండి 10 గంటల వరకు శివరాత్రి మరియు కొన్ని ఏకాదశి రోజుల వంటి ముఖ్యమైన రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


🌸భక్తులు తమ సౌకర్యాన్ని బట్టి పూజలు చేసుకోవచ్చు.

బీ ఎలర్ట్

 *బీ ఎలర్ట్.......* 👇


*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ సంస్థ హెచ్చరిక..*

                       

రాష్ట్రంలో రాబోవు మూడు రోజులపాటు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..


రేపు 136 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం..


ఎల్లుండి 153 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 132 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం..


ఇప్పటికే ఎండ తీవ్రత నేపధ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, మండల అధికారులకు సూచనలు..


క్షేత్రస్థాయిలో  ప్రజలకు  విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు..


ఇతర సమాచారం కోసం విపత్తుల సంస్థలో టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101


ఎండ తీవ్రత దృష్ట్యా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..


*ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..*


డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తాగాలి..


-డా.బి.ఆర్ అంబేద్కర్ , ఎండీ , ఏపీ విపత్తుల సంస్థ.


రాబోవు మూడు రోజులు కింద విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే  అవకాశం 


   *మే 14 ఆదివారం*


☀ విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం


ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో  45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం 


☀ శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం 


  *మే 15 సోమవారం*


☀ విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం 


ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం


☀ కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం


 *మే 16 మంగళవారం*


☀ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 48°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం


ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 48°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం


☀ విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య , చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం


-డా.బి.ఆర్ అంబేద్కర్ , డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

ఆంజనేయం

 శ్లోకం:☝️

*ఆంజనేయం మహావీరం*

 *బ్రహ్మవిష్ణు శివాత్మకం l*

*తరుణార్కప్రభం శాంతం*

 *రామదూతం నమామ్యహం ll*


భావం: మహావీరుడు, త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, ఉదయించే సూర్యుని వలే ప్రకాశించువాడు, రామదూత అయిన హనుమంతునికి నమస్కరిస్తున్నాను.🙏

పై ధ్యాన శ్లోకంలో హనుమంతుని శాంతమూర్తిగా వర్ణించారు. ఎప్పుడూ ధ్యానమూర్తి శాంతమూర్తిగానే ఉంటుంది.

జైన మతంలో కూడా హనుమంతుని కొలుస్తారు.

*అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు!*

అదృష్టం

 శ్లోకం:☝️

*తాదృశీ జాయతే బుద్ధిర్-*

 *వ్యవసాయోఽపి తాదృశః ।*

*సహాయాస్తాదృశా ఏవ*

  *యాదృశీ భవితవ్యతా ॥*


భావం: మానవుడు ఏ అదృష్టం (పారబ్ధం) వెంట తీసుకువస్తాడో, అందుకు అనుగుణమైన తెలివితేటలు అబ్బి, దానికి తగ్గ కృషి - ఇతరుల సహాయం మరియు ఫలితం పొందుతాడు.🙏