12, అక్టోబర్ 2024, శనివారం

Panchaang


 

జగదంబను రుక్మిణి వేడుట!

 శు భో ద యం 🙏

జగదంబను రుక్మిణి వేడుట! 


            ఉ:  నమ్మితి  నామనంబున  సనాతనులైన  యుమామహేశులన్  


                 మిమ్ము , పురాణ దంపతుల  మేలుభజింతు గదమ్మ ! మేటి   పె


                ద్దమ్మ !  దయాంబురాసివి గదమ్మ!  హరిం బతిసేయుమమ్మ!  నిన్


                నమ్మిన  వారి  కెన్నటికి  నాశము  లేదు గదమ్మ!    యీశ్వరీ !


                    శ్రీ భాగవతము- దశమస్కంధము- 1741 పద్యం:  బమ్మెఱపోతన;


                               తెలుగు వారి  పుణ్యాల పేటి  శ్రీ మహాభాగవత గ్రంధము. ఇది 18 పురాణములకు  మించిన నహాపురాణముగా

ప్రసిధ్ధి గాంచినది. శ్రీకృష్ణ పరమాత్ముడే నాయకుడుగా వెలసిన యీగ్రంధమున  నతని లీలా వినోదములే యనేక రసవద్ఘట్టములుగా , తీరిచి దిద్ద బడినవి. రక్తికి , భక్తికి , ముక్తికి ,యీగ్రంధము మూలమై యాంధ్ర సాహిత్యమున కొక వెలలేని యలంకారమై భాసించు చున్నది. భాగవతమునందలి  రసవద్ఘట్టములలో  రుక్మణీకళ్యాణము  ప్రముఖమైనది. 


                                 పెండ్లి కుమార్తెయగు  రుక్మణి  శిశుపాలుని  వరింప నిష్టపడక  తాను మనసిచ్చిన కృష్ణ పరమాత్మకు తనహృదయమును నివేదించి  యతనిని దోడ్కొని వచ్చుటకు అగ్నిద్సోతనుడను బ్రహ్మణ వర్యుని  ద్వారకకు పంపినది.తడవైనది యతడురాడాయెను.ముహూర్తము దరియు చున్నది.  గౌరీ పూజయు ,ప్రారంభమైనది. డోలాయమాన చిత్తయగు రుక్మిణి  సర్వమునకు  ఆపరమేశ్వరిపైననే భారముంచి  ఆజగ దంబ  నిట్లని ప్రస్తుతింప సాగినది. 


                   పోతన కవి చాతుర్యమంతము  పద్యము యెత్తుగడలోనే ప్రదర్శించినాడు."  నమ్మితి నామనంబున  సనాతనులైన  యుమామహేశులన్ మిమ్ము"- అమ్మా!  నేను  మిమ్మల్నే నమ్ము కొన్నాను. మీరు సనాతన దంపతులు. మీకన్న నాకు దిక్కెవ్వరు?అనుచున్నది. ఆమాటతో భారమంతయు పార్వతీ పరమేశ్వరులపై నుంచినట్లయినది.


                      పార్వతీ పరమేశ్వరులనే  గోరనేల? వారును ప్రేమ జంటలే !వారినిగూడ పెద్దలు వారించినారు. అయినను వారిరువురు సతీపతులైనారు. ఎన్ని యుగములైనదో వారిదాంపత్య మారంభమై,కావున వారు పురాణదంపతులు. అట్టి దంపతులదీవెనలే పెండ్లికుమార్తెకు కావలసినది. నచ్చినవరుతో కళ్యాణము ఆడుదానికి ఒక అమూల్యమైన వరముగదా! ఆవరము నీయగల

శక్తి శివ పార్వతులకేగలదు. కాబట్టే రుక్మిణి వారినాశ్రయించుట. గౌరీ పూజలోని ఆంతర్యమిదే !


                                     మిమ్ము పురాణదంపతుల  మేలుభజింతు గదమ్మ" ఆది దంపతులగు మిమ్ము  నెల్లవేళల పూజింతునుగదా!

నాచేపూజలందెడు మీరే నాకోర్కెదీర్పవలె. వేరెవ్వరు దీర్పగలరు.? 


                    మేట్టి  పెద్దమ్మ!  అమ్మలకు  అమ్మలున్నారు కాని  మేటియైన పెద్దమ్మల నెక్కడ గాంచగలము. ఆతల్లి పార్వతియే!" ఆకీట,

బ్రహ్మపర్యంతం ,ఆమెయే జనని. జగజ్జనని. కావున నందరకు పెద్దమ్మ ఆమెయే! పెద్దలే పిల్లలకోరికలు దీర్చాలి. లేకున్న వారి పెద్దరికమునకే అవమానము.


                     "దయాంబురాశివి గదమ్మ" ఆమె దయా సముద్ర. సువిశాలమై  అగాధమై  యనంతమైన  సముద్రముతో  నామెదయకు పోలిక. ఆహా! యెంత చక్కని యుపమానము.భక్తులయెడ  తరుగని దయగలది యాతల్లి.కావున ఆమెదయకు నోచుకొన్నవారి కోరికలు దీరక పోవునా?


                 చివరకు చెప్పుచున్నది అసలుమాట."హరింబతిసేయుమమ్మ" శ్రీకృష్ణుని నాకు భర్తగా చేయవమ్మా! యెవరు కాదన్నాసరే,నీవు అవునంటే చాలు మావివాహం జరిగితీరుతుంది. అమ్మా! నేవలచిన కృష్ణుని  భర్తగా ననుగ్రహించు.


                       నిన్  నమ్మిన వారి కెన్నటికి  నాశము లేదుగదమ్మ  యీశ్వరీ!"- నిను నమ్మిన వారు చెడగా నేనెక్కడా చూడలేదమ్మా!

కాన నాకోరిక ఫలింప జేసి  మానమ్మకము నిలబెట్టు మని రుక్మిణి  గౌరీ ప్రార్ధనము!


                           చక్కని నుడికారముతో  బహు చక్కని భావజాలముతో  రుక్మిణి కోరిక  ఫలించు రీతిగా  గౌరీ ప్రార్ధనా ఘట్టమును

కేవల మొకేయొక్కపద్యమున సయుక్తికముగ, సముచితముగ  రచియించిన పోతన మహాకవికి సాటి యగువారెవ్వరు? 


                                                       స్వస్తి!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

42. " మహాదర్శనము

 42. " మహాదర్శనము "-- నలభై రెండవ భాగము---వారుణీ విద్య


42 . నలభై రెండవ భాగము--  వారుణీ విద్య



          పంచాత్మ సంక్రమణ విద్యను గురించి ఆచార్యులు చెప్పదొడగినారు . " యాజ్ఞవల్క్యా , సావధానముగా ఉన్నావా ? అని అడిగినారు . సావధానముగానే కూర్చున్న కుమారుడు , ’ సిద్ధముగా ఉన్నాను , అనుజ్ఞ ఇవ్వవలెను , తమరు అనుమతి నిచ్చినట్లే , చెప్పువాడు ఆదిత్యుడు అన్న భావనము చేసుకొని మన ఇద్దరికీ రక్షణను ఇవ్వమని వేడితిని . " అన్నాడు . 

       ఆచార్యులు ’ సరే ’ యని ఆరంభించినారు . " మొదటిది అన్నమయ దేహము . దీనిని సాక్షాత్కరించుకో . అప్పుడు ఈ దేహపు ప్రతిబింబము నీ ఎదురుగా కూర్చొనును . ఇదేమిటి , ఒక దేహము రెండయినది అనుకోవద్దు . బయటి ఆకాశములో లయమగుచున్న నీ దృష్టి ఇప్పుడు దేహపు పక్కన ఉన్న ఆకాశములో నీ తపోబలముచేత వెనుతిరిగి నీ దేహమునే చూచును . కాబట్టి నీకు ఈ రెండవ దేహము కనిపించును . అన్నమయ కోశమును దాటుట అనగా అదే . " 


      " ఔను , రెండవ మూర్తి యొకటి కనిపిస్తున్నది . అలాగే అక్కడున్న అంగాంగములన్నీ స్ఫుటముగా కనిపించుచున్నవి . నఖ శిఖ పర్యంతమూ స్పష్టముగా కనబడుచున్నది . " 


" ఆ మూర్తికి పూజ చేసి , ముందుకు దారి ఇవ్వమని ప్రార్థించు " 


      యాజ్ఞవల్క్యుడు ఆ మూర్తికి పూజను సలిపి దారి ఇవ్వమని ప్రార్థించినాడు . అప్పుడు ఆ మూర్తి జ్వాలామయమయినది . ఒక ఘడియ లాగే ఉండి మరలా శ్యామ సుందరమై మూలాధారము నుండీ కంఠము వరకూ ఒకే పంక్తిలో నున్న ఐదు జ్వాలలై దర్శనమిచ్చినది . 


      పక్కనున్న ఆచార్యులు , " అదే , చూడు ప్రాణమయ కోశము . దానికి పూజ చేసి , తన క్రియా కలాపములను చూపించమని వేడుకో . " అన్నారు . యాజ్ఞవల్క్యుడు అలాగే చేసినాడు . 


      జీర్ణమైన రావి ఆకు వలెనున్న ఒక చిత్రము కనిపించినది . దేహపు సీమారేఖల మధ్య పందిరి వలె కన్నులు కన్నులుగా పరచుకున్న నరమండలము . ఆ నరమండలపు మధ్య నీలము , తెలుపు , నలుపు , ఎరుపు , పసుపు రంగుల దీపములు . ఆ దీపముల ప్రభ విశ్వతోముఖముగా పరచుకుంది . ఒక్క క్షణము కూడా విచ్ఛితి లేక , ఆ దీపముల ప్రభ మంద్రముగా నున్ననూ ఖచ్చితముగా వెలుగుతున్నది . 


       " ఇక్కడి వరకూ మానవులకు యాతాయాతములుండును . అక్కడ నీలపు వర్ణముతో వెలుగు చల్లుతూ కూర్చున్నాడే , అతడే వ్యానదేవుడు . అతడే దేహమునందు జరుగు సర్వ కార్యములకూ కర్త. దేహి నిద్రకు వశుడైనపుడు కూడా దేహములో మెలకువగా ఉండి , శ్వాస నిఃశ్వాసలు మొదలు ఆహార పచనాంతము వరకూ అని కర్మలనూ చేయించువాడీతడు . ఇతనిని పట్టుకుంటే ప్రాణ పంచకమూ సునాయాసముగా చేతికి చిక్కును . కాబట్టి అతనికి మొదట పూజ చేసి , ముందుకు పోవుటకు అతని అనుమతిని వేడు." 


       వ్యాన దేవుడు పూజగొని ప్రసన్నుడై తన అనుజులైన ప్రాణ , అపాన , సమాన , ఉదానులను పరిచయము చేసినాడు . " చూడు , ఇతడు ప్రాణ దేవుడు . దేహాద్యంతమూ వేడిమి యుండుటకు కారణమితడు . ఈతడు బయటి నుండీ వచ్చిన సర్వమునూ గ్రహణము చేయును . ఇక, ఇతడు అపాన దేవుడు . దేహమునుండీ బయటికి వెళ్ళు ప్రతియొక్క దానికీ దేహపు గమనమునకూ కారణము . తరువాత ఈతడు సమాన దేవుడు . ఇతడు  , జీర్ణమైన ఆహారమును మూడు భాగములు చేసి స్థూలముగా ఈ దేహమునకు అవసరము లేనిదానిని బయటికి పంపమని అపాన దేవుడి వశము చేయును . ఇంక రెండు భాగములలో ఒకభాగమును దేహమునకు , ఒక భాగమును మనసుకూ ఇచ్చును . ఇక ఈతడు ఉదాన దేవుడు . దేహములో కలుగు శబ్దములకన్నిటికీ కారణమైన ఇతడు సరస్వతీ వ్యూహము ద్వారా పలికిస్తూనే ఉండును . ఈతడు ప్రసన్నుడైతే , నువ్వు ఋషివై వేదమంత్రములను పలికెదవు . ఈతడు పరమాకాశములో నున్న సరస్వతిని పిలుచుకు వచ్చి వర్ణాత్మకురాలుగా చేయగలడు . అందరి పరిచయమునూ చేసినాను . ఇంకేమి కావాలో చెప్పు . " 


" తామందరికీ పూజ చేయు విధానము ఎలాగన్నది చెప్పవలెను . " 


       " ఇప్పుడు నువ్వు ముందుకు బయలు వెడలినావు . దారిలో నిద్రించుట సరికాదు . కాబట్టి మా అందరినీ సమిష్టిగా పూజించి మా అనుమతి పొంది ముందుకు వెళ్ళు . మేము ఇంతవరకూ నీలో ఉండి , నీ అర్చనాదుల వలన తృప్తులమైనాము . " 


       యాజ్ఞవల్క్యుడు సమిష్టిగా ప్రాణదేవులకు పూజ సలిపినాడు . ఐదుగా ఉన్న రత్న దీపములు ఒకటై హృదయములో నిలచి పూజను ఒప్పుకొని ప్రసన్నమై అనుమతినిచ్చినవి . 


       దేహపు రూపు రేఖలు అలాగే ఉన్నవి . దానిలో కనిపించిన రావి ఆకు వంటి జాలము అక్కడే ఉంది . ఆచార్యుడు అన్నాడు , " కుమారా , అన్నమయములో ప్రాణమయము  అంటే ఇంకేమో కాదు , అన్నమయము నంతా నిండిన పురుషుడు అని గుర్తెరిగితివా ? అలాగే , ఈ ప్రాణమయ కోశము నంతా నిండిన మనోమయ కోశమును చూడు . " 


       ప్రాణదేవుడు దారి ఇచ్చినాడు . చంద్ర మండలమువలె శాంతమై తెల్లగా ఉన్న జ్వాల యొకటి హృదయదేశములో కనిపించినది . అది రెండు భాగములైనది . ఒకటి ప్రాణమయ కోశము వైపుకు పోయి , ఇంద్రియ గోళములలో ప్రాణముతో పాటు కూర్చుంది . ఇంకొక భాగము దేహాద్యంతమునూ వ్యాపించినది . పంచ ప్రాణముల నుండీ వస్తున్న వెలుగు వలెనే ఉన్ననూ , ఈ వెలుగు అది కాదనునది తెలుస్తున్నది . అలాగని , ఇదివేరే యని దానిని వేరు పరచుటకూ లేదు . 


ఆచార్యులు అన్నారు , " అదే , మనోమయ కోశము . దానికి పూజాదులు చేసి , పరిచయమును కోరు " 


       మనోమయము కుమారుడిచ్చిన పూజను గ్రహించి ప్రసన్నముగా పలికింది , " చూడు , నాలో రెండు జ్వాలలున్నదానిని , లేదా నేను రెండు భాగములైన దానిని చూచితివి కదా ? మనస్సర్వము  , మనోతీతము యని నాకు రెండు రూపములు . మనస్సర్వము ఇంద్రియాదులను ఆశ్రయించుకొని యున్న బహిర్ముఖము . మనోతీతము ఇంద్రియములకు అతీతమై దేహములో ప్రాణుడితోపాటు వ్యాపారము చేయుచుండును . మనస్సర్వమును కట్టివేస్తే , మనోతీతపు పరిచయమగును . ప్రాణవాహినియై మనోతీతము లోకములన్నిటా సంచరించి రాగలదు . ఈ మనోతీతము యొక్క సన్నిధిని సాధించి యోగులు నానాత్వము యొక్క రహస్యమును ఛేదించి , కాల , దేశ వర్తమానములను గెలిచి , తాము ఎక్కడ కావాలంటే అక్కడ , ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసిన రూపములను తీసుకొని కావలసిన వ్యాపారమును చేయగలరు . అయితే అలాకావలెనన్న , నన్ను అతిక్రమించకుండా సాధ్యము కాదు . "


" దేవా , నువ్వు సర్వ శక్తుడవలె నున్నావు . ఇటువంటి నిన్ను అతిక్రమించి వెళ్ళుట సాధ్యమా ? " 


       " లోకములో అసాధ్యమనునదే లేదు యాజ్ఞవల్క్యా , కాలమూ , కర్మమూ అంతటినీ పాకము చేయుచుండును . సర్వమూ తలకిందులు అగుచుండును . ఇలా ఉన్నపుడు అసాధ్యమెక్కడిది ? రెండు గీతల కథ విన్నావా ? ఒకటి చిన్నది కావలెనంటే ఇంకొకటి పెద్దదయితే చాలు . అలాగే అసాధ్యమును చిన్నది చేయుటకు వీలయితే , అప్పుడది సాధ్యమగును . అలా అగుటకు నీ సంకల్ప పూర్వకమైన ప్రయత్నము సతతముగా జరుగవలెను . దానికి నా అనుగ్రహము కావలెను . అయితే , నాకునేనుగా నీకు ఏమీ ఇవ్వలేను . వెనుకటిది ప్రేరేపించినట్లు ముందుదానిని చేయుటయే నా పని . కాబట్టి నా వెనుక ఉన్నవాడిని చూడు . " 


       యాజ్ఞవల్క్యుడు చూచినాడు . ఆదిత్యుడు ప్రసన్నముగా విరాజమానుడై యున్నాడు . తాను అహర్నిశలూ ఉపాసన చేయుచున్న ఆదిత్యుడు, మనఃప్రేరకుడు , వెనుక తాను చూచినది జ్ఞాపకము వచ్చెను . ఆదిత్యుడు , " ఔనౌను . మనసును ప్రేరేపించువాడిని నేను . ఈ మనోదేవుడే అవస్థా త్రయమునకు కారణుడు . నీ ప్రయత్నము ఎక్కువయితే , ప్రాణమయ , అన్నమయములు రెండూ ఆ ప్రయత్న రాశిని వహించలేనంతగా అది పెద్దదయితే అప్పుడు మనోమయమును ప్రార్థించెదవు . మనోమయుడు వెనుకకు తిరుగును . అంటే , దాని అర్థము , నా కిరణములలో మునుగును . అప్పుడు సుషుప్తి యగును . అక్కడ జీవుడు ఏమీ చేయుటకు లేదు , కాబట్టి యాజ్ఞవల్క్యా , నీవు ఇతడిని బాగుగా ఆరాధించు . ఈతని ప్రసాదమును పొందు . అప్పుడు ఇతడు నిన్ను ముందుకు వదలును . " 


       ఆదిత్యుడు అంతర్థానమగుతుండగనే ప్రసన్నమైన , మందహాసపు మృదువైన గలగలారావము విని కుమారుడు అటు తిరిగినాడు . మనోదేవుడు ఇప్పుడు మూర్తియైనాడు . సింహాసనము పైన కూర్చున్న మకుట ధారి యైనాడు . మొదటి చాంచల్య భావము లేదు . ఒక్కచోట నిలవకుండా అలలవుతున్న వెలుగు ఇప్పుడు మూర్తియై కూర్చున్నది . యాజ్ఞవల్క్యుడు మరలా పూజను సమర్పించి , " దేవుడు ప్రసన్నుడు కావలెను . ముందరి ప్రయాణము అనుకూలము కావలెను " అని ప్రార్థించినాడు . 


       మనోదేవుడు అన్నాడు , " నీకు ముందరి ప్రయాణమునకు అనుకూలము కావలెననియే దేవతలు నిన్ను సర్వజ్ఞులైన ఉద్ధాలకుల వద్దకు పిలుచుకు వచ్చినది . చూడు యాజ్ఞవల్క్యా , అతడక్కడ సంకల్పిస్తున్నాడు , ఇక్కడ క్రియ నడచుచున్నది . నేను శుద్ధ చంచలుడను . నీటికన్నా , గాలికి చిక్కిన లేత చిగురు కన్నా చపలుడను నేను . నా చాపల్యమును పోగొట్టు ఉపాయమేదో తెలుసునా ? ఆదిత్య దర్శనము చేయుట . నువ్వింతవరకూ ఆదిత్యుడి దర్శనము చేసి అతడిలో ఉన్న సావిత్ర కిరణమును హృదయములో నింపుకొనుచుంటివి కదా ! దానివలన నేను ఇప్పుడు అచలుడనై దర్శనము ఇచ్చినాను . ఇదిగో , నువ్విక ముందుకు పోవచ్చు . ఇదివరకూ దేహములో ప్రాణమయ కోశమును చూచినావు . అన్నమయ , ప్రాణమయములలో నిండిన నన్ను కూడా చూచినావు . ఇక , నావలెనే అన్నమయ , ప్రాణమయములలో నిండిన బుద్ధి దేవుని చూడు . " 


       మనో దేవుడు తన సింహాసనముతో పాటూ అంతర్థానమయినాడు . అతని స్థానములో ఇంకొక సింహాసనములో ఒకతడు కూర్చున్నాడు . అతనికి శరీరము సగము తెలుపు , సగము నలుపు . యాజ్ఞవల్క్యుడు అతడికి పూజను సలిపినాడు . ఆతడు పూజను ఒప్పుకొని , " నేను కూడా నీ దేహములో ఉండవేవాడినే . అయితే నువ్వు నన్ను చూచి ఉండలేదు . నేనే నీ బుద్ధిని . మనోవ్యాపారములు ఒక్కొక్కదానిలోనూ నా పనితనము ఉంటుంది .  మనసు వెనుక వెనుకే ఉన్న నన్ను బహు కష్టపడి అర్ధార్ధముగా చూచినవారు లేకపోలేదు . అయితే , నీవలె నన్ను ప్రత్యేకించి చూచువారు బహుకొద్ది మందే . నువ్వు యోగ్యుడవని , నీకు లభించిన జ్ఞానమును దురుపయోగ పరచేవాడివి కావని , నీకు ఒక రహస్యమును చెపుతాను విను . ఈ నా ధవళ కృష్ణ రూపమును చూచుచున్నావు కదా , ఇది శుద్ధ శ్వేత వర్ణమయినపుడు నా అనుగ్రహమయినది అని తెలుసుకో . ఇదిగో చూడు  . ఈ కృష్ణ రూపములో ఉండి ఈ భాగము కృష్ణమగుటకు కారణమైన వాడు అహంకారుడు . ఆ అహంకారుడు శుద్ధుడైనపుడు ఈ భాగము కూడా తెలుపగును . ఈ అహంకారము అభివృద్ధి కాకుండా చూచుకొనేదే వైరాగ్యము . మానవుడు తాను చేయు ప్రతియొక్క కార్యము వలనా పెరుగు అహంకారమును పెరగనివ్వకుడా ఉండునదే వైరాగ్యము . ఇలాగ వైరాగ్య సంపన్నుడైన వాడే నన్ను దాటుటకు సమర్థుడు . నువ్వు నన్ను అడగనవసరము లేదు . నేనే దారి ఇస్తాను , ముందుకు వెళ్ళు . "  


       ఆచార్యులు ధ్యాన మగ్నులైయున్నారు . వారి నోటి నుండీ ఏమాటా రావడము లేదు . అయినా ఊపిన ఉయ్యాల ఎవరు ఊగకున్ననూ తానుగా ఊగుతున్నట్టే అయినది . యాజ్ఞవల్క్యుడు ముందుకు సాగాడు . దేహములో కనబడుతున్న రూపు రేఖలన్నియూ మసిబారినాయి . విశాలమైన బయలు ప్రదేశమొకటి . అక్కడ ఏమీ లేదు . ఒక ఓంకారపు ధ్వని మాత్రము వినిపిస్తున్నది . దాని మూలమెక్కడుందో అది మాత్రము తెలియుట లేదు . ఏదో విచిత్రము . అక్కడ అంతా విచిత్రమే అనిపిస్తున్నది . తనను పట్టిఉండిన నామరూపములు కరిగి సూక్ష్మాత్ సూక్ష్మమైనవి . అక్కడ ఏ దృష్టి ప్రసరిస్తున్నదో చెప్పుటకు అగుట లేదు . ఏ చెవులు వింటున్నవో అదికూడా తెలియుటకు లేదు . ఎలా తెలియునో అది కూడా తెలియదు . అక్కడ కుమారునికి అర్చనాదులు పొందినట్లయింది.. అంతే కాదు తాను ప్రత్యేకముగా ఒకడినున్నాను అన్న భావనయే కరగి పోతున్నది . అక్కడ చెవులు లేకున్నా వినిపిస్తుంది , కన్నులు లేకున్నా కనిపిస్తుంది .మనసు లేకున్నా తెలుస్తుంది . ఎక్కడ ఎవరో అంటున్నట్లుంది , :


      " జగమునకు కారణుడను నేను . చూడు , ఇక్కడికి వచ్చినవాడు ఉదయించిన సూర్యుని వలె పైకి వచ్చినవాడు. ఇంక పతితుడు కాకుండా చూచుకో . మనోబుద్ధుల వ్యాపారము నిలచినపుడు నేను ప్రకటమగుదును . నన్ను ఆశ్రయించియే సర్వమూ బ్రతికియున్నది . ఈపూటకు ఇంత చాలు " 


       యాజ్ఞవల్క్యుడు తన ప్రయత్నము లేకనే వెనుతిరిగి వచ్చినాడు . అతడు కళ్ళు తెరచు వేళకు ఆచార్యులు కూడా గురు దేవా అంటూ చేతులు జోడిస్తూ కళ్ళు తెరచినారు . ఇద్దరూ ఒకరినొకరు చూచుకొని నవ్వినారు . 

Janardhana Sharma

మంచి మాటల ప్రభావమెంతో?

 ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు.


వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి, తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు.


కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు.


చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు.


విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్య ఫలం ఏపాటి సాటి వస్తుందని అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు.


తపోఫలమా? సత్సాంగత్య ఫలమా? ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు. విష్ణువు, దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు. ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చాడు.


ఇద్దరూ కలిసి అక్కడకూ వెళ్లారు. వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటివరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండని సలహా ఇచ్చాడు.


విశ్వామిత్రుడు వెంటనే ‘నా వేయి సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది’ అన్నాడు. అయితే భూమిలో ఏ చలనం లేదు.


అప్పుడు వశిష్ఠుడు అన్నాడు ‘ఒక్క పూట సమయంతో పాటు మేం చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్య ఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.


వశిష్ఠుడు అలా అనగానే, ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని ‘మీ ఇద్దరూ ఇక వెళ్లవచ్చ’ని అంటాడు.


అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్లమంటే ఎలా? అని ఇద్దరూ ఆదిశేషుడిని ప్రశ్నించారు. ‘మీ ఎదురుగానే రుజువైంది కదా! ఏ తపోఫలం గొప్పదో? ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది?’ అని ఆదిశేషుడు అన్నాడు.


వేయి సంవత్సరాల తపశ్శక్తి ధారపోసినా కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్య ఫలాన్ని ధారపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు గ్రహించారు.


చూశారుగా! మంచి మాటల ప్రభావమెంతో?


*ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా అదే పని. ఏ ఇద్దరు కలిసినా అదే తీరు. ‘చరవాణి’ తోనే మాట్లాడుకుంటున్నారు. చరవాణితోనే గడుపుతున్నారు. దానితోనే పుణ్య కాలం కాస్తా గడిచిపోతోంది. ఇక మనం మనసు విప్పి మనతో మనం, ఇతరులతో మనం మంచి మాటలు మాట్లాడేదెప్పుడు?*

మన తెలుగు*

 🔔 *మన తెలుగు* 🔔


తెలుగు_కోతులం -   టెలుగు వినం - కనం - టెలుగూస్ గొప్పవాళ్లని అననే అనం

 

ఋగ్వేదంలో ఆంధ్రులున్నారు. రామాయణంలో సీతకోసం ఆంధ్రదేశంలో వెదకడం ఉంది. పోతన భాగవతం ప్రకారం బలి సంతానంలో ఆఖరివాడు ఆంధ్రుడే. యుధిష్ఠిర చక్రవర్తి పట్టాభిషేకోత్సవానికి హాజరైన రాజులలో ఆంధ్రరాజూ ఒకడు. పురాణమో, పుక్కిటపురాణమో.. ఒక లెక్కప్రకారం ఆంధ్రులంతా విశ్వామిత్ర మహర్షి సంతానమే. విశ్వామిత్రుడు విశిష్టిమైన వ్యక్తి. గురువునుమించి ఎదగాలన్న తపన  ఆయనది. ఎన్నో ఉద్యమాలకు ఆయన  స్ఫూర్తిప్రదాత.  సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపరవిధాత. త్రిశంకుస్వర్గనిర్మాత. గాయత్రీమంత్ర ఆవిష్కర్త. వంకాయ, టెంకాయ, గోంగూరవంటి విడ్డూరాలన్నీ ఆయన ప్రసాదాలే.  తెలుగువాడికి అందుకే అవంటే అంత ప్రీతి. దీక్ష.. కక్ష తెలుగువాళ్లందరికీ విశ్వామిత్ర మహర్షి నుంచే వారసత్వపు లక్షణాలుగా సంక్రమించాయేమోనని అనుమానం.  

రామాయణంలోని కిష్కింధ ఆంధ్రదేశంలోని ఓ అంతర్భాగమేనని  వాదన ఉంది. ఆ లెక్కన మనమందరం కిష్కింధవాసులమే! అన్నదమ్ముల మత్సరం వాలిసుగ్రీవులనుంచి అబ్బిన జబ్బేమో! వాయుపుత్రుడి లక్షణాలూ తెలుగువాడికి ఎక్కువే మరి!


స్వామిభక్తి తెలుగువాడికి మరీ విపరీతం. స్వామికార్యం తరువాతే వాడికి ఏ స్వకార్యమైనా. ఆరంభశూరత్వం, అత్యుత్సాహం ఆంధ్రుల గుత్తసొత్తు. చూసి రమ్మంటే కాల్చి వస్తేనే వాడికి తృప్తి! కొమ్మ తెమ్మంటే కొండను  పెకలించుకొచ్చాడంటే వాడు కచ్చితంగా తెలుగువాడే. ఆ రావడంలో కూడా ఆలస్యమవడం వాడి ప్రత్యేక లక్షణం. కోటిలింగాలు తెమ్మని రాములువారు  ఆజ్ఞాపిస్తే ఆంజనేయులుగారు ఏమి చేసారు? ఒకటి తక్కువగా తెచ్చుకొచ్చారు! ఆర్భాటంగా మొదలుపెట్టి అసంపూర్తిగా చుట్టబెట్టడం తెలుగన్నకు మొదట్నుంచీ అలవాటే!  స్వశక్తియుక్తులు మరొకడు పనిగట్టుకొని పొగిడితేగాని గుర్తెరగలేని బోళాతనం తెలుగువాడిది. సముద్రాలు లంఘించే శక్తిగలిగి వుండీ ఏ స్వామివారి పాదాల చెంతో విశ్రాంతి కోరుకోవడం తెలుగువాడికి అనాదిగా వస్తున్న బలహీనత.


'తెలుగువాడివి అన్నీ అవలక్షణాలేనా?' అని ఉసూరుమనుకోవాల్సిన అవసరం లేదు.  వనవాసంలో రామసోదరులను ఆదరించిన శబరితల్లి తెలుగుతల్లే! చేసిన ఘనకార్యం  చెప్పుకొనే  సంప్రదాయం అప్పట్లో లేదు. ఇంకెంతమంది కడుపునింపిందో  ఆ అన్నపూర్ణమ్మ తల్లి అందుకే మనకి తెలీదు. తెలుగుమహిళకు భోజనం వడ్డించడమంటే మహాసరదా కదా! పేరుకే అన్నపూర్ణమ్మ  కాశీ నివాసి. అసలు మసలేదంతా మన తెలుగునేల నలుచెరగులే కదా! డొక్కా సీతమ్మలు, మంగళగిరి బాలాంబలు అడుగడుక్కీ తారసిల్లే పూర్ణగర్భలండీ తెలుగురాష్ట్రాలు రెండూ!


ఉద్యమమైనా సరే.. ఉప్పు సత్యాగ్రహమైనా సరే సొంతముద్రంటూ లేకుండా తెలుగువాడు ఒక్కడుగు ముందుకు కదలడు. బౌద్ధాన్ని సంస్కరించి మరీ ప్రచారం చేసిన నాగార్జునుడు మన  తెలుగువాడే! తెలుగువాడికి కొత్తొక వింత. పాతొక రోత. అందాకా నెత్తికెత్తుకొన్న జైనం శైవం రాకతో హీనం అయిపోయింది! ఆనక వాడు వైదికం మోజులో పడ్డాక శైవం రాష్ట్రాల  శీవార్లలోకి పాతిపోయింది!


అటు ఆర్యులు.. ఇటు ద్రవిడులు! ఇద్దరూ ముద్దే మనకు! రెండు సంస్కృతుల పండుగలు  మనం సంబరంగా చేసుకొంటాం! పోతరాజు కృష్ణుణ్ణి తెలుగుదేవుడు చేసేసాడు. రామదాసు ఇక్ష్వాకులవాసిని సతీసోదరసమేతంగా భద్రగిరికి కట్టేసాడు.  కృష్ణరాయలు పాండిత్యప్రకర్షతో రంగధాముణ్ణి తెలుగుపెళ్ళికొడుకుగా తయారుచేసాడు. పాపయ్యశాస్త్రి భక్తిప్రవత్తులకు బద్ధుడైనట్లు బుద్ధభగవానుడు తెలుగు చిరునామా స్వీకరించాడు. అందరూ కావాలనుకొనే తత్వం తెలుగువాడిది. అయినా అతగాడే ఎవరికీ అక్కర్లేదు! భారతంలో తెలుగువాడి ఊసు ఆట్టే లేకపోయినా 'వింటే భారతమే వినాలి' అంటూ టాంటాం కొట్టుకొనే రకం తెలుగువాడు!


సాహసంలో మాత్రం? మనం వెనుకంజా? తైలంగ సామ్రాజ్యాన్ని స్థాపించాం. సుమిత్రా, జావా ద్వీపాల్లో వలస రాజ్యదీపాలను వెలిగించాం. సయాడోనిసిచయాల్లాంటి సుదూర ప్రాంతాల్లో నిబద్ధతతో బౌద్ధధర్మాన్ని ప్రచారం చేసి వచ్చాం. ఈజిప్టురాణికి చీనాంబరాలు కట్టబెట్టిన ఘనత మన  తెలుగువాడిదే! అజంతా, అమరావతి, సాంచి క్షేత్రాలలో అసమాన శిల్పకళావైభవాన్ని సృజించిన కళాతపస్వి మన తెలుగుయశస్వి. ధాన్యకటక విశ్వవిద్యాలయం స్థాపించి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన గురువులు మన తెలుగువారు. మానవ నాగరికత మణికిరీటంలో నిరంతరం వెలుగులు చిమ్మే కోహినూరు వజ్రాలు కదుటండీ మన తెలుగువారు!


మేధస్సులో మాత్రం మనమేమన్నా అధమస్థులమా?హైందవం క్షీణదశలో దక్షిణాది గోదావరీతటం నుంచే మహాతత్త్వవేత్త శంకరాచార్యులు ప్రభవించించింది. స్వధర్మ పునరుత్థనార్థం జన్మించిన పుణ్యమూర్తి విద్యారణ్యుడూ తెలుగు పురుషుడే! ఆయన తోడాబుట్టిన సాయనుడు వేదాలకు  భాష్యం చెప్పిన ఉద్దండుడు.  ఉత్తరాది కావ్యాలకు  వ్యాఖ్యానాలు చేసిన మల్లినాథుడుది తెలుగునాడు. జగన్నాథ పండితరాయలు హస్తిన ఎర్రకోట యవనసుందరి అంకపీఠంపైన తెలుగుప్రతిభను సుప్రతిష్ఠంచిన ఘనుడు. దేశదేశాల తాత్వికకేతనం విజయవంతంగా ఎగురువేసిన తెలుగు జ్ఞాననికేతనం రాధాకృష్ణ పండితుడు.


– కర్లపాలెం హనుమంతరావు గారి సరదా వ్యాసం


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

అర్బన్ నక్సల్స్...విజయదశమి!

 అర్బన్ నక్సల్స్...విజయదశమి!


ఈ అర్బన్ నక్సల్స్ ...పంట ఏపుగా పెరిగి కోత కొచ్చే టైముకి వచ్చే తెల్ల దోమ తెగులు లాంటి వాళ్ళు...


ఈ తెల్ల దోమలు కణజాలాన్ని తినేసి...ఆకుల మీద విసర్జించి వాటిని ముడుచుకుపొయ్యేట్టు చేసి...పంట మొత్తం నాశనం చేసేస్తాయి...


ఈ అర్బన్ నక్సల్స్ కి ఎప్పుడో ప్రపంచం వదిలేసిన చరిత్ర...గోడౌన్లలో కప్పెట్టిన విజ్ఞానం ఆవహించి ఉంటుంది...


వీళ్ళు రెండు రకాలు...


గతంలో నక్సల్స్ గా పనిచేసి...లొంగి పోయి...ఇప్పటి ఆధునిక ప్రపంచంలో ఇమడలేక...తిరిగి వెళ్ళలేక...వెనుకటి అలవాట్లు మానుకోలేక తిరుగుతున్న వాళ్ళూ...


మొదటినుంచీ...అడవుల్లోకి గట్రా పోకుండా ఎక్కువ త్యాగాలు లేకుండా....కాస్తో కూస్తో నాలుగు పుస్తకాలు తిరగేసి...ఆ ఎమోషనూ...విప్లవం వాడేసుకుని...డబ్బు కూడబెట్టుకుని విలాసంగా గడిపే బాపతు...


ఈ ఇద్దరూ ఇప్పుడు...పట్టణాల్లో..సిటీల్లో నాలుగు దశాబ్దాలుగా పాగా వేశారు...


వీళ్ళు చేసుకున్న డాక్యుమెంట్ ద్వారానే పౌర హక్కుల పేరుతోనూ..ప్రజాసంఘాల పేరుతోనూ అర్బన్ లో పనిచేసే నక్సల్స్ గురించి క్లారిటీ వచ్చింది...


అంతకు ముందు ప్రభుత్వాలకూ..జాతీయవాదులకి తెలిసినా...ముసుగులు తొలగిపోలేదు...సామాన్య ప్రజలకు అర్థం కాలేదు...


అయితే కాంగ్రెస్ మావోయిస్టులు "వ్యతిరేక సహకార" శక్తులు...


బయటకి విరుద్ధ శక్తులుగా కనిపిస్తూ...లోపల సహకరించుకుంటూ ఎదిగే వాళ్ళు...

ఇద్దరూ ఒకరిని ఒకరు చూపించి భయపెట్టి...ప్రజలను దోచుకునే వాళ్ళు...


మధ్యలో అమాయక యువతీ యువకులను...పోలీసులను వాడుకుని రెండు వర్గాలూ సంపద పోగేసుకునేవి...


పంపకాల్లో తేడా వచ్చినప్పుడు ఎన్కౌంటర్లు...నాయకుల కిడ్నాప్ డ్రామాలు.. హత్యలు...


ఇప్పుడు సుదీర్ఘ కాలం ప్రతి పక్ష పాత్రలో ఉండాల్సిన స్థితి వల్ల కాంగ్రెస్ మావోయిస్టుల ముసుగు తొలగిపోయింది...


మావోయిస్టుల అంతర్గత పత్రాల్లో...


హిందూ ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా అన్ని లౌకిక శక్తులు మరియు హింసించబడిన మతపరమైన మైనారిటీల ఐక్య పోరాటాన్ని నిర్మించే దిశగా ఉద్యమం చెయ్యాలని చెప్పుకున్నారు....


గమనించండి...కాంగ్రెస్ దీన్నే అనుసరిస్తోంది...


కమ్యూనిస్టు పార్టీలు సరే సరి...అవి మావోయిస్టుల ప్రజాస్వామ్య వ్యూహాత్మక ముసుగులు...


"శత్రువు" సైనికపరంగా బలహీనంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మొదట స్థావరాలను ఏర్పాటు చేసి, ఆపై నగరాలను, "శత్రువు బలగాల కోటలను" స్వాధీనం చేసుకోవడం వంటి సైనిక వ్యూహాన్ని కూడా వాళ్ల  పత్రం వివరిస్తోంది...


కాబట్టి పత్రికల్లో...మీడియాలో...సినిమాల్లో...సాహిత్య రంగంలో... కుల సంఘాలలో...ఇంకా కార్మిక సంఘాల్లో తిష్ఠ వేసుకుని కూర్చున్న వీళ్ళందరినీ నడిపించేది ఆ పత్రాలే అని అర్థం అవుతోంది...


అయితే అసలు ఆ డాక్యుమెంటుని తయారు చేసింది ఎవరు...చరిత్ర కారులా... శాస్త్రవేత్తలా...సాంకేతిక నిపుణులా...


వాళ్ల అర్హతలు ఏమిటి... ఏ నిర్ధారణ తో హిందూ ఫాసిస్టు అన్న పదాన్ని వాడారు...


దాన్ని వీళ్ళందరూ ఏదో ఒక పేరుతో ఇంతలా ఎందుకు వాడుతున్నారు...హిందువులను హిందుత్వాన్ని ఎందుకు ద్వేషిస్తూ ఉన్నారు...


స్పష్టంగా ఇది విదేశీ శక్తుల సిద్ధాంతాల పనే...


మావో సిద్ధాంతం అక్కడిదే...సూచనలూ అక్కడివే...


అక్కడి ఆదేశాలే వీళ్ళని ఆడిస్తున్నాయి...


ఈ దేశాన్ని అభివృద్ధిని ఆపితే వేరే దేశాలు ఏవో లాభ పడతాయి...


దాని కోసమే ఈ తపన అంతా...


వాళ్ల సిద్ధాంతం ప్రకారమే...హిందూ వ్యతిరేక శక్తులన్నీ అర్బన్ నక్సల్స్ యొక్క ప్రతిబింబాలే...


వీళ్ళు దేశ వ్యతిరేకులే...దేశాన్ని వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధం..బొక్కలో తోస్తారు కాబట్టి... హిందూ వ్యతిరేకతగా చూపిస్తున్నారు...



గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును


దీన్ని అర్థం చేసుకుని...ఆ అర్బన్ నక్సల్స్ ఎవరో గుర్తించడమే సగం విజయం...


మిగతా పనిని...జాతీయ ప్రభుత్వం చేస్తుంది...


అసలైన విజయ దశమి...వీళ్ళ వ్యవహారం అర్థం చేసుకోవడంలోనే ఉంది!


2026  సంపూర్ణ నక్సల్స్ నిర్మూలన అంటే....అడవుల్లో ఉన్న వారిని అనే కాదు కదా!!!


అందరికీ విజయదశమి శుభాకాంక్షలు!!!

🙏🙏🙏🙏

విజయదశమి

 *విజయదశమి*


నవరాత్రి కాంతి సనాతనముగఁదీరు

వేపూల వెల్గుల విజయదశమి

అవనిలో యసుర సంహారమొందించిన

వీరమాతకు రూపు విజయదశమి

హవనాత్మ సత్య యుగారణియైనట్టి

విస్ఫులింగిత గర్భ విజయదశమి

స్తవనీయ రామగాథా కీర్తికాంతి ది

వ్వెలనిలనందింౘు విజయదశమి

ౘవిగొని పాండవాజ్ఞాత కాలమునందు

విరళాభయప్రద విజయదశమి

నవకాలమునను మానవ జీవితమ్ము వి

వేకవంతముఁజేయు విజయదశమి


క్రొత్తధాన్యాలతోనింట కూర్మినొసగు

నూత్న వాహన గృహపు వినోదమొసగు

పాలపిట్టనుఁ దర్శింప పసిడినొసగు

విశ్వసంక్షేమకారిణి విజయదశమి

~~~~~~~~~~~~~~

జమ్మిచెట్టును పూజింపఁ జయమునొసగు

పాలపిట్టనుఁ దర్శింప భయము తొలగు

మిమ్ములందరి కలిసిన మేలు కలుగు

దసర సరదాల వరదలవసరమునగు

*శ్రీ కాళహస్తీశ్వర శతకము*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*శృతులభ్యాసము శాస్త్రగరిమ ల్శోధించి తత్త్వంబులన్*

*మతినూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబుఁ గాం*

*చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనేకాని ని*

*ర్జితచి త్తస్థిరసౌఖ్యముల్ దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 58*


*తాత్పర్యము:* ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! వేదాలు చదివితిమని, శాస్త్రములు శోధించితిమని, భగవత్తత్వము తేలియునని, శరీరము అశాశ్వతమని, *బ్రహ్మమే సత్యమనీ వృధామాటలు చెప్పుదురే కానీ వాటిని పరిత్యజించిన వారు మాత్రము లేరు కదా*....


✍️🌷🌺🌹🙏

*శ్రీ మధురాంతేశ్వర సిద్ధి వినాయక ఆలయం*

 🕉 *మన గుడి : నెం 467*






⚜ *కేరళ  : మధూరు,  కాసర్‌గోడ్*


⚜ *శ్రీ  మధురాంతేశ్వర సిద్ధి వినాయక ఆలయం*



💠 జగన్మాత కుమారుడైన విఘ్నేశ్వరుడి విశిష్ట ఆలయాల్లో కేరళలోని కాసర్‌గోడ్  జిల్లాలోని మధూరు మధురాంతేశ్వర సిద్ది వినాయక ఆలయం ఒకటి.

మధూర్ మదనంతేశ్వర సిద్ధివినాయక దేవాలయం కాసరగోడ్ జిల్లాలోని 4 ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి.  



💠 ఈ ఆలయం శ్రీమఠం అనంతేశ్వర అని పిలువబడే శివునికి అంకితం చేయబడింది మరియు ఆధ్యాత్మిక శోభను వ్యాప్తి చేసే సిద్ధి వినాయకుడి యొక్క భారీ విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఇది వేలాది మంది ఆధ్యాత్మిక అనుగ్రహాన్ని అనుభవించే ప్రదేశం.  

స్వయంభూ శివలింగం తూర్పు ముఖంగా ఉంది మరియు శ్రీ వినాయక విగ్రహం దక్షిణాభిముఖంగా ఉంది.  


💠 మధుర్ దేవాలయం మొదట్లో మధనేంతేశ్వర దేవాలయం (శివుడు) మరియు "మధుర" అనే "నిమ్న కుల" స్త్రీకి శివలింగం యొక్క "ఉద్భవ మూర్తి" (మానవునిచే తయారు చేయని విగ్రహం) దొరికిందని నమ్ముతారు.


💠 మధురవాహినీ నదీతీరంలో ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన ఆ విఘ్నరాజు దర్శనానికి దేశం నలుమూలల నుంచీ భక్తులు బారులు తీరతారు.


💠 మధూరు ఆలయంలో ప్రధాన దైవం పరమశివుడు. ఇక్కడ కొలువైన వినాయకుడు మధురాంతేశ్వర స్వామిగా పూజలందుకుంటాడు. 

గర్భగుడిలో ఆ గజముఖుడి పక్కనే జగన్మాత పార్వతీదేవి కూడా కొలువై కుమారుడితో సమానంగా నిత్యపూజలూ అభిషేకాలూ అందుకుంటుంది. అలానే ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి, వీరభద్రుడితోపాటు గణపతి సోదరులైన అయ్యప్ప, సుబ్రమణ్య స్వామి కూడా కొలువు దీరి ఉన్నారు


💠 మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా కనిపిస్తుంది. 

ఏనుగు వెనుక భాగంలాగా కనిపించే ఇలాంటి నిర్మాణాలని ‘గజప్రిస్త’ గోపురాలని అంటారు. ఆలయంలోని చెక్క మీద రామాయణ, మహాభారత ఘట్టాలని తలపించే శిల్పాలని చెక్కడం చూడవచ్చు


🔆 స్థల పురాణం 


💠 ఈ ఆలయంలోని శివలింగం "మధుర" అనే "నిమ్న కుల" మహిళ ద్వారా కనుగొనబడిందని చెబుతారు, ఒకానొకప్పుడు మధురవాహినీ నదీతీరంలో మధూరు అనే మహిళ నీటికోసం వెళ్లినప్పుడు గణపతి ఆమె ఎదుట సాక్షాత్కారించి విగ్రహంగా మారిపోతాడు. 

వెంటనే ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసి వారి సాయంతో ఆ ఉద్భవమూర్తిని నది ఒడ్డునే ఉన్న శివాలయంలోకి చేర్చుతుంది మధూరు. అందుకనే ఆమె పేరు పైనే మధూరు ఆలయంగా ప్రసిద్ది చెందింది.


💠 మధుర్ దేవాలయంలోని గణేశ విగ్రహం గురించి మరొక పురాణం.  

ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు ఆలయ గోడపై చిన్న వినాయకుడి బొమ్మను చెక్కినట్లు చెబుతారు. తర్వాత అది పెరిగి పెద్ద వినాయక విగ్రహంగా మారింది. 

 బాలుడు అతన్ని బొడ్డజ్జ లేదా బొడ్డ గణేశా అని పిలవడం ప్రారంభించాడు. 

 ఆ తర్వాత ఆ విగ్రహానికి మదనంతేశ్వర సిద్ధి వినాయక అని పేరు పెట్టారు.


💠 పురాతన తుళునాడులోని 6 గణపతి దేవాలయాలలో మధుర్ దేవాలయం అత్యంత ప్రసిద్ధ గణపతి దేవాలయాలలో ఒకటి.  

టిప్పు సుల్తాన్ తన దండయాత్ర సమయంలో ఆలయాన్ని కూల్చివేయాలనుకున్నాడు, కానీ ఆలయంలోని బావి నుండి నీరు త్రాగిన తరువాత, అతను ఆలయంపై దాడి చేసి కూల్చివేయడానికి తన మనసు మార్చుకున్నాడు.  

తన సైనికులను మరియు ఇస్లామిక్ పండితులను సంతృప్తి పరచడానికి అతను దాడికి ప్రతీకగా తన కత్తితో కోత పెట్టాడు.  ఆలయ బావి చుట్టూ నిర్మించిన భవనంపై ఇప్పటికీ ఆ గుర్తు కనిపిస్తుంది.

 

💠 బ్రహ్మాండపురాణంలో సాక్షాత్తూ భార్గవ రాముడే ఈ గుడిని నిర్మించి వినాయకుడికి పూజలు జరిపించినట్టుగా ఉంది. 


💠 ఈ ఆలయంలోని నమస్కార మండపం చెక్కతో చేసిన పౌరాణిక నాయకుల మనోహరమైన చిత్రాలతో అలంకరించబడి ఉంది.  

చెక్క శిల్పాలను మరింత లోతుగా పరిశీలిస్తే స్వయంవరంతో మొదలై రామాయణంలోని వివిధ ఘట్టాలు వెల్లడి అవుతాయి.  

ఈ ఆలయ నిర్మాణం లోపలి భాగంలో మంటపం మరియు ఈ ప్రధాన భవనం యొక్క 2 , 3 అంతస్థుల వెలుపలి ముఖభాగం కూడా చక్కగా కనిపించే మరియు అద్భుతమైన చెక్క చెక్కడం ద్వారా పుష్కలంగా ఉన్నాయి.


 💠 కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్నే ఇక్కడ మహాగణపతికి నైవేద్యంగా పెడతారు. అదే భక్తులకు ప్రసాదంగానూ ఇస్తారు. 


💠 ప్రతిరోజూ ఉదయాస్తమాన సేవలను ఘనంగా నిర్వహిస్తారు.

 సహస్ర అప్ప పూజలో భాగంగా వెయ్యి అప్పాలతో ప్రతిరోజూ పూజలు జరిపించడం విశేషం. 


💠 మూడ అప్పం పేరుతో మరో పూజా కార్యక్రమం కూడా జరుపుతారు. 

మూడప్ప సేవ అనేది ఇక్కడ నిర్వహించబడే ఒక ప్రత్యేక పూజ మరియు గణపతి యొక్క పెద్ద విగ్రహాన్ని అప్పం (బియ్యం మరియు నెయ్యి మిశ్రమంతో చేసిన నైవేద్యం)తో కప్పి ఉంచే ఆచారం. ఈ ఆచార పండుగ అప్పుడప్పుడు మాత్రమే నిర్వహిస్తారు. చివరిగా 1992లో జరిగింది

అందులో భాగంగా స్వామి వారికి ఏ అలంకారం లేకుండా విగ్రహాన్ని అప్పాలతో కప్పేసి పూజాదికాలు నిర్వహిస్తారు. 

ఆ దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది. 


💠 గణేష్ చతుర్థి అనేది ప్రత్యేకమైన హిందూ పండుగలలో ఒకటి, అయితే ఇది చాలా చోట్ల మతాలకు అతీతంగా కలిసి జరుపుకుంటారు



💠 కాసర్‌గోడ్ పట్టణానికి ఈశాన్య దిశలో 8 కి.మీ దూరంలో ఉంది.

బొమ్మల కొలువు*

 *బొమ్మల కొలువు*



దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులలో బొమ్మల కొలువులను నిర్వహించే ఆచారం ఉంది. బొమ్మలను కొలువు తీర్చడానికి తొమ్మిది మెట్లున్న వేదికను ఏర్పాటు చేస్తారు.


ఎప్పుడు రాక్షసుల వలన లోకాలకు బాధ కలుగుతుందో అప్పుడు ఆ పాపాలను తొలగించి, రాక్షసులను అంతమొందించేందుకు నేను అవతరిస్తాను అని ఆదిపరాశక్తి పలికినట్లుగా మార్కండేయ పురాణంలో చెప్పబడింది.


లోక రక్షణ కోసం ఆ జగన్మాత పలు రూపాలలో పలు నామాలతో అవతరించి అనేకమంది రాక్షసులను సంహరించింది. శుంభ, నిశుంభ, చండ, ముండ, రక్తబీజ, దుర్గమ, అరుణాసుర, మహిషాసుర వంటి రాక్షసులను సంహరించి సకలలోకాలను ఆ జగన్మాత రక్షించింది. అట్టి జగన్మాతను ఆరాధిస్తూ జరుపుకునే నవరాత్రులే దేవీ నవరాత్రులు.


ఆశ్వీయుజ మాసం శుక్ల పక్ష పాడ్యమి మొదలు నవమి వరకు ఉన్న తొమ్మిది రోజు లు దేవీ నవరాత్రులు. దేవీ నవరాత్రులను వాడుకలో దసరా పండుగ అని అంటారు. దేవీ నవరాత్రులతో పాటు దశమి కలిపితే దసరా, దసరా అనే పదం దశహరా నుంచి వచ్చింది. దశహరా అంటే దశవిధ పాపహరణం అని అర్ధం. అంటే పది రకాలైన పాపాలను హరించేది అని అర్ధం.


దేవీ నవరాత్రుల సందర్భంగా జగన్మాతకు వివిధ రూపాల్లో పూజలు చేయడం సంప్రదాయం. అంతేకాకుండా దసరా పండుగలో బొమ్మల కొలువులను నిర్వహించడం కూడా ఆనవాయితీ.


ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులలో బొమ్మల కొలువు లను నిర్వహించే ఆచారం ఉంది. సాధారణంగా బొమ్మల కొలువులను ఆలయాల్లోనూ, గృహాలలో ఏర్పాటుచేస్తారు. ప్రధానంగా మహిళలు, యువతులు బొమ్మల కొలువులను ఏర్పాటుచేసి నిత్యం పూజలు నిర్వహించడంతోపాటు ప్రతి రోజూ సాయంత్రం లలితా సహస్ర నామం వంటి దేవీస్తోత్రాలు చదివి పూజ లు నిర్వహించడంతో పాటు సాయంత్రం ముత్తయిదువులను పిలిచి పేరంటాలు నిర్వహించి, కుంకుమ, చందన తాంబూ లాదులు ఇవ్వడం ఆచారం.


బొమ్మలను కొలువు తీర్చడానికి తొమ్మిది మెట్లున్న వేదికను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా 3,5,7 మెట్లున్న వేదికలను కొందరు ఏర్పాటు చేసుకుంటారు.


అయితే జగన్మాత తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపా లను ధరించి దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేసింది అనేందుకు నిదర్శనంగా తొమ్మిది మెట్లున్న వేదికలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉన్న తర్వాతనే జననం జరిగి మనిషి ఈ భూమి మీదికి రావడం జరుగుతుంది. ఇది సృష్టి రహస్యం.


సృష్టి వెనుక ఉన్న ఈ రహస్యాన్ని వివరించేందుకే తొమ్మిది మెట్లను ఏర్పాటుచేస్తారని పండితులు చెబుతారు. దీనికితోడు తొమ్మిదిమెట్లను ఏర్పాటుచేయడం అనేది నవగ్రహాలకు ప్రతీకగా కూడా కొందరు పేర్కొంటారు.


తొమ్మిది మెట్ల పైన వివిధ దేవతా మూర్తులను కొలువుదీర్చి తొమ్మిది రోజులపాటు పూజలు చేయడంవల్ల నవగ్రహాల బాధలు తొలగి నవగ్రహాల అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రవేత్తలు పేర్కొంటారు.


సాధారణంగా తొమ్మిది మెట్లలో పైభాగంలో ఉన్న మెట్టులో సృష్టి స్థితి లయలను కొనసాగిస్తూ ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతోపాటు జగన్మాతను కొలువు తీరుస్తారు. కృత, త్రేతా, ద్వాపర యుగాలనాటి దేవతామూర్తులను, పురాణ గాథలను తర్వాతి మెట్లలో అమరుస్తారు.


తర్వాత కలియుగంలోని మహర్షులు, పీఠాధిపతులు వంటి వారి బొమ్మలతో పాటు నిత్యజీవితంలోని వివాహం, తులసి పూజ, నాయకులు, ఆలయాలు ఉత్సవాలు, పిల్లలు ఆడుకునే సన్నివేశాలు, రైతులు, వ్యాపారులు, దుకాణాలు, వివిధ ఇంటి సామాగ్రి, పిల్లలు ఆడుకునే వస్తువులు వంటివాటిని ఉంచుతారు.


వీటికి తోడు మరపాచి బొమ్మలకు బొమ్మల కొలువులో ప్రత్యేక స్థానం ఉంది. ప్రధానంగా చెక్కతో చేసిన పెళ్ళి కుమారుడు, పెళ్ళికూతురు బొమ్మలను మరపాచి బొమ్మలు అని పిలుస్తారు.


ఈ విధంగా బొమ్మల కొలువులను నవరాత్రి ముందురోజు అంటే భాద్రపద బహుళ అమావాస్య నాడు ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు నుంచి అంటే ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు ప్రతిరోజూ వివిధ నైవేద్యాలు సమ ర్పించడంతోపాటు దేవీ స్తోత్రాలు, పాటలు గానం చేసి అమ్మ వారిని పూజిస్తారు.


తొమ్మిది రోజుల పూజ అనంతరము విజయదశమి నాడు సాయంత్రం పూజించి చివరగా బొమ్మలను శయనింపచేసి శయనోత్సవాన్నీ నిర్వహిస్తారు.


తర్వాత అంటే ఆశ్వీయుజ శుక్ల ఏకాదశి నాడు బొమ్మల కొలువులను ఉద్యాపన చేసి తీసివేస్తారు.


ఈ విధంగా బొమ్మల కొలువులను నిర్వహించడంవల్ల ఆ యా దేవతామూర్తుల, జగన్మాత కరుణాకటాక్షాలు ప్రసరించిచేపట్టిన పనులు అన్నింటిలో విజయం లభించడం అనే ఆధ్యాత్మిక ప్రయోజనంతో పాటు సామాజిక ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.


బొమ్మలకొలువు సమయంలో సాయంత్రం నిర్వహించే పేరంటాల వల్ల చుట్టుపక్కలవారు ఒకచోట చేరుతారు. ఫలితంగా పరస్పర సహకారం, సామాజిక ఏకత్వం అనే భావన వృద్ధిచెందుతుంది.


దీనికి తోడు పిల్లలు బొమ్మలు చూసేందుకు ఆసక్తిగా హాజరుకావడంవల్ల వారి మధ్య కూడా సహకార భావం ఏర్పడటంతో పాటు మన దేవతలు, ఆచారవ్యవహారాలు, సామాజిక కట్టుబాట్లు వంటివి వారికి తెలిసే అవకాశం బొమ్మలకొలువుల వల్ల కలుగుతుంది.


ఈ విధంగా ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగి ఉండటం వల్లనే బొమ్మల కొలువులు భారతీయతలో భాగమై తరాలు మారినా నిత్యనూతనమై వర్ధిలుతున్నాయి

శుక్రవారం, అక్టోబర్ 11, 2024*

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*శుక్రవారం, అక్టోబర్ 11, 2024*

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*      

     *దక్షిణాయణం -శరదృతువు*

   *ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*   

తిథి : *అష్టమి* ఉ6.45 వరకు

          తదుపరి *నవమి* తె5.37 వరకు

వారం : *శుక్రవారం* (భృగువాసరే)

నక్షత్రం : *ఉత్తరాషాఢ* రా1.25 వరకు

యోగం : *సుకర్మ* రా11.58 వరకు

కరణం : *బవ* ఉ6.45 వరకు

          తదుపరి *బాలువ* రా6.11 వరకు

      ఆ తదుపరి *కౌలువ* తె5.37 వరకు

వర్జ్యం : *ఉ9.35 - 11.10*

            మరల *తె5.18 నుండి*

దుర్ముహూర్తము : *ఉ8.15 - 9.02*

                మరల *మ12.10 - 12.57* 

అమృతకాలం : *రా7.05 - 8.40*  

రాహుకాలం : *ఉ10.30 - 12.00*

యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30*

సూర్యరాశి: *కన్య* || చంద్రరాశి: *మకరం*

సూర్యోదయం: *5.55* || సూర్యాస్తమయం: *5.39* 


         మీకు, మీ కుటుంబ సభ్యులకు

 *దుర్గాష్టమి & మహర్నవమి శుభాకాంక్షలు*


గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

Panchaag