6, మార్చి 2025, గురువారం

విరించి పరిహాసం-

 శు భో ద యం 🙏


విరించి పరిహాసం-వాణిదరహాసం!!

సరస్వతీ వైభవం:


"నెమలికి నాట దిద్దు నగ, నెయ్యపుఁజిల్కకు గానమాధురిన్

దమియిడు నేర్పు నీకు విదితంబగు, నింక విరాళి చాలి గా

త్రమున రహింపజాలుటగదా యరు" దంచు విరించి మెచ్చ హా

సము నునువాతెఱం జొనుపు శారద పొల్చుఁ గృతీంద్రు సూక్తులన్.


  (చంపూ రామాయణము - వెంకటాచలపతికవి)


(ఆట = నాట్యము, నెయ్యపుఁజిల్క = గారాల చిలుక, గానమాధురి = గానమాధుర్యము, తమియిడు నేర్పు = అభ్యసింపజేసే నైపుణ్యము, విదితంబు = తెలుసు, విరాళి = విరహము, గాత్రము రహింపజాలుట = కంఠముతో రాగాలాపన చేయుట, విరించి = బ్రహ్మ, హాసము = చిరునవ్వు, నునువాతెఱం జొనుపు = మృదువైన పెదవిపై చిందించుట, పొల్చు = ప్రకాశించు, కృతీంద్రుడు = కవీంద్రుడు)


భావము: "మయూరమునకు నాట్యం నేర్పడం, నీ చేతిలోని పెంపుడుచిలుకకు గానమును అభ్యసింపచేయడం నీకు కరతలామలకములైన విద్యలేనని నాకు తెలుసు. నీకు ఆ పనులతోనే సరిపోతున్నది. నీ పతిదేవుడనైన నా యొక్క విరహమును ఉపశమింపచేసేలా నీ మధురగాత్రముతో రాగాలాపన చేయుటయే చాలా అరుదైపోయినది కదా!" అంటున్న బ్రహ్మదేవుణ్ణి చూసి, తన మృదువైన అధరముపై చిరునవ్వు చిందించే వాణీమాత కవీంద్రుని వాక్కులలో విరాజమానం అవుతూవుంటుంది,🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయం

 🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


      87వ దివ్యదేశము  🕉


🙏శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయం : పరమేశ్వర విన్నగరం దేవాలయం, కాంచీపురం 🙏


🔅 ప్రధాన దైవం:.వైకుంఠ పెరుమాళ్

🔅 ప్రధాన దేవత:వైకుంఠ నాయకి

🔅 పుష్కరిణి: ఐరంమద తీర్థము

🔅 విమానం: ముకుంద విమానము


🔔స్థలపురాణం 🔔


💠 విరోచనుడు అను ఒక మహారాజు సంతానము లేక కాంచీపురమున కైలాస పతి పరమేశ్వరుని పూజించి ప్రార్థించు చుండెను . అతనికి ఇద్దరు కుమారులు కలిగిరి . 

వారికి ఆ రాజు పల్లవన్ , వల్లవన్ అని నామకరణము చేసి పెంచెను .

 పల్లవన్ , వల్లవన్ పెద్దవారై గొప్ప విష్ణు భక్తి కలిగి తమ ప్రజలను మంచి దక్షతతో జన రంజకముగా పరిపాలించుచు గొప్ప రాజులుగా పేరుపొందిరి . 

వారు ఒక సమయమున ఈ పురమున ప్రజాహితమే కామ్యముగా అశ్వమేథ యాగమును చేసిరి .

 అంతట శ్రీమహావిష్ణువు వారికి పరపద నాథన్ ( వైకుంఠనాథన్ ) గా ప్రత్యక్షము నిచ్చి అనుగ్రహించి వారి జీవితమును ధన్యము చేసెను . వారు ఇరువురు శ్రీమహావిష్ణువు యొక్క ద్వారపాలకులే . కారణ విశేషమున భూలోకములో జన్మించవలని , విరోచన మహారాజునకు సంతానముగా జన్మించి గొప్ప విష్ణు భక్తులుగా జీవితమును సాగించి మంచి రాజులుగా రాణించి , పెరుమాళ్ దర్శన భాగ్యము పొంది , అంతమున విష్ణులోకమునకు తిరిగి ప్రస్థానము చేసిరి . 

 

💠 ఈ స్థలపురాణములో విశేమేమనగా - విరోచన మహారాజు సంతానమునకై పరమేశ్వరునికి పూజార్చనలు చేసి ప్రార్థించగా విష్ణుభక్తి పరాయణులైన కుమారులు జన్మించిరి . 

ఈ విధముగా మనలో శివ - వైష్ణవ అనుయాయులందు పరస్పర సామరస్యము , సద్భావములే ఉండవలయును విభేదములు . అనంగీకారభావములు , కలహములు ఉండుట సరికాదు అని పరమాత్ముడు సందేశము నొసంగుటయే కదా ! 


💠ఈ ఆలయము మూడు అంతస్థులలో ఉండును .

 పెరుమాళ్ భూతలమున ఆసీనమూర్తి , మధ్య తలమున శయన మూర్తి , ఆ పైన నిలిచి యున్న మూర్తిగా దర్శన మిచ్చును . 

నిలిచి యున్న మూర్తికి నిత్య పూజా లేవు . ఈ ఆలయమును సింహ వర్మ అను పల్లవ రాజు కుమారుడు పరమేశ్వర వర్మ నిర్మించెను . అందువలన " పరమేశ్వర విణ్ణగరమ్ " అని ప్రసిద్ధి చెంది యున్నది .


💠 గొప్ప శిల్ప కళా సంపద ఉన్న అత్యద్భుత క్షేత్రము. కంచి రైల్వే స్టేషన్‌కు 1 కి.మీ. దూరములో ఉంది.


💠 శుక్రవారం శ్రీ వైకుంఠవల్లి తన తల్లిని ప్రార్థిస్తే వివాహం త్వరలో జరుగుతుందని భావిస్తున్నారు.


🙏జై శ్రీమన్నారాయణ 🙏

నా విభూతులే

 నారీణాం.. కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమ...........!!

స్త్రీలలో కనిపించే ఈ ఏడు గుణాలు నా విభూతులే అంటున్నాడు భగవానుడు.


దీనిని బట్టి ఈ ఏడు లక్షణాలు పురుషులలో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు. 

లేదా ఈ ఏడు లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయని కావచ్చు. 

ఇవి స్త్రీలకు సహజగుణాలు కూడా. 


ప్రతి వస్తువులోను ఒక్కొక్క విభూతిని చెప్పి, 

స్త్రీలలో మాత్రం ఏడు విభూతులుగా నేనున్నాను 

అని భగవంతుడు అనటంలో స్త్రీల యొక్క విశిష్ఠతను చాటుతుంది. ఏమిటా ఏడు విభూతులు...


1) కీర్తి...

సత్కర్మలు, దానధర్మాలు, పూజాపునస్కారాలు, యజ్ఞయాగాదులు మోదలైన కర్మల ద్వారా, 

త్యాగభావన ద్వారా కీర్తిని సంపాదించటం, 

భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించటం 

ఇవి స్త్రీ సహజగుణాలు. 


2) శ్రీ...

శ్రీ అంటే సంపద. అంతేకాదు సంపదతో బాటు 

శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవటం కూడా స్త్రీ యొక్క సహజగుణమే. 

శ్రీ అంటే లక్ష్మి. 


3) వాక్కు...

వాక్కు అంటే సరస్వతి. విద్య, బుద్ధి, జ్ఞానం సంపాదించటం, చల్లగా, తియ్యగా, మధురంగా మాట్లాడటం కూడా భగవంతుని విభూతియే. 


4) స్మృతి...

జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకొనే జ్ఞాపకశక్తి, జ్ఞానాన్ని మరచిపోకుండా ఉండటం.

సందర్భానికి తగినట్లు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవటం స్మృతి. ఇదీ భగవంతుని విభూతియే. 


5) మేధా...

ధారణా శక్తి. విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకొనే శక్తి. జ్ఞానవిషయాలు, తత్త్వవిచారణ చేయటానికి కావలసిన మేధాశక్తి స్త్రీలలో అధికం. 

ఇది కూడా భగవంతుని విభూతియే.


6) ధృతి...

ధర్మ కార్యాలలో, దైవకార్యాలలో ధైర్యంతో, 

పట్టుదలతో పాల్గొనటం, మోక్ష సిద్ధి కొరకు పట్టుదల. ఇంద్రియ, మనస్సులను నిగ్రహించగల బలం. 

ఇది కూడా స్త్రీలలో అధికమే.


7) క్షమా...

 అత్తమామలను ఆదరించటంలోను, 

భర్తకు అనుకూలంగా నడుచుకోవటంలోను, 

పిల్లల పోషణలోను, బావలు, మరుదులు, తోటికోడళ్ళు మొదలైన వారితో నేర్పుతో వ్యవహరించటంలోను 

ఎంతో ఓర్పు ఉండాలి. ఇది కూడా స్త్రీ సహజగుణమే. 

ఇవన్నీ స్త్రీలలో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి.


విశేషార్థం...

'నార' అంటే భగవత్ సంబంధమైన.. అని. 

భగవత్ కార్యాలలో, లేదా భగవత్ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా, స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అవి భగవత్ విభూతులే.

విష్ణు సహస్రనామ స్త్రోత్ర* *పారాయణ ఫలితం*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

    *విష్ణు సహస్రనామ స్త్రోత్ర*

       *పారాయణ ఫలితం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ప్రతి నిత్యము లేదా ఏకాదశి రోజున విష్ణుసహస్రనామ పారాయణం చేయడం ద్వారా కలిగే అద్భుత ఫలితాలు లభిస్తాయి.*


*ప్రస్తుతం మనకి ఉన్న పని ఒత్తిడి ద్వారా ప్రతి రోజూ మనం విష్ణు సహస్రనామం పారాయణం చేయలేక పోతున్నాము కనీసం ఏకాదశి రోజైన విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వలన మనకి, మన ముందు మరియు తరువాతి తరాల వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది.*


*ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అదృష్ఠం కలుగుతుంది.. రాజ యోగం కలుగుతుంది. పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాలు నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర్య ఇతి బాధలు కనుమరుగవుతాయి.*

  

*జ్ఞానానికి ,మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయణం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది.*

  

*మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం.*

  

*ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది.*

  

*ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు.*

  

*శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవ గ్రహ దోషాలు తొలగి, వాక్శుద్ది  కలుగుతుంది. జ్ఞానం వృద్ది నొందుతుంది.తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది. జీవిత సత్యాన్ని భోధ పరుస్తుంది.*


*ఓం నమో భగవతే వాసుదేవాయ!*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

విష్ణు సహస్రనామ స్తోత్రము*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (68)*


*అర్చిష్మానర్చితః కుంభో*

*విశుద్ధాత్మా విశోధనః ।*


*అనిరుద్ధోప్రతిరథః*

*ప్రద్యుమ్నోమితవిక్రమః ॥*


*ప్రతి పదార్థం:~*


*637) అర్చిష్మాన్ - తేజోరూపుడు, అత్యంత కాంతి ప్రదమైన వాడు;*.


*638) అర్చిత: - సమస్త లోకములచే పూజింప బడువాడు.;*


*639) కుంభ: - సర్వము తనయందుండువాడు. విశ్వమంతా భగవానుని గర్భమునే భాండంలో ఇమిడి ఉంది;*


*640) విశుద్ధాత్మా - పరిశుద్ధమైన స్వభావము (గుణము,ఆత్మ) కలవాడు.*


*641) విశోధనః - పవిత్రము చేయువాడు; తనను స్మరించు వారి పాపములను నశింపచేయువాడు;*


*642) అనిరుద్ధః - నిరోధింప బడనివాడు;*


*643) అప్రతిరథ: - సాటి లేని వాడు; ఇతనితో పోటీ వేరెవ్వరు లేరు; తన నెదుర్కొను ప్రతిపక్షము లేని పరాక్రమవంతుడు.*


*644) ప్రద్యుమ్న: - విశేష ధనము కలవాడు; భక్తులయందే ఉండి వారిని ప్రకాశింప చేయువాడు; విశేషమైన ఐశ్వర్యము సంపద కలిగి భక్తులను అనుగ్రహించు వాడు;*


*645) అమిత విక్రమ: - విశేష పరాక్రమము కలవాడు; అమిత బలపరాక్రమాలు కలవాడు.*


*తాత్పర్యము:~*


*అత్యంత కాంతి ప్రదమైనవాడును, సర్వులచేత పూజింప బడువాడును, సమస్త వస్తువులును కుండలో చక్కగా నిమిడియున్నట్లు అనంతమగు విశ్వమంతయును తన గర్భమందే చక్కగాఇముడ్చుకున్నవాడును, బాగుగా పరిశుద్ధమైన ఆత్మయైనవాడును, స్మరణ మాత్రమున భక్తుల సకల పాపములను పొగొట్టువాడును, శత్రువులెవ్వరిచేతను నిరోధింపబడనివాడును, తనకు ప్రతిపక్షమే లేనివాడును, విశేష ధనము గలవాడును, సాటిలేని బలపరాక్రమ సంపన్నుడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను.*


*పాఠకులందరికీ శుభం కలుగు గాక ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       ‌ *సూచన*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*అనూరాధ నక్షత్రం 4వ పాదం జాతకులు పై 68వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇 

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(68వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

          *యయాతి చరిత్ర*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘అగ్రకులజులట! అగ్రకులజులు. ఏమిటే మీ కులం? మా ఇళ్లల్లో పౌరోహిత్యం చేసుకుని బతికే మీ సంగతి ఎవరికి తెలియదే? లేచింది మొదలు మీరంతా మా ఇంటి ముందు కుక్కల్లా పడి ఉంటారు. చాల్లే నీ గొప్పలు.’’ అంది ఆమె.* 


*అలా మాటా మాటా పెరిగి, ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునే స్థితికి చేరుకున్నారు.*


*ఆ స్థితిలో దేవయానిని ఓ పాడుబడ్డ బావిలోనికి తోసి వేసి, చెలికత్తెల సహా వెను తిరిగింది శర్మిష్ఠ. అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. నూతిలో ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంది దేవయాని*.


*ఆ సమయంలో యయాతి మహారాజు వేటకై అటుగా వచ్చి, దేవయాని ఆర్తనాదాలు విన్నాడు. నూతి దగ్గరగా వచ్చాడు. తొంగి చూశాడు. వివస్త్రగా అతనికి దేవయాని కనిపించింది.దయతో తన ఉత్తరీయాన్ని దేవయానికి అందించాడతను. చేయి అందించి, ఆమెను నూతిలోంచి బయటికి తీశాడు. తన మానాన్ని కాపాడి, ప్రాణాలు కాపాడిన యయాతిని దేవయాని మోహించింది. అతన్ని పెళ్ళి చేసుకోవాలని ఆశించింది. జరిగిన కథంతా యయాతికి చెప్పింది.*


*‘‘మహారాజా! మీరు నా పాణిని గ్రహించారు. పాణిగ్రహణం జరిగింది. మీరే నా భర్త.’’ అన్నది దేవయాని. ఆలోచనలో పడ్డాడు యయాతి. తను క్షత్రియుడు. దేవయాని బ్రాహ్మణకన్య. పైగా శుక్రాచార్యుని కూతురు. ఆ వివాహం యుక్తం కాదనుకున్నాడు యయాతి. పాపహేతువన్నాడు. ఆ మాటే చెప్పాడు దేవయానికి. అయినా యయాతే తన భర్తని పట్టుబట్టింది దేవయాని. దోషం లేదన్నది. తండ్రి శుక్రాచార్యుని అనుమతి తీసుకున్న అనంతరమే తనని వివాహం చేసుకోమన్నది. పూర్వం కచుడు తనకు ఇచ్చిన శాపకారణంగా కూడా ఈ వివాహం జరగాల్సి ఉందన్నదామె.*


*ఇక్కడ కచుడు-దేవయానుల కథ కొంత మేరకు తెలుసుకోవాలి.*


*దేవగురువు బృహస్పతి కుమారుడు కచుడు. మృతసంజీవనీ విద్య నేర్చుకునేందుకై అతను శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించాడు. శుక్రునికి శుశ్రూషలు చేసి అతని అనుగ్రహాన్ని సంపాదించాడు. మృతసంజీవనీ విద్య నేర్చుకున్నాడు. అప్పుడే అతనికి దేవయానితో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఆడారు పాడారు. విద్య పూర్తయి కచుడు వెళ్ళిపోతున్న వేళ, తన కోరికను తెలియజేసింది దేవయాని. తనని వివాహమాడమన్నదామె. ‘‘నాకు నువ్వు గురుపుత్రివి. సోదరితో సమానం. నిన్ను పెళ్ళాడడం పాపం.’’ అన్నాడు కచుడు. కాదన్నదామె. రకరకాలుగా వేడుకున్నది. వినలేదు కచుడు. ఆఖరికి కోపంతో ఇలా శపించింది.‘‘మృతసంజీవనీ విద్య నీకు పనిచేయకుండుగాక.’’తనని అకారణంగా శపించినందుకు కచుడు కోపగించుకుని, దేవయానిని ఇలా శపించాడు.‘‘నిన్ను బ్రాహ్మణుడు పెళ్ళాడకుండుగాక.’’శాప ప్రతిశాపాలతో కచ దేవయానులు విడిపోయారు.*


*నాటి శాపఫలితంగా దేవయానికి బ్రాహ్మణేతరుణ్ణి పెళ్ళాడే యోగ్యత ఉన్నది. ఆ మాటే యయాతికి ఇప్పుడు చెప్పింది దేవయాని. తనని స్వీకరించడంలో తప్పు లేదన్నది. ఒప్పించిందతన్ని.*


*తండ్రి శుక్రాచార్యుని సమీపించి, తనకి శర్మిష్ఠ చేసిన అవమానాన్ని వివరించింది దేవయాని. ఏడ్చింది. పౌరోహిత్యం కంటే భిక్షాటనే మేలు అనుకున్నాడు శుక్రాచార్యుడు. కుమార్తెను వెంటబెట్టుకుని వృషపర్వుని విడచి వెళ్ళిపోయాడు.*


*శర్మిష్ఠ కారణంగా గురువుగారు తనని విడచి వెళ్ళిపోయారని ఎంతగానో బాధపడ్డాడు వృషపర్వుడు. శుక్రాచార్యుడు లేకపోతే దేవతల ఆగడాలకు అంతు ఉండదనుకున్నాడు. ఎలాగయినా గురువుగారి అనుగ్రహం సంపాదించుకోవాలనుకున్నాడు. వెళ్ళి శుక్రాచార్యుని పాదాలపై మోకరిల్లాడు.*


*‘‘శర్మిష్ఠ చేసింది తప్పే! ఒప్పుకుంటాను. ఈ కారణంగా మీరు నన్ను విడచి రావడం భావ్యం కాదు. నా కూతురు చేసిన తప్పు క్షమించండి. మీరు లేకపోతే దానవకులం అంతరించిపోతుంది. మాకు దిక్కులేదు.’’ వేడుకున్నాడు. శుక్రాచార్యుడు కరిగాడు. కోపాన్ని తగ్గించుకున్నాడు. కూడా వృషపర్వునితో వచ్చేందుకు సిద్దమయ్యాడు. అయితే దేవయాని కోరిక తీర్చాలని వృషపర్వుని ఆజ్ఞాపించాడు శుక్రాచార్యుడు. తప్పకుండా అన్నాడు వృషపర్వుడు. కోరికను తెలియజేయమన్నాడు.*


*‘‘నాకు పెళ్ళి చేసి నా తండ్రి నన్ను ఎక్కడకి పంపితే అక్కడకి శర్మిష్ఠ తన చెలికత్తెలతో వచ్చి, నాకు ఊడిగం చెయ్యాలి. నా దగ్గరే ఉండాలి. ఇందుకు నువ్వు ఒప్పుకోవాలి.’’ అన్నది దేవయాని. శర్మిష్ఠను దేవయాని వెంట దాసిగా పంపడం భరించలేనిదే! అయినా తప్పదు. రాక్షసకులానికి కీడు మూడితే కాపాడేదెవరు? అనుకున్నాడు వృషపర్వుడు. తప్పనిసరయి దేవయాని కోరికను అంగీకరించాడు. విధిలేక శర్మిష్ఠ తండ్రి ఆజ్ఞకు కట్టుబడింది. చెలికత్తెలు సహా శర్మిష్ఠ, దేవయానిని చేరింది.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

మాతృభాషౌన్నత్యము

 🌸  *మాతృభాషౌన్నత్యము*   🌸


సీ.

కన్నతల్లియొడిని కల్గు సౌఖ్యము మించు 

సౌఖ్య మెందును లేదు జగతియందు 

మాతృహస్తములోని మార్దవమును మించు 

మార్దవ మేచోట మనకు లేదు 

జననిమనసులోని సౌకుమార్యము మించు 

సుకుమారమెట లేదు శోధజేయ 

ధరపైన వెలసిన దైవమ్మె మనతల్లి 

యట్టి తల్లిని మించు నన్యమేది? 

తే.గీ. ఇన్ని సుగుణాల కలుగుచు నెన్నదగిన 

మాతృదేవత మరియొండు మాతృభాష 

యట్టి భాషామతల్లికి నంజలింతు 

శ్రేష్ఠతమమైన మాతకు జేజె యనుచు 

*~శ్రీశర్మద*

జాతి యొసంగు దాఖ్యముల

 ఉ.జాతి యొసంగు దాఖ్యముల స్వార్థ విశేష కుయుక్తి తోడ సం

ప్రీతిగ స్వీకరించియును వ్యర్థములైన కుతర్క వాద సం

జాత విష ప్రచారముల సంగతి మాటున ధ్వంస మార్గపున్

రీతుల నెంచు వారల భరించి సహింపగనేల? భారతీ!౹౹ 67

(దాఖ్యము=నేర్పరి తనము)


మ.మహి నీ జాతికి సత్త్వ హేతువులు సన్మార్గంపు సంధాతలై

బహుళార్థమ్ములొసంగుసంపదలరూపమ్ముల్ లతాంగుల్ తగన్

సహధర్మార్ధ శరీరులై అలరు సత్సాంగత్య సామ్రాజ్ఞులు

ద్వహనమ్మైన సుభాషిణుల్ శిఖరిణుల్ ధన్యుల్ సదా భారతీ!౹౹68

పంచాంగం 06.03.2025 Thursday,

 ఈ రోజు పంచాంగం 06.03.2025 Thursday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాస శుక్ల పక్ష సప్తమి తిథి బృహస్పతి వాసర రోహిణి నక్షత్రం నిష్కంభ యోగః: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30  వరకు.



శుభోదయ:, నమస్కార:

శాస్తంకోట శ్రీ ధర్మ శాస్తా దేవాలయం

 🕉 మన గుడి : నెం 1041


⚜ కేరళ  : కొల్లం 


⚜ శాస్తంకోట శ్రీ ధర్మ శాస్తా దేవాలయం



💠 కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో ఉన్న సస్తంకోట చాలా ప్రసిద్ధ ప్రదేశం, ఇది ప్రధానంగా సస్తంకోట సరస్సు వెంబడి ఉన్న సస్తంకోట శ్రీ ధర్మ శాస్తా దేవాలయం కారణంగా యాత్రికులు తరచుగా వస్తుంటారు.

పట్టణానికి పేరు తెచ్చే ఈ ఆలయం ఒక ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం.



💠 కేరళలోని అచ్చన్‌కోయిల్, ఆర్యంకావు, కులతుపుజా, శాస్తంకోట మరియు శబరిమల అనే ఐదు పురాతన శాస్తా దేవాలయాలలో శాస్తంకోట ఆలయం ఒకటి.  

ధర్మ శాస్తా అనే భావన వైష్ణవ మరియు శైవ విశ్వాసాల ఐక్యతను సూచిస్తుంది. 


 💠 ఈ ఆలయం మూడు వైపులా కేరళలోని అతిపెద్ద మంచినీటి సరస్సు, సస్తంకోట సరస్సు చుట్టూ ఉంది.


💠 శాస్తంకోట శ్రీ ధర్మ శాస్తా ఆలయం: ఆలయ ప్రధాన దైవం శ్రీ ధర్మ శాస్తా, అతని భార్య 'ప్రభ' మరియు కుమారుడు 'సత్యక'తో కలిసి ఉన్నారు.  

శాస్తంకోట ఆలయంలో ప్రతిష్టించబడిన విగ్రహం మరెవరో కాదు, రాముడు తన భార్య అయిన సీతను వెతుకుతూ లంక (శ్రీలంక) పర్యటన సందర్భంగా పూజించిన స్వయంభూ విగ్రహం.


💠 ఒకసారి పందళం యువరాజు కాయంకులం రాజకుటుంబానికి చెందిన యువరాణిని వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. 

శబరిమలలోని అయ్యప్పను క్రమం తప్పకుండా ప్రార్థించే యువరాజుకు తన సాధారణ నెలవారీ సందర్శనలను కొనసాగించడం కష్టంగా మారింది. 

ఇది అయ్యప్ప స్వామికి అసంతృప్తి కలిగించింది మరియు రాజకుటుంబంలో స్వామి అసంతృప్తికి సంబంధించిన సంకేతాలు కనిపించడం ప్రారంభించాయి.

 యువరాజు తప్పుకు పశ్చాత్తాపపడి శబరిమలకు బయలుదేరి అక్కడ పన్నెండు రోజుల పాటు పూజలు చేశాడు.


💠 శబరిమల దర్శనం నిర్వహణ గురించిన ఆందోళనలు ఆయన్ను అంతటా కలవరపరిచాయి. 

12వ రోజు ఆరాధన రోజు రాత్రి, అయ్యప్ప స్వామి కలలో అతని ముందు కనిపించాడు మరియు అతను కాయంకుళంలోనే ఉండాలని సూచించాడు.

 శబరిమలను సందర్శించే బదులు, శబరిమల యొక్క అదే దైవిక ఉనికిని కలిగి ఉన్న శాస్తాంకోటను సందర్శించి తనను పూజించమని స్వామిని కోరాడు. 

కాయంకుళం ప్యాలెస్‌లో జరగబోయే ఉత్సవానికి వచ్చే యువకుడు ఆ స్థలాన్ని గుర్తించడంలో సహాయం చేస్తాడని ప్రభువు చెప్పాడు. 


💠 కలలో చెప్పినట్లు ఉత్సవాల విలువిద్య పోటీలో పాల్గొన్న ఓ యువకుడు బాణం వేశాడు. యువరాజు మరియు యువకుడితో సహా ఒక బృందం విజేతను ప్రకటించడానికి బాణాన్ని వెతకడానికి తూర్పు దిశ వైపు బయలుదేరింది. చివరకు ఈ సరస్సు ఒడ్డుకు చేరుకున్నారు. ఆ సరస్సులోని ఒక చిన్న ద్వీపంలో వారు ఆ బాణాన్ని కనుగొన్నారు.


💠 ఆశ్చర్యకరంగా, ఒక చిన్న ప్లాట్‌ఫారమ్‌పై అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కోతుల వంశం పూజిస్తోంది. ఆ సమయంలో యువకుడు అదృశ్యమయ్యాడు. కాయంకుళం రాజు అప్పుడు ఆలయాన్ని పునరుద్ధరించి, ప్రస్తుత రూపంలో నిర్మించాడు. ధర్మ శాస్తా అనే భావన వైష్ణవ మరియు శైవ విశ్వాసాల ఐక్యతను సూచిస్తుంది. 


💠 విగ్రహ చరిత్ర రామాయణ కాలం నాటిది. రావణుడిపై విజయం సాధించిన తరువాత, రాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు మరియు మొత్తం వానర సేనతో కలిసి ధర్మ శాస్తాకు పూజలు చేయడానికి శాస్తంకోటను సందర్శించాడని నమ్ముతారు. 

శాస్తంకోట ఒడ్డున, శ్రీరాముడు మానస సరోవరంలోని సూర్య రాగ తీర్థాన్ని పోలి ఉండే వ్రతాలను పూర్వీకులకు సమర్పించాడు. 

రాముడు తన వానర బృందానికి ప్రధాన వాస్తుశిల్పి అయిన నీలను శ్రీ ధర్మ శాస్తాకు సేవ చేయడానికి నియమించాడు. 

ఆలయంలో ఉన్న వానర వంశానికి నీలన్ పూర్వీకులని నమ్ముతారు.

ఆ విధంగానే ఇక్కడి విగ్రహానికి విశిష్టత వచ్చింది. ఈ ఆలయం కేరళ నిర్మాణ శైలితో అద్భుతమైన వాతావరణాన్ని కలిగి ఉంది.


💠ఇక్కడ ఉన్న ధర్మశాస్తా (దేవత) శబ రిమలలోని అయ్యప్ప స్వామికి ఉన్న అధికారాలను కలిగి ఉంటాడని చెబుతారు.

ఈ ఆలయాన్ని పందళం రాజకుటుంబానికి చెందిన యువరాజు నిర్మించారు. 


💠 ఇక్కడి దేవాలయం కోతుల నివాసానికి ప్రసిద్ధి. ఆలయ కోతులు ప్రధాన దేవత యొక్క దైవిక పరివారం అని నమ్ముతారు.

హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ లంకకు ఎగురుతూ ఈ ప్రదేశంలో కూడా ఆగిపోయాడని, అప్పటి నుండి ఈ ఆలయం కోతులకు నిలయంగా ఉందని నమ్ముతారు. కోతులు భక్తులకు అనుకూలమైనవి మరియు ఆలయాన్ని సందర్శించే వేలాది మంది భక్తులు ఈ కోతులకు కాయలు మరియు పండ్లను తినిపించడంలో ఆనందం పొందుతారు

 

💠 ఉత్సవం (వార్షిక పండుగ): 

ఉత్సవం పది రోజుల పాటు జరుగుతుంది. 

ఉత్సవాన్ని పురస్కరించుకుని తొలిరోజు జెండాను ఎగురవేస్తారు. ఉత్సవం కుంభం (ఫిబ్రవరి-మార్చి) మాసంలో 'ఉత్రం' నాడు జరిగే 'ఆరాట్టు'తో ముగుస్తుంది. 

పదవ రోజున 'కెట్టుకఙ్చ'-ఎద్దులు, గుర్రాలు, అలంకరించబడిన రథాలు మొదలైన వాటితో కూడిన ఊరేగింపు నిర్వహిస్తారు -- అనేక ఏనుగులు తమ నెట్టిపట్టంతో (అలంకార శిరస్త్రాణం) కూడా ఆలయానికి వచ్చి ప్రధానికి పూజలు చేస్తారు. 


💠 అర్ధరాత్రి జరిగే ఊరేగింపులో ఐదు ఏనుగులు పాల్గొనే ఆరాట్టు వేడుకతో పండుగ ముగుస్తుంది. 



💠 కొల్లాం నుండి 28 కి.మీ దూరంలో

ఉంది. 



Rachana

©️ Santosh Kumar

14-13-గీతా మకరందము

 14-13-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక తమోగుణాభివృద్ధియందు జీవుడెట్లుండునో వచించుచున్నారు -


అప్రకాశోఽప్రవృత్తిశ్చ 

ప్రమాదో మోహ ఏవ చ | 

తమస్యేతాని జాయన్తే  

వివృద్ధే  కురునన్దన || 


తాత్పర్యము:- కురువంశీయుడవగు ఓ అర్జునా! తమోగుణము అభివృద్ధినొందినదగుచుండగా మనుజునియందు అవివేకము (బుద్ధిమాంద్యము), సోమరితనము, అజాగ్రత, అజ్ఞానము  (మూఢత్వము, లేక విపరీతజ్ఞానము) అనునవి కలుగుచున్నవి.


వ్యాఖ్య:- తమోగుణ మభివృద్ధినొందినపుడు జీవునియందు మత్తు, సోమరితనము, అజాగ్రత, బుద్ధిమాంద్యము మున్నగు లక్షణములు గోచరించుచుండును. ఆతని ఆహారపానీయములందును, మాటలందును ఈ తమోగుణమే వ్యక్తమగుచుండును. వగరు మామిడికాయకు ఈ తమోగుణస్థితిని పోల్చవచ్చును. మఱియు కుంభకర్ణుని ఈ గుణమునకు దృష్టాంతముగ చెప్పవచ్చును. ప్రతివారును తమ తమ హృదయములను పరిశోధించుకొని తమయం దేగుణము యొక్క లక్షణములున్నవో పరీక్షించుకొని సాధనాతిశయముచే క్రమముగ ఊర్ధ్వస్థితిని బడయుటకై యత్నించవలెను. చెట్టుమొదలుకు నీటినిబోయుచున్నచో, పిందెయొక్క వగరుదనము నెమ్మదిగా పులుపుదనముగా మారి, ఆ పులుపుదనము తీపిదనముగా పరిణమించి, ఫలము పక్వమై, తుట్టతుదకు రాలిపోవును, అదియే జీవన్ముక్తదశ.  అత్తఱి  జీవునకు సంసారబంధమునుండి విముక్తి సంభవించును. అయితే ఫలముయొక్క పరిపక్వస్థితి, రాలునట్టిస్థితి చెట్టు యొక్క మొదలుకు నీరు పోయుటవలననే సిద్ధించునట్లు  భగవద్ధ్యానము, నిరంతర పరమార్థసాధన - వీని మూలకముగనే జీవుడు క్రమపరిణామమొంది రజస్తమములనుండి సత్త్వమునందుకొని, అటనుండి గుణాతీతపదవిని చేరుకొనును. 


ప్రశ్న:- తమోగుణ మభివృద్ధి నొందియున్నపుడు జీవుడెట్లుండును?

ఉత్తరము:- (1) అవివేకము (2) సోమరితనము (3) అజాగ్రత (4) అజ్ఞానము - మున్నగు లక్షణము లత్తఱి  యాతనియందు గోచరించును. ఈ గుఱుతులున్నచో వెంటనే ఆతనియందు తమోగుణ మధికముగ నున్నదని తెలిసికొనవచ్చును.

తిరుమల సర్వస్వం 169-*

 *తిరుమల సర్వస్వం 169-*

*శ్రీ హాథీరామ్ బావాజీ 1*


  *శ్రీ హాథీరామ్ బావాజీ* 


 స్వామివారి భక్తాగ్రేసరులలో అత్యంత ప్రముఖుడైన శ్రీ హాథీరామ్ బావాజీని స్మరించుకోకుండా తిరుమల క్షేత్ర చరిత్ర కానీ, శ్రీవేంకటేశ్వరుని ఇతిహాసం కానీ అసంపూర్తిగానే మిగిలిపోతాయంటే అతిశయోక్తి కాదు. వందల ఏళ్ళక్రితం, ఎక్కడో వేలమైళ్ళ దూరంలోనున్న హిమాచల్ ప్రదేశ్ నుంచి కాలినడకన వచ్చి, తిరుమలకొండపై జనావాసాలు ఏమాత్రం లేని రోజుల్లో స్థిరనివాసమేర్పరచుకుని, స్వామివారిని సేవించుకుంటూ, వారితో నిత్యము పాచికలాడిన శ్రీహాథీరామ్ బావాజీ చరిత్ర శ్రీవారి భక్తులందరికీ చిరపరిచితమే!


 వారి జీవనగమనం, శ్రీవేంకటేశ్వరునితో వారికున్న ప్రగాఢమైన అనుబంధం, తిరుమలలో బావాజీ జీవితంతో ముడివడి ఈనాటికీ దర్శించుకోదగ్గ ప్రదేశాలు, బ్రిటీషువారి హయాం అనంతరం ఆలయ నిర్వహణను తొంభై సంవత్సరాల పాటు చేపట్టిన మహంతు వ్యవస్థ - మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



 *పుట్టుపూర్వోత్తరాలు*


 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 'ఉనా' అనబడే గ్రామంలో, వంశపారంపర్యంగా శ్రీరామచంద్రుడి పరమభక్తుడైన 'దేశ్ రాజ్ బల్తోత్' అనే మధ్యతరగతి కుటుంబీనికి కలిగిన నలుగురు పుత్రులలో ఒకరిగా బాబాజీ జన్మించారు. వారి అసలు పేరు 'ఆశారామ్ బల్తోత్'. తరువాతి కాలంలో, 'లంబాడా' గిరిజన తెగకు చెందిన బలౌత్ కుటంబం పంజాబ్ రాష్ట్రానికి వలస వెళ్ళింది.


 మరి కొందరు చరిత్రకారులననుసరించి, బావాజీ పూర్వీకులు రాజస్థాన్ లోని 'నాగౌర్' పట్టణానికి చెందినవారు. తిరుమల లోని హాథీరాంజీ మఠంలో ప్రస్తుతం నివాసముంటున్న బావాజీ అనుయాయులు ఈ వాదాన్నే బలపరుస్తున్నారు.


 *తిరుమల యాత్ర*


 బల్తోత్ వంశస్థులు, ఆనాడు ఉత్తర భారతదేశంలో ఉధృతంగా ప్రచారంలోనున్న రామానంద భక్తి ఉద్యమానికి చెందిన వైష్ణవులు. ఈనాటి 'ఢిల్లీ' పట్టణానికి కొద్ది దూరంలో 'రామానంద మఠం' ఉండేది. శ్రీరామ భక్తిని వంశపారంపర్యంగా పుణికి పుచ్చుకున్న హథీరాం బాబా ఆ రోజుల్లో రామానంద మఠానికి అధిపతి యైన అభయానంద్ స్వామీజీకి ప్రియశిష్యుడు.


 గురువాజ్ఞ మేరకు, కౌమారదశలోనున్న ఆశారామ్ బడ్జత్, ఒక భక్తబృందంలో సభ్యుడిగా దక్షిణ భారతదేశంలోని తీర్ధాలన్నింటిని కాలినడకన దర్శించుకుంటూ, తిరుమల క్షేత్రానికి విచ్చేశారు. కొద్ది రోజులు శ్రీవారిని సేవించుకున్న తరువాత భక్తబృందం లోని సభ్యులందరూ తిరిగి వెళ్ళిపోగా, బావాజీ మాత్రం తిరుమల క్షేత్రం లోని ప్రకృతి సోయగానికి, శ్రీవేంకటేశ్వరుని దివ్యసౌందర్యానికి ముగ్ధుడై సప్తగిరులే తన దీక్షకు అనువైన స్థానమని తలంచి కొండపైనే ఉండిపోయాడు. ఆలయానికి అతి సమీపంలో ఆగ్నేయ దిక్కున ఒక చిన్న ఆశ్రమం ఏర్పరుచుకొని, అనునిత్యం స్వామివారిని సేవించుకునేవాడు. ఆ కాలంలో తిరుమల ప్రాంతమంతా దట్టమైన అడవులతో, క్రూరమృగాలతో, భరింపశక్యం గాని చలితో దుర్గమంగా ఉండడం వల్ల కొండపై వేరెవరూ నివాసముండేవారు కాదు. అర్చకులతో సహా అందరూ కొండ దిగి, చీకటి పడకముందే దిగువ తిరుపతికి చేరుకునే వారు. బావాజీ ఒక్కరే స్వామివారిపై భారం వేసి, ఆశ్రమంలో నివాసముంటూ శ్రీవారిని సేవించుకునేవారు. 


 బావాజీ స్వతహాగా, వంశపారంపర్యంగా శ్రీరాముడి భక్తుడవ్వడంతో; శ్రీవేంకటేశ్వరుని ముఖారవిందంలో కూడా స్వామివారి త్రేతాయుగ అవతారమైన శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకునే వాడు. 'కౌసల్యా సుప్రజా రామా' అంటూ స్వామి వారిని శ్రీరాముని వలెనే కీర్తించే వారు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

తిరుమల సర్వస్వం 169-*

 *తిరుమల సర్వస్వం 169-*

*శ్రీ హాథీరామ్ బావాజీ 1*


  *శ్రీ హాథీరామ్ బావాజీ* 


 స్వామివారి భక్తాగ్రేసరులలో అత్యంత ప్రముఖుడైన శ్రీ హాథీరామ్ బావాజీని స్మరించుకోకుండా తిరుమల క్షేత్ర చరిత్ర కానీ, శ్రీవేంకటేశ్వరుని ఇతిహాసం కానీ అసంపూర్తిగానే మిగిలిపోతాయంటే అతిశయోక్తి కాదు. వందల ఏళ్ళక్రితం, ఎక్కడో వేలమైళ్ళ దూరంలోనున్న హిమాచల్ ప్రదేశ్ నుంచి కాలినడకన వచ్చి, తిరుమలకొండపై జనావాసాలు ఏమాత్రం లేని రోజుల్లో స్థిరనివాసమేర్పరచుకుని, స్వామివారిని సేవించుకుంటూ, వారితో నిత్యము పాచికలాడిన శ్రీహాథీరామ్ బావాజీ చరిత్ర శ్రీవారి భక్తులందరికీ చిరపరిచితమే!


 వారి జీవనగమనం, శ్రీవేంకటేశ్వరునితో వారికున్న ప్రగాఢమైన అనుబంధం, తిరుమలలో బావాజీ జీవితంతో ముడివడి ఈనాటికీ దర్శించుకోదగ్గ ప్రదేశాలు, బ్రిటీషువారి హయాం అనంతరం ఆలయ నిర్వహణను తొంభై సంవత్సరాల పాటు చేపట్టిన మహంతు వ్యవస్థ - మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



 *పుట్టుపూర్వోత్తరాలు*


 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 'ఉనా' అనబడే గ్రామంలో, వంశపారంపర్యంగా శ్రీరామచంద్రుడి పరమభక్తుడైన 'దేశ్ రాజ్ బల్తోత్' అనే మధ్యతరగతి కుటుంబీనికి కలిగిన నలుగురు పుత్రులలో ఒకరిగా బాబాజీ జన్మించారు. వారి అసలు పేరు 'ఆశారామ్ బల్తోత్'. తరువాతి కాలంలో, 'లంబాడా' గిరిజన తెగకు చెందిన బలౌత్ కుటంబం పంజాబ్ రాష్ట్రానికి వలస వెళ్ళింది.


 మరి కొందరు చరిత్రకారులననుసరించి, బావాజీ పూర్వీకులు రాజస్థాన్ లోని 'నాగౌర్' పట్టణానికి చెందినవారు. తిరుమల లోని హాథీరాంజీ మఠంలో ప్రస్తుతం నివాసముంటున్న బావాజీ అనుయాయులు ఈ వాదాన్నే బలపరుస్తున్నారు.


 *తిరుమల యాత్ర*


 బల్తోత్ వంశస్థులు, ఆనాడు ఉత్తర భారతదేశంలో ఉధృతంగా ప్రచారంలోనున్న రామానంద భక్తి ఉద్యమానికి చెందిన వైష్ణవులు. ఈనాటి 'ఢిల్లీ' పట్టణానికి కొద్ది దూరంలో 'రామానంద మఠం' ఉండేది. శ్రీరామ భక్తిని వంశపారంపర్యంగా పుణికి పుచ్చుకున్న హథీరాం బాబా ఆ రోజుల్లో రామానంద మఠానికి అధిపతి యైన అభయానంద్ స్వామీజీకి ప్రియశిష్యుడు.


 గురువాజ్ఞ మేరకు, కౌమారదశలోనున్న ఆశారామ్ బడ్జత్, ఒక భక్తబృందంలో సభ్యుడిగా దక్షిణ భారతదేశంలోని తీర్ధాలన్నింటిని కాలినడకన దర్శించుకుంటూ, తిరుమల క్షేత్రానికి విచ్చేశారు. కొద్ది రోజులు శ్రీవారిని సేవించుకున్న తరువాత భక్తబృందం లోని సభ్యులందరూ తిరిగి వెళ్ళిపోగా, బావాజీ మాత్రం తిరుమల క్షేత్రం లోని ప్రకృతి సోయగానికి, శ్రీవేంకటేశ్వరుని దివ్యసౌందర్యానికి ముగ్ధుడై సప్తగిరులే తన దీక్షకు అనువైన స్థానమని తలంచి కొండపైనే ఉండిపోయాడు. ఆలయానికి అతి సమీపంలో ఆగ్నేయ దిక్కున ఒక చిన్న ఆశ్రమం ఏర్పరుచుకొని, అనునిత్యం స్వామివారిని సేవించుకునేవాడు. ఆ కాలంలో తిరుమల ప్రాంతమంతా దట్టమైన అడవులతో, క్రూరమృగాలతో, భరింపశక్యం గాని చలితో దుర్గమంగా ఉండడం వల్ల కొండపై వేరెవరూ నివాసముండేవారు కాదు. అర్చకులతో సహా అందరూ కొండ దిగి, చీకటి పడకముందే దిగువ తిరుపతికి చేరుకునే వారు. బావాజీ ఒక్కరే స్వామివారిపై భారం వేసి, ఆశ్రమంలో నివాసముంటూ శ్రీవారిని సేవించుకునేవారు. 


 బావాజీ స్వతహాగా, వంశపారంపర్యంగా శ్రీరాముడి భక్తుడవ్వడంతో; శ్రీవేంకటేశ్వరుని ముఖారవిందంలో కూడా స్వామివారి త్రేతాయుగ అవతారమైన శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకునే వాడు. 'కౌసల్యా సుప్రజా రామా' అంటూ స్వామి వారిని శ్రీరాముని వలెనే కీర్తించే వారు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*


*308 వ రోజు*


*కౌరవ శిబిరంలో కలవరం*


ఆ రాత్రి సమయంలో పాండవ శిబిరంలో పాంచజన్య, దేవదత్త ఘోషలు విని కౌరవసేనలలో కలవరం రేగింది. వెంటనే వారు చారులను పిలిచి అడుగగా వారు జరిగినది అంతా సవిస్తరంగా చెప్పారు. అది విన్న సైంధవుని శరీరం కంపించింది. అక్కడ నిలువ లేక సిగ్గు విడిచి నీ కుమారుని శిబిరానికి పరుగు తీసి " సుయోధనా ! నేను ఒక్కడినే అపకారం చేసినట్లు అర్జునుడు నాపై పగబూని నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసాడట. మీరంతా సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం ఎందుకు దుఃఖపడాలి ? అర్జునుడి ప్రతిజ్ఞకు దేవాసురులు, సిద్ధసాధ్యులుగాని అడ్డుపడగలరా ! సుయోధనా ! ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, శల్యుడు, బాహ్లికుడు నీవు తలచిన యమపురి పోయిన వాడిని తీసుకురాగలరు. కానీ మీరు కాపాడవలెనని అనుకున్నట్లు లేరు కనుక నాకిక దేవుడే దిక్కు " అన్నాడు. అతడి పెదవులు ఎండి పోతున్నాయి కాళ్ళు తడబడుతున్నాయి నిలబడ లేక పోతున్నాడు. " సుయోధనా ! ముందు నేను అర్జునుడి కంట పడకుండా దాక్కుంటాను. మీకిక శలవు బ్రతికుంటే రేపు కలుస్తాను " అని వెళ్ళబోయాడు.


*సైంధవుడికి ధైర్యం చెప్పుట*


సుయోధనుడు " సైంధవా ! ఏమిటీ వెర్రి ! ఇప్పుడే కదా ! మా పరాక్రమము పొగిడావు. ద్రోణుని శౌర్యము, సోమదత్తుని ధైర్యము, శకుని వీరము, శల్యుని బలము నీకు తెలియనిదా ! మేము నిన్ను విడిచి పెడతామా భయపడకుము నిన్ను వెన్నంటి ఉంటాము " అని ధైర్యము చెప్పాడు. వెంటనే సుయోధనుడు సైంధవుని వెంటబెట్టుకుని ద్రోణుని వద్దకు వెళ్ళాడు. సైంధవుడు ద్రోణునితో అర్జునుడికి తనకు ధనుర్విద్యలో కల తారతమ్యాలు అడిగాడు. ద్రోణుడు " సైంధవా ! మీరందరూ నా దగ్గర విలు విద్య అభసించారు. నేను మీకందరికి ఒకే విధంగా నేర్పాను కాని అర్జునుడు కఠోర శ్రమకు ఓర్చి ఎన్నో ప్రయోగములు చేసి విలువిద్యలో మెళుకువలు తెలుసుకున్నాడు. కనుక మీ కంటే అర్జునుడు అధికుడు కాని నీవు అర్జునుడికి భయపడ పని లేదు నా రక్షణలో ఉండగా నిన్ను దేవతలు కూడా తేరిపార చూడ లేరు. అర్జునుడు కూడా భేదింప లేని వ్యూహము రేపు పన్నుతాను. నీవు క్షత్రియ ధర్మము ప్రకారం యుద్ధం చెయ్యి. వేదవేదాంగాలు అభ్యసించి, యజ్ఞయాగాదులు చేసిన నీవిలా మృత్యువుకు భయపడ తగునా ! యాదవులు, పాండవులు, కౌరవులు మొదలైన ఎవరైనా ఈ భూమిపై శాశ్వతులా కాలం తీరగానే అందరూ పోవలసిన వారే కదా ! మహా మునులు యజ్ఞము చేసి పొందు ఫలం వీరులు యుద్ధభూమిలో మరణించిన పొందవచ్చు. కనుక నిశ్చింతగా ఉండు " అన్నాడు. ఆ మాటలకు ఊరట చెందిన సైంధవుడు సుయోధనునితో కలిసి తమ శిబిరానికి వెళ్ళాడు. ఇరుపక్షముల సైన్యాలు జరిగిన విషాదం తలపక రేపటి యుద్ధము గురించి ఆలోచించ సాగారు. సుయోధనుడు మరునాటి యుద్ధానికి సమాలోచనలు జరుపుతున్నాడు. ధర్మరాజు పాంచాల, కేకయ, మత్స్య, పాండ్య, యాదవ రాజులను మరునాటి యుద్ధానికి సమాయత్త పరుస్తున్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సాధించాలి

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏          🏵️ *సాధించాలి అనే సంకల్పం, పట్టుదల నీ మదిలో కలగకపోతే ఎప్పటికి నీవ్వు చేతగాని చవట లాగే ఉండిపోతావు..వేటిని గుర్తు పెట్టుకోవాలో వాటిని మర్చిపోయి, వేటిని మర్చిపోవాలో వాటిని గుర్తుంచుకోవడమే మనిషికి జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలకు మూలం..దానివల్ల జీవితం నాశనం చేసుకుంటారు*🏵️జీవితంలో గెలుస్తామా! ఓడిపోతామా! అనేది ముఖ్యం కాదు...జీవితంలో సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం..కష్టాలను తప్పించుకుని జీవించడం కాదు.. వాటిని అధికమించడమే నిజమైన గొప్పతనం..మంచి ఆలోచనతో కష్టపడి పని చేస్తే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి🏵️నమ్మకం ప్రాణం లాంటిది.. పొతే తిరిగి రాదు..ప్రపంచములో అతి విలువైనది చేజార్చుకుంటే  మళ్ళీ దొరకనిది *సమయం* దాన్ని అతి పదిలంగా మధురంగా అతి భద్రంగా ఉపయోగించండి.. ఎందుకంటే ఆ *సమయం* ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది🏵️సమస్త గ్రంథాలలో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉంది..ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు..ఈ విశ్వంలో నీవు దేనినైనా సాధించగలవు.. ఎప్పుడూ దౌర్భాల్యానికి లోనుకాకు..సమస్త శక్తి నీలో ఉంది🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్  ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ


యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ 

నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా (57)


యదా సంహరతే చాయం కూర్మో௨0గానీవ సర్వశః 

ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా (58)


స్నేహవ్యామోహాలు లేకుండా వ్యవహరిస్తూ శుభాశుభాలు కలిగినప్పుడు సంతోషం, ద్వేషం పొందకుండా వుండేవాడు స్థితప్రజ్ఞుడు. తాబేలు తన అవయవాలను లోపలికి ఎలా ముడుచుకుంటుందో అలాగే ఇంద్రియాలను సర్వవిధాల విషయసుఖాలనుంచి మళ్ళించిన వాడు స్థితప్రజ్ఞుడవుతాడు.

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


                        𝕝𝕝 *ఉ* 𝕝𝕝 

*దానము లేని సంపదలు, ధాన్యము లేని గృహంబు, శిష్టసం*

*తానము లేని వంశమును, తాలిమి లేని తపంబు నాత్మ వి*

*జ్ఞానము లేని విద్యయు, ప్రశంనత లేని నృపాలు సేవయున్*,

*వానలు లేని సస్యములు, వన్నె కెక్కవు ధర్మనందనా!*


*భావం* :- *దానము చేయని సంపద, ధాన్యము లేని యిల్లు, బుద్ధిమంతులైన బిడ్డలు లేని వంశము, ఓర్పు లేని తపస్సు, ఆత్మ జ్ఞానము లేని విద్య, ఎప్పుడూ కోపముగా చిర్రుబుర్రులాడు రాజు దగ్గర కొలువు, వానలు లేకుంటే పంటలు వన్నె కెక్కవు.*


 ✍️🪷🌹💐🙏

పోతనగారి రూపచిత్రణ !



పోతనగారి రూపచిత్రణ !


             శా: తాటంకాచలనంబుతో భుజనటధ్ధమిల్ల బంధంబుతో ,


                   శాటీముక్త కుచంబుతో , నదృఢ చంచత్కాంచితో ,శీర లా

                   

                 లాటేపముతో , మనోహర కరా లగ్నోత్తరీయంబుతోఁ ,


                గోటీందు ప్రభతో , నురోజభర సంకోచద్వలగ్నంబుతోన్;


                   భాగవతము- దశమస్కంధము- గజేంద్ర మోక్షము- బమ్మెఱపోతన ;


                     


                     బమ్మెఱ వారి రూపచిత్రణము బాపూ బొమ్మను బోలియుండును. భాగవతములోని ఆయాఘట్టములలో నతడు జూపిన ప్రతిభ నాన్యతో దర్శనీయము. ప్రకృత పద్యము గజేంద్ర మోక్షములోనిది. భక్తరక్షణా పరాయణుడగు నారాయణుడు.

గజేంద్రుని మొఱవిని వైకుంఠమునుండి సపరివారముగా బయలుదేరినాడు. ఆకాశమార్గమున పరుగు లెత్తు చున్నాడు. చీరచెంగు

నారాయణుని చేతజిక్కి లక్ష్మీదేవియు నతనివెనుక బరుగిడ సాగినది. అపుడామెయవస్థారూపమును పోతన బహురమ్యముగా

చిత్రించినాడు. 


                  తాటంకా చలనంబుతో- తాటంకములంటే కర్ణాభరణాలు అవి అటునిటు ఊగుతున్నాయట. 

                  భుజనటత్ ధమ్మిల్ల బంధంబుతో- ధమ్మిల్లము - అంటే జుట్టుముడి . అది ఊడిపోయి కేశసంపద భుజములపై జీరాడుచు

                  న్నదట.

                   శాటీ ముక్త కుచంబుతో- రెవిక ముడివిడింది వక్షోజ సంపద బయటకు కనిపిస్తోందట.

                    అదృఢ చంచత్కాంచితో-కాంచి - అంటే వడ్డాణం అదికాస్తా వదులై క్రిందికి జారుతున్నదట.

                    ఉశీర లలాటేపముతో- ఉశీరములు అంటే వట్టివేళ్ళు- చలువ గలగటంకోసం ఫాలభాగంలో  

                     వట్టివేరుల రసం పట్టీలా వేసుకుంటారు. అదికరగిపోయి క్రిందికి జారుతున్నది.

                   మనోహర కరాలగ్నోత్తరీయంబుతో- మనోహరుడు ఆమెభర్తగారు విష్ణువు ఆయనచేతిలో ఈమె చీరచెంగు

                    చిక్కుబడినదట.

                     కోటీందు ప్రభతో- కోటి చంద్రులకాంతితో వెలిగిపోతున్న ముఖమండలముతో నున్నదట.

                     ఉరోజ భర సంకోచత్ వలగ్నంబుతోన్- పాలిండ్ల బరువుకు ఈమెనడుము నిలుచునా లేదా? యను ననుమానము

                    నకు తావిచ్చు చున్నదట.


                      మొత్తంమీద భావమిది; హరితో ఆకాశ వీధిలో పరుగిడు నప్పుడు లక్ష్మీదేవి యాకారమిటులున్నది.


                      కదలుచున్న కర్ణాభరణములు. కొప్పువిడి భుజములపై తారాడు కేశములు. ముడివిడివిడి రెవిక నుండి వెలికి 

                      గనబడు పాలిండ్లు. క్రిందికి జారుచున్న వడ్డాణము. కరగి క్రిందకు జారు వట్టివేరుల గంధము. మగనిచేత చిక్కు

                      కొన్న చేలచెరగు. కోటిచంద్ర ప్రభా భాసమానమైన ముఖమండలము. పాలిండ్ల వ్రేగున వణకు నడుము గలిగి

                       చూపరులకు వింత గొల్పు చున్నదట!


                               

                                ఇదీ పోతనగారి రూప చిత్రణ! మనో నేత్రాలతో దర్శించి ఆనందాన్ని పొందండి!


                                                                             స్వస్తి!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟🌷🌷🌷🌟🌷🌷🌷🌷🌷

గుహుని రామభక్తి!

 శు భో ద యం 🙏


గుహుని రామభక్తి! 


             చ:  "సుడిఁగొని  రామపాదములు  సోకిన  ధూళివహించి  రాయి  యే


                      ర్పడ  నొక భామ  యయ్యెనట!::,పన్నుగ  నీతని  పాదరేణువి


                      య్యడ  వడిసోఁక  నిది  యేమగునో యని   సంశయాత్ముఁడై


                    కడిగె  గుహుండు  రామ పదకంజయుగంబు   భయంబు  పెంపునన్. 


                       మొల్లరామాయణము---  కుమారి  మొల్ల కవయిత్రి;  


                                    సరళతరమైన  మనోజ్ఙమైన  రామాయణ  రచనగా  ఆంధ్ర సాహిత్యంలో  మొల్లరామాయణానికి  విశిష్టమైన

స్థానం ఉంది. చదువరులకు  విసుగు జనించనిరీతి నాసాంతము  నొప్పారెడు యీగ్రంధము.మన సాహిత్య సంపదకు వెలలేని యలం

కారము.


                    రాముడు  సీతా లక్ష్మణ సమేతుడై  దండకారణ్యమునకు బోవునపుడు  గంగను  దాటు  సందర్భమున  నీపద్యము చోటుచేసికొన్నది.  గుహుడు  నావను నడపి జీవించువాడు. పామరుడే కాని గుండెలనిండుగా రామభక్తి కలవాడు.

నదీతరణమొనరింప  రాముడు నావ నెక్కునపుడు  గుహుడాతని  పదపద్మములను  ప్రక్షాళనమొనరించెనట!  దానికొక హేతువు

నీకవయిత్రి కమనీయముగా  సూచించుచున్నది. 


                         ఆటవికుడు  పామరుడును అయిన గుహునకు  సందేహముకలిగినదట. ఏమని?  వెనుక  గౌతమాశ్రమ సందర్శన 

సమయమున  రాముని  పాదరజము సోకి  ఒక రాయి  వనితామణియైనదని  విన్నాడు. మరి రామపాద మహిమచే తన నావ గూడ

నట్లయినచో  తనగతియేమి? జీవికయా పోవును. సవతి పోరు ప్రారంభమగును. ఇదీ వాని సందేహము.


                    తత్పరిహారముగా  రాముని పద పద్మములను  గుహుడు కడిగినాడు  అని  మొల్ల  సమర్ధనము. 

దీనివలన

              రామపాద ప్రక్షాళణ పలమూ  వానికి దక్కినది. సందేహమూ తీరినది. ఎంత చక్కటి కల్పనము!  


                                                      స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వృషాధిపశతకంలోనిది

 

       ఈపద్యం  పాల్కురికి సోమన రచయించిన వృషాధిపశతకంలోనిది

      "

"బలుపొడతోలు  సీరయును బాపసరుల్ గరుపారుకన్ను వె

      న్నెలతల  చేదుకుత్తుకయు  నిండినవేలుపుటేరు పల్గుపూ

      సలుగలరేని లెంకనని  జానుతెనుంగున విన్నవించెదన్

      వలపు మదిందలిర్ప బసవా   బసవా  వృషాధిపా!!"

     మచ్చలుగల గజచర్మమే వస్ర్తం. పాములేహారాలు .  వంకరటింకరకళ్ళు . వెన్నెలనిండినతల. నెలవంకధారణ.

      కంఠంలోవిషం.  తలపైనగంగ. పుర్రెలహారం .,ఇదీ ఆయవ వ్యవహారం.

 

పరమశివా! 

ఇట్టినీకుసేవకుడనని ప్రేమతోపలుమార్లు  జానుతెనుగులో విన్నవిస్తాను

       బసవా బసవా అంటూస్మరిస్తాను

           అంటూకవివృషాధిపశతకం రచించాడు. ఇందులో మనం గమనింపతగినది  "జానుతెనుగు'-   అంటేనాటి వ్యవహారంలోఉన్న

           తెలుగన్నమాట',


పైపద్యస్వరూపమంతాజానుతెనుగే!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐🌷🌷🌷

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం  - సప్తమి - రోహిణీ -‌‌ గురు వాసరే* (06.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

06.03.2025,గురువారం

 06.03.2025,గురువారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం

తిథి:సప్తమి మ3.39 వరకు

వారం:బృహస్పతివాసరే (గురువారం)

నక్షత్రం:రోహిణి తె4.34 వరకు

యోగం:విష్కంభం రా12.53 వరకు

కరణం:వణిజ మ3.39 వరకు

తదుపరి విష్ఠి రా2.41 వరకు

వర్జ్యం:రా9.00 - 9.31

దుర్ముహూర్తము:ఉ10.14 - 11.01 మరల మ2.55 - 3.42

అమృతకాలం:రా1.32 - 3.03

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి: వృషభం

సూర్యోదయం:6.20

సూర్యాస్తమయం:6.03




కాలం భగవంతుని స్వరూపం. ఈ సష్టిలో అత్యంత బలమైనది కాలమే. కాలానికి సమస్త జీవరాశీ వశపడవలసిందే. కాలానికి లొంగకుండా బతకగలిగినది ఈ సష్టిలో ఏదీ లేదు. అందుకే శ్రీ రామాయణంలో కాలం గురించి చెబుతూ...‘‘కాలోహి దురతి క్రమః’’ అంటారు మహర్షి. అంటే ..కాలాన్ని దాటడం, తనకు వశం చేసుకోవడం, దాన్ని కదలకుండా చేయగలగడం...లోకంలోఎవరికీ సాధ్య పడదు–అని. సాధారణ సిద్ధాంతంలో అందరూ కాలానికి వశపడవలసిందే.


కాలంలో పుడతారు, కాలంలో పెరుగుతారు, కాలంలోనే శరీరాన్ని విడిచి పెడతారు. అందరూ కాలానికి వశపడి ఉంటారు. కానీ ఎవడు భగవంతుడిచ్చిన జీవితం అనబడే ఈ శరీరంతో ఉండగలిగిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు తన శరీరాన్ని విడిచి పెట్టేసిన తరువాత కూడా కీర్తి శరీరుడిగా నిలబడిపోతాడు. ఆయనకి కీర్తే శరీరం అవుతుంది. ఆయన కాలంతో సంబంధం లేకుండా యుగాలు దాటిపోయినా కూడా కొన్ని కోట్ల మందికి ప్రేరణగా అలా నిలబడిపోతాడు. అందుకే మనుష్యుని జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడేది – కాలం విలువను గుర్తించడం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఎవడు కాలం విలువని గుర్తించలేడో ఎవడు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదో వాడు కాలగర్భంలో కలిసిపోతాడు. ఆ జీవితం ఏ విధంగా కూడా ఉపయోగకరం కాదు. తనను తాను ఉద్ధరించుకోవడానికిగానీ, మరొకరిని ఉద్ధరించడానికిగానీ పనికిరాడు.