2, డిసెంబర్ 2020, బుధవారం

ఆరోగ్యం

 💟🌳💟


ఒక తరగతి గదిలో ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకి ఒక చేతిలో నీటితో నింపిన గ్లాసుని చూపించి దాని బరువు ఎంత ఉంటుందో చెప్పమని అడిగింది..

 ఆ ప్రశ్నకి చాలా మంది విద్యార్థులు సుమారు 150 గ్రా ,, ఉంటుంది అని చెప్పగా....

 ఉపాధ్యాయురాలు వివరణ ఇస్తూ....

 వాస్తవానికి దీని బరువు తక్కువే కావొచ్చు 

దీనిని ఒక నిమిషము పాటు పట్టుకొని చూస్తే కొంత బరువు అనిపించొచ్చు 

అదే గ్లాసును ఒక గంట సేపు పట్టుకొని చూస్తే భుజం నొప్పి వోచే అంత బరువు అనిపించవొచ్చు....

అదే గ్లాసుని ఒకరోజు మొత్తం మోస్తూ చూస్తే మరుసటి రోజు నా చేయి పని చేయనంత బరువు అనిపించొచ్చు ...

అలానే మనకు కలిగిన బాధని ఒక నిమిషం పాటు ఆలోచించి వొదిలేస్తే అది మనలో ఎటు వంటి ప్రభావం చూపించదు సంతోషంగా జీవించవచ్చు..

ఆలా కాకుండా కలిగిన బాధనే గంటల తరబడి రోజుల తరబడి ఆలోచిస్తూవుంటే మనం మానసికంగా కృంగిపోయే  అవకాశం ఉంటుంది...

 కాబట్టి కలిగిన బాధని లేదా కష్టాన్ని ఎలా అధిగమించాలని ఆలోచించటం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో తప్పకుండ మార్పు రావటం మిరే గమనిస్తారు..

చివరిగా ఒక మాట ఈ భూమి మీదా కస్టాలు లేని జీవి లేదు ఎంతటి ధనవంతుడైన ఎంతటి అదృష్టవంతుడయిన ఒకానొక సమయంలో కష్టాలను బాధలను అనుభవించిన వల్లే కాకపోతే వాళ్లలో చేసుకున్న ఆలోచనలో మార్పు వలన ఈ రోజు సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు.....

 కాబట్టి బాధపడితే ఆరోగ్యం పాడు చేసుకోవటం తప్ప ఏమిఉండదు

మీ ఆలోచనలలో మార్పు తెచ్చుకొని ఆ బాధలు కష్టాల నుండి ఎలా బయటపడాలి అని ఆలోచన చేయటం మొదలుపెడితే తప్పకుండ విజయం సాధిస్తారు.

 జీవితంలో సంతోషం గ ఉంటారు 

కాబట్టి మీ జీవితం  మీ యొక్క ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది అని నేను నమ్ముతాను.


💟🌳💟 🌳💟🌳 💟🌳💟

తాపత్రయం

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



                 _*తాపత్రయం :*_

                   ➖➖➖✍️


_*తాపం అంటే దుఃఖం. త్రయం అంటే మూడు. త్రి విధ దుఃఖాలే తాపత్రయం, తాపాలు మూడు రకాలు.*_


_*1) ఆధ్యాత్మిక తాపం: మనలోని కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల వలన కలిగే బాధలనే 'ఆధ్యాత్మిక' తాపాలంటాం.*


*ప్రతి మనిషికి ఉండే బాధల మొత్తంలో 90% ఈ విధంగా ఎవరికి వారు కల్పించుకుంటున్న బాధలే !*_


_*2) ఆది భౌతిక తాపం : ఇతర ప్రాణికోటి వలన కలిగే తాపాలని 'ఆది భౌతిక తాపా'లంటారు.*


*ఇతరుల అజ్ఞాన, అక్రమ చర్యల వలన మనకు కలిగే బాధలు అన్నమాట. ప్రతి మనిషికి 9% బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.*_


_*3) ఆది దైవిక తాపం : ప్రకృతి సహజమైన మార్పుల వలన కలిగే తాపాలని 'ఆది దైవిక తాపాలు' అంటాం.*_


_*ఉదాహరణకు : అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు మొదలైనవి. 1% బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.*_


_*తాపత్రయాలు లేని స్థితే ముక్త స్థితి.*_  


_*ఆత్మ జ్ఞానం వల్లనే ముక్తి సంప్రాప్తిస్తుంది.*_✍️


                      🌷🙏🌷



   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Sri Gayatri December

 https://drive.google.com/file/d/1BtFqsFvGRMf0wd6y7bQ5VqBkQihnoVeU/view?usp=drivesdk

సంకష్టహర చతుర్థి

 #రేపు సంకష్టహర చతుర్థి


సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.

ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.

ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ )

ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.

ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.

ఓం గం గణపతయే నమః 


సంకటహర గణపతి స్తోత్రం


ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం 

భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం

లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ

సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం

నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం

ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్

ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం

నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో

విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం

పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్

జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్

సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః 


సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ.


ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తలకించ సాగాడు.

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమా నం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!

అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉప వాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయా న నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతు ర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల న ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పా టు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.

వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.


అంగారక చతుర్థి


సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితిమంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలోకుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి.

ఓం గం గణపతయే నమః

సంకష్టహరచవితి వ్రత విధానం :

సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.

వినాయక వ్రతం

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.

ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. “సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు”. పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 ‘చవితి ‘లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.

ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి.

ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.

ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.


సంకష్టహర చతుర్ధి ఉపవాసంతో స్వర్గలోక పయనం 


భాద్రపద శుద్ధ చవితి వినాయకచవితి. నిజానికి వినాయకునికి ప్రతి నెలా చవితి రోజు మహా ఇష్టమైన రోజని చెప్తారు పెద్దలు. అందుకే ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి నాడు ఉపవాసం ఉంటారు కొందరు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధిని ''సంకటహర చతుర్థి'' లేదా ''సంకష్టహర చతుర్ధి'' అంటారు. ఈ ''సంకష్టహర చతుర్ధి'' గనుక మంగళవారం నాడు వస్తే ''అంగారకి చతుర్ధి'' అంటారు.

పూర్వం భ్రుశుండి అనే మహర్షి ఉండేవాడు. ఆయన వినాయకుని భక్తుల్లో అగ్రగణ్యుడు. తాము కూడా ఆదర్శంగా మారాలని ఎందరో భ్రుశుండిని చూసేందుకు వెళ్ళేవారు. భ్రుశుండి మహర్షి ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే ''సంకష్టహర చతుర్థి'' లేదా ''సంకష్ట చతుర్ధి''నాడు వినాయకుని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండేవాడట. ఇలా ''సంకష్ట చతుర్ధి'' నాడు చేసే పూజ, ఉపవాసాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత పుణ్యం వస్తుందో తెలిపే కథ చూడండి...

ఒకసారి దేవలోక అధిపతి ఇంద్రుడు, భ్రుశుండిని దర్శించుకుని పుష్పక విమానంలో తిరిగి వెళ్తున్నాడు. ఆ దివ్య విమాన కాంతులు ధగధగాయమానంగా ఉన్నాయి. ఆ ఊళ్ళో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్ర విమానాన్ని ఆశ్చర్యంగా చూశాడు.

దేవేంద్రుని విమానం కిందికి దిగివచ్చింది. ఆ ధ్వనికి అందరూ విడ్డూరంగా చూశారు. ఇంద్రుడు వెనుతిరిగి వచ్చిన కారణం ఏమిటని అడిగారు.

''ఇక్కడ ఎవరో చాలా పాపాలు చేసిన వ్యక్తి దృష్టి దీనిపై పడింది.. అందుకే విమానం కిందికి వచ్చింది'' అన్నాడు.

''మరి, ఇప్పుడు పైకి ఎలా లేస్తుంది.. తిరిగి వెళ్ళడం ఎలా దేవా?''అనడిగారు అంతే ఆశ్చర్యంగా.

''ఇంద్రుడు చిరునవ్వు నవ్వుతూ ''ఈరోజు పంచమి.. నిన్న చతుర్ధి నాడు మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నారేమో చూడండి.. ఒకవేళ అలా ఎవరైనా నిన్నటి రోజు ఉపవాసం ఉండి ఉంటే, వారి దివ్య దృష్టి ఈ విమానం మీద ప్రసరిస్తే, ఇది తిరిగి బయల్దేరుతుంది...'' అన్నాడు.

వాళ్ళు ఊరంతా విచారించారు. కానీ, ఒక్కరు కూడా ముందురోజు ఉపవాసం లేరని తేలింది.

దేవేంద్రుడు బాధపడుతూ ఉండగా, వినాయకుని భటులు ఒక చనిపోయిన స్త్రీని తీసికెళ్తూ కనిపించారు.

ఇంద్రుడు చూసి, ''అదేంటి, అన్ని పాపాలు చేసిన స్త్రీని యమదూతలు కాకుండా మీరెందుకు తీసికెళ్తున్నారు" అనడిగాడు.

''నిజమే.. ఆమె ఉత్తమురాలేం కాదు. కానీ నిన్న అనుకోకుండా రోజంతా నిద్ర పోవడంవల్ల ఆమె భుజించలేదు. రోజంతా ఉపవాసం చేసి, ఈరోజు ఉదయం లేచిన తర్వాతే తింది. అలా ఆమెకి తెలీకుండానే నిన్న చతుర్ధినాడు ఉపవాసం ఉంది. అందువల్ల ఆమెని మేం తీసుకువెళ్తున్నాం'' అని చెప్పారు.

అంతా విన్న తర్వాత ఇంద్రుడు ''సరే, ఆమె పుణ్యాన్ని కాస్త ఇటు ప్రసరింపచేయండి..'' అన్నాడు.

''క్షమించండి, అలా కుదరదు స్వామీ'' అంటూ వారు వెళ్ళిపోయారు.

అయితే, ఆమె మీది నుండి వచ్చిన గాలితో విమానం బయల్దేరింది. చతుర్ధి నాటి ఉపవాసం చేసిన మహిమ అలాంటిది.


అసలు సంకష్టహర గణపతి వ్రతమంటే ఏమిటి?


గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.


సంకటహర గణపతి :


సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తూ ఉంటాయి. అయితే మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి మరింత అరుదు. అదే వచ్చే నెల రెండో తారీఖున రాబోతున్న అద్భుత ముహూర్తం.

వ్రత కథ :


పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.


సంక్షిప్త వ్రత విధానం :


1. సూర్యోదయమవకముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమూ, నిత్య పూజ పూర్తి చేసుకోవాలి.

2. తరువాత గణేశుని తలచుకొని ఆరోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పించుకోవాలి.

3. పగలంతా ఉపవాసంగాని, అల్పాహారంతోగాని ఉండాలి. నిష్ఠతో గడపాలి.

4. సాయంత్రమవగానే తెల్ల నువ్వులూ, ఉసిరి కలిపి నూరిన చూర్ణంతో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి.

5. మట్టితో గణేశుని ప్రతిమచేసిగానీ, పసుపుతో మూర్తిని చేసిగానీ గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి.

6. ధూప, దీపములూ, పుష్పాలంకరణ చేసి, తప్పనిసరిగా గరిక చిగుళ్ళతో పూజించాలి.

7. మూడు ఐదు లేదా ఏడు ఆకులు గల గరికలను, యిరవయ్యొకటి లేదా అంతకంటే ఎక్కువగానీ కనీసం ఒక్కటైనాగానీ సమర్పించాలి.

8. నలభై ఎనిమిది నిముషాలపాటు ఏదైనా గణేశ మంత్ర జపం చేయాలి.

9. గణేశునికి నైవేద్యం సమర్పించి, హారతినివ్వాలి.

10. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించాలి.

11. తప్పనిసరిగా చంద్రుని చూచి, చంద్రునికీ చతుర్థీ తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.

12. తరువాత పూజామందిరంలోకి వెళ్ళి గణేశుని, "సంకటాం మాం నివారయ" (నా సంకటములను తొలగించు) అని వేడుకుని, నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.

13. భోజన సమారాధన జరిపి, తరువాత తానూ భుజించాలి.

14. రాత్రంతా గణేశుని స్మరిస్తూ, కీర్తిస్తూ జాగారం చేయాలి.

15. తరువాత రోజు ఉదయం గణేశునికి సాధారణ పూజ చేసి, మళ్ళీ పూజించే అవకాశం అనుగ్రహించమంటూ స్వస్థానానికి తిరిగి వెళ్ళమని ప్రార్థించాలి.

16. తరువాత గణేశ నిమజ్జన కార్యక్రమం చేయాలి.


నిజానికి ఎంతో సులువుగా ఉన్నప్పటికీ, మనకు పూజలు అంతగా అలవాటు లేకపోవడంచేత, ఈ వ్రత విధిలో కొన్ని సందేహాలు రావడం సహజం. నాకు కలిగిన సందేహాల నివృత్తి కోసం గణేశ పురాణం శోధించగా,


1. అతి ముఖ్యమైన వ్రత విధి ఏమిటి

2. ఏ పూలు వాడాలి?

జ. మందారము వంటి ఎరుపు రంగు పూలు వినాయకునికి అత్యంత యిష్టం.

వినాయక చవితి నాడు తప్ప గణేశ్వరుని పూజలో ఎప్పుడూ తులసి ఆకులు గానీ పూలు గానీ వాడరాదు. కాబట్టి అవి నిషిద్ధం.

3. ఏ మంత్రం జపించాలి?

జ. గురువుచే ఉపదేశింపబడిన గణపతి మంత్రం అత్యుత్తమం. అయినప్పటికీ,

'గజానన' అనే నామ మంత్రంగానీ,

'సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః

లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః

ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రుణుయాదపి

విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా

సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య నజాయతే' అనే నామ స్తోత్రంగానీ జపించవచ్చు.

4. నైవేద్యం ఏమి సమర్పించాలి?

కుడుములు, ఉండ్రాళ్ళు, అరటి కాయలు, పాయసము, నువ్వులు

5. ప్రసాదం తెల్లవారిన తరువాత స్వీకరించాలా?

జ. కాదు. చంద్రోదయం తరువాత గణేశునికి నమస్కరించి ప్రసాదం తప్పనిసరిగా భుజించాలి.

6. రోజంతా గణేశ స్మరణలో గడపడానికి తేలికైన దారి ఏదైనా ఉందా?

జ. గణేశ పురాణం చదవడం (వినడం) లేదా గణేశునికై నైవేద్యాలు వండటం (సమర్పించడం). చేతనైతే నృత్య గీతాలూ మంచివే.

7. అర్ఘ్యం యివ్వటం తెలియకపోతే?

జ. నమస్కరించడం ఉత్తమం. తెలియని పూజావిధి తలకెత్తుకోవడం మంచిది కాదు.

8. పూజ చేయడం చేతకాదనుకుంటే?

జ. మంచి బ్రాహ్మణుని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వవిధాలా శ్రేయస్కరం. అయితే తప్పనిసరిగా పూజ పూర్తయిన వెంటనే దక్షిణ యివ్వండి.


వ్రతాచరణ వలన లాభాలు :


గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.


అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని, ఒక్కరోజు ఆచరిస్తే చాలు గణేశలోకంలో స్థానాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని, మళ్ళీ ఏడేళ్ళ తరువాత వచ్చినా అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో ఉండవో, ఈసారి తప్పక ఆచరిచి, మన అదృష్టాన్ని సార్థకం చేసుకుందాం. ఆ శక్తి పుత్రుని శక్తి సహితుని అనుగ్రహాన్ని పొందుదాం


పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రునికి, చతుర్థీ తిథికి, గణేశునికి నమస్కరించి భోజనం చేయండి. అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం. గణేశానుగ్రహం తప్పక కలుగుతుంది.


సంకటహర గణపతి ధ్యానం, ఏకవింశతి నామాలు


ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం

లంబోదరం విశాలాక్షం జ్వలత్పావకలోచనం

ఆఖుపృష్ఠ సమారూఢం చామరైః వీజితం గణైః

శేషయజ్ఞోపవీతం చ చింతయేత్తం గజాననం


ఏకవింశతి నామ పూజ :


ఓం సుముఖాయ నమఃమాలతీ పత్రం పూజయామిఓం గణాధిపాయ నమఃబృహతీ పత్రం పూజయామిఓం ఉమాపుత్రాయ నమఃబిల్వ పత్రం పూజయామిఓం గజాననాయ నమఃదూర్వాయుగ్మం పూజయామిఓం హరసూనవే నమఃదత్తూర పత్రం పూజయామిఓం లంబోదరాయ నమఃబదరీ పత్రం పూజయామిఓం గుహాగ్రజాయ నమఃఅపామార్గ పత్రం పూజయామిఓం గజకర్ణాయ నమఃజంబూ పత్రం పూజయామిఓం ఏకదంతాయ నమఃచూత పత్రం పూజయామిఓం వికటాయ నమఃకరవీర పత్రం పూజయామిఓం భిన్నదంతాయ నమఃవిష్ణుక్రాంత పత్రం పూజయామిఓం వటవే నమఃదాడిమీ పత్రం పూజయామిఓం సర్వేశ్వరాయ నమఃదేవదారు పత్రం పూజయామిఓం ఫాలచంద్రాయ నమఃమరువక పత్రం పూజయామిఓం హేరంబాయ నమఃసింధువార పత్రం పూజయామిఓం శూర్పకర్ణాయ నమఃజాజీ పత్రం పూజయామిఓం సురాగ్రజాయ నమఃగణ్డకీ పత్రం పూజయామిఓం ఇభవక్త్రాయ నమఃశమీ పత్రం పూజయామిఓం వినాయకాయ నమఃఅశ్వత్థ పత్రం పూజయామిఓం సురసేవితాయ నమఃఅర్జున పత్రం పూజయామిఓం కపిలాయ నమఃఅర్క పత్రం పూజయామి

వినాయక చవితి నాటి పూజకీ సంకటహర గణపతి పూజకీ తేడా కేవలం రెండు విషయాలలోనే. తులసీ పత్రం బదులు జంబూ పత్రం (నేరేడాకు) వాడటము, నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళకు తోడు నల్ల నువ్వులను సమర్పించడము.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

భగవంతుడు

 *🌸భగవత్తత్వం*🌸


భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. 


ఒక ఊళ్ళో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. జీవనోపాధి కోసం అతను మేకల్ని చంపి, వాటి మాంసాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతని మనసు కరడుగట్టింది. ముఖంలో క్రూరత్వం, మాటల్లో కాఠిన్యం ఉండేవి. అవి జనాన్ని అతనికి దూరంగా ఉంచేవి. చివరకు అతను అద్దంలో తన ముఖం చూసి తానే భయపడే స్థితికి చేరుకొనేవాడు. ఇంట్లో వాళ్ళు కూడా అతణ్ణి చూసి భయపడేవారు. ఈ స్థితి నుంచి బయటపడడం ఎలాగో అతనికి అర్థం కాలేదు. 


ఆ ఊరికి ఒక జ్ఞాని వచ్చాడు. పాపయ్య ఆయనను కలిసి, తన బాధంతా చెప్పుకొన్నాడు. తనకు ఓ దారి చూపించమని ఆయనను వేడుకున్నాడు.


‘‘నాయనా! నువ్వు భగవంతుణ్ణి ధ్యానించు. నీకు తప్పకుండా మేలు జరుగుతుంది’’ అన్నాడు జ్ఞాని.


‘‘అయ్యా! భగవంతుడు ఎవరు? అలా ఉంటాడు? నాకు తెలియజెయ్యండి’’ అని అడిగాడు పాపయ్య.


‘‘భగవంతుడు అంటే దయాసాగరుడు. ప్రేమ, కరుణ, శాంతి కలగలిసిన సముద్రం లాంటి రూపం ఆయనది. ఈ క్షణం నుంచీ ఆయన స్మరణలో ఉండడానికి ప్రయత్నించు. భగవంతుణ్ణి ధ్యానిస్తే  పాపకర్మలు నశిస్తాయి. అప్పుడే నువ్వు ఆ పరమాత్ముణ్ణి చూడగలవు’’ అని చెప్పాడు జ్ఞాని.


ఆయన ఆదేశం ప్రకారం పాపయ్య తన వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించాడు. భగవంతుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు. ఊర్లూ, వాడలూ తిరిగాడు. అడవులన్నీ వెతికాడు. గుడులూ, గోపురాలూ సందర్శించాడు. ప్రతి మనిషినీ నిశితంగా పరిశీలించాడు. జ్ఞాని చెప్పిన భగవంతుడి రూపం జాడలు ఎక్కడా కనిపించలేదు. విసిగి వేసారిన అతను ఒక ప్రశాంతమైన స్థలంలో చెట్టు కింద కూర్చొని, భగవంతుణ్ణి తలచుకుంటూ మధనపడసాగాడు. మనసులో ఏదో ఆరాటం... ఏదో తెలియని బాధ... అతనికి తెలియకుండానే కనురెప్పలు బరువెక్కి మూతపడ్డాయి. శరీరం తేలికయింది. క్షణాలు నిమిషాలయ్యాయి. అలా ఎన్ని గంటలు గడిచాయో తెలీదు. శరీరం ఉన్నదో లేదో తెలియని స్థితికి లోనయ్యాడు. ఏదో తెలియని ఆనందం... ఒకదాని వెనుక ఒకటిగా అనుభూతుల పరంపర... అతని చుట్టూ అపరిమితమైన వెలుగు. 


ఎప్పటికో మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. అంతా కొత్తగా ఉంది. తిరిగి జ్ఞాని దగ్గరకు వచ్చి, ఆ అనుభవం గురించి చెప్పాడు.


అప్పుడు జ్ఞాని ‘‘నీలోని తపనే నీకు మార్గదర్శకం అయింది. ఇంతకాలం నువ్వు ప్రాపంచిక విషయాలతో కలిసి బతికావు. ఇప్పుడు నీకు బాహ్య విషయాల మీద వైరాగ్యం కలిగింది. అదే నిన్ను అంతర్ముఖుణ్ణి చేసింది. ఇప్పుడు నీ మనసు దానంతట అదే లోలోపల నెమ్మదిస్తుంది. ఆ నిర్మలమైన మనసు నిన్ను ప్రేమమయుణ్ణి చేస్తుంది. నీ మాట, చూపు, ప్రవర్తన అన్నీ శాంతిమయం అవుతాయి. పరమాత్మ గుణాలనూ, శక్తులనూ నీలోలోపల ధారణ చేయడమే మహోన్నతమైన తపస్సు. దాన్ని సాధన ద్వారా మాత్రమే పొందగలవు’’ అని చెప్పాడు.


భగవంతుడు ఆకాశంలోనో, గుడిలోనో... ఏదో లోకంలో సింహాసనం మీద కూర్చొనో మనల్ని పరిపాలిస్తున్నాడనుకుంటాం. అయితే భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. భగవంతుడివైపు దారి కనిపిస్తుంది. మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. ఈ కథలోని పాపయ్యలాగే ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత క్రూరత్వం, కాఠిన్యం ఉంటాయి. ఆయుధాలతో బాధించేవాడే కాదు, ఎదుటి మనిషిని మాటలతో బాధపెట్టేవాడు కూడా క్రూరుడే! అందుకే ప్రతి మనిషీ తన అంతరంగంలోకి తొంగి చూసుకోవాలి. తనను తాను తెలుసుకోవాలి. అప్పుడే అతడిలో చైతన్య శక్తి ప్రజ్వరిల్లుతుంది. 

🌹🌹🌹🌹🌹🌹🌹

నిర్వాణషట్కము

 దశిక రాము**


**జగద్గురు ఆదిశంకర విరచితము**

**నిర్వాణషట్కము**

**ఆత్మషట్కము**

4వ శ్లోకము. 

విశ్లేషణ : శాస్త్రి ఆత్రేయ (ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

4వ శ్లోకము :

**న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం।**

**న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా।**

**అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా।**

**చిదానంద రూపః శివోహం।శివోహమ్॥**

అర్ధము :
పుణ్యపాపాలు, సుఖదుఃఖాలు నాకులేవు. నాకు మంత్రము, క్షేత్రములు, వేదములు, యజ్ఞములతో పనిలేదు. నేను భోజనాన్ని కాను, భోజ్యమును కాను, భోక్తను కూడా కాను.
నేను చిదానందరూపుడైన శివుడను! శివుడను తప్పా వేరవరినీ కాను॥

విశ్లేషణ :
జీవునికి, భగవంతుడికి ఉపాధికి సంబంధించిన అనేక భేదములు యున్నప్పటికీ "చైతన్యాంశ" మాత్రము యిరువురుకి సమానమే కావునా జీవేశ్వరులిరువురును ఒకటే! పరమాత్మకు వున్న లక్షణాలే జీవాత్మకు కూడా వున్నాయి.

పాపపుణ్యాలు, సుఖదుఃఖాలు, మంత్రపఠనాలు, క్షేత్రదర్శనాలు, వేదాధ్యయనాలు, యజ్ఞయాగాదులు ఇత్యాదివి జీవుడు కల్పించుకున్నావే గాని నిజంగా జీవాత్మకు వాటితో సంబంధంలేదు, వాటి అవసరం అంతకన్నా లేదు కారణం పరమాత్మే జీవాత్మ కాబట్టీ! 

కొంచెము ఆలోచిస్తే వీటి వలన కలిగే సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు, ఆనందం, అనుభూతి మనలోనే వుంది గాని వాటిలో లేదు. కారణం ఇవి కొందరికి కలిగించిన అనుభూతి వేరొకరికి కలిగించక పోవచ్చు. అలాగే వాటిద్వారా పొందిన ఫలితం, అనుభవించిన కొన్నాళ్ళకు పోయి దానియందు విసుగు పుట్టవచ్చు. అప్పుడు ఆనందము, సౌఖ్యం కోసం ఇంకో కొత్తమార్గాన్ని వెతుక్కుంటాము. అక్కడ దొరక్కపొతే అసహనం, కోపము కలిగి అశాంతికి లోనౌతాము. 

అంటే మునుజులు పొందుతున్న ఆనందము, అసహనం, కోపము వారిలోనే వున్నాయి కానీ బయట లేదన్న విషయము బోధపడుతుంది. ఒకవేళ ఆ సుఖము వస్తువులోనే వుంటే, అది అందరికీ, అన్నివేళలా ఆనందాన్ని కలిగించాలి కదా! మనుజులలో నున్న అజ్ఞానమే బాహ్య వస్తువులందు సుఖభ్రాంతికి కారణము. 

మానవుడు గాఢనిద్రలో నున్నప్పుడు, బాహ్యవస్తువులను మరచి, వాటియందు ఆసక్తిని విడచి, దుఃఖములను కూడా మరచి, తనయందే ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నాడు కదా! 

జీవుడు జ్ఞానముతో చేసే కర్మను యజ్ఞమని అంటారు. యజ్ఞము చేయువాడు, హోమమొనర్చు ద్రవ్యములు, హుతమొనర్చు అగ్ని కూడా పరబ్రహ్మస్వరూపములే, ఇక్కడ యజ్ఞఫలితం కూడా బ్రహ్మార్పణమే అన్ని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. అందుకే యోగులు బ్రహ్మమనే అగ్నితో, ఆత్మచేత ఆత్మనే ఆహుతి చేస్తారు. జ్ఞానులు అలాంటి జ్ఞానమునే ఉపదేశిస్తారు. ఈ శ్లోకంలో ఆది శంకరులు బోధించింది అదే! 

చిదానంద రూపః శివోహమ్! అన్నదే జీవుని అసలు స్వరూపము!!

🙏🙏🙏

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం*

 **దశిక రాము**


**శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం** 


17 


త్రిశూల రాముని కధ –2


నారద మహర్షి హనుమంతునికి తాను వచ్చిన కార్యాన్ని ఇలా చెప్ప సాగాడు ”పూర్వం ”అసి”అనే రాక్షసుడు తపస్సు చే శివ్వున్ని మెప్పించాడు .వాడికి ”త్రిశూల రాముడు ”అనే కొడుకున్నాడు .అనేక ఏనుగుల బలం వున్నవాడు క్రూరుడు .వీడు శివుని కోసం గోదా వరి తీరం లో ఘోర తపస్సు ను అనేక సంవత్స రాలు చేశాడు .తన బలాన్ని చూసుకొని ,గర్వం తో ఇతరులను కించ పరచే వాడు .తపస్సు చేసుకొనే మునులను బాధించే వాడు .దేవతలను ఇబ్బంది పెట్టె వాడు .దేవతా స్త్రీలను బలాత్కారం చేసే వాడు .దేవరుషులను కూడా చులకన గా చూసే వాడు .దిక్పాలుర నందర్నీ అధికారాలకు దూరం  చేశాడు .పాపం వాళ్లకు భార్య ల దగ్గరకు వెళ్ళే సాహసం కూడా లేదు .నన్ను కూడా ఆ దుష్టుడు  బాధ పెట్టాడు .భయం అంటే ఏమిటో తెలీని నాకు వాడి వల్ల భయం ఎక్కు వైంది .మనశ్శాంతి గా తపస్సు చేసుకో లేక పోతున్నాను .ఇంక ఉపేక్షించి ఊరుకోవటం తగదని నువ్వు తప్ప వాడిని అదుపు లో పెట్టె వారెవ్వరూ లేరని ,నీ శరణు వేడ టానికి వచ్చాను .”అన్నాడు

హనుమ పరాక్ర మాన్ని ఒక సారి గుర్తు చేస్తూ ”హనుమా !పూర్వం బదరికాశ్రమం లో ”నర నారాయణ ఆకృతి ”దాల్చి ,ధ్యానం లో నువ్వు వున్నావు .అప్పుడు రాక్ష బాధ పొందుతున్న బ్రహ్మాది దేవతలు నర నారాయనుడవైన నిన్ను శరణు జొచ్చారు . రాక్షసుల నుండి తమల్ని కాపాడమని మరీ మరీ వేడుకొన్నారు నిన్ను .అప్పుడు నువ్వు గౌరీ శంకరులకు హను మంతుడు అనే పేరు తో జన్మిస్తానని ,బల వీర శ్రీ మంతుదవై సర్వ రాక్షస సంహారం చేస్తానని అభయం ఇచ్చావు .నీ మాటలు విని సంతోషించి నీకు కృతజ్ఞత తెలియ జేసి దేవతలు మళ్ళీ తమ స్థానాలకు వెళ్లి పోయారు .నువ్విప్పుడు మమ్మల్ని అనుగ్రహించాలి .త్రిశూల రాముడిని వధించి లోక కల్యాణం చేయాలి ”అని నారదుడు విన్న విన్చుకొన్నాడు .హనుమ వదిన్క్”లోక కంటకుడైనా వాడిని తప్పక వధిస్తాను ”అని అభయం ఇవ్వగా నారదుడు  దేవేంద్ర లోకానికి వెళ్లి పోయాడు .

ఇంద్ర లోకం లో సుధర్మ సభలో దేవేంద్రుడు కొలువు తీరి వున్నాడు .త్రిశూలున్ని వాదించే వారెవ్వరూ అనే విషయం మీద అక్కడ చర్చ జరుగు తోంది ఇంతలో దేవర్షి నారదుడు సభ లో ప్రవేశించాడు .దేవేంద్రుడు సకలోప చారాలతో స్వాగతం పలికి ఉచితాసనం పై కూర్చో బెట్టాడు .దేవ గురువు బృహస్పతి ని చూసి ఇంద్రుడు దైన్యం గా ఉండ టానికి కారణమేమిటో నని అడిగాడు .అప్పుడు గీష్పతి ”దేవర్షీ !నీకు తెలియని దేముంది ?త్రిశూల రాముడనే రాక్షసి శివుని వర బల గర్వం తో మమ్మలనందర్నీ పీడిస్తున్నాడు .దిక్పాలకలకే దిక్కు లేకుండా చేశాడు .యజ్న హవిర్భాగాలను ఇంద్రుడికి దక్క నీయటం లేదు .శ్రౌత స్మార్త కర్మ లన్నీ  భ్రష్ట మైనాయి . .నీ  రాక మాకందరికీ ఊరట కల్గించింది .ఇంద్రుని కష్టాలు పోయే ఉపాయం చెప్పా లని మేమందరం నిన్ను ప్రార్దిస్తున్నాం ”అన్నాడు .

నారదుడు ఇంద్రుని వైపు చూసి ,మనసు లో శ్రీమన్నారాయ నుణ్ణి   ధ్యానించి”దేవ గురు బృహస్పతి వర్యా !పూర్వం మీరు శ్రీమహా విష్ణువు ను శరణు కోరిన సంగ తి మర్చి పోయినట్లుంది .ఆయన భూలోకం లో ఆంజనేయుని గా జన్మించి ,రాక్షస సంహారం చేస్తానని అభయం ఇచ్చిన సంగతి గుర్తు లేదా ? ఆంజనేయుడు పంపా తీరం లో వున్నాడు .రాక్షస సంహారం చేసి మీ అందరికి మేలు చేస్తాడు హనుమ ను స్మరిస్తూ వుండండి నేను కూడా హనుమ ను దర్శించి త్రిశూల రోముడిని   సంహరించమని వేడుకొని  వస్తున్నాను .”అని అభయమిచ్చి దేవర్షి వైకున్థం చేరాడు .

హనుమ కొంత కాలమ్ పంపా తీరం లోనే వుంది ఆ సరస్సులో నిత్యం జల క్రీడా లాడుతూ పిల్ల వాడి లాగా వినోదిస్తున్నాడు .ఒక రోజూ అకస్మాత్తు గా సామ గానం విన పడింది .తన పరి వారం తో అక్కడికి చేరాడు .వానరులన్దర్నీ మాట్లాడ వద్దని హెచ్చ రించా గా వారంతా చెట్లు ఎక్కి కూర్చున్నారు .హనుమ కూడా ఒక వ్రుక్షమేక్కి కూర్చున్నాడు .దూరం గా పొదల చాటు నుండి త్రిశూల రాముడు రావటం గమ నించాడు హనుమ .వాడిని చూసి ఋషులు భయ కంపితు లవుతున్నారు .రక్షించే వారి కోసం దిక్కులు చూస్తున్నారు .రాక్షసుడు అక్కడికి చేరి ,కశ్యపాది మహర్షులతో ”కాంది శీకలై పారి పోయిన మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది ?నేనే లోక నాయకుడిని .మీ యజ్న భాగం నాకే చెందాలి .”అని పళ్ళు పాట పటా కొరికి హవిస్సును సంగ్రహించటానికి ముందుకు వచ్చాడు .

అన్నీ చూస్తున్న హనుమ ఒక్క సారిగా చెట్టు మీద నుంచి రాక్షసుడి నెత్తి మీదకు దూకాడు .వాడు నేలపై పడి పోయాడు .మారుతిని గమనించి ఆకాశం లోకి ఎగిరాడు . తోకతో వాడి గొంతు బిగించి తిప్పి తిప్పి కొట్టాడు హనుమ .వాడి చూపు మందగించింది .ముక్కు నుండి రక్త   ధారలు స్రవించాయి వాడి భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు .హనుమ సాహసానికి ఆశ్చర్యం తో మునులు చూస్తున్నారు .మారుతి ని కింద పడేయ టానికి వాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు .రాక్షసుడు హనుమ తోక పట్టు కోని గిర గిరా తిప్పాడు మునులు భయ పడ్డారు .హనుమ కు ఆశీర్వచనాలు పలికారు .వాడు హనుమ వాలాన్ని పళ్ళ తో కొరికాడు .రాక్షసుణ్ణి తన్నుతూ పిడికిలి తో గుద్డుతూ వాడి ప్రాణాలకు ఎసరు పెట్టాడు ఆంజ నేయుడు .తన్ను చంప టానికి సాక్షాత్తు నారాయణుడే కపి రూపం లో వచ్చాడని తెలుసు కొన్నాడు .పరిగెత్తి కొండల మధ్య వున్న ”స్పటిక శిల ”చాటున దాక్కున్నాడు .వాడి వెంట బడి అక్కడికి చేరి ”గుండ క్రియా రాగం ”పాడాడు స్వామి హనుమ .ఆ రాగం తో స్పటిక శిల కరిగి నీరై పోయింది ..అక్కడున్న త్రిశూల రోముడిని వెంటనే చంపి దేవ మునులకు ఆనందం కల్గించాడు .ఈ కధ ఇంతటి తో సమాప్తం .


🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA

మాయాబజార్‌కు 61 ఏళ్లు -

 మాయాబజార్‌కు 61 ఏళ్లు - 


ఇలాటి కోటబుల్‌ కోట్స్‌ మాయాబజారు నిండా ఎన్నో వినబడతాయి. ఇవన్నీ సామెతల స్థాయికి ఎదిగిపోయాయి.


 'ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?',


 'ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉందిగా',


*'ఉద్దండపండితులే కానీ మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయా',*


 'పెళ్లి పెద్దలంటూ శుద్ధమొద్దులు తయారయారు',


*'ఉన్నమాటైనా సరే ప్రభువుల ఎదుట పరులను పొగడరాదు'* ,


 'చేతులు రాక కాదు - చేతకాక అని చెప్పు',  'మాలో గోటు అంటే గొప్ప అని అర్థం పండితులు తమకైనా తెలియదుటండీ' అని చినమయ అనగానే వెంటనే ఈ పండితుడు 'ఆ పై మాట నేను చెబుతా, తీట అంటే గౌరవం అంతేగా!' అంటాడు. పండితులను ముఖస్తుతితో ఎలా బోల్తా కొట్టించాలో గొప్ప ఉదాహరణ. 'పెళ్లి సందడిగా జరిపిస్తాన'ని కృష్ణుడు వదినగారికి మాట ఇస్తాడు. ఎలా కావాలంటే అలా అన్వయించుకునే వీలుంది. కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ జనజీవితంలో భాగంగా అయిపోయాయి కూడా ! ఇదివరకు ఏదైనా గొప్పపని చేస్తే 'మెచ్చి మేకతోలు కప్పడం' ఉండేదమో. మాయాబజారు వచ్చాక 'వీరతాడు' వేయడం మొదలయింది. అసలు ఆలోచిస్తే వీరతాడు ఏమిటి? దుష్టసమాసం కాదూ. అయినా జనం నోళ్లల్లో పడి యాక్సెప్టబుల్‌ అయిపోయింది. 


పాత్రల పేర్లలో కూడా ఓ తమాషా కనబడుతుంది. జాతకాల విషయంలో శంకించే ఆయన పేరు శంకుతీర్థులవారు. శశిరేఖ చేత చెంప చెళ్లుమని కొట్టించుకున్న చెలికత్తె పేరు చంప. రాజ్యవైభవాన్ని కోల్పోయి వచ్చిన అభిమన్యుణ్ని చూపించి కృష్ణుడు 'శశీ, చూశావా మీ బావ సత్యవంతుడై వచ్చాడు' అంటాడు. దానికి రుక్మిణి 'ఆయన సత్యవంతుడైతే, ఈమె సావిత్రి అవుతుంది' అంటుంది. రాజ్యం కోల్పోయినా భర్తను అంటిపెట్టుకుని ఉన్న పౌరాణిక పాత్రను గుర్తు చేస్తూ. పైగా అక్కడ ఆ పాత్ర వేసిన నటి పేరు కూడా సావిత్రే! మయుడు మయసభ నిర్మించిన విధంగా భ్రమలు కల్పించే మాయాబజారు నిర్మించిన ఘటోత్కచుడి శిష్యుడి పేరు - చిన్న మయ. మయసభ నిర్మించినవాడు సీనియర్‌ మయుడయితే ఇతను జూనియర్‌ మయుడన్నమాట. అలాగే గోడ ఆకారంలో వెళ్లి అభిమన్యుడిని అడ్డుకోబోయినవాడు - కుడ్యాసురుడు. శకుని పేరు వీళ్లు పెట్టినది కాకపోయినా 'లక్ష శనిల పెట్టు శకుని మామ' అనడానికి ఉపయోగించుకున్నారు. దుర్యోధనుడు చెప్పినది చెప్పినట్టు వెంటనే ఆచరించడం మరోటి ఎరుగని దుశ్శాసనుడికి ఊతపదం - మరి మన తక్షణ కర్తవ్యం? ఇవేకాక పింగళి ఈ సినిమాకోసం అనేక మాటలు సృష్టించి తెలుగుభాషకు అందించారు. అసమదీయులు, తసమదీయులు, తల్పం, గిల్పం, కంబళి, గింబళి, హైహై నాయకా, వైవై నాయకా, దవారం... !  

సినిమా వచ్చాక పింగళిని ఎవరో అడిగారు. 'దుర్యోధనుడు వీరాధివీరుడు, విశాల సామ్రాజ్యాన్ని పాలించిన రణధీరుడు. మరి అతని కొడుకు లక్ష్మణకుమారుడిని బొత్తిగా వెర్రి వెంగళప్పలా, వెకిలిగా చిత్రీకరించేరేం? 'తిరోగమించుటే మీకు తెలియును' అని అన్నా అర్థం తెలియనంత శుంఠా?' అని. దానికి ఆయన సమాధానం చెప్పాడు. 'భారతంలో అతను ధీరుడు, శూరుడు అని చెప్పలేదు. భారతయుద్ధంలో ప్రవేశించిన రోజే అభిమన్యుడి చేతిలో ఛస్తాడు. అటువంటివాడిని హాస్యానికి వాడుకుంటే తప్పేముంది?' అని. కానీ అందరూ పంచెలు కట్టుకుంటే లక్ష్మణుడు మాత్రం బొత్తిగా పైజమా వేసుకోవడం అదోలా ఉంటుంది. అతనేమైనా అరబ్బీ యువకుడా ఏమన్నానా? అతని చేత 'పెళ్లికూతురు మీద సర్వహక్కులూ నాకున్నాయి.' అని కూడా అనిపించేశారు. హక్‌ అన్నది ఉర్దూ పదం కదా, సర్వాధికారాలు అంటే సరిపోయేది. కానీ.. చల్తా హై.. హాస్యం కదా, పైగా రేలంగి. మనమేమీ నొచ్చుకోలేదు. లక్ష్మణకుమారుడి పాత్ర గురించి పింగళిగార్ని అడిగారు కానీ రేవతి గురించి చర్చేమీ జరిగినట్టు లేదు. ఒకవేళ రచయితను అడిగినా 'ఆవిడ ఉత్తమురాలు అని భారతంలో లేదు కాబట్టి కాస్త గయ్యాళితనం చూపిస్తే తప్పులేదు' అని సద్దేసేవారేమో! ఆవిడ గురించి కాస్త చెప్పుకుందాం. 


ఆడపడుచు మీద ఆవిడ విసుర్లు బ్రహ్మాండంగా ఉంటాయి. 'ఏ శోభలూ లేకుండా నీకు వలెనే నా కూతుర్ని కూడా పుట్టింట్లో పడి వుండమంటావా?' అనేస్తుంది. విభవం కోల్పోయి సుభద్ర వస్తే తలనొప్పి నటిస్తుంది. 'ఏ యింటికి వెళ్తే ఏంలే అమ్మా - నా కా పట్టింపులేమీ లేవు... ఇక అంతా ఇక్కడుండవలసిన వాళ్లమేగా.. ఈ పన్నెండేళ్లూనూ..!' అని ఎత్తిపొడుస్తుంది. చివర్లో సుభద్ర మాటకు మాట అంటిస్తుందనుకోండి. లక్ష్మణకుమారుడి సంబంధం కుదుర్చుకుని వచ్చాక ఆ విషయం సుభద్రకు చెప్పవద్దని మొగుడ్ని కట్టడి చేస్తుంది. గొప్ప సంబంధం అని మురిసిపోయినా చివర్లో పెళ్లిపీటల మీద అతని పిచ్చిచేష్టలు చూశాక తక్షణం మొగుణ్ని బ్లేమ్‌ చేస్తుంది - 'ఏమండీ మీరు ముందుగా అబ్బాయిని చూడలేదుటండీ' అంటూ. టిపికల్‌ వైఫ్‌ లాగ! బలరాముడు కూడా టిపికల్‌ కుటుంబపెద్దలా వ్యవహరిస్తాడు. సుభద్ర నిలదీసినప్పుడు 'ఈ ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావు' అని డిక్లేర్‌ చేసి తప్పుకుంటాడు. ఇరుకున పడ్డప్పుడు కోపం ప్రదర్శిస్తుంటారు ఇలాటి సందర్భాల్లో. 


ఇక కెవి డైరక్టోరల్‌ టచెస్‌ గురించి - ఘటోత్కచుడు వచ్చి ఒక పర్వతం మీద వాలినప్పుడు ఆ బరువుకి ఓ రాయి దొర్లిపోతుంది. అదే విధంగా ఘటోత్కచుడి ఎరీనాలోకి పరులు ప్రవేశించినప్పుడు వెలిగే ఢక్క. రాడార్‌ ఐడియా అన్నమాట. అది స్ఫురించేట్లు సిగ్నల్స్‌ ఇచ్చినట్టు చూపించడానికి వెలుగు పడుతూ ఆరుతూ ఉంటుంది. అలాగే చెలికత్తె మాయా శశిరేఖతో పడే ఇబ్బంది. మాయా శశిరేఖ చెయ్యి తన భుజం మీద పడినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. మగాడు, పైగా రాక్షసుడు తన మీద చెయ్యి వేసాడన్న అనీజీనెస్‌ కనబడుతుంది. అభిమన్యుడు బాణాల నిచ్చెన వేసేందుకు ముందు శశిరేఖను 'కిటికీలోంచి దూకేసేయ్‌' అంటే దూకేయడానికి ఆమె సిద్ధపడుతుంది. అదీ బావపై ఆమెకున్న విశ్వాసం. మాయాబజార్లో సృష్టించాక అమ్మాయిలు 'ఒకటే మా వయసు ఓ రాజు' డాన్సు చేస్తూంటే తండ్రీకొడుకూ ఇద్దరూ చూసి ఎంజాయ్‌ చేస్తారు. ఇద్దరూ వేరేవేరేలా రియాక్టు అవుతారు. కృష్ణుడి చిన్ననాటి చేష్టల గురించి నృత్యనాటిక వస్తూ ఉంటే రుక్మిణి తన మొగుడికేసి చూస్తుంది 'ఇంత గడుగ్గాయా మీరు' అన్నట్టు. ఘటోత్కచుడు మాయా శశిరేఖ అయినతర్వాత తన కంఠం గురించి చెలికత్తెతో చెక్‌ చేసుకుంటాడు చూడండి. కానీ పైట సంగతి చూసుకోడు. చెలికత్తె సైగచేశాక సద్దుకుంటాడు. అలాగే మాటిమాటికీ మగాళ్లలా చేతులు కట్టుకుంటూ వుంటే కృష్ణుడు మురళితో తట్టి దించమని సైగ చేస్తూ ఉంటాడు. 


కౌరవులు విలన్లే కానీ చేతకానివాళ్లు కారు. యుద్ధం అంటూ పెడితే కర్ణుడితో సహా వాళ్ల ప్రతాపం చూపాలి. అందువల్ల మాయాయుద్ధం చూపించి వాళ్లని మూటగట్టి పంపించేసినట్టు చూపారు. లాహిరిలాహిరి పాటలో తోడికోడళ్ల మధ్య స్పర్ధను ఎంతబాగా చూపించారో చూడండి. 'కాలమహిమ కాకపోతే చిన్నపిల్లకు మల్లే ఈ రుక్మిణికి ఇంకా ఈ విహారాలేమిటండీ' అంటుంది రేవతి. కాస్సేపటికి రుక్మిణి 'కాలమహిమ కాకపోతే మా అక్కగారికి ఎందుకండీ ఈ వయసులో ఈ విహారం' అంటుంది. మాయాబజారు సినిమా హాల్లో ఇన్నిసార్లు చూశాను కానీ లాహిరి, లాహిరి పాటలో చివరిదృశ్యంలో పాట ఇప్పటిదాకా వినలేదు. బలరాముడు, రేవతి పడవ ఎక్కగానే హాల్లో అందరూ నవ్వుతారు. ఆ నవ్వులో వాళ్లు పాడినది వినబడదు. లాహిరి, లాహిరి అనగానే ఫోటోగ్రఫీ గుర్తుకువస్తుంది. అది మూడు స్థలాల్లో వేర్వేరు వేళల్లో తీసి కలిపారట, తెలుసా? ఆ తెల్లగడ్డి ఎండలో తీసేరట. అది బ్యాక్‌ ప్రొడక్షన్‌ అని తెలుస్తుందా అసలు ఎక్కడైనా అతికినట్టు ఉందా? దటీజ్‌ మార్కస్‌ బార్‌ట్లే! పున్నమినాడు వెన్నెల చక్కగా ఉంటే విజయావారి వెన్నెలలా ఉందని మనం అనుకుంటున్నామంటే దానికి కారణం ఆయనే! చిన్న శశిరేఖ నుండి పెద్ద శశిరేఖ కావడం సింగిల్‌ షాట్‌లో తీశారట. మిక్సింగ్‌ లేదు. ఎలా తీశాడో మహానుభావుడు! అలాగే గింబళి చుట్టుకోవడం షాటు ఎలా తీశారన్నది ఈనాటి టెక్నీషియన్లకీ పెద్ద ప్రశ్నే! 


ఫస్ట్‌ సాంగ్‌లో చూడండి. ఏభైమంది ముత్తయిదువులు పాడుతున్నారంటే అందరూ ఫోకస్‌లోనే ఉంటారు. చివరున్నవారి ముఖం కూడా స్పష్టంగా కనబడుతుంది. బ్లర్‌ అవదు. సముద్రంలో ద్వారక షాట్స్‌ చూడండి. ఘటోత్కచుడి నీడ సముద్రంలో పడుతుంది. రాత్రిపూట ఘటోత్కచుడు రాజమహల్లో తిరుగాడుతూంటే లైటింగు చూడండి. వివాహభోజనంబు పాటలో ఘటోత్కచుడు పెద్దవాడయాక అతని గద సైజు చూసుకుని నవ్వుకోవడం చూడండి. లడ్లు తింటూ మీసాలు తుడుచుకోవడం చూడండి. ఇలా అన్నీ చూడాల్సిందే. మార్కస్‌ బార్‌ట్లేతోబాటు ఆర్ట్‌ డైరక్టర్‌ మాధవపెద్ది గోఖలేకు కూడా దండం పెట్టుకోవాలి. ముఖ్యంగా ఘటోత్కచుడి గెటప్‌ చూడండి. ఎంత హుందాగా ఉంటుందో! నటీనటులు అందరూ ప్రతిభావంతులే, అందమైన వారే! వాళ్లని మరింత అందంగా చూపడానికి, మన హృదయఫలకాలపై నిల్చిపోయేట్లు చేసినది మాత్రం ఈ టెక్నీషియన్లే! మాయాబజార్‌ కృష్ణుడి వేషంలో ఎన్టీ రామారావు మన మనస్సుల్లో ముద్ర వేసుకుపోయేడు. అసలు కృష్ణుడు వచ్చి నేనిలా, మరోలా ఉంటాౖనా బాబూ అన్నా పోవోయ్‌ అంటాడు తెలుగువాడు. 


ఇంటర్వెల్‌ తర్వాత అంతా విడిదిలో మగపెళ్లివారు చేసే అడావుడే! వాళ్లను ఆడపెళ్లివాళ్లు ఏడిపించడం. ఇది ఎంత బాగా హత్తుకుపోయిందంటే తలచుకున్న కొద్దీ నవ్వొస్తుంది. 'మా ఆచారంలో ఇంతసేపు తెరపట్టడం లేదు' అన్నమాట ఒకటి. పెళ్లిళ్ల వ్యవహారాల్లో జిల్లా జిల్లాకు ఆచారాలు మారతాయి కాబట్టి ఈ మాట రాక తప్పదు. శకుని కాబట్టి లౌక్యంగా చెబుతాడు. శశిరేఖను ఒకచోట 'చక్కగా.. సిగ్గులేకుండా చనువుగా వున్నావు' అంటాడు. ఆ విరుపు సియస్‌ఆర్‌కి మాత్రమే సాధ్యం. శకుని కాక తక్కిన దుష్టచతుష్టయంలో దుశ్శాసనుడు మరీ రెచ్చిపోతాడు. లక్ష్మణుడు పోట్లాడి తెర తీసేయించగానే 'భలే కర్ణా, మనవాడు మన పేరు నిలబెట్టాడు' అని పొంగిపోతాడు. కానీ దుర్యోధనుడు రారాజు కదా, మరీ అంత బయటపడడు. ముసిముసి నవ్వులు నవ్వుతూ 'కర్ణా, కృష్ణుని అవస్థ చూస్తే జాలి వేస్తోంది.' అంటాడు. ఏమిటో ఈ భేషజం! మళ్లీ ఇంకోసారి 'భలే మామా భలే, మనవాడు కృష్ణుడిమీద భలే చమత్కారబాణం విసిరాడు' అని దుశ్శాసనుడు మురిసిపోతాడు. 


శకుని విడిదిలో దిగుతూనే బ్రహ్మోపదేశం చేస్తాడు - 'మనం వరుని పక్షం. బెట్టు చెయ్యాలి. అది బాగులేదు, ఇది బాగులేదు అని - వాళ్లని చిన్నబుచ్చాలి.' అని. ఆ మాట పట్టుకుని కంబళీ వద్దు, గింబళీ కావాలని, తల్పం వద్దు గిల్పం కావాలనీ ఇలా ఎక్కడా లేనివాటి గురించి కోరికలు కోరుతారు. అక్కడ డైలాగు చూడండి - ఈ నాసి కంబళ్లా మాకు వేసేది? మా వూళ్లో దాసీవాళ్లకు వేస్తే తోసి అవతలకు పారేశారు'. ఇప్పటికీ మగపెళ్లివారి మాట ఇలాటి డైలాగులే వినబడతాయి కాబట్టి మాయాబజారు ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటుంది. శాస్త్రి శర్మ వేషాల్లో వంగర, అల్లు రామలింగయ్య తినేశారు. ఎన్ని వంటకాలున్నా ఓస్‌ ఇవేముంది కూరగాయలు, పానీయాలు, చిత్రాన్నాలు.. అంటూ తీసి పారేసి లేనిదేదో అడుగుతారు. వాళ్లకి తోడు బాలకృష్ణ ఒకడు. పెద్ద పోజు. తలుపు హఠాత్తుగా తెరుచుకోవడంతో దొర్లుకుంటూ వచ్చి పడతాడు. 'ఓ సారథిగారూ, పడ్డది తమరా బాబూ' అంటాడు వంగర. 'పడ్డానూ, మొగ్గ వేశానంతే!' అని సర్దుకుంటాడు బాలకృష్ణ. ఇదీ మొగపెళ్లివారి భేషజం. 


ఇక సంగీతం గురించి కాస్త చెప్పుకుందాం. మాయాబజారు థీమ్‌ మరాఠీ, హిందీ నాటకాలనుండి, సినిమాల్లోకి వచ్చిందన్నాగా, వాటన్నిటిలోనూ కామన్‌గా ఉన్న పాటలు ఈ సినిమాలో కూడా పెట్టారు. కృష్ణుడి బాలలీలలపైన ఓ పాట విధిగా ఉంటుంది. అదే ఈ సినిమాలో 'విన్నావటమ్మా యశోదమ్మా' అన్నట్టు ఆ పాటలో వేసిన బాలకృష్ణుడు ఎవరో తెలుసా? హిందీనటి రేఖా అన్నగారు. బాబ్జీ అని పేరు. అలాగే విధి గురించి ఓ పాట. మనకు 'భళి భళి దేవా' అన్నపాట. దారుకుడు వేషంలో ఉన్న మాధవపెద్ది తనకు తానే ప్లేబ్యాక్‌ పాడుకున్నాడు. తమిళ వెర్షన్‌లో కూడా ఆయనే తెరమీద కనబడతాడు కానీ వాయిస్‌ మాత్రం వేరే వాళ్లది. అలాగే మాయాబజార్‌ సృష్టించాక 'రక్షలు రక్షలు' పాటకు కూడా మాతృక ఉంది. 'పురానా దో నయే లో' అన్న పాట నాటకాల నాటిదే! అన్నట్టు ఇక్కడో మాట. మాయాబజారులో బొమ్మల షాపు వెలిసినపుడు అందులో బుద్ధుడి బొమ్మ కూడా ఉంటుంది. కృష్ణావతారం తర్వాతే కదా బుద్ధుడి అవతారం. ఇది చిన్న పొరబాటే ననుకోండి. ఇది తప్ప మాయాబజారులో తప్పులేమీ కనబడవు.


పాటల విషయానికొస్తే 'అహనా పెళ్లి అంట' టైపు పాట 1949 హిందీ వెర్షన్‌లో ఉంది. దాని పల్లవి 'మొహే దుల్హన్‌ బనాదె సఖీ'. ఇక వివాహ భోజనంబు పాట తీసుకుంటే 1936 నాటి మాయాబజారులోని ట్యూన్‌ తీసుకుని లిరిక్‌ మార్చి వాడుకున్నారు. ట్యూన్‌ పుట్టింది మాత్రం విదేశాలలోనే. 1930 ప్రాంతాల్లో బ్రిటన్‌, అమెరికా దేశాల్లో ప్రహసనాలు ఆడేటప్పుడు రంగస్థలం మీదకు ఆయా పాత్రధారులు వాళ్ల దుస్తులు తోపుడుబళ్లమీద వేసుకుని తోసుకుంటూ వచ్చేవారు. అప్పుడు వినబడే ట్యూన్‌ ఇది. దాన్ని 'మెక్సికన్‌ మెర్రీ గో రౌండ్‌' అనే పాటగా ఎడ్మండ్‌ రాస్‌ మలిచారని, ఆ ట్యూనే మనవాళ్లు గ్రహించారని చదివాను. అది కాదు, దానికి ఆధారం చార్లెస్‌ జోలీ అనే గాయకుడు పాడిన ''ద లాఫింగ్‌ పోలీస్‌మన్‌'' (1922) పాట అంటూ ఇప్పుడు వాట్సప్‌లలో వస్తోంది. వివాహ భోజనం పాటను తెలుగులో మాధవపెద్ది, తమిళంలో తిరుచ్చి లోకనాధన్‌ పాడారు. మాధవపెద్ది రంగారావుకి ప్లేబ్యాక్‌ ఇచ్చారు. రంగారావుపై పద్యాలు చిత్రీకరించినపుడు పద్యాల ముందు వచ్చే మాటలు కూడా మాధవపెద్ది చేతనే అనిపించారు. 


మాయాబజారు గురించి ఏ ముచ్చటయినా పాటల గురించి ప్రస్తావించనిదే పూర్తయినట్లు కాదు. సినిమా గొప్ప మ్యూజికల్‌ హిట్‌. లిరిసిస్ట్‌గా పింగళి, కంపోజర్‌గా ఘంటసాల విశ్వరూపం కనబడుతుంది. టైటిల్స్‌లో సంగీతం ఘంటసాల అన్నా, నాలుగు పాటలకు ఎస్‌.రాజేశ్వరరావుగారు ట్యూన్‌లు కట్టారు. అవి - లాహిరి లాహిరి లాహిరిలో, నీవేనా నను తలచినది, చూపులు కలసిన శుభవేళా, నీ కోసమె నే జీవించునది. ముందులో రాజేశ్వరరావునే మ్యూజిక్‌ డైరక్టర్‌ అనుకున్నారు. నాలుగు పాటలు కంపోజ్‌ చేశాక ఏదో పేచీ వచ్చినట్టుంది. ఆయన్ని తీసేసి ఘంటసాలను పెట్టుకున్నారు. ఆర్కస్ట్రయిజేషనూ, రికార్డింగూ అన్నిటికీ ఘంటసాలే! మిస్సమ్మలో రామారావు, నాగేశ్వరరావు కలిసి నటించారు. నాగేశ్వరరావుకి ఒక్క పాటా లేదు. మళ్లీ మాయాబజారులోనూ కలిసి నటించారు. ఇందులో రామారావుకి ఒక్క పాటా లేదు. అయినా వాల్‌ పోస్టర్లమీద అంతటా రామారావే! అదీ కృష్ణగారడీ! దీని తర్వాత మళ్లీ ఐదేళ్లపాటు అంటే గుండమ్మకథ 1962లో విడుదల అయ్యేదాకా వాళ్లిద్దరూ కలిసి నటించలేదు. మాయాబజారులో ఘంటసాల హీరో నాగేశ్వరరావుకే కాదు, రేలంగికి కూడా పాడారు. నాగేశ్వరరావు హీరోయిజం ఈ సినిమాలో అంతగా తెలియదు. ఘటోత్కచుడు అతన్ని హైహై బాలకా అన్నట్టుగానే ఉంటుంది. ఆలోచించి చూడండి. ఘటోత్కచుడు శశిరేఖను దొంగిలించి తేగానే ప్రేక్షకుడికి హీరోహీరోయిన్‌ల గురించి ఉత్కంఠ పోయింది. హీరోయిన్‌ హీరో గూట్లోనే ఉంది. పెళ్లి జరక్క ఛస్తుందా? ఆ తర్వాత కథ నడిపించినదంతా అద్భుతరసం, హాస్యరసం. పాత్రల పరంగా చెప్పాలంటే చిన్నమయ అండ్‌ గ్యాంగ్‌. అందుకే సినిమా పేరు చెప్పగానే మాటిమాటికీ గుర్తుకు వచ్చేది - మాయా శశిరేఖ, ఘటోత్కచుడు, లక్ష్మణకుమారుడు,  చిన్నమయ, లంబు జంబు, శర్మ, శాస్త్రి. అండ్‌ అఫ్‌కోర్స్‌ కృష్ణుడు. సినిమా పాటలు ఇంత తేలిక పదాలతో కూడా రాయవచ్చా? అనిపించేట్లా పింగళి పాటలు రాశారు. పరికించి చూడండి మాటలు సింపుల్‌గా ఉంటాయి. భావాలు ప్రౌఢంగా ఉంటాయి. పింగళి తన పాండిత్యాన్ని ఒలకబోయకుండా మామూలు జనం కూడా పాడుకునేట్లా చేశారు. అందుకే మాయాబజారు పాటల మకుటాలన్నీ తర్వాతతర్వాత సినిమా పేర్లగా వచ్చేశాయి.


ఇవి మాయాబజార్‌కు సంబంధించిన కొన్ని విశేషాలు మాత్రమే!🙂😊

శ్రీరమణీయం - (726)*

 _*శ్రీరమణీయం - (726)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"భావం ఆత్మసాక్ష్యాత్కారానికి ఏవిధంగా అడ్డు అవుతుంది !?"*_


_*మనిషిలో ఏర్పడే తొలి భావమే నేను అనే తొలి తలపుగా ఉంది. ఆ భావమే ఆత్మసాక్షాత్కారానికి అడ్డుగా ఉంది. అయితే ప్రపంచంతోనూ, మన కష్టసుఖాలతోనూ మనను అనుసంధానం చేసేది భావమే. భావం అంటే మనో సంభాషణ. ఒక జంతువుకు దాహం వేస్తే వెళ్ళి నీరు త్రాగుతుంది. అదే మనిషి అయితే దాహం వేయగానే 'దాహంవేస్తోంది' అని అనుకుంటాడు. ఇలా అనుకునే మనో సంభాషణే భావం అంటే. అది బయటికి చెబితే భాష అవుతుంది. అంటే లోపల భావంగా ఉన్నదే బయటకు భాషగా వ్యక్తమౌతుంది. భాషకు ముందు మనసులో జరిగే సంభాషణే భావం. జంతువుకు దాహం తీర్చుకోవడానికి సహజ ప్రేరణ సరిపోతుంది. ఏ భావంతో అవసరంలేదు. దానికి ఏ భావం లేదు కనుకనే 'నేను' అనే భావం కూడా రాలేదు. ఇప్పుడు మనం భావాలతో ఉన్నాం కనుక నేను దేహాన్ని, నేను ఫలానా అని అనుకుంటూ ఉంటాం. ఆత్మసాక్షాత్కారం అంటే నేను ఆత్మను అని అనిపిస్తుందేమోనని అనుకుంటాం. కానీ అలాకాదు. ఆత్మసాక్షాత్కారం అంటే తాను దేహం అనిగాని, ఆత్మనని గానీ అనుకోని స్థితి. అది అసలు అనిపించడమే లేని స్థితి. నిద్రపోయేవాడు తాను నిద్రపోతున్నాను అనుకుంటున్నాడంటే తను నిజంగా నిద్ర పోవటం లేదని అర్థం. అలాగే ఆత్మానుభవం పొందినవాడు నేను దేహాన్ని అనుకోన్నట్లే నేను ఆత్మ స్వరూపుడిని అని కూడా అనుకోడు. ఏదీ అనుకోకుండా ప్రకృతి ప్రేరణతో కదులుతాడు !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం }"*_

_*"భగవదానుభవానికి భావ దూరంలోనే ఉన్నాము !''*- *(అధ్యాయం -89)*_


🕉🌞🌎🌙🌟🚩

ఇంద్రియ అవగాహన

 *ఇంద్రియ అవగాహన.....*


పిల్లలకు మనం కుళ్ళిపోయిన ఆహారం పెడతామా..? పోనీ మనం తింటామా..? కుళ్ళిపోయిన, విషాహారం తింటే మన వ్యవస్థ కూడా చెడిపోయి, ఆనారోగ్యం వస్తుంది. వాంతులు, విరోచనాలు అవుతాయి. మరి మనం మన ఇంద్రియాలకు పెట్టే ఆహారం కూడా అలాంటిదే. ఇంద్రియాలు బయట ఉంటాయి, మనస్సు లోపల ఉంటుంది. ఇంద్రియాల ద్వారా మనస్సు ప్రపంచాన్ని చూస్తోంది. మనం బయట జరిగే కుళ్ళును, చెడును ఇంద్రియాల ద్వారా మనస్సుకు అందిస్తున్నాము. అందుకే మనస్సు చెడిపోయి, బయటకు అదే చెడును పంపిస్తోంది. ఆ కారణంగానే మానవుడు నేరాలు చేస్తున్నాడు.


మనిషి విన్నదానికంటే చూడటం ద్వారానే ఎక్కువ గ్రహిస్తాడు, విన్నది గుర్తుండకపోయినా, చూసినది మాత్రమే మనస్సులు చెరగని ముద్ర వేస్తుందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. మరి మనం రోజూ ఏమి చేస్తున్నాం.. మన మీడియా ఏమి చూపెడుతోంది. ఒక నేరం ఎలా జరిగింది అనేది మనకు అవసరమా.. కానీ క్రైం వాచ్, హత్యలు నేరాలు మొదలైన ఎన్నో కార్యక్రమాల పేరుతో మనకు టి.వి.చానెల్స్ లో కనిపించేవి నేరాలు, ఘోరాలే.


అసలు నేరం ఎలా చేస్తే మనకెందుకు.. వాడు తప్పించుకోవడానికి ఏమి చేసాడో మనకెందుకు.. కానీ మీడియా చేసే పని ఏంటంటే, వాడు చేసిన నేరాన్ని మళ్ళీ పాత్రలతో చూపించి, వాడు ఏమి చేయడం వలన 'క్లూ' దొరికిందో కూడా చెబుతుంది. అంటే పట్టుబడకుండా నేరాలు ఎలా చేయాలో చెబుతుంది. తాను చూసే విషయాల్లో ఇదంతా అనవరమైన చెత్త. అదే మనస్సులోకి వెళుతోంది.


ఇక మీరు చూసే సినిమాలు/ధారవాహికల సంగేతి సరేసరి. అందులో సగటున వారానికి ఒక అత్యాచార సంఘటన చూపిస్తారు. మీ మరియు మీ పిల్లల మనస్సులోకి అత్యాచారం అనేది ప్రతివారం పంపుతుంది సీరియల్. అదేగాక మద్యపానం, ధూమపానం, స్త్రీలను హింసించడం, ఏడిపించడం అనేవి ప్రతి సీరియల్లోనూ, సినిమా లోనూ కనిపిస్తాయి. మీరు పురాణాలు చూస్తే, అందులో కథానాయకుడు (హీరో) మరియు ప్రతినాయకుడు (విలన్) మధ్య తేడా స్పష్టంగా ఉంటుంది.


రామాయణం తీసుకోండి. రాముడు స్త్రీలను కామంతో చూడడు, మద్యం సేవించడు, ధూమపానం చేయడు, ధర్మానికి కట్టుబడతాడు. రావణుడు దీనికి పూర్తిగా విరుద్ధం. కనిపించిన ప్రతి స్త్రీని ఎత్తుకువచ్చి అత్యాచారం చేసాడు, మద్యపానం, ధూమపానం, పరులను హింసించడం, ఋషులను ఏడిపించడం అతని లక్షణాలు.


కానీ ఇప్పటి సినిమాల సంగతి చూడండి. కథానాయకుడు మరియు ప్రతినాయకునికి మధ్య బేధం లేదు. ఇద్దరు అమ్మాయిలను ఏడిపిస్తారు, మద్యం సేవిస్తారు, ధూమపానం చేస్తారు, 'రూల్స్' అతిక్రమిస్తారు. వాళ్ళిద్దరికీ తేడా ఏముంది.. ఏమీ లేదు. కథ చివరలో కథానాయకుడి చేతిలో ప్రతినాయకుడు ఓడిపోతాడు. మీ పిల్లలు సినిమాలో ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అయినా ఎవరిని తీసుకుంటే ఏమిటి.. ఇద్దరు అంతే. అందుకే చాలా మంది పిల్లలు నేరస్థులుగా మారుతున్నారు...


*|| ఓం నమః శివాయ ||*

వైకుంఠ ఏకాదశి 300 టికెట్స్ కోసం

 *వైకుంఠ ఏకాదశి 300 టికెట్స్ కోసం*


వైకుంఠ ఏకాదశి *(25.12.20 నుంచి 3.1.2021 వరకు)* తిరుమ‌ల శ్రీ‌వారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం కోటాను టీటీడీ *మంగళవారం (01.12.20) ఉదయం 11 గంట‌ల‌కు* ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనుంది.

....

Rs. 300 online quota for Vaikunta Ekadasi *(25-12-2020 to 03-01-2021)* will be released on *01-12-2020 by 11am* by TTD.

..........

*టీటీడీ పంచాంగం, సమాచారం కోసం* ఈ 9392877277 వాట్సప్ నెంబర్ ను సేవ్ చేసుకుని *మెసేజ్ చేయండి.


🙏ఓం నమో వేంకటేశాయ🙏

అరుణాచల శివా

 అరుణాచల శివా  

============================

పవిత్ర తిరువణ్ణామలై కార్తీక దీపము ఉత్సవము నాడు దివ్య అరుణ గిరి శిఖరములపైన  దీప ప్రజ్వలన గావించే ( పార్వత రాజకుల) వారి వంశ చరిత్ర  - సేకరణ 

============================

పవిత్ర తిరువణ్ణామలై కార్తీక దీపము ఉత్సవము నాడు దివ్య అరుణ గిరి శిఖరములపైన  దీప జ్వలన గావించే గొప్ప అవకాశం పార్వత రాజకులు అనబడే  వంశస్తులచే లేదా వారి కులముచేత నుండే జరుగుతోంది. ఈ పవిత్ర దీపమునకు కావలసిన 

పవిత్ర వస్త్రములు సేవలుగా పురాతనము నుండి చేయడం జరుగుతోంది.  ఈ వంశము వారు తమ యొక్క  ఈ మహా దివ్య కార్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ఈ సమస్త సృష్టికి లోక నాయకుడిగా ఉదయించిన పరమేశ్వరుని మహా దివ్య 

రూపమే అరుణ గిరి. ఆ పరమ శివుడే దివ్య జ్యోతి స్వరూపముగా కృత్తికా దీపము నాడు కనపడుచున్నారు. .  తిరువణ్ణామలై  పరమ పవిత్రమైన పర్వతము.   ఇక్కడ ఉన్న మట్టి కూడా మహేశ్వర రూపమే. ప్రతీ రాయి పరమేశ్వరుని లింగ రూపమే. 

ముప్పై కోట్ల దేవతలు పూజించిన స్వయం భువు రూపమే  అన్నమలై. సాక్షాత్తు భువి  కైలాసం గా కీర్తించబడుచున్నది.   మానవ జీవిత పరమార్ధం , మానవ జన్మ ప్రయోజనం చూడటమే. ఈ జ్యోతి దర్శనం. మనలోని అంతః జ్యోతి రూపుడు 

ఈశ్వరుని దర్శించడమే ఈ కృత్తికా దీప దర్శనం.  విశ్వ  వ్యాప్తంగా ఎంతో అఖండ ఖ్యాతిని పొందిన ఈ అరుణ గిరి పర్వతం పై మహాజ్యోతి చూడటం ఒక వరం అయితే అన్నమలైలో మహాజ్యోతి వెలిగించడం ఈ పర్వత రాజా కులము వారు ఎంత 

ధన్యులో కదా ! . తిరువణ్ణామలై  కార్తీక  పూర్ణమి నాడు  ఈ పర్వత రాజకులం వారికి ఈ మహా యోగం లభించింది.    ఈ పర్వత రాజా వంశస్తులు ఎంతో  భక్తి శ్రద్ధలతో అన్నామలై  మహాదీపం వెలిగించే కార్యాణి. నెరవేర్చేస్తున్నారు. తిరువన్నమలై  

పట్టణంలో మొత్తము వీరివి ఒంటరిగా 2 వేల కుటుంబాలు ఉన్నాయి. వారిలో ( ఐదుగురు వారసుల కుటుంబం అరుణ గిరిపై  దీపం వెలిగించే హక్కును పార్వత రాజకులం వారికి  ఎలా వచ్చింది? . అంటే   ఈ  పర్వత రాజకుల రాజవంశంలో  పర్వత 

రాజుకు జన్మించిన జగన్మాత పార్వతీ దేవి ఈ వంశస్తులు కావడమే ఆ వంశస్తులకు పొందిన మహా యోగం. జగన్మాత పార్వతీ దేవి వంశస్తులే ఈ పర్వత రాజ కులము వారు. అందుకే అట్టి పవిత్ర  పరమేశ్వరుని సాక్షాత్తు దివ్య స్వరూపమైన అరుణ 

గిరిని అధిరోహించడానికి అంతే కాకుండా అరుణ గిరిపై వెలిగించే దివ్య జ్యోతిని ప్రజ్వలించే అధికారం ఈ పార్వతీదేవి సంప్రదాయానికి చెందిన వారు మాత్రమే ఉన్నది కనుక   తిరువణ్ణామలై  కొండలపై మహా దీపం వెలిగించే పవిత్రకార్యాన్ని 

నిర్వహిస్తున్నారు. పూర్వము ఒకానొక సమయంలో బ్రహ్మ ఋషి ధ్యానాన్ని భగ్నం  చేయడానికి రాక్షసులు పాప కార్యము పాల్పడ్డారు. బ్రహ్మ ఋషికి కోపాగ్నికి భయపడి  రాక్షసులు చేపలుగా మారి  సముద్రంలో కనుమరుగవుతారు. రాక్షసులను 

నాశనం చేయమని , లోకానికి రక్షణ ఇమ్మని శివుని ,బ్రహ్మఋషి ప్రార్ధించారు . భక్త రక్షణ ఎరిగిన పరమశివుడు పర్వత రాజుని  పిలిచాడు. సముద్రంలో దాగిన రాక్షసులను చేప రూపంలో నాశనం చేయాలని ఆయన ఆదేశం. అందుకు  సాయం 

చేయడానికి విశ్వకర్మ సృష్టించిన జ్ఞాని శెంపాన్ అనే పడవను ఇచ్చాడు . సముద్రంలోకి దూకి చేపల ఆకార రాక్షసులను పట్టుకొని సంహరించి తీరంలో  పడేసిన పర్వత రాజు . మరణించిన రాక్షసులు మళ్ళీ మళ్ళీ ప్రాణం పొంది , సముద్రంలోకి దూకి 

అదృశ్యమవుతున్నారు. . ఇలా అనేక మార్లు జరిగి,  అలిసిపోయిన పర్వత రాజు , తన కుమార్తె అయిన పార్వతిదేవి సాయం కోరారు.  పార్వతి దేవి అఘోరా రూపంలో సముద్రం మధ్యలో నిలబడి రాక్షస  రూపంలో ఉన్న చేపలను మింగేసి రాక్షస 

జాతిని నాశనం చేసింది ఆ సమయంలో అనుకోకుండా రాక్షసులకు చెలరేగిన వలలో సముద్ర కింద తపస్సు చేసిన  మీనామరీషి అనే ఋషి  తన తపస్సు భంగం అయిందనే కోపంతో  " నీ వంశం నాశనం కావాలి. , చేపలు పట్టడం వల్ల జీవించాలి అని 

పర్వత రాజను శపించాడు,  శాపనికి భయపడిన పర్వత రాజు  వెళ్లి శివుని ప్రార్ధించాడు.  కరుణామయుడు శివుడు కార్తిగై శుభదినాన తిరువణ్ణామలై లో జ్యోతి రూపంలో దర్శనం ఇస్తానని , ఆ జ్యోతిని వెలిగించే పని నీ  పర్వత రాజా  వంశమే  

నెరవేర్చడం వలన ఈ శాప విముక్తి పొందుతారని అని వరం ఇచ్చి శాప విమోచన మార్గం అనుగ్రహించారు పరమ శివుడు.   ఆ ప్రకారం అప్పటి నుండి పవిత్ర కృత్తికా మాసంలో కార్తీక మహా దీపం వెలిగించే హక్కు పొందిన పర్వత రాజ కులము వారీ 

సంప్రదాయ అనుసరణగా వస్తున్న ఆనవాయితీ.  ఈ రోజు వారి కుటుంబ దేవత తిమలాయ్ అంగలమ్మన్ ఆలయ పూజ నిర్వహిస్తారు. దీపమునకు వలయు వస్త్రములను  ఊరేగింపుగా గిరి శిఖరములపై  చేరుకుంటారు. . రాత్రి 6 గంటలకు కార్తీకై దీప 

ప్రజ్వలనచేస్తారు  పర్వత రాజకుల వంశం వారు.

*కార్తీక పురాణం

 🚩 _*కార్తీక పురాణం*_🚩 

🚩 _*18 వ అధ్యాయము🚩*_


🕉☘🕉☘🕉☘🕉☘


*సత్కర్మానుష్టాన ఫల ప్రభావము*


🕉️☘☘☘☘☘☘🕉️


"ఓ మునిచంద్రా! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి - గురువు - అన్న - దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా, తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున వుండవలసినదే కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూణ్యఫలప్రదాయియగు యీ కార్తీకమాసమెక్కడ! పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ? యివి యన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో, దాని ఫలమెట్టిదో విశదీకరింపు"డని ప్రార్ధించెను.


"ఓ ధనలోభా! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధమైనట్టివి కాన, వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని, సకల శస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతివాడో, యెటువంటి కర్మలు ఆచరించావలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మల నచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా నీ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము చేయవలెను. అటుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడనూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు". అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.


"ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత దానిని నాచరించవలెను? ఇదివరకెవ్వరయిన నీ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తర౦గా విశదికరింపు"డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.


"ఓయీ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి' అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు, ఈ వ్రతమునకు, చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన, ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".


తొల్లి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింపబడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రు౦డును, చతుర్బాహు౦డును, కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీ మన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. "నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరు ధించవారికి విధించబడిన ధర్మముల నాచరించుచున్నారా? ప్రపంచమున నే అరిష్టములు లేక యున్నవి కదా?" అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి "ఓ దేవా! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరి కొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు"మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.


ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యెగతాళి చేయుచుండిరి. కొందరు "యీ ముసలి వానితో మనకేమి పని"యని ఊరకు౦డిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి "వీరినెట్లు తరింపజేతునా?"యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి, లక్ష్మి దేవితోడను, భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.


ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.


*శ్లో|| శాంతకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!*

*విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |*

*లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!*

*వందేవిష్ణుం! భవభయహారం! సర్వలోకైకనాథం ||*


*శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం*

*దాసి భూత సమస్త దేవా వనితాం* *లోకైకదీపంకురాం |*

*శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర* *గంగాధరాం*

*త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||*


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తం.*

🚩🌹🌷🕉️🕉️🌷🌹🚩

Bhakti







 

అత్యున్నత గౌరవం

 ప్రతిరోజు #టాటా_మోటార్స్ లో పనిచేసే పెద్దపెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాక అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవారు.


కానీ, కొన్ని రోజులనుండి #సుమంత్_మోలగోకర్ అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం చేయటానికి వెళ్ళటం చూసి, ఆ అధికారులు అతనిని ” ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్ళలొ ఇచ్చే పార్టీలు మరిగాడు" అనే అపవాదు వెయ్యటం సాగించారు.


ఒకరోజు కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.


ఆయన కారుతో వెళ్ళి , రోడ్డు వెంబడి ”ధాబా" దగ్గర కారు ఆపి, అక్కడ భోజనం చేస్తున్నాడు. అలా భోజనం చేస్తూ, టాటా మోటార్సు వారి తయారు చేసే ట్రక్ లు వాడే డ్రైవర్లతో సంభాషణ చేస్తూ, టాటా వాహనాలలోని బాగోగుల గురించి వారితో చర్చిస్తూ, ఆ విషయాలు తన నోట్బుక్ లో వ్రాసుకుంటూ, టాటా వాహనాల ఉత్పత్తి నాణ్యతను పెంచే దిశగా ఎంతో విషయసేకరణ చేశాడు. అలా ఆ డైవర్లు చెప్పిన విషయాలతో టాటా వాహానాల నాణ్యతను పెంచి, వాటిని ప్రపంచంలోనే ఉన్నతికి తీసుకు వచ్చాడు శ్రీ సుమంత్ మోలగోంకర్. ఆయన చేసిన సేవకు టాటా మోటార్సు ఆయన పేరున " #టాటా_సుమో " వాహనానికి ఆయన పేరు పెట్టారు. సు అంటే సుమంత్, మో అంటె మోలగోంకర్.


ప్రపంచంలో ఉద్యోగికి ఒక కంపెనీ ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇది.. 👏👏👏

పద్యం గురించి

 🌹🌹 బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే ఈ పద్యం గురించి మీకు తెలుసా !?🌹🌹


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!! 


విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాలనే ఇచ్చేస్తాయి.


    ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం.


కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.


’అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను.


అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడాని కని ఇటువంటి ప్రయోగం చేశారు. 


’అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. 


’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి. 


అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.


’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.


’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?


బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి

చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి


మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి. 


ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.


’రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’


అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.


’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.


అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’. 


ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’


మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ


ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు.


మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.


ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు.


కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ’ అనడానికి కష్టం ఏమిటి?


ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు.


ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ🌹🙏🙏🌹

ధార్మికగీత - 98

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                            *ధార్మికగీత - 98*

                                      *****

              *శ్లో:- కరా    వివ   శరీరస్య  ౹*

                     *నేత్రయో   రివ పక్ష్మణీ ౹*

                     *అవిచార్య ప్రియం కుర్యాత్౹*

                     *తన్మిత్రం    మిత్ర  ముచ్యతే ౹౹*

                                         *****

*భా:-  లోకంలో మనకు హితులన దగిన వారు ముగ్గురే అని పంచతంత్రం చెబుతున్నది.వారే*

*తల్లి-తండ్రి-మిత్రుడు.  మన జీవనపురోగమనంలో తల్లిదండ్రుల పాత్ర గురించి ప్రత్యేకించి వేరే చెప్పనక్కరలేదు. వారిది సమున్నతస్థానము. మిత్రులు చాల మంది ఉండవచ్చు. కాని "సన్మిత్రుడు"  మన శరీరానికి చేతులు, కంటికి రెప్పలు ఎలా ఉంటాయో అలా ఉండాలి.  చేతులు, రెప్పలు మన దైనందిన అవసరాల కనుగుణంగా, అసంకల్పిత ప్రతీకారచర్యలలో సమర్థవంతమైన క్రియాశీలక* *కార్యకర్తలుగా సమయస్ఫూర్తితో పనిచేస్తాయి. మనం   అడగకుండానే "చేతులు" వివిధ పనులలో వాటంతట అవే జోక్యం చేసుకుంటూ, చాకచక్యంగా సాయపడుతుంటాయి."రెప్పలు" కంటిలో ఒక్క నలక గాని, దుమ్ము- ధూళి గాని  *పడకుండా నిరంతర    అప్రమత్తతతో కాపాడుతుంటాయి. అలా మన ఇంగితాన్ని, హృదయాన్ని పసిగట్టి, కనిపెట్టి ఆపత్తు, విపత్తులలో  ఆదుకుంటూ,   సంపత్తులో రక్షగా  వెన్నంటి    కాపాడగలిగిన మిత్రుడే నిజమైన మిత్రుడు. అతనికి మనం కూడా అలాంటి సన్మిత్రునిగా ఉండాలి. మన జీవితం సార్థక మవడానికి అలాంటి మిత్రులు నలుగురు చాలని గ్రహించాలి. చరమాంకంలో కూడా ఆ నలుగురు కొండంత  అండగా ప్రక్కనే  ఉంటే నిశ్చింతగా, నిబ్బరంగా కన్ను మూయవచ్చు.  "మిత్ర" మనే అక్షరద్వయం భగవత్ ప్రసాదిత వరం అని సారాంశము*.

                                  *****

                   *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

వే దాంగములు

 వే దాంగములు 1.శిక్ష రెండు వ్యా కరణము 3 చందస్సు 4 నిరుక్తము 5 జ్యోతిష్యము 6 కల్పము

శిక్ష.. పాణిని శిక్షా శాస్త్రమును రచించెను ఇది వేదమును పల్కవలసిన పద్ధతిని బోధించును వేదములో స్వరము మిక్కిలి ముఖ్యము స్వరమున గూర్చిన విశేషములు ఈ శాస్త్రంలో చక్కగా నిరూపింపబడినది

2 వ్యాకరణము వ్యాకరణ శాస్త్రమును కూడా సూత్ర రూపమున పాణిని రచించెను ఇందు 8 అధ్యాయములు కలవు ఈ మహా శాస్త్రమును మహేశ్వరుని అనుగ్రహంతో ఆయన రచించిన అని చెప్పుదురు దోషరహితమైన పద ప్రయోగం సంబంధించిన నియమములన్నియు ఈ శాస్త్రములోచెప్ప బడును పాణిని వ్యాకరణ సూత్రాలే ఆధునిక భాషా శాస్త్రము లకు మూలము భాషా శాస్త్రవేత్తలు చెప్పు దురు


చందస్సు పింగళుడు చందో విచితి అనబడు 8 అధ్యాయముల చంధ శాస్త్రము రచించెను వేద మంత్రములకు సంబంధించిన లౌకిక ఛందస్సులు కూడా ఇక్కడ నిరూపింపబడినది


నిరుక్త శాస్త్రం.. నిరుక్త శాస్త్రమునకు కర్త యాస్కుడు వేద మంత్రం లోని పదముల యొక్క ఉత్పత్తి ఇందు బోధింపబడినది వేదార్థమును గ్రహించుట కి శాస్త్రం మిక్కిలి ఉపయోగపడుతున్నది పదములన్నియు ధాతువులనుండి పుట్టిన వని యీ యాస్కుని అభిప్రాయం

జ్యోతిష్యం.. వేదములు యజ్ఞములు చేయవలెనని బోధించుచున్నది నియత కాలమందే అగ్నివలన చేయవలెను ఆ కాల ని య మమ్మును బోధించు శాస్త్రమును జ్యొతిష్యమందురు జ్యోతిష్యం లగధుడు గర్గుడు మున్నగువారు ఈ శాస్త్ర గ్రంథములను రచించిరి


కల్పము. . సూత్ర రూపమునున్న కల్ప శాస్త్రము యజ్ఞయాగాదుల విధానములను అందలి భేదములను వివరించు చున్నది అశ్వలాయనుడు సాంఖ్యానుడు మొదలగు వారు ఈ శాస్త్రమును ప్రవర్తింప జేసిరి

జయలక్ష్మి పిరాట్ల హైదరాబాదు

Pravachanam


 

ఆలోచించాల్సిందే

 *ఒక్కసారి.. ఆలోచించాల్సిందే..!!* బ్రెజిల్‌, గ్రీస్, ఈజిప్టు, అర్జెంటీనా, బెల్జియం, ఈక్వెడార్, పెరూ, బొలీవియా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఈక్వెడార్, ఇటలీ, పరాగ్వే, స్విట్జర్‌ల్యాండ్, టర్కీ వంటి దేశాలతో పాటు భారత్ పక్కనే ఉన్న థ్యాయ్ ల్యాండ్, సింగపూర్‌లలో కూడా *నిర్బంధ ఓటు హక్కు ఉంది.* ఈ దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకోనివారికి రకరకాల శిక్షలు విధిస్తుంటారు. *బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ, సింగపూర్, బెల్జియం, ఆస్ట్రియా దేశాల్లో ఓటు వేయని ప్రజలకు పెనాల్టీ విధిస్తారు.* గ్రీస్, ఈజిప్టుల్లో *ఏకంగా జైలు శిక్ష విధిస్తారు.* థాయ్ ల్యాండ్‌లో ఓటు హక్కు రద్దు చేస్తారు. *ఇటలీలో ఓటు వేయలేదని అందరికీ తెలిసేలా అధికారిక పత్రాల్లో ప్రకటిస్తారు.* *బెల్జియంలో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేకుండా చేస్తారు.* బోలీవియాలో జీతం ఇవ్వరు. ఈ విధంగా పలు దేశాల్లో వివిధ రకాల శిక్షలు ఉన్నాయి. *కానీ 120 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో మాత్రం ఓటు హక్కు సంపూర్ణ వినియోగం ఏనాడూ జరగలేదు.*