25, ఆగస్టు 2026, మంగళవారం

25ఆగస్టు2026

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

  🍁 *మంగళవారం*🍁

 *🌹25ఆగస్టు2026🌹*  

   *దృగ్గణిత పంచాంగం*             

         

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం* 


*తిథి : ద్వాదశి* ఉ 06.20 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం  : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : ఉత్తరాషాఢ* రా 10.51 వరకు ఉపరి *శ్రవణం*         

*యోగం : ఆయుష్మాన్* ఉ 07.41 వరకు ఉపరి *సౌభాగ్య*

*కరణం  : బాలువ* ఉ 06.20 *కౌలువ* రా 07.13 ఉపరి *తైతుల* 

*సాధారణ శుభ సమయాలు:* 

*మ 12.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *మ 03.49 - 05.34*

 అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.34*

*వర్జ్యం    : శేషం ఉ 07.01 & రా 03.10 - 04.54*

*దుర్ముహూర్తం  : ఉ 08.24 - 09.14 రా 11.01 - 11.47*

*రాహు కాలం  : మ 03.18- 04.52*

గుళికకాళం      : *మ 12.09 - 01.43*

యమగండం    : *ఉ 09.01 - 10.35*

సూర్యరాశి : *సింహం*                 

చంద్రరాశి : *మకరం* 

సూర్యోదయం :*ఉ 06.01*  

సూర్యాస్తమయం :*సా 06.35* 

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     : *ఉ 05.53 - 08.24*

సంగవ కాలం        : *08.24 - 10.54*

మధ్యాహ్న కాలం    : *10.54 - 01.25*

అపరాహ్నకాలం   : *మ 01.25-03.55*

*ఆబ్ధికం తిధి        : శ్రావణ శుద్ధ త్రయోదశి*

సాయంకాలం   : *సా 03.55- 06.26*

ప్రదోష కాలం      : *సా 06.26- 08.43*

రాత్రి కాలం         : *రా 08.43- 11.47*

నిశీధి కాలం        : *రా 11.47 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.07*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

మంగళవారం 25 ఆగస్టు 2026*

 *మంగళవారం 25 ఆగస్టు 2026*


*శ్రీమద్భాగవతం - 30/42* 


*ధేనుకాసుర వధ, కాళీయ మర్దనం & దావాగ్ని ప్రాశనం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


భాగవత అధ్యయనం లో అప్పుడే 30 రోజులు గడిచి పోయాయి అసలు సమయమే తెలియదు స్వామి లీలలలో పడితే, నిన్నటి రోజున బ్రహ్మమోహన లీల తెలుసుకున్నాం ఈరోజు మరికొన్ని లీలల గురించి తెలుసుకుందాం.


1. ధేనుకాసుర వధ – తాళవన ప్రవేశం

బలరామ కృష్ణులు తమ పౌగండ వయసుకు చేరిన పిమ్మట అంటే ఆరవ ఏట ఆవులను మేపసాగిరి. బృందావనం లో గోవులు కాస్తూ తమ పవిత్ర పాదస్పర్శ చేత ఆ ప్రదేశాన్ని పునీతం చేశారు.


శ్రీకృష్ణభగవానుడు తన మాయాప్రభావమున నిజ దివ్యవైభవమును బయల్పడనీయక, నిత్యజీవనమున సామాన్య గోపబాలునివలె ప్రవర్తించుచుండెను. వైకుంఠమున లక్ష్మీదేవిచే పాదసేవలను అందుకొను ఆ మహాత్ముడు ఇప్పుడు గ్రామీణ జనులలో తానుకూడా ఒక్కడై మసలుకొనుచుండెను. ఐన ఆ ప్రభువు యొక్క అద్భుతలీలలు అప్పుడప్పుడు ప్రకటితములు అగుచునే యుండెను. 


 

బలరామకృష్ణులకు గాఢమిత్రుడైన శ్రీదాముడు, సుబలుడు, చిట్టికృష్ణుడు (ఇతడు శ్రీకృష్ణునకు భిన్నుడు) మొదలగు గోపబాలురు ప్రేమతో ఒకనాడు వారితో ఇట్లనిరి–"మిత్రులారా! దగ్గరలోని తాళవనంలో ఎంతో రుచికరమైన తాటిపండ్లు ఉన్నాయి. కానీ అక్కడ ధేనుకాసురుడు అనే గాడిద రూపంలోని రాక్షసుడు తన అనుచరులతో కాపలా కాస్తూ ఎవరినీ రానివ్వడం లేదు" వాడు నరమాంస భక్షకుడు, అందుకే పక్షులు సైతం అటు వెళ్ళడానికి బయటపడతాయి,కానీ ఆ పండ్ల వాసనలు గుబాళిస్తూ ఉంటాయి,వాటిని ఇంతవరకు ఎవరు కనీసం రుచి కూడా చూసీ ఉండలేదు,ఓ కృష్ణా నీవు సర్వసమర్దుడవు మాకు ఆ భాగ్యం కలిగించవా అని అడిగారు


బలరామకృష్ణులు గోపబాలురతో కలిసి తాళవనానికి వెళ్లారు.

అందులోనికి వెళ్ళగానే బలరాముడు తన బాహుబలంతో తాటిచెట్లను గట్టిగా ఊపగా పండ్లన్నీ నేలరాలాయి. ఆ శబ్దానికి క్రోధంతో పరుగెత్తుకు వచ్చిన ధేనుకాసురుడు బలరాముని తన వెనుక కాళ్లతో తన్నాడు.


అంతట బలరాముడు ఆ గాడిద రాక్షసుని రెండు కాళ్లను ఒంటిచేత్తో పట్టుకుని, గిరగిరా తిప్పి తాటిచెట్ల పైకి విసిరికొట్టాడు. ఆ దెబ్బకు చెట్లు కూలి ధేనుకాసురుడు మరణించాడు ఆయన అనుచరులైన రాక్షసులంతా ఉక్రోషంతో మీదకు వస్తె వారిని కూడా అలాగే సంహరించాడు.నాటి నుండి గోపాలురు, పశువులు భయం లేకుండా తాళవనంలో సంచరించారు.


2. కాళీయుని విషజ్వాలలు

పరీక్షిన్మహారాజా! ఈవిధముగా శ్రీకృష్ణభగవానుడు బృందావనమునందు తన అద్భుత లీలలను ప్రదర్శించుచుండెను. ఒకనాడు ఆ స్వామి తన యన్నయగు బలరాముడు లేకుండా, తోడి గోపబాలురతోగూడి యమునానదీ తీరమునకు చేరెను. అప్పుడు వేసవితాపముచే గోవుల యొక్క గోపకుమారులయొక్క గొంతు లెండిపోయెను. మిగుల దప్పికగొనియున్న ఆవులును, బాలకులును విషపూరితములైయున్న యమునానదీ జలములను త్రాగిరి.


యమునా నదిలో ఒక లోతైన మడుగులో వేయి పడగలు కలిగిన మహా విషసర్పం కాళీయుడు నివాసముండేవాడు.


 * ఆయన విషపు వేడిమికి యమునా జలాలు మరిగిపోయి, నీటి నుండి విషపు ఆవిర్లు లేచేవి. ఆ ఆవిర్లు తగిలిన పక్షులు ఆకాశం నుండి నేలకూలి మరణించేవి; ఒడ్డున ఉన్న చెట్లు ఎండిపోయాయి.


 * ఆరోజు ఆ విషపు నీటిని తాగిన ఆవులు, గోపబాలురు విషప్రభావంతో నేలపై పడి ప్రాణాలు విడిచారు. కరుణామయుడైన శ్రీకృష్ణుడు తన అమృతతుల్యమైన దృష్టితో వారిని స్పృశించి తిరిగి బ్రతికించాడు.


3. కాళీయ మర్దనం – పడగలపై శ్రీకృష్ణుని దివ్య నాట్యము

యమునా జలాలను పవిత్రం చేయడానికి చిన్నికృష్ణుడు నిర్ణయం తీసుకుని  ఒడ్డున ఉన్న ఒక కదంబ వృక్షంపైకి ఎక్కి, నడుముకు పీతాంబరాన్ని బిగించి, గంభీరంగా జబ్బలు చరుస్తూ కాళీయ మడుగులోకి దూకాడు.


 కృష్ణుని దూకుడుతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. కాళీయుడు తీవ్రమైన కోపంతో కృష్ణుడిని చుట్టుముట్టి, ఆయువు పట్టు మీద కాటు వేస్తూ బంధించాడు. గోకులవాసులు, యశోదానందులు ఇది చూసి హాహాకారాలు చేస్తూ యమునా తీరానికి పరుగెత్తుకు వచ్చారు. అప్పుడు గోకులంలో ఉన్న ఆవు,దూడ, గోపాలకులు, నందుడు ఎంతో వేదన చెందారు, కృష్ణుడికి ప్రమాదం వచ్చింది అని తమ ప్రాణాలే పోయినట్టు తల్లడిల్లారు.


అప్పుడు కృష్ణుని తమప్రాణముగా (సర్వస్వముగా) భావించెడి నందుడు మొదలగు గోపాలురు అందఱు బాధపడుచు ఆ హ్రదమున(మడుగులోకి) ప్రవేశించుటకు సిద్ధపడిరి. కాని మహాత్ముడైన బలరాముడు శ్రీకృష్ణమహిమలను ఎఱిగిన వాడగుటచే ధైర్యము వహించి, తగినరీతిగా ఓదార్చి, వారిని ఆ ప్రయత్నమునుండి నివారించెను. 


గోకులవాసులకు ఏకైక శరణ్యుడైన శ్రీకృష్ణుడు తనకారణముగా స్త్రీలు, వృద్ధులు, బాలురు అందఱును దుఃఖితులగుటను గమనించెను. స్వామి క్షణకాలము సామాన్యమానవునివలె పాముపట్టులో ఉండి,(ఉన్నట్టు నటించి)వెంటనే వేగముగా దానిపట్టునుండి పైకి లేచెను.


 అంతర్యామియైన శ్రీకృష్ణుడు కాళీయుని పట్టు నుండి సులభంగా విడిపించుకుని, ఆ సర్పం యొక్క వేయి పడగలపైకి ఎక్కాడు.


శ్రీకృష్ణుడు తన దేహమును పెంచుచున్నప్పుడు ఆ సర్పశరీరము తట్టుకొనలేని బాధకు లోనయ్యెను. అప్పుడు కాళియుడు శ్రీకృష్ణుని విడిచిపెట్టి కుపితుడై తన పడగలను పైకెత్తి నిలబడెను. బుసలుకొట్టుచున్న అతని నాసారంధ్రములనుండి విషజ్వాలలు పెల్లుబుకుచుండెను. దిక్కుతోచని స్థితిలోనున్న అతని చూపులు కాలుచున్న కొరవులవలె ఎఱ్ఱబాఱి యుండెను.


 అతడు తదేకదృష్టితో ఆ బాలకృష్ణుని చూస్తూ ఉండెను,ఆ సమయమున శ్రీకృష్ణుడు తన వాహనమైన గరుత్మంతునివలె ఆ సర్పముయొక్కపడగలపై క్రీడించుచు చిందులు వేయసాగెను. అప్పుడు


 దేవతలు ఆకాశం నుండి మృదంగ, దుందుభి నాదాలు చేస్తుండగా, రత్నాలు పొదిగిన కిరీటధారియై కృష్ణుడు కాళీయుని పడగలపై లయబద్ధంగా అద్భుత తాండవ నాట్యం చేశాడు!


  101 పడగలు కల ఆకాళీయుడు ఇంతవరకు ఎవరికి తలవంచి ఉండడు,కానీ స్వామి అతను ఏ పడగనైతే పైకెత్తుతాడో, ఆ పడగపై తన పాదంతో బలంగా తొక్కుతూ గర్వాన్ని అణచివేశాడు.


   * కాళీయుని నోటి నుండి రక్తపు ధారలు కారాయి; శరీర బలం నశించి నేలకూలాడు.మూర్చపోయాడు.


4. నాగపత్నుల స్తుతి & కాళీయునికి అభయం

కాళీయుని దైన్యస్థితిని చూసి ఆయన భార్యలైన నాగపత్నులు తమ పసిపిల్లలతో సహా కృష్ణుని ముందు సాష్టాంగపడి చేతులు జోడించి కన్నీళ్లతో ప్రార్థించారు:


"ఓ పరమాత్మా! నీవు ధర్మరక్షణ కోసం అవతరించావు. దుర్మార్గుడైన నా పతికి నీవు వేసిన దండన నిజానికి శిక్ష కాదు... ఆయన సమస్త పాపాలను హరించే గొప్ప అనుగ్రహం! మహాయోగుల తపస్సుకు దక్కని నీ చరణ స్పర్శ ఈరోజు నా పతి శిరస్సుకు దక్కింది. మా మాంగల్యాన్ని కాపాడి నా పతికి ప్రాణభిక్ష పెట్టు!"


 నాగపత్నుల భక్తికి కృష్ణుడు కరుణించి కాళీయుడిని వదిలిపెట్టాడు. కృష్ణానుగ్రహం తో తిరిగి స్వస్తుడు అయిన

కాళీయుడు చేతులు జోడించి తప్పు తెలుసుకున్నాడు. స్వామిని స్తుతించాడు,అప్పుడు కృష్ణుడు..


 "కాళీయా! యమునా జలాలను విడిచి నీ పరివారంతో కలిసి సముద్రంలోని 'రమణక ద్వీపానికి' వెళ్ళిపో. నీ శిరస్సుపై నా పాదముద్రలు ఉన్నాయి కాబట్టి, ఇకపై నీ శత్రువైన గరుత్మంతుడు నిన్ను ఏమీ చేయడు" అని అభయమిచ్చాడు.


(కాళీయుడు మొదట రమణక ద్వీపం లోనే ఉండేవాడు, పూర్వం గరుత్మంతుడు కనపడ్డ ప్రతీ సర్పాన్ని తినేస్తుంటే సర్పాలన్నీ కలసి ఆయనతో ఒప్పందం కుదుర్చుకుని అమావాస్య, పౌర్ణమి వంటి రోజుల్లో నీకు ఒక సర్పం ఆహారం గా ఇస్తాం అని ఒప్పందం చేసుకున్నాయి, అయితే 101 పడగలు గల కాళీయుడు నేనే బలవంతున్నీ అని ఆ గరుడ ప్రసాదం ఈయనే స్వీకరించే వాడు దాంతో గరుత్మంతుడు రమణక ద్వీపం మీద దాడి చేసి కాళీయుని చితక బాదాడు, ఎక్కడ ఉన్న తనకు చావు తప్పదు అని భావించి

ఈ మడుగులోకి వచ్చి ఆశ్రయము పొందాడు,ఈ మడుగు వైపు వస్తె మరణిస్తాడు అని గరుత్మంతుడు కి సౌబరి మహర్షి శాపం ఉంది, ఇప్పుడు శ్రీ కృష్ణ పాద స్పర్శ ఉంది కనుక గరుత్మంతుడు ఏమి అనడు)


అలా శ్రీకృష్ణ పరమాత్మ మడుగు నుండి బయటకు వచ్చాక, తమ కోరికలు నెరవేరిన వారు ఎంత సంతోషం పొందుతారో అంత సంతోషం పొందారు ఆ వ్రజ వాసులు.ఆ రాత్రి ఆ నదీ తీరంలోనే అంతా సేదతీరారు,ఆ సమయంలో తీవ్ర దావాగ్ని ఒకటి పుట్టి అడవిని దహించి వేస్తూ ఉంటే దాన్ని స్వీకరించి అందరిని కాపాడాడు స్వామి.

ఎంత ప్రేమించారండి స్వామిని.


5. ప్రలంబాసుర వధ

ఆ తరువాత బలరామకృష్ణులు తోటిబాలుర తో కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, కుస్తీ పడుతు ఒకరిని ఒకరు భళా భళా అనుకుంటూ, గోవులు కాస్తూ సమయం గడుపుతూ ఉన్నారు అలా ఒకరోజు అడవిలో గోవులు కాస్తూ ఉండగా 


ప్రలంబాసురుడు అనే రాక్షసుడు బలరామకృష్ణులను అంతం చేయడానికి ఒక గోపబాలుని వేషంలో వచ్చి వారితో స్నేహం నటించాడు.


అది గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ, అందరిని పిలిచి 

మనం రెండు జట్లుగా విడిపోయి ఆటలు ఆడదాం.ఓడిపోయిన జట్టువారు గెలిచిన వారిని తమ వీపుపై ఎక్కించుకుని ఒక నిర్దిష్ట స్థానం వరకుమోయాలి.అని నిబంధన పెట్టాడు, దాని ప్రకారం ఓడిన వారు గెలిచిన వారిని మోస్తూ క్రీడిస్తూ ఉన్నారు.


కృష్ణుడి బలం తెలిసిన ప్రలంబాసురుడు బలరాముడిని ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకునీ ఆటలో ఓడిపోయినట్లు నటించి, బలరాముడిని వీపుపై ఎక్కించుకుని అడవి వైపు వేగంగా పరుగులు తీశాడు.


కానీ పర్వతమంత బరువున్న ఆ బలరాముని వాడు మోయలేక పోయాడు,భారం పెరగడంతో రాక్షసుడు తన భయంకరమైన నిజరూపాన్ని ధరించాడు. బలరాముడు ఏమాత్రం భయపడకుండా, తన వజ్రసమానమైన పిడికిలితో ప్రలంబాసురుడి తలపై బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు.ఆ దెబ్బకు రాక్షసుని తల పగిలి రక్తం కక్కుకుంటూ ప్రాణాలు విడిచాడు. బలరాముడి పరాక్రమాన్ని చూసి గోపాలురు, దేవతలు పూలవర్షం కురిపించారు.


 * దావాగ్ని ప్రాశనం 


**దావాగ్ని రక్షణ

ఒకనాడు ఆటల ధ్యాసలో పడి ఆవులను పట్టించుకోలేదు దాంతోఅవి 'ఇషీకాటవి' (తుంగ అడవి) అనే దట్టమైన ప్రాంతంలోకి వెళ్ళాయి దారితప్పారు.


ఆ ముంజారణ్యం లో దారి తప్పిన పశువులను వాటిని వెతుక్కుంటూ వెళ్ళిన గోపాలురు ఎంత పిలిచినా అవి జాడలేదు, అప్పుడు 

 శ్రీ కృష్ణ పరమాత్మ యే స్వయంగా పిలువగా ఆ పశువులు అంబ అంబా అంటూ పరుగులు పెట్టుకుంటు వచ్చాయి.


ఆ సమయంలోనే వేసవి ఎండల వల్ల ఆ అడవిలో అకస్మాత్తుగా భయంకరమైన దావాగ్ని (అడవి మంటలు) చెలరేగి, నాలుగు వైపుల నుండి గోపాలురను, పశువులను చుట్టుముట్టింది.


తప్పించుకునే దారి లేక ప్రాణభయంతో అందరూ శ్రీకృష్ణుడిని రక్షించమని వేడుకున్నారు.


శ్రీకృష్ణుడు వారిని ఏమాత్రం భయపడవద్దని చెప్పి, అందరినీ **కళ్ళు మూసుకోమని** ఆజ్ఞాపించాడు. వారు కళ్ళు మూసుకోగానే ఆ భయంకరమైన మంటలన్నింటినీ క్షణంలో తన నోటితో మింగివేశాడు.

 గోపాలురు కళ్ళు తెరిచి చూసేసరికి మంటలన్నీ మాయమై, తామంతా సురక్షితంగా భాండీర వృక్షం(అంతసేపు ఆటలు ఆడిన ప్రదేశం)

వద్ద ఉండటం చూసి శ్రీకృష్ణుని లీలకు ఆశ్చర్యపోయారు.


ఆ తదుపరి సాయంసమయమున గోవులను మఱలించుకొని, తనను గోపబాలురు ప్రస్తుతించుచుండగా వేణునాదమొనర్చుచు వ్రజభూమియందు ప్రవేశించెను. యశోదాది గోపాంగనలు అందఱును పగలంతయును శ్రీకృష్ణుని దర్శనభాగ్యము లేక ప్రతిక్షణమును నూఱు యుగములుగా గడపిరి. సాయం సంధ్యాకాలమున గోవులతో వ్రజభూమికి చేరిన ఆ ప్రభువుయొక్క దర్శనమైనంతనే వారెల్లరును పరమానందభరితులైరి.


📝 నేటి ముఖ్య విషయాలు:

 * విష నివారణ – కాళీయ మర్దనం: మానవ హృదయమే యమునా మడుగు; అందులోని కామ, క్రోధ, మత్సరాలనే విష సర్పాలను భగవంతుని నామస్మరణ అనే పాదస్పర్శతో మాత్రమే అణచివేయగలం.


 * భగవంతుని పాదముద్రల రక్షణ: కాళీయుని తలపై కృష్ణుని పాదం పడటంతోనే గరుడ భయం నశించింది. ఎవరి హృదయంలో భగవత్పాదం నిలుస్తుందో వారికి సంసార మృత్యు భయం ఉండదు.


 * సర్వభక్షకుడైన అగ్నినే మింగిన పరమాత్మ: భౌతిక అగ్నిని తానే మింగివేయడం ద్వారా, భక్తులను సంసార దావాగ్ని తాపాల నుండి రక్షించేది పరమాత్మే అని నిరూపించాడు.


....సశేషం

🙏🌹🙏


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

25-08-2026 మంగళవారం రాశి ఫలితాలు

  శ్రీ మాత్రే నమః🙏

 శ్రీ గురుభ్యోనమః 🙏

25-08-2026 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి.      

--------------------------------------- 


వృషభం


నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. పాత ఋణాలు తీర్చగలరు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

---------------------------------------


మిధునం


వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఇంటాబయట నూతన సమస్యలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. 

---------------------------------------


కర్కాటకం


వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ హోదా పెరుగుతుంది. విద్యార్థుల నూతన విద్యావకాశములు లభిస్తాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

---------------------------------------


సింహం


ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------


కన్య


వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.

---------------------------------------


తుల


నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి.

---------------------------------------


వృశ్చికం


సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

---------------------------------------


ధనస్సు


వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

---------------------------------------


మకరం


వ్యాపార ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

---------------------------------------


కుంభం


వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. 

---------------------------------------


మీనం

 

వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాతమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.   

---------------------------------------

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః ।

శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ।। 41 ।।

అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ ।

ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ।। 42 ।।



ప్రతిపదార్థ:


ప్రాప్య — పొందును; పుణ్య-కృతాం — పుణ్యాత్ముల; లోకాన్ — లోకాలు; ఉషిత్వా — నివసించిన పిదప; శాశ్వతీః — చాలా; సమాః — యుగాలు; శుచీనాం — ధర్మపరాయణుల; శ్రీ-మతాం — సంపన్నుల; గేహే — ఇంటియందు; యోగ-భ్రష్టః — యోగములో సాఫల్యము పొందలేక పోయినవారు; అభిజాయతే — పుట్టెదరు; అథవా — లేదా; యోగినాం — దివ్య జ్ఞానము ప్రసాదించబడ్డ వారి; ఏవ — ఖచ్చితముగా; కులే — కుటుంబములో; భవతి — జన్మించెదరు; ధీ-మతాం — వివేకవంతుల; ఏతత్ — ఇది; హి — నిజముగా; దుర్లభ-తరం — చాలా దుర్లభము; లోకే — ఈ లోకంలో; జన్మ — పుట్టుక; యత్ — ఏదైతే; ఈదృశమ్ — ఇటువంటి.



తాత్పర్యము: 


యోగ భ్రష్టులైన వారు (ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు), పుణ్య లోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప, వారు తిరిగి భూలోకంలో, ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా, ఏంతో కాలం యోగ అభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారయితే, దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా లోకంలో చాలా దుర్లభము.



వివరణ:


ప్రాపంచిక పుణ్య కార్యాలు చేసినవారికి, వేదాలలో చెప్పబడిన సకామ కర్మ కాండలు చేసిన వారికి స్వర్గలోక నివాసం ప్రసాదించబడుతుంది. మరైతే, యోగభ్రష్టుడు ఈ స్వర్గ లోకాలకు ఎందుకు పోవాలి? దీనికి కారణం ఏమిటంటే, యోగమునకు (భగవంతునితో సంయోగం) వ్యతిరేకమైనది భోగము (భౌతిక అనుభూతులు). భోగముల మీద ఆసక్తి వలన వ్యక్తి యోగము నుండి భ్రష్టుడై పోతాడు. కాబట్టి భగవంతుడు, దయాళువైన తండ్రి లాగా, ఓ పడిపోయిన యోగికి, భోగ విలాసాల కోసం ఒక అవకాశం ఇచ్చి, అవన్నీ వ్యర్థమైనవి, అవి ఆత్మ కోరుకునే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుసుకునేలాగా చేస్తాడు. కాబట్టి, భ్రష్టుడైన యోగి కొన్నిసార్లు చాలా కాలం పాటు స్వర్గ లోకాలకు పంపబడి, తిరిగి ఈ భూలోకానికి పంపబడుతాడు.


ఇటువంటి జీవులకు తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించటానికి అవకాశం ఉండే కుటుంబంలో జన్మ ఇవ్వబడుతుంది. శుచీ అంటే పవిత్రమైన మరియు మంచి నడవడిక కలవారు అని అర్థం; శ్రీ అంటే సంపన్నులు అని అర్థం. యోగ భ్రష్టులైన వారు, పవిత్రమైన కుటుంబంలో చిన్నప్పటి నుండే ఆధ్యాత్మికత నేర్పించే వారికి జన్మిస్తారు లేదా సంపన్నుల కుటుంబంలో, భౌతిక అవసరాలు అన్నీ తీరి, బతుకు తెరువు కోసం రోజూ ప్రయాస పడే అవసరం లేని వారికి జన్మిస్తారు. ఇటువంటి కుటుంబ వాతావరణం ఆధ్యాత్మిక పరిశ్రమలో నిమగ్నమవటానికి, అటువంటి ఆసక్తి కల జీవులకు అనుకూలంగా ఉంటుంది.


మనం పుట్టిన పరిస్థితులు, స్థానము, మరియు కుటుంబము అనేవి మన జీవితంపై ఎంతో ప్రభావం కలిగి ఉంటాయి. మన శారీరిక తల్లిదండ్రుల నుండి మనం వంశపారంపర్యమైన గుణాలను పొందుతాము. ఇది జన్యు సంబంధమైన వంశపారంపర్య పద్దతి. కానీ, సామాజిక వారసత్వ పద్దతి కూడా ఉంటుంది. మనం చాలా ఆచారాలని మనం పెరిగిన వాతావరం వలన గుడ్డిగా పాటిస్తుంటాము. మనం భారతీయులమా, అమెరికన్లమా, బ్రిటిష్ వారిమా అని, మనకు మనం ఎంచుకోము. మన జన్మ ప్రకారం మనం ఎదో ఒక జాతీయతను ఆపాదించుకొనటమే కాకుండా వేరే దేశీయులతో శతృత్వం కూడా పెంచుకునేంత వరకు పోతాము. ఖచ్చితంగా మనం, సామాజిక వారసత్వంలో భాగంగా మన తల్లిదండ్రుల మతాన్నే అనుసరిస్తాము.


ఈ విధంగా, మనం పుట్టిన స్థలం మరియు కుటుంబం మన జీవిత గమనం మరియు పురోగతిపై చాలా చాలా ప్రభావం కలిగి ఉంటాయి. ఒకవేళ, ప్రతి జన్మలో, పుట్టే స్థలం మరియు కుటుంబం ఎదో కాకతాళీయంగా నిర్ణయించబడితే ఈ ప్రపంచంలో న్యాయం లేనట్టే. కానీ, మన యొక్క అనంతమైన జన్మల తలంపులు, పనుల చిట్టా భగవంతుని దగ్గర ఉంది. కర్మ సిద్ధాంత శాసనముని అనుసరించి, యోగంలో సాఫల్యం పొందలేకపోయిన యోగి యొక్క పూర్వ జన్మ ఆధ్యాత్మిక సంపద, దాని ఫలములను ఇస్తుంది. ఆ ప్రకారంగానే, ఎంతో పురోగతి సాధించి మరియు వైరాగ్యం పెంపొందించుకున్న యోగులు, స్వర్గ/పుణ్య లోకాలకు పంపబడరు. వారికి, తమ ప్రయాణం ముందుకు తీసుకువెళటానికి అనుకూలముగా, ఆధ్యాత్మికతలో ఉన్నతమైన దశలో ఉన్న కుటుంబంలో ఇక్కడే జన్మ ఇవ్వబడుతుంది. అటువంటి జన్మ అత్యంత భాగ్యవంతమైనది ఎందుకంటే, ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకి చిన్నతనం నుండే ఆధ్యాత్మిక ది--------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః ।

శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ।। 41 ।।

అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ ।

ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ।। 42 ।।



ప్రతిపదార్థ:


ప్రాప్య — పొందును; పుణ్య-కృతాం — పుణ్యాత్ముల; లోకాన్ — లోకాలు; ఉషిత్వా — నివసించిన పిదప; శాశ్వతీః — చాలా; సమాః — యుగాలు; శుచీనాం — ధర్మపరాయణుల; శ్రీ-మతాం — సంపన్నుల; గేహే — ఇంటియందు; యోగ-భ్రష్టః — యోగములో సాఫల్యము పొందలేక పోయినవారు; అభిజాయతే — పుట్టెదరు; అథవా — లేదా; యోగినాం — దివ్య జ్ఞానము ప్రసాదించబడ్డ వారి; ఏవ — ఖచ్చితముగా; కులే — కుటుంబములో; భవతి — జన్మించెదరు; ధీ-మతాం — వివేకవంతుల; ఏతత్ — ఇది; హి — నిజముగా; దుర్లభ-తరం — చాలా దుర్లభము; లోకే — ఈ లోకంలో; జన్మ — పుట్టుక; యత్ — ఏదైతే; ఈదృశమ్ — ఇటువంటి.



తాత్పర్యము: 


యోగ భ్రష్టులైన వారు (ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు), పుణ్య లోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప, వారు తిరిగి భూలోకంలో, ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా, ఏంతో కాలం యోగ అభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారయితే, దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా లోకంలో చాలా దుర్లభము.



వివరణ:


ప్రాపంచిక పుణ్య కార్యాలు చేసినవారికి, వేదాలలో చెప్పబడిన సకామ కర్మ కాండలు చేసిన వారికి స్వర్గలోక నివాసం ప్రసాదించబడుతుంది. మరైతే, యోగభ్రష్టుడు ఈ స్వర్గ లోకాలకు ఎందుకు పోవాలి? దీనికి కారణం ఏమిటంటే, యోగమునకు (భగవంతునితో సంయోగం) వ్యతిరేకమైనది భోగము (భౌతిక అనుభూతులు). భోగముల మీద ఆసక్తి వలన వ్యక్తి యోగము నుండి భ్రష్టుడై పోతాడు. కాబట్టి భగవంతుడు, దయాళువైన తండ్రి లాగా, ఓ పడిపోయిన యోగికి, భోగ విలాసాల కోసం ఒక అవకాశం ఇచ్చి, అవన్నీ వ్యర్థమైనవి, అవి ఆత్మ కోరుకునే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుసుకునేలాగా చేస్తాడు. కాబట్టి, భ్రష్టుడైన యోగి కొన్నిసార్లు చాలా కాలం పాటు స్వర్గ లోకాలకు పంపబడి, తిరిగి ఈ భూలోకానికి పంపబడుతాడు.


ఇటువంటి జీవులకు తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించటానికి అవకాశం ఉండే కుటుంబంలో జన్మ ఇవ్వబడుతుంది. శుచీ అంటే పవిత్రమైన మరియు మంచి నడవడిక కలవారు అని అర్థం; శ్రీ అంటే సంపన్నులు అని అర్థం. యోగ భ్రష్టులైన వారు, పవిత్రమైన కుటుంబంలో చిన్నప్పటి నుండే ఆధ్యాత్మికత నేర్పించే వారికి జన్మిస్తారు లేదా సంపన్నుల కుటుంబంలో, భౌతిక అవసరాలు అన్నీ తీరి, బతుకు తెరువు కోసం రోజూ ప్రయాస పడే అవసరం లేని వారికి జన్మిస్తారు. ఇటువంటి కుటుంబ వాతావరణం ఆధ్యాత్మిక పరిశ్రమలో నిమగ్నమవటానికి, అటువంటి ఆసక్తి కల జీవులకు అనుకూలంగా ఉంటుంది.


మనం పుట్టిన పరిస్థితులు, స్థానము, మరియు కుటుంబము అనేవి మన జీవితంపై ఎంతో ప్రభావం కలిగి ఉంటాయి. మన శారీరిక తల్లిదండ్రుల నుండి మనం వంశపారంపర్యమైన గుణాలను పొందుతాము. ఇది జన్యు సంబంధమైన వంశపారంపర్య పద్దతి. కానీ, సామాజిక వారసత్వ పద్దతి కూడా ఉంటుంది. మనం చాలా ఆచారాలని మనం పెరిగిన వాతావరం వలన గుడ్డిగా పాటిస్తుంటాము. మనం భారతీయులమా, అమెరికన్లమా, బ్రిటిష్ వారిమా అని, మనకు మనం ఎంచుకోము. మన జన్మ ప్రకారం మనం ఎదో ఒక జాతీయతను ఆపాదించుకొనటమే కాకుండా వేరే దేశీయులతో శతృత్వం కూడా పెంచుకునేంత వరకు పోతాము. ఖచ్చితంగా మనం, సామాజిక వారసత్వంలో భాగంగా మన తల్లిదండ్రుల మతాన్నే అనుసరిస్తాము.


ఈ విధంగా, మనం పుట్టిన స్థలం మరియు కుటుంబం మన జీవిత గమనం మరియు పురోగతిపై చాలా చాలా ప్రభావం కలిగి ఉంటాయి. ఒకవేళ, ప్రతి జన్మలో, పుట్టే స్థలం మరియు కుటుంబం ఎదో కాకతాళీయంగా నిర్ణయించబడితే ఈ ప్రపంచంలో న్యాయం లేనట్టే. కానీ, మన యొక్క అనంతమైన జన్మల తలంపులు, పనుల చిట్టా భగవంతుని దగ్గర ఉంది. కర్మ సిద్ధాంత శాసనముని అనుసరించి, యోగంలో సాఫల్యం పొందలేకపోయిన యోగి యొక్క పూర్వ జన్మ ఆధ్యాత్మిక సంపద, దాని ఫలములను ఇస్తుంది. ఆ ప్రకారంగానే, ఎంతో పురోగతి సాధించి మరియు వైరాగ్యం పెంపొందించుకున్న యోగులు, స్వర్గ/పుణ్య లోకాలకు పంపబడరు. వారికి, తమ ప్రయాణం ముందుకు తీసుకువెళటానికి అనుకూలముగా, ఆధ్యాత్మికతలో ఉన్నతమైన దశలో ఉన్న కుటుంబంలో ఇక్కడే జన్మ ఇవ్వబడుతుంది. అటువంటి జన్మ అత్యంత భాగ్యవంతమైనది ఎందుకంటే, ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకి చిన్నతనం నుండే ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని బోధిస్తుంటారు.వ్య జ్ఞానాన్ని బోధిస్తుంటారు.

పంచాంగం 25.08.2026 Tuesday,

 ఈ రోజు పంచాంగం 25.08.2026 Tuesday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి భౌమ వాసర ఉత్తరాషాఢ నక్షత్రం ఆయుష్మాన్ యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: త్రయోదశి.



 

నమస్కారః , శుభోదయం