8, మార్చి 2022, మంగళవారం

వైద్య ప్రక్రియలు

 ఆయుర్వేదం నందు నవరత్నాలను ఉపయోగించి చేయు వైద్య ప్రక్రియలు  -


     నవరత్నాలు అనగా మాణిక్యం , ముత్యము , పగడము , పచ్చ, పుష్యరాగము , వజ్రము , నీలము , వైడూర్యము , గోమేధికము  ఈ తొమ్మిదింటిని  నవరత్నాలు అని పిలుస్తారు . చాలామందికి ఇవి కేవలం ఆభరణాలలో ఉపయోగించు విలువయిన రాళ్ళగా మాత్రమే పరిచయం . భారతీయ పురాతన ఆయుర్వేద వైద్యులు వీటిలోని ఔషధ గుణాలను తమ పరిశోధనల ద్వారా తెలుసుకుని వాటిని తమ వైద్యములో విరివిగా ఉపయోగించారు. వారు తమ పరిశోధనా ఫలితాలను తమ గ్రంథాలలో సంపూర్ణంగా వివరించారు . ఇవి ఎక్కువుగా సంస్కృత లిపిలో ఉన్నాయి . ఈ మధ్యకాలంలో నేను అటువంటి పురాతన గ్రంథాలను సేకరించి వాటిపైన కొంత పరిశోధన కూడా చేశాను . ఆ విలువైన సమాచారాన్ని ఇప్పుడు మీకు నేను అందించబోవుతున్నాను.


         జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మాణిక్యం అనగా కెంపు సూర్యునకు , ముత్యము చంద్రునకు , పగడము అంగారకునకు , మరకతము అనగా పచ్చ బుధునకు , పుష్యరాగము గురువునకు , వజ్రము శుక్రునకు , నీలము శనికి , వైడుర్యము రాహువునకు , గోమేధికము కేతువునకు ప్రీతికరములు మరియు ప్రతిరూపములుగా పేర్కొన్నారు . మరియు ఆయా గ్రహ దోషములకు ఆయా రత్నములను ధరించి గ్రహపీడ నుండి బయటపడవచ్చు.


            ఇప్పుడు ఆయుర్వేదం నందలి నవరత్నాల ఉపయోగాలు మీకు తెలియచేస్తాను .


 *  మాణిక్యం  -


           ఈ మాణిక్యం పద్మరాగము అని ప్రసిద్ధి కలిగినది . తామరరేకు వన్నె కలిగి బరువుతో స్ఫుటంగా ఉండును. మిక్కిలి కాంతివంతముగా ఉండును. స్ఫుటముగా , బరువుగా , గుండ్రముగా ఉండు మాణిక్యం పరిశుద్ధం అయినది.  ఈ మాణిక్యమును సరైన పద్ధతుల్లో శుద్దిచేసి పుటం పెట్టి ఆ భస్మమును ఉపయోగించిన  శరీరము నందలి వాత,పిత్త, శ్లేష్మములను శాంతింపచేసి అగ్నిదీపమును కలిగించును. శరీరముకు దారుఢ్యము కలిగించును. మరియు దీనిని ధరించిన  భూత , బేతాళ పీడలు తొలగును . అతి భయం వంటి మానశిక దోషాలలో ఇది మంచి ప్రభావం చూపించును.


 *  ముత్యము  -


           గుండ్రగా ఉండి తెల్లని కాంతి కలిగి , తేలికైనది , నీటి కాంతి కలిగి , నిర్మలంగా ఉండి అందంగా ఉన్న ముత్యము శుభకరమైనది. వెలవెలపోతూ పైన పొరలుపొరలుగా ఉండి గొగ్గులుగొగ్గులుగా ఉన్నది మంచి ముత్యం కాదుగా గ్రహించాలి.ఇలాంటి ముత్యాలను అసలు వాడకూడదు.


          మంచి ముత్యమును పుఠం పెట్టి భస్మం చేసి ఒక మోతాదులో ప్రతినిత్యం పుచ్చుకొనుచున్న మనుజులకు రక్తపిత్తం, క్షయ వంటి రోగాలు నిర్మూలనం అగును. దేహమునకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. ఆయుష్షును వృద్దిచేయును . వీర్యవృద్ధి చేయును , శరీరం నందు జఠరాగ్ని వృద్ధిచెందించి శరీరానికి ఉత్సాహం కలుగచేయును .


 *  పగడం  -


            బాగా పండిన దొండపండు వలే ఎర్రని రంగు కలిగి గుండ్రని నునుపైన బుడిపెలు , వంకరలు , తొర్రలు మొదలగునవి లేకుండా పెద్దగా ఉండు పగడం శ్రేష్టమైనది. శుభప్రదం అయినది. 


          మంచి పగడమును సేకరించి సహదేవి ఆకు రసము నందు నానబెట్టిన శుద్ది అగును. దానిని భస్మము చేసి సేవించిన యెడల క్షయరోగములు , రక్తపిత్తములు , కాసరోగము , నేత్రరోగములు , విషదోషాలు మున్నగు వాటిని శమింపచేయును . అగ్నిదీప్తిని , జీర్ణశక్తిని కలిగించి వార్ధక్యమును పోగొట్టి దేహమునకు కాంతిని , బలమును కలిగించును. దీనిని ముట్టునొప్పికి విశేషముగా వాడుదురు.


 *  గరుడ పచ్చ  -


         మంచి గరుడపచ్చ ఆకుపచ్చని రంగు కలిగి మెరుగులు తేలుతూ బరువుగా , నున్నగా ఉండును. మిక్కిలి కాంతిమంతంగా ఉండును. దీనిని ఔషధముల యందు ఉపయోగించవచ్చు . తెల్లగా , నల్లగా , బుడుపులు కలిగి ఉన్న , పెలుసుగా ఉన్న ఆ పచ్చ మంచిది కాదు అని అర్థం .


            గరుడ పచ్చను ఆవుపాలలో నానబెట్టి శుద్దిచేసి భస్మము చేసి సేవించుతున్న పాండువ్యాధులు , మొలలు , విషదోషాలు , సన్నిపాత జ్వరాలు , సామాన్య జ్వరాలు , వాంతులు , శ్వాస సంబంధ సమస్యలు , కాసరోగం , అగ్నిమాంద్యం వంటి రోగాలను పోగొట్టును . దేహమున మిక్కిలి కాంతిని ఇచ్చి మేలుచేయును .


 *  పుష్యరాగము  -


           పుష్యరాగము శుద్ధముగా , నునుపుగా , లావుగా , బరువుగా , ఎగుడుదిగుడు లేనిదిగా ఉండి గోగుపూవ్వు రంగు కలిగి తళతళ ప్రకాశించుచుండును. ఇట్టి లక్షణాలు కలిగినది అత్యుత్తమం అయినది.ఇలా కాక గోరోచనపు రంగు గాని పచ్చగా కాని మిక్కిలి తెలుపుగా గాని ఉండిన మంచిది కాదు.


             దీని భస్మం సేవించిన తీవ్రమగు దాహమును , వాంతులను , వాతరోగములను , కుష్టు వ్యాధిని , విషదోషములను పోగొట్టి దేహమునకు మిక్కిలి కాంతిని కలుగచేయును .


 *  వజ్రము  - 


            ఈ వజ్రము నందు స్త్రీ, పురుష , నపుంసక అని మూడు రకాల జాతులు కలవు.


       ఎనిమిది అంచులు కలిగి , పక్షములు ఎనిమిది , కోణములు ఆరు కలిగి ఇంద్రధనస్సు వలే ప్రకాశించుతూ నీటివలె నీడదేరునది పురుషవజ్రము అనబడును.


             గుండ్రనైన ఆడుకులు గట్టి ఉండు ఆకారం కలిగి ఉండినది స్త్రీ వజ్రం అనబడును.


        మణిగిపోయిన మూలాలు , అగ్రమును కలిగి ఉండి మిక్కిలి గుండ్రముగా ఉండునది నపుంసక వజ్రం అనబడును. 


           మంచి పురుషజాతి వజ్రమును భస్మం చేసి వాడుతున్న సమస్తరోగములను పోగొట్టి వీర్యాభివృద్ధిని కలిగించి వార్థక్యమును పోగొట్టి బాగుగా ఆకలి పుట్టించును . మానవులకు ఇది అమృతప్రాయమై ఉండును. 


 * నీలము  -


           దీనిలో జలనీలము , ఇంద్రనీలము అను రెండు విభిన్న రకాలు కలవు. ఇందులో ఇంద్రనీలము శ్రేష్టము . జలనీలము తేలికగా ఉండి తెలుపుతో కూడిన వర్ణము కలిగి ఉండును. ఇంద్రనీలము బరువుగా ఉండి నలుపువర్ణము నందు నీలం మిశ్రితము కాక నీలవర్ణం కాంతి కలిగి నునుపుగా మలినం లేకుండా మృదువుగా మద్యభాగము నందు కాంతి కలిగి ఉండును. ఇది అత్యంత శ్రేష్టం అయినది.


             ఈ నీలమును గాడిద మూత్రములో నానబెట్టి మంచి తీవ్రత కలిగిన ఎండలో ఎండించిన శుద్ధం అగును.


        ఈ భస్మాన్ని ఉపయోగించుతున్న శ్వాస , కాస రోగాలు మానును . వీర్యవర్ధకం , త్రిదోషాలను హరించును . అగ్నిదీప్తిని పెంచును. విషమజ్వరం , మూలశంఖ రోగము , పాపసంబంధ రోగాలను హరించును .


 *  వైడుర్యము  -


           నలుపు , తెలుపు కాంతి కలిగి సమానమై , స్వచ్ఛమై , బరువై , స్ఫుటమై , లొపల తెల్లని ఉత్తరీయము వంటి పొర కలిగినది శ్రేష్టమైన వైడుర్యము . నల్లగా కాని తెల్లగా కాని ఉండి పారలుపొరలుగా ఉండి లొపల ఎర్రని ఉత్తరీయము వంటి పొర కలిగినది చెడు వైడుర్యముగా గుర్తించవలెను . మంచిది కాదు.


        దీనిని కొండపిండి రసములో నానబెట్టి ఎండించి బాగా కాల్చి ఆ తరువాత గజపుటము వేయవలెను .


         ఈ భస్మము రక్తపిత్తవ్యాధిని హరించును . బుద్ధిని , శరీర బలాన్ని , ఆయుర్వృద్దిని కలిగించును. పిత్తాన్ని పెంచును , అగ్నిదీప్తిని చేయును . మలములను శరీరం బయటకి వెడలించును.


 *  గోమేధికం  -


            ఇది ఆవుయొక్క మెదడుని పోలి ఉండటం వలన గోమేధికం అని పేరు వచ్చినది . ఇది స్వచ్చమైన గోమూత్రము కాంతి కలిగి నునుపుగా ఉండి హెచ్చుతగ్గులు లేకుండా బరువుగా ఉండి పొరలు లేకుండా దట్టముగా ఉండును. మెరుపు లేకుండా తేలికగా ఉండి కాంతివిహీనం అయి గాజుపెంకు వలే ఉండునది దోషయుక్తము .


          దీనిని గోమూత్రము నందు నానబెట్టి ఎండించి ఆ తరువాత నేలగుమ్ముడు సమూల రసము నందు నానబెట్టి ఆ తరువాత ఎండించిన శుద్ది అగును. ఆ తరువాత నల్ల ఉమ్మెత్తకు రసము నందు నానబెట్టి ఎండించి పుఠం పెట్టిన భస్మం అగును.


        ఈ గోమేధిక భస్మమును శ్లేష్మ, పైత్య రోగాలు , క్షయ , పాండువు వంటి రోగాల నివారణలో వాడతారు. అగ్నిదీప్తిని కలిగించి ఆహారాన్ని జీర్ణం చేయును . రుచికరంగా ఉండును. ఇంద్రియాలకు బుద్దిని , బలాన్ని ఇచ్చును.


         పైన చెప్పినటువంటి రత్నభస్మాలను అనుభవవైద్యుల పర్యవేక్షణలోనే తగినమోతాదులో వాడవలెను. స్వంత నిర్ణయాలు మంచివి కాదు.


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . 



            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

మహిళా సంభావ్య

 👧🏻👩🏻👱‍♀️ *మహిళా సంభావ్య* 🧎🏻‍♀️🏃‍♀️👸🏻


అడుగడుగునా ప్రేమ చిరునామా నువ్వు

అలసటన్నదే ఎరుగని అనురాగం నువ్వు

అంకురాలను ఆకాశానికి చిగురింపచేస్తావు

అమరత్వం ఆపాదించుకొని నిలిచిపోతావు. 


సంతానంగా వెలిసి సంతసింపజేస్తావు

సహోదరిగా చేరి ప్రేమను పారిస్తావు 

స్వామిసేవలో సదా తరిస్తుంటావు

సంతానం చెంత పంతం వదిలేస్తావు

సంసారంలో సరిగమ శ్రుతిలా నిలుస్తావు

 

సంస్కారానికి సంగమ గీతిక నీవౌతావు

సంస్కృతికి రూపంగా భాసిస్తావు

సంఘంలో సంగీభావమై ప్రవహిస్తావు

సంతానానికి నీవే గీతవై ప్రవచిస్తావు

సకారాత్మతకు సాకార రూపం నీవు


సాధికారత లేనిచోటా సమరం సాగిస్తావు

సంకేళ్లలో కూడా సహనం పాటిస్తావు

సంకటంలోనూ సమిధగా వెలుగుతావు

సంచిత ఖర్మకు నీవే సాటిగా నిలుస్తావు

సాయుజ్యం కోరుకొని సాధుజీవి నీవు.


సాకారం నీతోనే ప్రతి మగాడి జన్మం

మానవాళి ప్రగతికి నీవే ప్రధానం

సహజ ప్రకృతికి సంభావ్యత నీవు

సదా నీ త్యాగాలకు శానార్తులిడుతాను.


💐 *మహిళా దినోత్సవ (08.03.2022) శుభాకాంక్షలతో...* 🙏


✍️ మీ తుమ్మ జనార్దన్ (జాన్) 🙂🏃‍♀️🏃‍♀️🏃‍♀️

Asudhaara vratam

 HAPPY WOMEN'S DAY 


🤪😂😫😱👊🤪

ఒక అందమైన భార్య పని అంతా ముగించుకుని బెడ్ రూమ్ లోకి వచ్చేసరికి  అప్పుడే టీవీ లో వస్తున్న వార్తలను చూసి కొంచెం విసుగ్గా ఆ దరిద్రపు రష్యా కు ఏమైంది....⁉️⁉️⁉️

 చూడు Ukraine వాళ్ళెంత ఇబ్బంది పడుతున్నారో అంటాడు మొగుడు తన పెళ్లాంతో

సెల్ లో వీడియో చూస్తూ ...


ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లి పక్క సర్దుకుంటూ... అప్పటికే పడుకున్న పిల్లలకు దుప్పటి బాగా విదిలించి  కప్పుతుంది... అతడి మాటల్ని వినీ విననట్లుగా.... 

నీకే చెప్పేది ...!

 వాడలా రెచ్చిపోతుంటే ప్రపంచ దేశాలేమి చేస్తున్నాయి...❓

 నీవేంది అలా దిబ్బ రొట్టె ముఖం వేసి చూస్తున్నావు ....❓ వాడిష్టం వాడు NATO లో చేరుతాడో ... లేక ఇంకోదానిలో చేరుతాడో వీడికేమైందట ... ⁉️

 వీడికేమవసరం ...⁉️⁉️⁉️

 అలా రెచ్చిపోతాడా ...⁉️ 

అంటూ ఉక్రోష పడతాడు మొగుడు పెళ్ళాం మీద.

నటుడు పృద్విరాజ్ లెవెల్లో... 


ఇవేవీ పట్టించుకోకుండా పాపం ఆమె అటు తిరిగి పడుకుంటుంది.

 రేపు ఉదయం మళ్లీ తొందరగా లేవాలని, పిల్లలకి బాక్స్ లో ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ...... 


రష్యా  ఉక్రెయిన్ మీద దాడి చేసిన దానికన్నా ,తన పెళ్ళాం తనకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా పడుకోవడం అస్సలు సహించలేక పోతున్నాడు మొగుడు ...


 అసలే ఉదయం నుంచి ఎన్నో పేపర్లు, యూట్యూబ్ ఛానళ్లు ,చర్చా వేదికలు వినీ వినీ వినీ తన పాండిత్యాన్ని భార్య దగ్గర చూపించాలని ముచ్చట పడుతుంటే...,

 ఆమె అలా సింపుల్ గా అతడి మాటలు పట్టించుకోకుండా పడుకోవడం అతనికి ఎక్కడో బాధించింది ... 

🥸🥸🥸🥸🥸🥸🥸


 తనేదో గొప్ప విజ్ఞానఖని అని... సమస్తం అతడికే తెలుసని... పెళ్ళానికి ఏమీ తెలియని వెర్రి బాగుల్ది అని అతని ప్రగాఢ విశ్వాసం. కొంతైనా ఆమెను ఎడ్యుకేట్ చేయాలని అతడి తాపత్రయం ...


ఆ Frustration లో ... అసలు వాడ్ని కాదే నిన్ను..., నిన్ను అనాలి కనీసం అవగాహన లేకుండా , తిన్నామా, పడుకున్నామా అని కాదే ...

  మన చుట్టూ ఏమి జరుగుతుందో  తెలుసుకునే పనిలేదా... 😇😇😇  


అందుకే...,

 పేపర్ చదవ్వే కొద్దిగానైనా వార్తలు చూడవే, నాలాంటి వాడితో అప్పుడప్పుడు చర్చించవే ... అని నెత్తీ నోరు కొట్టుకునేది ...

 వింటేగా...,

 ఆమాత్రం పరిజ్ఞానం లేని దాన్ని  నాకిచ్చి పెళ్లి చేసావేమయ్యా దేవుడా అని ఒకసారి పైకి చూసి మళ్లీ ఏదో గొణుక్కుంటూ కూర్చుంటాడు సెల్ తీసుకుని వాట్స్ అప్ ఓపెన్ చేసి ...


*చూసీ చూసీ చూసీ* .... 

ఇక తప్పదన్నట్లుగా ...,


 కోపం వచ్చి విసురుగా లేచి అతడిని సీరియస్ గా చూసి  వంటింట్లోకి  వెళ్లి  పెద్ద కత్తి తెచ్చుకుని , పక్కన పెట్టుకుని అలా మంచం మీద పడుకొని లైట్ ఆర్పేసి, అదోలా చూస్తూ వచ్చి పడుకోండి అంటుంది మురిపెంగా ...


అదంతా చూసిన మొగుడికి అప్పటికే  ముచ్చెమటలు పోసాయి ... ఎక్కడెక్కడో తడిచిపోతుంది .... మెల్లగా టవల్ తో తుడుచుకుంటూ ... 🤧🤧🤧


అదేంటే ..., అంత పెద్ద కత్తి తెచ్చుకుని అలా పెట్టుకుని పడుకుంటే నీ దగ్గర నేను ఎలా పడుకునేది ... 😱😱😱 అంటాడు భయం భయంగా ...  అటూ ఇటూ చూస్తూ...,


*ఒక్కసారి అతడిని పైకి కిందికి ఎగాదిగా చూసి* ...!!!


నీ భార్యనైన నేనే..., ఒక కత్తి తెచ్చుకుని పడుకుంటే నీవు ధైర్యంగా పడుకోలేక పోతున్నావే... మరి అమెరికాకు అమ్ముడుబోయి NATO లో చేరాలని ఉవ్విల్లూరుతూ, రష్యా కు పక్కలో బల్లెంలా తయారయిన ఉక్రెయిన్ ని పక్కలో పెట్టుకుని రష్యా ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది అని చెప్పి అటు మల్లి పడుకుంటుంది భార్య ...


ఇంకేం గింగిరాలు తిరుగిన భర్త ... అప్పుడు తెరిచిన నోరు ఇంకా మూసుకోలేదు.

 పాపం భర్త ...  

😩😩😩😫😫😫😩


Note: ఆడవారిని తక్కువగా అంచనా వేయవద్దు ...

*మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో*.....

😂😂😂🤪🤪🤪

ఆడాళ్ళు...మీకు జోహార్లు*

 *ఆడాళ్ళు...మీకు జోహార్లు*


*అంతర్జాతీయ మహళా దినోత్సవ శభాకాంక్షలు*💐💐


ఇలా ఒక రోజంటూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాలంటే కొంచం కష్టంగానే వుంది. ఏ పాత్ర తీసుకున్నా అమ్మగా,ఆలిగా,అక్కగా,చెల్లిగా, కూతురిగా,గురువుగా ఇలా ఏ పాత్ర తీసుకున్నా ఆ పాత్రలో పరిపూర్ణ న్యాయం చేసి ప్రాణం పెట్టే *ఆడవాళ్ళూ...మీకు జోహార్లు*

ఇక ఏ రంగంలో అడుగపెట్టినా తమదైన ముద్ర వేసుకొని, తమ సత్తా చాటుతూ,ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న *ఆడవాళ్ళూ ...మీకు అందరికీ శుభాభినందనలు*

*ఆడాళ్ళు...మీకు జోహార్లు....* ఇలా లోకం మొత్తం చెప్తుంది.

నిజమే! ఆడవాళ్ళకు ఆడవాళ్లే సాటి...

ఎలా ఉన్నా ఆ కష్టంతో ఎవరూ చేయలేరు పోటీ.


*అంతర్జాతీయ మహళా దినోత్సవ శభాకాంక్షలు*💐💐💐

                         వేణుగోపాల్.!

స్త్రీ సహనశీల

 స్త్రీ సృష్టి రస భావ తపన ప్రకృతి,

స్త్రీ సహనశీల రాగ శృతి త్యాగ కృతి.

స్త్రీమమకార మమతానురాగ శక్తి.

సంయుక్తాక్షరం స్త్రీ బహుముఖ శక్తినే.

ఒక్కరోజుసుల్తాన్ దండం దండాలు కాదు,

విశ్వజనని విశాలత్వ విశ్వాసిని వనితనే.

మహిళ దేవత మహారాణి ఎన్నటికీ గృహరాణి.

మహికికళ,మహిత గళ, మాత్రుత్వ మాధ్వినే.

అసామాన్యం స్రీతత్వం ఆమెజనని జగతి సృష్టి ముద్ర,,

అనన్య పన్నీటి రసముద్ర, సహన శీల కన్నీటి సముద్ర.

బాధ్యత బహుముఖి,బాధ్యత బాసటల బహుముఖిగా,

భువన బావుటాల భావి కాంతుల బహు రూప రాగిణి.

Dr. Vedula sriramsarma "sirisha"

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 🌹🙏👍

Aly. Ln. Dr. Vedula"sirisha "🌹🙏

జీవుడు ఆత్మవిద్యచే పరిశుద్ధుడగును

 కాలేన స్నాన శౌచాభ్యాం 

సంస్కారైస్తప సేజ్యయా

శుధ్యంతి దానైస్సంతుష్ట్యా ద్రవ్యాణ్యాత్మాత్మవిద్యయా |


కాలముచే మట్టి ఉన్న నీరు, స్నానముచే దేహము, ఉతుకుటచే వస్త్రము, గర్భాధానాది సంస్కారముల యాగముచే బ్రాహ్మణుడు, దానములచే ధనము, సంతో షముచే మనస్సు అనే ద్రవ్యములు శుద్ధములగును. జీవుడు ఆత్మవిద్యచే పరిశుద్ధుడగును - భాగవతం