స్త్రీ సృష్టి రస భావ తపన ప్రకృతి,
స్త్రీ సహనశీల రాగ శృతి త్యాగ కృతి.
స్త్రీమమకార మమతానురాగ శక్తి.
సంయుక్తాక్షరం స్త్రీ బహుముఖ శక్తినే.
ఒక్కరోజుసుల్తాన్ దండం దండాలు కాదు,
విశ్వజనని విశాలత్వ విశ్వాసిని వనితనే.
మహిళ దేవత మహారాణి ఎన్నటికీ గృహరాణి.
మహికికళ,మహిత గళ, మాత్రుత్వ మాధ్వినే.
అసామాన్యం స్రీతత్వం ఆమెజనని జగతి సృష్టి ముద్ర,,
అనన్య పన్నీటి రసముద్ర, సహన శీల కన్నీటి సముద్ర.
బాధ్యత బహుముఖి,బాధ్యత బాసటల బహుముఖిగా,
భువన బావుటాల భావి కాంతుల బహు రూప రాగిణి.
Dr. Vedula sriramsarma "sirisha"
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 🌹🙏👍
Aly. Ln. Dr. Vedula"sirisha "🌹🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి