16, జనవరి 2023, సోమవారం

llసీసమాళికll

 🌿 *సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో*  🌿


llసీసమాళికll

భానుడు మకరాన భాసితమగు వేళ

దక్షణాయనకాలమోక్షమవగ


కొత్త అల్లుళ్ళతో కోడిపందాలతో

బోగిమంటల తోడ బోగమలర


రంగురంగులతోటి రంగవల్లి విరియ

ముంగిళ్ళు ముత్యాల ముగ్గు మెరిసె


ముదితలందరినోము ముచ్చటను గొలుపు

హరిదాసు కీర్తన హాయినిచ్చు


బోగిపండ్లతలలు బొమ్మరిల్లు కొలువు

గంగిరెద్దాటలు ఘనతదెల్పు


బోగి మకర సాగు ముక్కనుమకనుమ

ముచ్చట సంక్రాంతి మురుయు కాంతి


నిలిచి యుండునుగాక నిండైనహృదయాల

లక్షణ సంక్రాంతి లక్ష్మినిండ


Ilఆవెll

కోటి సూర్య కాంతి కొలువైన సంక్రమ

సమయమందు పుణ్య సమయమవగ

శాంతి సౌఖ్యములను సంతసమందగా

జ్యోతి నవ్య కృష్ణ జూడుమఖిల


మీ ✍🏼

*గోగులపాటి జ్యోతి కృష్ణమోహన్,*

కవి, రచయిత, జర్నలిస్టు 

సూరారం కాలని, హైదరాబాదు

9700007653

 🌾🌾🌾🌾🌾🌾🌾🌾

ఉత్తరాయణ

 🎋🪁🌹🌞🪔🌞🌹🪁🎋


*ఉత్తరాయణ పుణ్యకాలం విశిష్టత*


*'సంక్రాంతి' లేదా 'సంక్రమణం' అంటే 'చేరడం' లేదా 'మారడం' అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.*


జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం 'సంక్రాంతి'ని ఇలా నిర్వచించింది.


*"తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరితః సూర్యస్య పూర్వన్మాద్రాశే ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః"*


మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది.


*“రవి సంక్రమణే ప్రాపేనన్నా యాద్యన్తు మానవః సప్త జన్మసు రోగీ స్యా నిర్దేనశేచన జాయతే"*


అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే, రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రునిగా ఉండిపోతాడని భావం.


పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునే తన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.


ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు...


ఉత్తరాయణంలో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా ఉంటుంది..... మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రంగా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ, సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ, ముఖ్యంగా; ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ, ఉత్తరాయణ కాలమును పుణ్యకాలంగా హిందువులు భావించారు.


సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒక వైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు.

🌞🎋🪁🌹🪷🛕🪷🌹🪁🎋🌞

*ఏది సత్యం*

 🙏 *ఏది సత్యం* 🙏


స్వామీ వివేకానంద తన 9 ఏళ్ల వయసులో మత మార్పిడి చేయటానికి ప్రయత్మిస్తున్న వాడికి గుణపాటం చెప్పారు.


ఒక రోడ్ పై కొంత మంది నిలబడి ఒక వ్యక్తి చెబుతున్న మాటలు వింటూ వున్నారు.


ఏమిటని వెళ్లి చూడగా ....


ఒక క్రైస్తవుడు ఒక చేతిలో రాతి కృష్ణుడి బొమ్మను ఇంకో చేతిలో చెక్క శిలువ తీసుకుని ప్రజలారా నిజమైన దేవుడు నీటిలో మునుగు తాడా? నిజమైన దేవుడు ఎవరో మీరు చూసి చెప్పండి అంటూ వారిని మతప్రచారానికి ప్రజల అమాయకత్వాన్ని వాడుకుంటూ మొదలు పెట్టాడు. ఒక బకెట్ లో నీళ్ళు తీస్కుని దానిలో మొదట కృష్ణుడి రాతి బొమ్మ ను వేయగానే అది వెంటనే మునిగి పోయింది. తరువాత శిలువను నీటి లో వేయగా అది నీటిలో తేలింది. అప్పుడు ఇప్పడు మీరు నిజమైన దేవుడు ఎవరో తెలిసిందా? కావున మీరు నిజమైన దేవుడి కోసం రేపటి నుండి చర్చి కు వచ్చి ప్రార్దన చేయాలి అనగానే ప్రజలు సరే అని జవాబు ఇచ్చారు


అటువైపుగా వస్తు దీనిని చూసిన వివేకానందుడు వాడి మోసాన్ని గమనించి.....


అయ్యా మీరు చేసిన పరీక్ష ద్వారా నిజమైన దేవుడు ఎవరో సరిగ్గా తేలలేదు. భారతదేశం లో అగ్నిపరీక్ష  బాగా ప్రసిద్ది కాబట్టి మనం అగ్నిపరీక్ష చేసి దానిని తేలుద్దాం అని అక్కడి ప్రజల ద్వారా ఒప్పించారు. ఒక మంట పెట్టి కృష్ణుడి బొమ్మన, శిలువను మంట లో వేసాడు వివేకానందుడు.  అప్పుడు చెక్క బొమ్మ అయిన శిలువ కాలి పోయింది కాని రాతి బొమ్మ కృష్ణుడి బొమ్మ ఎటువంటి తేడా లేకుండా బయటకు వచ్చింది. ప్రజలారా దీనిని బట్టి మీకు ఏమర్దం అయ్యింది? అనగానే అవును కృష్ణుడే నిజమైన దేవుడు. అని వాడు మమ్మలిని మోసం చేయడానికి చుసాడని చీవాట్లు పెట్టి అక్కడ నుండి మందలించి వెళ్ళగొట్టారు.


మతమార్పిడి చేసే కుట్రలు ఆనాటి నుండే వున్నవి దానిని చూసిన వివేకానందుడు మత మార్పిడులను తీవ్రమైన విషయం గా పరిగణించి వీరిని అడ్డుకునే ప్రయత్నాలను చేసాడు.

_*

అరుణాచలశివ

 అరుణాచలం ఈ పేరే ఒక మాయ ఒక అద్భుతం అక్కడికి వెళ్లినవారికి ఏమవుతుందనేది తెలియదు కానీ ఆ కొండ అయస్కాంత శక్తిలాగా లాగేస్తుంది అక్కడే ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది. మనసు అరుణాచలశివ అంటూ ధ్యానం చేస్తుంటుంది, ఆ గిరి 260 కోట్ల సంవత్సరములుగా ఉంది అని పురావాస్తు శాఖ వారు నిర్ధారించారు.. ఆ కొండ రూపంలో దక్షిణామూర్తి ఉంటారు సాక్షాత్తు స్వామి అమ్మవారు అర్ధనారీశ్వరరూపంలో ఉన్నారు అక్కడ, మనం అక్కడ అప్రయత్నంగానే ధ్యానంలోకి  వెళ్లిపోతాము సమయం తెలియకుండా ఎంత సేపయినా అలా ధ్యానంలో ఉండిపోవచ్చు, భవబంధాలు గుర్తుకు రావు, బాహ్యసృహా ఉండదు. అలా ధ్యానంలో ఉన్న సమయంలో ఎందరో సిద్ధులు, అక్కడ సంచరిస్తున్న ఆశరీరుల దర్శనం, వారి వాక్కు కూడా మన మనో చక్షువులచే వినవచ్చు .


 ఆ స్థలంకి ఉన్న శక్తి అలాంటిది. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, మనస్సును ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిపోతుంది అక్కడి వాతావరణం, అన్నీ మర్చిపోయి అరుణాచల శివ అనే మాయలోకి మునిగిపోతాము.. ఆ మాయ ఎప్పటికి వదలదు , మాయ అని ఎందుకు అంటున్నాను అంటే అప్పటి వరకు గడిచిన జీవితాన్ని అక్కడ అడుగు పెట్టాక మర్చిపోతాము, అరుణాచలంలో అడుగు పెట్టాక అక్కడి నుండి జీవితం కొత్తగా మొదలు అవుతుంది అదే మెదలు అదే చివర అనే ధ్యాసకు లోనవుతుంది మనసు, అంతే ఆ మాయలో జీవితకాలం మొత్తం కూడా గడిచిపోవచ్చు.. 


ఎందరో నాస్తికులు కూడా కుతూహలంతో ఆ గిరి ప్రదక్షిణ చేసి అక్కడ ఏదో మాయ ఒక మహా శక్తిలాగా మనసులాగేస్తుందని అని కారణం తెలియని ఆనందాన్ని పొందుతామని చెప్పిన సంఘటనలు ఉన్నాయి , దేవుడికి దండం పెట్టని వారు కూడా దాసోహం అంటూ ఆ కొండ చుట్టూ పడి దొర్లేస్తారు ఆ స్వామి కరుణామయుడు నాస్తికులకే అంత అనుభూతి కలిగితే భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది అడుగడుగునా శివ దర్శనం నిదర్శనం కనపడుతూనే ఉంటుంది.. 




ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను �

బప్పా రావాలి

 ●400 సంవత్సారాలు భారత్ 🇮🇳వైపూ కన్నెత్తి చూడడానికి, వెన్నులో వణుకు పుట్టించిన🤺 అరివీర భయంకరుడు.


🤺అరబ్బుల పాలిట యమకింకరుడు


●36 మంది ముస్లిం రాజులు బయపడి వారి కూతుళ్లతో పెళ్ళి చేసి అల్లుడిగా 🤺చేసుకున్నా ఆజానుబాహుడు,సనాతన వైదిక ధర్మం రక్షణలో జీవితం చరితార్థం చేసుకున్న మహాకాళిశ్వరుని మహా భక్తుడు


🚩బప్పా రావాల్🤺


●ఇంతటి అరివీర భయంకరయోధుడి చరిత్ర విన్న హృదయం గర్వంతోఉప్పొంగుతుంది.


●చరిత్రపుటల్లో కాదు కదా!  ఆ యోధుడు కనీస చిత్రపటం కూడా మనకు దొరకదు, ఇదీ మన దౌర్భాగ్యపు చరిత్రా.


●ఏ.... నమ్మకం కలగడం లేదా... 

అయితే ఈ యోధుడు గురించి తెలుసుకుందాం పదండి.


భారతదేశ చరిత్రలో గొప్ప వీరుల చరిత్ర మాయం చేసినా ఘనత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కు అనగా మొట్ట మొదటి విద్య శాఖ మంత్రి కీ దక్కుతుంది.

వీడితో పాటు కమ్యూనిస్టు చరిత్రకారులు కలిసి చేసిన కుట్రలో ఎంతో మంది వీరుల అందరూ కూడా కనుమరుగై పోవడం జరిగింది.


🇮🇳భారతదేశం చరిత్రలో ఎందరో గొప్ప వీరులు ఉండగా మనకి చరిత్ర మార్చి వేరే దేశం నుంచి వచ్చిన మహమ్మద్, ఘజిని , అక్బర్,బాబర్, తుగ్లక్,ఘోరీ లాంటి వాళ్ల గురించి గొప్పగా  చెబుతూ ఉంటారు.


ఇస్లాం మతం స్టార్ట్ అయిన కొద్ది రోజులకే యావత్ అరబ్ నుంచి ఇరాన్ వరకు మొత్తం ముస్లిం దేశంగా మార్చారు, తర్వాత వారి కన్ను ..మన #భారత్ పై పడింది అక్కడే హాజాజ్ తన అల్లుడు మహమ్మద్ ఖాసిం భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని కాఫిర్ అంటే హిందువులను చంపమని చెబుతాడు.


భారీ సైన్యంతో మహమ్మద్ ఖాసిం సింధు రాజ్యంపై దండయాత్ర చేస్తాడు కానీ అక్కడ రాజు దాహెర్ సింగ్, తన పరాక్రమముతో ఖాసింను రెండుసార్లు ఓడించి, క్షమించి వెనక్కి పంపిస్తాడు.


●మూడవసారి కాసిం మోసంతో సింధ్, దాహేర్ ను  గెలిచి ఆక్కడ ఉన్న హిందూ 🛕మందిరాలను ధ్వంసం చేసి, ఆడవాళ్ళ అత్యాచారం, లేదా అరబ్బులకు అమ్మేసేవాడు.


●చిన్న పిల్లలను చంపి🐄 ఆవులను కోసి తినేవాడు ఇస్లాం మతంకు, మారని వాళ్ళని చంపేసేవాడు లేదా మార్చేవారు.


మహమ్మద్ ఖాసిం సింధుపై ఆక్రమించుకున్నకా , బీమల్ కన్ను వేస్ట్ పంజాబ్, మాల్వడ్, గుజరాత్లో కొంత భాగం తన ఆధీనంలోకి తీసు కుంటాడు.


●ఖాసిం తన రాజ్యం మీదికి వస్తున్నారని తెలుసుకున్న రాజ్యాలు మోయో,చావల్, కచేలో, సైంధవ, ఐకమత్యంతో పోరాడకుండా సరెండర్ అయిపోతారు.


కొంతమంది ఇస్లాం మతాన్ని స్వీకరించారు రాజ్యం మీద ఉన్న స్వార్థంతో ఇక తనకు ఎవరు అడ్డు రాలేరు అని. భారత్ మొత్తాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని అనుకుంటాడు.


కానీ 

భారతదేశంలో వీడి లాంటి ఎంతమంది వచ్చిన ఢీకొని మహాయోధులు ఉన్నారని వీనికి తెలియదు.


మాతృభూమి సనాతన ధర్మ రక్షణకు కాపాడుకునేందుకు ఆ రుద్రుడే మహాశివుడు ఈ వీరున్ని భూమిపై పంపించాడు అన్నట్టుగా ఉంటుంది


ఎవరి పేరు చెప్తే ఇస్లాం రాజులకు కూడా గుండె ఆగిపోతుందో!,


ఎవరి పేరు చెప్తే యముడికి కూడా చెమట పుడుతుందొ, మహాకాల్ శివ పరమభక్తుడు, మహాబలశాలి

 #వీర్_బప్ప_రావాల్


మన ఆరాధ్య దైవం శ్రీ రాముని కొడుకు యొక్క వంశంలో పుట్టిన వాడే

వీర్ బప్పా రావల్


713 AD లో రాజస్థాన్ లో జన్మించాడు తాను చిత్తోడ్ రాజ్యంలో శిశుద్యా మేవాడ్ వంశాన్ని స్థాపించాడు.


బప్పా రావల్ అసలు పేరు కాళ్-బొజ్.


ఎన్నో భీకర యుద్ధాలు జయించాక అందరూ అప్పటి నుండి బప్పా రావల్ అని పిలిచేవారు.


హైత్రిశి అనే మహాముని ఆశీర్వాదంతో అస్త్ర శస్త్ర విద్యను సాధించి అజేయుడు అయ్యాడు.


ఉదయపూర్ లో🛕 ఏకలింగ అనే మహా శివుని ఆలయాన్ని నిర్మించాడు, ఆ మహా శివుడు తన రాజ్యానికి రాజు అని, తను ఒక సేవకుడిలా గా రాజ్యాన్ని పాలించేవాడు అని అతను భావించేవారు.


ఇటు మహమ్మద్ ఖాసిం సింధ్ లో చేస్తున్న అరాచకాల నుండి తప్పించుకొని కొంతమంది రాజస్థాన్ లోని చిత్చొడ్ కు చేరుకుంటారు.


అప్పుడు అక్కడి ప్రజలు పడుతున్న కష్టాల గురించి సమాచారం బప్పారావు వరకు చేరుతుంది అది విన్న బప్పరావల్


సనాతన ధర్మ రక్షణకు మాతృభూమినీ కాపాడేందుకు తన సైన్యంతో పాటు చుట్టుపక్కల ఉన్న నాగభట్, ప్రాథమ్, విక్రమాదిత్య 2 తో ఇంకొన్ని రాజ్యాల సైనికులతో కలిసి హర హర మహదేవ్ అనే నినాదం సింహం లాగా గర్జిస్తు.. సింధు రాజ్యంపైకి వెళ్తాడు.


అక్కడ ఖాసిం ఇది తెలిసి అక్కడ ఒక లక్ష క్రూరమైన సైన్యంతో రెడీ గా ఉంటాడు .


బప్పా రావల్ సైన్యం చాలా చిన్నది ఇంకా చాలా సైన్యానికి యుద్ధం కూడా తెలియదు, కానీ దేశంకోసం సనాతన ధర్మంకోసం వారి ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధం అయ్యారు.


చాలా పెద్ద  అతిభీకరయుద్ధం జరుగుతుంది, ఖాసింని, 1లక్ష సైన్యాన్ని ఓడించి ఇప్పుడు ఉన్న బలుచిస్తాన్ వరకు తరిమికొడతాడు. సింధ్ లోవెళ్లి మళ్లీ భగవాన్ జెండాను ఎగుర వేసి,సనాతన ధర్మాన్ని స్థాపించి తన రాజ్యానికి తిరిగి వచ్చేస్తాడు.


మహమ్మద్ ఖాసింను అక్కడి ముస్లిం హాజాజ్ చంపేస్తాడు.


భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని రానివ్వకుండా అడ్డుగా నిలిచివున్నా బప్పా రవాల్ ను ఓడించడానికి అక్కడ హజజ్ ఈ సారి తమిముచేత్- అల్వుత్వి- జునేద్ వేద్- అబ్దుల్ రెహమాన్ వంటి రాజ్యాలతో నలువైపుల నుండి దాడి చేద్దామని సిద్ధం అవుతారు.


కానీ ఇది తెలిసి ఇస్లాం అరబ్ రాజులను మన దేశానికి రాకముందే అజ్మీర్, జేసాల్మిర్ ఇంకా ఎన్నో రాజ్యాలను కలుపుకుని అరబ్ కు వెళ్తాడు.


శత్రువు తన రాజ్యంలో వెళ్లి కొట్టడమే అప్పారావు యుద్ధనీతి, చాలా విశాలమైన సైన్యంతో అక్కడి హజాజ్ ను యుద్ధంలో ఓడించి, ఖాన్దార్, గురాసన్, జురాన్, ఇసొప్పన్, ఇరాన్, అరబ్ అన్ని తన రాజ్యంలోకి కలుపుకుంటాడు.


అక్కడి నుండి వస్తూ గజినీ రాజ్యం (ఆఫ్గనిస్తాన్) రాజు సలీం కూడా ఓడించి తన సైనిక స్థావరాన్ని నిర్మించుకుంటాడు.అందులో నుంచి ఒక్కటే ఇప్పుడు ఉన్న *రావల్ పిండి* ఈ ప్లేస్ పాకిస్థాన్లో ఇప్పుడు కూడా అదే పేరుతో ఉంది.


వీర్ బప్పా రావల్ కు భయపడి అక్కడి ముస్లింలు తన కూతుళ్ళను వీర్ బప్పా రావల్ ఇచ్చి పెళ్లి చేసేవారు.


వీర బప్పా రా వాళ్లకి 100 మంది భార్యలు అయితే అందులో 36 మంది ముస్లిం వాళ్ళే, 35 సంవత్సరాలు రాజ్యాన్ని నడిపించే అక్క తర్వాత సన్యాసాన్ని తీసుకొని ఏకలింగ శివుని భక్తి లో సేవకు అంకితమయ్యాడు.


97 ఏళ్ల వయసులో ఆ మహాశివునిలో లీనం అయ్యాడు.బప్పా రావల్


దేశంలో బంగారం సిక్కాలు( నాణేలు) నడిపించాడు,🐄 అందులో గోమాత 🌞సూర్యుని చిత్రాలు ఉండేవి.*


బప్పా రావల్ భయంతో 400 సంవత్సరాలు, ముస్లిం రాజులు భారత్ వైపూ చూడడానికి కూడ గజగజా వణికిపోయేవారంటే, అతను ఎంతటి అరివీర భయంకర వీరుడు యోధుడు అర్థమవుతుంది.


బప్పా రావాలి సమాధి నాగ్డ లో ఉంది.


బాధ కలిగించే విషయం ఏమిటంటే ఇలాంటి యోధుడు 🤺గురించి భారతీయులలో ఎవరికి కూడా తెలియదు.


కనీసం చరిత్ర పుస్తకాల్లో కూడా ఒక పేజీ కూడా లేదంటే.... ఇదీ మన దౌర్భాగ్యం అనుకోవాలా...? లేకా... మన అసహాయత అనుకోవాలా?

*అర్థం కావడం లేదు*


ఇంతటి అరివీర భయంకరుడైనా యోధుడికి కోటి కోటి హృదయపూర్వక వందనాలు..🙏

ఈ పోస్టింగ్ ఎందుకు

 ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోండి. దేశంలో ప్రతిభ కు కొదవ లేదు. పాలకుల ప్రోత్సాహమే కరువు.


అది 2016వ సంవత్సరం. సాధారణంగా, పదవీ విరమణ సమయంలో,  చివరి 2 సం.లలో తనకు అనువైన ప్రాంతంలో తేలికైన బాధ్యత గల పోస్టింగ్ పొంది ప్రశాంతంగా రిటైర్ అవ్వడానికి లేదా చివరి రోజుల్లో బాగా డబ్బు సంపాదించ గలిగే పోస్టు కోసం అందరు ఉద్యోగస్తులు ప్రయత్నిస్తారు. అయితే దీనికి భిన్నంగా  ఒక  రైల్వే జనరల్ మేనేజర్ గారు హోదా, పరపతి, డబ్బు వచ్చే జోనల్ హెడ్ పోస్ట్ కాదని,  ICF అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (రైల్వే కోచ్ లు తయారు చేసే ప్రభుత్వ సంస్థ) జనరల్ మేనేజర్ గా వేయమని అధికారులను అడిగారు.


ఈ పోస్టింగ్ ఎందుకు? మీ ఉద్దేశం ఏమిటి అని రైల్వే బోర్డు ఛైర్మన్  అతనిని అడిగారు.


ఆయన తాను రిటైర్ అయ్యే లోగా తన దేశం కోసం ఒక సెమీ-హై స్పీడ్ రైలును తయారు చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. స్పానిష్ దేశానికి చెందిన టాల్గో కంపెనీకి చెందిన రైలు కోచ్‌లు గంటకు 180కిమీల వేగంతో పరిగెత్తడంపై దేశంలో చర్చ జరుగుతున్న కాలం అది. దాని ట్రయల్ విజయవంతమైంది, అయితే ఆ కంపెనీ 10 కోచ్‌ల రేక్ సప్లై కోసం సుమారు రూ. 250 కోట్లు అడుగుతోంది మరియు దాని సాంకేతికత మనకు బదిలీ చేయాలి అని ఒప్పందంపై ఆ కంపనీ సంతకం చేయడానికి కూడా ఇష్టపడలేదు.


అటువంటి పరిస్థితిలో, ఈయన తన దేశంలో టాల్గో కంటే మెరుగైన రైలును స్వదేశీ సాంకేతికతతో దానిలో సగం కంటే తక్కువ ఖర్చుతో తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. 


రైల్వే బోర్డు ఛైర్మన్ అడిగారు:  "మీరు ఖచ్చితంగా విశ్వాసంతో ఉన్నారా? మనం దీన్ని తయారు చేయగలమా?" 


'అవును అండి. ఖచ్చితంగా తయారు చేయగలం "అని ఆ ఇంజనీర్ హామీ ఇచ్చాడు. (హామీ ఇవ్వడమే కాదు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం, మధ్యలో పుల్లలు వేసే అధికారుల వల్ల రైల్వే బోర్డ్ వారిని కాళ్ళు పట్టుకుని బతిమాలినంత పని చేయవలసి వచ్చింది అని ఆయన చెప్పారు.)


"దీని రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ కోసం ఎంత డబ్బు అవసరం?"


"కేవలం 100 కోట్లు చాలు సార్."


సరే! అతనిపై నమ్మకం ఉంచిన  రైల్వే బోర్డ్ అతనికి ICF లో జనరల్ మేనేజర్ గా వేసి ఈ బాధ్యత ఇచ్చింది మరియు 100 కోట్లు బడ్జెట్ ఇచ్చింది.


అంతే ! ఆ అధికారి హడావుడిగా రైల్వే ఇంజనీర్ల బృందాన్ని తయారుచేసుకుని  ఈ ఇంజిన్ నిర్మాణ పనిలో నిమగ్నమయ్యారు.


18 నెలలు అవిశ్రాంతంగా శ్రమించి తయారు చేసిన ఈ ప్రత్యేకమైన ఇంజిన్ లేని రైలునే" వందే భారత్"  రేక్ అని ప్రస్తుతం పిలుస్తున్నాం. అయితే దీనిని ముందుగా 'రైలు 18' అని పిలిచేవారు.


మరి ఈ 16 కోచ్‌ల కొత్త "రైలు-18"  తయారీకి ఎంత ఖర్చయిందో తెలుసా?


కేవలం ₹97 కోట్లు మాత్రమే. టాల్గో కేవలం 10 కోచ్‌ల రైలు కోసం 250 కోట్లు అడిగింది. అంటే 16కోచ్ ల వందే భారత్ దిగుమతి చేసుకుంటే ₹400 కోట్లు అయ్యేది. మరి వందే భారత్ కేవలం ₹100కోట్లలో తయారు అయిపోతోంది.


ఈ "రైలు-18"  భారతీయ రైల్వే యొక్క అద్భుతమైన చరిత్రలో అత్యంత అరుదైన వజ్రం.  దీని ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి కోచ్‌కి ఒక మోటారు ఉంటుంది. ప్రతీ కంపార్ట్‌మెంట్ స్వయం చోదకమైనది అంటే సెల్ఫ్ ప్రొఫెల్లింగ్,  కాబట్టి ఈ రైలు లాగడానికి ఎటువంటి ఇంజిన్ అవసరం లేదు.


రెండేళ్లలో సిద్ధం చేసిన తొలి "రైల్-18" రేక్‌ను "వందే భారత్"  రైలు పేరుతో వారణాసి - న్యూఢిల్లీ మధ్య నడిపారు. 


ఇంతకీ ఆ అధికారి పేరు చెప్పలేదు కదూ! అతనే శ్రీ సుధాంశు మణి.


అతను 2018లో పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం లక్నోలో నివసిస్తున్నారు.


ఈ వందే భారత్ వంటి అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు ఈ దేశం నుండి ఎవరూ అతన్నీ, అతని జట్టును వెన్ను తట్టలేదు. కానీ, ఇటీవల అదే వందే భారత్ గేదెను ఢీకొన్నప్పుడు, దాని ముందు భాగం దెబ్బతిన్నప్పుడు,  చాలా మంది ఈ రైలు డిజైన్‌ను విపరీతంగా విమర్శించడం ప్రారంభించారు.


ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో  లో మణి వందే భారత్ రైలు గురించి ఇలా వివరించారు:


1. ఈ ట్రైన్ పూర్తి భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం 18 నెలలోనే దేశంలో తయారు చేయబడ్డ మొట్ట మొదటి సెమి హై స్పీడ్ రైలు.


2. ఇలా భారత్ లొనే పూర్తిగా తయారు అయ్యే రైలు చేద్దాం అని మేం ఎప్పటి నుండో అనుకుంటున్నాం. కానీ, అధికారుల అలసత్వం, విదేశాల నుండి దిగుమతుల మీద యావ మా ప్రయత్నాన్ని ముందుకు జరగనీయ లేదు.


3. మేం తయారు చేసిన ప్రస్తుత లేటెస్ట్ మోడల్ గంటకు 180కి.మీ గరిష్టంగా వెళ్ళ గలవు.. రాబోయే మోడల్స్ లో స్పీడ్ ఇంకా పెంచ వచ్చు  అయితే ప్రస్తుత మన ట్రాక్స్ అంత వేగం తట్టుకోలేవు. దీని పూర్తి సౌలభ్యం ప్రయాణీకులు అనుభవించాలి అంటే కనీసం కొన్ని ముఖ్య రూట్లలో ట్రాక్ మార్చాలి.


4. ఇది ప్రస్తుతం ఉన్న ఎస్ప్రెస్ ట్రైన్స్ స్థానంలో ట్రాక్ సామర్ధ్యం బట్టి 130కి.మీ. పైగా వేగంతో నడపవచ్చు. ఇంధన సామర్థ్యం వల్ల వీటిని  ప్రస్తుతం ఉన్న రాజధాని, శతాబ్ది, వంటి రైళ్లు స్థానంలో నడపవచ్చు.


5. వందే భారత్ ట్రైన్ ని గేదెలు గుడ్డుకోవడం, డేమేజి గురించి మాట్లాడుతూ, ప్రస్తుత ట్రైన్స్ లో ముందు భాగం ఫ్లాట్ గా వుండే భారీ ఇంజిన్, దానిని జంతువులు ఢీ కొట్టినా ప్రయాణీకులకు ఇంపాక్ట్ తెలియకుండా ఉండడానికి బలమైన ఇనుప గార్డ్ ఉంటోంది.

కానీ వందే భారత్ ట్రైన్ కి ముందు భారీ ఇంజిన్ ప్రత్యేకంగా ఉండదు.  ఇంధన పొదుపు కోసం, లుక్ కోసం ట్రైన్ ముందు భాగం ఏరో డైనమిక్ డిజైన్ పెట్టాం. ముందు భాగంలో మొదట  వుండే  కోచ్ లో కంట్రోల్ పేనల్ వెనుకనే ప్రయాణీకులు వుంటారు. అంటే ఏదైనా జంతువుని ట్రైన్ ఢీ కొడితే ఆ ఇంపాక్ట్ నేరుగా ప్రయాణీకులకు తగిలి ప్రమాదం ఏర్పడవచ్చు..అందుకని మొదటి కోచ్ ముందు కొంత భాగం ఇంపాక్ట్ బాగా తగ్గించే ఫైబర్ మెటీరియల్ ఉపయోగించాము. దీని వల్ల ట్రైన్ కొంత డేమేజి అయినా ప్రయాణీకులు భద్రత బాగుంటుంది. చిన్న ఖర్చుతో ట్రైన్ వెంటనే రిపేర్ చేయవచ్చు.


ఆయన మాట్లాడుతూ యూరోప్ లో 160 కి.మీ హైస్పీడ్ రైళ్లు ఎలివేటెడ్ కారిడార్ల మీద నడుపుతారు, అవి లేని చోట్ల ట్రాక్ కి రెండువైపులా ఫెన్సింగ్ ఉంటుంది, ప్రజలు కూడా తమ పశువులను బాధ్యతగా చూసుకుంటారు కాబట్టి అక్కడ హై స్పీడ్ ట్రైన్స్ కి జంతువులు ఢీ కొట్టే బెడద తక్కువ అని అన్నారు. మన దేశంలో కూడా అటువంటి సదుపాయాలు వచ్చాక దీని ముందు వైపు డిజైన్ మార్పు గురించి ఆలోచించవచ్చు అని చెప్పారు.


ఏది ఏమైనా రాబోయే రోజుల్లో హై స్పీడ్ ట్రైన్స్ నిర్మాణానికి విదేశాలు మీద ఆధార పడకుండా స్వదేశీ పరిజ్ఞానం తో సెల్ఫ్ ప్రొఫెల్లింగ్ రైల్వే రేక్ నిర్మాణానికి ధైర్యం చేసిన మణి గారు అభినందనీయులు...🙏...


....చాడా శాస్త్రి....

సుభాషితమ్

 *సుభాషితమ్* 


శ్లో𝕝𝕝 యఃకర్తా జగతాం భక్తా సంహర్తా మహసం నిధిః! ప్రణమామి తమాదిత్యం బహిరన్త స్తమోపహమ్!!


తా𝕝𝕝 ఎవడు ఈ జగత్తును సృష్టించిన వాడై, భరించువాడై, వెలుగులకే వెలుగై, జగత్ చక్షువై ప్రకాశిస్తున్నాడో, ఆ సూర్యుని ప్రార్థిస్తూ, ఆతడే నాలో లోపల, బయట ఉన్న అజ్ఞానమనే అంధకారాన్ని, తమోగుణాన్ని, తొలగించి అనుగ్రహహించమని మరలా మరలా నమస్కరించుచున్నాను. *(సేకరణ)*

 

🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏 సంక్రాంతి శుభాకాంక్షలతో మీ విష్ణుభట్ల వేక్ఙ్ఞట సాంబశివ శర్మ దంపతులు.

పొంగల్ - మాట్టు పొంగల్

 పొంగల్ - మాట్టు పొంగల్


పరమాచార్య స్వామి దర్శనానికి న్యాయవాది చంద్రశేఖర్ ప్రతి భోగి రోజు వచ్చేవారు. అలాగే 1989లో మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, శ్రీమఠం గోశాల నిర్వాహకుడు చిన్న కాళీయన్ కూడా స్వామిదగ్గర నిలబడి ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నాడు. “అతనికి ఏమి కావాలో కనుక్కో?” అని శిష్యులను అడిగారు.


”ఎల్లుండి మాట్టు పొంగల్(కనుమ) పెరియవ. గోవుల కొమ్ములకు రంగులు వెయ్యాలి. వాటిని పూలదండలతో అలంకరించాలి. . .” అంటూ కాస్త నసుగుతూ ఇంకా చెప్పబోతుండగా, మహాస్వామివారే “ఓహ్ అలాగా అలాగైతే. అతని వద్ద ద్రవ్యం లేదా?” అని అడిగారు. కాళీయన్ అవునని తలూపాడు.


”ఎవరు వచ్చారు?” అని శిష్యులను అడిగారు స్వామివారు.


”తిరువారూర్ వచ్చారు” అని చెప్పారు.


న్యాయవాది చంద్రశేఖర్ తిరువారూర్ నుండి బయలుదేరుతున్నప్పుడు, అతని క్లైయింట్ ఒకరు స్టాంపు, కోర్టు ఖర్చులకు గాను ఇచ్చిన 4000 రూపాయలను అతని చేతిసంచిలో ఉంచుకొని కాంచీపురం బయలుదేరాడు. కేవలం తిరుగు ప్రాయాణానికి బస్సు చార్జీలకు సరిపడు డబ్బు ఉంచుకొని తక్కిన సొమ్ము మొత్తం కాళీయన్ కు ఇవ్వమని పరమాచార్య స్వామివారు ఆదేశించారు. ఆ డబ్బు తీసుకుని కాళీయన్ ను వెళ్లమన్నారు.


తరువాత స్వామివారు ఆ న్యాయవాదితో, “ప్రతి మాట్టు పొంగల్ కి శ్రీమఠానికి నీకు ఇవ్వగలిగినంత సొమ్ము తీసుకునిరా. అలాగే బెల్లం పొంగలి చేసుకొని వచ్చి మీ చేతులతోనే గోవులకు పెట్టండి” అని చెప్పారు. అతను అలాగే అని స్వామి వారి వద్దనుండి ప్రసాదం స్వీకరించి వెల్లిపోబోతుండగా, “తిరువారూర్ వెళ్ళిపొయాడా?” అని అడీగారు.


స్వామివారు మరలా వారిని పిలిపించి “బెల్లం పొంగలి ఎలా తయారు చేస్తారో తిరువారూర్ భార్యని అడగండి” అని శిష్యులను ఆదేశించారు. ఆమె తయారు చేసే విధానాన్ని చెబుతుండాగా, స్వామివారు అందుకొని “లేదు. లేదు. ఆవులకు పెట్టడం కోసం తయారు చేసేప్పుడు గోవుల నుండి వచ్చిన పదార్థాలను అందులో కలపకూడదు. అలా చేస్తే పాలిచ్చే ఆవు వట్టిపోతుంది” అని చెప్పారు.


ఇంకా ఇలా చెప్పారు, “అన్నాన్ని ఉడికించి, బెల్లం కరిగించి అవక్షేపాలు తొలగించాలి. ఆ అన్నాన్ని బెల్లాన్ని బాగా కలిపి గోవులకు తినిపించాలి”. పాలు, పెరుగు, నేయి, వెన్న - ఇవి ఏవి దానికి కలపకూడదు. వాటిని కలిపి పెడితే ఆవులు పాలు ఇవ్వవు. ”క్షేమంగా ఉండండి” అని స్వామివారు ఆ దంపతులను ఆశీర్వదించారు. ముగ్గురు అన్నదమ్ముల ఆ తిరువారూర్ కుటుంబం 1990 నుండి ప్రతి సంవత్సరము మాట్టు పొంగల్ రోజు పరమాచార్య స్వామివారు విధంగా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం