అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 5 .
* జిహ్వ పరీక్ష -
వాతరోగము నందు నాలుక పగిలి ముళ్ళ వలే గరగరలాడుచుండును . తడారిపోయి నల్లగా గాని బూడిద వర్ణములో గాని ఉండును . పైత్యవ్యాధుల యందు నాలుక ఎర్రబారి పూసి మంట కలిగి ద్రవం కారుచూ మృదువుగా ఉండును . శ్లేష్మరోగము నందు నాలుక తెల్లగా కరుడుగట్టి పాచి కలిగి ఉండును . మొద్దుగా ఉండును . జ్వరము నందు పాకము కలిగి చేదువాసన కొట్టుచుండును . దోషభేదమును బట్టి జ్వరము నందు నాలుక పాకము చెంది చేదుపట్టి వాసన తీపి జిగటగా అయ్యి సాగుట ఎండిపోవడం వంటి లక్షణాలు కలుగును .
సన్నిపాతము నందు ద్రవము లేక నాలుక ముళ్ళు కలిగినట్లుగా మాడి ఉండును . ద్వందరోగమున రెండు రెండు లక్షణాలు కలిగి ఉండును . రక్తపోటు అధికమై రోగికి మంటగా ఉండిన నాలుక ఎర్రగాను తాకిన వేడిగాను ఉండును . మంటతో కూడి జ్వరము నందు నాలుక తడి ఎండిపోయి ఉండును .
తీక్షణ జ్వరము నందు భయంకరమగు ఒళ్ళు మంటలు గూడిన వ్యాదుల యందును , అజీర్ణరోగము నందు , వాతవ్యాధుల ప్రారంభదశలో నాలుక తెల్లగా ఉండుటయే కాక దాని మీద ఒక కొత్తపొర కప్పినట్లుగా కనిపించును . త్రిదోష ప్రకోపము వలన జనియించిన జ్వరము నందు నాలుక దళసరి ( మందం ) ఎక్కి ద్రవ హీనమైన పొరచే కప్పబడినట్లు ఉండును . మరియు నల్లనై నిప్పు ఆరిపోయిన బొగ్గు వలే కనిపించును . కాలేయము యొక్క పని సక్రమముగా నిర్వర్తిన్చబడనప్పుడు , పిత్తముకు , మలముకు అవరోధము ఏర్పడినప్పుడు నాలుక పాలిపోయి పొరతో కప్పబడినట్లు ఉండును . కాలేయము మరియు ప్లీహము ( spleen ) దోషము చెందినప్పుడు అపాయస్థితిలో క్షయ యందు వలే నాలుక పైన పుండ్లు కనిపించును . తీక్షణమగు జ్వరము , అతిసారము , మూర్చ , కాస , శ్వాసల యందు నాలుక తాకిన చల్లగా ఉండును . దౌర్బల్యముగా ఉండును . మంటతో కూడిన వ్యాధుల యందు నాలుక పెద్దది అగును .
ఆరోగ్యవంతుని నాలుక ద్రవము కలిగి ఉండును. తాగుడు అలవాటు ఉన్నవారి నాలుక పగిలి ఉండును . వాత వ్యాధుల యందు లాలాజలము ఉప్పగా ఉండును . పైత్యవ్యాధుల యందు చేదుగా , శ్లేష్మ వ్యాధుల యందు తియ్యగాను , రెండురకాల దోషముల కలిగి ఉన్న రెండురకాల లక్షణములు కలిగి ఉండును .
* మూత్రపరీక్ష -
పాశ్చత్య వైద్యులు మొదటి ధార వదిలి తరువాతది సీసాలో పట్టి దానియందు కొన్ని రకాల రసాయనాలు కలిపి స్పిరిట్ లాంతరు పైన వేడిచేస్తారు . మూత్రము నందు చక్కెర తెల్ల శ్వేత ధాతువు , వీర్యము , తీపి , మున్నగు వాటిని ఉండకట్టుట , కలిసిపోవుట , రంగు మారు ట , పైకి తేలుట , అడుగున మునిగిపోవుట , ఇసుక వలే పొడిపొడిగా అవ్వుట , వాసన వేయుట మొదలగు బేధములచే వ్యాధిని గుర్తిస్తారు . కొందరు రోగుల మూత్రము నందు వీర్యము ముద్దగట్టి సన్నసన్నని ఇసుక కణములవలె కనబడును . కొందరి మూత్రము ( మధుమేహరోగులు ) విడిచినచోట బెల్లమునకు వలే చీమలు , ఈగలు , దోమలు ముసురును . మానవుని జీవితము మూత్రము పైన ఆధారపడి ఉండును . మూత్రమును బట్టియే ఆహారము ఎలా జీర్ణమగుచున్నది , సప్తధాతువులు ఎట్టి స్థితిలో ఉన్నవి , రక్తము , బలము ఎలా ఉన్నది చివరకు సంతానము కూడా మూత్రమును బట్టి తెలుసుకొనవచ్చు .
తరవాతి పోస్టు నందు మూత్రపరీక్ష విధానము గురించి సంపూర్ణముగా వివరిస్తాను . మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . ఆయుర్వేదం నందలి అత్యంత రహస్యమైన ఔషధయోగాలు మరియు మా వంశపారంపర్య అనుభవ యోగాలు అన్నియు సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది .
గమనిక -
నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది .
ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును .
ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034