🌹🌹🌹🌷🌷🌹🌹🌹
.*🌹మధ్వనవమి విశిష్టత🌹*
🌷🌷🌷
*ఈరోజు ఫిబ్రవరి 10 గురువారం మధ్వనవమి.*
మాఘ శుక్ల నవమి మధ్వనవమిగా ప్రసిద్ధం.
భారతీయ దర్శనాల్లో ముఖ్యమైన మూడు సిద్ధాంతాలలో ఒకటి ద్వైత సిద్ధాంతం. ద్వైత సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ధర్మమూర్తి, పూర్ణప్రజ్ఞులు శ్రీమధ్వాచార్యులు. ఆయన ఉడుపిలోని అనంతేశ్వరాలయంలో ఐతరేయోపనిషత్తుకు భాష్యం చెబుతూ, దేవతలు కురిపించిన పుష్పవృష్టిలో అంతర్థానమై బదరికాశ్రమాన్ని చేరిన రోజు మధ్వ నవమి.
త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం.. శ్రీమధ్వాచార్యులు. ఆయన ఆశ్వయుజ విజయదశమినాడు 1238లో దక్షిణ కన్నడ ఉడిపివద్ద పాజక గ్రామంలో జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధురేహ భట్ట, వేదవతిలుగా పేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్వ ప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.
పనెనండో ఏట అచ్యుతప్రజ్ఞ తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు. బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మికత విషయాలవైపు ఆసక్తిచూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవారు. చిన్నవయసులోనే సకల శాస్తజ్ఞ్రానం సంపాదించుకున్నందువల్ల పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు. ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్యేమార్గానికి చిహ్నంగా శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది. గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు. రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్యాచార్యులవారే. శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవితకాలంలో మూడు పర్యాయాలు బదరీయాత్ర విజయవంతంగా నిర్వహించారు. వారి చివరియాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది. ఆ తిరిగిరాని పయనమే మధ్వానవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశ వ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జీవుడు వేరు, బ్రహ్మము వేరు, జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్యకాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంత సత్యం. భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండాలి. మధ్వాచార్యుడు ఆసేతుసీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైతమతాన్ని ప్రచారం చేశాడు. దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణ్భక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు. జగత్తు మాయ మాత్రమే. జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే.
పరమాత్మ సర్వస్వతంత్రుడు, జీవాత్మ అస్వంతంత్రుడు, జీవోత్తముడు ఆచార్యుడు, ధర్మమార్గంలో ఆచార్యుల అనుగ్రహం సంపాదించి, అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తిముక్తావళి మధ్వులకు శిరోధార్యం. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలుస్తారు. మధ్వాచార్యుడు, హనుమంతుడు మరి భీముడు అనంతరము వాయుదేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు. తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాశాడు. ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాశాడు. తర్కంతోపాటు 37 గ్రంథాలను రచించాడు. మధ్వాచార్యులు అనంతరం మరే ఆచార్యులు భారతావనిలో పుట్టలేదు. వారు చేసిన ద్వైత సిద్ధాంతాన్ని ఖండించి దానికంటే ఉన్నతమైన మరొక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు.
ఒకసారి వీరు దక్షిణ కన్నడలోని మాత్నే తీరం సమీపంలో మునిగిపోతున్న ఓడను రక్షించగా, ఓడలోని ముఖ్య నావికుడు భక్త్భివంతో వీరికి ఒక గోపీ చందనం మూటను బహూకరించాడు. శ్రీమహావిష్ణువుయొక్క వివిధ అవతారాలను స్తుతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు. ఆ స్తోత్రమే తరువాత కాలంలో 3ద్వాదశస్తోత్రంగా పిలువబడింది. ఆ గోపీచందనం మూటను మధ్వ సరోవరంలో శుద్ధిచేసి దానిని విప్పిన వీరికి ఆ గోపీచందనం కణికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. ఆ విగ్రహానే్న 800 సంవత్సరాల పూర్వం ఉడిపిలో ప్రతిష్ఠించారని అంటారు. తనను అమితంగా కొలిచే అంత్య కులజుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా వున్న శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై గవాక్షం గుండా అతనికి దర్శనం అనుగ్రహించాడు. ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనల్ని అనుగ్రహిస్తున్నాడు. మూఢ నమ్మకాల్ని వ్యతిరేకించాడు. యుక్తవయస్సులో కన్యకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు మధ్వాచార్యులు ప్రవచించిన మతం ద్వైతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతారు. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ పరమాత్మ వాసుదేవుడిమీద ఆధారపడి వుంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది. పరబ్రహ్మ ఒక్కడే. అతను విష్ణువు అని ప్రబోధించాడు. మధ్వ మతతత్వానికి వనె్నతెస్తున్న ఉడిపికి చెందిన ఎనిమిది మఠాలు పెజావర, పుత్తిగె, పాలిమార్, ఆడనూరు, సోధె, కవియూరు, శిరూరు, కృష్ణాపురం మఠాలు. సంప్రదాయాలకు, మతపరమైన ఆచారాలకు, ద్వైత సిద్ధాంతాలకు ఉడిపి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.
పురందరదాసు, కనకదాసు వంటి వాగ్గేయకారులకు ఉడిపి నిలయం కావటంతో దీనిని దాస సాహిత్య కేంద్రమని పేర్కొంటారు.
మధ్వాచార్యులు తమ 79వ ఏట 1317లో శిష్యసమేతంగా బదరీ నారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా చేరుకుని వ్యాసభగవానుని కైంకర్యాలలో నిమగ్నమైపోయారు.
*ఓం నమో నారాయణాయ🙏*
🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి