🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
❗ *ఔను, అమ్మను మోసం చేస్తున్నాను.*
తల్లికి నిద్ర మాత్రలు వేసుకోవటం అలవాటు అయిపోయింది. మాత్రలు ఇవ్వకపోతే నిద్రపోను అని జిద్దు చేస్తున్నది. కొడుకుకు ఈమధ్యే పెళ్లయింది. కోడలిది వైద్య వృత్తి. నిద్ర మాత్రలు మంచివి కావు అని అత్త గారికి చెప్పటానికి చాలా ప్రయత్నం చేస్తున్నది. కానీ అత్తగారు వినటం లేదు. 'మీరు ఎంత అరిచి గీపెట్టినా మాత్రలు ఇవ్వను.' అని కోడలు తేల్చి చెప్పేసింది.
చివరికి ఆ తల్లి తన కొడుకుని పిలిచింది. కొడుకు వస్తూనే 'అమ్మా నోరు తెరువు' అని నిద్ర మాత్రలు తీసి ఆమె నోట్లో వేసి మంచినీరు అందించాడు. ఆమె వాటిని మింగి కొడుకుని మనసారా ఆశీర్వదించి హాయిగా నిద్రపోయింది.
ఆ అమ్మాయి కోపంగా 'ఎందుకు ఇట్లా చేశారు?' అని భర్తను అడిగింది. అతను ఆ మందు డబ్బా భార్యకు చూపించాడు. అది విటమిన్ మాత్రలు అని చూస్తూనే అమ్మాయి పెదవులపై నవ్వు విరిసింది. నెమ్మదిగా, 'అమ్మని మోసం చేస్తున్నారా?' అని అడిగింది.
అప్పుడు అతను, 'అమ్మ కూడా చిన్నప్పుడు మోసం చేసి మాకు బోలెడు తినిపించేది. అప్పట్లో ఆమె చేసేది. ఇప్పుడు నేను పగ తీర్చుకుంటున్నాను.' అని అన్నాడు.
ఇలా కూడా అమ్మను ప్రేమించవచ్చు...!!!
*అమ్మానాన్నలు దేవుని* *ప్రతిరూపాలు...!!!*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి