29, సెప్టెంబర్ 2021, బుధవారం

కంఠ చామీకర న్యాయం

 భగవంతుని గూర్చి ప్రతివారు వెతుకుతున్నారు.  కానీ చాలామంది భగవంతుడు బాహ్యంగా ఎక్కడో వున్నాడని, గుడులు గోపురాలు, క్షేత్రాలు అని ఈ ప్రపంచం అంతా తిరుగుతున్నారు.  ఎన్నోరకాల యజ్ఞ యాగాది క్రతువులు, నోములు, వ్రతాలూ చేస్తున్నారు.  ఆలా చేస్తే వారు చేసిన సత్కర్మలకు తగిన పుణ్యఫలం లభిస్తుంది కానీ భగవంతుడు మాత్రం దొరకడు ఎందుకంటె భగవంతుడు బాహ్యంలో లేఁడు.  మరి భగవంతుని వెతకటం ఎక్కడ, మోక్షం పొందటం యెట్లా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. ఈ విషయాన్నీ ప్రభోదించే కంఠ చామీకర న్యాయం గూర్చి తెలుసుకుందాం. 

కంఠ చామీకర న్యాయం - ఒక రాజ్యంలో రాణిగారు చాలా ఖరీదైన నెక్లెస్ విదేశాలనుంచి తెప్పించుకున్నారు. అకస్మాత్తుగా ఆ నెక్లెస్ కనిపించడం లేదు. రాణిగారికి చాలా ప్రీతికరమైన నెక్లెస్ మాయమయింది. దానిమీదమోజు తీరకుండానే పోయింది. దానితో రాణిగారు విపరీతమైన ఆవేదన చెందారు. సేవకులతో రాజప్రాసాదమంతా అడుగడుగునా గాలింపు చేయిస్తున్నారు. ఎంత వెతికినా ప్రయోజనం కన్పించ లేదు. మంత్రి ఏమైనా మార్గం చూపుతాడేమోనని పిలిపించారు. మంత్రిగారు అసలు విషయం వాకబు చేస్తే రాణిగారి నెక్లెస్ పోయిందని తెలిసింది. రాణిగారిని చూడగానే మంత్రిగారికి నెక్లెస్ జాడ తెలిసిపోయింది. వెంటనే మంత్రి అమ్మా మీ సేవకులను వెతకడం ఆపమనండి అన్నారు.  మంత్రి తెలివితేటల మీద అచంచలమైన విశ్వాసం ఉన్న రాణిగారు చప్పట్లు కొట్టి నెక్లెస్ గురించి వెతకడం ఆపింది.  “అమ్మా రాణిగారూ! మీ మెడను ఒకసారి తడుముకోండి,” అన్నారు మంత్రి. అప్పుడు రాణిగారికి మెడ తడుముకోకుండానే నెక్లెస్ బరువు తెలిసింది. ఆమె తన మెడలోనే నెక్లెస్ను పెట్టుకుని, ఊరంతా వెతుకుతోంది. తనదగ్గరే వున్న నెక్లెస్ బయట ఎలా దొరుకుతుంది? విశ్వమంతా ఎంత వెతికినా దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం నెక్లెస్ పొయింది అనే అజ్ఞానం తొలిగి తన దగ్గరే, మెడలోనే ఉందని తెలిస్తే చాలు. దీనినే కంఠచామీకర న్యాయం అంటారు. ఇది తెలిస్తే ఇక ఎటువంటి ఆందోళన ఉండదు. కంఠచామీకరం అంటే నెక్లెస్ అని అర్థం. -

    సరిగ్గా ఇలాగే జీవుడు తనే స్వరూపతః బ్రహ్మనని తెలుసుకోలేక జన్మ జన్మలనుంచి బ్రహ్మను వెతుకుతూనే ఉన్నాడు. మన దగ్గరే కోహినూర్ డైమండ్ ఉంది. దానిని అజ్ఞానంతో పేపరు వెయిట్ లా వాడుతున్నాము.

ప్రయోజనం: నేనే శాంతి, సుఖం, ఆనందాలకు నెలవు అని తన పూర్ణత్వం దర్శించిన జ్ఞానికి ఎటువంటి వెలితి లేదు. అతను ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, అత్యంతిక ఆనందం అనుభవిస్తాడు.

అదే మాదిరిగా జీవుడు తను స్వరూపతః బ్రహ్మను అని తెలుసుకుంటే, తనే ఆనంద స్వరూపమని తెలుసుకుంటాడు. అదే జీవన్ముక్తి. జీవుడు ఎప్పుడూ ముక్తుడే. ఆ విషయం తెలుసుకోవడమే తరువాయి. 

దీనినే శాస్త్రం ప్రాప్తస్య ప్రాప్తం అంటుంది. 

మోక్షం సిద్ధవస్తువు, సాధ్యవస్తువు కాదు.

సాధ్యవస్తువు అనగా కృషితో సాధించే వస్తువు.  ఆ కృషి ఎలాంటిదైనా కావచ్చు, భజన, కీర్తన, స్మరణ, యజ్ఞ యాగాది క్రతువులే కావచ్చు.  ఆలా సాధన వలన లభించేదానిని సాద్య వస్తువు అంటారు. 

సిద్ధవస్తువు అంటే వున్నవస్తువే కాకపొతే అది ఉన్నదన్న జ్ఞానం లేకపోతె దాని ఉనికిని తెలుసుకోలేము. ఒక చిన్న ఉదాహారణ మీరు మార్కెట్టుకు వెళ్లి ఏదో ఒక వస్తువు కొన్నారనుకోండి. తీరా డబ్బులు ఇవ్వాలనుకుంటే మీ జేబులో పర్సుకనపడలేదు.  అప్పుడు ఏమిచేస్తారు మీరు కొన్న వస్తువును వాపసు ఇస్తారా.  కానీ మీకు ఒక అలవాటు వుంది ఒకటి లేక రెండు వందల రూపాయలను మీరు మీ నడుము వద్ద వున్న ప్యాంటు జేబులో పెట్టుకుంటారు.  కానీ మీకు సమయానికి ఆ విషయం జ్ఞ్యాపకానికి రాలేదు.  కొంత ఆలోచించిన తరువాత జ్ఞ్యాపకానికి వచ్చింది అప్పుడు వెంటనే మీరు వాపసు ఇచ్చిన వస్తువుని దాని ధరచెల్లించి తిరిగి తెచ్చుకుంటారు. ఇలా మీ వద్ద వున్న వస్తువును మీరు తెలుసుకొనలేక పోవటం అజ్ఞ్యానం అదే తెలుసుకోవటం జ్ఞ్యానం.  మీలో వున్నపరమాత్మను (బ్రహ్మ)  తెలుసుకోలేక పోవటం పరమాత్మకు సంబందించిన అజ్ఞ్యానం అదే తెలుసుకోవటం పరమాత్మా (బ్రహ్మ) జ్ఞ్యానం ఇలా జ్ఞ్యానం పొందిన మానవుడే బ్రహ్మ జ్ఞ్యాని.  ఇలా చెప్పటం చాలా తేలిక కానీ ఆ జ్ఞ్యానం పొందటం మాత్రము కేవలం కఠోర తప్పస్సుచేయటం వలననే సాధ్యం. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 






మంత్ర జపం

 మంత్ర జపం...........!!


మంత్ర జపం యోగజపం కృత్వ పాప నివారణమ్,

పరం మోక్ష మవాప్నోతి మానుషో నాత్ర సంశయః!


మానవుడు జ్ఞానమునకు నిధి, మంత్ర జపము వలన పాప నివారణ జరుగును.అటువంటి మంత్ర సాధన మానవ జన్మ వలనే సాధ్యమగును. దాని వలనే తత్వ జ్ఞానము సిధ్దించును.


ఇతర జీవులలో జ్ఞాన గుణము లేదు. కేవలం పుణ్యము చేయుట వలనే మనుష్య జన్మ లభించుచున్నది. అటువంటి మనుష్యుడు సాధన చేతనే దేవతా సమానమగుచున్నాడు. దేహము లేనిదే పురుషార్ధము సిధ్ధించదు. కనుక ఈ శరీరమును రక్షించుకొనుచూ జ్ఞాన ప్రాప్తికి సాధన చేయవలెను.


మననం చేయడం వలన కాపాడేది మంత్రం మనస్సుకు చాంచల్య స్వభావం (ఒకచోట ఉండకుండా అనేకరకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అంటూనే వుంటుంది)


ఈ చంచల స్వభావం మానసిక వృత్తులను చిందరవందర చేస్తుంది. ఈ మానసిక వృత్తులు అన్నీ ఒకచోట చేరినప్పుడే అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది. అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తుంది. మంత్రానికి అంతఃకరణానికి సంబంధం వుంది.


మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు. నాడీ శుద్ధి జరుగుతుంది.

కుండలిని శక్తి జాగృతమౌతుంది. వ్యాధులు దూరమౌతాయి. మంత్ర సాధన వల్ల దేవతలు తమకు తామై దిగివస్తారు. నానావిధ సిద్ధులు సిద్ధిస్తాయి. మంత్రజప సాధన వలన సిద్ధులు కలుగుతాయని యోగా దర్శనం చెబుతుంది


ఎందరో మునులు, ఋషులు ఈమంత్రజపం వలనే సిద్ధులు సాధించారు.


సాధన వలన అధర్మపరుడిని ధర్మపరుడిగా, దానవుణ్ణి మానవునిగా, పాషండుని సదాచార పరాయనునిగా, దుఃఖ వంతుడిని, సుఖవంతుడిగా, కోపిని శాంతునిగా, ధరిద్రుడిని ధనవంతుడిగా, లోభిని త్యాగిగా, కాముని, జితేంద్రియునిగా, నాస్తికుడిని ఆస్తికుడిగా, తెజోవిహీనుడిని తేజోవంతునిగా, రోగిని ఆరోగ్యవంతునిగా, చేస్తుంది.


అంధకారం నుండి ప్రకాశం వైపు మృత్యువు నుండి అమృతం వైపు, నరకం నుండి స్వర్గం వైపు, హింస నుండి అహింస వైపు, దిర్భుద్ధి నుండి సద్బుద్ధి వైపు,తీసుకొనిపోతుంది. మంత్రమే దేవతా రూపాన్ని పొంది అత్మసక్షాత్కారాన్ని కలిగిస్తుంది.


జపం అనేది మూడు విధాలు....


1.బాహ్య జపం 2.ఉపాంశు జపం 3.మానసికజపం


1.బాహ్య జపం


ఒక జపమాల తీసుకుని దానిని ఒక నామాన్నో లేక మంత్రాన్నో ఉచ్ఛరిస్తూ కనుక విధిగా అభ్యాసం చేసినట్లైతే అది బాహ్య జపం !!


2.ఉపాంశు జపం


ఈ దశలో జపం జరిగే సమయంలో మాల తిరుగుతుంది, పెదవులు కదులుతుంటాయి కాని శబ్దం బయటకు వినపడకుండా సాగుతుంది !!


3.అంతరంగ జపం


ఇక్కడ ఈ స్థితిలో జపం నిరంతరాయమానముగా కొనసాగుతూనే ఉంటుంది ...


జపమాల తిరుగుతూనే ఉంటుంది కాని పెదవులు నాలుక కదలవు కేవలం మనసులో మాత్రమే నామస్మరణ (మంత్ర జపం) సాగుతూ ఉంటుంది


జపంతో నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం వల్ల, పరిపరి విధాలా పరుగులుదీసే ఇంద్రియాలు స్థిమితపడతాయి. మనం ఏ మంత్రాన్నైతే జపిస్తున్నామో అది మన మనసులోకి అంతకంతకూ గాఢంగా చొచ్చుకుపోతుంది. తొలుత బలవంతంగా కనిపించే ఈ ప్రక్రియ ఒక సాధనగా మారిపోతుంది.


ఇలా కొన్నాళ్లు సాధన చేసిన పిమ్మట సాధకుడు 'అజపజపం' అనే స్థితిని చేరుకుంటాడు. అంటే జపం చేయకున్నా కూడా మనసులోని ఒక భాగంలో నామస్మరణ నిర్విరామంగా సాగిపోతూనే ఉంటుంది.


మిగతా జీవుల సంగతేమో కానీ మనిషికి శబ్దానికీ మధ్య గాఢమైన సంబంధం ఉంది. మనిషి శబ్దం ద్వారానే తన భావాలను వ్యక్తపరుస్తాడు. శబ్దాన్ని వినడం ద్వారానే ఎదుట ఏం జరుగుతోందో అవగతం చేసుకుంటాడు. మనిషి వినే మాటకి అనుగుణంగా అతనిలోని మనసు ప్రతిస్పందిస్తుంది.


ఈ సృష్టి యావత్తూ ఓంకారం అనే శబ్దం నుంచి ఉత్పన్నం అయిందన్న వాదనలు హిందూ ధర్మంలో వినిపిస్తుంటాయి. అలాంటి శబ్దాన్ని ఉపాసించడం ద్వారా మనసుని లయం చేసుకోవడమే జపంలోని అంతరార్ధం.


అది నిర్విరామంగా సాగినా, జపమాల సాయంతో సాగినా.... మన జీవితాన్ని దైవ చైతన్యంతో అనుసంధానం కావడానికి, తనను తాను తరింప చేసుకోవడానికి ఒక నామాన్ని తలచుకోమని చెప్పడమే జప/మంత్ర సాధనలోని పరమార్థం...


#సాధన_సాధ్యతే_సర్వం..

దయచేసి మా పేజీని లైక్ చేయండి.. 🙏🙏

జపం చేస్తే ఫలితం......!!

 జపం చేస్తే ఫలితం......!!


జపం :

ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్నిస్తుంది. నదిలో చెసే జపం రెట్టింపు ఫలాన్నిస్తుంది. గోశాలలో జపం వందరెట్లు,యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది . పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధి లోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితము. శివ సాన్నిద్యంలో జపం చెస్తే అనంతమైన ఫలాన్నిస్తుంది.


అలాగే ఇతర జప ఫలితములు (వివిధ ఆసనములపై) :-


వెదురు తడకపై కూర్చునిచేస్తే - దారిద్ర్యము


రాతిపై కూర్చునిచేస్తే - రోగాలు,


నేలపై కూర్చునిచేస్తే - ధుఖము,


కొయ్యపీటపై-దౌర్భాగ్యము ,


గడ్డితో చేసిన చాపపై - చిత్తచాపల్యము కలుగుతాయి.


జింక చర్మము పై కూర్చునిచేస్తే- జ్ఞానసిద్ధి


వ్యాఘ్ర చర్మం(పులి తోలు)- మోక్షము


వస్త్రాసనం మీద- ధన సమృద్ధి


పేముతో అల్లిన ఆసనం - రోగ నివారణము కలుగును.


ధుఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేసుకొవాలి. అలాగే ధర్భలతో చేసిన ఆసనంపై జపము చేసిన పుష్టిని కలుగిస్తుంది.


కలియుగములో కీర్తనము మరియు జపము శ్రేష్ఠమైనవి. పూర్వము, వేయి ఎకరాలు అమ్మితే దొరికే డబ్బు, ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది. అదే కలియుగము యొక్క విశేషము. ఈ రోజుల్లో అయిదు నిమిషాలు పాటు ఏకాగ్రతను పొందగలిగితే అదే గొప్ప సొత్తు. జపము అనగా ఒక ప్రత్యేక దేవతను సూచించు మంత్రమును ‘పునఃపునః’ ఉచ్చరించటము...

#సాధన_సాధ్యతే_సర్వం..

దయచేసి మా పేజీని లైక్ చేయండి.. 🙏🙏

శ్రీమద్భాగవతము

 *29.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2276(౨౨౭౬)*


*10.1-1399-వ.*

*10.1-1400-*


*క. మన్నించి రాజుఁ జేసెను*

*వెన్నుఁడు సత్యావధాను విశ్రుతదానున్*

*సన్నుతమానున్ గదన*

*చ్ఛిన్నాహితసేను నుగ్రసేనున్ దీనున్.* 🌺



*_భావము: సత్యసంధుడని, గొప్ప దాతయని, సత్ప్రవర్తనుడనీ, యుద్ధములో శత్రుంజయుడని, కంసునిచే బాధలనుభవించి దీనావస్థలో నున్న ఉగ్రసేనుని, శ్రీకృష్ణుడు గౌరవించి మగధకు రాజుగా పట్టాభిషిక్తుని కావించెను._* 🙏



*_Meaning: Sri Krishna praised Ugrasena as an epostle of truth, a man of great character, conqueror of enemies and as the one, who suffered at the hands of Kamsa and crowned him as king of Magadha._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

యువతరం జీవితాలలో వెలుగు నింపడమే దార్శనికత

 " వృద్ధాప్యం, యావత్ విశ్వ జీవజాలానికి దివ్య ప్రకాశ చైతన్య దృక్పథ నిర్దేశితం " సృష్టి కర్త బ్రహ్మ నిర్దేశించిన జీవన వ్యవస్థలో భాగం, వృద్ధాప్యం ! సకల జీవ సృష్టిలో మానవ జన్మ, మహోన్నతం ! బాల్య వ్యవస్థ, ప్రతి వ్యక్తి జీవితానికి, మాతృప్రేమ తో సమ్మిళిత సన్మార్గ సువ్యక్తిత్వ చైతన్య స్ఫూర్తి ! సుసంస్కార, సుహృద్భావ దృక్పథ జీవన పథంలో సాగమని అమ్మ నేర్పే సన్మిత్ర స్ఫూర్తి ! ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం నేర్చే విశ్వ మానవాళి, తమ జీవన గమనంలో మహోన్నత శిఖరాలధిరోహిస్తోంది ! కాలక్రమంలో మనిషికి వృద్ధాప్య స్థితి రావడం సహజం, తన అనుభవమే భావి జీవనమార్గ నిర్దేశితమన్నది సత్యం ! విశ్వ మానవాళి నిత్య సత్య సహృదయ, సుహృద్భావ, సుస్నేహ భావనాత్మక జీవనం, వసుధైక కుటుంబక వ్యవస్థ నిర్మాణ దివ్య పథం ! వృద్ధాప్యం, ఈ మహత్తర జీవన విధానానికి మహోన్నత సుసంస్కార దివ్య భవ్య వేదిక అనెడి సమున్నత స్థానం ! తమ తమ జీవన గమనాల్లో అనేక ఒడిదుడుకులు తట్టుకున్న అనుభవమే వృద్ధుల జీవితాలలోని దివ్య ప్రకాశం ! " వృద్ధాప్యం ", ఏనాడూ మానవ జీవితాలలో శాపం కానేరదు, ఆ వ్యక్తుల పూర్వ జీవన అనుభవాన్ని సన్మార్గ భావి జీవన పథ నిర్దేశనంగా భావించిన నేపథ్యంలో ! వృద్ధులు, సకల విశ్వ భావి తరాలకు సక్రమ, సుసంస్కార, సన్మైత్రీ చైతన్య స్ఫూర్తినొసగే సన్మార్గంలో పయనించాల్సిన ఆవశ్యకత ప్రధానమిక్కడ ! ఏ వ్యక్తీ, తన జీవితంలో వృద్ధాప్యాన్ని భయంకరమైన రీతిలో భావించరాదనే సత్యం గ్రహించాలన్నదే ముఖ్య విషయం ! వృద్ధాప్యంలోని వారు తమ భావి తరాలకు దివ్య ప్రకాశ మహోన్నత జ్యోతిగా యువతరం జీవితాలలో వెలుగు నింపడమే దార్శనికత ! " వృద్ధాప్యం, ఏ నాడూ శాపం కాబోదు, మానవ జీవన పథంలో, వృద్ధులైన వారు తమ జీవన గమనంలో పొందిన అనుభవాన్ని రానున్న తరాల మంచి భవితకు సన్మార్గ దిశలో పంచినప్పుడు ! రచన : గుళ్లపల్లి ఆంజనేయులు

ధర్మ సందేహాలు

 ధర్మ సందేహాలు:


కాశీ యాత్రకు వెళ్ళినవారు, తమకు ఇష్టమైన ఆహారపదార్థాన్ని అక్కడ వదిలి పెట్టుటలో ఉద్దేశమేమిటి? 


'ఆహార పదార్థాన్ని వదిలి పెట్టేది కాశీలో కాదు గయలో.

గయలో ఫల్గుణీ నది ఒడ్డున "విష్ణుపాదం" ఉన్నది. ఈ విష్ణుపాదం గల ప్రదేశానికి 1 1/2 కి.మీ. దూరంలో ఒక వటవృక్షము కలదు. ఈ వృక్షము క్రింద మనలో ఉన్న లోపాలను విడిచి పెట్టవలెను. ఈ ఆచారానికి బదులు ప్రస్తుతం భక్తులు తమకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని వదిలి పెడుతున్నారు.

2021లో సింధూనది పుష్కరములు🙏🌹*

 *🌹🙏శ్రీప్లవనామ సంవత్సరము 2021లో సింధూనది పుష్కరములు🙏🌹*


సింధూ నది పుష్కరము

శ్రీప్లవ నామ సంవత్సర దక్షిణాయన శరదృతువు కార్తిక మాస బహుళ పక్ష విదియ శనివారం అనగా 20.11.2021న రోహిణి నక్షత్ర 3వ పాదం వృషభ రాశి శివయోగం తైతుల కరణం సింహలగ్న సమయంలో దైవ గురువు బృహస్పతి అంటే గురుడు కుంభరాశిలో ధనిష్ట నక్షత్ర 3వ పాదములో 50% బలంతో సమ స్థితిలో బాల్య అవస్థలో అడుగుపెట్టనున్నారు. ఆ క్రమంలో ఆరోజు రాత్రి అయినది కనుక రెండవ రోజు అయిన నవంబర్21,2021 ఆదివారం సూర్యోదయం నుంచి డిసెంబర్2 వరకు అంటే 12 రోజులపాటు సింధూ నదికి పుష్కరాలు జరగనున్నవి.ఋగ్వేదం అనేక నదులను వివరిస్తుంది. వాటిలో "సింధు" అనే పేరు ఉంది. ఋగ్వేదములో "సింధు"ను ప్రస్తుత సింధునది అని భావిస్తారు. ఇది దాని వచనంలో 176 సార్లు, శ్లోకాలలో 94 సార్లు ధృవీకరించబడింది. చాలా తరచుగా "నది" సాధారణ అర్థంలో ఉపయోగించబడుతుంది. ఋగ్వేదంలో, ముఖ్యంగా తరువాతి శ్లోకాలలో, సింధు నదిని సూచించడానికి ఈ పదానికి అర్ధం ఇరుకైనది, ఉదా. నాడిస్తుతి సూక్తా శ్లోకంలో పేర్కొన్న నదులలో సింధునది ప్రస్తావన ఉంది. ఋగ్వేద శ్లోకాలు బ్రహ్మాపుత్ర మినహా అందులో పేర్కొన్న అన్ని నదులకు స్త్రీ లింగాన్ని వర్తిస్తాయి.కానీ సింధూ నది మాత్రం పుంలింగాన్ని సూచిస్తుంది. అదే ఆశ్చర్యం ఏ నదికి లేని ప్రత్యేకత. అది ఒక్క సింధూ నదికి మాత్రమే ఉంది.

సింధూ నది టిబెట్టులోని మానస సరోవరం, కైలాస పర్వతాలనుంచి జమ్ము కశ్మీరులోని లద్దాక్ మీదుగా- గిల్గిట్‌, బాల్టిస్థాను నుండి పాకిస్థానులోని పంజాబు రాష్ట్రం గుండా ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించి కరాచీ ద్వారా అరేబియా మహా సముద్రంలో కలుస్తోంది. సింధూ నదికి సంబంధించిన అనేక ఉపనదులు భారత్ లోని జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ల 

మీదుగా ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తాయి. 3,180 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే సింధూనది వార్షిక నీటిప్రవాహం ప్రాతిపదికన ప్రపంచంలో 21వ అతి పెద్ద నదిగా గుర్తింపు పొందింది. చైనా, భారత్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహించే ఈ జీవనది పరీవాహక ప్రాంతం మొత్తం 11,65,000 చదరపు కిలోమీటర్లు. వార్షిక ప్రవాహ లెక్కల ప్రకారం సింధు నది ప్రపంచంలో కెల్లా 21వ అతిపెద్ద నదిగా రికార్డు నమోదు చేసింది.భారత పాకిస్తానులు సింధు నదీ జలాలను వినియోగించుకునేందుకు ఒక అంతర్జాతీయ నీటి పంపక ఒడంబడికను కుదుర్చుకున్నాయి.

సింధూ నది ఒకరకంగా పాకిస్థానుకు జీవనాడి! పాకిస్తాన్లోని పంజాబ్‌ రాష్ట్రంతో సహా ఆ దేశంలోని మొత్తం 65% భూభాగం సింధూ పరీవాహక ప్రాంతమే. ఆ ప్రాంతంలో నిర్మించిన కాలువల వ్యవస్థ, ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. పాక్‌లోని 90% ఆయకట్టు ఈ కాలువల ద్వారానే సస్య శ్యామలమవుతోంది. పాకిస్థానులోని మూడు అతి పెద్ద ఆనకట్టలు, అనేక చిన్న ఆనకట్టలు సింధూ పరీవాహక ప్రాంతంలోనివే. సింధూ నది పాక్‌ విద్యుత్తు అవసరాలను, తాగు, సాగునీరు అవసరాలను తీర్చే కామధేనువు.

సింధూ నది కశ్మీర్ లోయలో ప్రవేశించదు. కానీ సింధునది ఉప నదులు కశ్మీర్ లోయాలో ప్రవహిస్తాయి. అయితే కొన్ని టూరిస్టు ఏజెన్సీలు సింధూ పుష్కరాల సమయంలో ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోనే మార్గ్ లో ఉద్భవించిన ఒక వాగును కశ్మీరీలు సింధ్ గా వ్యవహరిస్తారు. ఈ వాగు షాధిపూరా అనే గ్రామం సమీపంలోని నారాయణ్ భాగ్ వద్ద జీలం నదిలో కలుస్తోంది. రెండు నదు కలిసే సంగమం కావడంతో యాత్రీకులు ఇక్కడే పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. నిజానికి సింధునదీ లద్దాక్ మీదుగా పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రవేశిస్తుందనే విషయం మనం మర్చిపోరాదు.

ఆచరణ విధానం:

మూడుమార్లు నదిలో మునిగి, అనంతరం రెండుచేతులతో నదీజలాలను తీసుకొని 18 మార్లు తర్పణములుగ తిరిగి ఆనదిలోనే వదలవలెను

తర్పణం

1) ఓం సంధ్యాం తర్పయామి 

2) ఓం గాయత్రీం తర్పయామి

3) ఓం బ్రాహ్మీం తర్పయామి

4)ఓం నిమృజీం తర్పయామి

5) ఓం ఆదిత్యం తర్పయామి

6) ఓం సోమం తర్పయామి

7) ఓం అంగారకం తర్పయామి

8) ఓం బుధం తర్పయామి

9) ఓం బృహస్పతిం తర్పయామి

10) ఓం శుక్రం తర్పయామి

11) ఓం శనిం తర్పయామి

12) ఓం రాహుం తర్పయామి

13) ఓం కేతుం తర్పయామి

14) ఓం యమం తర్పయామి

15) ఓం సర్వదేవతాన్ తర్పయామి

16) ఓం సకలపితృదేవతాన్ తర్పయామి

17) ఓం సర్వఋషీన్ తర్పయామి 

18) ఓం సర్వభూతాని తర్పయామి 


శ్లో !! నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా !

విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ !!

భాగిరధి భొగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ !

ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే !!

స్నాన కాల పఠె న్నిత్యం మహా పాతక నాశనం|| 


స్నానం తరువాత ప్రార్ధనా శ్లోకాలను చదువుతూ, ప్రవాహానికి ఎదురుగా, వాలుగా, తీరానికి పరాజ్ముఖముగా కుడి చేతి బొటన వ్రేలుతో నీటిని కదిలించి మూడు దోసిళ్ళ నీళ్ళు తీరానికి జల్లి , తీరానికి చేరి బట్టలని పిండుకోవాలి.

తరువాత పొడి బట్టలు కట్టుకొని తమ సంప్రదాయానుసారం విభూతి వంటి వాటిని ధరించి సంధ్యా వందనాదులు చేసుకోవాలి. తరువాత నదీ తీరాన గాని దేవాలయాన గాని దైవమును అర్చించాలి

మొదటి రోజు నారాయణనుడి అర్చన జప తర్పనాదులతో ప్రారంభించి

రెండోరోజు భాస్కర.

మూడురోజు మహాలక్ష్మి.

నాలుగో రొజు గణేష.

ఐదవ రోజు శ్రీకృష్ణ.

ఆరవ రోజు సరస్వతీ.

ఏడవ రోజు పార్వతీ.

ఎనిమిదవ రోజు మహేశ్వర.

తొమ్మిదవ రోజు అనంత.

పదవ రోజు నృసింహ

పదకొండవ రోజు వామన

పన్నెండవ రోజు రామచంద్రుడు

ఇలా 12 రోజులు 12 దేవతలను అర్చించి 12రోజులు 12 రకాల దానాదులు ఇవ్వాలి అలా చెయటం పుష్కర వ్రతంగా పిలుస్తారు ఇది ఉత్తమమైనది..

అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్రాద్దం నిర్వహించి పిత్రుదేవతలకు తర్పణాదులు ఇవ్వాలి

మొదటి రోజు హిరణ్యశ్రాద్ధం

తొమ్మిదవ రోజు అన్నశ్రాద్దం

పన్నెండవ రోజు ఆమ శ్రాద్దం..తప్పనిసరి 


పుష్కర సమయంలో నదీస్నానమే కాక పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా ముఖ్యం. 

పుష్కర సమయంలో చేయవసిన దానాదులు :

తేది దైవం పేరు - దానములు/పూజలు

21.11.2021(మొదటి రోజు) నారాయణ - ధాన్యము,రజితము,సువర్ణము, భూమి 


22.11.2021(రెండవ రోజు) భాస్కర - వస్త్రము,లవణము,గోవు,రత్నము. 


23.11.2021(మూడవ రోజు) మహాలక్ష్మి - బెల్లము,కూరలు,వాహనము, గొవు, అశ్వం, పండ్లు

24.11.2021(నాలుగవ రోజు) గణపతి - నేయి,నువ్వులు,తేనె,పాలు,వెన్న,నూనె,పానకం 


25.11.2021(ఐదవ రోజు) శ్రీకృష్ణ - ధాన్యము,బండి,గేదె,ఎద్దు,నాగలి 


26.11.2021(ఆరవ రోజు) సరస్వతి - కస్తూరి,గంధపుచెక్క,కర్పూరము, ఓషదులు, సుంగంద ద్రవ్యాలు 


27.11.2021(ఏడవ రోజు) పార్వతి - గృహము,ఆసనము,శయ్య(మంచము), పల్లకి, ఊయల 


28.11.2021(ఎనిమిదవ రోజు) పరమేశ్వరుడు- కందమూలములు,అల్లము,పుష్పమూలము, వెన్న 


29.11.2021(తొమ్మిదవ రోజు) అనంత - కన్య,పఱుపు,చాప(శయన వస్తువులు), దేవతా విగ్రహాలు, సాలగ్రామాలు,

30.11.2021(పదవ రోజు) నరసింహ - దుర్గ,లక్ష్మి,దేవి పూజ,వెండి, బంగారం, పూలు,ముత్యాలు, పురాణాలు 


1.12.2021(పదకొండవ రోజు) వామన - కంబళి,సరస్వతి,యజ్నోపవీతము,వస్త్రము,తాంబూలము, గ్రంథాలు 


2.12.2021(పన్నెండవ రోజు) శ్రీరామ - దశ,షోడశ మహాదానములలో అన్నిటిని దానం ఇవ్వవచ్చును


ఈ విధంగా పుష్కర వ్రతం దానాదులు ఆచరించటం అనంతకోటి పుణ్యఫలితాలను కలిగిస్తాయి.

సంస్కృత మహాభాగవతం

 *29.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - తొమ్మిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - కురురపక్షి (లకుముకిపిట్ట) మొదలుకొని 'భృంగి' అను కీటకము వరకు గల ఏడుగురు గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*9.16 (పదహారవ శ్లోకము)*


*ఏకో నారాయణో దేవః పూర్వసృష్టం స్వమాయయా|*


*సంహృత్య కాలకలయా కల్పాంత ఇదమీశ్వరః॥12559॥*


*9.17 (పదిహేడవ శ్లోకము)*


*ఏక ఏవాద్వితీయోఽభూదాత్మాధారోఽఖిలాశ్రయః|*


*కాలేనాత్మానుభావేన సామ్యం నీతాసు శక్తిషు|*


*సత్త్వాదిష్వాదిపురుషః ప్రధానపురుషేశ్వరః॥12560॥*


*9.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*పరావరాణాం పరమ ఆస్తే కైవల్యసంజ్ఞితః|*


*కేవలానుభవానందసందోహో నిరుపాధికః॥12561॥*


*9.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*కేవలాత్మానుభావేన స్వమాయాం త్రిగుణాత్మికామ్|*


*సంక్షోభయన్ సృజత్యాదౌ తయా సూత్రమరిందమ॥12562॥*


*9.20 (ఇరువదియవ శ్లోకము)*


*తామాహుస్త్రిగుణవ్యక్తిం సృజంతీం విశ్వతోముఖమ్|*


*యస్మిన్ ప్రోతమిదం విశ్వం యేన సంసరతే పుమాన్॥12563॥*


సర్వాంతర్యామియు, సర్వశక్తిమంతుడు ఐన భగవంతుడు కల్పప్రారంభమున ఎవ్వరి సహాయమూ లేకుండా తన సంకల్ప ప్రభావమున రచింపబడిన జగత్తును కల్పాంతమున (ప్రళయకాలమున) తన కాలశక్తి ద్వారా ఉపసంహరించును. తనలో లీనమొనర్చుకొనును. పిమ్మట సజాతీయ విజాతీయ స్వగతభేదము లేకుండా ఒంటరిగనే ఉండిపోవును. అన్నింటికిని అధిష్ఠానము, ఆశ్రయము అతడు. అతనికెట్టి ఆధారముగాని, ఆశ్రయముగాని లేవు. అతడు ప్రకృతి పురుషులకు నియామకుడు. కార్యకారణాత్మకమైన జగత్తునకు ఆదికారణుడైన ఆ పరమాత్మ తన శక్తియైన కాలప్రభావమున సత్త్వరజస్తమోగుణాత్మకములైన సర్వశక్తులను సామ్యావస్థలో నుంచును. తాను స్వయముగా కేవలుడై అద్వితీయ రూపముతో విరాజిల్లును. ఆ స్వామి కేవలము అనుభవైకవేద్యుడు. ఆనందఘనుడు. ఎట్టి ఉపాధులతోడను ఆయనకు సంబంధము లేదు. కేవలము తన కాలశక్తిద్వారా త్రిగుణాత్మకమైన మాయను క్షోభిల్లజేయును. దానినుండి ముందుగా ప్రధాన సూత్రమైన మహత్తత్త్వమును రచించెను. క్రియాశక్తిరూపమైన ఈ మహత్తత్త్వమే త్రిగుణాత్మకమైన ప్రకృతియొక్క మొదటి అభివ్యక్తి అనగా ప్రకటరూపము. ఇదియే అన్నివిధములగు సృష్టికి మూలకారణము. దానియందు ఈ విశ్వమంతయును సూత్రమునందు వస్త్రమువలె ఓతప్రోతమై యుండును. దానివలననే జీవుడు జననమరణ చక్రములో పరిభ్రమించుచుండును.


*9.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*యథోర్ణనాభిర్హృదయాదూర్ణాం సంతత్య వక్త్రతః|*


*తయా విహృత్య భూయస్తాం గ్రసత్యేవం మహేశ్వరః॥12564॥*


సాలెపురుగు తననుండి వెలువడిన దారముద్వారా గూడును అల్లుకొని అందే విహరించును. మఱల దానినే గ్రసించును. అట్లే పరమేశ్వరుడు ఈ జగత్తును తన నుండియే ఉత్పన్నము చేయును, జీవుల రూపములో అందు విహరించును. పిమ్మట దానిని తనలోనే లీనమొనర్చుకొనును.


*9.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*యత్ర యత్ర మనో దేహీ ధారయేత్సకలం ధియా|*


*స్నేహాద్ద్వేషాద్భయాద్వాపి యాతి తత్తత్స్వరూపతామ్॥12565॥*


యదుమహారాజా! ఏ ప్రాణియైనను ప్రేమతోగాని, ద్వేషముతోగాని, భయముతోగాని, నిశ్చయాత్మకబుద్ధితో ఏ వస్తువుపై తన మనస్సును ఏకాగ్రతతో లగ్నముచేయునో, ఆ ప్రాణికి ఆ వస్తు స్వరూపమే ప్రాప్తమగును. ఆ వస్తువుయొక్క గుణమే ప్రాప్తించును.


*9.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*కీటః పేశస్కృతం ధ్యాయన్ కుడ్యాం తేన ప్రవేశితః|*


*యాతి తత్సాత్మతాం రాజన్ పూర్వరూపమసంత్యజన్॥12566॥*


మహారాజా! భ్రమరము ఒక పురుగును తీసికొనివచ్చి, గోడరంధ్రములో తానున్న ప్రదేశమున ఉంచి, పదేపదే ఝంకారము చేయుచుండును. ఆ భ్రమరమునకు భయపడి కీటకము సర్వదా ఆ భ్రమరమునే ధ్యానించుచుండును. తత్ప్రభావమున ఆ కీటకము తన పూర్వశరీరమును త్యజింపకయే ఆ భ్రమరరూపమును పొందును. అట్లే మానవుడు సంతతము పరమాత్మను భక్తితో చింతించుచున్నచో అతను క్రమముగా ఆ పరమాత్మ రూపమునే పొందును. నేను భ్రమరమునుండి ఈ స్ఫూర్తిని పొందితిని.


*9.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*ఏవం గురుభ్య ఏతేభ్య ఏషా మే శిక్షితా మతిః|*


*స్వాత్మోపశిక్షితాం బుద్ధిం శృణు మే వదతః ప్రభో॥12567॥*


రాజా! ఈ విధముగా నేను ఈ ఇరువది నాలుగు మంది గురువుల నుండి ఉపదేశములను పొందితిని. నేను ఈ దేహముద్వారా పొందిన ఉపదేశములను తెలిపెదను వినుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*424వ నామ మంత్రము* 29.9.2021


*ఓం తత్త్వాసనాయై నమః*


పృథివి నుండి శివుని వరకు గల ముప్పదియారు తత్త్వములను తన ఆసనముగా చేసికొని విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *తత్త్వాసనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం తత్త్వాసనాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులు ఆత్మానందానుభూతిని పొందుదురు.


తత్త్వముల సంఖ్య భిన్న రీతిలో చెప్పబడుచున్నది. ఇక్కడ తత్త్వశబ్దముచే ముప్పదియారు తత్త్వములుగా తెలియదగును. అవి - మూలప్రకృతిః (1), మహదహంకార పంచతన్మాత్రలు ఏడు (7), పంచభూతములు ఐదు (5), జ్ఞానేంద్రియములు ఐదు (5), కర్మేంద్రియములు ఐదు (5), పంచప్రాణములు ఐదు (5), పంచ ఉప ప్రాణములు ఐదు (5), మనస్సు (1), జీవుడు (1), ఈశ్వరుడు/శివుడు (1) - మొత్తం ముప్పది ఆరు తత్త్వములు. ఈ తత్త్వములనే తన యోగపీఠముగా గలిగిన పరమేశ్వరి *తత్త్వాసనా* యని అనబడినది. ఇట్టి తత్త్వములకు అతీతమైనది పరమేశ్వరి. తత్త్వముల స్వరూపిణి పరమేశ్వరి గనుకనే అమ్మవారు *తత్త్వాసనా* యని అనబడినది. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం తత్త్వాసనాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*423వ నామ మంత్రము* 29.9.2021


*ఓం ద్విజబృంద నిషేవితాయై నమః*


ఉపనయన సంస్కారం గలిగి, ద్విజులు అనిపించుకునే వారిచే త్రికాలసంధ్యలయందును సంధ్యా స్వరూపిణిగా ఆరాధింపబడే పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ద్విజబృంద నిషేవితా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం ద్విజబృంద నిషేవితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి వారిని అనునిత్యం వారి వెంట ఉంటూ, సర్వకాల సర్వావస్థలయందును కరుణా కటాక్షవీక్షణములతో సకల శుభములను అనుగ్రహించును.


ద్విజులు అనగా ఉపనయన సంస్కారము గలవారు. అనగా పుట్టుట ప్రథమ జన్మమయితే, ఉపనయన సంస్కారముతో గాయత్రీ ఆరాధనార్హత కలిగియుండుట ద్వితీయ జన్మము ఏర్పడుతుంది. ఈ ఉపనయన సంస్కారము ఉన్నవారు బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులు. బ్రాహ్మణులు బ్రహ్మదేవుని ముఖమునుండియు, క్షత్రియులు బ్రహ్మదేవుని బాహువుల నుండియు, వైశ్యులు బ్రహ్మదేవుని ఊరువులనుండియు జన్మించినవారై ఉపనయన సంస్కారార్హత కలిగి ద్విజులయారు. ఈ మూడు వర్ణములవారు త్రికాలములయందు ఆ పరమేశ్వరిని గాయత్రీ స్వరూపిణిగా (ప్రాతః సంధ్యలో గాయత్రిగాను, మధ్యాహ్న సంధ్యలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను) సంధ్యావందనమునందు ఆరాధించుదురు. గనుకనే అమ్మవారు *ద్విజబృంద నిషేవితా* యని అనబడినది.


ఇంకను చెప్పవలెనంటే అండజములు అనగా పాములు, బల్లులు, పక్షులు, చేపలు కూడా ద్విజులే కాబట్టి వీటిచేతకూడా అమ్మవారు పూజింపబడుచున్నదని ఈ నామ మంత్రము వలన భావించవచ్చును.


రేణుకా పురాణమునందు సంధ్యాదేవి (ప్రాతః కాల సంధ్యయందు గాయత్రీదేవి, మధ్యాహ్నకాల సంధ్యయందు సావిత్రీదేవి, సాయంకాల సంధ్యయందు సరస్వతీ దేవి) దేవతలచేత, ద్విజులచేత, మహాత్ములచేత సర్వకాల సర్వావస్థలయందును పూజింపబడును అని గలదు.  


వ్యాహృతి, సంధ్య, ద్విజబృంద నిషేవిత అను మూడు నామ మంత్రములను జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థగా అన్వయించుకోవచ్చును. అది ఎలాగ? అంటే వ్యాహృతి యనగా మాటలాడుట జాగ్రదావస్థయందు జరుగును. అందుచే వ్యాహృతి జాగ్రదావస్థగా అన్వయించ గలము. సంధ్యా అను శబ్దము స్వప్నమును తెలియజేయును. ఇది జాగ్రదావస్థకును సుషుప్త్యవస్థకును సంధికాలమున పుట్టును గనుక సంధ్యయగును. అలాగే సంధ్య అను శబ్దము వ్యాసులవారి సూత్రముల ప్రకారము, సంధ్య అనగా స్వప్నపరమైనదిగా చెప్పవచ్చును. ఇక సుషుప్తి యందు సకల జీవులును నిద్రయందు ఒడలెరుగని స్థితిలో ఉండుదురు. సుషుప్తియందు జీవులు పరబ్రహ్మయందు లయమయి ఉన్నారని కూడా భావించవచ్చును.


త్రికాల సంధ్యలయందు సంధ్యావందనము అనేది ద్విజులకు (బ్రహ్మక్షత్రియవైశ్యులకు) వేదవిహిత కర్మాచరణముగా చెప్పబడినది. త్రికాల సంధ్యలయందు పరమేశ్వరి సంధ్యాదేవిగా ద్విజసమూహములచే ఆరాధింపబడుచున్నది గనుక ఆ తల్లి *ద్విజబృంద నిషేవితా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం ద్విజబృంద నిషేవితాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

 *28.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - తొమ్మిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - కురురపక్షి (లకుముకిపిట్ట) మొదలుకొని 'భృంగి' అను కీటకము వరకు గల ఏడుగురు గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*9.9 (తొమ్మిదవ శ్లోకము)*


*అన్వశిక్షమిమం తస్యా ఉపదేశమరిందమ|*


*లోకాననుచరన్నేతాన్ లోకతత్త్వవివిత్సయా॥12552॥*


*9.10 (పదియవ శ్లోకము)*


*వాసే బహూనాం కలహో భవేద్వార్తా ద్వయోరపి|*


*ఏక ఏవ చరేత్తస్మాత్కుమార్యా ఇవ కంకణః॥12553॥*


శత్రుసూదనా! యదుమహారాజా! ఆ సమయమున నేను లోకుల తీరుతెన్నులను పరిశీలించుటకై అటునిటు సంచరించుచు అచటికి చేరితిని. ఆ కన్యవృత్తాంతము నుండి నేను గ్రహించిన విషయమిది - "సమస్య ఏర్పడినప్పుడు సమయస్ఫూర్తితో దానినుంఢి బయటపడవలెను. పెక్కుమంది కూడినచోట కలహము తప్పక జరిగి తీరును. ఇద్దరున్నచో వ్యర్థ ప్రసంగములు చోటుచేసికొనును. అందువలన ఆ కన్యయొక్క చేతి గాజువలె ఒక్కడే సంచరించుట ఉత్తమము.


*9.11 (పదకొండవ శ్లోకము)*


*మన ఏకత్ర సంయుంజ్యాజ్జితశ్వాసో జితాసనః|*


*వైరాగ్యాభ్యాసయోగేన ధ్రియమాణమతంద్రితః॥12554॥*


*9.12 (పండ్రెండవ శ్లోకము)*


*యస్మిన్ మనో లబ్ధపదం యదేతచ్ఛనైః శనైర్ముంచతి కర్మరేణూన్|*


*సత్త్వేన వృద్ధేన రజస్తమశ్చ విధూయ నిర్వాణముపైత్యనింధనమ్॥12555॥*


*9.13 (పదమూడవ శ్లోకము)*


*తదైవమాత్మన్యవరుద్ధచిత్తో న వేద కించిద్బహిరంతరం వా|*


*యథేషుకారో నృపతిం వ్రజంతమిషౌ గతాత్మా న దదర్శ పార్శ్వే॥12556॥*


యదుమహారాజా! స్థిరమైన ఆసనముపై కూర్చుండి ప్రాణాయామముద్వారా శ్వాసక్రియను అదుపుచేయవలెను. అభ్యాస వైరాగ్యములద్వారా మనస్సును వశపరచుకొని, దానిని లక్ష్యముపై స్థిరముగా నిలుపవలెను. ఆనంద స్వరూపుడైన పరమాత్మయందు మనస్సు స్థిరముగా నిలచినప్పుడు క్రమక్రమముగా కర్మవాసనల రేణువులు తొలగిపోవును. సత్త్వగుణము వృద్ధియగును. రజస్తమోగుణముల వృత్తులు అణగారి ఇంధనము లేని అగ్నివలె మనస్సు ప్రశాంతమగును. ఈ విధముగా చిత్తమును పరమాత్మయందు స్థిరముగా నిలిపినప్పుడు బాహ్యాభ్యంతరముల పదార్థముల జోలియే పట్టదు. నేనొక బాణమును సిద్ధపరచువానిని చూచితిని. అతడు తన పనియందే చిత్తమును నిలిపియుండుటవలన ఆ ప్రక్కనుండి ఒకరాజు తన సైన్యముతో వెళ్ళిపోవుచున్నను అతడు గమనింపలేకుండెను. సాధకుడు ఏకాగ్రచిత్తుడై కార్యమునందు నిమగ్నుడై యుండవలయునని, ఈ బాణకారుని వృత్తాంతము మనకు బోధపరచుచున్నది.


*9.14 (పదునాలుగవ శ్లోకము)*


*ఏకచార్యనికేతః స్యాదప్రమత్తో గుహాశయః|*


*అలక్ష్యమాణ ఆచారైర్మునిరేకోఽల్పభాషణః॥12557॥*


*9.15 (పదునైదవ శ్లోకము)*


*గృహారంభోఽతి దుఃఖాయ విఫలశ్చాధ్రువాత్మనః|*


*సర్పః పరకృతం వేశ్మ ప్రవిశ్య సుఖమేధతే॥12558॥*


మునీశ్వరుడు ఒంటరిగనే జీవింపవలెను. తన చుట్టును ఎట్టి గుంపును చేర్చుకొనరాదు. తన నివాసస్థానముపై మమకారము లేకుండా జాగరూకుడై యుండవలెను. ఆచార వ్యవహారములద్వారా తన యునికిని ఎవ్వరికిని తెలియనీయరాదు. మితభాషియై యుండవలెను. అనిత్యమైన ఈ శరీరము కొరకు శ్రమపడి, గృహనిర్మాణము చేయుట వ్యర్థము. సర్పము ఇతర ప్రాణులు నిర్మించిన పుట్టలలో చేరుచు హాయిగా నివసించును. అట్లే మునీశ్వరులు గుహలలో నివసింపవలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*దేశ ప్రయోజనాల కోసం

 * ఆచార్య రజనీష్* ను అతని అనుచరులలో ఒకరు ప్రశ్నించారు.

  * ప్రశ్న * - * దయచేసి ఇళ్ళు మరియు ఆస్తులు దహనం చేయబడినప్పుడు, జిహాదీల ద్వారా హత్యలు జరుగుతున్నప్పుడు మనం ఏమి చేయాలి?  మేము హిందూ ముస్లిం సోదరుని బ్రదర్‌హుడ్‌ని ప్రోత్సహించాలా లేదా మన స్వంత భద్రత కోసం ఏదైనా అడుగు వేస్తే, దయచేసి మార్గనిర్దేశం చేయండి.


  * సమాధానం * - * 🙏 మీ ప్రశ్న మీ మూర్ఖత్వాన్ని తెలియజేస్తోంది, మీరు చరిత్ర నుండి ఏమీ నేర్చుకున్నట్లు అనిపించదు.  మహ్మద్ గజ్నవి సోమనాథ్ ఆలయంపై దాడి చేసినప్పుడు, సోమనాథ్ ఆ సమయంలో భారతదేశంలో అతి పెద్ద మరియు ధనిక దేవాలయం.  ఆ ఆలయంలో పూజించే 1200 మంది హిందూ పూజారులు మేము ధ్యానం, భక్తి, ఆరాధన, పగలు మరియు రాత్రి అని నిమగ్నమై ఉన్నామని అనుకున్నారు.  కాబట్టి దేవుడు మనల్ని రక్షిస్తాడు.  అతను రక్షణ కోసం ఎటువంటి ఏర్పాటు చేయలేదు, దీనికి విరుద్ధంగా, తమను తాము రక్షించుకోగల క్షత్రియులు కూడా నిరాకరించారు.

  *ఫలితంగా, మహమూద్ వేలాది మంది నిరాయుధులైన హిందూ పూజారులను చంపాడు, విగ్రహాలు మరియు దేవాలయాలను పగలగొట్టాడు మరియు చాలా సంపద, వజ్రాలు, ఆభరణాలు, బంగారం మరియు వెండిని ఎత్తుకెళ్లాడు.

 దేవుని ధ్యానం మరియు భక్తి ఆరాధన వారిని రక్షించలేకపోయాయి.


 నేడు, వందల సంవత్సరాల తరువాత కూడా, అదే మూర్ఖత్వం కొనసాగుతోంది, మీ గొప్ప వ్యక్తుల జీవితాల నుండి మీరు ఏమీ నేర్చుకున్నట్లు అనిపించదు.


  ధ్యానానికి దుర్మార్గుల హృదయాన్ని మార్చగలిగేంత శక్తి ఉంటే, రామచంద్ర జీ ఎల్లప్పుడూ అతనితో విల్లు మరియు బాణాన్ని ఎందుకు ఉంచాలి.  ధ్యాన శక్తితో, అతను రాక్షసులు మరియు రావణుడి హృదయాన్ని మార్చేవాడు, వారిని సుర్-అసుర సోదరులు మరియు సోదరులు అని వివరిస్తాడు మరియు వైరం ముగిసిపోతుంది, కానీ రాముడు కూడా ఎవరికీ వివరించలేదు మరియు రామ్-రావణ యుద్ధం యొక్క నిర్ణయం  ఆయుధం ద్వారా కూడా నిర్ణయించబడుతుంది.


  ధ్యానానికి చాలా శక్తి ఉంటే అది ఇతరుల మనస్సును మార్చగలదు.  కాబట్టి పూర్ణావతార్ శ్రీ కృష్ణుడు కంస మరియు జరాసంఘను ఎందుకు చంపాలి!  అతను వాటిని ధ్యానంతో మాత్రమే మార్చగలడు.


 ధ్యానానికి మరొకరి మనసు మార్చే శక్తి ఉంటే, మహాభారత యుద్ధం ఉండదు, కృష్ణుడు తన ధ్యాన శక్తితో దుర్యోధనుడిని మార్చేవాడు మరియు యుద్ధం నివారించబడేది.  కానీ దానికి విరుద్ధంగా, కృష్ణుడు ధ్యానానికి వెళ్లాలనుకున్న అర్జునుడిని ఆపి యుద్ధంలో నిమగ్నమయ్యాడు.


 మహాభారత యుద్ధం చరిత్రలో అతిపెద్ద యుద్ధం, దీనిలో కోటి మందిని ఊచకోత కోశారు, గత 1200 సంవత్సరాలలో భారతదేశంలో ఎంత మంది మహర్షి సాధువులు ఉన్నారు, గోరఖ్ నాథ్ నుండి రైదాస్ మరియు కబీర్ నుండి గురు నానక్ వరకు గురు గోవింద్ సింగ్ వరకు, శక్తి  వీరందరి ధ్యానం కూడా ముస్లిం ఆక్రమణదారులు మరియు బ్రిటిషర్లు.  ఈ సమయంలో కోట్ల మంది హిందువులను ఊచకోత కోశారు మరియు వారి మతం కత్తి యొక్క కొన వద్ద బలవంతంగా మార్చబడింది.


  వారిని చంపి ఇస్లాం మతంలోకి మార్చారు

  ఆ సాధువుల బోధలు ఆక్రమణదారులను మార్చలేకపోయాయి.  గురునానక్ తన మతం యొక్క తత్వశాస్త్రాన్ని ముస్లింలు సులభంగా అర్థం చేసుకునే విధంగా మరియు అతనిని గ్రహించే విధంగా ఇచ్చారు.  కానీ అదే గురు సంప్రదాయంలో, గురు గోవింద్ సింగ్ ముస్లింలకు వ్యతిరేకంగా కత్తిని తీసుకోవాల్సి వచ్చింది, హిందూ మతాన్ని కాపాడటానికి, నిరాయుధ సిక్కులు ఆయుధాలను చేపట్టవలసి వచ్చింది.


  ధ్యానం ఒకరి స్వంత చైతన్యాన్ని మార్చగలదని దీని నుండి స్పష్టమవుతుంది.

  కానీ మనం పదార్థాన్ని (భౌతిక శరీరాన్ని) మనమే కాపాడుకోవాలి, దాని కోసం మనం సైన్స్ మరియు టెక్నాలజీ సహాయం తీసుకోవాలి.


 దేశంలోని 70% కంటే ఎక్కువ సమస్యలకు పరిష్కారం.


  * శ్రీకృష్ణ భగవానుడు 5 గ్రామాలు అడిగాడు!

  *దేశ ప్రయోజనాల కోసం మేము 5 చట్టాలను అడుగుతున్నాము !!*


  *సమాన విద్య*

  *ఏకరీతి పౌర స్మృతి*

  *మార్పిడి నియంత్రణ*

  *చొరబాటు నియంత్రణ*

  *జనాభా నియంత్రణ*


 ఈ ఐదు చట్టాలు రాకపోతే, ప్రస్తుతం భారతదేశంలోని తొమ్మిది రాష్ట్రాల వలె సనాతన్ మొత్తం ప్రపంచం మొత్తంలో నాశనమవుతుంది.


  *సేవ్ ఇండియా ఉద్యమం*



  *మన దేశం మరియు మన సోదరీమణులు/ కుమార్తెలను కాపాడే ఉద్యమం*


  మీరు దానిని మరింతగా పంపరని నాకు తెలుసు, చదివిన తర్వాత మీరు దానిని వదిలివేస్తారు.  కనీసం ఒక వ్యక్తికి సందేశం పంపమని మీరు చాలా అభ్యర్థించబడ్డారు, ఒకవేళ మీరు కూడా సిగ్గుపడితే, దాన్ని నాకు తిరిగి పంపండి, చైన్ విరిగిపోకూడదు.

  *🚩జై శ్రీ రామ్🏹*...

50 ఏళ్ళ పూర్వం జీవన శైలి.*

 50 ఏళ్ళ పూర్వం జీవన శైలి.*


ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందుం పుల్లలు అని కూడా అనే వారు.


కొంతమంది కచ్చిక (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు.


మగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.


ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, 

లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. 

Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.


కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.


బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది UMRAO వత్తుల స్టౌ (కిరసనాయిలుది) / పంపు స్టౌ వాడేవారు.


అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు.


ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ రాచ్చిప్ లు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు, ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.


అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.


అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.


బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసాన్నాలు, SLO, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, SLO మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.


సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి (ఇప్పుడు WhatsAppలో రోజూ ఉదయం పంచాంగం పోస్ట్ చేస్తున్నట్టుగా) వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ మిస్స్ అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం.


రాత్రిపూట7, 8 గంటలకు మాదాకాలం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకాళo అబ్బాయికిచేస్తానని భయపెట్టేవారు తల్లులు.


టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేది.


పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.


ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.


డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు.


3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.


వైద్యం కి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత bread, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్ భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది.


ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు. అంతే. ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు.


పుస్తకాలు ఎప్పుడు 2nd hand వే. పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. Last year నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.


రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం అర్థం అయినా కాకపోయినా. రాత్రి పెంద్రాలే నిద్ర. వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసినికర్రే.


ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది. 2 రూపాయలు పెట్టి ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.


అదీ ఆరోజుల్లో జీవన శైలి.


ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు నిర్వహించేవారు.😃🤷🏻‍♂️

సంస్కృతేన లేఖయేమ

 జై శ్రీరామ్


గిరాం సంస్కృతమ్ ఉత్తమం

భావానాం ప్రభావః ఉత్తమః

ప్రభావానాం ప్రకాశః ఉత్తమః

ప్రకాశానాం ప్రదానమ్ ఉత్తమమ్


🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏


అపూర్ణం తస్య జన్మ

యో న భాషతే సంస్కృతేన

పూర్ణవాన్ భవతి సః

యో సదా భాషతే సంస్కృతేన


🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏


గీర్షు సంస్కృతమ్ ఉత్తమం

భావేషు ప్రభావః ఉత్తమః

ప్రభావేషు ప్రకాశః ఉత్తమః

ప్రకాశేషు ప్రదానమ్ ఉత్తమమ్


🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏


అన్నదానం మహాదానం

విద్యాదానమ్ అతః పరమ్

అన్నేన క్షణికా తృప్తిః

యావత్ జీవన్తు విద్యయా


🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏


సంస్కృతశ్రవణం పుణ్యం

భాషణం పాపనాశనమ్

పఠనం శక్తివర్ధకం

లేఖనం పాపనాశకమ్


🥒🥒🥒🥒🥒🥒🥒🥒🥒


ముఖ్యమన్త్రీ ప్రధానమన్త్రీ

రాజ్యపాలకః పురపాలకశ్చ

సంస్కృతభాషిణః భవన్తు

గీర్వాణీ విషయే సదా చిన్తయన్తు


🥒🥒🥒🥒🥒🥒🥒🥒🥒


సంస్కృతం సంస్కృతేన శ్రావయేమ


సంస్కృతం సంస్కృతేన వాచయేమ


సంస్కృతం సంస్కృతేన పాఠయేమ


సంస్కృతం సంస్కృతేన లేఖయేమ


🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥


నరత్వం దుర్లభం లోకే

విద్యా తత్ర సుదర్లభా

కవిత్వం దుర్లభం తత్ర

శక్తిః తత్ర సుదుర్లభా


సమ్భాషణ సంస్కృతమ్

(మాసపత్రికా)

అసలు కారకులు మీరే ( తల్లి దండ్రులే ).!!*

 *పిల్లలు చెడిపోవడానికి అసలు కారకులు మీరే ( తల్లి దండ్రులే ).!!*


      పిల్లల్ని గరాబంగా చూసుకోవడం మంచిదే కానీ అది మరీ *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.* పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది ఇది ముమ్మాటికీ నిజం. వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో మనమే వారిని సోమరులుగా మారుస్తున్నారు..

ఇప్పుడు తరం పిల్లలు..

🔥 తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు.

🔥 వారి సాక్సులు ఉతుక్కోమంటే ఉతకరు..

🔥 లంచ్ బ్యాగ్ లు శుభ్రం చేసుకోవడంలేదు..

🔥 కనీసం లోదుస్తులు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు..

🔥 గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు.

🔥 తిడితే వస్తువులను విసిరి కొడతారు


ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే ఫైవ్ స్టార్ లు, ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, కొనుగోలు చేస్తున్నారు...


🔥 ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..

🔥 ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

🔥 అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు..

🔥 డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..

🔥 బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి

🔥 కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు వారిస్తే వెర్రి పనులు..


ఎందుకంటే మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు..

కానీ కారణం మనమే..

ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*

చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ నెస్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

గారభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..

వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది.. 

*కష్టం గురించి తెలిసేలా పెంచండి* అని.. కష్టాలు, డబ్బు, సమయం, ఆరోగ్యం *విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*


ప్రేమతో, గరాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..


*అభినయాలు కనపడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..


భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు


మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..

కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, బాక్సు రైస్..


గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం

టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..

3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..

10 దాటేలోపు సకల రోగాలు ఒంట్లోకి వచ్చేస్తున్నాయి..


వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..

అందుకే *తల్లిదండ్రులు మారాలి..*


*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం..?*


ఒక్క సారి ఆలోచన చేయండి....


*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి?*


కేవలం గుడికి వెళ్లి ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు.


పిల్లలకు..👇


👉 *బాధ్యత* 

👉 *బరువు*

👉 *మర్యాద*

👉 *గౌరవం* 

👉 *కష్టం* 

👉 *నష్టం* 

👉 *ఓర్పు*

👉 *సహనం*

👉 *దాతృత్వం*

👉 *ప్రేమ*

👉 *అనురాగం*

👉 *సహాయం*

👉 *సహకారం*

👉 *నాయకత్వం*

👉 *మానసిక దృఢత్వం* 

👉 *కుటుంబ బంధాలు*

👉 *అనుబంధాలు*    

👉 *దైవం*

👉 *దేశం*


*ఇవి సంప్రదాయాలు అంటే..*


కొంచెం *కష్టమైనా సరే ఇవి తప్పక పిల్లలకు అలవాటు చేయాలి..* 

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, *ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..*


మనం కూడా మమేకమవుదాం....


*భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన , సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై బాటలు వేద్దాం..


  సర్వేజనా సుఖినో భవంతు🙏