24, ఆగస్టు 2023, గురువారం

Panchaag


 

బ్రహ్మజ్ఞానావళీ మాల

 బ్రహ్మజ్ఞానావళీ మాల



                    సకృచ్చ్రవణ మాత్రేణ బ్రహ్మజ్ఞానం యతో భవేత్‌ |

                        బ్రహ్మ జ్ఞానావళీ మాలా సర్వేషాం మోక్ష సిద్ధయే ||

                        

                    


           1.         అసంగోఽహం అసంగోఽహం అసంగోఽహం పునః పునః

                        సచ్చిదానంద రూపోఽహం అహమేవాఽహమవ్యయః ||


            2.        నిత్యశుద్ధ విముక్తోఽహం నిరాకారోఽహమవ్యయః

                        భూమానంద స్వరూపోఽహం అహమేవాఽహమవ్యయః ||


            3.        నిత్యోఽహం నిరవద్యోఽహం నిరాకారోఽహమచ్యుతః

                        పరమానంద రూపోఽహం అహమేవాఽహ మవ్యయః ||


            4.        శుద్ధ చైతన్య రూపోఽహం ఆత్మారామోఽహమేవచ

                        అఖండానంద రూపోఽహం అహమేవాఽహ మవ్యయః ||


            5.        ప్రత్యక్  చైతన్య రూపోఽహం శాంతోఽహం ప్రకృతేః పరః |

                        శాశ్వతానందరూపోఽహం అహమేవాఽహ మవ్యయః ||


            6.        తత్వాతీత పరాత్మాహం మధ్యాతీతః  పరః శివః

                        మాయాతీతః పరంజ్యోతిః అహమేవాఽహ మవ్యయః ||


            7.        నానా రూపవ్యతీతోఽహం చిదాకారోఽహ మచ్యుతః |

                        సుఖ రూప స్వరూపోఽహం అహమేవాఽహ మవ్యయః ||


            8.     మాయాతత్కార్య దేహాది      మమ  నాస్త్యేవ సర్వదా |

                        స్వప్రకాశైక రూపోఽహం అహమేవాఽహ మవ్యయః||


            9.     గుణత్రయవ్యతీతోఽహం బ్రహ్మాదీనాం చ సాక్ష్యహమ్‌ |

                        అనంతానంద రూపోఽహం అహమేవాఽహ మవ్యయః ||


            10.  అంతః  జ్యోతి  స్వరూపోఽహం కూటస్థః సర్వగోఽస్మ్యహమ్‌

                        సర్వసాక్షి స్వరూపోఽహం అహమేవాఽహ మవ్యయః || 


            11.     ద్వంద్వాది సాక్షి రూపోఽహం అచలోహం సనాతనః |

                        సర్వసాక్షి స్వరూపోఽహం అహమేవాఽహ మవ్యయః ||


            12.     ప్రజ్ఞాన ఘన ఏవాఽహం     విజ్ఞాన ఘన ఏవచ

                        అకర్తాఽహం అభోక్తాఽహం అహమేవాఽహ మవ్యయః ||


            13.     నిరాధార స్వరూపోఽహం సర్వాధారోఽహ మేవచ

                        ఆప్తకామ స్వరూపోఽహం అహమేవాఽహమవ్యయః ||


            14.     తాపత్రయ వినిర్ముక్తః    దేహత్రయ విలక్షణః

                        అవస్థాత్రయ సాక్ష్యస్మి అహమేవాఽహ మవ్యయః ||


            15.     దృగ్ దృశ్యౌ ద్వౌ పదార్థౌస్తః పరస్పర విలక్షణౌ |

                        దృగ్ బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాన్తడిండిమః ||


            16.     అహం సాక్షీతి యో విద్యాద్‌ వివిచ్యైవం పునః పునః |

                        స ఏవ ముక్తస్స విద్వాన్‌ ఇతి వేదాన్త డిండిమః ||


            17.     ఘటకుడ్యాదికం సర్వం మృత్తికామాత్రమేవ చ |

                        తద్వద్‌ బ్రహ్మ జగత్సర్వం ఇతి వేదాంత డిండిమః ||


            18.     బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః |

                        అనేన వేద్యం సచ్చాస్త్రం ఇతి వేదాన్త డిండిమః ||


            19.     అంతర్జ్యోతిః  బహిర్జ్యోతిః ప్రత్యగ్జ్యోతిః పరాత్పరః |

                        జ్యోతిర్జ్యోతిః స్వయంజ్యోతిః ఆత్మజ్యోతిః  శివోఽస్మ్యహమ్‌ ||


ఇతి శ్రీ శంకరాచార్యకృత బ్రహ్మ జ్ఞానావళీ మాల సమాప్తము.

మహాకవి వేమన(1652)

 ఆగష్టు25.

 మహాకవి వేమన(1652)

 371వ జయంతి.



బడిలో, ఇంట్లో పిల్లలకు 

క్రింది 3 పద్యాలు 

వచ్చిన వారితో పాడిద్దాం.

రానివారికి నేర్పిద్దాం. 

భావం చెబుదాం....                                                  

                                     

1.తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు

పుట్టనేమి వాడు గిట్టనేమి

పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా 

విశ్వదాభిరామ వినుర వేమ


2.భూమిలోనే బుట్టు భూసార మెల్లను

తనువులోన బుట్టు తత్వమెల్ల 

శ్రమలోన బుట్టు సర్వంబు తానౌను 

విశ్వదాభిరామ వినురవేమ 


3.ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు 

చూడ చూడ రుచుల జాడవేరు

పురుషులందు పుణ్యపురుషులు వేరయా 

విశ్వదాభిరామ వినురవేమ

 Toggle navigation

Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

12. అజామిళోపాఖ్యానము

భగవన్నామ మాహాత్మ్యము

శ్రీ మహాభాగవతములో అజామీళో పాఖ్యానము భగవన్నామ సంకీర్తన యొక్క ప్రాశస్త్యమును చాటుచున్నది. నామ జపము నిరంతరమగు భగవత్‌ స్మృతికి సాధనము. నామానుసంధానము వలన మనోలయము సిద్ధించును. నామ జపమునకు సమస్త జనులకును జాతి భేదము లేక అధికారము కలదు. భూత హింసలేదు. దేశకాల నియమములు లేవు. ''యజ్ఞానాం జప యజ్ఞోస్మి'' అని భగవంతుడు యజ్ఞములలో జప యజ్ఞము తానని గీతలో తెలిపెను. కలికాలమున ''నారాయణస్య నామోచ్చారణ మాత్రేణ నిర్ధూత కలి ర్భవతి.'' నారాయణ నామ జపముచే కలిదోషముల దరింప వచ్చునని కలిసంతారణోపనిషత్తు తెలుపు చున్నది. ''నామ నామినో రభేదః'' నామమునకును భగవంతునకును అభేదము. నామ జపము సర్వ పాపహరము, ముక్తి ప్రదమని భాగవతము కొనియాడు చున్నది.

క|| ధీమహిత! భవన్మంగళ

నామ స్మరణాను కీర్తనము గల హీనుల్‌

శ్రీమంతు లగుదు రగ్ని

ష్టోమాది కృదాళి కంటె శుద్ధులు దలపన్‌

భాగవతము 3-1035

క|| నీ నామస్తుతి శ్వపచుం

డైనను జిహ్వాగ్రమందు ననుసంధింపన్‌

వానికి సరి భూసురుడుం

గానేరడు చిత్రమిది జగంబుల నరయన్‌

భాగవతము 3-1037

పూర్వము కన్యాకుబ్జమను పురమున అజామీళుడను బ్రాహ్మణుడుండెను. అతడు బాల్యమున వేదాధ్యయనము సేసి గురు శుశ్రూష నొనర్చి మంత్రసిద్ధి బడసెను. మంచి గుణములు, సత్య భాషణములు కలిగి ఆచారవంతుడై నైష్ఠికుడై యుండెను.

కొంత కాలమునకు నవ యవ్వన మతని మేన పొడసూపెను. ఒకనాడు సమిధలకై అరణ్యమునకేగి అందు ఒక వృషలి విటునితో ఒక లతా భవనంబున కామకేళి దేలుట తిలకించెను. అట్లు తిలకించిన అజామీళుడు మన్మ ధోద్దీపితుడై కులాచారము మంటగల్పి ఆ కులటను జేరి పిత్రార్జితము నామెపాలు జెసెను. సుగుణాభిరామ యగు నిజభామను వదలి వేసెను. ఇట్లు మోహ జలధిలో మునిగి పాపవర్తనుడై మెలగి పతితుడయ్యెను. అతనికి వార్థక్యము వచ్చెను. తన చిన్నకొడుకగు నారయణుని యందు బద్ధాను రాగుడై తనకు రాగల మృత్యువును గూర్చి ఆలోచించడయ్యెను.

క|| అత్యంత పాన భోజన

కృత్యంబుల పొత్తుగలిగి, క్రీడల తత్సాం

గత్యంబు వదల కాగతి

మృత్యువు గన నేరడయ్యె మిక్కిలి జడుడై

భాగవతము 6-65

ఇట్లుండ అతనికి మరణకాల మాసన్న మయ్యెను. యమకింకరులు అగుపడగా భీతినంది అజామీళుడు.

క|| దూరమున నాడు బాలుడు

బోరన తన చిత్తసీమ బొడగట్టిన నో

నారాయణ నారాయణ

నారాయణ యనుచు నాత్మ నందను నొడివెన్‌

భాగవతము 6-72

అప్పుడు విష్ణుదూత లరుదెంచి యమ పాశముల ద్రుంచి అతనిని విడిపించిరి. ''ధర్మ పరిపాలకులమైన మమ్ముల నెందు కడ్డగించితి'' రని యమదూతలు ప్రశ్నించిరి. దానికి బదులుగా విష్ణుదూత లిట్లనిరి.

ఆ|| బిడ్డపేరు పెట్టి పిలుచుట విశ్రామ

కేళినైన మిగుల గేలినైన

బద్య గద్య గీత భావార్థములనైన

గమలనయను దలప గలష హరము

భాగవతము 6-122

శక్తివంతమైన ఔషధము తెలియక సేవించినను రోగమును మాన్పునట్లు శ్రీహరి నామోచ్చారణము మోక్షప్రదము. అజామీళుడు మరణ సమయమున హరి నామోచ్చారణ మొనర్చెను. ఇట్టి సజ్జన ధర్మము వ్యర్థము కాదని విష్ణుదూతలు భాగవత ధర్మమును వివరించిరి.

అజామీళుడు వారి సంవాదము నాలించి పశ్చాత్తాప తప్తుడై యత చిత్తేంద్రియ మానసుడగుచు యోగమార్గంబున దేహంబు విడిచెను. భగవన్నామ గ్రహణంబున ముక్తి మార్గావలంబియై తుదకు మోక్షమును పొందెను.

కలియుగమున ముక్తిని పొందుటకు ''నామస్మరణా దన్యోపాయం నహి పశ్యామో భవ తరణ'' అన్నారు.

శ్లో|| ధ్యాయన్‌ కృతే యజన్‌ యజ్ఞైత్రేతాయాం ద్వాపరేర్చయన్‌

యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవమ్‌

విష్ణు పురాణము.

కలియుగమున నామకీర్తనము చేతనే ధ్యానము యజ్ఞము అర్చన మొదలగువాని ఫలమును పొందవచ్చును.

నామస్మరణ మహిమను, భగవద్గీత, రామస్తవ రాజము, భగవన్నామకౌముది మొదలగు గ్రంధములు వివరించుచున్నవి.

శ్లో|| యం యం వాపి స్మరన్‌ భావం

త్యజ త్యంతే కలేవరం

తం తమే వైతి కౌన్తేయ!

సదా తద్భావ భావితః గీత 8-6

ఎవడు మరణకాలమందు ఏ భావమును స్మరించుచు శరీరమును విడుచునో వాడెల్లప్పుడును, ఆ భావమునే పొందును.

శ్లో|| అన్తకాలేచ మామేవ

స్మరన్‌ ముక్త్వా కళేబరమ్‌

యః ప్రయాతి సమద్భావమ్‌

యాతి నాస్త్యత్ర సంశయః గీత 8-5

ఎవడు మరణకాలమున నన్నే చింతించుచు దేహమును వదలునో అతడు నన్నే పొందును. సంశయములేదు. అజామిళు డిట్లు మరణకాలమున ''నారాయణ'' యని కొడుకును సంబోధించిన మాత్రముననేముక్తుడయ్యెను.

శ్లో|| ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్‌ మా మనుస్మరన్‌

యః ప్రయాతి త్యజన్‌; దేహం సయాతి పరమాం గతిమ్‌ గీత 8-13

యోగ అవసాన సమయమున ఓంకారరూప బ్రహ్మ మంత్రమునుచ్చరించిన వరమపద ప్రాప్తి నొందును.

కాబట్టి భగవద్గీతలో సర్వకాల సర్వావస్థల యందును భగవంతుని తలచవలెనని తెలుపబడినది..

శ్లో|| తస్మాత్‌ సర్వేషు కాలేషు మా మనుస్మర గీత 8-7

భాగవతమునకూడ అవసానకాలమున హరిస్మరణ మోక్షదాయకమని తెల్పుచున్నది.

సీ|| అనఘాత్మ! మఱి భవదవతార గుణకర్మ

ఘన విడంబన హేతుకంబులైన

రమణీయమగు దాశరథి వసుదేవకు

మారాది దివ్య నామంబు లోలి

వెలయంగ మనుజులు వివశాత్ములై యవ

సాన కాలంబున సంస్మరించి

జన్మ జన్మాంతర సంచిత దురితంబు

బాసి కైవల్య సంప్రాప్తు లగుదు''రు

భాగవతము 3-304

రామకృష్ణ నామములు వివశాత్ములై అవసాన కాలంబున సంస్మరించినను కైవల్యము ప్రాప్తించునని భాగవత మతము.

గీ|| జనులకెల్ల శుభము సాంఖ్య యోగము దాని

వలన ధర్మనిష్ఠ వలన నైన

అంత కాలమందు హరిచింత సేయుట

పుట్టువులకు ఫలము భూవరేంద్ర!

భాగవతము 2-5

అట్లే మల్లయామాత్య ప్రణీతంబైన రామస్తవ రాజమను గ్రంధమున నామ సంకీర్తన ఘట్టమున రామకృష్ణ నామ మాహాత్మ్యము వర్ణింప బడినది. ఆ ఘట్టమునందలి పద్యములను ఉదహరింతుము.

గీ|| పాండవోత్తమ! విను పరబ్రహ్మమైన

రామకృష్ణుల నామ కీర్తనల మహిమ

లేమి జెప్పుదు? ధాత్రిలో నెవ్వరైన

వాంఛ నొకమారు బల్క బావనుల జేయు.

గీ|| నామకీర్తన సరిసాటి భూమి గలదె

తెలియనేరని మూర్ఖులు తీర్థయాత్ర

లంచు దేవతాసేవ లట్లంచు, నుండ

బట్టక తిరుగు గ్రహచార బాధగాక.

క|| జారుండై నను వృద్ధా

చారుండైనను, గృహస్ధ సంచారుండై

శ్రీరామా యని ఒకపరి

నోరాడిన జాలు వాని నూరేడులకున్‌.

సీ|| తెల్లవారక తొలి చల్లని నీటిలో

వాయక నొడలెల్ల వణకువారు

నీరు కావులు గట్టి నీళ్ళు దర్భలచేత

సవ్యాప సవ్యముల్‌ జల్లువారు

బిగుసుక ముక్కులు బిగియించి గొణుగుచు

మా గన్ను వేయుచు తూగువారు

సాముజేసిన యట్లు సాగిల బడి పడి

బ్రొద్దుకై నిల్వగ బోవువారు.

బిర బిరను చెట్ల చుట్టును తిరుగువారు

నేయి జిదుగులు నగ్నిలో వేయువారు

వైశ్వదేవాది పూజల వరలు వారు

కీర్తనల సేయువారల క్రిందివారు

క|| ఆర్తా వేశముచే హరి

కీర్తన పరుడైన వాడు కృష్ణాయనుచున్‌

మూర్తి భజించిన యొక్క ము

హూర్తములో స్వామివద్ద నించుక యుండున్‌

పై పద్యముల భావము పరికించిన అది అర్థ వాదముగా తోచకమానదు. కాని శ్రీస్వామి అఖండానంద సరస్వతి వ్రాసిన ''భగవన్నామ కౌముది'' యందు భగవన్నామ జపమునకు చెప్పబడిన మహిమ అర్థవాదము కాదని చెప్పబడినది. ''కేవలయా భక్త్యా'' అను భాగవత వచనముచేత, ప్రకాశ మేర్పడగనే అంధకారము పూర్తి తొలగునట్లు, శ్రవణ కీర్తన స్మరణరూపమైన భక్తి చేతనే పాపక్షయ మగుచున్నది. అందులకే శ్రీ శంకరాచార్యులు భగవద్గీతా వ్యాఖ్యానమునందు '' భక్తి మాత్రేణ కేవలేన శాస్త్ర సంప్రదానే పాత్రం భవతి'' అని భక్తుడైన వానికి గీతాశాస్త్రము పదేశించ వచ్చునని తెలిపెను.

పాపక్షయమునకు ఇతర వైదిక ప్రాయశ్చిత్త కర్మల ఆవశ్యకత కూడ లేదు, కర్మాత్మకమగు వైదిక ప్రాయశ్చిత్తము అనగా వ్రతాదులు, పాపక్షయము మాత్రమే కలిగించును. కాని వాసనా క్షయము కలిగింప జాలవు. వాసనా క్షయము భక్తి చేతను, జ్ఞానముచేతను మాత్రమే కలుగును. ఇది భాగవత మతము. ప్రాయశ్చిత్త కర్మ వాసనా క్షయము కలిగింపజాలదు. కాబట్టి తిరిగి పాపము చేయుటకు అవకాశమున్నది. శ్రవణ కీర్తన స్మరణ రూపమైన భక్తి సర్వపాపములను నిర్మూలించెను.

శ్లో|| ఏతావతాల మఘ నిర్హరణాయ పుంసాం

సంకీర్తనం భగవతో గుణ కర్మ నామ్నాం

వికృశ్య పుత్ర మఘవాన్‌ య దజామిలో ೭ పి

నారాయణతి మ్రియమాణ ఇయాయ ముక్తిమ్‌.

అజామీళుడు మహాపాపి. మరణ సమయమున కొడుకు నుద్దేశించి నారాయణా అనెను. అతడు భగవంతుని స్మరించ లేదు. అనగా బుద్ధి పూర్వకముగా భగవన్నామోచ్చారణ చేయలేదు కదా! అయినను ముక్తి లభించినది.

ఆ|| బాంధవముననైన, బగనైన, వగనైన,

బ్రీతినైన, ప్రాణ భీతినైన,

భక్తినైన, హరికి పరతంత్రులై యుండు

జనులు మోక్షమునకు జనుదు రధిప!

భాగవతము 10-973

ఆ|| బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ

కేళినైన మిగుల గేలినైన

బద్య గద్య గీత భావార్థములనైన

గమలనయను దలప గలుష హరము

భాగవతము 6-122

క|| డెందంబు పుత్రు వలనం

జెందినదని తలప వలదు శ్రీపతి పేరే

చందమున నైన బలికిన

నందకధరు డందు గలడు నాథుం డగుచున్‌

భాగవతము 6-121

క|| కామంబు, పుణ్యమార్గ

స్థేమంబు, మునీంద్ర పాద చేత స్పరసీ

ధామంబు, విష్ణు నిర్మల

నామంబు దలంచువాడు నాధుడు గాడే.

శ్లో|| విద్యా తపః ప్రాణ నిరోధ మైత్రీ

తీర్థాభిషేక వ్రతదాన జపై#్యః

నాత్యంత సిద్థిం లభ##తే న్తరాత్మా

యధా హృదిస్థే భగవ త్వనన్తే.

పాపక్షయమునకై ఏకైక నామ జపమే చాలును. ఇతర కర్మలు దానితో చేయ నవసరములేదు. తపస్సు వ్రతము దానము జపము ఇత్యాదులచే పూర్ణ సిద్ధి లభింపదు. భగవన్నామ సంకీర్తనమే పూర్ణ సిద్ధిని కలిగించును.

శ్లో|| పాపే గురూణి గురుణి స్వత్పా న్యల్పేచ తద్విదః

ప్రాయశ్చిత్తాని మైత్రేయ జగుః స్వాయంభు వాదయః

శ్లో|| ప్రాయశ్చిత్తా న్యశేషాణి తపః కర్మాత్మకానివై

యానితేషా మశేషాణాం కృష్ణాను స్మరణం పరమ్‌

తపస్సు కర్మ మొదలగు ప్రాయశ్చిత్తములను పెద్దవి చిన్నవి అను పాపములకు తగినట్లు వేరువేరుగా మన్వాదులు విధించిరి. కాని అన్ని పాపములకు ప్రాయశ్చిత్తము కృష్ణానుస్మరణ మొక్కటే.

కృష్ణనామ స్మరణ మనగా కృషితి=సంసారమును భంగము చేయునది అని అర్థము; లేదా కర్షతి=అజ్ఞానమును భంగము చేయునది అని అర్థము. కాబట్టి అజ్ఞాన నిరసనమైన బ్రహ్మ విద్యయే కృష్ణాను స్మరణమని కొందరి వాదము. కాని అనుస్మరణమనగా కీర్తనమేనని క్రింది శ్లోకమునుండి గ్రహింపవచ్చును.

శ్లో|| క్వ నాకపృష్ఠ గమనం పునరావృత్తి లక్షణం

క్వ జపో వాసుదేవేతి ముక్తిబీజ మనుత్తమమ్‌

పునర్జన్మ కలిగించు స్వర్గలోక గమన మెక్కడ? ముక్తి బీజ మగు వాసుదేవ నామమెక్కడ? ఇంకను

శ్లో|| అవరే నాపియన్నామ్ని కీర్తితే సర్వపాతకైః

పుమా స్వముచ్యతే సద్యః సింహసై#్త న్మృగైరివ

వివశముగా నామ కీర్తనము చేసినప్పటికిని తక్షణమే సర్వపాపములనుండి విముక్తుడు కాగలడు.

శ్లో|| ఏతేనై వ హ్యఘోనోస్య కృతం సాదఘ నిష్కృతమ్‌

యదా నారాయణా యేతి జగాద చుతరక్షరమ్‌

అజామీళుడు పుత్రుని కొర కుచ్చరించిన నారాయణ నామము భగవన్నామ జపదృష్ట్యా ఉచ్చరింపబడినది కాదు. (నామాభాసము) ఈ ఉచ్చారణలో శ్రద్ధగాని ఆవృత్తిగాని ఫలకాంక్షగాని లేదు. అయినను మోక్షఫలము సిద్ధించినది కదా!

ఇట్టి అభిప్రాయమే రామనామ జపమును గూర్చి సీతరామాంజనేయ సంవాదమున కలదు.

తే|| రామరామ యటంచును గాముకుండు

మోహమున బ్రేయసిని బిల్వ మోక్షమొసగు

రామనామంబు హిమశైలరాజ తనయ!

గాన వర్ణింపగా జాల దాని మహిమ.

గోపన్న దాశరథీ శతకమున ''నీ నామము దాచుకో లేవు గదా?'' యని రాముని ప్రశ్నించెను.

ఉ|| నీలఘనాభ మూర్తివగు నిన్ను గనుంగొన కోరి వేడినన్‌

జాలముసేసి డాగెదవు సంస్తుతి కెక్కిన రామనామమే

మూలను దాచుకో గలవు.

శ్లో|| అజ్ఞానా దధవాజ్ఞానా దుత్తమ శ్లోక నామయత్‌

సం కీర్తిత మఘం పుంసాం దహత్సే ధో యధానలః

జ్ఞానముతోగాని, అజ్ఞానముతోగాని చేసిన భగవన్నా మోచ్చారణము పాపక్షయము చేయుచున్నది. నామ కీర్తమునకు జ్ఞాన మవసరము లేదు. కీర్తనతో పాపక్షయమైన తరువాత జ్ఞానోదయ మగును. వాల్మీకి కేవల రామనామ జపముననే తరించెను. భగవన్నామ స్మరణము మాటిమాటికి చేయుటచేత అంతఃకరణము శుద్ధి పొందును. దానితో పాపక్షయము వాసనాక్షయము రెండును సిద్ధించును. భగవ ద్విషయమైన వాసనలు వృద్ధి పొందుచూ పాప వాసనలు క్షీణించును. ఆ పైన శుద్ధ సత్త్వగుణము కలిగి ఆత్మ జ్ఞానము సిద్ధించును, ''సత్వాత్‌ సంజాయతే జ్ఞానమ్‌'' నారదునకు రజో తమోగుణ పరిహారిణియగు భక్తి కలిగి సత్వగుణ మేర్పడెనని భాగవతము తెలుపుచున్నది.

శ్లో|| మ్రియమాణో హరేర్నామ గృహ్ణాన్‌ పుత్రోపచారితమ్‌

అజామీలోప్యగాద్ధామ కిముత శ్రద్ధయా గృణన్‌.

మరణాసన్న దశలో నారాయణ శబ్ద మాత్రోచ్చారణము వలన అజామీళుడు ముక్తి నందెనుగదా? ఇక శ్రద్ధతో నామస్మరణము జేయు వారి విషయము చెప్పనేల?

వేదాంత శ్రవణము జేసినను ప్రతి బంధకము వలన జ్ఞానము కలుగనిచో ఆ ప్రతి బంధకమును భక్తి తొలగించును.

ఉ|| కొంజిక తర్కవాదమను గుద్దలిచే బరతత్త్వ భూస్థలిన్‌

రంజిల ద్రవ్వి కన్గొనని రామ విధానము నేడు భక్తి సి

ద్ధాంజనమందు హస్తగత మయ్యె - దాశరధీశతకము

వేదాంత శ్రవణము భక్తుడు చేయనిచో దేహాంతమున భగవంతుడే తత్త్వజ్ఞాన ముపదేశించు. మోక్షము నొసగును.

''దేహాంతే దేవః పరం బ్రహ్మతారకం వ్యాచష్టే

ఏనాసా వమృతీ భూత్వా సోమృతత్త్వంచ గచ్ఛతి''

శ్రీ నృసింహతాపిని ఉపనిషత్తు

శ్రీరామనామ జప మెంతటి ఫలమును జేకూర్చునో చూడుడు.

శ్లో|| ఆకృష్టిః కృతచేతసా సుమహతా ముచ్చాటనం చాం హసాం

ఆచండాల మమూక లోక సులభో విశ్వశ్చ మోక్ష శ్రియః

నోదీక్షాం నచదక్షిణాం నచపురశ్చర్యాం మనాగీక్షతే

మంత్రోయం రసనా స్పృగేవ ఫలతి శ్రీరామ నామాత్మకః

రామ నామముచే మహాత్ములు ఆకర్షింపబడిరి కాన ఆకర్షణ విద్య మోక్ష లక్ష్మిని కైవశము గావించును గాన వశీకరణవిద్య పాపములను పారద్రోలుటచేత ఉచ్చాటనవిద్య.

జాతి భేదము పాటించ పనిలేదు: దీక్ష దక్షిణ జపము అవసరము లేదు. ఈ శ్రీరామనామ మంత్రము మాత్రమే సర్వమంగళములను చేకూర్చును.

విష్ణు సహస్ర నామమున నారాయణ జపము అభయ ప్రదానము చేయునని సూచించినది.

శ్లో|| ఆర్తా విషణ్ణా శిధిలాశ్చ భీతా

ఘోరేషుచ వ్యాధిషు వర్తమానాః

సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం

విముక్త దుఃఖాః సుఖినో భవన్తి

............ భేకగళంబు లీల నీ

నామము సంస్మరించిన జనంబు భవం బెడబాసి తత్పరం

ధామ నివాసు లౌదురట .............

-దాశరథీ శతకము

''తెలిసి రామభజన సేయనే '' అని త్యాగరాజు అన్నప్పటికిని గోపన్న కప్పలు అరచిన విధమున కేవల రామనామము మాత్రమే జపించినను మోక్షము కల్గునని తెల్పెను. ఇందుకు నిదర్శనము వాల్మీకి మహర్షి.

ఇట్టి నామజప ప్రాశస్త్యము తెల్పుటకై అజామీళోపాఖ్యానము భాగవతమున చెప్పబడినది.

సీ|| బ్రహ్మ హత్యానేక పాపాటవుల కగ్ని

కీలలు హరినామ కీర్తనములు

గురు తల్ప కల్మష క్రూర సర్పములకు

గేకులు హరినామ కీర్తనములు

తపనీయ చౌర్య సంతమసంబునకు సూర్య

కిరణముల్‌ హరినామ కీర్తనములు

మధుపాన కిల్బిష మదనాగ సమితికి

గేసరుల్‌ హరినామ కీర్తనములు

మహిత యాగోగ్ర నిత్య సమాధి విధుల

నలరు బ్రహ్మాది సురలకు నందరాని

భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య

ఖేలనంబులు హరినామ కీర్తనములు భాగవతము 6-118

ఈ కథవలన తెలిసికొన దగిన విషయములు:-

1. భగవన్నామ మాహాత్మ్యము పొగడ సాధ్యముకాదు.

2. అంత్యకాలమున నారాయణనామ స్మరణము అవశ్యకర్తవ్యము.

3. హరినామ స్మరణము తెలిసి జేసినను తెలియక జేసినను పాప హరము, మోక్షప్రదము.

4. భగవద్భక్తుడు కర్మవశమున పతితుడైనను శ్రీహరియే అతనిని కాపాడును.

5. శ్రీ రమణ మహర్షి నామజపమును గూర్చి ఇట్లు తెలిపెను.

నిరంతరము నామజపము మానసికముగా చేయవలయును. ఈ జపము దైనందిన కార్యములు చేయుచున్నపుడును జరుగుచుండును. డ్రైవరు మనతో మాటలాడు చుండియు కారును నడుపుచుండును కదా? మనము ఇతరులతో మాట్లాడునప్పుడు చదువునప్పుడు మానసిక జపము జరుగదు.

నిద్రించుటకు ముందు మానసికముగా నామజపము చేయుచున్న ఎడల నిద్రలోకూడ ఆ జపమట్లే జరిగి నిద్రలేవగనే ఆ జపమే మానసికముగా జరుగుచుండుట గమనింప వచ్చును. దీనినే ఆత్మజప మని మహర్షి తెలిపెను.

ఇట్లు నిరంతర జపము నలవరచుకొన్న వాడే అంత్యకాలమున భగవన్నామోచ్చారణ చేయును. లేని యెడల కఫవాత పిత్త ప్రకోప ముల వలన తెలివితప్పి యుండును. భాగవతమున

సీ|| వాసుదేవ శ్లోక వార్త లాలించుచు

గాల మే పుణ్యుండు గడపుచుండు

నతని యాయువు దక్క యన్యుల యాయువు

నుదయాస మయముల నుగ్రకరుడు

వంచించి కొనిపోవు. - భాగవతము 2-47

అని చెప్పబడియున్నది. అందువలన దాశరథీ శతకములోని గోపన్న వాక్యములు పాటింపదగినవి.

ఉ|| ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చినవేళ, రోగముల్‌

గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్‌

గప్పినవేళ, మీ స్మరణ కల్గునొ? కల్గదొ? నాటి కిప్పుడే

తప్పక చేతు మీ భజనత దాశరథీ! కరుణాపయోనిధీ!

Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

 

ధ్యాయన్ కృతే యజన్

 ఇతి స్మృతిచన్దికాయాం యుగధర్మాః


కలియుగధర్మాః


అథ కలియుగధర్మాః


తత్ర వ్యాసః |


ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞస్ త్రేతాయాం ద్వాపరే ఒర్చయన్ | యద్ ఆప్నోతి తద్ ఆప్నోతి కలౌ సజ్కీర్త్య కేశవమ్ ॥ ధర్మోత్కర్షమ్ అతీవాత్ర ప్రాప్నోతి పురుషః కలౌ | అల్పాయాసేన ధర్మజ్ఞాస్ తేన తుష్టో ఒస్క్ అహం కలౌ || ఇతి |

అక్కున గొని

 *1857*

*కం*

అక్కున గొని యోదార్చగ

మిక్కిలి యుత్సాహమొసగి మేదిని మెచ్చన్

చక్కని విజయము నొందెడి

కిక్కెన నిడి దిగ్విజయము కృష్టము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఒక అపజయం కలిగి నప్పుడు ప్రేమ తో చేసే ఓదార్పు అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చి భూలోకం మెచ్చే చక్కని విజయము ను పొందగలిగే గొప్ప సంచలనం (కిక్కెన) కలిగించి దిగ్విజయం ఇవ్వబడుతుంది (కృష్టము).

*సందర్భం*:-- చంద్రయాన్ 2 విఫలమైనప్పుడు మాన్యులైన ప్రధాన మంత్రి మోదీజీ శాస్త్రవేత్త ల బృందానికి ఇచ్చిన ఓదార్పు ఫలితమే చంద్రయాన్ 3 యొక్క దిగ్విజయానికి మూలాధారం.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

చందమామ అందిన రోజు.

 చందమామ అందిన రోజు....


భరత మాత నవ్విన రోజు


పుడమితల్లి...పులకించిన రోజు

ఇస్రో...వికసించిన రోజు


సైంటిస్టుల...ఆశలన్నీ

సన్నజాజూలై  విరిసిన రోజు...

భలే మంచి రోజు

పసందైన రోజు...

వసంతాలు విరిసే నేటి రోజు...


చంద్రయాన్  చంద్రుని చేరి


ఇండియా కు..ఈ మెయిల్

పెడితే...


ఈ వార్తను...ఇస్రో చైర్మన్..


మోడీగార్కి...మోసుకు వెళితే 


మోడీ జీ ..ముఖారవిందం

మతాబు లాగ వెలిగిందంటా...


బలే చందమామ...

భువికి... మేనమామ..


వెన్నెలంతా మాదే వెర్రిమామ..

అందినంత...అంతా

 తవ్వుకోమా....


చందమామ రావే...

జాబిల్లి...రావే...


పాట మార్చిరాసీ..

నీలో మచ్చ తీసివేసి..


ప్లాటు లెన్నో...వేసి

రేటు కట్టి...కొంటామయ్యా


ఆదమరచి వున్నావంటే

ఆక్రమించుకుని పోతామయ్యా.....


బలే చందమామ...

భువికి మేనమామ...


చిక్కినావు లేవొయ్ చందమామ...


మనిషికి దక్కినావు లేవోయ్...బుజ్జి మామ..


బక్క చిక్కి పోతావ్...

వెర్రి..మామ...


నీ ఇంటి చుక్కలకి.. బై..బై 

చెప్పుకొమ్మా... 

ఓ చందమామ...🌷🌷











(చేతికి చిక్కిన చంద్రునిపై

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారేమోనని..భయంతో)

      

               ...కవి ఆవేదన

బ్రాహ్మణ క్యాటరింగ్

 శ్రావణ మాసం లో, భాద్రపదమాసంలో, మీ ఇంట జరిగే అన్ని కార్య్రమాలకు మడితో శుచి,శుభ్రంగా చక్కటి బ్రాహ్మణ భోజనం (ఉల్లీ, వెల్లుల్లి లేకుండా) క్యాటరింగ్లు చేయబడును.మీరు కోరిన విధంగా ప్రసాదాలు కూడా ఆర్డర్ పైన ఇవ్వబడును ప్రతి ఊర్లోను బ్రాహ్మణ క్యాటరింగ్ చేసే వాళ్ళ నెంబర్లు కింద ఇవ్వడం జరిగింది


బస్సు,కారు లేదా ఏ ఇతర మార్గాల్లో వచ్చే ప్రయాణికులకు మరియు టూర్స్ & ట్రావెల్స్ వాళ్ళకి దూరప్రాంతాలు ప్రయాణం చేసే ప్రయాణికులకు, యాత్రికులకు, అయ్యప్పలకు,భవానీలకు, భోజనాలు అందజేస్తాము


మాకు ఎటువంటి హోటల్స్, మెస్లు లేవు.అండి ఇది కేవలం ఇంటి భోజనం అండి. అందుకే మీరు చేయవలసిందిగా ఒక రోజు ముందు తప్పక  తెలియ చేయండి.

విజయవాడ 7396881404

విజయవాడ 9182554800

సికింద్రాబాద్ 9032910106

సికింద్రాబాద్+91 7842413139

సికింద్రాబాద్ 9885785556

విజయవాడ 79896 44180

వైజాగ్ 7032324851

వైజాగ్ +91 85010 62405

బెంగళూరు 9986119510

తిరుపతి 9959859227

కాకినాడ

08142729222

సామర్లకోట

9182285617

గుంటూరు 7989585295

నెల్లూరు:8179424949

కడప9866261232

చెన్నై 7395932954

కేరళ 096567 77404

కేరళ 9447136023

ముంబై 91 74484 08447

మధురై 9842191826

అరుణాచలం 8870218670

న్యూఢిల్లీ 9650873730

నాగపూర్ 9505651387

వారణాసి 6387716431


ప్రయాణంలో మన భోజనం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లలో మన బ్రాహ్మణ 

ఇంటి భోజనం అందించబడును

 నలుగురికి ఉపయోగపడే పోస్టు దయచేసి తప్పకుండా షేర్ చేయండి.🙏

గురువారం, ఆగస్టు 24, 20రాశి ఫలాలు23*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*గురువారం, ఆగస్టు 24, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*నిజ శ్రావణ మాసం - శుక్ల పక్షం*

*తిధి*      :   *అష్టమి రా9.29* వరకు 


.                *🌹రాశి ఫలాలు🌹* 


*మేషం*


అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి.

---------------------------------------

*వృషభం*


దూరపు బంధువుల నుండి  విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

---------------------------------------

*మిధునం*


ముఖ్యమైన వ్యవహారాలలో  సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థుల అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. నూతన వాహన యోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా  సాగుతాయి.

---------------------------------------

*కర్కాటకం*


వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులలో  శ్రమ తప్పదు. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది  ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

---------------------------------------

*సింహం*


మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో  వ్యయప్రయాసలు అధికమవుతాయి.  ఎంత శ్రమపడిన  పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------

*కన్య*


ఆపదల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా  నిర్ణయాలు మార్చుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి క్రయ  విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.

---------------------------------------

*తుల*


మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ధన  పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా  సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

*వృశ్చికం*


నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. చేపట్టిన  పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

---------------------------------------

*ధనస్సు*


చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రుల నుంచి ఋణ  ఒత్తిడులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.  ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.

---------------------------------------

*మకరం*


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవచింతన పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

---------------------------------------

*కుంభం*


విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------

*మీనం*


ముఖ్యమైన  వ్యవహారాలు ముందుకు సాగక  నిరాశ కలిగిస్తాయి.  ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

సౌందర్యలహరి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 5*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


        *హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం*

        *పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభ మనయత్ |*

        *స్మరోఽపి త్వాం నత్వా రతి నయన లేహ్యేన వపుషా*

        *మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ||*


ఈ శ్లోకంలో అమ్మవారి మంత్రశక్తిని వివరిస్తున్నారు శంకరులు. మొదటి పాదం మొదటి శబ్దం హరి తో అదే పాదంలోని చివరి శబ్దం ఈమ్ కలిపి హ్రీమ్ అనే బీజాక్షరాన్ని నిక్షిప్తం చేశారు ఇందులో. అలాగే విష్ణువు మోహినిగా వచ్చి శివుడిని మోహింపజేయటం అనే ఐతిహ్యాన్ని కూడా చేర్చారు. ఇప్పుడు ఈ శ్లోకార్ధం చూద్దాం.


ప్రణత జన సౌభాగ్య జననీం = ప్రణమిల్లే భక్తులకు సౌభాగ్యములను ప్రసాదించే తల్లి. అలాంటి తల్లిని

హరిస్త్వామారాధ్య = హరి ఉపాసించాడు. ఫలం ఏమి పొందాడు?

పురా నారీ భూత్వా = తాను స్త్రీ గా మారాడు. మారి ఏమి చేశాడు?

పురరిపుమపి క్షోభ మనయత్ = త్రిపురాంతకుడైన పరమేశ్వరుని మనసును కలవరపెట్టాడు. మన్మథుడినే   భస్మం చేసిన ఈశ్వరుడిని ఎవరు మోహింపజేయగలరు, కలవరపెట్టగలరు అమ్మవారు తప్ప. మారి విష్ణువు ఎలా మోహింపజేశాడు?  నారాయణుడు అమ్మవారిని ఉపాసిస్తే నారాయణి అయిన ఆమె ఆయనను ఆవేశించి శివమోహినిగా వచ్చింది. 


ఎందుకంటే క్షీరసాగరమధనానంతరం ఆ విశేషాలను నారదుడు శివునికి విన్నవిస్తూ మోహినీ అవతారం గురించి చెప్పినప్పుడు శివుడు ఆ మోహినిని చూడాలనుకొని వైకుంఠమునకు వెళ్తాడు. అప్పుడు విష్ణువు మాయమై మోహినిగా శివునకు కనబడతాడు. ఇది విష్ణువు యొక్క శివమోహినీ స్వరూపం. ఆయన ఇతర రెండు మోహినీ స్వరూపాలు జగన్మోహిని (క్షీరసాగరమధనం) భస్మాసుర మోహిని. రెండూ రాక్షసులను మోహింపజేసి జయించటానికి. అమ్మవారి పురుష రూపమే నారాయణుడు. అందుకే ఆమెను నారాయణి అని అంటారు. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో ఒక రోజు మోహినీ రూపంలో అనుగ్రహిస్తారు స్వామి.

అసలు స్త్రీ శబ్దం స కార,త కార, ర కారముల సత్వ రజస్తమో గుణాలను సూచిస్తే చివరలో వచ్చే ఈ కారము శక్తి ప్రణవం. అందువల్ల స్త్రీ అంటే త్రిగుణాత్మికమైన శక్తి స్వరూపం. అందుకే మన భారతదేశంలో స్త్రీని అవమానించరాదు అగౌరవపరచరాదు. భగవంతుడిని స్త్రీ రూపంగా కొలుస్తారు.


స్మరోఽపి త్వాం నత్వా=స్మరుడు అంటే మన్మథుడు కూడా నిన్ను ఆరాధించి

రతి నయన లేహ్యేన వపుషా = రతీదేవి కన్నులకు ఆనందం కలిగించే రూపం ధరించి (మన్మథుడిని శివుడు అగ్ని నేత్రంతో దగ్ధం చేయగా రతీదేవి అమ్మవారిని ప్రార్ధిస్తుంది తనను కనికరించమని. అప్పుడు అమ్మవారు వరం ఇస్తుంది.మన్మథుడు లోకాలకు కనబడడు కానీ నీ కళ్ళకు భువనమోహనంగా కనిపిస్తాడు అని. మన్మథుడికి అనంగుడనే పేరు అందుకే వచ్చింది)


మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ = మన్మథుడు మునులను కూడా మోహింపజేస్తున్నాడు. ఇది నీ మహాత్మ్యమే. నిన్ను ఉపాసించటం వలననే ఆయన మునులనూ లోకాలనూ మోహింపజేస్తున్నాడు.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

విజయుని సోయగం!

 


విజయుని సోయగం!


అతనినుతింపశక్యమె! జయంతునితమ్ముడుసోయగంబునన్/

బతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండుకృపారసంబునన్/

క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతిజోదుసమిజ్జయంబునం/

దతనికతండెసాటి చతురబ్ధిపరీత మహీతలమ్మునన్//

విజయవిలాసము-చేమకూరవేంకటకవి.

భావం: అర్జనుడు అందంలో జయంతుని తమ్ముడు .దయాస్వభావంలో విష్ణునకు ప్రాణసఖుడు.యుధ్ధంలో విజయంపొందడంలో పరమేశ్వరునకు సరిజోదు.చతుస్సాగరపర్యమతమైనయీభూమండలంలో అతనికతడేసాటి.అట్టి అర్జనుని పొగడశక్యమా?"-అని,


"చెప్పవలె కప్పురంబులు /

కుప్పలుగాబోసినట్లు,కుంకుమపైపై/

గుప్పినగతివిరిపొట్లము,/

విప్పినగతి,ఘమ్మనన్గవిత్వము సభలన్"-అని కవిత్వస్వభావానుగ్గడించిన రఘునాధుని యాస్థాని వేంకటకవి.


.చక్కనితెనుగు నుడికారంతో శ్లేషచమత్కారాలతో ఘమ్మనే కవిత్వంచెప్పిన మహనీయుడు.ఈతడేవిజయవిలాసం.

           కావ్యారంభంలోపాండవులరాజధాని వగైరాలను,ధర్మరాజును,విపులంగా వర్ణించి,పిదప కావ్యనాయకుడగు విజయునివర్ణనకు పూనుకొనినాడు.ఆ సందర్భములోనిది యీపద్యరత్నం.


అందంలో యితడు జయంతుని తమ్ముడంటాడు.ఏదోమాటవరుసకన్నమాటకాదది.నిజంగానే!అర్జనుడుగూడాయింద్రునిపుత్రుడేకదా! దయలోగరుడధ్వజుని ప్రాణమిత్రుడు.నిజమే,కృష్ణునకు ప్రాణసఖుడేకదా!.నరనారాయణులమైత్రిలోకప్రసిద్దము.యుధ్ధవిజయాలలో పార్వతీపతి శివునకు ప్రతివీరుడు.కిరాతార్జునీయకథసు ప్రసిధ్ధమే!

          ఇలాఈపద్యంలోఅర్జునుడు అందంలో,దయలో,వీరత్వంలో,జయంతునీ,విష్ణువునుఈశ్వరునీపోలినవాడనిచెప్పాడు.అయితే వారిపేరులను నేరుగా ప్రస్తావించక,వారిసంబంధాలనుసూచించే తమ్ముడు,ప్రాణసఖుడు,ప్రతిజోదు,అనేపదాలనువాడటంలో కవితన యసమానప్రతిభను వెల్లడించాడు.


చివరిగా"అతనికతండెసాటి"యనటం స్వవచన వ్యాఘాతంగా కనిపించినా అదికూడా యదార్ధమే! జయంతాదులు స్వర్గాదిలోకములకు జెందినవారు. భూలోకమునమాత్రము అర్జునుననకు సాటియర్జనుడేననుట సత్యసమ్మతమేగదా?

ఇదియే కవియొక్క చమత్కారము!!!🙏🙏🙏🌷🌷🌷💐💐💐🌷🌷🌷🌷💐💐💐💐💐💐🌷

ఆకలి అనేది



 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*_ఆదౌ రూప వినాశినీ కృశ కరీ కామాంకురచ్ఛేదినీ_*|

*_పుత్రామిత్ర కలత్ర భేదనకరీ గర్వాంకుర చ్చేదినీ_*||

*_కామం మందకరీ తపః క్షయకరి ధర్మస్య నిర్మూలినీ_*|

*_సా మాం సంప్రతి సర్వరోగ జననీ ప్రాణాపహంత్రీ క్షుధా_*||


𝕝𝕝భావం𝕝𝕝


ఆకలి అనేది మనిషి అందాన్ని కృశింప చేస్తుంది, సన్నగా కళా హీనంగా చేస్తుంది, లైంగిక కోరికను తగ్గిస్తుంది , పుత్రుణ్ణి కూడా శత్రువుగా చేస్తుంది,మిత్రులను దూరం చేస్తుంది మరియు  భార్యతో విభేదాలు సృష్టిస్తుంది... మరియు కుటుంబ సభ్యులను విచ్ఛిన్నం చేస్తుంది, సహనాన్ని తగ్గిస్తుంది  మరియు ధర్మమార్గం ను దగ్గరకు రాకుండా చేస్తుంది .... అన్ని రకాల అనారోగ్యాలకు మూలకారణంగా మారుతుంది ఇది చివరికి  వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. ఆకలి అన్నింటి కంటే భయంకరమైనది.

ఉత్పల ప్రతిభ!

 

ఉత్పల ప్రతిభ!


“కవితా మహేంద్రజాలం” గ్రథంనుంచిసేకరించబడిన పద్యమిది. వారు శ్రీ ఉత్పలవారి గురించి “ఉత్పల పరిమళం”లో వ్రాసిన పరిచయవాక్యాలనే యిక్కడ పొందుపరుస్తున్నాను.


“(శ్రీ ఉత్పలవారు) కవిగా, పండితుడుగా, నవలా రచయితగా, కథానికాకర్తగా, సినిమా రచయితగా, వ్యాసకర్తగా, పురాణతత్వవ్యాఖ్యాతగా బహుముఖీనమైన ప్రజ్ఞాప్రాభవాలు ప్రదర్శించిన వ్యక్తి-…”

శ్రీ ఉత్పలవారికి హైదరాబాదు, శంకర మఠం సభలో ఇవ్వబడిన సమస్య:—


“గుట్టుగ చెప్పికొన్న పలుకుల్ 

బహిరంగములౌను వెంటనే“.

కవిగారి సమస్యాపూరణం యిది:—


“జుట్టున గంగయున్ మరియు సోముడు మేల్కొనియుందురక్కునన్ 

కట్టడి పాపరేడు, యలికంబున నగ్ని, శివుండు పార్వతీ 

పట్టపుదేవితో సరసభాషణ కేనియు నోచుకోడటే!

గుట్టుగ చెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే”! ||


ముందు సమస్య అర్థం చూద్దాం! మాటలు, వాటి అన్వయమూ తేటతెల్లంగానేవున్నాయి. గుట్టుగ అంటే ఏకాంతంలో రహస్యంగా అనుకునే మాటలుకూడా వెనువెంటనే బహిరంగంగా అందరికీ తెలిసిపోతున్నాయట! ఇదీ దీని భావం.


దీనిని శివపరంగా పూరించి దీనికి ఎక్కడాలేని సొగసులు కూర్చారు, శ్రీ ఆచార్యులవారు. ఎంత సునిశిత దృష్టి? ఎంత సున్నితమైన భావన? ఎంత సులభమనోజ్ఞ శైలి? ఎంత సులలితపదప్రయోగం? ఎంత సుకర అన్వయం? ఇదంతా వారి సొమ్ము! వారికే చెల్లింది. ఇప్పుడు పద్యభావం సుతారంగా పట్టుకునేయత్నం చేద్దాం!


“శివుడి తలమీద ఒకప్రక్క గంగమ్మతల్లి, మరొకవైపు చంద్రుడు, వక్షస్థలంలో వ్రేలాడే వాసుకి(పాపరేడు=సర్పరాజు), నుదుటిమధ్య(అలికంబున) అగ్ని ఉన్నారు. ఆ ఉన్న అందరూ ఎప్పుడూ మెలకువగా ఉండేవారూ, శివపరమాత్మని ఒక్కక్షణమైనా వీడనివారూను. పాపం పశుపతి తన పట్టపురాణితో ఏకాంతంగా సరససల్లాపం చేసుకోవడానికే అవకాశం ఉండదు. “వాక్కు-అర్థములాగ” ఎప్పుడూ

ఎడబాయక ఉండే ఆ దంపతులిద్దరికి “ప్రైవసీ” అన్నది మచ్చుకికూడా లేకుండా పోయింది.

ఐనా ఎలాగో ఒకలాగ కాస్త “గుట్టు”గా ఏదైనా “క”భాషలాంటి కోడ్ లాంగ్వేజ్ లో మట్లాడుకుందామన్నా పరువుదక్కడం కష్టం. ఎందుకంటే చంద్రుడు తారానాథుడు. నక్షత్రాలకి భర్త. తన విశ్వమాధ్యమంద్వారా “కలైనేశన్ “వంటి వార్తాప్రసారాలలో తగినంత మసాలాజోడించి అంతా బట్టబయలు చేస్తాడు. గంగమ్మ “ఛానల్ ” ఆవిడకి వుంది. సవతులని భర్తైన సాగరుడి సమక్షంలో కలిసినవెంటనే శంకరుల సంసారం గుట్టు రట్టు చేస్తుంది. వాసుకి క్రిందిలోకాలప్రసారాలు తను చూసుకుంటాడు. అగ్ని దేవలోకంతోసహా పైలోకాల ప్రసారాలని స్వయంగా దగ్గరవుండి నడిపిస్తాడు. ఇది మన ప్రియమైన విశ్వనాథుడి కాపురం పరిస్థితి. పిసరంతైనా ఏకాంతంలేని కైలాసవాసి సంసారం ఇంత అందంగా సాగుతోందిమరి!

స్వస్తి!  రసజ్ఙభారతి సౌజన్యంతో-🙏🙏🙏

శ్రీ మహామాయ మందిర్

 🕉 మన గుడి 


⚜ ఛత్తీస్‌గఢ్ : రతన్‌పూర్ 

         ( బిలాసపూర్)


⚜ శ్రీ మహామాయ మందిర్


💠 మహామాయ ఆలయం రతన్‌పూర్‌లో ఉన్న

మహాకాళి,మహాలక్ష్మి సరస్వతిదేవిల ఆలయం .

మరియు ఇది భారతదేశం అంతటా విస్తరించి ఉన్న 51 శక్తి పీఠాలలో ఒకటి.  

మహామాయ దేవిని కోసలేశ్వరి అని కూడా అంటారు. 


💠 మహామాయా దేవి ఆలయం దాదాపు 900 ఏళ్ల నాటిది.  

ఇది 11వ శతాబ్దంలో హైహయవంశీ రాజ్యాన్ని స్థాపించిన కల్చూరి రాజు రత్నదేవ్-I పాలనలో మహామాయ ఆలయం స్థాపించబడింది.


💠1045 లో, రాజు రత్నదేవుడు మొదటిసారిగా మణిపూర్ అనే గ్రామంలో వేట కోసం వచ్చాడు, అక్కడ అతను చెట్టుపై రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు.  అర్ధరాత్రి రాజు కళ్లు తెరిచి చూస్తే చెట్టుకింద అతీంద్రియ కాంతి కనిపించింది.  

ఆదిశక్తి శ్రీ మహామాయా దేవి ఆ చెట్టు కింద కొంతమంది దేవతలతో సమావేశం అవుతున్న  అద్భుత దృశ్యం చూసారు. 

ఇది చూసి వారు స్పృహ కోల్పోయారు.  


💠 ఉదయం వారు తమ రాజధాని తిరిగి వచ్చి రతన్‌పూర్‌ను తమ రాజధానిగా చేయాలని నిర్ణయించుకున్నారు మరియు 1050లో ఇందులో శ్రీ మహామాయా దేవి యొక్క గొప్ప ఆలయం నిర్మించబడింది.  

ఆలయం లోపల మహాకాళి, మహాసరస్వతి మరియు మహాలక్ష్మిదేవి విగ్రహాలు ఉన్నాయి. 

 

💠 ప్రధాన ఆలయ ప్రాంగణంలో, ప్రసిద్ధ కంఠి దేవల్ ఆలయం మరియు చెరువుకు ఎదురుగా, మహామాయ యొక్క అద్భుతమైన 2 విగ్రహాలు ఉన్నాయి: 

1) ముందు ప్రతిమను మహిషాసుర మర్దిని అని పిలుస్తారు 

2) వెనుక విగ్రహం సరస్వతి దేవి అని నమ్ముతారు.  


💠1050లో రాజు రత్న దేవ్ తన రాజధానిని తుమాన్ నుండి రత్నాపూర్‌కు మార్చినప్పుడు దేవికి మొదటి పూజ & అభిషేకం ఈ ప్రదేశంలో నిర్వహించబడిందని నమ్ముతారు.

ఈ ఆలయంలో తంత్ర మంత్రానికి కేంద్రంగా ఉంటుందని నమ్ముతారు.

ఈ ఆలయం నగారా నిర్మాణ శైలిలో నిర్మించబడింది.


💠 మహామాయ ఆలయం రతన్‌పూర్ ప్రాంతానికి చెందిన కులదేవత.

ప్రధాన ఆలయం చుట్టూ కొన్ని  పెద్ద గదులు   ఉన్నాయి, ఇక్కడ భక్తుల జ్యోతి కలశాలు వెలిగిస్తారు.  నవరాత్రుల మొత్తం తొమ్మిది రోజులు కలశాలు "సజీవంగా" ఉంచబడతాయి.  అందుకే వీటిని అఖండ మనోకామ్న జ్యోతి కలశాలు అని కూడా అంటారు.


💠 ఆలయ ప్రధాన ప్రాంగణంలో మహాకాళి, భద్రకాళి, సూర్య, శ్రీ మహావిష్ణువు, హనుమంతుడు, భైరవుడు మరియు శివుని చిన్న విగ్రహాలు ఉన్నాయి.


💠 ఆలయ సంరక్షకుడు కాలభైరవుడిగా పరిగణించబడతారు , అతని ఆలయం హైవేలో ఆలయానికి చేరుకునే రహదారిలో ఉంది. మహామాయ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు తమ తీర్థయాత్రను పూర్తి చేయడానికి కాలభైరవ ఆలయాన్ని కూడా సందర్శించాలని ప్రసిద్ధి చెందిన నమ్మకం. 


💠 శ్రీ మహామాయా దేవి మందిర్ 21 మంది విశిష్ట ధర్మకర్తలతో కూడిన ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతుంది, వారు ఆలయం  శ్రేయస్సు, దాని వాస్తుశిల్పం, రోజువారీ నిర్వహణ, ఆర్థిక మరియు పరిపాలనకు బాధ్యత వహిస్తారు. 

ట్రస్ట్ - సిద్ధ్ శక్తి పీఠ్ శ్రీ మహామాయా దేవి మందిర్ ట్రస్ట్ - లాభాపేక్ష లేని సంస్థ, సంస్థలు మరియు సొసైటీల రిజిస్ట్రార్‌తో నమోదు చేయబడింది. 

సమాజంలోని పేద మరియు వికలాంగుల శ్రేయస్సు కోసం ట్రస్ట్ అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.


💠 ఆలయ సమయాలు :

 ప్రతిరోజూ ఉదయం 6.00 నుండి రాత్రి 8.30 వరకు. 

అర్ధగంట భోగ్ (నైవేద్యాల విరామం) మధ్యాహ్నం 12.00 గంటలకు నిర్వహించబడుతుంది, ఈ సమయంలో ప్రవేశం పరిమితం చేయబడింది.


💠 ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా కేంద్రం నుండి 25 కి.మీ దూరంలో ఉంది.

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-29🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-29🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


తొండమానుడు ఆలయ నిర్మాణమునకు తక్షణమే పూనుకొనినాడు. అతితక్కువ రోజుల్లోనే ఆనందనిలయం గోపుర, ప్రాకార, మంటపాలూ, మెట్లూ కట్టించాడు. పూల బావిని బాగుచేయించినాడు. ఆలయ నిర్మాణపు ముగింపు గూర్చి శ్రీనివాసునకు కబురు పంపినాడు. 



వేద వేదాంగ నిష్ణాతులైన బ్రాహ్మణులు శ్రీనివాసుడు ఆలయములో ప్రవేశించడానికి సముహూర్తం నిర్ణయించినారు. ఆ ప్రవేశోత్సవం చూడడానికి సర్వలోకాల వారున్నూ విచ్చేసారు. పద్మావతీ శ్రీనివాసులు చక్కగా ముస్తాబై ముహూర్తము సమీపించగానే విప్రాశీర్వచన శ్లోక శుభమంత్రములు చెలగుచుండ, వివిధ మంగళ వాయిద్యములు మ్రోగుచుండ, మునీంద్రులు ఆశీర్వచన శుభవాక్యాలు పలుకుచుండ, బ్రహ్మాది దేవతలు పుష్పవర్షం కురిపించుచుండ, జయ జయ నినాదముల మధ్య ఆనంద నిలయమున ప్రవేశించినారు.


కలియుగదైవమైన శ్రీనివాసుడు వుండు శ్రీ వేంకటాచలము ఒక ఆమడవెడల్పు, ముప్పయి ఆమడల పొడవు విస్తరించి వుంది


. శ్రీమద్వేంకట శైలరాజ శిఖరే శ్రీ శ్రీనివాసో హరి:

   శ్రీమత్ స్వామి సరోవర ప్రభృతిభి: పుణ్యైరనేకైర్యుతే

   తీర్థై:ప్రాజ్ముఖ సంస్థితి ర్విజయతే శ్రీతొండమానాదిభి:

   దృష్ట: శ్రీ నవసూరి సంస్తుత వపు స్త్వాలింగ్య పద్మావతీమ్‌||

   శ్రీ వేంకట గిరీశోయం అలర్ మేల్ మంగనాయకీమ్‌|

   ఆశ్రితో రాజతే నిత్యం ఆనంద నిలయాలయ:||


   మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్‌

   స్వామిపుష్కరిణీ తీరే రమయా సహమోదతే.


శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపమైన శ్రీవైకుంఠమును విడచి స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు, అనియు


   "శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీ తటే

    రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌"


("శ్రీవైకుంఠమున విరక్తుడైన స్వామి, స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు") 


అనియు చెప్పినట్లుగా శ్రీవైకుంఠనికేతనుడైన స్వామి భక్త సంరక్షణ దీక్షితుడై తిరుమలపై వేంచేసియున్నాడు.


   "కృతేయుగే నారసింహ: త్రేతాయాంరఘునందన:

    ద్వాపరే వాసు దేవశ్చ కలౌవేంకటనాయక:"


అని చెప్పినట్లుగా కృతయుగమున నరసింహస్వామి, త్రేతాయుగమున శ్రీరామచంద్రులు, ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్మ; కలియుగమున శ్రీవేంకటేశ్వరస్వామి భక్తరక్షణ దీక్షితులై యున్నారు.



శ్రీనివాసునకు బ్రహ్మోత్సవము

ఆనందనిలయం ప్రవేశోత్సవము జరిగిన తరువాత బ్రహ్మదేవుడు శ్రీనివాసుని చెంతకు వచ్చి ‘ఆదిపురుషా! నేను నీ చెంత రెండు ఆఖండజ్యోతులు వెలిగించెదను. లోక కళ్యాణకరంగా అవి ఎప్పుడూ నీ వద్ద వెలుగుతూండవలెను. ..


నీవు కలియుగపుమానవుల కొరకై యుగాంతము వరకూ యిచ్చటనే నివసించుచు భక్తులకు దర్శనభాగ్యము కలుగజేస్తూ వుండవలెను.


 నేను నీకు ఒక ఉత్సవము చేయగలను. దానికి మీరు అంగీకరించ గలందులకు కోరుచున్నాడు. అనగా శ్రీ వెంకటేశ్వరుడు అంగీకరించినాడు. 


బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి, ఇవి కలియుగాంతం వరకూ వెలుగుతూంటాయని చెప్పాడు.


బ్రహ్మోత్సవము ప్రారంభమైనది.


 పగలూ రాత్రీ అనక, ఏకటాకిని అలాగే ఉత్సవము జరుగసాగినది. 


ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదటి రోజున అంకురార్పణ జరిగినది. ధ్వజారోహణము, శేషవాహనము, గజవాహనము, సింహవాహనము, ముత్తెంపుపందిరి, కల్పవృక్షవాహనము, సర్వభూపాల వాహనము, మోహినీ అవతారము గరుడసేవ, హనుమంత వాహనము, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు, రథోత్సవము అశ్వవాహనము ఇవి అన్నీ తొమ్మిది రోజులపాటు రకరకాలుగా ఉత్సవాలు జరిగాయి. 


పదియవ రోజున అలంకారాలతో నిండిన పల్లకీ ఉత్సవము జరిగినది. ఆనాడే స్వామి పుష్కరిణీ తీర్థములో అవబృథస్నానము కూడా జరిగినది. వేలకొలదీ భక్తులు యీ ఉత్సవాలకు హాజరయ్యారు.


ఎక్కడ విన్ననూ ‘గోవిందా, గోవిందా’ అనే హరినామస్మరణమే! శేషాచలము! బ్రహ్మోత్సవ సమయములో వైకుంఠాన్ని తిరస్కరించేటటువంటి ప్రకాశంతముగా వుంది. భక్తులు శ్రీ వేంకటేశ్వరునకు కానుకలూ అవీ సమర్పించి, అనంతరము వారి వారి యిండ్లకు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు శ్రీనివాసునితో చెప్పి సత్యలోకానికి వెళ్ళి పోయాడు.



తిరుమల నాయక గోవిందా, తులసీమాల గోవిందా, శేషాద్రి నిలయ గోవిందా, శ్రేయోదాయక గోవిందా, |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||29||



*శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-29🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-29🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


తొండమానుడు ఆలయ నిర్మాణమునకు తక్షణమే పూనుకొనినాడు. అతితక్కువ రోజుల్లోనే ఆనందనిలయం గోపుర, ప్రాకార, మంటపాలూ, మెట్లూ కట్టించాడు. పూల బావిని బాగుచేయించినాడు. ఆలయ నిర్మాణపు ముగింపు గూర్చి శ్రీనివాసునకు కబురు పంపినాడు. 



వేద వేదాంగ నిష్ణాతులైన బ్రాహ్మణులు శ్రీనివాసుడు ఆలయములో ప్రవేశించడానికి సముహూర్తం నిర్ణయించినారు. ఆ ప్రవేశోత్సవం చూడడానికి సర్వలోకాల వారున్నూ విచ్చేసారు. పద్మావతీ శ్రీనివాసులు చక్కగా ముస్తాబై ముహూర్తము సమీపించగానే విప్రాశీర్వచన శ్లోక శుభమంత్రములు చెలగుచుండ, వివిధ మంగళ వాయిద్యములు మ్రోగుచుండ, మునీంద్రులు ఆశీర్వచన శుభవాక్యాలు పలుకుచుండ, బ్రహ్మాది దేవతలు పుష్పవర్షం కురిపించుచుండ, జయ జయ నినాదముల మధ్య ఆనంద నిలయమున ప్రవేశించినారు.


కలియుగదైవమైన శ్రీనివాసుడు వుండు శ్రీ వేంకటాచలము ఒక ఆమడవెడల్పు, ముప్పయి ఆమడల పొడవు విస్తరించి వుంది


. శ్రీమద్వేంకట శైలరాజ శిఖరే శ్రీ శ్రీనివాసో హరి:

   శ్రీమత్ స్వామి సరోవర ప్రభృతిభి: పుణ్యైరనేకైర్యుతే

   తీర్థై:ప్రాజ్ముఖ సంస్థితి ర్విజయతే శ్రీతొండమానాదిభి:

   దృష్ట: శ్రీ నవసూరి సంస్తుత వపు స్త్వాలింగ్య పద్మావతీమ్‌||

   శ్రీ వేంకట గిరీశోయం అలర్ మేల్ మంగనాయకీమ్‌|

   ఆశ్రితో రాజతే నిత్యం ఆనంద నిలయాలయ:||


   మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్‌

   స్వామిపుష్కరిణీ తీరే రమయా సహమోదతే.


శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపమైన శ్రీవైకుంఠమును విడచి స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు, అనియు


   "శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీ తటే

    రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌"


("శ్రీవైకుంఠమున విరక్తుడైన స్వామి, స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు") 


అనియు చెప్పినట్లుగా శ్రీవైకుంఠనికేతనుడైన స్వామి భక్త సంరక్షణ దీక్షితుడై తిరుమలపై వేంచేసియున్నాడు.


   "కృతేయుగే నారసింహ: త్రేతాయాంరఘునందన:

    ద్వాపరే వాసు దేవశ్చ కలౌవేంకటనాయక:"


అని చెప్పినట్లుగా కృతయుగమున నరసింహస్వామి, త్రేతాయుగమున శ్రీరామచంద్రులు, ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్మ; కలియుగమున శ్రీవేంకటేశ్వరస్వామి భక్తరక్షణ దీక్షితులై యున్నారు.



శ్రీనివాసునకు బ్రహ్మోత్సవము

ఆనందనిలయం ప్రవేశోత్సవము జరిగిన తరువాత బ్రహ్మదేవుడు శ్రీనివాసుని చెంతకు వచ్చి ‘ఆదిపురుషా! నేను నీ చెంత రెండు ఆఖండజ్యోతులు వెలిగించెదను. లోక కళ్యాణకరంగా అవి ఎప్పుడూ నీ వద్ద వెలుగుతూండవలెను. ..


నీవు కలియుగపుమానవుల కొరకై యుగాంతము వరకూ యిచ్చటనే నివసించుచు భక్తులకు దర్శనభాగ్యము కలుగజేస్తూ వుండవలెను.


 నేను నీకు ఒక ఉత్సవము చేయగలను. దానికి మీరు అంగీకరించ గలందులకు కోరుచున్నాడు. అనగా శ్రీ వెంకటేశ్వరుడు అంగీకరించినాడు. 


బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి, ఇవి కలియుగాంతం వరకూ వెలుగుతూంటాయని చెప్పాడు.


బ్రహ్మోత్సవము ప్రారంభమైనది.


 పగలూ రాత్రీ అనక, ఏకటాకిని అలాగే ఉత్సవము జరుగసాగినది. 


ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదటి రోజున అంకురార్పణ జరిగినది. ధ్వజారోహణము, శేషవాహనము, గజవాహనము, సింహవాహనము, ముత్తెంపుపందిరి, కల్పవృక్షవాహనము, సర్వభూపాల వాహనము, మోహినీ అవతారము గరుడసేవ, హనుమంత వాహనము, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు, రథోత్సవము అశ్వవాహనము ఇవి అన్నీ తొమ్మిది రోజులపాటు రకరకాలుగా ఉత్సవాలు జరిగాయి. 


పదియవ రోజున అలంకారాలతో నిండిన పల్లకీ ఉత్సవము జరిగినది. ఆనాడే స్వామి పుష్కరిణీ తీర్థములో అవబృథస్నానము కూడా జరిగినది. వేలకొలదీ భక్తులు యీ ఉత్సవాలకు హాజరయ్యారు.


ఎక్కడ విన్ననూ ‘గోవిందా, గోవిందా’ అనే హరినామస్మరణమే! శేషాచలము! బ్రహ్మోత్సవ సమయములో వైకుంఠాన్ని తిరస్కరించేటటువంటి ప్రకాశంతముగా వుంది. భక్తులు శ్రీ వేంకటేశ్వరునకు కానుకలూ అవీ సమర్పించి, అనంతరము వారి వారి యిండ్లకు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు శ్రీనివాసునితో చెప్పి సత్యలోకానికి వెళ్ళి పోయాడు.



తిరుమల నాయక గోవిందా, తులసీమాల గోవిందా, శేషాద్రి నిలయ గోవిందా, శ్రేయోదాయక గోవిందా, |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||29||



*శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 19*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 19*


44 అంత సులభం కాదు. అలా ఒక వ్యక్తి చేయగలిగితే అది అతనిలో బ్రహ్మచర్యశక్తి లేదా మేధాశక్తి అనే నూతన శక్తిని జనింపచేస్తుంది. ఈ శక్తి అసాధ్య కార్యాలను సాధ్యం చేస్తుంది. ఈ శక్తిని సముపార్జించే తీరాలని నరేంద్రుడు నిశ్చయించాడు. అందుకు తగ్గట్లు తన జీవిత విధానాన్ని మలచుకొన్నాడు. 


అయినప్పటికీ ఒక రోజు ఆ ఉద్వేగం కట్టలు తెంచుకొని ఆతడిలో ఉప్పొంగింది. ఇక మీదట అది తలెత్తకుండా అదుపులో ఉంచే తీరాలని సంకల్పించాడు. తలచుకొన్నది సాధించే తీరుతాడు కదా నరేంద్రుడు! చుట్టూ పరికించాడు. చలి కాచుకోవడానికి పొయ్యి రాజేసి ఉన్నారు. శరీర భాగం తాకేటట్లు ఆ పొయ్యి మీద కూర్చున్నాడు! ఆ పుండు నయం కావడానికి నెలలు పట్టింది! శరీరం మీద పుండు ఏర్పడ్డదే తప్ప కామం అనే పిడికిలి నుండి మనస్సు విడివడింది. 


ఆ తరువాత నరేంద్రుని జీవితంలో కామం అనే పదానికే చోటులేకపోయింది. ఆ యౌవనావస్థలోనే తనను కోరివచ్చిన స్త్రీలను తల్లిగా భావించి, వారిని త్రోసి రాజన్న శక్తి అతడిలో కలిగింది.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 4*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 4*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


       *త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః*

       *త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |*

       *భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం*

       *శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ ||*


ఈ శ్లోకంలో అమ్మవారిని సూచనగా వర్ణిస్తున్నారు. వరద, అభయ ముద్రలు లేనిదిగా చెరకు విల్లు, పుష్పబాణములు, పాశము, అంకుశము పట్టుకొని వున్న అమ్మవారిగా చూపిస్తున్నారు.


త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః = నీవు తప్ప మిగిలిన దేవతా గణాలు అభయ, వరద ముద్రలతో వున్నారు.

త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా = నీవు ఒక్కదానివే అభయ వరద ముద్రాభినయము ప్రకటించటంలేదు. ఎందుకని?


భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం = అమ్మవారి నామాల్లో *భయాపహా* అని చెప్పుకుంటున్నాము. భయముల నుండి రక్షించటానికి, కోరిన దాన్ని మించి ఇవ్వటానికి అమ్మవారికి వరద అభయ ముద్రల అభినయము అక్కరలేదు.


శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ = నీ పాదారవిందములే లోకాలకు అభయము, వరములు ఇవ్వటానికి శరణ్యము.


అమ్మవారు జ్ఞానప్రదాయిని. ద్వైతం భయం అన్నారు పండితులు. నీవు కాక మరొక వస్తువు వున్నదన్న భ్రమయే వివిధములైన భయమును కలిగిస్తుంది. విశ్వమంతా నీవే వ్యాపించి వున్నావు అనే సుజ్ఞాన భావన కలిగినప్పుడు ఇక దేనికి భయపడాలి? దేనిని కోరాలి - జ్ఞాన వైరాగ్యములు కలిగాక? ఇవి ఇచ్చేది అమ్మవారి పాదపద్మములే అంటున్నారు శంకరులు. *వాంచితార్ధప్రదాయినీ*, *వరదా వామనయనా* అని అమ్మవారి నామాలు. అటువంటి దివ్య పాదములను కాంచీపురంలో మహాయోగముద్రలో కూర్చొని వున్న కామాక్షీ అమ్మవారు ముముక్షువులకు అనుగ్రహిస్తున్నారు.


          🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹