26, నవంబర్ 2024, మంగళవారం

కార్తీక సిరి ఉసిరి*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

         *కార్తీక సిరి ఉసిరి*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అపుడు  కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ తగుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మిక. బావుల్లో ఉసిరి విత్తనాకు పోస్తారు. దీనివల్ల ఆనీరు శుధ్ధి అవుతుందని పూర్వుల నమ్మిక.*


*కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేస్తారు.ఈ విధంగా పూర్వం స్నేహితులు బంధువులు కలిసి వేద పండితులను సర్కరించడం , పూజాదికాలు చేయడం వల్ల పరస్పర స్నేహ భావన, బంధుభావన , రోజువారీ పనినుండీ కాస్తంత సేదతీరడం జరిగేవి.*


*కార్తికమాసం వచ్చిందంటే చాలు... వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తుంటారంతా. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరిచెట్టు కింద ఒక్కపూటయినా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకెళ్లి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తికంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరిచెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు.*


*దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృతబిందువులు పొరబాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళినీ రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. అంతటి మహత్తరమైనదిగా భావించే ఆ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమమైనదో వేరే చెప్పాలా? అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం.*


*ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రీఫలం అనీ పిలుస్తారు. ఏదో ఆపిల్ మాదిరిగానో అరటిపండులానో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు. ఎందుకంటే పులుపు దాని ఇంటిపేరు. కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం. కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. అలాగని ప్రొటీన్లు లేవనుకునేరు... ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ఎక్కువ. ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్వదోషహర అనీ పిలుస్తారు. శీతకాలం నుంచి వేసవివరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాదిపొడవునా వాడతారు. కొందరు పంచదారపాకంలో మురబ్బా రూపంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి అద్భుత ఔషధమే.*


*అయితే ఉసిరిలో మనకు తెలిసి రెండు రకాలున్నాయి. ఒకటి పుల్లని రాచ ఉసిరి, మరొకటి చేదూ తీపీ వగరూ ఘాటూ పులుపూ కలగలిసినట్లుండే ఉసిరి. రాచ ఉసిరిని కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతాం. ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు. కానీ ఉసిరిలో పండేకాదు, వేరు నుంచి చిగురు వరకూ ప్రతీదీ ఔషధమే.*


*ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత, పిత్త, కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి.  ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి, ఆరోగ్యం వస్తుందనడంలో ఎంత మాత్రం అతిశ యోక్తి కాదు. ఉప్పు లో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ప్రతి ఇంటిలో  ఉసిరిని పెంచితే ఆగాలికే ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రజ్ఞులమాట. . భారతీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవైనా ఉంటే  హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం చెప్తున్నాయి.*


*ఉసిరి కంటిచూపును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. జ్వరం వచ్చి పచ్చెం పెట్టే సమయం లోనూ, బాలింతకూ పచ్చం పెట్టేప్పుడూ పాత చింతకాయ పచ్చడితోపాటుగా ఉసిరి కూడా ఎండు మిర్చితో ,ఇంగువ వేసి చేసి పెడతారు. రక్త శుధ్ధికి ఇది మంచి మందుగా పని చేస్తుంది.*


*ఆదిశంకరులవారు ఆశువుగా చెప్పిన  కనక ధారా స్తవం  మనకు ప్రతిరోజూ చదవ దగ్గ స్తోత్రరాజం.శంకరులు బాల బ్రహ్మచారిగా ఏడెనిమిదేళ్ళ వయస్సులో భిక్షకోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిల్చి ' మాతా బిక్షం దేహి 'అని  కేకవేయగా ఆపేద బ్రాహ్మణి రెండో వస్త్రం సైతం లేక చీర ఆరేవరకూ ధరించిన చిన్న వస్త్రంతో బయ టకు రాలేక తన ఇంట ఉన్న ఒకేఒక ఎండిన ఉసిరికాయను తన లేమికి చింతిస్తూ ఆబ్రహ్మచారి జోలెలో తన పూరి పాక తలుపు చాటు నుంచీ విసిరివేస్తుంది. శంకరులు ఆమె దారిద్యాన్ని గ్రహించి, అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక ఉసిరికాయను త్యాగ భావంతో తనకు దానం చేసినందుకు సంతసించి ' కనక ధారాస్తవం ' ఆశువుగా చదువుతారు. వెంటనే లక్ష్మి కరుణీంచి ఆమె ఇంట బంగారు ఉసిరి కాయలవాన కురిపిస్తుంది. ఇల్లు నిండిపోతుంది. త్యాగానికి ఋజువు , ఆభావనను గ్రహించి కరుణించిన శంక రులవారి మనస్సూ ఈ కధ ద్వారా మనకు తెలుస్తాయి. అదే కనక ధారా స్తవం 'గా భక్తులు ప్రతిరోజూ చదివి సంపదలు పొందుతారు.*


*ఓం శ్రీ  కార్తీక దామోదరాయ నమః!*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

సర్వరోగాస్త్రానికి విరుగుడు*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

   *సర్వరోగాస్త్రానికి విరుగుడు*

         *నామత్రయాస్త్రం..!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్రీ అచ్యుతాయ నమః,*

*శ్రీ అనంతాయనమః,*

*శ్రీ గోవిందాయనమః॥*


*ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు.*


*వీటిలో అనేక రకాలు…. వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు. ఆ రోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తాడు. దానిపేరు సర్వారోగాస్త్రం.*


*దీనికి విరుగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు, లక్షలు వదిలించుకోవడం. కాని మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాతా ఒక శస్త్రం సంధించింది. దానిపేరు నామత్రయాస్త్రం. నామత్రయం అంటే మూడు నామాలు.*


*అవి…….*

*శ్రీ అచ్యుతాయ నమః,*

*శ్రీ అనంతాయ నమః,*

*శ్రీ గోవిందాయ నమః॥*


*ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు. జబ్బులు ఏమైనా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి. ఈ నామాలు ఒక దివ్యౌషధం మీరు స్మరించండి.*


*అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ:-*


*సాధు పరిత్రాణం కొరకు, దుష్ట వినాశం కొరకు, ధర్మ సంస్థాపన కొరకు పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తూ ఉంటానని చెప్పాడు.*


*భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.*


*సంధ్యావందనం మెుదలుకొని ఏ వైదీక కర్మ చేసినా*

*ఓం అచ్యుతాయ నమః,*

*ఓం అనంతాయ నమః,*

*ఓం గోవిందాయ నమః॥*

*అని ఆచమించి ఆరంభిస్తాం.*


*క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేదవైద్య విద్యకు ఆయనే ప్రధమ స్థానం.*


*అచ్యుతానంత గోవింద*

*నామోచ్ఛారణ భేషజాత్*

*నశ్యంతి సకలారోగాః*

*సత్యం సత్యం వదామ్యహ.!*


*ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను". ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట.*


*వైద్యవిద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే ఇంకొక ప్రమాణం అవసరమా" !. ఇది పరమ ప్రమాణం.*


*పద్మపురాణంలో ఈ నామ మహిమ మిక్కలి గొప్పగా వర్ణించబడింది.*


*పార్వతీదేవి అడుగగా శంకరులవారు శ్రీమన్నారయణుని లీలలను వివరిస్తూ కూర్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తూ ఇలా అన్నారు.*


*పార్వతీ! పాలకడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతిస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది. ఆ హాలాహలం చూసి దేవతలు, దానవులూ భయపడి తలో దిక్కుకి పారిపోయారు. పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకూటాన్ని నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను. అందరూ నా పాదాలపై బడి నన్ను పూజించి స్తుతించ సాగారు. అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముడు నామాల్ని - అచ్యుత, అనంత, గోవింద అన్న మహా మూడు మంత్రాల్ని స్మరించుకుంటూ ఆ మహా భయంకరమైన కాలకూట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణుభగవానుని యెుక్క ఆ నామత్రయం యెుక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది.*


*కనుక ఈ మంత్రములతో ఆచమించేటపుడు ఈ మహిమంతా జ్ఞాపకముంచుకుని, విశ్వాసం పెంచుకుని అందరూ భగవత్ కృపకు పాత్రులగుదురు గాక !.*


*ఓం శ్రీ అచ్యుతాయ నమః।*

*ఓం శ్రీ అనంతాయ నమః।*

*ఓం శ్రీ గోవిందాయ నమః॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కమలాక్షు నర్చించు కరములు కరములు:

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కమలాక్షు నర్చించు కరములు కరములు:*

*శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ*

*సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు:*

*శేషశాయికి మ్రొక్కు శిరము శిరము*

*విష్ణునాకర్ణించు వీనులు వీనులు:*

*మధువైరి తవిలిన మనము మనము:*

*భగవంతు వలగొను పదములు పదములు।*

*పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి!!*


*భావము:~*


*తండ్రీ! కమలాలవంటి కన్నులున్న ఆ స్వామిని పూజించే చేతులే నిజమైన చేతులు. లక్ష్మీపతి అయిన నారాయణుని గుణగణాలను కొనియాడే నాలుకయే నాలుక. దేవతలను కాపాడే ప్రభువును చూచే చూపులే చూపులు. ఆదిశేషుని పాన్పుగా చేసికొన్న వైకుంఠనాథునికి మ్రొక్కే తలయే తల. విష్ణువును గూర్చి వినే శీలం కల చెవులే చెవులు. మధువును మట్టుపెట్టిన మాధవుని అంటిపెట్టుకొని ఉండే మనస్సే మనస్సు. భగవంతునకు ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు. పురుషోత్తమునిపై నిశ్చలంగా నెలకొని ఉన్న బుద్ధియే బుద్ధి. ఆయన దేవులందరకు దేవుడు. అట్టివానిని భావించే దినమే దినము. చక్రం చేతబట్టి దుష్టసంహారం చేసే స్వామిని తెలియజెప్పే చదువే నిజమైన చదువు. ఈ సర్వభూమికీ అధినాయకుడైన మహాప్రభువును బోధించే గురువే గురువు. శ్రద్ధగా వినవయ్యా! హరిని చేరుకో నాయనా అని ఉపదేశంచేసే తండ్రియే తండ్రి.*


*ఓం నమో నారాయణాయ:*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

ఇదండీ మనవారి మేధస్సు*

 *ఇదండీ మనవారి మేధస్సు*


తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం

3 నిమేశాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్ట

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము,ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల.

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు


4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=త్రేతా యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట


భాగవతాదారితం 🕉🕉


అందరికీ తెలియాల్సిన విషయం తప్పకుండా షేర్ చేయగలరు .


ఎంతో గర్వంగా చెప్పుకునే హిందువులకే సొంతం ఈ లెక్కలు మరేదైనా మతం లో కానరాదు.  విదేశీయులు మాత్రమే కనుగొన్న ట్లుగా చెప్పుకనేటటువంటి ఎన్నో విషయాలు మన యోగులు మునులు ఏనాడో కనుగొనినారు. అందుకు మనమందరము గర్వరడాలి. 

నా దేశం గొప్పది. 🕉️🚩🕉️

The above information was also given by Kuppa Vishwanatha Sarma Varu in his discourse on Shrimad Bhagawatham on SCBC channel 🙏🙏😊😊

కార్తీక పురాణం - 26

 కార్తీక పురాణం - 26

26వ అధ్యాయము - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ


ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.


ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి "వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ హృదయముపై తన్నినను సహించితివి. అ కాలిగుర్తు నేటికినీ నీవక్షస్థలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి! నీచక్రాయుధము నన్ను చంపవచ్చుచున్న"దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్థించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్థించుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి "దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రుడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథివై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశి ఘడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి, నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను! చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకోనే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.


అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప, యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట "కల్కి" యను పేరున జన్మించి, అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేషులనందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.


స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహత్మ్యమందు షడ్వింశతి అధ్యాయము సమాప్తము.

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*

  

*శ్రీ స్వామివారి వివరణ..*


*(పన్నెండవ రోజు)*


శ్రీ స్వామివారు తన తపోసాధన కొరకు ఆశ్రమం నిర్మించుకోవాలని, అందుకు భూమి కావాలనీ శ్రీధరరావు దంపతులను కోరడం..వారు తర్జన భర్జన పడటం జరుగుతూవుంది..ప్రత్యామ్నాయంగా పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి..కొన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి.. ఆశ్రమ వాతావరణాన్ని ఈ మాలకొండ మీదే కల్పిస్తే ఎలావుంటుందని దంపతులిద్దరూ తలపోయసాగారు.. కానీ ఈ విషయాన్ని శ్రీ స్వామివారితో ఎలా చెప్పాలా అన్న మీమాంస వాళ్ళిద్దరినీ వెంటాడుతోంది..ఈ ఆలోచన ను తమలోనే దాచుకున్నారు..


వరుసగా ఆరేడు వారాలపాటు శ్రీధరరావు గారొక్కరే మాలకొండ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి..ప్రభావతి గారు ఇంటివద్దే ఉండిపోవాల్సివచ్చింది..మాలకొండ మీదకు రోడ్డు వేసే పని మొదలుపెట్టారు..శ్రీధరరావు గారు ఆ పని మీద వున్నారు..కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా మాలకొండ మీదుగా వేరే ఊళ్లకు వెళుతూ శ్రీధరరావు గారితో ఉన్న పరిచయం దృష్ట్యా వారిని కలిసి వెళుతూ వుండేవారు..అలా వచ్చిన వారిలో ఒకరిద్దరికి శ్రీ స్వామివారిని చూపిద్దామని శ్రీధరరావు గారు ప్రయత్నం చేశారు..కానీ అదేమీ చిత్రమో.. శ్రీ స్వామివారు అటు శివాలయం లోగానీ..ఇటు పార్వతీదేవి మఠం లోగానీ కనుపించేవారు కాదు..ఎంత సేపు వేచి చూసినా శ్రీ స్వామివారి జాడే తెలిసేది కాదు..వచ్చిన వారు శ్రీ స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిపోయేవారు..అలా రెండు మూడు సార్లు శ్రీధరరావు గారికి అనుభవం అయింది..


ఒకరోజు, శ్రీధరరావు గారొక్కరే పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లారు..చిత్రం..శ్రీ స్వామివారు ఆ ఆలయం వెలుపల వున్న అరుగుమీద పద్మాసనం వేసుకొని కూర్చుని వున్నారు..శ్రీధరరావు గారిని చూడగానే నవ్వుతూ.."శ్రీధరరావు గారూ నన్ను ప్రదర్శనకు పెడుతున్నారా?.." అన్నారు..


శ్రీధరరావు గారు అవాక్కయ్యారు.."అది కాదు స్వామీ..ప్రముఖ వ్యక్తులు ఇక్కడిదాకా వచ్చారు..మీ దర్శనం చేయిద్దామని అనుకున్నాను..మీరు కనిపించలేదు.." అన్నారు..


"ఇక్కడ నేను తపస్సుచేసుకుంటున్నానని అందరికీ ప్రచారం కావడం..నన్ను చూడటం కోసం వారం కాని వారం లో ఈ మాలకొండ ఎక్కడం..నాకోసం కొండమీద పడిగాపులు కాయడం..నన్ను వెతుక్కుంటూ అన్ని గుహలు తిరగడం..ఒకవేళ నేను కనబడితే..కాళ్లకు మొక్కడం..అది వీలుగాకపోతే..నామీదకు చిల్లర డబ్బులు విసరడం..ఇదంతా ఏమిటి?..నా తపోభంగం కావడం తప్ప వేరే ప్రయోజనం ఉందా?.."


"ఈ మాల్యాద్రి క్షేత్రానికి ఓ నియమం ఉంది శ్రీధరరావుగారూ..మీకూ తెలుసు..వారం లో ఆదివారం నుంచీ శుక్రవారం వరకూ దైవపూజ..ఒక్క శనివారం నాడు మాత్రమే మానవపూజ అని..నా మూలంగా ఈ సాంప్రదాయం తప్పుతోంది..నన్ను చూడటం కోసం జనాలు ఏరోజు పడితే ఆరోజు ఈ కొండమీద సంచరిస్తున్నారు..ఇది నివారిద్దామనే నేను, నా శేష తపోసాధనకు వేరే ప్రదేశం ఎన్నుకోదలచాను.. అందుకే మిమ్మల్ని భూమి అడిగాను.." అంటూ ఒక్కక్షణం ఆగి..


"ఈ పార్వతీదేవి మఠానికి మార్పులు చేసి, నాకు నివాసయోగ్యంగా చేద్దామని తలపోస్తున్నారా?..


"కౌపీన సంరక్షణార్ధం అయం పటాటోపః "


 అన్నట్లుగా అది సమస్యను మరింత జటిలం చేస్తుందేగానీ.. పరిష్కారం కాదు.." అన్నారు..


శ్రీధరరావు గారు ఆశ్చర్యపోయారు..ఈ ప్రతిపాదన తానూ తన భార్య అనుకున్నది..శ్రీ స్వామివారికెలా తెలిసిందీ?..అనుకుంటూ శ్రీ స్వామివారికేసి చూసారు..శ్రీ స్వామివారి మొహంలో అదే చిరునవ్వు..అదే ప్రశాంతత!..


"మీరు ఇతరత్రా ఆలోచనలు పెట్టుకోకండి..ఇంటికెళ్లి అమ్మతో చెప్పండి..ఇక్కడ ఎక్కువకాలం నేను ఉండటం సాధ్యపడదు..దైవానుగ్రహం ఉన్నంత వరకూ అన్ని సాధనలూ సవ్యంగా సాగుతాయి..ఆ లక్ష్మీనృసింహుడి ఆదేశం అయిన తరువాత ఆలస్యం చేయకూడదు..నా తపోసాధన ఇంతవరకూ ఈ శివపార్వతుల ఒడిలో జరిగిపోయింది..ఇకముందు జరగాల్సిన ప్రదేశం కావాలి..అందుకు మిమ్మల్ని స్థలం అడిగాను..అది దత్తక్షేత్రం అవుతుంది.." అని చెప్పి..పార్వతీదేవి మఠం లోపలికి వెళ్లిపోయారు..


శ్రీధరరావు గారు తిరిగి మొగలిచెర్ల కు వచ్చి..శ్రీ స్వామివారితో జరిగిన సంభాషణ అంతా..పూసగ్రుచ్చినట్లు ప్రభావతి గారికి చెప్పేసారు..

"సరే శ్రీవారూ..దైవానుగ్రహం ఎలా వుంటే అలా జరుగుతుంది..అంతగా స్వామివారు చెపుతున్నారు కదా..మన ప్రయత్నం మనం చేద్దాం..మీరే అన్నారుకదా కాలం ఎన్ని మలుపులు తిప్పుతుందో మన జీవితాలను అని..ఆ లక్ష్మీ నరసింహ స్వామి పాదాలను నమ్మి వున్నాము..ఆయన చెంతనే ఈ స్వామివారిని మనం కలిసాము...ఇప్పుడు కూడా ఆ నారసింహుడిదే ఈ భారం.." అని అన్నారు..శ్రీ చెక్కా కేశవులు గారితో కూడా శ్రీ స్వామివారు తపోసాధనకు తమను స్థలం అడిగిన విషయం చెప్పారు శ్రీధరరావు గారు..


ఆ తరువాత మరో రెండురోజుల్లో మళ్లీ మాలకొండ వెళ్లారు శ్రీధరరావు గారు..శ్రీ స్వామివారిని కలిశారు.."అమ్మతో చెప్పావా నాయనా?.." అన్నారు..అవునన్నట్లు తలూపారు శ్రీధరరావు గారు.."మంచిది..అంతా శుభమే జరుగుతుంది.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్ల అనుభవాలు..రేపటినుంచి..



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

*33 - భజగోవిందం

 *33 - భజగోవిందం / మోహముద్గర*

🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑


*భజగోవిందం శ్లోకం:-31*


*గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాద చిరాద్భవ ముక్తః॥*

*సేన్ర్దియమానసనియమాదేవం  ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్ ॥భజ॥  31*


*ప్రతి॥* గురుచరణాంబుజ = గురుచరణములనే కమలాలపై; నిర్భరభక్తః = ఎక్కువైన భక్తి కలిగివాడు; స+ ఇన్ర్దియ = ఇంద్రియములూ; మానస = మనసూ; సంసారాత్ = చావుపుట్టుకలనుండి; ముక్తః = ముక్తుడవు; భవ = అగుదువు గాక; నిజ = నీయొక్క; హృదయస్థం = హృదయాంతరాళంలో వున్న; దేవమ్ = దేవుని; ఏవమ్ = ఈ విధంగా; ద్రక్ష్యసి = చూచెదవు గాక.


*భావం:-*


గురుచరణ సేవారతుడవైన ఓ భక్తుడా! నీ జ్ఞానేంద్రియములూ మన స్సులను క్రమ శిక్షణలో పెట్టడం ద్వారా యీచావు పుట్టుకలనే సంసారం నుంచి విముక్తుడవు అగుదువుగాక. అప్పుడు నీ హృదయంలోనున్న పరమే శ్వరుని ప్రత్యక్ష పరుచుకొందువు.


*వివరణ:-*


సాధకుని యాత్రలోని ఎత్తుపల్లాలు తేలికగా సమానం చేయగలగాలంటే విశ్వాసం గురుభక్తి రెండూ అవసరం, మానవ హృదయంలో 'నమ్మిక” అనేది అతడి లో శక్తి నుద్భవింపజేయటానికి రహస్యమైన బలమైన ఆధారం, 'సెంట్ అగస్టిన్' అనే ఆయన విశ్వాసము అనేదాన్ని యిలా నిర్వచించి చెప్పాడు, విశ్వాసము అంటే నీవు ప్రత్యక్షంగా చూడలేని దానిని నమ్మటం, దాని ఫలితం నీవు నమ్మినదాన్ని ప్రత్యక్షం చేసుకోవటం అని.


గురువుచెప్పిన సూత్రము వెనువెంటనే తెలిసికొనలేముగాక, కాని ఆయన ఉపదేశములలోని తర్కము మన జ్ఞానలేశంచేత సూత్రమును తెలిసికోవటానికి సహాయం చేస్తుంది. ఇదమిత్థమని తెలియనప్పుడు కూడ ఆయన చెప్పిన ఒకానొక ఆశయ మును నమ్మటం అందుకనే తప్పనిసరి అయివుంటుంది. అందుచేత "విశ్వాసము" లేదా "నమ్మిక” అంటే యేమిటంటే వచే జ్ఞాన వశంచేత ఇంకా తనకు ప్రత్యక్షంకాని విషయం గూర్చి తెలిసీ తెలియనట్లుగా నున్న స్థితిలో నమ్మకమనేది హృదయంలో వున్నప్పుడు ఆ నమ్మకమే "విశ్వాసము'' అనాలి. 


ఈ ‘విశ్వాసము' అనే దానికున్న రహస్యమైన శక్తి. మనిషిని సునాయాసం గా తన రెక్కలమీద నెక్కించుకొని, అతడి గమ్యస్థానానికి ప్రత్యక్ష దర్శనం కలిగించటానికి తీసికొని పోతుంది. విశ్వాస రహితుడైన శిష్యుడు - వట్టిగా బజారులపై తిరిగే అంధుడు - బధిరుడు - ఒక ప్రక్క తన శరీరం నిర్జీవమై పోయినట్టివాడున్నూ అనవచ్చు.


శంకరులు తన శిష్యులనూ అంతే కాకుండా తన కాలంనుంచి అనంతమైన యీ కాలం వున్నంతవరకూ ఏ యే శిష్యులయితే వుండబోతారో ఆ శిష్యులందరనూ ఆశీర్వదిస్తున్నారు. మీరీ చావు పుట్టుకల సంసారం నుంచీ బయటపడి పోతారుగాక అని.


ఈ ముక్తి ఎప్పుడో ఎక్కడో దూరాన జరిగే పనికాదు, ఇక్కడి కిక్కడ ఇప్పటి కిప్పుడు జరిగేపని, అద్వైతమూర్తి తిరిగి శిష్యుని ఆశీర్వదిస్తూ చెప్పారు, "నీ జ్ఞానేంద్రి యాలు మనసూ క్రమశిక్షణ పొందటం ద్వారా నీ హృదయంలో నున్న ప్రభువునే నీవు ప్రత్యక్షం చేసికొంటావుగాక" అని. 


నిష్కపటమైన స్తుతి, ప్రపత్తి పూర్ణమైన సమర్పణం గురువును గూర్చి చేయ టమే అభ్యసించాలి. శిష్యుల కొక్కరికే కాదు యీ పాఠం, గురువులయిన వారికి కూడా యిదే ఆజ్ఞ. ఈ శ్లోకంలో చెప్పేటప్పుడు శంకరులు బహుశ తన గురుదేవులకు సాష్టాంగపడి నమస్కరించి వుంటారు. ఎందుకంటే- ఆయన గురువుల పేరు గోవిందా చార్యులవారు ఈశ్లోకం చెప్పగానే భజగోవిందం భజగోవిందం అని పల్లవి అందుకునే టప్పుడు తన గురువులను ధ్యానించి, నమస్కరించి వుంటారు, తప్పదు.


ఉపనిషత్తులలో కూడ గురవు వుండవలసిన అవుసరం ఎంతో ముఖ్యమని చెప్పబడింది. ముండకోపనిషత్తులో గురువు యొక్క గుణగణములెలా వుండాలో విహితమయింది. తిరిగి ఛాందోగ్యోపనిషత్తులో గురువు లేకుండా ఆధ్యాత్మికాభివృద్ధి కలిగించుకొనే అవకాశం కించిత్తు కూడా లేదని చెప్పి అలాటి అవకాశాన్ని విచ్ఛిన్నంచేసి పడేశారు. *"ఆచార్యవాన్ పురుషా వేద”* ఆచార్యుని కలిగియున్నవాడే పరమ పురుషుని గుర్తింపు చేయగలగటం ముక్తిని పొంద గలగటమున్నూ అని.


సా గురుమేవాభి గచ్చేత్, సమిత్పాణిః, శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం----ముండకోపనిషత్తు--(

1-11-12)



గురువులకు నమస్కరించటం అనే దానితో ఓయీ! వేదాంత విషయికమైన క్రోడీకరింపు కలిగిన యీ ప్రక్రియా స్తోత్రము ముగింపు అవుతుంది. - భజగో విందమ్ భజగోవిందమ్ అంటూ,


భజగోవిందము అనేది శ్రీశంకరుల రచనల్లో ఒకానొక చిన్న రచనగా పరిగణించబడుతోంది. ఆధ్యాత్మిక గురువులందరూ కూడ తమకు ప్రత్యక్షానుభూతి కలిగిన క్షణాల్లో పరమోత్కృష్టమైన సత్యపదార్థాన్ని అతి చిన్న వాక్యాల్లో విడమర్చి చెప్పటం అల వాటు. పెద్ద పెద్ద వ్యాకరణ శాస్త్రాలు చదివిన పండితులు యిలాంటి రచనలను చిన్న రచన అని ప్రక్కకు నెట్టటం కూడ మామూలే.


ఈ స్తోత్రంలో వుపయోగింపబడిన పదములు యెంతో సర్వసాధారణమైనవి అవటం వల్లనూ, పాటలోని చక్కని ఫణితివల్లనూ, అందులోని సంగీత మాధుర్యము వల్లనూ, ఈ స్తోత్రము కలిగించే విషయ వాతావరణము వల్లనూ, గుమిగూడి అనేక మంది పాడటంవల్ల కలిగే ఉధృతమువల్లనూ దేశంలో భజగోవింద స్తోత్రము యెంతో ప్రాపకమునకు వచ్చినది. మొన్నమొన్నటి వరకూ కూడ బజారుల్లో అనేకమంది దీనిని పాడుతూ వుండటం భారతదేశం అంతటా కూడ వింటూ వచ్చాం. పసివాళ్ళు పెదాలు కదిల్చి పలుకుతారు.


శైశవంలో వున్నవాళ్ళు ఉరిమినట్లు కదం త్రొక్కుతారు. జ్ఞానవంతులు దీజ అర్థంచేసికొంటారు. వేదాంతులు దీనిని పాడి సంతోషించుతారు. సాధకులు దీనిలోని ఉపదేశాన్ని ఉపయోగించుకొంటారు. తమ జీవితాలను సఫలం చేసుకొంటారు.


అనేకమంది జనులచే పాడబడి ఉపయోగించబడినప్పుడు కొద్దికాలము మాత్రమే గాక పదిశతాబ్దాలనుంచి దేశమంతా అలా జరుగుతున్నప్పుడు ఆ పాటకు చిలవలు పలవలు పుట్టటం కద్దు. ఈ స్తోత్రం అచ్చయిన ప్రచురణల్లో యే రెండూ ఒకే విధంగా లేవు. వాటన్నిటినీ చూసి అత్యంతమైన వాస్తవాన్ని వ్యక్తీకరించటానికి యేవి ఎక్కువగా సహాయపడుతున్నాయో పాఠాలు తీసికొని యిక్కడ సమకూర్చటమయింది.


ఈ కవిత్వంలో ముప్పది యొక్క శ్లోకాలున్నవి. మొదటి శ్లోకం పల్లవి, సామూహిక సాధనల్లో దాన్ని పల్లవిగా అందరూ కలిసి పాడతారు. ఎవరో ఒకానొకరు లేదా కొందరు మాత్రం ఇతర శ్లోకాలు ఒకటొకటిగా పాడుతూ వుంటారు. మొదటి పన్నెండు చరణాలున్నూ (2-13) ఆదిశంకరులు చరించినవని ప్రసిద్ధము. ఆ తరువాత వచ్చే పదునాలుగు శ్లోకాలున్నూ (14-27) శ్రీ శంకరుల శిష్యులు పదునాల్గురు

ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్పినట్లు చెప్తారు. వాళ్ళు శ్రీ శంకరులు కాశీయాత్ర చేసినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన శిష్యులు.


వాస్తవంగా చెప్పాలంటే ఈ పదునాలుగు శ్లోకాలు ఎవరెవరేది రచించారనే విషయానికి సాక్ష్యమేదీలేదు. కాలమనే తుఫానులో కలిసిపోయి సాక్ష్యమనేది తుడుచుకు పోయింది. ఫలాన ఫలాన శ్లోకం ఫలాన ఫలాన వారిదని అను శ్రుతిగా చెప్పే సాక్ష్య మొక్కటే, మిగిలింది.


చివరి నాలుగు శ్లోకాలున్నూ ఆచార్య శంకరులే రచించారని ప్రతీతి. అత్యంత ముఖ్యమయిన వేదాంత విషయాలను ప్రకటించిన ఈ స్తోత్రం అందుకు తగినట్లుగా శ్రీ శంకరుల ఆశీర్వచనాలతో ముగింపు చేయబడింది. సాధకులను ఆశీర్వదించటం ఎంతో తగివుంది.


ఆ పరమేశ్వరుని ఆశీర్వచనములు నిరంతరం మనందరిపై ప్రసరించుగాక!


*హరిః ఓం తత్ సత్!!*

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

*31- భజగోవిందం

 *31- భజగోవిందం / మోహముద్గర*

🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇


*భజగోవిందం శ్లోకం:-29*


*అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యమ్|*

*పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితారీతిః॥ భజ ॥ 29.*


*ప్రతి॥* నిత్యం = ఎల్లప్పుడూ; అర్థం = ద్రవ్యము; అనర్థం = దుఃఖ కరమైనదని; భావయ = తెలిసికో: (ఎందుకనంటే) తతః = దాని నుంచి; సుఖలేశః = కించిత్తు సుఖం కూడ; నాస్తి= లేదు (ఇది); సత్యమ్ = సత్యమైనది; పుత్రాదపి = పుత్రుడి నుంచి కూడ; ధనభాజాం = ధనముకలిగిన వానికి; భీతిః = భయమే ( (దాపురిస్తోంది); సర్వత్ర = అన్నిచోట్లకూడ; ఏషా = ఈ; రీతిః = విధము; విహితా = శాసించబడే వున్నది.


*భావం:-*


ద్రవ్యమనేది దుఃఖాన్నిచ్చేదని ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకో. దాని నుంచి కించిత్తుకూడ సుఖం వుండ దన్నమాట సత్యం. ధనం కలిగిన వానికి తన స్వంత కుమారుడి నుంచీ కూడ భయమనేది కలుగు తూనే వుంటుంది. అన్నిచోట్లా కూడ ఈ ధనం నడిచే పద్ధతే అలాంటిది.


*వివరణ:-*


వెనుకటి శ్లోకంలో బోధకుడు చెప్పినట్లు మనలోని నికృష్టమైన స్వభావాలు మహత్తర బలమైనవై మనం వాటిని జయించలేనివే అయితే వేదాంతమూ తత్సంబంధమై ఊహలు కూడ వట్టి స్వప్న తుల్యములన్నమాట. భయంకరమైన నల్లమందు మగతలో చూచే భ్రమాత్మక దృశ్యాలు మాత్రమే ననాల్సి వుంటుంది. ఏ శాస్త్రవేత్తైనా ఎదుట నున్న పరిస్థితులను చూస్తాడు. అవి ఎలా గోచరిస్తుంటే అలా వాటిని గ్రహిస్తాడు. ఆ తరువాత ప్రపంచాన్ని వాటిదృష్ట్యా అభివృద్ధిలోకి తేవటం ఎలాగా అనీ, జీవితమునకు వాటినుప యోగింపజేయటం ఎలా అని ఆలోచిస్తాడు. అందుకనే యీ శ్లోకంలో రెండు విషయాలను గూర్చి ముచ్చటించారు. అందరికీ తెలిసినవే. ధనందాని పరి ణామం.


ఆలోచన చేయగలిగిన ప్రతి మనిషి జీవితం ఉన్న విధంగానే వుండి పోటంతో తృప్తి పడడు. దుఃఖాన్నిచ్చే దేదయితే వుందో దాన్ని పగలగొట్టి తీసి పారేసి తిరిగి మళ్ళీ ఒక సుఖాల దేవాలయం కట్టెయ్యాలని ప్రయత్నిస్తాడు. కాని మాయవంటిదేదో యీ డబ్బు విషయంలో బాగా గోచరిస్తుంది. డబ్బు అనేది యేదైన కొనటానికి- పొందటానికి తగును గాక, అంత మాత్రమైన విలువే దానికిచ్చి నట్లయితే దిగులు లేదు. కాని దానికి అంతే విలువనిచ్చి వూరుకొనలేము గదా! డబ్బు అనేది మనుష్యుని వల్లనే కనిపెట్టబడినదైనా గాని మనిషినే అది ఒక బానిసగా చేస్తోంది. ఈనాడు డబ్బే తెలివిలేని మనుష్యుల్ని పాలించి ఆడిస్తోంది! ఇక్కడ గురువు శిష్యులకు ద్రవ్యం దుఃఖకరమైనదన్న విషయం నిరంతరం చింతించవలసినదని బోధిస్తున్నారు. ధనం కొఱకు మొత్తం జీవితమంతా వ్యర్థం చేయటమవుతోంది! పై చెప్పిన విధంగా నిరంతరం చింతిస్తుంటే ఒకానొక నాటికి ఆ డబ్బు యొక్క వశీకరణశక్తి అంతరిస్తుంది. దాని వశంలో పడి పోయిన వారిలో, ప్రేమ రాహిత్యము, ఇతర్ల నసహ్యించుకొనటము, నికృష్టమైన పశుతుల్యమైన అట్టడుగు భావాలు డబ్బుపిచ్చి అన్నీ ప్రబలుతాయి.


చిత్రము! డబ్బు మనని క్షణంలో విచిత్రంగా మార్చేస్తుంది! నీకు ఏమీ లేనప్పుడు కొంత డబ్బు సంపాదించాలని బాధపడతావు. అది సంపాదించి పెట్టుకున్నప్పు డు అంతకంటే ఎక్కువ కలిగిన వారిని చూచి అసూయ పడతావు. తక్కువ గలిగిన వారి ఎదుట మహాగర్వపడతావు. పోనీ యింకా కొంచెం డబ్బు గడించావనుకో-ఈ అసూయ యీ గర్వం తగ్గుతవా ? తగ్గవు సరికదా గర్వం శక్తి మంతమయినవై వూరుకొంటవి. పైగా చాల అసంగతమైన అనుమానాలు నీ బుర్రలో రేకెత్తుతయి డబ్బులేనివాళ్ళంతా నిన్ను మోసం చేసి నీ డబ్బు కాజెయ్యాలను కొంటున్నారని నీవనుకొంటావు. నిన్ను బంధిపోటు చేశెయ్యాలని వాళ్ళనుకున్న దనుకొంటావు. వాళ్ళంటే యెన్నో భయాలు నీ అంతరాంతరాల్లో లేసి నానా చీకాకు పడుతూ వుంటావు.


“అర్థం” అనేది క్షేమమయిందికాదు. అపవిత్రుడైనవాడు ధనవంతుడయితే అతడి కుమారునినుంచీ కూడ అతడు భయపడుతూనే వుంటాడు. అని ఆచార్య శంకరులు అంటున్నారు. అందుకనే నీమనుస్సు కోణాల్లో ఎక్కడయినాసరె ఈ సంగతి నిరంతరం దాచిపెట్టుకో - ఏమనంటే- డబ్బు దుఃఖకర మైనటువంటిది అనే విషం డబ్బును తగినంతమేర వుంచుకో. ఉపయోగించేసెయిదాన్ని, డబ్బే నిన్ను ఉప యోగించుకొనే స్థితిలో వుండకు. డబ్బుకోసం నౌకరీ చేయకు. జీవనం కోసం మాత్రమే నౌకరీ చెయ్యమని ధ్వని. డబ్బును సంపాదించి నీ అధీనంలో వుంచుకొంటేనీకుపయోగించేదిగా చూసుకొంటే- అది సమంజస మైనదే. ఆ డబ్బు అనేది నున్న ఆడించి వేస్తుంటే అదే నిన్ను తన అధీనంలో పెట్టుకొంటే అది ఒకశాపంగా తెలుసుకో. నీకది సుఖలేశమైనా యివ్వది. ఇది సత్యమైన మాట డబ్బు యొక్క పద్ధతే అంత.


*సశేషం*

🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑

మగాన్నై పుట్టాక

 రచన : పూదత్తు కృష్ణమోహన్ 

శీర్షిక : మగాన్నై పుట్టాక 

తేది : 19-11- 2022

పురుషుల దినోత్సవ సందర్భాన


మగ పుట్టుక పుట్టాక 

జీవిత గమనంలోని 

గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాక 

పుట్టడం తోనే మగపిల్లాడు 

అని పండుగ చేస్కుని 

ఆపై మగాడిపై సమాజం 

కుటుంబం ఉపాధ్యాయుల 

ఆరల్లు , ఆంక్షలు , ఆర్దర్లూ 

మగ పిల్లాడివి అంటూ 

భయపడడానికి కూడా 

అవకాశమివ్వక భయపెట్టిన 

అమ్మానాన్నలు 

బాధ కల్గినా ఏడవడానికీ 

ఛాన్స్ ఇవ్వక అమ్మాయిల్లా 

ఏదుస్తారా అని 

మా గుండెల మెమొరీ కార్డ్ ను 

బాధలమయం చేసీ 

మగాడివి బయట తిరగాలి 

అంటూ మెచ్చుకుంటూనే 

బండెడు చాకిరీ చేయించీ 

చదువుల్లో మాత్రం ఆడ పిల్లలతో 

పోల్చేస్తూ 

వాళ్ళను జూసైనా సిగ్గు దెచ్చుకో 

అని మా ఆత్మాభిమానాన్ని 

ఆసాంతం కాల్చేస్తూ 

బాల్యం నుండే బంధనాలు వేసీ 

మమ్ముల పుస్తకాల పురుగులను జేసీ 

ఉద్యోగం పురుష లక్షణం అని 

బాకాలూది బ్యాగూ లగేజీ సర్దేసి 

ఇంటి నుండి వెలివేసాక 

సరదాలన్నీ వదిలేసీ 

పోటీ పరీక్షల పని బట్టి 

ఉద్యోగం సాధించాకైనా 

మాపై ఇక మీ వత్తిల్లు 

తగ్గుతాయని సంబర పడ్డాం 

కానీ మూణ్ణాళ్ళ ముచ్చటయింది

కొందరేమో ఇక పెళ్ళి జేస్కోని 

వంశం నిలబెట్టమనీ 

కొందరేమో అప్పుడే పెళ్ళేంటి 

మినిమమ్ పదేల్లైనా సంపాదించు 

పది పైసలు వేనకేసుకొని 

ఆపై పెళ్ళి జేసుకోమని 

అప్పుడే పెళ్ళాం తో కులుకుదామనే 

అమ్మా అయ్యల జూస్కోవాని 

ఆశల పూలపై నిప్పులు పోసీ 

ఆపై కొంత కాలానికి పెళ్ళి జేసీ 

పిల్లలకై తొందర తొందర జేసీ 

ఇక మా జీవితాల్ని ఆడవాళ్ళకు 

అంకితం జేసీ 

షాపింగ్లు మ్యాచింగ్ లు 

చీరలు సారెలు పండుగలు పబ్బాలూ అని 

పర్మినెంట్గా ఫిక్సింగ్ జేసీ 

చంటి పిల్లల బాగోగులు మేమూ 

చూడాల్సిందేనని బ్రెయిన్లు వాషింగ్ జేసీ 

డైపర్లతో డైటింగ్ చేస్తూ 

లాలి పాటలు పాడుతూ 

సంసార భారాన్ని గుండెల 

నిండా మోసేస్తూ 

కొడుకుగా అన్నగా భర్తగా తండ్రిగా 

ఉద్యోగిగా మిత్రునిగా 

ఆకాశంలో సగం కాదు 

బాధ్యతల్లో బ్రహ్మాండమై 

సంపాదనలో ఒళ్ళంతా హూనమై 

ఆరోగ్యంతో సమరం చేస్తూ 

పిల్లల భవితకోసం మా కోర్కెలన్నిటికీ 

మంగళం పాడీ

సమస్త మానవాళి సంక్షేమం కోసం 

వెలుగుతున్న భూలోక సూర్యుడు 

మగాడు ! 

అవును మగాడు మగాడే 

పంటి బిగువున బాధ దాచెడి వాడు 

సమస్యల సునామీని గుండెల్లోనే 

బంధించిన బాహుబలి 

ఆడాళ్ళకు సమానంగా 

పిల్లల బాధ్యత మోస్తున్న 

11వ అవతారి 

కావలసినంత గుర్తింపు దొరకని 

అమాయకపు అబ్బురం 

 ' మగాడు ' 

ఇక నైనా మగాడి గొప్ప తనాన్ని 

పొగడక పోయినా 

కనీసం గుర్తిస్తారని ఆశిస్తూ . . 

 *మీ పూదత్తు కృష్ణమోహన్* 

 *సైకాలజిస్ట్ , స్కూల్ అసిస్టెంట్* *తెలుగు జి పఉప* *ఘనపూర్*

పండ్లబుట్ట

 🌿 *పండ్లబుట్ట కథ* .🌿


 *శ్రద్ధగా చదవoడి...* 


జస్ట్ 5 నిమిషాలకంటే ఎక్కువ టైం పట్టదు చదివి అర్థం చేసుకోడానికి..!!


*అరటిపండును తొక్క తీసేసి తింటాం.


*సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం.


*సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని...

పై తొక్కతో పాటు

లోపలి గింజలు కూడా వదిలేస్తాం.


*ఆపిల్ లో గింజలు తీసేసి, 

మొత్తం తింటాం.


*జామ పళ్ళని మొత్తం తినేస్తాం.


*ఇలాగ మనం ఒక పండులో టెంకని,

 ఒక పండులో గింజని, 

ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం.


*ఒక్కోటి ఒక్కో రుచి.

తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. 

అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే. 


*అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు. 

మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే. 


*అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు.


*కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, 

అందరు ఒక్కో రకం పండు లాంటివారు...

ఒకొక్కరిది ఒక్కో స్వభావం... 

అయితే అందరూ, 

పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే...

అయినా కానీ మనిషి స్వభావం విషయంలో వాళ్ళు మనకోసం చేసిన మంచి కంటే , వాళ్ళు అప్పుడప్పుడూ మనమీద చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది. 


పండులో అక్కర్లేని గింజ, తొక్క,తొడిమ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా!!?

కొన్నిపండ్లు మనకు నచ్చనివి కూడా ఉండొచ్చు..

వాటి జోలికి పోకుండా వదిలేస్తాం తప్ప..చిరాకుపడo కదా!!?


*పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం..

ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం..


*కుటుంబమంటే - 

అన్ని రకాల పండ్లతో నింపిన పండ్లబుట్ట!!

కుటుంబ స్థితిగతులను..

అర్థం చేసుకుంటూ, 

ఒకరికొకరు సహకరించుకుంటూ, కలిసిమెలిసి ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎవరికివారే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ సున్నితంగా కుటుంబాన్ని manage చేసుకోవాలి తప్ప..

ఓకే ఇంట్లో ఉంటూ రాగద్వేషాలకు తావిస్తూ..

శత్రువుల్లా మారకూడదు ఎప్పటికీ..!!

ఊరికేనే మారిపోడు

 🙏💐 జై శ్రీ రామ్ శుభదినం 🙏💐ఎవరైనా నీ పరపతికి భంగం కలిగించి నిన్ను క్రిందికి లాగాలని ప్రయత్నిస్తే నువ్వు పెద్దగా బాధపడకు వాడు నీ కన్నా క్రింద ఉన్నాడు కనుకే నిన్ను లాగాలని చూస్తున్నాడు. ఆలాంటి వాడు ఎప్పుడూ నీ కంటే కిందే ఉంటాడు.

👉ఒక మనిషి ఊరికేనే మారిపోడు

వాడి వెనుక ఉన్న భాధ వాడి చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన వాడిని మార్చేస్తుంది.

జై శ్రీ రామ్ కంచర్ల వెంకట రమణ

కార్తీక పురాణం*_🚩 _*25 వ అధ్యాయము*_

 🕉️🌹🪔🛕🪔🌹🕉️

     🌹 *మంగళవారం*🌹

🕉️ *నవంబరు 26, 2024*🕉️


🚩 _*కార్తీక పురాణం*_🚩    

   _*25 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*దూర్వాసుడు అంబరీషుని శపించుట*


☘☘☘☘☘☘☘☘☘


*"అంబరీషా ! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ అనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము"* అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు *"ఓ పండితోత్తములారా ! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విడచుట కన్న , విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును ? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన , జలపాన మొనరించి వూరకుందును"* అని వారి ఎదుటనే జలపానము నొనరించెను.


అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ *"ఓరీ మదాంధా ! నన్ను భోజనానికి రమ్మని , నేను రాకనే నీవేల భుజించితివి ? ఎంత దుర్మార్గము , ఎంత నిర్లక్ష్యము ? ఎంతటి ధర్మ పరిత్యాగివి ? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన , నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు ?   శ్రీ హరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే అవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరియొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా ! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా ! నీ వంశము కళంకము కాలేదా?"* అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు , ముని కోపమునకు గడ గడ వణుకుచు , ముకుళిత హస్తములతో *"మహానుభావా ! నేను ధర్మహీనుడను , నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ , దయా దాక్షిణ్యములు గలవారూ కాన , నన్ను కాపాడు"* డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని *"దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను , రెండవ జన్మలో తాబేలుగానూ , మూడవజన్మలో పందిగాను , నాలుగవ జన్మలో సింహముగాను , ఐదవ జన్మలో వామనుడు గాను , ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను , ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను , ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను , తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను , పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక"* అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా , శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని , తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి *"మునివర్యా ! అటులనే - మీ శాపమనుభవింతు"* నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా , శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి *"బ్రతుకుజీవుడా"* అని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను , దేవలోకమునకు వెళ్లి దేవేంద్రుని , బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని , కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ ఎంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. 


*ఇతి స్కాంద పురాణాంర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యైదవ రోజు పారాయణము సమాప్తము.*


             🌷 *సేకరణ*🌷

          🌹🪔🕉️🕉️🪔🌹

                 *న్యాయపతి*

              *నరసింహా రావు*

        🙏🙏🕉️🕉️🙏🙏

మంగళవారం*🍁 🌹 *26, నవంబరు, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

      🍁 *మంగళవారం*🍁

🌹 *26, నవంబరు, 2024*🌹    

       *దృగ్గణిత పంచాంగం*                  


           *ఈనాటి పర్వం*

    *సర్వేషాం ఉత్పన్నైకాదశి* 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః* 

*కార్తీకమాసం - కృష్ణపక్షం*


*తిథి     : ఏకాదశి* రా 03.47 తె వరకు ఉపరి *ద్వాదశి*

*వారం :మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : హస్త* రా 04.35 తె వరకు ఉపరి *చిత్త*


*యోగం  : ప్రీతి* మ 02.14 వరకు ఉపరి *ఆయుష్మాన్* 

*కరణం  : బవ* మ 02.25 *బాలువ* రా 03.47 తె ఉపరి *కౌలువ*          


*సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 09.30 - 10.30  సా 04.00 - 05.30*

అమృత కాలం  : *రా 09.47 - 11.36*

అభిజిత్ కాలం  :  *ప 11.32 - 12.17*


*వర్జ్యం        : ఉ 10.55 - 12.43*

*దుర్ముహూర్తం  : ఉ 08.32 - 09.17 రా 10.39 - 11.30*

*రాహు కాలం : మ 02.44 - 04.08*

గుళికకాళం      : *ప 11.55 - 01.19*

యమగండం    : *ఉ 09.06 - 10.30*

సూర్యరాశి : *వృశ్చికం* 

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 06.17* 

సూర్యాస్తమయం :*సా 05.32*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 06.17 - 08.32*

సంగవ కాలం    :*08.32 - 10.47*

మధ్యాహ్న కాలం  :*10.47 - 01.02*

అపరాహ్న కాలం : *మ 01.02 - 03.17*

*ఆబ్ధికం తిధి  : కార్తీక బహుళ ఏకాదశి*

సాయంకాలం  :  *సా 03.17 - 05.32*

ప్రదోష కాలం    :  *సా 05.32 - 08.06*

రాత్రి కాలం     :  *రా 08.06 - 11.30*

నిశీధి కాలం      :*రా 11.30 - 12.21*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.36 - 05.27*

________________________________

         🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


           🍁 *జై హనుమాన్*🍁


పంచముఖ హనుమాన్ 

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.

1. తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలనుహరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.

2. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.

3. పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.

 4.   ఉత్తరముఖముగా 

       లక్ష్మీవరాహమూర్తి గ్రహ  

       చెడు ప్రభావాలను 

       తప్పించి, అష్టైశ్వర్యాలు 

       కలుగజేస్తాడు.

5. ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను     ప్రసాదిస్తాడు.


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

          

🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

ఉత్తర కర్ణాటక : షీరాలి

 🕉 మన గుడి : నెం 941


⚜ ఉత్తర కర్ణాటక : షీరాలి


⚜ శ్రీ మహాగణపతి మహమాయ ఆలయం



💠 మహా గణపతి మహమ్మయ్య దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో షిరాలీలో ఉన్న ఒక హిందూ దేవాలయం . 

ఈ ఆలయం  మహాగణపతి మరియు దేవత మహామాయ ( శాంతదుర్గ ) గా అంకితం చేయబడింది.


💠 ఈ ఆలయం గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ సమాజానికి చెందిన కులదేవత ఆలయం  . ఆలయ దేవుడు గౌడ్ సారస్వత్ బ్రాహ్మణ సమాజానికి చెందిన కామత్‌లు, భట్లు, పౌరాణికులు, ప్రభులు, జోయిషీలు, మాల్యాలు, కుడ్వాలు మరియు నాయక్ కుటుంబాలకు చెందిన కులదేవత (కుటుంబ దైవం). 


💠 ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇది 1904లో పునరుద్ధరించబడింది. 


🔆 చరిత్ర 🔆


💠 షిరాలీలో మహమ్మయ్య

మహాగణపతి  మరియు మహామాయ ( దుర్గాదేవి మరియు శాంతదుర్గ అని కూడా పిలుస్తారు) .

విగ్రహాలు గోవాలోని ఎల్లా, తిస్వాడి , గోమంతేశ్వరుడు మరియు దాని అనుబంధ సంస్థలలో ఉన్నాయి . 

గోవాలో ముస్లింల దండయాత్ర సమయంలో (13వ శతాబ్దం), ఎల్లాలోని ఆలయం ధ్వంసం చేయబడింది మరియు విగ్రహాలు దివార్ ద్వీపంలోని గోల్టిమ్-నవేలిమ్ (గోల్తీ-నవేలి) కి బదిలీ చేయబడ్డాయి . 

గోమంతేశ్వరుడు మరియు అనుబంధ దేవతలు ఇప్పటికీ బ్రహ్మపూర్‌లోని ఎల్లాలో ఉన్నారు. 1560లో పోర్చుగీస్ పాలకులు అనుసరించిన శత్రు మత విధానాల కారణంగా, భక్తులు గోల్టిమ్-నవేలిమ్ ఆలయాన్ని నాశనం చేసిన తర్వాత విడిచిపెట్టారు. 


💠 విగ్రహాలను తమతో తీసుకెళ్లలేక, వారు గణేశుడి వెండి తొండం మరియు మహామాయ యొక్క ముసుగులో దేవతల ఉనికిని ప్రార్థించారు. 

వారు భత్కల్ చేరుకున్నప్పుడు , వారు వెంటనే ఆలయాన్ని నిర్మించలేకపోయారు మరియు రెండు చిహ్నాలను ఒక భక్తుడికి చెందిన దుకాణంలో ఉంచారు. తరువాత వారు భత్కల్‌కు ఉత్తరాన కొన్ని మైళ్ల దూరంలో ఉన్న షిరాలీలో ఒక ఆలయాన్ని నిర్మించారు, అది నేటికీ ఉంది. దేవతలను పీటే వినాయక మరియు శాంతదుర్గ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అవి "పేట"లో ఉన్నాయి, అంటే కన్నడలో పట్టణం . 


💠 ఈ ఆలయంలో "మలి" అనే ప్రత్యేకమైన దర్శన సేవ ఉంది. 

మరికొందరు భక్తులు మహాగణపతి మరియు మహామాయ విగ్రహాలను గోల్టిమ్-నవేలిమ్ నుండి ఖండేపర్ మరియు అక్కడి నుండి ఖండోలాకు మార్చారు. 


💠 ఈ రోజు, షిరాలీలోని ఆలయంలో శస్రగణయాగ, రథోత్సవం , గణహోమం మరియు సహస్రచండికాహవనంతో సహా వివిధ పూజలు నిర్వహిస్తారు. 

మార్గశిర శుద్ద నవమి (నవంబర్ లేదా డిసెంబరులో) ఆలయంలో రథోత్సవం జరుపుకుంటారు. 


💠 ప్రస్తుతం షిరాలీ మహా గణపతి మరియు మహమ్మయ ఆలయంలో 125 మంది కులవి (నిర్దిష్ట కుల దేవత కలిగిన కుటుంబం) ఉన్నారని, మొత్తం 6000 మంది వ్యక్తులు ఉన్నారని అంచనా. 

చాలా మంది కులావిలు ఏటా ఆలయాన్ని సందర్శిస్తారు మరియు విదేశాలలో నివసిస్తున్న చాలా మంది కులవి వారు భారతదేశాన్ని సందర్శించిన ప్రతిసారీ ఆలయాన్ని సందర్శిస్తారు. 


💠 ఆలయాన్ని సందర్శించే కులవీరులకు వసతి కల్పించేందుకు ఆలయ నిర్వాహకులు విశాలమైన గదులను నిర్మించారు, అలాగే ఆలయంలో బస చేసే సమయంలో కులవీరులకు ఆహారం కూడా అందిస్తారు


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -70*

 *తిరుమల సర్వస్వం -70* 

*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 9*

గరుడవాహన సేవ* 

*కపిలాక్షం గరుత్మంతం సువర్ణసదృశప్రభమ్* *దీర్ఘ బాహుం బృహత్ స్కంధం వందే నాగాంగభూషణం ||* తిరుమల బ్రహ్మోత్సవాలలో ఐదవనాటి రాత్రి జరిగే గరుడోత్సవం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఉత్సవంలో మలయప్పస్వామివారు ఒక్కరే, వారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో విహరిస్తారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో మిగతా వాహన సేవలన్నీ ఒక ఎత్తయితే, గరుడవాహనం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ వాహనసేవను వీక్షించడానికై తిరుమల క్షేత్రానికి విచ్చేసిన అశేష భక్తజన సందోహాన్ని చూస్తుంటే ఒడలు పులకరించి పోతుంది. *గరుడ గమన గోవిందా! గరుడ గమన గోవిందా!! గరుడ గమన గోవిందా!!!* బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు గరుత్మంతుడు ఉత్సవాలను పర్యవేక్షిస్తూ, ఉత్సవ నిర్వాహకుడైన బ్రహ్మకు సహాయకుడిగా ఉంటాడు. గరుత్మంతుని ఇరు రెక్కలు కర్మ-భక్తికి సంకేతాలు. నాసిక-జ్ఞానానికి ప్రతిరూపం. ఇలా, కర్మ-భక్తి- జ్ఞాన సంయోగమైన వేదమే ఆ గరుత్మంతుని రూపంలో స్వామివారిని మోస్తున్నది. స్వామివారు వేదమయుడు, వేదరూపుడు, వేదవేదాంత వేద్యుడు. కనుక, వేదమే ఆయనను భరిస్తోందన్న మాట. *"ఓం పక్షిస్వాహా!"* అన్న గరుడపంచాక్షరి మంత్రంలో ఐదు అక్షరాలు ఉన్నాయి. కనుక *"పంచవర్ణరహస్యం"* గా పేర్కొనబడే ఈ గరుడోత్సవం, బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు జరగటం శ్రీవారి సంకల్పమే కానీ, యాదృచ్ఛికం కాదు. *"శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం"* అంటూ, శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో కీర్తించబడే సప్తగిరులలో *'గరుడాచలం'* ఒకటి. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రోడ్డుమార్గంలో, వినాయకుని మందిరం సమీపాన, ఓ పర్వతసానువు "గరుడపక్షి" ఆకారంలో కనిపిస్తుంది. కొనదేలిన నాసిక, విశాలమైన నుదురు, రెక్కలు, చెవులు ఈ విధంగా, గరుత్మంతుడి శరీర భాగాలన్నీ ఆ పర్వతశిఖర పార్శ్వభాగాన గోచరిస్తాయి. *"శ్రీనివాసుడు గరుడాద్రిపై కొలువై ఉన్నాడు"* అని చెప్పటానికి ఇంకేం ఆధారం కావాలి? *కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం గరుడాచలమ్ ద్వాపరే శేషాచలం చ వెంకటాద్రి కలౌ యుగే ||* - అన్న సంస్కృత శ్లోకాన్ని బట్టి శేషాచలానికి, త్రేతాయుగంలో గరుడాద్రి అనే పేరు ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌరాణిక మూలాల్లోకి వెళితే, కృతయుగంలో శ్రీమహావిష్ణువు మరో అవతారమైన ఆదివరాహుని ఆదేశం మేరకు వైకుంఠం లోని క్రీడాచల పర్వతాన్ని తెచ్చి, సువర్ణముఖి నది ఉత్తరతీరాన నిలిపింది. 'గరుడుడే'. అందువల్లనే వేంకటాద్రిని గరుడాద్రిగా వ్యవహరిస్తారని మార్కండేయ పురాణం లోని ఈ శ్లోకం వివరిస్తుంది - *వైకుంఠలోకాత్ గరుడేన విష్ణోః* *క్రీడాచలో వెంకటనామధేయః* *ఆనీయ చ సర్ణముఖీ సమీపే* *సంస్థాపితో విష్ణునివాస హేతోః* 

గరుత్మంతుడు తన తల్లి వినతి యొక్క దాస్యాన్ని, క్లేశాన్ని పోగొట్టడం కోసం స్వర్గలోకానికి వెళ్లి అక్కడి వారందరినీ చాకచక్యంగా ఏమార్చి, అమృతభాండాన్ని చేజిక్కించు కుంటాడు. అమృత సేవనంతో జరామరణాలు ఉండవని తెలిసికూడా, స్వయంగా సేవిద్దామనే ప్రలోభానికి ఏమాత్రం లోను గాకుండా, తన తల్లి దాస్యవిముక్తే ఏకైక లక్ష్యంగా కార్యోన్ముఖుడవుతాడు. ఎంతో నిర్లిప్తంగా మాతృకార్యాన్ని నిర్వహించిన గరుత్మంతుని కార్యదీక్ష, త్యాగనిరతి, వినయశీలత, శారీరక దృఢత్వం వంటి మంగళకరమైన లక్షణాలకు ముగ్ధుడైన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోవలసిందిగా శెలవిస్తాడు. అప్పుడు గరుత్మంతుడు కోరుకున్న కోరిక పరమాద్భుతం. అమృతం సేవించక పోయినా జరామరణాలు లేకుండా, తానెంతటి బలవంతు డైనప్పటికీ పరమ వినయ విధేయతలతో విష్ణుమూర్తి సేవ చేసుకునే భాగ్యం కలగాలని కోరుకుంటాడు. గరుత్మంతుని నిస్వార్థ సేవాభావానికి అచ్చెరువొందిన వైకుంఠనాథుడు అతనికి రెండు వరాలిస్తాడు. వాటిననుసరించి గరుడుణ్ణి విష్ణుమూర్తి తన వాహనంగా స్వీకరించి, తన పతాకంపై ఎల్లప్పుడూ గరుడుని చిహ్నం ఉంచుకుంటాడు. *"తాను అత్యంత ప్రీతిపూర్వకంగా అధిరోహించే వాహనం గరుత్మంతుడే"* అని కూడా శ్రీహరి పలుమార్లు పెక్కు సందర్భాల్లో పేర్కొన్నాడు. 

శ్రీమహావిష్ణువు ఆదేశం మేరకు గరుత్మంతుడు శ్రీవారి సన్నిధిలో, సరిగ్గా బంగారువాకిలికి ఎదురుగా, నమస్కారముద్రలో నిలుచుని; భక్తులకు శ్రీవారి దర్శనమార్గాన్ని, విధానాన్ని సూచిస్తుంటాడు. 

శ్రీమహావిష్ణువు వరాలనొసగిన నాటినుండి వైనతేయుడు శ్రీమహావిష్ణువుకు దాసునిగా, ప్రియసఖుడిగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజపటంగా అనేకానేక సేవలు అందిస్తున్నాడు. *దాసో మిత్రం తాళ వృంతం వితానం* *పీఠం వాసో వాహనం చ ధ్వజశ్చ* *ఏవం భూత్వా అనేకథా సర్వథా సః* *శ్రీ శం శ్రీమాన్ సేవతే వైనతేయః ||* 

గరుత్మంతుడు విష్ణువుకు ధ్వజపటం కూడా అవ్వటం చేత బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై, ధ్వజావరోహణంతో ముగుస్తాయి.

ఇప్పుడు, గరుడుని అధిరోహించిన స్వామి వారిని అవలోకిద్దాం. 

స్వామివారు స్వర్ణ కిరీటం ధరించి శోభాయమానంగా దర్శనమిస్తుంటారు. ఆ కిరీటం మధ్య భాగంలో మిలమిలా మెరుస్తున్న పచ్చ, కిరీటానికి వ్రేలాడుతున్న ముత్యాలు, కిరీటానికి పొదిగినటువంటి రత్నాలు; కంఠసీమ యందు కేవలం గరుడోత్సవం నాడు తప్ప తక్కిన సర్వకాల సర్వావస్థల యందు మూలమూర్తికి మాత్రమే పరిమిత మయ్యుండే - శ్రీవెంకటేశ్వరసహస్రనామమాల, మకరకంఠి, లక్ష్మీహారాలు; ఉదరభాగాన మరో అందమైన పచ్చ, దివ్యంగా అలంకరింపబడిన పూలమాలలు ఇలా స్వామి నయనానందకరంగా, భక్తజన రంజకంగా అలరారుతుంటారు. గరుత్మంతుడు కొనదేలిన నాసికతో, పదునైన చేతి గోళ్ళతో, తిరునామాలతో ఓ ప్రక్క వైభవోపేతంగా, మరోపక్క అరివీర భయంకరంగా దర్శనమిస్తారు. 

ఒక్క గరుడసేవలో మాత్రమే శ్రీవారు ఈ ఆభరణాలన్నింటినీ ధరిస్తారు. గరుడసేవలో, ధ్రువమూర్తి అయిన శ్రీవెంకటేశ్వరస్వామికి - ఉత్సవమూర్తియైన మలయప్పస్వామికి వ్యత్యాసం లేదన్న విశ్వాసం కారణంగా, ఆనాడు మాత్రం మూలమూర్తికి అలంకరింప బడే ఆభరణాలన్నీ మలయప్ప స్వామి చెంత చేరుతాయి. *గోదా సమర్పిత సుభాషిత పుష్పమాలాం* *లక్ష్మీహార మణిభూషిత సహస్రనామ్నాం* *మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః* *శ్రీవేంకటాద్రి నిలయో జయతి ప్రసన్నః ||* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 

*ఫోన్ నెంబర్

99490 98406

10-18,19-గీతా మకరందము

 10-18,19-గీతా మకరందము

          విభూతియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


విస్తరేణాత్మనో యోగం 

విభూతిం చ జనార్దన | 

భూయః కథయ తృప్తిర్హి 

శృణ్వతో నాస్తి మేఽమృతమ్ || 


తా:- ఓ కృష్ణా! మీయొక్క యోగమహిమను, జగల్లీలావిభూతులను (ధ్యానింపదగిన వస్తువులను) సవిస్తరముగ మఱల తెలియజేయుడు. ఏలయనగా మీయొక్క అమృతవాక్యములను వినుచున్న నాకు సంతృప్తి కలుగుట లేదు (ఇంకను వినవలయునని కుతూహలము గలుగుచున్నది). 

 

వ్యాఖ్య:- శిష్యునకు గురువాక్య శ్రవణమున ఇట్టి ఉత్కంఠ జనింపవలెను.

____

అ|| అర్జునుని యా వాక్యములనువిని భగవానుడు తన విభూతులను వర్ణింపదొడగుచు, ప్రధానములైనవానిని మాత్రమే చెప్పెదనని తెలుపుచున్నాడు - 


శ్రీ భగవానువాచ :-

హన్త తే కథయిష్యామి 

దివ్యా హ్యాత్మవిభూతయః | 

ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ 

నాస్త్యన్తో విస్తరస్య మే || 


తా:- శ్రీ భగవంతుడు చెప్పెను - కురువంశశ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఇప్పుడు దివ్యములైన నాయొక్క విభూతులను ప్రాధాన్యతననుసరించి (ముఖ్యములైనవానిని) నీకు చెప్పెదను. ఏలయనగా - నాయొక్క విభూతి విస్తారమునకు అంతములేదు. 


వ్యాఖ్య:- భగవానుడు అనంతుడు. కాబట్టి వారి విభూతియు అనంతమైనదియే యగును. కాబట్టి ముఖ్యములైన విభూతులను మాత్రమే వర్ణించిచెప్పుటకు భగవానుడు పూనుకొనుచున్నాడు.

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


*207 వ రోజు*


*నహుషుడు శచీదేవిని కోరుట*


నహుషుడు ఇంద్రుని భార్య శచీదేవిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను మోహించాడు. అతడు దేవతలను పిలిచి " నేను స్వర్గాధి పతిని అందరూ నన్ను చూడటానికి వచ్చారు. కాని శచీ దేవి మాత్రం నా వద్దకు రాలేదు. వెంటనే ఆ సుందరాంగి శచీదేవిని ఇక్కడకు పిలిపించండి " అని ఆజ్ఞాపించాడు. అది విని శచీదేవి భయపడి దేవ గురువు బృహస్పతిని శరణు వేడింది. జరిగినదంతా విన్న బృహస్పతి " అమ్మా! శచీదేవి ఊరడిల్లుము. నీభర్త తిరిగి రాగలడు. నేను నిన్ను కాపాడతాను " అన్నాడు. ఇది తెలిసిన నహుషుడు " నేను కోరిన వనితకు బృహస్పతి రక్షణ కల్పిస్తాడా? " అని ఆగ్రహించగా దేవతలు " దేవేంద్ర పదవిలో ఉన్న మీరు పరస్త్రీలను కోరుట తగదు " అని నచ్చ చెప్పారు. అందుకు నహుషుడు నవ్వి " ఇంద్రుడు గౌతముని భార్యను కామించినప్పుడు ఈ బుద్ధులు మీరెందుకు చెప్ప లేదు? మీరు వెంటనే శచీదేవిని నా వద్దకు తీసుకు రండి " అన్నాడు. దేవతలు మునులతో బృహస్పతి వద్దకు పోయి " గురుదేవా! ఇంద్రపదవిలో ఉన్న నహుషుడు శచీదేవిని కోరడానికి అర్హుడు. కనుక శచీదేవిని అతని వద్దకు పంపి అతని కోపం పోగొట్టండి " అని ప్రార్ధించారు. బృహస్పతి నవ్వి " నహుషుడు శచీదేవిని కోరడమా? అందుకు మీరు అంగీకరించడమా? ఇది లోక హితమా? ఇంతటి మహా కార్యాన్ని ఆచరించ వలసినదే కాని శరణు వేడిన వారిని విడుచుట ధర్మం కాదు కనుక నేను ఆమెను పంపను " అన్నాడు. మునులు " అయితే తగిన కర్తవ్యం ఆలోచించండి " అని అర్ధించారు. బృహస్పతి " ఒక పని చేద్దాము శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళి కొంత సమయం అడుగుతుంది. ఆ తరువాత జరగ వలసినది ఆలోచిస్తాము " అన్నాడు. బృహస్పతి ఆదేశానుసారం శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళింది " నేను ఇంద్ర పత్నిని ఇంద్రుడు ఉన్నాడో లేదో తెలియలేదు. నా మనసు శంకిస్తుంది ఏవిషయం తెలియకుండా తొందర పడకూడదు. నాకు కొంత సమయం కావాలి " అన్నది. నహుషుడు అందుకు అంగీకరించాడు. మునులు రహస్యంగా విష్ణుమూర్తిని కలుసుకుని ఇంద్రుని పాపం పోగొట్టమని అడిగారు.


*శచీదేవి ఇంద్రుని వద్దకు పోవుట*


విష్ణుమూర్తి " ఇంద్రునిచేత అశ్వమేధయాగం చేయించండి అతని పాపం పోతుంది " అన్నాడు. మునులు అలాగే ఇంద్రునిచేత అశ్వమేధయాగం చేయించారు. ఇంద్రుని పాపం పరిహారం కాగానే అమరావతికి వెళ్ళాడు. అక్కడ నహుషుడు అమిత తేజోమయుడై ఉండటం చూసి భయపడి ఎవ్వరికీ చెప్పకనే వెళ్ళి పోయాడు. ఇంద్రుని జాడ తెలియని శచీదేవి కలత పడి ఉపశ్రుతి అనే దేవతను ఆరాధించి ఆమెను సాక్షాత్కరింప చేసుకుంది. ఉపశ్రుతి " అమ్మా శచీదేవి! నేను నీ పాతివ్రత్యానికి మెచ్చి వచ్చాను. నీవు నా వెంట వచ్చిన ఎడల నీ భర్తను చూడగలవు " అని ఉపశ్రుతి శచీదేవిని హిమాలయాలకు ఉత్తర దిక్కున ఉన్న మంజుమంతము అనే పర్వతము వద్దకు తీసుకు వెళ్ళింది. అక్కడ ఉన్న సరోవరంలో ప్రవేశించారు. ఆ తరువాత ఒక తామరపుష్ప కాడలో ప్రవేసించారు. అక్కడ సూక్ష్మరూపంలో ఉన్న ఇంద్రుని చూపి ఉపశ్రుతి " అమ్మా! నీ భర్త ఇక్కడ ఉన్నాడు చూడు " అని చెప్పి ఉపశ్రుతి అదృశ్యమైంది. ఇంద్రుడు ఆశ్చర్యపడి " నేను ఇక్కడ ఉన్నది నీకెలా తెలుసు " అని శచీదేవిని అడిగాడు. శచీదేవి జరిగినది అంతా చెప్పి " నాధా! నీవు నహుషుని చంపి నన్ను రక్షించాలి " అని వేడుకుంది. ఇంద్రుడు " దేవీ ! నహుషుడు ఇప్పుడు నా కంటే బలవంతుడు. దేవతలు ఋషులు అతనికి తమ శక్తులు ప్రసాదించారు. కనుక అతను అజేయుడు. శత్రు శక్తి సంపన్నుడై ఉన్నప్పుడు వేచి ఉండటం రాజనీతి. అతనికి నీ మీద మోహం కలిగింది మనం దానిని అనుకూలంగా మార్చుకోవాలి. నీవు అతనితో సఖ్యం నటించి " నీవు నన్నుపొందాలంటే సప్తఋషి వాహనంపై రమ్మని చెప్పు దానితో అతని పుణ్యం క్షీణించి పతనం కాక తప్పదు. ఆ పై నేను అతనిని జయించడం సులువు " అన్నాడు. అందుకు అంగీకారం చెప్పి శచీదేవి అమరావతికి తిరిగి వచ్చింది. నహుషుడు మరలా శచీదేవి వద్దకు వచ్చి తన కోరిక తీర్చమని అడిగాడు.శచీదేవి " మహేంద్రా! నేను పెట్టిన గడువు ఇంకా మిగిలి ఉంది. ఆ గడువు తీరగానే నీవు సప్తఋషి వాహనం మీద వస్తే నేను నిన్ను వరించగలను " అని చెప్పింది. మోహావేశంలో ఉన్న నహుషుడు ఉచితానుచితాలు మరచి మునులను వాహనంగా చేసుకుని తిరగసాగారు. శచీదేవి " బృహస్పతి వద్దకు పోయి నన్ను నా నాధుని రక్షించండి " అని అడిగింది. బృహస్పతి " శచీదేవీ! చింతించ పని లేదు నహుషుడు ఋషి వాహనంతో శక్తిని కోల్పోతాడు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

చిత్రమయ అంగయాత్ర

 "కాశీలో చిత్రమయ అంగయాత్ర (శ్రీశివ అంగ యాత్ర)" 

 

కాశీఖండంలో చెప్పబడిన మరో మహిమాన్విత యాత్ర ఇది. 

 

⏩ 1) శిరస్సు : కృత్తివాశేశ్వరుడు (చిరునామా: కృత్తివాసేశ్వర్, హరతీర్థ్, వృద్ధ కాల్ వద్ద. [కాలభైరవుని గుడి దగ్గర్లోనే కృత్తివాసేశ్వరుడు, మృత్యుంజయ మహాదేవుడు, రత్నేశ్వర మహదేవ్ మందిరం ఉంటాయి] 

⏩ 2) శిఖా : ఓంకారేశ్వరుడు (చిత్తన్‌పురా, పఠాని తోలా, కోయలా బజార్ రోడ్డు, మకరేశ్వరుని మందిరం ఎదురుగా, అలంపుర) 

⏩ 3) రెండు కళ్ళు : త్రిలోచనేశ్వరుడు (త్రిలోచన్ ఘాట్ దగ్గరలో, మచోదరి) 

⏩ 4) రెండు చెవులు : భారభూతేశ్వరుడు (గోవిందపుర చౌక్) మరియు గోకర్ణ (కోడై కి చౌకీ, దైలు స్ట్రీట్) 

⏩ 5) రెండు కుడి చేతులు : విశ్వనాథుడు మరియు అవిముక్తేశ్వరుడు (విశ్వనాథ్ ఆలయ సముదాయంలో) 

⏩ 6) రెండు ఎడమ చేతులు : ధర్మేశ్వరుడు (మీర్‌ఘాట్, దశాశ్వమేధ సమీపంలో) మరియు మణికర్ణికేశ్వరుడు (మణికర్ణిక ఘాట్ దగ్గర) 

⏩ 7) రెండు పాదాలు : కాళేశ్వరుడు (మృత్యుంజయ దేవాలయ సముదాయం) మరియు కపర్దీశ్వరుడు (పిశాచ మోచన కుండం లేదా విమల్ కుండం) 

⏩ 8) పిరుదులు : జైశేశ్వరుడు (కాశీపుర, కాశీదేవి ఆలయం సప్త్సగర్, వారణాసి) 

⏩ 9) నాభి : మధ్యమేశ్వర్ (దారా నగర్, మైదాగిన్, మధ్యమేశ్వర్ మొహల్లా) 

⏩ 10) కపాలం మరియు శిరో భూషణం : ఆదిమహాదేవుడు (త్రిలోచన ఘాట్, త్రిలోచనేశ్వరుడి ఆలయం వెనుక వీధి), శ్రుతేశ్వరుడు (రత్నేశ్వరుడి ఆలయం దగ్గర, మృత్యుంజయ మందిర మార్గం) 

⏩ 11) హృదయం : చంద్రేశ్వర్ (సిద్ధేశ్వరి వీధి, చౌక్) 

⏩ 12) ఆత్మ : ఆత్మవీరేశ్వరుడు (సింధియా ఘాట్) 

⏩ 13) లింగం : శ్రీగౌరికేదారేశ్వరుడు (కేదార ఘాట్) 

⏩ 14) శుక్రభాగం : శుక్రేశ్వరుడు (కాళికా వీధీ, విశ్వనాథుని ఆలయ వీధిలో) 

 

 ఈ పవిత్ర యాత్ర చేయడం ద్వారా, ఒక వ్యక్తి ప్రమాదానికి గురైనప్పటికీ అతని అంగాలు (అవయవాలు) దెబ్బతినకుండా ఉంటాయి అనేది భక్తుల యొక్క నమ్మకం. ఎవరైతే ఈ యాత్రను సరైన రీతిలో చేస్తారో అతడు మోక్షాన్ని పొందుతాడు. శివ అంగ యాత్ర స్కంద పురాణంలోని కాశీఖండం నుండి గ్రహించబడింది! శివుని యొక్క అవయవాలకు సంబంధించిన లింగాలు పూర్తిగా ఒక్క కాశీలో మాత్రమే ఉన్నాయి. ఈ శివ అంగ యాత్రకు సంబంధించిన అన్ని శివలింగాలు కాశీలోనే దర్శించవచ్చును. 

"ఓం నమఃశివాయ"

*శ్రీ కాళహస్తీశ్వర శతకము

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*చెడుగుల్ కొందఱకూడి చేయఁగఁ బనుల్ చీకట్టు దూ*

*ఱఁగఁ  బాల్పడితిం గాని చరింపరాని నిను నొల్లంజాలుఁ*

*బొమ్మంచు ని ల్వెడలం ద్రోచినఁ జూరుపట్టుకొని నేవ్రేలా*

*డుదుం గోర్కెఁగో రెడియర్థంబులు నాకు నేలయిడవో శ్రీకాళహస్తీశ్వరా!!!*


         *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 101*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! అజ్ఞానినై కొందఱు చెడ్డవారితో కూడి నేను పూర్వము కొన్ని అకృత్యపు పనులు చేసిన మాట నిజమే... కానీ నీ సాన్నిధ్యమును మాత్రము ఎదబాయను... *నీవు నన్ను వద్దని మెడ పట్టుకొని గెంటివేసినా నేను మాత్రము నాకోరిక తీర్చెదవను ఆశతో నీ చూరు పట్టుకొనే వేలాడుతాను... నేను కోరిన కైవల్యమును తీర్చకుండ ఎట్లుండగలవో చూచెదను?* *( నీవు బోళాశంకరుడవు గనుక నిన్నే నమ్ముకొన్న నన్ను విడిచి పెట్టవని నా విశ్వాసము అని కవి భావము ).*


✍️🌹🌷🌺🙏

కార్తీక పురాణం - 26

 _*🚩కార్తీక పురాణం - 26 వ అధ్యాయము🚩*_


🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️


*దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ*


☘☘☘☘☘☘☘☘☘


ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి , మిగిలన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.


ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము , భువర్లోకము , పాతాళలోకము , సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి *"వాసుదేవా ! జగన్నాథా ! శరణాగతరక్షణ బిరుదాంకితా ! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీవక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. శ్రీహరి ! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"* దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి *"దూర్వాసా ! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా ! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో , దేవ , బ్రాహ్మణ , సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని , అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథినై వచ్చికూడ , నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి , నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను ! చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని , పవిత్రతకును చేయదగినదే కదా ? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే ? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని , తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి , దయాశాలి , ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.


అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము , సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి , ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప , యదువంశమున శ్రీకృష్ణునిగను , కలియుగమున బుద్దుడుగను , కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట *"కల్కి"* యను పేరున జన్మించి , అశ్వారూడుండనై పరిభ్రమించుచు బ్రహ్మదోషులనందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను ఈ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వింశోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

తిరునక్కర మహాదేవర్ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 512*








⚜ *కేరళ  : కొట్టాయం*


⚜ *తిరునక్కర మహాదేవర్ ఆలయం*



💠 కొట్టాయం నగరం నడిబొడ్డున ఉన్న తిరునక్కర మహాదేవ ఆలయం  భారతదేశంలోని మధ్య కేరళలో ఉన్న 108 శివాలయాల్లో ఒకటి.  

సుమారు 500 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని తెక్కుంకూరు రాజు నిర్మించారు. 

ఇది వివిధ హిందూ దేవతల యొక్క అనేక ప్రత్యేకమైన శిల్పాలు మరియు కుడ్యచిత్రాలను కూడా భద్రపరుస్తుంది.  


💠 ఇక్కడ శివుని విగ్రహం పరశురామునిచే ప్రతిష్టించబడిందని ఒక నమ్మకం.  

తెక్కుక్కూర్ రాజ కుటుంబం ఈ విగ్రహాన్ని "తిరునక్కర తేవర్" రూపంలో తమ పరదేవతగా భావించింది.


🔆 *చరిత్ర*


💠 తెక్కుంకూర్ రాజ వంశానికి చెందిన ఒక రాజు త్రిసూర్ వడక్కుమ్నాథన్‌కు పెద్ద భక్తుడు. తన రాజభవనానికి సమీపంలో తాలికోట దేవాలయం అనే పెద్ద శివాలయం ఉన్నప్పటికీ, అక్కడ అతను క్రమం తప్పకుండా సందర్శించేవాడు, అతను నెలకోసారి వడక్కుమ్నాథన్ ఆలయాన్ని సందర్శించకుండా సంతోషంగా ఉండలేడు.  ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, అతను తన జీవితాంతం వడక్కుమ్నాథన్ ఆలయాన్ని సందర్శించేవాడు. 


💠 కానీ, సంవత్సరాలు గడిచేకొద్దీ, రాజుకు వృద్ధాప్యం వచ్చింది, మరియు అతను ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయాడు.  దీంతో అతడు దుఃఖంలో మునిగిపోయాడు.  శివుడు అతని ముందు ప్రత్యక్షమై, 

రాజభవన ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న నక్కరక్కును అనే చిన్న కొండలో స్వయంభూ లింగంగా కనిపిస్తాడని, తన ముందు నంది విగ్రహం ఉంటుందని చెప్పాడు.


💠 ఆ తరువాత, అతను తన భూభాగంలో తన ఇష్ట దైవం కోసం ఒక  అతిపెద్ద ఆలయాన్ని నిర్మించాడు, ఆ తర్వాత దీనిని తిరునక్కర మహాదేవ ఆలయం అని పిలుస్తారు 


💠 ప్రస్తుతం ఆలయం ఉన్న నక్కరక్కున్ను అప్పట్లో విశాలమైన అటవీ ప్రాంతం. ఎలాంటి ఇబ్బంది లేకుండా అడవి జంతువులు సంచరించాయి. ఉచితంగా ఇచ్చినా అక్కడ స్థిరపడేందుకు ఎవరూ ఇష్టపడలేదు. 

ఆలయానికి ఈశాన్య భాగంలో త్రిక్కైక్కట్టు మాడమ్ అనే పేరుతో స్వామియార్ మడోమ్ అనే మఠం ఉండేది . 

రాజు శివుని దర్శనం పొందిన మరుసటి రోజు, స్వామియార్ మడోమ్ నుండి ఇద్దరు సేవకులు - చంగజిస్సేరి మూత్తత్తు మరియు పున్నస్సేరి మూత్తత్తు - హోమం (అగ్ని ఆచారం) కోసం కలప మరియు అగ్నిని సేకరించడానికి వెళ్లారు. 


💠 వారు అక్కడ ఒక రాయిని చూసి వారి కొడవలిని గీసారు, కానీ అకస్మాత్తుగా రక్తస్రావం ప్రారంభమైంది. అది స్వయంభూ శివలింగమని వారు వెంటనే గ్రహించారు. 

ఈ వార్త పొగ మంటలా వ్యాపించి, వార్త విని భావోద్వేగాలను అదుపు చేసుకోలేని రాజుగారి చెవులకు కూడా చేరింది. 

రాజు లింగం ప్రతిష్టించిన ప్రదేశానికి వచ్చి, దాని ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. 


💠 దాని ముందు నంది విగ్రహం కూడా అతను కనుగొన్నాడు. ఆ తరువాత, అతను తన భూభాగంలో తన ఇష్ట దేవత కోసం ఒక మహాక్షేత్రం (ప్రధాన ఆలయం) యొక్క అన్ని ప్రధాన భాగాలతో అతిపెద్ద ఆలయాన్ని నిర్మించాడు. 


🔆 *బ్రహ్మరాక్షసులు*


💠 బ్రహ్మ రాక్షసుల వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది . 

మూస్ అనే వ్యక్తి రాజుకు గొప్ప స్నేహితుడు. రాజు తన అందం గురించి తెలియదు కానీ అతని స్నేహితుడు మూస్ చాలా అందంగా ఉన్నాడు. రాజు తన సేవకులను మూస్‌ని చంపమని ఆజ్ఞాపించాడని తెలుసుకున్న రాణి ఈ స్నేహితుడితో ప్రేమలో పడింది. 

అతనిని చంపడానికి బదులుగా, రాజు సేవకులు ఆలయంలోని జూనియర్ పూజారి ( కీజ్ శాంతి )ని చంపారు. పూజారి భార్య బ్రహ్మ రాక్షసురాలిగా మారి ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. 

అందుకే రాజు ఆమెకు గుడి కట్టించాడు. ఆ తర్వాత చాలా కాలం వరకు మహిళలు ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి ఇష్టపడేవారుకారు.


💠 ఆలయానికి మొదటి ప్రవేశ ద్వారంలో ఇటీవల నిర్మించిన గణపతికి ఒక చిన్న ఆలయం ఉంది.

ఈ ఆలయంలో వివిధ ప్రదేశాలలో వివిధ ఉప దేవతలకు మందిరాలు ఉన్నాయి. ఆగ్నేయ ద్వారంలో అయ్యప్ప మరియు గణేశుని విగ్రహాలు ఉన్నాయి .


💠 తూర్పు భాగంలో సుభ్రమణ్య మరియు దుర్గ  మందిరాలు ఉన్నాయి మరియు ఈశాన్య భాగంలో బ్రహ్మరాక్షసుల స్థాపన ఉంది .

ఇది పురాణాల ప్రకారం ఆలయం లోపల హత్య చేయబడిన పూజారి ఆత్మ.


💠 ఈ ఆలయం యొక్క రెండు అంతస్తుల చతురస్రాకారపు శ్రీకోవిల్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. శ్రీకోవిల్‌లో మూడు వేర్వేరు గదులు ఉన్నాయి, పశ్చిమాన గర్భగృహలో శివలింగ విగ్రహం ఏర్పాటు చేయబడింది. దాని పక్కనే పంచలోహముతో చేసిన పార్వతి దేవి విగ్రహం కూడా ప్రతిష్టించబడింది. 


💠 ఈ ఆలయం వార్షిక పది రోజుల పండుగను నిర్వహిస్తుంది, దేవత విగ్రహాన్ని నదిలో లేదా ఆలయ కోనేరులో ముంచడం అనే ఆరాట్టు ఆచారంతో ముగుస్తుంది , ఇందులో అలంకరించబడిన తొమ్మిది ఏనుగుల ఊరేగింపు ఉంటుంది. 


💠 ఈ పండుగ అనేది పార్వతితో శివుని వివాహ వేడుకకి అంకితం చేయబడింది. 

పండుగ సందర్భంగా, సాయంత్రం ఆలయ ప్రాంగణంలో మయిలట్టం మరియు వెలకళి వంటి సంప్రదాయ కేరళ నృత్యాలు ప్రదర్శించబడతాయి. పండుగ సందర్భంగా జరిగే కథాకళి ప్రదర్శనలు మరో ప్రధాన ఆకర్షణ .


💠 కొట్టాయం రైల్వే స్టేషన్ నుండి సుమారు 1.8 కి.మీ మార్గం

తత్తరపాటు లేక

 ఉ.తత్తరపాటు లేక సతతమ్ము సమాజ హితమ్ము గోరి కిం

చిత్తు ప్రయోజనమ్ము తమ చిత్తమునందు తలంప నట్టి, సం

పత్తును గడ్డి పోచగ నపార విచక్షణతోడ నెంచి, కొం

గ్రొత్త విశేష శోధనల గూర్చిన విజ్ఞులు ధన్యులిమ్మహిన్౹౹ 41


శా.విత్తమ్మయ్యది శాశ్వతమ్మని మదిన్ వ్యామోహమున్ జెంది ఉ

న్మత్త భ్రాంతి మదించి నట్టి జనులా మైకమ్ములోఁ గూరి యే

బత్తిన్ చిత్తమునన్ దలంపక,తుదన్ బ్రాప్తించు నంతమ్మునా

మిత్తిన్ వేడిన కావు కావు మనగా, మేలెట్లు చేకూరునో ౹౹ 42

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  - ఏకాదశి - హస్త -‌‌ భౌమ వాసరే* (26.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మంచిమాట

 * మంచిమాట* 


కోపంగా మాట్లాడేవారు గొప్పగా బ్రతకడానికి దారి చూపిస్తున్నారని ఎలా అయితే తెలుసుకోలేమో...

అలాగే నవ్వుతూ నమ్మిస్తూ మాట్లాడేవారు గొంతుకోసే వరకు కూడా మోసం చేస్తున్నారని తెలుసుకోలేము.