9, జూన్ 2024, ఆదివారం

*శ్రీ పంచలింగేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 343*








⚜ *కర్నాటక  :-*


*విట్ల - దక్షిణ కన్నడ ప్రాంతం*


⚜ *శ్రీ పంచలింగేశ్వర ఆలయం*



💠 పురాతన మూలాలు ఉన్న దేవాలయాలను సందర్శించడం మీకు ఇష్టమైయితే, దక్షిణ కన్నడ మీకు సరైన ప్రదేశం. 

అనేక దేవాలయాలు మరియు సందర్శించదగిన ప్రదేశాలు ఉన్నాయి మరియు శ్రీ పంచలింగేశ్వర ఆలయం వీటిలో ముఖ్యమైనది.


💠 పంచలింగేశ్వరాలయం పీఠం లేకుండా నేరుగా నిర్మించబడింది మరియు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. 

ఆలయాన్ని తూర్పు ముఖంగా నిర్మించారు మరియు ప్రతి రోజూ సూర్యుడు ఉదయించే దిశలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందంగా రూపొందించిన నంది ప్రవేశ ద్వారం వద్ద ఉంది. గర్భ గృహంలో ప్రవేశద్వారం వద్ద గణేశుడు మరియు శివుడు, పార్వతి మరియు సుబ్రమణ్య వంటి వివిధ దేవతలు ఉన్నారు.


💠 పంచలింగేశ్వర ఆలయం శివుని భక్తులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర మరియు దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి చెప్పుకోదగిన ఉదాహరణ.


💠 పురాణాల ప్రకారం, పురాతన కాలం నాటి ఏకచక్ర వర్గానికి సమీపంలో కలంజి కొండ అడవిలో బకాసురుని గుహ ఉండేది . 

అక్కడే భీముడు అతన్ని చంపినప్పుడు ప్రవహించిన రక్తం కారణంగా నెత్తురు కొలను ఏర్పడింది .

ఆలయానికి సంబంధించిన స్థానిక పురాణాల ప్రకారం , పాండవులు తమ సంచారంలో శివుడిని ప్రతిష్టించారు. నైవేద్యానికి గత్యంతరం లేకపోవడంతో , నైవేద్యంగా పెట్టిన అన్నం అంత నీరు చల్లినట్లే, నిప్పు పెట్టి నైవేద్యంగా పెట్టడం వల్ల విట్ల దేవుడికి నైవేద్యంగా చెబుతారు. (ఇప్పుడు కూడా వండిన అన్నంలో నీళ్లు చల్లి దీపారాధన చేస్తారని చెబుతారు ) 


🔆 చరిత్ర 


💠 వామదేవ, తత్పురుష, అఘోర, సద్యోజాత మరియు ఈశాన అనే ఐదు లింగాలు ఆలయంలో ఉన్నాయి. శివుడు ఈ పంచ (ఐదు) లక్షణాల స్వరూపుడు. 

ఆలయాన్ని సృష్టించిన ఘనత పాండవులకే దక్కుతుందని చరిత్రకారులు పరిశోధించి తెలుసుకున్నారు.

హెగ్డే రాజవంశం పంచలింగేశ్వరుడిని ఆరాధిస్తుంది మరియు ఇది హెగ్డేల కులదేవతగా భావించబడుతుంది. 


💠 ఈ ఆలయం 10వ శతాబ్దంలో చోళ రాజవంశం పాలనలో నిర్మించబడిందని భావిస్తున్నారు. విజయనగర సామ్రాజ్యం మరియు కేలాడి నాయక రాజవంశం కాలంలో ఇది పునర్నిర్మాణాలు మరియు చేర్పులు జరిగింది.


💠 ఆలయాల పరిమాణాన్ని బట్టి అల్పప్రసాదం, మధ్యప్రసాదం, మహాప్రసాదం, జాతి, వికల్పం, ఛందం అనే ఆరు పేర్లు ఉన్నాయి. 

విట్లలోని శ్రీ పంచలింగేశ్వరాలయం మహాప్రసాద (చాలా పెద్ద గర్భాలయం) ఆలయం .

పంచ లింగానికి ముందు నంది విగ్రహం , నవరంగ మంటపం, వసంత మంటపం ఉన్నాయి. 


💠 కుంతీశ్వరలింగం  పాండవులు

 పూజించిన లింగము.

ఈశాన్యంలో ధౌమ్యేశ్వరుడు మరియు ఆగ్నేయంలో భైరవేశ్వరుడు ఉన్నాయి. 

తూర్పు ముఖంగా దక్షిణ దిశలో గణపతి విగ్రహం ఉంది .


💠 ఏడాది పొడవునా జరిగే పండుగ విట్లాయన మకరసంక్రమంలో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. దాదాపు పది రోజుల ముందు గోనకడి ముహూర్తం ఉంది. మకరసంక్రమంలో మధ్యాహ్నం రాజభవన రాజులు , విలుకాడులు, గ్రామాల ప్రజల సమక్షంలో జెండాను ఎగురవేస్తారు. 

లక్షదీపోత్సవ మొదటి రోజు ఆలయం చుట్టూ చంద్ర దీపాలు వెలిగిస్తారు . 

రెండవ , మూడవ మరియు నాల్గవ రోజులలో రోజువారీ ఉత్సవాలు జరుగుతాయి .


💠 పంచలింగేశ్వర ఆలయం గోవిందనహళ్లి సమీపంలో ఉంది మరియు బెంగళూరు నుండి 168 కిమీ దూరం.


Panchaag


 

మోక్ష సాధనకు సంగీతం

 మోక్ష సాధనకు సంగీతం సోపానం - 06వ భాగం

ఇక మీరాబాయి మొదలైన వారి గురించి చెప్పాలంటే పెద్ద సముద్రం.

ఒకమారు మీరాబాయి తన్మయురాలై పాడుతూ ఉంటె అందరూ వింటూ ఉన్నారు. ఆ మధ్యలో ఒక సంగీత విద్వాంసుడు వచ్చాడు. ఈవిడ పాడుతూ తన్మయంలోకి వెళుతూ ఉంటె "రాగ్ సే గావో, తాన్ సే గావో" అని గోడ మీద వ్రాసి వెళ్ళిపోయాడట. ఆవిడ చూసి అయ్యో అనుకుంది. తరవాత ఒక చిన్న పిల్లవాడు వచ్చి అది చెరిపేసి "ప్రేమ్ సే గావో శ్రద్ధా సే గావో" అని వ్రాసి వెళ్ళాడు. ఆ వచ్చింది కృష్ణపరమాత్మ. ఆ ప్రేమతో పాడుకునేప్పుడు భగవదానుభూతితో, అలా పాడుకోవడం అనేది ఈ మహాత్ములలో కనపడుతూ ఉంటుంది.

తెలుగులో వాగ్గేయకారుల్లో మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గురించి చెప్పుకోవాలి. ఆయన ఆధ్యాత్మరామాయణంపై కీర్తనలు రచించారు. క్షేత్రయ్య పదసాహిత్యం, ఎంత శృంగార భావాలో కానీ అవన్నీ కూడా కృష్ణపరమాత్మతో అనుబంధం పెట్టి చక్కగా చూపిస్తారు. అష్టవిధ నాయికా లక్షణాలు ఇత్యాదులు తెలియాలి. జయదేవుడి గీతగోవిందం కానీ, క్షేత్రయ్య పదసాహిత్యం కానీ పైపైన చూసేవాళ్ళు అదేదో అశ్లీలము అని భావిస్తూ ఉంటారు కానీ అశ్లీలము కాదు, శృంగారము, అది చాలా ఉత్కృష్టం. భావం తెలియాలి, అది గ్రహించితే అన్నమయ్య కూడా శృంగార కీర్తనలు ఎందుకు రచించారో తెలుస్తుంది. పరమయోగులే, విరక్తులే వాళ్ళు ఎందుకు ఇలా వ్రాసారు అని ఆలోచించాలి. వాళ్ళు చూస్తున్న భూమిక వేరు. భరతుడు నాట్యశాస్త్రంలో అష్టవిధనాయికల లక్షణాలు చెప్తాడు, వీటిని ఆధారం చేసుకొని వారి రచనలు ఉన్నాయి. ఒక శాస్త్రబద్ధతతో, సాధనతో రచించారు కనుక ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క శిల్పం.

అష్టవిధనాయికల్లో ఖండిత నాయిక, పోషిత భర్త్రుక ఇటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు అంటే different emotions ని ఇక్కడ అష్టవిధనాయికలుగా చూపించారు. ఈ different emotions తో ఒకే భగవంతుడిని పట్టుకోవడం అనేది ఏదయితే ఉందో దాన్ని వీళ్ళు ఈ కీర్తనలలో చూపిస్తారు. మన సత్యభామని కూడా ఖండిత నాయికగా చూపించారు, ఇది తీస్కుని సిద్ధేంద్రయోగి కూచిపూడి సంప్రదాయంలో భామాకలాపం ఇత్యాదులు రచించాడు. నిజంగా భాగవతంలో మాత్రం సత్యభామ రుక్మిణీదేవి లాగే పతివ్రత, సౌమ్యురాలు. అంతేకానీ ఆవిడ అలగడాలు, కాలితో కిరీటం తన్నడాలు ఇవన్నీ తరవాత వారు సృష్టించినవి. వాటిని ప్రమాణాలుగా తీసుకోకూడదు.

మనిషిలో వస్తున్న రకరకాల emotions ని తీసుకున్నారు. ఈ emotions ఎన్ని వస్తున్నా నీలోపల ఉన్న ఈశ్వరుడి చుట్టూ అవి తిరగాలి. అందుకు అవన్నిటికీ నాయకుడు ఎవరు అంటే అయితే కృష్ణుడు లేదంటే రాముడు. భగవంతుడిని ఎప్పుడయితే నాయకుడిగా పెట్టారో దాని వలన ధీరోదాత్తత వచ్చి మన కళలు భక్తి, ధర్మంతో నిండి గొప్పవి అయ్యాయి.

రామదాసు గారి గురించి చూస్తే ఎంత గొప్ప రచనలు చేసాడు. భజన సంప్రదాయంలో ఆయన చూపినన్ని భావాలు, పైగా భగవదనుగ్రహంతో ఎన్నెన్ని అద్భుతాలు సాధించవచ్చో చూపించారు. ఒకసారి రాముడికి వైభోగం చేసి ఆ వంటలు అందరికీ వడ్డించడం కోసం ఏర్పాటు చేసాడు. ఆ వంటలు మండుతున్న సమయంలో ఆయన కొడుకు ఆ అరుగు మీద నడుస్తూ సలసల కాగుతున్న బాణలిలో పడి ఇంచుమించు మృతప్రాయుడయ్యాడు. ఈయన ఒక గానంలో లీనమయ్యాక తెలిసింది పిల్లవాడికి ఇలా అయింది అని, వెంటనే పిల్లాడిని ఎత్తుకుని రాముడు ముందర పెట్టి "కోదండరామా! కోదండరామా! కోట్యర్కధామా!" అని ఆలాపన చేస్తే వెంటనే పిల్లవాడు తిరిగ బ్రతికాడు. వాళ్ళకి ఎలాంటి శక్తి అంటే, స్వరానికి, అక్షరానికి శక్తి ఉంటుంది, దానికి వీరి తపస్సు కలపడం వలన ఆ శక్తిని జాగృతపరచగలిగారు. అప్పుడు రాగం ఏమైంది? మంత్రం అయింది! మంత్రోపాసనతో చేయగలిగినది రాగంతో చేసారు.

ఇది కాకుండా రామదాసు కీర్తనలలో అనేక సందేశాలు ఉంటాయి. ఎంత విన్నపం, ఎంత ఆర్తి కనపడతాయో!

కొంతమంది వారు అనుకున్నది దొరకకపోతే దేవుడినే మార్చేయడం మనం చూస్తూ ఉన్నాం, మతమార్పిడులు దానివలననే వస్తున్నాయి. అంటే వాడు దేవుడిని వ్యాపార దృష్టితో చూస్తున్నాడు కనుక మార్పిడి అనేది వచ్చింది. కానీ మన సంస్కృతిలో ఆ లక్షణాలు లేవు.

"పాలన్ముంచుము నీట ముంచుము ఇది నీకే భారము" అనాలంట ఎంత దమ్ము ఉండాలి? అంతేకాని నేనెప్పుడూ విష్ణుసహస్రం చదివేవాడిని కానీ పరీక్షలో ఫెయిల్ అయ్యాక మానేసాను అన్నాడట, అంటే, అంత విష్ణువు నీ బంటా? నువ్వు చెప్పినట్లు చేయడానికి! భగవంతుడు ఎటువంటి వాడు? అందుకు ఆయన నుండి ఇటువంటివి ఆశించే భక్తిని చాలా అసహ్యంగా తీసేసారు మన సంస్కృతిలో.

పైగా భారతీయ సంస్కృతిలో నీకు మంచి జరుగుతుంది ఇది చేస్తే అంటూ ఆశ చూపించి పిలవరు, అలా అని మంచి జరగదు అని కాదు, మంచి జరుగుతుంది కానీ నువ్వు అనుకునే మంచి కాదు, ఆయనకి తెలుసు నీకేది మంచిదో, అది మనకి తెలిస్తే నిబ్బరంగా ఉండవచ్చు. నిజంగా రామదాసు స్థానంలో సామాన్యులు ఉంటే ఈపాటికి మూడో నాలుగో మతాలు మారి ఉండేవాళ్ళు. రామదాసు జీవితం చూస్తే, ఏమి సుఖపడ్డాడు? గుడి కట్టాడు, జైలులో పెట్టారు అతనిని.

బ్రాహ్మణ భోజనం

 💐 ఆల్ ఓవర్ ఇండియా శర్మాస్ బ్రాహ్మణ భోజనం 🙏బ్రాహ్మణ క్యాటరింగ్ గ్రూప్ 💐 🕉️ఏదన్నా యాత్రలకు వెళుతున్నప్పుడు  భక్తులకి భోజనానికి ఇబ్బంది లేకుండా మీరు ఏ ఊరు నుంచి అయినా ప్రయాణిస్తున్నట్లయితే ఆ ఊరి వాళ్ళ నెంబర్లు కింద ఇవ్వడం జరిగింది🕉️ వేద పండితులకు ISKCON వాళ్ళకి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇవ్వబడును  విజయవాడ :మోహన్ గారు 7396881404

విజయవాడ:మధువని కేటరింగ్ 9182554800

సికింద్రాబాద్ :ప్రసన్న 9032910106

సికింద్రాబాద్ :రవికిరణ్ 7842413139

సికింద్రాబాద్ కళ్యాణ్

093915 54470

భద్రాచలం శ్వేత గారు+91 80969 19125

చెన్నై తాంబరం శ్రీనివాస్ గారు 073959 32954

బెంగళూరు: ద్రాక్షాయిని 9738979748

బెంగళూరు :శర్మ గారు 9986119510

తిరుపతి :హేమంత్ గారు9959859227

కాకినాడ ;హారి గారు 08142729222

పెద్దపల్లి,రామగుండం.శర్మ గారు..9849259500

సామర్లకోట :దీప్తి 9182285617

వైజాగ్063056 54727

వైజాగ్085010 62405

గుంటూరు:అరుణ్ గారు :7989585295

హార్స్లీహిల్స్(మదనపల్లి )8500145320

షిరిడి అనిల్ గారు 095111 11585

 అరుణాచలం:088702 18670

కేరళ: జై శ్రీ విశ్వనాథన్

096567 77404

కేరళ :లలిత గారు.9447136023

ముంబై: శివరామన్ శర్మ

9174484 08447

మధురై:నారాయణ 9842191826

న్యూఢిల్లీ:ఫణి కుమార్ గారు9650873730

వారణాసి:శైలజ గారు 6387716431

నాగపూర్ 

095056 51387



మీ ఇంట జరిగే,పెళ్లిళ్లకి🌹నోములకు,🌺 భజనలకి🪷 ,వ్రతాలకు,🌸 అభిషేకాములకు 🌺 స్వాములకి భవానీలకు మరియు ఇతర శుభకార్యములన్నింటికి సుచి, రుచితో కూడిన చక్కటి బ్రాహ్మణ భోజనం, బ్రాహ్మణ క్యాటరింగ్ అందజేస్తాము.


దూరప్రాంతాలకు కార్ , బస్సు లలో ప్రయాణంచేసే ప్రయాణికులకు, టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్లకి,శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్పస్వాములకు భవానీలకు,వేద పండితులకు కూడా భోజనం టిఫిన్స్ అందజేస్తాం దయచేసి ఒకరోజు ముందు రోజు తెలియజేయగలరు🙏 ప్రసాదాలు కూడా ఇవ్వబడును


ప్రయాణంలో మన భోజనం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లలో మన బ్రాహ్మణ ఇంటి భోజనం, కేటరింగ్ అందించబడును నలుగురికి ఉపయోగపడే పోస్ట్ దయచేసి తప్పకుండా షేర్ చేయండి*🙏

చిదంబర_రహస్యం

 ₹₹చిదంబర_రహస్యం


ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన,

విశ్లేషణ అనంతరం, పాశ్చాత్య శాస్త్రవేత్తలు,

ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్ర, భూమధ్య రేఖ

యొక్క కేంద్ర స్థానం చిదంబరంలోని నటరాజ స్వామి

పెద్ద బ్రొటన వేలులో ఉన్నది అని నిరూపించారు,


మన ప్రాచీన తమిళ పండితుడు, కవి ’తిరుమూలర్’

ఈ విషయాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితమే

వక్కాణించారు. వీరు రచించిన ’తిరుమందిరం’

అనే గ్రంథం ప్రపంచం అంతటికీ శాస్త్రీయంగా

మార్గ నిర్దేశంచేసే అద్భుతమైన గ్రంథరాజం. వీరి అధ్యయనాలను, విశ్లేషణలను అర్థం చేసుకోవడానికి

బహుశా మనకు మరో వందేళ్లు కావాలి. ప్రత్యేకించి, చిదంబరం ఆలయం ఈ విధమైన లక్షణాలు, విశిష్టతలు కలిగి ఉంది.


1. ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్రం

 భూమధ్యరేఖ యొక్క కేంద్ర స్థానంలో 

ఈ ఆలయం నెలకొని ఉంది.


2. 'పంచభూత' ఆలయాలలో, చిదంబరం-'ఆకాశ' తత్వానికి ప్రతీక, శ్రీకాళహస్తి-'వాయు' తత్వానికి ప్రతీక, శ్రీకాంచీపురం-'భూమి' తత్వానికి ప్రతీక. 

ఈ మూడు క్షేత్రాలు/ ఆలయాలు ఒకే రేఖ పైన,

79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం (79°41') పై నెలకొని ఉన్నాయి,


ఆసక్తి కలవారు ఈ విషయాన్ని గూగుల్ లో పరీక్షించుకోవచ్చును. ఇది ఒక అద్భుతమైన వాస్తవమే కాక, ఖగోళ శాస్త్రంలో కూడా అద్భుతమే,


3. చిదంబర క్షేత్రం మానవ శరీర నిర్మాణం ఆధారంగా నిర్మించబడినది. మానవ శరీరం తొమ్మిది ద్వారాలను/రంధ్రాలను కలిగి ఉన్నట్లే, ఈ ఆలయంలో తొమ్మిది ద్వారాలు ఉన్నాయి.


4. ఆలయంపై కప్పు/విమాన గోపురంలో 21,600 స్వర్ణ పత్రాలు/బంగారు రేకులు ఉపయోగించబడినవి. ఇవి, మనిషి ఒక రోజులో తీసుకునే శ్వాసను సూచిస్తాయి.(15x60x24=21,600,


5. ఈ 21,600 బంగారు రేకులను 72,000 బంగారు మేకులు ఉపయోగించి బిగించ బడినవి. మానవ శరీరంలో ఉన్న 72,000 నాడులకు ఇవి ప్రతీకలు. 

ఇవి శరీరంలోని కొన్ని అదృశ్య భాగాలకు 'శక్తి' ని సరఫరా చేస్తాయి,


6. మనిషి 'శివలింగం' ఆకారానికి ప్రాతినిధ్యం వహిస్తాడని తిరుమూలర్ వివరించారు. అదే 'చిదంబరం' 'సదాశివం'

నటరాజ తాండవాన్ని సూచిస్తుంది.


7. 'పొన్నాంబలమ్' కొద్దిగా ఎడమవైపుకు వంగి ఉంటుంది. ఇది హృదయ స్థానాన్ని సూచిస్తోంది. 

దీన్ని చేరుకోవడానికి ఐదు మెట్లను ఎక్కాలి, అవి, ‘పంచాక్షరి’ ‘పడి’, ‘శి  వా  య  న మః’ అనే పంచాక్షరీ మంత్రం. నాలుగు వేదాలే, నాలుగు స్తంభాలుగా, 

వీటి ఆధారంగా 'కనకసభ’ ఉన్నది,


8. 'పొన్నాంబలమ్' 28 శైవ ఆగమాలకు (28 పూజా విధానములు) సూచనగా 28 స్తంభాలను కలిగి ఉంది. ఈ 28 స్తంభాలు, ఆలయం పైకప్పులోని 64 దూలాలకు (బీమ్) ఆధారంగా ఉన్నాయి. 

ఈ 64, అరువది నాలుగు కళలను సూచిస్తాయి. ఆలయంలోని అడ్డ దూలాలు మనిషి శరీరంలో అంతటా వ్యాపించి ఉన్న రక్త నాళాలను సూచిస్తాయి


9. గర్భాలయంపైన బంగారు విమానంపై ఉన్న తొమ్మిది కలశాలు, తొమ్మిది రకములైన శక్తిని సూచిస్తాయి. అర్థ మంటపంలోని ఆరు స్థంభాలు,

'ఆరు శాస్త్రముల'కు సూచికలు. ప్రక్కగా ఉన్న మంటపంలోని 18 స్తంభాలు, పద్దెనిమిది పురాణాలను సూచిస్తాయి.


10. నటరాజ స్వామి తాండవాన్ని/నృత్యాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు విశ్వ తాండవం/నృత్యంగా పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు దేనిని సిద్ధాంతీకరిస్తున్నదో, దాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే హిందూత్వం వక్కాణించింది.


హిందూ అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం !


🚩సర్వే జనాః సుఖినోభవంతు 🚩


ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన,

విశ్లేషణ అనంతరం, పాశ్చాత్య శాస్త్రవేత్తలు,

ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్ర, భూమధ్య రేఖ

యొక్క కేంద్ర స్థానం చిదంబరంలోని నటరాజ స్వామి

పెద్ద బ్రొటన వేలులో ఉన్నది అని నిరూపించారు,


మన ప్రాచీన తమిళ పండితుడు, కవి ’తిరుమూలర్’

ఈ విషయాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితమే

వక్కాణించారు. వీరు రచించిన ’తిరుమందిరం’

అనే గ్రంథం ప్రపంచం అంతటికీ శాస్త్రీయంగా

మార్గ నిర్దేశంచేసే అద్భుతమైన గ్రంథరాజం. వీరి అధ్యయనాలను, విశ్లేషణలను అర్థం చేసుకోవడానికి

బహుశా మనకు మరో వందేళ్లు కావాలి. ప్రత్యేకించి, చిదంబరం ఆలయం ఈ విధమైన లక్షణాలు, విశిష్టతలు కలిగి ఉంది.


1. ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్రం

 భూమధ్యరేఖ యొక్క కేంద్ర స్థానంలో 

ఈ ఆలయం నెలకొని ఉంది.


2. 'పంచభూత' ఆలయాలలో, చిదంబరం-'ఆకాశ' తత్వానికి ప్రతీక, శ్రీకాళహస్తి-'వాయు' తత్వానికి ప్రతీక, శ్రీకాంచీపురం-'భూమి' తత్వానికి ప్రతీక. 

ఈ మూడు క్షేత్రాలు/ ఆలయాలు ఒకే రేఖ పైన,

79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం (79°41') పై నెలకొని ఉన్నాయి,


ఆసక్తి కలవారు ఈ విషయాన్ని గూగుల్ లో పరీక్షించుకోవచ్చును. ఇది ఒక అద్భుతమైన వాస్తవమే కాక, ఖగోళ శాస్త్రంలో కూడా అద్భుతమే,


3. చిదంబర క్షేత్రం మానవ శరీర నిర్మాణం ఆధారంగా నిర్మించబడినది. మానవ శరీరం తొమ్మిది ద్వారాలను/రంధ్రాలను కలిగి ఉన్నట్లే, ఈ ఆలయంలో తొమ్మిది ద్వారాలు ఉన్నాయి.


4. ఆలయంపై కప్పు/విమాన గోపురంలో 21,600 స్వర్ణ పత్రాలు/బంగారు రేకులు ఉపయోగించబడినవి. ఇవి, మనిషి ఒక రోజులో తీసుకునే శ్వాసను సూచిస్తాయి.(15x60x24=21,600,


5. ఈ 21,600 బంగారు రేకులను 72,000 బంగారు మేకులు ఉపయోగించి బిగించ బడినవి. మానవ శరీరంలో ఉన్న 72,000 నాడులకు ఇవి ప్రతీకలు. 

ఇవి శరీరంలోని కొన్ని అదృశ్య భాగాలకు 'శక్తి' ని సరఫరా చేస్తాయి,


6. మనిషి 'శివలింగం' ఆకారానికి ప్రాతినిధ్యం వహిస్తాడని తిరుమూలర్ వివరించారు. అదే 'చిదంబరం' 'సదాశివం'

నటరాజ తాండవాన్ని సూచిస్తుంది.


7. 'పొన్నాంబలమ్' కొద్దిగా ఎడమవైపుకు వంగి ఉంటుంది. ఇది హృదయ స్థానాన్ని సూచిస్తోంది. 

దీన్ని చేరుకోవడానికి ఐదు మెట్లను ఎక్కాలి, అవి, ‘పంచాక్షరి’ ‘పడి’, ‘శి  వా  య  న మః’ అనే పంచాక్షరీ మంత్రం. నాలుగు వేదాలే, నాలుగు స్తంభాలుగా, 

వీటి ఆధారంగా 'కనకసభ’ ఉన్నది,


8. 'పొన్నాంబలమ్' 28 శైవ ఆగమాలకు (28 పూజా విధానములు) సూచనగా 28 స్తంభాలను కలిగి ఉంది. ఈ 28 స్తంభాలు, ఆలయం పైకప్పులోని 64 దూలాలకు (బీమ్) ఆధారంగా ఉన్నాయి. 

ఈ 64, అరువది నాలుగు కళలను సూచిస్తాయి. ఆలయంలోని అడ్డ దూలాలు మనిషి శరీరంలో అంతటా వ్యాపించి ఉన్న రక్త నాళాలను సూచిస్తాయి


9. గర్భాలయంపైన బంగారు విమానంపై ఉన్న తొమ్మిది కలశాలు, తొమ్మిది రకములైన శక్తిని సూచిస్తాయి. అర్థ మంటపంలోని ఆరు స్థంభాలు,

'ఆరు శాస్త్రముల'కు సూచికలు. ప్రక్కగా ఉన్న మంటపంలోని 18 స్తంభాలు, పద్దెనిమిది పురాణాలను సూచిస్తాయి.


10. నటరాజ స్వామి తాండవాన్ని/నృత్యాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు విశ్వ తాండవం/నృత్యంగా పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు దేనిని సిద్ధాంతీకరిస్తున్నదో, దాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే హిందూత్వం వక్కాణించింది.


హిందూ అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం !


🚩సర్వే జనాః సుఖినోభవంతు 🚩

సమున్నతంగా నిలిచిన వెల్లాయ్ గోపురం

 సమున్నతంగా నిలిచిన వెల్లాయ్ గోపురం ! వెల్ల అంటే సున్నం తెలుగులో ! తెల్లగా ఉంటుంది ! తెల్లగా ఉంటుంది కాబట్టి వెల్లాయ్ గోపురం అని పిలిచారనుకున్నారా ? కాదు !

..

రంగనాథ స్వామి గుడిలోని 20 కి పైగా ఉన్నగోపురాలు అన్ని రకరకాల రంగులలో ఉంటాయి ! ఈగోపురమొక్కటే తెల్లగా ఉంటుంది ! గత 1100 ఏళ్ళనుండీ అదే రంగు ! తెలుపు !!!

...

ఒక మహాతల్లి త్యాగానికి బలిదానానికి కృతజ్ఞతతో మనము పెట్టుకున్న పేరు ! 

...

ఎవరా తల్లి ఏమా కధ ? 

...

కధ పెద్దది సంక్షిప్తంగా చెపుతాను ! 

...

సుల్తాన్ సేనలు శ్రీరంగాన్ని చుట్టుముట్టాయి ! కాఫిర్ల అంతు చూడాలనే పంతంతో వచ్చారు వాళ్ళు ! శ్రీరంగం ప్రజలు ధైర్యంగానే ఎదుర్కొన్నారు ! కానీ విధర్మీయుల పశుబలం ముందు నిలబడలేక ఓడిపోయి 12000 మంది ప్రాణాలు అర్పించారు ! 

...

సేనలు మూలమూర్తిని సమీపించకుండా ఒక దేవదాసి వారికి తన నృత్యంతో కనువిందు చేసింది ! సుల్తానుయొక్క సైనికకమాండరును మాయలో పడవేసి ఆ గోపురం ఎక్కించి ఒక్క ఉదుటున అక్కడినుండి తోసివేసింది ! తానూ వారి చేతికి చిక్కి చావటం ఇష్టం లేక గోపురం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నది ! ఈ సమయాన్ని అక్కడి అర్చకుడు చక్కగా వినియోగించుకొని స్వామిని మధురై తరలించివేశాడు ! ఈ సంఘటన C.E 1323 లో జరిగింది !

..

సుల్తన్ సేనలు దోచిన సొమ్ము 20 బండ్లకు నిండుగా ఎక్కించి తరలించుకు పోయారు !!!

...

ఆవిడే లేకపోతే ? శ్రీరంగం కళతప్పేది ! హంపివిజయనగరం కన్నా ముందే ధ్వంసమయి ఉండేది !!!

...

ఆ మహాతల్లి పేరు "" వెల్లాయ్ ""

...

అమ్మా ! మీ వంటి వారి త్యాగాలే సనాతన ధర్మానికి ఊపిరిపోసి నిలబెడుతూ వచ్చాయి !!!

...

ఆతల్లికి సహస్రాధిక పాదాభివందనాలు !

...

వూటుకూరు జానకిరామారావు

విజ్ఞానం

 హరిఓం , - - విమానం. రైట్ బ్రదర్ లు కనిపెట్టారు అని చెప్పిన వాడు. నీకు అంతకు ముందే పుష్పకవిమానం. వుందని చెప్పలేదు 

టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టిందని పండగ చేసినవాడు. 101 మంది కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీ లే అని చెప్పలేదు. 

3d house అని మురిసిపోయే నీతో .తరాల క్రితం మయసభ వుందని చెప్పలేదు

చదువు విజ్ఞానం అని గొప్పలు పోయె నీకు. మొట్టమొదటి విశ్వ విద్యాలయం భారతదేశం లోదే అని తెలియదు. 

ఆదిమానవుడి గీతలు ఆశ్చర్యంగా చూసే నీకు . అంతకు మునుపే తాళపత్ర గ్రంథాలను రాశారు అని తెలియదు. 

లేజర్ సర్జరీ అని డప్పు కొట్టుకొనే నీకు. సుశ్రుడు చేసిన వైద్యం తెలియదు.

గండు చీమల తో చరకుడు చేసిన శస్త్ర చికిత్స లు తెలియదు. 

ఎందుకంటే.. ఇలాంటి ఎన్నో నీకు తెలియకుండా చేశారు. నీ దేశపు గర్వాన్ని నే చేతితోనే తుడిపించారు. 


ఓ మేధావి. నీకు నిజంగా స్పృహ వుంటే . ఒక్కటే తెలుసుకో 


ఆ బ్రిటీష్ వారి పూర్వీకులు గాడిదల మీద తిరగటం కూడా రాక మునుపే. 

నీ. తాత ముత్తాతలు. గుర్రాలు పున్ చిన రథం మీద. బంగారు నగలు ధరించి తిరిగే వారు. 

వారికి స్నానం తెలియక తోలు చుట్టుకు తిరగక ముందే. నీ తాత ముత్తాతలు. సుగంధ ద్రవ్యాల తో స్నానాలు చేసేవారు....... ప్రపంచంలో నాగరికత పుట్టింది మన దేశంలో..... మన వారసత్వ సంపద అంత గొప్పది ...... - - 🙏🙏 ...... - వలిశెట్టి లక్ష్మీశేఖర్ ... - 98660 35557...... - 09 .06 .2024 ......

ప్రశ్న పత్రం 1/2024

 ప్రశ్న పత్రం 1/2024

కూర్పు చేరువేల భార్గవ శర్మ న్యాయవాది. 

క్రింది ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి సరైన దానిని ఎంచుకోండి. 

1) పెండ్లికి త్రిజేష్ట పనికి రాదు అంటే 

అ ) పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరియు ఆమె తల్లి జేష్ఠమాసములో పుట్టినవారు కాకూడదు.  

ఆ )  పెండ్లి కుమారుడు ఆయాన తండ్రి,  పెండ్లి కుమార్తె  జేష్ఠమాసములో పుట్టినవారు కాకూడదు. 

ఇ )  పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరియు పౌరోషితుడు  జేష్ఠమాసములో పుట్టినవారు కాకూడదు. 

ఈ )  పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరియు పెండ్లి జేష్ట మాసములో  కాకూడదు. 

2)     రావణ బ్రహ్మ కనుగొన్న రాగము పేరు ఏమిటి. 

అ )  శ్రీ రాగము

ఆ )   ఆది తాళము

ఇ )    ఖరహర ప్రియరాగము

ఈ ) కాపీ రాగము 

3)  తింటే గారెలే తినాలి వింటే_____

అ )  రామాయణం వినాలి

ఆ )   మనుచరిత్ర వినాలి

ఇ )    భారతం వినాలి

ఈ ) భాగవతం వినాలి 

4)  మనిషి శరీరంలో కిడ్నీలు ఎన్ని ఉంటాయి

అ )  ఒకటి

ఆ )   రెండు

ఇ )    మూడు

ఈ ) నాకు తెలియదు 

5) కంప్యూటర్ వైరస్ అనునది ఒక 

అ )  సూక్ష్మ క్రిమి

ఆ )   రోగకారక వైరస్

ఇ )    ఒక ప్రోగ్రాము అది కంప్యూటర్లోని సాఫ్ట్ వేరుని పాడు చేస్తుంది

ఈ ) కంప్యూటర్కు వర్షాకాలంలో వచ్చే ఒక వ్యాధి.

భక్తులకు కష్టాలు

 భక్తులకు కష్టాలు ఎక్కువా??


యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే

సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।

యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥


ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ పునరావృత్యాత్మక సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు


భక్తులకు కష్టాలు ఎక్కువ! చాలామంది అపోహ!!

సినిమా చూసి ఆ ఘటనలు మన కష్టసుఖాలు అనుకోవడం వంటిది ఇది.


కర్మశేషం అతిక్రమించలేనిది. గురువు / అమ్మ అనుగ్రహం ఉంటే సంచిత కర్మశేషం త్వరగా నశించి (ప్రారబ్దం గా మారి) ఆధ్యాత్మిక పురోగతి వేగం పెరుగుతుంది. ఇది బయటికి "భక్తులకు కష్టాలు".


సినిమా జీవితం ఐతే భగవంతుడు ప్రొడ్యూసర్ (సృష్టికర్త) మరియు డైరెక్టర్. మనం యాక్టర్ / పాత్రధారి అని తెలుసుకుంటే (గురు అనుగ్రహం) కష్టాలు కేవలం పాత్రవే కాని మనవి కావు. నటనలోని ఆనందం మనది కష్టాలు పాత్రవి. నేను పాత్ర ని మాత్రమే అని ఎరిగిన వారు నిజమైన భక్తులు, ఆ ఎరుకనిచ్చేది గురువు. 


శ్రీ ఆదిశంకరులకు (దక్షిణామూర్తి స్తోత్రం ప్రేరణ ఈ రోజు), మరియు మా నాన్నగారు సుబ్రహ్మణ్యంగారికి నమస్సులతో!!

తీర్థము

 భారతీయ సంస్కృతి:తీర్థము:


మానవుడు ఇహలోకములో,పరలోకంలో సుఖముగా ఉండుటకు ప్రయత్నించవలెను.


కేవలము ఈ లోకములో సుఖముగా ఉండుటయే కాదు.ఈ లోక సుఖము ధర్మముగా ఉండనిచో పరలోకములో,పైజన్మలో కష్టములకు కారణమగును.భగవంతుని విషయములు ఆసక్తి ఉన్నను చెప్పువారు లేక కొందఱు, వినువారు లేక కొంతమంది బాధ పడుచున్నారు.కాగా.దేవుని తీర్థము తీసుకొనుటవలన ఆరోగ్యము,దేవుని అనుగ్రహమువలన సర్వము కలుగును.


దేవునికి అభిషేకము చేసి ఆ జలమును తీర్థముగా గ్రహించుదురు.ఈ జలములో అనేక వస్తువులు కలుపుదురు. చెంగల్వకోష్టు, జటామాంసి,మామూలు పసుపు, కస్తూరి పసుపు,తుంగముస్తలు,సంపెంగ,వస,కచ్చూరములు,వట్టివ్రేళ్ళు కలుపుదురు.ఈ తీర్థము కఫము,పైత్యము,విషదోషము, కంటిబాధలు,వాంతి కలుగును అను వికా రము మొ.వానిని పోగొట్టును.మంత్రములతో దేవుని శరీరముతో కలసి వచ్చిన జలము పవిత్రము,మంచిని కలిగించుననుటలో ఆశ్చర్యము లేదు కదా!



చెవులు కోసిన గాడిద

 *చెవులు కోసిన గాడిద*

 *(ఎవరి భావాలకు భంగం కలగకుండా)*


 ఒకప్పుడు సింహానికి ఆకలిగా అనిపించి నక్కతో చెప్పింది - నాకు కాస్త ఎర వెతుక్కో, లేకపోతే నిన్ను తినేస్తాను...


 నక్క ఒక గాడిద దగ్గరకు వెళ్లి చెప్పింది - సింహం నిన్ను అడవికి రాజుగా చేయాలనుకుంటున్నందున నాతో రా...


 గాడిద నక్కతో వెళ్ళింది.  సింహం దానిని చూడగానే గాడిదపై దాడి చేసి చెవులు కోసేసింది కానీ గాడిద ఎలాగోలా తప్పించుకుంది.


  అప్పుడు గాడిద నక్కతో చెప్పింది - నువ్వు నన్ను మోసం చేశావు, సింహం నన్ను చంపడానికి ప్రయత్నించింది, నన్ను అడవికి రాజును చేస్తానని నువ్వు చెబుతున్నావు...


 నక్క చెప్పింది - మూర్ఖపు మాటలు మాట్లాడకు...


 సింహం మీ చెవులను కత్తిరించింది, తద్వారా కిరీటం మీ తలపై సులభంగా ఉంచబడుతుంది, అర్థం చేసుకోండి...


 రండి, సింహం దగ్గరకు వెళ్దాం...


 ఇది కరెక్ట్ అని గాడిదకు అనిపించి మళ్లీ నక్కతో...


 సింహం మళ్లీ గాడిదపై దాడి చేసి ఈసారి దాని తోకను నరికేసింది...


 గాడిద మళ్లీ నక్కతో పారిపోయింది - నువ్వు నాకు మళ్లీ అబద్ధం చెప్పావు, ఈసారి సింహం నా తోకను కూడా కత్తిరించింది...


 నక్క చెప్పింది - సింహం నీ తోకను కత్తిరించింది, తద్వారా మీరు సింహాసనంపై సులభంగా కూర్చోవచ్చు, మళ్ళీ అతని వద్దకు వెళ్దాం ...


 ఈ విధంగా నక్క గాడిదను తిరిగి రావడానికి ఒప్పించింది ...


 ఈసారి గాడిదను పట్టుకోవడంలో సింహం విజయం సాధించి చంపేసింది...


 సింహం నక్కతో చెప్పింది - వెళ్ళి అతని చర్మాన్ని తీసివేసి అతని మెదడు, ఊపిరితిత్తులు మరియు గుండెను నాకు ఇవ్వండి, దానిని తీసుకురండి, మిగిలిన భాగాన్ని మీరు తినవచ్చు ...


 నక్క గాడిదను తోలు తీసి దాని మెదడును తిని ఊపిరితిత్తులను, గుండెను మాత్రమే సింహానికి తీసుకువెళ్లింది.  సింహానికి కోపం వచ్చి - దాని మెదడు ఎక్కడికి పోయింది?


 నక్క బదులిచ్చింది - మహిమా!  దానికి మెదడు లేదు...


 దానికి మెదడు ఉంటే చెవులు, తోక తెగిపోయిన తర్వాత కూడా అది నీ దగ్గరకు తిరిగి వచ్చేదా?


 సింహం చెప్పింది - అవును, నువ్వు చెప్పేది పరమ సత్యం...


 ఈ కథ 1000 సంవత్సరాలకు పైగా హిందువులందరినీ అంతమొందించడానికి పదే పదే కుట్రలు చేసినా లౌకికవాదాన్ని నమ్మే ప్రతి హిందూ గాడిద కథ...


 ఈ కథ 1990లో కాశ్మీరీ పండిట్ల ఊచకోత తర్వాత కూడా సెక్యులరిజాన్ని నమ్మే ప్రతి హిందూ గాడిద కథ..

ఈ కథ భారతదేశంలోని ఈ 7 రాష్ట్రాల (లక్షద్వీప్, జమ్మూ & కాశ్మీర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్) వేగంగా మారుతున్న జనాభాను కళ్ళు తెరిచి చూస్తున్న ప్రతి హిందూ గాడిద కథ. ...


 భారత్‌లో ఉంటూ భారత్‌లోని శత్రు దేశాలను పొగిడే నాయకులకు, భారత్‌లో ఉంటూ కూడా 'భారత్ మాతాకీ జై' అనడం సిగ్గుచేటని భావించే నాయకులకు ఈ ప్రజలు ఎందుకు మళ్లీ మళ్లీ ఓటు వేస్తారో నాకు తెలియదు. హిందూ, సనాతన్ మరియు భారతదేశాన్ని బహిరంగంగా స్తుతించండి...


 జై హింద్ 

 భారతమాత చిరకాలం జీవించండి 

 వందేమాతరం

ఉత్తమమైన ధర్మం*

 *ఉత్తమమైన ధర్మం* 

మహాభారతంలో భీష్మపితామహుడిని యుధిష్టిరుడు ఇలా అడుగుతాడు..

 *कोधर्मः सर्वधर्माणाः* 

 *भवतः परमोमतः* 

...అంటే అన్ని ధర్మములకంటే ఏది ఉత్తమమైన ధర్మం అని. అప్పుడు భీష్ములవారు -

 *एष मे सर्व धर्माणां* 

 *धर्मोऽधिक तमोमतः|* 

 *यद्भक्त्या पुंडरीकाक्षं* 

 *स्तवैरर्चेन्नरः सदा ||* 

పరమాత్మ అనేవాడొకడున్నాడు. ఆ పరమాత్మను నిత్యమూ అనన్యమైన మనస్సుతో ధ్యానించు, అదే ధర్మాలలోకెల్లా మహాధర్మం అని భీష్ములవారు సమాధానమిచ్చారు.

ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం ఉన్నది. "అయ్యా! దేవుళ్ళెంతమంది? ఒకరా, ఇద్దరా, వందనా, వేయిమందా?" ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందండీ అంటే మీరు రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు, అమ్మవారు, అయ్యప్ప అని ఎన్నో పేర్లు చెపుతుంటారు. ఈశ్వరుడికి పూజ చేస్తే విష్ణువుకు పూజ చేయగూడదంటారు. విష్ణువుకు పూజచేస్తే ఈశ్వరుడికి చేయగూడదంటారు. అందువలన మా మనస్సులో అనేక సందేహాలు కలుగుతున్నాయి, అంటారు కొందరు. మరి కొంతమంది ఇంత మంది దేవతలేమిటండీ ఎవర్ని పూజించాలో అర్థం కావటంలేదు అంటుంటారు.

అసలు విషయం తెలియకే ఈ సందేహాలు, గందరగోళం. అయితే అసలు విషయమేమిటంటే దేవుడు ఒకడే అన్నది మా సిద్ధాంతం.

 *एको देवः सर्वभूतेषु गूढः* 

 *सर्वव्यापी, सर्वभूतांतरात्माः |* 

 *कर्माध्यक्षःसर्वभूताधिवासः,*                          *साक्षीचेताकेवलो निर्गुणश्च ||* 

ఇదయ్యా అసలు విషయం. ఒకే పరమాత్మ సర్వాంతర్యామిగా ఉన్నాడన్నది మా సిద్ధాంతం. పరమాత్మలనేక మంది ఉండటానికి వీల్లేదు. సత్యసంకల్పుడు, సృష్టిస్థితిలయకారుడు అయిన పరమేశ్వరుడు ఒకడే.🍃🕉️🙏🌸

 *---జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు* 


|| *हर नमः पार्वतीपतये हरहर महादेव* ||

కనకధారా స్తవం*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *నమోఽస్తు నాళీక నిభాననాయై*

       *నమోఽస్తు దుగోదధి జన్మభూమ్యై*

       *నమోఽస్తు సోమామృత సోదరాయై*

      *నమోఽస్తు నారాయణ వల్లభాయై* (12)


               { _/  *కనకధారా స్తవం* _/ } 


తాత్పర్యం: శ్రీమహాలక్ష్మి పద్మంతో సమానమైన ముఖం గలది. ఆమె జన్మించిన చోటు క్షీరసముద్రం. పాలకడలి యందు జన్మించిన చంద్రునితో, అమృతంతో పాటు ఆమె కూడ జన్మించింది. కనుక ఆమె చంద్రసుధాసహోదరి. ఆమె శ్రీమన్నారాయణునకు ప్రియురాలు. అట్టి జగజ్జననికి నమస్కారం. దారిద్ర్యమోచన స్తోత్రంలో లక్ష్మీదేవి పద్మ అని, పద్మాలయ అని, పద్మప్రియ అని, పద్మహస్త అనీ, పద్మాక్షి అని, పద్మసుందరి అని, పద్మోద్భవ అని, పద్మముఖి అని, పద్మమాలాధర అని, పద్మిని అని, పద్మగంధిని అని కీర్తించబడింది. ఆమె ముఖాదులకు పద్మంతో సామ్యం చెప్పడం వల్ల శైత్యసౌరభ్యాలకు ఆమె స్థాన మని వర్ణించినట్లైంది. *చంద్రుని తోబుట్టువు ఆమె పరమాహ్లాదకరురాలనీ, అమృతసహోదరి అని పేర్కొనడం వల్ల, ఆమెనెంత సేవించినా తనివితీరదని, ఆమె పుట్టిన చోటు రత్నాకరమనడం వల్ల ఆమె ఆదిగర్భేశ్వరీ తత్త్వాన్ని ప్రశంసించి నట్లయింది.*

108 సంఖ్య

 ఫ్రెండ్స్ 108 సంఖ్య ఎందుకంత పవిత్రమో ప్రాముఖ్యమో తెలుసుకుందాం🙏


108 సంఖ్య మనకు చాలా పవిత్రమైనది.

అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ 108 అనే సంఖ్యకు మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం దేవున్ని / దేవతలను మంత్ర పుష్పాలతో పూజిస్తూ 108 పవిత్ర పూసలు గల జపమాలను గణిస్తూ జపం చేస్తాం.


108 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను భారతదేశంలో హిందువులే కాదు, బౌద్ధులు, జైనులు, సిక్కులువంటి వారందరూ గుర్తించారు. తనలోని దైవత్వాన్ని గ్రహించటానికి ఆత్మ 108 మెట్లు దాటాలని వీరి నమ్మకం. ఈ సంఖ్య భగవంతునికీ భక్తునికీ మధ్య అనుసంధాన కారకమని భారతీయుల నమ్మకం.


వేద ఋషులు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గణనలో..

భూమికి, చంద్రునికి మధ్య దూరం, చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉందని.. భూమికి, సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉందని..  సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు అనీ నిర్థారించారు.

ఈ వేదగణన ఆధునిక సాంకేతిక విశ్వగణనలో లభించిన భూమికీ, చంద్రునికీ, చంద్రునికీ సూర్యునికీ ఉన్న దూరంతో దాదాపు సరిపోయింది.


ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలను గుర్తించింది. 108 అనే మర్మాల గొలుసులో 107 గ్రంధులు శరీరంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇవి జీవచైతన్యం మానవ శరీరంలో మిళితమయ్యే కేంద్ర స్థానాలు. ఈ మర్మస్థానాల ద్వారా ప్రాణశక్తి జీవిని చైతన్యపరుస్తుంది. భారతీయ యోధునికి పైన చెప్పిన మర్మస్థానాలు తెలిసే ఉంటాయి. అతడు యుద్ధం చేసే సమయంలో శత్రువును ఆ మర్మ స్థానాలపై దాడి చేసి సంహరిస్తాడు.


అలాగే పవిత్రమైన శ్రీ చక్రయంత్రంలో 54 స్త్రీ,

54 పురుష అంతర్భాగాలు ఉంటాయి.

వీటి మొత్తం 108.జ్యోతిష్య శాస్త్రం ః

 మానవ ప్రవృత్తికి సంబంధం ఇచి

బ్రహ్మాండాన్ని 27 చంద్ర సూచికలైన నక్షత్రాలతో,

ఒక్కో నక్షత్రం తిరిగి 4 పాదాలతో ఉంటుందని గుర్తించింది. ఇది 27 X  4 = 108 పాదాలయింది. అవే 108 ప్రాథమిక మానవ ప్రవృత్తులు. శిశు జనన సమయంలో చంద్రుడు ఏ పాదంలో ఉంటాడో, దాని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో, వృత్తిలో, ఆనందంలో, కుటుంబంలో, చివరకు మోక్షమార్గాలలోనూ ప్రతిఫలిస్తుంది.


భారతీయ జ్యోతిష్యంలో 12 రాశులు, 9 గ్రహాలుంటాయి. 12 x 9 = 108.

మానవుడు సగటున ప్రతిరోజు 21,600 సార్లు శ్వాస తీస్తాడు. అందులో 10,800 సూర్యాంశ, 10,800 చంద్రాంశ.. 108ని 00తో గుణిస్తే.. 10,800 వస్తుంది. దీనిని 2తో గుణిస్తే.. 21,600 వస్తుంది అని తంత్ర శాస్త్రం చెబుతుంది.


భరతుడు - తన నాట్యశాస్త్రంలో చేతులు, కాళ్లు కలిపి చేసే నాట్యభంగిమల మొత్తం సంఖ్య 108గా గుర్తించాడు. వీనిని కరణములంటారు.


18 పురాణాలు, 108 ఉపనిషత్లుఉ, భగవద్గీతలో 18 అధ్యాయాలు, ఎన్నో ప్రముఖ సంస్కృత గ్రంథాలలో 108 శ్లోకాలు ఉంటాయి. లిహందువులు నిత్యమూ పూజ చేసే విధానంలో అష్టోత్తర పూజ, అష్టోత్తర శత నామావళి వంటివి ఉంటాయి. చాలామంది సిద్ధులు తమ తమ పేర్లకు ముందు 108గానీ, 1008గానీ ఉంచుకునే సాంప్రదాయం ఉంది.


సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వీటికి శివ, శక్తి తత్వాలైన స్త్రీ, పురుష రూపాలుంటాయి. అనగా

54 X 2 = 108.

భారతీయ కాలగణన ప్రకారం బ్రహ్మకు ఒక రోజు అంటే

4 యుగాలు కలిసి 43,20,000 సంవత్సరాలు. 

ఇది 108 అనే సంఖ్యతో భాగించబడుతుంది.

సంఖ్యా శాస్త్రంలో 108ని 1+0+8=9గా రాస్తారు.


ఒక సంఖ్యను 9తో గణించి వచ్చిన సంఖ్యను కూడగా తిరిగి 9 వస్తుంది.

అందుకే ఇంతటి వైశిష్ట్యం గల 108 సంఖ్య ఎంతో దివ్యమైనదని చాలామంది నమ్ముతుంటారు. 

అది సృష్టికర్తకు, సృష్టికి అనుసంధానం కలిగించేది. అందుకే మన రుషులు, పురాణాలు, వేదాలు,

భారతీయ సంస్కృతి

108కి ఇంతటి పవిత్రత  ఇచ్చింది ఇస్తున్నది.🙏


అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏


                *_🌻శుభమస్తు🌻_*

                             

                             

              

          🙏 సర్వే జనాః సుఖినోభవంతు

         🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు

        🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

సంకల్పము

 *శుభోదయం*

*********

 సంధ్యావందనం 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ 09.06.2024

ఆది వారం (భాను వాసరే) 

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠ మాసే శుక్ల పక్షే తృతీయాయాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ 

జ్యేష్ఠ మాసే  శుక్ల పక్షే తృతీయాయాం

భాను వాసరే అని చెప్పుకోవాలి.

౽ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.28

సూ.అ.6.29

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం 

శుక్ల పక్షం

తదియ సా.4.18 వరకు. 

ఆది వారం. 

నక్షత్రం పునర్వసు  రా.9.19 వరకు.

అమృతం రా. 6.50 ల 8.29 వరకు. 

దుర్ముహూర్తం సా.4.43 ల 5.35 వరకు.  

వర్జ్యం  ఉ.8.57 ల 10.36 వరకు.

యోగం వృధ్ధి సా. 6.43 వరకు. 

కరణం గరజి సా. 4.18 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు. 

***********   

పుణ్యతిధి జ్యేష్ఠ శుద్ధ తదియ. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

ఆదివారం, జూన్ 9, 2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*


ఆదివారం, జూన్ 9, 2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం

తిథి:తదియ సా4.22 వరకు

వారం:ఆదివారం(భానువాసరే)

నక్షత్రం:పునర్వసు రా9.26 వరకు

యోగం:వృద్ధి సా6.47 వరకు

కరణం:గరజి సా4.22 వరకు తదుపరి వణిజ తె4.36 వరకు

వర్జ్యం:ఉ9.03 - 10.42

దుర్ముహూర్తము:సా4.44 - 5.36

అమృతకాలం:సా6.57 - 8.36

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి: వృషభం

చంద్రరాశి: మిథునం 

సూర్యోదయం:5.28

సూర్యాస్తమయం:6.29


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

(09-06-2024) రాశి ఫలితాలు

 (09-06-2024) రాశి ఫలితాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును


మేషం

  09-06-2024

ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి  ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.  వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.


వృషభం

  09-06-2024

చేపట్టిన  పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో  ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.


మిధునం

  09-06-2024

వ్యయప్రయాసలతో కాని పనులు పూర్తి కావు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.


కర్కాటకం

  09-06-2024

ఆరోగ్య ఈ విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ అంతగా ఫలించదు. బంధువులతో వివాదాలు తప్పవు. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు.  వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.


సింహం

  09-06-2024

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక  ఆనందం కలిగిస్తుంది. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విందువినోదాది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.


కన్య

  09-06-2024

వ్యాపార, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన  పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవదర్శనాలు చేసుకుంటారు.


తుల

  09-06-2024

ఆప్తుల నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట  ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.  మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు.


వృశ్చికం

  09-06-2024

రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక  వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు.


ధనస్సు

  09-06-2024

దైవచింతన పెరుగుతుంది. ఖర్చుల  విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు.


మకరం

  09-06-2024

వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు  నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి.  ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.


కుంభం

  09-06-2024

నూతన వాహనయోగం ఉన్నది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి. సన్నిహితుల నుండి  శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.


మీనం

  09-06-2024

నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. స్థిరస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

అప్పటినుంచే

 చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా మాస్టారు నన్ను కొట్టినప్పుడల్లా ప్రతీదెబ్బ తిన్న వెంటనే నేను చేతులను దులుపుకుని నా లాగుకి రాసుకున్న తర్వాతే రెండో దెబ్బకు చెయ్యి చాచేవాణ్ణి. శుచి-శుభ్రత అన్నది నాకు అప్పటినుంచే ఉండేది!


అప్పట్లో మా గురువులంతా పాఠం చెప్పినంతసేపూ నిలబడే ఉండేవాళ్ళు, ఎందుకో తెలుసా? గౌరవం...నేనంటే వాళ్ళకి అంత గౌరవం...అంతే!


నేను చదువుకునే రోజుల్లో మా గురువులు నాలుగురోజులకొకసారి మా నాన్నగారిని తీసుకుని రమ్మనే వారు! ఎందుకంటే వాళ్ళందరూ ఏ విషయమైనా నాకు సూటిగా చెప్పడానికి చాలా భయపడేవారు!


నేను రాసినవి చదవడానికి మా గురువులంతా చాలా ఇష్టపడేవారు. అందుకే వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు కొన్ని వందలసార్లు మళ్ళీ మళ్ళీ రాసి చూపించమని ప్రతీరోజూ అభ్యర్థించేవారు!


మా గురువులందరూ నన్ను "వీడొక సింహబలుడు" అన్నట్టుగా చూసేవారు. అందుకే వాళ్ళకి ఏమాత్రం భయం వేసినా క్లాసులో నుంచి నన్ను బయటకు పంపి గుమ్మం దగ్గర కాపలా కోసం నిల్చోబెట్టేవారు.


మా గురువులకి నేను చాలా తెలివైనవాడిని అనే భావన బాగా బలంగా ఉండేది. అందుకే వాళ్ళంతా, "ఒరేయ్, నువ్వు స్కూలుకి ఎందుకొస్తావురా. పోయి ఎక్కడైనా పనిలో చేరిపోవచ్చు కదా!", అని కనీసం రోజుకోసారైనా అనేవారు!