💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *నమోఽస్తు నాళీక నిభాననాయై*
*నమోఽస్తు దుగోదధి జన్మభూమ్యై*
*నమోఽస్తు సోమామృత సోదరాయై*
*నమోఽస్తు నారాయణ వల్లభాయై* (12)
{ _/ *కనకధారా స్తవం* _/ }
తాత్పర్యం: శ్రీమహాలక్ష్మి పద్మంతో సమానమైన ముఖం గలది. ఆమె జన్మించిన చోటు క్షీరసముద్రం. పాలకడలి యందు జన్మించిన చంద్రునితో, అమృతంతో పాటు ఆమె కూడ జన్మించింది. కనుక ఆమె చంద్రసుధాసహోదరి. ఆమె శ్రీమన్నారాయణునకు ప్రియురాలు. అట్టి జగజ్జననికి నమస్కారం. దారిద్ర్యమోచన స్తోత్రంలో లక్ష్మీదేవి పద్మ అని, పద్మాలయ అని, పద్మప్రియ అని, పద్మహస్త అనీ, పద్మాక్షి అని, పద్మసుందరి అని, పద్మోద్భవ అని, పద్మముఖి అని, పద్మమాలాధర అని, పద్మిని అని, పద్మగంధిని అని కీర్తించబడింది. ఆమె ముఖాదులకు పద్మంతో సామ్యం చెప్పడం వల్ల శైత్యసౌరభ్యాలకు ఆమె స్థాన మని వర్ణించినట్లైంది. *చంద్రుని తోబుట్టువు ఆమె పరమాహ్లాదకరురాలనీ, అమృతసహోదరి అని పేర్కొనడం వల్ల, ఆమెనెంత సేవించినా తనివితీరదని, ఆమె పుట్టిన చోటు రత్నాకరమనడం వల్ల ఆమె ఆదిగర్భేశ్వరీ తత్త్వాన్ని ప్రశంసించి నట్లయింది.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి