9, జూన్ 2024, ఆదివారం

తీర్థము

 భారతీయ సంస్కృతి:తీర్థము:


మానవుడు ఇహలోకములో,పరలోకంలో సుఖముగా ఉండుటకు ప్రయత్నించవలెను.


కేవలము ఈ లోకములో సుఖముగా ఉండుటయే కాదు.ఈ లోక సుఖము ధర్మముగా ఉండనిచో పరలోకములో,పైజన్మలో కష్టములకు కారణమగును.భగవంతుని విషయములు ఆసక్తి ఉన్నను చెప్పువారు లేక కొందఱు, వినువారు లేక కొంతమంది బాధ పడుచున్నారు.కాగా.దేవుని తీర్థము తీసుకొనుటవలన ఆరోగ్యము,దేవుని అనుగ్రహమువలన సర్వము కలుగును.


దేవునికి అభిషేకము చేసి ఆ జలమును తీర్థముగా గ్రహించుదురు.ఈ జలములో అనేక వస్తువులు కలుపుదురు. చెంగల్వకోష్టు, జటామాంసి,మామూలు పసుపు, కస్తూరి పసుపు,తుంగముస్తలు,సంపెంగ,వస,కచ్చూరములు,వట్టివ్రేళ్ళు కలుపుదురు.ఈ తీర్థము కఫము,పైత్యము,విషదోషము, కంటిబాధలు,వాంతి కలుగును అను వికా రము మొ.వానిని పోగొట్టును.మంత్రములతో దేవుని శరీరముతో కలసి వచ్చిన జలము పవిత్రము,మంచిని కలిగించుననుటలో ఆశ్చర్యము లేదు కదా!



కామెంట్‌లు లేవు: