9, జూన్ 2024, ఆదివారం

భక్తులకు కష్టాలు

 భక్తులకు కష్టాలు ఎక్కువా??


యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే

సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।

యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥


ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ పునరావృత్యాత్మక సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు


భక్తులకు కష్టాలు ఎక్కువ! చాలామంది అపోహ!!

సినిమా చూసి ఆ ఘటనలు మన కష్టసుఖాలు అనుకోవడం వంటిది ఇది.


కర్మశేషం అతిక్రమించలేనిది. గురువు / అమ్మ అనుగ్రహం ఉంటే సంచిత కర్మశేషం త్వరగా నశించి (ప్రారబ్దం గా మారి) ఆధ్యాత్మిక పురోగతి వేగం పెరుగుతుంది. ఇది బయటికి "భక్తులకు కష్టాలు".


సినిమా జీవితం ఐతే భగవంతుడు ప్రొడ్యూసర్ (సృష్టికర్త) మరియు డైరెక్టర్. మనం యాక్టర్ / పాత్రధారి అని తెలుసుకుంటే (గురు అనుగ్రహం) కష్టాలు కేవలం పాత్రవే కాని మనవి కావు. నటనలోని ఆనందం మనది కష్టాలు పాత్రవి. నేను పాత్ర ని మాత్రమే అని ఎరిగిన వారు నిజమైన భక్తులు, ఆ ఎరుకనిచ్చేది గురువు. 


శ్రీ ఆదిశంకరులకు (దక్షిణామూర్తి స్తోత్రం ప్రేరణ ఈ రోజు), మరియు మా నాన్నగారు సుబ్రహ్మణ్యంగారికి నమస్సులతో!!

కామెంట్‌లు లేవు: