5, జులై 2022, మంగళవారం

తెలుగు పదాలు, మాండలికాలు

 అత్తారింటికి దారేది సినిమాలో వచ్చిన #కాటమరాయుడా పాట గుర్తుందా మీకు??


నిజానికి ఈ పాట చాలా గొప్ప భక్తి పాట...


అనంతపురం జిల్లా, కదిరిలో ఉన్న #నరసింహస్వామి వారిని కీర్తించేది ఇది… తనకు వేటరాయుడు అనే పేరు కూడా ఉంది… వేట్రాయి కాస్తా కన్నడ ప్రభావంతో బేట్రాయి అయ్యింది… అందుకే బేట్రాయి సామి అయ్యాడు… ఎంత మంచి కీర్తన అంటే..?


#యడ్ల_రామదాస అనే ఓ వడ్డెర కులస్థుడు రాసిన పాట ఇది… ఊరూరూ తిరుగుతూ రాళ్లు కొట్టుకునేవాడు… ఓసారి ఓ రాయిని పగులగొడితే అందులో నుంచి కప్ప బయటపడుతుంది… దానితో జీవం, దేవుడి మీద మథనంతో… దేవుడి దశావతారాలనూ తనదైన జానపద శైలిలో కీర్తిస్తాడు… దశావతారాలు మానవ పరిణామ గతిని, మనిషి పిండ దశ నుంచి తల్లి గర్భంలో ఎదిగే పలు దశల్ని కూడా సూచిస్తాయి తెలుసు కదా… ఇదీ అంతే


#పలకల_భజన  అని పిలిచేవారు, భజనల కాంపిటీషన్ నడిచేది అందులో ఈ పాట హోరుకు అంతేలేదు..

……


పూర్తి పాట ఇది..


బేట్రాయి సామి దేవుడా – నన్నేలినోడ, బేట్రాయి సామి దేవుడా


కావేటి రాయుడా – కదిరి నరసిమ్ముడా

మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా ||బేట్రాయి||


శాప కడుపు సీరి పుట్టగా – రాకాసిగాని కోపామునేసి కొట్టగా

ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి

బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ ||బేట్రాయి||


తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ దేవాసురులెల్లకూడగా

దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు

సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ ||బేట్రాయి||


అందగాదనవుదులేవయా – గోపాల గోవిందా రచ్చించా బేగరావయా

పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి

కిందు మిందు సేసినోడ సందమామ నీవె కాద ||బేట్రాయి||


నారసిమ్మ నిన్నె నమ్మితి – నానాటికైన కోరితి నీ పాదమే గతీ

ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి

కోర మీసవైరిగాని గుండె దొర్లసేసినోడ ||బేట్రాయి||


బుడత బాపనయ్యవైతివి ఆ సక్కురవరితి నడిగి భూమి నేలుకుంటివే

నిడువు కాల్లోడివై అడుగు నెత్తిపైన బెట్టి

తడవు లేక లోకమెల్ల మెడిమ తోటి తొక్కినోడ ||బేట్రాయి||


రెండుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల సెండాడినావు పరసుతో

సెందకోల బట్టి కోదండరామసామికాడ

బెండు కోల సేసికొనే కొండకాడకేగినోడ ||బేట్రాయి||


రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి

శ్యామసుందర నిన్ను మెచ్చగా

సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి

ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ ||బేట్రాయి||


దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన

దేవుడై నిలిచినావురా

ఆవూల మేపుకొనీ ఆడోళ్ళా గుడుకొనీ

తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ ||బేట్రాయి||


ఏదాలు నమ్మరాదనీ ఆ శాస్త్రాలా

వాదాలూ బాగలేవనీ

బోధనలూ సేసికొనీ బుద్ధులూ సెప్పుకొనీ

నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద ||బేట్రాయి||


కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన

పలికినావు బాలసిసువుడా

చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర

పిల్లంగోవె సేతబట్టి పేట పేట తిరిగినోడ ||బేట్రాయి ||


 చేపగా పుట్టి, సోమకాసురుడిని చంపి, వేదాల్ని (బాపనోళ్ల చదువులెల్ల) బ్రహ్మకు తిరిగి ఇవ్వడం…


తరువాత తాబేలు… (కొండకింద దూరగానే సిల్కినప్పుడు) క్షీరసాగరమథనం… ఇక్కడ సావులేని మందు అంటే అమృతం…


పందిలోన సేరి కోర పంటితోనే ఎత్తి భూమి… ఇదంతా వరాహావతారం, భూమిని మోస్తూ రక్షించడం…

 అందగాడనవుదులేవయా అని కొంటెగా కీర్తిస్తాడు రచయిత…


కంబానా చేరి… వైరిగాని గుండె దొర్లసేసినోడ… ఇది నరసింహావతారం… కంబం అంటే స్తంభం… హిరణ్యకశిపుడిని వధించడం…


శక్కురవరితి, బుడత బాపయ్య… తడవు లేక లోకమెల్ల మెడిమ తోటి తొక్కినోడ… అంటే బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి తొక్కేయడం…


రెండు పదుల్ ఒక్కమారు అంటే ఇరవై ఒకటి… దొరలనెల్లా సెండాడినావ్ అంటే పరుశురాముడు క్షత్రియ రాజుల్ని ఊచకోత కోయడం…


తండ్రి మాటా గాచి… అంటూ రాముడి అవతారం ప్రస్తావన…


ఆవూల మేపుకోనీ, ఆడోళ్లా గూడుకోనీ… బృందావనంలోని కృష్ణుడి జీవన సరళి ప్రస్తావన…


తరువాత బుద్దుడిని కూడా ఓ అవతారంగా చూస్తాడు రచయిత… ‘ఏదాలూ నమ్మరాదనీ, బోధనలు సేసికొనీ, బుద్దులూ సెప్పుకొనీ’ పదాలన్నీ అవే…


చివరగా కల్కి అవతారాన్ని ఊహించి ముగిస్తాడు… ఎన్నెన్ని అచ్చ తెలుగు పదాలు, మాండలికాలు…


ఇది దశావతారాలను గ్రామీణుడు వర్ణించిన ఒక జానపదం. స్వచ్చమైన రాయలసీమ వాసన. భజనల్లో పాడుకునే వాళ్ళు.


This is why Telugu is special, it takes as many words from Sanskrit , but has it’s own equivalents for many of them , which encouraged all sections of societies to freely create their own literature, often with musical notation 👏👏👏

మత్కుణం_కథ

 మత్కుణం_కథ

----------------

ఒకసారి కృష్ణదేవరాయలవారి ఆస్థానానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు. ఆయనతో పాటు ఒక బండి నిండా పత్రాలు ఉన్నై. "సంస్కృతంలో నన్ను మించినవాడు లేడు. అనేక దేశాల సంస్కృత పండితులు నాతో ఓడి, నాకు ఈ విజయపత్రాలను అందించారు. మీ రాజ్యపు పండితులతో శాస్త్ర చర్చ చేద్దామని వచ్చాను. మీ రాజ్యంలో ఎవరైనా పండితుడన్నవాడు ఉంటే నాతో తలపడమనండి. లేదూ, వారెవ్వరూ నాతో శాస్త్ర చర్చకు ముందుకు రాలేమంటే, మరి విజయపత్రాలను ఇప్పించండి" అన్నాడు గొప్పగా.

రాయలవారు సభలోని కవుల కేసి చూసారు. వాళ్లంతా కొంచెం ఇరుకున పడ్డారు. ఏమంటే "ఆస్థానంలో ఉన్న సంస్కృత పండితులు అందరూ ఆ సమయానికి వేరే దేశానికి వెళ్ళి ఉన్నారు- రాజ్యంలో ఉన్నదల్లా తెలుగు కవులు మాత్రమే. ఈ సంస్కృత కవి తీరు చూస్తే మామూలు వాడిలాగా లేడు. ఊరికే చర్చించేదెందుకు, ఓడేదెందుకు, రాజ్యాన్నంతా ఓటమి పాలు చేసిన అపకీర్తిని మూటగట్టుకునేదెందుకు?"

రాయలవారు వారి సంశయాన్ని గుర్తించారు. సభలో కూర్చున్న తెనాలి రామకృష్ణుడికేసి చూసారు. రామకృష్ణుడు ఇకిలించాడు. రాయలవారు తల పంకించారు. "అయ్యా! పండితులవారూ! మా సంస్కృత కవులందరూ విదేశ యాత్రలో ఉన్నారు. వారి శిష్యులైన పామరులు మాత్రం కొందరు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. తమరి రాకను వారికి తెలియజేస్తాం. రేపు మధ్యాహ్నంగా శాస్త్రచర్చ ఏర్పాటు చేసుకుందాం. అంతవరకూ తమరు మా ఆతిథ్యం స్వీకరించండి" అని పండితులవారికి తుంగభద్రా నదీ తీరాన వున్న ఒక భవంతిలో విడిది ఏర్పాటు చేసారు.

పండితులవారు అటు పోగానే ఇటు రాయలవారు "రామకృష్ణా!" అన్నారు.

"ప్రభువులవారు ఈ పని నాకు వదిలెయ్యండి!" అన్నాడు రామకృష్ణుడు నవ్వుతూ.మరునాడు తెల్లవారే సరికి రామకృష్ణుడు చాకలివాడి వేషం వేసుకున్నాడు. తన భార్యకు చాకలమ్మ వేషం వేసాడు. ఏం చెయ్యాలో అంతా ఆమెకు చెప్పి వుంచాడు. ఓ బట్టల మూటనెత్తుకొని తను తుంగభద్రా నదీ తీరం చేరుకున్నాడు. నదిలో బట్టలు ఉతుకుతున్నట్లు నటించటం మొదలు పెట్టాడు.

అనుకున్నట్లే ఆ రేవు దగ్గరికి వచ్చాడు సంస్కృత పండితుడు. నదిలోకి దిగి స్నానం చేస్తున్నాడు. చాకలి ఆయన తీరును చూస్తూ తన జోరు పెంచాడు.

అంతలోకే చాకలమ్మ వచ్చింది మరో చిన్న బట్టల మూట పట్టుకొని. రామకృష్ణుడిని అడిగింది గట్టిగా, దగ్గర్లోనే ఉన్న పండితుడికి వినబడేట్లు- "యివ్వాళ అన్నం లోకి సాధకం ఏమి చెయ్య మంటావు మామా ?" అని.

చాకలివాడు కొంచెం ఆలోచించాడు:

"మత్కుణం నది సంయుక్తం, విచార ఫల మేవచ, గోపత్నీ సమాయుక్తం,

గ్రామచూర్ణం చ వ్యంజనం" అని జవాబి-చ్చాడు.

ఆమె కనబడీ కనబడనట్లు నవ్వింది. "సరే అలాగే- 'తథైవ అస్తు' " అని చెప్పి, ఉతికిన బట్టలు పట్టుకొని వెళ్ళిపోయింది.

నదిలో సంధ్యావందనం చేసుకుంటున్న పండితుడికి తల తిరిగినట్లైంది. "ఈ దేశంలో ఒక సాధారణ చాకలి, చాకలమ్మ సంస్కృతంలో మాట్లాడుకున్నారు! ఇంతగొప్ప సంస్కృత పండితుడైన తనకు ఆ శ్లోకం అర్థం కాలేదు!"

"ఇంతకీ 'మత్కుణం' అంటే ఏంటి? 'మత్కుణం' అంటే సంస్కృతంలో 'నల్లి' అని అర్థం.

'నది సంయుక్తం' అంటే 'నదితో కలిసినది'- నల్లి నదితో కలవటమేమిటి? తెలీదు!

"విచార ఫలం" అన్నాడు- విచారిస్తే ఫలితం ఏముంటుంది? కన్నీళ్ళు వస్తాయి.. అయితేనేమి?

ఇక "గో పత్ని- ఆవు భార్య" అంటున్నాడు. ఆవే ఆడది కదా, ఇక ఆవుకు భార్య ఎక్కడినుండి వస్తుంది?

అంతా చేసి "గ్రామ చూర్ణం" కావా-లంటున్నాడు! అదేంటి?

"పోనీ 'దీనికంతా అర్థం లేదు' అనుకుందామంటే అట్లానూ లేదే, చాకలమ్మ "సరే సరే" అని పోయింది. అంటే ఆమెకు అర్థమైనట్లే కదా!" ఆలోచించీ ఆలోచించీ అతనికి మతి పోయింది-

"ఈ రాజ్యపు చాకలివాడి శ్లోకమే తనకు అర్థం కాలేదు- చాకలమ్మకు అర్థమయినంత నాకు అర్థం కాలేదు. యింక రాజుగారి దగ్గర పనిచేసే పండితులతో నేనెక్కడ గెలువగలను?" అనుకున్నాడాయన. రామకృష్ణుడు చూస్తుండగానే ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా బయలుదేరి భవనానికి వెళ్లి, మూటా ముల్లె సర్దుకొని, నగరం విడిచి పారిపోయాడు.

మరునాడు సభలో రాయలవారు అడిగారు- "ఏడీ! పండితుడు?!" అని."విడిది పరిసరాల్లో ఎక్కడా లేడు" చెప్పారు భటులు. "వేరే నగరానికి వెళ్తున్నానని చెప్పి ఉదయాన్నే వెళ్ళాడాయన!" వింటున్న రామకృష్ణుడు నవ్వాడు. రాయలవారు "నువ్వే ఏదో చేసినట్లున్నావు

?!" అన్నారు మర్మగర్భంగా

"లేదు- నేను కాదు, ఇదంతా చేసింది మత్కుణం" అని కథంతా చెప్పాడు రామకృష్ణుడు.

రాయలవారు నవ్వి, ఇంతకీ ఈ శ్లోకం మాక్కూడా అర్థం కాలేదు- ఏంటి, దీని కథ?" అన్నారు.

అప్పుడు రామకృష్ణుడు ఇలా అర్థం చెప్పాడు:

"మత్కుణం అంటే నల్లి; నది అంటే ఏరు. నల్లి, ఏరు కలిసి 'నల్లేరు' అయ్యింది.

విచారం అంటే చింత; ఫలం అంటే పండు- కలిసి చింతపండు అయ్యింది.

గోవు అంటే ఆవు; పత్ని అంటే భార్య- ఆలు. ఆవు,ఆలు కలిస్తే అయ్యేవి ఆవాలు-"

రాయలవారు కడుపుబ్బా నవ్వారు. మరి ఇంతకీ గ్రామచూర్ణం ఎలా చేస్తారు? అన్నారు.

ఏమీ లేదు- గ్రామం అంటే ఊరు; చూర్ణం అంటే పిండి- వెరసి 'ఊరుబిండి' అవుతుంది ప్రభూ. మన సీమలో అందరికీ ఇష్టమైన పచ్చడి కదా అది?" అన్నాడు రామకృష్ణుడు కొంటెగా.

"నల్లేరు, ఆవాలు, చింతపండు కలిపి చేసే వూరుపిండి సంస్కృత పండితుడినే భయపెట్టిందే, అంతగొప్ప పండితుడు పలాయనం చిత్తగించేట్లు చేసింది ఇది మామూలుది కాదు" నవ్వారు రాయలవారు.....

 

డా॥ అయోధ్య శర్మ కస్తూరి ముఖపుస్తకం నుండి

ఉచితఆరోగ్య భీమా*

*60 సంవత్సరాలు వయసు పైబడిన భారత పౌరులందరికీ " 5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య భీమా* " *ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం ఇప్పుడు *ABHA హెల్త్ కార్డు* గా మార్చబడింది..... వెబ్సైట్ ఓపెన్ అయింది.. ఇందులో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ ABHA హెల్త్ కార్డ్ లభిస్తుంది.. *5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది* . ఇందులో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ని మరల టైప్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ను టైప్ చేయమని చెప్పి అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ లో నమోదు చేసిన తరువాత మరలా ఓటిపి వస్తుంది ఆ ఓటిపి కూడా నమోదు చేస్తే మీ ఫోటో తో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు... దయచేసి ప్రతి ఒక్కరు (ఆయుష్మాన్ )ABHA హెల్త్ కార్డు పొందవలసిందిగా కోరుచున్నాము.. డౌన్లోడ్ చేసిన ఐడి కార్డును జాగ్రత్తగా ల్యామినేషన్ చేసుకుని మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి, ఐడి కార్డులు జాగ్రత్తగా భద్రపరుచుకోండి.
*Central Government వారి _ఆయుష్మాన్ హెల్త్ కార్డ్_ Health card* కావలసిన వారికి 
 గొప్ప ఆరోగ్య కరమైన *శుభవార్త* 
ప్రతి *ఆరోగ్యశ్రీ* హాస్పిటల్ లో చెల్లుబాటు.
కేంద్ర ప్రభుత్వం _ఉచితంగా_ *5 లక్షల రూపాయల హెల్త్ కార్డు* _ఆయుష్మాన్ హెల్త్ కార్డ్_ ఇవ్వడం జరిగింది. 
అందరు అప్లై చేసుకొని హెల్త్ కు సంబంధించిన బెనిఫిట్స్ పొందగలరు. 
దీనికి ఆధార్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. 
అప్లై చేసుకున్న *ఒకే ఒక్క నిమిషాల్లో* *హెల్త్ కార్డు* వస్తుంది. 
కింద లింక్ పంపుతున్నానము క్లిక్ చేసి చూడండి.

*https://healthid.ndhm.gov.in/*

 కేంద్ర ప్రభుత్వము వారు ప్రవేశ పెట్టిన ఈ ఉచిత ఆరోగ్య పదకమునకు సంబంధించిన పైన తేలీయ చేసిన విధముగా (wife and husband) కార్డు తీసుకొనవచ్హును.  
దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్ నుండే సులభంగా ఆయుష్మాన్ భారత్ ABHA పథకంలో చేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. *మీరు కార్డ్ డౌన్ లోడ్ చేసిన తరువాత మి గ్రూప్ లో పోస్ట్ చేయండి..అది చూసి మిగతావారు కూడా ఆ విధముగా ఈ పదకం లో చేరుతారు* . మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి, ఐడి కార్డులు జాగ్రత్తగా భద్రపరుచుకోండి...