12, ఫిబ్రవరి 2023, ఆదివారం

అహంకారం

 ప్రాతరగ్నిః పురుప్రియో విశస్తవేతాతిధిః| విశ్వేయస్మిన్నమర్త్యే హవ్యం మర్తాన ఇంధతే||


*భావార్థము:* అగ్నిదేవా ! అతి ప్రియమైన వాడవు. సమస్త గృహములలోను అతిథిరూపములో నివశించువాడవు. ప్రాతఃస్మరణీయుడవు, మరణంలేనివాడవు. ఇటువంటి నీకు సమస్త ప్రజలు హవిష్యాన్నముతో ఆహుతులు సమర్పించుచున్నారు.

*సంకలనం*


*“అహంకారం”* మనను ప్రతి ఒక్కరి నుండి ఆఖరుకు భగవంతుడి నుండి కూడా దూరం చేస్తుంది. కింద పడ్డానని ఆగి పోకూడదు మరియు అందరికంటే వెనకాపడ్డానని అలసిపోకూడదు.తిరిగి ప్రయత్నం చేస్తూ ఉంటే, *“విజయం”* మన చెంతకు చేరుతుంది.”

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

పండుటాకు అవుతుందని* .

 హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు.....*

*భోజనానికి ఎంత తీసుకుంటారు......*

*యజమాని చెప్పాడు...*

చేపల పులుసుతో అయితే 50 రూపాయలు,

*అవి లేకుండా అయితే 20 రూపాయలు....*

*ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి ,ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు....*

*నా చేతిలో ఈవే ఉన్నాయి..*

*వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు....ఉత్తి అన్నమైనా ఫరవాలేదు...*

*కాస్త ఆకలి తీరితే చాలు.*

*నిన్నటి నుండి ఏమీ తినలేదు...*

*ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది....*

*హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు.*

*నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను....* ఆయన కంటినుంది కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి.వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్నవ్యక్తి అడిగాడు....


*మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా...?,*

ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూసి కళ్ళు వొత్తుకుంటు ఇలాచెప్పారు...

నా గత జీవితం గుర్తుకువచ్చి కన్నీళ్ళు వచ్చాయి.... నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి.....

*ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి.... నేను కూడపెట్టిన ప్రతీ పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చుపెట్టాను. దానికోసం నేను నాయవ్వనాన్ని, 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను...*

అన్నింటికి నా వెన్నుముకై నిలచిన నా భార్య నన్ను ఒంటరివాడినిచేసి ముందే వెళ్లి పోయింది....ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటినుండి నా కొడుకులు, కొడళ్లు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు.వాళ్లకు నేను భారమవ్వడం మొదలైనాను.

ఎంత ఒదిగి ఉంటున్నా , నన్ను వాళ్ళు అంత దూరంపెట్టనారంభించారు....

నేను వృద్దుణ్ణి కదా....? కనీసం

నా వయస్సు కైనా గౌరవమివ్వచ్చుకదా....? అదీ ..లేదు...

వాళ్లందరు భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్లే వాడిని, అయినా అప్పుడు కూడా తిట్లూ, చీత్కారాలు తప్పేవి కావు, భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది, మనవలుకూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ, నాన్న చూస్తే తిడతారనే భయంతో...

ఎప్పుడు ఒకటే సతాయింపు ఎక్కడికైనా పొయి బ్రతకవచ్చుకదా, అని..

*పగలనక, రాత్రనక, చెమటోడ్చి కష్టపడి, కంటినిండా నిద్ర పోకుండా, కడుపునిండా తినకుండా ఆమె, నేను కూడబెట్టిన డబ్బుతో ఒకొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు...., ఆమె జ్ఞాపకాలు, చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు...*

*కానీ ఏం చేయను కోడలి బంగారం దొంగిలించాననే నెపంతో దొంగ అనే ముద్ర వేశారు...కొడుకు కోప్పడ్డాడు, ఇంకా నయం కొట్టలేదు, అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అదికూడా జరగవచ్చు.తండ్రి పై చేయి చేసుకున్న కొడుకు* అనే అపవాదు వాడికి రాకూడదని, బయటకు వచ్చాను.నాకు చావంటే భయం లేదు, అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికోసం బ్రతకాలి....*?

*ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు..*

తనవద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు....

యజమాని వద్దు చేతిలో ఉండనివ్వండి అన్నాడు....

*ఎప్పుడైనా మీరు ఇక్కడకు రావచ్చు...*

*మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది..*

*ఐతే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడపెట్టి చెప్పాడు....*

చాలా సంతోషం, మీ ఉపకారానికి....

*ఏమి అనుకోకండి... ఆత్మాభిమానం, నన్ను విడవటంలేదు. వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని గమ్యంతెలియని బాటసారిలా...* వెళ్ళిపోయాడు.

ఆ వ్యక్తి నా మనసుకి చేసిన గాయం నేటికీ మానలేదు.

*అందుకే అంటారు ప్రతీ పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండుటాకు అవుతుందని* .......

పండుటాకులాంటి ఆ పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే మనకు అటువంటి ఒకరోజు వస్తుందని ఎవరు చింతించడం లేదు..???

కావలసింది, అక్కరలేనిది అని తేడా లేకుండా ప్రతీది షేర్ చేసి MB అవగొట్టేవాళ్ళు, దీన్నికూడా షేర్ చెయ్యండి

ఎవరైనా ఒక్కళ్ళ మనసు మారినా.....*చాలు.*

*మార్పు మననుండే ప్రారంభం కానీయండి.*

అహంకారం

 ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🙏🏿💐

ఎవరికైనా అహంకారమే అవరోధం🙏🏽💐

అహంకారంతో ఎందరో మహానుభావులు నామరూపాలు లేకుండా పోయారు రావణాసురుడు హిరణ్యకశిపుడు హిరణ్యక్షుడు దుర్యోధనుడు లాంటివారు ఎందుకు కొరగాని వాళ్ళు అయిపోయారు🙏🏽💐

ఎప్పుడైనా అహంకారం లేకుండా అణుకువ వినియం కలిగి ఉంటే మామూలు వ్యక్తులు కూడా మహాత్ములు అవుతారు అనేది సత్యం అహం ఉంటే మనుషులే కాదు ఆకులు అలములు కూడా గౌరవం కోల్పోతాయి🙏🏽💐

ఒక చిన్న కథ చాలా బాగుంది చదవండి 🙏🏿💐

ఒకసారి ఆకులన్నీ సభ పెట్టుకున్నాయి. ముందుగా మామిడాకు తల ఎగరేస్తూ మాట్లాడింది నేను ప్రతి శుభానికి శుభకార్యానికి ఎంతో అవసరం ఆఖరికి దేవుడు విగ్రహాలను పటాలను కూడా నేను లేకుండా పెట్టరు గోప్ప జన్మ నాది అని మామిడాఅంది అయితే గుమ్మాలకి ద్వారాలకి తలకిందులుగా వేలాడటమే మామిడాకు స్థానం అని నిజాన్ని మర్చిపోయింది అంటే బతుకు తల్లకిందలైందనే విషయాన్ని గ్రహించలేకపోయింది🙏🏽💐

ఇక తర్వాత అరిటాకు నిలిచింది తన ప్రతిభను చెప్పుకోవడం మొదలుపెట్టింది దేవునికి ప్రసాదం నివేదన అరిటాకుల్లోనే చేస్తారని గొప్పగా చెప్పుకుంది పెళ్ళిలో పేరంటాల్లో అరిటాకులో భోజనాలు వడ్డించితే సాంప్రదాయ పద్ధతిలో భోజనాలు పెట్టారనే గొప్ప పేరు ఆ భోజనానికి వస్తుందని గర్వంగా తల ఎగరేసింది అయితే అవసరార్థం అరిటాకును వాడిన చివరకు తాను ఎంగిలాకుల కుప్పలో పడవలసిందే అని అరిటాకు మర్చిపోయింది🙏🏿🙏🏽🙏🏽💐

ఇక కరేపాకు వంతు వచ్చింది వంట రుచి రావాలంటే సుగంధ భరితం అవ్వాలంటే కరేపాకు ఎంతో అవసరం. కరేపాకు లేకపోతే ఆ వంట దానికి సార్థకత రాదు అంతటి ప్రాముఖ్యత కలదాన్ని నేను అని కరేపాకు అహం ప్రదర్శించింది అవునవును తింటున్నప్పుడు నిన్ను (కరేపాకు తీసి )అవతల పారేస్తారు అంత నీచమైన స్థానం నీది అని మిగతా ఆకులు విని వినబడనట్లు గోణుక్కున్నాయి🙏🏿🙏🏽💐

ఇక తర్వాత తమలపాకు మాట్లాడింది మంచి సువసనతో నోరులన్నిటినీ పండిస్తాను తాంబూలం సేవనానికి మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని తన గొప్పతనాన్ని తానే చెపుతుంది తమలపాకు అవునవును తాంబూల సేవనం అయిన తర్వాత పిప్పిగా మిగిలిపోయిన నిన్ను వుంమ్ముగా వూసి పారేస్తారు అది నీ స్థానం అని హాస్యంగా నవ్వుకుంటూ ఎగతాళి చేశాయి మిగతా ఆకులు🙏🏿🙏🏽💐

తమలపాకు తర్వాత మారి ఏ ఆకు మాట్లాడటానికి నిలబడలేదు అయితే వినమ్రరంగా కూర్చుని అంతా వింటున్న ఓ ఆకు తులసి ఆకు వైపు చూసింది తులసి ఆకుని తన గొప్పదనాన్ని చెప్పుకోమని తులసిఆకుకు ఎంతగానో చెప్పింది తులసి ఆకు మాత్రం ససేమీరా మాట్లాడలేనని కరాఖండిగా చెప్పింది మాట్లాడవలసిందే అని అన్ని ఆకులు తులసిని ఆకును బలవంతం చేశాయి చేసేదేమీ లేక మాట్లాడటానికి సిద్ధపడింది తులసి ఎంతో వినమ్రరంగా నిలుచుని ఇలా అంది నేను చాలా చిన్న ఆకుని నాకే ప్రత్యేకత లేదు అని చెప్పి నెమ్మదిగా కూర్చుంది తులసి ఆకులో అణువణువునా ఏమాత్రం అహంకారం అహభావం ఏ మాత్రం కనిపించలేదు అందుకే తులసి ఆకు పవిత్రమైంది అమ్మ స్థానం పొందింది తులసమ్మాయింది ప్రతి వారి చేత నిత్యం పూజలు అందుకుంటుంది

చూశారా ఎప్పుడైనా అహంకారం మనిషినైనా ఆకునైనా అధోపతళానికి తీసుకువెళతాయి

అణుకువ వినియం కలిగి ఉందాం భగవంతుడిని కృపను పొందుదాం 🙏🏿🙏🏿💐💐

(ఒక మహానుభావుడు రచన నుండి సేకరణ)

ఫినిక్స్


 

ధర్మమే మనల్ని రక్షిస్తుంది.

 శ్లోకం:☝️

*నాఽముత్ర చ సహాయార్థం*

  *పితా మాతా చ తిష్ఠతః ll*

*న పుత్రదారం న జ్ఞాతిః*

  *ధర్మస్తిష్ఠతి కేవలం ll*

 - మనుస్మృతి


భావం: లోకాంతరంలో తల్లిదండ్రులు కాని, భార్యా పిల్లలు కాని లేదా సోదరులు బంధువులు కాని ఎవరూ సహాయానికి నిలబడరు. కేవలం మన ధర్మమే మనల్ని అనుసరించి రక్షిస్తుంది. మన కర్మకు మనమే బాధ్యులం.

మన సంస్కృతి

 మనం బ్రతికినంత కాలం, కంఫర్టబుల్ గా బ్రతుకుతాం, మాకేంటి? అని అనుకోవద్దు. ఈ ఆరోగ్యం ఎల్లకాలం ఇలాగే నిల్చి ఉండదు. అనారోగ్యానికి గురవ్వక తప్పదు. ప్రపంచాన్ని వీడక తప్పదు. మన ధనం మనకు అన్నం పెట్టదు. 

మనకు పునర్జన్మ మీద ఉత్తర గతులమీద ప్రగాఢ మైన విశ్వాసం ఉంది. మన జీవన విధానం ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. ఇక్కడ బంధాలు అనుబంధాలు ప్రేమలు కట్టుబాట్లు పుణ్య పాప చింతన, చిన్నతనం నుంచి దైవ భక్తి, దేశ భక్తి ఉండే దేశం. ఎంతమంది ఎన్ని సంవత్సరాలు పరిపాలించినా, మన సంస్కృతి నుంచి, మనల్ని మరల్చలేక పోయారు. 

అమెరికన్ స్టైల్ ఆఫ్ లివింగ్ అన్న పేరుతో పెళ్లి పెటాకులు లేకుండా తిరిగే సంస్కృతి మనకొద్దు. ధనసంపాదనే ధ్యేయంగా పెట్టుకుని మన పిల్లల్ని విదేశాల్లో శాశ్వతంగా ఉండేలా చేయవద్దు. మనం ఎన్నటికీ దిక్కులేని వారిగా కాకూడదు. మన ఆడబిడ్డలు మగాళ్లు లా, మగాళ్లు ఆడవాళ్ళు లాగా మసలే పరిస్థితి రాకూడదు. ఆడవాళ్ళు చదువుకోవచ్చు. ఉద్యోగాలు చేయవచ్చు. కానీ సగం సగం బట్టలు కట్టుకుని, గుప్తంగా ఉంచవలసిన సౌందర్యాన్ని, వెల్లడి చేస్తూ, అలాగే ఉద్యోగాలు చేసే పురుషులు వంటలు వండి పెట్టే పద్ధతి మనకు రాకూడదు. స్త్రీ వండి వడ్డించే దాంట్లో ఉండే సౌందర్యం పురుషులు చేస్తే అందం ఉండదు. పరిమితమైన, అర్ధవంతమైన స్వేచ్ఛ ఉండాలి. మన పురాణాలు ఇతిహాసాలు మనం చదివి వాటి ఉనికిని చాటాలి. ఇతర దేశాలకు వెళ్లిన వెళ్ళవచ్చు. కానీ కష్టమో సుఖమో తిరిగి భారతదేశానికి  రావాలి.

తల్లి తండ్రుల చివరి స్టేజ్ లో, వారి వద్దనే ఉండి, ఉత్తర క్రియలు చేయాలి. పితృదేవతలకు వంశాభివృద్ధి కై, చేయవలసిన శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉండాలి. ధనంతో ఏదైనా కొనగలము అనే భ్రాంతి నుండి బయటకు రావాలి. మన తెలివి, శక్తి, యుక్తి మనదేశాభి వృద్ధి కి మాత్రమే వినియోగించాలి. వేనోళ్ళ కొనియాడబడే ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే భావితరాలకు దిక్కు అవాలి. మనందరం భారతీయులం. ఏ నాడూ ఇతర దేశాలను పొగడొద్దు. మనల్ని మనం కించపరిచేలా వ్యాఖ్యలు చేయవద్దు. ఒకనాటి మన సంపదను దోచుకుని ఈనాడు ఈ ఇతర దేశాలు ఈనాడు సంపన్న దేశాలుగా చెలామణి అవుతున్నాయి. మాతృ భక్తి పితృ భక్తి దేశ భక్తి అంటే ఏమిటో మననుంచి తెలుసు కోవాలి. అనేక ఇతర దేశాలు కలిస్తే ఒక అమెరికా ఒక ఇంగ్లాండ్ అయ్యాయి. కానీ భారత దేశం వేద కాలం నాటికి ఈనాటికీ కూడా, ఏ ఇతర దేశాలు కలవని అఖండమైన భారతదేశం. 

మన వేదాలలో చెప్పబడినది ఏమిటంటే, పుడితే మానవుడు గా పుట్టాలి. అందునా భారతదేశం లో పుట్టాలి అని. కడకు దేవతలు కూడా ఈ భారత దేశంలో పుట్టాలి అని కోరుకుంటారుట.

ఇది వేద భూమి. కర్మ భూమి. పునరాగతి రహితమైన జన్మ కోసం భారతీయులుగా మన చింతన సాగిద్దాం.

సుఖము

 .                        శుభోదయమ్

                        *సుభాషితమ్*


𝕝𝕝శ్లో𝕝𝕝

*శాంతితుల్యం తపో నాస్తి*

*న సంతోషాత్పరం సుఖమ్|*

*న తృష్ణయా పరో వ్యాధి:*

*న చ ధర్మో దయాపరః||*


𝕝𝕝తా 𝕝𝕝 *శాంతి కంటే మించిన తపస్సు లేదు*..... 

*తృప్తి, సంతోషాల కంటే మించిన సుఖము లేదు*...... 

*పేరాశని మించిన రోగము లేదు*...... 

*దయాగుణముని మించిన ధర్మము లేదు*....