ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🙏🏿💐
ఎవరికైనా అహంకారమే అవరోధం🙏🏽💐
అహంకారంతో ఎందరో మహానుభావులు నామరూపాలు లేకుండా పోయారు రావణాసురుడు హిరణ్యకశిపుడు హిరణ్యక్షుడు దుర్యోధనుడు లాంటివారు ఎందుకు కొరగాని వాళ్ళు అయిపోయారు🙏🏽💐
ఎప్పుడైనా అహంకారం లేకుండా అణుకువ వినియం కలిగి ఉంటే మామూలు వ్యక్తులు కూడా మహాత్ములు అవుతారు అనేది సత్యం అహం ఉంటే మనుషులే కాదు ఆకులు అలములు కూడా గౌరవం కోల్పోతాయి🙏🏽💐
ఒక చిన్న కథ చాలా బాగుంది చదవండి 🙏🏿💐
ఒకసారి ఆకులన్నీ సభ పెట్టుకున్నాయి. ముందుగా మామిడాకు తల ఎగరేస్తూ మాట్లాడింది నేను ప్రతి శుభానికి శుభకార్యానికి ఎంతో అవసరం ఆఖరికి దేవుడు విగ్రహాలను పటాలను కూడా నేను లేకుండా పెట్టరు గోప్ప జన్మ నాది అని మామిడాఅంది అయితే గుమ్మాలకి ద్వారాలకి తలకిందులుగా వేలాడటమే మామిడాకు స్థానం అని నిజాన్ని మర్చిపోయింది అంటే బతుకు తల్లకిందలైందనే విషయాన్ని గ్రహించలేకపోయింది🙏🏽💐
ఇక తర్వాత అరిటాకు నిలిచింది తన ప్రతిభను చెప్పుకోవడం మొదలుపెట్టింది దేవునికి ప్రసాదం నివేదన అరిటాకుల్లోనే చేస్తారని గొప్పగా చెప్పుకుంది పెళ్ళిలో పేరంటాల్లో అరిటాకులో భోజనాలు వడ్డించితే సాంప్రదాయ పద్ధతిలో భోజనాలు పెట్టారనే గొప్ప పేరు ఆ భోజనానికి వస్తుందని గర్వంగా తల ఎగరేసింది అయితే అవసరార్థం అరిటాకును వాడిన చివరకు తాను ఎంగిలాకుల కుప్పలో పడవలసిందే అని అరిటాకు మర్చిపోయింది🙏🏿🙏🏽🙏🏽💐
ఇక కరేపాకు వంతు వచ్చింది వంట రుచి రావాలంటే సుగంధ భరితం అవ్వాలంటే కరేపాకు ఎంతో అవసరం. కరేపాకు లేకపోతే ఆ వంట దానికి సార్థకత రాదు అంతటి ప్రాముఖ్యత కలదాన్ని నేను అని కరేపాకు అహం ప్రదర్శించింది అవునవును తింటున్నప్పుడు నిన్ను (కరేపాకు తీసి )అవతల పారేస్తారు అంత నీచమైన స్థానం నీది అని మిగతా ఆకులు విని వినబడనట్లు గోణుక్కున్నాయి🙏🏿🙏🏽💐
ఇక తర్వాత తమలపాకు మాట్లాడింది మంచి సువసనతో నోరులన్నిటినీ పండిస్తాను తాంబూలం సేవనానికి మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని తన గొప్పతనాన్ని తానే చెపుతుంది తమలపాకు అవునవును తాంబూల సేవనం అయిన తర్వాత పిప్పిగా మిగిలిపోయిన నిన్ను వుంమ్ముగా వూసి పారేస్తారు అది నీ స్థానం అని హాస్యంగా నవ్వుకుంటూ ఎగతాళి చేశాయి మిగతా ఆకులు🙏🏿🙏🏽💐
తమలపాకు తర్వాత మారి ఏ ఆకు మాట్లాడటానికి నిలబడలేదు అయితే వినమ్రరంగా కూర్చుని అంతా వింటున్న ఓ ఆకు తులసి ఆకు వైపు చూసింది తులసి ఆకుని తన గొప్పదనాన్ని చెప్పుకోమని తులసిఆకుకు ఎంతగానో చెప్పింది తులసి ఆకు మాత్రం ససేమీరా మాట్లాడలేనని కరాఖండిగా చెప్పింది మాట్లాడవలసిందే అని అన్ని ఆకులు తులసిని ఆకును బలవంతం చేశాయి చేసేదేమీ లేక మాట్లాడటానికి సిద్ధపడింది తులసి ఎంతో వినమ్రరంగా నిలుచుని ఇలా అంది నేను చాలా చిన్న ఆకుని నాకే ప్రత్యేకత లేదు అని చెప్పి నెమ్మదిగా కూర్చుంది తులసి ఆకులో అణువణువునా ఏమాత్రం అహంకారం అహభావం ఏ మాత్రం కనిపించలేదు అందుకే తులసి ఆకు పవిత్రమైంది అమ్మ స్థానం పొందింది తులసమ్మాయింది ప్రతి వారి చేత నిత్యం పూజలు అందుకుంటుంది
చూశారా ఎప్పుడైనా అహంకారం మనిషినైనా ఆకునైనా అధోపతళానికి తీసుకువెళతాయి
అణుకువ వినియం కలిగి ఉందాం భగవంతుడిని కృపను పొందుదాం 🙏🏿🙏🏿💐💐
(ఒక మహానుభావుడు రచన నుండి సేకరణ)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి