11, మే 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం*

 *08.05.2021  సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  అరువది రెండవ అధ్యాయము*


*ఉషా - అనిరుద్ధుల సమాగమము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*చిత్రలేఖోవాచ*


 *62.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*వ్యసనం తేఽపకర్షామి త్రిలోక్యాం యది భావ్యతే|*


*తమానేష్యే నరం యస్తే మనోహర్తా తమాదిశ॥10863॥*


*అంతట చిత్రలేఖ ఇట్లనెను* "సుందరీ! నేను సకల రాకుమారుల చిత్తరువులను రూపొందించి నీ ముందుంచగలను. వారిలో నీ మనస్సును దోచిన సుందరుని నీవు గుర్తింపగల్గినచో, అతడు ముల్లోకములలో ఎక్కడ ఉన్నను తీసికొనివచ్చి నీ ముందుంచగలను. ఆ విధముగా నీ విరహవేదనను శాంతింపజేయగలను. అందులకై నన్ను ఆదేశింపుము"


 *62.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*ఇత్యుక్త్వా దేవగంధర్వసిద్ధచారణపన్నగాన్|*


*దైత్యవిద్యాధరాన్ యక్షాన్ మనుజాంశ్చ యథాలిఖత్॥10864॥*


చిత్రలేఖ ఇట్లు పలికిన పిమ్మట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, నాగులు, దైత్యులు, విద్యాధరులు, యక్షులు, మానవులు మున్నగువారి చిత్రములను యథాతథముగా లిఖించెను.


 *62.20 (ఇరువదియవ శ్లోకము)*


*మనుజేషు చ సా వృష్ణీన్ శూరమానకదుందుభిమ్|*


*వ్యలిఖద్రామకృష్ణౌ చ ప్రద్యుమ్నం వీక్ష్య లజ్జితా॥10865॥*


 *62.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*అనిరుద్ధం విలిఖితం వీక్ష్యోషావాఙ్ముఖీ హ్రియా|*


*సోఽసావసావితి ప్రాహ స్మయమానా మహీపతే॥10866॥*


చిత్రలేఖ మానవులలో శూరుడు (వసుదేవుని తండ్రి), వసుదేవుడు, బలరామకృష్ణులు, ప్రద్యుమ్నుడు మొదలగువారి చిత్రములను లిఖించెను. ఆ చిత్రపటములను వరుసగా చూచుచు వచ్చిన ఉషాసుందరి ప్రద్యుమ్నుని చిత్తరువును చూచినంతనే ఇంచుక సిగ్గుపడెను. పరీక్షిన్మహారాజా! పిమ్మట అనిరుద్ధుని చిత్రమును కాంచినంతనే ఉషాసుందరి సిగ్గుతో తలవంచుకొని, చిఱునగవుతో 'ఇతడే! ఇతడే! నా మనోహరుడు' అని పలికెను.


*62.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*చిత్రలేఖా తమాజ్ఞాయ పౌత్రం కృష్ణస్య యోగినీ|*


*యయౌ విహాయసా రాజన్ ద్వారకాం కృష్ణపాలితామ్॥10867॥*


అంతట యోగినియైన చిత్రలేఖ అతనిని కృష్ణుని మనుమడైన అనిరుద్ధునిగా గుర్తించెను. వెంటనే ఆమె అప్పటికప్పుడే (ఆ రాత్రియే) బయలుదేఱి, ఆకాశమార్గమున పయనించి, కృష్ణుని పాలనలో నున్న ద్వారకానగరమునకు చేరెను..


*62.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*తత్ర సుప్తం సుపర్యంకే ప్రాద్యుమ్నిం యోగమాస్థితా|*


*గృహీత్వా శోణితపురం సఖ్యై ప్రియమదర్శయత్॥10868॥*


ఆ సమయమున అనిరుద్ధుడు హంసతూలికా తల్పముపై నిదురించుచుండెను. అంతట చిత్రలేఖ తన యోగమాయా ప్రభావమున అతనిని తీసికొని శోణితపురమునకు చేరి, తన నెచ్చెలియగు ఉషాసుందరికి ఆమె యొక్క ప్రియుని చూపించెను.


*62.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*సా చ తం సుందరవరం విలోక్య ముదితాననా|*


*దుష్ప్రేక్ష్యే స్వగృహే పుంభీ రేమే ప్రాద్యుమ్నినా సమమ్॥10869॥*


ఆ ఉషాదేవి ఆ పరమసుందరుని (అనిరుద్ధుని) గాంచినంతనే సంతోషముతో ఆమె ముఖమున కోటికాంతులు వెల్లివిరిసెను. ఆ సుందరియొక్క ఏకాంతమందిరము పరపురుషులెవ్వరును తొంగియైనను చూడజాలనంతగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సురక్షితముగానున్నది. ఆమె అట్టి తన అంతఃపురమున తన ప్రాణప్రియుడైన అనిరుద్ధునితో క్రీడించెను.


*62.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*పరార్ధ్యవాసః స్రగ్గంధధూపదీపాసనాదిభిః|*


*పానభోజనభక్ష్యైశ్చ వాక్యైః శుశ్రూషయార్చితః॥10870॥*


*62.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*గూఢః కన్యాపురే శశ్వత్ప్రవృద్ధస్నేహయా తయా|*


*నాహర్గణాన్ స బుబుధే ఊషయాపహృతేంద్రియః10871॥*


అతనియెడ ఆమె ప్రేమానురాగములు దినదినప్రవర్ధ మానమగుచుండెను. ఆ సుందరి మిగుల శ్రేష్ఠమైన వస్త్రాభరణములు, పూలమాలలు, సుగంధ లేపనములు, ధూపదీపములు, సుఖాసనములు మొదలగు ద్రవ్యములతోను, మధుర పానీయములతోను, భక్ష్యభోజ్యములతోను, నర్మభాషణములతోను, ఇతర సేవలతోను తన ప్రియుని ఆరాధించుచుండెను. ఆ విధముగా ఆ లలనామణి అతని హృదయమును ఆకట్టుకొనెను. ఆ అంతఃపురములో రహస్యముగా సుఖడోలికలలో తేలియాడుచున్న ఉషా-అనిరుద్ధులకు ఎన్ని దినములు గడచిపోవుచున్నదియు తెలియకుండెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి     అరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం🌼🌿

 *🌼🌿నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం🌼🌿


శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని పరాశర సంహిత'లో ఉంది.


నవగ్రహాల అనుగ్రహం త్వరగా పొందాలంటే వాల్మీకి రామాయణం లోని ఈ 9 శ్లోకాలు నిత్యం పారాయణ చేయడం మంచిది.


నవగ్రహాలు అత్యంత కరుణా స్వరూపులు. మనం పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల బట్టి ఫలితాలని ఇస్తారు. 


కానీ భక్తితో వారిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతిస్తే శుభఫలితాల్ని అనుగ్రహిస్తారు. 


శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది.


నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు.


వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము.సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం. 


రత్నములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది. ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది. 


ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది. 


శ్లోకము తత్సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తెలుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.


♦️మాణిక్యం (సూర్యుడు)..

తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |

ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||


అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.


♦️ముత్యం (చంద్రుడు).

యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |

స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం స కర్మసు న సీదతి ||


అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.


♦️పగడం (కుజుడు).

అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |

అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||


అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.


♦️మరకతం (బుధుడు).

నమోస్తు రామాయ సలక్ష్మణాయ

దేవ్యై చతస్యై జనకాత్మజాయై |

నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:

నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||


అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.


♦️హీరకం (శుక్రుడు)

రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర: |

రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||


అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.


♦️ఇంద్రనీలం (శని)..

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||


అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను.


♦️గోమేదికం (రాహువు)..

యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |

యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||


అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.


♦️వైడూర్యం (కేతువు)..

నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |

అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||


అర్థము : శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.

ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం.

జై హనుమాన్*


♦️🙏♦️🙏♦️🙏♦️🙏♦️🙏

తెలంగాణ లాక్ డౌన్ మార్గదర్శకాలు

 *#ab6news* *Breaking*


*తెలంగాణ రాష్ట్ర కాబినెట్ నిర్ణయాలు*


*తెలంగాణ లాక్ డౌన్ మార్గదర్శకాలు*@ab6news


ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది. 


*క్యాబినెట్ నిర్ణయాలు :*


- మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి..  10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది. 

- మే 20వ తేదీన క్యాబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.

- యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. 

- ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను  క్యాబినెట్ ఆదేశించింది. 

- అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం.


https://bit.ly/3rjKHE2

*Subscribe@ab6news*


- రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరిన సీఎం. 

- ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు. 


*లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు*@ab6news


- వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు. 

- తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. 

- వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు. 

- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది. 

-విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి. 

- జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది. 

- జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. 

- కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు


*- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు*


- ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.

- ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.

- గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి. 

- అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి

- అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.

- తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం

- ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ  ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. 

- ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. 

- కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది. 

- సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. 

-పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది.


https://bit.ly/3rjKHE2


*Subscribe@ab6news*

లాక్ డౌన్ నుంచి మినహాయింపు

 లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు :

- వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.

- తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.

- వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.

- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.

-విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.

- జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.

- జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.

- కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు

- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు

- ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.

- ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.

- గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.

- అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి

- అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.

- తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం

- ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.

- ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.

- కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది.

- సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.

-పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది.

పంకజం పదనిసలు - 10*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

ఇది ఇప్పుడు వ్రాసింది కాదండోయ్. అల్లప్పుడు లాక్డౌన్లో ప్రైవేటు డాక్టర్లందరూ ఖాళీగాఉండి తీరిగ్గా డాన్సులూ పాటలూ యూట్యూబ్లో పెడుతూ ఎంజాయ్ చేసినరోజులు. పాపం మళ్ళీ ఇప్పుడు బిజీ అయిపోయార్లెండి. 


 *పంకజం పదనిసలు - 10* 


 ఓ చేత్తో కాఫీకప్పూ, ఇంకో చేత్తో పకోడీ ప్లేటూ బాలెన్స్ చేస్తూ కుంటుతూ నడుస్తున్న నన్ను పంకజం నవ్వుతూ చూస్తోంది. 


"ఏంటీ మొన్న డాన్స్ తాలూకు నెప్పి తగ్గక నేను చస్తుంటే, అంత కన్నార్పకుండా చూస్తున్నావ్" విసుక్కున్నాను పంకజాన్ని. 


"అసలు నీకు డాన్స్ రాదన్న అపోహ నాకు ఎందుకొచ్చిందా?  అని ఆలోచిస్తున్నా.  ఇప్పుడు రెండుచేతుల్లో కప్పూ, ప్లేటూ పట్టుకు నడుస్తుంటే, నీ నడకే నాట్యంలా ఉంది తెలుసా" అంది. 

వెక్కిరిస్తోందని అర్ధమవుతూనేఉంది.  కసిగా పెదవికొరుక్కొని మావారి దగ్గరికి వెళ్ళాను. "డాక్టర్ దగ్గరికి వెళదాం పదండి అర్జంటుగా" అని ఆర్డర్ వేశాను. 


హాయిగా పకోడీలు నముల్తూ మధ్య మధ్యలో కాఫీ తాగుతూ" మొన్నేగా వెళ్ళొచ్చాం మన ఫామిలీ డాక్టర్ గుర్నాధం గారి దగ్గరికీ, నెమ్మదిగా ఓ వారం పది రోజుల్లో తగ్గుతుందని చెప్పాడుకదా" అన్నారు. 


నాకోపం నషాలానికి అంటింది.  అందుకే ...సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కి వెళదామనేది.  అక్కడైతే ఎంచక్కా వెంఠనే తగ్గుతుంది. దగ్గరలోనే ఉన్న "వైద్య" సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కి వెళదాం, అన్నాను. 


"అమ్మో! ఆ సముద్రం  లో పడితే సాయంత్రానికి కానీ పైకి తేలం.  అసలే కరోనా  రోజులు నేను రాను గాక రాను" అని తేల్చేసారు.  నేను మాత్రం ఎందుకూరుకుంటానూ,  అంతకంటే మొండిగా"సరే మీ ఇష్టం నేనుమాత్రం రేపొద్దునే వెళ్ళి కాలునెప్పి వెంఠనే తగ్గించుకుంటా" అని మంగమ్మ శపధం చేసాను. 


తెల్లారి చకచకా టిఫినూ, వంటా కానిచ్చి, ఆయన్ను కూడా బైల్దేరదీశాను.  నాలుగు వీధుల అవతల ఉన్న హాస్పటల్ కి. 


హాస్పిటల్  గేటుదగ్గర దించి, ఓ పదివేలు నాచేతిలో పెట్టి "నేను మాత్రం రాను నువ్వే వెళ్ళిరా" అనిచెప్పి చక్కా వెళ్ళిపోయారు తను. 


ఎప్పుడూ వచ్చేపోయే జనాలతో పెళ్ళిపందిరిలా హడావుడిగా ఉండే ఆ ఐదంతస్తుల భవనం చాలా నిశ్సబ్దంగా నిద్రపోతోంది. ఔరా! కరోనా! ఎంతపని చేసావ్ అనుకున్నా. 


గేటుదగ్గరే సానెటైజరు తో చేతులు రుద్దించి, గ్లౌసూ, సాక్సూ, తలతో సహా కవర్చేసే డిస్పోజబుల్ ప్లాస్టిక్ బుర్ఖా ఇచ్చి రెండొందలు వసూలు చేసాడు అక్కడి అసిస్టెంటు. 


"రెండొందలు పోతే పోయినై గానీ ఆస్ట్రోనాట్ లాగా భలే ఉన్నావ్" అంది పకపకా నవ్వుతూ పంకజం. 


నెమ్మదిగా మొదటి అంతస్తు కి చేరగానే," ఇదిగో నాలుగు ఉజ్జీలు, నాది గుర్రం. అంటోందొక నర్సు.  ఇదిగో నాలుగు గుర్రాలు ...నాది ఏనుగు నేనే గెలిచానొచ్" అంటోంది ఇంకో నర్సు.


ఇద్దరూ పేషంట్లకి వేసే చైర్ల వరసలు పక్కకి జరుపుకొని కిందకూచొని ఆడుతున్నారు" ఈ పదాలువిని చాలా రోజులైందే, ఏమాటబ్బా!" అని తొంగి చూసి ఆశ్చర్యపోయాను ఎంచక్కా  ఇద్దరూ చింతపిక్కలాట (గిల్లాలాట) ఆడుకుంటున్నారు!


రిసెప్షన్ లో కూచుని ఉండే అందమైన కుర్రపిల్ల ..హాయిగా కాళ్ళు బారచాపి రిసెప్షన్ బల్లమీదపెట్టి నౌకాసనం భంగిమలో సెల్ ఫోన్ లో ఆడుకుంటోంది. 


అరడజను కంప్యూటర్లతో కళ కళ లాడే రిసెప్షన్ ఒక్క అమ్మాయితో బోసిపోతోంది. నెమ్మదిగా" సిస్టర్" అని పిలిచాను.  ఉలిక్కిపడి లేచింది.  "ఏమిటి సమస్య, జలుబూ దగ్గూ ఉన్నాయా? ఇక్కడ ట్రీట్మెంట్ లేదు" అంది భయంగా.

"లేదు లేదు, అలాంటివేం లేవు కాలునెప్పి మాత్రమే" అని భరోసా ఇచ్చాను. "హమ్మయ్య" అని తేలిక పడి ఫైల్లో పేరు అవీ రాసి ఇంకో అసిస్టెంట్ ని కేకేసింది. దూరంగా ఇంకో బల్లమీద బారాకట్ట ఆడుతున్నారు అతనూ ఇంకొకరూ" నాది దోయం, చచ్చావురే.  మళ్ళీ నా ఆటే!  గడులు కదిలించమాక" అని పరుగెత్తుకుంటూ వచ్చి "ఎంటక్కా! ఆట మంచి పట్టులో ఉంటే పిలుస్తావేందీ.  అంటూ నావైపు అనుమానంగా చూసాడు. 


"అలాంటిదేమీ లేదులే" ఆర్థో గారి దగ్గరకు తీసుకువెళ్ళు చెప్పింది నర్సు. 


పేరు  రాయిచ్చుకున్నాక కనీసం రెండుగంటలైన పట్టేది ఒకప్పుడు, ఇప్పుడు వీ ఐ పీ లాగా వెంటబెట్టుకుని తీసుకుని తీసుకుని వెళుతుంటే నవ్వుతూ చూస్తోంది పంకజం. 


ఒకప్పుడు ఆ డాక్టర్ల రూముల ముందు పడిగాపులు కాచేవాళ్ళు పేషెంట్లు. ఇప్పుడు దర్జాగా లోపలికి నడిచాను.  బల్లమీద కూచుని డాక్టర్ గారి వళ్ళో కాళ్ళుపెట్టి పుస్తకం లో హోం వర్క్ చేస్తున్నాడో చిన్న పిల్లాడు. బహుశా ఆయన కొడుకేమో!


నన్ను చూడగానే చెప్పండి ఏమిటీ ప్రాబ్లెం  అన్నాడు. కాలు చూపించి విషయం చెప్పాను." ముందు ఎక్సరే తీయించుకు రండి తరువాత చూద్దాం" అన్నాడు. 


మళ్ళా మూడో అంతస్తులో ఎక్సరే రూముకి వెళ్ళాను. అక్కడ ఎక్సరే తీసేవాళ్ళు ఇద్దరూ ఎంచక్కా "వైకుంఠ పాళి" ఆడుకుంటున్నారు. పంకజం నవ్వుతూ," కరోనా పుణ్యమాని తిండితినటానికి కూడా తీరిక లేని మనుషులు. ఇప్పుడు చూడు ఎంత తీరిగ్గా ఉన్నారో," అని కిసుక్కుమని నవ్వింది. 


రెండు కాళ్ళకీ ఎక్సరేలు తీస్తుంటే" అదేంటీ ఒకకాలేగా నొప్పీ" అన్నాను. "డాక్టర్ గారు రెండు కాళ్ళకీ రాసారండీ" అన్నారు.  ఎనిమిదొందలు బిల్లుకట్టి ఎక్సరేతో మళ్ళా డాక్టర్ దగ్గరికి వచ్చాను. 


"పడినందువల్ల ప్రాబ్లమేమీ లేదండీ ..కాకపోతే మీకు మడమ దగ్గర ఎముక పెరుగుతోంది ఆపరేషన్ చెయ్యాలి" అన్నాడు. "ఇంతకీ ..ఇప్పటి కాలునొప్పీ," అడిగాను. "ఏమీలేదు కొంచెం లిగమెంటు టేరయ్యింది అంతే నొప్పికి టాబ్లెట్ రాస్తాను."


"అంతేనా ఇంకేమీ సమస్య లేదా ఆపరేషను పదిహేను రోజుల తర్వాత నాకు డేట్లు ఖాళినే"అన్నాడు. "పడ్డప్పుడు కొంచెం పొట్ట నొప్పి చేసింది మర్నాడు తగ్గింది లెండి" అన్నాను. 


"అలాగా! మరి చెప్పరే, ఇప్పుడు నొప్పి లేదుకదా అని నిర్లక్ష్యం చెయ్యకూడదు. వెంటనే గైనకాలజిష్టుకు చూపించండి "అని సిస్టర్ ను కేకేసి గైనిక్ కు తీసుకువెళ్ళమని చెప్పాడు. 


పంకజం నవ్వుతూ" మళ్ళీ ఓపీ ఇంకో ఐదొందలు సమర్పయామి కానీయ్" అంది. 


మేం రూం లోకి వెళ్ళే సరికి ...ఈల పాటేదో వినిపిస్తోంది.  సామజ వరగమనా... నినుచూసి  ఆగగలనా ...వయసుమీద మనసుకున్న అదుపు చెప్పతగునా ...ఈ పాటని ఈలతో పాడుతూ వీడియో చేస్తోందావిడ." ఇదేదో నీకేసు లానేవుంది.  ఆ డాన్సుజోలికి పోకుండా హాయిగా ఇలానే విజిల్ ప్రాక్టీసు చెయ్యరాదూ రిస్కుండదూ ..."కొంగు అడ్డం పెట్టుకుని కిసుక్కుమని నవ్వింది పంకజం. 


"కరోనాలో ...కులాసా ...ఎలాఉందో చెప్పండేం" అని కళ్ళు రెపరెప లాడిస్తూ వీడియో పూర్తి చేసిందావిడ. 


కూర్చోమని సమస్యేంటో అడిగి ...వెంటనే అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించుకు  రమ్మంది. అక్కడ పులీ మేకా ఆడుకుంటున్న సిస్టర్ లు డిస్ట్రబ్ చెసినందుకు విసుగ్గా మొహాలుపెట్టి స్కానింగ్ తీసి పంపారు.  వెయ్యిరూపాయలు కట్టి "ద్యావుడా!" అనుకుంటూ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళా. 


"అదృష్టవంతులు!  మీకు సమస్యేమీ లేదు.  లేక పోతే చాలా ఇబ్బంది పడేవారు. ఈమందులు వాడండి అని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చింది." అయినా నొప్పేమీ లేదుకద మందులేంటబ్బా అని చూస్తున్నాను కళ్ళజోడు మర్చిపోయినందుకు నన్ను నేను తిట్టుకుంటూ.


వెంఠనే ఆవిడ" ఏంటలా కళ్ళు చికిలించి చూస్తున్నారూ" అంది. "అదికాదూ, కళ్ళజోడు మర్చిపోయానని చెబుతున్న నా మాట వినిపించుకోకుండా,  "మీరు షుగర్ పేషెంట్ కూడా కదా వెంటనే ఆప్తాల్మజిష్ట్ దగ్గరకు వెళ్ళండి." అని సిస్టర్ అని కేకేసి వీరిని ఆప్తాల్మజిస్ట్ దగ్గరికి తీసుకు వెళ్ళమని చెప్పింది.


"కానీ, చేసిందేముంది, ఇంకో ఐదొందలు అంతేగా" అంది వెటకారంగా పంకజం. చాంబర్ లోకి అడుగు పెడుతూనే, "జెండాపై కపిరాజు .....ముందు శ్రితవాజిశ్రేణియున్ గూర్చి ....నే దండంబున్ గోనితోలు ...శ్చందనము మీద ...నా ....ఆ .....ఆ ....ఆ... ఆ ..రి . సా ...ఆ రించి ఫల్గుణుడు మూకన్ చెండుచున్నప్పుడు, ఒక్కండును ....ఒక్ఖండును నీమొరాలకింపడు కురుక్ష్మానాధ ...సంధింపగన్ ....ఆ...ఆ...ఆ...ఆ... "


కాసేపు హాస్పటల్ లోనే ఉన్నామా ...నాటకం స్టేజి వెనగ్గా ఉన్నామా?  అన్న అనుమానం వచ్చింది.  డాక్టర్ మమ్మల్ని చూసి కాస్త సిగ్గుపడి "ఎప్పటించో పద్యాలు నేర్చుకోవాలన్న కోరికండీ, కరోనా మూలంగా ఆ కోరిక తీరుతోంది" అన్నాడు. 


ఆ తర్వాత అలాగే ఖుషీగా పద్యాలు హం చేస్తూ కళ్ళు పరీక్షించి భేషుగ్గా ఉన్నాయని సర్టిఫై చేసాడు.  ఏవో ఐ డ్రాప్స్ రాసిచ్చాడు.  చివరగా నీరసంగా కనబడుతున్నారు జనరల్ ఫిజీషియన్ ని కలవమని అక్కడికి పంపించాడు.  ఇది ఆకలేసిన నీరసమని చెబుదామన్నా ఎలాగూ వినిపించుకోరు గనుక, నీరసంగా జనరల్ ఫిజీషియన్ ని కలిసాను. 


పాపం, డెబ్భై యేళ్ళ పెద్దాయన ఒక్కడే కూచుని చైనీస్ చెక్కర్ ఆడుకుంటున్నాడు.  ఆయనే నీరసంగా ఉన్నాడనిపించింది నాకు.  "ఆయన మాత్రం ఏం లేదమ్మా అంతా బాగానేఉంది రోజూ పండ్లూ కూరలూ బాగా తినమని రెండు టానిక్కులూ, రెండురకాల టాబ్లెట్లూ రాసాడు. 


కిందికి దిగి వస్తుంటే పంకజం కోపంగా" వీళ్ళంతా ఒకచోట చేరి పరస్పర ఆధారితం గానూ, పరస్పర పోషకులు గానూ ఉన్నారని నా అనుమానం అంది.  "తప్పు అలా అనకూడదు మనగురించేగా, అన్నాను. 


"మరింకేం!  మందులు కూడా కొందాం పద వాళ్ళు మాత్రం బతకొద్దూ" అంది పంకజం. కింద మందుల షాప్ ముందు ఎప్పుడూ చాంతాడంత  క్యూ ఉండేది.  చక చకా టిల్లర్ మెషిన్లో డబ్బులు లెక్కేసుకునే వాళ్ళు ఇప్పుడు ఉబుసుపోక జాగ్రత్తగా అంతవరకూ వచ్చిన డబ్బులన్నింటినీ ముందేసుకుని  "పదిహేను వందల నలభై ఐదు" అని లెక్కపెడుతున్నాడతను. వాళ్ళావిడ అక్కడే దేవుళ్ళ ఫొటోల దగ్గర అగరొత్తులు వెలిగించి కరోనా మహా మృత్యుంజయ మంత్రం నూటెనిమిది సార్లనుకుంటా, చదువుతోంది. 


అందరి డాక్టర్ల ప్రిస్కిప్షన్లూ ఇచ్చాను.  అదిచూస్తూ మందులు వెదుకుతున్నాడు అతను.  ముక్కు నలుపుకుంటూ,నాకీ సాంబ్రాణి కడ్డీల వాసన పడదు అంటున్నాను పంకజం తో,  ఎంత ఆపుకుందామన్నా ఆగలేదు.  భీకర మేఘ గర్జనలాంటి తుమ్మొకటి వందమైళ్ళ స్పీడుతో వచ్చింది.  అసలే జనం లేకుండా ఉన్న బిల్డింగేమో, అంతకంటే భయంకరంగా ప్రతిధ్వనించింది!


భూకంపమేదో వచ్చినట్లు అదిరిపడి అందరూ బల్లలకిందా కుర్చీలకిందా దాక్కున్నారు!  రిసెప్షన్లో పిల్ల తేరుకొని కరోనా, కరోనా కాల్ వన్నాట్ ఎయిట్ అని అరుస్తొంది. 


"హమ్మో! ఇంకేముందీ ఐసొలేషన్ పదిహేనురోజులు క్వారంటైన్" అని భయంతో నేనూ సంధించి విడిచిన బాణంలా ఒకటే పరుగందుకున్నా వెనకనించీ పంకజం అరుస్తున్నా వినిపించుకోకుండా.


మూడువీధులు దాటి నాలుగో వీధిలోకి వచ్చిపడ్డా, హమ్మయ్యా ఇల్లు దగ్గరి కొచ్చింది.  ఆయాస పడుతూ కాస్త నిలబడ్డాను.  పంకజం వెనకేవొచ్చి అలా ఎలా పరుగెత్తావ్?  మరీ ఒలింపిక్ పోటీలకేమన్న వెళుతున్నావా ...అసలే కాలునొప్పి కదా !అంది. 


కాలు నెప్పి! అవును నాకు కాలునెప్పికదా, అయినా భయంతో ఇంతదూరం ఎలాపరుగెత్తానూ?


It’s gone!  గాయబ్!

పోయిపోచ్చీ ....

పోయిందే .....


*పద్మజ కుందుర్తి.*

కేశవ నామాలు

 కేశవ నామాలు


1. కేశవ:- క = బ్రహ్మ, అ= విష్ణువు, ఈశ= రుద్రుడు. సృష్టి, స్థితి, లయ కారకుడు.


2. నారాయణ:- పుట్టి పెరిగి సాగే జీవసమూహం = నారం, ఆయనం= ఆశ్రయ స్థానం. సర్వ జీవులకు ఆశ్రయమైన వాడు.


3. మాధవ:- మా అంటే లక్ష్మీ దేవి, ధవ= భర్త.


4. గోవింద:- గోవుల ద్వారా తెలియ పడేవాడు.గో = కిరణములు, వాక్కులు, వేణువు, భూమి, ఇంద్రియములు, ప్రాణాలు.


5. విష్ణు:- ధర్మ,యజ్ఞాదుల రూపంతో , సూర్యాగ్న్యాది తేజస్సుల రూపంలో, శబ్ద స్వరూపంలో అన్నిటా వ్యాపించినవాడు.


6. మధుసూదన:- మధు- రాక్షసుడిని హరించిన వాడు.


7. త్రివిక్రమ:- మూడు లోకాలు ఆక్రమించిన వాడు.


8. వామనాయ:- వమనం= వెలికి పంపుట. నదులు, జలమును వెలిగ్రక్కినట్లు, సర్వ వ్యాపకుడైన విష్ణువు నుండి సనాతనము గా వివిధ జ్ఞాన మయమైన జగత్కర్మలు ప్రకటింప బడుటచే వామనుడు.


9. శ్రీధర:- అమృతం మాధుర్యాన్ని, చంద్రుడు వెన్నెలను ధరించినట్లు స్వాభావికంగా లక్ష్మిని /శ్రీదేవిని ధరించినవాడు.


10. హృషీకేశ:- హృషీకము= ఇంద్రియములు, ఇంద్రియములకు ఈశుడు.


11. పద్మనాభ:- పద్మమునకు నాభి వంటివాడు. అనంత శక్తులతో, (రేకులు) భూతాలతో ఉన్న విశ్వం యొక్క కేంద్రస్థానం/ శక్తి. పద్మమునకు కర్ణికలా విశ్వానికి పద్మనాభుడు.


12. దామోదర:- దామము (లోకములు) ఉదరమునందు కలవాడు. యశోద చే తాడు కట్టబడిన ఉదరం కలవాడు.


13. సంకర్షణ:- విశ్వాన్ని పట్టి ఉంచు వాడు.


14. వాసుదేవ :-వసించి దీపించు వాడు. అంతటా ఆవరించే ధర్మం కలది.'వాసన' పూలలోని గంధంలా విశ్వమంతా వ్యాపించిన చైతన్యమే విశ్వమును ప్రచోదనం చేస్తుంది.


 15. ప్రద్యుమ్న:- విశేషంగా, ఎడతెగక ప్రకాశించే తేజ స్వరూపుడు.


16. అనిరుద్ధ:- అడ్డగించుటకు  సాధ్యం కాని వాడు .


17. పురుషోత్తమ :- హృదయ పురమున శయనించువాడు.(2) విశ్వమెవనిచేత పూర్ణమై (వ్యాప్తమై) ఉన్నదో అతడు పురుషుడు.


18. అధోక్షజ:- అధః = క్రిందకు, అక్షః = దివి. ఈ రెంటికీ నడుమ వ్యాపించిన విరాట్ పురుషుడు. క్రింద ఉన్న కిరణముల ద్వారా మూలమైన దానిని అక్షః - తెలుసుకోవడం.


19. నారసింహ:- శ్రేష్టమైన దివ్యాకారం. నారం( నర) జీవ సమూహం. నారభావం హింసించి పోగొట్టేవాడు. జీవుల (నర) హృదయ గుహలో ఉండే మహా చైతన్యమే సింహం.


20. అచ్యుత:- తానున్న స్థితి నుండి జారని వాడు.జారనివ్వనివాడు. మార్పు, వికారం లేనివాడు.


21. జనార్ధన:- జనులను (పాపఫలములుగా) హింసించు వాడు. జనులచే అభీష్ట సిద్ధులను అర్ధించబడువాడు.


22. ఉపేంద్ర:- ఇంద్రునికి సోదరునిగా ఉన్నవాడు. ఇంద్రునికి (ఉపరి)పైన ఇంద్రుడు.


23. హరి:- అన్నీ లయమయ్యాక, అన్నిటికి ఆధారమైన అధిష్ఠాన చైతన్యమే మిగులుతుంది.


24. శ్రీకృష్ణ:- భక్తుల దుఃఖములను పోగొట్టువాడు.(2) అన్నింటిని తనలోనికి లాగుకునేదే కృష్ణ .నామం, రూపం, గుణం, మహిమ, ఏది తలచినా భక్తుల మనసులు వెంటనే ఆయన లోనికి ఆకర్షితమవుతాయి.


25. శ్రీకృష్ణ పరబ్రహ్మం:- భగవంతుని నామాల ద్వారా లీలలు (తత్త్వం) వ్యక్తమవుతాయి.ఇన్ని నామాల ద్వారా తెలియజేసిన తత్త్వం శ్రీకృష్ణునిదిగా తెలుసుకుని, సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పడం. "సచ్చిదానంద స్వరూపుడు" నిర్గుణ, నిరాకార, నిష్క్రియ పరబ్రహ్మ.

సంతోషంగా ఉంటే

 ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం..

*ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*.

జీవితం కూడా అంతే...

*ఏంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*.

• అదేదో ఏంజాయ్ చేసిపోతే, ఆ జీవితానికి ఓ పరమార్థం వుంటుంది.

• *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.

• తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు.

• పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.

• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది. 

ఫైనల్ గా చెప్పదేంటంటే...

*టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*. 

• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*?

• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!.

• *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!

• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.

• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*. 

• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*. 

• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*. 

• భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*. 

• పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*. 

• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*. 

• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*. 

• మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*. 

• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*. 

• ప్రకృతి అందం *ఐశ్వర్యం*.  

• పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*. 

• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*. 

• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*. 

• బిడ్డలకొచ్చే చదువు  *ఐశ్వర్యం*. 

• భగవంతుడిచ్చిన ఆరోగ్యం  *ఐశ్వర్యం*. 

• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*. 

• పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.

• *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు. 

• కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*. 

• మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం*

పేర్లు ఏవి ?*

 ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?*

 

1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .


 *సప్త సంతానములు అంటే ఏమిటి ?*

 

1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 

6. స్వసంతానం ( పుత్రుడు ).

 

*తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?*


 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.

 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  

7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.


 *పదిరకాల పాలు ఏవి ?*


 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .

 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.

 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.

 10. లేడి పాలు.


 *యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?*


 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  

 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .

 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .


 *అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?*


 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 

11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 

13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 

15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 

 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.


 *గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?*


 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.

 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.

 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.

 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .

 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.

 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.

 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.

 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.

 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.


 *వివిద ఫలాల నైవేద్యం  -  ఫలితాలు*


 కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.


 అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.


 నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.


 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.

 

మామిడి పండు. -  మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.


 అంజూర  పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

 

సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.

 

యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.

 

కమలా పండు. -  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.


 పనసపండు -  పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.


 *పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?*


 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం . 


 *దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?*


 శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.

రెండు తరాలకు సాక్షులం

 45 years    నిండిన   మేము  రెండు   తరాలకు    సాక్షులం 

         

స్వచ్చమైన     గాలి  నీళ్ళు,.      పచ్చటి  పొలాలు.     🌾🌴

పరిశుభ్రమైన.    వాతావరణం  లో  పుట్టి.    పెరిగిన   వాళ్ళం... 

👦తలపై   నుండి.    చెంపల   మీదకు     కారిపోయేలా    నూనె రాసుకుని...


📚  చేతికి     పుస్తకాల.   సంచి తగిలించుకుని...,

ఒక్కడిగా.    బయలుదేరి    దారిలో స్నేహితులను

ఒక్కొక్కళ్లను.      కలుస్తూ పెద్దగుంపుగా.  👦. 👦 👩. 👧 కిలోమీటర్ల    దూరంలో     ఉన్న  బడికి     కాళ్లకు    చెప్పులు    లేకుండా    నడచి   వెళ్ళిన     తరం వాళ్ళం, 🚶🏃


జారిపోయే    నిక్కరు    మీదకు   మొలతాడు.   లాక్కుంటు ..., చిరుగు.    బొక్కలకు    గుడ్డ ముక్కలు    అతుకులేయించుకున్న వాళ్ళం  🕺


10 వ తరగతి    అయ్యే  వరకు    నిక్కరు.   వేసుకున్న.  ,  తరం మాదే...🌲


🤸🤹

గోలీలు,     బొంగరాలు,

కర్రా బిళ్ళ, 

నేలా బండ,.    ఉప్పాట,

ఏడు పెంకులాట.....

🥎   బంతి పుచ్చుకుని.   నేరుగా కొట్టేసుకుంటే    బంతి    లాగ  వంటి మీద    ముద్ర   పడే      ముద్రబాల్.   లాంటి    ఆటలాడిన తరం...,


🚴🏊🤽

బడికి    వేసవి కాలం.   , సెలవులు రాగానే   తాటి చెట్లూ,. ..  సీమ తుమ్మ చెట్లూ    ఈతచెట్లు    ఎక్కి కాయలు.   కోసుకొని    తిన్న వాళ్ళం,   చెరువులు,     కాలవల్లో స్నానాలు     చేసిన   వాళ్ళం.   , తాటి   బుర్రలు     బండితో ఆడినోళ్లం...


🪔🪔🪔

దీపావళి  కి.    తాటి    బొగ్గుల రవ్వల   దివిటీ    కోసం   వళ్ళంతా మసి   పూసుకొని     మరీ     తయారు చేసుకనే    వాళ్ళం.


5 ps     ఐస్   తిన్నది   మేమె. ,,  .  పది    పైసలతో   బళ్ళో.  మ్యాజిక్   షో.   చూసింది    మేమే.... 


🌦️ వర్షం   వస్తె   తాటాకు.  గొడుగూ,    యూరియా   సంచులు, కప్పుకుని   బడికి  వెళ్ళిన    వాళ్ళం..


📖 second    hand   text  books     కోసం     పరీక్షలు 

అయినప్పటి    నుండి   ముందు తరగతి   వాళ్ళని    బతిమాలిన తరం.


🚴సెకెండ్   హ్యాండ్    సైకిల్  తొ  పక్క.   తొక్కుడుతో      సైకిల్ నేర్చుకున్నోల్లo     మేమే...


✉️ఉత్తరాలు.., రాసుకున్న..   ,అందుకున్న తరంవాళ్ళం... 🌴


పండగ    సెలవులు,

వేసవి   సెలవులు. , ,దసరా,  సంక్రాంతి   సెలవులు

ఎన్ని సెలవులు.   వొచ్చినా   ఐదు పైసలు   ఖర్చులేకుండా    ఆనందాన్ని.  🤼  🏃🏻 ⚽ 🏸 🪁🏹  🤸  ⛹️. 🏊   అనుభవించిన    తరంవోళ్ళం...,


 👨👩👧👦 పెద్దలు.  /పిల్లలూ అందరం    వీధి    అరుగుల మీద కూర్చుని   ఎన్నో     సాయంత్రాలు/రాత్రులు   ఆనందంగా    కబుర్లు చెప్పుకుని.   పొట్ట    చెక్కలయ్యేలా

నవ్వుకున్నదీ మేమే.... ☘️


 ఊర్లో,.  ఎవరి   ఇంట్లో    ఏ వేడుక  జరిగినా,.   మన   ఇంట్లో  జరిగినట్లు,.    అంతా మాదే. ,

అంతామేమే.  అన్నట్లుగా    భావించి    స్వచ్చందంగా. / నిస్వార్థంగా    పాలుపంచుకున్న    తరం   మాదే...🍁


🕵🏻ఉర్లో   ఒక    ఇంట్లో   దొంగలు  పడ్డారని ,.  పిల్లలు.    అందరం  కలిసి    ఊరు  చుట్టూ    తెల్లవార్లూ   ఎన్నో రాత్రులు

🔦టార్చిలైట్స్,    కర్రలు  పట్టుకుని  కాపలా కాసిన    వాళ్ళం  మేమే.


🕉️  🚩 🛕 

ప్రతీ శ్రీరామ

నవమి కీ   వినాయక చవితి కి   గుడి   దగ్గర   తాటాకు పందిరికి     రంగు   కాగితాలు అంటించడం,   ,  మామిడి తోరణాలు కట్టడం.  కోసం.  ముందు రోజు     రాత్రంతా      జాగారం.   చేసింది మేమే.  .🌾


👨👩👧👧చుట్టాలు    వస్తేనే అమ్మ     ప్రత్యేక వంటలు వండి పెట్టిన  తరం....🍁

అత్తయ్యా,

మామయ్య,.  ,పిన్ని,,    బాబాయ్,   అక్కా   ,బావ       అంటూ ఆప్యాయంగా    పిలుచుకున్న  తరం,

స్కూలు    మాష్టారు    కనపడితే భయంతో    పక్కనున్న     సందుల్లోకి    పారిపోయిన   తరం... ,🌺


పుల్లల    పొయ్యి    మీద   అన్నం/కూర     ఉడుకుతున్నప్పడు   వచ్చే అద్బుతమైన    పరిమళాన్ని ఆస్వాదించిన   తరం.   వాళ్ళం..,🌱

పొయ్య     మీదనుంచి.   నేరుగా    పళ్ళెం   లోకి    వచ్చిన   వేడి  వేడి అన్నంలో   ఆవకాయ,    వెన్నపూస వేసుకుని    పొయ్యి   దగ్గరే  

తాతయ్యలు.    అమ్మమ్మ/నాయనమ్మ, ,   అమ్మా    నాన్నా, పెదనాన్న. ,, ,పెద్దమ్మ,, . పిన్ని బాబాయ్,.    అత్తయ్య    మామయ్య,   అక్కలు    చెల్లెళ్లు    అన్నయ్యలు   తమ్ముళ్లు   అందరం    ఒకే.   దగ్గర   చేరి    మధురమై.      అనుభూతితో  కూర్చుని   అన్నం.  తిన్న    తరం ..,..🦋


అమ్మమ్మలు. / నాయమ్మల   చేత గోరుముద్దలు   తిన్నది,.   అనగనగా ఒక రాజు....      కథలు   విన్నది  ,🌵


నూనె పిండితో    నలుగు పెట్టించుకుని     కుంకుడు  కాయ పులుసుతో      తలంటు   స్నానం చేయించు కున్న      తరం...,🍀


📻రేడియో,

దూరదర్శన్📺

టూరింగ్ టాకీస్📽️.   కాలం చూచిన వాళ్ళం... .🍁


🎥 40 పైసల.   నేల   టిక్కెట్  తో నేల   మీద   కూర్చుని, 

1. .20. రూపాయల    chair   టిక్కెట్ తో  ,,rs 2    ticket    బాల్కనీ లో కూర్చుని    సినిమా  చూచిందీ    మేమే...🌵


 స్కూల్   , కాలేజీ   రోజుల్లోనే ఎలక్షన్లు   చూచిన    వాళ్ళం.. .🍂


అమ్మా   నాన్నా    తో     సంవత్సరానికి   ఒక సారి,   పరీక్ష పాస్     అయ్యావా.. ..    అని మాత్రమే    అడిగించు కున్న   తరం వాళ్ళం...🌹 అప్పటికీ ఇప్పటికీ పెద్దవాళ్లకు గౌరవం ఇచ్చే తరం మాదే


📲🖥️🖨️

ప్రస్తుత0   ఉన్న    Whatsapp Fb skype లు   మీతో   పాటు సమానంగా     వాడేస్తున్న మాతరం...,

మేమే    ఆ  తరానికి    ఈ  తరానికి మధ్యవర్తులం...

 మేమే-- -💐


 అవును.......రెండు   తరాల   మద్యలో    జరిగిన   అనూహ్యమైన    మార్పులకు   మేమే  సాక్షులం  🌸


   మన ముందుతరం 

తల్లిదండ్రుల పై భయభక్తులు ...ఉన్న వాళ్లు... మన తరువాత తరం వాళ్లు వాళ్ల పిల్లలకు భయపడుతుంటారు..

మనం మాత్రం అటు తలిదండ్రులకు ఇటు పిల్లలకు భయపడే..అనిశ్చిత తరం😀😀😀😀

ఘనుడు

 💚🍋 అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రంలో అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు.. ఈ కథ విన్నా, వినిపించినా కోటిజన్మల పుణ్యఫలం 🍋💚

🌷🌻 మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం 🌻🌷

🌺 పంచశత శక్తిపీఠాల్లో  మధురమీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనములవంటి చక్కని విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత.

🌺 మధురనుపాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతంలోని మూలమూలలనుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించేసింది మీనాక్షి.

🌺 పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమతమ పనులన్నీ పూర్తిచేసుకుని రాత్రికాగానే ఎవరిగృహాల్లోవారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా, అపాయం వచ్చినా, వారికి బైటకొచ్చేవీలులేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే!

🌺 క్షేత్రపాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షీభూతునిలా చూస్తుండిపోయారు. తన దేవేరియొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తనఅంశతో ఒక అవతారపురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనంవహించి తీరాల్సిందేతప్ప మరేమీ చేయటానికిలేదని నిర్ణయించుకున్నారు భోళాశంకరుడు.

🌺 తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే , తననుతాను అవమాన పరచుకోడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో, ఏప్రాణికి, ఏశిక్ష, ఏ పరీక్ష, ఏదీక్ష, ఏసమీక్ష ప్రసాదించాలో ఒక్క మహా కాలుడికే ఎరుక. ఎవరివంతుకు ఏదివస్తే అది మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే.  

🌺 ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితలాఉంది. పాండ్యరాజు ఆది శంకరులను అత్యంత భక్తిశ్రద్ధలతో స్వాగతంపలికి తనఅంతఃపురంలో సకలసేవలుచేసాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారయిన ఆదిశంకరాచార్యులు "నేను మధురమీనాక్షి ఆలయంలో ఈరాత్రికి ధ్యానం చేసుకుంటాను" అని చెప్పాడు. ఆ మాటలువిన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపమొచ్చినంతగా కంపించిపోయాడు. 

🌺 "వద్దుస్వామీ! మేము చేసుకున్న ఏపాపమో,  ఏ శాపఫలితమో చల్లనితల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షితల్లి రాత్రిసమయాల్లో తామస శక్తిగామారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగంరానివిధంగా సకలఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగుపెట్టద్దు .అసలు అంతఃపురంనుండి బయటకు ఎవరూవెళ్ళరు. పొరపాటుగా బయటకొస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క"  అని పాండ్యరాజు వేడుకున్నాడు. 

🌺 ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరచాడు. "సన్యాసులకు గృహస్తులభిక్ష స్వీకరించేవరకే ఉండాలికానీ తర్వాత వారు గృహస్తుల యింట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటేతప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డుచెప్పద్దు" అన్నారు.  పాండ్యరాజు హతాశుడైయ్యాడు.

🌺  దైవీతేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని "ఇకచూడనేమో?!" అని  పాండ్యరాజు ఆవేదనచెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంత:పురానికెళ్ళాడు. పాండ్య రాజుకు ఆరాత్రి నిద్రలేదు. "ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆపాపం తన తరతరాలను పట్టిపీడిస్తుందేమో" అని నిద్రరాక అటుఇటూ పచార్లు చేయసాగాడు. 

🌺 రాత్రయింది. గర్భగుడికి ఎదురుగాఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకతశ్యామ అయిన ఆతల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటిమధ్య నిలచి సహస్రారంలో ఆశీనురాలై చంద్రకాంతివంటి వెలుగులతో సుధావర్షదార కురిపిస్తోంది.

🌺 ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో  చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠమునుండి లేచి నిల్చుంది.  

🌺 పాదమంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగ,ధగ మెరుస్తుండగా, ఆమె ధరించిఉన్న ఎర్రనినిరంగు పట్టుచీర, బంగారు జరీఅంచులకుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా, కోటివెన్నెలలు రాసిబోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారంవద్దకొచ్చి లిప్తకాలమాగింది.

🌺  ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలోఉన్న యువయోగి ఆమె విశాలనయన దృష్టిపథంలోకొచ్చాడు. "ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి?  నుదుట విభూదిరేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో "బాల శివుని"లా ఉన్న ఆయోగిని చూస్తుంటే తనలో మాతృ మమత, పెల్లుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయములో ఉన్నాడేమిటి?" అని ఆశ్చర్యం కలిగింది.

🌺 క్షణకాలమే ఇదంతా! గర్భగుడి "గడప" దాటిన ఆతల్లిపై ఒకానొక ఛాయారూప "తమస్సు" ఆవరించుకుంది. ఆమెలో సాత్త్వికరూపం అంతరించి తామసికరూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్తా కారుమబ్బు రంగులోకిమారి భయంకర దంష్ట్రాకరాళవదనంతో, దిక్కులనుసైతం మ్రింగివేసే భయంకరమైనచూపులతో అడుగుముందుకేస్తోంది మహాకాళీ స్వరూపంలా. 

🌺  ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్క రించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధినుండి మేల్కొని "మహాలావణ్య శేవధి" ని కళ్లారాచూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వంరూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామసరూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోఙ్ఞరూపంగానే కన్పిస్తోంది. కన్నతల్లి అందమైనదా? కాదా?అనుకోరుకదా! కన్నతల్లి కన్నతల్లే ! అంతే !

🌺 అప్రయత్నంగా ఆయన స్తోత్రంచేసాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలనివస్తున్న ఆ తామసమూర్తికి ఆస్తోత్రం అమృతపుజల్లులా చెవులకుసోకింది. దంష్ట్రాకరాళవదనంలో రేఖా మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తిపారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మ స్థైర్యానికి, తపశ్శక్తికి  ఆశ్చర్యంగా చూచింది. నిజానికీసమయంలో తనవదనంలోకి శలభంలా వెళ్లిపోవాల్సినవాడు, మ్రింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? 

🌺 అర్ధనిమీళితాలైన కన్నులతో భక్తిపారవశ్యంతో వజ్రాసనంవేసి కూర్చుని స్తోత్రంచేశాడా యువయోగి పుంగవుడు. "భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం" ఆ యువయోగిలోంచి కవిత్వ గంగాఝురిగా పొంగి పొరలివస్తోంది. జగజ్జనని తృళ్లిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమెహృదయంలో ఒకానొక సాత్త్వికతేజ: కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది.

🌺 ఆహా! తన శక్తిపీఠస్థానము ఎంత అద్భుతంగా చెప్పాడీ యువకుడు? అవునుతాను "త్రికోణ బిందురూపిణి. శ్రీ చక్రరాజనిలయ". సహస్రారమనే మహాపద్మములో శివ, శక్తిరూపిణిగా, పరాశక్తిగా ఉండే తనఉనికిని ఎంతచిన్న శ్లోకంలో ఎంత చక్కగావర్ణించి గుర్తుచేశాడు. మరితనలో ఈ తామస భావాలేమిటి? తనసృష్టినితానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలోపడింది అమ్మవారు. 

🌺 ఆదిశంకరుల ముఖకమలంనుండి, సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణపుటలనుదాటి, ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. "ఏమిటిది?  ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరోరూపమా! ఏమి పదలాలిత్యము! ఏమా కవిత్వము! ఏమా కంఠస్వరం! ఏమి భక్తితత్పరత! ఏమివర్ణన? శ్రీచక్ర రాజంలోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువయోగికి కరతలా మలకము!"  ఆనుకుంది అమ్మవారు.

🌺 "ఎవరు నాయనా నీవు ?  నాదారికడ్డుగా కూర్చున్నావేమిటి? నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్నుచూచి నీస్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలమాగానంతే. నీవుతొలగు. నిజానికి నీవీపాటికి నాకాహారం కావలసినవాడివి. నీవాక్కు నన్ను ఆకట్టుకొన్నది"అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపుచూస్తూ.

🌺 ఆదిశంకరులు సాష్టాంగ దండప్రణామము చేసాడు. "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా, కాత్యాయినీ సుందరి..." గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తలపంకించింది. "నవవిద్రుమ బింబశ్రీ శ్రీన్యక్కారి రదనచ్చదా" పగడము, దొండపండు కలగలిపిన ఎర్రనిరంగును గుర్తుకుతెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లివిరిసి "శుద్ధ విద్యామ్ కురాకార  ద్విజపంక్తి ద్వయోజ్వలా " అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. 

🌺 "కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా" అన్నట్లుగా తాంబూలసేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన "కచ్ఛపి"  మధురనాదాన్ని మించే సుస్వర, సుమధురనాదంతో జగన్మాత ఇలా అన్నది. "నీ స్తోత్రాలకు, నీ భక్తికీ మెచ్చాను. నీవు, నీకవిత్వం చిరస్తాయిఅయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీనుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయ గలిగినవారు శ్రీచక్రార్చన చేసినంతటిఫలం పొందుతారు". 

🌺 " నీకు ఏవరం కావాలోకోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నాసంహార కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించకఅనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్దవరముగా భావించు" అన్నది కించిత్ "అహం" ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణము జాగుచేయలేదు. 

🌺 "బాల్యంలో తెలిసీతెలియని వయసులోనే నేను సన్యసించానుతల్లీ, నాపేరు శంకరుడు. దేశాటనం తోనూ, వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్త దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇదిగూడా ఎంత కాలం తల్లీ!"

🌺 "కానీ నా హృదయంలో నా బాల్యకోరికొకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడూ బాధిస్తుంటుంది" అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. "ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జననిని, నేనుండగా  నీకేమికొరత నాయనా! అడుగు నీ కోరికతీర్చి, నేను నా సంహారకార్యక్రమానికి వెళ్లిపోతాను" అన్నది. ఇంకాఆమెలో తామసికవాసనాబలం తగ్గలేదు.

🌺 పసితనపు  అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు "మందస్మితప్రభాపూర మజ్జత్కామేశమానసా" అన్నట్టుగా ఫక్కున నవ్వింది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నదా నవ్వు. "అమ్మా ! నాతో పాచికలాడతావా ?" అని పసి పిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. "తప్పక ఆడతాను నాయనా! నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో, నీపట్ల అపార మాతృవాత్సల్యము పెల్లుబికేలా చేసావు" 

🌺  "మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలిగా! నీకు తెలుసోతెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధనపెడతాను. నేనుఓడిపోతే ఆయన ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో! ఈశ్వరుడు ఓడిపోతే నేనువేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆప్రశ్నలు లౌకికమైనవికావు. ఎన్నో వేదాంతరహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకారధ్యేయంతో ప్రశ్నిస్తాను". 

🌺 "అట్లా ఏర్పడినవే, ఎన్నో దేవీ,దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు. మరి నీపందేమేమిటి నాయనా! అన్నది జగజ్జనని.ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసం?లోకకల్యాణం కోసం. మౌన ముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగంనుండి ఒకానొక కాంతికిరణము మెరుపులా వచ్చి ఆది శంకరునిలో ప్రవేశించడం ఆతల్లి గమనించలేదు.  

🌺  ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణకాలం దివ్యానుభూతికిలోనైంది. "శివా, పరమశివా! తల్లితో ఆడేఆటలో పందెంగా ఏమికోరాలో వాక్కుప్రసాదించు సుందరేశ్వరా!" అనుకున్నాడు లోలోపల. అది భావనారూపంగా పరమశివునినుండి అందింది. "పందెమేమిటి నాయనా?" అని మళ్ళీ అడిగింది అమ్మవారు. "ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తననైపుణ్యాన్ని సుందరీశ్వరునికికూడా తెలియచేయాలి" అనే  ఉబలాటము ఆమెలో వచ్చేసింది.

🌺  "తల్లీ నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తు, వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒకవాగ్దానాన్ని పందెపుపణంగా నేనుపెడితే నీకు అభ్యంతరమా తల్లీ?" అన్నాడు శంకరాచార్య. "తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేసేయ్" అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులుమెచ్చి మహాత్కీర్తి రావాలనే కోర్కెకోరుతాడని ఉహించింది"  

🌺  "తల్లీ, నీవు కరుణామయివి. నీవు తామసశక్తివై  ఈ సంహారకార్యక్రమం చేయడం నాకు బాధగాఉంది. ఆటలోనీవు ఓడిపోతే ఈ సంహారకార్యక్రమం ఆపేసి అందరినీకాపాడాలి. నేనుఓడితే మొదటగా నేనే నీకు ఆహారవుతాను". అన్నాడు దృఢచిత్తముతో ఆదిశంకరాచార్య.  

🌺 జగన్మాత నవ్వింది. "నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా! నేను ఓడిపోతే, నీమాటప్రకారాం నేను ఈ సంహారకార్యక్రమం ఆపేస్తాను, సరేనా!" అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢవిశ్వాసము నిండుగాఉంది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాదు, రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహ పరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి,  తన సంహారకార్యక్రమం కొనసాగించాలని  ఆలోచించింది. 

🌺  ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. "తల్లీ! దివ్య మహిమలుగల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకుపడేలా ఆ పాచికలలో నీ మహత్యంనింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవునాతో పాటు ఈ విశాలమండపంలో కూర్చోనవసరంలేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనంమీద కూర్చోమ్మా!" అన్నాడు.

🌺 "ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదటవేయి.  చిన్నవాడివి. నీవు మొదట ఆడడమే న్యాయం" అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రము "సుందరేశ్వరా! నీఅర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమినేనాడూ చూడలేదు. ఈబిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది.  మరి మీఇష్టము!" అన్నది.  సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. 

🌺 ఆదిశంకరులు "తల్లీ నీవు సృష్టించిన దివ్య పాచికలు  ఈక్షణాన నాచేతిలో ఉన్నాయి? నీలోని దివ్యత్వము నాలోకి వచ్చినట్టేకదా! ఈ భావనే నన్ను పులకింప చేస్తోంది. అమ్మా! జగన్మాతా! ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కతుంది? మళ్లీ మళ్లీ ఈ అవకాశం రాదునాకు. పశుపతితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది.

🌺 నీ లలితాసహస్రనామంలోని  కొన్ని నామాలు, వాటిఅర్ధాలు ఆలోచిస్తూ  ఈక్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీనామాలు పలుకుతూనే ఆటాడతాను. అభ్యంతరమా తల్లీ! అలాగని ఆటలో ఏమరుపాటు చూపను. సాక్షాత్తూ గురురూపిణివైన నీవు, నీవు తోపింపచేసే అర్ధాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది". అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైనది ఆతల్లి.

🌺 సంఖ్యాశాస్త్రప్రకారము  పావులు కదులుతూ ఉన్నాయి.  సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంభందముంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. "తాటంక యుగళీభూత తపనోడుపమండలా" అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలూపుతోంది. 

🌺 ఆ తల్లి తాటంకాలకాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు. "విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా"! అన్నాడు. తల్లి నవ్వింది. "విజయమంటే విజయం నాదేకదా నాయనా!" అన్నది. ఆటమధ్యలో ఆపి, కించిత్ గర్వంగా.. విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. 

🌺 "విజయం నాదయినా, నీదయినా రెండూఒకటే తల్లీ.! నీలోనుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒకనాణేనికి బొమ్మా బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా! విజయపుఅంచుకు చేరుకున్నవ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయ లక్ష్మి  చివరిక్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో? అదే విజయరహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతరయోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగల్గిన వారికి విజయమైనా, పరాజయమైనా ఒకటేకదమ్మా.

🌺 పరాజయము నీ శక్తిస్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది.  ఆ పరాజయంద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవంయొక్క పాదాలను పట్టుకొనేలాచేస్తుంది. ఇది మాత్రం విజయంకాదా తల్లీ!" అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది. 

🌺 "గెలుపోటములు, ద్వంద్వాలు. సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైతస్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్ధగురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో". లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెల్లుబికిరాగా పైకనేసింది. "నాయనా! నీ ప్రతిఅక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరునిసాక్షిగా నేను కపటం, మోసంచేయను" అన్నది అమ్మ.. "గెలుపోటములు జగన్మాతవైన నీ అధీనం కదాతల్లీ!" అన్నాడు ఆదిశంకరాచార్యులు.

🌺 ఆలయములో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ, చందనపుపొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారిపాదాలవద్దున్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచిముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధముచేసాడు. జగన్మాత సంతోషించింది. దివ్యపాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆటపూర్తయ్యేవరకు  "నీకోరిక మేరకు నేను నాస్థానములో కూర్చుంటాను", అంటూ గర్భగుడిలోకి వెనక్కివెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువయోగీశ్వరునిపై మాతృమమత పెల్లుబికింది. "ఎంతచిన్న కోరిక కోరాడీడింభకుడు. ఓడించకూడదు" అనే జాలికూడా కలిగినది. 

🌺 పీఠంమీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావము  మాయమై నిర్మలత్వం వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటిమార్పుఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. "పరమశివా! జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోకకళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండూ నీదృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామసశక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్ధముచేసుకొని నీవు సాక్షీభూతునిగా వుండి ఈఆట నడిపించు" అని మనసారా ప్రార్ధించాడు. 

🌺 వెంటనే అతనిహృదయానికి చందనశీతలస్పర్శ లాంటి అనుభూతి కలిగినది. అది ఈశ్వరకటాక్షమని అర్ధమయింది. "ధన్యుడిని తల్లీ! ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు, నీశక్తి అంతర్లీనమై నిలిస్తేచాలు. "ఆ బ్రహ్మకీటజననీ!" ఈక్షణములో "నిర్వాణ షట్కము" అనే కవితనాలో శ్లోకరూపంలో పెల్లుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో అదికవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది. అంటూనే నిర్వాణషట్కoలోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేసాడు. ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం" రాచనగరులో తెల్లవారుఝాము అయింది. ఆ గుర్తుగా మేలుకొల్పు నగారా మోగింది. 

🌺 అమ్మవారు తృళ్ళిపడింది. ఈ యువయోగి మధురవాక్కుల్లో కాలమాగిపోయి, త్వరగా ఝాము గడిచింది. "తల్లీ! ఇంకాకొద్దిగా ఆట ఉంది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు. "విశ్వానికి సాక్షిణిని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా?!" అని అడిగింది. జగన్మాత అతని నోటివెంట ఆనామాలకు అర్ధాలు వినాలనే కుతూహలంతో. "తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలేగదమ్మా! సర్వవిశ్వానికి సాక్షిణివైన నీవు ప్రాణులకు కాలంతీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం  రెప్పపాటుసాకుతో మూసుకుని సాక్షివర్జితవవుతావు. అలాచేయకపోతే నీసృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ!"అన్నాడు.

🌺  "ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈయువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనేఉంది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలం వినోదమా!కాదు, కాదు. ఇంకేదో కారణముంది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డా?" ఆట పూర్తి కాలేధీరోజు. సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామసశక్తి మరుగై సాత్వికశక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మముహూర్త కాలమొస్తుంది. ఆలయ పూజారులొస్తారు. అభిషేకాలు, పూజావిధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని కచ్చితంగా అమలుపరిచే సూర్య భగవానుడొస్తాడు. "భానుమండల మధ్యస్థా" తన స్థానం. ఎంతమార్పు ఒక్కరాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రమేశాడో! అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. 

🌺 "తన ఆట కట్టేసాడా! తీరాతను ఆట ఓడిపోదు కదా! పశుపతినే ఓడించగలిగినతాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహారశక్తి ఆపెయ్యాలి". అని మనసులో అనుకుంటూ ఇక ఆటమీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విహ్వలతతో చలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తి పూర్వకముగా నమస్కరించాడు. అమ్మవారి కుండలినీ యోగశ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి ("పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ") గానంచేస్తూ పావులు చకచకా పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదలపెరిగి త్వరత్వరగా పెద్దపెద్ద పందేలుపడేలా పాచికలను వేస్తోంది. దూరంగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపనికి ఒక నిర్దిష్టసమయం, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తిపధానికి మొదటిమెట్టు. 

🌺 "నాయనా! చివరి పందెంనాది. నాపావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోషతరంగాలలో తేలిపోతూ. "అవునుతల్లీ! భూపురత్రయం, 4 ద్వారాల్లోకి వచ్చేశాను నేనుకూడా. 9వ ఆవరణ చేరాముతల్లీ, నీవు బిందువులో  యధాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లీ! నీచేతిలో ఓటమి కంటే నీబిడ్డకు కావాల్సిన కైవల్యమేముందమ్మా! జగన్మాతచేతిలో ఓటమికూడా గెలుపేతల్లీ, ఇలాంటి ప్రత్యక్ష  ఆట ఎవరికి దక్కుతుంది?" అన్నాడు దివ్యపాచికలు అమ్మవారిముందు పెడుతూ.

🌺 "నేను గెలిచాను. మరిమన ఒప్పందంప్రకారం నా సంహారకార్యక్రమం నేనుకొనసాగిస్తాను. జగన్మాతనైన నాతోపాచికలాడి నీ కోర్కెతీర్చుకొని, పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా!"అంది అమ్మవారు. "అవును తల్లీ! ఆటపరంగా విజయం నీది. కానీతల్లీ, ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపునాది" అన్నాడు దృఢస్వరముతో. అమ్మవారు "ఏమిటి? సంఖ్యాశాస్త్ర పరంగానా!" అన్నది, ఏదీ స్ఫురించని అయోమయ స్థితిలో.

🌺 "నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం. శ్రీ చక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామసశక్తి మాయమైంది. శ్రీచక్రము నీదేహమైతే, సహస్ర నామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నాతపస్సు ధారపోసి  నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీఉనికిని, నీవేఅర్ధరహితమని నిరూపిస్తావా! అలాచేస్తే ఆస్తికత ఉండక, నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వములోకి, తమస్సులోకి జారిపోదా!" అంటూ క్షణకాలమాగాడు ఆదిశంకరాచార్యులు. 

🌺 దిగ్భ్రాంతిపొందిన అమ్మవారు మండపంలోకి దృష్టిసారించింది. కోటిసూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టికళలతో, షోడశకళలతో బిందుత్రికోణరూపిణిగా కొలువైవుంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు. గెలుపుతనదా! కాదు కాదు ఆ యువయోగిదే. ఆదిశంకరుడు "అమ్మా! నా మీద ఆగ్రహించకు. ఆగ్రహమొస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివునిగూడా పిలుద్దాము. న్యాయనిర్ణయము ఆస్వామి చేస్తారు. 

🌺 అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒకబిడ్డ చేతిలో ఓడిపోయింది. "ఒక్కసారి నీ పాదాలవద్దనుండి మండపంలో చిత్రించిన ఈఆట చిత్రంవరకు నీ  విశాలనయనాల చల్లనిదృష్టి సారించుతల్లీ!  తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ!  నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటికూడా తప్పుపోకుండా ఏకరువుపెడతాను తల్లీ, ఒక్కసంఖ్య, ఒక్కఅక్షరం పొల్లుపోదు. తప్పు, తడబాటు నాకురాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను  చూడుతల్లీ!"

🌺 44కోణాలు, 9ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆటచిత్రంలో చూడమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించిచూడు. పందెపుసంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్వికబీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి, ఏపొరపాటు రానీకుండా న్యాయబద్దంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయంవరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి. 

🌺 "అకారాది క్షకారాంత" దేవతాశక్తి స్వరూపాలకు వారివారి ఆహార్యాలు,ఆయుధాలు, శరీరపు రంగుతో సహా, ఆయా ఆవరణలలో పరివేష్టితులైనవారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీస్వరూపాలను, యోగినీదేవతలను, చక్రీశ్వరులను, సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా! షట్చక్రాల ప్రత్యక్ష, పరోక్షభోధే శ్రీచక్రార్చనగదా తల్లీ!నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్రబీజాలు తొలగించి, క్రొత్తగా సాత్విక బీజాక్షరాలసహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూవస్తున్నాను".

🌺  "ఆకార్యక్రమంలో భాగంగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రముచేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ట చేసాను. అదే నీముందున్న "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:" "ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్తవైపు  కించిత్ లజ్జ, కించిత్ వేదనతో  బేలగా చూసింది. మధుర మీనాక్షి. ఈయువకుడు అద్భుతరీతిలో సంఖ్యల అక్షరాలనుసంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. 

🌺 "స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం?" అమ్మవారు ఆర్తిగాపిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయంలో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరునిరూపం తండ్రిగానూ, తనతప్పుకు క్షమాపణవేడుకుంటూ "శివ అపరాధ  క్షమాపణ స్తోత్రము" గంగాఝురిలా ఉరకలేసిందాక్షణంలో. అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. 

🌺 ఒకవైపు అహం తగ్గిపోయినఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యము తెలుపమంటూ ప్రార్ధిస్తున్నాడు. సర్వదేవీ, దేవ గణాలు ఆస్వామి తీర్పుకోసం ఎదురుచూస్తున్నాయి. శివుడు కళ్ళుతెరిచాడు. చిరునవ్వునవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తలవిదిలించి రంకెవేసాడు. మధురాపట్టణమంతా మారుమ్రోగిందా రంకె. ప్రమధ గణమంతా అప్రమత్తులై స్వామివెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలివచ్చింది. ఆలయగంటలు అదేపనిగా మోగాయి. 

🌺 భక్త్యావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరులు స్తోత్రంచేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోధృత జలపాతంలా స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయమండపంలో సాక్షాత్కరించాడు. "దేవీ!" అన్నాడు పరమశివుడు.  

మధురమీనాక్షి వినమ్రంగా లేచినిల్చుని చేతులు జోడించింది. ఇప్పుడామె "మందస్మితప్రభాపూర మజ్జత్ కామేశమానసా". తామసం మచ్చుకైనాలేని మమతాపూర్ణ. భర్తఆజ్ఞ, తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. 

🌺 పరమశివుడు ఇలాఅన్నాడు. "దేవీ! నీఅహాన్ని, నీ తామసస్వభావాన్ని అదుపుచేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు.  ఈప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామసశక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నంచేస్తే నాఅర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతాలుగా ఉండిపోయాము. నీ తామసశక్తిని అదుపుచేయగల యంత్రాన్ని, మంత్ర పూతంగా సిద్ధముచేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్తసంగునిగా జన్మించి, ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారంపొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగల్గాలి.

🌺 అందుకే ఆ సమయంకోసం వేచిఉన్నాను. ఇతడు నాఅంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి, అతడిని ఆసేతుహిమాచలం పర్యటన సలిపేలాచేసింది. అతినిరాడంబముగా సాగించిన అతని పర్యటనయొక్కఉద్దేశం అతని హృదయానికి, పరమశివుడనైననాకు మాత్రమే తెల్సు. 

🌺 కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధపూరిత ఆలోచనలతో  తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింతఉగ్రరూపము సంతరించు కునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసికశక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారుచేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగి పోయింది. వారు పతనమైపోయారు.  బ్రష్టులయ్యారు. కానీనీలో తామసికరూపం స్థిరపడిపోయింది. లోకకల్యాణంతప్ప మరోటికోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసికశక్తిని రూపు మాపి, నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలితప్ప, భక్షించకూడదని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్వికకళలను ప్రతిష్టించాడు. నీవు ఆటలో గెలిచినా, నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వగృహస్తులకు శ్రేయోదాయకమైంది". అని సుందరేశ్వరుడు అన్నాడు. 

🌺 అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. "ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాలశంకరుడే. భర్త శంకరునివైపు, బిడ్డలాంటి బాలశంకరునివైపు మార్చి,మార్చి చూసింది. ఆఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటుచేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి, శంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించింది. ఆసమయంలోనే పాండ్యరాజు అంత:పురములో నందీశ్వరునిరంకె విన్నాడు. మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆరాజు అమ్మవారి తామసానికి శంకరాచార్య భలైఉంటాడని

 భయబ్రాంతుడయ్యాడు.

🌺  రాజుతోపాటు పరివారం, అంత:పుర కాంతలు ఆలయంవైపు పరుగులుతీశారు. ఆ యువయోగి మరణిస్తే, తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికొచ్చి, కత్తిదూసి ఆత్మాహుతికిసిద్ధమై, ఆలయప్రవేశం చేసిన మహారాజుకు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్తదూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రముచేస్తూ తన్మయత్వంలో మునిగిఉన్న ఆదిశంకరులు కనిపించారు. పాండ్య రాజు "స్వామీ! నీవు జీవించేవున్నావా! నన్ను ఘోర నరకములో పడకుండాచేశావా!" అంటూ శంకరునికి, ఆదిదంపతులకు మ్రొక్కాడు. "తల్లీ! మరల నీసాత్వికరూపాన్ని కళ్లారా చూస్తున్నాను" అని వారి పాదాలను అభిషేకించాడు. 

🌺 సుందరేశ్వరుడన్నాడు "నాయనా పాండ్యరాజా! ఇకనీవు ఆవేదనపడద్దు. ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగామారదు. శ్రీచక్రమును దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హతున్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారినుండే శ్రీచక్రార్చనకు నాందిపలుకుదాం. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రము ఎక్కడఉంటే అక్కడ అమ్మవారు కొలువైఉన్నట్టే. గృహాల్లో పవిత్రముగా ఉంచుకొని, నియమనిష్టలతోఉంటే ఫలితం కలుగుతుంది సుమా!" అన్నారు స్వామి.. పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది. 

🌺 ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠచేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయములో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. ఆ యంత్రప్రభావం కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృస్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్రప్రాంతంలో మోకరిల్లి, నమస్కరిస్తే వారిహృదయంలో ప్రకంపనలుకల్పించి ఆశీర్వదిస్తుంది ఈయంత్రం. పాండ్యరాజు తన జన్మసార్ధకమైందని ఆనందించాడు. "నాయనా! శంకరాచార్యా, నీజన్మ ధన్యమైంది, నీవు కారణజన్ముడవు. మరేదైనా వరముకోరుకో!" అన్నది అమ్మవారు. "ఏ వరమూ వద్దుతల్లీ! నా నోటివెంట నీవుపలికించే ప్రతిస్తోత్రం లోనూ, మీస్మరణ ఎడతెగకుండా అక్షరరూపమై విరాజిల్లేటట్టుగా, ఆశ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే  వారి జీవితాలు ధన్యమయేట్టుగా, నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి, నా శరీరపతనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేదీ, ఎవరికీ అంతుబట్టని విధముగాఉండాలి". 

🌺 "నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లీ! అన్నాడు."అలాగే నాయనా! తథాస్తు" అన్నది అమ్మవారు. తెల్లవారింది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యధా స్థానాల్లో అర్చక మూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి.

_వైశాఖ మాసం విశిష్టత_*

 *_వైశాఖ మాసం విశిష్టత_*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో  వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో  *ఏక భుక్తం , నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడింది.*  వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు , తపస్సులకు పూజాదికాలకు , దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.


ఎవరైతే ఈ మాసం లో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో , వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటి తో రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది.

మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి.. అందులోని చరాచరాలన్ని పూజనీయాలే ! అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు , నక్షత్రాలు , వారాలు , మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని , ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. 

చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత , విశిష్టత ఉన్నాయి.

కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి *వైశాఖమాసం* అనే పేరు ఏర్పడింది. ఆద్యాత్మికత , పవిత్రత , దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.


ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖమాసానికి మాధవమాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా

పేరుపొందిన *వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు  స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.* అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే.

అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన , పూజ , దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం , పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.


వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ , గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ , చెరువులోగాని , బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.


వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం , నీరు , గొడుగు , విసనకర్ర , పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం , చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.

సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది. సదా మీ సేవలో శ్రీ గాయత్రీ క్యాటరర్ గంప మాధవరావు

చిలుక కథ🦜

 💥💥💥💥💥💥💥

 *విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భం గా..రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన* 


 *🦜చిలుక కథ🦜*

🕉️🌞🌎🏵️🌼🚩


 *ఒక చిలుక ఉండేది.చక్కగా పాడేది. స్వేచ్ఛగా ఎగిరేది. కానీ చదవలేకపోయేది.అది రాజు గారి తోటలోని చిలుక.* 


 *ఒకరోజు అది రాజు గారి కంట్లో పడింది. వెంటనే మంత్రిని పిలిచి 'ఎడ్యుకేట్ ఇట్' అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజు గారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి.* 



 *ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చేయటం? విద్యావేత్త లు కూర్చుని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే... మొదట అది కుదురుగా ఉండాలి. అంటే.... అది ఎగురకూడదు.వెంటనే ఒక మంచి పంజరం చేయించారు. చిలుకను అందులో కూర్చోబెట్టారు.* 


 *కోచింగ్ ఇవ్వటానికి ఒక పండితుడు వచ్చాడు. చిలుకను చూశాడు. ' ఈ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు' అన్నాడు.గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేశాయి గంటల కొద్దీ చదువు మొదలైంది.* 



 *పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్లేవరూ ' అబ్బా... భలే చిలుక' అనటం లేదు. ' అబ్బా... ఏం పంజరం!' అంటున్నారు. లేదంటే ' అబ్బా ... ఎంత చదువు!' అంటున్నారు. రాజు గారిని మెచ్చుకుంటున్నారు.మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు.రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారుచేసిన కంసాలిని, చదువు చెప్పటానికి వచ్చిన పండితుడిని ' ఆహా... ఓహో ' అని కీర్తిస్తున్నారు.* 



 *రాజు గారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు... ఎన్ని లక్షల వరహాలు ఖర్చైన పర్వాలేదు. చిలక్కి బాగా చదువు రావాలని. మంచి మేనర్స్ కూడా రావాలని.* 


 *' అలాగే ' అని లక్షల వరహాలు దఫా దఫాలుగా కోశాగారం నుంచి తెప్పించారు మంత్రిగారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి.* 



 *ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతుందో* *చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. 'చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారహో ' అని తప్పెట్లు, తాళాలు ,పెద్ద పెద్ద శబ్దాలు చేసే బూరలతో ఒకటే హోరు.* 


 *రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది. అయితే పంజరం లోని చిలుకను ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరూ దాని వైపు చూడటం* *లేదు.పండితుడు ఒక్కడే చూస్తున్నాడు. ఆయనైనా చిలుక సరిగా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప , చిలకెలా ఉందో చూడటం లేదు. చిలుక బాగా నీరసించి పోయింది.* *మానసికంగా బాగా నలిగిపోయి ఉంది* . 


 *ఆ రోజైతే .... రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది. తర్వాత కొద్దిరోజులకే పూర్తి ప్రాణం విడిచింది ! ఆ సంగతి ఎవరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు.* 



 *రాజుగారు మళ్ళీ మేనల్లుడిని పిలిచి, ' చిలుక ఎలా చదువుతోంది? ' అని అడిగాడు.* 

 *' చిలుక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి' అన్నాడు మేనల్లుడు* 


 *రాజుగారు సంతోషించారు. *తన కృషి ఫలించిందన్నమాట.* 

 *' ఇప్పటికి అల్లరి చిల్లర గానే ఎగురుతోందా?'* 

' *ఎగరరదు'* 

 *' ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా? '* 

 *'పాడదు'* 

 *' సరే, చిలుకను ఒకసారి నా దగ్గరికి తీసుకురా'* 

 *తీసుకొచ్చాడు మేనల్లుడు.* *చిలుక నోరు తెరవడం లేదు.ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.చిలుక కడుపు* *ఉబ్బెత్తుగా ఉంది. చిలుక అసలు కదలనే కదలటం లేదు.* 



 *" ఆ కడుపులోనిది ఏమిటి!"అనిఅడిగారు రాజు గారు.* 

' *జ్ఞానం మామయ్య ' అని చెప్పాడు మేనల్లుడు.* 


' *చిలుక చనిపోయినట్లు ఉంది కదా ' అన్నారు రాజుగారు.* 

 *చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత. చచ్చిందా* *బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనల్లుడు.* 


 *నూరేళ్ళ క్రితం విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ రాసిన చిలుక కథ ఇది.ఇప్పటి కార్పోరేట్ విద్యాసంస్థలకు సరిగా సరిపోతుంది కదా ...* 


🕉️🌞🌎🏵️🌼🚩

వాక్సుధారసం

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹 *🌷శ్రీ దత్త వాక్సుధారసం🌷* 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

విశ్వానికంతటికి మూల కారణమైన అనాది పరబ్రహ్మము ఒక్కటే.  నిజానికి పరబ్రహ్మమునకు ఏ పేరు కాని, జాతి కాని లేవు. కాని మాయ వలన కలిగిన మోహమనెడి చీకటిలో పరబ్రహ్మమును గురించిన భావన కొరకు మాత్రమే ఈ పేరు పెట్టబడినది.


పిల్లలు పుట్టినప్పడు ఏ పేరూ పెట్టుకుని రారు.  కాని, అటు తరువాత మనం ఆబిడ్డను పేరు పెట్టి పిలుస్తూ ఉంటే క్రమంగా ఆ పేరు వినగానే బిడ్డ పలుకుతూ ఉంటుంది. ఆవిధంగానే సంసారములోని బాధలను దుఃఖములను భరించలేక జీవులు ఆర్తితో భగవంతునికి తమ కష్టములను గురించి చెప్పుకునేటప్పుడు ఏ పేరుతో పిలిచినప్పుడు ఆ బ్రహ్మత్వము మారుపలికి అతనికి జవాబిస్తుందో, అదే ఈ "సాంకేతికము" (ఓం తత్ సత్) అనగా గుర్తించటం కోసం ఏర్పడిన పేరు, కొందరు 'రామా' అని అనవచ్చును. మరికొందరు "కృష్ణా" అనవచ్చును.  కొందరు శివుడనీ ఇంకొందరు 'అమ్మ' అని  పిలువ వచ్చును మొదలైన ఏ పేరుతో ఎవరు ఎలాగయినా పిలువవచ్చును.


ఏ పేరుతో పిలిచినా, ఏరూపాన్ని తలచినా పలికే "దైవం" మాత్రం ఒక్కటే.


ఓమ్, తత్, సత్, అనునది 'బ్రహ్మము' యొక్క త్రివిధ నామము.  ఈనామముతో ఏకరూపముచెంది సాత్త్విక కర్మాచరణము చేసినప్పుడు మాత్రమే మానవుడు కైవల్యమును పొందగలుగును.


నోటితో బ్రహ్మము యొక్క నామమును పలుకుతూ, చేతులతో సాత్త్వికకర్మలు చేస్తున్నప్పటికీ కూడా, దాని వినియోగాన్ని గురించిన జ్ఞానం లేకపోతే ఆపనులన్నీ కూడా వ్యర్థమే.


ఈనామంలోని మూడు అక్షరములను కర్మ యొక్క ఆరంభము, మధ్య మరియు అంత్యమనెడి మూడు స్థానములో ఉపయోగించాలి. ఈ వ్యవస్థవలననే బ్రహ్మవేత్తలు, బ్రహ్మస్వరూపాన్ని పొందగలిగారు.  ఈ నామ సహాయంవలన లోకులు బంధకరములైనట్టి కర్మలనుండి విముక్తిని పొందుతారు.  ఈవిధంగా యజ్ఞదానాది కర్మలు ఓంకార సహాయముచే హితకరములగుచున్నవి. ముముక్షువులు వివిధములైన యజ్ఞములను, తపస్సు, దానములను చేయునప్పుడు ఫలమును కోరకుండా 'తత్' అని ఉచ్ఛరించుచూ చేయుదురు. "తత్ రూపియగు బ్రహ్మకు ఈ కర్మలన్నియు ఫల సహితముగా అర్పితము అగుగాక!" అని విజ్ఞ పురుషులు తమ కర్మ ఫలమును భగవంతునికి అర్పించి కర్మచేయటంవలన ఆకర్మయొక్క ఫలము వారికి బంధం కాకుండా ఉంటుంది. 'తత్' రూపియగు బ్రహ్మకు తమసమస్త కర్మఫలములను అర్పించి 'నమమ' అంటూ సమస్త కర్మఫలముల నుండి తమను తాము వేరు చేసుకుంటారు. "నమమ" అనగా ఈఫలము నాది కాదు."


హోమము చేయునప్పడు దేవతల నుద్దేశించి "ఇంద్రాయ స్వాహా| ఇంద్రాయ ఇదం నమమ.." మొదలైన మంత్రాలు చెపుతారు. అదేవిధంగా ఏదైనా దానము ఇచ్చినప్పడు.  "తుభ్యం బ్రాహ్మణాయ దదామి. బ్రాహ్మణాయ ఇదం నమమ” అని చెపుతారు.  అనగా దానమిచ్చిన వస్తువు దానము పుచ్చుకొన్న బ్రాహ్మణునకు చెందుగాక! ఇక ఆవస్తువు నాకు చెందదు. అని మామూలుగా అర్థం చెపుతారు. కర్మయోగి దానమిచ్చిన వస్తువునే కాక ఆదానఫలమును కూడా వదులుకుంటున్నాడు.  అని ఈ “నమమ" అను మాటకు అర్ధము.  నమమ అనగా నాది కాదు.  అలాగే కర్మయోగి హోమం చేయునప్పడు హోమ ద్రవ్యము మాత్రమే కాక తత్ఫలము కూడా తనకు అక్కరలేదని అంటారు.


ఈవిధముగా ఓంకారముచే ఆరంభించబడి బ్రహ్మార్పణ భావముతో చేయునటివంటి కర్మ, బ్రహ్మరూపమును పొందుతుంది.  ఇవి బయటకు కర్మలుగా కనిపించినా కూడా ఆకర్మఫలం కర్తకు అంటదు. అలాకాకుండా ఫలము నాకు కావాలి నేనే చేస్తున్నాను" అనేటువంటి కర్తృత్వభావన కలిగియుండి పైకి మాత్రం "బ్రహ్మార్పణం" అంటూ కర్మచేస్తే అది బ్రహ్మమును పొందదు, ఆకర్మఫలం కర్తకు చెంది తీరుతుంది.


పరమేశ్వరుడు సర్వ స్వతంత్రుడు, ప్రభువు. నియామకుడు.  నేను నిమిత్తమాత్రుడను అనే భావముతో కర్మలు చేసి కర్మఫలమును భగవదర్పణ చేస్తే భగవంతుడు ఆఫలమును స్వీకరించి కర్మబంధము నుండి జీవునికి విముక్తి కలిగిస్తాడు - అని భక్తులు చెపుతారు.


ఉప్పునీటిలో కరగి పోయినప్పటికీ కూడా దానికి గల ఉప్పదనము మాత్రము మిగిలి ఉండే విధంగా "మనము మన కర్మలను బ్రహ్మార్పణ మొనర్చాము" అనేటువంటిద్వైతభావం కర్తలోనిలిచే ఉంటుంది. అయినప్పటికీ చిత్తశుద్ధి కల్గుతుంది.  రాగద్వేషాదులు లేని చిత్తము ఏర్పడుటను చిత్తశుద్ధి అంటారు.  దీని వలన జ్ఞానమార్గమున ఉత్తమాధికారి అవుతాడు, బ్రహ్మవిచారమువలన జ్ఞానము కలుగుతుంది.  ఈ విధంగా నేను అనేటువంటి అహంకారము, కర్తృత్వాభిమానము ఉన్నంతవరకూ సంసారభయము పోదు - అని జ్ఞానులు అంటారు.


స్వయముగా పరమేశ్వరుని ముఖమునుండి చెప్పబడిన వేదములు ఈ విషయమును గట్టిగా నొక్కి చెప్పుచున్నవి. ఈనామరూపాత్మకమైన జగత్తంతయు అనిత్యము. ఇది శాశ్వతము కాదు. అందువలన ఇది "సత్" కాదు. కేవలము ఆత్మస్వరూప ప్రాప్తి వలననే ఆ "సత్" అనెడి తత్వ జ్ఞానము కలుగును.  ఈసత్ తత్వము వలననే ఇంతకు పూర్వము ప్రశస్తముగానైన కర్మలన్నీ కూడా ఐక్య జ్ఞానమువలన సమరూపమును పొందును. అంతట ఆత్మస్వరూపుడగు "బ్రహ్మము" తెలియబడును. ఇందువలన ఓంకారము మరియు ఓంకారముచేత బ్రహ్మాకారమును పొందిన కర్మలన్నియు పరిపక్వమై ఒక్కమారుగా సంపూర్ణముగా సద్రూపమును పొందును.  ఏఏ కర్మలు చేసినప్పటికిన్నీ సమస్తకర్మలూ బ్రహ్మార్పణమనుటచేత బ్రహ్మారూపముగానే అయిపోవును.  సముద్రములో కలసిన తరువాత నదులను వేరుపరచలేని విధముగా బ్రహ్మార్పణమొనర్చబడిన కర్మలలో ఎక్కువ తక్కువ భేధములు ఉండవు.


ఓం, తత్, సత్ అనే మూడు శబ్దములు ఈవిధముగా పర బ్రహ్మమును గూర్చి తెలియచేస్తున్నాయి. బ్రాహ్మణులు, వేదములు యజ్ఞములు, తమ పవిత్రతను కాపాడుకోవటానికి ఈశబ్దములనే ఉపయోగిస్తూ ఉంటారు (యి), బ్రాహ్మణులు చేసే కర్మలలో కాని, వేదములు పలికే సమయంలో కాని, యజ్ఞములు చేసేటప్పుడు కాని తెలిసో, తెలియకో ఏవైనా లోపాలు సంభవిస్తే ఆలోపాలను ఈ మూడు శబ్దములు పోగొట్టి పవిత్రతను కలిగిస్తాయి.


మోక్షము కోరువారు ఫలాపేక్ష లేకుండా ఈ "తత్" శబ్దమును ఉచ్ఛరించి యజ్ఞాలు, తపస్సులు, దానాలు చేస్తూ ఉంటారు.  మంచి విషయాలలోను, ఉత్తమ కర్మలు చేసేటపుడు "సత్" అనే శబ్దాన్ని వాడతారు. యజ్ఞాలలో, తపస్సులలో, దానములలో స్థిరమైన నిష్ఠనే శ్రద్ధ అంటారు. ఈశ్వరానుగ్రహం కొరకు శ్రద్ధతో చేయబడే కర్మలన్నీ కూడా సత్కర్మలు, కర్మ + భగవంతుడు= కర్మయోగము. శ్రద్ధ లేకుండా చేసే కర్మలు అసత్కర్మలు.   చేసేది, ఏ కొంచెమైనా సరే శ్రద్ధగా చెయ్యాలి.  అశ్రద్ధతో ఎంతపనిచేసినా అది వ్యర్ధమే.

ఏది చేసినా సర్వం గురు జ్ఞాన మయం.  కనుక సర్వం దత్తార్పణం అని కార్యాంతములో చెప్పుకొని కార్య ఫలాన్ని దత్తునికీ దత్తం చేయాలి.  

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *జై గురు దత్త* 🙏🙏

హరిని

 హరిని విడిగా చూడలేము.అందుకు ప్రత్యక్ష సాక్ష్యం, మహా నివేదన అయిన తరువాత శివలింగ దర్శనం విష్ణు రూపం. క్షీరసాగరంలో శయనించే శ్రీ మహావిష్ణువు రూపం. లింగానికి నాగా లంకరణ విష్ణువు శేషసాయి పాన్పు. అచ్చంగా అదే రూపం. యిది ఆదినుండి లింగోద్భవ నుండి అనగా భూమి పుట్టినప్పటినుండి లింగారాధన జరుగుచూనే వున్నది శివరాత్రి రూపంలో.శివలింగం భూమి. జలం నుండి భూమి యనే లింగం ఉధ్బవము. భూమిలేని జీవం శూన్యం.సృష్టికి మూలం లింగోధ్భవం. అది ప్రత్యక్ష ప్రమాణము. అది లేని జీవకళ చైతన్యం లేని ప్రకృతి. యింత చక్కగా ప్రమాణపూర్వకంగా సృష్టి మూల ప్రకృతి తత్వాన్ని తెలిపిన వేదాసార పురుషుడైన విష్ణువుకు భవునికి వందనం.భవము అనగా పదార్ధ రూప లక్షణము  ప్రకృతి యని తెలియుట. ఉదయం బ్రహ్మ స్వరూపం లింగాకరం. ఏమీ తెలియదు. ఆపై విష్ణు స్వరూపం. అంతా కళా మయమే.రాత్రి సమయం సృష్టికి మూలం. అది అలంకారమయమైన విష్ణు తత్వం ప్రకృతి. అలంకారము కళ యని మనకి అనుభవ పూర్వకమే. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*మంత్రోపదేశం..మొగలిచెర్ల ప్రయాణం..*


*(ఇరవై నాలుగవ రోజు)*


శ్రీ స్వామివారు తన దండ కమండలాలు చేతబూని..శ్రీధరరావు దంపతులకంటే ముందుగానే..పార్వతీదేవి మఠం ముందున్న మెట్ల వైపు అడుగులేసి మెట్లు దిగసాగారు..చేసేదేమీ లేక, శ్రీ స్వామివారితో ఇక ఆ క్షణంలో ఏమి చెప్పినా వృధా అని ఉద్దేశ్యంతో దంపతులిద్దరూ ఆయన వెనకాలే అనుసరించారు..మెట్లు దిగుతున్న ప్రభావతి గారు ఒక్కక్షణం ఆగి, శ్రీధరరావు గారిని కూడా ఆగమని చెప్పి..కొండమీద కొలువైవున్న శ్రీ లక్ష్మీ నృసింహుడిని మనసారా ధ్యానిస్తూ.."స్వామీ!..ఏ మలుపులు త్రిప్పుతావో ఇక నీ ఇష్టం..మేము నిమిత్తమాత్రులం.." అని చెప్పుకొని క్రిందకు దిగివచ్చారు..


ఆసరికే శ్రీ స్వామివారు దగ్గరలో ఉన్న ఒక చెట్టుక్రింద, తన జింక చర్మాన్ని పరచుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..శ్రీధరరావు గారిని, ప్రభావతి గారిని తనవద్దకు రమ్మని పిలిచారు..ఇద్దరూ వచ్చి శ్రీ స్వామివారి ముందు కూర్చున్నారు..


"అమ్మా!..మీ ఇద్దరికీ చాలా సందేహాలు మనసులో ఉన్నాయి..మీ సందేహాలన్నీ ఈ వ్యావహారిక లోకానికి సంబంధించినవి..నా ఆలోచనలు మీ ఊహకు కూడా అందనివి..ఏది ఎప్పుడు ఎలా జరిగిపోవాలో..అది అప్పుడు జరిగి తీరాలి..అది సృష్టి నియమం!..ఇక జల పడదు..ఇక్కడ త్రవ్వించిన బావి దండగ అని మీరు అనుకున్న బావిలో పుష్కలంగా నీరు రాలేదా?..అలాగే మందిర నిర్మాణం ఎలా జరుగుతుందో అని మీరు ఆలోచించనవసరం లేదు..

"బాలోన్మత్త పిశాచ వేషాయ!.." అన్నట్లు గా అవధూతల చేతలు మాటలు మీకు అర్ధం కావు..అంతుబట్టవు కూడా..దేనిగురించి మీరు విచారపడకండి..నేను ఇప్పుడు మీతో ఇలా హఠాత్తుగా వస్తున్నానంటే..దానికి గల కారణం దానికి నిర్దేశించివుంటుంది..ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన కార్యం తోడై ఉంటుంది.." అని ఒక్కనిమిషం పాటు కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలోకి వెళ్లారు..


అనంతరం..అత్యంత వాత్సల్యపూరిత చూపుతో.."అమ్మా..శ్రీ వైష్ణవం నీ పద్దతి!..ఇప్పుడు..ఈ క్షణం లో నీకు ఈ మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి పాదాల చెంత.."తిరుమంత్రం" ఉపదేశిస్తాను..మీ ఇంటికి చేరిన తరువాత..సాంగోపాంగంగా మంత్రం, మంత్రార్థం, జపవిధానం బోధిస్తాను..సావధానంగా విను!.." అన్నారు..


పద్మాసనం లో ఉన్న స్వామివారు..ఒక్కసారిగా ధ్యాన సమాధి స్థితి కి వెళ్లారు..చుట్టూ వున్న ప్రకృతి కూడా చడీ చప్పుడూ లేకుండా పది నిమిషాలపాటు నిశ్శబ్దంగా మారిపోయింది..శ్రీ స్వామివారు కళ్ళుతెరచి..మంత్రాన్ని పలుకమని ప్రభావతి గారిని ఆదేశించారు..శ్రీధరరావు గారికి ఆ నిమిషంలో శ్రీ స్వామివారిలో సాక్షాత్తూ దక్షిణామూర్తి రూపం గోచరించింది..ప్రభావతి గారైతే..పూర్తిగా మంత్రం పలకడం లో లీనమై పోయారు..శ్రీ స్వామివారు ఎన్నిమార్లు మంత్రాన్ని ఆవిడ చేత పలికించారో.. ఈవిడ ఎన్ని సార్లు ఉచ్చరించారో ..సమయం ఎంతసేపు గడిచిందో..ఏమీ గుర్తురాలేదు..నిజానికి శ్రీధరరావు గారికి మంత్రోపదేశం చేయలేదు..కానీ ఆయన కూడా అదో విధమైన అనుభూతికి లోనై..పరిసరాలు మర్చిపోయారు..


శ్రీ స్వామివారి మంత్రోపదేశం పూర్తయ్యేసరికి..సాయంత్రం పొద్దు కూకుతోంది..బండితోలే మనిషి.."అయ్యా!..అడివి దారి..చీకటి పడితే కష్టం.." అంటున్నాడు..దంపతులిద్దరూ ఇంకా ఆ దివ్యానుభూతి నుంచి తేరుకోలేదు.. శ్రీ స్వామివారే ముందుగా లేచి.."ఇక పదండి!.." అన్నారు..


శ్రీ స్వామివారితో కలిసి బండిలో కూర్చున్న శ్రీధరరావు గారు ప్రభావతి గార్లు మౌనంగా వున్నారు..వారి హృదయాలలో ఇంతకుముందు శ్రీ స్వామివారు బోధించిన మంత్రమే సుడులు తిరుగుతున్నది.. శ్రీ స్వామివారు ఆ గతుకుల దారిలో..బండి కుదుపుల లోనే..ధ్యానం లోకి వెళ్లిపోయారు..మళ్లీ అత్యంత దివ్య సుగంధ పరిమళం బండిలో వ్యాపించిపోయింది..దాదాపు రెండు గంటల బండి ప్రయాణం దివ్యమైన అనుభూతితో గడచినట్లుగా ఆ దంపతులకు తోచింది..కొద్దిగా చీకటి పడే వేళకు..మొగలిచెర్ల కు చేరారు..


ఇంటికి రాగానే..శ్రీ స్వామివారు ఇంతకు ముందు బస చేసిన గది లోనే..వసతి ఏర్పాటు చేశారు..ఒక చెక్క మంచము అందులో వేశారు..దానిమీద శ్రీ స్వామివారు, తాను తెచ్చుకున్న ధావళి పరచుకొని..ఆ ధావళి మీద జింక చర్మం పరచుకొని, తన ధ్యానానికి అనువుగా చేసుకున్నారు..ఒక గ్లాసు పాలు మాత్రం ఆహారంగా తీసుకొని గది తలుపులు వేసుకున్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు..భవిష్యత్ కార్యాచరణను పూర్తిగా శ్రీ లక్ష్మీ నృసింహుడి మీదే భారం మోపారు!..


శ్రీ స్వామివారి ధ్యానం..ఊరి ప్రజల వ్యాఖ్యలు..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 &  99089 73699).