45 years నిండిన మేము రెండు తరాలకు సాక్షులం
స్వచ్చమైన గాలి నీళ్ళు,. పచ్చటి పొలాలు. 🌾🌴
పరిశుభ్రమైన. వాతావరణం లో పుట్టి. పెరిగిన వాళ్ళం...
👦తలపై నుండి. చెంపల మీదకు కారిపోయేలా నూనె రాసుకుని...
📚 చేతికి పుస్తకాల. సంచి తగిలించుకుని...,
ఒక్కడిగా. బయలుదేరి దారిలో స్నేహితులను
ఒక్కొక్కళ్లను. కలుస్తూ పెద్దగుంపుగా. 👦. 👦 👩. 👧 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి కాళ్లకు చెప్పులు లేకుండా నడచి వెళ్ళిన తరం వాళ్ళం, 🚶🏃
జారిపోయే నిక్కరు మీదకు మొలతాడు. లాక్కుంటు ..., చిరుగు. బొక్కలకు గుడ్డ ముక్కలు అతుకులేయించుకున్న వాళ్ళం 🕺
10 వ తరగతి అయ్యే వరకు నిక్కరు. వేసుకున్న. , తరం మాదే...🌲
🤸🤹
గోలీలు, బొంగరాలు,
కర్రా బిళ్ళ,
నేలా బండ,. ఉప్పాట,
ఏడు పెంకులాట.....
🥎 బంతి పుచ్చుకుని. నేరుగా కొట్టేసుకుంటే బంతి లాగ వంటి మీద ముద్ర పడే ముద్రబాల్. లాంటి ఆటలాడిన తరం...,
🚴🏊🤽
బడికి వేసవి కాలం. , సెలవులు రాగానే తాటి చెట్లూ,. .. సీమ తుమ్మ చెట్లూ ఈతచెట్లు ఎక్కి కాయలు. కోసుకొని తిన్న వాళ్ళం, చెరువులు, కాలవల్లో స్నానాలు చేసిన వాళ్ళం. , తాటి బుర్రలు బండితో ఆడినోళ్లం...
🪔🪔🪔
దీపావళి కి. తాటి బొగ్గుల రవ్వల దివిటీ కోసం వళ్ళంతా మసి పూసుకొని మరీ తయారు చేసుకనే వాళ్ళం.
5 ps ఐస్ తిన్నది మేమె. ,, . పది పైసలతో బళ్ళో. మ్యాజిక్ షో. చూసింది మేమే....
🌦️ వర్షం వస్తె తాటాకు. గొడుగూ, యూరియా సంచులు, కప్పుకుని బడికి వెళ్ళిన వాళ్ళం..
📖 second hand text books కోసం పరీక్షలు
అయినప్పటి నుండి ముందు తరగతి వాళ్ళని బతిమాలిన తరం.
🚴సెకెండ్ హ్యాండ్ సైకిల్ తొ పక్క. తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్నోల్లo మేమే...
✉️ఉత్తరాలు.., రాసుకున్న.. ,అందుకున్న తరంవాళ్ళం... 🌴
పండగ సెలవులు,
వేసవి సెలవులు. , ,దసరా, సంక్రాంతి సెలవులు
ఎన్ని సెలవులు. వొచ్చినా ఐదు పైసలు ఖర్చులేకుండా ఆనందాన్ని. 🤼 🏃🏻 ⚽ 🏸 🪁🏹 🤸 ⛹️. 🏊 అనుభవించిన తరంవోళ్ళం...,
👨👩👧👦 పెద్దలు. /పిల్లలూ అందరం వీధి అరుగుల మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు/రాత్రులు ఆనందంగా కబుర్లు చెప్పుకుని. పొట్ట చెక్కలయ్యేలా
నవ్వుకున్నదీ మేమే.... ☘️
ఊర్లో,. ఎవరి ఇంట్లో ఏ వేడుక జరిగినా,. మన ఇంట్లో జరిగినట్లు,. అంతా మాదే. ,
అంతామేమే. అన్నట్లుగా భావించి స్వచ్చందంగా. / నిస్వార్థంగా పాలుపంచుకున్న తరం మాదే...🍁
🕵🏻ఉర్లో ఒక ఇంట్లో దొంగలు పడ్డారని ,. పిల్లలు. అందరం కలిసి ఊరు చుట్టూ తెల్లవార్లూ ఎన్నో రాత్రులు
🔦టార్చిలైట్స్, కర్రలు పట్టుకుని కాపలా కాసిన వాళ్ళం మేమే.
🕉️ 🚩 🛕
ప్రతీ శ్రీరామ
నవమి కీ వినాయక చవితి కి గుడి దగ్గర తాటాకు పందిరికి రంగు కాగితాలు అంటించడం, , మామిడి తోరణాలు కట్టడం. కోసం. ముందు రోజు రాత్రంతా జాగారం. చేసింది మేమే. .🌾
👨👩👧👧చుట్టాలు వస్తేనే అమ్మ ప్రత్యేక వంటలు వండి పెట్టిన తరం....🍁
అత్తయ్యా,
మామయ్య,. ,పిన్ని,, బాబాయ్, అక్కా ,బావ అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న తరం,
స్కూలు మాష్టారు కనపడితే భయంతో పక్కనున్న సందుల్లోకి పారిపోయిన తరం... ,🌺
పుల్లల పొయ్యి మీద అన్నం/కూర ఉడుకుతున్నప్పడు వచ్చే అద్బుతమైన పరిమళాన్ని ఆస్వాదించిన తరం. వాళ్ళం..,🌱
పొయ్య మీదనుంచి. నేరుగా పళ్ళెం లోకి వచ్చిన వేడి వేడి అన్నంలో ఆవకాయ, వెన్నపూస వేసుకుని పొయ్యి దగ్గరే
తాతయ్యలు. అమ్మమ్మ/నాయనమ్మ, , అమ్మా నాన్నా, పెదనాన్న. ,, ,పెద్దమ్మ,, . పిన్ని బాబాయ్,. అత్తయ్య మామయ్య, అక్కలు చెల్లెళ్లు అన్నయ్యలు తమ్ముళ్లు అందరం ఒకే. దగ్గర చేరి మధురమై. అనుభూతితో కూర్చుని అన్నం. తిన్న తరం ..,..🦋
అమ్మమ్మలు. / నాయమ్మల చేత గోరుముద్దలు తిన్నది,. అనగనగా ఒక రాజు.... కథలు విన్నది ,🌵
నూనె పిండితో నలుగు పెట్టించుకుని కుంకుడు కాయ పులుసుతో తలంటు స్నానం చేయించు కున్న తరం...,🍀
📻రేడియో,
దూరదర్శన్📺
టూరింగ్ టాకీస్📽️. కాలం చూచిన వాళ్ళం... .🍁
🎥 40 పైసల. నేల టిక్కెట్ తో నేల మీద కూర్చుని,
1. .20. రూపాయల chair టిక్కెట్ తో ,,rs 2 ticket బాల్కనీ లో కూర్చుని సినిమా చూచిందీ మేమే...🌵
స్కూల్ , కాలేజీ రోజుల్లోనే ఎలక్షన్లు చూచిన వాళ్ళం.. .🍂
అమ్మా నాన్నా తో సంవత్సరానికి ఒక సారి, పరీక్ష పాస్ అయ్యావా.. .. అని మాత్రమే అడిగించు కున్న తరం వాళ్ళం...🌹 అప్పటికీ ఇప్పటికీ పెద్దవాళ్లకు గౌరవం ఇచ్చే తరం మాదే
📲🖥️🖨️
ప్రస్తుత0 ఉన్న Whatsapp Fb skype లు మీతో పాటు సమానంగా వాడేస్తున్న మాతరం...,
మేమే ఆ తరానికి ఈ తరానికి మధ్యవర్తులం...
మేమే-- -💐
అవును.......రెండు తరాల మద్యలో జరిగిన అనూహ్యమైన మార్పులకు మేమే సాక్షులం 🌸
మన ముందుతరం
తల్లిదండ్రుల పై భయభక్తులు ...ఉన్న వాళ్లు... మన తరువాత తరం వాళ్లు వాళ్ల పిల్లలకు భయపడుతుంటారు..
మనం మాత్రం అటు తలిదండ్రులకు ఇటు పిల్లలకు భయపడే..అనిశ్చిత తరం😀😀😀😀
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి