11, అక్టోబర్ 2026, ఆదివారం

కుండ చెప్పిన సందేశం*

 🪷Enlightenment Story🪷

🍁🦚🍁 🦚

*కుండ చెప్పిన సందేశం*


అర్జునా....మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ...అవి అన్నీ మట్టి తోటే తయారు చేయబడతాయి.అలానే జీవుల శరీరాలు వేరైనా...వాటిలో ఉండేది ఒకే ఆత్మ.

ఈ విషయం తెలుసుకున్న వారు ఎవరూ...

ఎవరినీ బాధ పెట్టరు.


ఎవరి చేతనూ బాధింపబడరు.ఒకసారి కుండను ఎవరో అడిగారట...నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా...ఇది ఎలా సాధ్యం? అని.


అప్పుడు కుండ...

నేను ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను...నేను వచ్చింది మట్టిలో నుంచి...వెళ్ళేది మట్టిలోనికే...

మధ్యలో ఆవేశం, గర్వం, అహం అవసరమా?

అని చల్లగా జవాబిచ్చింది.


నాది అనుకుంటే బాధ్యత అవుతుంది...నాకెందుకు అనుకుంటే...

బరువు అవుతుంది.స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి.వెలిగించడం చాలా సులభం...

కానీ ఆరిపోకుండా కాపాడుకోవడం లోనే ఉంది అసలైన గొప్పతనం...


కష్టం విలువ తెలిసినవారు ఎవరినీ కష్ట పెట్టరు. 

ఇష్టం విలువ తెలిసినవారు ఎవరినీ వదిలిపెట్టరు.

లోపాలనే పట్టుకుని వేలాడితే...బంధాలు ఎప్పటికీ మెరుగవ్వవు.మన మనస్సు విశాలం చేసుకున్న కొద్దీ...ఎదుటివారి లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి.

ఐనా ఇష్టం ఉన్న బంధంలో ఏదీ కష్టం అనిపించదు.


*ప్రేమ ఉన్న బంధం ఎప్పటికీ చెక్కుచెదరదు.

అవసరం ఉన్నప్పుడు పలకరిస్తున్నారని...

ఎవరి గురించీ బాధపడకు.వాళ్లు చీకట్లో ఉన్నప్పుడు నువ్వు వెలుగులా గుర్తొస్తావని సంతోషించు*



 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*సర్వేజనా సుఖినోభవంతు*

*లోకాస్సమస్తాః సుఖినోభవంతు*

*సమస్త సన్మంగళాని భవంతు*

 *శుభం భూయాత్*

 *శుభమస్తు*

*ఓం శాంతి శాంతి శాంతిః*

*స్వస్తి*

నీవు లేక నేను లేను…💞

 జీవితం...


🌹 నీవు లేక నేను లేను…💞


కానీ… నీవు లేకున్నా నేను నిలబడాలి!


ఈ ఆదివారం ప్రతి భార్యాభర్త తప్పక చదవాల్సిన మనందరి కథ 🙏


“ఏవండీ… ఒక మాట అడుగుతాను. ఏమీ అనుకోకుండా నిజాయితీగా సమాధానం చెప్పాలి…”


“మళ్లీ ఏదో భేతాళ ప్రశ్న వేయబోతున్నావా? సరే… అడుగు!”


“మన పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. మనిద్దరం ఇక్కడే ఉంటున్నాం. దేవుడి దయవల్ల తిండికి, బట్టకి, సొంతింటికి లోటు లేదు. ఇద్దరం ఒకరికొకరం తోడుగా హాయిగా కాలం గడుపుతున్నాం.


కానీ… రానురాను మన వయసు పెరుగుతోంది. ఓపికలు తగ్గుతున్నాయి. పూర్వం లాగా పిల్లల దగ్గర శాశ్వతంగా ఉండలేం. వాళ్లూ ఉద్యోగాలు, పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలతో మన దగ్గరకు ఎప్పుడూ రాలేరు.


అందుకే… ఒకవేళ నాకు ఏమైనా అయితే మీరు ఒంటరిగా ఎలా ఉంటారో అని భయంగా ఉంది. ఈ ఆలోచనలతో రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు…”


భర్త కాసేపు మౌనంగా ఉండి…


“నాకూ అదే భయం ఉంది. కానీ ఒక చిన్న తేడా ఉంది.


నువ్వు నేను లేకపోతే ఎలా బతకాలి అని ఆలోచిస్తున్నావు…

నేను మాత్రం నువ్వు లేకపోతే ఎలా బతకాలో ఆలోచిస్తున్నాను!


నీకంటే నేను ఐదేళ్లు పెద్దవాడిని. మనలో ఎవరు ముందు వెళ్తారో ఎవరికీ తెలియదు.


అందుకే ఈరోజు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి.


❤️ ప్రేమ అంటే ఒకరిపై ఒకరు ఆధారపడటం మాత్రమే కాదు…


ఒకరు లేని సమయంలో మరొకరు నిలబడేలా చేయడం కూడా!


నువ్వు నాకు ఎన్నిసార్లు చెబుతావు…


‘మీరు లేకపోతే నేను ఏం చేయాలి?’ అని.


కానీ నేను అడుగుతున్నది…


‘నేను లేకపోతే నువ్వు ఏం చేయగలవు?’


మన సందు చివర్లో ఉన్న ATMకి వెళ్లి డబ్బు తీసుకురాగలవా?


UPI ద్వారా డబ్బు పంపగలవా?


ఫోన్‌లో వచ్చిన OTP అంటే ఏమిటో తెలుసా?


Google Pay / PhonePe / Net Banking ఎలా ఉపయోగించాలో తెలుసా?


అత్యవసర సమయంలో Cab బుక్ చేయగలవా?


108 Ambulanceకి ఫోన్ చేయగలవా?


నా ఫోన్‌లో Emergency Contacts ఎక్కడున్నాయో తెలుసా?


మన పిల్లలకు Video Call ఎలా చేయాలో తెలుసా?


WhatsAppలో Location Share చేయగలవా?


మన ఇంటి Google Maps Locationని ఎవరికైనా పంపగలవా?


నా హాస్పిటల్, డాక్టర్, ఇన్సూరెన్స్ వివరాలు ఎక్కడున్నాయో తెలుసా?


మన ఆరోగ్య బీమా కార్డు ఎక్కడుంది?

దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా?


ఇంట్లో Gas అయిపోతే ఎలా Book చేయాలో తెలుసా?


కరెంట్ బిల్లు ఎలా చెల్లించాలో తెలుసా?


నీ మొబైల్ Recharge ఎలా చేసుకోవాలో తెలుసా?


మన Bank Accounts ఎక్కడున్నాయి?

ఎన్ని Deposits ఉన్నాయి?

ఏవి Maturityకి వస్తున్నాయి?


మన ముఖ్యమైన Documents — Aadhaar, PAN, Insurance, Property Papers, Bank Details — ఎక్కడ భద్రంగా ఉన్నాయో తెలుసా?


మన పిల్లలు విదేశాల్లో ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం…

కానీ వాళ్లకు మన అవసరం వచ్చినప్పుడు మనం Video Call చేయగలమా? వాళ్లకు మన పరిస్థితిని సరిగ్గా చెప్పగలమా?


ఇవి చిన్న విషయాలే అనిపించవచ్చు.


కానీ…


అత్యవసర సమయంలో ఇవే జీవితంలో పెద్ద విషయాలవుతాయి!


⸻


భార్య నెమ్మదిగా…


“మీరు ఎన్నిసార్లు చెప్పారు… కానీ నాకు ఇవన్నీ అవసరం ఉండదనిపించింది.


మీరు ఉన్నారుగా…

అన్నీ మీరే చూసుకుంటారు అనుకున్నాను…”


భర్త చిరునవ్వుతో…


“అదే మన పెద్ద పొరపాటు.


‘ఆయన ఉన్నారుగా… ఆమె ఉన్నారుగా…’ అని జీవితమంతా ఒకరిపై ఒకరు ఆధారపడుతూ వచ్చాం.


కానీ జీవితానికి గ్యారంటీ లేదు.


అందుకే ఇకనుంచి…


నువ్వు నాకు నేర్పాలి.

నేను నీకు నేర్పాలి.


నువ్వు UPI నేర్చుకో.

నేను వంట నేర్చుకుంటాను.


నువ్వు Bank పనులు నేర్చుకో.

నేను ఇంటి పనుల్లో కొన్ని నేర్చుకుంటాను.


నువ్వు Emergency Contacts తెలుసుకో.

నేను Insurance వివరాలు తెలుసుకుంటాను.


నువ్వు Online Payments నేర్చుకో.

నేను Medicines, Medical Records ఎక్కడున్నాయో నీకు చూపిస్తాను.


మనిద్దరం కలిసి బతకాలి…

అదే సమయంలో ఒకరు లేకపోయినా మరొకరు ధైర్యంగా నిలబడగలగాలి.”


భార్య కళ్లలో నీళ్లు…


“ఇలా చెప్పేసరికి భయంగా ఉంది…”


భర్త ఆమె చేతిని పట్టుకుని…


“భయపడాల్సిన అవసరం లేదు.


మన చేతిలో లేనిదాని గురించి భయపడటం కంటే…


మన చేతిలో ఉన్నదాన్ని నేర్చుకోవడం మంచిది.



ఉన్న ప్రతి రోజును ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో, ఒకరికొకరం అండగా గడపడం మాత్రం మన చేతుల్లోనే ఉంది 


పిల్లలకు చిన్నప్పటి నుంచే…


చదువు, ఉద్యోగం, కారు డ్రైవింగ్, వంట, ఈత, టెక్నాలజీ, డబ్బు నిర్వహణ… అన్నీ నేర్పిస్తాం.


కానీ మనం వయసు పెరిగిన తర్వాత…


‘ఇవి నాకు ఎందుకు?’ అని అనకుండా

‘రేపు అవసరం అయితే నేనే చేసుకోగలనా?’ అని ఆలోచించాలి.


⸻


🌷 ఈ కథ మనందరికీ ఒక చిన్న గుర్తు


భర్త భార్యకు ప్రత్యామ్నాయం కాదు.

భార్య భర్తకు ప్రత్యామ్నాయం కాదు.


కానీ…


ఒకరి జీవితంలో మరొకరు అద్భుతమైన తోడు. ❤️


ఆ తోడు ఉన్నంతకాలం ప్రేమగా జీవిద్దాం.


అదే సమయంలో…


ఒకరు లేని రోజు వచ్చినా, మరొకరు కూలిపోకుండా నిలబడేలా ఒకరినొకరు సిద్ధం చేద్దాం.


📱 Technology నేర్చుకుందాం.

💳 Digital Payments నేర్చుకుందాం.

🏦 Banking తెలుసుకుందాం.

🚑 Emergency Services తెలుసుకుందాం.

📄 Documents సక్రమంగా ఉంచుకుందాం.

🔐 ముఖ్యమైన సమాచారాన్ని సురక్షితంగా నిర్వహిద్దాం.

❤️ పిల్లలతో Regular Contactలో ఉందాం.

🙏 ముఖ్యంగా… ఒకరినొకరు ప్రేమగా, గౌరవంగా చూసుకుందాం.


🌺 చివరగా ఒక్క మాట…


“నీవు లేక నేను లేను” అనేది ప్రేమ.

“నీవు లేకున్నా నేను నిలబడగలను” అనేది జీవితంపై అవగాహన.

“నీవు ఉన్నంతకాలం నీకు తోడుగా ఉంటాను” అనేది నిజమైన దాంపత్యం. ❤️


కర్తవ్యం మన వంతు…

కాపాడటం ఆయన వంతు. 🙏


ఈ చిన్న కథను ప్రతి భార్యాభర్త ఒక్కసారి చదివి…

ఒక్కసారి మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకుందాం...


ఏమంటారు..?.✍️

పంచాంగం 11.10.2026 Sunday

  ఈ రోజు పంచాంగం 11.10.2026 Sunday


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష ప్రతిపత్తి తిథి భాను వాసర వైధృతి నక్షత్రం  యోగః కింస్తుఘ్నం తదుపరి బవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు. 


శ్రాద్ధ కర్మ తిథి : పాడ్యమి.


ఈ రోజు నుండి శరన్నవరాత్రులు ప్రారంభం. 

అందరికి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు 




 

నమస్కారః , శుభోదయం

11-10-2026 ఆదివారం రాశి ఫలితాలు

 శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

11-10-2026 ఆదివారం రాశి ఫలితాలు


మేషం


మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి అందిన శుభవార్తలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు.     

---------------------------------------


వృషభం


వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.     

---------------------------------------


మిధునం


ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. బందు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.       

---------------------------------------


కర్కాటకం


నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా  సాగుతాయి. ఋణదాతల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. బంధువర్గం నుండి విలువైన సమాచారం అందుతుంది. 

---------------------------------------


సింహం


కొన్ని వ్యవహారాలలో సొంత  ఆలోచనలు కలసిరావు. నూతన ఋణ ప్రయత్నాలు  చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.   

---------------------------------------


కన్య


వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అధికారులతో సఖ్యత కలుగుతుంది. కుటుంబ పెద్దల నుండి అవసరానికి ధనసహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు.    

---------------------------------------


తుల


వ్యాపారాల విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.    

---------------------------------------


వృశ్చికం


సహోద్యోగులతో మాటపట్టింపులు తొలగుతాయి. ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ  ప్రతిభ వెలుగులోకి వస్తుంది.      

---------------------------------------


ధనస్సు


విందువినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి.  వృత్తి  ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.          

---------------------------------------


మకరం


కుటుంబమునకు కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నూతన ఋణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.         

---------------------------------------


కుంభం


వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా  సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.            

---------------------------------------


మీనం


వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగమున అధికారులతో వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.   

---------------------------------------