*హైదరాబాద్ ఆసుపత్రుల్లో 7 నెలల్లో 35వేల క్యాన్సర్ కేసులు నమోదు?*
వినడానికి కఠినంగా ఇబ్బందికరంగా అనిపించినా ఇది నూటికి నూరు శాతం నిజం. ఎందుకు ఈ పరిస్థితి? ప్రధానంగా నిందించాల్సింది ఎవరిని?
1. ప్రభుత్వం 2. ప్రజలు
ప్రభుత్వాన్ని ఎందుకు?. వ్యాపారులమీద, రైతులమీద నియంత్రణ లేకపోవడమే.
పండే పంటలన్నిటిలో హానికరమైన రసాయనాలు వాడుతున్నారు. చివరకు రోజువారీ దొరికే ఆకుకూరలు కూడా వదలడం లేదు. పసుపు, కారం, ఉప్పు, పప్పు, నూనెలు అన్నీ కల్తీనే . మసాలా దినుసుల్లో హానికరమైన రసాయనాలు, రంపపు పొట్టు, ఇతర పదార్థాలు వాడుతున్నారు. వీటన్నింటినీ మీద ప్రభుత్వ నియంత్రణ చర్యలు నామమాత్రమే. అమెరికాను తిడతాముగాని ఆహార ఉత్పతుల దిగుమతుల్లో ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తుంది అంటే కారణాలు ఇవే. ఈ ఎండాకాలంలో ఆంధ్రా నుంచి మామిడికాయల ఎగుమతి విదేశాలకు సగం తగ్గిపోవడానికి కారణం రసాయనాలు వాడటమే. హైదరాబాద్ లో బాగా జరుగుతున్న వ్యాపారం ఆసుపత్రులు, రెండు హోటళ్లు. జీవితం 24/7 అయిపోవడంతో వీధి వీధికి టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు. వీటిమీద నియంత్రణ నామమాత్రమే. నియంత్రణ కు తగినంత సిబ్బంది లేదు .
2. ప్రజలు: కాన్సర్ ఎక్కువ కావడానికి ప్రభుత్వం కంటే ప్రజలే ఎక్కువ కారణమని నాకనిపిస్తుంది. ప్రజలు ఇళ్లలో తినడం మానేశారు. ఏమైనా రోడ్డుమీద దొరికే కూరలు అన్నం తెచ్చుకు తింటున్నారు. కాస్త ఆదాయం పెరిగిన వాళ్ళు లేస్తే ఏదో రెస్టారెంట్ కు పరుగులు తీస్తున్నారు. రోజు హానికరమైన రసాయనాలతో కూడిన ఆహారం తీసుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఇంట్లో వండుకునే ఆహారం అంటేనే విరక్తి. లైఫ్ స్టైల్ కూడా మారి పోయింది. నిద్ర తగ్గింది. వంటికి కావలసిన వ్యాయామం లేదు. ఖాళీ దొరికితే మొబైల్. కాస్త నడుద్దాం అన్న సోయే లేదు. నేటి తరం క్యాన్సర్ని కొని తెచ్చుకుంటున్నారు
3. చివరిగా గాలి వెలుతురు లేని గదులు పర్యావరణ కాలుష్యం మనిషి మీద పగ పడుతున్నాయి. నేను అంటాను గత ఏడు నెలల్లో 35వేల కేసులు.. వచ్చే సంవత్సరానికి ఇవి లక్షల్లోకి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గమనించండి. కాన్సర్ వస్తే ఇంటిల్లిపాదికి ఎంతో ఇబ్బంది. ఆరోగ్యం పోతుంది, ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలైపోతుంది. దయచేసి నేను చెప్పినవి గమనించండి. రెడీమేడ్ ఆహార పదార్థాలు మానేయండి. చక్కగా ఇంట్లో వండుకుని వేడి వేడి గా తినండి. రోజుకు ఒక గంటైనా శరీరానికి తగిన వ్యాయామం చేయండి.
చివరిగా క్యాన్సర్ గొప్ప వారు ఆసుపత్రి ఖర్చులకు కోట్లు పడేస్తారు. పేదవారు ప్రభుత్వ దవాఖానా కు పరుగెత్తుతారు. మధ్య తరగతి ప్రజలే ఎటు వెళ్లాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోతారు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉందాం.
Sterzy Rajan Bandela,
Senior Journalist.
. ఇందులో రాసింది ప్రతి అక్షరము సత్యం ప్రభుత్వాలు కేవలం వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి చేసే తాపత్రయం తప్ప ప్రజల యొక్క వెల్ఫేర్ కానీ ఆరోగ్యం కానీ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు గాని ఏమాత్రం పట్టటం లేదు అనవసరమైన ఉచిత పథకాలు పెట్టి ప్రజల్ని విడదీసి పాలించే ఈ ప్రభుత్వాలు వాళ్ల స్వార్ధాలు మాత్రమే చూసుకుంటున్నాయి నిజానికి పాలు నీరు ఉప్పు, పప్పు పప్పు ప్రతిదీ కూడా కలుషితమే అంతదాకా ఎందుకు అని పిలిచే గాలి కూడా కలుషితమే మనం నిత్యం మనకు తెలియకుండా అనేక రేడియేషన్లకి గురి అవుతున్నాము దాని ప్రభావం మన మెదడు మీద మన నర్వస్ సిస్టం మీద ఇంకా గుండె మీద రక్తప్రసరణ మీద కూడా చూపుతోందని వైద్యులకు తెలియదా కాబట్టి ఇటువంటి విషయంలో సామాన్య ప్రజలతో పాటు వైద్యులు కూడా సామూహికంగా యోజన చేసి ప్రభుత్వానికి తగువేధమంగా సూచనలు సలహాలు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రతి ఒక్కళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏమి చేయాలి అనే విషయాన్ని తర్కించాలి ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అప్పుడే మన సమాజం సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది మీరు నా అభిప్రాయంతో ఏకీభవిస్తారని తలుస్తాను