27, జూన్ 2026, శనివారం

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 21*


*నమస్యాసంసజ్జన్నముచిపరిపంథిప్రణయినీ-*

*నిసర్గప్రేంఖోలత్కురలకులకాలాహిశబలే ।*

*నఖచ్ఛాయాదుగ్ధోదధిపయసి తే వైద్రుమరుచాం*

*ప్రచారం కామాక్షి ప్రచురయతి పాదాబ్జసుషమా ॥*


*భావము :*


*అమ్మా! ఇంద్రపత్ని శచీదేవి, నీ పాదములకు ప్రణమిల్లినపుడు, ఆమె ముంగురులు, పాలసముద్రమువంటి నీ పాదములపై తేలియాడుచున్న నాగులవలే కనిపించు చున్నవి. ఇక నీ ఎర్రని పాదముల కాంతి క్షీరసముద్రముపై అనేకమైన పగడములవలే ప్రతిబింబించు చున్నది.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏