16, డిసెంబర్ 2022, శుక్రవారం

 ಶಿರಸಿಯ ನಮ್ಮ ವೃದ್ಧಾಶ್ರಮದಲ್ಲಿ  ಅಡುಗೆ ಕೆಲಸ ಮಾಡಲು ಕೌಟುಂಬಿಕ ಜವಾಬ್ದಾರಿ ಕಡಿಮೆ ಇರುವ,ಸೇವಾ ಮನೋಭಾವನೆಯುಳ್ಳ,ಯಾವುದೇ ಕೆಟ್ಟ ಚಟಗಳಿಲ್ಲದ ಸಸ್ಯಾಹಾರಿ ಅಡುಗೆಯವರು ಬೇಕಾಗಿದ್ದಾರೆ. (ದಂಪತಿಯೂ ಓಕೆ) ಊಟ,ವಸತಿ,ಬಟ್ಟೆಯೊಂದಿಗೆ ಆಕರ್ಷಕ ಸಂಬಳ.

ಸಂಪರ್ಕಿಸಿ- 8310930527

(ಸಾಧ್ಯವಾದಷ್ಟು ಇದನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳಿ. ಅವಶ್ಯಕತೆ ಇರುವವರಿಗೆ ತಲುಪಲಿ)

రెండక్షరాల జీవితం

 ✌🏻రెండక్షరాల జీవితం✌🏻

-------------------------------

✌🏻"భూమి " అనే రెండక్షరాల పైన పుట్టి 

✌🏻"ప్రాణం "అనే రెండక్షరాల జీవం పోసుకుని 

✌🏻రెండక్షరాల "అవ్వ "తాత "

"అమ్మ ""నాన్న " "అన్న ""అక్క "

అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ 

✌🏻రెండక్షరాల "గురు " వు దగ్గర 

✌🏻రెండక్షరాల "విద్య "ని నేర్చుకుని 

✌🏻రెండక్షరాల "డబ్బు " ని సంపాదించి 

✌🏻రెండక్షరాల "భార్య" "బిడ్డ" అనే 

బంధాలను ఏర్పరచుకొని

✌🏻రెండక్షరాల "ప్రేమ"ను పంచుతూ 

✌🏻రెండక్షరాల "స్నేహం" పెంపొందించుకుంటూ 

✌🏻రెండక్షరాల "బాధ "ని భరిస్తూ 

✌🏻రెండక్షరాల "కోపం "ను దూరం చేసుకుని 

✌🏻రెండక్షరాల "నేను "అనే అహంకారాన్ని మరచి 

✌🏻రెండక్షరాల "మనం "అనే మమకారాన్ని పెంచి 

✌🏻రెండక్షరాల "జాలి..దయ '" లను కొండంత పెంచుతూ 

✌🏻రెండక్షరాల "తీపి "అనుభవాలను గుర్తు చేసుకుంటూ 

✌🏻రెండక్షరాల "చేదు "సంఘటనలను మర్చిపోతూ 

✌🏻రెండక్షరాల "ముప్పు " వచ్చి

✌🏻రెండక్షరాల "చావు " వచ్చే వరకు 

✌🏻రెండక్షరాల "ముఖం "పైన 

✌🏻రెండక్షరాల "నవ్వు "ఉంటే 

✌🏻రెండక్షరాల "స్వర్గం "మన 

అరచేతిలో ఉన్నట్లే..!!

ఈ సత్యాలను తెలుసుకుని జీవించగలిగేతే అదే జీవితం ....

👌👍👌👍👌👍👌

😊🤝😊🤝😊🤝😊

🙏🏻👏🙏🏻👏🙏🏻👏🙏🏻

🌹🌹🌹🌹

తెలుగు గజల్

 https://www.youtube.com/watch?v=CULsFixnCvQ *తెల్లవారుతున్నది. కాకులు అరుస్తున్నాయి. అవిగో కోవెల గంటలు... లేవండి. రాక్షస సంహారి అయిన హరిని పూజిద్దాం... అని తన తోటి వనితలను కూడా గోపెమ్మలుగా భావిస్తూ మేలుకొలుపుతున్నది ఆండాళ్ అమ్మ!


తెలుగు గజల్

కాకుల అరుపులు కోవెల గంటలు వినబడలేదా మేలుకో చెలీ!

శంఖ నినాదము భక్తుల అలజడి జొరబడలేదా మేలుకో చెలీ!


కళ్ళను తెరచిన చాలదు తల్లీ మనసును కూడా తట్టి లేపవే

పరమార్థముకై ఆలోచనలే అలవడలేదా మేలుకో చెలీ!


విషమును చన్నుల పూసుకు వచ్చిన రక్కసి పూతన ప్రాణము తోడెను

ఎంతటివాడో నీకై నీకే కనబడలేదా మేలుకో చెలీ!


చంటిబిడ్డగా శకటాసురునీ ఉసురులు తీసిన నారాయణుడే!

యోగనిద్రలో శయనిస్తాడని చెవి బడలేదా మేలుకో చెలీ!


పరుగున రావే పూజలు చేస్తూ పాపాలన్నీ పారద్రోలుదాం

మంచి సమయమే మించిపోవునని భయమే లేదా మేలుకో చెలీ!


Thiruppavai Pasuram - 6 | Dhanurmasam Special l Writer: Umadevi Jandyala | Voice Srimathi Parimala| Ratnalahari TV Channel | INDIA| TELANGANA| TAMILNADU | CHENNAI|

ఆనంద స్వాగతం

 🌹🌾🌹🌱🌹🌾🌹🌱🌹🌾

బంగారు కంకుల కాలి యందెలు బెట్టి సింగారమగు రంగవల్లి చీరెను గట్టి వగలు కురిసెడి మంచు విరులు సిగలో జుట్టి  సిరుల కలరవముతో మరులు గొల్పగ వచ్చె మార్గశిర పౌష్యాల మధుర సమ్మిళితమౌ మాధవార్చన ధనుర్మాస లక్ష్మి

🙏😌🙏😌🙏😌🙏😌🙏😌

పంట సిరులు తెచ్చి ఇంట నిలిపే పవిత్ర ధనుర్మాసానికి అభివాద పూర్వక ఆనంద స్వాగతం చెపుతూ 💐🙏😊

ఫణిథర్ పోణంగి

అర్చకుని(purohithuni)విలువ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

 *అర్చకుని(purohithuni)విలువ*

            *ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది*

     ఫిర్యాదు దారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు

       ఒక పురోహితుడు  సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax కూడా చెల్లించడం లేదు

       కావున తమరు విచారణ జరిపి అక్రమ సంపాధరణ దారుడిగా గుర్తించి తగిన విధంగా శిక్షించగలరని పిర్యాదు.

 జడ్జి :- పురోహితుణ్ణి పిలిచి ఈ విధంగా ప్రశ్నించారు. మీరు మీ వద్ద ఉన్న ధనం అక్రమంగా సంపాధించారా లేక సక్రమంగా సంపాధించారా   అని

పురోహితుడు:-ఈ విధంగా సమాధానం ఇచ్చాడు

నేను సంపాదించినదంతయు సక్రమమే  ఇసుమంతయు అక్రమం కాదు అని

జడ్జి :-అంత సంపాదన సక్రమంగా ఎలా సంపాదించావో వివరించు

పురోహితుడు :-అయ్యా!

ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు వద్దకు వచ్చారు నేను ఆ సమయంలో సంధ్యావంధనం చేస్తున్నాను. ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను ఆత్మ హత్య మహా పాపం అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరామయింప చేసి సాంతన కలిగించాను. నా మాటపై విశ్వసంతో వెనుదిరిగి వెళ్లారు కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్న వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని వేడుకున్నారూ.

దానికి ప్రతిఫలంగా సంతానా సిద్ధిరస్తు అని ఆశీర్వాదం ఇచ్చాను. కొన్ని సంవత్సరాల తరువాత వారికీ కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నావద్దకు వచ్చి నా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి అని ప్రాధేయపడ్డాడు. దానికి నేను ఆపిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు నీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ సమయంలో ఆనందంతో మరికొంత ధనం ఇచ్చి వెళ్ళాడు.మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే అదనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడాయ్యాడనే విషయం తెలియజేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు

నేను ఆదంపతులిద్దరిని ఆయురారోగ్య వృద్ధిరస్తు అని ఆశీర్వధించా.

అతను తన వద్ద ఉన్న ధనంలో కొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.

అయ్యా!ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాధించింది సక్రమమైనదో లేక అక్రమమైనదో  తమరే తీర్పు ఇవ్వండి అని సెలవిచ్చారు.

-పై విషయం అంత సావధానంగా విన్న జడ్జి తీర్పు ఇచ్చాడు. ఆరోజునా ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న ఆదంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికీ తర్వాత జీవనం ఉండేది కాదు. కొన్ని రోజులకు వారు తప్పు తెలుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞత పూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోదయోగ్యమైనది ఆ ధనం సక్రమమైనదే

కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చాడు అధియును సక్రమైనదే గా

మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడాయ్యాడనే సంతోషం తో కొంత ధనం ఇచ్చాడు ఇది కూడా సక్రమమే

మరియు ధనవంతుని శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుకొని ఆనందంగా జీవిస్తున్నాడు

ఈ విషయంలో ఎక్కడ పురోహితుని సంపాధన అక్రమమని తెలుపలేము అని తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంలోనే జడ్జి గారు 

ఇలా అడిగాడు.

జడ్జి:-అయ్యా ఇంత ధనాన్ని మికిచ్చి పుణ్యాత్ములైన ధనవంతులు ఎవరో తెలుకోవాలనే ఉత్చాహం ఉన్నాను ఎవరో తెలుపగలరా అని.

పురోహితుడు :-ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే అని తెలియచేసాడు.

దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగి వచ్చి పురోహితునికి షాష్టాంగ నమస్కారం చేసాడు జడ్జి.


బ్రహ్మణుడి ఆశీర్వాదం ఎంతో శక్తివంతమైనది.

మాకు కూడా ఇలానే ఉంటుంది

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*టీవీ విలేఖరి ఒక రైతుని ఇంటర్వ్యూ చేస్తున్నాడు...* 


విలేఖరి: మీరు మేకలకి ఏమి తినిపిస్తారు ?


రైతు: నల్ల దానికా లేక తెల్ల దానికా ?


విలేఖరి: తెల్ల దానికి...


రైతు: గడ్డి...


విలేఖరి: మరి నల్ల దానికి ?


రైతు: దానికి కూడా గడ్డే..


విలేఖరి: మీరు మేకలకి ఎక్కడ కట్టేస్తారు ?


రైతు: నల్ల దానినా లేక తెల్ల దానినా ?


విలేఖరి: తెల్ల దానిని...


రైతు: బైట గదిలో...


విలేఖరి: మరి నల్ల దానిని ?


రైతు: దానిని కూడా బైట గదిలోనే...


విలేఖరి: మీరు మేకలకి ఎలా స్నానం చేయిస్తారు ?


రైతు: దేనికి ? నల్ల దానికా లేక తెల్ల దానికా ?


విలేఖరి: తెల్ల దానికి...


రైతు: గోరువెచ్చని నీటితో...


విలేఖరి: మరి నల్ల దానికి ?


రైతు: దానికి కూడా గోరువెచ్చని నీటితోనే...


విలేఖరికి కోపం వచ్చింది. రెండింటికీ అన్నీ ఒకే విధంగా చేస్తున్నప్పుడు, ఎందుకు మళ్ళీ మళ్ళీ తెల్లది నల్లది అని అడుగుతావు ?


రైతు: ఎందుకంటే తెల్ల మేక నాది...


విలేఖరి: మరి నల్లది ?


రైతు: అది కూడా నాదే...


విలేఖరి పిచ్చెక్కింది. అతనికి కోపం తగ్గాక రైతు ఇలా చెప్పాడు...


"ఇప్పుడు అర్థం అయ్యిందా ? మీరు ఒకే వార్తని రోజు మొత్తం మార్చి మార్చి మళ్ళీ మళ్ళీ చూపిస్తుంటే, మాకు కూడా ఇలానే ఉంటుంది"

🤣😁😂

పాపయ్యశాస్త్రిగారు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

వెనకటికి బులుసు పాపయ్యశాస్త్రిగారని గొప్ప వేద విద్వాంసులు ఉండేవారు. ఆయన విద్వత్తును మెచ్చి పిఠాపురం రాజావారు గంగాధర రామరాయణింగారో సందర్భంలో ‘‘అయ్యా! మన ఇలాకాలో మీకు ఎక్కడ ఎంత భూమి కావాలో కోరుకోండి... దానపట్టా రాసిస్తాం’’ అన్నారు.


 వెంటనే పాపయ్యశాస్త్రి గారొక ఆశీర్వచనం చేసి, నెలకో పుట్టి భూమి చొప్పున ఇప్పించమని కోరారట.  పుట్టి అంటే సుమారు ఎనిమిదెకరాల లెక్క. నెలకు ఎనిమిది ఎకరాల వంతున పన్నెండు నెలలకు పన్నెండెనిమిదులు తొంభైయ్యారు ఎకరాల భూమిని రాజావారు రాసిచ్చేశారు.  పాపయ్య శాస్త్రిగారే చక్రం తిప్పారో, లేక వేదపండితుడికిచ్చే దానం కదా అనుకుని ఠాణేదారే కావాలని కొలిపించాడోగాని, గోదావరి లంక భూమి పన్నెండుకు బదులు పద్దెనిమిది పుట్లు శాస్త్రిగారికి దఖలు పడింది.  ఈ సంగతి కొన్నాళ్లకి రాజుగారి చెవిని పడింది. ఠాణేదారుని పిలిపించి, కూకలేసి, ఉద్యోగంలోంచి పీకేశారు.


      పాపాయ్యశాస్త్రిగారికి ఈ విషయం చేరింది. ఆయన నేరుగా రాజుగారి దగ్గరకొచ్చి తనకు దానం చేసిన భూమిని తిరిగి తీసేసుకోమని కోరారు.  అది రాజుగారికి పెద్ద తలవంపుల వ్యవహారం కనుక శాస్త్రి గారికి నచ్చచెప్పబోయారు.  తనెంత చెబితే అంత చెయ్యాలి.  ఏం చెబితే అదే చెయ్యాలి!  తప్ప ఇలాంటి సొంత పెత్తనాలు గుమాస్తాలకు తగునా?  అన్నది రాజావారి వాదన!  ఠాణేదారు ఉద్యోగ ధర్మాన్ని అతిక్రమించేడంటాడు రాజు. లేదంటారు శాస్త్రిగారు!


      ‘‘తమరు ఈ భూమిని ఎందుకు ఇప్పించారు?’’

      ‘‘మీరు మహాపండితులు, మీకిస్తే మేం తరిస్తాం కనుక!’’

      ‘‘మేం ఎందులో పండితులం?

      ‘‘వేదశాస్త్రాలన్నింటా మీరు మహాపండితులే’’

      ‘‘వేదశాస్త్రాలనగా ఏ భాష?

      ‘‘గీర్వాణ భాష’’

      ‘‘గీర్వాణులంటే దేవతలు! దేవతలు దేవమానంలో కాక, మనుషుల కొలతల్లో ఎలా కొలిపించుకుంటారు? కాబట్టి ఠాణేదారు లెక్క సరైనదే! గజానికి గజంన్నర చొప్పున సరిపెట్టాడు!’’ అని తేల్చారు శాస్త్రిగారు.


      ఇంకేం అంటాడు రాజుగారు? శాస్త్రిగారు ఇటు భూమీ దక్కించుకున్నారు, అటు ఠాణేదారు ఉద్యోగమూ నిలబెట్టారు. అదీ లౌకిక ప్రజ్ఞ అంటే! లౌక్యుడు కాబట్టే ఠాణేదారును రక్షించగలిగాడాయన. 


శ్రీ ఎల్లాప్రగడ రామకృష్ణ     

రచనలో భాగం.

మనిషిలో ఆశ చావదు.

 *అగ్రేవహ్నిః పృష్టేభానూ రాత్రౌచుబుక సమర్పిత జానుః కరతల భిక్షిస్తరుతలవాస స్తదపిన ముంచత్యాశా పాశః !!*


అగ్నిముందు కూర్చున్నా, సూర్యుని వేడికి నిలబడినా, చలికి ముడుచుకుని పడుకొని, భిక్షమెత్తుకుని, చెట్టుకింద నివశిస్తున్నా మనిషిలో ఆశ చావదు. 


ప్రతివాడూ ఆనందంగా బతకాలనుకోవడం సహజం. కానీ ఆ ఆనందతత్త్వాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడు. ప్రయత్నించడం కూడా ఎంతో కష్టమనుకుంటాడు. కోరికలు ఆకాశాన్నంటుతాయి. ఆ కోరికలు తీరడానికి మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అటువంటి వాడికి పరమాత్మ సాక్షాత్కారం ఎట్లా లభిస్తుంది? 


అందుకే శరీరంలో పటుత్వం ఉండగానే సాధన చేయాలి. మనస్సుని మెల్లమెల్లగా కోరికల వలయం నుండి తప్పించి, అద్భుతమైన ఆత్మానందాన్ని అనుభవించేలా సాధన చెయ్యాలి. మనస్సులో కలిగే సంకల్పాలే కోరికలకి పునాదులు. ఆ పునాదుల్లో కూరుకుని పోకుండా ఉండాలంటే ముందు మనస్సు సంకల్పరహితం కావాలి. 


సంకల్పరహితం కావాలంటే, మనస్సును ప్రలోభపెట్టే ఆలోచనలని, ఆశలని నిగ్రహించాలి. ఇది సాధకుని సాధనలో మొదటి మెట్టు.

మఠం - మందుల షాపు

 మఠం - మందుల షాపు


చాలా ఏళ్ల క్రితం కంచిలో శ్రీమఠం ఎదురుగా పూల కొట్టు, పచారి కొట్టు, మందుల షాపు ఇలా చాలా దుకాణాలు ఉండి వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఇండియన్ బ్యాంకు వారికి శ్రీమఠం ఎదురుగా ఒక శాఖను ప్రారంభించి మఠం లావాదేవీలను చూసుకోవాలని వారి కోరిక. వారు తమ అలోచనని మఠం అధికారులకు తెలిపి వారి అనుమతి తీసుకున్నారు. 


మఠం ఉన్నప్పటి పరిస్థితుల ప్రకారం బ్యాంకు వారు మఠం ఎదురుగా స్వయంగా ఒక సొంత భవనాన్ని కట్టుకుని శాఖను ప్రారంభించవలిసి ఉంది. ఇందుకోసం అక్కడున్న దుకాణాలను ఖాళీ చేయించి వేరొకచోట వాటిని ఏర్పాటు చేసుకోవడానికి తగిన స్థలాన్ని ఆ దుకాణదారులకు ఇవ్వాలి. అంతా సవ్యంగా జరిగి ఇండియన్ బ్యాంకు వారు మఠం ఎదురుగా తమ శాఖను ప్రారంభించారు.


రెండు సంవత్సరాల తరువాత దంపతులొకరు మహాస్వామి వారి దర్శనానికి వచ్చి, స్వామి వారితో “ఈరోజు మా పెళ్ళిరోజు. పరమాచార్య స్వామి వారు మమ్మల్ని దీవించాలి” అని ప్రార్థించారు. 


మహస్వామి వారు వారిని గుర్తుపట్టి, “నువ్వు మందుల షాపు ముదలియార్ కదూ?” అని అడిగారు. 

”అవును పెరియవ”


“మీ తండ్రి అంతిమ సమయంలో చాలా క్లేశపడ్డాడు”

”అవును పెరియవ”


వారి బాగోగుల గురించి కనుక్కున్న తరువాత మహాస్వామి వారు ఇలా అడిగారు. “ఇప్పుడు షాపు ఎక్కడ పెట్టుకున్నావు?”


“షాపు ఇంకా ఎక్కడా పెట్టుకోలేదు పెరియవ. సరైన స్థలం కోసం చూస్తున్నాము” అని చెప్పారు. 


మహాస్వామి వారు కనుబొమ్మలు ముడిచి ”ఎందుకు? శ్రీమఠం ఎదురుగా ఉన్న స్థలం ఖాలీ చేసిన తరువాత వారు నీకు వేరొక స్థలం ఇవ్వలఏదా?” అని అడిగారు. 


ముదలియార్ సణుగుతూ ”అది పెరియవ . . ”


ఏదో తప్పు జరిగిందని మహాస్వామి వారుకి అర్థం అయ్యింది. మఠం మేనేజరు గణేశ అయ్యర్ ని పిలిపించారు. మహాస్వామి వారు నెమ్మదిగా విషయం విచారిస్తున్నారు. ”మనకు వీలున్నంతలో దదాపు అందరికి మరోచోట స్థలాలు ఇచ్చాము” అని చెప్పాడు


“కాని మెడికల్ షాపు ముదలియార్ ఎక్కడ ఇచ్చినట్టు లేదు. అతను ఇంకా షాపు పెట్టుకోలేదు అని చెప్తున్నాడు” అని అడిగారు స్వామి వారు. 


గణేశ అయ్యర్ తడబడుతూ ”లేదు పెరియవ అతనితో అన్ని మాట్లాడి నిర్ణయించాము. . . .”


ఆ తరువాత రోజంతా మహాస్వామి వారు ఎవ్వరితోను మాట్లాడలేదు. తీవ్రమైన చింతలో ఉన్నట్టు కనిపించారు. మందుల షాపు ముదలియారుకు వేరోకచోట స్థలం ఇవ్వలేదు అనే విషయం వారిని చాలా సంకటంలో పడేసింది. ఇలా చేయ్యడం ఇచ్చిన మాటను అతిక్రమించడమే. అది అసత్య దోషం. వారు చివరగా తీసుకున్న నిర్ణయం అందరికి చెప్పారు. వారి నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చెసింది.


ముదలియార్ ఇంటి చిరునామా తీసుకుని అతణ్ణి అప్పుడే పంపించివేసారు. తరువాత వారు మేనేజరుని పిలిచి విచారించారు. శ్రీమఠం వెనకాతల రోడ్డు పక్కగా చాలా ఖాళీ స్థలం ఉంది. మఠం కాంపౌండు గోడని కూల్చితే ముదలియార్ పాత షాపు కంటే మూడింతలు పెద్ద స్థలం లభిస్తుంది. సాయిత్రం లోపల ఆ స్థలాన్ని అతనికి కేటాయించారు. ఆ రోజు దర్శనానికి వచ్చిన శ్రీమఠం భక్తుడైన ఒక ఇంజనీయరుకు అక్కడ దుకాణం కట్టవలసిందని అనుజ్ఞ ఇచ్చారు. 


మూడునెలలో చక్కగా దుకాణాన్ని నిర్మించారు. ముదలియార్ అక్కడ తన మందుల షాపుని పెట్టుకుని మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాడు. 


పరమాచార్య స్వామి వారు చేసిన ప్రమాణాలు నెరవేర్చడంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఎంతటి స్థితిలోనైనా వాటిని నెరవేర్చవలసిందే. ఈ సంఘటన తరువాత మహాస్వామి వారి అనుగ్రహాన్ని తనకు కలిగిన అదృష్టాన్ని తలచుకొని ముదలియార్ చాలా సంతోషపడ్డాడు.  


--- రా. వెంకటస్వామి, శక్తి వికటన్ ప్రచురణ


#KanchiParamacharyaVaibhavam #Paramacharya

తిరుప్పావై పాశురాలు

 _*ఈ రోజు నుండి 30 రోజులు తిరుప్పావై పాశురాలు పారాయణం చేసుకుందాం*_


*_రేపటి తిరుప్పావై మొదటిరోజు పాశురం_*

 


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


 


*🌴1. వ పాశురము : 🌴*


     *మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్*

    *నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్*

    *శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్*

    *కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్*

    *ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్*

    *కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్*

    *నారాయణనే నమక్కే పఱై దరువాన్*

    *పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !*


*🌳 భావము : 🌳*


సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును , విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును , నల్లని మేఘము వంటి శరీరమును , చంద్రునివలె ఆహ్లాదకరుడును , సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్ప , ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.


*తిరుప్పావై గీతమాలిక*

 


  *☘అవతారిక:☘*


వ్రతము చేయుటకు అనువైన సమయము , మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు , రండీ ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.


 *🌹1 . వ మాలిక 🌹*


        (రేగుప్తి రాగము -ఆదితాళము)


ప..    శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!

    భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!


అ.ప..    మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!

    మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!


1. చ..    ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని

    యశోదమ్మ యొడి యాడెడు - ఆ  బాల సింహుని

    నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని

    నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి


2. ఛ.    ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము

    పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము

    లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము

    మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.




_కాళేశ్వరం భక్తిసామాచారం.

telugu word Daily

 Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింపబడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

8వ దినము (15-12-2022):

నీరు:

తెలుగు: అంధము, అంబువు, అక్షరము, అగ్గిచూలి, అగ్నిజము, అగ్నిజాతము, అప్పు, అభ్రపుష్పము, అమృతము, అర్ణము, ఆపస్సు, ఇర, ఉడువు, ఉదకము, ఉదము, ఉర్విరసము, కంబలము, కడారము, కతము, కబందము, కమలము, కర్బురము, కీలాలము, కుశము, కోమలము, క్షణదము, క్షరము, క్షీరము, గంగ, ఘనరసము, ఘృతము, చందిరము, జడము, జలకము, జలము, తీర్ధము, తోయము, నరము, నారము, నీరము, పవనము, పానీయము, పిప్పలము, పీథము, పుష్కరము, భువనము, మరులము, మేఘజము, రయి, వరుణము, వాజము, వారి, వ్యోమము, శంబరము, శరము, శివము, శీతము, సత్యము, సదనము, సరము, సలము, సలిలము, సోమము, స్యందనము, హల, హేమము, హోమి. 


ఆంగ్లము: Water

చోళపురం - సేలం

 చోళపురం - సేలం


“నీవు చోళపురం వెళ్ళావా?” అని మహాస్వామి వారిని దర్శించడానికి సేలం నుండి వచ్చిన ఒక భక్తుణ్ణి అడిగారు స్వామివారు. ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మహాస్వామి వారు చరిత్ర పుట నుండి ఒక విషయం బయటపెట్టారు. ”అవ్వయ్యార్ తెలుసు కదా నీకు, పారి మహారాజు కుమార్తెలు అయిన అంగవై సంగవై ల పెళ్ళికి తను చాలా కష్టపడింది. మహారాజు మూవెందర్ (చేర, చోళ, పాండ్య రాజులు) లను పిలిచి వారు సహాయం చెయ్యకపోవడం వల్ల వారి సమక్షంలోనే ఇక్కడే ఉత్తమ చోళపురంలో పెళ్ళి జరిపించాడు. తరువాత ఈ ప్రాంతాన్నంతా చోళ రాజు ఆధీనంలో ఉంచాడు. సేలం అనే ఒక పెద్ద గ్రామాన్ని చేర రాజుకు, వీరపాండి అనే మరొక గ్రామం పాండ్య రాజుకు బహుమానంగా ఇచ్చాడు. పారి మహారాజు మూవెందర్ లకు ఇచ్చినవే ఇప్పుడు ఉత్తమచోళపురం, వీరపాండి మరియు సేలం”.


ఎంతో మందికి తెలియని విషయాన్ని స్వామి వారు చెప్పారు.


సేలం చుట్టుపక్కల ఉన్న చాలా శివస్థానాల గురించి కూడా చెప్పారు. సేలంలోని శుకవనేశ్వరర్ గొప్పతనం గురించి చెప్తూ, అరుణగిరినాథర్ ఆ దేవస్థానం లోని సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధి ముందు పాడినట్టు చరిత్ర చెప్తోందని అన్నారు.


--- రా. వేంకటసామి. ‘శక్తి వికటన్’ జులై 2, 2004 ప్రచురణ


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సాధన అనగా నేమి

 *_నేటి మాట_*

         

*సాధన అనగా నేమి - అది ఎలా ఆచరించాలి ?? ఏది చేస్తే భగవంతునికి దగ్గరవుతాము??*

ఈరోజు అందరికీ వున్న ఒక పెద్ద అనుమానం, ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని పూజలు సలిపినా, ఎన్ని వ్రతాలు నోములు నోచినా భగవద్ అనుగ్రహం కలగడం లేదు అని!!...

దైవానుగ్రహం అనేది మనం చేసే సాధన మీద ఆధారపడి వుంటుంది!!... 

అది ఎలా!!...

సాధన అంటే పూజలు, యజ్ఞాలు, హోమాలు, తపస్సులు అనే కాదు.!

అడవులలో, గృహలలో కూర్చోవడమూ కాదు!! 

సాధన ఎక్కడికో వెళ్లి చేయాల్సిన పనిలేదు!..

ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా మనసు కొంచం మాధవునిపై పెట్టుకుంటే చాలు!!...

చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు భగవంతుని స్మరణ చేసుకోవచ్చు. 

అయన గూర్చి పాటలను పాడుకోవచ్చు. 

ఖాళీ సమయాల్లో లేదా పని మీద బయటకు వెళ్లినపుడు ఎవరైనా యాచకులు లేదా దీనులు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు  కనబడితే  వాళ్లకి ఎంతో కొంత సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి. 

పెళ్లి రోజు, పుట్టిన రోజులంటూ పార్టీలు కోసం డబ్బు వృధా చేసే బదులు ఏ అనాధాశ్రమంలో లేదా ఇంకేదైనా సేవా కార్యక్రమాలకో వినియోగించడం చాలా ఉత్తమం. 

దీని వలన దేవునికి hb కూడా జరుగుతుంది...


               *_🌹శుభమస్తు🌹_*

     🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

అవగాహనా స్థాయిలు (UNDERSTANDING LEVELS) 

అవగాహనా స్థాయిలు (UNDERSTANDING LEVELS) 

ఈ భూమి మీద వున్న జంతుకోటిలో ఒక్క మానవుడు మాత్రమే బుద్ది జీవి.  అట్లా అని అందరు మానవులు అన్ని విషయాలను తెలుసుకునే స్థాయిలో (LEVEL) ఉంటారని మనం అనలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవగాహనా స్థాయి  ఉంటుంది.  పూర్వం కొంతమంది ఒక్కసారి ఒక పాఠం చెపితే వెంటనే దానిని తెలుసుకొని కంటతహా పట్టేవారట అంటే వారు ఒక్కసారి ఒక్కవిషయాన్ని వింటే వెంటనే ఆదివారికి నోటికే వచ్చేది అన్నమాట.  ఒకసారి మన తెలుగు దేశంలోని ఒక పండితుడు ఇప్పుడు ఆగ్రాగా పిలవబడే పట్టణానికి వెళ్లి అక్కడి యమునా నదిలో స్నానం చేస్తుండగా ఒక స్త్రీని కొంతమంది దుండగలులు తీసుకొని వచ్చి హత్య చేశారట అక్కడ మన పండితుడు తప్ప ఆ దేశంవారు ఎవరు అక్కడ  లేరు. మన పండితునివారికి అక్కడి భాష రాదు.  మరునాడు రాజుగారు ఆ కేసును విచారించటానికి రాజభటులను పంపగా వారు మన పండితుఁలవారిని సాక్షిగా తీసుకొని వచ్చారట.  రాజుగారు అడిగిన ప్రశ్నలకు పండితులవారు ఇలా చెప్పారట.  నాకు అక్కడి దుండగులు మాట్లాడే భాష తెలియదు, కానీ వారు ఏమి మాట్లాడుకున్నారో చెప్పగలను అని విన్నది విన్నట్లు  చెప్పారట. ఆ పండితుడు చెప్పిన మాటలతో ఆ నేరస్తుల వివరాలు పూర్తిగా తెలుసుకొన్నారు  రాజుగారు. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయి మీకు బాష రాదుగా మరి ఎలాచెప్పారని అడిగారట.  దానికి మన పండితులవారు రాజా నేను అవధానాలు  చేస్తుంటాను. మాకు అవధానప్రక్రియలో ఏకసంతాగ్రాహ్యం ప్రధాన విషయం అని చెప్పగా మన పండితులవారి తెలివి తేటలకు ముగ్దులైన ఆ రాజుగారు ఆయనను విశేషంగా సన్మానించారట. మన అవధానుల మేధస్సు అంత గొప్పది. పూర్వకాలంలో వేదాలు నోటికే చెప్పేవారు.  బహుశా అప్పుడు భాషలకు లిపికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారుకాదేమో. అందుకే " ముఖే ముఖే సరస్వతి" అని అన్నారు కాబోలు.

నిజానికి మనం రోజు అనేక విషయాలను వింటుంటాము, చూస్తుంటాము కానీ అవి అన్ని మనకు గుర్తుండవచ్చు లేక గుర్తుండకపోవచ్చు. మనజీవితంలో జరిగిన కొన్ని విషయాలు మనకు ఎల్లప్పుడూ జ్ఞ్యాపకం ఉంటాయి అవి సహజంగా మనం పొందిన అత్యంత ఆనందము, దుఃఖము, బాధలు.  ఎవరో నిన్ను అవమానించారనుకో అది నీకు సదా జ్ఞ్యాపకం ఉంటుంది.  అదే నిన్ను అవమానించిన వానితో నీకు జరిగిన ఇతరవిషయాలు మాత్రం జ్ఞ్యాపకం  ఉండకపోవచ్చు. "అది నేనెట్లా మారుస్తాను జీవితాంతం గుర్తుంచుకుంటా.  అని అనటం" మనం సర్వ సాధారణంగా చూస్తూవుంటాం.  అంటే మనం మనసుకు పూర్తిగా హత్తుకునే విషయాలు అవి మంచివి కావచ్చు లేక చెడ్డవికావచు వాటిని మాత్రమే గుర్తు  పెట్టుకోగలుగుతాము. ఇది నిజం. 

కొన్ని సందర్భాలలో మన ముందు జరిగిన విషయాలు కూడా తెలియనట్లుగా ఉంటాము.  నీవు ఇక్కడే ఉన్నావా అని నీ స్నేహితుడు అడిగితె ఇక్కడే గంటనుంచి బస్సుకోసం ఎదురుచూస్తున్నాను అని అన్నావు.  రామారావు ఇటుగా వెళ్ళటం చూసావా అంటే మాత్రం ఏమోరా నేను చూడలేదు అని బదులు ఇస్తావు.  ఎందుకు అంటే నీవు రామారావు నీ ముందరిగా వెళ్ళటం నీ కళ్ళు చూశాయి కానీ నీమనస్సు గుర్తించలేదు అదీ సంగతి. 

ఒక విషయాన్ని చూడటం, చూసినదానిని గమనించి అవగాహన చేసుకోవటం, చేసుకున్నదానిని గుర్తుంచుకోవటం మొదలైన అన్నివిషయాలు కూడా ఒక మనిషి మేధాశక్తి మీద ఆధార పడతాయి.  ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళ మేధాశక్తి ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఏదిఏమైనప్పటికీ తానుచేసిన విషయం మీద మనస్సు లగ్నం కానిఅప్పుడు ఆ విషయాన్ని అవగాహన చేసుకోవటం కుదరదు అంతేకాదు గుర్తుకూడా ఉండదు. భౌతికమైన విషయాలమీదనే ఇన్నిరకాల సమస్యలు ఉంటే ఇక ఆద్యద్మికమైన విషయాల మీద ఇంకా ఎంతో శ్రర్ధ కావలసి వస్తుంది. 

భౌతికమైన విషయాలు మనకు పంచేంద్రియాలతో ముడిపడినవి.  ఎందుకంటె భౌతికజ్ఞ్యానం మనకు ఇంద్రియాలతోటే కలుగుతుంది. ఇంద్రియాలకు అతీతమైనది ఆత్మ జ్ఞ్యానం లేక బ్రహ్మ జ్ఞ్యానం కాబట్టి ఆ జ్ఞ్యానం పొందాలంటే మనుషులకు అవగాహనా స్థాయి చాలా ఎక్కువగా ఉండాలి.  ఎందుకంటె బౌతికంగా పొందే జ్ఞ్యానం తనకన్నా బిన్నంగా వున్నా విషయాల జ్ఞ్యానం అదే బ్రహ్మ జ్ఞ్యానం అనేది తన గూర్చి తాను తెలుసుకునే జ్ఞ్యానం.  కాబట్టి బ్రహ్మ జ్ఞ్యాన పిపాసికి అనగా జిగ్న్యాశువుకి అవగాహనా సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉండాలి. అణువణువున ఎన్నో సందేహాలు  వస్తూవుంటాయి. వాటిని సరైన పూజ్యగురువు సేవనం చేస్తూ నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక జీవనం చాలా కఠినంగా కష్టభరితంగా, దుర్లభంగా ఉంటుంది. ఎందుకంటె సాధకుడు తనకు తానూ మోక్షాన్ని పొందాలి అని యోచిస్తాడు  కాబట్టి. ఈ భూమిమీద మానవుడు సాధించవలసిన అతిబృహత్ కార్యం ఏదయినా వున్నది అంటే అది మోక్షం మాత్రమే.  ఒక మనిషి బౌతికంగా చేయగల కార్యాలు అన్నీ కూడా ఏదో ఒక హద్దు కలిగి ఉంటుంది.  కానీ మోక్షం అనేది అట్లా కాదు.  ఇంకొక విషయం బౌతికంగా సాధించేది ప్రతిదీ పూర్తిగా కానీ లేక ఒక స్టాయిమటుకు అయినా తనకన్నా ముందు ఎవరో ఒకరు చేసి వుంటారు, ఆలా చేసినది ఉపలబ్ధం అవుతుంది అంటే దానికి సంబందించిన సమాచారం, ఆధారము, సాక్షం ఉంటుంది.  కానీ మోక్షం ఏమిటో ఎలావుంటుందో అనేది ఒక్కొక్క సాధకుడు తన సాధనా పటిమతో సిద్దించుకునేది మాత్రమే మోక్షార్ధికి గతంలో మోక్షం పొందిన వాని జాడ కుడా తెలియదు.  తెలుసుకునేటందుకు అవకాశం కూడా ఉండదు.  ఒక్క మాటలో చెప్పాలంటే మోక్షం అనేది తనకుతానుగా తెలుసుకుని సిద్దించుకునేది . అంటే స్వయంగా తెలుసుకునేది మాత్రమే. కానీ వేరే ఇతర జ్ఞ్యానం లాగ ఇతరులనుండి నేర్చుకునేది కానీ చూసే తెలుసుకునేది కానీ లేక విని తెలుసుకునేది కానీ లేక గ్రంథపఠనగావించి తెలుసుకునేది కానీ కాదు. మోక్షార్ధి మోక్షంపొందిన తరువాత అది కేవలం అతని అనుభవంలోకి మాత్రమే వస్తుంది కానీ తాను తన అనుభవం ఇట్రారులకి చెప్పటానికి కుదరదు. ఒకడు పండు తిని తియ్యగా వున్నదని, కాకరకాయ తిని చేదుగా వున్నదని చెపుతాడు కానీ నిజానికి తీపి, చేదు అనేవి ఎవరి అనుభవాలు వారివే. ఇతరులు చెప్పేది వారి అనుభవపు కేవలం ఒక సూచనమాత్రమే. కానీ మోక్షాన్ని పొందినవానికి కలిగే దివ్య అబుభవం కానీ అనుభూతికాని ఇతరులకు పంచుకొనటానికి అంతుచిక్కదు ఎందుకంటె వర్ణించటానికి బాషాచాలదు, చెప్పటానికి మాటలు  చాలవు. దివ్యానుభూతులన్నీ వ్యక్తిగతమగా (ఆత్మపరంగా) అనుభవించాలసిందే కానీ మొరొక్కటి కాదు. సత్ గురువులు కేవలం మార్గదరక్షకులు మాత్రమే.  నీ మార్గంలో నీ ప్రయాణం ప్రారంభమైన తరువాత గురువుతోటి పనిలేదు. ఒక నది దాటటానికి తిప్పని ఉపయోగిస్తావు, అది కేవలం నదిని దాటేవరకు మాత్రమే పనికి వస్తుంది తరువాత దానితో పని లేదు. అదే మాదిరిగా సత్గురువు బోధకుడా ఈ విషయం తెలియనివారు అనేకులు గురువుల వెంటపడి వారి అమూల్య జీవితాలను వృధా  చేసుకుంటున్నారు. ఇంకా కొందరు అజ్ఞ్యానులు కొందరిని స్టేగురువులని భావించటమే కాకుండా వారిని పూజిస్తూ ఇంకా ఇంకా అజ్ఞ్యానంలోకి నెట్టబడుతున్నారు. సాధకుడు తన సాధనలో సదా అప్రమత్తతతో వ్యవహరించి మోక్ష జిగ్న్యాసిగా ముందుకు నడవాలి.

ఓం తత్సత్  

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు

మీ భార్గవ శర్మ