16, డిసెంబర్ 2022, శుక్రవారం

చోళపురం - సేలం

 చోళపురం - సేలం


“నీవు చోళపురం వెళ్ళావా?” అని మహాస్వామి వారిని దర్శించడానికి సేలం నుండి వచ్చిన ఒక భక్తుణ్ణి అడిగారు స్వామివారు. ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మహాస్వామి వారు చరిత్ర పుట నుండి ఒక విషయం బయటపెట్టారు. ”అవ్వయ్యార్ తెలుసు కదా నీకు, పారి మహారాజు కుమార్తెలు అయిన అంగవై సంగవై ల పెళ్ళికి తను చాలా కష్టపడింది. మహారాజు మూవెందర్ (చేర, చోళ, పాండ్య రాజులు) లను పిలిచి వారు సహాయం చెయ్యకపోవడం వల్ల వారి సమక్షంలోనే ఇక్కడే ఉత్తమ చోళపురంలో పెళ్ళి జరిపించాడు. తరువాత ఈ ప్రాంతాన్నంతా చోళ రాజు ఆధీనంలో ఉంచాడు. సేలం అనే ఒక పెద్ద గ్రామాన్ని చేర రాజుకు, వీరపాండి అనే మరొక గ్రామం పాండ్య రాజుకు బహుమానంగా ఇచ్చాడు. పారి మహారాజు మూవెందర్ లకు ఇచ్చినవే ఇప్పుడు ఉత్తమచోళపురం, వీరపాండి మరియు సేలం”.


ఎంతో మందికి తెలియని విషయాన్ని స్వామి వారు చెప్పారు.


సేలం చుట్టుపక్కల ఉన్న చాలా శివస్థానాల గురించి కూడా చెప్పారు. సేలంలోని శుకవనేశ్వరర్ గొప్పతనం గురించి చెప్తూ, అరుణగిరినాథర్ ఆ దేవస్థానం లోని సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధి ముందు పాడినట్టు చరిత్ర చెప్తోందని అన్నారు.


--- రా. వేంకటసామి. ‘శక్తి వికటన్’ జులై 2, 2004 ప్రచురణ


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: