*అగ్రేవహ్నిః పృష్టేభానూ రాత్రౌచుబుక సమర్పిత జానుః కరతల భిక్షిస్తరుతలవాస స్తదపిన ముంచత్యాశా పాశః !!*
అగ్నిముందు కూర్చున్నా, సూర్యుని వేడికి నిలబడినా, చలికి ముడుచుకుని పడుకొని, భిక్షమెత్తుకుని, చెట్టుకింద నివశిస్తున్నా మనిషిలో ఆశ చావదు.
ప్రతివాడూ ఆనందంగా బతకాలనుకోవడం సహజం. కానీ ఆ ఆనందతత్త్వాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడు. ప్రయత్నించడం కూడా ఎంతో కష్టమనుకుంటాడు. కోరికలు ఆకాశాన్నంటుతాయి. ఆ కోరికలు తీరడానికి మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అటువంటి వాడికి పరమాత్మ సాక్షాత్కారం ఎట్లా లభిస్తుంది?
అందుకే శరీరంలో పటుత్వం ఉండగానే సాధన చేయాలి. మనస్సుని మెల్లమెల్లగా కోరికల వలయం నుండి తప్పించి, అద్భుతమైన ఆత్మానందాన్ని అనుభవించేలా సాధన చెయ్యాలి. మనస్సులో కలిగే సంకల్పాలే కోరికలకి పునాదులు. ఆ పునాదుల్లో కూరుకుని పోకుండా ఉండాలంటే ముందు మనస్సు సంకల్పరహితం కావాలి.
సంకల్పరహితం కావాలంటే, మనస్సును ప్రలోభపెట్టే ఆలోచనలని, ఆశలని నిగ్రహించాలి. ఇది సాధకుని సాధనలో మొదటి మెట్టు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి