19, అక్టోబర్ 2022, బుధవారం

శ్రీమదాంధ్ర మహాభారతము

 శ్రీమదాంధ్ర మహాభారతము 


కవి నన్నపార్యుని ఘనపద్య కవితతో 

             గౌతమీ తటమున గణుతికెక్కి 

కవిబ్రహ్మ తిక్కన కమనీయ గంటాన 

             నెల్లూరు సీమలో నెగడి కీర్తి 

శివదాసు డెఱ్ఱన  శ్రీకర కవితతో 

             పరిపూర్ణ యుతముగా పరిఢవిల్లి 

పదునెన్మిదైనట్టి పర్వమ్ములనునొప్పి 

             యితిహాసరాజమై యిలను వెల్గి 

అఖిల కావ్యమ్ము లందున శిఖర మయ్యు 

నిఖిల ధర్మసూక్ష్మంబుల నిలయ మయ్యు 

సకల వేదాంత ఉపనిషద్ సార మయ్యు  

ప్రథితి పొందెను శ్రీ మహాభారతంబు 


గోపాలుని మధుసూదనరావు

సాధకుడు-శరీర సంరక్షణ

సాధకుడు-శరీర సంరక్షణ  

సాధకునికి మనస్సు నియంత్రణ ఉండాలి "చిత్తవృత్తి నిరోధమే" యోగం అన్నది నిజమే కానీ ప్రతి సాధకుడు తన మనోవృత్తులను నిరోధించుకోవటానికి ప్రయత్నించే ముందు తన శరీరానికి సంబందించిన జాగ్రత్తలు తీసుకోవాలి.  అట్లా అని దేహ మోహంలో ఉండకూడదు.  మరి శరీరంగూర్చి ఎలాంటి శ్రార్ధ తీసుకోవాలి అనేది ముద్యమైన విషయం. 

ఆత్మ శరీరాన్ని ఆశ్రయించి వున్నది. శరీరానికన్నా బిన్నంగా ఉంటూనే ఆత్మ శరీరంలో ఉండి ఇంద్రియాలతో జీవన వ్యాపారాలను సాగిస్తుంది. నిజానికి ఇంద్రియ జ్ఞ్యానం పూర్తిగా ఆత్మేకలిగి ఉంటుంది. కేనోపనిషత్ ఈ విషయంలో స్పష్టమైన వివరం ఇచ్చింది. 

కేనేషితం పతతి ప్రేషితం మనః
కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః
కేనేషితాం వాచమిమాం వదన్తి
చక్షుః శ్రోత్రం క ఉ దేవో యునక్తి 

ఈ మంత్రార్ధము ఏమిటంటే ఎవరిచేత కోరబడి పంపబడినదియై మనస్సు వస్తు ప్రపంచము పైకి నడచుచున్నది. ఎవరి ఆజ్ఞకు లోబడి ముఖ్య ప్రాణము చరించుచున్నది. ఎవరి వలన వాక్కు నడచుచున్నది. ఏ జ్ఞానము ఛక్షుశ్శ్రోత్రములను నడిపించుచున్నది అంటే ఈ జ్ఞ్యానాలు ఎవరి ఆధీనంలో వున్నాయి, ఎవరు వీటిని నియంత్రిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నది. తదుపరి మంత్రంలో 

శ్రోత్రస్య శ్రోతం మనసో మనో య
ద్వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః
చక్షుష శ్చక్షు రతిముచ్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకా దమృతా భవన్తి  

ఈ మంత్రంలో ఏదైతే చెవికి చెవిగా, మనస్సునకు మనస్సుగా, వాక్కనకు వాక్కుగా ఉన్నదో అదియే ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా ఉన్నది అని గ్రహించిన ధీర పురుషులు విముక్తినొందినవారై ఈ లోకము నుండి విడిపడి అమృతతత్వమును పొందుచున్నారు.అనగా మనస్సు మనస్సుగా పనిచేస్తున్నది ఎవరి నియంత్రణలో అదే విధంగా వాక్కు, ప్రాణము, నేత్రాలు ఎవరి ఆధీనంలో వున్నదో దానినిని తెలుసుకొనవలెనని పేర్కొనుచున్నది. తదుపరి మంత్రంలో 

న తత్ర చక్షుర్గచ్ఛతి
న వాక్ గచ్ఛతి నో మనో
న విద్మః న విజానీమః
యథా ఏతత్ అనుశిష్యాత్
అన్యదేవ తత్ విదితాత్
అథః అవిదితా దధి
ఇతి శుశ్రుమ పూర్వేషాం 

ఈ మంత్రంలో ఆత్మస్వరూపాన్ని గూర్చి ఇలా చెప్తున్నారు. దానిని నేత్రములు చూడలేవు. వాక్కు దానినిగూర్చి పలుకలేదు. దానినిగూర్చి ఎలా తెలుపవలెనో మాకు తెలియదు. తెలిసినదాని కంటెను, తెలియనిదాని కంటెను అది అతీతమైనది. దానినిగూర్చి మాకు భోధించిన మా పూర్వీకుల నుండి మేము అలాగే విన్నాము.మహర్షులు అత్యంత జ్ఞ్యానం కలిగినవారు.  వారు వారి జ్ఞ్యానంతో మనకు ఆత్మజ్ఞ్యానాని ఆవిష్కరించారు. ఒక సామాన్యు సామాజిక ఉదాహరణతో దీనిని వివరించే ప్రయత్నం చేద్దాం. సెల్పోనులో సింకార్డు ఉండిపోను పనులన్నీ చేయిస్తున్నది. ఒక ఫోను పనిచేస్తున్నది అంటే దానికి సింకార్డే మూలం.  దానికి ఒక నెంబరు వుంది ఇతరనెంబరులతో అనుసందానం కలగటానికి ఫోను పరికరం  ఉపకరిస్తుంది. కానీ అదే నెంబరుకు మనం ఫోను చేయలేము.  అదేవిధంగా ఆత్మతన శక్తితో ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది తత్ద్వారా ఇతర ప్రపంచం మొత్తం తెలుసుకోగలుగుతున్నది.  కానీ అది తనకు తానుగా ఇంద్రియాలద్వారా తెలియబడదు. ఇది అర్ధం చేసుకోవటమే జ్ఞ్యానం కేవలం జ్ఞ్యని తన అనుభూతులతో, అనుభవంతో మాత్రమే తెలుసుకోగలడు.  దానికి చేయుయవలసిం కృషే నిత్యయోగ సాధన. 

సాధనకు శరీరం ముఖ్యం,  కాబట్టి శరీరాన్ని సదా జాగ్రత్తగా చూసుకోవలెను. శరీరాన్ని సదా ఆరోగ్యంగా ఉండేవిధంగా చూసుకోవాలి.  శరీరం సదా సాధకుని సాధనకు అనుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలి. 

ఆహారానియమాలు.  మనం తీసుకునే ఆహరం మన శరీరం మీద, మనస్సు మీద ప్రభావితం కలిగి ఉంటాయి. కాబట్టి సాధకుడు ఎల్లప్పుడూ సాత్వికమైన మితాహారం మాత్రమే తీసుకోవాలి. భగవతిగీత ఆహార నియమాలు  

ఆయుః సత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః ।
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ।। 8 ।।

BG 17.8: సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు - ఆయుష్షుని పెంచేవి, మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడుతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి.  సాధకుడు ఎల్లప్పుడూ సత్వగుణాన్ని వృద్ధి చేసే ఆహరం మాత్రమే తీసుకోవాలి. ఆ ఆహరం ఎలావుంటుందో కూడా భగవానులు మనకు తెలిపారు. సాధకుడు ఆహరం తీసుకున్న తరువాత వెంటనే దాహం కాకుండా వుండే ఆహరం తీసుకోవాలి. అది ఏ ఆహారంలో భగవానులు మనకు తెలుపలేదు.  కానీ సాధకుడి తెలుసుకోవాలి. 

శరీరం మీద శ్రర్ధ . సాధకునికి ఎల్లప్పుడూ శరీరం మీద శ్రర్ధ కలిగి ఉండాలి. సమయానికి, కాలకృత్యాలు తీర్చుకోవటం, స్నానాదులు చేయటం. పరిశుబ్రమైన దుస్తులు ధరించటం. కేశ సంరక్షణ అంటే సమయానికి క్షౌరం చేయించుకోవటం. శరీరం, మీద మొహాన్ని పెంచేది శరీర అందం.  ఒక మనిషి ఎప్పుడైతే తాను అందంగా వున్నానని భావన కలుగుతుందో అప్పుడు శరీరం మీద మొహం కలుగుతుంది.  ఇంకొక విషయం ముఖం అందంగా కనబటాటానికి కేశాలు ఒక కారణం.  ఎప్పుడైతే సాధకుడు ముండనం చేయించుకుంటాడో అప్పుడు శరీర మొహం కొంతవరకు తగ్గుతుంది. శరీరాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి.  అంటే బద్ధకం అసలు ఉండకూడదు.ఒకే ఆసనంమీద ఎక్కువ సేపు ఉండగల్గటం ఇత్యాదులు నియంత్రణలో ఉంచుకోవాలి. 

పతంగాలి మహర్షి మనకు యోగసూత్రాలను తెలియచేసారు.  ఆయనకూడా శరీరం ఎలా స్వాదీనం చేసుకోవాలో కొన్ని నియమాలను చెప్పారు అవి పతంజలి మహర్షి యోగ సూత్రములు వ్రాశాడు. యోగను అష్టాంగ యోగం అన్నాడు. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యోగాభ్యాసం చేయించే యోగ గురువులు ఆసనం నుంచి మొదలు పెడ్తారు. మొదటి రెండు సూత్రాలైన యమ నియమాలు కేవలం కొంత సమయం పాటు చేసేందుకు పరిమితమైనవి కావు. ఇవి జీవితకాలం పాటు సాధన చేయాలి. 

కాబట్టి ప్రతి సాధకుడు తన శరీరం సాధనకు పనికి వచ్చే విధంగా మలచుకోవాలి.  తత్ద్వారా దీర్ఘ ఆయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం పొంది సాధన చేసి బ్రహ్మజ్ఞాని కాగలడు.  ఇంకొక పర్యాయం సాధకుడు మనస్సుని ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకుందాం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ 

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 28 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


జయవిజయులకు సనకసనందనాదుల శాపము.


శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులని ఇద్దరు పార్షదులు ఉన్నారు. వైకుంఠములో వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు ఏడు ద్వారములు ఉంటాయి. ఏడవద్వారం దాటి లోపలి వెళితే స్వామి దర్శనము అవుతుంది. జయవిజయులు ఏడవద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు. సనకసనందనాదులు స్వామి దర్శనార్ధమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహా జ్ఞానులు. నిరంతరము భగవంతుని పాదములయందు భక్తితో ఉండే స్వరూపము ఉన్నవారు. వారు ఏడవద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. జయవిజయులు వారిని ‘లోపలికి వెళ్ళడానికి వీలు లేదు’ అని అడ్డుపెట్టారు.


సనకసనందనాదులు ‘ఇది వైకుంఠము. ఇక్కడ మాత్సర్యము ఉండదు. ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరము ఉండదు. లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకునేందుకు అభ్యంతరము ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్త పరాధీనుడు. భక్తులయిన వారు వస్తే చాలు ఆయనే ఆర్తితో ఎదురువచ్చే స్వభావము ఉన్నవాడు. ఆయన లోపల ఉంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయములో ఆయనను దర్శనము చేయాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డుపెట్టడము మీకు మించిన స్వాతంత్ర్యము. ఏది ఎక్కడ ఉండకూడదో దానిని మీరు చూడడము మొదలు పెట్టారు. అది ఎక్కడ పుష్కలముగా దొరుకుతుందో ఆ భూలోకమునకు పొండి’ అన్నారు. అనేటప్పటికి జయవిజయులిద్దరూ సనకసనందనాదుల కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలు పెట్టారు.


శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయన శరీరము మీద నల్లని పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది. ఆ పుట్టుమచ్చను శ్రీవత్సము అని పిలుస్తారు. ఆ పుట్టుమచ్చను చూసి, ఆయన స్వరూపమును చూసి సనక సనందనాదులు పొంగిపోయారు. ‘మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపమును దర్శనం చేయగలిగాము. మా భాగ్యం పండింది’ అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి ‘పుష్పములోకి మకరందము కోసము గండుతుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరము నీ పాదములయందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది’ అని ప్రార్థించారు.

శ్రీమన్నారాయణుడు – ‘మీ స్తోత్రమునకు నేను చాలా సంతోషించాను. ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్లు నాకు అనిపించింది. ఏమయింది?’ అని అడిగితే – ‘స్వామీ మేము తప్పే చేశామో! ఒప్పే చేశామో! మాకు తెలియదు. కానీ మేము లోపలకి వస్తున్నప్పుడు ఏడవద్వారం దగ్గర ఈ పార్షదులు మమ్ములను అడ్డుపెట్టారు. మత్సరములు ఉండడానికి అవకాశం లేని వైకుంఠమునందు నీ దర్శనమునకు మమ్మల్ని పంపలేదు, వారు మాయందు విముఖులయి ఉన్న వారిని భూలోకమునందు జన్మించమని శపించాము. నీవు ఎలా చెపితే అలా ప్రవర్తిస్తాము. ఒకవేళ మావలన అపరాధము అంటే మన్నించవలసినది’ అన్నారు.


శ్రీహరి – ‘నా పాదములు మీవంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు. ఇంతమంది చేత ఆరాధింపబడుతున్నాయి. మీవంటి వారిచేత పూజించబడి మిమ్మల్ని రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనం ఇస్తాను. నిత్యాపాయినియై నిరంతరము లక్ష్మి నావెంట వస్తోంది. నేను భక్త పరాధీనుడను. భక్తులయిన వారు పిలిస్తే పరుగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరుగెత్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించడములో అడ్డువస్తే నా చేతిని నేను నరికేస్తాను’ అని ఎంతో పెద్దమాట అన్నాడు ! ఆ చేయి లోకములనన్నిటిని రక్షించే చేయి. మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకరిని కొలవని వారు, ఎప్పుడూ నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు, చతుర్ముఖ బ్రహ్మ అంతటివారు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చేయమంటే చేయకుండా కేవలము నా పాదపంజరము నందు భక్తితో నిలబడిన మిమ్ములను జ్జయ విజయులు అడ్డుపెట్టి మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది.’ ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమయిన విషయమును ప్రతిపాదన చేశారు.


‘నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపమును అంగీకరిస్తున్నానో తెలుసా! వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఈ అధికారం నేను ఇచ్చాను. ఏడవ ప్రాకార ద్వారము వద్ద ఉండి వచ్చిన వాళ్ళని లోపలి పంపించండని చెప్పాను. లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలని అంతరము తెలుసుకొని ముందు వాళ్ళకి నమస్కారం చేసి, లోపలి ప్రవేశ పెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులయిన వారికి కలిగిన మనఃక్లేశము పట్టి కుడిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడడానికి నేను లోపల ఉన్నాను. మీరు నావద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమునందు పుట్టిన కుష్ఠు తనని పాడు చేసినట్లు నేను వీళ్ళకి పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయవిజయులు నాకే తప్పు పేరు తీసుకుని వస్తున్నారు. మీవంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింపబడితే భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకము పాడయిపోతుంది. నేను భక్త పరాధీనుడను. నాకు దుష్ట పేరు తెచ్చారు. వాళ్ళను మీరు శపించడం కాదు నేను చెపుతున్నాను.’

‘వీళ్ళు ఉత్తర క్షణం భూలోకమునకు వెళ్ళి రాక్షసయోనియందు జన్మించి ఉగ్రమయిన రాక్షసులై అపారమయిన లోభత్వమును పొందుతారు’ అన్నాడు.


జయవిజయులిద్దరు శ్రీమన్నారాయణుడి పాదముల మీద పడి ‘స్వామీ! లోపల ఉన్నవాడి హృదయమును అర్థం చేసుకోవడములో పొరపాటు జరిగింది. మమ్ములను క్షమించు. మళ్ళీ మాకు ఎప్పుడు వైకుంఠమునకు ఆగమనం’ అని అడిగారు. స్వామి ‘మీరు మూడుజన్మలు గొప్ప రాక్షసులు అవుతారు. మిమ్మల్ని దునుమాడవలసిన అవసరం కూడా నాదే. నేనే మీ కోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా రక్షణ!


04. యజ్ఞ వరాహ మూర్తి


వారిలో ఒకడయిన హిరణ్యాక్షుడు పశ్చిమ సముద్రము అడుగున ఉన్న వరుణుడిని యుద్ధమునకు రమ్మనమని పిలుస్తున్నాడు. ఆ సమయమునకే యజ్ఞవరాహమూర్తి జన్మించాడు. వరుణుడు– ‘సముద్ర జలముల మీదకు ఒక కొత్త భూతం వచ్చింది. నీవు దానితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణముగా యజ్ఞవరాహ మూర్తిని ఎక్కడయినా ఏదయినా ఫోటో చూసినప్పుడు ఒక పంది స్వరూపమును వేసి దాని మూపు మీద రెండుకోరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లుగా వేస్తారు. పరమాత్మ అలా ఉండడు. యజ్ఞవరాహ మూర్తి వర్ణన విన్నా, ఆవిర్భావమును గూర్చి విన్నా, చదివినా, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాపము దగ్ధమయిపోయి కృష్ణభక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపముతో ఆయన దర్శనం ఇచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆ హుంకారం? అనుకుని స్వామి వంక చూశారు. ఆయన గుర్ గుర్ అని శబ్దం చేస్తున్నాడు. వ్యాసులవారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగు తీసి అడుగు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం. ఆయననను స్తోత్రం చేయాలి. ఋషులందరూ నిలబడి ఋగ్వేదములోంచి, యజుర్వేదము లోంచి, సామవేదంలోంచి సూక్తములను వల్లిస్తూ యజ్ఞవరాహమునకు నమస్కారం చేస్తున్నారు.

యజ్ఞవరాహం సముద్రములోకి ప్రవేశించి తన నాసికతో, మూపుతో సముద్ర అడుగు భాగమును కెలకడము ప్రారంభించింది. ముఖం అంతా నీటితో నిండిపోతోంది. యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను. ఒక్కసారి తన ముఖమును పైకెత్తి కనురెప్పలను ఒకసారి చిట్లించి మెడను అటూ ఇటూ విసురుతోంది.


విసిరినప్పుడు జూలులోంచి నీళ్ళు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయననుండి పడిన నీటికోసమని దానిక్రింద తలపెట్టారు. ఈ కంటితో చూడరాని పరమాత్మ ఇవ్వాళ యజ్ఞవరాహముగా వచ్చి నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి భూమిని పట్టుకుని దానిని మూపు మీదకు ఎత్తుకుని రెండు దంష్ట్రల మధ్య ఇరికించి, పైకి ఎత్తి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 27 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


భాగవతం – తృతీయ స్కంధము


కశ్యప ప్రజాపతికి పదమూడుమంది భార్యలు. ఆయన తన భార్యలతో ధర్మ బద్ధమయిన జీవితం కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం అగ్నికార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్యాసమయం ప్రారంభం అయింది. మహానుభావుడు సాక్షాత్తుగా రాశీ భూతమయిన తపశ్శక్తి. ఆయన దగ్గరికి ‘దితి’ వచ్చి – 'నామీద మన్మథుడు బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణ ప్రయోగపు తాకిడికి తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి. నన్ను అనుగ్రహించి నాలో కలిగిన ఈ కామావేశమునకు ఉపశాంతిని కలిగించు’ అని చెపుతూ ఆవిడ ‘నేను ఇలా అడగడం వెనకాల ఒక రహస్యం ఉన్నది’ అంది. కశ్యపుడు ‘అదేమిటో చెప్పమ' ని అడిగాడు.

ఆవిడ ‘నీకు పదముగ్గురు భార్యలు ఉన్నారు. మేమందరం ఏకగర్భ సంజాతులము అయిన మమ్ములను ప్రజాపతి నీకిచ్చి వివాహం చేశాడు. అందులో పన్నెండుమందికి సంతానం కలిగారు. ఇంకా నాకు సంతానం కలుగలేదు. సాధారణముగా భార్యాభర్తల అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నది. ‘ఆత్మావై పుత్రనామాసి’ – భర్త భార్యకు అపురూపముగా ఇచ్చే కానుక తానే తన భార్య కడుపున మళ్ళా ఉదయిస్తాడు. ధర్మపత్ని విషయంలో అది ధర్మం. ఒక దీపమును పట్టుకు వెళ్ళి ఇంకొక దీపమును వెలిగిస్తాము. రెండు జ్యోతులు వెలుగుతున్నట్లు కనపడుతుంది. కానీ వత్తులు పొడుగు పొట్టి ఉండవచ్చు. ప్రమిదల రంగులలో తేడా ఉండవచ్చు. దీపశిఖ మాత్రం సమాన ధర్మమును కలిగి ఉంటుంది. దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే. రెండు దీపముల జ్యోతికి తేడా ఉండదు. తండ్రికి, కుమారుడికీ భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్లు చేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే. ఆవిడ మాత్రమే ఈ అధికారమును పొంది ఉంటుంది. ఆయన తేజస్సును తాను గ్రహించి తన భర్తను కొడుకుగా ప్రపంచమునందు నడిచేటట్లు చేయగలదు. నీ తేజస్సును నాయందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మమునకు లోపము లేదు. నాకు సంతానమును కటాక్షించు’ అంది. ఆవిడ ఎంతో ధర్మబద్ధముగా అడిగింది. ఆయన – ‘దితీ! నీవంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం. ఒక్కమాట చెపుతాను విను. ఇది ఉగ్రవేళ అసురసంధ్యా కాలములో పరమశివుడు వృషభవాహనమును అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు. ఆయన వెనక భూత గణములు వెడుతూ ఉంటాయి. వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు. వాళ్లకి ఆ సమయములో శివుడి పట్ల ఎవరయినా అపచారముగా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చునేమో, ఆయన చుట్టూ ఉన్న గణములు అంగీకరించవు. చాలా తీవ్రమయిన ఫలితమును ఇచ్చేస్తారు. కొంతసేపు తాళవలసినది. ఒక్క ముహూర్త కాలము వేచి ఉండు. నీకు కలిగిన కోరికను భర్తగా నేను తీరుస్తాను’ అన్నాడు.

దితికి అటువంటి బుద్ధి కలిగింది. భాగవతంలో ధర్మ భ్రష్టత్వము ఎక్కడ వస్తుందో గమనించాలి. ఆవిడ ఒక వెలయాలు ప్రవర్తించినట్లు కశ్యప ప్రజాపతి పంచెపట్టి లాగింది. ఆయన ఈశ్వరునికి నమస్కారం చేసి, తాను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా వేరుగా ప్రవర్తించకూడదు అనుకుని, ఆవిడ కోరుకున్న సుఖమును ఆవిడకు కటాక్షించి స్నానం ఆచమనం చేసి తన కార్యమునందు నిమగ్నుడయిపోయాడు.

కొంతసేపు అయిపోయిన తరువాత దితికి అనుమానం వచ్చింది. చేయరాని పని చేశాను. దీని ఫలితము ఉగ్రముగా ఉంటుందేమోనని పరమశివుడికి, రుద్ర గణములకు క్షమాపణ చెప్పింది. అప్పటికి జరగవలసిన అపకారం జరిగిపోయింది. దితి చేసిన అకార్యమును భూత గణములలో భద్రాభద్రులు అనే వారు చూసి ఉగ్రమయిన ఫలితమును ఇచ్చేశారు.

పిమ్మట దితి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ‘నా కడుపున పుట్టే బిడ్డలు ప్రమాదము తీసుకురారు కదా’ అని అడిగింది. కశ్యప ప్రజాపతి ‘నేను వద్దని చెప్పాను. నీవు వినలేదు. నీ కడుపున పుట్టబోయే ఇద్దరు బిడ్డలు కూడా లోకకంటకులు అవుతారు. వాళ్ళు పుట్టగానే ఆకాశం నెత్తురు వర్షిస్తుంది. నక్కలు కూస్తాయి. వాళ్ళు కొన్నివేల స్త్రీల కళ్ళమ్మట నీళ్ళు కార్పిస్తారు. ఋషులను, బాలురను, బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, వేదములను, దేవతలను అవమాన పరుస్తారు. చిట్టచివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు’ అని చెప్పాడు.

ఈ మాటలను విని దితి బావురుమని ఏడ్చింది. ‘చివరకు నాకు ఇంత అపఖ్యాతా? దీనికి నీవారణోపాయం లేదా’ అని అడిగింది. కశ్యపప్రజాపతి ‘దీనికి పశ్చాత్తాపమే నివారణోపాయం. నీవు చాలా పశ్చాత్తాపం పడుతున్నావు. నీవు చేసిన దోషం పోదు. కానీ నీవు మహా భక్తుడయిన మనవడిని పొందుతావు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులలో ఒకనికి మహాభక్తుడయిన కుమారుడు పుడతాడు. నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. మనవడు అటువంటి వాడు పుడతాడు. కానీ అసురసంధ్య వేళలో నీవు చేసిన దుష్కృత్యము వలన కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరిచేతిలో మరణిస్తారు’ అని చెప్పాడు.

భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదములు ఎక్కడ నుండి వస్తాయో బోధ చేస్తుంది. దితి మహా పతివ్రత. ఆమె అసలు పిల్లలను కనడము మానివేసి కడుపులోనే ఉంచేసింది. వాళ్ళు బయటకు వస్తే చంపేస్తారేమోనని నూరు సంవత్సరములు గర్భమునందు ఉంచేసింది. ఆ గర్భమునుంచి తేజస్సు బయలుదేరి లోకములను కప్పేస్తోంది. అందరూ వెళ్ళి మొరపెట్టుకున్నారు. దితి గర్భము నుండి వస్తున్న తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది. ఆవిడ బిడ్డలను కనేటట్టు చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించారు. కశ్యపప్రజాపతి దితితో – ‘నీవు చేస్తున్న పని సృష్టి విరుద్ధం. నీ బిడ్డలను కనవలసింది’ అని చెప్పాడు. దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు.

ఆ పుట్టేవాళ్ళు ఎలా ఉంటారో కశ్యపప్రజాపతికి ముందరే తెలుసు. వాళ్లకి ఆ పేర్లు కశ్యప ప్రజాపతే పెట్టారు. ‘హిరణ్య’ ముందు పెట్టి ఒకనికి ‘అక్షి’, రెండవ వానికి ‘కశ్యప’ అని చేర్చి, ఒకనికి ‘హిరణ్యాక్షుడు’, రెండవ వానికి ‘హిరణ్యకశిపుడు’ అని పేర్లు పెట్టారు. ఒకడు కనబడ్డదానినల్లా తీసుకువెళ్ళి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపూ తానే గొప్పవాడినని, తానే భోగం అనుభవించాలని భావిస్తూ చివరకు యజ్ఞములు, యాగములు కూడా తనపేరు మీదనే చేయించుకుంటాడు. ఇద్దరూ అహంకార మమకారములే! ఈవిధముగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరు దితి గర్భమునుండి జన్మించారు.

హిరణ్యాక్షుడు పుట్టీ పుట్టడం తోటే దుర్నిమిత్తములు అన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశమంత ఎత్తు పెరిగిపోయాడు. వాడికి పుట్టినప్పటి నుంచి యుద్ధం చేయాలనే కోరికే! యుద్ధం కోసం అనేకమంది దగ్గరకు వెళ్ళాడు. చిట్టచివర సముద్రము లోపల ఉన్న వరుణుడి దగ్గరకి వెళ్ళాడు. వెళ్ళి 'నీవు ఎక్కడో సముద్రములో ఉంటావు. నా భుజముల తీట తీరాలి. నువ్వు వచ్చి నాతో యుద్ధం చెయ్యి’ అన్నాడు. వరుణుడు ‘నాకు నీతో యుద్ధం ఎందుకు? నీకోసం వచ్చేవాడు ఒకాయన ఉన్నాడు. నీవు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిందో వాడు వచ్చే సమయం అయిపోయింది. నీవు ఒక పర్యాయం సముద్రము మీదకు వెళ్ళు. ఆయన కనపడతాడు. ఆయనతో యుద్ధం చెయ్యి’ అన్నాడు. ఈ విషయం వరుణుడు ఎలా చెప్పగలిగాడు? అంటే దీనికి వెనుక ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది. భద్రాభద్రులు అనే రుద్ర గణములు చూసి దితి యందు ఉగ్రమయిన బిడ్డలు పుట్టాలని ఎప్పుడయితే నిర్ణయం జరిగినప్పుడు ఒక సంఘటన జరిగింది. పురాణము అంతా శివ కేశవుల అభేదముగా నడుస్తుంది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 30 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


దేవహూతి కర్దమ ప్రజాపతిని సేవిస్తోంది. ఆయన తపస్సు చేస్తున్నాడు. నియమములు పాటిస్తున్నాడు. భర్త ఏమి చేస్తున్నాడో భార్య కూడా అదే చేస్తోంది. ఆయనకు బాహ్యస్మృతి లేదు. ఒకప్పుడు దేవహూతి చూడడానికి ఎంతో అందముగా ఉండేది. ఇప్పుడు శుష్కించి పోయింది. ఆమె పార్వతీదేవి పరమశివుని సేవించినట్లు కర్దముని సేవించింది. కొంతకాలానికి ఒకరోజు కర్దముడు తపస్సులోంచి ఎందుకో ఒకసారి దేవహూతి వంక చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఒకనాడు ఈమె సౌందర్యమును వర్ణన చేసాను. నాకోసం తపించడములో, పరిశ్రమించడములో ఇన్ని ఏర్పాట్లు చేయడములో ఈవిడ ఇలా అయిపోయింది’ అనుకుని దేవహూతీ! నీ సేవలకి నేను సంతోషించాను. నీకు నావలన తీరవలసిన కోరిక ఏమిటి? అని అడిగాడు.

ఒక సౌశీల్యవంతురాలయిన స్త్రీ భర్తవలన తాను సంతానవతియై తల్లి కావాలని కోరుకుంటుంది. ఆవిడ ‘ఈశ్వరా! మీరు నాకు పతిదేవులు. మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యే అదృష్టమును నాకు కటాక్షించండి’ అని కోరితే ఆయన ‘తప్పకుండా కటాక్షిస్తాను’ అని ఒక అందమైన మాట చెప్పాడు. ‘నీకు నేను చూడడానికి ఇలా ఒక ఆశ్రమములో జటలు కట్టుకుని, ఉరఃపంజరము పైకి వచ్చేసి ఒక నారపంచె కట్టుకుని ఎప్పుడూ దండకమండలములు పట్టుకుని చాలా వెర్రివాడిలా, తపస్సు చేసుకుంటున్న వాడిలా ఏ భోగ భాగ్యములు లేని వాడిలా, ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ భూశయనం చేసే వాడిలా కనపడుతున్నాను కదా! నాకు ఉన్న భోగములు ఎటువంటివో తెలుసా? ఈ భూమియందు సార్వభౌములమని సమస్త భూమండలమును ఏలగలమన్న చక్రవర్తులకు కూడా లేని భోగములు నాకున్నాయి.

నేను నిరంతరము శ్రీమన్నారాయణుని సేవించాను. అపారమయిన భక్తితో యోగమును అవలంబించాను. గొప్ప తపస్సు చేశాను. ఈశ్వరానుగ్రహముగా యోగశక్తి చేత కల్పింపబడవలసిన భోగోపకరణములు ఉన్నాయి. అవి సామాన్యులకు దొరికేవి కావు. వాటిని నేను నా తపశ్శక్తితో సృజిస్తున్నాను. ఇతరులకు కనపడవు. వాటిని చూడడానికి వీలయిన దివ్యదృష్టిని నీకు ఇస్తున్నాను. భోగోపకరణములను చూడవలసినది’ అని దివ్యదృష్టిని ఇచ్చాడు.

ఒక పెద్ద భవనము వచ్చింది. ఆ భవనములో గొప్ప గొప్ప శయ్యా మందిరములు ఉన్నాయి. ఆ శయ్యా మందిరములకు ఏనుగుల దంతములతో చేయబడిన కోళ్ళు, కట్టుకోవడానికి వీలుగా వ్రేలాడుతున్న చీనీ చీనాంబరములు – బంగారము, వెండితో చేయబడిన స్తంభములు, వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములు వాటికి తాపడము చేయబడ్డాయి. లోపల శయనాగారములు, బయట విశాలమయిన ప్రాంగణములు.

వీటన్నింటినీ చూసి ఆమె తెల్లబోయి నిలబడిపోయింది. ఈ స్థితిలో వున్న దేవహూతికి ఉత్తరక్షణములో ఇవన్నీ కనబడ్డాయి. కర్దమప్రజాపతి ‘దేవహూతీ! అదిగో బిందు సరోవరము. అందులో దిగి స్నానం చేసి బయటకు రా’ అన్నాడు. వచ్చేసరికి ఇంతకు పూర్వం దేవహూతి ఎంత సౌందర్యముగా ఉండేదో దానికి పదివేల రెట్లు అధిక సౌందర్యమును పొందింది. అక్కడ ఒక వేయిమంది దివ్యకాంతలు కనపడ్డారు. వాళ్ళు ఆమెకు పట్టు పుట్టములు కట్టి, అంగరాగముల నలది ఆమె చక్కటి కేశపాశమును ముడివేసి అందులో రకరకములయిన పువ్వులు పెట్టి ఒక నిలువు అద్దం పట్టుకువచ్చి ఆవిడ ముందుపెట్టి సోయగమును చూసుకోమన్నారు. అద్దంలో తన సోయగమును చూసుకుని, వెంటనే తన భర్తను స్మరించినది. ఉత్తరక్షణము కర్దమప్రజాపతి ప్రత్యక్షమయి మనము ఎవరూ అనుభవించని భోగములు అనుభవిద్దాము రావలసింది’ అని విమానము ఎక్కించాడు. ఈ విమానము సమస్త లోకముల మీద ఎవరికీ కనపడకుండా తిరగగలిగిన విమానములో వాళ్లు తిరుగుతున్నారు. భోగములను అనుభవిస్తూ ఇద్దరూ ఆనందముగా క్రీడిస్తూ ఉండగా ఆ విమానము మేరు పర్వతశిఖరముల మీద దిగింది. వారు మేరు పర్వతచరియలలోకి వెళ్ళారు. అక్కడ గంధర్వులు, యక్షులు, కిన్నరలు, కిపురుషులు దేవతలు ఉన్నారు. గ్రహములన్నీ ఆ మేరుపర్వతమును చుట్టి వస్తుంటాయి. ఆ మేరుపర్వత చరియలలో దేవహూతితో కలిసి కొన్ని సంవత్సరములు అలా భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. అలా భోగములను అనుభవిస్తూ ఉండగా వారికి తొమ్మండుగురు ఆడపిల్లలు పుట్టారు. తొమ్మిదవపిల్ల పుట్టిన తరువాత కర్దమ ప్రజాపతి ‘మనం ఎన్నాళ్ళ నుండి భోగం అనుభవిస్తున్నామో నీకు గుర్తుందా దేవహూతీ? అని అడిగాడు. ఆవిడ తొమ్మండుగురు ఆడపిల్లలు జన్మించారు. పెద్దపిల్ల పెళ్ళి ఈడుకు వచ్చేస్తున్నది.’ జ్ఞాపకమే లేదు కాలము క్షణములా గడిచిపోయింది’ అన్నది.

ఆయన ఇన్ని భోగములను అనుభవిస్తూ ఇవి భోగములు కాదని మనసులో నిరంతరము తలుచుకుంటున్నాడు. వైరాగ్యము బాగా ఏర్పడుతున్నది. వైరాగ్య భావన మనస్సులో ఉండాలి. అది పండిననాడు భార్యకు చెప్పి వెళ్ళిపోవాలి. అందుకని దేవహూతీ! నేను సన్యాసము తీసుకుని వెళ్ళిపోతున్నాను’ అన్నాడు. దేవహూతి ‘నిన్ను ఆపను నువ్వు పండడమే నాకు కావాలి. గృహస్థాశ్రమంలోకి వచ్చినందుకు నువ్వు పండాలి. కానీ నాది ఒక్క కోరిక. నాకు తొమ్మండుగురు ఆడపిల్లలను ఇచ్చావు. ఇప్పుడు వీరికి యోగ్యమైన వరుడిని తేవాలి. నేను ఆడదానిని ఏమీ తెలియవు. ఇంటికి రక్షణగా నాకు ఒక కొడుకును ప్రసాదించి వెళ్ళు. ఆ కొడుకు మరల నన్ను సంసార లంపటమునందు తిప్పేవాడు కాకూడదు. ఆ కొడుకు నన్ను ఉద్ధరించే వాడు కావాలి. నన్నుకూడా జ్ఞానము వైపు తిప్పేవాడు కావాలి. కూతుళ్ళను గట్టెక్కించగలవాడు అయిన ఒక కొడుకును ఇచ్చి వెళ్లవలసినది’ అని అడిగింది.

ఆయన ‘గొప్ప కోరిక కోరావు. నీకు ఒక కుమారుడిని ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను’ అన్నాడు. కర్దమప్రజాపతి తేజస్సునందు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు. పిమ్మట దేవహూతి గర్భములోనికి ప్రవేశించి ఆయన కుమారుడయి కపిల భగవానుడని పేరుతో బయటకు వచ్చాడు.

కపిలమహర్షి జన్మిస్తే సంతోషమును ప్రకటించడానికి మరీచి మొదలగు మహర్షులతో బ్రహ్మగారు వచ్చారు. ‘కర్దమా! నిన్ను నేను సృష్టించి ప్రజోత్పత్తి చేయమని చెప్పాను. నీవు కేవలము ప్రజోత్పత్తి చేస్తూ ఉండిపోలేదు. గృహస్థాశ్రమము లోనికి వెళ్ళి ప్రజోత్పత్తి చేసి ధర్మబద్ధమయిన భోగమును అనుభవించి వైరాగ్యమును పొంది, వైరాగ్యము వలన సన్యసించుటకు సిద్ధపడి, భార్య కోర్కె తీర్చడానికి ఈశ్వరుడిని కొడుకుగా పొందావు. కపిలుడిని సేవించి నీ భార్య దేవహూతి మోక్షమును పొందుతుంది. సన్యాసాశ్రమమునకు వెళ్ళి నీవు మోక్షం పొందుతావు’ అన్నాడు. ఇదీ గృహస్థాశ్రమములో ప్రవర్తించవలసిన విధానము.

చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తరువాత కర్దమప్రజాపతి తన కుమార్తెలను ఎవరికీ ఇచ్చి వివాహము చెయ్యాలా అని ఆలోచించారు. ఇంటి పెద్ద, తండ్రిగారయిన చతుర్ముఖబ్రహ్మగారు ఉన్నారు. ఆయన నిర్ణయం చేయాలి. బ్రహ్మగారు ‘నీకు కలిగిన తొమ్మండుగురు పిల్లలను తొమ్మండుగురు ఋషులకు ఇచ్చి వివాహము చేయమ’ ని చెప్పారు. ఆయన సూచన ప్రకారము తన కుమార్తె మరీచిమహర్షికి ‘కళ’ ను, అత్రిమహర్షికి ‘అనసూయ’ ను, అంగీరసునకు ‘శ్రద్ధ’ ను, పులస్త్యునకు ‘హవిర్భువు’ ని, పులహునకు ‘గతి’ ని, క్రతువునకు ‘క్రియ’ ను భృగువునకు ‘ఖ్యాతి’ ని’ వసిష్ఠునకు ‘అరుంధతి’ని, అధర్వునకు ‘శాంతి’ని – అలా తొమ్మండుగురు ఋషులకు, తొమ్మండుగురు కన్యలు ఇచ్చి కన్యాదానం చేశాడు. చేసి తను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళాడు. చంటిపిల్లవాడయిన కపిలుడు పడుకొని ఉన్నాడు. ఆయన ఎవరో కర్దమునికి తెలుసు. చంటి పిల్లవానిగా వున్న పిల్లాడిముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేశాడు. ‘మహానుభావా! మీరు ఎందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణులు. నన్ను ఉద్ధరించడానికి జన్మించారు. కొడుకు పుట్టకపోతే నాకు పితృ ఋణం తీరదు. కొడుకుగా పుట్టి పితృ ఋణం నుండి నన్ను ఉద్దరించారు. మీ సౌజన్యమునకు హద్దు లేదు. తండ్రీ! మీకు నమస్కారము. అన్నాడు. ఆయన ‘ఇంతకుపూర్వం నేను ఈ భూమండలము మీద జన్మించి సాంఖ్యమనే వేదాంతమును బోధచేశాను. తత్త్వము ఎన్నిరకములుగా ఉంటుందో సంఖ్యతో నిర్ణయించి చెప్పడమును సాంఖ్యము అంటారు. లోకం మరిచిపోయింది. మళ్ళీ సాంఖ్యం చెప్పడము కోసం నీకు కొడుకుగా పుట్టాను. నీకు కొడుకుగా పుడతానని ఇచ్చిన మాట తప్పలేదు పుట్టాను. నాయనా! నువ్వు వెళ్ళి సన్యసించు. మోక్షమును పొందుతావు’ అన్నాడు.

కర్దమప్రజాపతి ‘నా భార్య నీకు తల్లి అయిన దేవహూతిని నీవు ఉద్ధరించాలి’ అన్నాడు. ‘తప్పకుండా ఉద్ధరిస్తాను’ అన్నారు స్వామి.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 29 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


యజ్ఞవరాహమూర్తియై వచ్చి భూమండలమును పైకెత్తాడు. స్వామి అది నీటిలో నిలబడడానికి దానికి ఆధారశక్తిని ఇచ్చాడు. ఆ ఆధారశక్తిని ఇచ్చి మూపురమును పైకెత్తి నిలబడ్డాడు. ఇలా గోళరూపంలో ఉన్న భూమండలమును పైకెత్తేసరికి భూదేవి పొంగిపోయి గాఢంగా ఆలింగనం చేసుకుంది. తత్ఫలితమే నరకాసుర జననము. ఈ దృశ్యము చూసిన ఋషులు పరమాత్మను అనేక విధములుగా స్తోత్రం చేశారు.

స్వామి వారందరికీ అభయం ఇస్తున్న సమయములో హిరణ్యాక్షుడు యుద్ధమునకు వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమయిన యుద్ధం జరిగింది. ఒక స్థితిలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన గదాప్రహారమునకు స్వామి చేతిలో గద జారి క్రింద పడిపోయింది. వాడు ‘నేను ఆయుధం లేని వాడితో యుద్ధం చేయను’ అన్నాడు. అతని ధర్మమునకు స్వామి ఆశ్చర్యపోయారు. వెంటనే స్వామి సుదర్శన చక్రమును స్మరించారు. చతుర్ముఖ బ్రహ్మగారు ‘స్వామీ! నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది. వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేక పోతున్నాము. వాడిని సంహరించి ఉద్ధరించు. వాడికి ఒక శాపము విమోచనము అయిపోతుంది’ అన్నారు. స్వామి సుదర్శన చక్రమును ప్రయోగిస్తే వాడు ఒక పెద్ద గదను ప్రయోగించాడు.

ఆ గదను స్వామి అలవోకగా పట్టుకుని విరిచి అవతల పారేశారు. పిమ్మట ఆదివరాహమూర్తి హిరణ్యాక్షుడి గూబమీద ఒక లెంపకాయ కొడితే వాడు క్రిందపడిపోయాడు. నాసికారంధ్రముల వెంట, కర్ణ రంధ్రముల వెంట నెత్తురు కారిపోతూ ఉండగా కిరీటము పడిపోయి తన్నుకుంటున్నాడు. దితి తన కొడుకును శ్రీహరి సంహరిస్తున్నాడని అర్థం చేసుకున్నది. ఆవిడ స్తనముల లోంచి రక్తము స్రవించింది. శ్రీహరి హిరణ్యాక్షుడిని తన రెండుకోరలతో నొక్కిపెట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకు ఒక శాపం తీరిపోయింది. పిమ్మట స్వామి భూమండలమును పైకి ఎత్తారు.

ఆదివరాహమై, యజ్ఞవరాహమై ఆనాడు రెండు కోరలతో భూమండలమును సముద్రములోంచి పైకి ఎత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడిన స్వామి మూర్తిని ఎవరు మానసికంగా దర్శనము చేసి, చేతులొగ్గి నమస్కరిస్తారో, అటువంటి వారి జీవనయాత్రలో ఈ ఘట్టమును చదివినరోజు పరమోత్కృష్టమయిన రోజై వారి పాపరాశి ధ్వంసం అయిపోతుంది.

5. కర్దముడు – కపిలుడు.

వ్యాసభగవానుడు గృహస్థాశ్రమము అనేది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తరించడానికి ఎటువంటి మార్గమును అవలంబించాలో, ఎటువంటి జీవనము గడపాలో అందులో తేడా వస్తే ఏమి జరుగుతుందో, భోగము అంటే ఏమిటో దానిని ఎలా అనుభవించాలో, అలా భోగమును అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి, ఒక అద్భుతమయిన ఆఖ్యానమును చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతుల జీవితము.

స్వయంభువు అయిన బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేసిన ప్రజాపతులలో ఒకరు కర్దమప్రజాపతి. ఆయన మహాయోగి పుంగవుడు. కర్దమ ప్రజాపతిని సృష్టిచేసిన పిదప, ఆయనను బ్రహ్మగారు పిలిచి ఒకమాట చెప్పారు. ‘నాయనా! నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి. ఇంకా సృష్టి కార్యమును నిర్వహించాలి. నీకు అనురూపయై నీతోపాటు శీలము సరిపోయే ఒక భార్యను స్వీకరించి సంతానమును కనవలసింది ఇది నాకోరిక’ అన్నాడు. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి జీవితము. కర్దముడు తండ్రి మాట పాటించాలని అనుకున్నాడు. సరస్వతీ నదీ తీరంలో కూర్చుని శ్రీమన్నారాయణుని గూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షం అయ్యారు. సాధారణముగా భగవద్దర్శనము అయినపుడు భక్తుని కన్నులవెంట ఆనందభాష్పములు కారతాయని చెప్తారు. ఇక్కడ కర్దమ ప్రజాపతి తపస్సును మెచ్చిన శ్రీమన్నారాయణుని కన్నులవెంట ఆనందభాష్పములు జారి నేలమీద పడ్డాయి. అది ఎంతో విచిత్రమయిన సంఘటన – ఆయన కన్నులవెంట కారిన భాష్పబిందువులు పడినచోట ఒక సరోవరం ఏర్పడింది. అది సరస్వతీనదిని చుట్టి ప్రవహించింది. ఈ సరోవరమును ‘బిందు సరోవరము’ అని పిలిచారు.

పరమాత్మను చూసి కర్దమ ప్రజాపతి ‘ఈశ్వరా! నీవు కాలస్వరూపుడవై ఉంటావు. కాలము అనుల్లంఘనీయము. అది ఎవ్వరిచేత ఆపబడదు. అది ఎవ్వరి మాట వినదు. దానికి రాగద్వేషములు లేవు. దానికి నా అన్నవాళ్లు లేరు. దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న కాలములో జీవులు వస్తూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. ఇలా వెళ్ళిపోతున్న కాలమునందు అల్పమయిన భోగములయందు తాదాత్మ్యం చెందకుండా నిన్ను చేరాలి. నిన్ను చేరుకోవడానికి అపారమయిన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమములో ఉండి భోగము అనుభవించాలి. ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భోగమును అనుభవించి వైరాగ్యమును పొందాలి’ అన్నాడు. ఇటువంటి స్థితి కలిగిన కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు నాయనా! నీవు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు? అని అడిగితే ‘నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకొక కర్తవ్యోపదేశము చేశారు. నన్ను ప్రజోత్పత్తి చేయమని, సంతానమును కనమని చెప్పారు. నా తండ్రిమాట పాటించడం నా ప్రథమ కర్తవ్యము. ఆయన మాట పాటించాలి అంటే ప్రజోత్పత్తి చెయ్యాలి అంటే నాకు సౌశీల్యయిన భార్య కావాల’ ని అద్భుతమయిన స్తోత్రం చేశాడు.

ఆయన స్తోత్రమునకు పరమాత్మ సంతోషించి ‘కర్దమప్రజాపతీ! నీ స్తోత్రమునకు నీ మాటకు నేను చాలా సంతోషించాను. నీకు కావలసిన భార్యను నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడకు స్వాయంభువ మనువు వస్తున్నాడు. ఆయనకు ‘అకూతి’, ‘దేవహూతి’, ‘ప్రసూతి’ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహూతి అనబడే ఆవిడ నీకు తగిన కన్య. దేవహూతిని రథం మీద కూర్చోబెట్టుకుని వచ్చి పిల్లను ఇస్తాను స్వీకరించమని అడుగుతాడు. ఆ పిల్లను స్వీకరించు. మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తార’ ని ఆశీర్వదించి స్వామి గరుడవాహనము మీద కూర్చుని గరుడుని రెక్కలసవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాడు. గరుడుని రెక్కలు కదుపుతున్నప్పుడు ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోనుండి సామవేదమును కర్దమప్రజాపతి విన్నాడు. గరుడవాహనము అంటే ఒక పక్షి కాదు. సాక్షాత్తు వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. వేదమంత్రములను విని ప్రజాపతి పొంగిపోయాడు.

కర్దమప్రజాపతి నిర్మించుకున్న ఆశ్రమవాటిక ఎంతో అందముగా ఉన్నది. శ్రీమన్నారాయణుడు చెప్పిన రోజు రానే వచ్చింది. స్వాయంభువమనువు చేతిలో ధనుస్సు పట్టుకుని రథం మీద తన భార్యయైన శతరూప, తన కుమార్తె అయిన దేవహూతి తో వచ్చి కర్దమప్రజాపతి దర్శనము చేసారు. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు. జ్ఞానము చేత పెద్దవాడు. కర్దమప్రజాపతి పాదములకు స్వాయంభువమనువు నమస్కరించి ‘నాకు ముగ్గరు కుమార్తెలు. అందులో ఇప్పుడు నాతో వచ్చిన పిల్లను దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగిన సౌశీల్యము కలిగినది. నారదుడు మా అంతఃపురమునకు వచ్చినపుడు నీ గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్నతర్వాత నిన్ను భర్తగా చేపట్టాలనే కోర్కె నా కుమార్తెయందు కలిగింది. నా కుమార్తెను స్వీకరించి ధన్యుడిని చేయవలసినద’ ని అడిగాడు. కర్దమప్రజాపతి ‘నీ కుమార్తె ఎంతటి సౌందర్య రాశో నాకు తెలుసు. ఎవరికీ లక్ష్మీదేవి అనుగ్రహము ఉన్నవారు మాత్రమే నీ కుమార్తెను చేపట్టగలరు. నాయందు లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయింది. అందుకే నాకు ఇటువంటి భార్యను ఇచ్చింది. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటిరోజున చెప్పాడు. నేను నీ కుమార్తెను భార్యగా స్వీకరిస్తాను’ అన్నాడు. కర్దమప్రజాపతి, దేవహూతిల వివాహం ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము. ఈ వివాహము మన అందరికీ మార్గదర్శకము.

శ్రీమన్నారాయణుడు కర్దమునికి కొడుకుగా పుడతానని వరము ఇచ్చాడు. వివాహానంతరము స్వాయంభువమనువు కూతురిను కర్దమునికి అప్పజెప్పి భారమైన గుండెతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక తన రాజ్యమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళి పోతున్నప్పుడు సరస్వతీ నదీతీరములో ఉన్నటువంటి మహాపురుషులను అందరినీ సేవించాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

బాధ పడుతుంటే కలిగేది కారుణ్యం

 Ganapathi Tatwamu -- 2 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


సనాతన ధర్మం లో మీరు ఏ దేవతను పూజ చేయండి,పూజలో చిట్టచివర అడిగేవి మాత్రం రెండే వుంటాయి,మీరు శివ స్వరూపం గా చేయండి, విష్ణు స్వరూపం గా చేయండి, మీరు ఏమి అడుగుతారంటే బుద్ధిని ప్రచోదనం చేయమని అడుగుతారు. "ఏకదంతాయ  విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నః దంతి ప్రచోదయాత్". "తన్నః రుద్ర ప్రచోదయాత్". "తన్నః విష్ణు ప్రచోదయాత్" మీరు ఏ రూపంలో ఈశ్వరుడిని పూజించారో ఆ రూపం అనుగ్రహించవలసినది ఒక్కటే. మా బుద్ధులను ప్రేరేపించుగాక. ఏమిటి బుద్ధి ప్రేరేపించటం? మనస్సు చెప్పిన ప్రతిదానికీ నేను వశుడను కాకుండెదను గాక. నా బుద్ధి బలంగా వుండి అది శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయం చేసుకొని అది నా జీవితమును తరింపజేయు గాక." తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యా కార్యం వ్యవస్థితౌ".ఒక కార్యాన్ని ఎలా చేయాలి ఎందుకు చెయ్యలి అన్న దానికి ప్రమాణం నేను చెప్పింది కాదు,మీరు చెప్పింది కాదు, ఎవరు చెప్పింది కాదు,శాస్త్రం చెప్పింది ఒక్కటే. శాస్త్రం మీద మీకు గురి కుదరాలి అంటే గురువాక్యం నందు శ్రద్ధ ఏర్పడటం వినా మార్గం లేదు. అందుకే శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న దానికి వ్యాఖ్యానం చేస్తూ,భాష్యం చేస్తూ ఒక మాట అంటారు,"శాస్త్రస్య,గురువాక్యస్య,సత్యబుధ్యావధారణ. శాస్త్రం,గురువు ఈ రెండు చెప్పినవి ఏవి ఉన్నాయో ,వారిద్దరు చెప్పినవి సత్యం. అది నన్ను ఈ సంసార సాగరము నుండి ఉద్ధరిస్తుంది అన్న విశ్వాసము,పూనిక, దాని మీద నువ్వు గట్టిగా నిలబడ గలిగితే దానికి శ్రద్ధ అని పేరు.ఆ శ్రద్ధ మీకు వుంటే సమస్త ప్రయోజనములు వచ్చేస్తాయి.అసలు అది లేదనుకోండి.మరి ఎందుకు చేస్తున్నావు అని అడిగారనుకోండి? చెయ్యమన్నారండి,చెయ్యకపోతే ఇబ్బంది అన్నారండి,అన్నారనుకోండి.ఇప్పుడు శాస్రాన్ని మీరు పాటిస్తున్నారు, కానీ పరిపూర్ణమైన అవగాహన లేదు.అవగాహన లేని పని ఏది వుందో దానిని కేవలం తంతు అని పిలుస్తుంది శాస్రం. తంతు అంటే కర్మేoద్రియముల స్థాయికి మాత్రమే దిగి నిలబడుతుంది."ఓం నిధనపతయే నమః"అన్నాననుకోండి,ఓ మారేడు దళం వేయి,అప్పుడు నోరు ఏమి అంటుందంటే "ఓం నిధనపతయే నమః"  ఈ చెయ్యి ఏమి అంటుందంటే ఓ మారేడు దళమును అక్కడ వెయ్యి.నిధనపతయే నమః అని మీకు అవగాహనకి వచ్చిందనుకోండి.లేదు షోడశనామ స్తోత్రం చేస్తున్నారు గణపతిమీద."సుముఖశ్చైకదంతస్య  కపిలో గజకర్ణికః , లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప, ధూమకేతుర్గణాధ్యక్షః  ఫాలచంద్రో  గజాననః , వక్రతుండ శ్శూర్పకర్ణ హేరంభో స్కంధపూర్వజః, షోడసైతాని నామాని యః పఠే చ్రుణయాదపి”, మీరు చదువుతున్నారు. ఏదో ఓ నామం  దగ్గర మీ మనస్సు ఆగిపోయింది. అబ్బ. ఏమి నామం .ఎంత గొప్పది.మహానుభావుడు ఎంత శక్తి మంతుడో కదా. అందుకు కదా ఈ నామం వచ్చింది అని.మీ మనస్సు ప్రీతి పొంది, ప్రీతి పొందగానే తరువాతి నామం స్ఫురణలోకి రాదు. రాకపోతే ఏమి అవుతుందంటే మీకు తెలియదని కాదు,మీకు ధారణలో లేదని కాదు.అక్కడ ప్రీతి ఆవిష్కృతమై పోయింది. ఆవిష్కృతమవటంలో ఏమవుతుందంటే "సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణికః , లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప,ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో" అబ్బ ఏమి నామం, ఏమి నామం  శమంతకోపాఖ్యానం అంతా అక్కడే కదా వుంది, గజాననః రాదు ఇంక , ఫాలచంద్రో, ఫాలచంద్రో  అంటూ  ఉంటారు.  అసలు  శాస్త్రం  అంది, ఎవడికి నామం దగ్గర ఆగిపోయిందో వాడు పూజ చేశాడు.ఎందుకంటే ఇప్పుడు మనస్సు నిలబడింది.  మనస్సు నిలబడి ఆ మనస్సు చెందిన ప్రీతి చేత కర్మేద్రియములు పూజ యందు అన్వయమైతే  దానికి  పూజ అని పేరు.తప్ప అసలు మనస్సు అక్కడ లేదు.మనస్సు అక్కడ ఉండటానికి కారణమేమిటి. మీకు, ఆ మూర్తికి  మధ్య వున్న అనుబంధమేమిటో  మీకు  తెలియాలి. తెలిస్తే మీకు ఒక ప్రీతి ఉంటుంది.వీడు నా కొడుకు, నా కొడుకు కనబడగానే నాలో ప్రీతి కలుగుతుంది.ఎందుకు? మా ఇద్దరి మధ్య వున్న అనుబంధమేమిటో  తెలుసు. వాడు మూడో నెలలోనో, ఆరో నెలలోనో వుండగానే ఎవరో పట్టుకు పోయారనుకోండి. వాడికి పాతిక ఏండ్లు వచ్చాయి. వాడు వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు.నాకేమన్నా ప్రీతి కలుగుతుందా? వాడు నా కొడుకని నాకు తెలిస్తే కదూ?ఎవరో వచ్చి వాడు మీ కొడుకే నండీ,మూడో నెలలో పట్టుకుపోయామని చెప్పారనుకోండీ,అప్పుడు,నాన్నా!అని వెళ్ళి కౌగలించుకొంటాను.ప్రీతి పొంగింది.ప్రీతి పొందటానికి హేతువు అనుబంధం. ఈ అనుబంధం మీకు,ఈశ్వరునికి వుందని మీరు గ్రహిస్తే కదూ అసలు,ఆ అనుబంధం మీకు,ఈశ్వరునికి వుందని గ్రహింపుకి వచ్చారనుకోండి, మీరు పొంగిపోతారు, ఆయన పొంగిపోతాడు, చంద్రుని చూసి సముద్రం పొంగినట్లు. సముద్రుడిని చూసి చంద్రుడు పొంగినట్లు. ఉభయులు పొంగిపోతారు. కాబట్టి ప్రీతి ఆవిష్కృతం కావాలి.ప్రీతి ఆవిష్కృతమగు  మాటనే  భక్తి అని  పిలుస్తారు. ఆ ప్రీతి  కేవలం  భావన అని  మీరు గుర్తు పెట్టుకోవాలి. ప్రేమ యొక్క మరొక పేరే భక్తి. ఎందుకంటే  భక్తి అన్న మాట  ప్రేమ యొక్క మరొక పేరు. ప్రేమలో  ప్రతిఫలాన్వేషణ వుండదు.ప్రతిఫలాన్వేషణ వున్నదో అది కామం. అది ప్రేమ కాదు.శిష్యుల యెడ వుండేది వాత్సల్యం.ఎవరైనా బాధ పడుతుంటే కలిగేది కారుణ్యం.

సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్

 *సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ నియామకం*


సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నియమితులయ్యారు. సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ 74 రోజుల స్వల్ప కాలం పాటు పదవి బాధ్యతలు నిర్వహించనున్నారు. నవంబర్‌8న జస్టిస్‌ లలిత్‌ పదవీ విరమణ చేయనుండగా నవంబర్‌9న జస్టిస్‌ చంద్రచూడ్‌ నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. రెండేళ్ల పాటు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. 


*కీలక తీర్పుల్లో భాగస్వామి*


సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆరేళ్ల కాలంలో పలు కీలక తీర్పుల్లో జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ భాగస్వామిగా ఉన్నారు. ఆధార్‌ బిల్లును మనీ బిల్లుగా రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదించినట్లు జస్టిస్‌ కె.ఎస్‌.పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయానికి భిన్నంగా ప్రత్యేక తీర్పురాశారు. ఆ చట్టంలోని నిబంధనలు వ్యక్తిగత గోప్యత, గౌరవం, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయని చెప్పారు. అలాగే నవ్‌తేజ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఐపీసీ సెక్షన్‌ 377 రాజ్యాంగ విరుద్ధమని, సేమ్‌ సెక్స్‌ ఇంటర్‌కోర్స్‌ చట్టబద్ధమేనని పేర్కొన్నారు. సెక్షన్‌ 377 వలసవాదుల పాలనలో వచ్చిందని, అది ప్రాథమిక హక్కులు, సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ, జీవితం, వ్యక్తిగత గోప్యతకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మేజర్‌ అయిన వారికి వివాహం, మతం విషయంలో తమకు నచ్చినట్లు నడుచుకొనే స్వేచ్ఛ ఉంటుందని సాఫిన్‌ జహాన్‌ వర్సెస్‌ అశోకన్‌ కేఎం కేసులో తీర్పు చెప్పారు. 10-50 ఏళ్ల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం నిషిద్ధం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని, అలాచేయడం వారి స్వతంత్రత, స్వేచ్ఛ, మర్యాదలను దెబ్బతీయడమేనని ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో స్పష్టంచేశారు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుల కిందకు వస్తుందని జస్టిస్‌ కె.ఎస్‌.పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 2017 ఆగస్టులో ఏకగీవ్రంగా తీర్పునిచ్చిన 9 మంది సభ్యుల ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. వ్యభిచారం నేరం కాదని జోసెఫ్‌ షైన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో మెజారిటీ తీర్పుతో ఏకీభవించారు. ఐపీసీ సెక్షన్‌ 497 రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 (చట్టం ముందు అందరూ సమానం), 15 (మతం, వర్ణం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షచూపడం నిషేధం), 21 (జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ)కు విరుద్ధమని చెప్పారు. శతాబ్దాలుగా మహిళల అణచివేతకు దీన్ని ఉపయోగిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.


*అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు*


1959 నవంబరు 11న బొంబాయిలో జన్మించిన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు 2000 మార్చి 29న బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2013 అక్టోబరు 31న అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1998 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యేంతవరకూ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేశారు. అమెరికాలోని హార్వర్డ్‌ లా స్కూల్‌లో ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ, జ్యుడిషియల్‌ సైన్సెస్‌లో డాక్టరేట్‌ పొందారు. దిల్లీ సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బి.ఎ., దిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌బీ చేశారు. ఇదివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ కుమారుడు జస్టిస్‌ ఎ.కె.సిక్రీ, జస్టిస్‌ కె.కె.మాథ్యూ కుమారుడు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేశారు. తండ్రీకుమారులు ఇద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైన ఘనత మాత్రం జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లకే దక్కనుంది.


*ఆనవాయితీ ప్రకారం..*


తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సూచించాలని అక్టోబర్​7న సీజేఐకి లేఖ రాశారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్​ రిజిజు. ఈ క్రమంలోనే ఆయన లేఖకు ప్రతిలేఖ పంపించారు జస్టిస్​ లలిత్​. సుప్రీం కోర్టు సంప్రదాయాల ప్రకారం ఈ లేఖను తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టే వారికి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అందజేస్తారు. ఆనవాయితీ ప్రకారం సీజేఐ తన వారసునిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును ప్రతిపాదిస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్​ లలిత్​ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. సాధారణంగా.. భారత ప్రధాన న్యాయమూర్తి సూచించే పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉంటుంది.

స్పాండిలైటిస్

 స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 


          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 


       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 


          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 


              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 


       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 


      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  


                కాళహస్తి వేంకటేశ్వరరావు 


            అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

శంఖం

 *శుభాలను అందించే…*


                       *‘శంఖం'*

                    ➖➖➖✍️

   

*భారతీయ సంస్కృతిలో 'శంఖం'కు ప్రత్యేక స్థానం ఉంది. అఖండ దైవిక వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలం అనే అర్థం.*


*క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒక్కటిగా పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మధన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి.*


*శంఖం ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందింది. దక్షిణావర్త శంఖం ఎంతో శ్రేష్ఠమైంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో ‘పాంచజన్యం’ అనే శంఖాన్ని పూరించాడు. అదే విధంగా అర్జునుడి శంఖాన్ని ‘దేవదత్తం’గానూ, భీముని శంఖం ‘పౌండ్రకం’ అనీ, యుధిష్ఠరుని శంఖాన్ని ‘అనంత విజయమ’నీ, నకులుని శంఖాన్ని ‘సుఘోష’నామంతో, సహదేవుని శంఖాన్ని ‘మణిపుష్ప’ అన్న పేర్లతో పిలుస్తారని మహాభారతకథ చెబుతుంది.* 


*వైరివర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖాన్ని పూరించడమన్నది యుద్ధ నియమాలలో ఒకటి. విజయ సూచికంగా కూడా శంఖాన్ని పూరించడమన్నది ఓ ఆచారం.*


*లక్ష్మీ, శంఖం సముద్ర తనయలని విష్ణుపురాణం చెబుతోంది. వరుణుడు, చంద్రుడు, సూర్యుడు శంఖం యొక్క పీఠభాగంలోనూ, ప్రజాపతి ఉపరితలం మీద, గంగా సరస్వతులు ముందు భాగంలో ఉంటారు.*


*విష్ణు మూర్తి దుష్ట శక్తులను పారద్రోలడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది.*


*నిజానికి శంఖం జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు. ‘శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు !’ అనే నానుడి మనకు తెలిసినదే. నవ నిధులు, అష్టసిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు. పూజ,ఆరాధన, యఙ్ఞాలు, తాంత్రిక క్రియలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక!  ధార్మిక ఉత్సవాలు, యఙ్ఞాలు, శివరాత్రి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు. శంఖాన్ని పూజించడంతో పాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు. శంఖాన్ని పూజిస్తారు.*


*శంఖాలలో వివిధ రకాలున్నాయి. దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం, మధ్యమావర్త శంఖంగా చెప్తారు.* 


*వీటిలోనూ లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రాహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు ఉన్నాయి.* 


*భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలను, విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.*


*సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్య్రం వదిలిపోతుంది. అదే విధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి.*


**ఫలితాలు:*

*శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది. శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది. మెదడు చురుకుతనం వృద్ధి చెందుతుంది. ఊపిరితిత్తుల పనితీరు, శ్వాసక్రియ బాగుంటుంది. శంఖం ఊదడం వల్ల గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి.*


*దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో  మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు. అందువలనే శంఖాన్ని పూరించడం వల్ల గాని, ఆ ధ్వనిని వినడంవలన గాని ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతాయంటారు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

బ్రాహ్మణ శాఖలు

 🕉వామ్మో ఇన్ని శాఖలా..... ద్రావిడ బ్రాహ్మణ శాఖలు, వైదీక బ్రాహ్మణ శాఖలు, నియోగి బ్రాహ్మణ శాఖలు, వైష్ణవ బ్రాహ్మణ శాఖలు, శివార్చక బ్రాహ్మణ శాఖలు ఉన్నాయి..

వాటి గురుంచి విపులంగా తెలుసుకుందాం.....🙏


 ద్రావిడ బ్రాహ్మణ శాఖలు..


1) ప్రధమ శాఖ ద్రావిడ

2) ద్రావిడ

3) పేరూరు ద్రావిడ

4) పెద్ద ద్రావిడ

5) దిమిలి ద్రావిడ

6) ఆరామ ద్రావిడ

7) పుదూరు ద్రావిడ

8) కోనసీమ ద్రావిడ

9) ద్రావిడ వైష్ణవులు

10) తుమ్మగంటి ద్రావిడ

11) తుమ్మ ద్రావిడ


 వైదీక బ్రాహ్మణ శాఖలు..


1) వెలనాటి వైదీక

2) వెలనాట్లు

3) వెలనాటి పూజారులు

4) వెలనాటి అర్చకులు

5) కాసలనాటి వైదీక

6) కాసలనాట్లు

7) ములకినాట్లు

8) ములకినాటి వైదీక

9) తెలగాణ్యులు

10) వేగనాట్లు

11) వేగనాటి వైదీక

12) ప్రధమ శాఖ వైదీక

13) కరణకమ్మ వైదీక


నియోగి బ్రాహ్మణ శాఖలు..


1) ప్రధమ శాఖ నియోగి

2) ఆరువేల నియోగి

3) నందవరీక నియోగి

4) లింగధారి నియోగి

5) ఉంత్కఖ గౌడ నియోగి

6) ఆరాధ్య నియోగి

7) అద్వైత నియోగి

8) నియోగి వైష్ణవులు

9) పాకనాటి నియోగి

10) ప్రాజ్ఞాటి నియోగి

11) పొంగినాడు నియోగి

12) నియోగి ఆది శైవులు

13) యజ్ఞవల్క్య నియోగి

14) ఆరాధ్యులు

15) వేమనారాధ్యులు

16) తెలగాణ్యు నియోగి

17) కరణకమ్మ నియోగి

18) బడగల కరణకమ్మ నియోగి

19) కరణాలు

20) శిష్ట కరణాలు


 వైష్ణవ బ్రాహ్మణ శాఖలు..


1) శ్రీవైష్ణవులు

2) నంబులు

3) గోల్కొండ వ్యాపారులు

4) ఆచార్యులు 

5) మర్ధ్యులు

6) వ్యాపారులు

7) కరణకమ్మ వ్యాపారులు

8) బడగల కరణకమ్మ

9) మెలిజేటి కరణకమ్మ

10) దారుకులు

11) యజ్ఞవల్క్యులు

12) యజుశ్యాఖీయులు

13) బడగ కన్నడలు

14) నంబూద్రి బ్రాహ్మలు

15) వైఖానసులు

16) మధ్వలు

17) కాణ్వులు

18) కాణ్వేయులు


 శివార్చక బ్రాహ్మణ శాఖలు.....


1) మహారాష్ట్ర చిత్సవనులు

2) లింగార్చకులు

3) ఆది శైవులు

4) శివార్చకులు

5) వీర శైవులు

6) మోనభార్గవ శైవులు

7) కాశ్యప శైవులు

8) శైవులు

9) ప్రధమ శాఖ శైవులు

10) రుద్ర శైవులు

11) పరమ శైవులు

12) శివ పూజారులు

13) శైవ స్మార్తులు


*మొత్తం బ్రాహ్మణ ఉప శాఖలు 75* ఉన్నాయి.....🙏


మీ బ్రాహ్మణ మిత్రులందరికీ ఈ పోస్ట్ ను షేర్ చెయ్యండి....🙏.🌸

మూర్ఖు డెపుడు

 మూర్ఖాణాం పండితా ద్వేష్యాః

నిర్ధనానాం మహాధనాః l

వ్రతినః పాపశీలానాం

అసతీనాం కులస్త్రియః ll 


పరమ మూర్ఖు డెపుడు పండితున్ ద్వేషించు 

ననయ మీసడించు ధనికు బీద 

పాపశీలు డెపుడు పావనున్ ద్వేషించు 

కులట యీసడించు కులపుసతిని


గోపాలుని మధుసూదనరావు

Srimadhandhra Bhagavatham -- 47

 Srimadhandhra Bhagavatham -- 47 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ఇంద్రుడు దధీచి దగ్గరకు వెళ్ళి ‘నేను ఇంద్రుడనని చాలా గొప్పవాడిననే అహంభావంతో మా గురువుగారు సభలోకి వచ్చినపుడు లేవకుండా కూర్చుని ఆయనకు అపచారం చేశాను. ఈవేళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా! నేను దేహంతో ఉండడానికి దేహీ, అని అభ్యర్ధిస్తున్నాను. అంతకన్నా నాకు బ్రతుకు లేదు. నేను బ్రతికి ఉండడానికి దయచేసి ‘మీ దేహమును నాకీయవలసినది. ఇంతకన్న నేను ఏమి అడగను. ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయాను’ అని ఇంతటి ఇంద్రుడు తలదించుకుని అడిగాడు.

దధీచి గొప్పతనం ఏమిటంటే ఆయన ఇంతకుముందు రెండుమార్లు చచ్చిపోయాడు. ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్వనీ దేవతలు వచ్చి ‘మీరు మాకు ‘అశ్వశిరము’ అనే మంత్రమును ఉపదేశం చెయ్యాలండి' అన్నారు. దధీచి ఇపుడు నేను ఒకయాగం చేసుకుంటున్నాను. అది పూర్తయిపోయిన తరువాత తప్పకుండా ఉపదేశం చేస్తాను అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఇంద్రుడు దధీచి దగ్గరకు వచ్చి మీరు ఆ విద్య అశ్వనీ దేవతలకు చెప్పినట్లయితే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. తరువాత మరల అశ్వనీ దేవతలు వచ్చారు. దధీచి నేను మీకు ఆ మంత్రమును ఉపదేశించినట్లయితే ఇంద్రుడు నన్ను చంపేస్తానన్నాడు ఎలాగ? అన్నాడు అశ్వనీ దేవతలు ‘నీవు మాకు విద్య ఉపదేశం చేసావని చెప్పగానే ముందు వెనుక చూడకుండా ఇంద్రుడు నీ కంఠమును కోసేస్తాడు. ఆ పనేదో మేమే చేసేస్తాము. ఒక గుఱ్ఱం తలకాయ తీసుకు వచ్చి నీకు పెట్టేస్తాము. ఆ విద్య పేరు ఎలాగు అశ్వశిరము కదా. నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పెయ్యి. ఇంద్రుడు వచ్చి కోపంతో ముందు వెనుక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు. మేము ఆ గుర్రం తలకాయ తీసివేసి అసలు తలకాయ పెట్టేస్తాము అన్నారు.

గురువు అంటే ఎలా ఉంటాడో ఎంత స్వార్థ త్యాగంతో ఉన్నాడన్నది చూడాలి. దధీచి నరికెయ్యండి అన్నాడు. వెంటనే వారు దధీచి కంఠం నరికేసి ఒక గుఱ్ఱం తలకాయను తెచ్చి అతికించారు. ఇంద్రుడు వచ్చి మరల తలకాయ నరికేశాడు. వీళ్ళు ఆ గుర్రం తలకాయను ప్రక్కన పెట్టి దధీచికి మామూలు తలను పెట్టేశారు. ఆయన ప్రాణంతోనే ఉన్నాడు. బ్రహ్మహత్యాపాతకం రాలేదు. దధీచి ద్విజుడు. మహాపురుషుని దగ్గరకు వెళ్ళి ఈమాట అడిగితే ఆయన వీళ్ళను చూసి ఒక చిరునవ్వు నవ్వి 'నేను ప్రపంచములో కోర్కెలను అడిగిన వారిని చూశాను. మీరు నా శరీరమును అడుగుతున్నారు. ఇలా అడగడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు బ్రతకడానికి ఇంకొకరిని చంపుతారా? ఇలా అడగవచ్చునా? అన్నారు. అంటే వాళ్ళు ‘ మాకు ఇంతకన్న వేరు మార్గం లేదు. మిమ్మల్ని వేడుకుంటున్నాము. మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ఈ ప్రపంచమునందు వేరొకరు లేరు అన్నారు.

దధీచి 'ఈ శరీరము నేను కాదు. నేను ఆత్మని. మీకు శరీరము కావాలి తీసుకోమని చెప్పి యోగవిద్యతో తనలో ఉన్న ప్రాణవాయువును పైకిలేపి అనంతములో కలిపేసి శరీరమును కిందపడగొట్టేశాడు. వీళ్ళందరూ ఆ శరీరము కోసి అందులోని ఎముకలను తీసుకొని విశ్వకర్మకు ఇచ్చారు. అందులోంచి విశ్వకర్మ నూరు అంచులు కలిగిన వజ్రాయుధమును తయారు చేశాడు.

ఈలోగా వృత్రాసురుడు లోకములన్నింటిని గడగడలాడించేస్తున్నాడు. ఇంద్రుడు గబగబా వెంటనే ఈ వజ్రాయుధమును చేతిలో పట్టుకుని ఐరావతమునెక్కి తన సైన్యమునంతటిని తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. వృత్రాసురుడితో యుద్ధం చేశాడు. వృత్రాసురుడు 'ఇంద్రా !నేను ఈ విశ్వమంతా నిండిపోయి ఉండి నీవేమి చేస్తున్నావో చూస్తూనే ఉన్నాను. నువ్వు శ్రీమన్నారాయణ దర్శనము చేసుకుని, దధీచి ఎముకలు పట్టుకుని దానితో వజ్రాయుధం చేయించుకుని నన్ను చంపడానికి వచ్చావు. నేను నీ చేతిలో చచ్చిపోతాను. ఎందుకంటే నీకు శ్రీమన్నారాయణుడి అండ ఉన్నది. వజ్రాయుధానికి నేను చచ్చిపోతానని స్వామి చెప్పారు. ఆయన వాక్కుకు తిరుగులేదు. నేను చచ్చిపోతానన్న భయం లేదు. నాకు ఎప్పటికయినా భగవంతుని సేవ చేసి భగవద్వాక్యములు చెప్పే వారితో కూడిక కావాలి. నేను శ్రీమన్నారాయణుని పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్న వాడిని. తొందరగా నీ వజ్రాయుధమును నామీద ప్రయోగించి నన్ను తుదముట్టించు’ అన్నాడు.

వాని మాటలకు ఇంద్రుడు ఆశ్చర్యపోయి ‘నిన్ను చూస్తుంటే నాకు నారాయణునే చూస్తున్నట్లు ఉంది నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది. నీవు రాక్షసుడవు ఏమిటి, నీకు యుద్ధం ఏమిటి’ అని అడిగాడు. ఆయన ‘ధర్మము ధర్మమే. నీవు మా అన్నయ్యను చంపేశావు. చచ్చిపోయేవరకు నీతో యుద్ధం చేస్తాను' అని ఒక శూలం తీసి ఐరావతం తలమీద కొట్టాడు. ఆ దెబ్బకు తలబద్దలై నెత్తురు కారుతూ ఐరావతం పడిపోయింది. ఆ శూలం తీసి లెంపకాయ కొట్టినట్లు ఇంద్రుని చెంపమీద కొట్టాడు. ఆ దెబ్బకు తల గిర్రున తిరిగి ఇంద్రుడు తన చేతిలో వున్న వజ్రాయుధమును క్రింద పడేశాడు. అది భూమిమీద పడిపోయింది. ఇంద్రా! వజ్రాయుధమును తీసుకుని నాతో యుద్ధం చెయ్యి’ అన్నాడు. నిజంగా ఆ వృత్రాసురుడు ఎంతో ధర్మాత్ముడు. ఇంద్రుడు అనుమాన పడుతూనే వజ్రాయుధాన్ని చేతితో పట్టుకుని ఆయన రెండు చేతులు నరికేశాడు. అలాగే వాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ దగ్గరకు వచ్చి నోటితో ఉఫ్ అన్నాడు. ఆ గాలికి ఇంద్రుడు, ఇంద్రుని ఐరావతము అన్నీ కలిసి ఆయన నోట్లోకి వెళ్ళిపోయాయి. గుటుక్కున మింగేశాడు. వృత్రాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన ఇంద్రుడు అదృష్టవశాత్తు ఇంతకు పూర్వం విశ్వరూపుని దగ్గర నారాయణ కవచం పొందాడు. ఆ నారాయణ కవచ స్మరణం చేత, వైష్ణవీ విద్య చేత అతడు వృత్రుని కడుపులోకి వెళ్ళిపోయినా జీర్ణము కాలేదు. వృత్రాసురుని కడుపులో ఉండిపోయి వజ్రాయుధంతో ఆయన కడుపు కత్తిరించి బయటకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఒక సంవత్సరం పాటు ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ వజ్రాయుధంతో ఆయన కంఠమును కత్తిరించాడు. ఉత్తరాయణ దక్షిణాయనముల సంధికాలంలో వృత్రాసురుని శిరస్సు దుళ్ళి క్రింద పడిపోయింది. వృత్రాసురుడు రాక్షసుడే కానీ పోతనగారు అన్నారు –

అఖిల దుఃఖైక సంహారాది కారణం; బఖిలార్థ సంచ యాహ్లాదకరము

విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం; బనుపమ భక్త వర్ణనరతంబు

విబుధహర్షానేక విజయ సంయుక్తంబు; గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు

బ్రహ్మహత్యానేక పాపనిస్తరణంబు; గమనీయ సజ్జన కాంక్షితంబు

నైన యీ యితిహాసంబు నధిక భక్తి, వినినఁ జదివిన వ్రాసిన ననుదినంబు

నాయు రారోగ్య విజయ భాగ్యాభివృద్ధి, కర్మనాశము సుగతియుఁ గల్గు ననఘ!

ఎవరికయినా విశేషమయిన కష్టములు, బ్రహ్మహత్యాపాతకం వంటి కష్టములు వస్తే వృత్రాసుర వధలో వున్న పద్యములను, వచనములను కూర్చుని ఒక పుస్తకములో వ్రాస్తే చాలు వాళ్ళ కష్టములు పోతాయి. చెపితే చాలు కష్టములు పోతాయి. ఎంతటి మహాపాపము తరుముకు వస్తున్నా వృత్రాసుర వధ వింటే చాలు ఆ పాపములన్నీ పోతాయి.

ఇదంతా విని పరీక్షిత్తు ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పటివరకు నీవు నాకు ఎన్నో విషయములు చెప్పావు. ఇలాంటి రాక్షసుని గురించి నేను వినలేదు. ఏమి ఆశ్చర్యము! నన్ను తొందరగా చంపెయ్యి – నేను శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోతానన్న రాక్షసుడిని ఇంతవరకు నేను చూడలేదు. ఈ వృత్రాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది? ఇంతజ్ఞానం ఎలా కలిగింది? నాకు చెప్పు నా మనస్సు ఆత్రుత పడిపోతోంది అన్నాడు. మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...

instagram.com/pravachana_chakravarthy

భారతదేశ వ్యవస్థ!!

 *ముంబై హైకోర్టు సీనియర్ న్యాయవాది డికె శ్రీవాస్తవ రాసిన ఈ పోస్ట్‌తో మన జ్ఞానం పెరుగుతుంది.*

*ఇదీ భారతదేశ వ్యవస్థ!!*

 *మీరే చూడండి ....*

    సేకరణ:- పాలక పురుషోత్తం. 

1- ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలను కుంటే, అతను ఒకేసారి రెండు స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేయ వచ్చు. 

కానీ అదే వ్యక్తి మాత్రం రెండు చోట్ల ఓటు వేయ లేరు.


2- ఒక వ్యక్తి జైలులో ఉంటే ఓటు వేయలేరు.

కానీ అదే వ్యక్తిరాజ కీయ నాయకుడు కావాలను కుంటే మాత్రం జైలులో ఉన్న ప్పుడు కూడా ఎన్నికల్లో పోటీచేయవచ్చు.


3-ఒక వ్యక్తి ఎప్పుడైనా జైలుకు వెళ్లినట్లయితే జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం రాదు,

కానీ అదే వ్యక్తి హత్య లేదా అత్యాచారానికి పాల్పడినా, ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా, ప్రధాని లేదా రాష్ట్రపతి కూడా కావచ్చు


4- ఒక వ్యక్తి నిరాడంబర మైన ఉద్యోగం పొందడానికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 

కానీ అదే వ్యక్తి చదువు లేనప్పటికీ భారతదేశ ఆర్థిక లేదా విద్యా మంత్రి కావచ్చు.


5-ఒకవ్యక్తి సైన్యంలో చేరటానికి మైనర్ అయి ఉండాలి10 కిలోమీటర్లు పరిగెత్తి డిగ్రీ చూపించాలి.

కానీ అదే వ్యక్తి నిరక్షరాస్యుడు, పిరికివాడు కుంటివాడు అవుతూ కూడా డిఫెన్స్ మినిస్టర్ కూడా కావచ్చు.


6 ఒక వ్యక్తి వేలాది కేసులలో నిందితుడైన ప్పటికీ న్యాయ లేదా హోం మంత్రి కూడా కావచ్చు


ఈ వ్యవస్థను మార్చాలని మీరు అనుకోవట్లేదా?

నాయకులు మరియు ప్రజలు ఇద్దరికీ ఒకే చట్టం ఉండవద్దా?

కాబట్టి దయచేసి ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయడం ద్వారా దేశంలో అవగాహన తీసుకురావ డానికి మీమద్దతు ఇవ్వండి.


మీరు ఫార్వార్డ్ చేయకపోతే ఏ నాయకుడిని నిందించవద్దు ....

కాకపోతే, మీరు నష్టానికి బాధ్యత వహిస్తారు.


30 నుండి 35 సంవత్సరాల వరకు సంతృప్తికరమైన సేవను అందించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అర్హత లేదా? 


కేవలం 5 సంవత్సరాలు కూడా  రాజకీయ పదవిలో లేకుండా పెన్షనా? 


ఎన్ని రాజకీయ పదవులు పోషిస్తే అన్ని పెన్షన్లా??


న్యాయం ఎక్కడ ఉంది ...?


శ్రీ డి. కె. శ్రీవాస్తవ

చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

బొంబాయి హైకోర్టు.

ముంబై .....

ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లండి తొలగించ వద్దు, ఈ వ్యవస్థను మార్చటం నిజంగా అవసరం కాదా???!

PM's reply

 The Chief Justice has written to the Prime Minister asking for further increase in the number of judges in the Supreme Court.


 *PM's reply*

 Honorable Judge Saheb,  you have the following instructions from the public..


  1:- All you Justices come at 10 o'clock - Lunch -between 2 and 3 o'clock, then return home at 4 o'clock.  How long will this last??

  2:- Come at 9 am and work till 6 pm like doctors, engineers, policemen, bureaucrats and people from corporate world.

  3:- Work on Saturdays and Sundays as many doctors and some officers do.

  4:- Since 1947, from 1st June to 30th June, you enjoy summer vacation.  Why summer vacation in June when entire SC is centralized AC ??

  5:- Each Justice shall take only 15-20 days leave in a year.

  6:- Why waste time deliberately in cases like Jallikattu, Dahihandi??

  7:- Why are you wasting your time hearing hundreds of useless PILs filed by some professionals??

  8:- EPFO ​​vs pensioners, why you make 3 justice benches and then 5 justice benches in many cases?

  9:- Review for traitors, then petitions for correction?  Why do you open the court even at night for the poor people who don't have time ???

  10:- You get crores of salary and facilities from tax payers but zero accountability to public.

  11:- You live in AC bungalows, travel in luxury cars, have elaborate security at public expense, so why don't you work hard?

  12:- All of you will get Cabinet Minister facilities.


   No need to age.  Working days of SC Supreme Court should be increased to atleast 300 days which function only 168 days in a year.


  Judges should have no difficulty in working for 300 days while the Prime Minister can work for 365 days.

  The poor patriots could bear it no longer.

  Judiciary is rotten.  There is an urgent and urgent need to improve it.


  *Send at least five groups*

  *

కుండలి శక్తి

 యోగ శాస్త్రం లో ( కుండలి శక్తి ) అనేది 

ఒక అనిర్వచనీయమైన శక్తి అని సవివరము గా విశదీకరించింది. 

మానవ శరీరంలోవెన్నెముక లో 

సప్తచక్రాలు ఉంటాయి. కుండలి శక్తిమానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది.


మూలాధారం లో దాగివున్న ఈ కుండలిని శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలిని యోగ. ఈ కుండలిని యోగ ద్వార గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాటే వీలున్నది.


కుండలిని యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలిని శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది.యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయవచ్చు.

 1

 

అరిషడ్వర్గాలను జయించినప్పుడే...

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి, నాడీ శుద్ధి, మనో శుద్ధి మరియు బుద్ధి శుద్ధి ఎలా జరగాలో బోధిస్తుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైన ముని ప్రవక్తిమై అనేక రూపాలలో కర్మసిద్ధంతం విసదీకరించారు. కర్మఅంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసినది.

 2

అవన్నీ కర్మ ఫలాలే

ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితము విద్యుక్త ధర్మాన్ని వదిలి వేయడం పాపంగానే పరిగణించ బడుతుంన్నది .


 3

 

కర్మ ఫలం మీద అధికారం లేదు..

కర్మచేయడం మీదే మనుష్యులకు అధికారం ఉంటుంది. కాని కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు.అంటే సత్కర్మ లేక పాప కర్మ ఆచరించేది మానవుడే.కనుక గత జన్మలలో చేసిన పాప పుణ్య కర్మలు అనుభవింగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది.కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి.మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి! పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ చేసే ప్రతి పని కర్మయే.

 4

కర్మ అంటే ఏమిటి.

నిద్రించడం, శ్వాసించడం, ధ్యానింనించడం, తపస్సు, మౌనం, భుజించడం, ఉపవసించడం కర్మయే. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండ లేరు. మనిషి మరణించిన తరువాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది. మనిషి మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు.పాపం నశించే వరకూ ఆత్మ ప్రయాణం సాగుతుందని ఆ కర్మఫలితమైన పుణ్య పాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడు.

 5

కర్మ పల్లే పాపపుణ్యాలు

జీవుడు భౌతిక శరీరాన్ని వదిలి పోయే సమయంలో పాపపుణ్యాలను, వాసనలను వెంట తీసుకు వెడాతాడని వివరిస్తుంది. పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది. అంటే. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు.లోక హితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలాన్ని భగవత్ప్రసాదితంగా అనుభవించవచ్చన్నది దీని సారాంశం.


భగవంతుని ఆధీనంలో కర్మఫలం

మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి . భవంతుడిని ధ్యానించి గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని యోగ శాస్త్రం బోధిస్తుంది. మనిషి తన విద్యుక్త కర్మలను నిష్కామముగా చక్కగా ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చన్నది ఆద్యాత్మిక దృష్టితో యోగ శాస్త్రం వివరిస్తుంది. సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని యోగ శాస్త్రాలు బోధిస్తుంది...

.

.

.


ఈమధ్యకాలంలో కొందరిలో వెఱ్ఱి వెఱ్ఱిఊడలు వేస్తుంది.


కుండలిని, శ్రీచక్ర ఉపాసన అర్థంపర్థం లేకుండా మొండిగా, మూర్ఖంగా గురువు అనేవాడు లేకుండా చేసేస్తున్నారు.


ఈ రెండూ చాలా సున్నితమైనవి. అత్యంత ప్రభావితమైనవి. కొన్ని మంత్రాలు, శ్రీచక్ర ఉపాసన, కుండలిని జోలికి వెళ్ళకండి.


వెళితే ఏమి జరుగుతుంది?

కుండలిని అనేది శరీరానికి సంబంధించిన షట్చక్రాలను కదిలిస్తుంది. శ్రీచక్రం అమ్మవారి శక్తిని జాగృతం చేస్తుంది. వీటిని అదుపు చేయడం తెలియాలంటే వాటిలో సిద్ధహస్తుడైన గురువు ప్రక్కనే ఉండాలి. ఇవి మాటలతో చెప్పినంత తేలికగా ఉండదు. కంటికి కనబడవు. చేసినవాడికి ఏమి జరిగిందో తెలియదు. చెప్పడం సాధ్యం కాదు. ఎక్సరే లో కనబడదు. కొస్తే కనబడదు.


ఇవి చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి దశలో ఉన్నారో అది ఆరితేరిన ఒక్క గురువుకి మాత్రమే తెలుస్తుంది. అందులో నుండి బయటపడడం ఎలాగో ఆయన మాత్రమే చేయగలడు. వీడు ఈ స్థితిలో ఉన్నాడు అని మనోనేత్రంతో గ్రహించి మాత్రమే తీసుకురాగలుగుతాడు. అంత శక్తి గురువుకి ఉంది.


కుండలిని గురించి యూట్యూబ్ ఛానెల్ దొరికింది కదా అని ముద్రలు, ఆసనాలు చెప్పేస్తున్నారు. వాటిని చూసి ఉత్సాహంగా చేయకండి. శరీరంలోని సున్నితమైన వ్యవస్థలు దెబ్బతింటాయి. మాంసాహారం, మద్యం, చిరుతిళ్ళు, మసాలాలు, కోడిగ్రుడ్లు, వంటి ఆహారం తీసుకోవడానికి అలవాటు పడినవారి కనీసం ఇటువైపు చూడడం కాదు కదా కనీసం వీటిని చేయాలనే ఆలోచన కూడా చేయొద్దు. పిచ్చివాళ్ళై పోతారు. 


బాగా ఆస్తులు ఉండి, నేను పోయినా పర్వాలేదు. నాబిడ్డలు, భార్య క్షేమంగా ఉండగలరు అని నిర్ణయం తీసుకున్న తరువాత ఇటువైపు ఆలోచన చేయండి. ఎందుకంటే గురువు కనుసన్నల్లోనే ఈ కుండలినీ, కొన్ని మూల మంత్రాలు, శ్రీచక్ర ఉపాసన వంటి ప్రక్రియలు చేయాలి. దానికి కొన్ని సంవత్సరాల పాటు ఆయన సమక్షంలో సేవ చేయాలి. అభ్యాసం చేయాలి. ఇవేమీ చేయకుండా ముందుకు దూకడం అంటే యుద్ధవిద్య నేర్వకుండా కత్తి దొరికిందని కదనరంగంలో దిగడమే. ఎవడైనా నరికితే ఇక్కడ చెప్పడానికి ఉండదు. పైన చెప్పిన వాటిలో ఏదైనా జరిగితే మీరు ఉంటారు. కానీ చెప్పే స్థితి మీకుండదు.....

.

Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 46 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


అమరావతిని స్వాధీనం చేసుకొని ఇంద్రుడు ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. పూర్వం ‘మా ఐశ్వర్యం అంతా మీది’ అని ఒక మాట అన్నాడు. ‘మహానుభావా! మీ వలననే మరల నేను ఈ అమరావతిని పొందాను. ఈ ఐశ్వర్యం అంతా మీదే. మీరు ఈ ఐశ్వర్యమును అనుభవించవచ్చు’ అన్నాడు. తనవలన శిష్యుడు అంత ఐశ్వర్యమును పొందాడని, వాని ఐశ్వర్యమును పొందే ప్రయత్నమును గురువు చెయ్యడు. విశ్వరూపుడు 'నీ ఐశ్వర్యం నాకెందుకు? నేను అలా పుచ్చుకునే వాడిని కాను. నీ ఐశ్వర్యం నాకు అక్కర్లేదు’ అన్నాడు. విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులను స్వీకరిస్తూ ఉండేవాడు. ఇంద్రాదులకు ఆ హవిస్సులు ఇస్తూ ఉండేవాడు. ఆయన తల్లిగారి పేరు ‘రచన’. ఆవిడ రాక్షస వంశమునకు చెందినది. మేనమామలైన రాక్షసులు వచ్చి ‘నువ్వు మా మేనల్లుడివి. నీవల్ల మేము స్వర్గమును పోగొట్టుకున్నాము. నీవు వెళ్ళి దేవతలకు గురుత్వము వహించావు. ఇంద్రుడికి నీమీద నమ్మకం ఎక్కువ. ఇంద్రుడు చూడకుండా మాకు కొద్దిగా హవిర్భాగములు పెట్టేస్తూ ఉండు’ అన్నారు.

ఇలా చేయడం తప్పే అందులో సందేహం లేదు. అయితే విశ్వరూపుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? విశ్వరూపుడు తన స్వరూపము ఏమిటో ముందరే చెప్పాడు. ‘నాకు రాగద్వేషములు తెలియవు. నేను అంతటా బ్రహ్మమునే చూస్తాను. ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కున వారిమాట వినేస్తాను’ అని చెప్పాడు. అందుకని వాళ్లకి హవిర్భాగములు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇది ఒకరోజున ఇంద్రుడు గమనించాడు. మరుక్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. వెంటనే తన చేతిలో వున్న చంద్రహాసమును తీసుకొని మహానుభావుడైన విశ్వరూపుని మూడు తలకాయలు తెగిపోయేటట్లు నరికేశాడు. ఆయన మూడు తలకాయలలో ఒక తలకాయతో యజ్ఞవేదిలో సురాపానం చేస్తూ ఉంటాడు. సురాపానం చేసే తల క్రింద పడగానే అది ఆడ పిచ్చుకగా మారిపోయింది. సోమపానం చేసే తలకాయ కౌజు పిట్టగా మారిపోయింది. అన్నం తినే తలకాయ తీతువు పిట్టగా మారిపోయింది. ఇప్పటికీ తీతువు పిట్ట అరిచింది అంటే అమంగళమని అంటారు. ఎందుకు అంటే ఆనాడు ఇంద్రుని వలన బ్రహ్మహత్య జరిగింది. ఎవరిని గురువుగా పెట్టుకున్నాడో ఆ గురువు తల కోసేశాడు. అలా కోసేసినపుడు పడిపోయిన తలకాయే తీతువు పిట్ట అయింది. దాని కూత వినపడితే అమంగళము. అది ఒక్క కృష్ణ స్మరణ చేత మాత్రమే పోతుంది. తీతువు పిట్ట అరిచినపుడు కృష్ణ స్మరణ చేస్తూ ఉంటారు.

ఈవిధంగా తెగిపడిన విశ్వరూపుని మూడు తలలు మూడు పిట్టలయ్యాయి. ఈ మూడు పిట్టలు కూస్తూ ఇంద్రుని వెంటపడ్డాయి. ఆ ఘోరమయిన కూతలను వినలేక ఏడాదిపాటు భరించాడు. బ్రహ్మ హత్యాపాతకం వలన అతనికి మనశ్శాంతి పోయింది. దీనిని ఎవరికయినా ఇచ్చివేయాలి. ఎవరు పుచ్చుకుంటారు? ఆ రోజులలో ఇంద్రుని మాట కాదనలేక బ్రహ్మ హత్యాపాతకమును పుచుకోవడానికి నలుగురు ఒప్పుకున్నారు. అవి భూమి, చెట్లు, జలము, స్త్రీలు. ఈ నలుగురు పావు వంతు చొప్పున పుచ్చుకున్నారు. తీసుకొన్నందుకు గాను తమకు వరముల నిమ్మని ఇంద్రుని అడిగారు. ఇంద్రుడు వాటికి వరములు ఇచ్చాడు. భూమికి ‘ఎవరయినా గొయ్యి తీసినా ఆ గొయ్యి కొంత కాలమునకు తనంత తాను పూడుకుపోతుంది’ అని, చెట్లకు ‘ఎవరయినా చెట్లను కత్తితో నరికేసినా మొదలు ఉంటే చాలు మరల చిగురించేలా ‘ఏ పనిచేసినా ప్రక్షాళనము అనబడే మాట దానియందు ప్రయోగింప బడదు. మీరు ఏదో ముట్టుకోకూడని వస్తువును ముట్టుకుని ఒక కాగితమునకు తుడుచు కున్నారనుకోండి అది ప్రక్షాళనము అనరు. నీటి చుక్క ముట్టుకున్నట్లయితే వెంటనే ప్రక్షాళనము అయిపోతుంది. మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోని పువ్వులు ఈశ్వరుడి పాదముల మీద వేస్తే ఒక చుక్క నీరు చేతిలో వేస్తే చెయ్యి తుడుచుకుంటాము. ఒక్క చుక్కయినా చాలు. ప్రక్షాళన చేయగలిగే శక్తి నీటికి ఇచ్చాడు. కామోప భోగములందు ఎక్కువ సుఖము కలిగేటట్లు స్త్రీలకి వరం ఇచ్చాడు. ఈవిధంగా నలుగురుకి నాలుగు వరములు ఇచ్చాడు.

ముందు భూమి పుచ్చుకున్నది. ఊసర క్షేత్రములు వచ్చాయి. ఉప్పుతో కూడిన పంటలు పండని ఇసుక పర్రలు ఏర్పడ్డాయి. దానిమీద మొక్క మొలవదు. చెట్టు పుచ్చుకుంది. చెట్టులోంచి జిగురు కారుతుంది. అందుకే చెట్టు జిగురు వికారమును స్పృశించకూడదు అంటారు. నీటియందు బుడగగాని, నురుగు కాని ఉంటే అది బ్రహ్మహత్యా పాతక రూపం. ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగగాని, నీటియందు నురుగు కాని ఉంటే ఆ నీళ్ళని పక్కకి వదిలి పెట్టేస్తారు. కొత్తగా ప్రవాహం వచ్చేముందు పెద్ద పెద్ద నురుగు వస్తుంది. దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయడం కానీ, ఆ నురుగు ముట్టుకోవడం కానీ చెయ్యరు. స్త్రీలయందు రజోగుణ దర్శనము బ్రహ్మహత్యా పాతక రూపం. వారియందు ఆ నియమం ఉంచారు. ఇంద్రుడు తన బ్రహ్మ హత్యాపాతకమునుండి నివారణ పొంది మరల సింహాసనాదిష్టుడు అయ్యాడు. ఒకనాడు బృహస్పతి సభలోకి వచ్చినపుడు లేవనందుకు సంభవించిన పాపం ఇప్పటికీ తను సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనడానికి వీల్లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని వెనుక మరొకటి తీసుకు వస్తున్నది.

విశ్వరూపుడు మరణించాడని త్వష్ట ప్రజాపతికి తెలిసి కోపముతో ఒక పెద్ద యజ్ఞం మొదలు పెట్టాడు. ఇంద్రుడిని సంహరించే వేరొక కొడుకు ఆ యజ్ఞంలోంచి రావాలని అన్నాడు. యజ్ఞం పరిసమాప్తము అవుతుండగా ఒక బ్రహ్మాండమయిన రూపము ఆ యజ్ఞ గుండంలోంచి బయటకు వచ్చింది. ఆ యజ్ఞగుండంలోంచి బయటకు వచ్చిన రూపమునకు పేరు తండ్రిగారు పెట్టలేదు.అది పుట్టీ పుట్టగానే మొత్తం ఈ బ్రహ్మాండము ఎంతవరకు ఉన్నదో అంతవరకూ వ్యాపించి నిండిపోయింది దానికి ‘వృతాసురుడు’ అని పిలిచారు. ఆయన తలకాయను నరకడానికి ఇంద్రునికి ఒక ఏడాదికాలం పట్టింది. వజ్రాయుధంతో ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ ఒక ఏడాదిపాటు నరికాడు. కోస్తే ఉత్తరాయణ, దక్షిణాయన మధ్య కాలానికి కోయడం పూర్తయింది. అతడు పుడుతూనే ఆకాశం అంతటిని నోట్లో పెట్టుకుని చప్పరించాడు. ఆ తరువాత అది ఏమయినా రుచిగా ఉంటుందేమోనని ఒక్కొక్క గ్రహమును నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. అలా గ్రహములను, నక్షత్రములను, బ్రహ్మాండములను, అన్నింటినీ చేత్తో పట్టుకుని వాటిని నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. వాడు పుడుతూనే ‘ఇంద్రుడనేవాడు ఉండాలి. ఎక్కడ ఉంటాడని అడిగాడు. వాడు తనని చంపడానికి వచ్చేస్తున్నాడని ఇంద్రుడికి తెలిసిపోయింది. ఇంద్రుడు సైన్యం అంతటినీ తీసుకుని యుద్ధమునకు వెళ్ళాడు. వీరు వేసిన అస్త్రములను తన గుప్పెటతో పట్టుకుని నోట్లో వేసుకుని చప్పరించేశాడు. ఇంకా వానితో యుద్ధం లాభం లేదని, ముందు బతికితే చాలనుకుని దేవతలందరూ పారిపోవడానికి నిశ్చయించుకున్నారు. శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠ ద్వారం వద్దకు వెళ్ళి నిలబడి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఆయనకు ఆర్తత్రాణ పరాయణుడని బిరుదు. ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పుచేశాడా, ఒప్పు చేశాడా అని చూడడు. గభాలున వచ్చి దర్శనం ఇచ్చి రక్షిస్తారు. తనను నమ్మినవారి పట్ల అలా ప్రవర్తిస్తారు. స్వామి దర్శనం ఇచ్చి ‘మీరేమీ బెంగ పెట్టుకోకండి. భయపడకండి’ అని అభయ ప్రకటన చేశారు. వీరందరూ స్వామిని స్తోత్రం చేశారు.

వెంటనే స్వామి పోనీలెండి మీరేమీ బెంగ పెట్టుకోకండి వృతాసురుణ్ణి సంహరించి మిమ్మల్ని రక్షిస్తాను అని అనలేదు. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతోంది? బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది. అంటే ఎక్కడో మనస్సులో వాళ్ళ పట్ల చులకన భావం ఉన్నది. మనం పలుమార్లు వాళ్ళను తెచ్చుకోవచ్చు. ఎలాగయినా వాడుకోవచ్చు అనే భావన ఒకటి మనసులో మెదలుతోంది. ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి. గురువుల అనుగ్రహం ఎలా ఉంటుందో, వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలి అనుకుని ‘మిమ్మల్ని రక్షించడానికి మీకు అస్త్ర శస్త్రములు పోయాయి కదా! వృతాసురుణ్ణి సంహరించడానికి కావలసిన ఆయుధమును ఇవ్వగలిగిన వాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. ఆయనే దధీచి మహర్షి. మీకు కావలసిన ఆయుధం ఆయన శరీరం నుండి వస్తుంది. ఆయన నిరంతరం నారాయణ కవచమును పారాయణం చేశాడు. ఆయన వద్దకు వెళ్ళి ‘మీ శరీరము ఇవ్వండి అని అడగండి. ఆయన బ్రహ్మజ్ఞాని. తన శరీరమును ఇచ్చేస్తాడు. ఆయన శరీరము ఇచ్చిన తరువాత ఆయన శరీరమును కోసివేయండి. లోపల ఉన్న ఎముకలను పైకితీసి మూట కట్టుకుని పట్టుకు వెళ్ళి విశ్వకర్మకు ఇవ్వండి విశ్వకర్మ ఆ ఎముకలలోంచి నూరు అంచులు కలిగిన వజ్రాయుధమును తయారుచేస్తాడు. దానితో వృతాసురుడు సంహరింప బడతాడు. అందుకని వెళ్ళి దధీచిని ప్రార్థించండి అని చెప్పాడు. గతంలో త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని సంహరించడం వల్ల తనకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. వృత్రాసురుని సంహరించడం వలన మళ్ళీ తనకు ఏమి కీడు మూడుతుందో అన్న ఆలోచన ఇంద్రునికి కలిగింది. ఈవిషయము దేవతలకు చెప్పాడు. ఇంద్రునిలో కొంచెం పాప పుణ్యముల విచారణ ప్రారంభం అయింది. దేవతలు ‘మేము నీచేత అశ్వమేధ యాగమును చేయించి ఎలాగోలాగ నీవు బ్రహ్మహత్యాపాతకము నుండి విముక్తుడవయ్యేలా చూస్తాము. ముందు వెళ్ళి దధీచి శరీరమును అడగవలసినది’ అని చెప్పారు. పరుగెత్తుకుంటూ దేవతలను తీసుకుని దధీచి దగ్గరకు వెళ్ళాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

మూర్ఖాణాం

 శ్లోకం:☝️

*మూర్ఖాణాం పండితా ద్వేష్యాః*

   *నిర్ధనానాం మహాధనాః l*

*వ్రతినః పాపశీలానాం*

   *అసతీనాం కులస్త్రియః ll*

    -హితోపదేశం


భావం: లోకంలో మూర్ఖులు పండితులను, పేదవాళ్ళు ధనవంతులను, పాపవర్తనులు సచ్ఛీలురను, కులతలు పతివ్రతలను ద్వేషిస్తుంటారు. లోకంలో అత్యధిక సంఖ్యాకులుగా ఉండే మొదటి తరహావాళ్ళకు పాపభీతిని కలిగించి ఋజు మార్గమున నడపుటకే శాస్త్రాలు, పురాణ ఇతిహాసాదులు ప్రయత్నించుచున్నవి.

సజ్జను డిలలోన్

 కం.

మనమున చింతన జేయుట
ఘనముగ నోటను బలుకుట కాయికముగ తా
పనిసేయుట నొక విధముగ
సలుపును నిత్యము వెఱవక సజ్జను డిలలోన్
కవిసమ్రాట్టుకు ఘనతర
కవికులరాట్టుకు పటుతర కవితాలోక
చ్ఛవితృట్టుకు భట్టుకు భా
రవి జట్టుకు తట్టిన విథి ప్రణతి ఘటింతున్
*~* 
*~శ్రీశర్మద* 

ధర్మాకృతి : ఇంద్రసరస్వతీ, భారతీ మహాస్వాములు - 3

 ధర్మాకృతి : ఇంద్రసరస్వతీ, భారతీ మహాస్వాములు - 3


శ్రీకంఠశాస్త్రి గారిపైన వదిలివేశారు. తమకు ఇష్టము ఉన్నా లేకున్నా వారి నిర్ణయానికే తమ ఆమోదముద్ర వేసేవారు.


శ్రీకంఠశాస్త్రి గారు విద్యారణ్యుల కాలం నుండి వచ్చిన రాచమర్యాదలు ఏమాత్రం సడలించడం ఇష్టపడేవారు కాదు. స్వామివారికి ఈ దర్జా ఆడంబరం నచ్చేవి కాదు. 1920-27 యాత్రలలో ప్రతి గ్రామం ప్రవేశించేటప్పుడు స్వామివారికి కిరీటము, ఆభరణాలు, జరీ శాలువాలు అలంకారం చేయవలసినదిగా శాస్త్రి గారి ఆజ్ఞ. స్వామివారికి సుతరామూ ఇది ఇష్టం ఉండేది కాదు. అయినా శాస్త్రిగారికి కష్టం కలిగించ కూడదని నిర్లిప్తంగా భారించేవారు. మళ్ళీ గ్రామం దాటగానే ఈ బరుగు తొలగించబడేది. స్వామివారు ఈ కవాతుని సాక్షిమాత్రంగా స్వీకరించేవారు. ‘నేనో వేషధారిని. ఈరోజు ఈ వేషం – రేపో వేషం’ అని తీసిపారేసేవారు. 


శ్రీకంఠశాస్త్రి గారి విధానానికి, స్వామివారి స్వాభావిక లక్షణాలకు అనంతమైన అంతరం ఉంది. శృంగేరీ మఠ ఔన్నత్యానికి శాస్త్రిగారు ఎనలేని సేవ చేశారనేది నిర్వివాదాంశము. కానీ చిన్నతనంలో తమ వద్ద పెరిగిన ఈ స్వామివారి ఆధ్యాత్మికోన్నతిని బహుశః వారు గుర్తించలేదని చెబుతారు. శాస్త్రిగారు స్వయంగా పండితులు. అద్వైతానుభూతి గూర్చి స్పష్టమైన పుస్తక పరిజ్ఞానమున్నది. అయితే మఠోన్నతి అనే గాడిన పది మిగతా విషయాలను పట్టించుకోవడం మానేశారనుకుంటారు. ఈ కారణం చేతనో వస్తుతః విరాగి కావ్వడం చేతనో శృంగేరీ స్వామి 1928-31 లలో పూర్తిగా అంతర్ముఖులయిపోయారు. నిరంతర బ్రహ్మానుభవంలో మునిగి తేలుతూ బాహ్య స్మృతి పూర్తిగా మర్చిపోయారు. పూజ మొదలుపెడితే గంటల తరబడి అర్చన చేస్తూ ఉండడం, చేతిలో పుష్పం ఉంచుకొని అమ్మవారిని చూస్తూ అలానే లీనమయిపోయి ఉండడం, అభిషేకం చేస్తూ ధారాపాత్రలో పాలు అయిపోయినా అలానే ఉండిపోవడం వంటివి చేయనారంభించారు. విజ్ఞాపన చేస్తే వినిపించేది కాదు. ఏం తింటున్నారో వారికే అర్థమయ్యేది కాదు. సదాశివ బ్రహ్మేంద్రుల ఆత్మవిద్యా విలాసంలోని శ్లోకాలు పెద్దగా చదువుకుంటూ ఉండేవారు. 


శ్రీకంఠశాస్త్రి గారికి ఈ పోకడ అర్థం కాలేదు. స్వామివారికి ప్రయోగం లాంటిదేమైనా జరిగిందేమోనని పరిహారాలు మొదలుపెట్టారు. రాత్రిపూజ వారే చేయడం మొదలుపెట్టారు. బాహ్యస్మృతిలో లేనికాలంలో గదిలో తాళం వేసి ఉంచి పరిచారకులను కావలి ఉంచారు. పరిచారకులు కూడా కేవలం స్నానం చేయించడానికి ఆహరం ఇవ్వడానికి మాత్రమే లోపలి వెళ్ళేవారు. మూసిన గదిలోనుంచి అప్పుడప్పుడూ సంగీతం కేవలం దేవతలే పాడుతున్నారా అన్నట్లు వినవస్తుంది. మరింకోసారి స్వామివారు ఆశువుగా ఆత్మానుభూతి సంబంధమైన శ్లోకాలు అనర్గళంగా చదవడం వినవస్తుంది. ఆహా! ఆ స్వామి ఉనికి చేత శృంగేరీ చిక్ మంగళూర్ జిల్లా, కర్ణాటక యావద్భారతం పవిత్రమైపోయాయి.


అర్థం కాని అమాయకులు మతిభ్రమణం అని భ్రమపడ్డారు. విషయం ప్రభుత్వం దాకా పొక్కింది. కోట్ల ఆస్తి ఉన్న పీఠానికి అధిపతి – విషయం ధృవీకరించుకోవడానికి రహస్యంగా ఒక మానసిక వైద్యుని పంపారు. స్వామివారిని కలిసే వేలు లేనందున ఆ వైద్యుడు వారి మనఃపరిస్థితి గూర్చి సర్వాధికారి వద్ద, పరిచారకుల వద్ద వాకబు చేస్తున్నాడు. అయితే హఠాత్తుగా స్వామివారు బాహ్యస్మృతిలోనికి వచ్చారు. బాహ్యస్మృతిలోనికి వచ్చినప్పుడు ఆశ్రమ నిధులు, భక్తులకు దర్శనాలు స్వామివారు యధావిధిగా నిర్వర్తిస్తారట. అందరితో పాటు వైద్యుడు కూడా స్వామి దర్శనానికిక వెళ్ళారు. దర్శనం అయిన తరువాత శలవు తీసుకోబోతున్నారు. “ఏం వెళ్ళిపోతున్నావు? వచ్చిన పని అయిందా?” అన్నారు స్వామి. రహస్యమైన పనిమీద వచ్చిన వైద్యుడు మౌనం వహించారు. ‘నీవు నన్ను పరీక్షించే పని పూర్తిచేశావా? నా ఈ వ్యాధికి మీ వైద్యవిధానంలో మందు ఏమైనా ఉన్నదా” అని నేరుగా ప్రశ్నించారు. డాక్టర్ గారు దొరమొహం వేశారు. తనపై ఏర్పాటు చేయబడిన కావలిని. అందువలన ఏర్పడిన అనుమానాన్ని దృష్టిలో ఉంచుకొని “ఇది నా ప్రారబ్ధం. అనుభవించవలసినదే. పాపం నీవేమి చేస్తావు” అని పంపివేశారు. డాక్టర్ నివేదిక ఏమైనా ఉంటుందనే విషయం వేరే చెప్పనక్కర లేదు కదా!


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

మనసు పరమాత్మయందు నిలపాలి.

 ధ్యానంలో కూర్చున్న వాడి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి భయము, భీతి, ఆందోళన ఉండకూడదు. మనసును బ్రహ్మయందు అంటే పరమాత్మయందు నిలపాలి. 


అలా చేయాలంటే మనసును సంయమింప చేయాలి. నిలకడగా ఉంచాలి. పరమాత్మను తప్ప వేరే ఏ విషయాన్ని గురించి ఆలోచించకూడదు. ఈ ధ్యానం అంతా నాకు పరమగతి కలగడం కోసమే చేస్తున్నాను అనే ధృఢమైన నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి.


ప్రశాంతాత్మా అంటే మనసును, చిత్తాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎటువంటి ఆలోచనలు ఆందోళనలు ఉండకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. అంటే మనము ధ్యానంలో కూర్చోగానే ఇదివరకు చూచినవి, విన్నవి, తాకినవి, జరిగినవి విషయాలు అన్నీ గుర్తుకు వస్తాయి. 


ఎక్కడెక్కడో ఎప్పుడో జరిగిన విషయాలు అన్నీ అప్పుడే గుర్తుకొస్తాయి. వాటి వలన బాధ, భయము, సంతోషము కలుగుతాయి. అటువంటి గతకాలపు ఆలోచనలు మనసులోకి రాకుండా అరి కట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.


విగతభీ అంటే భయం ఉండకూడదు. గతించిన విషయాలు గుర్తుకొస్తాయి అన్ని పైన చెప్పుకున్నాము కదా. అలాగే రాబోయే విషయాల గురించి, జరగబోయే విషయాల గురించి కూడా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల వల్ల భయం కూడా కలిగే అవకాశం ఉంది. 


అంతేకాదు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా అంటారేమో అన్న భయం ఉంటుంది. దేనికీ భయపడకూడదు. మనసులో గుబులు ఉండకూడదు. ఈ టైములో ఆ పని చేద్దామనుకున్నాను. కాని చేయలేకపోయాను. ఇక్కడ కూర్చున్నాను. అక్కడ నేను లేకపోతే ఏం జరుగుతుందో ఏమో అనే చింత విడిచిపెట్టాలి. 


బయట ఏం జరిగినా నిశ్చలంగా ఉండాలి. అన్నీ భగవంతునికి అర్పించి మనసును నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకోవాలి. ఇది కష్టమే అయినా అభ్యాసంతో సులభమే అవుతుంది.


తరువాతది బ్రహ్మచర్యం పాటించాలి. అంటే మనసు కామ వాంఛల వైపు వెళ్లకూడదు. స్త్రీసంబంధమైన ఆలోచనలు రాకూడదు. స్త్రీలు ధ్యానంలో కూర్చుంటే పురుష సంబంధమైన ఆలోచనలు రాకూడదు. అటువంటి సంకల్పాలు కూడా రాకూడదు. అసలు సాంసారిక సంబంధమైన ఆలోచనలే మనసులోకి రానీయకూడదు. 


ఇది అందరూ ఆచరించవలసిన విషయం. బ్రహ్మచర్యం అంటే కేవలం శరీరమే కాదు, మనసులో కూడా అటువంటి ఆలోచనలు

రాకూడదు. మాటలు కూడా అటువంటి మాటలు మాట్లాడకూడదు. అప్పుడే మనసు పరిశుద్ధంగా ఉంటుంది. ఇది బ్రహ్మచర్యమునకు మనం లౌకికంగా చెప్పుకునే అర్ధం.


🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

పాపాలను పోగొట్టే పినాకపాణి...

 #పాపాలను పోగొట్టే పినాకపాణి....


ఈశ్వరుడికున్న నామాల్లో చాలా చిత్రమైనది.. ‘పినాకి’ అనే నామం. 


మనకు తెలిసి ఉన్నంతలో చేతిలో కోదండం పట్టుకున్న శివమూర్తి ఎక్కడా కనిపించడు.. 


శివుడు పట్టుకునే ధనుస్సు సామాన్యమైనది కాదు. ఆయన మేరుపర్వతాన్ని ధనుస్సుగా పట్టుకుంటాడు. 


 #పరమశివుని పినాకము 


మహాశివునికి గల మరో పేరే పినాకపాణి. ఈ పేరుని ఎక్కడో చోట వినే వుంటారు. ఆ ధనస్సే మహాశివుని ఆయుధం, దాని పేరే పినాకము.


పినాకము అను ధనస్సును చేతిలో కలవాడు పినాకపాణి, మహాశివుడు.


శ్రీమహావిష్ణువు చేసే రాక్షస సంహారానికి, శంకరుడు చేసే రాక్షస సంహారానికి చిన్న తేడా ఉంటుంది. విష్ణుమూర్తి రాక్షస సంహారం చేసేటప్పుడు.. 


ఆ రాక్షసుడు ఏ వరాలు కోరుకున్నాడో వాటికి మినహాయింపుగా చంపడానికి వీలైన శరీరాన్ని స్వీకరిస్తాడు. శంకరుడు తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి రాక్షసులను సంహరిస్తాడు. 


వేరొక రూపం తీసుకోడు. అయితే శంకరుడు ధనస్సును పట్టుకున్నట్టు ఎక్కడా చూపించరు గానీ.. వేదం వల్ల శాబ్దికంగా తెలుస్తుంది..


ఎక్కడంటే... యజుర్వేదంలోని ‘శ్రీరుద్రం (రుద్రాద్యాయం)’లో తెలుస్తుంది.


నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః

నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః

యా త ఇషుపశ్శివతమాశివం బభూవ తే ధనుః

శివాశరవ్యాయా తవ త యా నో రుద్ర మృడయ’


`ఓ రుద్రా మా మీద ఏమిటా కోపం? స్వామీ మీరు అంత కోపంగా ఉన్నారేమిటి? మీ కోపానికి ఒక నమస్కారం’ - అని చెబుతూ రుద్రాభిషేకం ప్రారంభిస్తాం.


ఇక్కడ మనం ప్రసన్నుడైన మూర్తికి నమస్కారం చెయ్యడం లేదు. కోపంగా ఉన్న స్వామివారి మూర్తికి నమస్కారం చేస్తున్నారు.


కోపంతో ఉన్నవాడు తన చేతిలో ఉన్న ఆయుధం నుంచి బాణాలను విడిచిపెడతాడు. ఇవి మనల్ని రోదింపజేస్తాయి. మరి ఎందుకు ఆయన అలా ధనుస్సు పట్టుకోవాలి? రుద్రుడు మనం చేసిన తప్పులకు మనను శిక్షించడానికి ధనుస్సును పట్టుకుని ఉన్నాడు. 


ఆయన వంక చూస్తేనే భయంతో వణికిపోతారు. దీన్ని ఈశ్వరుడి ఘోరరూపం అంటారు. అలాంటి రూపంలో ఉన్న ఈశ్వరుడు తన ధనుస్సును ఎక్కుపెడితే మన కంట అశ్రుధారలు తప్పవు. 


ఆయన మనల్ని ఎందుకు బాధపెట్టడం అంటే.. చేసిన పాప ఫలితం బాధపడితేగానీ పోదు కాబట్టి. పాపం పోయేలా ఏడిపించేందుకుగాను ఆయన తన బాణాలను తీస్తున్నాడు.


అప్పుడు మనమేం చేయాలి? ‘నేను పాపం చేశాను. కానీ నన్ను అంత ఏడిపించకు. తట్టుకోలేను. నేను ఏడిస్తే నీ పాదాల యందు విస్మృతి కలుగుతుంది. 


నిష్ఠతో నీ పాదాలను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. కాబట్టి ఈశ్వరా నీ కోపానికి ఒక నమస్కారం. ఈశ్వరా నీ ధనుస్సుకు ఒక నమస్కారం. ఈశ్వరా నీ బాణాలకు ఒక నమస్కారం.


మేమేదో కొద్దిగా పుణ్యం చేసుకున్నాం. నీవు తలుచుకుంటే, నన్ను నీ భక్తుడిని చేసుకుంటే ఎవరూ అడ్డు రారు. నా యందు దయ ఉంచి నన్ను నీ త్రోవలో పెట్టుకో’ అని ప్రార్థిస్తే ఆయన ప్రసన్నుడు అవుతాడు. 


అసలు సనాతన ధర్మంలో.. మనను భయపెట్టడానికి మనం చేసే పాపానికి ఫలితం ఇచ్చేవాడొకడు, భయం తీసేవాడు ఒకడు వేర్వేరుగా ఉండరు. ‘భయకృత్‌ భయనాశనః’.. భయాన్ని సృష్టించేవాడు, తీసేసేవాడు పరమాత్మే. 


ఈశ్వరుని కారుణ్యానికి అంతులేదు. శాస్త్రప్రకారం ఆయన పట్టుకున్న ధనుస్సు మనకు ఎల్లప్పుడూ రక్షణే కల్పిస్తుంది. ఘోరరూపంతో పాపఫలితాన్నిచ్చినా.. అఘోర రూపంతో సుఖాన్నిచ్చినా చేస్తున్నది మన రక్షణే. 


రామాయణంలొ ముఖ్య ఘట్టమైన శివధనుర్భంగం గురించి తెలియని వారు ఎవరూ వుండరు. కానీ శివుని ధనస్సు జనకుని దగ్గరికి ఎలా వచ్చింది? దాని ప్రత్యేకతలు ఏంటో

తెలుసుకుందాము.


దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుందని ప్రశ్నించిన దక్షుని కుమార్తె, పరమశివుడి భార్య అయిన సతీదేవి అవమానానికి గురై యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది.


ఆగ్రహించిన శివుడు రుద్రుడై, యజ్ఞాన్ని తన ధనస్సుతో ధ్వంసం చేసి, అక్కడికి వచ్చిన దేవతలపై కోపోద్రుక్తుడై, మహాశివుడు తన ధనస్సును ఎక్కు పెట్టడంతో వెంటనే దేవతలు శివుని పాదాలను చేరి, శరణు వేడి, ప్రార్థించారు. అంతటితో శివుడు ప్రసన్నుడై ఆ ధనస్సుని వారికి అందజేస్తాడు.


ఆ ధనుస్సుని దేవరాతుడు అనే మిథిలా నగర రాజు దగ్గర న్యాసంగా (అంటే కొంతకాలం ఉంచారు)ఉంచారు. దానినే పినాకము అంటారు.


అప్పుడా రాజు, ధనుస్సుని ఒక మంజూషలో (పెద్ద పెట్టె) పెట్టాడు. ఎనిమిది చక్రాలున్న ఆ మంజూషలొ శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది మనుషులు కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివ ధనుస్సుని రోజూ పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు.


వంశపారంపర్యంగా వస్తున్న ఆ ధనస్సుని జనకుడు, తన కుమార్తె సీతా స్వయంవరంలో ఉపయోగించి, ఉత్తమోత్తముడైన వరుడిని ఎంచుకొనుటకు ఉంచుతాడు.


విశ్వామిత్రునితో వచ్చిన రామలక్ష్మణులలో, రాముడు ఆ శివధనస్సును ఎక్కుపెట్టడమే కాక, శివధనుర్భంగం చేయడంతో సీతను పొందుతాడు.


అలాంటి ఆ ధనుస్సు లోకాలను రక్షించగలిగినది. అందుకే రుద్రం ఆ ధనుస్సును అంత స్తోత్రం చేసింది.