మన దేశంలో మొట్టమొదటిసారిగా మన సంస్కృతికి నిదర్శనంఐన రామాయణ ఘట్టాలను ఒకే ఒక రైలు ప్రయాణంలో చూసే అవకాశం మన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ కల్పిస్తున్నది. ఈ రైలుకి శ్రీ రామాయణ రైలు అని పేరు పెట్టటం విశేషం. ఈ రైలు ఛార్జి రూ. 15,120 రైలు ఈ నవంబర్ 14వ తారీకునుండి నడుస్తుంది. ఈ రైలు ఢిల్లీ లోని స్ఫదరగంజి స్టేషన్ నుండి బయలుదేరి 16 రోజుల ప్రయాణం ముగించుకొని తిరిగి వాపసువస్తుందిముందుగా డిల్లీ నుండి ప్రారంభమై ఆయొధ్య, నందిగ్రాం, జనకపూర్, సీతామర్రి, ప్రయాగ, వారణాసి, చిత్రకూట్, శ్రింగవేరపుర్, నాసిక్, హంపి ల మీదగా రామేశ్వరం చేరుతుంది …. మరలా అక్కడి నుండి భక్తులను, విమానాల ద్వారా శ్రీలంకకు తీసుకువెళతారు. శ్రీలంకలొని సీతమ్మవారు ఉన్న అశొకవనం ప్రదేశాలను, రాయాయణ యుద్ధం జరిగిన ప్రదేశాలను, అత్యంత ప్రసిద్ధి చెందిన మునేశ్వరం దేవాలయం, రంబొడా, చిలావ్ లను చూపించి, తిరిగి విమానంలొ మన దేశానికి తీసుకు వస్థారు.
ఈ పర్యటనమెత్తం, రైల్వే అధికారులే దగ్గరుండి, ప్రయాణికులకు అన్నీ క్షేత్రాలను చూపిస్థారు. రైల్వే స్టేషన్ల నుండి బస్సుల ద్వారా, ఆయా పవిత్ర క్షేత్రాలకు తీసుకువెళ్ళి దైవదర్శనం, చారిత్రాత్మక కట్టడాలను, గురుతులను దగ్గరుండి చూపిస్థారు. అంతేకాకుండా ఈ క్షేత్రాలలొని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలొ రాత్రి పూట బసచేసే అవకాశం కల్పిస్థారు. బుకింగులు మొదలైనాయి. వివరాలకోసం irctc సైటు చుడండి.