21, ఫిబ్రవరి 2024, బుధవారం

Indicators


 

పంచపునీతాలు

 ***


*పంచపునీతాలు*


 వాక్ శుద్ధి

 దేహ శుద్ధి

 భాండ శుద్ధి

 కర్మ శుద్ధి

 మన:శ్శుద్ధి


 *వాక్ శుద్ధి* :


వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి ....


 *దేహ శుద్ధి* :


మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....


 *భాండ శుద్ధి* :


శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది .


 *కర్మ శుద్ధి* :


అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....


 *మన:శ్శుద్ధి* :


మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...


 ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!


ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!


 నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!


 యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!


 సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!


 గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!


 సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!


 పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!


 భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు !!



                ***

Panchang


 

కారణం అవుతాడు.

 శ్లోకం:

*కాలో వా కారణం రాజ్ఞో*

  *రాజా వా కాలకారణం |*

*ఇతి తే సంశయో మా భూత్*

  *రాజా కాలస్య కారణం ||*

  (మహాభారతం-శాంతిపర్వం)


భావం: ఓ యుధిష్ఠిర! కాల మహిమ వల్ల రాజు తయారవుతాడా? లేక రాజు వల్ల కాలం ఏర్పడుతుందా? అనే సంశయం వద్దు. రాజు తన ధర్మపాలనతో లేక అధర్మ పాలనతో) ఆ యా పరిస్థితులకి (కాలానికి) కారణం అవుతాడు.

*యథా రాజా తథా ప్రజా*

బెడ్ నంబర్ 26

 *పిచ్చి శాంపిల్ !!*


మొన్న పనిమీద బయటకు వెళ్లాను ... అలా వెళ్తుంటే పక్కనే పిచ్చాసుపత్రి ఉంది ... ఆ బోర్డ్ ను చూసుకుంటూ వెళ్తుంటే , నా చిన్ననాటి స్నేహితురాలు కనిపించింది . అదేంటి నువ్విక్కడ?  అని అడిగానేను ... నేను ఇక్కడే డాక్టర్ గా పనిచేస్తున్నా ..! అంది తను ... రారా నా చాంబర్ లో కూర్చుని మాట్లాడుకుందాం అని తీసుకెళ్లింది ... కాసేపు కుశల ప్రశ్నలు ‌అయ్యాక .. నేను తనని ఒక ప్రశ్న అడిగాను ...


" నువ్వు , వాళ్లు పిచ్చివాళ్లా కాదా " అని ఎలా కనిపెడతావ్ అని ...


అందుకు తను ... " అదా ..! వాళ్లకు బాత్ టబ్ నిండా నీళ్లు నింపి , వాళ్ల చేతికి స్పూన్ , జగ్ , బకెట్ ఇచ్చి టబ్ ని ఖాళీ చేయమని చెప్తాము ... వారు దేనితో  ఖాళీ చేస్తే .. దానిని బట్టి, వారికి పిచ్చి ఏం రేంజ్ లో ఉందో నిర్ణయిస్తాము‌ .. " అంది తను ...


అంటే.. మామూలు మనుషులు బకెట్ తోనే ఖాళీ చేస్తారు కదా అన్నాన్నేను ...


అందుకామె ... కాదు . మాములు వాళ్లు బాత్ టబ్ కున్న వాల్వ్ తీసి ఖాళీ చేస్తారు ... నువ్వెళ్ళి బెడ్ నంబర్ 25 పై పడుకో నిన్ను టెస్ట్ చెయ్యాలి అంది ...


ఓరినీ! ఎరక్కపోయి‌ వచ్చి ఇరుక్కుపోయాను ... మీరు కూడా బకెట్ అనుకున్నారు కదా ..!

మీరు వచ్చి బెడ్ నంబర్ 26 తీస్కోండి . నాక్కూడా కొంచెం తోడుగా , ధైర్యంగా ఉన్నట్టు ఉంటుంది ... సరేనా ...


😁😳😃😳

పరోపకారముతో శోభిస్తాడే

 *సుభాషితం*

*---------------*

🌺

*శ్రోత్రం శ్రుతనైవ న కుండలేన*

   *దానేన పాణిర్న తు కంకణేన ౹*

     *విభాతి కాయః కరుణాపరాణాం*  

     *పరోపకారైర్న తు చందనేన ౹౹*

🌺


 *భావం :  శాస్త్ర శ్రవణముతో చెవులు శోభించును. చేతులు కంకణముతో కాదు, దానం చెయ్యడం వల్ల శోభించును. దయ కలవాడు పరోపకారముతో శోభిస్తాడే కానీ శ్రీచందనం పూసుకోవడము వల్లకాదు.*

🌺✍🏽

Veda aaseervachan

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం -‌ ద్వాదశి - పునర్వసు -‌ సౌమ్య వాసరే* (21.02.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మహానుభావులు

 బాగా ఆకలి వేస్తోంది. అప్పటికే మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యింది. ఇప్పట్లో సాపాటుకి ఏర్పాటు ఎక్కడా కనపడటం లేదు. సోఫాలో కూర్చున్నాను... ఇంతలో ఒక బొద్దుగా ఉన్న అబ్బాయి వచ్చాడు... "మా ఊర్లో కూడా ఇంతే తెలుసా నీకు, నన్ను ఎప్పటికీ ఎవరూ భోజనానికి పిలవరు. అసలు నేనొక్కడినే చాలు నందికేశుడి నోము పూర్తి చెయ్యడానికి. నువ్వూ నా బాపతేనా?" అని నాతో అన్నాడు. ఆ అబ్బాయి వెనకాలే చిలకమర్తి వారు వచ్చి, "ఒరేయ్ గణపతీ... ఇలా అందరి దగ్గరకూ వచ్చేసి నీ గోడు చెప్పుకోకురా" అని అన్నారు. ఆయన్ని చూస్తూ అలానే ఉండిపోయా.


ఇంతలో, "ఆకలిగా ఉందా? ఇదిగో, నీ కోసం బోలెడు తినుబండారాలు తెచ్చాను, ఇవి చూడు లడ్లు, జిలేబీలు..." అని, కాస్త నీలినయనాలతో ఉన్న ఒక అందమైన అమ్మాయి ఒక పళ్ళెం పట్టుకొచ్చింది. అవి తిందామనుకునే లోపల, "అవి తినొద్దు... ఈ అమ్మాయి విషబాల, ఆమె తాకి ఇచ్చినవన్నీ విషపదార్థాలే" అని మరో అమ్మాయి చెప్పింది. ఇద్దరి వైపూ అలా చూస్తూ తినాలా వద్దా అనుకుంటుండగా... అడవి బాపిరాజు గారు వచ్చి, "హిమబిందూ... ఈ విషబాల ఇప్పుడు చంద్రబాల అయిపోయింది, ఇప్పుడు తన శరీరంలో విషం లేదు" అని అన్నారు.


సరే, ఆ చంద్రబాల తెచ్చినవి తిందామనుకునే లోపల, "ఆగు శ్యామా ఆగు!" అని వినిపించింది. ఎంత రంగు తక్కువైతే మాత్రం నన్ను 'శ్యామా' అని అంటాడా? అన్నది 'ఎవరా?' అని వెనక్కి తిరిగా, ఆరడుగుల పొడుగు పెద్ద శరీరంతో ఎస్.వి. రంగారావు లా ఉన్న వ్యక్తి.. అతను భూతనాథుడు... "ఆ పదార్థాలు మాయారాణి పంపినవేమో అని అనుమానంగా ఉంది" అని అన్నాడు. ఇంతలో కమిలినిని వెంటబెట్టుకొని భోలానాథ్... "మాయారాణి గోపాలసింహుడి చేతిలో చనిపోయిందిగా, ఇప్పుడు ఏ భయం లేదు" అని తన "మాయామయి" రహస్యాన్ని చెప్పాడు బొందలపాటి శివరామకృష్ణ, శకుంతలాదేవితో కలిసి.


"మా గిరిక నాట్యం చూడటానికి రండి, వచ్చేవారం. భోజనాలు కూడా మా ఇంట్లోనే" అని ధర్మారావు వచ్చి చెప్పాడు. వెనకాల పెద్దాయన విశ్వనాథ వారు కూడా వచ్చారు... "అవును కొత్తావకాయలో మెరపకాయ ఆ పక్కన వెన్న ఉంటే ఇంక ఏ విందు భోజనం పని చేయదు" అంటూ. ఆవకాయ అనగానే ఆకలి ఎక్కువయ్యింది.


"మనము ప్రతిరోజూ భోజనంతో పాటు జంతికలు, చక్కిలాలు, పప్పుచెక్కలు, చిలగడదుంపలు తినాలి" అంటూ ఓ బొద్దుగా ఉన్న పిల్ల... అదే మన పొత్తూరి గారు వచ్చి చెప్పసాగారు. "నీకు తెలుసా, మా పూర్వికి మళ్ళీ పెళ్ళి చేద్దామనుకుంటున్నాము... నువ్వు రా, నీకు సున్నుండలు, బెల్లం మిఠాయి కూడా ఇస్తాను" అని చెప్పింది. ఇంతలో ఒక పెద్దావిడ... "నిన్ను స్కూల్ కి వెళ్ళమంటే ఇలా వచ్చావా?" అంటూ ఆ బొద్దు పిల్ల చెయ్యి పట్టుకున్నారు పెద్ద పొత్తూరి విజయలక్ష్మి గారు.


"మరి పెళ్ళికి లొట్టిపిట్టలు ఉంటాయా, భోజనాలకేం వండిస్తున్నారు?" అంటూ జడగంటలు తిప్పుకుంటూ వచ్చింది మధురవాణి. "కన్యాశుల్కమైనా, వరవిక్రయం అయినా నష్టపోయేది ఆడపిల్లలే" అని బాధపడ్డారు ఆవిడ వెనకాల ఉన్న గురజాడ.


"ఇదిగో ఈ పకోడి పొట్లం పట్టుకోవే... తినకు... నేనెల్లి లాచసుడి దగ్గర పదమూడో ఎక్కం చెప్పేసి వాడి నడ్డి మీద చంపేసి సీగానను తీసుకొచ్చేస్తా" అంటూ బుడుగు వచ్చాడు. వాడిచ్చిన పకోడి పొట్లం చూసి ఒకటి నోట్లో వేసుకుందామనుకునే లోపల, "వీడితో ఇదే కష్టం... ఒక్క చోట ఉండడు... కోతికొమ్మచ్చి ఆడేస్తాడు నీలాగా" అంటూ బుడుగుని వెతుకుంటూ బాపు, రవణలు.


"రోజూ ఇష్టంగా అష్టపదుల్లాంటి నా పాటాలు వింటావుగా, ఏ ఒక్కసారీ పొగడదండలతో పొగడాలనుకోవా? తీపి కోవాలాంటి పాటలు వినడమే కానీ సాహిత్యాన్ని, నన్ను పొగడాలను 'కోవా?' " అంటూ స్వీటూరి వేటూరిగారు కొమ్మకొమ్మకో సన్నాయిలాంటి పాటలందించి పాడమన్నారు.


"నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు" అని పెద్దాయన దేవరకొండ గట్టిగా అన్నాడు. "అంటే 'ప్రేమ' లో మా వేద సంహిత అంత అందమైన ఆడపిల్ల అన్న మాట" అని యండమూరి అన్నారు.


"నీకు ఆకలి ఎక్కువైతే పైత్యం ప్రకోపిస్తుంది... ఇదిగో ఈ ఉప్మా తిను" అంటూ అమ్మ నిద్ర లేపింది.

ఇంకొంచం సేపు ఆ నిద్రలో ఉంటే ఇంకెంత మంది మహానుభావులు కనపడేవారో!


(ఇంత రుచికరమైన పుస్తకాల విందు ఉండగా మరేది రుచించదు కదా.).


మిత్రులందరికి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.

తెలుగులో వ్రాస్తున్నవారికి, తెలుగులో పాడుతున్నవారికి, తెలుగులో పోట్లాడుకుంటున్నవారందరికీ ప్రణామాలు.🙏🙏🙏

Tirumala


 

Aadramam


 

సంకల్పము

 *శుభోదయం*

16.2291923113

Xxxxxx

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.21.02.2024 బుధ వారం (సౌమ్య వాసరే) 

 Xxxxx

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే శుక్ల పక్షే ద్వాదశ్యాం. (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

సౌమ్య వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే*

శిశిర ఋతౌ 

మాఘ మాసే 

శుక్ల పక్షే ద్వాదశ్యౌపరి త్రయోదశ్యాం

సౌమ్య వాసరే అని చెప్పుకోవాలి.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.28

సూ.అ.5.59

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం* 

*ఉత్తరాయణ పుణ్యకాలం*

*శిశిర ఋతువు*

*మాఘ మాసం* 

*శుక్ల పక్షం ద్వాదశి ప.12.39 వరకు*. 

*బుధ వారం*. 

*నక్షత్రం పునర్వసు*

మ.3.34 వరకు. 

అమృతం మ. 1.02 ల 2.43 వరకు. 

దుర్ముహూర్తం ప. 11.51 ల 12.37 వరకు. 

వర్జ్యం రా. 12.08 ల 1.51 వరకు. 

యోగం ఆయుష్మాన్ మ.1.20 వరకు.  

కరణం బాలవ ప.12.39 వరకు.  

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ.12.00 ల 1.30 వరకు. 

గుళిక కాలం ఉ. 10.30;ల 12.00 వరకు. 

యమగండ కాలం ఉ.7.30;ల 9.00 వరకు. 

***************

పుణ్యతిధి మాఘ శుధ్ధ త్రయోదశి. 

*****************

గమనిక* :౼

మా సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏

విశ్వనాధ్

 నిన్నటి రోజున కళాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్ గారి పుట్టినరోజు సందర్బంగా వారికి జయంతి శుభాకాంక్షలు 💐💐💐💐🌹



విశ్వనాథ్ చిత్రాల్లో సహజమైన హాస్యం కథలో కలిసిపోయి మనకు గిలిగింతలు పెడుతుంది. ఎంత సమర్ధులైన సంభాషణా రచయితలున్నా దర్శకుడికి ఆ యావ ఉంటేతప్ప హాస్యం పండదు.


ఊరికే గొప్పలు పోతూ శంకరశాస్త్రి స్నేహితుడిగా అజమాయిషీ చెలాయించే మాధవ ‘ఏం, వాడంటే నాకు భయమా? రానీ చెప్తాను. చెడామడా కడిగేస్తా వాణ్ణి!' అంటూ వీరంగమెత్తేసి ఆనక బయట గుఱ్ఱబ్బగ్గీ ఆగగానే ఆ చప్పుడుకే వణికిపోతాడు. 


ఇప్పుడొచ్చే బిల్డప్ సీన్లన్నింటికీ ఇది బాప్. చూడటానికి ఏమంత హడావుడిగా ఉండదు. మనిళ్ళలోనూ ఉంటారు ఇటువంటి మనుషులు. అచ్చం అలాంటివాడే అల్లురామలింగయ్య ఈ సినిమాలో.


ఇక సప్తపదిలో క్షత్రియుడైన అల్లు రామలింగయ్య చెరువులో స్నానం చేస్తూ సోమయాజులుకి ‘మీరు యాజులూ, మేం రాజులూనూ మరి! అంచేతా ఈసారికిలా కానిచ్చెయ్యండి మరి!’ అంటూ హితబోధ చేస్తాడు. సోమయాజులు మౌనాన్ని చూస్తే మనందరికీ ఒకరకమైన భయం ఉంటుంది. అటువంటి మనిషిని అంత సరళంగా వారించగల, నియంత్రించగల వ్యక్తిగా అల్లుని భలే వాడుకున్నారు విశ్వనాథ్.


ఇక సాగరసంగమంలో డాక్టర్ తంబుగారబ్బాయి చక్రి తోలేటి తీసిన ఫొటోలు, పెట్టించిన భంగిమలూ, ఆ సన్నివేశంలో సంభాషణలూ ఇప్పటికీ తెలుగిళ్ళలో మారుమోగుతున్నాయి. ఎవడైనా సరిగ్గా ఫొటోలు తియ్యకపోతే ‘ఏంట్రా ఈ సాగరసంగమం ఫొటోలు?’ అనో, ‘భంగిమా...’ అనో అరుస్తూ నవ్వుకోవడం పరిపాటి.


స్వాతిముత్యంలో అతిథిగా నటించిన సోమయాజుల్ని ఉద్యోగం కోసం వెంటాడే కమలహాసన్ పిచ్చిపిచ్చిగా నవ్విస్తాడు. అలా వెంటాడేవాళ్లను ఇప్పటికీ అలానే పిలుస్తున్నారు... స్వాతిముత్యంలో కమలహాసన్‌లా తగులుకున్నావేంట్రా బాబూ?' అని.


‘అసలే విశాఖపట్నం, స్టీలుముక్కలతో కొడతారేమో జనం?'


‘అయ్యా, కూర్చోండయ్యా! కాఫీ తాగుతారాండయ్యా? అవునండయ్యా, అమ్మగారు లేరండయ్యా! బయటికెళ్ళారండయ్యా!' 


సహజనటుడు పొట్టి ప్రసాద్ గారి ఈ మేనరిజమ్స్ కూడా మనల్ని కాసేపు హాయిగా నవ్విస్తాయి.


స్వాతికిరణంలో అనంత్ అయితే ఒక వెరైటీ డిక్షన్‌తో పిచ్చెక్కిస్తాడు. 


‘అక్కయ్యా, బావగారు....... ఎక్కి వస్తున్నారు!' అంటూ మధ్యలో ముఖ్యమైన మాటల్ని మింగేసే మనుషుల్ని మనచుట్టూ అప్పుడప్పుడు చూస్తుంటాం. 


వరండాలో కూర్చుని బీరకాయలు తరుగుతూ అనంతుని పిలిచి, చిన్న ముక్క చేతిలో వేసి ‘చేదు చూడు!' అనే సహజత్వం ఆయనలోని నికార్సైన తెలుగుదనం.


పూజగదిలో వైజాగ్ ప్రసాద్ దేవుడికి హారతిస్తూంటాడు. బయట అరుగుమీద నలుగురూ కూర్చుని మాట్లాడుకుంటుంటే మాటిమాటికీ లోపలినుంచి గంట వినబడుతుఊ ఉంటుంది. అది వినబడ్డ ప్రతిసారీ మాటలాపి అటుతిరిగి హారతి కళ్ళకద్దుకుంటారందరూ. ఆ సున్నితమైన హాస్యం విపరీతంగా నవ్వు తెప్పించదుగానీ ఆ సరళత్వానికి ముచ్చటేస్తుంది.


ఇక అచ్యుత్‌ భార్యగా నటించిన పిల్లచేత గాయట్రీ వషంటం, టేగరాజ్ కీర్తనలు అనిపించడం ఓ చురకలాంటి చమక్కు.


స్వర్ణకమలం చిత్రానికి భానుప్రియ నటనా, నాట్యం రెండూ ప్రాణం పోశాయని అనుకోవచ్చు. 


‘అర్ధం చేసుకోరూ...' అనేమాట ఇప్పటికీ మన లేడీసంతా సాగదీస్తూ పలుకుతూనే ఉన్నారు.


అందులోనే భానుప్రియ చేత బలవంతంగా నాట్యప్రదర్శనకు ఒప్పిస్తాడు వెంకటేష్. ఆ కార్యక్రమంలో ముందువరసలో కూర్చున్న విన్నకోట విజయరామ్‌ని ఎవరో అడుగుతారు పిల్లాణ్ణి తీసుకురాలేదేమని... ‘విరేచనాలకి మందేశాం. హడావిడవుతుందేమోననీ తీసుకురాలేదు!’ అంటాడు. ఆమాటకి, అతగాడి హావభావాలకీ జోహార్లు.


ఆపద్బాంధవుడు చిత్రంలో పశువుల భాషను డీకోడ్ చేసే సన్నివేశంలో చిరంజీవి నటన చాలా చాలా నవ్విస్తుంది. 


కేవలం సంగీతసాహిత్యాలనే కాకుండా సున్నితమైన హాస్యాన్ని, అదీ మనకందుబాటులో ఉండే సరళమైన సన్నివేశాలతో పండించిన కాశీనాథుని విశ్వనాథ్ చిరస్మరణీయులు!


నివాళులు!


......కొచ్చెర్లకోట జగదీశ్

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం  -‌ ద్వాదశి - పునర్వసు -‌ సౌమ్య వాసరే* *(21-02-2024)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏