1, ఏప్రిల్ 2022, శుక్రవారం

ఉగాది

 *ఉగాది*

( - 02-04-2022 *శుభకృత్ నామ సంవత్సర* ఉగాది సందర్భంగా.....)

🍃🌿🍃🎋🌿🍃🎋🌿🍃🎋🌿🍃


*ఉగస్య ఆది ఉగాదిః*


🎋 *"ఉగ"* అనగా నక్షత్ర గమనం. *నక్షత్ర గమనానికి 'ఆది' 'ఉగాది',  అంటే సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది".* 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము• ఉత్తరాయణ, దక్షిణాయనములు అనబడే *"ఆయన ద్వయ సంయుతం యుగం"* (సంవత్సరం) కాగా,  ఆ యుగానికి ఆది (సంవత్సరాది) *యుగాది* అయింది• యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది•


🎋 *తత్ర చైత్ర శుక్ల ప్రతిపది సంవత్సరారంభః:* 🎋


🎋 *చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది' గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు•*


🎋 *ఉగాది పుట్టుపూర్వోత్తరాలు* 🎋


🎋 వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి•


🎋 చైత్రశుక్ల పాడ్యమి నాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను• కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది•


🎋 శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం•


🎋 *ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'•*


🎋 *"ఉగాది" ఆచరణ విధానం* 🎋


🎋 ఉగాది పర్వాచరణ విధానాన్ని 'ధర్మసింధు' కారులు *'పంచవిధుల సమన్వితం'* గా ఇలా సూచించియున్నారు•


*తైలాభ్యంగం సంకల్పాదవు నూతన వత్సర నామకీర్త నాద్యారంభం...*

*ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం...*


✅ *ఉగాది రోజున:*


👉 *తైలాభ్యంగనం* 

👉 *నూతన సంవత్సరాది స్తోత్రం* 

👉 *నింబకుసుమ భక్షణం* (ఉగాది పచ్చడి సేవనం)

👉 *ధ్వజారోహణం* (పూర్ణకుంభదానం)

👉 *పంచాంగ శ్రవణం* 


మున్నగు *'పంచకృత్య నిర్వహణ'* గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం•


🎋 *(1) తైలాభ్యంగనం:* 


🎋 *తైలాభ్యంగనం* అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి• ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి• కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసినట్లైతే లక్ష్మి, గంగా మాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు•


*"అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం"*


(అభ్యంగన స్నానం అన్ని అవయవాలకూ పుష్టిదాయకం) అనే ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా• ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికి ఈబరీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది•


🎋  *(2) నూతన సంవత్సర స్తోత్రం* 🎋


🎋 అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి, పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది రసాయనాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను•


🎋  *(3) నింబకుసుమ భక్షణం* *(ఉగాడి పచ్చడి సేవనం* 


🎋 ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది•


🎋 వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!


*అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌*

*భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌*


అని ధర్మ సింధుగ్రంధం చెబుతున్నది•


🎋 ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం• పలురుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! 


👌 *"తీపి వెనుక చేదు, పులుపూ ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు"•*  అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి•


🎋 అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం•


🎋  *(4) పూర్ణ కుంభదానం:* 


ఉగాది నాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజారోహణం• ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది•


*ఏష ధర్మఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మకః*

*అస్య ప్రదవాత్సకలం మమః సంతు మనోరధాః*


🎋 యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం ఉంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానం ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి•


🎋  *(5) పంచాంగ శ్రవణం* 


*"తిధిర్వారంచనక్షత్రం యోగః కరణమేవచ పంచాంగమ్‌"*


తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం•


🎋 ఉగాది నాడు దేవాలయంలో గాని, గ్రామకూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది•


*"పంచాంగస్య ఫలం శృణ్వన్‌ గంగాస్నానఫలం ఖిలేత్"*


🎋 ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది•


*"సూర్యశ్శౌర్య మధేందురింద్రపదవీం"* 


🎋 అనే పంచాంగ శ్రవణ ఫలశృతి శ్లోకం ప్రకారం,  *ఉగాది నాడు పంచాంగశ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది•*


           ✡️ >>><♾🔘♾><<<🔯


 *శ్లో.* 


*శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ*

*సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం*


ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి•


🎋 'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు• ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయమును "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.


🎋 లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి• జీవునకు చైతన్యం కలిగించేది కాలం• ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి•


*తృట్యైనమః, నిమేషాయనమః, కాలాయనమః* 


🎋‌ అంటూ ప్రకృతిని, ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము• ఉగాదినాటి పంచాంగం పూజ, పంచాంగం శ్రవణం కాలస్వరూప నామార్చనకు ప్రతీకం• పంచాంగ పూజ, దేవి పూజ సదృశమైంది• అంతం, ముసలితనం, మరణం లేనిది కాలస్వరూపం• అదే దేవిస్వరూపం• అందుకే పంచాంగం పూజ, పంచాంగ శ్రవణం, దేవిపూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది• విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం చైత్రశుద్ధపాడ్యమి. ఆనాడే విక్రమార్క శకం ప్రారంభమైంది•


🎋 శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి, యుద్ధంలో కలిగిన కష్టనష్టాలు చేదుకు, శత్రువులను తమలో ఒకరుగా కలుపుకోవడంలో వచ్చిన మంచి చెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు• ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం•


🎋 ఈ పండగ ప్రత్యేకత 'ఉగాది పచ్చడి'. ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది• బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి ముక్కలు, కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు• తీపి, ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం అనే షడ్రుచుల సమ్మేళనంగా జీవితంలో కష్టసుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు• ఆరోగ్యానికి ఇది మంచిది• అంతేకాకుండా అంతర్గతంగా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది•


🎋 మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం•


🎋 ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి•


🎋 పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు•


🎋 మనకు తెలుగు సంవత్సరాలు *'ప్రభవ'* తో మొదలుపెట్టి *'అక్షయ'* నామ సంవత్సరము వరకు గల 60 సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి *'షష్టిపూర్తి'* ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.


🕉️ *పంచాంగ శ్రవణం* 🕉️


🎋 నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌ క్యాలెండరు" ను ఉపయోగిస్తూ వున్నా... శుభకార్యాలు, పూజాపునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి

"పంచాంగము" ను ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం• ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది• అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి• అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి• ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము• కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి• ఇలా పూర్వం లభించేవికాదు• తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి• కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు•


🎋 ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం•


🎋 *"పంచాంగం"* అంటే అయిదు అంగములు అని అర్ధం. *తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం* అనేవి ఆ అయిదు అంగాలు. పాడ్యమి మొదలుకొని 15 తిధులు, 7వారాలు, అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు, విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగములు, బవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం".


🎋 పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం• పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు• అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు• సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవనాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.




🍃🍃🌿🌿🎋🎋🌿🌿🍃🍃🌿🎋

దేవాలయాల కమిటీల నిర్ణయంతో

 హిజాబ్ కోసం వాళ్ళు చేసిన రబస వాళ్ళ జిహా.దీల మెడకే ఉచ్చులా మారింది...

ఉడిపిలోని హిందూ దేవాలయాల దగ్గర వార్షిక జాతరల వద్ద ముస్లింస్  వ్యాపారం చేయరాదని దేవాలయాల కమిటీల నిర్ణయంతో ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన ముస్లిం వ్యాపారులు మార్చి 30 బుధవారం పెజావర్ మఠంలోని శ్రీరామ విట్టల సభావనంలో పెజావర్ మఠం అధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని కలుసుకుని తమను దేవాలయాల వద్ద జరిగే జాతరలలో గతంలో లాగానే హిందూ జాతరలలో ఆలయాల దగ్గర వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతించాలని స్వామీజీని వేడుకున్నారు..

దీనిపై స్పందించిన పరమపూజ్య శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ సమాజంలో శాంతియుత జీవనానికి  అనుకూలమైన వాతావరణం ఉండాలంటే శాంతి మరియు సామరస్య సహజీవనం చాలా అవసరమని చెప్తూ.. ఈ శాంతి బాధ్యత కేవలం ఒక సమాజానికి భారం కాదని అలాగే  కేవలం ఒక సమాజం వల్ల శాంతిని సాధించలేమని అన్నారు..

హిందువులమైన మేము  చాలా కాలంగా బాధను, వేదననూ అనుభవించాము ఇంకా అనుభవిస్తున్నాము కూడా..

అనేక చేదు అనుభవాల కారణంగా హిందూ సమాజం వేదనలో కూరుకుపోతోంది..

ఇంత గంభీరమైన విషయాన్ని  కొంతమంది మత పెద్దల మధ్య పరస్పర చర్చలతో ఈ సమస్యను పరిష్కరించలేము.. 

అట్టడుగు స్థాయిలో శాశ్వత పరిష్కారం కనుగొనాలి.. 

ఒక మత సమూహం నిరంతరం అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు దానిలో  నిరాశ మరియు కోపం కట్టలు తెంచుకుంటుంది..తీవ్రమైన ఆవేదన చెందిన హిందూ సమాజం మీ యొక్క అన్యాయాలతో విసిగిపోయింది.. 

మనం వేదికపై కూర్చుని ఈ పరిస్థితికి కారణాలను చర్చించాలి.

హిందూ సమాజం నిరంతరం మతపరమైన వివక్ష మరియు హింసకు గురికాకుంటే మళ్లీ సామరస్యం నెలకొంటుందని ఆశ ఉంది..

మీవారు చేసిన ఒక దారుణాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను..

ఒక హిందూ వితంతువు పశువుల కొట్టంలోని ఆవులన్నీ దొంగిలించబడ్డాయి..చంపివేయబడ్డాయి ..ఆమె జీవనోపాధి ఛిన్నాభిన్నమైంది దానివలన ఆవిడ ఉపాధి కోల్పోయి వీధుల్లోకి నెట్టబడింది..అంతేకాదు ఆవిడ తాను పైకి చెప్పుకోలేని అవమానానికి గురైంది దీనికి కారణం మీ వర్గమే.. 

ఇటువంటి మరియు మరెన్నో క్రూరమైన సంఘటనలు హిందువులలో చాలా బాధను కలిగించాయి.. ఇటువంటి పరిస్తితిలో కేవలం మాటలు రూపంలో పైకి నటిస్తూ చెప్పే  శాంతి సహజీవనం మాటలతో ' శాంతిని సాధించలేము అలాగే సహజీవనం ' కూడా  సాధ్యం కాదు..

మీరు మనఃస్పూర్తిగా నోటితో చెప్పేది చేతలలో చూపిస్తే  మూడవ వ్యక్తి మధ్యవర్తిత్వం అవసరం లేదు..

మీరు చేసిన హిజాబ్ పోరాటం ఫలితంగా మాత్రమే ముస్లిం వ్యాపారుల ఆర్థిక బహిష్కరణ జరిగిందని భావించకండి..

హిందూ సమాజం పరమపావన స్థానాలుగా భావించే మఠాలు..దేవాలయాల దగ్గర మీరు హిజాబ్ కు అనుకూలంగా మీరు చేసే వ్యాపారాలు మూసివేశారు..దీనివలన హిందూ సమాజం మరింతగా కోపోద్రిక్తురాలయింది..దీనివలన మీకు జరిగిన నష్టంతో పోలిస్తే హిందూ సమాజం ఎదుర్కొన్న ఇబ్బందులే ఎక్కువ..

ఒక ధర్మనిష్ట కలిగిన హిందూ కార్యకర్తను కూడా హిందూ సమాజం కోల్పోయింది..

నిజానికి నేను మీకు ఇచ్చే సలహా!! మీరు ఏదైతే సమస్యను ఎదుర్కుంటున్నాము అని భావిస్తున్నారో ఆ సమస్య యొక్క మూల కారణాన్ని పరిష్కరించాలని నేను భావిస్తున్నాను..

మీ సమాజం తప్పు చేసిన వారిని ముందు శిక్షించనివ్వండి..అలాగే మీరు  ఇతరులకు చేసిన తప్పులను పరిష్కరించండి..మీవారిలో తప్పు చేసిన సభ్యులపై నిరసన తెలియజేయండి..వాళ్ళను ఈసారి ఇదే తప్పు చేయకుండా ఆపండి..

ఒకరు చేసే తప్పుడు పనులు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి..తప్పులు చేసేవారిని మీ సమాజం అడ్డుకొని ఉంటే హిందూ సమాజానికి ఇంత బాధ ఉండదు..కనుక ముందుగా మీరు మీ సమాజంలో ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దుకొని సమస్యను పరిష్కరించుకొండని స్వామీజీ వాళ్ళకు మృధువుగానే కఠినంగా తెలియచేసారు..

వాహ్!! ఇలాంటి హిందూ స్వామీజీలు కదా మనకు కావాలి..

స్వామీజీ తీసుకున్న తన దృఢమైన స్టాండ్ కోసం వారికి పాదాభివందనం..

ఇదే కేరళలోనో..ఆంధ్రాలోనో..తెలంగాణలోనో..తమిళనాడులోనో  జరిగి ఉంటే, హిందువులుగా మరియు జాతీయవాదులుగా చెప్పుకునే కొందరు మూర్ఖులు వెంటనే జిహా.దీలను కౌగిలించుకొని...వాస్తవానికి వాళ్ళు బాగున్నారు... అది వాళ్ళ మతం..వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించుకుంటే తప్పేంటి అని మిగిలిన హిందువులందరినీ హోల్ సేల్ గా పిచ్చోల్లని చేవారు..

ఈ యుద్ధంలో ఎలా పోరాడాలో తెలిసిన స్వామీజీ లు ఉన్నారని కన్నడిగులు నిరూపించారు..

కన్నడ సోదరులకూ పరమపూజ్య స్వామీజీ శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్ధుల వారికి సాష్టాంగ ప్రణామం...🙏🙏🙏🙏..

సరదాకందం

 సరదాకందం


చీమకు లిప్స్టిక్ రాయుట,

దోమకు ఇంజక్షనిడుట, తొడపయినేన్గున్

ప్రేమ నిడుకొనుట, సతికౌ

రా! మది నచ్చంగ జెప్పుటవికష్టములౌ ||

వృద్ధులూ

 🕉️ *సుభాషితమ్* 🕉️


శ్లో.

*వయోవృద్ధాస్తపోవృద్ధాః*

*జ్ఞానవృద్ధా బహుశ్రుతాః।*

*ఇత్యేతే ధనవృద్ధస్య*

*ద్వారే తిష్ఠన్తి కిఙ్కరాః॥*

                --- సూక్తిసుధానిధిః


తా.

*వయస్సుచేత* వృద్ధులూ, *తపస్సుచేత* వృద్ధులు, బాగా *చదువు కొని జ్ఞానంచేత వృద్ధులైనవారు*, ఇలాంటి వారందరూ కూడ *ధనంచేత వృద్ధుడైన వాని ద్వారం దగ్గర కింకరులై పడి ఉంటారు*....[ఉండవలసి వస్తుంది] 

              ( *ధనమూలమిదంజగత్* )

దేవీ నవరత్నమాలికా స్తోత్రం

 దేవీ నవరత్నమాలికా స్తోత్రం


⚜️⚜️⚜️⚜️⚜️



హారనూపురకిరీటకుండలవిభూషితావయవశోభినీం

కారణేశవరమౌలికోటిపరికల్ప్యమానపదపీఠికామ్ |

కాలకాలఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాం

ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతామ్ || ౧ ||


గంధసారఘనసారచారునవనాగవల్లిరసవాసినీం

సాంధ్యరాగమధురాధరాభరణసుందరాననశుచిస్మితామ్ |

మంధరాయతవిలోచనామమలబాలచంద్రకృతశేఖరీం

ఇందిరారమణసోదరీం మనసి భావయామి పరదేవతామ్ || ౨ ||


స్మేరచారుముఖమండలాం విమలగండలంబిమణిమండలాం

హారదామపరిశోభమానకుచభారభీరుతనుమధ్యమామ్ |

వీరగర్వహరనూపురాం వివిధకారణేశవరపీఠికాం

మారవైరిసహచారిణీం మనసి భావయామి పరదేవతామ్ || ౩ ||


భూరిభారధరకుండలీంద్రమణిబద్ధభూవలయపీఠికాం

వారిరాశిమణిమేఖలావలయవహ్నిమండలశరీరిణీమ్ |

వారిసారవహకుండలాం గగనశేఖరీం చ పరమాత్మికాం

చారుచంద్రవిలోచనాం మనసి భావయామి పరదేవతామ్ || ౪ ||


కుండలత్రివిధకోణమండలవిహారషడ్దలసముల్లస-

త్పుండరీకముఖభేదినీం చ ప్రచండభానుభాసముజ్జ్వలామ్ |

మండలేందుపరివాహితామృతతరంగిణీమరుణరూపిణీం

మండలాంతమణిదీపికాం మనసి భావయామి పరదేవతామ్ || ౫ ||


వారణాననమయూరవాహముఖదాహవారణపయోధరాం

చారణాదిసురసుందరీచికురశేకరీకృతపదాంబుజామ్ |

కారణాధిపతిపంచకప్రకృతికారణప్రథమమాతృకాం

వారణాంతముఖపారణాం మనసి భావయామి పరదేవతామ్ || ౬ ||


పద్మకాంతిపదపాణిపల్లవపయోధరాననసరోరుహాం

పద్మరాగమణిమేఖలావలయనీవిశోభితనితంబినీమ్ |

పద్మసంభవసదాశివాంతమయపంచరత్నపదపీఠికాం

పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతామ్ || ౭ ||


ఆగమప్రణవపీఠికామమలవర్ణమంగళశరీరిణీం

ఆగమావయవశోభినీమఖిలవేదసారకృతశేఖరీమ్ |

మూలమంత్రముఖమండలాం ముదితనాదబిందునవయౌవనాం

మాతృకాం త్రిపురసుందరీం మనసి భావయామి పరదేవతామ్ || ౮ ||


కాలికాతిమిరకుంతలాంతఘనభృంగమంగళవిరాజినీం

చూలికాశిఖరమాలికావలయమల్లికాసురభిసౌరభామ్ |

వాలికామధురగండమండలమనోహరాననసరోరుహాం

కాలికామఖిలనాయికాం మనసి భావయామి పరదేవతామ్ || ౯ ||


నిత్యమేవ నియమేన జల్పతాం – భుక్తిముక్తిఫలదామభీష్టదామ్ |

శంకరేణ రచితాం సదా జపేన్నామరత్ననవరత్నమాలికామ్ || ౧౦ ||


⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ఉగాది ప్రసాదస్వీకరణ*

 *ఉగాది ప్రసాదస్వీకరణ*

🎋🥥🍌🍃🌿🌱🥭🌴🍂🥥🍌🎋


*పూజానంతరం భగవంతునికి నివేదించిన ఉగాది పచ్చడిని ఈ క్రింది మంత్రం శ్లోకముతో స్వీకరించాలి.*


*త్వామశోక నరాభీష్ట మధుమాస సముద్భవ*

*సించామి శోక సంతప్తం మమశోకం వ్యపాకురు*


*శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ*

*సర్వారిష్టవినాశాయ నింబకుసుమ భక్షణం*


🎋🥥🍌🍃🌿🌱🥭🌴🍂🥥🍌🎋

కోరలు విరిగిన పాము

 🌹🌹 *సుభాషితమ్* 🌹🌹

--------------------------------------------


శ్లోకం:

*దంష్ట్రా విరహితః సర్పో*

*మదహాహీనో యథా గజః।*

*తథాఽర్థేన విహీనోఽత్ర*

*పురుషో నామధారకః॥*

                ~సుభాషితరత్నావళి


తాత్పర్యం:

ఈ ప్రపంచంలో కోరలు విరిగిన పాము, మదం పోయిన ఏనుగు, 

ఎలా నామమాత్రానికే అగునో, అలాగే ధనం పోగొట్టుకున్న పురుషుడూ నామమాత్రానికే అగును.

ఆదికావ్యం

 శ్లోకం:☝️

    *జ్వలతి చలితేన్ధనోఽగ్నిః*

*విప్రకృతః పన్నగః ఫణం కురుతే l*

    *ప్రాయః స్వం మహిమానం*

*క్షోభాత్ ప్రతిపద్యతే హి జనః ll*


భావం: చితుకులు కదిలిస్తే అగ్ని మరింతగా జ్వలిస్తుంది. అపకారం చేయబోతే పాము పడగ విప్పుతుంది. మనిషి కూడ క్షోభ కలిగినప్పుడే తన శక్తి సామర్ధ్యాలు ప్రదర్శిస్తాడు. మనిషిలో అంతర్గతమై ఉన్న శక్తులు అయా ప్రత్యేక పరిస్థితులు కలిగినప్పుడు వెలుగుచూస్తాయి. వ్యథలో నుండే కథలు ఉద్భవిస్తాయి. వాల్మీకి శోకమే శ్లోకమై ఆదికావ్యం అయ్యింది కదా!🙏

ఎక్కడుందో రహస్యం.*

 🤔  *ఎక్కడుందో రహస్యం.*.🙄


చిన్నప్పుడు

ఏ పండక్కో..పబ్బానికో

 Dress కుట్టిస్తే..

ఎంత ఆనందమో...👗👕


ఎప్పుడు పండగ

వస్తుందా, ఎప్పుడు

వేసేసుకుందామా

అన్న ఆతృతే...🥳


ఇంటికి చుట్టాలొచ్చి

వెళ్తో వెళ్తూ.. 

చేతిలో రూపాయో... 

అర్ధరూపాయో పెడితే

ఎంత వెర్రి ఆనందమో...😊


చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే

దుఃఖం తన్నుకు వచ్చేది...

ఇంకా ఉంటే బాగుండు

అన్న ఆశ...

ఎంత ఆప్యాయతలో...💞


సినిమా వచ్చిన ఏ

పదిహేను రోజులకో

ఎంతో ప్లాన్ చేసి

ఇంట్లో ఒప్పించి

అందరం కలిసి

నడిచి వెళ్లి..

బెంచీ టికెట్

కొనుక్కుని  సినిమా

చూస్తే ఎంత ఆనందమో...🥰


ఇంటికొచ్చాకా 

ఒక గంటవరకూ

ఆ సినిమా కబుర్లే...

మర్నాడు స్కూల్ లో

కూడా...

ఆ ఆనందం ఇంకో పది

రోజులుండేది...💖


అసలు రేడియో విచిత్రం..

అందులోకి మనుషులు

వెళ్లి మాట్లాడతారా అన్న

ఆశ్చర్యం...అమాయకత్వం..🙄


పక్కింట్లో వాళ్లకి రేడియో

ఉంటే..ఆదివారం

మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం

ముందు కూర్చుని 

రేడియో లో సంక్షిప్త

శబ్ద చిత్రం (ఒక గంట కి

కుదించిన) సినిమాని

వింటే ఎంత ఆనందం...

మనింట్లో కూడా రేడియో

ఉంటే...అన్న ఆశ...😇


కాలక్షేపానికి లోటే లేదు...

స్నేహితులు

కబుర్లు, కధలు

చందమామలు

బాలమిత్రలు...🥰


సెలవుల్లో మైలు దూరం

నడిచి లైబ్రరీ కి వెళ్లి

గంటలు గంటలు

కథల పుస్తకాలు

చదివి ఎగురుకుంటూ

ఇంటికి రావడం....🏃🏻‍♂️


సర్కస్ లు, 

తోలు బొమ్మలాటలు

లక్కపిడతలాటలు...

దాగుడు మూతలు...

చింత పిక్కలు

వైకుంఠ పాళీ

పచ్చీసు..

తొక్కుడు బిళ్ళలు..

ఎన్ని ఆటలో...☺️


మూడు గదుల రైలుపెట్టి

లాంటి ఇంట్లో అంతమంది

ఎంత సంతోషంగా ఉన్నాం...

వరుసగా కింద చాపేసుకుని

పడుకున్నా ఎంత హాయిగా

సర్వం మరిచి నిద్రపోయాం...😴


అన్నంలో కందిపొడి..

ఉల్లిపాయ పులుసు

వేసుకుని తింటే

ఏమి రుచి...

కూర అవసరమే లేదు..🤷‍♂️


20/-రూపాయలు తీసుకెళ్లి

నాలుగు కిలోల 

బియ్యం తెచ్చేది...

ఇంట్లో,  చిన్నా చితకా

షాపింగ్ అంతా నేనే...

అన్నీ కొన్నాకా షాప్

అతను చేతిలో గుప్పెడు

పుట్నాల పప్పో, పటికబెల్లం

ముక్కో పెడితే ఎంత

సంతోషం...

ఎంత బరువైనా

మోసేసేవాని..💓


ఎగురుతున్న విమానం

కింద నుండి 

కళ్ళకు చెయ్యి అడ్డం

పెట్టి చూస్తే ఆనందం...🥰


తీర్థం లో ముప్పావలా

పెట్టి కొన్న ముత్యాల దండ 

చూసుకుని మురిసి

ముక్కలైన రోజులు...


కొత్త పుస్తకం కొంటే

ఆనందం...వాసన

చూసి మురిపెం..

కొత్త పెన్సిల్ కొంటే

ఆనందం...

రిక్షా ఎక్కితే...

రెండు పైసల

ఇసుఫ్రూట్ తింటే

ఎంత ఆనందం..?🤩


రిక్షా ఎక్కినంత తేలికగా... 

ఇప్పుడు విమానాల్లో 

తిరుగుతున్నాం...✈️

మల్టీప్లెక్స్ లో ఐమాక్స్

లో సినిమా చూస్తున్నాం.

ఇంటర్వెల్ లో

ఐస్ క్రీం తింటున్నాం..🍧


బీరువా తెరిస్తే మీద పడి

పోయేటన్ని బట్టలు...

చేతినిండా డబ్బు...

మెడలో ఆరు తులాలనగ....

పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...

ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...

హోమ్ థియేటర్లు...

సౌండ్ సిస్టమ్స్, 

చేతిలో ఫోన్లు... 

అరచేతిలో స్వర్గాలు...

అనుకోవాలే గానీ క్షణంలో

మన ముందు ఉండే 

తిను బండారాలు.. 

సౌకర్యాలు...😍


అయినా చిన్నప్పుడు

పొందిన  ఆ ఆనందం

పొందలేకపోతున్నాం

ఎందుకు ...?

ఎందుకు...? ఎందుకు...?🤔


చిన్నప్పుడు కోరుకున్నవి

అన్నీ ఇప్పుడు  

పొందాము కదా...

మరి ఆనందం లేదేం...

ఎందుకంత మృగ్యం

అయిపోయింది...

ఎండమావి 

అయిపోయింది..


మార్పు ఎందులో...?🤔

మనలోనా...?

మనసుల్లోనా...?

కాలంలోనా...?

పరిసరాల్లోనా...?

ఎందులో... ఎందులో...?

ఎందులో ...?

చెప్పవా తెలిస్తే....!!


(👍.... ఎవరు రాసారో కానీ బాగా నచ్చింది 👍) గట్టిగా అరవాలని ఉంది "" నిజమే"" అని... 🙏🙏🙏

నిజమైతే బాగుంటుందనిపించే

 *నిజమైతే బాగుంటుందనిపించే కల*😇


వేడివేడి ఉప్మా తింటుంటే - అల్లం ముక్క నోటికి తగిలినట్టూ


దోరగా వేగిన పెసరట్టు కొరికితే -  జీడిపప్పు పంటి కిందకి వచ్చినట్టూ


మిర్చిబజ్జి ఆబగా తినబోతే -  నాలిక సుర్రుమన్నట్టూ


పక్కనే ఉన్న వొగ్గాణీ - గుప్పెడు బొక్కినట్టూ


పచ్చి మిరపకాయలు తగిలించి -  రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ


మామిడికాయ బద్ద నవులుతూ - గుండమ్మ కథ సినిమా చూస్తున్నట్టూ


పీకల్దాక పెరుగన్నం తినేసి - ఉసిరికాయ బుగ్గనెట్టుకున్నట్టూ


దిబ్బరొట్టె మొత్తం - 

నేనే తినేసినట్టూ


వేపచెట్టు కింద మడతమంచమెక్కి - 

చెంబుడు నిమ్మకాయ మజ్జిగ తాగి పడుకున్నట్టూ


చద్దన్నంలో - ఆవకాయ వాయ కలిపినట్టూ


పప్పుచారులో గిన్నెడు -  చిన్నుల్లిపాయలు, దోసకాయ, బెండకాయ, ములక్కాయ ముక్కలు తేల్తున్నట్టు


రోడ్ మీద కొబ్బరి బొండాం కొట్టించుకుంటే - లేత కొబ్బరి ఉన్నట్టూ


లేత లేత ముంజెలు వేలితో పొడుచుకుని - లెక్కెట్టకుండా తిని మూతి తుడుసుకున్నట్టూ


కమ్మగా ఉడికిన ముద్దపప్పు అన్నంకి - దోసబద్దల పచ్చడి తోడైనట్టూ


చుక్కకూర పప్పు కుతకుతలాడించి - వేడివేడిగా అమ్మ చపాతీ చేసినట్టూ


నూకలన్నంలో - వెన్న తీయని మజ్జిగ పోసుకుని జుర్రినట్టూ


పులగం అన్నంలోకి - ఘాటుగా పచ్చిపులుసు పోసినట్టూ


చెట్టు నుంచి తెంపుకొచ్చిన లేత వంకాయలు - మగ్గీ మగ్గగానే పళ్ళెంలోకి వడ్డించినట్టూ


సావిట్లో గేదెలతో పోటీపడి -  తేగలు తెగ తినేసినట్టూ


దోర పచ్చికొబ్బరి లోకి - బెల్లం గెడ్డ జత కుదిరినట్టూ


తిరుపతి లడ్డూ మొత్తం -  అచ్చంగా నాకే ఇచ్చేసినట్టూ


పరపరలాడే పచ్చిమామిడికాయలు - ఉప్పూ కారం దట్టించి కొరికినట్టూ


పండిన వేపకాయ - ఎవరూ చూడకుండా చీకిపారేసినట్టూ


టమాటా పప్పుకి తోడు -  ఊరమిరపగాయలూ , వడియాలూ , అప్పడాలతో వచ్చినట్టూ


మసాలా చాయ్ - ముంత మసాలాతో తాగినట్టూ


బంగినపల్లి మామిళ్ళు - పరకల కొద్దీ తినేసినట్టు


వేడి వేడి బెల్లం జిలేబీ , 

రోడ్ మీద కొనీ కొనగానే - 

కారు డోర్ వేసుకుని గుటుక్కుమనిపించినట్టు


బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తులు -  ఒలుచుకు తిన్నట్టూ


లోటాడు మద్రాస్ ఫిల్టర్ కాఫీ -  స్టార్ బక్స్ లో దొరికినట్టూ


బట్టీలోంచి తెచ్చిన బఠాణీలు -  పటపటమని నమిలేసినట్టూ


అలా చెట్టు నుంచి దూసిన కరేపాకు -  తాలింపులో వేసి కొత్తటుకులు వేయించినట్టూ


సినిమా హాల్ లో పాప్కార్న్ -  ఎవరన్నా తెచ్చిపెట్టినట్టూ


చిన్నా పెద్దా తేడాలేకుండా -  రసాలు గుటకలేసినట్టూ


కొబ్బరి బూరెల కోసం చేసిన -  చలివిడి కొట్టేసి తిన్నట్టూ


బిడ్డనెత్తుకొచ్చిన సారెలో -  పంచదార చిలక నాకే ఇచ్చినట్టూ


కొబ్బరి మామిడికాయ ముక్కలు - కేజీలు ఖాళీ చేసినట్టూ


మా పెద్ద రేగు చెట్టు - ఇంకా బిందెలు బిందెలు కాయలు కాస్తున్నట్టూ


కిస్మిస్ లని -  కేజీల్లో మాయం చేసేసినట్టూ


దోర జాంకాయాలు  చెట్టునుంచి ఎతికెతికి కోసుకుని -  పరపరా నమిలేసి తిన్నట్టూ


సన్నసెగన మరగకాగిన ఉలవచారు తాలింపు -  ఘుప్పుమన్నట్టూ


వానాకాలంలో పకోడీల వాసన -  గాలిలో తేలి వచ్చినట్టూ


తంపడకాయలు, కాల్చిన పచ్చేరుసెనక్కాయలు - కలిసి దొరికినట్టూ


పుల్లైసు బండి - పరిగెత్తకుండానే మన గుమ్మం ముందే ఆగినట్టూ


పొట్ట పగిలిపోడానికి రడీగా ఉన్న సీతాఫలం - చెట్టునే మగ్గి దొరికినట్టూ


దోరగా పండిన చింతకాయ -  చిటుక్కున చేతికి అందినట్టూ


పాలసపోటా చెట్టుకింద నిలబడి - అలాగ్గా కోసుకు తిన్నట్టూ


చిన్నుసిరికాయల చెట్టు -  స్కూలుకెళ్ళే దారిలో  కొమ్మజాపి రమ్మన్నట్టూ


ఎర్రగా వేగిన బంగాళా దుంప కూరకి - రసం తోడైనట్టూ


వాక్కాయల చెట్టొకటి తోవెమ్మటే ఉండి రారమ్మన్నట్టూ


కణుపు చిక్కుళ్ళు - చట్టినిండా ఉడకబెట్టి అమ్మ వాకిట్లోకి వెళ్ళినట్టూ


మామిడితాండ్ర పొరలుపొరలు తీసితింటూ - ముచ్చట్లు చెప్పుకున్నట్టూ


సాంబారు పెట్టిన్నాడే - దొండకాయ వేపుడు కూడా చేసినట్టూ


ఎర్రని సీమతుమ్మకాయలు -  కొక్కెం ఊడిపోకుండానే ఒడినిండా దొరికినట్టూ


గుళ్ళో పక్కనోళ్ళు - వాళ్ళ వాటా పులిహోర కూడా నాకే ఇచ్చినట్టూ


వగరే తెలియని కండపట్టిన నేరేళ్ళ కొమ్మ - చేతికందినట్టూ


విరగ కాసిన ఈత చెట్టొకటి - పిలిచి కాయలిచ్చినట్టూ 


బెల్లం గవ్వలు - ఒక పిసరు పాకం తక్కువై తీగ సాగినట్టూ


వర్షం పడుతుంటే - పునుగుల పళ్ళెం చేతిలోకి వచ్చినట్టూ 


వేయించిన ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసి - రోట్లో తొక్కిన గోంగూర పచ్చడి వెన్నపూసేసుకుని వాయ కలిపినట్టూ


భోజనాల బల్ల దగ్గర ప్రశాంతంగా కూర్చుని -  పాలుపోసి వండిన కూరలో ములక్కాయ ముక్కల్ని ఓ పట్టుపట్టినట్టూ


ఆవడల మీద బూందీ మిక్చరు వేసుకుని - మిట్టమధ్యాహ్నం ఎండలో హాయిగా తింటున్నట్టూ


పూరీలు పున్నమి చంద్రుళ్ళా పొంగి - కమ్మని కూరతో తెగతిన్నట్టూ


ఉల్లిపాయలు జీలకర్ర కరేపాకు దిట్టంగా వేసిన రవ్వట్టు - గుండ్రని డైనింగ్ టేబుల్ సైజులో పెట్టినట్టూ


గడ్డపెరుగులో - నిమ్మకాయ బద్ద నంజుకుని నాకేసినట్టు


పానిపూరీలు - లొట్టలేసేంత పుల్లగా వర్రగా కుదిరినట్టూ


దప్పళం గిన్నె - మొట్టమొదలు నాకే ఇచ్చినట్టూ


ఆఖరికి ఏడేడి ఇడ్లీలు దూదిలా మెత్తగా పొగలు కక్కుతుంటే - నేతిగిన్నెలో ముంచి కారప్పొడి అద్దినట్టూ


*కమ్మని కలలు కంటూ మాంచగి నిద్రలో  ఉంటే,  కుళ్ళుమోతు అలారం  పీడకలొచ్చినట్టు  మోగిచచ్చింది!* 


ఇదంతా ఎందుకంటే .....


ఈ రోజుల్లో ఇవిదొరకటం, దొరికినా తిని అరిగించుకునే శక్తిని కోల్పోయాం కదా‌!😏                                       



కంప్యూటర్ - కరుణ

 కంప్యూటర్ - కరుణ


శ్రీమతి రమా రాజగోపాలన్ తమ జీవితంలో పొందిన పరమాచార్య స్వామివారి అనుగ్రహాన్ని ఇలా తెలుపుతున్నారు.


రమా భర్త చేస్తున్న ఉద్యోగం వదిలి, కొత్త ఉద్యోగానికై ప్రయత్నాలు చేస్తున్నారు. తను కూడా తన భర్తకు ఇంటికి ఏదైనా సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది.


“ఉద్యోగం లేనివారికి ప్రభుత్వం ఇచ్చే ఏదైనా సహాయాన్ని మనం కూడా పొందవచ్చు కదా” అని తన భర్తను అడిగింది. అతను నిర్లక్ష్యంగా, “నువ్వు చదువుకోలేదు. మరి ప్రభుత్వ సహాయం పొంది నువ్వు ఏమి చేస్తావు” అని బదులిచ్చాడు. రెండురోజుల తరువాత, ఉద్యోగం వెతకటం కోసం బాంబేకు వెళ్ళిపోయాడు.


కుటుంబ పరిస్థితి గమనించి రమా చాలా బాధపడుతోంది. ఆర్ధిక సహాయం గురించిన వివరాలేమైనా తెలుస్తాయేమోనని రోజూ వార్తాపత్రికలు చూస్తోంది. వ్యవసాయానికి, కుట్టుమిషన్లకు, టైప్ రైటర్లకు, చిన్నపాటి ఉద్యోగాలకి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని ఒక వార్తను చూసింది.


వెంటనే ఆమెకు ఒక ఆలోచన కల్గింది. అప్పుడే కంప్యూటర్ల వాడకం మొదలవుతోంది. ఒక కంప్యూటరు కొనడానికి కావాల్సిన లోను కోసం ధరకాస్తు చేసుకుంది. ఆ వారంలోనే, ఇంటర్వ్యు కోసం తమని వచ్చి కలవమని బ్యాంకు నుండి సమాధానం వచ్చింది.


ఏ కార్యమైనా చెయ్యబోయే ముందు పరమాచార్య స్వామిని తలచుకుని ప్రార్థించడం రమకు అలవాటు. ధరకాస్తు పంపేటపుడు కూడా మహాస్వామి వారి పాఠం ముందు నిలబడి, ప్రార్థించిన తరువాతనే బ్యాంకుకు పంపింది. ఇప్పుడు ఇంటర్వ్యుకు వెళ్లేముందు, స్వామివారి పటానికి నమస్కారం చేసి ఇంటర్వ్యు కోసం కాంచీపురానికి బయలుదేరింది.


ప్రయాణంలో తనకు కంప్యూటర్ల గురించి బొత్తిగా ఏమి తెలియదు కనుక ఇంటర్వ్యులో వారు ఏదైనా కంప్యూటర్లకు సంబంధించిన విషయం అడిగితే తను ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తోంది. బ్యాంకు వారు తనని నమ్మి కంప్యుటర్ కొనడానికి ఆర్ధిక సహాయం ఎలా చేస్తారు అని అనుకుంటోంది. కాని తనకు పరమాచార్య స్వామిపై గట్టి నమ్మకం, వారు తప్పక దారి చూపి, సహాయం చేస్తారని.


ఇంటర్వ్యుకు వెళ్లేముందు కాంచీపురం శ్రీమఠానికి వెళ్లి దర్శనం కోసం పరమాచార్య స్వామివారి ముందు నిలబడింది. మొత్తం విషయం అంతా తెలిపి ఆశీస్సులు అర్థించింది. స్వామివారు చిన్నగా నవ్వి, “కంప్యూటర్ల వెనుక ఉన్న విజ్ఞానం ఏంటో తెలుసా?” అని అడిగి, వారే వాటి గురించి చెప్పడం మొదలుపెట్టారు.


“మనిషి తెలివితో చేసే పనులన్నింటిని ఆ యంత్రాల చేత చేయించేలాగా వాటిని రూపొందిస్తున్నారు. ఎక్కువగా మతిమరుపు ఉంటున్న ఈరోజుల్లో అది ఒక వరం. మనం ఇచ్చిన మొత్తం సమాచారాన్ని అందులోకి ఇస్తే, దాన్ని మొత్తం అది దాచిపెట్టుకుని, మనం కావాలన్నప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా తిరిగి ఇస్తుంది. కాని కంప్యూటర్లు మానవ మేధస్సుకు సమానం కావు” అని స్వామివారు చెప్పగానే, ఆవిడకు కంప్యూటర్ల గురించిన ప్రాథమిక అవగాహన, వాటి అవసరం తెలిసింది.


తరువాత స్వామివారు, “కంప్యూటర్ల గురించి ఏం చదువుకున్నావు?” అని అడిగారు. ఇప్పుడు రమా ఇరకాటంలో పడింది.


“ఇప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టాను పెరియవ” అని బదులిచ్చింది.


“పని మొదలుపెట్టక ముందే దాని ఫలితం పొందాలని ఆలోచిస్తున్నావన్నమాట” అని చిన్నగా నవ్వి కుంకుమ, కలకండ ఆమె ఫైలు మీద పెట్టి ఆశీర్వదించారు.


అంతులేని విశ్వాసంతో వెళ్లి ఇంటర్వ్యుకు వెళ్ళింది. అక్కడ వాళ్ళు తన చదువు గురించి కానీ, కంప్యూటర్లతో తను చెయ్యబోయే పని ఏంటని కాని అడగలేదు. వారు అడిగిన విషయం కంప్యూటర్ల వల్ల ఉపయోగం ఏంటని. తను ఇంటర్వ్యుకు వచ్చే ముందు పరమాచార్య స్వామివారిని కలిసినప్పుడు స్వామివారు కంప్యూటర్ గురించి చెప్పిన విషయాన్ని మొత్తం వాళ్లకు చెప్పింది. ఇక్కడ ఇటువంటి ప్రశ్ననే అడుగుతారని మహాస్వామివారికి తెలుసు కాబట్టి, ఇదే విషయం స్వామివారు రమకు తెలిపారు. తన సరళమైన, స్పష్టమైన సమాధానాన్ని విని అధికారులు సంతోషించారు.


ఇక ఎటువంటి ప్రశ్నలు అడగకుండా వెళ్ళవచ్చని చెప్పారు. తనకు సహాయం అందదని బాధతో ఇంటికి వచ్చి పరమాచార్య స్వామివారి చిత్రపటం ముందు నిలబడి, “వికలాంగునికి తేనే కావాలని కోరిక” (తమిళ సామెత) అని ఏడ్చింది.


కాని స్వామివారి ఆశీస్సుల వల్ల, వారంలోపే తనకి ముప్పైఅయిదు వేల రూపాయల ఋణం లభించింది. పరమాచార్యుల ఆశీస్సులు ఉంటే, వికలాంగునికైనా తేనె నేరుగా వచ్చి నోటిలోకే పడదా?

కేవలం భక్తి, శరణాగతి మాత్రమె మనల్ని పరమాచార్య స్వామివారికి దగ్గర చేస్తుంది. శ్రేయస్సును కలిగిస్తుంది.


--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।