26, ఆగస్టు 2021, గురువారం

తెలుగు మాస్టారు

 *తెలుగు మాస్టారు*


డు,ము,వు,లు ప్రధమా విభక్తి,

నిన్,నున్,లన్,కూర్చి, గురించి......ద్వితీయా విభక్తి.


తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతోంది. సూది మొన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్ లో. తెలుగు మాస్టర్ గారంటే ఆ క్లాస్ కే కాదు, స్కూల్ మొత్తం భయం. క్రమశిక్షణకు మారుపేరు మాస్టారు. అల్లరి చేసిన వాడి వీపు వంచి గుల్ల దెబ్బ ఒక్కటి వేసేరంటే చాలు, స్కూలు మొత్తం వినపడేది. ఆ శబ్దానికే పిల్లలకు చచ్చేంత భయం.కర్ర విరగాకూడదు, పాము చావాకూడదు అనేది ఆయన సిధ్ధాంతం.దెబ్బ తగిలేదు కాదు కానీ, ఆ శబ్దానికే బిక్క చచ్చి పోయేవారు కుర్రాళ్లంతా. 


నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరిపడతది.....

నేను ఈల వేస్తే గోలకొండ అదిరిపడతది....... 

దివికి దివికి దిమాడి.....గుబుకు గుబుకు గుమాడి.....దివికి దివికి దిమాడి ....గుబుకు గుబుకు గుమాడి.......

అంటూ పెద్దగా ఈల వేసుకుంటూ,ప్లే గ్రౌండ్ లో వున్న ఉసిరి చెట్టెక్కి కోసిన ఉసిరికాయలు ఒక ముచ్చికవర్ లో వేసుకుని, క్లాస్ రూమ్ లోకి అప్పుడే ఎంటర్ అయిన శీను గాడు. 


పాఠం చెబుతున్న తెలుగు మాస్టర్ గారిని చూసి గతుక్కు మన్నాడు. భయంతో బిక్క చచ్చిపోయేడు. వాడిపై ప్రాణాలు పైనే పోయేయి. తెలుగు మాస్టర్ గారు ఆరోజు సెలవు, స్కూల్ కి రారు అనుకున్న శీను గాడికి పాపం మాస్టర్ గారు లీవ్ క్యాన్సల్ చేసుకుని క్లాస్ కి వచ్చేరన్న విషయం తెలీదు. ఎంచక్కా తెలుగు పీరియడ్ ని ఉసిరి కాయలకోసం కేటాయించుకున్నాడు. 


ఒరేయ్..ఇలా రారా!మాస్టారి కళ్ళు చింత నిప్పుల్లా వున్నాయి. 

భయంతో ఉసిరికాయలన్నీ అక్కడే కిందన పడేసాడు. 

పిల్లలంతా ఒకింత భయంతోనూ, ఒకింత 

ఆతృతతోను చూస్తున్నారు , ఏం జరగబోతుందా అని. 


అంతలోనే ధామ్...ధామ్ అంటూ గట్టిగా రెండు శబ్దాలు వినపడే సరికి శీను గాడి పని అయిపోయిందివాళ అనుకున్నారంతా. 


వెధవా......నీ తల్లి, తండ్రి అంతంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తుంటే, నువ్వు చేసే ఘన కార్యం ఇదా? చదువు లేకపోయినా ఫర్లేదు, క్రమశిక్షణ లేకపోతే ఎలా? పెద్దయ్యాక ఏం సాధిద్దామని? అంట్లు తోముకుని బతుకుదామని అనుకుంటున్నావా? మాస్టర్ గారి తిట్ల సునామీ కి అడ్డుకట్టలేదు. అంత కోపం అతనిలో మునుపెన్నడూ చూడలేదు ఎవరూ. పిల్లలు క్రమశిక్షణ లేక చెడిపోతున్నారన్న బాధ, ఆయన కళ్ళల్లో రౌద్రమై తాండవిస్తోంది. శీను గాడు అది చూసి తట్టుకోలేకపోయేడు. ఒహటే ఏడుపు. 


ఇంతలో మిగిలిన క్లాస్ టీచర్స్, హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగు మాస్టర్ గారిని శాంతింప చేయడంతో పరిస్థితి కుదుటపడింది. 


తుఫాన్ తరువాత ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ క్లాస్ 

రూమ్ ని చూస్తే అర్ధం అవుతుంది. కానీ ఈ సంఘటన తరువాత మాస్టర్ గారు అన్యమనస్కంగా వున్నారు. మిగిలిన పాఠం చెప్పే మూడ్ లేక,పిల్లలికి ఏదో వర్క్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయేరు. 


ఈ ఘటన జరిగి చాలా రోజులైనా, శీను గాడికి మాత్రం మాస్టర్ గారిపై కోపం తగ్గలేదు. ఆయన అంటే బాగా అయిష్టం పెంచేసుకున్నాడు. అతనికి కనిపించకుండా తిరుగుతూ జాగ్రత్త పడుతుండేవాడు. ఏదో విధంగా టెన్త్ పరీక్షల్లో పాస్ అనిపించుకుని, స్కూల్ చివరి రోజున కూడా మాస్టర్ గారికి కనిపించకుండా, కనీసం పలకరించకుండా వచ్చేశాడు. 


ఆ తరువాత శీను వాళ్ళ నాన్న గారికి వేరే వూరు బదిలీ అవడంతో,ఆ వూళ్ళో కాలేజీలో చేరిపోయేడు.


రోజులు గడిచి పోతున్నాయి. క్యాలెండర్లు మారిపోతున్నాయి. అవి రోజులా....లేక కళ్ళాలు లేని గుర్రాలా అన్నట్టున్నాయి. 


తెలుగు మాస్టారి చిన్న అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. తను పనిచేసే రోజుల్లో యేవో లోన్లు అవీ పెట్టి మెల్లగా పెద్దమ్మాయి పెళ్లి చేసేరు. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి కోసం,తను జాగ్రత్త చేసి కొనుక్కున్న కొంత భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు.


కానీ తను, తనతో పాటు కొంతమంది కలిసి కొన్న ఆ జాగా వున్న ఏరియాలో యేవో కొన్ని వివాదాల కారణంగా భూమిని అమ్మడానికి ప్రభుత్వ పరంగా కొన్ని అడ్డంకులు వున్నాయి. ఆ అడ్డంకులు తొలిగితే కానీ తాను అమ్మే పరిస్థితి కానరాకపోవడంతో, తెలిసిన వ్యక్తుల సలహా మేరకు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే పని జరగొచ్చు అని చెప్పడంతో కలెక్టర్ ని కలవడానికి అప్పోయింట్మెంట్ తీసుకున్నారు మాస్టర్ గారు. 


అబ్బే.....కుదరదండి.రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం అస్సలు కుదరదండి అంటూ పంపేశారు కలెక్టర్ గారు. రెండు, మూడు సార్లు అతని చుట్టూ తిరగవలసి వచ్చింది మాస్టారికి.

మీరు ఎన్ని సార్లు నా దగ్గరికి వచ్చినా ప్రయోజనం లేదు సార్! ఈ విషయంలో నేను ఏమీ చెయ్యలేను. నా పరిధి దాటిపోయింది. మీ వలన అవుతుంది అంటే వెళ్లి మంత్రి గారిని కలవండి. ఏమైనా చెయ్యగలిగితే ఆయనే చెయ్యగలడు. దయచేసి వెళ్లిపోండి.......అంటూ ఖరాఖండి గ చెప్పేసేడు కలెక్టర్ శ్రీనివాస్.


చేసేది లేక మాష్టారు,మంత్రి గారి అప్పోయింట్మెంట్ కోసం ప్రయత్నిచసాగేరు. ఎట్టకేలకు తనకు వున్న ఆ కాస్త పరిచయాల ద్వారా మంత్రి గారి అప్పోయింట్మెంట్ సాధించారు. 


సర్....ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట. ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు..కుదరదంటే వినిపించుకోవట్లేదు. అమ్మాయి పెళ్లి అంట..ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇదిగో ఇవి అతని వివరాలు.....అంటూ ఆ ఫైల్ ని మంత్రి గారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయేడు సెక్రటరీ. 


కాసేపు ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాస్టర్ గారిని లోపలికి పంపించ వలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీ కి చెప్పారు మంత్రిగారు.


రండి....కూచోండి. మీ వివరాలన్నీ చూసాను. అంటూ మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు. ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు వున్న మాట వాస్తవమయినా, మీ కేసు జెన్యూన్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను. మరేమీ ఫర్లేదు...మీరు నిశ్చింతగా ఉండొచ్చు, అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి, సెక్రటరీని పిలిచి, త్వరగా క్లియర్ చెయ్యమంటూ ఆదేశాలు జారీ చేసారు మంత్రిగారు. 


మాస్టారు ఉప్పొంగిపోయేరు. గత మూడు నెలలనించీ తిరుగుతున్నా పని కాలేదు. 

మీ దయ వలన ఇప్పుడు పూర్తయ్యింది. అంటూ కృతఙ్ఞతా పూర్వకంగా నమస్కరించబోయేరు మాస్టర్ గారు. 


అయ్యో.....మీరు పెద్దవారు. మీరు నమస్కరించరాదు. మీ బోటి వారికి సేవ చెయ్యడమే మా లక్ష్యం అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రి గారు.


కృతఙ్ఞతా పూర్వకంగా ఆశీర్వదించి వెనుదిరిగి తలుపు తీసుకుంటూ వెళ్లబోయారు తెలుగు మాస్టారు. 


చేతన్, చెన్, తోడన్, తోన్.. చేతనైన చేయూతనందించి తోడుగా నిలవడం....

తృతీయా విభక్తి...!


కొఱకున్, కై ......

ప్రజల కొరకు,ప్రజల కోసం పోరాడటం.....

చతుర్ధీ విభక్తి ...!


వలనన్, కంటెన్, పట్టి.....

ప్రజల వలన ఎన్నుకోబడిన నేను,వాళ్ళ కంటే గొప్పవాడినేమీ కాను, పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించటమే.....

పంచమీ విభక్తి ....!


కిన్, కున్, యొక్క,లోన్, లోపల.....

వ్యవస్థ లోపల వున్న కలుపు మొక్కల్ని ఏరి పారేసి, సంఘం యొక్క మేలు కోరడమే.....

షష్టీ విభక్తి...!


అందున్, నన్.......

అందుకు కట్టుబడి వుంటాను, ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటాను.....

సప్తమీ విభక్తి...!


ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన పాఠం.....అందుకే మా తెలుగు మాస్టారంటే మాకు అమితమైన భక్తి !!! ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు యెనలేని శక్తి!!!!


అమాంతం వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టారి కళ్ళు నీటి కుండల్లా వున్నాయి. 


అవును మాస్టారు.....నేనే చిన్నప్పటి మీ శీను గాణ్ణి......అన్నాడు మంత్రి శీనయ్య!!!


నీటి పొరలు కప్పేయడం వలన ఏమో, ఒకరికొకరు మసక, మసకగా కనపడుతున్నారు. తన శిష్యుడి ఉన్నతి చూసి మురిసిపోయేరు మాస్టారు. గట్టిగా కౌగిలించుకున్నారు.


కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలను నేర్పసాగింది మాస్టారు.....అప్పుడు తెలిసి వచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారో,మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారో! ఆ నాడు మీరు నేర్పిన పాఠాలను నెమరు వేసుకుంటూ.....

నా బతుకు చిత్రాన్నేమార్చుకున్నాను. ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత ఋణం తీర్చుకోవాలనుకున్నా.....

చూస్తున్నారుగా......ఇపుడిలా


మీరేమీ అనుకోక పోతే అమ్మాయి పెళ్లి కి నాకు చేతనైనంత సహాయం చేసి, మీకు గురుదక్షిణగా చెల్లించుకుంటా.......

ఆ భూమిని మాత్రం అమ్ముకోవద్దు. 

మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టే పెట్టుకోండి .....

ఇది నా విన్నపం. కాదనకండి....అంటూ అభ్యర్ధించాడు మంత్రి శీనయ్య ఉరఫ్ శీను.


గురుభక్తిని కాదనలేకపోయారు తెలుగు మాష్టారు. తన శిష్యుడు అంత ఎత్తుకి ఎదిగినందుకు సంబర పడిపోయారు.


సార్ .....మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది. మేడం గారు ఫోన్ చేసేరు. మీ చిన్నబ్బాయి స్కూల్ లో ఉసిరి చెట్టెక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాడంట. మరేమి ఫరవాలేదు ....హి ఈస్ ఆల్రైట్ అని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారంట .....అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణలు చెప్తూ .....వచ్చి చెప్పాడు సెక్రటరీ.


మరేమీ ఫర్వాలేదు ప్రిన్సిపాల్ గారిని వాడికి ఇంకో నాలుగు తగిలించమను.మరీ బుద్ధి లేకుండా తయారవుతున్నాడు ఈ మధ్య అంటూ ......తెలుగు మాస్టర్ గారి ముఖం లోకి చూసారు సదరు మంత్రి గారు.


ఆ ఇద్దరూ అంతలా పకా,పకా ఎందుకు నవ్వుతున్నారో ఓ పట్టాన అర్ధం కాలేదు సెక్రటరీ కి.......


అంతర్జాల సేకరణ 

షరా: అలాంటి ఉపాధ్యాయుల్ని, విద్యార్ధుల్ని చూపించమంటే చూపగలను కానీ అలాంటి మంత్రులను చూపమని అడగొద్దు. అసాధ్యం.

సాధు పురుషుల, మహనీయుల గొప్పతనం

 *🕉️🚩మన హిందూ ధర్మంలోని చాలా విషయాలు సైన్స్ కు అందవు, మరి సాధు పురుషుల, మహనీయుల గొప్పతనం చూడండి. 106 సంవత్సరాల వయస్సు.సంత్ శిరోమణి సియారం బాబా వారి పేరు.(అగిపెట్టె లేకుండా 🪔🔥దీపాన్ని🔥🪔 వెలిగించారు.) హర హర మహాదేవ శంభో శంకర 🙏🕉️🚩*


*మహాత్ముల పరిచయం- 456*

*శిరోమణి సంత్ శ్రీ సియారం బాబా*

🕉️🌞🌏🌙🌟🚩


106 సంవత్సరాలు. సజీవులు.

తల్లిదండ్రుల పేరు తెలియదు.చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వారి దగ్గర ఎప్పుడూ ఒక హనుమాన్ విగ్రహం ఉండేది.నిరంతరం రామాయణం పారాయణ చేస్తూ ఉండేవారు.వారి గురువు గారు(ఆ) గౌరీ మహరాజ్ గారు.



వారితో 5 సంవత్సరాలు బదరినాధ్, కైలాష్ మానస సరోవర్,పుణ్యక్షేత్రములు తిరిగారు.10 సంవత్సరాలు నర్మదా నదిలో ఖండేశ్వరి సిద్ధి కోసం నిద్ర,ఆహారం మానేసి సాధన చేశారు.నర్మదా నదిలో దాదాపు మునిగిపోయే స్థితి వచ్చినా చలించలేదు.



నర్మదా మాత కరుణతో ఆ సిద్ధి లభించింది. బాబా గారు సాధు, సంతులకు అనే స్వయంగా చాయి పెట్టి ఇచ్చేవారు.



తరువాత మధ్యప్రదేశ్ లోని నర్మదా నది వడ్డున,పరిక్రమ మార్గంలో తెలి భదామాన్ అనే గ్రామంలో రావి చెట్టుకింద తన ఆంజనేయ స్వామి విగ్రహం ని పెట్టి,14 సంవత్సరాలు నిల్చొని రామాయణం పారాయణ,రామనామ సంకీర్తన, చేశారు.అందరిని సియారం అని మాత్రమే పలకరించి,మౌనంగా ఉండేవారు.



గ్రామస్థులు పిచ్చి వాడు అనుకోని రాళ్లతో కొట్టడం,వారి లంగోటి లాగడం,కర్ర తో కొట్టడం చేసేవారు. కానీ ఆహారం ఇచ్చేవారు కాదు.కొన్ని నెలలకు వారికి వీరు ఆహారం లేకుండా ఎలా ఉంటున్నారో అర్ధం కాలేదు.



వీరి మహత్యం గుర్తించి వారి గ్రామంలో ఉండమని ప్రార్ధించగానే బాబా గారు అక్కడే హనుమాన్ విగ్రహంకి మందిరం కట్టించి నిరాకార హనుమాన్ అని పేరు పెట్టారు.



విగ్రహం మందిరంలో మొత్తం కనపడకుండా కట్టించారు.బయట ఒక గూడు పెట్టి,అక్కడ నమస్కారం చేసుకోమంటారు.



నిరంతరం సదా నర్మదే హార్ అని నామస్మరణ జరుగుతుంది. 106 సంవత్సరాల వయస్సు లో కూడా చక్కగా నడుస్తారు.



తన దగ్గరకు వచ్చిన ఆహార పదార్థాలు మొత్తం కలిపి అక్కడ ఉన్నవారికి అంతా పంచేస్తారు.వారే స్వయంగా నర్మదా మాత కి ఘాట్ నిర్మించారు.



చీమల నుంచి,పక్షులు, కుక్కలు,మనుష్యులు అందరూ వారి దగ్గర తినవలసిందే.లేకపోతే పంపరు. వారు ఏమి తినరు. డబ్బు ముట్టుకోరు.



అడ్రస్:సియారం బాబా ఆశ్రమం, తెలి భదాయన్, కార్గోన్ ,సనవాడ దగ్గర, కసరావాడ తాసిల్, ఖరుగౌన్ జిల్లా,మధ్య ప్రదేశ్,ఇండోర్ దగ్గర.


🕉️🌞🌏🌙🌟🚩

సంస్కృత మహాభాగవతం*

 *26.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - రెండవ అధ్యాయము*


*జనకమహారాజునకును - తొమ్మిదిమంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట - నారదుడు వసుదేవునివద్దకు వచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీనారద ఉవాచ*


*2.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*ఏవం తే నిమినా పృష్టా వసుదేవ మహత్తమాః|*


*ప్రతిపూజ్యాబ్రువన్ ప్రీత్యా ససదస్యర్త్విజం నృపమ్॥12222॥*


*నారదుడు ఇట్లనెను* "వసుదేవా! నిమి (జనకుడు) ఈ విధముగా అడిగిన పిమ్మట ఆ మహామహులు సదస్యులతోను, ఋత్విజులతోడను గూడియున్న ఆ మహారాజును అభినందించుచు పలికిరి.


*కవిరువాచ*


*2.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*మన్యేఽకుతశ్చిద్భయమచ్యుతస్య పాదాంబుజోపాసనమత్ర నిత్యమ్|*


*ఉద్విగ్నబుద్ధేరసదాత్మభావాద్విశ్వాత్మనా యత్ర నివర్తతే భీః॥12223॥*


*కవి ఇట్లు పలికెను* "ఓ రాజా! భక్తజనుల హృదయమునుండి ఎప్పుడును దూరము కానట్టి అచ్యుత భగవానుని చరణములను నిత్యము - నిరంతరాయముగా ఉపాసించుటయే ఈ సంసారమునందు మిగుల శ్రేయోదాయకమగును. సకలభయములు పూర్తిగా సమసిపోవును. అని నా నిశ్చితాభిప్రాయము. దేహ, గేహాదులవంటి తుచ్ఛమైన, అసత్తు పదార్థములయందు అహంకార - మమకారములను కలిగి యుండుటచే, మానవుల చిత్తవృత్తులు ఉద్విగ్నమలై పోవును. అట్టియెడ వారలు వైరాగ్యభావమును పొంది భగవంతుని పాదపద్మములను ఆశ్రయించినచో, వారిని ఆవహించిన భయములన్నియును పూర్తిగా మటుమాయమైపోవును.


*2.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*యే వై భగవతా ప్రోక్తా ఉపాయా హ్యాత్మలబ్ధయే|*


*అంజః పుంసామవిదుషాం విద్ధి భాగవతాన్ హి తాన్॥12224॥*


అజ్ఞానులైన పురుషులుగూడ సాక్షాత్తు భగవత్ప్రాప్తిని సులభముగా పొందుటకు ఉపాయములను ఆ శ్రీహరియే స్వయముగా తెలిపియుండెను. వాటినే భాగవత ధర్మములుగా ఎఱుంగుము.


*భాగవత ధర్మములు* శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము - ఇవి భాగవత ధర్మములు (వీరరాఘవీయ వ్యాఖ్య)


*2.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*యానాస్థాయ నరో రాజన్ న ప్రమాద్యేత కర్హిచిత్|*


*ధావన్ నిమీల్య వా నేత్రే న స్ఖలేన్న పతేదిహ॥12225॥*


నిమి (జనక) మహారాజా! ఈ భాగవత ధర్మములను అవలంబించినవానికి ఎన్నడును విఘ్నములు ఏర్పడవు. కనులు మూసికొని పరుండినను అనగా విధివిధానములో ఏదైన నొకలోపము వాటిల్లినను ఆ మార్గమునుండి స్ఖలితుడుగాడు (జాఱిపడిపోడు), పతితుడునుగాడు. అనగా ఫలమును పొందకపోడు.


*2.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వానుసృతస్వభావాత్|*


*కరోతి యద్యత్సకలం పరస్మైనారాయణాయేతి సమర్పయేత్తత్॥12226॥* 


*భాగవత ధర్మముల పాటించువాడు ప్రత్యేకమైన విశేషకర్మనే ఆచరింపవలయునను నియమము లేదు*


భాగవత ధర్మములను ఆచరించువాడు శారీరకముగా, వాచికముగా, మానసికముగా, ఇంద్రియముల ద్వారా, బుద్ధిద్వారా, అహంకారమువలన లేక అనేకజన్మల సంసారప్రభావముచే ఏర్పడిన స్వభావమువలన ఏకర్మను ఆచరించినను దానిని *శ్రీమన్నారాయణార్పణమస్తు* అనుచు సమర్పింపవలయును.


*2.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*భయం ద్వితీయాభినివేశతః స్యాదీశాదపేతస్య విపర్యయోఽస్మృతిః|*.


*తన్మాయయాతో బుధ ఆభజేత్తం భక్త్యైకయేశం గురుదేవతాత్మా॥12227॥*


పరమేశ్వరునకు విముఖుడైన మానవుడు మాయా ప్రభావమున తన నిజమైన స్వరూపమును మఱచిపోయి దేహాత్మభావమునకు (ఈ దేహమే నేను - అను భ్రమకు) లోనగును. దేహము మొదలగు అనిత్యవస్తువులపై ఆసక్తుడగుట వలన అతనికి వార్థక్యము, మృత్యువు, రోగములు మున్నగు పెక్కు భయములు ఏర్పడును. కనుక వివేకవంతుడగువాడు అధీతవేదాంతజన్య జ్ఞానసంపన్నుడైన (వేదార్థములను బాగుగా ఆకళించుకొని బ్రహ్మజ్ఞానమును పొందిన) గురుదేవుని ఆశ్రయించి, అనన్యభక్తిద్వారా భగవంతుని భజింపవలెను.


*2.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*అవిద్యమానోఽప్యవభాతి హి ద్వయో ధ్యాతుర్ధియా స్వప్నమనోరథౌ యథా|*


*తత్కర్మసంకల్పవికల్పకం మనో బుధో నిరుంధ్యాదభయం తతః స్యాత్॥12228॥*


వాస్తవముగా భగవంతుడు, ఆత్మ అనునది తప్ప మఱి యే వస్తువూ నిత్యముకాదు. కాని, అనిత్యమైన జగత్తునుగూర్చి ఆలోచించుట వలన స్వప్నావస్థలోను, జాగ్రదావస్థలోను ఏర్పడిన మనోరథములవలె అది (జగత్తు) నిత్యముగా భాసిల్లుచుండును. కనుక, వివేకియైనవాడు సాంసారిక కర్మలకు సంబంధించిన సంకల్ప వికల్పములను చేయునట్టి మనస్సును నిగ్రహింపవలెను. తత్పలితముగా భయరహితమైన స్థితి అనగా భగవత్ప్రాప్తి కలుగును.


*2.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*శృణ్వన్ సుభద్రాణి రథాంగపాణేర్జన్మాని కర్మాణి చ యాని లోకే|*


*గీతాని నామాని తదర్థకాని గాయన్ విలజ్జో విచరేదసంగః॥12229॥*


భక్తుడు దేహాభిమానరహితుడై శ్రీహరియొక్క అవతారములను గూర్చియు, మంగళకరములైన ఆ స్వామి లీలలను గురించియు వినుచుండవలెను. భగవత్స్వరూప, గుణప్రతిపాదకములైన గీతములను, నామములనుగూర్చి ఎట్టి బిడియమూ లేకుండా గానముచేయుచు అసంగుడై సంచరించుచుండవలెను.


*2.40 (నలుబదియవ శ్లోకము)*


*ఏవంవ్రతః స్వప్రియనామకీర్త్యా జాతానురాగో ద్రుతచిత్త ఉచ్చైః|*


*హసత్యథో రోదితి రౌతి గాయత్యున్మాదవన్నృత్యతి లోకబాహ్యః॥12230॥*


భగవంతుని జన్మ, కర్మ, నామాదిశ్రవణగానాత్మకమైన వ్రతమును అవలంబించుట వలన ఆ సర్వేశ్వరునిపై అంతులేని అనురాగము (భక్తిప్రపత్తులు) కలుగును. అందువలన అతని చిత్తము ఆర్ధ్రమగును. అంతట అతడు అసాధారణస్థితికి లోనగును. అప్పుడు పారవశ్యములో ఈ లోకమునే మరచిపోవును. భక్త పరాధీనుడైన భగవంతుని స్మరించుచు బిగ్గరగా నవ్వును, 'ఇంతకాలమువరకును నేను భగవంతుని ఉపేక్షకు గుఱియైతినే' యని ఏడ్చును. భక్త్యతిరేకముతో భగవంతుని పిలుచును. హర్షాతిశయముచే మధురముగా ఆ స్వామి గుణములను గానము చేయును. ఒక్కొక్కప్పుడు తనకు భగవంతుని సాక్షాత్కారము కలిగినట్లు అనుభవించుచు ఉన్మత్తునివలె ఒడలు మఱచి నృత్యము చేయును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


*26.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - రెండవ అధ్యాయము*


*జనకమహారాజునకును - తొమ్మిదిమంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట - నారదుడు వసుదేవునివద్దకు వచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉బ🕉🕉🕉


*2.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*ఖం వాయుమగ్నిం సలిలం మహీం చ జ్యోతీంషి సత్త్వాని దిశో ద్రుమాదీన్|*


*సరిత్సముద్రాంశ్చ హరేః శరీరం యత్కిం చ భూతం ప్రణమేదనన్యః॥12231॥*


ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, గ్రహములు, నక్షత్రములు, ప్రాణులు, దిశలు, వృక్షములు మొదలగునవియును, నదులు, సముద్రములును భగవత్స్వరూపములనియు, ఈ అన్ని (వీటన్నింటి) రూపములలో భగవంతుడే ప్రకటితుడు అగుచున్నాడనియు అతడు భావించును. అందువలన అతడు ఈ అన్నింటికిని భగవద్భావముతో ప్రణమిల్లును. అంతేగాక, తానును భగవంతునితో తాదాత్మ్యము చెందును.


*2.42 (నలుబది రెండవ శ్లోకము)*


*భక్తిః పరేశానుభవో విరక్తిరన్యత్ర చైష త్రిక ఏకకాలః|*


*ప్రపద్యమానస్య యథాశ్నతః స్యుస్తుష్టిః పుష్టిః క్షుదపాయోఽనుఘాసమ్॥12232॥*


భోజనము చేయుచున్నవానికి ఏకకాలముననే ముద్దముద్దకును తుష్ఠి (సుఖము), పుష్టి (శరీరపోషణశక్తి), ఆకలి తీరుట అనునవి జరుగుచుండును. అట్లే మానవుడు భగవంతుని శరణు జొచ్చి భజించునప్పుడు ప్రతిక్షణమునను భగవద్భక్తి, పరమాత్మతత్త్వజ్ఞానము యొక్క అనుభవము శబ్దాది విషయములయెడ విరక్తి ఏకకాలముననే జరుగును.


*2.43 (నలుబది మూడవ శ్లోకము)*


*ఇత్యచ్యుతాంఘ్రిం భజతోఽనువృత్త్యా భక్తిర్విరక్తిర్భగవత్ప్రబోధః|*


*భవంతి వై భాగవతస్య రాజంస్తతః పరాం శాంతిముపైతి సాక్షాత్॥12233॥*


నిమి (జనక) మహారాజా! ఈ విధముగా ప్రతిక్షణము అభ్యాసబలముచే భగవంతుని చరణకమలములను భజించు భక్తునకు దైవభక్తి, సంసారమునెడ విరక్తి, భగవత్స్వరూప గుణములయెడ స్ఫూర్తి తప్పక ఏర్పడును. అప్పుడు

 ఆ భాగవతోత్తముడు ప్రత్యక్షమైన పరమశాంతిని పొందును.


*రాజోవాచ*


*2.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*అథ భాగవతం బ్రూత యద్ధర్మో యాదృశో నృణామ్|*


*యథాఽఽచరతి యద్బ్రూతే యైర్లింగైర్భగవత్ప్రియః॥12234॥*


*నిమి (జనక) మహారాజు ఇట్లు ప్రశ్నించెను* 'మహాత్మా! భగవంతుని శరణుజొచ్చిన భాగవతోత్తముని యొక్క ధర్మము ఎట్టిది? మానవులమధ్య అతడు ఎట్లు చరించును? అతని స్వభావము ఎట్లు ఉండును? అతని భాషణము ఎట్టిది? ఏ లక్షణముల వలన అతడు భగవంతునకు ప్రీతిపాత్రుడగును? మొదలగు విషయములను అన్నింటిని దయతో విశదపరుచుము.


*హరిరువాచ*


*2.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*సర్వభూతేషు యః పశ్యేద్భగవద్భావమాత్మనః|*


*భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః॥12235॥*


*పిమ్మట 'హరి' యను యోగీశ్వరుడు ఇట్లనెను* "నిమి మహారాజా! పిపీలికాది బ్రహ్మపర్యంతముగల సకల ప్రాణుల యందును, తనయందును భగవంతుని ఉనికిని భావించువాడు అట్లే, భగవంతునియందు ఆత్మస్వరూపుడగు సమస్త ప్రాణులను దర్శించువాడు భాగవతోత్తముడనబడును.


*2.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*ఈశ్వరే తదధీనేషు బాలిశేషు ద్విషత్సు చ|*


*ప్రేమమైత్రీకృపోపేక్షా యః కరోతి స మధ్యమః॥12236॥*


సర్వేశ్వరునియందు భక్తిభావమును, భగవద్భక్తులయందు మైత్రిని, దుఃఖితులపైనను, పామరులయెడలను కృపను, అట్లే భగవంతుని ద్వేషించువారియెడ ఉపేక్షాభావమును కలిగియుండువాడు మధ్యమస్థాయికి చెందిన భక్తుడు.


*2.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*అర్చాయామేవ హరయే పూజాం యః శ్రద్ధయేహతే|*


*న తద్భక్తేషు చాన్యేషు స భక్తః ప్రాకృతః స్మృతః॥12237॥*


భగవంతునియొక్క అర్చామూర్తిని శ్రద్ధచూపనివాడు, ఇక ఇతరులయెడ ఏ మాత్రమూ శ్రద్ధ చూపనే చూపనివాడు సామాన్య భక్తుడని అనబడును.


*2.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*గృహీత్వాపీంద్రియైరర్థాన్ యో న ద్వేష్టి న హృష్యతి|*


*విష్ణోర్మాయామిదం పశ్యన్ స వై భాగవతోత్తమః॥12238॥*


భాగవతోత్తముడు ఇంద్రియములద్వారా శబ్దాది విషయములను గ్రహించుచున్నను అవి తన ఇచ్ఛకు అనుకూలముగా ఉన్నప్పుడు పొంగిపోడు. మరియు అతడు ఈ జగత్తంతయును విష్ణుమాయయేయని తలంచును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*980వ నామ మంత్రము* 26.8.2021


*ఓం జ్ఞానగమ్యాయై నమః*


జ్ఞానముచే పొందదగినది అయిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జ్ఞానగమ్యా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం జ్ఞానగమ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి పరబ్రహ్మమును తెలుసుకోగలిగిన జ్ఞానమును పొందుటకు కావలసిన దీక్షాపటిమను అనుగ్రహించును.


సాధకునికి పరబ్రహ్మతత్త్వమును తెలియగలిగే జ్ఞానము ఉండవలెను. అట్టి జ్ఞానముతో మాత్రమే శ్రీమాతను తెలిసికోవడం జరుగుతుంది. వేదపండితుడైనను, సకల శాస్త్రపారంగతుడైనను, ప్రవచనములను చెప్పుటలో మంచి పట్టు ఉన్నవాడైనను, నీతిశాస్త్రములు ఎన్ని చదివినను మోక్షమును పొందడం కష్టం. తాను విన్నది, చదివినది మనసుకు పట్టించుకొని, పరబ్రహ్మతత్త్వాన్ని ఆకళింపుచేసుకుని దీక్షగా సాధనచేయాలి. జ్ఞానసముపార్జనకు కావలసిన సాధనాపటిమ కలిగియుండి, జీవాత్మపరమాత్మలు ఒకటే యనే అద్వైత భావనతో, జగన్మాత స్వరూపమును తన హృదయంలోని దహరాకాశంలో చిత్రించుకొని ఆరాధన చేస్తే లభించేదే బ్రహ్మజ్ఞానము. అట్టి బ్రహ్మజ్ఞానసముపార్జనతో ముక్తి లభించుతుంది. బ్రహ్మజ్ఞానస్వరూపమే జగన్మాత గనుకనే అమ్మవారు *జ్ఞానగమ్యా* యని అనబడినది. 


*య త్తు మే నిష్కళం రూపం చిన్మాత్రం కేవలం శివమ్|*


*సర్వోపాధి వినిర్ముక్తం అనంత మమృతం పరమ్|*


*జ్ఞానేనైకేన తల్లభ్యం క్లేశేన పరమం పదమ్॥* (సౌభాగ్య భాస్కరం, 1072వ పుట)


'నాకు సకలము, నిష్కళము అని రెండు రూపములు కలవు. అందులో నా నిష్కళ రూపము శుద్ధజ్ఞానస్వరూపము. అది అమృతపరమైనది. నా నిష్కళరూపము కేవలము జ్ఞానముచేతనే పొందదగినది. ఎవరైతే సర్వత్ర జ్ఞానమును చూచుచున్నారో వారు నన్ను పొందుచున్నారు, కైవల్యముననుభవించుచున్నారు' అని శ్రీమాత చెప్పినట్లు కూర్మపురాణంలో ఉన్నది.


పరబ్రహ్మ జ్ఞానస్వరూపమగుటచే, అట్టి పరబ్రహ్మను పొందాలంటే జ్ఞానమే సరైన మార్గము గనుక పరమేశ్వరి *జ్ఞానగమ్యా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం జ్ఞానగమ్యాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*397వ నామ మంత్రము* 26.8.2021


*ఓం మూలప్రకృత్యై నమః*


సమస్త జగత్తులకు మూలకారణమై తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మూలప్రకృతిః* యను ఐదక్షరముల నామ మంత్రమును *ఓం మూలప్రకృత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ మూలప్రకృతిస్వరూపిణియైన జగన్మాత, ఆ సాధకులు చేయు సాధనాపటిమను మరింత పటుత్వమొనరించి సాధనలో పరిపూర్ణతను సంప్రాప్తింపజేయును.


పాంచభౌతికమయిన చరాచరజగత్తుకు మూలమైనటువంటిది. అనగా పంచభూతములకు ములమైన ప్రకృతి ఆ పరమేశ్వరియే *మూలప్రకృతిః* అని అనబడినది.


పుట్టేబిడ్డకు తల్లిదండ్రులు మూలం. అనంతకోటి జీవాలకు మూలం ఈ పృథివి.  అయితే ఈ భూమికి మూలం జలం. జలానికి మూలం అగ్ని. అగ్నికి మూలం వాయువు. వాయువుకు మూలం ఆకాశం. ఆకాశానికి మూలం పరబ్రహ్మ. ఇక ఈ పరబ్రహ్మకు మూలంలేదు. ఎందుకంటే జననమరణ చక్రభ్రమణమునకు అతీతమైనది ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్వరూపిణియైన పరమేశ్వరియే *మూలప్రకృతిః* అని యనబడుచున్నది.


సృష్టికి పూర్వము మాయలో కలిసి యుండిన అనంతకోటి జీవరాశులు పరిపక్వంకాని కర్మతో పరమాత్మలో లీనమై ఉంటాయి.  కర్మపరిపక్వమయిన తరువాత సృష్టి జరుగుతుంది. ఈ కార్యములన్నియు పంచకృత్యపరాయణయైన పరమాత్మ నిర్వహించడం జరుగుతుంది. అటువంటి పరమాత్మయే *మూలప్రకృతిః* అని అనబడుతుంది.


మాయ అంటే వ్యక్తముకానిది. అందుచేత మాయనే అవ్యక్తము అంటారు. అటువంటి అవ్యక్తమునుండి మహత్తత్త్వము, ఆ మహత్తత్త్వమునుండి తమోగుణప్రధానమైన అహంకారము పుడుతుంది.  ఆ విధంగా 1. సత్త్వము, 2. రజస్సు, 3. తమస్సు అను త్రిగుణములు ఉద్భవిస్తాయి. ఈ విధమైన సృష్టికి మూలమే మూలప్రకృతి.  పంచకృత్య (సృష్టిస్థితిలయతిరోధాననుగ్రహములు)  పరాయణ అయిన పరమేశ్వరియే *మూలప్రకృతిః* అనబడుచున్నది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మూలప్రకృత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *25.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - రెండవ అధ్యాయము*


*జనకమహారాజునకును - తొమ్మిదిమంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట - నారదుడు వసుదేవునివద్దకు వచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*2.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*తాన్ దృష్ట్వా సూర్యసంకాశాన్ మహాభాగవతాన్ నృప|*


*యజమానోఽగ్నయో విప్రాః సర్వ ఏవోపతస్థిరే॥12215॥*


వసుదేవ మహారాజా! సూర్యతేజస్సులతో వెలుగొందుచున్న ఆ కవి ప్రభృతి భాగవతోత్తములను గాంచి, యజమానుడైన జనకుడు, ఆకృతులను దాల్చిన త్రేతాగ్నులు, మహర్షులు, మున్నగువారు అందరును వారికి స్వాగతము పలుకుచు లేచి నిలబడిరి.


 *2.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*విదేహస్తానభిప్రేత్య నారాయణపరాయణాన్|*


*ప్రీతః సంపూజయాంచక్రే ఆసనస్థాన్ యథార్హతః॥12216॥*


జనకమహారాజు వారిని శ్రీమన్నారాయణునియెడ భక్తితత్పరులుగా ఎరింగెను. పిదప వారిని సుఖాసీనులను గావించి, సంతోషముతో యథాయోగ్యముగా భక్తిశ్రద్ధలతో పూజించెను.


 *2.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*తాన్ రోచమానాన్ స్వరుచా బ్రహ్మపుత్రోపమాన్ నవ|*


*పప్రచ్ఛ పరమప్రీతః ప్రశ్రయావనతో నృపః॥12217॥*


ఆ మహానుభావులు బ్రహ్మమానస పుత్రులైన సనకాదులవలె దివ్యతేజస్సంపన్నులై విరాజిల్లుచుండిరి. అప్పుడు జనక (నిమి) మహారాజు మిగుల వినమ్రుడై ప్రీతితో వారిని ఇట్లు ప్రశ్నించెను.


*విదేహ ఉవాచ*


 *2.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*మన్యే భగవతః సాక్షాత్పార్షదాన్ వో మధుద్విషః|*


*విష్ణోర్భూతాని లోకానాం పావనాయ చరంతి హి॥12218॥*


*విదేహరాజు ఇట్లనెను* "మహాత్ములారా! మీరు సాక్షాత్తూ సర్వేశ్వరుడైన ఆ మధుసూదనుని (శ్రీహరి) యొక్క పార్షదులని భావించుచున్నాను. విష్ణుభక్తులు లోకములను పావనము చేయుటకే సంచరించుచుందురుగదా!


 *2.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభంగురః|*


*తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠప్రియదర్శనమ్॥12219॥*


అట్టి మనుష్యశరీరము (నరజన్మ) లభించుట ఎంతయు దుర్లభము. ఐనను అది క్షణభంగురమైనధి. అట్టి మానవాళికి మీవంటి పరమ భాగవతోత్తముల దర్శనము లభించుట మరింత దుర్లభము.


 *2.30 (ముప్పదియవ శ్లోకము)*


*అత ఆత్యంతికం క్షేమం పృచ్ఛామో భవతోఽనఘాః|*


*సంసారేఽస్మిన్ క్షణార్ధోఽపి సత్సంగః శేవధిర్నృణామ్॥12220॥*


మహానుభావులారా! ఈ లోకమున పరమశ్రేయస్సును గూర్చునది ఏది? దానిని పొందుటకు ఉపాయమేమి? ఈ లోకమున మహాత్ములతో సమాగమము అర్ధక్షణమ లభించినను అది మానవులకు పెన్నిధివంటిది గదా! దీనిని గూర్చి వివరింపప్రార్థన!


 *2.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*ధర్మాన్ భాగవతాన్ బ్రూత యది నః శ్రుతయే క్షమమ్|*


*యైః ప్రసన్నః ప్రపన్నాయ దాస్యత్యాత్మానమప్యజః॥12221॥*


యోగీశ్వరులారా! వినుటకు మేము యోగ్యులమైనచో, మీరు దయతో మాకు భాగవత ధర్మములను ఉపదేశింపుడు. అట్టి ధర్మములను ఆచరించి, శరణాగతుడైన భక్తునిపట్ల భగవానుడు మిగుల ప్రసన్నుడగును. అంతేగాదు, కరుణామూర్తియగు భగవంతుడు అట్టి భక్తునకు తనను తానే ఇచ్చివేయును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *26.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2242(౨౨౪౨)*


*10.1-1354-*


*క. చూచెదరు గాని సభికులు*

*నీ చిన్నికుమారకులకు నీ మల్లురకు*

*న్నో చెల్ల! యీడు గాదని*

*సూచింపరు పతికిఁ దమకు శోకము గాదే?* 🌺



*_భావము: ఆ పుర స్త్రీలు ఇంకా ఇలా అనుకుంటున్నారు: "సభ లో ఉన్న పెద్దలు కూడా చోద్యం చూస్తున్నారే కానీ 'అయ్యో! ఈ అసమంజసమైన పోటీ సబబు కాద'ని రాజుకు సలహా ఇచ్చి ఆపించరే? అసలు వీళ్ళకి ఏ బాధా కలగటం లేదా?"_* 🙏



*_Meaning: Those women in distress were expressing their concern further:”These elders in the courtyard are watching this as fun but not intervening and suggesting to the king to stop this disproportionate and inappropriate fight. It is deplorable that these seniors and superiors are not feeling even a pinch of pain.”_* 🙏    



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

ప్రశ్న పత్రం సంఖ్య: 22

  ప్రశ్న పత్రం సంఖ్య: 22  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

భారత సంబంధ క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  

  1) సవ్యసాచి అని ఎవరికి పేరు 

2) లక్క ఇంట్లో చనిపోయిన వారు ఎవరు 

3) లక్క ఇల్లు నిర్మించిన ఇంజనీర్ (వాస్తు శిల్పి) పేరు ఏమిటి. 

 4)  శ్రీ కృష్ణ భగవానుల గురువు గారు ఎవరు. 

 5) పాండవులు, కౌరవులు బంతి ఆట ఆడే సమయంలో బావిలోంచి బంతిని తీసిన ధనుర్ధారి ఎవరు.   

6) దృతరాష్టునికి కుమార్తెలు ఎందరు పేర్లు చెప్పండి. 

7) ధర్మరాజుతో పాటు స్వర్గావరోహణ పర్వంలో తోడుగా  వెళ్లిన జంతువూ ఏది తరువాత అది ఏ దేవత అని తెలుసుకుంటాడు.. 

8) అడవిలో పాండవులు వున్న పర్వానికి పేరు ఏమిటి. 

9) శ్రీ కృష్ణ భగవానులు శరీరంలో ఏ అవయవానికి బాణం తగలటం వలన చనువు చాలించారు. 

10)  ఉత్తర వివాహమాడిన వీరుని పేరు ఏమిటి. 

 11) అర్జనునికి  శాపం పెట్టిన అప్సరస ఎవరు. 

12) ధర్మరాజు ఆడిన అబద్దం ఏమిటి. 

 13) శిశుపాలుని వాదించింది ఎవరు ? 

14) నకుల సహదేవుల మేన మామ ఎవరు 

15) కృష్ణ భగవానుల తండ్రిగారు ఏ జంతువూ కాళ్ళు పట్టుకున్నారు. ? 

16) భారతంలో ఎన్ని పర్వాలు వున్నాయి. 

17) రధికుని నిరుత్సహ పరుస్తూ చేసే సారధ్యాన్ని యేమని అంటారు. 

 18) పాండవులు, కావురవులు ఆడిన జూదములో పాచికలు యెట్లా తాయారు చేశారు 

19) శకుని కుంటివాడుగా మారటానికి కారణం ఎవరు. 

 20) భారతంలో మీకు నచ్చిన పర్వం ఏది ఎందుకు. 




పెళ్లి కావడం లేదు !!

 "మన్మధరావు" కి పెళ్లి కావడం లేదు !!

ఎన్నో ఫోటోలు పెట్టాడు !!

అన్ని షాదీ డాట్ కామ్ లకి ఫోటోలు పంపించాడు !!


అబ్బే ..ఒక్క సంబంధం రాలేదు !!!


నా దగ్గర కి వచ్చి భోరున ఏడ్చాడు !!!


అభయహస్తం ఇచ్చాను !!

తప్పుతుందా మరి !!!


"మన్మధ రావు" ఫోటోలు కొత్తగా తీసి పంపించాను ..


అంతే ...

కుప్పలు తెప్పలుగా సంబంధాలు వచ్చి 

పడిపోయాయి !!


"సారూ ...

ఏం మాయ చేశారు" అని అడిగారు చుట్టుపక్కల వాళ్ళు !!!


"సింపుల్ భయ్యా ...

మన్మధరావు ...

"బట్టలు" ఉతుకుతున్నట్టూ ...


"గిన్నెలు" తోముతున్నట్లూ ...


"కాఫీ" పెడుతున్నట్టూ ..

ఫోటోలు తీసి పెట్టా" !!!

అని చెప్పాను ..


*ఒకడిని ఇంటివాడిని చెయ్యాలంటే ...*

*ఈ రోజుల్లో మాటలు కాదు, చేతలు కావాలి 😝*

అజ్ఞాతకవి వ్రాసిన ఈ పద్యం

 కన్యకు నైదు జంఘలును; గన్యకు నాఱు కుచంబు; లెన్నగాఁ గన్యకు నాల్గు కన్బొమలు; కన్యకు నేడు విశాలనేత్రముల్; కన్యకు ద్వాదశంబు నులికౌనును; గల్గుసులక్షణాఢ్య కాకన్యకు నీకు నింకఁ బదికావలెఁ గస్తూరిరంగనాయకా!


ఎవరో అజ్ఞాతకవి వ్రాసిన ఈ పద్యం గమనింౘండి. అంతా గందరగోళంగా ఉంది కదా! ఈ పద్యం అర్థం కావాలంటే ముందుగా జ్యోతిష్యశాస్త్రంతో కించిత్తు పరిచయం కావాలి. 

అందుకు ప్రాతిపదికగా ద్వాదశరాసులు ఏమిటో ౘూద్దాం! 


అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం.


ఇప్పుడు చిక్కు విడిపోతుంది ౘూడండి. ఇదంతా ఒక కన్య గురించిన ప్రస్తావన కనుక, 'కన్యకు ఐదు జంఘలును (పిక్క)' అన్నాడు కనుక ఇప్పుడు ద్వాదశరాసుల్లో కన్యనుంచి మొదలుపెట్టి ఐదోరాశి ఏమిటో ౘూద్దాం! అది 'మకరం'. పిక్కలు మకరంతో పోల్చడం కవిసమయం! 


తరువాత 'కన్యకు ఆరు కుచంబు (స్తనం)', కన్య నుంచి ఆరోది కుంభం అంటే స్తనాలు కుంభాల్లాగా ఉన్నాయని


ఆ తరువాత 'కన్యకు నాల్గు కన్బొమలు'. కన్య నుంచి నాలుగవది ధనూరాశి, అంటే కనుబొమలు ధనుస్సులాగా ఉన్నాయని


ఆ తరువాత 'కన్యకు నేడు విశాల నేత్రముల్' అంటే ఆవిడ కళ్ళు మీనం అంటే చేపల్లా ఉన్నాయని


ఆ తరువాత 'కన్యకు ద్వాదశంబు నులికౌనును (నడుము)' అంటే ఆవిడ నడుము సింహం నడుములా సన్నగా ఉంది. 


ఇటువంటి సల్లక్షణాలు కలిగిన కన్య 'నీకు బది కావలె', అంటే పదోరాశి అనగా మిథునం, అంటే 'ఆవిడతో నీకు జత కుదరాలని' కస్తూరి రంగనాయకుడికి విన్నవిస్తున్నాడు.


ఆ పద్యం వివరణ చదవక ముందు కాస్తా వెగటనిపించినా చదివిన తరువాత కవి చమత్కారానికి జోహార్లు.

అనుగ్రహం,కృతజ్ఞత

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*అనుగ్రహం,కృతజ్ఞత*

ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట నివసిస్తూ ఉండేది. అక్కడ ఎటువంటి పచ్చదనమూ లేకపోవటం వలన ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది.


ఒక రోజున నారదుడు అటు పోతూ ఈ పిట్ట పడుతున్న కష్టాలను చూసి చాలా జాలి పడ్డాడు. ఆ పక్షి దగ్గరకు వెళ్ళి ,” ఓ చిన్ని పక్షి ! ఇంత మండే ఎడారిలో నీవు ఏమి చేస్తున్నావు? నీకు ఏమైనా సహాయం చేయనా?అని అడిగాడు.


ఆ చిన్ని పక్షి,” నాకు

నాజీవితం ఎంతో ఆనందంగా ఉంది.కాని ఈ ఎండ వేడిని నేను భరించలేకపోతున్నాను. నా పాదాలు రెండు కాలిపోతున్నాయి.ఇక్కడ ఒక చెట్టు ఉంటే, ఈ ఎండ, వేడిని కొంచము తట్టుకుని హాయిగా,సంతోషంగా ఉండగలను." అని చెప్పింది.


“ఇటువంటి ఎడారిలో చెట్టు మొలవటం అంటే, నా ఊహకి అందకుండా ఉన్నది.అయినా నేను పరమాత్మ దగ్గరకి వెళ్లి నీ కోరిక నెరవేర్చమని అయనను అడుగుతాను” అన్నారు.


శ్రీమహా విష్ణువు వద్దకు వెళ్లి ఆ పిట్టకి సహాయం చేయమని ఆయనకు ఈ పిట్ట విన్నపము తెలియజేశాడు. అప్పుడు ఆయన "నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలా చేయగలను.కానీ ఆ పిట్ట విధి రాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను. కానీ,ఎండ నుంచి ఉపశమనము కోసము ఒక ఉపాయం చెబుతాను. ఎప్పుడూ ఏదో ఒక కాలి పైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు.అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి కొంత విశ్రాంతి దొరికి, ఉపశమనం కలుగుతుంది. వెళ్లి ఆ పక్షి తో ఇలా నేను చెప్పానని చెప్పు" అన్నారు పరమాత్మ.


నారదుడు మళ్ళీ ఎడారిలో ఉన్న పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాను వినిపించాడు పక్షికి భగవానుని పై ఎంతో నమ్మకము.ఈ ఉపాయం విని చాలా సంతోషించింది. నారద మహర్షికి ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది.ఈయనకు అర్థం కాలేదు "ఇందులో ఇంత సంతోషించటానికి ఏముందో.అడిగిన చెట్టు మొలిపించలేదు సరి కదా, ఒంటి కాలి మీద నడువు" అని ఇచ్చిన సలహా వలన ఉపయోగమేమిటో అని తికమక పడ్డాడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి వెంటనే అమలు లో పెట్టటం మొదలు పెట్టింది.


మహర్షికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. కొన్నాళ్లకు మళ్ళీ అక్కడికి వెళ్లి చూద్దామని ఆ దారిలో వెళుతూ ఆ పక్షిని చూశాడు. అది హాయిగా ఆ ఎడారి మధ్యలో ఉన్న ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చుని ఉంది. పక్షి సుఖంగా హాయిగా ఉండటం చూసి ఈయనకి ఆనందం కలిగింది, అయినా పరమాత్మ చెప్పక పోయినా చెట్టేలా వచ్చిందనే విషయం బోధ పడలేదు. మళ్ళీ దేవుడి దగ్గరకి వెళ్ళి ఆయనతో ఈ పక్షి గురించి తాను చూసిందంతా చెప్పాడు.


అందుకు శ్రీమహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు:" నేను చెప్పినట్లే జరిగింది. పక్షి తల రాతలో చెట్టు రాసి పెట్టలేదు. కానీ నీవు ఆ పక్షికి నా సందేశం వినిపించిన తరువాత, భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని అర్థము చేసికొని ఆచరించింది. అంతే కాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయముతో తనకు లభించిన భగవత్ప్రసాదమును స్వచ్ఛమైన అంతఃకరణతో అమలులో పెట్టింది. ఆపక్షి చూపించిన ఈ భక్తి శ్రద్ధలకు నా అనుగ్రహము మేరకు తల రాతను మార్చేసి, అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను" అన్నారు. 

                                                                                                                                                                            

అందిన అనుగ్రహాన్ని ఆచరించాలి, ఆ పూటకు దొరికిన దాన్ని ప్రసాదముగా భావించాలి. ఈ మాత్రము అందుకోగలిగినందుకు ఆయన పట్ల కృతజ్ఞత చూపాలి. మనకేమి కావాలో ఆవి యిస్తారు, మనం కోరుకున్నవన్నీ మనకు సుఖ శాంతులు అందించలేకపోవచ్చు. అందువలన ఇది కావాలి అది కావాలి అని కోరుకునే కంటే, మనకేది అవసరమో ఆయనే ఇచ్చేటట్లు ధన్యవాదములు తెలియచేసుకోవాలి, భగవంతుని ఆశీస్సులను పొందే ప్రయత్నం చేయాలి. భక్తి శ్రద్ధ కృతజ్ఞతా భావం, విశ్వాసం- వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది.

*:హరే రామ హరే కృష్ణ:* 

🙏Please read 🙏

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *25.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2241(౨౨౪౧)*


*10.1-1352-వ.*

*10.1-1353-*


*ఉ. "మంచి కుమారులం గుసుమ మంజు శరీరులఁ దెచ్చి చెల్లరే*

*యంచిత వజ్రసారులు మహాద్రి కఠోరులు నైన మల్లురం*

*గ్రించులఁ బెట్టి రాజు పెనఁగించుచుఁ జూచుచు నున్నవాఁడు; మే*

*లించుకలేదు; మాను మనఁ డిట్టి దురాత్ముని మున్ను వింటిమే?* 🌺



*_భావము: అలా బలరామకృష్ణులు మల్లయోధులతో పోరాడుతున్న సమయంలో, మధుర లోని మచ్చకంటులు (మహిళలు)  గుంపులు గుంపులుగా చేరి, వేడి నిట్టూర్పులతో వారిలో వారు ఇలా తమ ఆందోళనను చర్చించుకుంటున్నారు: “ఔరా! కుసుమ కోమలమైన శరీరాలు కల ఈ చిన్ని పిల్లలను రప్పించి, వజ్రదేహులూ, పర్వతాల వంటి కఠోరులు అయిన  మల్లయోధులతో పోరాటం చేయిస్తూ, రాజు వినోదం చూస్తున్నాడు. ఇదేమన్నా పద్ధతిగా ఉన్నదా? ఇంత భయంకరంగా పోరు సాగుతున్నా కూడా ఆపమని అనడేమి? ఇలాంటి దుర్మార్గులను గురించి ఇంతకు ముందు ఎన్నడైనా విన్నామా?"_* 🙏🏻



*_Meaning: As Balarama and Sri Krishna were grappling with those two wrestling giants, the womenfolk of Madhura were discussing their concern, with deep sighs, in groups: "Alas! The king summoned these two tender boys and is making them fight these experienced warriors, who are with strong bodies and toughnuts in the size of mountains. This is inhuman and further he is treating this as entertainment and enjoying the fare. Why doesn't he stop this unequal fight? Did we ever hear about such cruel and wicked people?"_* 🙏🏻



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*