5, ఆగస్టు 2023, శనివారం

బంధాలు

 *బంధాలు*


ఓ రైతు తన మూడు గాడిదలను అమ్మేయడానికి అంగడికి తీసుకెళ్తున్నాడు... మార్గమధ్యంలో ఓ నది కనిపించింది... అసలే నడిచీ నడిచీ ఒళ్లంతా చెమట చిటచిట... స్నానం చేస్తే పుణ్యం, శుభ్రత రెండూ దక్కుతాయని అనుకున్నాడు... 


ఆ గాడిదల్ని కట్టేయడానికి తన దగ్గర రెండే తాళ్లున్నాయి... మరి మూడో గాడిదను కట్టేయడం ఎలా..?


ఓ సన్యాసి అలా నడిచిపోతున్నాడు... తనను పిలిచాడు... స్వామీ, నీ దగ్గర ఓ తాడు ఉంటే ఇవ్వవా...? కాసేపు నా గాడిదను కట్టేస్తా, నా స్నానం కాగానే నీ తాడు నీకు తిరిగి ఇచ్చేస్తా...


నా దగ్గర తాడు లేదు కానీ ఓ ఉపాయం చెబుతాను అన్నాడు ఆ సాధువు...


నీ దగ్గర ఉన్న తాళ్లతో ఆ రెండు గాడిదలను కట్టెయ్... మూడోది చూస్తూనే ఉంటుంది... తరువాత దీని వెనక్కి వెళ్లి తాడుతో చెట్టుకు కట్టేస్తున్నట్టు నటించు...


సాధువు చెప్పినట్టే చేశాడు... నదీస్నానం పూర్తిచేశాడు... వెనక్కి వచ్చి ఆ రెండు గాడిదల కట్లు విప్పేశాడు... అదిలించాడు, తను ముందు నడుస్తున్నాడు... కాసేపయ్యాక చూస్తే రెండు తనతో వస్తున్నాయి కానీ మూడో గాడిద మాత్రం ఆ చెట్టు దగ్గర నుంచి అస్సలు కదలడం లేదు...  అక్కడే ఉండిపోయింది... 


తట్టాడు, కొట్టాడు, తిట్టాడు... ఊహూఁ... ఫలితం లేదు... అటూఇటూ చూస్తుంటే అదే సాధువు కనిపించాడు... స్వామీ, స్వామీ, ఇది మొరాయిస్తోంది, కదలనంటోంది...


అసలు నువ్వు కట్లు విప్పితే కదా, అది కదిలేది... అన్నాడు సాధువు...


అసలు నేను కట్టేస్తే కదా విప్పేది... అంటాడు రైతు...


అవునోయీ, అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ గాడిదకు తెలియదు కదా... తను ఇంకా కట్టేసి ఉన్నట్టే భావిస్తోంది... 


అయ్యో, మరేం చేయాలిప్పుడు..?


కట్లు విప్పితే సరి... కదులుతుంది... 


అసలు కట్టేస్తే కదా... విప్పేది... 


పిచ్చోడా... కట్టేసినట్టు ఎలా నటించావో, విప్పేసినట్టు కూడా నటించవోయ్... 


రైతు అలాగే చేశాడు... గాడిద ముందుకు కదిలింది, మిగతా రెండింటితో కలిసింది... రైతు సాధువు వైపు అయోమయంగా చూశాడు... 


‘‘మనుషులు కూడా అంతేనోయ్... కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్టు వ్యవహరిస్తాం... కదలం, ఉన్నచోటు వదలం... నిజానికి అవన్నీ భ్రమాత్మక బంధాలు... అవేమీ లేవనే నిజం తెలిస్తే చాలు... ప్రపంచమంతా నీదే...


అర్థమయ్యీ కానట్టుగా ఉంది... అవును, మరి తత్వం, సత్యం ఎప్పుడూ సంపూర్ణంగా అర్థం కావుగా... రైతు కాసేపు బుర్ర గోక్కున్నాడు... సాధువుకు ఓ దండం పెట్టి తన గాడిదల వైపు కదిలాడు...


***   ***   ***

*ఈ జీవిత సత్యం!!.*..🌹

 *ఈ జీవిత సత్యం!!.*..🌹


🙏🙏🙏🙏🙏🙏🙏🙏


ఒకానొక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం వ్యాపారం లో తనకొచ్చిన లాభాలలో నాలుగో వంతన్నా దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. 

అందరూ తనను దాన కర్ణుడు అని ప్రశంసిస్తూ ఉంటే ఆయనకు అదొక తృప్తి గా ఉండేది. 


చనిపోయిన తరవాత కోటీశ్వరుడు స్వర్గం చేరాడు, కానీ అక్కడ కొద్ది కాలం మాత్రం గడిపిన తర వాత, యమదూతలు తనని నరకానికి తీసుకువెళ్లటం అతడికి బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగింది. 


నరకా నికి వెళుతూనే, చిత్రగుప్తుడితో వాదం పెట్టుకొన్నాడు. ‘అయ్యా! ఇన్ని దానధర్మాలు చేసిన నన్ను నరకానికి పంపడ మేమిటి? మీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది...


దాన్ని సరిచేయించండి’ అని....


 చిత్రగుప్తుడు కోటీశ్వరుడికి పరిస్థితి వివరించాడు:...


 ‘నాయ నా, పొరపాటేమీ లేదు, నీకు నీ దానధర్మాల వల్ల చాలా పుణ్యం రావలసిన మాట నిజ మే, కానీ, నువ్వు దానం కోసం నీ దగ్గరకు వచ్చిన వాళ్ల ను చులకనగా చూసి, ఒకటికి పదిసార్లు నీ చుట్టూ తిప్పించుకొన్న తరవాతే నువ్వు చేసే దానమేదో చేసేవా డివి...


ఆ కారణంగా, నీకు రావలసిన పుణ్యంలో నాలు గోవంతు చేతులారా నువ్వే పోగొట్టుకొన్నావు! ఆ తర వాత, ‘నేను అంత దానం చేశానూ, ఇంత దానం చేశానూ’ అని పదే పదే ప్రతిచోటా సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకొని మరో నాలుగో వం తు పుణ్యం పోగొట్టుకున్నావు!’


 ‘అయినా, కనీసం ఆ మిగతా సగం పుణ్యమన్నా నాకు దక్కాలి గదా?’ అన్నాడు కోటీశ్వరుడు...


 ‘దక్కేదే, కానీ దాన గ్రహీతల చేత నువ్వు చేయించుకొన్న సత్కా రాలూ, సన్మానాలు, స్తుతులు, స్తోత్రాలూ వగైరాలకూ నీ పేరు ఉండాలని బలవంతం చేసి, నువ్వు సంపాదించిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసుకొన్నావు! 


కనక నీకు రావలసిన పుణ్యంలో స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది’ అన్నాడు చిత్ర గుప్తుడు.


 ‘అదేమిటి? నా డబ్బుతో కట్టించిన ఆశ్రమా లకు నా పేరు పెట్టమంటే తప్పా? నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకొంటే పాప మా?’ ఆక్రోశంతో ప్రశ్నించాడు కోటీశ్వరుడు...


 ‘అక్కడే చాలా మందిలా నువ్వూ పొరబడుతున్నా వు నాయనా! 

భూమి మీద నువ్వు జన్మ ఎత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకొన్న ద్రవ్యమంటూ ఒక్కపైసా లేదు. 


నీ జీవిత కాలంలో కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చాయి, కానీ ఆ జీవిత కాలం ముగిసిన తర్వా త సంక్రమించినదాన్లో ఒక పైసా కూడా మళ్లీ నీతో తెచ్చుకోలేకపోయావు. 


ఇక అది నీ సొమ్ము ఎలాగ యింది చెప్పు? సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలూ, వనరులూ అన్నీ భగవంతుడివే. నీ కర్మ ఫలం వల్ల, ఆయన తన మహదైశ్వర్యంలో కొద్దిపాటి భాగం కొంతసేపు నీ చేతి లో ఉంచాడు...


ఆ ధనంలో కొంత భాగం నువ్వు ఆయ న మెచ్చే దానధర్మాల కోసం వాడిన మాట నిజమే! ఆ మాత్రానికే నీకు ఎంతో పుణ్యం రావలసింది,


కానీ ఆ పుణ్యమేదో అప్పటికప్పుడే పేరు కోసం, కీర్తి కోసం, అహం కోసం ఖర్చు పెట్టేసుకొన్నావు...


'మిగిలిన అతి స్వల్ప భాగం నువ్వు చేసిన కొద్ది కాలపు స్వర్గవాసంతో చెల్లు అయిపోయింది’ అని చిత్రగుప్తుడు చెప్పేసరికి కోటీశ్వరుడు కొయ్యబారి పోయాడు...


సేకరణ...

*సర్వేజనాసుఖినోభవంతు*         . .     🙏🙏🌄🙏🙏

Kamarajan great leader

 


సంస్కృత భారతీ* *5*

 *సంస్కృత భారతీ* 

           *5*

*పంచమ పాఠః*

*తుమున్ ప్రత్యయ విశేషః*

 తుమున్ ప్రత్యయం చేర్చినచో కొరకు అనే భావం వస్తుంది.

*ఉదా*:-- కర్తుం = చేయుటకు, కారయితుం = చేయించుటకు, గన్తుం = వెళ్ళుటకు, గమయితుం = పంపుటకు, భోక్తుం = తినుటకు, వక్తుం = చెప్పుటకు, ఆనయితుం = తెచ్చుటకు, ప్రాపయితుం = పొందించుటకు, ప్రాప్తుం = పొందుటకు, పఠితుం = చదువుటకు, గణితుం = లెక్కించుటకు, దాతుం= ఇచ్చుటకు... ఒకవేళ ఆ తుమున్ ప్రత్యయం ద్వారా కలిగే మార్పు తెలియక పోతే ఆ క్రియాపదానికి తదుపరి " కర్తుం" చేర్చి ప్రయోగించదగును.

*ఉదా*:-- గానం కర్తుం (గాతుం)= పాట పాడుట చేయుటకు( పాడుటకు), భోజయితుం/ భోజనం కారయితుం ఈ రెండింటికినీ భోజనం చేయించుటకు అనే భావమే కలుగుతుంది...ఇలా.

*ప్రయోగ విభాగః*

*ప్ర*:-- త్వం కుత్ర కిమర్థం గఛ్ఛసి? ... నీవు ఎక్కడ కు ఎందుకు వెళ్ళుచున్నావు?

*స*:-- అహం పాఠశాలాయాం ప్రతి పఠితుం గఛ్ఛామి... నేను పాఠశాల కు చదువుటకు వెళ్ళు చున్నాను.

*ప్ర*:-- త్వం శ్వః కుత్ర కిమర్థం గమిష్యసి?.. నీవు రేపు ఎక్కడ కు ఎందుకు వెళ్ళెదవు??

*స*:-- అహం శ్వః రాజమహేంద్రవరం పర్యన్తం గోదావరినదీస్నానం కర్తుం (నద్యాం స్నాతుం) గన్తుం ఇఛ్ఛామి... నేను రేపు రాజమహేంద్రవరం వరకూ గోదావరి నదీస్నానం చేయడానికి(నది లో స్నానం చేయడానికి) వెళ్ళుటకు ఇష్టపడుచున్నాను....ఇలా ప్రయత్నం చేయగలరు.

*శుభం భూయాత్*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

అడవిలో కాచి న వెన్నెల

 *1819*

*కం*

సడవన పుట్టిన పూవులు

గుడినో జడనో దరిగొని గుర్తించబడున్.

అడవిన గాచిన వెన్నెల

కడకును గుర్తించబడదు కనుగొన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నడిచే దారిలో పుట్టిన పూవులు జడలోనో,గుడిలోనో చేరగా గుర్తింపు ను పొందుతాయి. కానీ అడవిలో కాచి న వెన్నెల చివరకు కూడా గుర్తింపు నొందలేదు.

*సందేశం*:-- వినియోగించబడే చోట మాత్రమే ఏ వస్తువు కైనా వ్యక్తులకైనా విలువ ఉంటుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సంస్కృత శ్లోకం.

 *అనుష్టుప్*

రామనామ జపం కేమి

ఉప్రఛత్రి ఒఝాబిహ

ఉఖగోహి తెమేమప్ర

అప్రాంప్రగు అబెంతక.


భారత దేశంలో ని 29 రాష్ట్రాల పేర్లలోని మొదటి అక్షరాలతో తయారు చేయబడిన సంస్కృత శ్లోకం.


*రా* - రాజస్థాన్

*మ* - మహారాష్ట్ర

*నా* - నాగాలేండ్

*మ* - మణిపూర్

*జ* - జమ్మూ కాశ్మీర్

*పం* - పంజాబ్

*కే*  - కేరళ,

*మి* - మిజోరాం,

*ఉప్ర*- ఉత్తర ప్రదేశ్,

*ఛ*- ఛత్తీస్ గఢ్,

*త్రి*- త్రిపుర,

*ఒ*- ఒడీషా,

*ఝా*- ఝార్ఖండ్,

*బి*: బిహార్,

*హ*- హర్యానా,

*ఉఖ*- ఉత్తర ఖండ,

*గో*- గోవా,

*హి*- హిమాచల్ ప్రదేశ్,

*తె*- తెలంగాణ,

*మే*- మేఘాలయ,

*మప్ర*- మధ్య ప్రదేశ్,

*అప్ర*- అరుణాచల్ ప్రదేశ్,

*ఆంప్ర*- ఆంధ్ర ప్రదేశ్,

*గు*- గుజరాత్,

*అ*- అస్సాం,

*బెం*- బెంగాల్,

*త*- తమిళనాడు,

*క*- కర్ణాటక,

*రచన...కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Power of God

 *🙏🌹పేరు చెప్పకుండా కేవలం దేవుడు అని మాత్రమే నీతులు చెప్పే వీడియోలు ఏ ధర్మాన్ని నేర్పుతున్నాయి. చూసుకోండి. జాగ్రత్త!*.ఉదాహరణకు Power of God. .. ఒక *చెడ్డ ఆవు* చిన్న పిల్లాడిని కొమ్ములతో కుమ్మ బోతుంటే ఎక్కడి నుంచో వచ్చిన ఒక *మంచి తోడేలు కుక్క* ఆ ఆవుని తరిమింది. ఇందులో తప్పేముంది? అంటే ఉంది. నిజానికి ఆవు పిల్లాడిని చంపి తినదు. కానీ తోడేలు కుక్క పిల్లాడిని చంపి తినగలదు. జింకలు అడవి మొత్తం తినేస్తుంటే పులి వాటిని చంపుతుంది. అంటే పులి మంచిది. జింక చెడ్డది.అడవిలో సీత బాధపడుతుంటే చూడలేక తన లంకా నగరానికి తీసుకు వెళ్ళిన రావణుడు మంచివాడు. సీతను అడవిలో వదిలిన రాముడు చెడ్డవాడు. మంచి అలవాట్లు మనుకోవద్దని కాపాడిన భర్త చెడ్డవాడు. మాయమాటలు చెప్పి లేపుకుపోయిన వాడు మంచివాడు. చదువుకోసం అప్పుచేసి కాలేజీ కి పంపిన తండ్రి చెడ్డవాడు. కాలేజీ మాన్పించి పెళ్లి చేసుకున్న ప్రియుడు మంచివాడు. ఇలా చాలా తెలివిగా దేశం మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవతల మీద చేసిన ఇలాంటి  వీడియోలు నేర్పేది  హిందుత్వ వ్యతిరేకమే. ఇలాంటి వీడియోలు చూస్తే మెల్లగా ఆ ఊబిలో కూరుకు పోతారు. తస్మాత్ జాగ్రత్త.

పరమాత్మా ! యిదియె చాలు

#కందము 


*హరిదాసుననెడి పేరునె*

*నిరతము నేఁగోరుకొందు ; నిత్యము నీపై*

*సరియగు భక్తిని గోరెద ;*

*పరమాత్మా ! యిదియె చాలు వరమొసగుమురా !!*


✍️ *--వేణుగోపాల్ యెల్లేపెద్ది* 


*స్వామీ !*🙏 


నా పేరు ఏమిటో నువ్వే చెప్పు .

నా త్రోవ ఏదియో నువ్వే చూపు.


నాకు సరియైన వరమేదో నువ్వే ఇవ్వు !!🙏


 

Vankaya kura


 

Ammavaaru


 

Sree suktam

Sree suktam 

A


 

Photo










 

Age bar


 

పుణ్యాత్ములు

 *పుస్తకాల్లో కనపడని పుణ్యాత్ములు*



మనదేశం , ధర్మం , సంస్కృతి మీద వెకిలి కామెంట్లు చేసే అమీర్ ఖాన్ , ప్రకాష్ రాజ్ , కమల్ హాసన్ లాంటి వాళ్ళు మనకు బాగా తెలుసు కానీ , దేశం , ధర్మం కోసం కుటుంబాలు , ఆస్తిపాస్తుల్ని వదిలేసుకొన్న అళసింగ పెరుమాళ్ గురించి మనకు తెలియదు. [ఫోటో చూడండి]


*ఎవరు ఈ అళసింగ పెరుమాళ్?*


1865 లో మైసూరు ప్రాంతానికి చెందిన చిక్కమంగళూరు లో వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి , మద్రాసులో చదువుకొన్న ఈయన స్వామీ వివేకానంద జీవితానికి , బోధనలకు విశేషంగా ప్రభావితం అయ్యారు. 1892 డిశెంబరు లో స్వామీజీ మద్రాసు వచ్చినప్పుడు , వారిని కలిసి త్వరలో అమెరికా లోని షికాగో మహానగరంలో *'' విశ్వమత మహా సభ ''* [ World Parliament of Religions ] జరగబోతున్నదని , మన సనాతన ధర్మం , భారతజాతి , నాగరికత , సంస్కృతి ఎంత గొప్పవో , మానవాళికి ఎంత మేలు చేస్తాయో చెప్పడానికి అది మంచి వేదిక అని చెప్పి , అమెరికా వెళ్లేందుకు కావాల్సిన డబ్బుకు తాను , తన స్నేహితులు కూడా విరాళాలు సేకరిస్తామని అన్నారు. అలాగే సేకరించి స్వామీజీకి పంపించారు.


1893 మే 31 న ముంబాయి నుండి బయలుదేరి అమెరికా చేరాక , జూలై 30 న షికాగోలో అడుగుపెట్టారు. అక్కడ ఆయన్ని పట్టించుకొనేవాళ్ళు ఎవ్వరూ లేరు. తనదగ్గరున్న డబ్బు తక్కువే కాబట్టి , రోజూ తిండి కొనుక్కొని తింటుంటే అది అయిపోతుందని తెలిసి రెండు , మూడు రోజులకు ఒకసారి మాత్రమే స్వామీజీ భోజనం చేసేవారట. అలా చేసినా వున్న డబ్బు అయిపోతోంది. అపుడు స్వామీజీ అళసింగ పెరుమాళ్ కు టెలిగ్రాం పంపారట. అమెరికాలో స్వామీజీ పడుతున్న కష్టం అర్థం అయ్యి పెరుమాళ్ చాలా బాధ పడ్డారు. అపుడు ఆయన మద్రాసులో కొన్ని రోజులు , చిక్కమంగళూరులో కొన్ని రోజులు ఇంటీంటికీ వెళ్ళి భిక్షాటన చేసి కొంత డబ్బు సేకరించారు. ఆరోజుల్లో వూళ్ళో బావి నుండి నీళ్ళు చేదుకొని ధనవంతుల ఇళ్ళకు ఇస్తే డబ్బులు ఇచ్చేవారు. అది కూడా చేసాడు పెరుమాళ్. అప్పటీకే అతనికి పెళ్ళి అయ్యివుంటుంది. భర్త ఉదయం నుండి మధ్యాహ్నం దాకా బావి నుండి నీళ్ళు తోడి , సాయంత్రం మళ్ళీ ఇంటింటికి వెళ్లి డబ్బులు భిక్షం అడగడాన్ని చూసి చాలా బాధ పడిన భార్య మంగమ్మ , తన పుట్టింటివారు ఇచ్చిన నగల్లో ఒక్క తాళిబొట్టును మాత్రమే వుంచుకొని తక్కినవన్నీ ఇచ్చేసి , *'' మీరు వీటిని అమ్మి , ఆ డబ్బును స్వామీజీకి పంపండి ''* అని భర్త తో అన్నదట. కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా పెరుమాళ్ అలానే చేసి , డబ్బును స్వామీజీకి మనీ ఆర్డర్ ద్వారా పంపారట.


1893 విశ్వమత మహాసభ లో ప్రసంగించి అంత వరకూ ప్రపంచ దేశాలకు , మేధావులకూ భారత్ అంటే అనాగరికమైనదని , పాములు పట్టుకొని ఆడించే జాతి అని వున్న నీచ అభిప్రాయాన్ని పటాపంచలు చేసి భారత్ ను విశ్వగురువు స్థానంలో నిలిపిన స్వామీ వివేకానందుల బ్రహ్మాండమైన విజయం వెనుక కర్ణాటకకు చెందిన ఇద్దరు పేద చిక్కమంగళూరు బ్రాహ్మణ దంపతుల త్యాగం ఎందరికి తెలుసు ?


చరిత్ర గుర్తించని చరితార్థులు ఎందరో !

పుస్తకాల్లో కనపడని పుణ్యాత్ములు ఇంకెందరో !

మరుగున పడిపోయిన మహానుభావులు మరెందరో !


... P సతీష్ ...

🚩శ్రీ వివేకానందస్వామి జీవిత గాథ🚩* *భాగం 2*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*


*🚩శ్రీ వివేకానందస్వామి జీవిత గాథ🚩*   


*భాగం 2*


*ఓం నమో భగవతే రామకృష్ణాయ*


సంతానం కావాలనే తల్లి తండ్రుల హృదయపూర్వకమైన ఆర్తి, ప్రార్థన

ఫలితంగా ఈ లోకంలోకి వచ్చేవాడు శ్రేష్ఠతముడైన వ్యక్తిగా విరాజిల్లుతాడు. అలాంటి  భక్తిప్రపత్తులతో భువనేశ్వరి పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చింది. మొదట మగపిల్లవాడే జన్మించినప్పటికీ, అతడు విగతజీవుడయ్యాడు. తరువాత వరుసగా నలుగురు ఆడపిల్లలు పుట్టారు. అందుకే మగపిల్ల వాడికోసం ఆమె ఆర్తితో పరమశివుణ్ణి ప్రార్థించింది.


 ఒక సంవత్సరం అవిచిన్నగా ఆమె సోమవార వ్రత అనుష్టించింది. వారి బందువులలో ఒకరిని కాశీలో వెలసివున్న వీరేశ్వర శివునికి సోమవారాలలో తన తరఫున విశేష పూజలు చేయమని కోరింది. ఈ విధంగా భువనేశ్వరి ఒక సంవత్సర కాలంపాటు నిరంతరాయంగా జప, పూజ, పారాయణలతో తపోమయ జీవితం గడిపింది.


ఇలావుండగా ఒక రోజు పగలంతా ప్రార్ధనలోను, పూజలోను నిమగ్ను రాలైన భువనేశ్వరి ఆ రాత్రి ఒక కలకన్నది. ఆ కలలో శివుడు నుండి ప్రకాశమానమైన కాంతి వెల్లువలా వెలువడి భువనేశ్వరిని ఆవరించింది. అప్పుడు భువనేశ్వరి మనస్సు అనిర్వచనీయ ఆనందంలో ఓలలాడింది. ఆ సమయంలో పరమశివుడు ధ్యానం చాలించి లేచి ఒక మగపిల్లవాడుగా మారిపోయాడు.


 "సాక్షాత్తు ఆ భగవంతుడు నాకు కుమారునిగా జన్మించబోతున్నాడా! నా ప్రార్థనను ఈ విధంగా నెరవేర్చనున్నాడా? అంటూ భువనేశ్వరి మనస్సు ఫారవశ్యంతో నిండింది. ఇంతలో కల చెదరిపోయింది. మేల్కొన్న తరువాత కూడా ఆ కాంతి వెల్లువ తనను ఆవరించి ఉండడం ఆమె గమనించకపోలేదు.


 దైవసంకల్పం  వలన త్వరలోనే భువనేశ్వరి గర్భం దాల్చింది. 1863 జనవరి 12వ తేదీ సోమవారం (కృష్ణ సప్తమి, ధనుర్లగ్నం, కన్యారాశి, హస్తానక్షత్రం)

 ఉదయం ఆరు గంటల 33 నిమిషాల 33 సెకండ్లకు ఒక అందమైన మగబిడ్డకు భువనేశ్వరి జన్మనిచ్చింది. 

 

ఆరోజు మకర సంక్రాంతి .అనాడు ఉదయించిన బాలుడు సనాతన ధర్మమహాసాగరాన్ని ఉప్పొంగచేయటానికై, వేదాంత మతప్రకాశాన్ని ప్రాచ్యపాశ్చాత్య ఖండాల్లో అంతటా వ్యాపింపచేయటానికై, ఈశ్వరాంశసంభూతుడై ఉదయించిన బాలచంద్రుడని ఎరుగకే భారతజనసహస్రం ఆ పర్వదినాన ఆనందసాగరంలో ఓలలాడింది!


 కాశీ వీరేశ్వర శివుని అనుగ్రహం వలన జన్మించాడు కాబట్టి ఆ పిల్ల వాడికి విశ్వేశ్వరుడని నామకరణం చేశారు. ముద్దుగా 'బిలే'   అని నరేన్ అని పిలిచేవారు. ఆ తరువాత నరేంద్రనాథ్ అనే పేరు స్థిరపడింది.🙏


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సంస్కృత భారతీ* *6*


*సంస్కృత భారతీ*

            *6*

        *సన్నన్తాః*

కర్తుం ఇఛ్ఛా = చికీర్షా =  చేయాలనే కోరిక,

గన్తుం ఇఛ్ఛా = జిగమిషా= వెళ్ళాలనే కోరిక,

వక్తుం ఇఛ్ఛా =  వివక్షా  = చెప్పాలనే కోరిక,

భోక్తుం ఇఛ్ఛా = బుభుక్షా = తినాలనే కోరిక,

జ్ఞాతుం ఇఛ్ఛా = జిజ్ఞాసా = తెలుసుకోవాలనే కోరిక,

ద్రష్టుం ఇఛ్ఛా = దిదృక్షా= చూడాలనే కోరిక,

...ఇలా ద్విపదకములు  ఏకపదకములుగా మారుతాయి. ఇవన్నీ స్త్రీలింగ శబ్దములు. అందువలన తదనుగుణంగా సహాయ క పదములనూ స్త్రీలింగంలోనే ప్రయోగించవలెను. 

****

షష్ఠీ విభక్తి పదానికి కృతే చేర్చినచో చతుర్థీ విభక్తి గా మారుతుంది.

మహ్యం / మమకృతే= నాకొరకు, తుభ్యం/ తవ కృతే  = నీకొరకు, అస్మాకంకృతే = మన కొరకు, భవతః కృతే / యుష్మాకం కృతే = మీకొరకు, అస్యకృతే = వీని కొరకు, తస్య కృతే = వాని కొరకు,ఏతత్కృతే = దీని(నపుంసకలింగ) కొరకు, తత్ కృతే = దాని (నపుంసక) కొరకు

*ప్రయోగవిభాగః*

*** మమ సంస్కృతాధ్యయన చికీర్షా అస్తి... నాకు సంస్కృత మును చదివే కోరిక కలదు.

*** అస్య అమెరికా జిగమిషా అస్తి వా? ఈతనికి అమెరికా వెళ్ళే కోరిక ఉన్న దా? (వా అనేది కూడా ప్రశ్నించుటకై వాడబడును).

భవతః  చలనచిత్ర దిదృక్షా అస్తి ఖలు? మీకు చలన చిత్రం చూచే కోరిక ఉన్న ది కదా.?

*శుభం భూయాత్*

**** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

 *సంస్కృత భారతీ*

         *7/౧*

*శబ్దములు వాటి ప్రాముఖ్యం*

ప్రపంచంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనములూ గల  ఒకే ఒక భాష సంస్కృతం.

***అకారాన్తః పుల్లింగో రామశబ్దః...ఇత్యుదాహారణమివ స్వీకృత్య**

*౧. ప్రథమా విభక్తి*.. నామవాచకములు.

రామః = రాముడు, రామౌ = ఇద్దరు రాములు, రామాః = బహు రాములు.

*౨. ద్వితీయాబిభక్తి*

నిన్,నున్,లన్, గురించి.

రామమ్ = రాముని, రామౌ = ఇద్దరు రాములను, రామాన్ = బహు రాములను,.

*౩.తృతీయా విభక్తి*

చేతన్, తోడన్,

రామేణ = రాముని చేత,

రామాభ్యామ్ = ఇద్దరు రాముల చేత,

రామైః = బహు రాముల చేత,

*౪. చతుర్థీ విభక్తి*

కొరకున్, కై,

రామాయ = రాముని కొరకు,

రామాభ్యామ్ = ఇద్దరు రాముల కొరకు,

రామేభ్యః = బహు రాముల కొరకు..

*౫. పంచమీ విభక్తి*.

వలన, కంటే, పట్టి

రామాత్ = రాముని వలన,

రామాభ్యామ్ = ఇద్దరు రాముల వలన,

రామేభ్యః = బహు రాముల వలన.

*౬. షష్ఠీ విభక్తి*

కి, కు, యొక్క, లో, లోపల

రామస్య = రాముని యొక్క,

రామయోః = ఇద్దరు రాముల కు,

రామాణామ్ = బహు రాముల కు.

*౭. సప్తమీ విభక్తి*

అందున్, నన్

రామే = రాముని యందు,

రామయోః = ఇద్దరు రాముల యందు,

రామేషు = బహు రాముల యందు.

*౮. సంబోధన ప్రథమా విభక్తి* ఓయీ, ఓరీ, ఓసీ..

హేరామ = ఓ రామా!, హేరామౌ = ఓ ఇద్దరు రాములారా!, హేరామాః = ఓ బహు రాములారా!!!.

ఏవం(ఇదేవిధంగా) కృష్ణః,, కాలః,సమయః, వృక్షః,నరః, మనుష్యః, దేహః, నాపితః, రజకః, మూషకః, దాసః, శుకః, చౌరః, సంశయః, ప్రశ్నః, క్రోధః, జ్వరః, రోగః, హస్తః, పాదః,అశ్వః... ఇత్యాదయః(మొదలైనవి).

*శుభం భూయాత్*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*"

 *సంస్కృత భారతీ*

    *ఏకాదశపాఠః*

            *11*

ప్రణిధిః = బాటసారి, మార్గం/సరణి = దారి, గ్రామం = ఊరు, గృహం = ఇల్లు, యానం/ వాహనం/ శకటం = వాహనము, పద్భ్యాం / పాదగమనం = కాలినడక, చలనం= కదులుట, భ్రమణం = తిరుగుట, గమనం = వెడలుట, ద్విచక్ర వాహనం/ ద్విచక్రికా = ద్విచక్ర వాహనం,ఇలాగే చతుశ్చక్రికా,బహుచక్రికా...లను కూడా అనువర్తించుకొనవచ్చు. యాంత్రిక శకటం/ యాంత్రిక వాహనం = మోటారు వాహనం, తైల యాంత్రిక శకటం = నూనె (పెట్రోలు వంటి) తో నడిచే మోటారు వాహనం, మృత్తికా తైలం = మట్టి నూనె (పెట్రోలు), జవం = శక్తి, వేగం = వేగము, విద్యుద్వాహనం = విద్యుత్ చేత నడిచే వాహనం, 

*నూతన గ్రామప్రవేశ సంభాషణం*

*ప్రణిధిః*:-- భోః అత్ర  రామాలయం కుత్రాస్తీతి వక్తుం శక్యతే వా?( అయ్యా, ఇక్కడ రామాలయం ఎక్కడ ఉన్నదో చెప్పగలరా?)

*సమాధానం*:-- సంతోషేన వక్తుం శక్నోమి భోః. అత్రతః పూర్వదిశే శతపదం గత్వా దక్షిణే వింశతి పదం గఛ్ఛన్తు భోః తత్ర అయమేవ ప్రశ్నం కమపి పృఛ్ఛన్తు,తే వదిష్యన్తి.(సంతోషంగా చెప్పగలనండీ. ఇక్కడి నుండి తూర్పు దిశలో వంద అడుగులు వెళ్ళి దక్షిణమునకు ఇరవై అడుగుల దూరం వెళ్ళి ఇదే ప్రశ్న ఎవరినైనా అడగండి,వారు చెప్పుదురు.)

*ప్ర*:-- ధన్యవాదాః.

స ప్రణిధిః తథా గత్వా  అర్చకం పృఛ్ఛతి...(ఆ బాటసారి ఆ విధంగా వెళ్ళి అర్చకుని అడుగుచున్నాడు.)

*ప్ర*:-- భోః భవతః నామం కిం??

*అర్చకః*:-- చతుస్సాగరపర్యన్తం గోబ్రాహ్మణేభ్యశ్శుభం భవతు కాశ్యపావత్సారనైధృవత్ర్యాఋషేయప్రవరాన్విత కాశ్యపసగోత్రః యజుశ్శాఖాధ్యాయీ ఆపస్తంబ సూత్రః శ్రీ రామశర్మాహంభో అభివాదయే ఇత్యుక్తవన్తః యతః స ప్రణిధిః అర్చకస్య గురురిత్యవగతం తమ్.  (అర్చకులు ప్రవరతో వారి పేరు శ్రీ రామ శర్మ అని పలికెను. ఎందుకంటే ఆ బాటసారి తన గురువని అర్ధం అయినది వారి కి).

*ప్ర*:-- హే శ్రీ రామ శర్మ వర్ధస్వ.(ఓ శ్రీ రామ శర్మా వర్థిల్లుము.) సర్వైః సకలైః కుశలైర్వా?? అహం ఏక వేదశాస్త్రసదస్యార్థం ఆగతవాన్. మహ్యం స్నాతుం తటాకం దర్శయ. తథాస్థాతుంనివాసం చ వ్యవస్థయ.(నేను ఒక వేదశాస్త్ర సదస్యమునకై వచ్చాను. నాకు స్నానం చేయుటకు చెరువు చూపుము. అలాగే ఉండుటకు నివాసం కూడా ఏర్పరచుము.)

*అ*:-- ఆమ్ భోః.అవశ్యం.(అలాగే ఆర్యా.తప్పకుండా.),

*ప్రణిధిః*:-- (స్నానాది నిత్య కృత్యానంతరమ్ = స్నానాది నిత్య కృత్యాలు ముగించిన తర్వాత) హే శ్రీ రామ! అహం సదస్యార్థం పద్భ్యాం గఛ్ఛామి( ఓ శ్రీ రామ! నేను సదస్యానికి నడచి వెళ్తాను)

*అ*:-- మాస్తు మహాశయ! సదస్యకేంద్రం బహుదూరమస్తి, భవతః శ్రమా భవేత్, అహం తైల యాంత్రికయానే నేష్యామి(వద్దు మహాశయా! సదస్యకేంద్రం చాలా దూరంలో ఉంది. మీకు శ్రమ కలుగుతుంది, నేను పెట్రోమోటర్ వాహనం పై తీసుకుని వెళ్ళెదను.

*ప్రణిధిః*:-- నావశ్యకం వత్సా! మహ్యం జవమస్తి(అవసరం లేదు బాలకా! నాకు శక్తి ఉంది).

 అంతే గురురనుజ్ఞయా శ్రీ రామః తస్య వాహనే నీతవాన్ సదస్యకేంద్రపర్యన్తమ్.(చివరకు గురువు ను ఒప్పందం తో శ్రీ రాముడు ఆతని వాహనం పై సదస్యకేంద్రానికి తీసుకుని వెళ్ళాడు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

అన్నీ అదే

 🌹అన్నీ అదే!🌻


భార్య: మీకు ఏమి పని లేదా? మొదట చాగంటి గారి మహా భాగవతం విన్నారు, అది అయిపోంగానే మాడుగుల వారిది విన్నారు, తరువాత గరికిపాటి వారిది, ఇప్పుడు సుందర చైతన్యానంద స్వామి వారిది. ఎవరు చెప్పిన అదే మహా భాగవతం కధ కదా. ఒకరిది వింటే సరిపోదా?


భర్త: నువ్వు మినప్పిండి రుబ్బి మొదటి రోజు కొంచెం పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీలు వేస్తావు, రెండో రోజు గారెలు, మూడో రోజు వడలు, నాలుగవ రోజు సాదా దోశలు, అయిదో రోజు కొంచెం ఉల్లిపాయముక్కలు వేసి ఉల్లి దోశ, ఆరో రోజు పొటాటో కూర వేసి మసాలా దోశ, ఏడో రోజు ఇంత టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఊతప్పమ్, ఎనిమిదో రోజు అదే పిండితో గుంట పునుగులు, తొమ్మిదో రోజు పుల్ల మజ్జిగ కలిపి పుల్లట్లు వేస్తూ ఉంటే నేను రేపు అనేది ఉందో లేదో అని ఆత్రంగా తినటం లేదా. వీటన్నిట్లో ఉన్నది మినప్పిండి అని తెలిసినా ఎంజాయ్ చేస్తున్నామా లేదా. 😳😜


మహా భాగవతం కూడా అంతే. చాగంటి వారు చెప్పెదాంట్లో భక్తి పాలు ఎక్కువ అందుకు వినాలి, మాడుగల వారిది  ఎందుకంటే ఆయన అమృత తుల్య మైన కంఠం లో పోతన గారి పద్యం వినటానికి, గరికిపాటి వారు ప్రస్తుతo సమాజం లో జరుగుతున్న వాటిని మేళవిస్తారు కాబట్టి ఆయనది వినాలి, చివరకు సుందర చైతన్యానందుల వారిది వినాలి, ఎందుకంటే  తత్వ చింతనతో పాటు ఆయన చెప్పే దాంట్లో పైన చెప్పినవన్నీ ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రక మైన పంథా. అన్నీ ఎంజాయ్ చేయాలి.

భార్యకు ఏమి అర్ధం కాలా. తను చేసే పనిని భాగవతం తో పోల్చి పొగడారా !!?లేక ఒకే పిండితో వారం రోజులు టిఫిన్ చేసి పెడుతున్నాను అని ఎత్తి పొడుపుగా అన్నారా.!!? ఆలోచనలో పడింది.

😅😂😛😜

వివేకానందుడు చెప్పిన గొప్ప జీవిత సత్యం.

 _*వివేకానందుడు చెప్పిన గొప్ప జీవిత సత్యం.*_

🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀


గ్రద్ద జీవితం గద్ద అనగానే మనకు ఎప్పుడూ  కోడి పిల్లలను ఎత్తుకు పోయే దానిగా లేదా మనుషులను బయపెట్టే ఒక పక్షిగా మాత్రమే తెలుసు.


ఇంకా గద్దలు మనుషుల కలళేభరాలని పీక్కు తింటాయని కథనాలు వింటుంటాం.కానీ గద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుందని ఎంత మందికి తెలుసు?


గద్ద జీవితకాలం 70ఏళ్ళు, ఈ జాతి పక్షుల్లో ఎక్కువ జీవితకాలం బ్రతికేది గద్దే.  అయితే గద్దకి 40ఏళ్ళు పూర్తి అయ్యేసరికి దాని గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు.


పొడవైన దాని ముక్కు కొన చివర వొంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు.  ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై... చురుకుగా ఎగరడానికి సహకరించవు.  ఆ సమయంలో దాని ముందున్నవి రెండే లక్ష్యాలు. ఒకటి ఆహారాన్ని సంపాదించుకోలేక సుష్కించి మరణించడం లేదా భాదకరమైన సరే తనను తాను మార్చుకోవడం.


 ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవి అయినా… ఎంత క్షీణ దశకు వచ్చినా బ్రతకాలనే అను కుంటుంది.  అలాగే, గద్ద కూడా బ్రతకాలనే అనుకుంటుంది. మరి గద్ద ఏవిధంగా తనను తాను మార్చుకుంటుంది ఒక్కసారి చూద్దాం….


గద్దకు ఈ మార్పు చాలా భాదాకర మైనది. ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ. ఈ మార్పు కోసం గద్ద తనకు అందుబాటులో ఒక ఎతైన  కొండను తన స్థావరంగా చేసుకుంటుంది. అక్కడ పెరిగి పోయిన తన ముక్కుకొనను కాలిగోళ్ళ మధ్య పెట్టుకొని ఎంతో భాధ కలిగిన నెమ్మదిగా వొలిచేసు కుంటుంది.


 ఇలా వదిలించుకున్న ముక్కు మళ్ళీ కాస్తా కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంది.  అలాగే పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్ళను వదిలించుకుంటుంది.  ఇక కొత్త గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో తన రెక్కలకు బరువైన పాత ఈకలను పీకేస్తుంది. అలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చు కుంటుంది.


ఇలా 5నెలలు భాదాకరమైన కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో 30ఏళ్ళు హాయిగా బ్రతుకు తుంది. ఈ సృష్టిలో మనం బ్రతకాలంటే మార్పు అనేది చాలా అత్యవసరం అనే జీవిత సత్యాన్ని, గద్ద జీవించి మనల్ని కూడా అలా జీవించమని బోధిస్తుంది. ఇలానే ప్రతీ మానవుడుకు కూడా జీవించాలనే ఉంటుంది. కాని జీవితాన్నే మార్చే ధ్యానసాధన మాత్రం 1 గంట చేయలేము. జీవితం మాత్రం కావాలి.


ఒక పక్షి 150 రోజుల కఠోర సాధనతో మరో 30 సంవత్సరాల వయస్సు పెంచుకుంది.  పాత సామేత ఒకటి ఉంది కుండలో ఉన్న అన్నం కుండలోనే ఉండాలి అమ్మాయి బొద్దుగా ఉండాలి అని....


అలానే మనం ధ్యానం చేయము కాని ఆరోగ్యం ఆనందం మనకు కావాలి..... ఎలా వస్తుంది... ?ఎక్కడ నుంచి వస్తుంది....?


*ఒక పక్షి సాధన చేత మరో పునర్జన్మ తెచ్చుకున్నట్టుగా*.


మనమూ కఠోర  ధ్యాన సాధన చేద్జాం.మానవులుగా  ఉన్న మనం మాధవులు గా మారుదాం! ఆరోగ్యంగా ఆనందంగా జీవించుదాం

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

నిమ్మకాయతో చికిత్స -

 నిమ్మకాయతో చికిత్స  - 


  అజీర్ణం  ( Dyspepsia ) - 


   గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 


  మలాశయం బాధ  ( Bowel Trouble ) - 


    నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.


 స్థూలకాయం  ( Obesity ) - 


    నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు     ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.


 ముఖ సౌందర్యం  ( cosmetic ) - 


   సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు         ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 


  చలి జ్వరం  - ( Maleria ) 


     నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు        ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 


   అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.


 రక్తస్రావం  - 


    శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను.  ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen కడుపులో బల్ల పెరుగుట హరించును. 


    నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 


  దంతశుద్ధి  - 


     దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది.


          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


   

Yogi


 

హిందువులకు కూడా

 *హిందువులకు కూడా డ్రెస్ కోడ్ ఉంది. అదే బ్రాహ్మణ వేషం. తెలుసా?*

బ్రాహ్మణుల పిలక ప్రస్తావన పోస్టు చూసి  నిజాలు చెప్పాలని ఉంది. పురాణాల ప్రకారం వర్ణాలు నాలుగు అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు. వీరిలో 2/3 వంతు మందికి యజ్ఞోపవీతం, పిలక, ధోవతి - ఉత్తరీయం, చెవులకు కమ్మలు, మెడలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. ప్రతీ వర్ణంలోనూ చాలా కులాలు ఉన్నాయి. అందరూ సమన సంఖ్యలో ఉన్నారని అనుకున్నా ఆ లెక్కన 75శాతం హిందువులకు ఉపనయనం, పిలక ఉందని తేలింది. దరిద్రం ఏమిటంటే వర్ణం పేరు ఉన్న కులాలు మాత్రమే పేరుకి 5శాతం ఉన్నాయి. మిగిలిన 70 శాతం వారిలో చాలా కులాలు శూద్ర వర్ణం వారు కాదు. *అసలు శూద్ర వర్ణం అంటే ఈ కులాలు అని ఎక్కడా లేదు. ఆచారం పాటించని పై మూడు వర్ణాల వారినే శూద్రులు అనే పదంతో పిలిచేవారు. ఆ లెక్కన శూద్ర కులాలు 10శాతం మించి ఉండకూడదు.* కాబట్టి ఇప్పుడు చరిత్రలో లేదా పురాణాలలో రాజరికం చేసిన కులాలు తిరిగి యజ్ఞోపవీతం, పిలక ధరించాలి. శ్రీరాముడుకి, శ్రీకృష్ణుడికి కూడా పిలక ఉందని రామాయణంలో, భారతంలో ఉంది. కమ్మ రాజులు, రెడ్డి రాజులు, యాదవ రాజులు, అడవిలో ఉండే కోయ రాజులు, గిరిజన జాతులలో ఉండే రాజులు,...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కులాలకు యజ్ఞోవీతము, పిలక ఉన్నాయి? ఈ మాత్రం తెలియకనే కాశీ పండితులు శూద్ర కులం అనుకునే శివాజీ మహారాజ్ కీ రెండో భార్యగా బ్రాహ్మణుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారా? క్షత్రియులకు చేసే పట్టాభిషేకం చేసి, శివాజీ మహారాజుకి ఛత్రపతి అనే బిరుదు ఇచ్చారా? హిందూ ఆచారాన్ని అందరూ పాటిస్తే సరిపోతుంది. ఆ రోజుల్లో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం మొఘలుల కాలంలో హిందూ ధర్మ రక్షణ చేస్తున్న రాజకుటుంబాల వారిని వెతికి మరీ చంపుతుంటే చాలామంది అగ్రవర్ణాల వీరులు విధిలేక యజ్ఞోపవీతం, పిలక తీసేసి తాము శూద్రులమని ప్రకటించి ఉండవచ్చు. *రాజ్యాలు పోయినా రాజసం పోతుందా? వారి కులాల వారే ప్రభుత్వ అధికారంలో నాయకులుగా ఉండటం అందరికీ తెలుసు.* కాబట్టి, ఇప్పటికైనా హిందూ ధర్మాన్ని మన నాయకులు రక్షించాలంటే ముందుగా వారు యజ్ఞోవీతమును, చిన్న పిలకను, నుదుటిపై విభూతి రేఖలు, తిలకం, లేదా తిరు నామం (వెంకన్న బొట్టు), చెవి కమ్మలను, ఖద్దరు పంచె - ఉత్తరీయాన్ని ధరించాలి. ఒక వందేళ్ల క్రితం ఫోటోలు చూడండి. పురాణ కాలం నాటి మనుషుల డ్రెస్ కోడ్ చూడండి. ఇంకా, తప్పుగా అనిపిస్తే క్షమించండి. ధర్మం అనిపిస్తే పాటించండి.*

వరసిధ్ధి గణనాథ

 *సీసము*

పరమేశ ప్రియపుత్ర వరసిధ్ధి గణనాథ

దూర్వంపు పూజకే తుష్టినొంద

సిరులెల్ల కురిపించు సిరిబొజ్జ సరియొజ్జ 

మోదకంబులొసగ మోదమొంద

ఘనమైన పనులైన గణనాథ నినుగొల్వ

సులభ సాధ్యము జేయు శూర్పకర్ణ

జనులెల్ల పులకించు గణనాథు ఘనకీర్తి

అల్పబుద్ధి కెటుల నర్థమయ్యు!!??

*ఆ.వె.*

సర్పభూషితాంగ సకలగణాధీశ

వక్రతుండ నీదు పటిమనెరుగ

జనుల మతులు తప్పు సర్వేశ విఘ్నేశ

నుతులు జేతు నీకు నతుల నెపుడు.


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

నిర్మించడం చాలా కష్టం

*

*కం*

నిర్మించుట కడుకష్టము

నిర్మూలించుట సులభము నిక్కంబెరుగన్

నిర్మాణములను కాచుట

ధర్మం బౌ నరులకెల్ల ధరణిని సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నిర్మించడం చాలా కష్టం కానీ కూల్చడం సులభం. కానీ నిజం తెలుసుకోవాలంటే నిర్మాణాలను కాపాడటం మనుషులకు ధర్మం.

*సందేశం*:-- ఏ నిర్మాణాలనైనా,చెట్లనైనా నిర్మూలించడం కంటే ఏదో ఒక విధంగా కాపాడటం ధర్మము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

జీవితమను పెనుపాఠము

జీవించగ బోధపడును జీవులకెపుడున్.

చావను తుదిపాఠంబే

జీవికినవగతముగాని జిగిబిగి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! జీవితమనే పెద్ద పాఠము జీవించినప్పుడే జీవులకు తెలియును. ఇందులో చావు అనే చివరి పాఠం ఏ జీవికీ అర్థం కాని ప్రవల్లిక(జిగిబిగి = puzzle).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

05-08-2023 / శనివారం /రాశిఫలాలు*

 *05-08-2023 / శనివారం /రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━


మేషం


సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. 

---------------------------------------


వృషభం


మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------


మిధునం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

---------------------------------------


కర్కాటకం


చేపట్టిన పనులులో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేరు. కీలక వ్యవహారాలలో సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------


సింహం


అవసరానికి చేతికిడబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో కీలక విషయాలలో చర్చలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

---------------------------------------


కన్య


ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సమస్యల పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


తుల


ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో స్వల్ప ధన నష్టాలుంటాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------


వృశ్చికం


కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమౌతారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------


ధనస్సు


సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి. సమస్యల నుండి బయట పడతారు.

---------------------------------------


మకరం


కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణ ప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------


కుంభం


ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఉద్యోగమున ఆశించిన మార్పులు కలుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


మీనం


వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు ఆశించిన రీతిలో ఉంటాయి.

•••••┉━•••••┉━•••••┉━

సుభాషితమ్

 .         🕉️ _**_ 🕉️

                  _*సుభాషితమ్*_ 


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*_ఏకో౽పి కృష్ణస్య కృతః ప్రణామ:_*

*_దశాశ్వమేధావభృథేన  తుల్యః౹_*


*_దశాశ్వమేధీ పునరేతి జన్మ* 

*కృష్ణప్రణామీ న పునర్భవాయ౹౹_*



𝕝𝕝తా𝕝𝕝

కృష్ణునికి హృదయ పూర్వకంగా చేసిన ఒకే  ఒక నమస్కారం పది అశ్వమేధయాగాలు చేశాక అవభృథస్నానం చేసినంత ఫలితం ఇస్తుంది......కానీ కృష్ణునికి చేసిన నమస్కారంలో ఒక విశేషం ఉంది.


దశాశ్వమేధాలు చేసినవాడు మళ్లీ జన్మిస్తాడు.... కానీ? కృష్ణునికి నమస్కరించినవాడు మళ్లీ జన్మ ఎత్తడు.

శివానందలహరీ - 03

 శివానందలహరీ - 03


త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం

జటాభారోదారం చలదురగహారం మృగధరం

మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం

చిదాలంబం సాంబం శివ మతివిడంబం హృది భజే  



వేదముల్ మూడింట వేద్యుడయ్యెడి వాడు

            నఖిల సృష్టికి నాది యైన వాడు

భక్త హృత్పద్మాన వరలు చుండెడి వాడు 

            త్రినయన యుక్తుండు త్రిపురహరుడు

కదలు సర్పంబులు కంఠహారములుగా

            ఘన జటాజూటంబు గల్గు వాడు

శ్రీమహాదేవుండు చిత్ స్వస్వరూపుండు

            నగజాతనాథుండు మృగధరుండు

శూల ఢమరుక రుద్రాక్ష శోభితుండు

భవ్య భస్మాంగ గాత్రుండు పావనుండు

పార్వతీదేవి సహితుడౌ పరమశివుని

నిందుభూషణు భజియింతు డెంద మందు.     03 @


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

సంధ్యావందనం_ఆవశ్యకత

 #సంధ్యావందనం_ఆవశ్యకత


పూర్వం ఒకసారి బ్రాహ్మణ వటువు శృంగేరి జగద్గురువుల దర్శనానికి వచ్చినప్పుడు జగద్గురువులు మంత్రాక్షతలు ప్రసాదిస్తూ అలంకార ప్రాయంగా కనిపిస్తున్న యజ్ఞోపవీతం చూసి సంధ్యావందనం చేస్తున్నావా లేదా అని ఆయనను ప్రశ్నవేస్తే, యజ్ఞోపవీతం ధరించియున్నామే కానీ, సంధ్యావందనం చేయలేకపోతున్నామని ఆ వటువులు జవాబిస్తే జగద్గురువులు ప్రాయశ్చిత్తం చేయించి పునఃసంధ్యావందనం ఆచరించే విధంగా వారిని ఆశీర్వదించి పంపేవారు.


ఇప్పటి పరిస్థితి ఎలా ఉన్నదంటే తమ దర్శనానానికి వచ్చే ఉపనయనం అయిన వటువులు సంధ్యావందనం చేయడం మాట అటుంచి కనీసం యజ్ఞోపవీతం లేకుండా వస్తున్నారు. యజ్ఞోపవీతం ఏమైంది అని ప్రశ్నిస్తే చొక్కా తీసేటప్పుడు బయటకు వచ్చేసిందనో, లేక జీర్ణమయిందనో బదులిస్తున్నారు. ఆరునెలలనుండో, సంవత్సరంనుండో ఇలా యజ్ఞోపవీతం ఒంటిపై లేకుండా తిరుగుతున్న వాళ్ళ పరిస్థితిని చూసి ఆశ్చర్యం వేసింది. ఇప్పటికే ఒకసారి ఉపనయనం అయ్యి ఒంటిమీద యజ్ఞోపవీతం లేకుండా తిరుగుతున్న వటువునకు మరల యజ్ఞోపవీతం వేయించి పంపించే పరిస్థితి వచ్చింది.


ఈ విధంగా శాస్త్ర ధిక్కారం చేసి ధర్మభ్రష్టులై తిరుగుతున్నవారు తప్పకుండా దానికి తగిన ప్రతిఫలము అనుభవించి తీరవలసిందే. దాని ఫలితాలు అనుభవించే సమయములో చింతించవలసి వస్తే ఏ ప్రయోజనమూ ఉండదు. వెనువెంటనే ఆ దుష్ఫలితం కనిపించకపోయినా ఎప్పటికైనా తప్పదు. కాబట్టి జగద్గురువులు ఆదేశాన్ని శిరసావహించి ఉపవీతులందరూ సంధ్యావందనాదులు చేస్తు విధ్యుక్తధర్మాన్ని ఆచరించవలసిన ఆవశ్యకత మనపై ఎంతైనా ఉంది.


--- జగద్గురు శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు.

కాళికాదేవి జన్మరహస్యం

 నిత్యాన్వేషణ:


కాళికాదేవి జన్మరహస్యం, వర్ణన మొదలైన విషయాలు తెలియజేయండి? 


దీని గురించి దేవి భాగవతం, కాళికా పురాణం లో సవివరంగా వుంటుంది.

రక్త బీజూడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని నుండి వరమును పొంది వుంటాడు అదేమిటంటే యుద్ధంలో అతని రక్తం బొట్టు పడిన ప్రతి దగ్గర అతని కన్న వేయిరెట్లు శక్తివంతం అయిన రక్త బీజులు వందలు , వేలల్లో పుట్టాలని వరం అడిగి సాధించుకుంటాడు.

వర గర్వంతో ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్న ఈతనిని ఓడించడం ఏ దేవతల వల్ల అవ్వలేకపోయినది. కారణం ఈతని రక్త బొట్టు పడిన క్షణం లోనే వందలు వేలల్లో మరింత మంది రక్త బిజులు వచి క్షణాల్లో సర్వనాశనము చేసేయడమే.

దీన్ని నివారించుకునేందుకు సాక్షాత్తు జగన్మాత తన అంశతో కాళికా అను దేవత ను సృజిస్తుంది(దేవి పురాణం ప్రకారం). ఇది కాళికా దేవి జన్మ రహస్యం.

కాళికా దేవి వర్ణన :

ఈవిడ ఒళ్ళు మొత్తం నల్లని నలుపు వర్ణం లో వుండి, మహా భయానకం అయిన వదనం, కోర పళ్ళు, ఛాతీ వరుకు వేలాడే రుధిర వర్ణపు నాలుక తో, ఒంటిపై వస్త్రాలకు బదులు పుర్రెల దండ మీద, అస్తి పంజర చేతులు కింద వైపున కట్టుకొని, బిరుసెక్కిన నల్లని పెద్దవైన శిరోజాలతో, 8 చేతులు, వాటిలో ఆయుధాలతో అతి క్రూరంగ గర్జన చేస్తూ, దిక్కులు పిక్కటిల్లేలా అరిచి యుధ్ధంలో దిగుతుంది. ఇలా అన్నమాట 👇


ఇక రాగానే ఈవిడ ఒక రక్త బీజుడిని చంపగనే మళ్ళీ యధావిధిగా పుట్టడం మొదలెడతాడు. అది చూసిన ఈమె పొడుగాటి ఆమె నాలుకను పరిచి ఒక్కో రక్త బీజుడిని చంపడం, కింద రక్తం బొట్టు పడెలోపు నాలుకతో జుర్రకొని మింగేయడం చేసింది. తద్వారా ఒక్కసారి కూడా రక్తం నేల తాకకుండా వుండుట చేత రక్త బీజుడు మరల ఉద్భవించుట జరగలేదు.

చివరగా చంపిన రక్త బీజుని తలను చేత్తో పట్టుకొని రక్తం పీల్చేసి విజయ గర్వంతో నర్తిస్తు అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరికి చంపడం మొదలెట్టింది. కారణం ఆవిడ తాగింది అమృతం కాదు కదా….. రాక్షసుని రక్తం. అది తమోగుణ ప్రధానం అయినది, అందుకు ఆ రాక్షస ప్రవృత్తి తనకూ వచి ఇలా దేవతలు, మానవులు తేడా లేకుండా అందర్నీ నరకడం మొదలు పెట్టింది.ఎవ్వరూ ఆమె ఎదురు వెళ్ళ సాహసించలేదు అప్పటి నుండి. ముల్లోకాలు గజ గజ వణికిపోతూ వుండగా,ఈమె గట్టిగా గర్జిస్తూ, క్రూరంగా హంకరించుతు, అందర్నీ భక్షిస్తు నడుస్తోంది.

దేవతలకు వచ్చిన ఈ కొత్త సమస్య వల్ల అందరూ మహా దేవుణ్ని ప్రార్థించారు. ఈమె పార్వతి దేవి అంశమే కనుక మహా దేవుడే ఆమెను శాంతిప చేయగలడని చెప్పగా మహాదేవుడు ఆమెను అనుసరిస్తూ వెళ్లి, ఆమెకు ఎదురు పడగానే నిలబడకుండా వెంటనే నేల మీద పడుకుండి పోతాడు. ఈమె వెళ్తూ వెళ్తూ మహాదేవుని ఛాతీమీద తన పాదం మోపుతుంది చూస్కొకుండ. తర్వత కిందకు చూసి కింద వున్నది తన భర్త అని గుర్తించి, నాలుక కరుచుకుని, సిగ్గుతో, బాధతో, భయంతో గట్టిగా రోదిస్తూ ,ఏడుస్తూ , వెనక్కి మళ్ళుతుంది.

ఇలా అవడానికి కారణం రాక్షస రక్తం తాగిన ఆమెకు ఆ తామస గుణం పోవాలి అంటే, కేవలం తన భర్త స్పర్శ,అందునా మహాదేవుని పావన స్పర్శ వల్ల మాత్రమే స్పృహ వస్తుందని మహాదేవుడు ఎరుగుదును కనుక ఆయన అల చేశాడు. భర్త మీద కాలు పడగానే పత్ని యొక్క సహజ సిద్ధమైన సిగ్గు, చూస్కోకుండ అడుగు వేసేసాను అనే బాధ, భయం కలిగి వెంటనే ఆమె శాంతి స్వరూపిణి అయినది. ముల్లోకాలను రక్షించింది.

నాకు ప్రసాదించుము

 𝕝𝕝 శ్లో 𝕝𝕝 

*సాధుసజ్జనసాంగత్యం*

*సద్బుద్ధిమ్ సత్ప్రవర్తనం|*

*సంతోషం సద్విచారాంశ్ఛ*

*దేహి మే మధుసూదన||*


𝕝𝕝 తా𝕝𝕝 ఓ మధుసూదనా! నాకు సాధుస్వభావముండేవారితోను, మంచి ప్రవర్తన గలవారితోను సాంగత్యమును కలుగజేయుము. నిరతము సంతోషముతో మంచి ప్రవర్తనతో ఉండునట్లు చేయుము. మంచిబుద్ధిని మంచి ఆలోచనలను నాకు ప్రసాదించుము.

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం:38/150 


వసువేగో మహావేగో 

మనోవేగో నిశాచరః I 

సర్వవాసీ శ్రియావాసీ 

ఉపదేశకరోఽకరః ॥ 38 ॥  


* వసువేగః = కిరణములయొక్క వేగము కలవాడు, 

* మహావేగః = గొప్పవేగము కలవాడు, 

* మనోవేగః = మనస్సు వంటి వేగము కలవాడు, 

* నిశాచరః = రాత్రియందు సంచరించువాడు, 

* సర్వవాసీ = సమస్త ప్రదేశములందు నివసించువాడు, 

* శ్రియావాసీ = శ్రీ (శోభ)తో నివసించువాడు, 

* ఉపదేశకరః = ఉపదేశము చేయువాడు, 

* అకరః = ఏమియు చేయనివాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

పంచాంగం 05.08.2023 Saturday,

 ఈ రోజు పంచాంగం 05.08.2023  Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ  పక్ష: చతుర్ధి తిధి స్థిర వాసర: ఉత్తరాభాధ్ర  నక్షత్రం సుకర్మ యోగ:  బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


చవితి పగలు 09:44 వరకు.

ఉత్తరాభాధ్ర రాత్రి 02:55 వరకు.

సూర్యోదయం : 06:00

సూర్యాస్తమయం : 06:44

వర్జ్యం : మధ్యాహ్నం 01:37 నుండి 03:05 వరకు.

దుర్ముహూర్తం: ఉదయం 06:00 నుండి 07:42 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం : 01:30 నుండి 03:00 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

శనివారం, ఆగష్టు 5, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శనివారం, ఆగష్టు 5, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

అధిక శ్రావణ మాసం - బహుళ పక్షం

తిథి:చవితి మ3.13 వరకు 

వారం:శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:పూర్వాభాద్ర ఉ10.41 వరకు

యోగం:అతిగండ ఉ8.51 వరకు

కరణం:బాలువ మ3.13 వరకు 

తదుపరి కౌలువ రా2.09 వరకు

వర్జ్యం:రా7.43 - 9.14

దుర్ముహూర్తము:ఉ5.43 - 7.25

అమృతకాలం:తె4.46నుండి

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్య రాశి: కర్కాటకం

చంద్ర రాశి:  మీనం

సూర్యోదయం:5.43

సూర్యాస్తమయం: 6.29


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

సనాతన ధర్మాన్ని రక్షించండి,



🚩.నడిరోడ్డు మీద నడుచుకుంటు నాగ సాదువు ఇలా అంటున్నాడు: ఓ హిందువో మేలుకో..సనాతన ధర్మాన్ని రక్షించండి,జైల్లో బంధించకండి,లేదంటే హిందు ధర్మం నాశనమైపోతుంది.ఓహిందువో ఆలోచిచండి, ఈరోజు నీదగ్గర ఏమున్నదీ, నీకు ఒక అమ్మాయి,ఒక అబ్బాయి,ఇద్దరు మాత్రమే ఉన్నారు. అమ్మాయి పారిపోయింది,అబ్బాయి చనిపోయాడు,కుటుంబము నాశనమై పోయింది.కుటుంబము ఆకలి తీర్చేవాడులేడు,శ్మషానానికి తీసుకెల్లే వాడు లేడు,పిండ ప్రదానం చేసేవాడు లేడు,ఓ హిందువో మేలుకో... ముస్లింలు ఏమో 15/20మంది పిల్లలను దయ్యాల వలే కంటున్నారు,మనకు ముందు ముందు చాలా పెద్ద ప్రమాదం పొంచి వున్నది,జాగ్రత్త హిందువులారా ఐకమత్యంగా అందరం కలసి మన ధర్మాన్ని రక్షించుకుందాం,ధర్మం మనల్ని, మనపిలల్లని,రాబోయే తరాలను కాపాడుతుంది,మిత్రులు అందరికీజై శ్రీరామ్..🚩🕉️🔱🔔🔔🙏🙏🙏

సంస్కృత భారతీ* *2*

 *సంస్కృత భారతీ*

            *2*

    *ద్వితీయ పాఠః*

*కరోమి* = చేయు చున్నాను, కరోతి = చేయుచున్నాడు, కరోషి

 =చేయుచున్నావు,

కుర్వన్తి = చేయుచున్నారు, కుర్మః = చేసెదము, కరోతు/కురు = చేయుము,కుర్వన్తు = చేయుము(చేయండి)(బహువచనం/గౌరవవచనం), 

*వదతి* = చెప్పుచున్నాడు,ఇదే విధంగా వదసి,వదామి వర్తిస్తాయి. వదన్తి = చెప్పుచున్నారు. వదతు/వద = చెప్పుము,వదన్తు = చెప్పండి, వదామ = చెప్పెదము.

*భవామి*= అగుచున్నాను,ఇదేవిధంగా భవసి, భవతి, భవన్తి, భవతు/భవ, భవన్తు,భవామ వర్తిస్తాయి. 

*గఛ్ఛామి* = వెళ్ళుచున్నాను, ఇలాగే గఛ్ఛసి, గఛ్ఛతి, గఛ్ఛన్తి,గఛ్ఛతు/గఛ్ఛ,గఛ్ఛామ *ఆగచ్ఛామి* = వచ్చు చున్నాను, ఆ అనే ఉపసర్గను చేర్చ గా ఇటువంటి పదాల అర్థం మనవైపునకు అనగా వచ్చుటకు గా మారుతుంది. 

*ఉదా*:-- గఛ్ఛతి = వెడలు చున్నాడు, ఆగఛ్ఛతి = వచ్చుచున్నాడు, ఇదే విధంగా ఆగఛ్చసి,ఆగఛ్ఛసి,ఆగఛ్ఛన్తి,ఆగఛ్ఛ, ఆగఛ్ఛామ..ఇలా ఇంచుమించు గా అన్ని ధాతువు లనూ అనువర్తనం చేయవచ్చు.అలాగే నయతి = తీసుకొని వెడలు చున్నాడు, ఆనయతి = తీసుకుని వచ్చు చున్నాడు.

 కొన్ని ధాతువులకు మాత్రం కొంత వ్యత్యాసం వస్తుంది.

*సాధారణంగా మనం ఉపయోగించే కొన్ని ధాతువులు ఉత్తమ పురుష(స్వంతము) రూపంలో*

 *అటామి* = తిరుగుచున్నాను(roaming). 

*భణామి*/ భాషయామి = మాట్లాడుచున్నాను. *ఖాదామి* = తిను చున్నాను., అస్మి = ఉన్నాను, ఇఛ్ఛామి = కోరుకొను చున్నది., *పృఛ్ఛామి* = అడుగు చున్నాను, 

*శ్రుణోమి* = వినుచున్నాను, ఇక్కడ శ్రుణ్వన్తి = విను చున్నారు.

*పశ్యామి* = చూచు చున్నాను,

*దర్శయామి* = చూపుచున్నాను,

*చలామి* = కదులుతున్నాను,

*క్రీడామి* = ఆడుచున్నాను,

*భరామి* = భరించు(ధరించు) చున్నాను,.

ఇలా ఈ రూపాలను మధ్యమ ,ప్రధమ పురుష రూపాలకు కూడా అనువర్తించుకొనవచ్చు. అయితే కొన్ని రూపాంతరాలలో కొన్ని మార్పు లు ఉంటాయి, అవి చర్చోపచర్చలలో తెలుసుకొనవచ్చును.

*----*

అత్ర = ఇక్కడ, తత్ర = అక్కడ, కుత్ర = ఎక్కడ?, ఇదం = ఇది, తత్ = అది, కిం = ఏది?, ఇదానీం = ఇప్పుడు, తదా = అప్పుడు, కదా = ఎప్పుడు??, ఇథ్థం / ఈదృశీ = ఇలా, తథా/ తాదృశీ = అలా, కథం/ కీదృశీ = ఎలా?, ఏతాని = ఇన్ని, తాని = అన్ని, కాని = ఎన్ని?, ఇలాగే సా,ఏషా,కా అనేవి స్త్రీ లింగాలు. తే = వారు, ఏతే = వీరు, కే = ఎవరు?

*ప్రయోగ విభాగః*

*ప్ర*:--- త్వం కిం కరోషి-- నీవు ఏమి చేయుచున్నావు??

*స*:-- అహం లిఖామి-- నేను రచించు(రాయు) చున్నాను.

*ప్ర*:--- భవన్తః కుత్ర గఛ్ఛన్తి-- మీరు ఎక్కడ కు వెళ్ళుచున్నారు??

*స*:-- అహం పాఠశాలాం ప్రతి గఛ్ఛామి-- నేను పాఠశాల కు(కొరకు=ప్రతి) వెళ్లుచున్నాను.

*ప్ర*:-- సః కిం ఖాదతి-- వాడు ఏమి తినుచున్నాడు?

*స*:-- సః ఫలం ఖాదతి.-- వాడు ఫలం తినుచున్నాడు.

*ప్ర*: సః కుత్రతః ఆగఛ్ఛతి?.. వాడు ఎక్కడినుండి వచ్చుచున్నాడు?,

*స*:-- సః కార్యాలయతః ఆగఛ్ఛతి... వాడు కార్యాలయం నుండి వచ్చుచున్నాడు.


..... *శుభం భూయాత్*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ***

సంస్కృత భారతీ* *1*

 *సంస్కృత భారతీ*

            *1*

   *ప్రథమ పాఠః*

అహం = నేను, వయం=మేము/మనము, త్వం  = నీవు, భవాన్ = మీరు(గౌరవవాచకం) యూయం = మీరు, మమ/మదీయ  = నాయొక్క, తవ/త్వదీయ = నీయొక్క, భవదీయ = మీయొక్క, (భవ అనేది గౌరవవాచక సూచకము) యుష్మదీయ = మీయొక్క అస్మత్ = మాయొక్క/మనయొక్క,తస్య = అతని యొక్క

సః  = వాడు, సా= ఆమె, తే  = వారు, తత్  = అది, తాని  = అవి. తైః = వారిని, తేభ్యః = వారి కొరకు, తేషాం = వారియొక్క, తేషు = వారి యందు, తస్మై = వారి కొరకు,


వీటన్నిటికీ ముందు 'ఏ' ను చేర్చినచో మనసమీపములుగా మారును. ఇలా ఉపసర్గ(పదానికి ముందు చేర్చే వర్ణము/అక్షరము) చేర్చినప్పుడు ఒక్కొక్కప్పుడు ఆ పదం లోని ఇతర అక్షరాలలో కూడా కొంత మార్పు వస్తుంది,ఉదాహరణకు  సః, ఏ *షః* గా మారుతుంది.

 *ఉదా* ఏషః = వీడు,ఏషా = ఈమె,ఏతత్ = ఇది...ఇలా


******

అస్మి  = ఉన్నాను, స్మః  = ఉన్నాము, అసి  = ఉన్నావు, అస్తి  = ఉన్నది/ఉన్నాడు, సంతి = ఉన్నారు/ఉన్నాయి. అస్తు = అగుగాక

*****

"క' కారము సంస్కృతమున ప్రశ్నాక్షరము, ఉదాహరణకు కిం = ఏమిటి?, కః = ఎవరు?, కా = ఎవతె?,కాని = ఎన్ని, కస్మై/ కస్యకృతే = ఎవరికొరకు, కైః = ఎవరిని, కేభ్యః = ఎవరి యొక్క, కథం = ఎలా!??, కుత్ర = ఎక్కడ?, కదా?= ఎప్పుడు?, ....‌ఇలా.

అలాగే వా అని చివర లో చేర్చినప్పుడు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఉదాహరణకు త్వం రామః వా!?? అంటే నీవు రాముడవా ? అని అర్థం.


నామం = పేరు, గ్రామం = ఊరు.సమయః / కాలః = కాలము, మరిన్ని పదాలు మనకు వ్యావహారికంగానూ, నిఘంటువు లలోనూలభిస్తాయి. అలాగే ఈ సమూహం లో అడిగిననూ తెలుపగలరు.

 *---* 

*ప్రయోగభాగః*

*ప్రశ్న* :-- తవ నామ కిం  = నీ పేరు ఏమిటి?

*సమాధానం*:--మమ నామ శ్రీనివాస శర్మా,

*ప్ర*:-- తవ గ్రామం కిం ?

*స*:-- మమ గ్రామం రాజమహేంద్రవరం

*ప్ర*:-- తస్య గ్రామం కిమ్?

 *స*:-- భాగ్య నగరమ్,


*శుభం భూయాత్*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

వాదన పెరిగి తే

 *1815*

*కం*

వాదము ప్రబలగ చివరకు

ఖేదంబే మిగులు జనుల క్షేమము నెంచన్

వాదము తగ్గించగ నా

హ్లాదము జనియించి నెగడు రమ్యము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! వాదన పెరిగి తే చివరకు దుఃఖము మిగులుతుంది. జనుల క్షేమం కోరుకునే వారు వాదన తగ్గించి తద్వారా మానసిక ఉల్లాసం పెంచుకొందురు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

చాణక్య నీతి దర్పణం

 సమ్భాషణసంస్కృతమ్

(వార్తావాహినీ)


చాణక్య నీతి దర్పణం

🌸🌸🌸🌸🌸

  


🌹సుసిద్ధమౌషధం ధర్మం

 గృహచ్ఛిద్రం చ మైథునం  

కుభుక్తం కుశ్రుతం చైవ

 మతిమాన్న ప్రకాశయేత్.


🌹బుద్ధిమాన్ జనః  


సిద్ధం కృతం ఔషధస్య నిర్మాణవిషయం నిర్మాణరహస్యం చ


తేనకృతం ధర్మకార్యం


తస్య గృహస్య  దోషాన్,  


 తేన అనుభోక్తాన్ సంభోగ ఉపభోగ విషయాన్ ,


తేన భుక్తం అసాధు అహరం శృతాని అసాధు వచనాని చ


 బహిః న ప్రకాశయేత్ న వదేత్ ఇత్యర్థః


కిన్తు ఆధునికే కాలే ఏతాన్ యది వదేమ శృణుయామ బహిః ప్రకాశయేమ


తర్హి ఏవ తృప్తిం ధనం చ ప్రాప్నుయామ 


ధన్యవాదః


సమ్భాషణసంస్కృతమ్

(వార్తావాహినీ)

గురువారం, ఆగష్టు3, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


గురువారం, ఆగష్టు3, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

అధిక శ్రావణ మాసం - బహుళ పక్షం

తిథి:విదియ రా7.57 వరకు 

వారం:గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం:ధనిష్ఠ మ1.54 వరకు

యోగం:సౌభాగ్యం మ2.53 వరకు

కరణం:తైతుల ఉ9.11 వరకు తదుపరి గరజి రా7.57

వర్జ్యం:రా8.35 - 10.05

దుర్ముహూర్తము:ఉ9.57 - 10.48 &

మ3.04 - 3.55

అమృతకాలం:తె5.31నుండి

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్య రాశి : కర్కాటకం

చంద్ర రాశి : కుంభం 

సూర్యోదయం:5.42

సూర్యాస్తమయం: 6.31


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి!!

 అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి!!



గోదావరీ నది పాయలలో ఒకటైన వశిష్ట పాయ సముద్రంలో కలిసే స్థలంలో ఉన్న అంతర్వేది గొప్ప నారసింహ క్షేత్రం. ఇక్కడ గోదావరి ఒడ్డున శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి గుడి ఉంది. సముద్రంలో తిరిగే ఓడలు తరచూ అగ్నిప్రమాదాలకు గురి అవుతుండడం వల్ల మొగల్తూరు రాజా వారు ఇక్కడ నారసింహ యంత్ర ప్రతిష్ఠ చేయించి ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. శ్రీనాుని రచన ’భీమఖండం’లో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది.

క్రీ.శ. 1582 ప్రాంతంలో స్వామి వారి సుదర్శన చక్రం సముద్రు ఉప్పెనలో కొట్టుకొని పోయింది. అప్పుడు పేరూరు నివాసి అయిన అంతర్వేది చయనులనే బ్రాహ్మణుడు 11 రోజులపాటు జపం చెయ్యగా చక్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. అప్పటినుండీ స్వామి వారి కళ్యాణ సమయంలో పేరూరు వారిని ఆడపెళ్ళివారిగా పరిగణించడం ఆచారంగా వస్తోంది.

పూర్వం హిరణ్యాక్షుని కుమారుడైన రక్తలోచనుడనే రాక్షసుడితో స్వామి యుద్ధం చేశాడు. రక్తలోచనుని రక్తపు చుక్క భూమిమీద పడితే మరొక రక్తలోచనుడు పుట్టుకు వస్తాడు. అందువల్ల స్వామి సోదరి అశ్వరూఢాంబ (గుర్రాలక్క) వచ్చి తన నాలుకను పెంచి, యుద్ధభూమిపై పరచింది. దాంతో రక్తలోచనుని రక్తం నేలమీద పడలేదు. ఆ తరువాత స్వామి ఆ రాక్షసుణ్ణి వధించడం సులభమైంది. రాక్షసవధ జరిగాక గుర్రాలక్క తన నాలుక పైనున్న రక్తాన్ని ఒక పక్కకు వదిలింది. ఆ రక్తపు కాలువనే నేడు రక్తకుల్య అంటున్నారు. బ్రహ్మ ఇక్కడ యజ్ఞం చేసి నీలకంఠేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశాడు

                                

                             స్వస్తి!🙏

అల్లసానివారిఅల్లిక జిగి"


"అల్లసానివారిఅల్లిక జిగి"


ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్తానంలోని అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన స్వారోచిష మనుసంభవము లేదా మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రథమ ప్రబంధముగా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చువాడు అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు. ఇతడు బళ్లారి కడప జిల్లాల ప్రాంతములయందు దూపాడు అను దేశంబున దొరాళ అను గ్రామంలో శాలివాహన శకము 1430 సంవత్సరమున జన్మించినట్లు తెలియబడుచున్నది. కృష్ణదేవరాయలవారి ఆస్థాన పండితులు ఎనిమిది మందిలో ఈయన ఒక్కరు. ఈయన గురువు శఠగోపయతి.


అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు వేటూరు ప్రభాకరశాస్త్రిగారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు (సింహావలోకనము). కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. కడప జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట గ్రామం ఉంది. ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పడిందంటారు.


మను చరిత్ర:


మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము, అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. 


ఇతివృత్తము:


మారన మార్కండేయ పురాణంలో 150 పద్యాలలో చెప్పిన విషయము. ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషునితో ముగుస్తుంది. కాశీ నగరం దగ్గర ప్రవరుడనే పరమ నిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు, అతనికి అనుకూలవతియైన భార్య ఉండేవారు. వారు అతిథులను ఎంతగానో ఆదరించేవారు. వారి ఇంటికి వచ్చిన ఒక సిద్ధుడు ప్రవరునికి ఒక మహిమాన్వితమైన పసరును ఇచ్చాడు. ఆ పసరు కాళ్ళకు పూసుకొని ఆ దివ్య ప్రభావం వలన ప్రవరుడు హిమాలయ పర్వతాలకు పోయి అక్కడి సుందర దృశ్యాలను చూచి ఆనందిస్తాడు. అయితే ఎండకు ఆ పసరు మంచులో కరిగిపోయింది.తిరుగి పోయే ఉపాయం కోసం చూస్తున్న ప్రవరుడిని చూచు వరూధిని అనే అప్సరస మనసు పడింది. అయితే ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోయాడు. కామవిరహంతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకున్నాడు. వారికి జన్మించిన స్వరోచి ఒక దేశానికి రాజయ్యాడు. ఆ స్వరోచి ఒకసారి వేటకు వెళ్ళి మనోరమ అనే యువతిని పెళ్ళాడాడు. వారి కొడుకే స్వారోచిష మనువు.


రచనా వైభవం

మనుచరిత్రంలో పెద్దన కథన కౌశలం, వర్ణనా చాతుర్యం పండితుల ప్రశంసలందుకొన్నాయి. పెద్దనను సమకాలికులు, అనంతర కవులు కూడా అనుసరించారు. మనుచరిత్రలోని కవితాశిల్పం అద్వితీయం. అక్షరాలా పెద్దన ఆంధ్ర ప్రబంధ కవితా పితామహుడే. మనుచరిత్రలో అనేక ఇతివృత్తాలున్నా గాని అందరినీ అలరించి పెద్దనకు కీర్తి తెచ్చిపెట్టినది వరూధినీ ప్రవరాఖ్యుల ఘట్టమే.


పాత్ర పోషణ : వరూధినీ ప్రవరులు ఈనాటికీ మన సంభాషణలలో చోటు చేసుకోవడం పెద్దన పాత్ర పోషణలోని నైపుణ్యానికి చిహ్నం.


రస పోషణ : శృంగారం, శాంతం, ధర్మం, అద్భుతం, బీభత్సం వంటి అనేక రసాలు ఆయా వృత్తాంతాలలో పాత్రలకు తగినంత ఔచిత్యంతో పెద్దన పోషించాడు.


అలంకారిక రామణీయత : పాత్రలకు, సన్నివేశాలకు, రసానికి అనుగుణంగా అలంకారాలను ప్రయోగించాడు.


కవితా శైలి : "అల్లసానివారి అల్లిక జిగిబిగి" అనే నానుడి ఉంది. "జిగి" అంటే కాంతి. "బిగి" అంటే కూర్పు, పట్టు. అంటే పదాల ఎంపికలోను, సమాసాల కూర్పులోను, పద్యాల ఎత్తుగడలోను చక్కదనం, చిక్కదనం ఉంటాయన్నమాట.


 మార్కండేయ పురాణంలోని ఒక చిన్న కథను తీసుకొని, దాన్ని విస్తరించీ ప్రస్తరించీ ఒక అపూర్వ కళాఖండాన్ని శిల్పించాడు పెద్దన. ఇది నిజంగా అపూర్వమే. పెద్దనకు పూర్వం తెలుగులో అంత ఖచ్చితమైన ప్రమాణాలతో రచింపబడిన కావ్యం లేదు. పెద్దన తర్వాత కవుల్లో కూడా మనుచరిత్రమును అనుకరించి రాయబడిన కావ్యాలే ఎక్కువ. మనుచరిత్రమును పెద్దన గారి “సకలోహ వైభవ సనాధము” అనవల్సిందే. కొద్దో గొప్పో సాహిత్యజ్ఞానం ఉన్నవారికి మనుచరిత్రం లోని చాలా పద్యాలు కంఠతా ఉంటాయనేది అతిశయోక్తి కాదు. ... కథా సంవిధానంలో గానీ, పాత్రల చిత్రణలో గానీ, సన్నివేశాలు కల్పించి సంభాషణలు నిర్వహించడంలో గానీ, పద్య నిర్వహణంలో గానీ దీనికి సాటి ఐన గ్రంథం నభూతో నభవిష్యతి అనీ అనిపించుకున్న కావ్యం ఈ మను చరిత్రము.


 అరుణాస్పదపురంలో ప్రవరుని గైహిక జీవనం, హిమాలయ ప్రాంతాల ప్రకృతి వర్ణన, వరూధినీ ప్రవరుల వాదోపవాదాలు గానీ, ఆమె దిగులు, ఆ తర్వాత ప్రకృతి వర్ణనా, స్వరోచి మృగయా వినోదం గానీ, ఎవరు ఎంతగా వర్ణించి చెప్పినా, రసజ్ఞుడైన పాఠకుడు, స్వయంగా చదివి అనుభవించే ఆనందం ముందు దిగదుడుపే.


విశేషాలు

ఇది తొలి తెలుగు ప్రబంధము, దీని తరువాత మొదలైనదే ప్రబంధ యుగము, తరువాతి ప్రబంధాలు దీని నుండి స్ఫూర్తిపొందినవే ఎక్కువగా ఉన్నాయి.ఇందు మొత్తం ఆరు అశ్వాసాలు ఉన్నాయి. ఈ ప్రబంధం తెలుగు పంచకావ్యాలలో మొదటిదిగా చెపుతారు.


మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యం ఇది. అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యం.


అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్


భూమిసురుడు = బ్రాహ్మణుడైన ప్రవరుడు

 అటన్+చని = అక్కడికి వెళ్ళి

 అంబర చుంబి = ఆకాశాన్ని తాకుతున్న 

 శిరస్ = శిఖరాల నుండి

 సరత్ = జారుతున్న

 ఝరీపటల = సెలయేళ్ళ సమూహంలో

 ముహుః + ముహుః = మాటి మాటికి

 లుఠత్ = దొర్లుతున్న

 అభంగ = ఎడతెగని

 తరంగ = అలలు అనే

 మృదంగ = మద్దెలల యొక్క

 నిస్వన = ధ్వనుల చేత

 స్ఫుట = స్పష్టమైన

 నటన + అనుకూల = నాట్యమునకు తగినట్లుగా

 పరిపుల్ల = మిక్కిలి విప్పారిన

 కలాప = పురులుగల

 కలాపి జాలమున్= ఆడ నెమళ్ళు గల దానిని

 కటక చరత్ = పర్వత మధ్యప్రదేశాల్లో తిరిగే

 కరేణుకర = ఆడ ఏనుగుల తొండాల చేత

 కంపిత = కదిలించబడిన

 సాలమున్ = మద్దిచెట్లు గల దానిని

 శీతశైలమున్ = మంచుకొండను

 కాంచెన్ = చూశాడు


మంచుకొండ కొమ్ములు నింగిని తాకుతున్నాయి. వాటి నుండి సెలయేళ్ళు జారుతున్నాయి. వాటిలో లేచిపడే అలల సవ్వడి మద్దెలమోతల్లాగా ఉన్నాయి. వాటికి పరవశించిన నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి. ఏనుగుల తొండాలతో అక్కడి మద్దిచెట్లను పెకలిస్తున్నాయి. అటువంటి మంచుకొండను చూశాడు ప్రవరుడు.


ఇంత సరళంగా చెప్పగలిగిన సంగతిని ఎందుకింత ప్రౌఢగంభీరంగా వర్ణించాడు కవి? హిమాలయ పర్వతం అసామాన్యమైనది. మహోన్నతమైనది. ఆ మహత్వాన్ని, మహాద్భుత దృశ్యాన్ని స్ఫురింపజేయటానికి అంత సంస్కృత పదాటోపం అవసరమైంది. పద్యంలో ముచ్చెం మొదటి మూడూ మాటలు తప్ప (అట, చని, కాంచె) తక్కినవన్నీ సంస్కృతం నుండి దిగిన తత్సమపదాలే.


కేవలం శబ్దం ద్వారానే అర్థస్ఫురణ గావించటం ఈ పద్యంలో విశేషం. "అంబరచుంబి శిరస్సరజ్ఝరీ పటల" 

మన్నప్పుడు నింగినంటిన కొండల నుండి జాలువారే సెలయేళ్ళ ధారాప్రవాహం మనో నేత్రం ముందు కనబడుతుంది.


మద్దెల చప్పుళ్ళకి, మేఘధ్వనులకి నెమళ్ళు ఆహ్లాదంతో పురివిప్పి ఆడతాయని ప్రసిద్ధి. ఆ సెలయేటి అలలు రాళ్ళకు కొట్టుకొని మద్దెలలాగా మోగుతున్నాయి. అభంగ, తరంగ, మృదంగ అనే పదాల ద్వారా ఆ మద్దెలల మోత వినిపించాడు కవి.

 "స్ఫుటనటనానుకూల" అనేచోట నాట్యం స్ఫురింపజేస్తున్నాడు. అక్షరాలు నర్తిస్తున్నట్టు, ఆయా అర్థాలను స్ఫురింజేస్తున్నట్టు రచించటం వికటత్వం. (వికటత్వ ముదారతా- వామనుడు) వికటత్వం గల కూర్పు ఔదార్యం. ఈ పద్యంలో ఔదార్యం అనే గుణం ఉంది. దీనికి తోడు దీర్ఘసమాసాలతో కూడిన 

 గాఢబంధం వల్ల ఓజోగుణం కూడా చేకూరింది.


"అంబరచుంబి, శిరస్సరత్, ముహుర్ముహుః, అభంగ తరంగ మృదంగ, స్ఫుట నటనానుకూల, కలాపకలాపి, సాలము శీతశైలము" - ఈ చోటుల్లో వృత్త్యనుప్రాస, ఛేకానుప్రాస, అంత్యప్రాస, యమకంలాంటి శబ్దాలంకారాలున్నాయి. తరంగ ధ్వనుల్ని మృదంగధ్వనులుగా నెమళ్ళు భ్రమించినట్టు వర్ణించటం చేత భ్రాంతిమదలంకారం అవుతుంది.


 "అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి.


సేకరణ🙏🙏👌