5, ఆగస్టు 2023, శనివారం

వరసిధ్ధి గణనాథ

 *సీసము*

పరమేశ ప్రియపుత్ర వరసిధ్ధి గణనాథ

దూర్వంపు పూజకే తుష్టినొంద

సిరులెల్ల కురిపించు సిరిబొజ్జ సరియొజ్జ 

మోదకంబులొసగ మోదమొంద

ఘనమైన పనులైన గణనాథ నినుగొల్వ

సులభ సాధ్యము జేయు శూర్పకర్ణ

జనులెల్ల పులకించు గణనాథు ఘనకీర్తి

అల్పబుద్ధి కెటుల నర్థమయ్యు!!??

*ఆ.వె.*

సర్పభూషితాంగ సకలగణాధీశ

వక్రతుండ నీదు పటిమనెరుగ

జనుల మతులు తప్పు సర్వేశ విఘ్నేశ

నుతులు జేతు నీకు నతుల నెపుడు.


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: